
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) రూ.2 కోట్ల వరకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను 0.20 శాతం వరకు పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 13 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడాది టర్మ్ డిపాజిట్‌పై రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. 400 రోజులు దాటి, మూడేళ్ల వరకు కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై రేటు 5.45 శాతం నుంచి 5.50 శాతానికి చేరింది. మూడేళ్లు దాటి, పదేళ్ల వరకు డిపాజిట్లపై రేటు 0.15 శాతం పెరిగి 5.65 శాతానికి చేరుకుంది.
ఏడాది కాల డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం రేటు లభిస్తుంది. ఇతర కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపైనా వృద్ధులకు కొంచెం అదనపు వడ్డీని బీవోబీ ఆఫర్ చేస్తోంది. ‘బరోడా ట్యాక్స్ సేవింగ్స్ టర్మ్ డిపాజిట్’ 5–10 ఏళ్ల కాల వ్యవధికి 5.65 శాతం రేటు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 0.15 శాతం అదనపు రేటును బ్యాంక్ అందిస్తోంది.