నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్‌ | HDFC AMC launches tap based feature for mutual fund investments via WhatsApp | Sakshi
Sakshi News home page

నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్‌

Published Wed, Apr 2 2025 9:13 PM | Last Updated on Wed, Apr 2 2025 9:17 PM

HDFC AMC launches tap based feature for mutual fund investments via WhatsApp

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్ మేనేజ్‌మెంట్‌ వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌ ‘ట్యాప్2ఇన్వెస్ట్‌’ను ప్రవేశపెట్టింది. ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ ప్రస్తుత కేవైసీ-వెరిఫైడ్ ఇన్వెస్టర్లను వాట్సాప్‌లో క్లిక్ ఆధారిత ఇంటర్‌ఫేస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందని మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

టెక్ట్స్‌ కమాండ్లపై ఆధారపడే సాంప్రదాయ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి సేవల మాదిరిగా కాకుండా, ట్యాప్ 2ఇన్వెస్ట్ వాట్సాప్‌లో యూజర్ ఫ్రెండ్లీ, యాప్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు నేరుగా వాట్సాప్ (+91-82706 82706) ద్వారా  సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) ప్రారంభించవచ్చు. లేదా పెద్ద మొత్తం పెట్టుబడులను సైతం పెట్టవచ్చు.

యూపీఐ ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ పేమెంట్ ఆప్షన్లకు ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందని ఫండ్ హౌస్ తెలిపింది. వాట్సాప్ వంటి సుపరిచిత ప్లాట్‌ఫామ్‌లో ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిర్వహించడానికి ‘ట్యాప్2ఇన్వెస్ట్’ సురక్షితమైన మార్గాన్ని అందిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement