హైదరాబాద్: వినూత్న వ్యూహాలు, థీమ్‌లతో ప్రయోజనం పొందే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తూ టాటా ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌ను ఆవిష్కరించినట్లు టాటా అసెట్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. ఇది నవంబర్ 11 నుంచి 25 వరకు అందుబాటులో ఉంటుంది.
కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. వివిధ మార్కెట్ క్యాప్‌లు, రంగాలవ్యాప్తంగా ఇన్నోవేషన్ థీమ్ ద్వారా లబ్ధి పొందే సంస్థల సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పెట్టుబడుల వృద్ధికి ఈ ఫండ్ తోడ్పడుతుందని సంస్థ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ రాహుల్ సింగ్ తెలిపారు.
యాక్సిస్ క్రిసిల్–ఐబీఎక్స్ ఇండెక్స్ ఫండ్..
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తాజాగా యాక్సిస్ క్రిసిల్–ఐబిఎక్స్ ఎఎఎ బాండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్–సెప్టెంబర్ 2027 ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది క్రిసిల్–ఐబీఎక్స్ ఎఎఎ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్–సెప్టెంబర్ 2027లోని సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. నవంబర్ 21 వరకు ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment