
న్యూఢిల్లీ: ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ పథకం బరోడా బీఎన్‌పీ పరిబాస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రూ. 1,400 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈ కొత్త ఫండ్ ఆఫర్(ఎన్‌ఎఫ్‌వో) జులై 25న ప్రారంభమై ఈ నెల(ఆగస్ట్) 8న ముగిసింది.
బరోడా బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా చేపట్టిన తొట్టతొలి పథకమిది. బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియాలో బరోడా అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా విలీనమయ్యాక తీసుకు వచ్చిన తొలి పథకమిది.
దేశవ్యాప్తంగా 120 పట్టణాల నుంచి 42,000 మంది ఇన్వెస్టర్లు ఎన్‌ఎఫ్‌వోపట్ల విశ్వాసముంచినట్లు బరోడా బీఎన్‌పీ పరిబాస్ అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా సీఈవో సురేష్ సోనీ పేర్కొన్నారు. ఈ పథకాన్ని తిరిగి ఈ నెల 24 నుంచి రీఓపెన్ చేయనున్నట్లు వెల్లడించారు.