Bank of Baroda
-
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త స్కీమ్..
బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంపిక చేసిన డిపాజిట్లపై ఎఫ్డీ వడ్డీ రేట్లను ఇటీవల అప్డేట్ చేసింది. దీంతోపాటు బీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ అనే కొత్త డిపాజిట్ ఎంపికను ప్రవేశపెట్టింది. ఇది డిపాజిట్‌దారులకు అధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. ఈ కొత్త రేట్లు అక్టోబర్ 14 నుండి అమలులోకి వచ్చాయి.కొత్త స్కీమ్ వడ్డీ రేట్లుబీఓబీ ఉత్సవ్ డిపాజిట్స్ స్కీమ్ సాధారణ పౌరులకు 7.30 శాతం వడ్డీని అందిస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు 7.80 శాతం వడ్డీ అందుకోవచ్చు. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు అయితే గరిష్టంగా 7.90 శాతం వడ్డీ లభిస్తుంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై భారీగా రిటైర్మెంట్ సొమ్ముబ్యాంక్ ఆఫ్ బరోడా ఎఫ్డీ వడ్డీ రేట్ల మార్పు తర్వాత రూ. 3 కోట్ల లోపు 7 రోజుల నుండి 10 సంవత్సరాల వరకు వ్యవధి గల డిపాజిట్లపై సాధారణ పౌరులకు 4.25% నుండి 7.30% (ప్రత్యేక డిపాజిట్‌తో సహా) వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 4.75% నుండి 7.80% మధ్య వడ్డీ రేటును అందిస్తుంది. -
వడ్డీ రేట్లను పెంచిన ప్రభుత్వ బ్యాంకులు ఇవే..
భారతదేశంలోని మూడు ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు.. మార్జినల్ కాస్ట్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను పెంచుతున్నట్లు ప్రకటించాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బెంచ్ మార్క్ వడ్డీ రేటును 6.5 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించిన తర్వాత ఇది జరిగింది.వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకుల జాబితాలో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూసీఓ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా & కెనరా బ్యాంక్‌లకు సవరించిన రేట్లు ఆగస్టు 12 నుంచి అమలులోకి వస్తాయి. కాగా యూసీఓ బ్యాంక్ వడ్డీ రేట్లు ఆగష్టు 10 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలుస్తోంది.ఎంసీఎల్ఆర్ అంటే?మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) అనేది లోన్ ఇవ్వడానికి నిర్దారించిన ఓ ప్రామాణిక రేటు. దీనిని ప్రాసెసింగ్ ఫీజు, సీఆర్ఆర్, కాలపరిమితి వంటి వాటిని పరిగణలోకి తీసుకుని లెక్కిస్తారు. బ్యాంకులు ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ రేటుకు లోన్లు ఇవ్వడానికి అనుమతి ఉండదు. ఈ వడ్డీ రేటు అనేది వివిధ కాలపరిమితులకు లోనై ఉంటుంది. -
టెకీలకు బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్‌న్యూస్
ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యమిస్తోంది. టెక్ సిబ్బందిని ప్రస్తుతమున్న 1,500 మంది నుంచి రెండేళ్లలో రెట్టింపునకు (3,000 మంది) పెంచుకోనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో దేవదత్త చాంద్ తెలిపారు.రెగ్యులర్ నియామకాలతో పాటు, ఇతర సంస్థల్లో ఇదే తరహా బాధ్యతల్లో ఉన్న ప్రత్యేక నిపుణులను నియమించుకోనున్నట్టు (లేటరల్ హైరింగ్) మార్చి త్రైమాసికం ఫలితాల సందర్భంగా ప్రకటించారు. టెక్నాలజీ పరంగా కొన్ని లోపాలు వెల్లడి కావడంతో ఇటీవల బీవోబీపై ఆర్బీఐ ఆంక్షలు ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. తర్వాత వీటిని ఎత్తివేసింది.1,500 మంది ప్రస్తుత టెక్నాలజీ బృందంలో రెగ్యులర్ ఉద్యోగులతోపాటు, కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నట్టు చాంద్ చెప్పారు. జెనరేటివ్ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ త్వరలోనే కస్టమర్లకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. టెక్నాలజీపై బ్యాంక్ పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. టెక్నాలజీ మౌలిక సదుపాయాల కోసమే రూ.2,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు.రానున్న కాలంలోనూ దీనిపై ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడతామన్నారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) 600 కొత్త శాఖలను ప్రారంభిస్తామని చెప్పారు. 12–14 శాతం మేర రుణాల్లో వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని, అదే సమయంలో డిపాజిట్లలో 10–12 శాతం వృద్ధిని కాంక్షిస్తున్నట్టు తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 3.15 శాతంగా ఉంటుందన్నారు. -
బీవోబీ-మైక్రోసాఫ్ట్ జెన్ఏఐ హ్యాకథాన్.. రూ.లక్షల్లో ప్రైజ్‌మనీ
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా మైక్రోసాఫ్ట్ సహకారంతో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ఏఐ)పై దేశవ్యాప్త ఆన్లైన్ హ్యాకథాన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.బ్యాంక్ నిర్వచించిన నిర్దిష్ట అంశాల్లో జెన్ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సృజనాత్మక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి పాల్గొనేవారిని ప్రేరేపించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యం. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతులు అందజేస్తామని, హ్యాకథాన్ నుంచి వెలువడే ఉత్తమ ఐడియాలను అమలు చేస్తామని బ్యాంక్ పేర్కొంది.డెవలపర్లు, విద్యార్థులు, ప్రొఫెషనల్స్, స్టార్టప్స్, ఫిన్‌టెక్‌లు వ్యక్తిగతంగా లేదా బృందంగా ఈ హ్యాకథాన్‌లో పాల్గొనవచ్చు. కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఆడిట్ & కాంప్లయన్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఆపరేషనల్ ఎఫిషియెన్సీ, పర్సనలైజ్డ్ కంటెంట్ జనరేషన్ అనే ఆరు విభాగాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా అద్భుతమైన పరిష్కారాలను కోరుతోంది.బ్యాంక్ ఆఫ్ బరోడా ఇన్నోవేషన్‌లో ముందంజలో ఉంటుందని, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి జెన్ఏఐ కొత్త మార్గాలను అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ ముదలియార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఉమ్మడి విజన్ ను పంచుకోవడానికి సంతోషిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఇండియా&దక్షిణాసియా ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు.కంటెస్టెంట్లు https://bobhackathon.com ద్వారా హ్యాకథాన్‌లో పాల్గొనేందుకు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒక్కో టీమ్‌లో గరిష్టంగా నలుగురు వ్యక్తులు ఉండొచ్చు. జూన్ 10 నుంచి 30వ తేదీలోపు ఐడియాలను సమర్పించవచ్చు. షార్ట్ లిస్ట్ చేసిన జట్లు ప్రోటోటైప్‌ను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. -
ఇక ఆ బ్యాంక్ యాప్ వాడుకోవచ్చు.. ఆర్బీఐ ఊరట
న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ ఆర్బీఐ ఊరట కలిగించింది. బీవోబీ వరల్డ్ మొబైల్ యాప్ ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకునేందుకు తాజాగా బీవోబీకు అనుమతినిచ్చింది.బీవోబీ వరల్డ్ యాప్ ద్వారా వినియోగదార్లను చేర్చుకోరాదంటూ 2023 అక్టోబర్ 10న ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వర్తించే మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా వినియోగదార్లను చేర్చుకుంటామని బీవోబీ తెలిపింది.'బీవోబీ వరల్డ్' యాప్ అనేది పెద్ద సంఖ్యలో కస్టమర్ల కోసం ఒక ప్రాథమిక ఛానెల్, వీడియో కేవైసీ ద్వారా ఖాతా తెరవడాన్ని సులభతరం చేస్తుంది. కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఓ మొబైల్ బ్యాంకింగ్ ఛానెల్‌ని ఆర్బీఐ నిషేధించడం ఇదే తొలిసారిగా నిలిచింది. ఈ నెల ప్రారంభంలో, కొత్త కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయకుండా కోటక్ బ్యాంక్‌ను కూడా ఆర్బీఐ నిషేధించింది. -
బీవోబీ లాభం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది. వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి. క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ అడ్వాన్స్‌లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఏఐఎఫ్)లో ఎక్స్పోజర్కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్ అయింది. -
స్వల్పకాల డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంపు.. ఎంతంటే..
స్వల్పకాలిక రిటైల్ డిపాజిట్లపై వడ్డీరేటును 7.1 నుంచి 7.6 శాతం వరకూ ఆఫర్ చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, ఇతరులకు 7.1 శాతం రేటు వర్తిస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. ‘బీఓబీ360’ పేరుతో ప్రారంభించిన ఈ తాజా బల్క్ డిపాజిట్ స్కీమ్ సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. బ్యాంక్ ప్రస్తుత లేదా కొత్త కస్టమర్లు ఈ బల్క్ డిపాజిట్ స్కీమ్‌ను ఏదైనా బ్రాంచ్‌లో, ఆన్లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారా తెరవవచ్చు. కాగా, రెండు వారాల క్రితమే బీఓబీ రూ.2 కోట్ల లోపు స్వల్పకాలిక స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు 1%) వరకూ పెంచింది. 7–14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25% పెరిగి 4.25 శాతానికి చేరింది. 15–45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50%కి చేరింది. 271 రోజుల బల్క్ డిపాజిట్లపై బ్యాంక్ 6.25 శాతం వడ్డీరేటును ఆఫర్ చేసింది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది. 1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్ దృష్టి సారించింది. బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్ పాయిట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 7 నుంచి 14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది. 15 నుంచి 45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది. -
చిరిగిన నోట్లలో తేడాలు.. ప్రభుత్వ బ్యాంక్‌కు భారీ ఫైన్!
ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda)కు భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) భారీ షాక్ ఇచ్చింది. చిరిగిన, పాడైన నోట్ల మార్పిడికి సంబంధించిన లావాదేవీల్లో వ్యత్యాసం గుర్తించడంతో ఈ బ్యాంక్‌కు రూ.5 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు శుక్రవారం నాటి ఎక్చేంజ్ ఫైలింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. చిరిగిన నోట్లలో నకిలీవి దీంతోపాటు చిరిగిన, పాడైన నోట్లలో నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ .. బ్యాంక్ ఆఫ్ బరోడాకు అదనంగా మరో రూ.2,750 ఫైన్ వేసింది. బీవోబీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. డిసెంబర్ 18, 20 తేదీల్లో వేర్వేరుగా ఈ జరిమానాలు ఆర్బీఐ విధించింది. క్లీన్ నోట్ పాలసీకి అనుగుణంగా సెంట్రల్ బ్యాంక్ ఈ పెనాల్టీలను విధించినట్లు తెలుస్తోంది. కాగా బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఆర్బీఐ గత నెలలో కూడా పెద్ద మొత్తంలో పెనాల్టీ వేసిన విషయం తెలిసిందే. నిబంధనలు పాటించకుండా భారీ మొత్తంలో రుణాలు జారీ చేసినందుకు గతంలో బీవోబీకి ఆర్బీఐ రూ.4.35 కోట్ల జరిమానా విధించింది. -
విద్యార్ధులకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపరాఫర్!
విద్యార్ధులకు ప్రభుత్వ రంగ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. బీఆర్ఓ పేరిట విద్యార్థుల కోసం కొత్త సేవింగ్స్ జీరో బ్యాంక్ అకౌంట్‌ని తీసుకొచ్చింది. ఈ ఖాతాను 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య వయసు కలిగిన విద్యార్థులు తెరవొచ్చు. ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. విద్యార్ధుల అర్హతను బట్టి జీవిత కాలం ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డును అందిస్తారు. త్రైమాసికానికి రెండు సార్లు కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ సదుపాయం ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా సేవింగ్ అకౌంట్‌పై ఇతర ప్రయోజనాలు 👉16 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయస్సు గల వారికి జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతా 👉ప్రముఖ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లతో జీవితకాల ఉచిత రూపే ప్లాటినం డెబిట్ కార్డ్ 👉 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ 👉యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రూ.2 లక్షలు 👉ఆటో స్వీప్ సౌకర్యం అందుబాటులో ఉంది 👉డిజిటల్ ఛానెల్‌లు, బ్రాంచ్ ద్వారా ఉచిత ఎన్ఎఫ్టీ,ఆర్టీజీఎస్,ఐఎంపీఎస్,యూపీఐ సర్వీసులు 👉అపరిమిత ఉచిత చెక్ లీవ్‌లు 👉ఉచిత ఎస్ఎంఎస్, మెయిల్స్ అలెర్ట్ 👉డీమ్యాట్ ఏఎంసీలో 100శాతం వరకు రాయితీ 👉సున్నా ప్రాసెసింగ్ రుసుముతో విద్యా రుణాలపై రాయితీ వడ్డీ రేట్లు 👉అర్హతకు లోబడి ప్రత్యేకమైన క్రెడిట్ కార్డ్ ఆఫర్లు -
విద్యార్థుల కోసం స్పెషల్ అకౌంట్ - ప్రయోజనాలు ఇవే..
హైదరాబాద్: విద్యార్థుల కోసం సున్నా బ్యాలన్స్ సదుపాయంతో ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రారంభించింది. 16–25 ఏళ్ల వయసులోని విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘బీవోబీ బ్రో సేవింగ్స్ ఖాతా’ను రూపొందించినట్టు తెలిపింది. జీవిత కాలం పాటు కాంప్లిమెంటరీ డెబిట్ కార్డ్, ఇతర ప్రయోజనాలను ఈ ఖాతాకు అనుసంధానంగా ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రయోజనాలు.. 16–25 ఏళ్ల వయసు వారికి ఈ ఖాతా సున్నా బ్యాలన్స్తో వస్తుంది. ఆకర్షణీయమైన ఆఫర్లతో కూడిన ఉచిత రపే ప్లాటినం డెబిట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు. ప్రతి త్రైవసికానికీ విమానాశ్రయాల్లో రెండు సార్లు లాంజ్ ప్రవేశాలను పొందొచ్చు. ర.2 లక్షల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితం. ఆటో స్వీప్ సదుపాయం కూడా ఉంది. నెఫ్ట్, ఆర్ట్జీఎస్, ఐఎంపీఎస్, యూపీఐ లావాదేవీలు ఉచితం. చెక్‌లను కూడా ఉచితంగా పొందొచ్చు. ఉచిత ఎస్ఎంఎస్, ఈమెయిల్ అలర్ట్‌ల సదుపాయం కూడా ఉంది. డీమ్యాట్ ఖాతా ఏఎంసీపై నూరు శాతం రాయితీ ఉంది. విద్యా రుణాలపై ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీ లేకపోగా, వడ్డీ రేటులో 0.15 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాతాను యువతకు చేరువ చేసేందుకు గాను ఐఐటీ బోంబేకి చెందిన మూడ్ ఇండిగోను ఎక్స్‌క్లూజివ్ బ్యాంకింగ్ పార్ట్నర్గా నియమించుకుంది. -
గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రణాళికలు!
ముంబై: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న దేశీ విమానయాన కంపెనీ గో ఫస్ట్ లిక్విడేషన్ ప్రక్రియ ఊపందుకోనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ లిక్విడేషన్ ప్రతిపాదనకు ఈ వారంలో రుణదాతలు అనుకూలంగా ఓటింగ్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖ పారిశ్రామివేత్త నస్లీ వాడియా ప్రమోట్ చేసిన కంపెనీ రుణ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడంలో పలుమార్లు విఫలమైంది. కంపెనీ రుణదాతలకు రూ. 6,521 కోట్లవరకూ చెల్లించవలసి ఉంది. రుణదాతలలో బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డాయిష్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో సెంట్రల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 1,987 కోట్లు బకాయిపడి ఉంది. ఈ బాటలో బీవోబీకి రూ. 1,430 కోట్లు, డాయిష్ బ్యాంక్‌కు రూ. 1,320 కోట్లు చొప్పున రుణాలు చెల్లించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. రుణదాతల కమిటీ(సీవోసీ) కంపెనీ ఆస్తుల విలువను రూ. 3,000 కోట్లుగా మదింపు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. దివాలా చట్టం(ఐబీసీ)లో భాగంగా 270 రోజులలోగా కేసులను పూర్తి చేయవలసి ఉంది. దీంతో త్వరలోనే కంపెనీ లిక్విడేషన్‌కు తెరలేవనున్నట్లు తెలుస్తోంది. అయితే కస్టమర్లు, ట్రావెల్ ఏజెంట్లు, బ్యాంకులు తదితర రుణదాతలకు నిధులను సర్దుబాటు చేయవలసి ఉంటుంది. రేసులో జిందాల్ గో ఫస్ట్ విమానాలను కొనుగోలు చేయకుండా సేల్, లీజ్‌బ్యాక్ పద్ధతిలో కార్యకలాపాల నిర్వహణ చేపట్టడంతో కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం కాకపోవచ్చని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. కంపెనీ కీలక ఆస్తులలో థానేలోని 94 ఎకరాల భూమిని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ భూమిని వాడియా బ్యాంకులకు కొలేటరల్‌గా ఉంచారు. ఈ భూమి విలువను రూ. 3,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనికితోడు ముంబైలోని ఎయిర్‌బస్ శిక్షణా కేంద్రం, ప్రధాన కార్యాలయాలను అదనపు ఆస్తులుగా పరిగణిస్తున్నాయి. గో ఫస్ట్ కొనుగోలుకి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ(ఈవోఐ).. జిందాల్ పవర్ మాత్రమే రుణదాతల కమిటీ పరిశీలనలో నిలిచినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకుకాకుండా విమాన సరఫరాదారులకు రూ. 2,000 కోట్లు, వెండార్లకు రూ. 1,000 కోట్లు, ట్రావెల్ ఏజెంట్లకు రూ. 600 కోట్లు, కస్టమర్లకు రూ. 500 కోట్లు చొప్పున బకాయి ఉన్నట్లు తెలియజేశాయి. కేంద్రం నుంచి ఎమర్జెన్సీ క్రెడిట్ పథకం కింద మరో రూ. 1,292 కోట్ల రుణం పొందినట్లు వెల్లడించాయి. వెరసి గో ఫస్ట్ మొత్తం రూ. 11,000 కోట్ల రుణ భారాన్ని మోస్తున్నట్లు చెబుతున్నాయి. 2023 మే 2న కార్యకలాపాలు నిలిపివేసిన కంపెనీ 8 రోజుల తదుపరి జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)కు స్వచ్చంద దివాలా పిటీషన్‌ను దాఖలు చేసింది. -
ప్రభుత్వ బ్యాంకులనూ వదలని ఆర్బీఐ - రూ.10.34 కోట్లు ఫైన్!
గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది. బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda) ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. సిటీ బ్యాంక్ (City Bank) ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు. -
ఏటీఎంకు నిప్పు.. తెరుచుకోలేదని తగలబెట్టేశాడు!
ఏటీఎంలో దొంగతనానికి వచ్చిన దుండగుడు.. అది తెరుచుకోకపోవడంతో నిప్పుపెట్టిన ఘటన ముంబై నగరంలోని బొరివాలీ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని సతార ప్రాంతానికి చెందిన విలాస్ శిలేవంత్ (22)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. ముంబై నగరంలోని బొరివాలీ వెస్ట్ ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా షింపోలీ బ్రాంచ్ ఉంది. దానికి ఆనుకునే ఏటీఎం సెంటర్ కూడా ఉంది. నవంబర్ 11న తెల్లవారు జామున 4.35 గంటల ప్రాంతంలో ఈ ఏటీఎం సెంటర్లోని ఏటీఎం మిషన్ మంటల్లో కాలిపోయిన దృశ్యాన్ని గమనించిన బ్యాంక్ సర్వేలెన్స్ సిబ్బంది బ్యాంక్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే అక్కడి చేరుకుని పరిశీలించగా ఏటీఎంను ఎవరో తెరవడానికి ప్రయత్నించారని తెలిసింది. దీంతో పోలీసులకు విషయం తెలియజేశారు. 25 నుంచి 30 ఏళ్లున్న యువకుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడినట్లుగా సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైంది. నిందితుడు ఏటీఎం మిషన్‌ను బద్దలుకొట్టడానికి ప్రయత్నించాడని, సాధ్యం కాకపోవడంతో నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. నిందితుడు ఏటీఎం ముందు భాగానికి నిప్పుంటించినప్పటికీ అందులోని క్యాష్ వ్యాలెట్‌ను మాత్రం తెరవలేకపోయాడని పేర్కొన్నారు. -
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
కొత్త కస్టమర్లను యాప్‌లో చేర్చుకోవద్దు.. ఆర్బీఐ షాక్!
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తమ ‘బీవోబీ వరల్డ్’ మొబైల్ యాప్‌లో కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా రిజర్వ్ బ్యాంక్ నిషేధం విధించింది. ఇది తక్షణమే అమల్లోకి వచ్చింది. యాప్‌లో కస్టమర్లను చేర్చుకునే ప్రక్రియకు సంబంధించి పర్యవేక్షణాపరమైన లోపాలను గుర్తించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వాటిని సరిచేసి, సంబంధిత ప్రక్రియను పటిష్టం చేసినట్లు ఆర్బీఐ సంతృప్తి చెందితే తప్ప కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉండదు. దీనివల్ల ప్రస్తుత బీవోబీ వరల్డ్ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలంటూ బ్యాంకుకు సూచించింది. ఆర్బీఐ సూచించిన అంశాలను ఇప్పటికే సరిదిద్దినట్లు, ఇతరత్రా ఏవైనా లోపాలుంటే వాటిని కూడా సరిచేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా తెలిపింది. ఆర్బీఐ ఆదేశాలను అమలు చేసే క్రమంలో కస్టమర్లకు సర్వీసులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని పేర్కొంది. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలెర్ట్, అమల్లోకి కొత్త వడ్డీ రేట్లు!
ఖాతాదారులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త చెప్పింది. రూ.2 కోట్ల వరకు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచింది. దీంతో ఎఫ్డీ చేసిన సాధారణ ఖాతాదారులు అత్యధికంగా 7.25 శాతం, సీనియర్ సిటిజన్లు 7.75 శాతం వడ్డీని పొందవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్డీ రేట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సవరించిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు రోజుల నుంచి 14 రోజుల టెన్యూర్ కాలానికి 3 శాతం, 15 రోజుల నుంచి 45 రోజుల కాలానికి 3.50శాతం పెంచింది. 4.5 శాతం ఉన్న వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచి 46 నుంచి 180 రోజుల టెన్యూర్‌కు 5శాతం వడ్డీని, 181 నుంచి 210 టెన్యూర్ కాలానికి 5.50 శాతం,211 నుంచి 270 కాలానికి 6 శాతం, 271 నుంచి ఏడాది లోపు వడ్డీ రేట్లను 6.25 శాతం అందిస్తుంది. అయితే, 399 రోజుల కాలవ్యవధి గల ‘బరోడా తిరంగా ప్లస్’డిపాజిట్ స్కీమ్‌పై వడ్డీ రేటును 7.25 శాతం నుంచి 7.15 శాతానికి తగ్గించింది. సవరించిన ఈ వడ్డీ రేట్లు 2023 అక్టోబర్ 9 (నేటి) నుంచి అమల్లోకి వచ్చాయి. -
క్రికెట్ ప్రపంచ కప్ 2023 ఆదాయంపై బీవోబీ సంచలన అంచనాలు
ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సమరం షురూ అయింది. అయితే ఈ మెగా టోర్నీకి ఆతిథ్య దేశంగా ఇండియా ఉండటంతో భారీ ఆదాయం సమకూరి, దేశ ఆర్థిక రంగానికి ఊతమిస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా భారతదేశ ఆర్థికవ్యవస్థకు 220 బిలియన్ రూపాయల (2.6 బిలియన్ల డాలర్లు) భారీ ఆదాయం సమకూరుతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ UK GDPకి మంచి బూస్ట్ అందించిందని ఈసారి భారత్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని నివేదిక పేర్కొంది. ఇప్పటికే అటు పండగ సీజన్, ఇటు వరల్డ్ కప్ ఫీవర్ కారణంగా యాడ్ రెవెన్యూ భారీగా పెరగనుందనే అంచనాల మధ్య బీవోబీ తాజా అంచనాలు మరింత ఆసక్తికరంగా మారాయి. గురువారం (అక్టోబరు 5) ప్రారంభమై నవంబర్ మధ్య వరకు జరిగే చతుర్వార్షిక టోర్నమెంట్ దేశీయంగా, అంతర్జాతీయంగా పెద్దమొత్తంలో సందర్శకులను, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తుంది. దీంతో పలు రకాలుగా ఆదాయ వృద్ధి నమోదుకానుందని అంచనావేశారు. 10 నగరాల్లో జరిగే మ్యాచ్‌లతో ప్రయాణ, ఆతిథ్య రంగాలకు ప్రయోజనం చేకూరుతుందని బీవోబీ ఆర్థికవేత్తలు జాహ్నవి ప్రభాకర్, అదితి గుప్తా అభిప్రాయపడ్డారు. చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్ సహా 10 నగరాల్లో నవంబర్ 19 వరకు జరిగే ప్రపంచకప్ సిరీస్‌ను చూసేందుకు వివిధ దేశాల నుంచి పర్యాటకుల సంఖ్య పెరగనుంది. ఇది ప్రీ-కోవిడ్ స్థాయిల కంటే 80 - 90 శాతం పెరుగుతుందని అంచనా. (2023 ఐసీసీ వరల్డ్ కప్: ప్రకటనల ఆదాయం ఎంతో తెలుసా?) భారత్‌కు క్రికెట్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు. అది ఒక వేడుక. ఇక భారత్‌లో జరిగే ప్రపంచకప్ సిరీస్ క్రికెట్ అభిమానులకు పండుగే. అందులోనూ 12 ఏళ్ల తరువాత (2011) తొలిసారి ఇండియాలో జరుగుతున్న ఈ ఈవెంట్ సెప్టెంబర్‌లో ప్రారంభమైన మూడు నెలల పండుగ సీజన్‌తో సమానంగా ఉంటుందని, చాలా మంది "సెంటిమెంటల్ క్రయవిక్రయాలు చేస్తారు కాబట్టి రిటైల్ రంగానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. టోర్నమెంట్ కోసం టెలివిజన్, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా మొత్తం భారతీయ వీక్షకుల సంఖ్య 2019లో చూసిన 552 మిలియన్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని కూడా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. టీవీ హక్కులు ,స్పాన్సర్షిప్ రాబడిలో రూ. 10,500 కోట్ల నుండి రూ. 12,000 కోట్ల వరకు రావచ్చని వీరు భావించారు. మరోవైపు ప్రపంచ కప్ ధరల పెరుగుద కారణంగా ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుందని ఆర్థిక వేత్తలు భావించారు. ఈ సమయంలో ఎయిర్‌లైన్ టిక్కెట్లు, హోటల్ అద్దెలు ఇప్పటికే పెరిగాయి. పండగసీజన్కు తోడు10 అతిధేయ నగరాల్లో అనధికారిక సెక్టార్లో సేవా ఛార్జీలు గణనీయమైన పెరుగుదల నమోదు కానుందన్నారు. ఫలితంగా అక్టోబర్ , నవంబర్‌లో ద్రవ్యోల్బణం 0.15 శాతం-0.25 శాతం మధ్య పెరగవచ్చని వారు చెప్పారు. -
బ్యాంకు లాకర్లో రూ.18 లక్షలు చెదల పాలు: లాకర్ కొత్త నిబంధనలు తెలుసా?
బ్యాంకు నిబంధనలు తెలుసుకోకుండా సురక్షితంగా ఉంటాయనుకుని బ్యాంక్ లాకర్లో పెట్టుకున్న సొమ్ము చెదల పాలు కావడం తీవ్ర విషాదాన్ని నింపింది. కష్టపడి సంపాదించిన సొమ్ము సర్వ నాశనం కావడంతో బాధిత మహిళ ఆవేదనకు అంతులేకుండా పోయింది. అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం దాదాపు ఒకటిన్నర సంవత్సరాల పాటు రూ. 18 లక్షల నగదు, కొన్ని ఆభరణాలను లాకర్లో దాచింది. అయితే ఆర్బీఐ నిబంధలన ప్రకారం KYC ధృవీకరణ , వార్షిక లాకర్ నిర్వహణ కోసం ఆమెను బ్యాంక్ అధికారులు పిలిచినప్పుడు ఈ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.బాధిత మహిళ ట్యూషన్లు చెబుతూ,చిన్న వ్యాపారం చేస్తూ, ఒక్కో రూపాయి పొదుపు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం లాకర్లో ఉంచిన రూ. 18 లక్షలను చెదపురుగులు తినేశాయి. ఈ విషయంపై స్పందించిన బ్యాంకు సిబ్బంది ఈ ఘటనను ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. ఈ నేపథ్యంలో ఆమెకు ఎలాంటి న్యాయం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. (Today Gold and Silver: బంగారం నేలచూపులు, షాకిస్తున్న వెండి) లాకర్‌కు సంబంధించి తాజా నిబంధనలు బ్యాంకు లాకర్లలో నగదు నిల్వ చేయకూడదు. కేవలం నగలు, పత్రాలు వంటి విలువైన వస్తువులు నిల్వ చేసుకొనేందుకు, చట్టబద్ధమైన ప్రయోజనాల కోసమే మాత్రమే దీన్ని వినియోగించాలి. చట్టవిరుద్ధమైన ప్రమాదకర పదార్ధాలను అసలు ఉంచకూడదు. ఏదైనా అనుమానం వచ్చినప్పుడు, కస్టమర్‌పై 'తగిన చర్య' తీసుకునే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అగ్నిప్రమాదం, దొంగతనం, దోపిడి, దోపిడీ, భవనం కూలిపోవడం మొదలైన వాటికి బ్యాంకుదే బాధ్యత. ఉద్యోగి మోసం చేయడం వల్ల నష్టం జరిగితే బ్యాంకు కూడా బాధ్యత వహిస్తుంది. ఇలాంటి కేసుల్లో 'సేఫ్ డిపాజిట్ లాకర్’ ప్రస్తుత వార్షిక ఫీజుకు వంద రెట్లు ఖాతాదారుడికి నష్టపరిహారంగా చెల్లించాలి. కానీ వరదలు, భూకంపాలు , ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా లాకర్ కంటెంట్‌కు ఏదైనా నష్టం లేదా నష్టానికి బ్యాంక్ బాధ్యత వహించదు. అలాగే లాకర్ అద్దెను మూడేళ్లపాటు చెల్లించకపోతే, కస్టమర్‌కు సమాచారం అందించి, కస్టమర్ అనుమతి తర్వాత బ్యాంక్ 'డ్యూ ప్రొసీజర్‌ను అనుసరించి' లాకర్‌ను తెరిచే అధికారం ఈ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే ఇప్పటికే లాకర్ ఉన్న వినియోగదారులు బ్యాంకులకు కొత్త ఒప్పంద పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం వినియోగదారుడు రూ. 200 స్టాంప్ పేపర్‌పై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్బిఐ నిర్దేశించిన ఈ గడువు జూన్‌తో ముగిసిపోగా తాజాగా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు దీన్ని పొడిగించింది. అంతేకాదు కొత్త నిబంధనల ప్రకారం నష్టపరిహారం పొందాలంటే గడువులోగా సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాకర్లలో ఉంచకూడని వస్తువులు , సెల్ఫ్ డిక్లరేషన్ కరెన్సీ నోట్లు, ఆయుధాలు, పేలుడు సామగ్రి, మాదక ద్రవ్యాలు రేడియేషన్ పరికరాలు చట్ట విరుద్ధమైన వస్తువులు ఉంచకూడదు. దీనికి సంబంధించి అక్రమ, నిషేధిత వస్తువులను లాకర్లో దాచిపెట్టనని ఖాతాదారుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ప్రాథమిక నిబంధనలకు లోబడి లాకర్‌ను వినియోగిస్తానంటూ సంబంధిత ఒప్పంద పత్రంపై సంతకం చేయాలి. అలా బ్యాంకులో లాకర్ తీసుకున్న తరువాత ఈ అగ్రిమెంట్ కాపీని బ్యాంకు నుంచి తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. -
రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి
లక్నో: బ్యాంకు లాకర్లో దాచిన రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాబాద్లో జరిగింది. మొరాదాబాద్‌కు చెందిన మహిళ అల్కా పాఠక్ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షల నగదును గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలోని లాకర్లో భద్రపర్చింది. లాకర్ అగ్రిమెంట్‌ను నవీకరించుకోవాలని, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకు సిబ్బంది ఆమెకు ఫోన్ చేసి చెప్పారు. అల్కా పాఠక్ బ్యాంకుకు వెళ్లి తన లాకర్‌ను తెరిచి చూసు కోగా, చెత్తాచెదారమే కనిపించింది. నగదును చెదపురుగులు కొరికేసి ముక్క లు ముక్కలు చేశాయి. మొత్తం సొమ్మంతా పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది స్పందించారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. -
పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది!
ఇప్పటికే దేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. కేవలం ఆటోమొబైల్ కంపెనీలు మాత్రమే కాకుండా.. కొన్ని దిగ్గజ బ్యాంకులు సైతం తమ కస్టమర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ బాటలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వడ్డీ & ఇతర రాయితీలను అందించనుంది. హోమ్ లోన్ మీద వడ్డీ రేటు ఇప్పుడు 8.4శాతం నుంచి ప్రారంభమవుతుంది బ్యాంక్ ఫ్లోటింగ్ అండ్ ఫిక్స్డ్ రేట్ కార్ లోన్ల వడ్డీ రేటు వరుసగా 8.75 శాతం, 8.70 శాతం నుంచి ప్రారంభమవుతాయి, దీనికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజులు లేవు ఎజ్యుకేషన్ లోన్ మీద వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభమవుతుంది (60 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) పర్సనల్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ 10.10 శాతం నుంచి ప్రారంభమవుతుంది (80 బేసిస్ పాయింట్ల వరకు తగ్గింపు) ఇదీ చదవండి: సింగిల్ ఛార్జ్‌తో 800కిమీ రేంజ్! ధర రూ. 3.47 లక్షలే.. ఈ ఏడాది చివరి వరకు.. అంటే 2023 డిసెంబర్ 31 వరకు అమలులో ఉండనున్న ఈ ఆఫర్స్ కింద బ్యాంక్ విద్య & వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లను వరుసగా 60 bps, 80 bps తగ్గించింది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే కొన్ని ఇతర బ్రాండ్లతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు ఉన్న వారు ప్రత్యేక ఆఫర్స్ పొందవచ్చు. -
బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్: చిటికెలో రూ.50వేల లోన్! నమ్మారో..
బ్యాంకుల్లో లోన్ కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బ్యాంకుల్లో తీసుకునే రుణాలపై వడ్డీ శాతం తక్కువగా ఉంటుంది. దీంతో ఏదైనా బిజినెజ్ లేదా వ్యక్తిగత అవసరాల నిమిత్తం రుణాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. కానీ బ్యాంకుల్లో రుణం అంత సులువుగా లభించదు. క్రెడిట్ స్కోర్, ఆదాయ మార్గం.. ఇలా చాలా అంశాలను బ్యాంకులు పరగణనలోకి తీసుకుని లోన్ మంజూరు చేస్తాయి. టెక్నాలజీ ఆధారంగా బ్యాంకింగ్ సర్వీసులు కూడా చాలా సులభతరం అయ్యాయి. బిల్లుల చెల్లింపు, పేమెంట్ చెల్లింపు, మనీ సెండ్, మనీ రిసీవ్ ఇలా చాలా పనులు ఇప్పుడు సెకన్లలోనే అయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య ఆన్లైన్ లోన్లు ఎక్కువయ్యాయి. కస్టమర్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు కొత్త కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఏమరపాటుగా ఉంటే అసలుకే ముప్పు రావొచ్చు. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్‌లో చేరితే చాలంటూ.. ఇటీవల కాలంలో వాట్సాప్ స్కామ్‌ల ద్వారా చాలా మంది మోసపోతున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయితే చాలు క్షణాల్లో లోన్ పొందొచ్చు అంటూ జరుగుతున్న మోసం గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తోంది. 'మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే.. వెంటనే రూ.50 వేలు ఉచితంగా పొందొచ్చు. వరల్డ్ డిజిటల్ లోన్ కింద బ్యాంక్ రూ.50 వేల లోన్ అందిస్తోంది. ఇంట్లో నుంచే మీరు ఈ లోన్ పొందొచ్చు. నిమిషాల్లో రుణం వస్తుంది. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి లోన్ పొందొచ్చు' అంటూ ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోందని బ్యాంక్ తెలిపింది. ఇలాంటి మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి మోసాల బారిన పడవద్దని బ్యాంక్ కస్టమర్లను కోరుతోంది. ఇలాంటి మోసపూరిత వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ కావొద్దని సూచించింది. బ్యాంక్ ఎప్పుడూ కస్టమర్లను ఇలా వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వమని కోరదని, బ్యాంక్ వివరాలను ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. -
వీడియో కేవైసీని ప్రవేశపెట్టిన బీవోబీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వీడియో ఆర్ఈ కేవైసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఎప్పటికప్పుడు తమ కేవైసీ ధ్రువీకరణ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం బ్యాంక్ శాఖ వరకు రావాల్సిన అవసరాన్ని వీడియో ఆర్ఈ కేవైసీ విధానం నివారిస్తుంది. వీడియో కేవైసీ సదుపాయం వినియోగించుకోవాలంటే కస్టమర్ వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి, ఆధార్, పాన్ ఉండాలని బీవోబీ తెలిపింది. ముందుగా కస్టమర్లు బీవోబీ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆన్లైన్ ఆర్ఈ–కేవైసీ దరఖాస్తును సమరి్పంచాలి. ఇందులో అడిగిన వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌కు వీడియో కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కాల్ కంటే ముందు కస్టమర్ తన ఒరిజినల్ పాన్ కార్డ్, ఖాళీ వైట్ పేపర్, బ్లూ లేదా బ్లాక్ పెన్ సిద్ధంగా ఉంచుకోవాలి. వీడియో ఆర్ఈ కేవైసీ కాల్‌ను అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య చేసుకోవచ్చు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా 251 పసిడి రుణాల షాపీలు
హైదరాబాద్: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కొత్తగా 251 బంగారం రుణాల షాపీలను ప్రారంభించింది. వీటిలో 35 షాపీలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. కొత్త వాటి ప్రారంభంతో మొత్తం సంఖ్య 1,238కి చేరింది. బంగారంపై రుణాలపరమైన సరీ్వసులు అందించేందుకు బ్యాంకు శాఖలోనే ప్రత్యేకంగా కేటాయించిన ఎన్క్లోజర్ను షాపీగా వ్యవహరిస్తారు. ఇందులో ఒక ఇంచార్జి, కనీసం ఇద్దరు అప్రైజర్లు ఉంటారు. రుణాలపై నిర్ణయాధికారం ఇంచార్జికే అప్పగిచడం వల్ల ప్రాసెసింగ్ మరింత వేగవంతం కాగలదని బీవోబీ ఈడీ అజయ్ కే. ఖురానా తెలిపారు. ఆకర్షణీయ వడ్డీ రేట్లతో బంగారంపై అధిక మొత్తంలో రుణాలు అందిస్తున్నామని, రూ. 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజులు లేవని ఆయన పేర్కొన్నారు. -
బాలీవుడ్ హీరో విల్లా వేలానికి నోటీసులు.. అంతలోనే ట్విస్ట్
బీజేపీ ఎంపీ, సినీ నటుడు సన్నీడియోల్‌కు చెందిన బంగ్లా వేలం నోటీసును ఉపసంహరించుకోవడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది."అజయ్ సింగ్ డియోల్ అలియాస్ సన్నీ డియోల్‌కు సంబంధించి అమ్మకపు వేలం నోటీసుకు సంబంధించి ఇ-వేలంకు సంబంధించిన కొరిజెండం సాంకేతిక కారణాల వల్ల ఉపసంహరించబడింది" అని బ్యాంక్ ఆఫ్ బరోడా వెల్లడించింది. (అప్పుడు ఆఫీసు బోయ్..ఇపుడు ఎవ్వరూ ఊహించని శిఖరాలకు!) తాజా పరిణామంపై విమర్శలకు తావిచ్చింది. దీనిపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విటర్)లో విస్మయాన్ని వ్యక్తం చేశారు. వేలం నోటీసు జారీ చేసిన 24 గంటలలోపు దాన్ని విత్‌డ్రా చేసుకోవడంపై ఆయన మండిపడ్డారు. బీవోబీ ప్రకటించిన టెక్నికల్ కారణాలను ఎవరు లేవనెత్తారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (ఎస్‌డబ్ల్యూపీ అంటే? నెక్ట్స్ మంత్ నుంచే ఆదాయం పొందొచ్చా? ) Yesterday afternoon the nation got to know that Bank of Baroda had put up the Juhu residence of BJP MP Sunny Deol for e-auction since he has not paid up Rs 56 crore owed to the Bank. This morning, in less than 24 hours, the nation has got to know that the Bank of Baroda has… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 21, 2023 బ్యాంకును సంప్రదించారంటున్న బీవోబీ జుహు బంగ్లాను వేలనోటీసుల నేపథ్యంలో రుణగ్రహీత (సన్నీ డియోల్), బకాయలను చెల్లించేందుకు తమను సంప్రదించినట్లు బరోడాకు చెందిన బీవోబీ బ్యాంకు తన ప్రకటనలో వెల్లడించింది. నోటీసులోని మొత్తం బకాయిలు రికవరీ చేయాల్సిన బకాయిల ఖచ్చితమైన పరిమాణాన్ని పేర్కొనలేదని బ్యాంక్ తెలిపింది.అలాగే ప్రాపర్టీ సంకేత స్వాధీనత ఆధారంగా నోటీసు లిచ్చామని, "...సెక్యూరిటీ ఇంటరెస్ట్ (ఎన్ఫోర్స్మెంట్) రూల్స్ 2002లోని రూల్ 8(6) ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకోవడం ఆధారంగా విక్రయ నోటీసు అందించినట్టు వివరణ ఇచ్చింది. pic.twitter.com/L4BdXxeuyN — Bank of Baroda (@bankofbaroda) August 21, 2023 కాగా మధ్యప్రదేశ్‌లో గురుదాస్ ఎంపీ సన్నీడియోల్. 2016లో ఒక సినిమా కోసం రుణం తీసుకున్నాడు. చెల్లింపులు చేయకపోవడంతో ఈ బకాయి రూ. 56 కోట్లుకు చేరింది. గత ఏడాది డిసెంబర్ నుంచి మొండి బకాయిల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిని సెప్టెంబరు 25న ఈ-వేలం వేయనున్నట్టు, ఈ వేలంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 22 లోపు దరఖాస్తు చేయాల్సిందిగా బ్యాంకు అధికారులు తొలుత ప్రకటించారు. ఈ ఆస్తికి బ్యాంకు 51.43 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించారు. జుహులోని గాంధీగ్రామ్ రోడ్లో సన్నీ విల్లా, సినీ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియో ‘సన్నీ సూపర్ సౌండ్’ కూడా ఉన్న 599.44 చదరపు మీటర్ల ఆస్తిని కూడా వేలం వేయడానికి బ్యాంకు సిద్ధపడింది. సన్నీ సౌండ్స్ డియోల్స్ యాజమాన్యంలోని కంపెనీ, లోన్‌కు సంబంధించిన కార్పొరేట్ గ్యారెంటర్. సన్నీ డియోల్ తండ్రి, బాలీవుడ్ హీరో నటుడు, బీజేపీ మాజీ ఎంపీ, తండ్రి ధర్మేంద్ర వ్యక్తిగత హామీదారు. ధర్మేంద్ర భార్య, నటి హేమామాలిని కూడా బీజేపీ ఎంపీ కావడం గమనార్హం.