గత కొన్ని రోజులుగా నిబంధనలను అతిక్రమిస్తున్న బ్యాంకులపై 'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (ఆర్‌బీఐ) కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలు బ్యాంకుల లైసెన్సులు క్యాన్సిల్ చేయడమే కాకుండా కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు కూడా విధించింది. తాజాగా మరి కొన్ని బ్యాంకులకు కోట్ల రూపాయాల ఫైన్ వేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రెండు ప్రభుత్వ రంగంలోని 'బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్' బ్యాంకులకు, ప్రైవేట్ రంగంలోని 'సిటీ బ్యాంకు'కు ఈ రోజు రూ. 10.34 కోట్లు జరిమానా విధించినట్లు తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank Of Baroda)
ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ అయిన 'బ్యాంక్ ఆఫ్ బరోడా'పై ఆర్‌బీఐ ఏకంగా రూ. 4.34 కోట్లు జరిమానా విధించింది. కామన్ ఎక్స్‌పోజర్ సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేయడంలో RBI ఆదేశాలను పాటించకపోవడం వల్ల ఈ జరిమానా విధించినట్లు తెలుస్తోంది.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)
ప్రభుత్వ రంగంలోని మరో దిగ్గజ బ్యాంక్ 'ఇండియన్ ఓవర్సీస్'పై కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోటి రూపాయలు జరిమానా విధించింది. బ్యాంక్ లోన్స్, అడ్వాన్సులకు సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించినందున ఈ జరిమానా విధించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
సిటీ బ్యాంక్ (City Bank)
ప్రైవేట్ రంగంలో 'సిటీ బ్యాంక్'పై RBI ఏకంగా రూ. 5 కోట్లు ఫైన్ వేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949, డిపాజిటర్ ఎడ్యుకేషన్, అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఔట్ సోర్సింగ్ విధానాలను అమలు చేయడంలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను ఉల్లఘించడం వల్ల ఈ జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment