మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్‌ఆర్‌ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి.
బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్‌డీఎఫ్‌సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?)
బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment