nfo
-
టాటా ఇన్నోవేషన్ ఫండ్.. రూ. 5000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు
హైదరాబాద్: వినూత్న వ్యూహాలు, థీమ్‌లతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్ మేనేజ్మెంట్ వెల్లడించింది. ఇది నవంబర్ 11 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది.కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ మార్కెట్ క్యాప్‌లు, రంగాలవ్యాప్తంగా ఇన్నోవేషన్ థీమ్ ద్వారా లబ్ధి పొందే సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి ఈ ఫండ్ తోడ్పడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ రాహుల్ సింగ్ తెలిపారు.యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఇండెక్స్ ఫండ్.. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ క్రిసిల్–ఐబిఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్–సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్–సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నవంబర్ 21 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. -
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్‌నీత్ మునోత్ తెలిపారు. -
నిధుల సమీకరణలో కొత్త పథకాలు డీలా..! మొదటి ఆరు నెల్లలో రూ.25,712 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ నూతన పథకాల ద్వారా (ఎన్ఎఫ్వో) నిధుల సమీకరణ ఈ ఏడాది అనుకున్నంత ఆశాజనకంగా లేదు. మొదటి ఆరు నెలల్లో (జనవరి–జూన్) ఎన్‌ఎఫ్‌వోల రూపంలో సమీకరించిన నిధులు రూ.25,712 కోట్లుగా ఉన్నా యి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఎన్‌ఎఫ్‌వోలు సమీకరించిన రూ.38,929 కోట్లతో పోలిస్తే 34 శాతం తగ్గాయి. ఈక్విటీ, డెట్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితులు ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. ఒకే విభాగంలో ఒకటికి మించిన పథకాలు ఆవిష్కరించకూడదంటూ సెబీ విధించిన ఆంక్షలు పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలపై ప్రభావం చూపించింది. జనవరి నుంచి జూన్ వరకు మొత్తం 115 ఎన్‌ఎఫ్‌వోలు నిధుల సమీకరణ కోసం మార్కెట్లోకి వచ్చాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన 160 ఎన్ఎఫ్వోలతో పోలిస్తే క్షీణత కనిపిస్తోంది. ఈక్విటీ ఫండ్స్ జనవరి నుంచి జూన్ వరకు ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు రూ.14,917 కోట్లు సమీకరించాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ కొత్త పథకాలు సమీకరించిన రూ.16,370 కోట్లతో పోలిస్తే 9 శాతం క్షీణత కనిపిస్తోంది. మొత్తం నూతన పథకాల ఆవిష్కరణ కూడా క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 22 నుంచి 17కు పరిమితమయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, దేశీ ఈక్విటీలు అదే పనిగా పెరుగుతూ వెళుతుండడంతో చాలా మంది ఇన్వెస్టర్లు నూతన పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి బదులు, ఇప్పటికే ఉన్న పెట్టుబడులపై లాభాల స్వీకరణకు మొగ్గు చూపి ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెద్ద మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను ఆకర్షించేందుకు రిస్క్‌తో కూడిన థీమ్యాటిక్ పథకాల ఆవిష్కరణకు మొగ్గు చూపించారు. హైబ్రిడ్ ఫండ్స్ హైబ్రిడ్ (ఈక్విటీ, డెట్ కలిసిన) న్యూ ఫండ్ ఆఫర్ల రూపంలో సమీకరించిన నిధులు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 22 శాతం తగ్గి, రూ.2,141 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఫండ్స్ ఎన్‌ఎఫ్‌వోలపై ప్రభావం ఎక్కువగా పడింది. ఇవి రూ.6,235 కోట్లను రాబట్టాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో డెట్ ఎన్ఎఫ్వోల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.12,649 కోట్లుగా ఉన్నాయి. డెట్ ఎన్‌ఎఫ్‌వోల సంఖ్య 51 నుంచి 38కి తగ్గింది. ఇక ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) విభాగంలోనూ ఎన్‌ఎఫ్‌వోల నిధుల సమీకరణ 66 శాతం క్షీణించి రూ.2,419 కోట్లుగా ఉంది. ఇండెక్సేషన్ ప్రయోజనాన్ని (ద్రవ్యోల్బణం మినహాయింపు) ఎత్తివేయడం డెట్ ఫండ్స్ సమీకరణపై ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో ప్యాసివ్ లిక్విడ్, గిల్ట్ ఫండ్స్, టార్గెట్ మెచ్యూరిటీ పథకాలు ఆకర్షణ కోల్పోయాయి. మారిన పరిస్థితులు.. ఈ పరిణామంపై నిప్పన్ ఇండియా మ్యూ చువల్ ఫండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సౌగతా ఛటర్జీ స్పందిస్తూ.. ‘‘కొత్తగా ప్రవేశించిన సంస్థలు మిన హాయిస్తే చాలా వరకు ఫండ్‌హౌస్‌ల ఉత్పత్తుల ఆఫర్ అనేది పరిమితికి చేరింది. దీంతో కొన్ని థీమ్యాటిక్ ఫండ్స్‌తో మార్కెట్లోకి వస్తున్నాయి. నిప్పన్ మ్యూచువల్ ఫండ్ మాత్రం ఎన్‌ఎఫ్‌వోల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్వెస్టర్లకు వినూత్న మైన ప్రతిపాదనలు ఉన్నాయని అనిపించినప్పుడే కొత్త పథకాలను తీసుకొస్తోంది. గడిచిన రెండేళ్లలో రెండే పథకాలను ఆవిష్కరించాం’’అని సౌగతా ఛటర్జీ తెలిపారు. ఇన్వెస్టర్లు కొత్త పథకాల్లో యూనిట్ ఎన్ ఏవీ రూ.10కే లభిస్తుందన్న ఉద్దేశ్యంతో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తుంటారని స్మార్ట్ వెల్త్ అడ్వైజర్స్ సీఈవో రమేశ్ పవార్ తెలిపారు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ఇన్వెస్ట్ చేసినప్పు డే యూ నిట్ల అసలు విలువ ప్రతిఫలిస్తుందన్నారు. పెద్ద సంస్థలు కాకుండా కొత్తగా ప్రవేశించిన సంస్థలు తెచ్చే ఎన్‌ఎఫ్‌వోలకు స్పందన పెద్దగా ఉండడం లేద మరోవైపు తక్షణ లాభాల కోసం ఇన్వెస్టర్లు ఐపీవోల పట్ల మొగ్గు చూపిస్తున్నట్టు చెప్పారు. -
న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓ) జోరు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్ పరిస్థితులు బాగుండడంతో మ్యూచువల్ ఫండ్ కంపెనీలు న్యూ ఫండ్ ఆఫర్స్(ఎన్ఎఫ్ఓఎ)ను జోరుగా అందించనున్నాయి. కంపెనీలు దాదాపు 34 ఎన్ఎఫ్ఓలను ఆఫర్ చేస్తాయని సమాచారం. ఎస్బీఐ ఎంఎఫ్, యూటీఐ ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఎంఎఫ్, రిలయన్స్ ఎంఎఫ్, హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, తదితర కంపెనీలు ఈ ఎన్ఎఫ్ఓలను ఆఫర్ చేయనున్నాయి. -
ఎన్ఎఫ్ఓల్లో పెట్టుబడులు పెట్టొచ్చా?
కొత్త ఫండ్ ఆఫర్ల(ఎన్ఎఫ్ఓ)లో 5,000-10,000 చొప్పున చిన్న మొత్తాల్లో పెట్టుబడిపెట్టి దీర్ఘకాలిక రాబడుల కోసం పదేళ్లపాటు వేచి చూడటం మంచి నిర్ణయమేనా? - వికాశ్, ఈమెయిల్ ఎన్ఎఫ్ఓలకు దూరంగా ఉండాలనేది మేం సాధారణంగా ఇచ్చే సలహా. ఈ పెట్టుబడులను ఆయా సంస్థలు తిరిగి ఎందులో ఇన్వెస్ట్ చేస్తాయనేది తెలియదు. అందువల్ల గతంలో మంచి పనితీరున్న ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం అన్నింటికంటే ఉత్తమం. దీర్ఘకాలం పాటు పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా ఉంచాలని మీరు భావిస్తున్నారు కాబట్టి.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఫండ్‌ను ఎంచుకొని మీ చిన్నచిన్న పొదుపు మొత్తాలను క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీరు చిన్న మొత్తాన్ని ఒక ఎన్ఎఫ్ఓలో పెట్టుబడిగా పెట్టారనుకుందాం. ఆ పెట్టుబడి ఎలా వృద్ధి చెందుతోంది లేదంటే తగ్గుతోందనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఆ ఫండ్ పథకం పనితీరును తెలియజేసే గత రికార్డు ఏదీ అందుబాటులో ఉండదు. మీ పెట్టుబడులు రాబడులు అందించొచ్చు లేదా అందించకపోవచ్చు. అదే క్రమం తప్పకుండా ఏవైనా పెట్టుబడులు పెట్టుకుంటూవెళ్తే... కొన్నేళ్ల తర్వాత అత్యంత మెరుగైన రాబడులు అందుకునేందుకు ఎక్కువగా అవకాశాలుంటాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) ద్వారా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్లు క్షీణించే సమయంలో మరింత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసేందుకు వీలవుతుంది. తక్కువ రేటుకు ఫండ్ యూనిట్లను కొనుగోలు చేస్తారు కాబట్టి లాభాల మార్జిన్లు కూడా అధికంగా ఉంటాయి. అంతేకాదు సిప్‌ను అనుసరించడం వల్ల ఏ సమయంలో పెట్టుబడి పెడితే మంచి రాబడులొస్తాయి ఇతరత్రా మానసిక ఒత్తిళ్లుకూడా ఉండవు. ఒక మంచి ఫండ్‌లో దీర్ఘకాలిక పెట్టుబడులు అనేవి ఎల్లప్పుడూ అత్యుత్తమ రాబడులనే అందిస్తాయి. దీనికోసం ఎన్ఎఫ్ఓలను ఆశ్రయించడం అనవసరం. అయితే, మీరు చేసే పెట్టుబడులకు సంబంధిన మొత్తాన్ని ఫండ్ సంస్థలు నిర్వహించే తీరు, కేటాయింపులు లేదా ఆ రంగం భవిష్యత్తులో మంచి పనితీరును కనబరుస్తుందని మీరు బలంగా విశ్వసిస్తే ఎన్ఎఫ్ఓల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఇంట్రాడే ట్రేడింగ్ సందర్భంగా ఆయా ఇండెక్స్ విలువలకు అనుగుణంగా ట్రేడ్ అవుతాయా? వీటి బిజినెస్ మోడల్‌ను అదేవిధంగా ఇన్వెస్టర్లకు ఏవిధంగా రాబ డులను అందించగలుగుతాయో వివరించండి. - సుశీల్‌కుమార్, విజయవాడ ఇండెక్స్ ఫండ్స్‌ను ఓపెన్-ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. స్టాక్ సూచీల జాబితాలో ఉండే కంపెనీల వెయిటేజీకి అనుగుణంగా ఈ పండ్స్ పెట్టుబడులు పెడతాయి. ఫండ్ కంపెనీలు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలను ట్రాక్ చేయడం ద్వారా వీటి పనితీరును అంచనావేస్తాయి. చాలా చురుగ్గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మార్చే ఫండ్స్‌తో పోలిస్తే.. ఈ ఇండెక్స్ ఫండ్స్‌కు నష్టభయం(రిస్క్-రిటర్న్ ఫ్రొఫైల్) తక్కువగా ఉంటుంది. బుల్స్ మంచి దూకుడు మీదున్నప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్ ఇంచ్చేంత భారీ రాబడులను ఈ ఇండెక్స్ ఫండ్స్ అందించలేవు. అదేవిధంగా మార్కెట్లు కుప్పకూలినప్పుడు డైవర్సిఫైడ్ ఈక్విటీ విభాగంలోని ఫండ్స్ మాదిరిగా భారీగా నష్టపోయే అవకాశం కూడా ఉండదు. ఇండెక్స్ ఫండ్స్‌కు సంబంధించి రాబడులను ముందుగానే ఒక అంచనా వేయొచ్చు. మార్కెట్లను మించి లాభాలను ఆశించడం కుదరదు. ఇక ఇంట్రాడే ట్రేడింగ్ విషయానికొస్తే... మ్యూచువల్ ఫండ్స్ కేవలం షేర్లను మాత్రమే కొనడం, అమ్మడం, కొంతకాలం అట్టిపెట్టుకోవడం చేస్తాయి. డే ట్రేడర్ల మాదిరిగా ఫండ్స్ కార్యకలాపాలు ఉండవు. ఏజెంట్లు లేదా డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించే ట్రైల్ కమీషన్‌ను నికర అసెట్ విలువ(ఎన్ఏవీ) కొనుగోలు తేదీ లేదా వార్షిక ముగింపు తేదీ లేదా అమ్మకం తేదీ... వీటిలో దేని ఆధారంగా లెక్కిస్తారు? అదేవిధంగా డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్లను నిర్వచించేందుకు గల పరిమితులు ఏంటి? డెట్ ఫండ్ తనవద్దనున్న కార్పస్(మూల నిధి)లో డెట్ పెట్టుబడి సాధనాల్లో వెచ్చించే మొత్తం 75 శాతమా లేదంటే 65 శాతమా? - కమల్, తిరుపతి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల(ఏయూఎం)ల్లో రోజువారీ ప్రాతిపదికన కొంత శాతాన్ని తీసుకొని దాని ఆధారంగా ఈ ట్రైల్ కమీషన్లను లెక్కిస్తారు. వీటిని నెలవారీగా చెల్లిస్తారు. నికర అసెట్స్ ఆధారంగా వీటిని లెక్కగడతారు కాబట్టి.. ఆయా ఫండ్స్‌కు సంబంధించిన ఎన్ఏవీ పెరగడం వల్ల అసెట్స్ పుంజుకోవడం లేదా మరిన్ని ఎక్కువ ఫండ్ యూనిట్లను విక్రయించడం వంటి సందర్భాల్లో డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. రోజువారీ పద్ధతిలో వ్యయనిష్పత్తిని పరిగణనలోకి తీసుకొని దాన్ని మినహాయించుకున్నాకే ఈ కమీషన్ చెల్లింపులు జరుగుతాయి. ఇన్వెస్టర్లు ఈ ట్రైల్ కమీషన్ల గురించి పెద్దగా ఆందోళనచెందక్కర్లేదు. ఎందుకంటే అన్ని ఫండ్స్ కూడా ఈ కమీషన్లను తమ వ్యయ నిష్పత్తుల్లో చేరుస్తాయి. ఇవేమీ బయటికి వెల్లడించని వ్యయాలుకావు. కాబట్టి ఎన్‌ఏవీలపై వీటి ప్రభావం ఉండదు. ఈక్విటీ ఫండ్స్‌లో ట్రైల్ కమీషన్లు 0.20-1 శాతంగా; డెట్ ఫండ్స్‌లో అయితే 0.10-1 శాతం మధ్యలో ఉంటాయి. ఇన్వెస్టర్ల సొమ్ము ఫండ్స్‌లో కొనసాగినంతకాలం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్లు చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండో ప్రశ్న విషయానికొస్తే.. ఏ ఫండ్ అయినా 65 శాతానికి మించి తమ అసెట్స్‌ను ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌చేస్తే దాన్ని ఈక్విటీ ఫండ్‌గా వ్యవహరిస్తారు. అదే 65 శాతం కంటే తక్కువ మొత్తాన్ని ఈక్విటీల్లో పెట్టుబడిపెడితే వాటిని డెట్ ఫండ్స్‌గా చెప్పొచ్చు. -
పీఎస్‌యూల ఈటీఎఫ్ నేడు షురూ
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల(పీఎస్‌యూ) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) మంగళవారం(18న) ప్రారంభంకానుంది. 10 బ్లూచిప్ కంపెనీల వాటాలతో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఫండ్‌లో పెట్టుబడులకు తొలి రోజు యాంకర్(సంస్థాగత) ఇన్వెస్టర్లకు మాత్రమే అవకాశముంటుంది. ఫండ్ ద్వారా మొత్తం రూ. 3,000 కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 900 కోట్ల విలువైన యూనిట్లను విక్రయించనుంది. ఆపై బుధవారం(19) నుంచీ సంపన్న వర్గాలు, రిటైల్ ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగం నుంచి రూ. 2,100 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫండ్‌లో భాగమైన ప్రభుత్వ బ్లూచిప్ దిగ్గజాల జాబితా ఇలా ఉంది... ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా, ఆయిల్ ఇండియా, కంటెయినర్ కార్పొరేషన్, ఆర్ఈసీ, పీఎఫ్సీ, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇం జనీర్స్ ఇండియా, ఐవోసీ చోటు దక్కించుకున్నాయి. కొత్త ఫండ్ ఆఫర్ ఈ నెల 21న ముగియనుంది. రూ. 10 కోట్లకుపైగా... కనీసం రూ. 10 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేసే యాంకర్ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం తొలుత ఈ కొత్త ఫండ్‌ను ఆఫర్ చేస్తోంది. రిటైలర్లు తదితర ఇన్వెస్టర్లు 19 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ద్వారా టాప్-10 పీఎస్‌యూ కంపెనీలలో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లకు అవకాశం లభిస్తుందని డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ కార్యదర్శి టాండన్ పేర్కొన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు 6.66% లాయల్టీ అంటే ప్రతీ 15 యూనిట్లకూ ఒక లాయల్టీ యూనిట్‌ను అందించనున్నట్లు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా ఇండియాలో ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పుంజుకుంటూ వస్తున్నాయి. 2009 మార్చిలో ఈటీఎఫ్ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 1,396 కోట్లుకాగా, 2013 సెప్టెంబర్‌కల్లా రూ. 11,807 కోట్లకు ఎగశాయి. సీపీఎస్ఈ ఇండెక్స్ కూడా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) 18 నుంచీ సీపీఎస్ఈ ఇండెక్స్‌ను ప్రవేశపెడుతోంది. 2009 జనవరి 1 రేట్ల ఆధారంగా ఇండెక్స్‌ను రూపొందించింది. విలువను 1,000గా నిర్ధారించింది. ఇక్కడి నుంచి ఇండెక్స్‌లో ట్రేడింగ్ మొదలుకానుంది. ఈ ఇండెక్స్ ద్వారా సీపీఎస్ఈ ఈటీఎఫ్ యూనిట్ల విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి ఎన్ఎస్ఈ సహాయపడనుంది. మరోవైపు ఇన్వెస్టర్లకు కూడా తక్కువ వ్యయంలోనే వివిధ పరిశ్రమలకు చెందిన ప్రభుత్వ రంగ బ్లూచిప్ కంపెనీలలో వాటాలను పొందేందుకు అవకాశం లభిస్తుందని ఎన్ఎస్ఈ పేర్కొంది. సీపీఎస్ఈ ఇండెక్స్‌లోని కంపెనీల వెయిటేజీలను ప్రతీ క్వార్టర్లోనూ సమీక్షించి మార్పులను చేపట్టనున్నట్లు తెలిపింది. లక్ష్యానికి చేరువగా: ఆర్థిక మంత్రి చిదంబరం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని రూ. 40,000 కోట్ల నుంచి రూ. 16,027 కోట్లకు కుదించిన విషయం విదితమే. ఈ లక్ష్యాన్ని చేరుకునే బాటలో ఇప్పటికే ప్రభుత్వం రూ. 13,119 కోట్లను సమీకరించింది. గత శుక్రవారం ఐవోసీలో 10% వాటా విక్రయం ద్వారా రూ. 5,340 కోట్లను సమీకరించింది. ఈ నెల మొదట్లో భెల్‌లో 5.94% వాటాను ఎల్ఐసీకి అమ్మడం ద్వారా రూ.2,685 కోట్లను సమీకరించిన సంగతి తెలిసిందే. -
రిలయన్స్ క్లోజ్డ్ ఈక్విటీ
రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ క్లోజ్డ్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్‌ని ప్రవేశపెట్టింది. ఈనెల 15న ప్రారంభమైన ఈ ఫండ్ ఎన్ఎఫ్వో ఈనెల 29తో ముగుస్తుంది. ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన మొత్తాన్ని లార్జ్, మిడ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసే విధంగా తీర్చిదిద్దారు. ఐదేళ్ళు లాకిన్ పీరియడ్ ఉండే ఈ పథకంలో కనీస ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ.5,000గా నిర్ణయించారు.