
పారిశ్రామిక కమోడిటీగాను, విలువైన లోహంగా పెట్టుబడికి అనువైన సాధనంగాను వెండి ద్విపాత్రాభినయం పోషిస్తోంది. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు వీలు కల్పించేలా 360 వన్ అసెట్ మేనేజ్‌మెంట్ (గతంలో ఐఐఎఫ్‌ఎల్ అసెట్ మేనేజ్‌మెంట్) సిల్వర్ ఈటీఎఫ్‌ను ఆవిష్కరించింది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుంది. కనీసం రూ. 1,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది దేశీయంగా వెండి ధరలను ట్రాక్ చేస్తూ, దానికి అనుగుణమైన పనితీరు కనపరుస్తుందని సంస్థ సీఈవో రాఘవ్ అయ్యంగార్ తెలిపారు. వెండి ధరల కదలికలకు అనుగుణంగా దీర్ఘకాలిక సంపద సృష్టి, ఆదాయం కోరుకునే ఇన్వెస్టర్లకు అనువైనదిగా ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం అసెట్స్‌లో 95 శాతాన్ని వెండి లేదా వెండి సంబంధిత సాధనాల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది.
హెచ్‌డీఎఫ్‌సీ ‘నిఫ్టీ టాప్ 20’ ఇండెక్స్ ఫండ్
హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా నిఫ్టీ టాప్ 20 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 21తో ముగుస్తుంది. సమాన వెయిటేజీ పెట్టుబడి విధానం ద్వారా దేశీ బ్లూ చిప్ కంపెనీల దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను, ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలనుకునే ఇన్వెస్టర్లకు ఈ స్కీము అనువైనదిగా ఉంటుంది. ఒకే స్టాక్‌లో అధికంగా ఇన్వెస్ట్ చేయడం కాకుండా సమాన స్థాయిలో పెట్టుబడిని కేటాయించడం వల్ల రిస్కులు తగ్గించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. వెయిటేజీ ప్రతి మూడు నెలలకోసారి మారుతుంది. కనీసం రూ. 100 నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చని సంస్థ ఎండీ నవ్‌నీత్ మునోట్ తెలిపారు.
బజాజ్ అలయంజ్ లైఫ్ ఫోకస్డ్ 25 ఫండ్
ప్రైవేట్ రంగ జీవిత బీమా సంస్థ బజాజ్ అలయంజ్ లైఫ్ తాజాగా ఫోకస్డ్ 25 ఫండ్ పేరిట న్యూ ఫండ్ ఆఫర్‌ను ప్రకటించింది. కంపెనీకి చెందిన యులిప్ పథకాలతో పాటు ఇది అందుబాటులో ఉంటుంది. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా 25 వరకు స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడుతుంది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ మార్చి 20 వరకు అందుబాటులో ఉంటుందని సీఎఫ్‌ఓ శ్రీనివాస్ రావు రావూరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment