hikes
-
ఎస్బీఐ కస్టమర్లకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు ఇకపై మరింత భారమయ్యాయి. ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణాల రేట్లను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 0.05 శాతాన్ని (5 బేసిస్ పాయింట్లు) పెంచడంతో 9 శాతానికి చేరింది. గృహ రుణం వంటి దీర్ఘకాల రుణాలకు ఏడాది ఎంసీఎల్ఆర్ రేటే ప్రామాణికంగా ఉంటుంది.మూడు నెలలు, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేట్లను సైతం ఇంతే మేర పెంచింది. ఓవర్‌నైట్, ఒక నెల, రెండేళ్లు, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేట్లను మాత్రం సవరించలేదు. పెరిగిన రేట్లు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఇటీవలి కాలంలో ఎంసీఎల్ఆర్ రేట్లను ఎస్బీఐ రెండుసార్లు పెంచడం గమనార్హం. డిపాజిట్లపై వ్యయాల పెరుగుదలతో బ్యాంక్‌లు రుణ రేట్లను సవరించాల్సి వస్తోంది. -
జియోకి భారీ డామేజ్ 25 లక్షల మంది BSNLకి పోర్ట్?
-
పెరిగిన ఎస్బీఐ వడ్డీ రేట్లు: ఈ రోజు నుంచే అమలు..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎట్టకేలకు మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటును (MCLR) 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక ప్రకటన చేసింది. సవరించిన రేట్లు ఈ రోజు (జులై 15) నుంచి అమలులోకి వస్తాయి. ఇది లోన్ తీసుకున్నవారి మీద ప్రభావం చూపుతుంది.పెరిగిన వడ్డీ రేట్లుఒక నెల ఎంసీఎల్ఆర్ రేటు 5 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో వడ్డీ రేటు 8.3 శాతం నుంచి, 8.35 శాతానికి చేరింది.మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 8.30 శాతం నుంచి 8.40 శాతానికి పెరిగింది. అంటే ఇది 10 బేసిస్ పాయింట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది.బ్యాంక్ ఆరు నెలలు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేట్లకు 10 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. దీంతో ఈ వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.85 శాతం, 8.95 శాతానికి చేరింది.మూడు సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ఆర్ రేటు 8.95 శాతం నుంచి 9 శాతానికి చేరింది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
బీఎండబ్ల్యూ కార్లు ప్రియం
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ అన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచుతోంది. జనవరి 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. విదేశీ మారకపు రేట్లు, పెరుగుతున్న తయారీ ఖర్చులలో హెచ్చుతగ్గుల ప్రతికూల ప్రభావాలను పాక్షికంగా భర్తీ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీఎండబ్ల్యూ వెల్లడించింది. ఇప్పటికే మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా, ఆడి తదితర కంపెనీలు ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. -
కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..
ప్రముఖ ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (Karur Vysya Bank) తమ కస్టమర్లకు షాకిచ్చింది. బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును పెంచినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ద్వారా ప్రకటించింది. మార్పులు సెప్టెంబర్ 21 నుంచి అమలులోకి వస్తాయి. కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుతం ఉన్న బేస్ రేటును 11.20 శాతం నుంచి 11.40 శాతానికి పెంచింది. అలాగే బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (BPLR )ను 16.20 శాతం నుంచి 16.40 శాతానికి పెంచింది. దీంతో రుణ గ్రహీతలపై వడ్డీ భారం మరింత పెరగనుంది. అలాగే ఈఎంఐలపైనా దీని ప్రభావం పడనుంది. ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్ జూలైలో KVB ESOS 2011 స్కీమ్, KVB ESOS 2018 పథకం కింద ఉద్యోగులకు 1,63,635 ఈక్విటీ షేర్లను స్టాక్ ఆప్షన్‌గా కేటాయించినట్లు ప్రకటించింది. ఒక్కొక్క ఈక్విటీ షేర్ల ముఖ విలువ రూ.2 ఉంటుంది. కాగా శుక్రవారం (సెప్టెంబర్15) వారాంతంలో కరూర్ వైశ్యా బ్యాంక్ షేర్లు 1.84 శాతం లాభంతో రూ.132.75 వద్ద ముగిశాయి. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్: విలీనం తరువాత లక్షలాది కస్టమర్లకు భారీ షాక్
మెగా మెర్జర్ తరువాత ప్రపంచ బ్యాంకింగ్ దిగ్గజాల్లో నిలిచిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు ఎంసిఎల్ఆర్ను పెంచి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. అవకాశం ఉంది. సవరించిన వడ్డీరేట్లు శుక్రవారం ( జూలై 7 ) నుంచే అమలులోకి వచ్చాయి. బెంచ్‌మార్క్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. హెచ్డీఎఫ్సీ తాజా నిర్ణయం ద్వారా లక్షలాది మంది ఖాతాదారులకు షాక్ ఇచ్చింది. దీంతో హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఆటో లోన్ సహా అన్ని రకాల రుణ గ్రహీతలపై ఈఎంఐ భారం పడనుంది. (డైనమిక్ లేడీ నదియా వ్యాపారం, ఆమె కిల్లర్ మూవ్ గురించి తెలుసా?) బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగింది. దీంతో ఈ రేటు 8.1 శాతం నుంచి 8.25 శాతానికి చేరింది. నెల రోజుల ఎంసీఎల్ఆర్ రేటు కూడా 10 బేసిస్ పాయింట్లు పెంపుతో ఇది 8.2 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. మూడు నెలలపై వడ్డీరేటు 10 బేసిస్ పాయింట్లు పెరిగి 8.5 శాతం నుంచి 8.6 శాతంగానూ,5 బేసిస్ పాయింట్లు పెంపుతో ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.85 శాతం నుంచి 8.9 శాతంగా ఉండనుంది. అయితే ఏడాది ఆపైన వ్యవధి రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం వద్ద యథాతథంగా ఉంటుంది. (మెక్‌డొనాల్డ్స్‌కి టొమాటో ‘మంట’ ఏం చేస్తోందో తెలుసా?) -
గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం అనంతరం గురువారం కీలక వడ్డీరేట్లను 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. 2022-23లో జీడీపీ 7శాతం పెరిగిందని, ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉన్నాయని, అయితే ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని గవర్నర్ అన్నారు. గ్లోబల్ ఎకానమీ అల్లకల్లోలాన్ని ఎదుర్కొంటోందన్నారు. ఏప్రిల్-జూన్ 2023లో జీడీపీ వృద్ధి 7.8 శాతంగా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేసినట్లు శక్తికాంత దాస్ చెప్పారు. (ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు) తాజా రివ్యూలో రెపో రేటును మరో పావుశాతం పెంపునకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని విశ్లేషకులు అభి ప్రాయపడ్డారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రికార్డు స్థాయిలో 6.75 శాతానికి పెరగనుందనే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే తాజా నిర్ణయంతో మార్కెట్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నాయి. -
కార్ల ధరలు పెంచేసిన మారుతీ సుజుకీ..
దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్ల కార్లు, వాహనాల ధరలను పెంచేసింది. వాహన ధరల సగటు పెరుగుదల 0.8 శాతంగా ఉంది. పెరిగిన తయారీ ఖర్చులు, నియంత్రణ వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ మార్చి 23నే ప్రకటించింది. (తప్పని తిప్పలు: జాబొచ్చినా జాయినింగ్ లేదు!) అంతకు ముందు జనవరిలో కంపెనీ తమ వాహనాల ధరలను 1.1 శాతం పెంచింది. మారుతీ సుజుకీ మాత్రమే కాకుండా, హోండా కార్స్, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్‌తో సహా పలు వాహన తయారీదారులు ఏప్రిల్ నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుంచి, కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఉద్గార స్థాయిలను పర్యవేక్షించడానికి వాహనాలు ఆన్ బోర్డ్ స్వీయ నిర్ధారణ పరికరాన్ని కలిగి ఉండాలి. ఇందుకు గాను ధరలు పెంచినట్లుగా తెలుస్తోంది. (The Holme: రూ.2,500 కోట్ల భవంతి! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది ఇదే..) కంపెనీ విక్రయాల విషయానికి వస్తే గత నెలలో మొత్తం అమ్మకాలు స్వల్పంగా క్షీణించి 1,70,071కి చేరుకున్నాయి. దేశీయ విపణిలో డీలర్లకు వాహనాల సరఫరా 3 శాతం క్షీణించి 1,39,952 యూనిట్లకు చేరుకుంది. ఇక గత నెలలో ఎగుమతులు 14 శాతం పెరిగి 30,119 యూనిట్లకు చేరుకున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 16,52,653 యూనిట్ల నుంచి గతేడాది 19 శాతం వృద్ధితో 19,66,164 యూనిట్ల అత్యధిక టోకు విక్రయాలను నమోదు చేసింది. 2022-23 సంవత్సరంలో డొమెస్టిక్ డిస్పాచెస్ 17,06,831 యూనిట్లు కాగా ఎగుమతులు 2,59,333 యూనిట్లు. (వెంట వచ్చే రిఫ్రిజిరేటర్.. మొబైల్ ఫోన్లోనే కంట్రోలింగ్) కాగా కంపెనీ విదేశీ ఎగుమతులు ప్రారంభించినప్పటి నుంచి ఎగుమతుల్లో 25 లక్షల యూనిట్ల మైలురాయిని అధిగమించింది. గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్ నుంచి లాటిన్ అమెరికాకు మారుతీ సుజుకీ బాలెనో వాహనాన్ని ఎగుమతి చేసి ఈ రికార్డు సాధించిది.1986-87లో మారుతీ సుజుకీ బంగ్లాదేశ్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతులు చేయడం ప్రారంభించింది.ప్రస్తుతం ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని దాదాపు 100 దేశాలకు తమ వాహనాలు ఎగుమతి చేస్తోంది. (నేను ‘మోనార్క్’ని... సెల్ఫ్‌డ్రైవింగ్ ట్రాక్టర్) -
చిన్న పొదుపులకు పెద్ద ఊరట
న్యూఢిల్లీ: ఎకానమీలో వడ్డీరేట్ల పెరుగుదల పరిణామాలు చిన్న పొదుపుదారులకు మేలు చేకూర్చుతున్నాయి. 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి పలు పోస్టాఫీసు పొదుపు పథకాలపై వడ్డీరేట్లను 0.1 శాతం నుంచి 0.7 శాతం వరకూ పెంచుతూ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మే నెల నుంచి ఆర్బీఐ రెపో రేటును వరుసగా ఆరుసార్లు 2.5 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది. ఇది బ్యాంకులు అటు రుణ రేట్లు-ఇటు డిపాజిట్ రేట్ల పెరుగుదలకు దారితీస్తోంది. రానున్న త్రైమాసికానికి సంబంధించి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సేవింగ్స్ డిపాజిట్ల వడ్డీరేట్లు వరుసగా 7.1శాతం, 4 శాతాలుగా కొనసాగించినప్పటికీ, ఇతర సేవింగ్స్ పథకాలపై రేట్లు 0.1శాతం నుంచి 0.7శాతం మధ్య పెరిగాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై (ఎన్ఎస్సీ)పై అత్యధికంగా వడ్డీరేటు పెరిగింది. పథకాల వారీగా రేట్ల పెరుగుదల (శాతాల్లో) పథకం కొత్త వడ్డీ పాత వడ్డీ ఎన్ఎస్సీ 7.7 7 సుకన్యా సమృద్ధి 8 7.6 సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 8 కిసాన్ వికాస్ పత్ర 7.5 7.2 ఏడాది టర్మ్ డిపాజిట్ 6.8 6.6 రెండేళ్ల టర్మ్ డిపాజిట్ 6.9 6.8 మూడేళ్ల టర్మ్ డిపాజిట్ 7 6.9 ఐదేళ్ల టర్మ్ డిపాజిట్ 7.5 7 నెలవారీ ఆదాయ పథకం 7.4 7.1 -
జియో కస్టమర్లకు ట్విస్ట్ : ఎంట్రీ-లెవల్ రూ.199 ప్లాన్ ఇక రూ. 299లు
సాక్షి, ముంబై: రిలయన్స్ జియో ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను రూ.199 నుండి రూ.299కి పెంచేసింది. 100 రూపాయిలు పెంచిన ఈ ప్లాన్‌లో మిగిలిన ప్రయోజనాల్నీ ఒకేలా ఉండగా, 5 జీబీ డేటా అదనంగా అందిస్తోంది. (ఇదీ చదవండి: ఫాంటసీ క్రికెట్ యాప్ ‘క్రిక్‌పే’ లాంచ్... అదీ ఐపీఎల్‌కు ముందు) కొత్త జియో రూ. 299 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వెబ్సైట్ ప్రకారం, జియో ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఇప్పుడు రూ. 299 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో 30జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSల ఉచింతం అర్హతగల జియో సబ్స్క్రైబర్లు అపరిమిత 5జీ డేటాతో Jio వెల్కమ్ ఆఫర్‌ను పొందవచ్చు. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) పాత జియో రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ పాత రూ. 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 25 జీబీ హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలను అందించింది. JioPrime సభ్యత్వం కోసం రూ. 99 వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ రూ JioTV, JioCinema, JioSecurity , JioCloud వంటి అంతర్గత యాప్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇపుడిక పాత ఎంట్రీ-లెవల్ పోస్ట్‌పెయిడ్ రూ. 199 ప్లాన్ కస్టమర్లకు అందుబాటులో లేదు. కాగా గత వారం రిలయన్స్ జియో పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం రూ. 299తో ప్రారంభమయ్యే జియో ప్లస్ పేరుతో నాలుగు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాన్లు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. (Upasana Konidela:ఉపాసన అరుదైన ఘనత.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!) -
రెపో రేటు పెంచిన ఆర్బీఐ
-
మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. రూ.2 కోట్ల కన్నా తక్కువ విలువ ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీరేటును పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు నేటి (2022 డిసెంబర్ 13) నుంచి అమల్లో ఉంటాయని ఎస్బీఐ అధికారిక ప్రకటలో తెలిపింది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో 7-45 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 3 శాతం, 46-179 రోజుల మధ్య ఎఫ్డీపై 3.9 శాతం, 180-210 రోజుల మధ్య 5.25 శాతం వడ్డీ లభిస్తోంది. 211 రోజుల నుంచి 1 ఏడాది వరకు ఉండే ఎఫ్డీలపై 5.75శాతం వడ్డీ చెల్లింస్తుంది. 1-2 ఏళ్ల మధ్యలో మెచ్యూర్ అయ్యే ఎఫ్డీపై 6.75 శాతం, 2-3 మూడేళ్ల వరకు అయితే 6.75 శాతం, 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు.. 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అయితే 6.25 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) అలాగే సీనియర్ సిటిజన్ కస్టమర్లకు అన్ని కాల వ్యవధిలో అదనంగా 50 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటును అందిస్తుంది. తాజా సవరణతో, సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.5 శాతం నుంచి 7.25 శాతం వరకు ఆఫర్ చేస్తోంది. కాగా ద్రవ్యోల్బణం ఆందోళన నేపథ్యంలో కేంద్రబ్యాంకు ఆర్బీఐ వరుసగా ఐదోసారి కూడా వడ్డీరేటు పెంపునకే మొగ్గు చూపింది. తాజా పాలసీ రివ్యూలో రెపో రేటు 35 బేసిస్ పాయింట్లకు పెంచింది. (సామాన్యుడికి ఊరట:11 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం) -
మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!
న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ధరలను వచ్చే నెల నుంచి పెంచాలని భావిస్తోంది. ముడి సరుకు వ్యయాలు భారం కావడంతోపాటు 2023 ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనల నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: vivo Y02: ట్రెండీ ఫీచర్లు, ధర పదివేల లోపే! బ్యాటరీ ధరలూ ప్రియం అవుతున్నాయని, వీటి భారం కస్టమర్లపై ఇంకా వేయలేదని కంపెనీ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేశ్ చంద్ర వెల్లడించారు. బ్యాటరీ ధరలు, నూతన నిబంధనలు ఎలక్ట్రిక్ వాహన విభాగంపై ప్రభా వం చూపుతున్నాయని చెప్పారు. వాహనం నుంచి వెలువడే కాలుష్య స్థాయిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరికరం ఏర్పాటు చేయాలన్న నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. పరిమిత స్థాయి మించి కాలుష్యం వెదజల్లితే ఈ పరికరం హెచ్చరిస్తుంది. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
17 శాతం తగ్గిన పసిడి దిగుమతులు
న్యూఢిల్లీ: భారత్ పసిడి దిగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల కాలంలో (2022–23, ఏప్రిల్–అక్టోబర్) 17.38 శాతం తగ్గి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో ఈ విలువ 29 బిలియన్ డాలర్లు. దేశీయంగా డిమాండ్ తగ్గడం దీనికి కారణం. ఒక్క అక్టోబర్ నెలను తీసుకున్నా, దిగుమతులు 27.47 శాతం పడిపోయి 3.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్ దాదాపు వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకునే సంగతి తెలిసిందే. కాగా, దేశం నుంచి రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్–అక్టోబర్ మధ్య 1.81 శాతం పెరిగి 24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జనవరి నుంచి ఎగుమతులు మరింత ఊపందుకుంటాని పరిశ్రమ భావిస్తోంది. వెండి దిగుమతులు అప్... ఇక వెండి దిగుమతులు అక్టోబర్‌లో 34.80 శాతం తగ్గి 585 మిలియన్ డాలర్లుగా నమోదయ్యితే, ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో మాత్రం భారీగా పెరిగాయి. 2021–22 ఏడు నెలల్లో ఈ విలువ 1.52 బిలియన్ డాలర్లయితే, తాజా సమీక్షా నెల్లో ఈ విలువ ఏకంగా 4.8 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి, వెండి దిగుమతుల విలువ కలిపిచూస్తే, కరెంట్ అకౌంట్‌కు దాదాపు మిశ్రమ ఫలితంగానే ఉండడం గమనార్హం. దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం లెక్కలను ‘కరెంట్ అకౌంట్’ (లోటు లేదా మిగులు రూపంలో) ప్రతిబింబిస్తుంది. -
పెరిగిన మదర్‌డెయిరీ పాల ధరలు..రేపట్నుంచి అమల్లోకి
ప్రముఖ పాలపంపిణీ సంస్థ మదర్ డెయిరీ దేశంలోని పలు ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ- ఎన్సీఆర్ (National Capital Region) పరిధిలో లీటర్ పాలపై రూ.1 లీటర్ విడిపాల (token milk) ధర రూ.2 పెంచింది. దీంతో పెరిగిన ధరలతో ఫుల్ క్రీమ్ (వెన్నతీయని) పాల ధర రూ.64, విడి పాల ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది. కాగా, అర లీటర్ ఫుల్ క్రీమ్ పాల ధరల్ని యథాతథంగా ఉంచుతున్నట్లు మధర్ డైరీ ప్రతినిధులు తెలిపారు. ఇక తాజాగా పెరిగిన పాల ధరలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. -
ఆ కస్టమర్లకు షాక్.. ఐసీఐసీఐ బ్యాంక్ కీలక నిర్ణయం!
దేశంలో ప్రైవేట్ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్‌గా పేరున్న ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ షాకిస్తూ వారి సేవింగ్స్ అకౌంట్ల బ్యాంక్ సర్వీస్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన చార్జీలు 1 నవంబర్ 2022 నుంచి అమలులోకి రానున్నట్లు తెలిపింది. వీటితో పాటు చెక్కులతో కూడిన వివిధ లావాదేవీల పెనాల్టీ చార్జీలను కూడా పెంచేసింది. దీంతో ఇకపై చెక్ ద్వారా నిర్వహించే పలు లావాదేవీలకు కొత్తగా తీసుకున్న పెంపు నిర్ణయం వర్తించనుంది. ఏవేవి పెరిగాయి.. ఎన్ఆర్ఐ సేవింగ్స్ అకౌంట్లకు సంబంధించి.. నగదు డిపాజిట్లు, డూప్లికేట్ స్టేట్మెంట్ జారీ, డూప్లికేట్ పాస్‌బుక్ జారీ, IMPS అవుట్‌వర్డ్, డెబిట్ కార్డ్ పిన్ రీ-జనరేషన్, ఇంటర్నెట్ యూజర్ ఐడి లేదా పాస్వర్డ్ (బ్రాంచ్ లేదా నాన్ IVR కస్టమర్ కేర్) రీఇష్యూ వంటి వివిధ రకాల లావాదేవీల చార్జీలు పెరిగాయి. బ్యాంక్ జరిమానా ఛార్జీలు చెక్ రిటర్న్ అవుట్‌వర్డ్ (కస్టమర్ డిపాజిట్ చేసిన చెక్కు), చెక్ రిటర్న్ ఇన్వర్డ్ (కస్టమర్ జారీ చేసిన చెక్) వంటి వాటిపై ఉన్న జరిమానా చార్జీలను కూడా పెంచింది. చదవండి: దీపావళి స్కాం: వాటిపై క్లిక్ చేయకండి, మోసపోతారు జాగ్రత్త! -
బాబోయ్ షాక్: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు
న్యూఢిల్లీ: సహజ వాయువు రేట్లను ఏకంగా 40 శాతం పెంచుతూ చమురు శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో యూనిట్ (ఎంబీటీయూ) రేటు రికార్డు స్థాయిలో 6.1 డాలర్ల నుంచి 8.57 డాలర్లకు చేరింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థలు సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ రేటు 9.92 డాలర్ల నుంచి 12.6 డాలర్లకు పెంచుతూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (పీపీఏసీ) ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా వాహనాల్లో ఉపయోగించే సీఎన్జీ, వంట అవసరాల కోసం పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే పీఎన్జీ రేట్లకు రెక్కలు రానున్నాయి. ధరల పెంపు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. గ్యాస్‌ను ఉపయోగించి ఉత్పత్తి చేసే ఎరువులు, విద్యుత్ తయారీ వ్యయాల భారం కూడా పెరగనున్నాయి. సాధారణంగా గ్యాస్ రేట్లను ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి (ఏప్రిల్ 1న, అక్టోబర్ 1న) సమీక్షిస్తుంది. అమెరికా, కెనడా, రష్యా వంటి గ్యాస్ మిగులు దేశాల రేట్లకు అనుగుణంగా నిర్దిష్ట ఫార్ములా ప్రకారం సవరిస్తుంది. మరోవైపు, ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశాలు ఉన్నందున రేట్ల ఫార్ములాను సమీక్షించి, తగు సిఫార్సులు చేసేందుకు ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు కిరీట్ పారిఖ్ సారథ్యంలో కేంద్రం కమిటీ వేసింది. ఇది సెప్టెంబర్ ఆఖరు నాటికే నివేదిక ఇవ్వాల్సి ఉన్నప్పటికీ మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!
చెన్నై మహానగరం పరిధిలో అద్దె ఇళ్లలో నివాసం ఉంటున్న వారికి.. యజమానులు చుక్కలు చూపిస్తున్నారు. ఎడాపెడా అద్దె మొత్తాన్ని పెంచేస్తూ సామాన్యులపై భారం మోపుతున్నారు. అంత కట్టలేమంటే వెళ్లిపోమంటూ ఈసడించుకుంటున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ నిర్ణయం అశనిపాతంగా మారుతోంది. సాక్షి, చెన్నై: పెరిగిన విద్యుత్ బిల్లులు, ఆస్తి, నీటిపన్నులతో సతమతం అవుతున్న నగరజీవికి ఇంటి అద్దె పెరుగుదల మోయలేని భారంగా మారుతోంది. చెన్నై మహానగరంలో ఉద్యోగం, విద్యా, వ్యాపారం కోసం వచ్చి స్థిర పడ్డ వారి సంఖ్య ఎక్కువే. వీరిలో మెజారిటీ ప్రజలు అద్దె ఇళ్లలోనే ఉంటున్నారు. వీరి అవసరాలు ఇంటి యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. చెన్నై శివారులలోని చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాలో పెద్దసంఖ్యలో పారిశ్రామిక వాడలున్నాయి. ఇక్కడ ఉద్యోగ రిత్యా రాష్ట్రానికి చెందిన వారే కాదు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు. ఇటీవల ఉత్తరాది నుంచి వివిధ పనుల నిమిత్తం చెన్నై వస్తున్న వారి సంఖ్య పెరిగింది. దీంతో చెన్నై, సెంట్రల్ చెన్నై, దక్షిణ చెన్నైతో పాటు శివారులలోని వేళచ్చేరి, ఈసీఆర్, ఓఎంఆర్ మార్గాలు, అంబత్తూరు, పూందమల్లి, రెడ్ హిల్స్, మాధవరం, ఆవడి, తాంబరం, పల్లావరం, క్రోం పేట, పెరుంగళ్తూరు, ముడిచ్చూరు పరిసరాలలో అద్దె ఇల్లు దొరకడం గగనంగా మారింది. సాఫ్ట్వేర్ వంటి పెద్ద సంస్థలలో పనిచేసే ఉద్యోగులు మాత్రం తమకు సౌకర్యవంతంగా ఉండే అపార్ట్‌మెంట్స్‌ను బాడుగకు తీసుకుంటున్నారు. వడ్డనతో భారం.. చెన్నై నగరంలో నెలసరి అద్దె అధికంగానే ఉంటోంది. చిన్న గది అయినా కనీసం రూ. 5 వేలు పైగా వెచ్చించాల్సిందే. సింగిల్ బెడ్ రూమ్ కావాలంటే రూ.10 వేలు, మరి కాస్త పెద్దది కావాలంటే రూ. 15 వేలు, రూ. 20 వేలు, రూ. 25 వేలు వరకు అద్దె చెల్లించాల్సిందే. అన్నానగర్, అడయార్, తిరువాన్మీయూరు, ఈసీఆర్, ఓఎంఆర్ తదితర మార్గాల్లో కొంత సౌకర్యాలు కల్గిన ప్రాంతాల్లో రెట్టింపు అద్దె చెల్లించుకోక తప్పదు. ఇక, కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులకు మీటరుతో సంబంధం ఉండదు. ఇంటి యజమాని నిర్ణయించే మీటర్ రీడింగ్ చార్జీను చెల్లించక తప్పదు. పన్నులు పెంచితే చాలు.. అసలే కరోనా మిగిల్చిన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ప్రజల్ని ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింత కష్టాల్లోకి నెడుతున్నాయి. చెన్నై వంటి నగరాలలో ఆస్తిపన్ను, నీటి పన్ను ఇటీవలే అదనంగా వడ్డించారు. అలాగే, విద్యుత్ బిల్లుల మోత మోగింది. ఈ ప్రభావం ఇళ్ల యజమానులపై పడింది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు వారు అద్దెను అమాంతం పెంచేస్తున్నారు. సెప్టెంబర్, అక్టోబరు నుంచి అనేక చోట్ల అద్దె పెంచుతూ యజమానులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అద్దెతో పాటు అదనంగా.. కొన్నిచోట్ల ఇంటి అద్దెతో పాటు విద్యుత్, తాగునీరు, మెయింట్‌నెన్స్ చార్జీలను పెంచేశారు. ఈ విధంగా కుటుంబ ఆదాయంలో గణనీయమైన మొత్తాన్ని ఇంటి అద్దె రూపంలో చెల్లించడం ద్వారా మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాయి. ప్రస్తుతం లగ్జరీతో కూడిన అపార్ట్మెంట్లకు 13, 14 శాతం మేరకు, చిన్న చిన్న రూములు, సింగిల్ బెడ్ రూం, డబుల్‌బెడ్ రూం ఇళ్లకు 25 శాతం వరకు అద్దెను పెంచారు. దీంతో ఇది వరకు రూ. 5 వేలు చెల్లిస్తున్న వారు ప్రస్తుతం రూ. 7 వేల వరకు, రూ.10 వేలు చెల్లిస్తున్న వారు రూ. 13 వేల వరకు అద్దె భారాన్ని భరించాల్సిన పరిస్థితి చెన్నైలో నెలకొంది. నిబంధనలు దాటి ఇంటి అద్దెలు అధికంగా వసూలు చేసేవారిపై చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ అధికారులు పేర్కొంటున్నా, ఆ దిశగా చర్యలు తీసున్న దాఖలాలు లేవు. ఇంటి బాడుగలను క్రమబద్దీకరించే విధంగా మార్గదర్శకాలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న వారిలో మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉండడం గమనార్హం. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
గోదాముల లీజు విస్తీర్ణంలో 62 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశంలోని ప్రధాన పట్టణాల్లో గోదాములకు డిమాండ్ ఏర్పడింది. లీజు విస్తీర్ణం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 62 శాతం వృద్ధితో 51.3 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఈ కామర్స్ సంస్థల నుంచి డిమాండ్ పెరిగినట్టు తెలిపింది. నూతన లాజిస్టిక్స్ పాలసీ ఈ రంగానికి సాయంగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు భారత్ వేర్‌హౌసింగ్ మార్కెట్‌పై నైట్ ఫ్రాంక్ ఓ నివేదికను విడుదల చేసింది. లీజు విస్తీర్ణం వృద్ధి పరంగా పుణె, హైదరాబాద్ టాప్–2 మార్కెట్లుగా ఉన్నాయి. పుణెలో 166 శాతం, హైదరాబాద్ మార్కెట్లో 128 శాతం చొప్పున గోదాముల లీజు గత ఆర్థిక సంవత్సరంలో పెరిగింది. భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి, వినియోగం పెరగడం సంఘటిత రంగంలో గోదాముల లీజు అధిక వృద్ధికి దోహదం చేస్తున్నట్టు తెలిపింది. కరోనా ముందు నాటి పరిమాణాన్ని గోదాముల లీజు అధిగమించినట్టు పేర్కొంది. ఇనిస్టిట్యూషన్స్ సైతం గోదాముల నిర్వహణ, అభివృద్ధి పట్ల ఆసక్తి చూపిస్తుండడం వల్ల.. నిపుణుల అనుభవం వృద్ధి చెందుతున్న ఈ మార్కెట్‌ను నడిపిస్తుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్, ఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. వేర్‌హౌసింగ్ వృద్ధి టాప్–8 పట్టణాలకు వెలుపల కూడా జోరందుకుంటోందని.. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్క్‌ల ఏర్పాటు, మరిన్ని వేర్ హౌస్ జోన్ల ఏర్పాటుకు వీలు కల్పిస్తుందని పేర్కొంది. పట్టణాల వారీగా.. ► ఢిల్లీ ఎన్సీఆర్లో వేర్‌హౌస్ లీజు విస్తీర్ణం 2021–22లో 32 శాతం పెరిగి 9.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► ముంబైలో 48 శాతం పెరిగి 8.6 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. ► బెంగళూరులో 38 శాతం వృద్ధితో 5.9 మిలియన్ చదరపు అడుగుల పరిమాణంలో గోదాములు లీజు నమోదైంది. ► పుణెలో 166 శాతం పెరిగి 7.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. హైదరాబాద్‌లో 128 శాతం పెరిగి 5.4 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. ► అహ్మదాబాద్‌లో 81 శాతం వృద్ధితో 5.3 మిలియన్ చదరపు అడుగులు, చెన్నైలో 44 శాతం పెరిగి 5.1 మిలియన్ చదరపు అడుగులు, కోల్‌కతాలో 41 శాతం పెరిగి 4.3 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు గుడ్ న్యూస్,రూ.2 కోట్ల వరకు
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడాది టర్మ్ డిపాజిట్‌పై రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. 400 రోజులు దాటి, మూడేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై రేటు 5.45 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. మూడేళ్లు దాటి, పదేళ్ల వరకు డిపాజిట్లపై రేటు 0.15 శాతం పెరిగి 5.65 శాతానికి చేరుకుంది. ఏడాది కాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం రేటు లభిస్తుంది. ఇతర కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా వృద్ధులకు కొంచెం అదనపు వడ్డీని బీవోబీ ఆఫర్ చేస్తోంది. ‘బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్’ 5–10 ఏళ్ల కాల వ్యవధికి 5.65 శాతం రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం అదనపు రేటును బ్యాంక్ అందిస్తోంది. -
ఖాతాదారులకు షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంకు
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ మరోసారి తన ఖాతాదారులకు షాకిచ్చింది. రుణాలపై వసూలు చేసే మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) ను 10 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ పెంపు వాహన, గృహ అన్ని రకాల రుణాలపై వర్తిస్తుంది . ఈ రేట్లు నేడు(సెప్టెంబర్ 1, 2022) నుంచే వర్తిస్తాయని బ్యాంకు తెలిపింది. తాజా వడ్డీ రేట్ల సవరణలో రుణ గ్రహీతలపై ఈఎంపై భారం మరింత పెరగనుంది. తాజాగాపెంచిన పెంపుతో ఓవర్‌నైట్ , ఒక నెల ఎంసీఎల్ఆర్ రేటును 7.65 శాతం నుండి 7.75 శాతానికి పెంచినట్లు బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. దీని ప్రకారం మూడు నెలల కాల పరిమితి రుణాలపై 7.80 శాతంగానూ, ఆరు నెలలకు 7.95 శాతంగా ఉండనుంది. ఇక వార్షికరుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంటుంది. గత నాలుగు నెలల్లో వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు జూన్, జూలై, ఆగస్టులలో రేట్లు సవరించింది. ఆగస్టులో, బ్యాంక్ తన రేట్లను 15 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇది చదవండి: షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్ windfall profit tax: మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్ SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
డీజిల్, ఏటీఫ్ ఎగుమతులపై మరోసారి విండ్‌ఫాల్ టాక్స్ షాక్
న్యూఢిల్లీ: డీజిల్, జెట్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కొరడా ఝళిపించింది. వీటి ఎగుమతులపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం అర్థరాత్రి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డీజిల్ ఎగుమతిపై విండ్ ఫాల్ టాక్స్‌ను లీటరుకు రూ.7 నుంచి రూ.13.5కు పెంచుతూ సర్కార్ నిర్ణయించింది. అలాగే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. దీంతోపాటు దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై పన్ను టన్నుకు రూ.13,000 నుంచి రూ.13,300కి పెరిగింది. మార్జిన్ల పెరుగుదలకు అనుగుణంగా ఎగుమతులపై పన్నును పెంచారు. అంతర్జాతీయ చమురు బెంచ్‌మార్క్‌లలో మార్పులు, ఒపెక్, దాని మిత్రదేశాల అంచనా ఉత్పత్తి తగ్గింపునకు అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తయ్యే చమురుపై కూడా లెవీని పెంచింది. (షాకింగ్ రిపోర్ట్: వదల బొమ్మాళీ అంటున్న ఎలాన్ మస్క్) ఇది చదవండి: SC On Check Bounce Case: చెక్ బౌన్స్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు కాగా దేశంలో మొదటిసారిగా జూలై 1న విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌లను విధించిందిప్రభుత్వం. పెట్రోల్, ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 6 ఎగుమతి సుంకం విధించి. ఆ తరువాత జూలై 1న డీజిల్ ఎగుమతిపై రూ. 13 పన్ను విధించింది.జూలై 20న జరిగిన మొదటి పక్షంవారీ సమీక్షలో, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.6 ఎగుమతి సుంకం రద్దు చేయడంతోపాటు, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతిపై లీటరుకు రూ. 2 చొప్పున టాక్స్ తగ్గించింది. అలాగే దేశీయంగా ఉత్పత్తి అయ్యే క్రూడ్‌పై పన్నును టన్నుకు రూ.17వేలకు తగ్గించింది. మళ్లీ ఆగస్టు 2న డీజిల్, ఎటీఎఫ్ ఎగుమతులపై పన్ను తగ్గించింది. అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరగడంతో దేశీయంగా ఉత్పత్తి చేసే ముడి చమురుపై లెవీని టన్నుకు రూ.17,750కి పెంచింది. తదనంతరం, ఆగస్టు 19న, మూడవ పక్షంవారీ సమీక్షలో, డీజిల్‌పై ఎగుమతి పన్ను రూ. 7కు పెంచి,ఏటీఎఫ్‌పై లీటరుకు రూ. 2ల పన్ను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. -
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
పన్ను పోటు: భవిష్యత్తులో పసిడి ధర ఎంత పెరగనుంది?
సాక్షి, ముంబై: కేంద్ర ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచడంతో బంగారం ధరలు పెరగడం ఖాయమని మార్కెట్ వర్గాలు తేల్చి చెబుతున్నారు. ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు పెరగడం, పసిడి అక్రమ రవాణా నిరోధించే లక్ష్యం, అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రికార్డు కనిష్టాలకు పడిపోతుండటం, కరెంట్ ఖాతాపై ఒత్తిడి లాంటి అంశాల నేపథ్యంలో ఆర్థికశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు కనీసం ఐదు శాతం పెరుగుతుందని అంచనాలు నెలకొన్నాయి. భారతదేశంలో బంగారంపై విధించే మొత్తం దిగుమతి సుంకం మూడు భాగాలను ఉంటుంది. బేస్ డ్యూటీ, వ్యవసాయ సెస్, సోషల్ సర్వీస్ సర్ఛార్జ్. వ్యవసాయ సెస్ 2.5 శాతం ఉండగా, సర్‌చార్జ్ రద్దయింది. అయితే దిగుమతి సుంకం పెంపుపై ఐబీజేఏ సురేంద్ర స్పందించారు. ఆయన అంచనా ప్రకారం భవిష్యత్తులో పసిడి 10 గ్రాములకు రూ. 2500 మేర పెరగనుంది. డాలర్‌తో రూపాయి పడి పోతున్న తీరు, బంగారం దిగుమతుల నేపథ్యంలో తాజా పెంపును ఊహించినప్పటికీ ప్రభుత్వం ఇంత త్వరగా ప్రకటిస్తుందని ఊహించ లేదన్నారు. మరోవైపు కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచిన మరుసటి రోజే పసిడి ప్రియులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఊహించినట్టుగానే దేశవ్యాప్తంగా శనివారం ఉదయం బంగారం ధరలు పుంజుకున్నాయి. -
నెల వ్యవధిలోనే మరో షాకిచ్చిన ఐసీఐసీఐ
సాక్షి, ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తన వినియోగదారులకు మరోసారి భారీ షాకిచ్చింది. తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)ను 20 బీపీఎస్ పాయింట్లు పెంచింది. పెంచిన రేట్లు నేటి( జూలై 1, 2022) నుంచే అమల్లోకి వచ్చాయి. రుణాలపై వడ్డీ రేట్ల తాజా సవరణతో మూడు నెలల లోపు రుణాలపై వడ్డీరేటు 7.55 శాతం, ఆరు నెలల 7.70 శాతం, వార్షిక రుణాలపై వసూలు చేసే వడ్డీ రేటు 7.75 శాతంగా ఉంది. అన్ని కాల వ్యవధి రుణాలపై ఈ పెంపు వర్తిస్తుంది. గత నెలలోనే (జూన్ 1) రుణాలపై వడ్డీరేటును 30 బీపీఎస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. -
పసిడి లవర్స్‌కు భారీ షాక్, కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి,ముంబై: అంతర్జాతీయంగా భగ్గుమంటున్న ముడి చమురు ధరలు, దేశీయంగా నెలకొన్న కొరత, వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పెట్రోల్, డీజిల్‌పై ఎగుమతి పన్ను, దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై విండ్‌ఫాల్ పన్ను విధించింది.దీంతోపాటు పసిడిదిగుమతులకు కళ్లెం వేసేందుకు కూడా ఆర్థికమంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది కూడా చదవండి: కేంద్రం కొత్త పన్నుల షాక్, రిలయన్స్,ఓఎన్జీసీ ఢమాల్! బంగారం దిగుమతులు ఒక్కసారిగా పెరడంతో బంగారం డిమాండ్‌ను తగ్గించాలనే లక్ష్యంతో తాజా నిర్ణయం తీసుకుంది. మే నెలలో మొత్తం 107 టన్నుల బంగారం దిగుమతి కాగా జూన్‌లో కూడా గణనీయంగా దిగుమతులు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బంగారం దిగుమతులు పెరగడం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచివేసింది. గతంలో బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, ఇప్పుడు 12.5 శాతానికి చేరనుంది. దీనికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి 3 శాతం జీఎస్టీ అదనపు భారం. తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకున్నాయి. కాగా ఇంధన దిగుమతులు,ఎగుమతులను నియంత్రించే చర్యల పరంపరలో, ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాలను విధించింది. పెట్రోలుపై లీటరుకు రూ.6 డీజిల్‌పై లీటరుకు రూ.13 పన్ను విధించింది. ముడి చమురుపై టన్నుకు రూ.23,250 (ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం) లేదా విండ్‌ఫాల్ పన్ను విధించింది. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటరుకు రూ. 6 ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం విధించింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న ఇండియా బంగారం డిమాండ్‌లో చాలా వరకు దిగుమతుల ద్వారానే. ఇది రూపాయిపై ఒత్తిడి పెంచుతోంది. ఫలితంగా దేశీయ కరెన్సీ రోజుకో రికార్డు కనిష్టానికి చేరుతున్న సంగతి తెలిసిందే. -
ఇక వడ్డీరేట్లు పైపైకి!
ముంబై: విశ్లేషణలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కేవలం ఐదు వారాల వ్యవధిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను మరో అరశాతం పెంచింది. దీనితో ఈ కీలక రేటు 4.9%కి చేరింది. గత నెల 4వ తేదీన ఆర్బీఐ అనూహ్యరీతిలో బ్యాంకులకు రెపోను 40 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1%) పెం చింది. దీనితో ఈ రేటు 4.4%కి చేరింది. మూడురోజుల భేటీ అనంతరం గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ మరోదఫా రెపో పెంపు నిర్ణయంలో కీలక రేటు 4.9%కి ఎగసింది. మొదటి విడత పెంపు నేపథ్యంలో పలు బ్యాంకులు తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచడం ప్రారంభించాయి. కొన్ని బ్యాంకులు ఈ స్వల్ప వ్యవధిలోనే రెండు దఫాలుగా వడ్డీరేట్లను పెంచాయి. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్ గృహ, వాహన, వ్యక్తిగత, కార్పొరేట్ రుణాలు మరింత భారంగా మారనున్నాయి. అదనపు ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణలో భాగంగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎండీఎఫ్) రేటు అరశాతం పెంచుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దీనితో ఈ రేట్లు వరుసగా 4.65%, 5.15%కి చేరాయి. ద్రవ్యోల్బణంపై అందోళన... అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ద్రవ్యోల్బణం అంచనాలుసైతం అనిశ్చితిలో ఉంటున్నట్లు ఆర్బీఐ తాజా సమీక్ష సందర్భంగా అభిప్రాయపడ్డం గమనార్హం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరి (6.01 శాతం), ఫిబ్రవరి (6.07 శాతం), మార్చి (17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతం) నెలల్లో హద్దులు మీరి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్య్లోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి ఎగసింది. దీనితో 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న కిత్రం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒకశాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల స్పీడ్ కట్టడికి సంబంధించి ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) అధికం. ఏకగ్రీవ నిర్ణయం 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన పాలసీ సమీక్షలో ఆరుగురు సభ్యులు 4.9 శాతం వరకూ రేటు పెంపునకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. పాలసీ విధానాన్ని ‘‘రిమైనింగ్ అకామిడేటివ్’’ (తగిన ద్రవ్యలభ్యత ఉండే స్థాయి) నుంచి ‘‘ విత్‌డ్రాయెల్ ఆఫ్ అకామిడేటివ్’’ (ద్రవ్యలభ్యత ఉపసంహరణ)కు మార్చుతున్నట్లు పేర్కొన్న ఆర్బీఐ పాలసీ సమీక్ష, భవిష్యత్తు చర్యలపై మార్కెట్‌కు మరింత స్పష్టత ఇవ్వాలన్న లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే వృద్ధికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా తగిన చర్యలను అన్నింటినీ ఆర్బీఐ తీసుకుంటుందని పాలసీ సమీక్ష స్పష్టం చేసింది. వృద్ధి బాట పటిష్టం కాగా, ఒకవైపు వడ్డీరేట్లు పెరిగే పరిస్థితి నెలకొన్నప్పటికీ, భారత్ ఎకానమీ వృద్ధి బాట పటిష్టంగానే ఉంటుందన్న భరోసాను ఆర్బీఐ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతం వృద్ధి నెలకొంటుందన్న క్రితం అంచనాలను మరోసారి పునరుద్ఘాటించింది. ఏప్రిల్, మే నెలల్లో సూచీలు దేశీయ ఎకానమీ క్రియాశీలత పటిష్టతను సూచిస్తున్నట్లు ఆర్బీఐ పాలసీ సమీక్ష పేర్కొంది. మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా వృద్ధి రేటు 16.2%, 6.2%, 4.1%, 4.0% వృద్ధి రేట్లు నమోదవుతుందని అంచనా వేసింది. అయితే భౌగోళిక ఉద్రిక్తతలు, గ్లోబల్ ఎకనామీ మందగమనం వంటి ప్రతికూలతలూ ఉన్నాయని గుర్తు చేసింది. ఆర్బీఐ ఇంతక్రితమే వృద్ధి రేటును 7.8% నుంచి 7.2%కి తగ్గించిన సంగతి తెలిసిందే. రిజిస్టర్‌కాని డిజిటల్ లెండింగ్ యాప్‌లపై హెచ్చరిక కాగా, డిజిటల్ లెండింగ్ యాప్‌లపై ప్రజల్లో నెలకొంటున్న ఆసక్తి నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తత ప్రకటించింది. ఏదైనా అవకతవకలు జరిగితే రిజిస్టరయిన డిజిటల్ యాప్‌లపైనే ఆర్బీఐ చర్యలు తీసుకోగలుగుతుందని తెలిపింది. రిజిస్టర్ కాని యాప్‌లపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. డిజిటల్ లెండింగ్ యాప్‌ల ద్వారా వేధింపులు, అవి ఆత్మహత్యలకు దారితీయడం వంటి సంఘటనల నేపథ్యం లో ఆర్బీఐ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. క్రెడిట్ కార్డులకు ‘యూపీఐ’ లింక్ క్రెడిట్ కార్డులను యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో లింక్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. యూపీఐ ప్లాట్‌ఫారమ్ వినియోగం విస్తృతికి, ఎక్కువ మంది ఈ విధానంలో చెల్లింపులు చేయడానికి దోహదపడే చర్య ఇది. ఇప్పటి వరకూ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన డెబిట్ కార్డులు మాత్రమే యూపీఐ అనుసంధానమైంది. ముందుగా రూపే క్రెడిట్ కార్డులను యూపీఐతో అనుసంధానం చేస్తారు. ప్రస్తుతం యూపీఐ చెల్లింపులు చేయడం ఉచితం. అయితే క్రెడిట్ కార్డ్ కంపెనీలు సాధారణంగా మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్)పై ఆధారపడి ఉంటాయి. ఆదాయ మార్గంగా మర్చంట్ పేమెంట్స్‌కు సంబంధించి ప్రతి వినియోగంపై ఎండీఆర్ చార్జ్ ఉంటుంది. తాజా ఆర్బీఐ నిర్ణయం నేపథ్యంలో యూపీఐతో అనుసంధానమయ్యే క్రెడిట్ కార్డుల విషయంలో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. మేలో 594.63 కోట్ల లావాదేవీలకు సంబంధించి రూ.10.40 లక్షల కోట్లు యూపీఐ ద్వారా ప్రాసెస్ జరిగినట్లు గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ మ్యాండేట్ పరిమితి రూ.15,000కు పెంపు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ప్రాతిపదికన నిర్వహించే రికరింగ్ చెల్లింపుల విషయంలో ఈ–మ్యాండేట్ (కస్టమర్ ఆమోదం తప్పనిసరి) పరిమితి పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ఈ పరిమితి రూ.5,000 కాగా, దీన్ని రూ.15,000కు పెంచుతున్నట్లు తెలిపింది. అంటే ఇక రూ.15,000 లోపు లావాదేవీలకు ఈ–మ్యాండేట్ అవసరం లేదన్నమాట. రియల్టీ మందగమనమే ఆర్బీఐ తాజా నిర్ణయం వల్ల గృహ రుణాలు మరింత ప్రియం కానున్నాయి. విక్రయాలు తగ్గే పరిస్థితి నెలకొంది. వెరసి సమీప భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ మందగమనంలోకి జారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపో రేటు పెంపు తప్పనిసరి అయినప్పటికీ, ఇది రియల్టీ రంగాన్ని రెడ్ జోన్లోకి నెట్టేసింది. – రమేష్ నాయర్, కొలియర్స్ ఇండియా సీఈఓ రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే ద్రవ్యోల్బణం కట్టడి... 2022–23 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు ధర బ్యారల్‌కు (ఇండియన్ బాస్కెట్) 105 ఉంటుందని అంచనా వేస్తున్నాం. దీనితోపాటు 2022లో తగిన వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలతో ఉన్నాం. మే 21న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో పట్టణ నివాసితుల నుంచి కొంత సంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు మా సర్వేలో తెలిసింది. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్‌లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లతో పాటు ఈ అంచనాలను తగ్గించడానికి ఖచ్చితంగా దోహదం చేస్తుంది. – శక్తికాంతదాస్, ఆర్బీఐ గవర్నర్ సహకార బ్యాంక్ గృహ రుణ పరిమితి రెట్టింపు రియల్టీలో సహకార బ్యాంకులు ఇక మరింత క్రియాశీల పాత్ర పోషించనున్నాయి. గృహ రుణాలకు సంబంధించి సహకార బ్యాంకు ఒక వ్యక్తికి ఇచ్చే గరిష్ట రుణ మొత్తాన్ని రిజర్వ్ బ్యాంక్ రెట్టింపు చేసింది. గృహాల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు దశాబ్ద కాలం క్రితం చేసిన మార్గదర్శకాల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ తెలిపిన సమాచారం ప్రకారం, పట్టణ గ్రామీణ బ్యాంకుల విషయంలో గరిష్ట రుణ పరిమితి ప్రస్తుతం రూ.70 లక్షల నుంచి రూ.1.40 కోట్లకు పెరిగితే, గ్రామీణ సహకార బ్యాంకుల విషయంలో ఈ పరిమితి రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షలకు ఎగసింది. డెవలపర్లకు ఉత్సాహాన్ని ఇచ్చే దిశలో ఆర్బీఐ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన బిల్డర్లకు రుణాలు ఇవ్వడానికి గ్రామీణ సహకార బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిఇచ్చింది. ప్రస్తుతం దీనిపై నిషేధం ఉంది. గ్రామీణ సహకార బ్యాంకులు వాణిజ్య రియల్ ఎస్టేట్ – రెసిడెన్షియల్ హౌసింగ్ (సీఆర్ఈ–ఆర్‌హెచ్) రంగానికి రుణాలు ఇవ్వడానికీ ఆర్బీఐ అనుమతులు మంజూరు చేయడం ఈ రంగాలకు సానుకూల అంశం. వృద్ధులు, వికలాంగులకు సహాయం చేయడానికి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవల నిర్వహణకు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ తెలపడం మరో విశేషం. సమగ్ర అంచనాలు... ఆర్బీఐ పాలసీ సమీక్ష అంచనాలు సమగ్రంగా ఉన్నాయి. వృద్ధి–ద్రవ్యోల్బణం సమతౌల్యం తత్సంబంధ అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని ఆర్బీఐ కమిటీ ఎకానమీ పురోగమనానికి తగిన నిర్ణయాలు తీసుకుంది. రియల్టీ రుణాల విషయంలో సహకార బ్యాంకింగ్‌కు తగిన అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయాలు ఈ రంగానికి సానుకూల అంశం. – దినేష్ ఖారా, ఎస్బీఐ చైర్మన్ కీలక దశ... ఒకపక్క వృద్ధి పురోగమనం. మరోపక్క ద్రవ్యోల్బణం కట్టడి. ఈ కీలక లక్ష్యాల సాధన దిశగా ఎకానమీ అడుగులు వేయాల్సిన పరిస్థితిలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంది. పాలసీ సమీక్ష దాదాపు ఊహించిందే. వృద్ధి బాట చెక్కుచెదరకుండా ప్రభుత్వం, ఆర్బీఐ పరస్పర సహకారంతో పనిచేస్తున్నాయి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ సమతుల్య పాలసీ... ద్రవ్యోల్బణం తగ్గడానికి, వృద్ధి పురోగతికి తగిన చర్యలు తీసుకుంటూ ద్రవ్య, పరపతి అధికారులు తగిన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇందుకు సంబంధించి దేశీయంగా ఎదురవుతున్న సవాళ్లలో అధికభాగం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల వల్ల తలెత్తుతున్నవే. ఆర్థికాభివృద్ధికి– ధరల కట్టడికి ఆర్బీఐ పాలసీ కమిటీ తన నిర్ణయాలను తాను తీసుకుంది. – అజయ్ సేథ్, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి. -
శ్రీలంక సంక్షోభం, భగ్గుమన్న పెట్రోలు, లీటరు రూ.420
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో మరోసారి ఇంధన ధరలు భగ్గుమన్నాయి. మంగళవారం పెట్రోల్ ధరను 24.3 శాతం, డీజిల్ ధరను 38.4 శాతం పెంచుతూ అక్కడి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర 420 రూపాయలు (1.17 డాలర్లు,) డీజిల్ రూ. 400 (1.11 డాలర్లు) కు చేరింది. ఏప్రిల్ 19 నుండి రెండోసారి ధరల పెంపుతో ఫ్యూయల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో విదేశీమారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. సవరించిన ధరలు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయని ప్రభుత్వరంగ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రకటించింది. శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో అక్కడి వినియోగదారుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. 1948లో స్వాతంత్య్రం పొందినప్పటి నుండి ఇంతటి సంక్షోభం ముందెన్నడూ లేదు. దాదాపు అన్ని నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. విదేశీ నిల్వల కొరత కారణంగా ఇంధనం, వంటగ్యాస్, ఇతర నిత్యావసరాలకోసం జనుల క్యూలైన్లలో బారులు తీరుతున్న పరిస్థితి. అయితే తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం రేటు 40 శాతం దిశగా దూసుకుపోవడం, ఆహారం, ఇంధనం, ఔషధాల కొరతతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. శ్రీలంక తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, ఇంధనం అడుగంటిపోకుండా నిరోధించే చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులను తగ్గించే చర్యగా, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, ఆయా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించింది. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపిందనీ ఈ ఫార్ములా ప్రతి పదిహేను రోజులకోసారి లేదా నెలకోసారి వర్తింపజేస్తామని విద్యుత్,ఇంధన శాఖ మంత్రి కాంచన విజే శేఖర ట్విటర్లో తెలిపారు. (1) Fuel Price will be revised from 3am today. Fuel pricing formula that was approved by the cabinet was applied to revise the prices. Price revision includes all costs incurred in importing, unloading, distribution to the stations and taxes. Profits not calculated and included. — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 (3) Public sector workforce will be called to work on the direction of the head of the institute from today. Work from home will be encouraged to minimize the use of fuel and to manage the energy crisis. pic.twitter.com/JVKrmSYnoc — Kanchana Wijesekera (@kanchana_wij) May 23, 2022 -
మెర్సిడెస్ బెంజ్ ప్రియులకు షాక్..!
ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు నేడు సంస్థ తెలిపింది. ఇన్ పుట్ ఖర్చుల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణం అని కంపెనీ పేర్కొంది. కారు మోడల్ బట్టి రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. "మెర్సిడెస్ బెంజ్ వినియోగదారులకు సాటిలేని అనుభూతిని అందించడం కోసం అత్యంత అధునాతన సాంకేతికతను అందిస్తున్నాము. అయితే, వ్యాపారాన్ని స్థిరంగా నడపడానికి ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చులలో నిరంతర పెరుగుదలను భర్తీ చేయడానికి ధరల దిద్దుబాటు అవసరం" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి & సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆడి ఇండియా ఏప్రిల్ 1 నుంచి 3 శాతం వరకు తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
మందు బాబులు జర జాగ్రత్త.. లేదంటే జేబులు ఖాళీ!
కోహెడరూరల్(హుస్నాబాద్): సిండికేట్ల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి సిండికేట్‌గా ఏర్పడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హుస్నాబాద్ నిమోజకవర్గంలో మద్యం వ్యాపారులు మద్యం వినియోగదారుల జేబులు ఖాళీ చేసేందుకు కుమ్మక్కయ్యారు. మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ అధికారుల పరస్పర అవగాహనతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్‌లో కొన్ని బ్రాండ్లను మాత్రమే విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారుల తీరుతో మందుబాబులు విసిగిపోతున్నారు. కొద్ది రోజులుగా మద్యం అమ్మకాల్లో జరుగుతున్న నాటకీయ పరిణామాలు వారి మత్తు దిగేలా చేస్తున్నాయి. కోరింది కాకుండా స్కీం ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే అమ్ముతున్నారు. బెల్ట్ షాపుల్లో మాత్రం 24 గంటలు అన్ని రకల బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి. పోలీస్, ఎక్సైజ్ శాఖల అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. (చదవండి: వంట నూనెల సలసల.. 15 రోజుల్లో భారీగా పెరిగిన ధర, ఇలా అయితే కష్టమే! ) వ్యాపారుల ఇష్టారాజ్యం మద్యం కొనుగోలుదారులు అడిగిన బ్రాండ్ కాకుండా తమకు లబ్ధిచేకూర్చే కంపెనీల బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే అమ్ముతున్నారు. లాభం ఎక్కువ ఇచ్చే(స్కీం)కంపెనీల మద్యాన్ని మాత్రమే విక్రయించేందుకు వ్యాపారులు సిండికేట్ అయ్యారని స్థానికులు చర్చించుకుంటున్నారు. స్కీంలు భారీగా ఇచ్చే కంపెనీల మద్యం మాత్రమే విక్రయించాలని అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్థానికులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రధాన బాండ్ల విక్రయాలను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో వాటిని అమ్ముతున్నప్పటికీ స్థానిక వ్యాపారులు సిండికేటుగా మారడంతో కొన్ని బ్రాండ్ల మద్యం లభించడం లేదు. దీంతో మద్యం ప్రియులు వారు అంటగడుతున్న వాటినే తీసుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. స్కీం లేకుంటే అంతే.. యువత ఎక్కువగా బీరు తాగుతుంటారు. అత్యధికంగా కింగ్ ఫిషర్ లైట్ లేదా స్ట్రాంగ్ పైనే మక్కువ చూపుతుంటారు. బీర్ల విక్రయాల్లో ఎక్కువగా అమ్మడు పోయిదే ఈ బ్రాండ్ మాత్రమే. మార్కెట్లో డిమాండ్ ఉన్న బ్రాండ్ కావడంతో కొద్దిరోజులుగా ఆ కంపెనీ స్కీం రూపంలో వైన్‌షాప్‌లకు ఇచ్చే ప్రోత్సహకాలకు నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో ప్రోత్సాహకాలు(స్కీం)ఇవ్వని బ్రాండ్లు అమ్మకూడదని వ్యాపారులు నిర్ణయించుకున్నట్లు వినికిడి. వినియోగదారులు కోరినా స్టాక్ లేదంటూ ఇతర కంపెనీల బీర్లను అంటగడుతున్నారు. (చదవండి: అమ్మమ్మ పాలకూర కావాలంటూ.. పుస్తెలతాడుతో.. ) ఎక్సైజ్ అధికారుల అండతో.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారుల అండదండలతో మద్యం వ్యాపారుల సిండికేట్ నడుస్తోంది. సిండికేట్ నడుస్తోందని తెలిసినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా దృష్టికి రాలేదు హుస్నాబాద్ పరిధిలో మద్యం వ్యాపారులు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. అధిక ధరలకు అమ్ముతున్నట్టు మాకు సమాచారం లేదు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్టు మా దృష్టికి రాలేదు. మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఉండకూడదు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ధరలకు మద్యం విక్రయించకూడదు – విజయలక్ష్మి, ఎక్సైజ్ సీఐ, హుస్నాబాద్ సరికొత్త రేట్లతో విక్రయాలు మద్యం వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు కాకుండా ఇష్టారాజ్యంగా ధరలు పెంచి బహిరంగంగా విక్రయాలు సాగిస్తున్నారు. ఫుల్ బాటిల్‌పై రూ.20 నుంచి 30, హాఫ్ బాటిల్‌పై రూ.10 నుంచి 20 వరకు, క్వాటర్ సీసాపై రూ.10 నుంచి 15 వరకు విక్రయిస్తున్నారు. బీరుపై రూ.10 నుంచి 20 అధికంగా వసూలు చేస్తున్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేకంగా మద్యం సీసాలపై స్టిక్కర్లు వేసి బెల్ట్‌షాపులకు సరఫరా చేస్తున్నారు. -
బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారా..! అయితే మీకో గుడ్‌న్యూస్!
బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇంట్రస్ట్ రేట్లు పెంచుతూ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఖాతా దారులు వడ్డీరేట్ల పెంపుపై సంతోషం వ్యక్తం చేస్తుండగా..పెరిగిన ఆ ఇంటస్ట్ర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం? దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ రంగ సంస్థ హెచ్డీఎఫ్సీ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ అధికారిక వెబ్సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు తర్వాత వడ్డీ రేటు 5.6 శాతంగా ఉంటుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా..,రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి.ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. అలాగే, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ పొందేందుకు కనీస వ్యవధి 7 రోజులు. వడ్డీ ఒక సంవత్సరంలోని రోజుల సంఖ్య ఆధారంగా లెక్కించబడుతుంది. లీపు సంవత్సరంలో వడ్డీ 366 రోజులకు లెక్కించబడుతుంది, సాధారణ సంవత్సరంలో వడ్డీ 365 రోజులకు లెక్కించబడుతుంది. కాగా, పెరిగిన వడ్డీ రేట్లపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే మీ దగ్గర్లోని బ్యాంక్‌ను సందర్శించాల్సి ఉంటుంది. చదవండి: ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఆధార్ కార్డు సేఫ్..లేదంటే? దొంగ చేతికి తాళం ఇచ్చినట్లే -
పాపులర్ స్మార్ట్ ఫోన్, ధర ఐదోసారి పెరిగింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి మరోసారి రెడ్మీ నోట్ 10ను ధరను పెంచింది. రెడ్మీ నోట్ సిరీస్ అంటే మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ సిరీస్ విడుదలైన ప్రతీసారి ఆ ఫోన్ కొనుగోలు కోసం యూజర్లు ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్చి 16న రెడ్మీ నోట్ 10ను విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐదుసార్లు ఈ ఫోన ధరను షావోమి పెంచింది. మొత్తంగా ఐదు నెలల కాలంలో ఈ ఫోన్ ధర రెండు వేల రూపాయలు పెరిగింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చిప్‌ల తయారీ తగ్గిపోయింది. దీంతో స్మార్ట్ఫోన్ల ఉత్పత్తిపై చిప్‌ల కొరత ప్రభావం పడుతోంది. ఫలితంగా ఫోన్ల ధరలు పెంచేందుకు స్మార్ట్ తయారీ కంపెనీలు వెనుకాడటం లేదు. చదవండి : అద్భుతమైన ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్, ఫీచర్లు లీకయ్యాయి అప్పుడు రూ. 11,999లకే రెడ్మీ నోట్ 10 మార్కెట్లోకి వచ్చినప్పుడు 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గా ఉంది. ఇప్పుడు ధర పెరిగిన అనంతరం ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999గానూ, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గానూ ఉంది. ఈ రెండు వేరియంట్ల ధర రూ.500 మేర పెరిగింది. రెడ్మీ నోట్ 10 ఫీచర్స్ నెట్వర్క్ టెక్నాలజీ : జీఎస్ఎం / హెచ్ఎస్పీఏ లాంచ్ డేట్ : మార్చి 4 డైమన్షన్ : 160.5 x 74.5 x 8.3 మిల్లీమీటర్ (6.32 x 2.93 x 0.33 అంగుళాలు) వెయిట్ : 178.8 గ్రాములు బిల్డ్ : ఫ్రంట్ గ్లాస్ (గొరిల్లా గ్లాస్ 3), ప్లాస్టిక్ బ్యాక్, ప్లాస్టిక్ ఫ్రేమ్ సిమ్ : సిమ్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్, డ్యూయల్ స్టాండ్-బై) డిస్ ప్లే : సూపర్ ఆమ్లోడ్, 450 నిట్స్ (టైప్), 1100 నిట్స్ (పీక్) సైజ్ : 6.43 అంగుళాలు, 99.8 cm2 (83.5% స్క్రీన్-టు-బాడీ రేషియో ) రిజల్యూషన్ :1080 x 2400 పిక్సల్స్, 20: 9 రేషియో ప్రొటెక్షన్ : కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఓఎస్ : ఆండ్రాయిడ్ 11, MIUI 12.5 చిప్సెట్ : క్వాల్కామ్ SDM678 స్నాప్‌డ్రాగన్ 678 (11 nm) సీపీయూ : ఆక్టా కోర్ (2x2.2 GHz క్రియో 460 గోల్డ్ అండ్ 6x1.7 GHz క్రియో 460 సిల్వర్) జీపీయూ : అడ్రినో 612 మెమరీ కార్డ్ స్లాట్ : మైక్రో ఎస్డీఎక్స్సీ ఇంటర్నల్ : 64జీబీ 4జీబీ RAM, 128జీబీ 4జీబీ ర్యామ్, 128జీబీ 6జీబీ ర్యామ్ క్వాడ్ : కెమెరా 48 ఎంపీ,ఎఫ్ /1.8, 26ఎంఎం సెల్ఫీ : కెమెరా సింగిల్ 13 ఎంపీ, ఎఫ్/2.5 -
టెకీలకు బంపర్ ఆఫర్ : డబుల్ హైక్స్ కు ఐటీ దిగ్గజాల మొగ్గు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మరి కారణంగా గత ఏడాది చాలా ఐటి కంపెనీలు జీతాల పెంపును వాయిదా వేసుకున్నాయి. గత ఏడాది రెండవ భాగంలో వ్యాపారం పుంజుకున్నందున, చాలా ఐటి కంపెనీలు గత క్యాలెండర్ సంవత్సరం చివరి నుంచి లేదా ఈ ఏడాది ఆరంభం నుంచి ఇంక్రిమెంట్ ఇవ్వడం ప్రారంభించాయి. ఇక ఈ ఏడాది ఐటీ దిగ్గజాలు ఇప్పటికే వేతనాలు పెంచడంతో పాటు నైపుణ్యం గల మానవ వనరులను నిలుపుకునేందుకు డబుల్ హైక్స్ కూడా ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాయి. కరోనా మహమ్మారి డిజిటల్ వాడకం పెరగడంతో పాటు ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తుండటంతో ఆఫీస్ నిర్వహణ ఖర్చులు కూడా తగ్గి పోయాయి. అందుకే ప్రతిభ గల ఉద్యోగులు జారీ పోకుండా ఉండేందుకు డబుల్ హైక్స్ ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. దీంతో టెకీల్లో జోరు నెలకొంది. ఇప్పుడు ప్రతిభకు పోటీ తీవ్రతరం కావడంతో, చాలా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్లతో మళ్లీ బహుమతి ఇస్తున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, 2 లక్షలకు పైగా ఉద్యోగులున్న యాక్సెంచర్ ఇండియా గత ఏడాదికి డిసెంబరులో ఇంక్రిమెంట్ ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్ళీ వేతనాల పెంపు, బోనస్, ప్రమోషన్లను ప్రకటించింది. ఏప్రిల్‌లో అసోసియేట్ డైరెక్టర్ స్థాయి వరకూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోనస్ ను అందచేశామని యాక్సెంచర్ ఇండియా ప్రకటించినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఏడాది డిసెంబరులో, యాక్సెంచర్ ప్రపంచవ్యాప్తంగా 605 మందిని ఎండికి, 63 మందిని సీనియర్ ఎండికి ప్రమోషన్ ఇచ్చింది. ఇందులో రికార్డు శాతం మహిళలు ఉన్నారు. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ ఈవీపీ & హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో చాలా వరకు హైక్స్ నిలిపివేసిన తరువాత జనవరి నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభించారు. గత సంవత్సరం పనితీరు ఆధారంగా మరో సమీక్ష ఇన్ఫోసిస్ చేస్తున్నట్లు పేర్కొంది. పనితీరు ఆధారంగా జీతం పెంపు జూలై నుంచి అమలులోకి రానుంది. రెండు ఇంక్రిమెంట్లు కలుపుకుని 10 నుంచి 14 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. అలాగే, ఇన్ఫోసిస్ ప్రధాన ప్రత్యర్థి టీసీఎస్ ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు ఇంక్రిమెంట్లను ఇచ్చినట్లు ప్రకటించింది. టీసీఎస్ అన్ని భౌగోళిక ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్ ఇచ్చింది. చాలా మంది సీనియర్ ఉద్యోగులు 6-8 శాతం వరకు వేతన పెంపును అందుకున్నారని, ఇది సాధారణం కంటే ఎక్కువగా అని మార్కెట్ వర్గాల అభిప్రాయం. ఇక విప్రో మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో జూన్ లో వేతన పెంపును అమలు చేస్తామని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి తమ సిబ్బంది వేతనాలు పెంచినట్టు టెక్ మహీంద్ర పేర్కొంది. చదవండి: భారత్ కు అండగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ -
కొత్త ఇళ్లు కొనే వారికి ఎస్బీఐ షాక్
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) గృహ రుణాల కనీస వడ్డీ రేటును పెంచింది. ఎస్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ రుణ వడ్డీ రేట్లు 6.95 శాతం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వడ్డీ రేటులో మార్పు అనేది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దేశంలో అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ మార్చిలో గృహ రుణాలపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. మార్చి నెలలో 6.70 శాతం వడ్డీ రేటుతో బ్యాంకు గృహ రుణాలు అందించింది. ఈ ఆఫర్ మార్చి 31 వరకు ఉంది. బ్యాంకు ఇప్పుడు గృహ రుణాల వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. కొత్త రేటు ఇప్పుడు 6.95 శాతంగా ఉంది. గృహ రుణాలపై ఏకీకృత ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ విధిస్తుంది. ఇది రుణ మొత్తంలో 0.40 శాతం, అలాగే జీఎస్టీ చార్జీలు కూడా ఉంటాయి. మార్చిలో ఎస్బీఐ గృహ రుణ ప్రాసెసింగ్ ఫీజును మార్చి 31 వరకు మాఫీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో గృహ కొనుగోలుదారులు ఇతర బ్యాంకుల వైపు చూసే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆస్తులు, డిపాజిట్లు, శాఖలు, కస్టమర్లు, ఉద్యోగుల పరంగా దేశంలోనే అతిపెద్ద వాణిజ్య బ్యాంకు. ఇది దేశంలో అతిపెద్ద తనఖా రుణదాత. బ్యాంకు యొక్క గృహ రుణ పోర్ట్‌ఫోలియో రూ.5 లక్షల కోట్లు. చదవండి: షియోమీ కొత్త లోగోపై నెటిజన్ల ట్రోల్స్ -
వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు
సాక్షి, ముంబై : వరుస బాదుడు తరువాత మధ్యలో కాస్త శాంతించినా పెట్రో ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. గత ఐదురోజులుగా భగ్గుమంటున్న పెట్రోలు ధర వరుసగా ఆరో రోజు మంగళవారం కూడా పెరిగింది. ఆగస్టు 16 నుండి చమురు కంపెనీలు (ఆగస్టు 19 తప్ప) మెట్రోల్లో పెట్రోల్ ధరలను పెంచుతున్నాయి. అయితే, దాదాపు ఒక నెలరోజుల నుంచి డీజిల్ ధరలో మార్పులేదు. మంగళవారం ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో పెట్రోల్ రేటు 9-11 పైసలు పెరిగింది. పెట్రోల్ ధర లీటరుకు ఢిల్లీలో 81.73రూపాయలు ముంబైలో 88.39 రూపాయలు చెన్నైలో 84.73 రూపాయలు కోల్‌కతాలో 83.24 రూపాయలు హైదరాబాద్‌లో 84.94 రూపాయలు బెంగళూరులో 84.39 రూపాయలు డీజిల్ ధర లీటరుకు ఢిల్లీలో 73.56 రూపాయలు ముంబైలో 80.11 రూపాయలు చెన్నైలో 78.86 రూపాయలు కోల్‌కతాలో 77.06 రూపాయలు హైదరాబాద్‌లో 80.17 రూపాయలు బెంగళూరులో 77.88 రూపాయలు ఆసియా , ఐరోపాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యుఎస్ గల్ఫ్ తీరంలో వ్యాపారులు భారీగా ఉత్పత్తి కోతలు విధించడంతో ముడి చమురు ధరలు మండుతున్నాయని రాయిటర్స్ తెలిపింది. -
చుక్కలు తాకుతున్న బంగారం ధరలు
-
వరుస పరాజయాలు.. పారితోషికం మాత్రం డబుల్
ఒక్క సక్సెస్ వస్తే చాలు హీరోహీరోయిన్లు తమ పారితోషికాలను అమాంతం పెంచేస్తుంటారు. స్టార్ ఇమేజ్ ఉన్న నటీనటుల పారితోషికాలను చూస్తుంటే మతిపోతోంది. హీరోలు రూ.40 కోట్లకు పైనే డిమాండ్ చేస్తుంటే హీరోయిన్లు తామేమీ తక్కువ కాదు అన్నట్టుగా రూ.10 కోట్లకు పైనే పుచ్చుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్లు రూ.12 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు. ఇక దక్షిణాదిలో భారీ పారితోషికం పుచ్చుకుంటున్న నటి నయనతారనే. ఈ సంచలన నటి రూ.5 కోట్లు తీసుకుంటున్నట్లు సినీ వర్గాల సమాచారం. అనుష్క రూ.3 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక పెద్దగా మార్కెట్ లేని హీరోయిన్లు రూ.50 నుంచి 60 లక్షల వరకూ పుచ్చుకుంటున్నారు. మొన్నటి వరకూ కోలీవుడ్‌లో హిట్ కోసం పడిగాపులు పడ్డ నటి రకుల్ ప్రీత్‌సింగ్ ఆ మధ్య కార్తీతో జత కట్టిన ‘ధీరన్ అధికారం ఒండ్రు’ చిత్ర విజయంతో కోటి వరకూ పారితోషికాన్ని డిమాండ్ చేసింది. ఇటీవల మరోసారి కార్తీతో రొమాన్స్ చేసిన ‘దేవ్’ చిత్రం నిరాశపరిచింది. అయినా కూడా మరోసారి పారీతోషికాన్ని పెంచేసిందట రకుల్. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూర్యకు జంటగా నటించిన ‘ఎన్జీకే’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం తెలుగులో రకుల్‌కి పెద్దగా అవకాశాలు లేవు. అయినా తెలుగులో నాగార్జునకు జంటగా నటించే చిత్రం కోసం రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం తీసుకుంటున్న పారితోషికానికి మరో సగం పెంచేసి రూ.1.50 కోట్లు డిమాండ్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. మరో విజయం సాధించేవరకూ ఇదే పారితోషికాన్ని మెయిన్టేన్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. -
ఇక విదేశీ స్మార్ట్ఫోన్లు కొనాలంటే..
సాక్షి, న్యూఢిల్లీ: అంతకంతకూ దిగజారిపోతున్న కరెన్సీ రూపాయిని గట్టెక్కించేందుకు కరెంట్ అకౌంట్ లోటును నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొన్ని రకాల వస్తులపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్టు ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ బోర్డ్ వెల్లడించింది. అక్టోబర్11, గురువారం అర్థరాత్రినుంచే పెరిగిన సుంకం అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. దీంతో దిగుమతి చేసుకున్న విదేశీ స్మార్ట్‌ఫోన్ ధరలు మరింత భారం కావడం ఖాయం. గత పదిహేనురోజుల్లోనే కొన్ని వస్తువులపై దిగుమతి సుంకాన్ని రెట్టింపు చేయడం ఇది రెండవ సారి. ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 17రకాల వస్తులపై దిగుమతి పన్నును పెంచింది. వీటిల్లో స్మార్ట్‌వాచీలు,స్మార్ట్‌ఫోన్ ఎక్విప్మెంట్స్/ కంపోనెంట్స్ దిగుమతులపై 10శాతం సుంకాన్ని పెంచింది. ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (PCBA) వంటి కమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపయోగించే కొన్ని ఇన్‌పుట్స్‌పై కూడా దిగుమతి సుంకం పెంచింది. దీంతో వీటిపై ప్రస్తుతం 10శాతంగా ఉన్న పన్ను 20 శాతానికి చేరింది. స్థానికంగా స్మార్ట్‌ఫోన్ తయారీలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఇంటర్మీడియట్ వస్తువులను నిషేధిస్తూ మరో నోటిఫికేషన్‌ను ఆర్థిక మంత్రిత్వ జారీచేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరుసార్లు దిగుమతి సుంకాన్ని పెంచినట్టయింది. ఇటీవల 19 రకాల (ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, లెదర్ వస్తువులు, విమాన ఇంధనం తదితర)వస్తువులపై సుంకాన్ని పెంచుతూ నిర్ణయాన్ని వెలువరించింది. కాగా కరెంట్ అకౌంట్ లోటును తగ్గించే చర్యల్లో కొన్ని వస్తువులపై అధిక దిగుమతి సుంకాలను విధిస్తామని సెప్టెంబరులో ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.4 శాతానికి చేరగా అక్టోబర్ నాటికి డాలరు మారకంలో భారత కరెన్సీ 7 శాతం క్షీణించి రికార్డు కనిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. -
దిగుమతి సుంకాల పెంపు
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటును నియంత్రించడం, రూపాయి విలువ క్షీణతకు చెక్‌పెట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 19 రకాల దిగుమతులపై సుంకాలను పెంచింది. వీటిలో విమాన ఇంధనం, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్లు తదితర ఉత్పత్తులు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి వచ్చేస్తాయని కేంద్రం ప్రకటించింది. ఈ దిగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.86,000 కోట్ల మేర ఉంటుందని తెలిపింది. సుంకాల పెంపుతో వీటి ధరలు మరింత పెరిగిపోతాయి. తద్వారా వాటి దిగుమతులకు ఆదరణ తగ్గుతుందని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కొన్ని రకాల దిగుమతులను నిరోధించేందుకుగాను ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని పెంచడం ద్వారా కేంద్ర ప్రభుత్వం టారిఫ్ చర్యలు తీసుకుంది. కరెంటు ఖాతా లోటును కుదించడమే ఈ చర్యల ఉద్దేశం’’ అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, రూపాయి క్షీణతను అడ్డుకునేందుకు అనవసర దిగుమతులను నిరోధించనున్నట్టు కేంద్రం ఈ నెల 14నే ప్రకటించింది. -
దిగుమతి సుంకం పెంపు: ఎవరికి షాక్, ఎవరికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే కేంద్ర ప్రభుత్వం విదేశాలనుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై బేసిక్ కస్టమ్ డ్యూటీ పెంపును ప్రకటించింది. కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణ, చారిత్రక కనిష్టాలకు పడిపోతున్న రూపాయి విలువ నేపథ్యంలో 19 రకాల విలాస వస్తువులపై (నాన్ ఎసెన్షియల్) దిగుమతి సుంకాన్ని పెంచింది. ఈ పెంపు సెప్టెంబరు 27నుంచి అమల్లోకి రానున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా ఈ సుంకంనుంచి బంగారం నుంచి మినహాయించడం విశేషం. మరోవైపు ఎలక్ట్రానిక్ వస్తువులు, విమాన ఇంధన ధరలపై సుంకాన్ని పెంచడం ఆయా రంగాలకు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో కుదేలవుతున్న విమానయాన పరిశ్రమ ఉపయోగించే టర్బైన్ ఆయిల్ దిగుమతులపై మొదటిసారి 5శాతం సుంకాన్ని విధించింది. అలాగే రానున్న ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఏసీలు, ఫ్రీజ్, వాషిగ్మెషీన్లపై దిగుమతి సుంకం పెంపు సాధారణ కొనుగోలు దారులకు చేదువార్తే. మెటల్ జ్యుయల్లరీ, సెమీ ప్రాసెస్డ్ డైమండ్స్,కొన్ని రకాల విలువైన రాళ్లపై 5శాతం నుంచి 7.5శాతానికి పెంపు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్మెషీన్లు, టీవీలపై 10శాతం నుంచి 20 శాతం పెంపు ప్లాస్టిక్ వస్తులపై10నుంచి 15శాతానికి పెంపు సూట్‌కేసులపై 10 నుంచి 5శాతానికి పెంపు ఏవియేషన్ టర్బైన్ ఆయిల్‌పై 5శాతం రేడియల్ కారు టైర్లపై 10 నుంచి 15శాతానికి ఫుట్‌వేర్‌పై 20 నుం 25 శాతానికి పెంపు కిచెన్‌వేర్‌పై 10నుంచి 15శాతానికి పెంపు షవర్ బాత్, సింక్లు, వాష్ బేసిన్, స్పీకర్లపై 10 శాతం నుండి 15 శాతం పెంపు -
దేశంలో కొనసాగుతున్న పెట్రోమంట
-
కార్లు, బైక్ ధరలకు రెక్కలు!
న్యూఢిల్లీ: కార్లు, ద్విచక్ర వాహనదారులు థర్డ్ పార్టీ బీమా రూపంలో శనివారం నుంచి అదనపు భారం మోయాల్సిన పరిస్థితి. ఇకపై కార్ల కొనుగోలు సమయంలో ఏడాది బీమా కాకుండా మూడేళ్ల కాలానికి బీమా పాలసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే ద్విచక్ర వాహనాలు అయితే కొనుగోలు సమయంలోనే ఐదేళ్ల బీమా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో వాహనాల కొనుగోలు వ్యయం ఒక్కసారిగా పెరిగిపోనుంది. ఇది వాహనదారులకు కాస్తంత రుచించనిదే. అయితే, ఏటా రెన్యువల్ చేసుకోవాల్సిన ఇబ్బంది అయితే తప్పనుంది. ఈ భారం ఏ స్థాయిలో ఉంటుందంటే... 1500సీసీ సామర్థ్యంపైన ఉన్న కార్లకు ఏడాది బీమా పాలసీ ప్రీమియం ప్రస్తుతం రూ.7,890 స్థాయిలో ఉండగా, మూడేళ్లకు తీసుకోవాలంటే ఇక మీదట ఒకేసారి రూ.24,305ను జేబు నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. అదే 350సీసీ సామర్థ్యంపైన ఉన్న బైకులకు ఏడాది ప్రీమియం రూ.2,323గా ఉంటే, ఇక మీదట ఐదేళ్ల పాలసీ కోసం రూ.13,034 ఖర్చు చేయాల్సి వస్తుంది. వివిధ సామర్థ్యం కలిగిన మోడళ్ల ఆధారంగా ఈ ప్రీమియంలో మార్పులు ఉంటాయి. ఇదంతా సుప్రీంకోర్టు ఆదేశాల పర్యవసానమే. కొత్త కార్లకు మూడేళ్లు, ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా తప్పనిసరిగా సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలంటూ ఈ ఏడాది జూలై 20న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ కవరేజీ తీసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో, దీర్ఘకాల పాలసీలను వాహనాలను కొన్నప్పుడే తీసుకునే విధంగా సుప్రీం ఆదేశించింది. నిబంధనల ప్రకారం మన దేశంలో వాహనాలకు బీమా తప్పనిసరి. థర్డ్ పార్టీ బీమా అనేది, వాహనదారుడు, అతని వాహనం కారణంగా మూడో పార్టీకి కలిగిన నష్టానికి పరిహారం చెల్లించేది. దీన్ని వాహనదారులు అందరూ తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో బాధితులకు కలిగే నష్టానికి పరిహారం లభిస్తుంది. ప్రాణ నష్టానికి బాధిత కుటుంబాలు పెద్ద మొత్తంలో పరిహారం అందుకోగలవు. ఆస్తి నష్టానికి కూడా పరిహారం లభిస్తుంది. బీమా విస్తరణకు దోహదం వాహనం వయసు పెరుగుతున్న కొద్దీ దానికి బీమా కవరేజీ విలువ తగ్గుతూ వెళుతుంది. పైగా ప్రీమియం పెరుగుతూ వెళుతుండడం గమనించొచ్చు. ముఖ్యంగా థర్డ్ పార్టీ బీమా విషయంలో పరిహార చెల్లింపులు పెరుగుతుండటంతో, ప్రీమియంలను బీమా కంపెనీలు ఏటా సవరిస్తుండటం వల్ల భారం అధికం అవుతోంది. దీంతో చాలా మంది వాహనదారులు బీమా పాలసీని రెన్యువల్ చేయించుకోకుండా వదిలిపెట్డడం, రిస్క్‌ను పూర్తిగా కవర్ చేయని పాలసీలను కొనుగోలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘‘దీర్ఘకాలిక పాలసీల కారణంగా బీమా ఉత్పత్తుల విస్తరణ పెరుగుతుంది. మరిన్ని వాహనాలు కవరేజీ పరిధిలోకి వస్తాయి’’ అని ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అండర్‌రైటింగ్ హెడ్ సంజయ్ దత్తా వివరించారు. బీమా పరిధిలో ఉన్నవి, పరిధిలో లేనివి అన్న ప్రశ్నకు తావుండదని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీ పెద్ద మొత్తంలో, మెరుగ్గా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం 2015లో ప్రతిరోజూ 1,374 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 400 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితులు క్లెయిమ్ దాఖలకు సమయ పరిమితి కూడా లేదు. ప్రమాదం జరిగిన ప్రాంత పరిధిలో లేదా తన నివాస ప్రాంత పరిధిలోనూ క్లెయిమ్ దాఖలకు అవకాశం ఉంటుంది. టూవీలర్ల డిమాండ్‌కు దెబ్బ! నూతన నిబంధనలు ద్విచక్ర వాహన కొనుగోళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపిస్తుందంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ఇప్పటి వరకు బీమా కోసం వెచ్చించిన మొత్తానికి ఇకపై నాలుగు రెట్లు అదనంగా (ఐదేళ్ల పాలసీ) ప్రీమియంను భరించాల్సి రావడమే ఇందుకు కారణం. కానీ, కార్లపై పెద్దగా ప్రభావం ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100సీసీ ఇంజిన్ల విభాగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. ఎందుకంటే తక్కువ ధర కారణంగానే వీటిని ఎక్కువ మంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈ విభాగంలోని బైక్‌లపై రూ.720గా ఉన్న ప్రీమియం కాస్తా ఇకపై రూ.3,285 అవుతోంది. అంటే మూడున్నరరెట్లు పెరిగినట్టు. ప్రతీ5 మోటారుసైకిళ్ల అమ్మకాల్లో మూడు 100సీసీ విభాగంలోనివే. ఇక 150సీసీ ఆపైన 350సీసీ సామర్థ్యంలోపు బైకులకు నాలుగున్నర రెట్లు పెరిగి రూ.5,453 కానుంది. ఇక ఈ పెరిగే మొత్తంపై జీఎస్టీ భారం అదనం. రెండు రకాల పాలసీలు సుప్రీం ఆదేశాలతో కొత్త కార్లకు మూడేళ్లు, ్జకొత్త ద్విచక్ర వాహనాలకు ఐదేళ్ల థర్డ్ పార్టీ బీమా ప్రీమియంను కొనుగోలు సమయంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయాలని బీమా కంపెనీల ను బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. దీంతో బీమా సంస్థలు ఓన్ డ్యామేజ్, థర్డ్ పార్టీ కవరేజ్‌ను దీర్ఘకాలానికి లేదా ఏడాది కాలానికి ఓన్ డ్యామేజీ కవర్, దీర్ఘకాలానికి థర్డ్ పార్టీ బీమాతోనూ పాలసీలను ఆఫర్ చేసే అవకాశం ఉంది. థర్డ్ పార్టీ బీమానే దీర్ఘకాలానికి తీసుకోవడం తప్పనిసరి. చోరీ, ఇతర నష్టాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీని ఏడాది లేదా ఐదేళ్ల కోసం ఎంచుకునే స్వేచ్ఛ వాహనదారులకు ఉంటుంది. బిల్లులో మాత్రం ఒక్కో ఏడాదికి విడిగా కవరేజీని పేర్కొనడం జరుగుతుంది. రెండో ఏడాది, ఆ తర్వాత కాలానికి ప్రీమియంను ‘ముందస్తు ప్రీమియం’గా పేర్కొటాయి. పాలసీ కాల వ్యవధి మధ్యలో సాధారణంగా థర్డ్ పార్టీ కవర్‌ను రద్దు చేసుకునేందుకు అవకాశం ఉండదు. వాహనం ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకపోవడం, అమ్మేయడం, బదిలీ వంటి సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది. -
టాటా మోటార్స్ వాహన ధరల పెంపు
న్యూఢిల్లీ: టాటా మోటార్స్ తన వాహనాల తాలూకు అన్ని మోడళ్ల ధరలనూ వచ్చేనెల నుంచి పెంచుతోంది. ఈ పెంపు 2 నుంచి 2.2 శాతం మధ్య ఉంటుందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పారీఖ్ వెల్లడించారు. వ్యయ నియంత్రణపై కసరత్తు చేస్తున్నప్పటికీ ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు. రూ.2.36 లక్షల నానో నుంచి రూ.17.89 లక్షల ఎస్యూవీ హెక్సా వరకు వివిధ సెగ్మెంట్లలో టాటా మోటార్స్ కార్లను విక్రయిస్తోంది. గడిచిన 28 నెలలుగా తాము ఇండస్ట్రీని మించి వృద్ధి సాధించామని చెప్పారు. -
గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనం పెంపు
సాక్షి, న్యూఢిల్లీ: తపాలా శాఖ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గ్రామీణ డాక్ సేవక్‌ల వేతనాలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ సమావేశం అనంతరం ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖామంత్రి మనోజ్ సిన్హా మీడియాకు తెలిపారు. గ్రామీణ డాక్ సేవక్‌ల బేసిక్ సాలరీ గరిష్టంగా 14,500 రూపాయలుగా నిర్ణయించినట్టు చెప్పారు. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 2.6లక్షలమంది గ్రామీణ డాక్ సేవక్‌లు లబ్ది పొందనున్నారు. గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లకు సంబంధించి ఇప్పటివరకూ 2,295 రూపాయల వేతనం పొందుతున్న వారు ఇకపై నెలకు 10వేల రూపాయల చొప్పున, రూ. 2,775 పొందుతున్నవారు ఇకపై 12,500 రూపాయలు, రూ.4,115 పొందుతున్న జీడీఎస్‌లకు ఇకపై నెలకు 14,500 రూపాయల బేసిక్ పే చెల్లించనున్నామని మనోజ్ సిన్హా తెలిపారు. దీనికి అదనంగా రిస్క్ అండ్ హార్డ్‌షిప్ అలవెన్సులను తొలిసారి అందించనున్నట్టు చెప్పారు. ఈ సవరించిన వేతనాలు జనవరి1, 2016 నుంచి వర్తిస్తాయని, వీటిని బకాయిలతో సహా చెల్లిస్తామన్నారు. అలాగే మూడు షిప్ట్‌ల్లో కాకుండా ఇకపై వీరు రెండు షిప్ట్‌ల్లో మాత్రమే పనిచేయనున్నారని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతేకాదు జీడీఎస్‌లపై ఆధారపడిన వారికుద్దేశించిన పరిహార నియామకాలను కూడా కేబినెట్ ఆమోదించిందన్నారు. ఇప్పటివరకూ ఈ సదుపాయం ఈ ఉద్యోగులకు అందుబాటులో లేదని పేర్కొన్నారు. -
గృహ రుణాలు మరింత భారం
-
ఎస్బీఐ కస్టమర్లకు తీపికబురు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మదుపరులకు తీపి కబురు అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచింది. కోటి రూపాయల లోపు ఎంపిక చేసిన డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీరేటు పెంచింది. ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలలోపు మెచ్యూరిటీ డిపాజిట్లపై వర్తించే వడ్డీరేటును 6.65 శాతంగా నిర్ణయించింది. ఇప్పటి దాకా ఇది 6.4శాతంగా ఉంది. సీనియర్ పౌరుల డిపాజిట్లపై 7.15 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఇంతకుముందు ఇది 7.10 శాతంగా ఉంది. ఈ సవరించిన రేట్లు మే 28 నుండి అమలులోకి వచ్చినట్టు బ్యాంకు వెబ్సైట్లో పేర్కొంది. అయితే ఇతర మెచ్యూరిటీలకు వర్తించే వడ్డీరేటును యథాతథంగా ఉంచింది. ఉదాహరణకు 45 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం, 46 -179 రోజులకు గాను 6.25 శాతం, 80-210 రోజుల డిపాజిట్లపై 6.35 శాతం వరకు వడ్డీని అందిస్తుంది. 211 రోజుల నుండి ఒక సంవత్సరం లోపు వాటిపై 6.40 శాతంగానూ, మూడు సంవత్సరాల నుండి ఐదేళ్ల కాలానికి 6.70 శాతం, ఐదునుంచి పది సంవత్సరాల వరకు డిపాజిట్లపై 6.75 శాతం వడ్డీరేటును వర్తింప చేస్తుంది. -
మీసేవలపై బాదుడు
పెదవాల్తేరు(విశాఖతూర్పు):సులభంగా.. వేగంగా.. అంటూ మొదలై.. మీ సౌలభ్యానికి.. సౌకర్యానికి అంటూ సాగుతున్న మీసేవలకు ఇక బాదుడు మొదలైంది. మీసేవల రుసుంలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శనివారం నుంచి అమలులోకి వచ్చిం ది. పలు రకాల సర్వీసులు మీసేవ కేంద్రాల ద్వారానే అందుతుంటాయి. దీంతో ప్రజలు ఆయా అవసరాల కోసం మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తు తం వసూలు చేస్తున్న రుసులపై రూ.10 అదనపు భారం మోపడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోం ది. ఇప్పటికే పలు ప్రైవేట్ మీసేవ నిర్వాహకులు అదనంగా చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నా థుడే కరువయ్యాడు. ఈ నేపథ్యలో ప్రభుత్వం రూ. 10 అదనంగా పెంచడంతో నిర్వాహకులు ఇంకెంత వసూలు చేస్తారోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రారంభం ఇలా.. విశాఖ జిల్లాలో 2004 మార్చిలో ఈసేవ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వీటినే మీసేవ కేంద్రాలుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 22 మీసేవ కేంద్రాలను రామ్ఇన్ఫో సంస్థ నిర్వహించడం తెలిసిందే. ఈ సంస్థ ఫ్రాంఛైజీలు 200కి పైగా ఉన్నాయి. ఇక ఏపీ ఆన్లైన్ సంస్థకి ఫ్రాంఛైజీలు మరో 200 వరకు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 300 వరకు సర్వీసులు అందుతుండగా.. రెగ్యులర్‌గా ఉపయోగించుకునే సర్వీసులు 50 వరకు ఉన్నాయి. ప్రభుత్వ, రామ్ఇన్ఫో కేంద్రాలలో రోజుకు దాదాపుగా రూ.50లక్షల వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక ఏపీ ఆన్లైన్ కేంద్రాల ద్వారా రూ.40లక్షల వరకు లావాదేవీలు సాగుతున్నట్టు సమాచారం. ఏ, బీ క్యాటగిరీ సేవలపై భారం మీసేవ కేంద్రాల ద్వారా అందుతున్న ఏ, బీ క్యాటగిరీ సేవలపై సర్వీసు చార్జీలను పెంచారు. ఏ క్యాటగిరీలోని అడంగళ్, వన్‌బీ, పట్టాదారు పాసుపుస్తకం వంటి సేవలు పొందడానికి ఇప్పటివరకు రూ.25 చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక నుంచి ఈ చార్జీ రూ.35కి పెరిగింది. బీ క్యాటగిరీలోని కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు, కుటుంబ వారసత్వ ధ్రువపత్రం వంటి సేవలు పొందడానికి ఇప్పటి వరకు సర్వీసు చార్జీల కింద రూ.35 చొప్పున వసూలు చేస్తుండగా.. శనివారం నుంచి ఇది రూ.45కి పెరిగింది. మొత్తమ్మీద ఈ రెండు క్యాటగిరీల సేవలపైనా రూ.10 అదనపు భారం పడినట్టయింది. ఈ రెండు విభాగాలలోను మీసేవ కేంద్రాలలో నెలకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. అంటే జిల్లా ప్రజలపై నెలకు రూ.లక్ష వంతున అదనపు భారం మోపినట్టయింది. ప్రభుత్వ మీసేవ కేంద్రాలలో ధ్రువపత్రాల కోసం రూ.35 వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ మీసేవ కేంద్రాలలో స్కానింగ్ చార్జీలంటూ రూ.15 అదనంగా వసూలు చేస్తున్నారు. గతంలో ఇదే విషయమై çఫిర్యాదు అందడంతో సీతంపేటలోని ఒక కేంద్రాన్ని అప్పటి తహసీల్దార్ సీజ్ చేయడం తెలిసిందే. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మీసేవ నిర్వాహకుల వినతి మేరకే చార్జీలు పెంచామని ప్రభుత్వం చెబుతోంది. అదనపు భారం తగదు మీసేవ కేంద్రాలలో అందిస్తున్న సర్వీసులపై అదనపు భారం మోపం అన్యాయం. పదో తరగతి పరీక్షల తరువాత విద్యార్థులంతా ధ్రువపత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ తరుణంలో సర్వీసు చార్జీలు పెంచడం తగదు. – సీహెచ్.రాజ్యలక్ష్మి, గృహిణి, పెదజాలరిపేట ఇప్పటికే ఇష్టానుసారం వసూలు మీసేవ సర్వీసులపై రూ.10 వంతున అదనపు భారం మోపడం విచారకరం. ఇప్పటికే పలు కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే చార్జీలు పెంచడం ప్రజలపై అదనపు భారం మోపినట్టయింది. – సత్తిబాబు, ప్రైవేట్ ఉద్యోగి, కొత్తవెంకోజీపాలెం -
కమోడిటీ ఎక్సేంజ్ లేవాదేవీ చార్జీల పెంపు
సాక్షి, ముంబై: కాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కమోడిటీ ఎక్సేంజ్ చార్జీలను పెంచేసింది. ఈ మేరకు బుధవారం సెబీ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ వెలువడిన 30రోజులకు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీని ప్రకారం టర్నోవర్ స్లాబ్‌లో అత్యధిక లావాదేవీ ఛార్జీల మధ్య నిష్పత్తి 2: 1 ని మించికూడదు. వివిధ ఎక్స్ఛేంజీలతో సంప్రదించి న అనంతరం సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక కాంట్రాక్ట్ లోని 'టర్నోవర్ స్లాబ్' హయ్యస్ట్ నుండి లోయస్ట్ చార్జీల రేషియో 2:1 మించకుండా కమోడిటీ ఎక్చేంజ్‌లు చూస్తాయని తెలిపింది. 2016 సెప్టెంబర్‌లో కమోడిటీ డెరివేటివ్ ఎక్స్చేంజ్ లకు సెబీ నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ నిష్పత్తి 1.5.1గా ఉంది. ఫార్వర్డ్ మార్కెట్స్ కమీషన్ తో విలీనం తరువాత. 2015నుంచి కమోడిటీ ఎక్సేంజ్‌లపై నియంత్రణ ప్రారంభించిన సెబీ 2016 సెప్టెంబరులో సరుకు డెరివేటివ్స్ లావాదేవీల చార్జీల వసూలుపై నిబంధనలను విధించింది. -
పెట్రోల్ బంకులు భారీగా పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. గత ఆరేళ్లలో (2011–2017) వీటి సంఖ్యలో 45 శాతంమేర వృద్ధి నమోదయ్యింది. దీన్ని ప్రపంచంలోనే గరిష్ట వృద్ధిగా భావించొచ్చు. భారత్‌లో అక్టోబర్ చివరి నాటికి పెట్రోల్ బంకుల సంఖ్య 60,799గా ఉంది. 2011లో వీటి సంఖ్య 41,947. 2011–2017 మధ్యకాలంలో పెట్రోల్ బంకుల సంఖ్య 18,852 మేర పెరిగింది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే పెట్రోల్ బంకులు ఎక్కువ. చమురు శాఖ గణాంకాల ప్రకారం.. రిలయన్స్, ఎస్సార్ ఆయిల్ వంటి ప్రైవేట్ సం స్థలకు 5,474(9%) పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిల్లో ఎస్సార్‌కు అధిక వాటా ఉంది. ఈ సంస్థకు 3,980 బంకులున్నాయి. ఇక ప్రభుత్వ రంగ చమురు రిటైలర్ల పెట్రోల్ బంకుల సంఖ్య 55,325. ఐఓసీకి అత్యధికంగా 26,489 పెట్రోల్ బంకులున్నాయి. అమెరికా, చైనాలలో లక్ష చొప్పున పెట్రోల్ బంకులు ఉండటం గమనార్హం. -
మోత మోగనున్న కార్ల ధరలు
న్యూఢిల్లీ: అంచనాలకనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లగ్జరీకార్లు, ఎస్‌యూవీలపై పన్ను భారాన్ని విధించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేవంలో నిర్ణయం జరిగింది. కొత్త జీఎస్టీ చట్టం కింద 15 శాతం నుంచి 25 శాతం వరకు మధ్యతరహా, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎక్సైజ్ డ్యూటీ, సేవా పన్ను, వ్యాట్ లాంటి స్థానంలో జులై 1 నుంచి కొత్త జీఎస్టీ అమల్లోకి రావడంతో చాలా వివిధ కార్ల ఉత్పత్తి సంస్థలు తమ ఎస్యూవీ, తదితర లగ్జరీ కార్ల ధరలను రూ 1.1 లక్షలు, రూ .3 లక్షల మధ్య తగ్గింది. తాజా నిర్ణయంతో ఈ ఇది రివర్స్ కానుంది. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. మరోవైపు ఈ సెస్ పెంపు నేపథ్యంలో మారుతీ, టాటా మోటార్స్ షేర్లు 1 శాతం చొప్పున ఎగిశాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. సెస్ పెంపు కారణంగా ఈ మేరకు పలు పెద్ద(విలాసవంత) కార్ల ధరలు పెరగనున్నట్లు ఆటో రంగ నిపుణులు తెలియజేశారు. అయితే సెప్టెంబర్ 9న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత దీనిపై నోటిఫికేషన్ వెలువడనుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం, అనంతరం పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది. -
విజయ పాల ధర పెరిగింది
జూలై 1 నుంచి అమలు ఈ సంవత్సరంలోనే రూ.4 పెంపు లాలాపేట: తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ది సమాఖ్య సరఫరా చేస్తున్న విజయ పాలను టోండ్ మిల్క్‌పై లీటరుకు రూ 1 , హోల్ మిల్క్‌పై రూ 3 పెంచుతున్నట్లు విజయ డెయిరి అధికారులు గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిజేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న లీటరు టోండ్ మిల్క్ రూ 41కి అందిస్తున్న పాలు జూలై 1వ తేదీ నుంచి రూ 42 కి విక్రయించనున్నారు. ధర పెంపుకు వినియోగదారులు సహకరించాలనీ అధికారులు కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి రోజు సుమారు 3.5 లక్షల లీటర్లు, జిల్లాల్లో సుమారు 50 వేల లీటర్ల పాలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెరిగిన పాల దరలు ఇలా.... టైప్ ఆఫ్ మిల్క్ ఫ్యాకేజ్ సైజ్ ప్రస్తుత ధర పెరిగిన ధర 1.హోల్ మిల్క్ 500 ఎం.ల్ రూ. 26.50 రూ .28.00 2.స్టాండడ్జైడ్ మిల్క్ 500 ఎం.ల్ రూ .22.50 రూ .23.00 3.టోండ్ మిల్క్ 1000 ఎం.ల్ రూ. 41.00 రూ. 42.00 4.టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .20.50 రూ. 21.00 5.టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ. 8.50 రూ .8.50 6.ఫ్యామిలీ మిల్క్ 500 ఎం ల్ రూ .19.50 రూ .20.00 7.డబుల్ టోండ్ మిల్క్ 500 ఎం ల్ రూ .18.50 రూ .19.00 8.డబుల్ టోండ్ మిల్క్ 300 ఎం ల్ రూ. 11.00 రూ .11.00 9.డబుల్ టోండ్ మిల్క్ 200 ఎం ల్ రూ .8.00 రూ .8.00 10.డైట్ మిల్క్ 500 ఎం.ల్ రూ .17.50 రూ .18.00 11.కౌ మిల్క్ 500 ఎం ల్ రూ .20. 50 రూ .21.10 ఈ సంవత్సరం లోనే రూ .4 భారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డెయిరి సరఫరా చేస్తున్న పాలను లీటరుపై జనవరి 5 తేదీన రూ 2 ను పెంచింది. ఏప్రిల్ 1 న రూ 1, తాజాగా మరో రూ 1 పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి జూలై వ్యవధిలోనే మూడు పర్యాయాలు రూ 4 విజయ పాల ధరను పెంచి ప్రజలపై భారం మోపుతుంది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తన ఫెడ్ ఫండ్ రేటును యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ రేటు 0.75 - 0.1 శాతం శ్రేణిలో ఉంది. జానెట్ యెలెన్ నేతృత్వంలోని ఫెడ్, ప్రస్తుతానికి రేటు పెంపు నిర్ణయాన్ని పక్కనబెట్టాలని బుధవారం నిర్ణయం తీసుకుంది. అయితే క్రమేపీ రేట్లు పెంచే ప్రక్రియను కొనసాగిస్తామని తాజాగా ఫెడ్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశంలో ఉపాధి కల్పన పటిష్టంగా వుందని, ఆర్థికాభివృద్ధి ఓ మోస్తరుగా వుండవచ్చని ఫెడ్ పేర్కొంది. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి మందగమనం తాత్కాలికమేనని కూడా ఫెడ్ తెలిపింది. ఈ నేపథ్యంలో జూన్‌లో రేట్ల పెంపు నిర్ణయం ఉండవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. తాజా విధాన సమావేశం తర్వాత ఫెడ్ బుధవారం విడుదల చేసిన ఫెడ్ జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ గణనీయంగా మందగించింది కానీ నిశ్చలంగాఉండనున్నట్టు భావించింది. డిసెంబరు, మార్చ్ నెలల్లో స్వల్పకాలిక రేటును స్వల్పంగా పెంచిన అనంతరం యథాతథవైఖరి అనుసరిస్తోంది. అయితే తదుపరి జూన్ రివ్యూలో మళ్లీ స్వల్పంగా వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మహా మాంద్యం ముగిసిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, నిరుద్యోగ రేటు తక్కువగా 4.5 శాతంగా ఉంది. అయితే ఇప్పటికీ వినియోగ వ్యయం, ఫ్యాక్టరీ ఉత్పత్తి మందగించడంతోపాటు ద్రవ్యోల్బణం ఫెడ్ టార్గెట్ రేటు కంటే తక్కువగానే ఉంది. కాగా రెండు రోజుల పాటు కొనసాగిన సమావేశాలు బుధవారం ముగిశాయి. అమెరికా, ప్రపంచ ఆర్థిక అంశాలు, పరిణామాలను చర్చించిన మార్చి నెల సమావేశంలో ఫెడ్ ఫండ్ రేటు పావుశాతం పెరిగిన సంగతి తెలిసిందే. -
తొలి రోజే పెట్రో పిడుగు
• పెట్రోల్ లీటర్‌పై రూ.1.29, డీజిల్ లీటర్‌పై 97 పైసలు వడ్డన • లబోదిబోమంటున్న వాహనదారులు ఖమ్మం సహకారనగర్ : కొత్త ఏడాది తొలి రోజు జనంపై పెట్రో పిడుగు పడింది. గత నెల 16వ తేదీనే పెట్రోల్ ధర రూ. 2.21, డీజిల్ ధర రూ.1.79 పెంచారు. తాజాగా ఆదివారం మళ్లీ పెట్రో ధరలు పెంచడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం పెట్రోల్ లీటర్‌పై రూ. 1.29పైసలు, డీజిల్ లీటర్‌పై రూ. 97పైసలు వడ్డించింది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 140పెట్రోల్ బంక్‌లున్నాయి. వీటి ద్వారా పెట్రోల్ రోజుకు సుమారు 6 లక్షల లీటర్లు, డీజిల్ లక్షా 20వేల లీటర్ల వినియోగం జరుగుతోంది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 73.69పైసలు ఉండగా పెరిగిన ధరలతో లీటర్ పెట్రోల్ 74.98పైసలకు చేరుకుంది. స్థానిక పన్నులతో మరో 30పైసలు పెరిగే అవకాశంఉంది. డీజిల్ లీటర్ 61.92 పైసలు ఉండగా, 62.89పైసలకు చేరుకుంది. స్థానిక పన్నులతో అదనంగా మరో 15పైసలు పెరగనుంది. నెలకు రెండు జిల్లాల ప్రజలపై సుమారు రూ. 3 కోట్ల వరకు భారం పడనుంది. పెరిగిన ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలు కానున్నాయి. ఇటీవల కాలంలో పెరిగిన పెట్రో ధరలతోనే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా పెరిగిన ధరలతో వాహనదారులపై మరింత భారం పడనుంది. వరుసగా ఇటీవల కాలంలోనే రెండు సార్లు పెట్రో ధరలు పెరగటంతో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. -
బొగ్గు రవాణా చార్జీల మోత!
ముంబై: రైల్వే ఆదాయాలను పెంచుకునే లక్ష్యంతో బొగ్గు రవాణా చార్జీలను రైల్వే బోర్డ్ సవరించింది. ఇంధన ద్రవ్యోల్బణం పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయ రేల్వే బొగ్గు రవాణా చార్జీలను పెంచింది. 19శాతం చార్జీలను పెంచుతున్నట్టు మంగళవారం వెల్లడించింది. కేవలం బొగ్గు రవాణా పై మాత్రమే 19 శాతం వరకు చార్జీలను పెంచుతున్నట్టు రైల్వే బోర్డ్ సభ్యులు వివరణ ఇచ్చారు. 100 కి.మీ పరిధిలోపు ఎలాంటి పెంపులేదని., 200-700 మధ్య 8-14 శాతం, 700 కి.మీ పైన మరింత పెంపు ఉండనుందని స్పష్టం చేసింది. దీని ప్రభావం సిమెంట్ , పవర్ కంపెనీలపై పడనుందని ఎనలిస్టులు అభిప్రాయపడ్డారు. మరోవైపు మార్కెట్లో స్టీల్, సిమెంట్ రంగాలు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా సిమెంట్ దిగ్గజం,అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఏసీసీ, స్టీల్ రంగంలో జెఎస్డబ్ల్యు స్టీల్ లిమిటెడ్ నష్టపోయాయి. -
’పెంచిన ధరలు వెంటనే ఉపసంహరించాలి’
-
స్లాబులతో మాయాజాలం చేస్తున్న సర్కారు
-
మళ్లీ ఉల్లి ధర భగ్గు
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్:ఉల్లిగడ్డ ధర మళ్లీ భగ్గుమంది. గత రెండు మూడు నెలలుగా ఉల్లి ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. మొదట రూ. 60 నుంచి 100 రూపాయలవరకు ధర ఉండగా...గత నెలలో మాత్రం కిలో రూ. 40 నుంచి 45 రూపాయలకు విక్రయించారు. ఈ ధర చాలా రోజులు స్థిరంగా ఉంది. అయితే శని, ఆదివారాల్లో ఉల్లి రేటు మళ్లీ రూ.60కి చేరింది. ధరలు తగ్గుతాయని ఆశతో ఉన్న తరుణంలో మళ్లీ పెరగడం సామాన్య ప్రజల ను బెంబేలెత్తిస్తోంది. ధరలకు భయపడి సామాన్య ప్రజలు కొంత కాలంగా ఉల్లిగడ్డ కొనడమే మానేశారు. హైదరాబాద్ మార్కెట్లోనే ఉల్లిగడ్డ ధరలు పెరగడం వల్ల ఇక్కడ కూడా ధరలు పెంచి విక్రయించాల్సి వస్తోం దని ఇక్కడి వ్యాపారులు వాపోతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిగడ్డ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు.