సెబీ కొత్త రూల్స్‌.. నవంబర్‌ 1 నుంచే.. | SEBI new rules for mutual funds starting November 1 | Sakshi
Sakshi News home page

సెబీ కొత్త రూల్స్‌.. నవంబర్‌ 1 నుంచే..

Published Sun, Oct 27 2024 7:52 AM | Last Updated on Sun, Oct 27 2024 10:05 AM

SEBI new rules for mutual funds starting November 1

న్యూఢిల్లీ: వచ్చే నెల (నవంబర్‌) 1 నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌కు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ జారీ చేసిన నూతన మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ(ఏఎంసీ) ఒక పాన్‌ ద్వారా యూనిట్లలో రూ. 15 లక్షలకు మించి చేపట్టే అన్ని లావాదేవీలు రెండు రోజుల్లోగా కంప్లయెన్స్‌ అధికారికి వెల్లడించవలసి ఉంటుంది.

సంబంధిత అధికారులు, ట్రస్టీలు లేదా సంబంధిత వ్యక్తులు ఆయా లావాదేవీల వివరాలను రెండు పనిదినాల్లోగా తెలియజేయవలసి ఉంటుంది. ఒక త్రైమాసికంలో సింగిల్‌ లేదా అనేక లావాదేవీల ద్వారా రూ. 15 లక్షల విలువ ట్రాన్సాక్షన్‌ జరిగితే.. మినహాయింపులో ఉన్నవికాకుండా అన్ని పథకాలకూ తాజా నిబంధనలు వర్తించనున్నట్లు సెబీ ఒక సర్క్యులర్‌లో పేర్కొంది.

వచ్చే నెల నుంచి ఏఎంసీలు త్రైమాసికవారీగా సంబంధిత అధికారులు, ట్రస్టీలు, సమీప బంధువుల హోల్డింగ్స్‌ వివరాలను వెల్లడించవలసి ఉంటుంది. అక్టోబర్‌ 31కల్లా కలిగి ఉన్న హోల్డింగ్స్‌ను నవంబర్‌ 15కల్లా వెల్లడించవలసి ఉంటుంది. ఆపై ప్రతీ త్రైమాసికం తదుపరి 10 రోజుల్లోగా వీటి వివరాలు దాఖలు పరచాలని సెబీ తెలియజేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement