యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, కొత్తగా యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ బాండ్ ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీ–జూన్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది క్రిసిల్– ఐబీఎక్స్ ఎఎఎ ఎన్‌బీఎఫ్‌సీ–హెచ్‌ఎఫ్‌సీ ఇండెక్స్–జూన్ 2027లోని సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టే ఓపెన్–ఎండెడ్ టార్గెట్ మెచ్యూరిటీ ఇండెక్స్ ఫండ్. ఈ స్కీములో ఒక మోస్తరు వడ్డీ రేటు రిస్కు, మిగతా సాధనాలతో పోలిస్తే తక్కువ క్రెడిట్ రిస్కు ఉంటాయి. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. డిసెంబర్ 10 వరకు ఇది అందుబాటులో ఉంటుంది.
శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్
శామ్కో అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ.. కొత్తగా శామ్కో మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ప్రారంభించింది. ఈ నెల 4న ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో), ఈ నెల 18 వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈక్విటీలు, బంగారం, డెట్, ఆర్బిట్రేజ్ సాధనాల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఆయా విభాగాల్లో ఆకర్షణీయమైన అవకాశాలకు అనుగుణంగా కేటాయింపుల్లోనూ మార్పులు, చేర్పులు చేస్తుంటుంది.
ఈక్విటీలు ర్యాలీ చేసే సమయంలో వాటికి కేటాయింపులు పెంచడం, ఈక్విటీలు అధిక వ్యాల్యూషన్లకు చేరి నిదానించిన సమయంలో బంగారంలోకి పెట్టుబడులు తరలించడం తదితర వ్యూహాలను అనుసరిస్తుంది. తద్వారా రిస్క్‌ను అధిగమించి, మెరుగైన రాబడులు ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఈక్విటీలకు 20–80 శాతం మధ్య, డెట్‌కు 10–70 శాతం మధ్య, బంగారం, సిల్వర్ ఈటీఎఫ్‌లకు 10–70 శాతం మధ్య అవకాశాలకు అనుగుణంగా కేటాయింపులు చేస్తుంది. 30 శాతం వరకు కమోడిటీ డెరివేటివ్‌లు, 10 శాతం వరకు రీట్‌లు, ఇన్విట్‌లలోనూ పెట్టుబడులు పెడుతుంది. ఎన్‌ఎఫ్‌వోలో భాగంగా ఒకరు కనీసం రూ.5,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్
ఈక్విటీ, డెట్, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్కో ఇండియా మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్‌ను ఇన్వెస్కో మ్యుచువల్ ఫండ్ ఆవిష్కరించింది. ఈ ఓపెన్ ఎండెడ్ న్యూ ఫండ్ ఆఫర్ డిసెంబర్ 11 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సిప్ విధానంలో రూ. 500 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈక్విటీలు, డెట్ సాధనాల్లో 10–80 శాతం వరకు, గోల్డ్ ఈటీఎఫ్‌లు/సిల్వర్ ఈటీఎఫ్‌లలో 10–50 శాతం వరకు ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. అలాగే అవకాశాన్ని బట్టి విదేశీ సెక్యూరిటీస్‌లో 35 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment