
ఏంజెల్ వన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కొత్తగా నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నిఫ్టీ 50 ఈటీఎఫ్ పేరిట రెండు ప్యాసివ్ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. మే 16 వరకు ఈ న్యూ ఫండ్ ఆఫర్స్‌లో (ఎన్‌ఎఫ్‌వో) ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. సిప్ రూపంలోనైతే రోజువారీ, వారంవారీ, పక్షానికోసారి, నెలవారీ, త్రైమాసికాలవారీగా రూ. 250 నుంచి రూ. 3,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి రెండూ నిఫ్టీ 50 సూచీని ట్రాక్ చేస్తాయి. నాణ్యమైన లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడుల ప్రయోజనాలను పొందాలనుకునే ఇన్వెస్టర్లు వీటిని ఎంచుకోవచ్చని సంస్థ ఈడీ హేమేన్ భాటియా తెలిపారు.
బరోడా బీఎన్‌పీ పారిబా నుంచి..
ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను బరోడా బీఎన్‌పీ పారిబా మ్యుచువల్ ఫండ్ (బీబీపీఎంసీ Baroda BNP Paribas) ఆవిష్కరించింది. ఇది మే 21న ముగుస్తుంది. రిస్కులను అంతగా ఇష్టపడకుండా.. మూలధన వృద్ధి, మెరుగైన రాబడులు కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్ అనువైనదిగా ఉంటుంది. బీబీపీఎంసీకి చెందిన డెట్ ఆధారిత ఫండ్స్‌లో 50–65 శాతం నిధులను, ఆర్బిట్రేజ్ పథకంలో 30–50 శాతం, మిగతా మొత్తాన్ని మనీ మార్కెట్ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది.