Sip
-
రూ.250కే జన్‌నివేష్ సిప్
ముంబై: తక్కువ మొత్తంతో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పరిష్కారం కొనుగొంది. జన్‌నివేష్ సిప్ పేరుతో రూ.250 నుంచి పెట్టుబడికి వీలు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ దీన్ని ప్రారంభించారు. రూ.250 సిప్ తనకు అత్యంత ఇష్టమైన స్వప్నాల్లో ఒకటని బుచ్ పేర్కొన్నారు. ఈ తరహా అతి స్వల్ప పెట్టుబడుల ఉత్పత్తులు లక్షలాది మందికి సంపద సృష్టిలో కీలకపాత్ర పోషిస్తాయన్నారు.‘భారత్ వృద్ధి చెందే క్రమంలో సంపద సృష్టి జరుగుతుంది. చిన్న మొత్తాల రూపంలో అయినా ప్రతి ఒక్కరికీ అందాలి. జన్‌నివేష్ అంటే నా దృష్టిలో అర్థం ఇదే’ అని మాధవి పేర్కొన్నారు. గతంలో బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థలు రూ.100, రూ.500 సిప్‌లు ప్రవేశపెట్టినప్పటికీ అధిక నిర్వహణ వ్యయాల కారణంగా వాటికి కొనసాగించలేకపోయినట్టు చెప్పారు. సూక్ష్మ సిప్‌లు ఆర్థికంగా లాభసాటి కావాలంటే, రెండేళ్లలోపే వాటికి సంబంధించి లాభం–నష్టంలేని స్థితి(స్టేబుల్‌గా ఉండేలా)ని సాధించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: పెట్రోలియం ధరల్లో హెచ్చుతగ్గులు‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సాయంతో రూ.250 సిప్ ద్వారా మొదటిసారి ఇన్వెస్టర్లు, అసంఘటిత రంగంలోని చిన్న మొత్తాల పొదుపరులను ఆకర్షించగలం’ అని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నందకిషోర్ ప్రకటించారు. అందరికీ ఆర్థిక సేవలను మరింత సమర్థవంతంగా చేరువ చేసే దిశగా తాము ఉత్పత్తుల అభివృద్ధి, ప్రక్రియలు, టెక్నాలజీలపై దృష్టి సారిస్తామని ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. యోనో యాప్‌తోపాటు పేటీఎం, జెరోదా, గ్రోవ్ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రతీ యూజర్ జన్‌నివేష్ సిప్‌ను పొందొచ్చని ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. -
సులభంగా రూ.కోటి సంపాదన!
స్టాక్ మార్కెట్ అంటే తీవ్ర ఒడిదొడుకులు సహజం. ఒక్క రోజులో సెన్సెక్స్, నిఫ్టీ(NIFTY) సూచీలు భారీగా నష్టపోతాయి. మరో రోజు అవి అంతే వేగంతో పైకి దూసుకుపోతాయి. ఇది సహజమే. దీర్ఘకాలిక లక్ష్యాలతో మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇలా సూచీల్లోని ఒడిదొడుకుల ప్రయోజనమే కలిగిస్తాయి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) చేసేవారికి ఇదో మంచి అవకాశంగా భావించాలి. మార్కెట్ ఎటు వైపు పయనిస్తున్నా మదుపు చేస్తూ వెళ్లడమే వీరికి లాభాలు పెరిగేలా చేస్తుంది. అసలు సిప్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.మార్కెట్ భారీగా పెరిగినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తం మదుపు చేయడం సరికాదు. అలాగని అలా పెరుగుతూ ఎక్కడి వరకు వెళ్తుందో స్పష్టంగా చెప్పలేం. ఒకవేళ తగ్గితే నష్టపోతామనే భయాలుంటాయి. కానీ సిప్ చేసేవారికి అలాంటి భయాలు ఉండకూడదు. ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి లాభాలు అందుకోవచ్చు. ఇదే సిప్ ఉద్దేశం. కొద్ది మొత్తంతో ప్రారంభించి, ఏటా కొంత శాతం పెంచుకుంటూ వెళ్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో డబ్బు కూడబెట్టవచ్చు.లక్ష్యంపై స్పష్టతఅసలు ఏ ఇన్వెస్ట్ చేసినా అది మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునేలా ఉండాలి. ఏ సమయంలో మనకు ఆ డబ్బు అవసరమో స్పష్టత ఉండాలి. దాన్ని సాధించేందుకు ఏం చేయాలి? అనే స్పష్టమైన ప్రణాళికతోనే సిప్‌ను ప్రారంభించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు కాలక్రమంలో మారిపోవచ్చు. మరింత అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ, కొన్నిసార్లు తమ అవసరానికి సరిపడా డబ్బు అందుకోకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తు ప్రణాళికలు, లక్ష్యాలపై స్పష్టమైన వైఖరి ఉండాలి. నష్టభయం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన పథకాన్ని ఎంచుకోవాలి. ఏ సమయంలో మదుపు చేస్తున్నాం అనేదానికంటే.. ఎంత కాలం కొనసాగుతున్నాం అనేది ముఖ్యం.కోటి సులభంగానే..మ్యూచువల్ ఫండ్ల(Mutual Funds)లో సిప్ ద్వారా రూ.కోటిని జమ చేయడం కష్టమేమీ కాదు. కానీ, అందుకు దీర్ఘకాలం మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.2,000తో సిప్ చేసిన ఫండ్ కనీసం 15 శాతం సగటు వార్షిక రాబడి వస్తుందని భావిస్తే రూ.కోటికి మించి జమ అయ్యేందుకు వ్యవధి 28 ఏళ్లు. అదే స్టెప్అప్(ఏటా సెప్ పెంచుకుంటూ వెళ్లే పద్ధతి) ద్వారా మరింత త్వరగానే ఈ లక్ష్యాన్ని చేరవచ్చు. -
నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
డబ్బు ఆదా చేయాలనుకుంటే.. అనేక మార్గాలు కనిపిస్తాయి. కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తే, మరికొందరు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకొందరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలను ఆర్జిస్తారు. ఈ కథనంలో నెలకు 10,000 రూపాయలు పెట్టుబడి పెడుతూ రూ. 7కోట్లు సంపాదించడం ఎలా? అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం.ఒక వ్యక్తి సిప్‌లో నెలకు రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే.. సంవత్సరానికి అతని పెట్టుబడి రూ.1.2 లక్షలు అవుతుంది. ఇలా 30 ఏళ్ళు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం రూ.36 లక్షలు అవుతాయి. మార్కెట్ ఆధారంగా 15 శాతం వార్షిక రాబడి వస్తే.. పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. దీంతో ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి అదనంగా రూ. 66 లక్షల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్, అదనంగా వచ్చిన మొత్తం డబ్బు కలిపితే రూ.7 కోట్ల కంటే ఎక్కువ డబ్బు వస్తుంది.ఇన్వెస్ట్ చేయాలనుకునే వ్యక్తి ముందుగానే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాలి. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే.. 50 ఏళ్ల నాటికి రూ.7 కోట్లు పొందవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే దీర్ఘకాలిక పెట్టుబడులలో మాత్రమే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉండ్తుంది.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటినోట్: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తుందని చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్‌ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్‌లో ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్‌ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు. -
రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
డబ్బు ఖర్చు పెట్టడం సులువు. అదే సంపాదించాలంటే కొంత కష్టపడక తప్పదు. కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో విలాసవంత వస్తువులు కొనుగోలు చేయడంకంటే ఆ డబ్బును పొదుపు చేసి మరింత డబ్బు సంపాదించాలని చాలామంది సూచిస్తున్నారు. ఈమేరకు పొదుపునకు సంబంధించి సౌరవ్దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. కేవలం రూ.20 వేలతో రూ.17 లక్షలు పోగుచేసే మార్గాన్ని సూచించారు. రవి అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఆ డబ్బు ఎలా సమకూరుతుందో వివరించారు.‘రవి అనే వ్యక్తి రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొనాలనుకున్నాడు. అందుకు ఐదేళ్లపాటు నెలవారీ రూ.20 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కారు వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి 2030 నాటికి దాని విలువ రూ.నాలుగు లక్షలు అవుతుంది. అంటే ఐదేళ్లలో అది రూ.ఆరు లక్షలు తగ్గిపోతుంది. అదే తన వద్ద ఉన్న రూ.20 వేలను రవి నిఫ్టీ ఈటీఎఫ్‌లో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 2030 నాటికి తన వద్ద ఏకంగా రూ.17 లక్షలు జమవుతాయి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతిలోనే ఉంటుంది’ అని సౌరవ్ పోస్ట్ చేశారు.₹20000/mo is the 5 year EMI of a 10L car for Ravi.Instead, Ravi puts ₹20000/mo for 5 years in Nifty ETF SIP.First decision gives him a car worth ₹4L in 2030.Second decision gives him ₹17L of bank balance in 2030.Life is about the choices we make.— Sourav Dutta (@Dutta_Souravd) October 15, 2024ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులుడిప్రిషియేషన్ అసెట్(కాలంతోపాటు విలువ తగ్గిపోయే వస్తువులు) కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్పా..దానివల్ల మనం వెచ్చించే డబ్బు కంటే అధిక లాభం ఉంటే తప్పా కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్వీడీ మార్కెట్, ఎఫ్డీ..వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. -
మెరుగైన రాబడులకు.. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్..
గడిచిన దశాబ్దకాలంగా దేశీయంగా మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో ఒకటిగా మారింది. ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ విస్తృతి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లకు (సిప్) ఆదరణ పెరుగుతుండటం మొదలైన సానుకూలాంశాలు ఇందుకు దోహదపడుతున్నాయి. గత పదేళ్లుగా ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. 2014లో మొత్తం ఏయూఎంలో (నిర్వహణలోని ఆస్తులు) వీటి పరిమాణం 2 శాతమే ఉండగా 2024 జూన్ నాటికి ఏకంగా 17 శాతానికి (మొత్తం ఏయూఎం రూ. 10,00,000 కోట్లకు పైగా ఉంటుంది) ఎగిసింది. ఇంత వేగంగా పరిశ్రమ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారిపోతున్న ఇన్వెస్టర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్నమైన ఉత్పత్తులు, కొత్త వ్యూహాలను ప్రవేశపెట్టడంపై అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహం తెరపైకి వచ్చింది. అధిక రాబడులనిస్తూ, రిస్కులను తగ్గిస్తూ, మెరుగైన డైవర్సిఫికేషన్ ప్రయోజనాలను అందించే విధంగా ఇది ఉంటుంది.సెక్యూరిటీస్‌లో అంతర్గతంగా మెరుగైన రాబడులు అందించే నిర్దిష్ట లక్షణాలను లక్ష్యంగా చేసుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. ఫ్యాక్టర్ ఫండ్స్ అనేవి భారత్‌లో ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్ ఫార్మాట్లో తక్కువ వ్యయాలతో అందుబాటులో ఉంటున్నాయి. నాణ్యత (క్వాలిటీ), విలువ (వేల్యూ), పరిమాణం (సైజ్), గతి (మూమెంటమ్), తక్కువ ఒడిదుడుకులు వంటి నిర్దిష్ట గుణాలపై ప్రధానంగా దృష్టి పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియోలను తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు, వేల్యూ ఇన్వెస్టింగ్ అనేది ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్లో ఒక భాగం. ఇది తక్కువ వేల్యుయేషన్లతో ఉన్న సెక్యూరిటీలను టార్గెట్ చేయడం ద్వారా ప్రయోజనాలను అందించేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే, మూమెంటమ్ ఇ న్వెస్టింగ్ అనే విధానం, ధర పెరుగుతున్న ట్రెండ్ ఆధారితమైనదిగా ఉంటుంది.సంపద సృష్టి: చారిత్రకంగా మార్కెట్‌ను మించి రాబడులు పొందడానికి తోడ్పడే నిర్దిష్ట గుణాలను లక్ష్యంగా పెట్టుకుని ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ పని చేస్తుంది. వివిధ మార్కెట్లు, అసెట్ క్లాస్‌లు, కాలవ్యవధులవ్యాప్తంగా ఇది పనిచేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ఫ్యాక్టర్లను ఉపయోగించడం ద్వారా ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను ఎలాంటి ఆరి్థక పరిస్థితుల్లోనైనా, మార్కెట్లో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా నిలదొక్కుకోగలిగేలా మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకోవచ్చు. పరిశోధనల ప్రకారం చారిత్రకంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మార్కెట్ బెంచ్‌మార్క్‌లను మించిన పనితీరు కనపర్చింది. సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో సంపద సృష్టించి ఇవ్వగలదు.రిస్క్ మేనేజ్మెంట్: వివిధ మార్కెట్ పరిస్థితుల్లో మెరుగ్గా రాణించే ఫ్యాక్టర్లను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా రిసు్కలను సమర్ధవంతంగా అదుపులో ఉంచుకునేందుకు ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ సహాయపడుతుంది. ఉదాహరణకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో, తక్కువ హెచ్చుతగ్గులకు లోనయ్యే స్టాక్స్ మెరుగ్గా ఉంటాయి. నష్టభారాన్ని తగ్గిస్తాయి. తీవ్ర ఒడిదుడుకులు ఉన్న పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోను స్థిరపర్చుకునేందుకు ఈ విధానం సహాయపడుతుంది.పారదర్శకత: మిగతా పాసివ్ ఫండ్స్ (ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్) తరహాలోనే ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు కూడా సాధారణంగా రూల్స్ ఆధారితమైనవిగా ఉంటాయి. అంటే, పెట్టుబడులను పెట్టేందుకు నిర్దిష్ట నిబంధనలను పాటిస్తాయి. పెట్టుబడి నిర్ణయాల వెనుక గల హేతుబద్ధతను అర్థం చేసుకునేందుకు, తమ పోర్ట్‌ఫోలియోలను సులభతరంగా పర్యవేక్షించుకునేందుకు, నిర్వహించుకునేందుకు ఇన్వెస్టర్లకి ఈ పారదర్శకత ఉపయోగకరంగా ఉంటుంది.డైవర్సిఫికేషన్: ఒకదానితో మరొక దానికి మరీ అధిక స్థాయిలో పరస్పర సంబంధం ఉండని వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది వైవిధ్యానికి సంబంధించిన ప్రయోజనాలను కల్పిస్తుంది. ఏదైనా ఒక ఫ్యాక్టర్ పనితీరు బాగా లేకపోతే పోర్ట్‌ఫోలియోలో దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది. రిస్కులకు తగ్గ మెరుగైన రాబడులను అందుకోవడానికి వివిధ ఫ్యాక్టర్లను కలిపి వాడే వ్యూహాన్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు ఉపయోగిస్తుంటారు.సౌలభ్యం: టెక్నాలజీ, డేటా వంటి అంశాల్లో పురోగతి కారణంగా ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మరింతగా అందుబాటులోకి వచ్చింది. ఫ్యాక్టర్ ఆధారిత వ్యూహాలను సులభతరంగా అమలు చేయడానికి సాధనాలు, ప్లాట్‌ఫాంలు వీలు కల్పిస్తున్నాయి. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది మెరుగైన రాబడులు అందించేలా, రిస్కులను నియంత్రించుకునేలా, తక్కువ వ్యయాలతో కూడుకున్న పెట్టుబడి సాధనాలను వినియోగించుకునేలా పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలు.. ఫ్యాక్టర్స్ కొన్నాళ్ల పాటు అండర్పెర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు వేల్యూ స్టాక్స్ అనేవి నిర్దిష్ట మార్కెట్ పరిస్థితుల్లో గ్రోత్ స్టాక్స్‌తో పోలిస్తే వెనుకబడొచ్చు. ఒకే ఫ్యాక్టర్‌లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఒకవేళ ఆ ఫ్యాక్టర్ పనితీరు సరిగ్గా లేకపోతే గణనీయంగా నష్టాలు రావచ్చు. తప్పిదాల వల్ల పనితీరు దెబ్బతినే అవకాశం ఉన్నందున, ఫ్యాక్టర్ ప్రీమియంలను కచ్చితంగా గుర్తించి, అందిపుచ్చుకోవాలంటే అధునాతన మోడల్స్, విస్తృతమైన డేటా విశ్లేషణ అవసరమవుతుంది. మార్కెట్ పరిస్థితులు గానీ ఇన్వెస్టర్ ధోరణి గానీ మారితే ఫ్యాక్టర్ వ్యూహాల సామర్థ్యాలపై ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఒకవేళ పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు అదే ఫ్యాక్టర్ వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టారంటే, ఫ్యాక్టర్ ప్రయోజనం తగ్గిపోవచ్చు. ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ వ్యూహాలు అమలు చేయాలనుకునే ఇన్వెస్టర్లు ఈ రిస్కులను దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. రిసు్కలను తగ్గించుకునేందుకు వివిధ ఫ్యాక్టర్లవ్యాప్తంగా డైవర్సిఫికేషన్ పాటించాలి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటే సహాయకరంగా ఉంటుంది. చదవండి: మిడ్‌క్యాప్ విభాగంలో మెరుగైన రాబడులు ఇలా!రిస్కు సామర్థ్యాలను బట్టి.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి లక్ష్యాలు, రిస్కు సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దిష్ట ఫ్యాక్టర్స్‌ను టార్గెట్‌గా పెట్టుకుని తమ పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకు అధిక రిస్కు సామర్థ్యాలున్న ఇన్వెస్టర్లు, మూమెంటమ్ లేదా సైజ్ వంటి ఫ్యాక్టర్లకు మరింత ఎక్కువగా కేటాయించవచ్చు. ఇవి మరింత ఎక్కువ ఒడిదుడుకులకు లోనైనా అధిక రాబడులనిచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. స్థిరమైన ఆదాయాన్ని కోరుకునే వారు నాణ్యమైన, తక్కువ ఒడిదుడుకులుండే ఫ్యాక్టర్లను ఎంచుకోవచ్చు. ఇక, గ్రోత్ కోరుకునే ఇన్వెస్టర్లు, వేల్యూ అలాగే మూమెంటమ్కి ప్రాధాన్యతనివ్వొచ్చు. అంతర్జాతీయంగా ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు కూడా దాదాపు ఇలాంటి ఫ్యాక్టర్ మేళవింపులనే ఎంచుకుంటూ ఉంటారు. చివరగా చెప్పాలంటే, ఫ్యాక్టర్ ఇన్వెస్టింగ్ అనేది అధిక రాబడులను అందించే నిర్దిష్ట చోదకాలను అందిపుచ్చుకునేందుకు ఉపయోగపడే ఒక విధానం. రిసు్కలను తగ్గించుకుని, అధిక రాబడులను అందుకునే అవకాశాలను ఇది కల్పిస్తుంది. అదే సమయంలో దీనిలో కూడా ఉండే కొన్ని రిస్కులను దృష్టిలో ఉంచుకుని, తమ వ్యక్తిగత ఇన్వెస్ట్మెంట్ ప్రొఫైల్‌ను బట్టి ఇన్వెస్టర్లు వ్యూహాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్యాక్టర్లను అర్థం చేసుకుని, జాగ్రత్తగా ఎంచుకోగలిగితే ఇన్వెస్టర్లు తమ ఆర్థిక లక్ష్యాలను మరింత సమర్ధమంతంగా సాధించుకోగలుగుతారు. -
‘సిప్’ సరికొత్త రికార్డు.. ఈ ఇన్వెస్ట్ మీరూ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: క్రమానుగత పెట్టుబడుల ప్రణాళిక (ఎస్ఐపీ– సిప్) పై ఇన్వెస్టర్ల భరోసా పెరుగుతోంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) సెప్టెంబర్ తాజా గణాంకాల ప్రకారం– సిప్‌లోకి సమీక్షా నెల్లో రికార్డు స్థాయిలో రూ.24,509 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.సిప్‌లోకి ఒకే నెలలో ఈ స్థాయి పెట్టుబడులు రావడం ఇదే తొలిసారి. క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక సంపద వైపు మళ్లుతున్న పెట్టుబడిదారుల సెంటిమెంట్‌ను ఈ పరిణామం తెలియజేస్తోందని ఏఎంఎఫ్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ చలసాని అన్నారు. కాగా, ఆగస్టులో సిప్‌లోకి వచ్చిన పెట్టుబడుల విలువ రూ.23,547 కోట్లు. ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.34,419 కోట్లు.. ఇక మొత్తంగా చూస్తే, ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు సెప్టెంబర్‌లో 10 శాతం (ఆగస్టుతో పోల్చి) పడిపోయి రూ.34,419 కోట్లుగా నమోదయ్యాయి. లార్జ్ క్యాప్, థీమెటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. అయితే ఈక్విటీ ఫండ్స్‌లోకి నికర పెట్టుబడులు సుస్థిరంగా 43 నెలలుగా కొనసాగుతుండడం సానుకూల అంశం. మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్ల విశ్వాసానికి ఇది అద్దం పడుతోందని సంబంధిత వర్గాలు పేర్కొంన్నాయి. ఇక ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ ఆగస్టులో రూ.66.7 లక్షల కోట్లు ఉంటే, సెప్టెంబర్‌లో రూ.67 లక్షల కోట్లకు ఎగసింది. -
స్మార్ట్ సిప్ ఎంపిక సరైనదేనా..?
ఈక్విటీ మార్కెట్ ఎప్పటికప్పుడు నూతన గరిష్టాలను నమోదు చేస్తోంది. కనుక స్మార్ట్ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? - నియతి దూబేరెగ్యులర్ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)కు వినూత్నమైనవే స్మార్ట్ సిప్‌లు. ఇవి ఎలా స్మార్ట్ అంటే.. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం కాకుండా మార్కెట్ తీరు ఆధారంగా వ్యవహరిస్తాయి. కొన్ని అంశాల ఆధారంగా మార్కెట్లు ఖరీదుగా ఉన్నాయా? లేక చౌకగా ఉన్నాయా..?ఎలా ఉన్నాయన్నది చెప్పే ఆల్గోరిథమ్ (సాఫ్ట్వేర్) వాటికి ఉంటుంది.మార్కెట్ల విలువ చాలా ఖరీదుగా ఉన్నట్టు ఆల్గోరిథమ్ భావిస్తే ఇన్వెస్టర్ నుంచి వచ్చే సిప్ మొత్తాన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, కొంత మొత్తాన్నే కేటాయిస్తాయి. ఉదాహరణకు ప్రతి నెలా ఒక ఇన్వెస్టర్ నుంచి రూ.1,000 సిప్ రూపంలో వస్తుంటే, అందులో కొంత స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి, మిగిలిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్ (డెట్ ఫండ్)లోకి మళ్లిస్తాయి. మళ్లీ స్టాక్స్ విలువలు దిగొచ్చినప్పుడు తిరిగి ఎక్కువ మొత్తాన్ని స్టాక్స్‌కు, తక్కువ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌కు కేటాయిస్తుంటాయి.స్మార్ట్ సిప్‌లు అంటే ఈక్విటీ, డెట్ పెట్టుబడుల కలబోతగా ఉంటాయి. స్మార్ట్ సిప్‌లు ఇలానే పనిచేస్తుంటాయి. ఇది విజయాన్నిచ్చే విధానం. ఈక్విటీలు ఖరీదుగా ఉన్నప్పుడు తక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసి, ఎక్కువ మొత్తాన్ని డెట్ ఫండ్ రూపంలో ఉంచుకోవడం, మార్కెట్లు చౌకగా మారినప్పుడు దీనికి విరుద్ధంగా వ్యవహరించడం ఇందులో కనిపిస్తుంది. కానీ వాస్తవికంగా చూస్తే మార్కెట్లు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తాయో కచ్చితంగా అంచనా వేయడం కష్టం.ఎవరూ కూడా నిరాటంకంగా ఈ విషయంలో కచ్చితత్వంతో వ్యహరించలేరు. మార్కెట్ల గమనాన్ని కచ్చితంగా అంచనా వేయలేని పరిస్థితికి ముందు నుంచి ఉన్న సిప్ నిజానికి ఒక పరిష్కారం. ఈ విధానంలో మార్కెట్లు ఖరీదుగా ఉన్నా, చౌకగా ఉన్నా సరే ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఖరీదుగా ఉన్నప్పుడుకొన్ని యూనిట్లు వస్తే, మార్కెట్లు పడిపోయినప్పుడు అంతే సిప్‌తో ఎక్కువ యూనిట్లు లభిస్తాయి. మార్కెట్లగమనం, అంచనా రిస్క్‌ను అధిగమించేందుకు ఇదే మెరుగైన పరిష్కారం. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వె స్ట్ చేసుకుంటూ, దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందు కు ఇది వీలు కల్పిస్తుంది. కనుక రెగ్యులర్ సిప్‌లను ఎంపిక చేసు కోవాలన్నదే మా సూచన.ఇండెక్స్ ఫండ్ ఎంపిక చేసుకునే విషయంలో ఎలాంటి అంశాలను పరిశీలించాలి? -లలావత్ రాములుఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం సులభమే. ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ ఈ రెండు అంశాలపై దృష్టి సారించాలి. ఇందులో ఎక్స్పెన్స్ రేషియో కీలకమైనది. ఇది ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ నుంచి వసూలు చేసే నిర్ణీత చార్జీ. ఇది తక్కువగా ఉంటే దీర్ఘకాలంలో ఎక్కువ రాబడులకు వీలుంటుంది.ఉదాహరణకు ఒక ఫండ్ 0.10 శాతం, మరో ఫండ్ 0.25 శాతం వసూలు చేస్తుంటే.. ఈ రెండింటిలో మొదటి పథకంలో ఎక్కువ రాబడులు వస్తాయి. ట్రాకింగ్ ఎర్రర్ అనేది ఒక పథకం పనితీరుకు, బెంచ్‌మార్క్ సూచీ రాబడులను మధ్య ఉన్న వ్యత్యాసం.ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉంటే, పథకం పనితీరు సూచీలకు తగిన స్థాయిలోనే ఉందని అర్థం. అలాంటి పథకం ఇన్వెస్టర్లకు అనుకూలం. ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో తక్కువ ఎక్స్పెన్స్ రేషియో, పరిమిత ట్రాకింగ్ ఎర్రర్ ఉన్న పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఎక్కువ రాబడులకు అవకాశం ఉంటుంది.ధీరేంద్ర కుమార్ -సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులుసిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లుపెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)థీమ్యాటిక్ అదుర్స్ రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి. -
పెట్టుబడులు సిప్ చేస్తున్నారు
న్యూఢిల్లీ: ఆర్థిక పరిస్థితులపై సానుకూల అంచనాల నేపథ్యంలో క్రమాణుగత పెట్టు బడులు (సిప్) 2023–2024లో రూ. 2 లక్షల కోట్ల రికార్డ్ స్థాయికి చేరాయి. 2022–2023తో పోలిస్తే ఇది 28% అధికం. ఫండ్స్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2016–17లో రూ. 43,921 కోట్లుగా ఉన్న సిప్ పెట్టుబడులు 2022–23 నాటికి రూ. 1.56 లక్షల కోట్లకు చేరాయి. ఇవి 2020–21లో రూ. 96,080 కోట్లుగా, 2021–22లో రూ. 1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు, గతేడాది మార్చి నెలలో సిప్ల రూపంలో రూ. 14,276 కోట్లు రాగా ఈ ఏడాది మార్చిలో 35 శాతం వృద్ధి చెంది ఆల్–టైమ్ గరిష్ట స్థాయి రూ. 19,270 కోట్లు వచ్చాయి. ఫిబ్రవరి, మార్చిలో వరుసగా రెండు నెలల పాటు సిప్ పెట్టుబడులు రూ. 19,000 కోట్ల మార్కును దాటాయి. -
అదిరిపోయే లాభాలు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్
-
కోటీశ్వరులు కావాలనుందా..?
దేశీయ స్టాక్‌మార్కెట్లు జీవితకాల గరిష్ఠాలను చేరుతున్నాయి. దాంతో చాలా మంది మదుపరుల సంపద ఎన్నోరెట్లు పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లో నేరుగా డబ్బు ఇన్వెస్ట్ చేసేవారి కంటే కొంత సేఫ్‌గా ఉండే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే చిన్న మొత్తాల పొదుపుతో కోటీశ్వరులుగా మారే అసలైన ఫార్ములాను ఈ కథనంలో తెలుసుకుందాం. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ లేకుండా సంపద రెట్టింపు కావాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఎక్కువ మంది ఎస్ఐపీ(క్రమానుగత పెట్టుబడులు)లను ఎంచుకుంటారు. పైగా దీర్ఘకాలం పెట్టుబడి పెట్టేవారు దీని నుంచి మెరుగైన రాబడులను అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు నిర్వహించటం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా మంచి వెల్త్ సృష్టించవచ్చు. మ్యూచువల్‌ఫండ్‌లో చాలా మంది పెట్టుబడులు పెడుతూంటారు. తోచినంత మదుపుచేస్తూ దీర్ఘకాల కోరికల కోసం కష్టపడుతుంటారు. అందులో ఒకొక్కరి ఆసక్తులు ఒక్కోలా ఉంటాయి. అయితే కోటి రూపాయల టార్గెట్ అందుకోవటానికి మాత్రం ఒక నియమాన్ని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే 15*15*15 స్ట్రాటజీ. దీనికి అర్థం..నెలకు రూ.15,000 చొప్పున.. 15 ఏళ్ల పాటు.. 15 శాతం రాబడి అందించే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వరులుగా మారవచ్చు. ఇందులో దాగిఉన్న కాంపౌండింగ్ ఫార్మాలాతో కార్పస్ జనరేట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సామాన్యులను సైతం కోటీశ్వరులుగా మారేందుకు రోజుకు రూ.500 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడిగా పెడితే సరిపోతుందన్న మాట. ఇదీ చదవండి: టెస్లా యూనిట్‌కు సర్వం సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం..? ఇన్వెస్టర్లు క్రమం తప్పకుండా 15 ఏళ్లపాటు కొనసాగించే పెట్టుబడిపై 15 శాతం చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపితే రూ.75 లక్షలు అవుతుంది. ఇదే సమయంలో ఇన్వెస్టర్ పెట్టుబడి రూపంలో మెుత్తంగా రూ.27 లక్షలు పెడతారు. దాంతో మొత్తం 15 ఏళ్ల తర్వాత రాబడి రూ.1.02 కోట్లకు చేరుకుంటుంది. -
రూ.1000ల పెట్టుబడితో రూ.34.9 లక్షలు లాభం!
డబ్బును డబ్బే సంపాదిస్తుంది. అందుకే మన జేబులో డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతుంటాం. పెట్టుబడులు పెట్టేందుకు ఇళ్లు, బాండ్స్, బంగారం, స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి సాధానాలు ఉన్నాయి. అయితే ఈ పద్దతుల్లో డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టాలంటే మన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండాలి. అలా కాకుండా రోజు వారి దిన సరి కూలీల్ని సైతం లక్షాది కారుల్ని చేసే పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీరు ఎంచుకున్న పద్దతిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ తరహాలో ఇది బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేస్తుంది. అంటే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఎంపిక చేసుకుని అందులో నెలకు కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దానిపై అసలు, ప్లస్ వడ్డీని టెన్యూర్ ముగిసే సమయానికి పొందవచ్చు. నెలకు రూ.1000 చొప్పున అలాంటిదే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఉదాహరణకు రాము అనే దినసరి కూలి నెలకు రూ.1000 చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినట్లైతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఫలితంగా అసలు పెట్టుబడి రూ.3.6 లక్షలైతే.. నిర్ణీత గడువు ముగిసే సమాయానికి వచ్చేది రూ.34.9లక్షలు. రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది ఒకవేళ అదే రాము 20 సంవత్సరాలు పాటు నెలకు రూ.1000 పెట్టుబడిగా పెడితే ఆ మొత్తం రూ. 2,40,000 అవుతుంది. గడువు ముగిసే సమయానికి వచ్చే మొత్తం రూ. 9.89 లక్షలు. అదే 10ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ.1,20,000 అవుతుంది. ఆ మొత్తం కాస్త గడువు ముగిసే సమయానికి రూ. 2,30,038 అవుతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం పిల్లల చదువుకోసం, పెళ్లిళ్ల కోసం ఇతర అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడిలు పెట్టి భారీ మొత్తంలో డబ్బుల్ని ఆదా చేయండి. -
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
గణేషుడు నేర్పే పెట్టుబడి పాఠాల గురించి మీకు తెలుసా?
విఘ్నాలను తొలగించే వినాయకుడు ఆధ్యాత్మికంగానే కాకుండా మనం ఆర్థికంగా, పెట్టుబడులపరంగా కూడా ఎలా మసలుకోవాలో పాఠాలు నేర్పుతాడు. ఆయన గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన ఏనుగు తల జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. పెద్ద చెవులు దేన్నైనా ఏకాగ్రచిత్తంతో వినాల్సిన ఆవశ్యకతను సూచిస్తాయి. ఆయన శరీరం బలాన్ని, శక్తిని అలాగే ఆయన వాహనమైన ఎలుక.. నమ్రతను ప్రతిబింబిస్తాయి. వినాయకుడి విగ్రహం చూస్తే ఒక దంతం విరిగి ఉంటుంది. పురాణాల ప్రకారం వేద వ్యాస మహర్షి, మహాభారతాన్ని రచించాలని సంకల్పించినప్పుడు .. తనకు వచ్చే ఆలోచనలను అంతే వేగంగా అక్షరబద్ధం చేయగలిగే వారు ఎవరు ఉన్నారని అన్వేషించాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని మహాగణపతిని కోరాడు. వినాయకుడు ఒక సాధారణ పక్షి ఈకతో రాయడానికి ఉపక్రమించగా, అది మధ్యలో విరిగిపోయింది. కానీ, మొదలుపెట్టిన పనిని మధ్యలో ఆపడానికి ఇష్టపడక, ఆయన తన దంతాన్ని విరిచి, దానితో రాయడాన్ని కొనసాగించాడని ప్రతీతి. ఆయన నిబద్ధత, అంకితభావం కారణంగానే మనకు అమూల్యమైన మహాభారతం లభించింది. నిలకడతత్వం, అంకితభావంతో ఎలాంటి అవాంతరాలనైనా అధిగమించవచ్చని ఈ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. సాధారణంగా పెట్టుబడుల విషయంలోనూ, జీవితంలోనూ మనం ఎన్నింటినో చాలా ఆసక్తిగా ప్రారంభిస్తాం. కానీ ఏదైనా చిన్న అవాంతరం ఎదురుకాగానే వెంటనే విరమించుకుంటాం. ఉదాహరణకు, ఈ ఏడాది కచ్చితంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తీర్మానించుకుని, ప్రతి ఏడాది జనవరి 1న జిమ్ మెంబర్షిప్ తీసుకుంటాం. కానీ మళ్లీ దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోతాం. ఫిట్నెస్ లక్ష్యాన్ని అటకెక్కిస్తాం. పెట్టుబడుల విషయంలోనూ అలాగే చేస్తుంటాం. ఏదో ఆర్థిక లక్ష్యం పెట్టుకుని పెట్టుబడుల ప్రస్థానం మొదలెడతాం. కానీ మార్కెట్లు ఏకాస్త ఒడిదుడుకులకు లోనైనా, పడిపోయినా వెంటనే మన సిప్‌లను ఆపేస్తాం. అంతేగాకుండా ముందుగానే మన పెట్టుబడులను వెనక్కి కూడా తీసేసుకుంటాం. సిప్‌లను మధ్యలోనే ఆపేయడం వల్ల మనకు రావాల్సిన ప్రయోజనాలు దక్కవు. అలా కాకుండా మిగతా సమస్యలు ఎన్ని ఎదురైనా మనం జిమ్‌కు మానకుండా వెళ్లడం కొనసాగించినా లేదా మార్కెట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పెట్టుబడులను కొనసాగించినా ఎలాంటి ఫలితాలు వచ్చి ఉండేవి? దీనిపై స్పష్టత కోసం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మార్కెట్లు పడిన వెంటనే ఎవరైనా తమ పెట్టుబడులను మధ్యలోనే ఆపేస్తే ఏం జరుగుతుంది, ఆపకుండా కొనసాగించి ఉంటే ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. 2018 సెప్టెంబర్ 1 నుంచి రాము ప్రతి నెలా రూ. 2,000 చొప్పున సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ప్రారంభించాడు. అయితే, 2020 మార్చిలో ఈక్విటీ మార్కెట్లు గణనీయంగా పడిపోయాయి. అలాంటప్పుడు అతను తన పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకుని ఫిక్సిడ్ డిపాజిట్లలో పెట్టి ఉంటే ఏమై ఉండేది? అలా చేయకుండా పెట్టుబడులను కొనసాగించి ఉంటే ఎలా ఉండేది? ఒకసారి పరిశీలిద్దాం. (ఇందుకోసం నిఫ్టీ 50 టీఆర్ ఇండెక్స్‌ను ప్రామాణికంగా తీసుకుందాం.) 2023 ఆగస్టు 31 నాటి డేటా ప్రకారం మూలం:ఎన్ఎస్ఈ సూచీలు, ఎస్బీఐ వెబ్సైట్, అంతర్గత రీసెర్చ్ ఏ తుది మొత్తాన్ని 28–03–2020 నుంచి 3 ఏళ్లకు లెక్కించేందుకు ఎస్బీఐ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు (5.7 శాతం) పరిగణనలోకి తీసుకున్నాం. చూశారుగా, 2020లో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ రాము తన సిప్‌ను కొనసాగించి ఉంటే ఇప్పుడది సుమారు రూ. 1.76 లక్షలు అయి ఉండేది. సంపద సృష్టిలో నిలకడగా వ్యవహరించడం ఎంత ముఖ్యమైనదో తెలుసుకోవడానికి ఇదో చిన్న ఉదాహరణ. కాబట్టి మిగతా పనులెన్ని వచ్చి పడినా జిమ్‌కు వెళ్లడం కొనసాగించి ఉన్నా, లేక మార్కెట్ హెచ్చుతగ్గులకు వెరవకుండా పెట్టుబడులను కొనసాగించి ఉన్నా ఏం జరిగి ఉండేది? మనం మరింత ఫిట్‌గా, మరింత ఆరోగ్యంగా ఉండేవాళ్లం. దీన్ని దృష్టిలో ఉంచుకుని మన పెట్టుబడుల విషయంలో జై గణేశా అంటూ ముందుకు సాగుదాం! -
వర్షం మధ్య దాహార్తి తీర్చుకుంటున్న పులి.. అలరిస్తున్న అరుదైన వీడియో!
జూపార్కులో సఫారీ చేసే సమయంలో పులి కనిపించడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. అయితే ఊహించని రీతిలో సఫారీలో ఉన్న పర్యాటకులకు పులి ఎదురైతే ఇక వారి ఆనందానికి హద్దులుండవు. ఇలాంటి సందర్భాల్లో తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఐఎఫ్ఎస్ అధికారి రమేష్ పాండే తన ట్విట్టర్ అకౌంట్లో ఇటువంటి క్లిప్నే షేర్ చేశారు. కర్నాటకలోని నేషనల్ పార్కులో కనిపించిన పులికి సంబంధించిన క్లిప్ అది. ఈ వీడియో బందీపూర్ నేషనల్‌పార్కులో షూట్ చేశారు. వీడియోలో ఒక పులి భారీగా వర్షం కురుస్తున్న సమయంలో నీరు తాగుతూ కనిపిస్తుంది. అది ఎంత సావధానంగా నీరు తాగుతున్నదో ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ అరుదైన వీడియో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటోంది. వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకులను కలిపిన భారీ వరదలు.. 35 ఏళ్ల క్రితం వేరయి.. Tiger sighting in Monsoons. This comes from Bandipur. VC: FD Bandipur pic.twitter.com/OIgak01xV9 — Ramesh Pandey (@rameshpandeyifs) July 26, 2023 -
ఆర్థికమాంద్యం హెచ్చరికలున్నా.. భారతీయ యువత ‘సిప్’.. సిప్.. హుర్రే!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నా... మరోసారి ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నా.. దేశంలోని యువత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇందుకోసం వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్)ను ఎంచుకుంటున్నారు. ప్రతీ నెలా నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడాన్ని సిప్ విధానంగా పేర్కొంటారు. బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, రియల్ ఎస్టేట్, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో యువత ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో గడిచిన మూడేళ్లలో సిప్ ఖాతాల సంఖ్య రెట్టింపు కావడమే కాకుండా అదే స్థాయిలో నెలవారీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల కాలంలో సిప్ ఖాతాల సంఖ్య 82 లక్షలకు పైగా పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 ఏప్రిల్‌లో 5.39 కోట్లుగా ఉన్న సిప్ ఖాతాల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 6.21 కోట్లకు చేరాయి. అంటే సగటున ప్రతీ నెలా 10 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారు. భారీగా పెరిగిన ఇన్వెస్ట్మెంట్ దేశంలోని మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ జనవరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 14,28,43,642 కోట్లకు చేరితే అందులో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 6,73,774.80 కోట్లు ఉందంటే మనవాళ్లు సిప్ విధానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు గడిచిన మూడేళ్లుగా సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంలో కూడా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2020–21లో సగటున నెలవారీ ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 9,000 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు ఏకంగా రూ. 13,856.18 కోట్లకు చేరింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోందని ఆంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఎస్ వెంకటేష్ పేర్కొన్నారు. ఒక్క జనవరిలోనే కొత్తగా 23 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభం కావడం దేశీయ స్టాక్‌మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ స్టాక్ మార్కెట్ల పతనం తక్కువగా ఉండటానికి సిప్ పెట్టుబడులు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
పని వారి కోసం ‘సిప్’
ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్యోగ్’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది. రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం! -
స్టాక్ మార్కెట్ కంటే రిస్క్ తక్కువ..సిప్‌లోకి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
న్యూఢిల్లీ:ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన రూ.12,976 కోట్లను అధిగమించాయి. సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మార్కెట్ ర్యాలీల్లో, పతనాల్లోనూ పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుంది. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి రిస్క్ తగ్గుతుంది.దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పైగా నెలవారీ సంపాదనకు అనుగుణంగా ప్రణాళిక మేరకు, నిర్దేశిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ సానుకూలతలపై రిటైల్ ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, దీని రూపంలో వచ్చే పెట్టుబడులు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మే నెలలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు చొప్పున వచ్చాయి. ఏప్రిల్ నెలకు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ఏడు నెలల్లో రూ.87,000 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. ‘‘మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక రేట్ల పెంపునకు స్పందిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తులు, ఫోలియోల్లోనూ వృద్ధి ఉన్నట్టు చెప్పారు. అక్టోబర్ నెలలో కొత్తగా 9.52 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే నంబర్‌ను ఫోలియోగా పేర్కొంటారు. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య అక్టోబర్ చివరికి 5.93 కోట్లకు చేరింది. సిప్ రూపంలో స్థిరమైన పెట్టుబడుల రాక మన ఈక్విటీ మార్కెట్లలో కొంత స్థిరత్వానికి సాయపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీల్లోకి రూ.9,390 కోట్లు ఇక అక్టోబర్ నెలకు ఈక్విటీ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా 20వ నెలలోనూ (2021 మార్చి నుంచి) ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్టయింది. కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.14,100 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. మార్కెట్లలో అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి రూ.147 కోట్లు వచ్చాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.2,818 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని రకాల విభాగాలు కలిపి చూస్తే ఫండ్స్ పరిశ్రమలోకి అక్టోబర్‌లో రూ.14,047 కోట్లు వచ్చాయి. దీంతో ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.39.5 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ చివరికి ఇది రూ.38.4 కోట్లుగా ఉంది. -
బాహుబలి ‘సిప్’ ప్రతి నెలా రూ.12,000 కోట్లపైనే
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టే విషయంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఎంతో పరిణతి చూపిస్తున్నారు. ఇటీవలి కాలంలో మార్కెట్లలో అస్థిరతలతో సంబంధం లేకుండా ప్రతి నెలా నికర సిప్ పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉండడం దీన్నే సూచిస్తోంది. గత నాలుగు నెలలుగా నెలవారీ సిప్ పెట్టుబడుల రాక రూ.12,000 కోట్లపైనే నమోదవుతోంది. ఆగస్ట్‌లో సిప్ పెట్టుబడులు అత్యధికంగా రూ.12,693 కోట్లకు చేరాయి. ఒక నెలలో ఇదే గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవి. ఈ ఏడాది మే నెలకు రూ.12,286 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్ల చొప్పున సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో సిప్ పెట్టుబడులు రూ.61,258 కోట్లకు చేరాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. క్రమబద్ధమైన పెట్టుబడులు.. సిప్ ద్వారా ప్రతి నెలా పెట్టుబడులు పెట్టడం వల్ల మార్కెట్ల ర్యాలీల్లో పాల్గొనొచ్చు. అదే సమయంలో మార్కెట్లలో కరెక్షన్ల సమయంలోనూ కొనుగోలుకు అవకాశం లభిస్తుంది. ఏకమొత్తంలో పెట్టుబడికి ఈ వెసులుబాటు ఉండదు. అందుకని సిప్ రూట్లో పెట్టుబడుల వల్ల దీర్ఘకాలంలో అస్థిరతలను సులభంగా అధిగమించి రాబడులు పొందేందుకు వీలుంటుంది. ఈ వెసులుబాటే సిప్‌కు ఆదరణ పెంచుతోంది. వేతన జీవులు ప్రతి నెలా క్రమం తప్పకుండా సిప్ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సిప్ అన్నది పొదుపు అలవాటును ప్రోత్సహిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు (పెట్టుబడులు) 2022 మర్చి చివరికి రూ.5.76 లక్షల కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి రూ.6.4 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. వార్షికంగా సిప్ ఆస్తులు 30 శాతం మేర పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణ ఆస్తుల వృద్ధి కంటే ఇది రెండు రెట్లు అధికంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద నమోదైన మొత్తం సిప్ ఖాతాలు ఆగస్ట్ చివరికి 5.72 కోట్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ప్రధానంగా సిప్ పెట్టుబడులపైనే ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే 43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో రూ.64.935 కోట్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించగా, ఇందులో రూ.61,258 కోట్లు సిప్ రూపంలో రావడం దీన్నే తెలియజేస్తోంది. వచ్చే 18-24 నెలల్లో సిప్ ద్వారా ప్రతి నెలా వచ్చే పెట్టుబడులు రూ.20,000 కోట్లకు చేరతాయని భావిస్తున్నట్టు మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేటు వెల్త్ ఎండీ, సీఈవో ఆశిష్ శంకర్ పేర్కొన్నారు. -
వారం/నెల ‘సిప్’.. ఏది మంచిది?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచి్ఛకంగా ఉంటాయని తెలుసు. అది కూడా అధిక స్థాయిలో. భిన్న పథకాలను ఎంపిక చేసుకుని భిన్న కాలాలకు పోల్చి చూస్తే ఫలితాలు అంతే యాదృచ్ఛికంగా ఉంటాయి. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా చేస్తున్నాం కదా అని వాదించొచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ అమలు చేయాలి? అందుకే దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. సిల్వర్ ఈటీఎఫ్, సెన్సెక్స్/నిఫ్టీ ఇండెక్స్ మధ్య వ్యత్యాసాం ఏంటి? – అనూప్ సెన్సెక్స్ లేదా నిఫ్టీ అన్నవి స్టాక్ మార్కెట్లకు సంబంధించి ప్రధాన సూచీలు. నిఫ్టీ 50 స్టాక్స్‌తో, సెన్సెక్స్ 30 స్టాక్స్‌తో ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ అన్నవి ఈ సూచీల్లోని భిన్న కంపెనీల్లో వాటి వెయిటేజీకి తగ్గట్టు ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫథకాల్లో రాబడులు సూచీలకు సమానంగా ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో, ట్రాకింగ్ ఎర్రర్ అంశాల ఆధారంగా నికర రాబడుల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. సిల్వర్ ఈటీఎఫ్‌లు అన్నవి పెట్టుబడిదారుల నుంచి అందుకున్న మొత్తాన్ని వెండిపై పెట్టుబడిగా పెడతాయి. వెండి ధరల పెరుగుదలపై రాబడులు ఆధారపడి ఉంటాయి. రాబడుల నుంచి వ్యయాలను మినహాయించాల్సి ఉంటుంది. అలాగే, వెండి ధర, ఈటీఎఫ్ ధర మధ్య పనితీరు వ్యత్యాసం కూడా రాబడులపై ప్రభావం చూపిస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సిల్వర్ ఈటీఎఫ్ వెండిపై ఇన్వెస్ట్ చేస్తుందంతే. నా యవసు 72 ఏళ్లు. నేను ఈక్విటీ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సురక్షితమేనా? లేదంటే సంప్రదాయ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఎంపిక చేసుకోవాలాలా? – భాస్కర్ ఇది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ల అస్థిరతలను ఎదుర్కోవడంలో ఉన్న అనుభవం ఏ మేరకు? ఒకవేళ ఈక్విటీల్లో ముందు నుంచి ఇన్వెస్ట్ చేస్తూ మూడేళ్లకు పైగా అనుభవం ఉండి, మార్కెట్లలో ఎత్తు, పల్లాలను (ర్యాలీలు, దిద్దుబాట్లు) చూసి ఉన్నట్టయితే అప్పుడు అక్విటీ ఆధారిత ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చూడాల్సిన మరో అంశం మీకు కావాల్సిన ఆదాయ అవసరాలు. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం ఆదాయం కోరుకునేది కాకుండా, పెట్టుబడి అయితే అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడుల్లో ఎటువంటి అనుభవం లేకుండా, చేసే పెట్టుబడిపై ఆదాయం కోరుకుంటుంటే అప్పుడు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మార్కెట్లో మీకున్న అనుభవం, ఆదాయంపై మీ అంచనాల ఆధారంగానే ఎంపిక ఉండాలి. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వాల్యూ రీసెర్చ్) -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.25,077 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో డిసెంబర్ నెలలో ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో పెట్టుబడులు పెట్టారు. ఈక్విటీ ఫండ్స్ నికరంగా రూ.25,077కోట్లను ఆకర్షించాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడుల రాక కూడా బలంగా నమోదైంది. మల్టీక్యాప్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు రావడం వరుసగా పదో నెలలోనూ నమోదైంది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను తన పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. డిసెంబర్లో పెట్టుబడుల రాక గతేడాది జూలై తర్వాత అత్యధిక స్థాయిలో ఉంది. గతేడాది జూలైలో ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రూ.25,002 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి నుంచి ఈక్విటీ ఫండ్స్ నికరంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయి. ఈ కాలంలో మొత్తం రూ.1.1 లక్షల కోట్లు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. అంతకుముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని విభాగాల్లోకి.. ఈక్విటీల్లో దాదాపు అన్ని విభాగాలు పెట్టుబడులను ఆకర్షించాయి. మల్టీక్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.10,516 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.313 కోట్లుగా ఉన్నాయి. డెట్ విభాగం నుంచి నికరంగా రూ.49,154 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. 20 నూతన పథకాలను (ఎన్‌ఎఫ్‌వోలు) ఫండ్స్ సంస్థలు ప్రారంభించాయి. రూ.37.72 లక్షల కోట్లు 2021 డిసెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఇన్వెస్టర్ల ఆస్తుల విలువ (ఏయూఎం) రూ.37.72 లక్షల కోట్లకు చేరింది. నవంబర్ చివరికి ఈ మొత్తం రూ.37.34 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. సిప్ జోరు.. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిస్) ద్వారా డిసెంబర్లో రూ.11,305 కోట్లు ఈక్విటీల్లోకి వచ్చాయి. నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.11,005 కోట్లు. సిప్ ఖాతాలు కూడా 4.78 కోట్ల నుంచి 4.91 కోట్లకు పెరిగాయి. ‘‘క్రమానుగత పెట్టుబడులకు, సాధారణ వ్యక్తి సైతం క్రమశిక్షణగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు సిప్ ఆకర్షణీయ సాధనంగా మారింది’’ అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ అన్నారు. సిప్ రూపంలో మార్కెట్లలో అస్థిరతలను అధిగమించొచ్చని ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. సిప్ వల్ల పెట్టుబడుల వ్యయం సగటుగా మారుతుందని తెలిసిందే. -
క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా?
ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఆదా చేసుకోవచ్చా? మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే లాభాలపై పన్ను ఆదా చేసుకునే మార్గం ఉందా? –జగన్మోహన్ 2018 వరకు ఈక్విటీ పెట్టుబడులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదు. 2018లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో దీన్ని ప్రతిపాదించారు. ఏడాదికి మించిన దీర్ఘకాల పెట్టుబడులపై మూలధన లాభం రూ.లక్ష వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. అంతకుమించిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కనుక మీరు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే.. లాభం రూ.లక్ష వరకు ఉంటే విక్రయించుకోవాలి. లాభాలను కాపాడుకోవడానికి మార్గం ఇదే. నిర్ణీత కాలానికి మీ పెట్టుబడులపై పన్నుల్లేని లాభాలను సమకూర్చుకోవచ్చు. అంటే మినహాయింపుల పరిమితి మేరకు లాభం తీసుకుంటూ, తిరిగి ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం. కానీ, దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దన్నది నేనిచ్చే సలహా. మీరు 15–20 ఏళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఇదేమీ పెద్దదిగా అనిపించదు. ప్రతీ రూ.లక్ష లాభంపై ఆదా చేసేది కేవలం రూ.10,000. ఇంత చిన్న మొత్తానికి తలపోటు పని పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ ఇదేమీ శ్రమగా భావించడం లేదనుకుంటే లాభం రూ.లక్షకు చేరగానే వెనక్కి తీసుకోవచ్చు. క్రిప్టోల ఫండమెంటల్స్ విశ్లేషించడం ఎలా? ఈక్విటీ షేర్ల మాదిరిగా.. క్రిప్టోలను వాటి ఫండమెంటల్స్ (ఆర్థిక మూలాలు) ఆధారంగా విశ్లేషించే మార్గం ఏదైనా ఉందా? – పీఎం అన్నాదురై క్రిప్టో కరెన్సీలను వాటి మూలాల ఆధారంగా విశ్లేషించే మార్గమే లేదు. ఒక దేశం గురించి తెలుసుకోవడం ద్వారా కరెన్సీని విశ్లేషించగలరు. ఒక దేశంగా భారత్ మరిన్ని డాలర్లను కొనుగోలు చేయగలదు. లేదా విక్రయించగలదు. ఎందుకంటే మనం ఎక్కువగా దిగుమతులపై ఆధారపడుతున్నాం. ఎన్నో స్థూల ఆర్థిక వ్యత్యాసాలున్నా కానీ ఒక దేశ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కరెన్సీని విశ్లేషించుకోవచ్చు. క్రిప్టోలకు సంబంధించి విశ్లేషించేందుకు అటువంటి అంశాలేవీ లేవు. ఒకే ఇండెక్స్‌ను ట్రాక్ చేస్తున్నా కానీ వివిధ ఇండెక్స్ ఫండ్స్ ఎన్ఏవీల్లో వ్యత్యాసం ఎందుకు ఉంటుంది? – అశోక్ కుమార్ ఒక్కో పథకం ఒక్కో సమయంలో ప్రారంభం కావడం వల్లే ఈ అంతరం కనిపిస్తుంది. ఉదాహరణకు బీఎస్ఈ సెన్సెక్స్ ఆధారితంగా 2000 సంవత్సరంలో ఒక పథకం రూ.10 ఎన్ఏవీతో ప్రారంభమై ఉంటే.. సెన్సెక్స్ పనితీరు ఆధారంగా ఇప్పుడు అదే పథకం ఎన్ఏవీ ఎన్నో రెట్లు పెరిగి ఉంటుంది. ఒకవేళ ఏడాది క్రితం ప్రారంభమైన సెన్సెక్స్ ఆధారిత పథకం ఎన్ఏవీ రేటు భిన్నంగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్ ఎన్ఏవీ అన్నది ఇక్కడ కీలకం కాదు. మీరు పెట్టుబడులు పెట్టిన తర్వాత సంబంధిత పథకం రాబడి రేటు.. ఇండెక్స్ రాబడికి అనుగుణంగా ఉందా, లేదా అన్నదే చూసుకోవాలి. సిప్‌లు అన్నింటికీ ఒకటే తేదీ ఉండడం సరైనదేనా? నేను ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ప్రతీ నెలా మొత్తం మీద రూ.లక్ష ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇలా పదేళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలన్నది నా ప్రణాళిక. తద్వారా రిటైర్మెంట్ కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఐదు మ్యూచువల్ ఫండ్స్ పథకాలకూ సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) తేదీ 15వ తేదీనే ఉంది. ఇలా ఉంటే ప్రతికూలమా? – విష్ణు కుమార్ మీ పెట్టుబడులను ప్రణాళికకు అనుగుణంగా కొనసాగించుకోండి. ప్రతీ నెలా అనుకున్నట్టుగానే, అనుకున్న రోజున నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లేలా చూసుకోండి. పెట్టుబడి కొనుగోలు వ్యయం సగటుగా మారడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మెరుగైన ఫలితాన్నిస్తుంది. ఐదు మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లకు నెలలో భిన్నమైన తేదీలను నిర్ణయించుకోవడం అన్నది క్లిష్టమైనది. కనుక అన్నింటికీ ఒక్కటే తేదీ సిప్‌గా ఉండడం ప్రతికూలమేమీ కాదు. - ధీరేంద్ర కుమార్ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్) చదవండి: ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు వచ్చే స్కీమ్స్ ఇవే -
‘సిప్’కి జై కొడుతున్నారు
ముంబై: ఇంతకాలం చిట్టీలలో పొదుపు చేస్తూ, రియల్ ఎస్టేట్ వెంచర్లలో పెట్టుబడిగా పెట్టిన వారు తమ రూటు మార్చుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. నెలవారీ చెల్లింపులు చేసే అవకాశం ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు క్రమంగా పెరుగుతున్న ఆధారణ ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. పెరిగిన ఆసక్తి కరోనా సంక్షోభం తర్వాత పొదుపు, పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపుగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. ఇదే సమయంలో ఇంటర్నెట్ వాడకం కామన్ అయ్యింది. దీంతో టెక్నాలజీని వాడుకుంటూ తమ వద్ద ఉన్న కొద్ది మొత్తాలను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా మార్చేందుకు రిస్క్ తీసుకుంటున్నారు. అయితే స్టాక్ మార్కెట్లో ఇంట్రా డే ట్రేడింగ్‌లో రిస్క్ ఎక్కువ, అయితే తక్కువ పెట్టుబడితో బ్లూ చిప్ కంపెనీల్లో షేర్ల కొనుగోలు కష్టంగా. దీంతో తక్కువ రిస్క్ కోరుకునే వారు మ్యూచ్‌వల్ ఫండ్స్‌కి మొగ్గు చూపేవారు. అయితే ఆగస్టులో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గాయి. కేవలం రూ.8,666 కోట్ల రూపాయలే వచ్చాయి. అంతకు ముందు జులైలో ఈ మొత్తం రూ.22,583 కోట్లుగా నమోదు అయ్యింది. జోరుమీదున్న సిప్ నెలవారీగా చిట్టీలు కట్టినట్టు, ప్రతీ నెల ఈఎంఐలు చెల్లించినట్టు మ్యూచవల్స్ ఫండ్స్‌లో ప్రతీ నెల ఇన్వెస్ట్ చేయడాన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటారు. ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఒక సిప్‌ను ఎంచుకుంటే ప్రతీ నెలా కొంత మొత్తం మన అకౌంట్ నుంచి ఆయా కంపెనీలో పెట్టుబడిగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రస్తుతం సిప్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్క ఆగస్టులోనే సిప్‌కి సంబంధించిన అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏఎమ్యూ) విలువ రూ. 5.26 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది మొత్తం సిప్ ఏఎమ్యూ విలువ రూ.17.15 లక్షల కోట్లలో మూడో వంతుగా ఉంది. సిప్‌లపై చెల్లించే వడ్డీ ఆగస్టులో లైఫ్‌టైం హైకి చేరుకుని రూ.9,923 కోట్లుగా నమోదు అయ్యింది. ఆగస్టులోనే ఏకంగా 24.92 లక్షల కొత్త సిప్‌లు మొదలయ్యాయి. మెత్తంగా 4.32 కోట్ల సిప్‌లు ఉన్నాయి. సిప్‌లకు సంబంధించి అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో 53 లక్షల కొత్త ఖాతాలు ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో మ్యూచవల్ ఫండ్స్‌లో పెట్టుబడులు తగ్గినా సిప్‌లో ఖాతాలు పెరగడం వల్ల ఓవరాల్‌గా మ్యూచ్‌వల్ ఫండ్ మార్కెట్ పరిస్థితి మెరుగ్గానే ఉంది. 2021 ఆగస్టు నాటికి మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో పెట్టుబడులు 36.59 లక్షల కోట్లకు చేరుకుని ఆల్‌టైం హైని టచ్ చేశాయి. చదవండి: ఈక్విటీ మార్కెట్ల మద్దతు ఒక్కటే చాలదు -
బంగారం ఫండ్‌లో సిప్ చేయొచ్చా?
స్టాక్‌మార్కెట్ పతనాల్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై ఏ విధమైన ప్రభావం ఉంటుంది? – అమిత్ ఈక్విటీ మార్కెట్లు పడిపోయిన సందర్భాల్లో డెట్ ఫండ్స్‌పై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే స్థిరాదాయ పథకాల మార్కెట్ తీరుతెన్నులు భిన్నంగా ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం, ద్రవ్యోల్బణ రేట్లు డెట్ ఫండ్స్‌పై ప్రభావం చూపిస్తాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే వడ్డీ రేట్లు కూడా పెరిగిపోతాయి. దీనివల్ల బాండ్ల రేట్లపై ప్రభావం పడుతుంది. వడ్డీ రేట్లు తగ్గిపోతున్న సందర్భాల్లో బాండ్లపై రాబడులు పెరుగుతాయి. క్రెడిట్ నాణ్యత లేదా ఆయా బాండ్ల క్రెడిట్ రేటింగ్‌లు కూడా ప్రభావం చూపిస్తాయి. బలహీన ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కంపెనీలు సమస్యలను చూస్తున్నట్టయితే.. ఆయా కంపెనీలు బాండ్లపై వడ్డీ చెల్లింపులు చేయలేని పరిస్థితులు నెలకొంటే క్రెడిట్ రేటింగ్ క్షీణించడానికి దారితీస్తుంది. అది డెట్ ఫండ్స్‌పై ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత లిక్విడిటీ కూడా ముఖ్యమైన అంశం అవుతుంది. వ్యవస్థలో నగదు లభ్యత తగ్గినప్పుడు బాండ్లపై ప్రభావం ఉంటుంది. ఫిక్స్డ్ ఇన్కమ్ మార్కెట్‌పై ఈ అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయిని తెలుసుకోవాలి. బాండ్లలో రాబడులు తక్కువగా ఉన్న సమయంలో.. రిస్క్ తీసుకోవడం వల్ల అధిక రాబడులకు ఈక్విటీల్లో అవకాశం ఉంటుంది. కనుక వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతుంటారు. ఐదేళ్ల కాలానికి బంగారం ఫండ్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లో ఇన్వెస్ట్ చేయవచ్చా? – కౌశిక్ సాధారణంగా చెప్పుకోవాలంటే బంగారం ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలానికి బంగారాన్ని పెట్టుబడి సాధనంగా ఎంపిక చేసుకోకూడదు. ఎందుకంటే నిల్వ ఉండే విలువే కానీ.. పెట్టుబడిని వృద్ధి చేసేది కాదు. బాండ్స్ లేదా స్థిరాదాయ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒకరికి మీరు రుణం ఇచ్చినట్టు అవుతుంది. దానిపై మీకు ఊహించతగిన రాబడులు వస్తాయి. ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కంపెనీలో ఆ మేరకు వాటాలు పొందినట్టు అవుతుంది. కంపెనీ లాభాలు, డివిడెండ్లలో ఆ మేరకు వాటా లభిస్తుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చేదేమీ లేదు. ఇది ఉత్పాదకత సాధనం కాదు. అందుకనే దీర్ఘకాల పెట్టుబడుల విషయంలో బంగారానికి దూరంగా ఉండాలి. బంగారాన్ని ఈటీఎఫ్‌ల రూపంలో కలిగి ఉండడం మరో మార్గం. కానీ, దీనిపై ఎక్స్పెన్స్ రేషియో రూపంలో వ్యయాలను భరించాల్సి ఉంటుంది. పైగా డీమ్యాట్ ఖాతా లేకుంటే వీటిని కొనుగోలు చేసుకోవడం కుదరదు. సులభంగా కొనుగోలు చేసుకోవడానికి ఇదొక అడ్డంకి. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేసే బంగారం ఫండ్స్ కూడా ఉన్నాయి. కానీ, వీటిల్లో ఈటీఎఫ్‌ల కంటే ఎక్కువ చార్జీలుంటాయి. సౌర్వభౌమ బంగారం బాండ్ల (ఎస్‌జీబీలు) రూపంలో బంగారాన్ని కలిగి ఉండడం చక్కని మార్గం అవుతుంది. దేశీయ ఇన్వెస్టర్లకు ఇదొక ఆకర్షణీయమైన సాధనం. కొనుగోలు చేసుకోవడం సులభంగా ఉంటుంది. బ్యాంకు ద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. సెకండరీ మార్కెట్లోనూ అందుబాటులో ఉంటాయి. ఎస్‌జీబీలపై.. వార్షికంగా 2.5 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. బంగారం ధరల వృద్ధి, క్షీణతతో సంబంధం లేకుండా వడ్డీ చెల్లింపులు ఉంటాయి. బంగారం ధరల్లో మార్పునకు ఈ వడ్డీ రాబడి అదనం. కనుక దేశీయ ఇన్వెస్టర్లు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అందుకు ఎస్జీబీ ఒక్కటే మెరుగైన సాధనం అవుతుంది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వాల్యూ రీసెర్చ్ -
స్టాక్స్‌లో సిప్ చేయడం మంచిదేనా?
ప్రతీ రంగంలోనూ 5–10 శాతం పెట్టుబడులు చొప్పున పూర్తి వైవిధ్యంతో కూడిన పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చా? లేదంటే కొన్ని రంగాల్లోకి కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావాలా? ఇందులో మంచి విధానం ఏది? – విజయ్ జాదవ్ వైవిధ్యం పేరుతో అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టడం అన్నది అంత మంచి విధానం కాదు. మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ ఫోలియోలను పరిశీలించినట్టయితే.. వందల నుంచి వేల కోట్ల రూపాయిలను నిర్వహిస్తుంటారు. అయినప్పటికీ వారు అన్ని రంగాల్లోనూ ఇన్వెస్ట్ చేయరు. స్పష్టత, ఎంపికలన్నవి కీలకం అవుతాయి. ముందుగా పెట్టుబడులకు విలువైన స్టాక్స్‌ను గుర్తించడం సరైన విధానం అవుతుంది. రిటైల్ ఇన్వెస్టర్‌కు 10–15 స్టాక్స్‌తో కూడిన పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. బలమైన ఆర్థిక మూలాలతో, చక్కగా వృద్ధి చెందుతున్న కంపెనీలను ఎంపిక చేసుకోవాలి. దీర్ఘకాలానికి ఆయా కంపెనీలు సరైన ఎంపిక అవ్వాలంటే.. ఆయా కంపెనీలు ఆదాయాన్ని ఎలా సమకూర్చుకుంటున్నాయి తదితర అంశాలు కూడా తెలిసి ఉండాలి. ఇలా ముందు కంపెనీలను ఎంపిక చేసుకున్న తర్వాత రంగాల వారీ కేటాయింపులు చేసుకోవాలి. ఒకే రంగానికి ఎక్కువ కేటాయింపులు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే మ్యూచువల్ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయం అవుతాయి. స్టాక్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/నిర్ణీత కాలానికోసారి కొంత చొప్పున) రూపంలో పెట్టుబడులు పెట్టుకోవడం మంచి విధానమేనా? మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్‌తో పోలిస్తే ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటి? – దుర్గేష్ చూడ్డానికి ఈ రెండూ ఒక్కటే. ఈక్విటీ ఫండ్‌లో సిప్ మాదిరే షేర్లలో నేరుగా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఇందుకు మంచి కంపెనీని ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులను కొంత కాల వ్యవధి వరకు విస్తరించడం వల్ల రిస్క్, ఆందోళన తగ్గుతుంది. అయితే, స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే మీ పెట్టుబడులపై ఎప్పుడూ దృష్టి సారించి ఉండాలి. క్రమానుగతంగా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ కొంత వరకు చురుకైన నిర్వహణ విధానం అవసరమవుతుంది. సరైన సమయం, ఉత్సాహం ఉండి, వీటిన్నింటిని ఆస్వాదించేట్టు అయితే స్టాక్స్‌లో పెట్టుబడులకు మొగ్గు చూపొచ్చు. లేదంటే మంచి మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. పైగా ప్రతి నెలా మీ పెట్టుబడులు రూ.5,000–10,000 మధ్యే ఉంటే యాక్టివ్ ఇన్వెస్టర్‌గా ఉండడం వల్ల పెద్దగా వచ్చే లాభం ఉండదు. ఇటువంటి వారు మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టేవారు బ్యాలెన్స్డ్ ఫండ్ లేదా పన్ను ఆదా ఫండ్ (ఈఎల్ఎస్ఎస్)తో ప్రయాణాన్ని ప్రారంభించాలి. కనీసం రెండు, మూడేళ్ల పాటైనా పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగించాలి. దాంతో అస్థిరతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత రెండు నుంచి మూడు వైవిధ్యంతో కూడిన ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను ప్రారంభించొచ్చు. బ్యాలెన్స్డ్ ఫండ్‌లోని పెట్టుబడులను వీటిల్లోకి మళ్లించాలి. ఆ తర్వాత మరో రెండు, మూడేళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించాలి. ఇలా ఐదేళ్ల తర్వాత మార్కెట్లలో ఉద్దాన, పతనాలను అర్థం చేసుకుని, సర్దుబాటు చేసుకోవడం తెలిస్తే.. అప్పుడు కంపెనీ వార్షిక నివేదికలను అధ్యయనం చేయడం, మంచి స్టాక్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా అన్నది తెలుస్తుంది. స్టాక్ పడిపోయినా కానీ, మీకున్న కచ్చితమైన అవగాహన, విశ్వాసంతో పెట్టుబడులను కొనసాగించగలరు. అప్పుడే నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైనది. ఈక్విటీల్లో నేరుగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ మాత్రం నైపుణ్యాలు, అవగాహన అవసరం. పైగా ఇదంతా ఒకే విడత చేయకూడదు. నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులను 20–25 శాతంతో మొదలుపెట్టాలి. అలా ఏడాది పాటు చూడాలి. అంతా సక్రమంగానే ఉంటే అప్పుడు పెట్టుబడులను 50 శాతానికి పెంచుకోవాలి. అలా మరో ఏడాది పాటు కొనసాగించాలి. ఆ తర్వాత పెట్టుబడులను 75 శాతానికి పెంచుకోవాలి. ఈక్విటీ పెట్టుబడులను అర్థం చేసుకునేందుకు ఇదొక క్రమానుగత విధానం అవుతుంది. దీనివల్ల పెట్టుబడుల నిర్వహణ ఫీజులను (మ్యూచువల్ ఫండ్స్‌లో వసూలు చేసేవి) ఆదా చేసుకోవచ్చు. ఇలా ఐదేళ్ల ప్రణాళికకు బదులు వేగంగా డబ్బులు సంపాదించుకోవాలని చూస్తే.. అంతే వేగంగా నష్టాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగం కూడా ఆకర్షించొచ్చు. కానీ, అందులోకి ప్రవేశించొద్దు. చాలా రిస్క్ ఎక్కువ. ఒకవేళ అంతగా ఆకర్షిస్తే చాలా స్వల్పమొత్తానికే పరిమితం అవ్వాలి. - ధీరేంద్ర కుమార్, సీఈవో , వాల్యూ రీసెర్చ్ -
రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే కోట్లు వెనకేయవచ్చా?!
చేతిలో డబ్బులు ఉన్న ప్రతి ఒక్కరికి కోటీశ్వరులు కావాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికతో అవగాహన లేకుండా ఎక్కడంటే అక్కడ ఇన్వెస్ట్ చేసి డబ్బుల్నివృధా చేసుకుంటుంటారు.అదే ఒక ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే సంపన్నులయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందుకోసం భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రోజుకు రూ.100లెక్కన పెట్టుబడి పెడితే సరిపపోతుంది. అది ఎలా అంటారా? హైదరాబాద్‌లో నివసించే శేఖర్ అనే ఉద్యోగి భవిష్యత్ లో తన పిల్లల చదువులకు ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశంతో సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ పేరుమీద రోజుకు రూ.100 అంటే నెలకు రూ. 3వేలు తనకు తెలిసిన మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు. అలా 25 నుంచి 30ఏళ్ల పాటు డబ్బుల్ని సేవ్ చేశాడు. దీంతో తనపిల్లల చదువులు, పెళ్లిళ్లే కాదు రిటైర్మెంట్ తరువాత కూడా ఎలాంటి ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా కోటీశ్వరుడయ్యారు. ఉదాహరణకు శేఖర్ నెలకు రూ.3 వేలు.. 30 ఏళ్ల పాటు పొదుపుచేయగా వార్షిక రాబడి 15శాతంగా పరిగణలోకి తీసుకుంటే రూ.2.1 కోట్లు వస్తాయి.10 శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు వస్తాయి. 12 శాతం అయితే రూ.1.05 కోట్లు పొందొచ్చు. -
రిటైరైన వారు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కొనసాగించొచ్చా?
నా వయసు 53 సంవత్సరాలు. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాను. ఒక సలహా సంస్థ సూచనల ఆదారంగా రూ.15 లక్షలను నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. మరో రూ.15 లక్షలను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాను. పీపీఎఫ్, ఈపీఎఫ్ల్లోనూ రూ.50లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 2026లో నేను పదవీ విరమణ తీసుకుంటాను. ఆ తర్వాత కూడా ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించొచ్చా? -ఆర్కే గుప్తా, హైదరాబాద్ ఒక పెట్టుబడి సాధనంగా రిటైర్ అయిన తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించొచ్చు. మీరు ఈక్విటీల్లో రూ.30 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. మీ మొత్తం నిధి రూ.80 లక్షల్లో ఈక్విటీ పెట్టుబడులు 35–37 శాతంగా ఉన్నాయి. రిటైర్ అయిన వారు స్థిరమైన ఆదాయం, ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మించి దీర్ఘకాలిక రాబడుల కోసం ఈక్విటీలకు ఈ మాత్రం కేటాయింపులు చేసుకోవాలని మేము సాధారణంగా భావిస్తాము. ఆ విధంగా చూస్తే ఈక్విటీలకు మీరు చేసిన కేటాయింపులు చక్కగానే ఉన్నాయి. వాటిని కొనసాగించొచ్చు. కాకపోతే ఈక్విటీ కేటాయింపులు ఏ విధంగా చేశారన్నది ముఖ్యమైన అంశం అవుతుంది. ఒకవేళ మీ ఈక్విటీ కేటాయింపులు ఎక్కువగా మిడ్ అండ్ స్మాల్‌క్యాప్‌లో ఉంటే వెంటనే తగ్గించేసుకుని.. అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్ కంపెనీలకే పరిమితం కావాలని నా సూచన. ఒకవేళ మీరు ఇప్పటికే ఆ విధంగా చేసి ఉంటే సరైన నిర్ణయమే అవుతుంది. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును (ఎల్టీసీజీ) లెక్కించే సమయంలో ఇండెక్సేషన్ ప్రయో జనం అన్నది కేవలం డెట్ ఫండ్స్‌కే వర్తిస్తుందా..? ఈక్విటీలకు ఉండదా? -శివనందన, బెంగళూరు మీరు అడిగింది నిజమే. ప్రస్తుతం ఇండెక్సేషన్ ప్రయోజనం అన్నది డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను విషయంలోనే అందుబాటులో ఉంది. ఈక్విటీలకు లేదు. ఈక్విటీ పెట్టుబడులను ఏడాదికి మించి కొనసాగించినప్పుడు వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను పడుతుంది. డెట్ ఫండ్స్‌పై ఎల్టీసీజీ అంటే కనీసం మూడేళ్లు, అంతకుమించి పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో డెట్ ఫండ్స్‌పై వచ్చిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని (ఇండెక్సేషన్) మినహాయించిన తర్వాత మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇండెక్సేషన్ అన్నది మీ కొనుగోలు వ్యయాన్ని ద్రవ్యోల్బణంతో సర్దుబాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఉదాహరణకు మీరొక సెక్యూరిటీని రూ.100కు కొనుగోలు చేసి కొన్నేళ్ల పాటు కొనసాగించారనుకుంటే.. ఆ పెట్టుబడి కొనసాగించిన అన్నేళ్లలో రూ.100 విలువ కాస్తా ద్రవ్యోల్బణ ప్రభావం కలసి రూ.125కు చేరిందనుకుంటే.. అప్పుడు ఇండెక్సేషన్ వల్ల మీ కొనుగోలు వ్యయం రూ.100 కాకుండా రూ.125 అవుతుంది. కనుక ఇది మూలధన లాభాల పన్ను భారాన్ని తగ్గిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఈక్విటీలకు ఇండెక్సేషన్ ప్రయోజనం లేకపోయినప్పటికీ.. డెట్ ఫండ్స్‌తో పోలిస్తే పన్ను రేటు తక్కువ. ఇండెక్సేషన్ ప్రయోజనం మీకు అనుకూలిస్తుందా లేదా అన్నది ఎంత మేర మూలధన లాభాలు వచ్చాయి, ద్రవ్యోల్బణం రేటు, కొనసాగించిన కాలం వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. మూడేళ్ల క్రితం ఈక్విటీ ఆధారిత పొదుపు పథకం (ఈఎల్ఎస్ఎస్)లో సిప్ ప్రారంభించాను. మూడేళ్ల కాలం అన్నది 2021 మార్చితో ముగిసింది. ఇప్పుడు పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చా? అలాగే, నా వద్ద రూ.1.5లక్షలు ఉన్నాయి. వీటిని ఈఎల్ఎస్ఎస్లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేక ఏక మొత్తంలో చేసుకోవాలా? -రత్నాకర్, మెదక్ సిప్ రూపంలో ఈఎల్ఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే.. అప్పుడు ప్రతీ సిప్‌కు 36 నెలల కాలం (సిప్ పెట్టిన తేదీ నుంచి) లాకిన్ అమలవుతుంది. కనుక మీరు మీ పెట్టుబడిని వెనక్కి తీసుకోదలిస్తే అది మొదటి సిప్ వరకే అలా చేసుకోగలరు. ఆ తర్వాతి సిప్‌లకు 36 నెలల కాలం ఇంకా ముగిసిపోలేదు కనుక వాటిని ఉపసంహరించుకోలేరు. మీ వద్ద ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోతగిన మొ త్తం ఉన్నప్పటికీ.. సిప్ వల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. దీంతో మార్కె ట్లు ప్రతికూలంగా మారినా ఆందోళన ఉండదు. సిప్ ద్వారా కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవచ్చు. -
సిప్ రెట్టింపు చేసుకోండి!
ప్రస్తుత ఎకానమీ లేదా మార్కెట్ ప్రదర్శనను చూసి ఒక అంచనాకు రావద్దని, ప్రస్తుత వెనుకంజ నిజానికి పెట్టుబడులకు సరైన అవకాశమని ప్రముఖ అనలిస్టు ప్రశాంత్ జైన్ సూచిస్తున్నారు. 2020-21ని మర్చిపోయి తర్వాత సంవత్సరాలను మదింపు చేసుకోవాలన్నారు. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో సిప్ పెట్టుబడులు డబుల్ చేసుకోవడం ద్వారా మంచి ఆర్జన చూడొచ్చన్నారు. కరోనా సంక్షోభం కారణంగా జీడీపీ కుంచించుకుపోవడం సహజమేనని చెప్పారు. ఈ ఇబ్బంది కారణంగా కార్పొరేట్ లాభదాయకత బాగా దెబ్బతింటుందన్నారు. అయితే ఇదంతా సంక్షోభానంతరం కుదుటపడుతుందని, నిజానికి వర్ధమాన మార్కెట్లన్నింటిలో భారత్‌ది భిన్నగాధని చెప్పారు. శుక్రవారం దేశీయ జీడీపీ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ దఫా సహజంగానే జీడీపీ బాగా మందగించిఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా పలు బ్రోకరేజ్‌లు అంచనా వేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ఎగుమతులు, దిగుమతులు క్షీణించి తొలిసారి 10-12 సంవత్సరాల తర్వాత చెల్లింపుల శేషం(బాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) పాజిటివ్‌గా ఉంటుందని జైన్ అంచనా వేశారు. రాబోయే రోజుల్లో వడ్డీరేట్లు మరింత దిగివస్తాయన్నారు. 2021-22లో తిరిగి ఇండియా రెండంకెల వృద్ది సాధిస్తుదని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్లో వినిమయ రంగ స్టాకులపై పాజిటివ్‌గా లేనని, లాక్డౌన్ కారణంగా వినిమయం తగ్గిందని, ఈ నేపథ్యంలో వినిమయ స్టాకుల వాల్యూషన్లు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఆస్తుల నాణ్యత పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుంటే తిరిగి బ్యాంకింగ్ రంగం పుంజుకుంటుందన్నారు. -
సిప్ ఇన్వెస్ట్మెంట్లు ఆపొద్దు: ఫైనాన్షియల్ ప్లానర్స్
ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్)లను ఆపవద్దని మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం కోల్పోవడం, నెలవారి ఆదాయం గణనీయంగా తగ్గినప్పుడు మాత్రమే సిప్‌లలో ఇన్వెస్ట్మెంట్లు ఆపాలని వారు సూచిస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో తెలియక, ప్రస్తుత ఆర్థిక అనిశ్చితిలో చాలా మంది సిప్ఇన్వెస్టర్లు .. వేతనాల్లో కోత, నెలవారి ఆదాయాల్లో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వారు మాత్రమే ఫండ్ హౌస్ అధికారిక వెబ్‌సైట్‌గానీ, అధికారిక ఈ-మెయిల్ లోకి వెళ్లి తమ సిప్‌ను 3-6 నెలలపాటు వాయిదా వేయాలని కోరుతూ, ప్రారంభ, ముగింపు తేదీలను చెబుతూ పోలియో నంబరుతో రిజిస్టర్ చేసుకోవాలని మీరే అసెట్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ స్వరూప్ మొహంతి వెల్లడించారు. ఎవరికైతే త్రీవ ఆర్థిక సమస్యలు ఉన్నాయో వారు మాత్రమే సిప్‌ను నిలిపివేసే ఆప్షన్ ఎన్నుకోవాలన్నారు. ఈక్విటీ మార్కెట్లు దెబ్బతిన్నప్పటికీ సిప్ ఇన్వెస్టర్లకు ఎటువంటి నష్టం లేకుండా దీర్ఘకాలంలో పెట్టుబడి మొత్తం నగదు వెనక్కి వస్తుందని తెలిపారు. ఫైనాన్షియల్ ప్లానర్లు ఈ సదుపాయాన్నితొందరపాటుతో వినియోగించరాదని ఆయన హెచ్చరిస్తున్నారు. నెలవారీ ఆదాయంలో కోత ఉంటేనే సిప్‌ను నిలిపివేసే ఆప్షన్ తీసుకోవాలని స్వరూప్ స్పష్టం చేశారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా మార్కెట్లు వోలటాలిటీకి లోనవుతున్నాయి. దాన్ని చూసిన కొంతమంది ఇన్వెస్టర్లు సిప్‌లను ఆపాలని చూస్తున్నారని, ఇది సరైన నిర్ణయం కాదని పేర్కొన్నారు. మార్కెట్లు పతనమైనప్పుడు సిప్‌లలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటే కనిష్ట ధర వద్ద సగటు చేసే ప్రయోజనం కోల్పోతారని, తద్వారా ఇన్వెస్టర్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరని ఫైనాన్షియల్ ప్లానర్ విరాల్ భట్ అంటున్నారు. -
ఫండ్స్ ఎంపిక ఇలా కాదు..!
మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల వైపు నేడు ఎక్కువ మంది వేతన జీవులు మొగ్గు చూపుతున్నారు. దీర్ఘకాలంలో ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇవి అనుకూలమనే అవగాహన పెరుగుతోంది. అధిక రాబడులకు ఈక్విటీలు మెరుగైన సాధనంగా ఉండడంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి ప్రతి నెలా సగటున రూ.8,000 కోట్లపైనే సిప్ (క్రమానుగత పెట్టుబడులు) రూపంలో పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలనే ప్రాథమిక అవగాహన కొందరిలో ఉన్నప్పటికీ.. ఎంపిక విషయంలో పట్టిపట్టి చూడకూడని, అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది. జీవనశైలి, అవసరాలు, రిస్క్ తీసుకునే సా మర్థ్యం ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అలాగే, ఫండ్ పనితీరును కూడా ప్రామాణికంగా చూడాల్సి ఉం టుంది. నాణేనికి మరోవైపు అన్నట్టు ఫండ్స్‌లో పెట్టుబడులకు ఈ అంశాలను పెద్దగా పట్టించుకోకుండా, ఇతర ముఖ్య అంశాలపై ఆధారపడడం మంచిదని నిపుణుల సూచన. డివిడెండ్ డివిడెండ్ అధికంగా ఇస్తున్నాయని ఫండ్స్‌ను ఎంచుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే విధమైన డివిడెండ్‌ను పంపిణీ చేయాలన్న హామీ ఉండదు. ఉదాహరణకు మార్కెట్లు పడిపోతే, సంబంధిత ఫండ్ డివిడెండ్ పంపకాన్ని తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టి కోసమే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ, వస్తున్న లాభాన్ని ఎప్పటికప్పుడు డివిడెండ్ రూపంలో తీసేసుకోవడం మంచి ఆలో చన ఎంత మాత్రం కాదు. ఎందుకంటే లాభాన్ని తీసేసుకోవడం వల్ల పెట్టుబడి వృద్ధి చెందదు. పైగా ఇప్పుడు డివిడెండ్ పంపిణీపై ఈక్విటీ ఫండ్స్ అయితే 10% పన్ను పడుతోంది. అంటే ఈక్విటీల్లో దీర్ఘకాల మూలధన లాభాలపై 10% పన్నుమాదిరిగానే. కనుక డివిడెండ్ ఇస్తున్న వాటిని ఎంపిక చేసుకోవడం సూచనీయం కాదు. దీనికి బదులు అవసరమైనప్పుడు కొన్ని యూనిట్లను విక్రయించి అవసరాలు తీర్చుకోవడమే మంచిది. డెట్ ఫండ్స్‌లో అయితే డివిడెండ్ కోసం చూడడం అన్నది ఏ మాత్రం సరికాదు. దీనికంటే క్రమానుగత ఉపసంహరణ(ఎస్‌డబ్ల్యూపీ) అన్నది మరింత సమర్థవంతమైన టూల్ అవుతుంది. ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా నిర్ణీత సంఖ్యలో యూనిట్లను ఉపసంహరించుకోవడం ద్వారా అవసరమైన మేర పొందొచ్చు. దీనివల్ల పన్ను పరంగా కలిసొస్తుంది. అదే డెట్ ఫండ్స్‌లో డివిడెండ్ ఆశిస్తే, డివిడెండ్ పంపిణీ పన్ను కింద 29.12% పడుతుంది. ఇన్వెస్టర్ ఆదాయం ఏ స్లాబ్‌లో ఉందన్నదానితో సంబం ధం ఉండదు. కానీ, ఎస్‌డబ్ల్యూపీలో పెట్టుబడిపై ఆర్జించిన లాభం వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఏ పన్ను రేటులో ఉంటే ఆ మేరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో ఉపసంహరించుకునేది కొద్ది మొత్తమే ఉంటుంది కనుక పన్ను భారం అంతగా ఏమీ ఉండదు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని డెట్ ఫండ్స్‌లో ఆర్జనకు ముడిపెట్టి సర్దుబాటు చేసుకునే వీలూ ఉంది. ఫండ్స్ సంస్థ తెలియక్కర్లేదు.. మనలో చాలా మందికి కొన్ని బ్యాంకులంటే ఎక్కువగా పరిచయం, అనుబంధం ఉండి ఉంటుంది. కనుక తెలిసిన బ్యాంకుల నిర్వహణలోని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదని భావించే వారూ ఉన్నారు. కానీ, ఇది నిజం కానే కాదు. ఇటీవలి డెట్ ఫండ్ సంక్షోభంలో బ్యాంకుల మద్దతుగల ఎన్నో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు నష్టాలను ఎదుర్కొన్నాయి. పైగా వీటి ఈక్విటీ రాబడుల చరిత్ర కూడా అంత గొప్పగా లేదు. మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ రికార్డుకు స్థిరత్వం ఎంతో అవసరం. ఫండ్ మేనేజర్ ట్రాక్ రికార్డు కూడా ఇక్కడ కీలకం అవుతుంది. నికర విలువ స్టాక్స్‌లో పెట్టుబడుల పట్ల అవగాహన ఉన్న వారు అవే అంశాలను ఫండ్స్‌కు అన్వయించడం çసరి కాదు. స్టాక్స్‌లో 52 వారాల గరిష్ట, కనిష్ట ధరలను సాధారణంగా చూస్తుంటారు. కానీ ఫండ్స్ యూనిట్ల నికర విలువ 52 వారాల కనిష్ట స్థాయిలో ఉంటే, అది మంచి పెట్టుబడికి సంకేతంగా చూడడం తప్పిదమే కావచ్చు. ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఎంచుకున్న స్టాక్స్ పనితీరు బాగాలేకపోయినా యూనిట్ల ఎన్ఏవీ పడిపోతుంది. ఇక మార్కెట్లు పడిపోయినప్పుడు ఫండ్ మేనేజర్లు సరసమైన ధరల కంటే దిగొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఈ విధమైన అవకాశాలున్నాయేమో చూడాలి. దీనికి బదులు ఇప్పటికే మీ వద్ద ఉన్న ఫండ్ యూనిట్లను తక్కువ ధరల వద్ద మరిన్ని జోడించుకోవడంపై దృష్టి సారించొచ్చు. ఫండ్ సైజు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు, సంబంధిత పథకం నిర్వహణలో ఉన్న ఆస్తులను ప్రత్యేకంగా చూడడం అవసరం లేదు. అదే డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో మాత్రం నిర్వహణ ఆస్తులను చూడడం అవసరం. ఎందుకంటే లిక్విడిటీ ఏ స్థాయిలోఉంటుందో తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈక్విటీ ఫండ్స్‌కు ఆస్తుల పరిమాణం ప్రతికూలంగా మారొచ్చు. ఉదాహరణకు స్మాల్‌క్యాప్ ఫండ్‌కు భారీ ఆస్తులు ఉంటే అది సానుకూలం కంటే ప్రతికూలమే అవుతుంది. ఇలా ఫండ్ సైజు చూసే వారు ఆస్తులను అద్భుతంగా నిర్వహించే చిన్న సైజు పథకాల్లో పెట్టుబడి అవకాశాలను కోల్పోవచ్చు. అందుకే ఓ పథకం ఎంపికకు స్థిరమైన రాబడుల చరిత్ర, పోటీ పథకాలతో పోల్చినప్పుడు ఇచ్చిన రాబడులు మెరుగ్గా ఉన్నాయా అన్నవి చూడాలి. అస్తుల పరిమాణాన్ని కాదు. వ్యయ భారం ఎక్స్పెన్స్ రేషియో... ఓ మ్యూచువల్ ఫండ్ పథకం తాను నిర్వహించే పెట్టుబడులపై అన్ని రకాల చార్జీలను కలుపుకుని ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే దానిని టోటల్ ఎక్స్పెన్స్ రేషియోగా చెబుతారు. ఫండ్స్ పథకాల ఎంపికకు చూసే అంశాల్లో ఇది కూడా ఒకటి. ఈ చార్జీలను ప్రతి రోజూ ఏఎంసీలు ఫండ్స్ యూనిట్ల ఎన్ఏవీ నుంచి మినహాయించుకుంటాయి. అంటే కనిపించే ఎన్ఏవీ ఖర్చులు మినహాయించుకున్న అనంతర విలువ అని తెలుసుకోవాలి. అయితే, అన్ని వేళలా ఈ ఎక్స్పెన్స్ రేషియోపై అంతగా ఆధారపడక్కర్లేదు. బెంచ్‌మార్క్, పోటీ పథకాల కంటే మెరుగైన పనితీరు చూపిస్తుంటే, అటువంటి పథకాల్లో ఎక్స్పెన్స్ రేషియో పట్ల అంత సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. డెట్ ఫండ్స్‌లో రాబడులు ఎక్కువగా లేకపోతే, అప్పుడు ఎక్స్పెన్స్ రేషియో రాబడులపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అయితే, ఫండ్ నాణ్యత, రిస్క్ ఆధారిత రాబడుల రేషియో అన్నవి ఎక్స్పెన్స్ రేషియో కంటే ముఖ్యమైనవిగా గుర్తించాలి. ఈక్విటీ ఫండ్స్‌లో ఏడాది కాల పాయింట్ టు పాయింట్ రాబడులు అన్నవి రాబడుల పనితీరుకు ప్రామాణికంగా చూడక్కర్లేదు. ఉదాహరణకు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఈక్విటీ పథకం 2016లో పనితీరు పరంగా నంబర్ 1 స్థానంలో ఉంది. కానీ, మరుసటి ఏడాది మూడో స్థానానికి వెళ్లింది. ఒకే తరహా పనితీరు తర్వాతి సంవత్సరంలోనూ నమోదు చేయడం అన్నది కష్టమే. అందుకే పనితీరు పరంగా స్థిరత్వాన్ని చూడడం అవసరం. -
సిప్..సిప్..హుర్రే!
న్యూఢిల్లీ: దేశీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ (సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా వస్తున్న పెట్టుబడుల వాటా అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫీ) వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం... గతనెల్లో ఈ పరిశ్రమ సిప్ మార్గంలో రూ.8,246 కోట్లను ఆకర్షించింది. అంతకుముందు ఏడాది ఇదే నెల్లో ఈ మొత్తం రూ.7,985 కోట్లు. గడిచిన 12 నెలల సగటు ఇన్‌ఫ్లో రూ. 8,000 కోట్లుగా నమోదయింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ.8,263 కోట్లు, ఆగస్టులో రూ.8,231 కోట్లు, జూలైలో రూ.8,324 కోట్లు, జూన్‌లో రూ.8,122 కోట్లు, మే నెల్లో రూ.8,183 కోట్లు, ఏప్రిల్‌లో రూ.8,238 కోట్లు సిప్ మార్గంలో మ్యూచ్‌వల్ ఫండ్లలోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి ఏడు నెలల్లో సిప్ల ప్రవాహం రూ.57,607 కోట్లు కాగా, గతేడాది ఇదే కాలంలో ఈ మొత్తం రూ.52,472 కోట్లుగా ఉంది. నెలకు సగటున 9.35 లక్షల కొత్త అకౌంట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 9.35 లక్షల చొప్పున కొత్త సిప్ అకౌంట్లు జత అయినట్లు యాంఫీ తెలియజేసింది. వీటిద్వారా ఇన్వెస్ట్ చేస్తున్న సగటు మొత్తం మాత్రం రూ.2,850గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2.89 కోట్ల సిప్ ఖాతాలున్నాయి. పెరుగుతున్న పెట్టుబడుల ప్రవాహ ధోరణి ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్‌లో సానుకూలతను సూచిస్తున్నట్లు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఇండియా సీనియర్ అనలిస్ట్ హిమాన్షు శ్రీవాస్తవ చెప్పారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇన్వెస్టర్ల సెంట్‌మెంట్‌ని మెరుగుపరిచిన నేపథ్యంలో సిప్ పెట్టుబడులు జోరందుకున్నాయని విశ్లేషించారు. ఇక 2018–19లో రూ. 92,700 కోట్లు, 2017–18లో రూ. 67,000 కోట్లు, 2016–17లో రూ. 43,900 కోట్లు సిమ్ మార్గంలో మార్కెట్లోకి వచ్చాయి. -
నష్టాలొస్తున్నాయి.. సిప్‌లు ఆపేయాలా?
నేను 2017 నుంచి కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మిడ్–క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎల్ అండ్ టీ ఇండియా వేల్యూ ఫండ్, టాటా ఈక్విటీ పీఈ ఫండ్లు ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో 2017 నుంచి సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లు ప్రారంభించాను. అయితే ఈ ఫండ్స్ నష్టాలు చూపడంతో 2018లో సిప్‌లు ఆపేశాను. ఈ ఏడాది కూడా ఈ ఫండ్స్ నష్టాల్లోనే ఉన్నాయి. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించమంటారా ? లేకుంటే నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వేరే ఫండ్స్‌కు మళ్లించమంటారా ? –కళ్యాణి, విజయవాడ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నవన్నీ మంచి ఫండ్సే, పైగా ఇది మంచి కాంబినేషన్ కూడా. ఒక్కొక్క ఫండ్ది ఒక్కొక్క ప్రత్యేకమైన థీమ్. సుందరమ్ రూరల్ అండ్ కంజప్షన్ ఫండ్.. ప్రామిసింగ్ సెక్టోరియల్ ఫండ్. సాధారణంగా సెక్టోరియల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవద్దని చెప్తుంటాను. కానీ సుందరమ్ ఫండ్ దానికి మినహాయింపు. 2017లో మార్కెట్ మంచి స్థాయిలో ఉంది. ఇలాంటప్పుడు ఫండ్స్ పనితీరు బాగా ఉంటుంది. 2018లో మార్కెట్ అంతంతమాత్రంగానే ఉంది. ఫలితంగా దాదాపు ఫండ్స్ అన్నీ ఆశించిన స్థాయి పనితీరు కనబరచలేకపోయాయి. ఇక ఈ ఏడాది ఇప్పటివరకూ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదు. మీరు ఎంచుకున్న ఫండ్స్ బాగా ఉన్నాయి. వీటన్నింటి పనితీరు పూర్తిగా మార్కెట్ పనితీరును బట్టే ఉంటుంది. అందుకే ఇప్పుడు నష్టాలు కనిపిస్తున్నాయి. నష్టాలు వస్తున్నా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను సిప్ల రూపంలో కొనసాగించండి. మార్కెట్లో పరిస్థితులు కుదుటపడితే, ఈ ఫండ్స్ మీకు లాభాలను చూపిస్తాయి. అసలు సిప్ల ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న పరమార్థం కూడా ఇదే. మార్కెట్ పెరుగుతున్నప్పుడే కాకుండా మార్కెట్ పతనబాటలో ఉన్నప్పుడు కూడా అధైర్యపడకుండా ఇన్వెస్ట్ చేస్తే, దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందగలరు. ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్‌కు మధ్య తేడా ఏమిటి? వేటిల్లో రాబడులు అధికంగా వస్తాయి.? –దామోదర్, విశాఖపట్టణం ఆల్ట్రా షార్ట్ డ్యురేషన్, లిక్విడ్ ఫండ్స్‌లు రెండు వేర్వేరు రకాలు. వీటి మధ్య చాలా సన్నని విభజన రేఖ మాత్రమే ఉంటుంది. చట్ట ప్రకారం, లిక్విడ్ ఫండ్... 91 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే సాధారణంగా చాలా మంది లిక్విడ్ ఫండ్ మేనేజర్లు 55 రోజుల నుంచి 60 రోజుల మెచ్యురిటీ ఉండే మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరోవైపు మూడు నుంచి ఆరు వారాల మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాయి. ఇక తాజా సెబీ నిబంధనల ప్రకారం, లిక్విడ్ ఫండ్స్ తమ నిధుల్లో కనీసం 20 శాతం వరకూ నగదు, ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లుల వంటి లిక్విడ్ అసెట్స్ల్లో ఇన్వెస్ట్ చేయాలి. డిజైన్ పరంగా చూస్తే, ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్ కంటే లిక్విడ్ ఫండ్స్ ఒకింత సురక్షితమనైవని చెప్పవచ్చు. తాజా సెబీ నిబంధనల కారణంగా లిక్విడ్ ఫండ్స్ మరింత సురక్షితంగా మారాయి. ఆల్ట్రా–షార్ట్–డ్యురేషన్ ఫండ్స్‌తో పోల్చితే లిక్విడ్ ఫండ్స్ రాబడులు ఒకింత తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మదుపు మొదలు పెట్టడానికి ముందుగా మ్యూచువల్ ఫండ్స్‌నే పరిగణించాలా? నేరుగా షేర్లలో ఇన్వెస్ట్ చేయకూడదా? –అబ్దుల్లా, హైదరాబాద్ మదుపు మొదలు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాలంలో ఫండ్స్ మంచి రాబడులనే ఇస్తాయి. ఇక నేరుగా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే, ఒడిదుడుకులు తీవ్రంగా ఉంటాయి. తగిన అనుభవం, అవగాహన లేకపోతే నష్టాలు వస్తాయి. ఇన్వెస్ట్ చేయడానికి ఏ షేర్‌ను ఎంచుకోవాలి ? ఆ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి ? తదితర అంశాలపై సాధారణ ఇన్వెస్టర్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ మేనేజర్‌కు అధిక అవగాహన ఉంటుంది. మార్కెట్ సంబంధిత సాధనాల్లో గతంలో ఇన్వెస్ట్ చేసిన అనుభవం లేకుంటే, ముందుగా మ్యూచువల్ ఫండ్స్‌నే ఇన్వెస్ట్మెంట్స్ కోసం పరిగణించండి. మ్యూచువల్ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తే, ముఖ్యంగా రెండు ప్రయోజనాలు లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. ఫండ్ మేనేజర్లు ప్రొఫెషనల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వారి అనుభవం మంచి ఫలితాలనిస్తుంది. ఇక రెండవది...మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న చిన్న మొత్తాల్లో కూడా ఇన్వెస్ట్ చేసే వీలుంటుంది. మీరు కనీసం నెలకు రూ.1,000తో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మొదలు పెట్టవచ్చు. కనీసం ఐదు అంతకు మించిన కాలానికి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మ్యూచువల్ ఫండ్స్‌కు మించిన ఇన్వెస్ట్మెంట్ సాధనం మరొకటి లేదు. ఫండ్స్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకూడదు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయాలి. మీకు జీతం పెరిగినా, ఇంక్రిమెంట్ వచ్చినా ఈ పెరిగిన మొత్తంలో కొంత మొత్తాన్ని సిప్‌లకు జత చేయండి. ఒకవేళ మీరు స్వయం ఉపాధి లేదా వ్యాపారం చేస్తున్నట్లయితే, ఏడాదికి సిప్ మొత్తాన్ని కనీసం 5–10 శాతం చొప్పున పెంచండి. కనీసం ఏడాదికొకసారైనా మీ పోర్ట్‌ఫోలియోలోని ఫండ్ల పనితీరును సమీక్షించి, వాటి పనితీరు ఆధారంగా నిర్ణయాలు తీసుకోండి. -
ధీమాగా ‘సిప్’ చేస్తున్నారు!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో భారీ హెచ్చుతగ్గులు, రూపాయి పతనం, ముడిచమురు రేట్ల పెరుగుదల మొదలైన ప్రతికూల అంశాలకు వెరవకుండా మ్యూచువల్ ఫండ్స్ సిప్ పథకాల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్(సిప్)లో పెట్టుబడులు ఏకంగా రూ. 7,985 కోట్లకు చేరడమే దీనికి నిదర్శనం. గతేడాది అక్టోబర్‌లో నమోదైన రూ. 5,621 కోట్లతో పోలిస్తే ఇది 42 శాతం అధికం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రూ. 7,727 కోట్లు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ గణాంకాల ప్రకారం తాజా ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కలిపి.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా (ఏప్రిల్–అక్టోబర్) సిప్‌లలో పెట్టుబడుల మొత్తం రూ. 52,472 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ మార్గంలో ఫండ్స్ రూ. 67,000 కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఈ పెట్టుబడులు రూ. 43,900 కోట్లు. రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పెట్టుబడి సాధనాలైన రియల్ ఎస్టేట్, బంగారం కన్నా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ సాధనాలవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని యాంఫీ పేర్కొంది. మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్కి పొంచి ఉండే రిస్కులను తగ్గించుకునేందుకు సిప్‌లను ఎంచుకుంటున్నారని తెలియజేసింది. పెరుగుతున్న ఇన్వెస్టర్లు.. ‘గడిచిన ఏడాది కాలంలో రిటైల్ ఫోలియోస్ సంఖ్య 30 శాతం, నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) పరిమాణం 14 శాతం, నెలవారీ సిప్ పెట్టుబడులు 40 శాతం పైగా పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్లలో నెలకొన్న నమ్మకానికి ఇది నిదర్శనం‘ అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రస్తుతం 2.5 కోట్ల పైచిలుకు సిప్ ఖాతాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతి నెలా 10 లక్షల పైచిలుకు సిప్ ఖాతాలు వచ్చి చేరాయి. సగటున పెట్టుబడి పరిమాణం రూ.3,200గా ఉంటోంది. యాంఫీ గణాంకాల ప్రకారం అక్టోబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి (ఎంఎఫ్) నికరంగా రూ. 14,783 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం నెలలో ఈ పరిమాణం రూ. 11,251 కోట్లుగా నమోదైంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయకుండా వారంవారీ, నెలవారీ, మూణ్నెల్లకోసారి చిన్న మొత్తాలను ఫండ్స్ ద్వారా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడతాయి సిప్ పథకాలు. ఇవి ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసేందుకు ఉపయోగించే రికరింగ్ డిపాజిట్ పథకాల కోవకి చెందినవి. -
ఇన్వెస్టర్లూ... ఇలా చేయొద్దు!!
‘‘గత ఏడాది కాలంలో మార్కెట్లు 20 శాతం ర్యాలీ చేశాయి. కానీ, నేను ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ పథకం మాత్రం నష్టాలనే చూపిస్తోంది’’ ఇదీ... ఢిల్లీకి చెందిన తరుణ్ ఆవేదన. మరి తరుణ్ విషయంలో ఏమై ఉంటుందని పరిశీలిస్తే... అతడు 2017 జులై నుంచి ప్రతి నెలా ఓ లార్జ్‌క్యాప్ పథకంలో రూ.10,000, ఓ మిడ్‌క్యాప్ పథకంలో రూ.10,000 చొప్పున సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాడు. లార్జ్ క్యాప్ పథకంలో సగటున స్వల్ప రాబడులే ఉన్నాయి. కానీ, ఇదే సమయంలో మిడ్‌క్యాప్ పథకంలో ఎక్కువ నష్టాలొచ్చాయి. దీంతో మొత్తం మీద వరుణ్ పెట్టుబడులపై నష్టాలే కనిపిస్తున్నాయి. ఏడాది, ఏడాదిన్నర కిందట సిప్ విధానంలో పెట్టుబడులు ప్రారంభించిన చిన్న ఇన్వెస్టర్లలో ఎక్కువ మందిది ఇదే పరిస్థితి. ప్రారంభంలో వీరు ఎంచుకున్న పథకాల పనితీరు బాగానే ఉంది. కానీ, గత ఆరు నెలలుగా మాత్రం పని తీరు ఆశాజనకంగా లేదు. బెంచ్ మార్క్ సూచీలతో పోలిస్తే పనితీరులో వెనుకబడే ఉన్నాయి. కాకపోతే, ఇన్వెస్టర్లు చేసే కొన్ని పొరపాట్లు సైతం నష్టాలకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు. వాటి వివరాలే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... కొన్ని నెలలుగా మార్కెట్ల ర్యాలీని గమనిస్తే... రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టీసీఎస్, ఐటీసీ వంటి షేర్లు మాత్రమే అసాధారణ రాబడులను ఇచ్చాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్ అన్నవి వైవిధ్యంతోనూ ఉంటాయి. ఇండెక్స్ స్టాక్స్‌తో పాటు, బయటి స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అయితే, సూచీలో అధిక వెయిటేజీ కలిగిన ఈ స్టాక్స్ ర్యాలీ కారణంగా... సూచీలోని స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే ఇండెక్స్ ఫండ్స్ పనితీరులో ముందు నిలిచాయి. దీంతో పెట్టుబడులను లార్జ్‌క్యాప్ ఫండ్స్ నుంచి, తక్కువ చార్జీలు, అధిక రాబడులు కనిపిస్తున్న ఇండెక్స్ ఫండ్స్‌లోకి మార్చుకోవాలని భావించడం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. ‘‘స్థిరమైన పనితీరు విషయంలో ఇండెక్స్ ఫండ్స్... యాక్టివ్ ఫండ్స్‌తో పోటీ పడే పరిస్థితి ఇంకా దేశీయ మార్కెట్లలో రాలేదు. కాబట్టి మంచి పోర్ట్‌ఫోలియోతో కూడిన యాక్టివ్ ఫండ్స్ మరికొన్నేళ్లు చక్కని పనితీరు చూపించగలవు’’ అని స్క్రిప్‌బాక్స్ సీవోవో సంజీవ్ తెలియజేశారు. సిప్‌లు నిలిపివేయడం సరికాదు... గత కొన్ని నెలల్లో మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో నష్టాల పాలయ్యాయి. గడిచిన ఏడాది కాలంలో సిప్ విధానంలో ఈ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టిన వారు తమ పెట్టుబడులపై ప్రస్తుతం నష్టాలనే చవిచూస్తున్నారు. దీంతో తమ పెట్టుబడులను నిలిపివేస్తున్నారు. కానీ, ఇది తెలివైన చర్య కాదన్నది నిపుణుల మాట. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై గతంతో పోలిస్తే తక్కువ ఎన్‌ఏవీకే ఎక్కువ యూనిట్లను సొంతం చేసుకునేందుకు ఇది సరైన సమయమని వారు సూచిస్తున్నారు. కొంత కాలానికి సిప్ ద్వారా పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులను ఇస్తాయని పేర్కొంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసే వారు దాన్ని ఆపకుండా, కొనసాగించడమే మెరుగైన విధానం అన్నది నిపుణుల మాట. డెట్ ఫండ్స్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లకు... నాలుగు సంవత్సరాల విరామం తర్వాత వడ్డీ రేట్లు పెరగడం ప్రారంభమయ్యాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్‌పై ఈల్డ్ 8 శాతానికి చేరింది. దీంతో డెట్ ఫండ్స్ రాబడులపై ప్రభావం పడుతోంది. ముఖ్యంగా దీర్ఘకాలిక బాండ్ ఫండ్స్‌పై ఈ ప్రభావం ఉంది. ఇతర కేటగిరీల బాండ్ ఫండ్స్ రాబడులు 3–4 శాతం మధ్యే ఉన్నాయి. మరోవైపు బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను పెంచుతున్నాయి. చాలా బ్యాంకులు మూడేళ్ల కాలానికి డిపాజిట్లపై 7–7.5 శాతం మధ్య వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. దీంతో అధిక వడ్డీ రేటును చూసి కొంత మంది ఇన్వెస్టర్లు బాండ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన చేయవచ్చు. కానీ, నిపుణులు మాత్రం ఇలా చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంకు డిపాజిట్లు నమ్మకమైన రాబడులను ఇస్తున్నాగానీ, వాటిపై పన్ను ప్రయోజనాలుండవు. బ్యాంకు డిపాజిట్లపై ఆర్జించే ఆదాయం అంతా కూడా సంబంధిత వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. వారు ఏ శ్లాబ్ పరిధిలోకి వస్తే ఆ ప్రకారం పన్ను పడుతుంది. దీనికి బదులు ఇన్వెస్టర్లు షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. బాండ్ ఫండ్స్ పన్ను పరంగా మరింత సమర్థనీయమైనవి. మూడేళ్లకుపైగా వీటిని కొనసాగిస్తే... ఇండెక్సేషన్ ప్రయోజనంతో పాటు రాబడులపై 20 శాతమే పన్ను చెల్లిస్తే సరిపోతుంది. స్వల్పకాల లక్ష్యాల కోసం సిప్!... కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు గడిచిన రెండు, మూడేళ్ల కాలంలో మంచి రాబడులు ఇవ్వడాన్ని చూసి కొందరు ఇన్వెస్టర్లు ఆయా పథకాల్లో సిప్‌లు మొదలు పెడుతుంటారు. స్వల్ప కాలిక లక్ష్యాల కోసం, సత్వర రాబడుల కోసం ఆశించకుండా ఈ మార్గాన్ని ఆశ్రయించడం సరైనదే. ఎందుకంటే కొన్ని స్టాక్స్ విలువలు చారిత్రక గరిష్ట స్థాయిలకు చేరినందున స్వల్ప కాలంలో రాబడులు ఉండకపోవచ్చు. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేసే వారు కనీసం ఐదేళ్ల కాలం పాటు కొనసాగేందుకు సిద్ధపడాలని నిపుణుల సూచన. డివిడెండ్ కోసం ఫండ్స్... కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు క్రమం తప్పకుండా ఆదాయం కోసమని కొన్ని రకాల పథకాలను తీసుకొస్తుంటాయి. కానీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి డివిడెండ్ ఆదాయం అన్నది, తమ సొంత పెట్టుబడుల నుంచి చెల్లించేదన్న విషయాన్ని గమనించాలి. ఇక ఈ డివిడెండ్‌పై ఇటీవలే 10 శాతం పన్ను అమల్లోకి వచ్చింది. కనుక డివిడెండ్ ఆదాయం అన్నది పన్ను పరంగా లాభసాటి కాదు. కనుక డివిడెండ్ చెల్లింపులను క్రమం తప్పకుండా ఆదాయం కింద పరిగణించే వారు మరోసారి పునరాలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మిగుల నిధుల నుంచే ఈ డివిడెండ్ చెల్లింపులు చేయడం జరుగుతుంది. కనుక క్రమం తప్పకుండా, కచ్చితమైన డివిడెండ్ చెల్లింపులకు ఎటువంటి హామీ ఉండదని తెలుసుకోవాలి. స్టాక్స్ పట్ల అతి విశ్వాసం వద్దు స్టాక్ మార్కెట్లో అతివిశ్వాసం ప్రమాదకరం. అతి విశ్వాసం, లెక్కచేయని తనం ఉన్న వారితో పోలిస్తే తక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన వారే స్టాక్ మార్కెట్లో తక్కువ తప్పిదాలు చేస్తుంటారు. పోర్ట్‌ఫోలియోకు రక్షణ కల్పించుకునేందుకు ఈక్విటీ, డెట్‌కు మధ్య శాతం వారీగా సమతూకం పాటించడమే ఉత్తమ మార్గం. అలాగే, రాబడుల ఆధారంగా... నిర్ణయించుకున్న శాతానికంటే విలువ తగ్గిన విభాగంలోకి పెట్టుబడులను పెంచుకోవడం చేస్తుండాలి’’ అని వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో ధీరేంద్ర కుమార్ తెలిపారు. -
సిప్‌తో మెరుగైన రాబడుల కోసం!
అన్ని ర్యాలీల్లోనూ సత్తా చూపించి, అలాగే మార్కెట్ పతనాల్లో నష్టాలను పరిమితం చేయడం అన్నది రిలయన్స్ స్మాల్ క్యాప్ ఫండ్ పనితీరులో గమనించొచ్చు. ఓ స్మాల్ క్యాప్ ఫండ్ ఈ తరహా పనితీరు చూపించడం అన్నది అసాధారణమే. కనీసం ఏడు నుంచి పదేళ్లు అంతకంటే ఎక్కువ కాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు, మెరుగైన రాబడులను ఆశించే వారు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. స్మాల్ క్యాప్ షేర్ల విలువలు బాగా పెరిగి ఉండటంతో... మార్చి నుంచి ఈ పథకం లంప్సమ్గా (ఏకమొత్తం) పెట్టుబడులను తీసుకోవడం నిలిపి వేసింది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) రూపంలో మాత్రం పెట్టుబడులను అనుమతిస్తోంది. మరీ ముఖ్యంగా అస్థిరతలు ఎక్కువగా ఉండే స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో పెట్టు బడులు అంటే అందుకు సిప్ మార్గమే మెరుగైనది. పనితీరు... ఏడాది, మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో రిలయన్స్ స్మాల్ క్యాప్ పథకం పనితీరును పరిశీలించినట్టయితే మెరుగ్గా ఉంది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికమైన బీఎస్ఈ స్మాల్క్యాప్తో పోలిస్తే రిలయన్స్ స్మాల్ క్యాప్ రాబడులు అధికంగా ఉన్నాయి. ఏడాది కాలంలో 13.3 శాతం రాబడులను అందించగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ పెరుగుదల 7.8 శాతంగానే ఉంది. ఇక మూడేళ్ల కాలంలో రిలయన్స్ స్మాల్ క్యాప్ రాబడులు వార్షికంగా 18.2 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 37.5 శాతం చొప్పున ఉన్నాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ రాబడులు మూడేళ్ల కాలంలో 13.3 శాతం, ఐదేళ్లలో 27.2 శాతంగానే ఉండడం గమనార్హం. ప్రామాణిక సూచీతో పోలిస్తే 5–10 శాతం అధిక రాబడులను ఇచ్చింది. గత ఐదేళ్లలో వార్షికంగా కాంపౌండెడ్ రూపంలో 37 శాతం రాబడులతో పోటీ పథకాలైన డీఎస్పీ బ్లాక్‌రాక్ స్మాల్ క్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ స్మాల్‌క్యాప్ కంటే ముందుంది. ఈ విభాగంలో గత ఏడేళ్లుగా టాప్ పథకాల్లో ఇదీ ఒకటిగా ఉంటోంది. పెట్టుబడులు, విధానం పెట్టుబడుల్లో ఇది వైవిధ్యాన్ని ప్రదర్శిస్తోంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలను పెంచుకోవడం ద్వారా రిస్క్‌ను తగ్గించే విధానాన్ని అనుసరిస్తోంది. పైగా విడిగా ఒక స్టాక్‌లో 3% పెట్టుబడులు మించ కుండా చూస్తోంది. భిన్న మార్కెట్ సమయాల్లో పోర్ట్‌ఫోలియోలో మొత్తం స్టాక్స్ 70–80గా నిర్వహిస్తోంది. పైగా ఒక్కో రంగంలో పెట్టుబడులను 10 శాతానికే పరిమితం చేస్తుంది. 7–9 శాతం మేర డెట్, నగదు రూపంలో పెట్టుబడులను కలిగి ఉంటోంది. మార్కెట్ కరెక్షన్లలో ఫండ్ ఎన్ఏవీ విలువ భారీగా పడిపోకుండా ఈ చర్యను అనుసరిస్తుండడం గమనార్హం. మిగిలిన పథకాల మాదిరిగా బ్యాంకులు, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులను కలిగి లేదు. వీటికి ప్రాధాన్యం తక్కువగా ఇస్తోంది. గత ఏడాది కాలంలో కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ స్టాక్స్‌లో పెట్టుబడులను పెంచుకుంది. కదలికల ఆధారంగా, విలువ ఆధారిత విధానాలతో స్టాక్స్‌ను ఎంపిక చేయడం ఈ పథకం ఫండ్ మేనేజర్లు అనుసరించే విధానం. -
పెట్టుబడులకు మంచి సమయమే!!
దేశీ ఎకానమీలో కొన్ని సవాళ్లున్నప్పటికీ... రిటైల్, బ్యాంకులు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన రంగాలకు చెందిన సంస్థల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలుంటాయని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ సీఈవో ఎ.బాలసుబ్రమణియన్ చెప్పారు. ఈ సారి రుతుపవనాలు కాస్త మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో గ్రామీణ, వ్యవసాయ ఆధారిత సంస్థలూ సానుకూలంగానే కనిపిస్తున్నాయని తెలియజేశారాయన. మార్కెట్ల రాబడులు, సిప్‌లు తదితర అంశాలపై ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – హైదరాబాద్, బిజినెస్ బ్యూరో రుతుపవనాలపై సానుకూల అంచనాలు.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు, వాణిజ్య యుద్ధ భయాలు మొదలైన వాటితో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లలో కొన్ని నెలలుగా అనిశ్చితి నెలకొంది. ఇక చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలతో దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. అయితే, మెరుగైన వర్షపాతంతో వ్యవసాయోత్పత్తి ఆశావహంగా ఉండగలదన్న అంచనాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుండటంతో ఆటోమొబైల్స్, కన్జూమర్ డ్యూరబుల్స్ అమ్మకాలు మెరుగుపడుతున్నాయి. ఈ రంగాల సంస్థల షేర్లతో పాటు రిటైల్ కార్యకలాపాలపై ప్రధానంగా దృష్టి పెట్టే బ్యాంకులు, గ్రామీణ.. వ్యవసాయ రంగాలకు సంబంధించిన సంస్థల షేర్లు మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నాం. దీర్ఘకాలంలో ఈక్విటీలతో అధిక రాబడి.. ప్రతి రెండు మూడేళ్లకోసారి మార్కెట్లు కొంత అనిశ్చితం పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంటా యి. అయినప్పటికీ.. దీర్ఘకాలంలో చూస్తే జీడీపీ వృద్ధికి మించి 3–4 శాతం అధికంగానే రాబడులిస్తుంటాయి. పెట్టుబడులకు కట్టుబడి ఓపికగా వేచి చూడగలిగితే ప్రయోజనాలు అందుకోవచ్చు. గడిచిన 20 ఏళ్లుగా చూస్తే.. పదేళ్ల వ్యవధిలో ఈక్విటీలు 20 శాతానికి పైగా రాబడులిచ్చాయి. అంటే హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. సగం కాలం అత్యధిక రాబడులు ఇచ్చినట్లే లెక్క. ఈ 20 ఏళ్లలో కేవలం ఆరు సార్లే మార్కెట్లు ప్రతికూల ఫలితాలు కనపర్చాయి. మొత్తం మీద అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ఈ వ్యవధిలో పెట్టుబడులపై సగటున 17.3 శాతం రాబడి ఉండొచ్చు. సిప్ల నిష్పత్తి ఇలా .. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ పథకాల (సిప్) ద్వారా ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేర పెట్టుబడులు వస్తున్నాయి. ఏటా ఇది పెరుగుతోంది. మార్కెట్లలో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. సిప్‌లను కొనసాగించడంతో పాటు వీలైతే ఇన్వెస్ట్మెంట్ పరిమాణం పెంచడం, బహుళ సిప్ల విధానాన్ని అనుసరిస్తే మరింత అధిక రాబడులు పొందవచ్చు. అయిదేళ్ల పైబడిన కాలవ్యవధి గల సిప్‌లలో పెట్టుబడులకు సంబంధించి లార్జ్, మల్టీ, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో 30:30:40 నిష్పత్తిలో కేటాయించడం ద్వారా కాంపౌండింగ్ ప్రయోజనాలు కూడా మెరుగ్గా ఉంటాయి. ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేయదల్చుకుంటే.. డబ్బంతా ఒకే సాధనంలో పెట్టకుండా ఈక్విటీతో పాటు ఫిక్సిడ్ ఇన్‌కం స్కీమ్స్‌లోనూ పెట్టడం ద్వారా సమతుల్యత ఉండేలా చూసుకోవచ్చు. -
సిప్‌తో నష్టాలా..? కంగారొద్దు!!
శ్రీనిధి (32) ఎంఎన్సీ కంపెనీలో మానవ వనరుల విభాగంలో పనిచేస్తోంది. గతేడాది నుంచి ఆమె ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడి పెడుతోంది. ఇటీవలి మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆమె తన పోర్ట్‌ఫోలియోపై రాబడులను పరిశీలించింది. అవేమో కాస్త నష్టాల్లో ఉన్నాయి. శ్రీనిధి తెల్లబోయింది. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో సంపద సమకూరుతుందని, లక్ష్యాలు సులభంగా చేరుకోవచ్చని నిపుణులు చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అవి నిజమేనా? అని డైలమాలో పడింది. నిజానికిది శ్రీనిధి ఒక్కరి సమస్యే కాదు. ఈ మధ్య మార్కెట్లోకి ప్రవేశించి సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టిన వారిలో చాలా మందికి నష్టాలే ఎదురవుతున్నాయి. వారు అవి చూసి ఆందోళన చెందుతున్నారు. దీన్ని కొనసాగించాలా... వద్దా? అనే డైలమాలో పడ్డారు కూడా. కాకపోతే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారు ఈ తాత్కాలిక నష్టాలను చూసి ఆందోళన చెందక్కర్లేదన్నది నిపుణుల మాట. ఇలా పడ్డప్పుడే సిప్‌ను కొనసాగించాలని, అపుడు పెరిగితే మంచి లాభాలు చూడవచ్చనేది వారి సూచన. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మార్కెట్లు పడితే మంచిదే... సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను (సిప్) ఆపేద్దామని నిర్ణయించుకుంటే లేదా ఇప్పటి వరకు వచ్చిన లాభాలు చాల్లేనని వాటిని వెనక్కి తీసుకుందామనుకున్నా దాని కంటే ముందు మీరు పరిశీలించాల్సినవి ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించి కనీసం మూడు నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలమే అయితే కచ్చితంగా మంచి లాభాలతో ఉండి ఉంటారు. కాబట్టి తాజా పతనంలో ఆ లాభాల శాతం తగ్గిందని అమ్మేయడం సరికాదు. ఒకవేళ మీరు గడిచిన ఏడాది లేదా రెండేళ్లుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే, తాజా మార్కెట్ల పతనం నిజంగా మీకంటూ లభించిన ఓ అవకాశం. మార్కెట్లు గరిష్టాల్లో ఉన్నప్పుడు ఫండ్ యూనిట్లు గానీ, షేర్లు గానీ అధిక ధర పెట్టి కొనాలి. అవే యూనిట్లు ఈ సమయంలో చాలా డిస్కౌంట్ రేటుకే కొనుగోలు చేయొచ్చు. కాబట్టి దీన్నో చక్కని అవకాశంగా చూడాలి. ఉదాహరణకు రూ.10,000ను సిప్ రూపంలో ఓ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి. దాని ఎన్ఏవీ రూ.200. రూ.10,000 పెట్టుబడికి 50 యూనిట్లు వస్తాయి. కరెక్షన్ సమయంలో ఈ ఎన్ఏవీ రూ.175కు తగ్గిపోయిందనుకోండి. రూ.10వేల పెట్టుబడికి 57.14 యూనిట్లు వస్తాయి. ఓ రెండు నెలల తర్వాత మార్కెట్ల రికవరీతో మీ ఫండ్ ఎన్ఏవీ తిరిగి రూ.250కు వెళితే అదనంగా వచ్చిన 7.14 యూనిట్లపై రూ.535 లాభం వచ్చినట్టు. అయితే మార్కెట్లు నెలా, రెండు నెలల్లో రికవరీ అవ్వాలనేమీ లేదు. ఇంకా ఎక్కువ సమయమే తీసుకోవచ్చు. అయినా కానీ, మార్కెట్లు దిద్దుబాటుకు గురైన సమయంలో తక్కువ ఎన్ఏవీల వద్ద ఫండ్ యూనిట్లను కొనుగోలు చేయడం వల్ల కాస్తంత ఆలస్యమైనా మంచి రాబడులు కనిపిస్తాయి. ఇన్వెస్టింగ్లో రిస్క్ ఉంటుంది... ఇక తాజా కరెక్షన్ మార్కెట్లు అధిక విలువల వద్ద ఇన్వెస్ట్ చేస్తే ఉండే రిస్క్‌ను తెలియజేసింది. గతేడాది మార్చిలో నిఫ్టీ 23 పీఈవో వద్ద ఉంటే, మిడ్‌క్యాప్ సూచీ 33–49 పీఈ స్థాయిలో, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 45 పీఈల వద్ద ఉన్నాయి. ఆ విలువల వద్ద పెట్టుబడులు మొదలు పెట్టిన వారికి సమీప కాలంలో లాభాలు ఆర్జించే అవకాశాలు తక్కువేనని ‘పర్సనల్ ఫైనాన్స్ ప్లాన్ డాట్ ఇన్’ వ్యవస్థాపకుడు దీపేశ్ రాఘవ్ చెప్పారు. అయినప్పటికీ సిప్ కొనసాగిస్తే దీర్ఘకాలంలో చక్కని రాబడులు అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ‘‘ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కనీసం 7–10 ఏళ్ల కాల వ్యవధికి సిద్ధపడాలి. ఒకవేళ మార్కెట్లు గరిష్ట విలువల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసినాగానీ 7–10 ఏళ్ల కాలంలో మరోసారి గరిష్టాలకు వెళ్లే అవకాశం దాదాపుగా ఉంటుంది. ఆ గరిష్టాలు అంతకు ముందు స్థాయి కంటే ఎక్కువే అయి ఉంటాయి’’ అని దీపేశ్ చెప్పారు. కరెక్షన్ అవసరమే... ఇటీవలి బుల్ రన్లో లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ మెరుగైన పనితీరు చూపించాయి. నిజానికి ఈ తరహా పథకాలు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు వేగంగా పెరగడం, పడిపోతున్నప్పుడు అంతే వేగంగా పతనం అవడం జరుగుతుంటుంది. అందుకే రిస్క్ ఎక్కువ తీసుకోలేని వారు మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ముందు ఆ పెట్టుబడుల కేటాయింపుల్లో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీల్లో 70–75 శాతం వరకు పెట్టుబడులను లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు కేటాయించుకోవాలని, మిగిలిన 25–30 శాతం పెట్టుబడులను స్మాల్, మిడ్ క్యాప్స్‌లో ఉండేలా చూసుకోవాలన్నది ఆర్థిక సలహాదారుల సూచన. ఇక తమ మిగులు నిల్వలన్నింటినీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారు, వాటి విలువలు పెరుగుతున్న కొద్దీ డైవర్సిఫై చేసుకోవాలి. కొంత మేర నిధుల్ని బంగారం, డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవడం ద్వారా రిస్క్ పరిమితం చేసుకోవచ్చు. ‘‘ప్రతీ ఆరు నెలలకోసారి మీ ఫండ్ పనితీరును పరిశీలించుకోవాలి. ఆ ఫండ్ పనితీరు ఆ విభాగంలోని మిగిలిన పథకాల కంటే, బెంచ్ మార్క్ సూచీ కంటే వెనుకబడిందా అన్నది గమనించుకోవాలి’’ అని ఆర్థిక సలహాదారు ఆర్ణవ్ పాండ్యా సూచించారు. ఇలాంటపుడే సిప్ కొనసాగాలి మార్కెట్లు పడుతున్న ఇలాంటి సమయంలో యువ ఇన్వెస్టర్లు సిప్‌లను ఆపేసి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుని పొరపాటు చేయవద్దని ఎక్కువ మంది విశ్లేషకులు, ఆర్థిక సలహాదారులు సూచిస్తున్నారు. తమ పెట్టుబడులను, సిప్‌లను కొనసాగించాలనే చెబుతున్నారు. ‘‘సిప్ ప్రధాన ఉద్దేశం మార్కెట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు నిరాటంకంగా పెట్టుబడులను కొనసాగించడమే. కరెక్షన్ వల్ల మార్కెట్ల వ్యాల్యూషన్లు చౌకగా మారిన సమయంలో మీ సిప్‌ను ఆపేయడం తెలివైన పని కాదు. సిప్పై నెగెటివ్ రిటర్న్‌లు వచ్చిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2008–09, 2012–13లో ఇలానే జరిగింది. ఆ సమయంలో నష్టాలను చూసి సిప్ ఆపేసిన ఇన్వెస్టర్లు లాభాలను మిస్సయ్యారు. నష్టాలు వచ్చినప్పటికీ సిప్ కొనసాగించిన వారు మాత్రం మార్కెట్లు వృద్ధిలోకి వచ్చిన తర్వాత లాభాలను కళ్లజూశారు’’ అని కోటక్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నీలేశ్ షా వ్యాఖ్యానించారు. -
సిప్..సిప్.. హుర్రే..!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు సిప్..సిప్.. హుర్రే అంటున్నారు. మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.5,600 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టారని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సిప్ల ద్వారా ఫండ్స్‌లోకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్(రూ.3,434 కోట్లు)తో పోల్చితే ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్ల ద్వారా ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబులు 64 శాతం వృద్ధి చెందాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫండ్స్‌లో సిప్ పెట్టుబడులు రూ.5,516 కోట్లుగా ఉన్నాయని వివరించింది. సగటు సిప్ పెట్టుబడి రూ.3,250 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల కాలంలో సిప్ల ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన మదుపులు.. మొత్తం రూ.34,887 కోట్లుగా ఉన్నాయని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి వచ్చిన పెట్టుబడులు రూ.23,584 కోట్లని యాంఫీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నెలకు సగటున కొత్తగా 8.86 లక్షల సిప్ ఖాతాలు జత అవుతున్నాయని, ఒక్కో సిప్ సగటు పెట్టుబడి రూ.3,250గా ఉందని పేర్కొంది.ప్రస్తుతం 1.73 కోట్లు సిప్ ఖాతాలున్నాయి. మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధించి ఆందోళన చెందాల్సిన పని లేకుండా సిప్‌లు ఇన్వెస్టర్లకు భరోసానిస్తున్నాయని యాంఫీ పేర్కొంది. క్రమశిక్షణగా మదుపు చేయడం, యావరేజ్ ప్రయోజనాలు సిప్ల ద్వారా లభిస్తున్నాయని వివరించింది. స్టాక్ మార్కెట్ జోరుతోనే... స్టాక్ మార్కెట్ జోరుగా ఉండటంతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిప్ పెట్టుబడులు జోరుగావస్తున్నాయని బజాజ్ క్యాపిటల్ సీఈఓ రాహుల్ పారిఖ్ చెప్పారు. యాంఫీ, మ్యూచువల్ ఫండ్ సంస్థలు నిర్వహిస్తున్న ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమాలు కూడా సిప్‌లు పెరగడానికి తోడ్పడుతున్నాయని వివరించారు. స్టాక్ మార్కెట్లో నష్టభయాన్ని తగ్గించుకోవటానికి ఇన్వెస్టర్లు సిప్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. సిప్ అంటే... రిటైల్ ఇన్వెస్టర్లు ఒకేసారి పెద్ద మొత్తాల్లో కాకుండా చిన్న చిన్న మొత్తాల్లో వారానికి/నెలకు/ మూడు నెలలకొకసారి చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడాన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌గా వ్యవహరిస్తారు. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ తరహా ఇన్వెస్ట్మెంట్ లాంటిదే. -
డైమండ్‌ని సిప్ చేద్దాం.. రెడీనా?
ఏమన్నా... డైమండ్ అంటే ఆ కథే వేరు. వజ్రాల మీద మక్కువ మనకి మామూలుగా ఉండదు. వజ్రపుటుంగరం, డైమండ్ నెక్లెస్... ఇవన్నీ భారతీయుల కల. మరి వజ్రాభరణం కొనాలంటే..? బంగారంతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టాలి. దీంతో ఇది అందరికీ సాధ్యపడక పోవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో డబ్బులుండాలి కదా? ఉన్నా ఖర్చుపెట్టగలగాలి కదా? మరేం చేద్దాం..!! ఈ ప్రశ్నకు జవాబుందా? లేకేం! సంపద కూడబెట్టడానికి ఏకైక మార్గం సిప్ అని అంతా చెబుతుంటారు కదా! మరి వజ్రాలు కొనుక్కోవటానికి కూడా సిప్ చేయొచ్చు కదా!! నెలవారీ క్రమానుగతంగా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ (సిప్) వజ్రాలను సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది. సెబీ అనుమతితో ఇండియన్ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఐసీఈఎక్స్) దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకే సిప్ అవకాశం ఉండగా, ఐసీఈఎక్స్ దీన్ని వజ్రాల విషయంలోనూ సాకారం చేసింది. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఇతర లోహాలతో పోలిస్తే... ఇతర లోహాలతో పోల్చి చూస్తే వజ్రాలు చాలా ఖరీదైనవి. అమూల్యమైన లోహాల కేటగిరీలోకి వస్తాయి. బంగారం, ప్లాటినం, వెండి కంటే ఖరీదైనవి. సాధారణంగా ఉన్నత వర్గాల వారు వజ్రాభరణాలను ఎక్కువగా ధరిస్తుంటారు. అందుకే బంగారంతో పోల్చుకుంటే వజ్రాలకు లిక్విడిటీ (కావాలనుకున్నపుడు వెంటనే నగదుగా మార్చుకోవడం) తక్కువ. వజ్రాలను సిప్ చేయటమెలా..? మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ఎంత సులభమో ఇందులోనూ సరిగ్గా అంతే. ఐసీఈఎక్స్లో ఖాతాను ప్రారంభించి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వజ్రాలను సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలో వజ్రాలు ట్రేడయ్యే తొలి ఎక్స్ఛేంజ్ కూడా ఐసీఈఎక్స్ కావడం గమనార్హం. సెబీ నుంచి ఇటీవలే ఈ ఎక్స్ఛేంజ్ అనుమతి పొందింది. వినియోగదారులు వజ్రాలను సిప్ విధానంలో దక్కించుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని రూపొందించింది. ఖాతా తప్పనిసరి వజ్రాల కోసం ఐసీఈఎక్స్ బ్రోకర్ వద్ద ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. కేవైసీ ధ్రువీకరణల తర్వాత కొంత మేర డిపాజిట్ చెల్లించడం ద్వారా ఖాతాను తెరవచ్చు. ప్రతి నెలా ఏ తేదీన వజ్రాలు కొనాలనుకుంటున్నామో ముందుగానే బ్రోకర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. షేర్ల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల మాదిరిగానే ఈ ఖాతాను కూడా ప్రారంభించాలి. అందుకు అవసరమైన ధ్రువపత్రాలు... ఆధార్ కార్డు, పాన్ కార్డు, చిరునామా ధ్రువీకరణ వంటివి ఇవ్వాల్సి వస్తుంది. ఎంత కాలం పాటు ఇన్వెస్ట్మెంట్ వజ్రాన్ని బట్టి సిప్ ఉంటుంది. ఉదాహరణకు 30 సెంట్ల డైమండ్ కావాలనుకుంటే దాని ధర (ఐసీఈఎక్స్ ప్రకారం) రూ.27,000. ఇందుకోసం ప్రతి నెలా కనీసం రూ.900తో సిప్ మొదలు పెట్టొచ్చు. ఇలా 30 నెలల పాటు ఇన్వెస్ట్ చేస్తే రూ.27,000 అవుతాయి. దీంతో 30 సెంట్ల వజ్రాన్ని ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు. ఏదైనా అవాంతరం ఏర్పడి కాల వ్యవధి మధ్యలోనే సిప్ ఆపేసినా నష్టం లేదు. అప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన మేర వజ్రం డీమ్యాట్ ఖాతాలో జమ అయి ఉంటుంది. మళ్లీ వీలైనప్పుడు సిప్ మొదలు పెట్టి 30 వాయిదాలు పూర్తి చేసిన తర్వాత వజ్రాన్ని అందుకోవచ్చు. అంటే వజ్రాన్ని డెలివరీ తీసుకోవాలంటే కనీసం 30 సెంట్ల సైజును సమకూర్చుకోవాలి. సిప్ రూపంలోనే కాదు!!. డబ్బులు సిద్ధంగా ఉంటే ఒకేసారి చెల్లించి ఐసీఈఎక్స్ నుంచి కొనుగోలు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంది. వజ్రం వద్దనుకుంటే తిరిగి ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ఎప్పుడైనా దాన్ని అమ్మేసుకోవచ్చు. ఐసీఈఎక్స్ మూడు రకాల సైజుల్లో వజ్రాల ట్రేడింగ్‌ను ప్రారంభిస్తోంది. 30 సెంట్లు, 50 సెంట్లు, 100 సెంట్లు. 100 సెంట్లు అంటే ఒక క్యారట్‌తో సమానం. ఒక షేరు మాది రిగా ఒక సెంట్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. స్టాక్మార్కెట్లో షేర్ల మాదిరి గా ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వజ్రాలు ఎలక్ట్రానిక్ రూపంలో ట్రేడవుతుంటా యి. కొన్నప్పుడు షేర్ల వలే వజ్రాలు కూడా ఎలక్ట్రానిక్ రూపంలోనే డీమ్యాట్ ఖాతాకు వెళతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. ఒకవేళ మీరు డెలివరీ తీసుకోవాలనుకుంటే వజ్రం రూపంలోనే మీ చేతికి అందుతుంది. వజ్రాల్లో సిప్ చేస్తే రాబడి ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీఈఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై వజ్రాలు అప్పటి కరెంట్ మార్కెట్ ధరల మేరకు ట్రేడవుతూ ఉంటాయి. కొంత కాలానికి వజ్రాల ధరలు పెరగొచ్చు. లేదా తగ్గొచ్చు. కనుక వజ్రాలపై కొంత కాలానికి రాబడి అందుకోవాలన్న ఉద్దేశంతో సిప్ ఎంచుకోవడం సరికాకపోవచ్చు. పెట్టుబడిగా చూడకుండా ఆభరణాల కోసం వజ్రాలను సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం... అంతర్జాతీయంగా పేరొందిన డీబీర్స్ సంస్థ నుంచి నాణ్యతా ధ్రువీకరణతో పాటు సులభంగా వజ్రాన్ని సొంతం చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.ఇంకెందుకు ఆలస్యం!! వజ్రాభరణాలు ధరించాలనే కల మీకుంటే... దాన్ని నెరవేర్చుకోవటానికి ఇప్పుడే సిప్ మొదలుపెట్టండి. నెలకు కనీసం రూ.1100 చొప్పున ఇన్వెస్ట్ చేసినా... దాదాపు రెండేళ్లలో వజ్రాలు మీ చేతికొస్తాయి!! -
సిప్ ప్రారంభానికి సరైన సమయమేది?
నేను మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు కొత్త. నేను ఎంత రిస్క్‌ను అయినా భరించగలను. 10–15 ఏళ్ల కాలానికి గాను నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. –రాంబాబు, విజయవాడ మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం కొత్త. మీరు ఎంత రిస్క్‌ను భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మీరు ఇన్వెస్ట్ చేసిన వెంటనే మార్కెట్ పతనమైతే, మీకు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల ఉత్సాహం తగ్గిపోతుంది. అందుకని ఎంత రిస్క్ భరించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్‌లో మొదటగా ఇన్వెస్ట్ చేసేవారికి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌ను సూచిస్తాం. మొదటి 2–3 ఏళ్ల కాలానికి మీరు మంచి బ్యాలెన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై తగిన అవగాహన వచ్చిన తర్వాత, ఒకటి లేదా రెండు ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమమైన పెట్టుబడి వ్యూహం. పిల్లల ఉన్నత చదువులు, రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం తదితర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మీకు పన్ను ప్రయోజనాలు కావాలనుకుంటే బ్యాలెన్స్డ్ ఫండ్స్ కంటే ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్)లో ఇన్వెస్ట్ చేయండి. నేను మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సిప్(సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనేది నా ఆలోచన. అయితే ఇప్పుడు మార్కెట్ రికార్డ్ స్థాయిలో ఉంది. మార్కెట్ పడిపోయినప్పుడు సిప్‌లు ప్రారంభించాలనుకుంటున్నాను. ఇది సరైన నిర్ణయమేనా ? –సంతోష్, కరీంనగర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పరమార్థం... ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెట్టడం. సిప్ ప్రారంభానికి మార్కెట్ పతనం దాకా వేచి చూడడం సరైన పనికాదు. ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ పతనమయ్యేదాకా వేచి చూడడంలో ఒకింత అర్థం ఉంది. కానీ ఇది కూడా సరైన మదుపు వ్యూహం కాదు. ఎందుకంటే మార్కెట్‌ను సమర్థవంతంగా అర్థం చేసుకోవడం చాలా మంది ఇన్వెస్టర్ల వల్ల కాదు. సిప్ ప్రారంభించడానికి సరైన సమయం ఎప్పుడంటే.., మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడే. చాలా మంది ఇన్వెస్టర్లు గత రెండేళ్లుగా కరెక్షన్ వస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉన్నారు. కరెక్షన్ కోసం వేచి చూస్తూ, పలువురు ఇన్వెస్టర్లు చాలా మంచి అవకాశాలు కోల్పోయారు. ఇక ఇప్పుడు కరెక్షన్ వస్తే రావచ్చు. మార్కెట్ నిలకడగా పెరుగుతోంది. కానీ ఫండమెంటల్స్ ఏమంత ప్రోత్సాహకరంగా లేవు. మార్కెట్ రికార్డ్ స్థాయిల్లో ఉన్నప్పటికీ, మీరు సిప్‌ను ప్రారంభించవచ్చు. మార్కెట్ పతనమయ్యేదాకా వేచిచూడడం కంటే ఒక ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు కొనసాగించడం సరైన పెట్టుబడి విధానం. సిప్ వల్ల అది సాకారమవుతుంది. నేను మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటి ఎక్స్పెన్స్ రేషియోనే.. ఆ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినంత కాలమూ ఉంటుందా ? ఆ ఫండ్‌లో నా ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిన కాలంలో ఎక్స్పెన్స్ రేషియోలో ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటాయా ? ఎక్స్పెన్స్ రేషియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎన్ఏవీని ప్రకటిస్తారా ? –రేణుక, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్ నిర్వహణకు అయిన ఖర్చులను ఎక్స్పెన్స్ రేషియోగా వ్యవహరిస్తారు. మేనేజ్మెంట్, మార్కెటింగ్, కస్టోడియన్ తదితర చార్జీలన్నీ దీంట్లో కలసి ఉంటాయి. ఎక్స్పెన్స్ రేషియో మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినంత కాలమూ ఉంటుంది. ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగినంత కాలం ఒకే ఎక్స్పెన్స్ రేషియో ఉండాలని లేదు. ఈ ఎక్స్పెన్స్ రేషియోలో మార్పులు, చేర్పులు ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎంత ఎక్స్పెన్స్ రేషియోను వసూలు చేయాలన్నది మార్కెట్ నియంత్రణ సంస్థ, (సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిర్దేశిస్తుంది. ఎక్స్పెన్స్ రేషియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే ఎన్ఏవీని నిర్ణయిస్తారు. మీ ఫండ్ నుంచి వ్యయాలను తీసివేసి ఎన్ఏవీని లెక్కిస్తారు. మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ ఎంత ఉందో అదే మీ ఇన్వెస్ట్మెంట్ విలువ. దీపావళి పండుగ సందర్భంగా నాకు రూ. 4 లక్షల వరకూ బోనస్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ మొత్తాన్ని ఏదైనా లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. మంచి లిక్విడ్ ఫండ్‌ను సూచించండి. –శ్రీకాంత్, బెంగళూరు లిక్విడ్ ఫండ్స్ పనితీరులో పెద్దగా తేడాలుండవు. దాదాపు అన్ని లిక్విడ్ ఫండ్స్ ఒకే మాదిరి పనితీరు కనబరుస్తాయి. స్వల్పకాలిక ఫిక్స్డ్ డిపాజిట్ కంటే, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కంటే కూడా లిక్విడ్ ఫండ్స్ ఒకింత అధిక రాబడిని ఇస్తాయి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీ డబ్బులను రిడీమ్ చేసుకునే వెసులుబాటు ఉన్న మొబైల్ యాప్ ఉన్న లిక్విడ్ ఫండ్కే ప్రాధాన్యత ఇవ్వండి. దీర్ఘకాలం పాటు మీకు ఈ డబ్బులు అవసరం లేకపోతే, ఇతర పెట్టుబడి మార్గాలను పరిశీలించవచ్చు. ఇక మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈ లిక్విడ్ ఫండ్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు. ఎస్కార్ట్స్ లిక్విడ్ ప్లాన్, ఇండియాబుల్స్ లిక్విడ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఫ్లోటింగ్ రేట్ ఫండ్–షార్ట్ టర్మ్ ప్లాన్, యాక్సిస్ లిక్విడ్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్రెజరీ మేనేజ్మెంట్ అకౌంట్ ఫండ్, కోటక్ ఫ్లోటర్ షార్ట్ టర్మ్–రెగ్యులర్ ప్లాన్. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
అపోహలు వదిలేస్తే..కాయ కాదు ఫండే!
♦ ఎన్ఏవీ తక్కువున్నంత మాత్రాన మంచివికావు ♦ సిప్ అంటే ఒక విధానమే... మంచి పథకాలైతేనే రాబడి ♦ మూడేళ్లు దాటినా ఈఎల్ఎస్ఎస్ కొనసాగించవచ్చు ♦ డివిడెండ్ ఇవ్వకపోయినా గ్రోత్ పథకాలు మంచివే ♦ గత పనితీరు భవిష్యత్తుకు గ్యారెంటీ కాదు ♦ రిస్క్ ఉండని ఫండ్ పథకాలూ ఉంటాయి ♦ దీర్ఘకాలమే కాదు; స్వల్పకాలానికీ పెట్టొచ్చు ♦ ఫండ్స్‌పై ఉన్న అపోహలకు జవాబులివిగో... మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. కానీ ఎంత పెరుగుతున్నా... దేశంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్య ఇప్పటికీ జనాభాలో 5 శాతానికి లోపే ఉంది. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా... ఇన్వెస్ట్ చేయాలన్న ఆసక్తి చాలామందిలో ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల విషయంలో ఎన్నో సందేహాలు, అపోహలు వారికి అడ్డు పడుతున్నాయి. మనదేశంలో ఉద్యోగులు, స్వయం ఉపాధి ఉన్నవారి సంఖ్య సుమారు 70 కోట్లుగా ఉన్పప్పటికీ అతి తక్కువ మంది ఫండ్స్‌ను ఆశ్రయిస్తుండటం చూస్తే ఇది తెలియకమానదు. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటపుడు సాధారణంగా వచ్చే సందేహాలేంటి? వాటికి నిపుణులు ఏం చెబుతున్నారు? అదే ఈ వారం ప్రాఫిట్ ప్రత్యేకం... మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లా...? మ్యూచువల్ ఫండ్స్ అంటే షేర్లు కాదు. షేర్లలో పెట్టుబడి పెట్టేవి. అలాగని అన్ని ఫండ్లూ పూర్తిగా ఈ క్విటీ మార్కెట్లతోనే ముడిపడి ఉండవు. కొన్ని ఫండ్లు డెట్‌లో... అంటే ప్రభుత్వం, ఇతర కంపెనీలు ఇష్యూ చేసే రుణ పత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. లిక్విడ్ ఫండ్స్ కూడా ఇంచుమించు అలాంటివే. ఇవన్నీ ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి కనక వీటిలో రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. ఈక్విటీలో పెట్టుబడి పెట్టే ఫండ్స్ కూడా దీర్ఘకాలానికి ఇన్వెస్ట్ చేస్తాయి కనక రిస్క్ తక్కువని చెప్పొచ్చు. సిప్ అంటే ఒక విధానమే... సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) అంటే ఎంచుకున్న కాలావధి ప్రకారం క్రమంగా పెట్టుబడులు పెట్టే ఒక విధానం. ఈ విధానంలో పెట్టుబడులు పెడితే లాభాలొస్తాయని చాలామంది భావిస్తుంటారు. కొందరైతే ఇది రిస్కు కదా అనుకుంటారు. నిజానికి సిప్ అనేది ఒక విధానం మాత్రమే. రాబడులనేవి ఈ సిప్ ద్వారా మనం దేంట్లో పెట్టుబడులు పెడుతున్నామనేదానిపై ఆధారపడి ఉంటుంది. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లోనే కాదు. ఈక్విటీలు, ఆఖరికి బంగారంలో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. అంటే ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని అందులో పెట్టుబడిగా పెడుతుంటే... అప్పటి ధర ప్రకారం మనకు రావాల్సినన్ని యూనిట్లు వస్తాయి. ఒక్కోసారి తగ్గొచ్చు... ఒక్కోసారి పెరగొచ్చు. మొత్తంగా దీర్ఘకాలంలో చూస్తే మాత్రం లాభదాయకమే అన్నది కాదనలేని వాస్తవం. ప్రతి వారం, నెల, లేదా మూడు నెలలకోసారి నిర్దేశించిన మొత్తాన్ని సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. నిర్ణీత తేదీ రోజున బ్యాంకు ఖాతా నుంచి నేరుగా ఎంచుకున్న పథకంలోకి డబ్బులు పెట్టుబడిగా వెళతాయి. సిప్ మొదలు పెడితే ఆపేందుకు అవకాశం లేదన్న అపోహ ఉంది. కానీ, సిప్ మొదలైన తర్వాత కేవలం ఒకే ఒక్క నోటిఫికేషన్‌తో ఎప్పుడు కావాలంటే అప్పుడు నిలిపివేయొచ్చు. మూడేళ్లయితే ఈఎల్ఎస్ఎస్ యూనిట్లు అమ్మేయాలా? ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్లన్న మాట. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఆఫర్ చేసే ఈ ఫండ్లలో ఒకవైపు పొదుపు, మరోవైపు పన్ను ఆదా కూడా ఉంటుంది. అంటే వీటిలో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. కాకపోతే పన్ను ఆదా చేసే ఈ పథకాల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ (ప్రతి పెట్టుబడి వాయిదా తేదీ నుంచి సరిగ్గా మూడేళ్లు) ఉంటుంది. అంటే ఆ కాలంలో విక్రయించేందుకు అవకాశం లేదు. అయితే, మూడేళ్ల తర్వాత వాటిని తప్పనిసరిగా విక్రయించాల్సిన పనిలేదు. కావాల్సినంత కాలం దాన్ని కొనసాగించవచ్చు. అవసరమైతే సిప్ రూపంలో పెట్టుబడులు నిలిపివేయొచ్చు. కానీ పాత పెట్టుబడులు అలాగే ఉంచితే అవి పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే ఫండ్ పనితీరు బాగులేకుంటే ఉపసంహరణను పరిశీలించొచ్చు. ఎన్ఏవీ తక్కువ ఉన్నవే మంచివా...? ఫండ్ యూనిట్లలో ఎక్కువ ఎన్ఏవీ (నెట్ అస్సెట్ వ్యాల్యూ) ఉన్నవే నయమన్న భావన నిజం కాదు. షేర్ల విషయంలోనూ ఇది నిజం కానట్టే... ఫండ్ల విషయంలోనూ ఎన్ఏవీకి వాటి పనితీరుకు సంబంధం ఉండదు. కొన్ని సందర్భాల్లో రూ.10 ఉన్న షేరు రూ.1,000 ఉన్న షేరు కంటే వేగంగా పెరిగే అవకాశముంటుంది. కానీ, ఫండ్స్ విషయంలో ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఫండ్ పనితీరు ఆధారంగా నెట్ అస్సెట్ వ్యాల్యూలో (నికర ఆస్తుల విలువ) వృద్ధి ఉంటుంది. ఇదే ఎన్ఏవీ పెరుగుదలకు కారణమవుతుంటుంది. మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే..? మ్యూచువల్ ఫండ్ కంపెనీ దివాలా తీస్తే నష్టపోవాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ వ్యవస్థ అధిక భద్రతతో కూడుకునే ఉంటుంది. ఇవెప్పుడూ సెబీ నియంత్రణలోనే పనిచేస్తుంటాయి. కనుక స్కామ్ వల్లో, ఏఎంసీ దివాలా తీస్తేనో నష్టపోవాలన్న భయం అక్కర్లేదు. యూనిట్లు ఫండ్ చేతిలో ఉండవు. అవి సంరక్షకుల చేతిలో ఉంటాయి. ఫండ్ మేనేజర్ కేవలం అమ్మకం, కొనుగోలు నిర్ణయాలు మాత్రమే తీసుకోగలరు. గ్రోత్ కంటే డివిడెండ్ ఆప్షన్ మంచిదా? ఫండ్స్‌లో డివిడెండ్, గ్రోత్ ఆప్షన్లని ఉంటాయి. డివిడెండ్ ఆప్షన్ ఎంచుకుంటే రెగ్యులర్‌గా చేతికి డివిడెండ్ వస్తుంది. గ్రోత్ ఆప్షన్ ఎంచుకుంటే చేతికి ఎలాంటి డివిడెండూ రాదు. కాబట్టి చాలామంది డివిడెండ్ ఫండ్స్‌ను ఎంచుకోవటమే మంచిదనుకుంటారు. కానీ డివిడెండ్ ఫండ్ల ఎన్ఏవీ చాలా తక్కువగా పెరుగుతుంటుంది. ఎందుకంటే పెరుగుతున్న విలువను డివిడెండ్ రూపంలో ఎప్పటికప్పుడు చెల్లించేస్తూ ఉంటారు కనక. అదే గ్రోత్ ఫండ్లయితే ఆ డివిడెండ్ మొత్తం కూడా దానిమీదే రీఇన్వెస్ట్ చేయటం జరుగుతుంటుంది. దీంతో గ్రోత్ ఫండ్ల వృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. మన చేతికొచ్చిన డివిడెండ్‌ను మనం ఖర్చు చేసేస్తుంటాం. కానీ గ్రోత్ ఫండ్లలో ఆ మొత్తాన్ని అలాగే ఇన్వెస్ట్ చేస్తూ వెళతారు కనక వీటిని ఎంచుకోవటమే బెటరని చెప్పొచ్చు. ఫండ్స్‌లో కనీసం రూ.5,000 పెట్టాలా? మ్యూచువల్ ఫండ్స్‌లో అన్ని పథకాల్లోనూ ప్రారంభ పెట్టుబడి రూ.5,000 అవసరం లేదు. సిప్ విధానంలో అయితే రూ.500 నుంచీ ప్రారంభించొచ్చు. సిప్ కాకుండా ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 అవసరం. దీర్ఘకాలం కోసమే..? ఫండ్స్ అన్నవి దీర్ఘకాలం కోసమేనన్న అపోహ కూడా నిజం కాదు. లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్‌ను ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలం కోసం ఎంచుకోవచ్చు. వీటిలో 8 నుంచి 12 శాతం వరకూ రాబడులకు వీలుంటుంది. కచ్చితమైన రాబడులొస్తాయా? ఫండ్స్‌లో రాబడులకు ఎలాంటి హామీ ఉండదు. ఇవి ఫిక్స్డ్ డిపాజిట్ల తరహా కానే కావు. ఎక్కువ మంది ఫండ్స్ వైపు రాకపోవడానికి కూడా ఇదే కారణం. ఈక్విటీ పథకాలైతే ఏడాదిలో 50 శాతం రాబడులను సైతం ఇచ్చే అవకాశం ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో 5 నుంచి 15 శాతం, లిక్విడ్ ఫండ్స్‌లో 6 నుంచి 8 శాతం వరకు రాబడులకు వీలుంటుంది. కానీ, ఇవేవీ గ్యారంటీ కావు. మార్కెట్ గమనాలు, వడ్డీ రేట్లపై రాబడులు ఆధారపడి ఉంటాయి. గత పనితీరు భవిష్యత్తులోనూ... గతంలో ఓ పథకం ఇచ్చిన రాబడుల మాదిరిగానే భవిష్యత్తులోనూ రాబడులను ఇస్తుందని భావించడం సరికాదు. కాకపోతే గతంలో మంచి పనితీరుంటే ఇక ముందూ మెరుగ్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందని భావించొచ్చు. ఫండ్ మేనేజర్ తీసుకునే నిర్ణయాలే రాబడులను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒకప్పుడు నంబర్ 1 ఫండ్‌గా ఉన్న హెచ్డీఎఫ్సీ టాప్ 200 ఇప్పుడు టాప్ 10లోనూ లేదు. టాప్ పనితీరు చూపించే ఫండ్స్‌లో 92 శాతం రెండేళ్ల తర్వాత అదే స్థాయిలో ఉండడం లేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఫండ్స్‌లో వైవిధ్యం ఉండాలా..? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒకటికి మించిన పథకాల్లో వైవిధ్యం కోసం పెట్టుబడులు పెట్టాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఓ రంగానికి చెందినవి కాకుండా బ్యాలెన్స్డ్ ఫండ్స్, మల్టీ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవన్నీ వైవిధ్యంతో కూడుకునే ఉంటాయి. వివిధ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులు పెడుతుంటారు. డీ మ్యాట్ ఖాతా ఉండాలా? అక్కర్లేదు. నేరుగా ఫండ్ హౌస్‌ల నుంచే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిడీమ్ చేసుకోవచ్చు. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా ఉండి, స్టాక్ బ్రోకర్ ద్వారా కొంటే అప్పుడు డీమ్యాట్ ఖాతాలో యూనిట్లు జమ అవుతాయి. విక్రయించినప్పుడు డెబిట్ అవుతాయి. డెబిట్ చార్జీల విధింపు కూడా ఉంటుంది. సిప్‌కు ఓకే చెప్పి మర్చిపోవచ్చా...? సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఎంచుకుని మర్చిపోవడం తగదు. ఏటా వాటి రాబడులను సమీక్షిస్తూ అవసరమైతే పథకం నుంచి వైదొగలడం కూడా అవసరమే. సిప్‌లో ఏదైనా ఓ నెల ఎగ్గొడితే? 12 నెలల పాటు ఓ ఫండ్ పథకంలో పెట్టుబడులకు సిప్ ఎంచుకున్నారనుకుందాం. మధ్యలో ఓ నెల బ్యాంకు ఖాతాలో నిధుల్లేక సిప్ ఫెయిలైందనుకోండి. సిప్ విధానం ఆగిపోదు. మరుసటి నెలలో అదే తేదీన తిరిగి వాయిదా పెట్టుబడి కొనసాగుతుంది. కాకపోతే లావాదేవీ ఫెయిలైతే బ్యాంకు కొంత మేర చార్జీ విధించొచ్చు. మార్కెట్లు పడిపోతుంటే సిప్ ఆపేయాలా? నిజానికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు మార్కెట్లు క్షీణించే సమయమే అనుకూలం. ఫండ్ యూనిట్లు తక్కువ ఎన్‌ఏవీకే లభిస్తాయి. మార్కెట్లలో లాభ నష్టాలతో సంబంధం లేకుండా సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కొనుగోలు ధర యావరేజ్ అవుతుంది. టీడీఎస్ కోత ఉంటుందా..? మ్యూచువల్ ఫండ్స్ రాబడులపై మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) అమలు చేయరు. విడిగా వ్యక్తులు వార్షిక రిటర్నుల్లో భాగంగా పన్ను చెల్లించాల్సి ఉంటే చెల్లించాలి. ఎన్ఆర్ఐలకు మాత్రం టీడీఎస్ అమలు ఉంటుంది. సిప్ బెటరా.. ఏకమొత్తం బెటరా? ఒకేసారి పెట్టుబడులు పెట్టే కంటే సిప్ విధానంలో పెట్టుబడులు పెట్టడమే బెటర్. ఇవే సగటున మెరుగైన పనితీరు చూపించగలవు. పాక్షికంగా వెనక్కు... ఫండ్స్‌లో పెట్టుబడులన్నింటినీ వెనక్కి తీసుకోవాలన్న నిబంధన ఏదీ లేదు. మీకెంత అవసరం అనుకుంటే ఆ మేరకే రిడెంప్ట్ చేసుకోవచ్చు. వ్యక్తులకే కాదు... వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు, కంపెనీలు సైతం ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. మారే అవకాశం ఉంది... ఒక ఫండ్ హౌస్‌లో ఒకదాంట్లో నుంచి మరోదాన్లోకి మారే వీలుంది. మీరు ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మంచి రాబడుల కోసం మరో ఫండ్‌లోకి వెళితే బాగుండేది అనుకున్నారు. ఇక్కడ మీరు ఒక ఫండ్‌లోంచి ఇంకొక ఫండ్‌లోకి మీ పెట్టుబడులు మార్చుకునే అవకాశం ఉంది. అంటే మీరు బిర్లా ఏఎంసీ మ్యూచువల్ ఫండ్ నుంచి మరో బిర్లా ఫండ్‌లోకి మారవచ్చన్నమాట. అన్నీ మంచివేనా? మీకు ఒక విషయం తెలుసా? ఎల్ఐసీకి కూడా మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్ ఉంది. అయితే మొత్తం ఫండ్ పరిశ్రమలో అతి పేలవ పనితీరు ప్రదర్శించే ఫండ్స్‌లో ఇదొకటి. అలాగే ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బిజినెస్‌కూ, ఎస్బీఐ బ్యాంకుకు సంబంధం ఉంటుందని భావించవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో తొలిసారి ప్రవేశించే వారు దాదాపు ఎల్ఐసీ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి విశ్వసనీయ బ్రాండ్ల వైపు నడుస్తారు. ఇక్కడ ఫండ్స్ పనితీరు దేనికదిగా విడిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. పన్ను రాబడులు... కేవలం ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో ఏడాదిలో రూ.1.50 లక్షల పెట్టుబడులకు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు ఉంది. ఫండ్స్‌లో పెట్టుబడులు అర్థం కావా? ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తేలిక. మొదటి సారి కేవైసీ అంటే గుర్తింపు, నివాస ధ్రువీకరణలు, బ్యాంకు ఖాతా నంబర్ ఇస్తే సరిపోతుంది. ఆ తర్వాత వాటి అవసరం లేదు. ఆన్లైన్లోనే కొనుగోలు, అమ్మకం చేసుకోవచ్చు. చిరునామా, బ్యాంకు ఖాతా మారినప్పుడు ఆ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలన్నది ఎంచుకోవడం పరిశోధనతో కూడుకున్నది. కష్టమనిపిస్తే ఆర్థిక సలహాదారులు ఉండనే ఉన్నారు. వృద్ధులకు తగినవి కావా...? ఇది నిజం కాదు. రిస్క్ తీసుకోని వారి కోసం డెట్ ఫండ్స్ ఉన్నాయి. స్వల్ప రిస్క్ తీసుకునే వారికి మంత్లీ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి. తరచూ డివిడెండ్ రూపంలో ఆదాయం అందుకోవచ్చు. లేదా ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేసి క్రమానుగతంగా వెనక్కి తీసుకోవచ్చు. దీన్నే సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌గా పిలుస్తుంటారు. ఎప్పుడంటే అప్పుడు విక్రయించుకోవచ్చా? పనిదినాల్లో ఎప్పుడైనా ఫండ్స్ యూనిట్లను అమ్ముకోవచ్చు. విక్రయించిన మేర డబ్బు మీ ఖాతాకు జమ కావాలంటే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. ఒక్కరోజులోనే అందుకోవాలంటే లిక్విడ్ ఫండ్స్ అందుకు అనువైనవి. – సాక్షి, బిజినెస్ విభాగం -
ఈ రోజైనా... రేపైనా... ఎప్పుడైనా మునిగిపోనిదే...‘సిప్’
♦ దీర్ఘకాలంలో భారీ రాబడులకు అనువైన సాధనం ♦ మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లతో సంబంధమే లేదు ♦ గరిష్ఠ స్థాయిల్లో... బాగా పడినా ఎప్పుడైనా ఓకే ♦ నిరంతరం సిప్ చేస్తూ వెళితే పెట్టుబడుల్లో సక్సెసే ♦ ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన ధర రాకున్నా... లాభాలే అది 2007వ సంవత్సరం. స్టాక్ మార్కెట్లు మంచి పరుగుమీదున్నాయి. చాలా షేర్లు వాటి జీవితంలో ఎప్పుడూ చూడనంత స్థాయిల్లో ట్రేడవుతున్నాయి. మ్యూచ్‌వల్ ఫండ్ల విలువలు కూడా భారీగా పెరిగాయి. ఎన్ఏవీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నాయి. అప్పటికే స్టాక్ మార్కెట్లను నమ్ముకుని దీర్ఘకాలంగాపెట్టుబడి పెడుతూ వస్తున్న ఇన్వెస్టర్లు ఇంకొన్నాళ్లు కొనసాగిస్తే మరిన్ని మంచి లాభాలు కళ్ల చూడొచ్చని ఎదురుచూస్తున్నారు. కాకపోతే అప్పటిదాకా స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండి... ఇతర పొదుపు సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్న పలువురి దృష్టి అప్పుడే స్టాక్ మార్కెట్‌పైకి మళ్లింది. ఇక ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే జీవితంలో మళ్లీ ఇలాంటి అవకాశం రాదని చాలామంది భావించారు. పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు. ప్రసాద్, శేఖర్ ఇద్దరూ మంచి సంపాదనాపరులే. పొదుపరులే. అప్పటిదాకా పోస్టాఫీసు, బ్యాంకు డిపాజిట్లు అంటూ ఇన్వెస్ట్మెంట్లు చేసిన వారిద్దరూ... ఓ ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్ సలహాతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులకు సిద్ధమయ్యారు. కాకపోతే ఇద్దరూ పొదుపరులే కానీ... ప్రసాద్‌కు కాస్త ఆశ అధికం. దీంతో అప్పటిదాకా తన డిపాజిట్లలో ఉన్న సొమ్ము మొత్తాన్ని విత్‌డ్రా చేసి... దాదాపు రూ.30 లక్షల మొత్తాన్ని అడ్వయిజర్ చెప్పిన ఒకే ఫండ్‌లో పెట్టుబడిగా పెట్టేశాడు ప్రసాద్. దాని ఎన్ఏవీ కూడా అప్పట్లో దాదాపు రూ.100కు అటూ ఇటూగా ఉంది. శేఖర్‌ది అతిగా ఆశపడే మనస్తత్వం కాదు. అత్యాశకు పోకుండా డిపాజిట్లు అలాగే ఉంచి... వాటిపై నెలకు వచ్చే రూ.20,000 వడ్డీకి, తన జీతంలోంచి మరో రూ.10వేలు కలిపి నెలనెలా అదే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయటం మొదలెట్టాడు. కొన్నాళ్లు బాగానే పెరిగాయి. కానీ 2008లో మార్కెట్ల పతనం మొదలైంది. కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఆ పతనం దెబ్బకు... చాలా షేర్ల ధరలు పాతాళానికి పడిపోయాయి. మంచి కంపెనీలు కూడా దారుణంగా పడ్డాయి. ఫలితం... వీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. దాదాపు ఆరు నెలల వ్యవధిలో శేఖర్, ప్రసాద్ ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఎన్ఏవీ రూ.115 నుంచి ఏకంగా రూ.60కి పడిపోయింది. ఇద్దరూ కాస్త నిరాశపడ్డారు. తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలొస్తాయని భావించిన ప్రసాద్... అదే ఫండ్‌లో మరో రూ.20 లక్షలు తెచ్చి ఇన్వెస్ట్ చేశాడు. శేఖర్ మాత్రం తన సిప్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. తరవాత ఆ ఫండ్ ఎన్ఏవీ తగ్గుతూ తగ్గుతూ చివరికి రూ.18కి కూడా వచ్చింది. ఇక భయం వేసిన ప్రసాద్... ఆ స్థాయిలో మరికొంత డబ్బులు పెట్టేంత ధైర్యం చేయలేకపోయాడు. శేఖర్ మాత్రం తన నెలనెలా ఇన్వెస్ట్ మొత్తాన్ని మరో రూ.5వేల వరకూ పెంచాడు. మార్కెట్లు నెమ్మదిగా కోలుకున్నాయి. ఆ ఫండ్ ఎన్ఏవీ కూడా పెరుగుతూ వచ్చింది. చివరకు 2017 జనవరిలో దాని ఎన్ఏవీ రూ.90 వద్దకు వచ్చింది. అంటే ప్రసాద్, శేఖర్ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించిన ఎన్ఏవీ రూ.100 కన్నా 10 రూపాయలు తక్కువే. అప్పుడు ఇద్దరూ ఒకసారి తమ ఇన్వెస్ట్మెంట్లు ఏ మేరకు పెరిగాయో చూసుకున్నారు. ప్రసాద్ అప్పటిదాకా రెండు విడతలుగా రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. రూ.90 ఎన్ఏవీ వద్ద తన ఇన్వెస్ట్మెంట్ విలువ దాదాపు రూ.57 లక్షలుగా ఉంది. అంటే పదేళ్లు రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే వచ్చిన లాభం... కేవలం రూ.7 లక్షలు. కనీసం బ్యాంకు డిపాజిట్లలో పెట్టినా రెట్టింపునకు పైగా పెరిగి ఉండేదని బాధపడ్డాడు ప్రసాద్. మరి శేఖర్ పరిస్థితి చూస్తే... తను నికరంగా నెలనెలా రూ.30వేల చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. మార్కెట్లు బాగా పతనమయ్యాక 2011లో దాన్ని మరో రూ.5వేలు పెంచాడు కూడా. నికరంగా చూస్తే తను ఇన్వెస్ట్ చేసింది 110 నెలల్లో 36 లక్షలు. తను పెట్టుబడి ప్రారంభించింది రూ.100 ఎన్ఏవీ వద్ద. అది ఇప్పటికీ రూ.90 దగ్గరే ఉంది. కానీ శేఖర్‌కు ఇన్వెస్ట్మెంట్లపై మంచి రాబడులొచ్చాయి. తన 36 లక్షలు కాస్తా రూ.1.3 కోట్లయ్యాయి. పైపెచ్చు తను బ్యాంకులో మొదట పెట్టిన డిపాజిట్లు అలాగే ఉన్నాయి. అవి కూడా దాదాపు రూ.80 లక్షలకు చేరటంతో తన పెట్టుబడుల విలువ రూ.2 కోట్లు దాటేసింది. ఇది చూసిన ప్రసాద్ కంగుతిన్నాడు. తాను ఒకేసారి రూ.50 లక్షలు ఇన్వెస్ట్ చేసినా 7 లక్షలు మాత్రమే లాభం వచ్చిందని, ఆ ఫండ్ బాగా పెరగకపోయినా శేఖర్‌కు మాత్రం అంత లాభమెలా వచ్చిందని ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్‌ను ప్రశ్నించాడు. ఆ అడ్వయిజర్ ఇచ్చిన సమాధానమేంటో తెలుసా? ‘‘అదే బాబూ!! సిప్ మహిమ’’ అని. నిజం... ఇదంతా సిప్‌గా పిలిచే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ మాయ. ఆపకుండా కొనసాగిస్తే చాలు పెట్టుబడులకు సంబంధించి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇబ్బంది కానే కాదు. చేయాల్సిందల్లా... సాధ్యమైనంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడమే. పెట్టుబడులను ఆపకుండా కొనసాగించడమే. కొంతమంది ఈక్విటీ మార్కెట్లు పతనం అయిన సమయంలో ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆపేస్తుంటారు. పెరిగినప్పుడు పెట్టుబడులు పెడుతుంటారు. ఇది ఏ మాత్రం సరైన విధానం కానే కాదు. ఎందుకంటే పతన సమయంలో మంచి షేర్లు కూడా తక్కువ ధరలకే అందుబాటులో ఉంటాయి. ఈ విధమైన సమస్యలకు పరిష్కారమే సిప్. తగినంత రక్షణతోపాటు సాధ్యమైనంత రాబడులకు సిప్ విధానంలో అవకాశం ఉంటుంది. దీర్ఘకాలమైతే మరీ లాభం! మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సిప్ ఉత్తమ సాధనం. ఇది క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడులకు మళ్లిస్తుంది. మార్కెట్లు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానితో సంబంధం లేకుండా పెట్టబడులు కొనసాగుతాయి. ఉదాహరణకు మార్కెట్లు హెచ్చు స్థాయిల్లో ఉన్నప్పుడు ఓ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ రూ.20 ఉందనుకోండి. మీరు ప్రతి నెలా రూ.10వేలు సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్నారనుకుంటే 500 యూనిట్లు వస్తాయి. ఒకవేళ మార్కెట్లు కరెక్షన్కు గురై ఈ ఎన్ఏవీ మరుసటి నెలలో రూ.16కు తగ్గిందనుకోండి. అప్పుడు రూ.10,000కు 625 యూనిట్లు వస్తాయి. దీంతో సగటు కొనుగోలు ధర మార్కెట్ రేటు కంటే తక్కువే ఉంటుంది. దాంతో రాబడుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు విక్రయించుకున్నా లాభాలను తీసుకోవచ్చు. దీంతో తక్కువలో కొని, ఎక్కువలో విక్రయించాలన్న లక్ష్యం సాకారమవుతుంది. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు... ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు మార్కెట్లు బాగా పెరిగి ఉన్నాయి కదా... కాస్త కరెక్షన్ వస్తే చేద్దామని చూస్తుంటారు. అవి ఒకోసారి పడకుండా అలా పెరిగిపోతూనే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సిప్ ఉత్తమం. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు చేయకూడదు... వంటివి సిప్ విషయంలో అవసరం లేదు. కొత్తగా పెట్టుబడులు మొదలు పెట్టిన వారైనా, ఇప్పటికే ఎంతో కాలంగా ఇన్వెస్ట్ చేస్తున్న వారైనా సిప్ విలువను పూర్తిగా అర్థం చేసుకోవాలి. సంపద సృష్టి ఇలా... సిప్ విధానంలో పొందే రాబడులు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయన్నది నిపుణులు ఘంటాపథంగా చెప్పే మాట. వ్యాల్యూ రీసెర్చ్ వ్యవస్థాపకుడు ధీరేంద్ర కుమార్ సిప్ మహత్తు గురించి చెప్పేందుకు ఓ నాలుగు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో గత 20 ఏళ్ల రాబడులను ఉదాహరణగా పేర్కొన్నారు. రూ.5,000 చొప్పున నెలనెలా ఇన్వెస్ట్ చేసి ఉంటే 20 ఏళ్లలో నికర పెట్టుబడి రూ.12 లక్షలు. కానీ రాబడులతో కలుపుకుంటే ఈ నిధి 20 ఏళ్ల తర్వాత రూ.1.21 కోట్ల నుంచి రూ.2.05 కోట్ల వరకు పథకాన్ని బట్టి వృద్ధి చెంది ఉండేది. అందుకే సాధ్యమైనంత ముందుగా పెట్టుబడులను ఆరంభించాలి. సిప్ విధానంలో పెట్టుబడి పెడుతూ వెళ్లాలి. ఈ సూత్రాన్ని ఫాలో అయితే చాలు లక్ష్యాలకు తగ్గట్టు రాబడులను అందుకోవచ్చు. ఇది గమనించాలి సుమా! ఇక్కడ ఇన్వెస్టర్లంతా గమనించాల్సిందొకటుంది. సిప్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ విధానం మాత్రమే. సిప్ పద్ధతిలో పెట్టుబడులు పెట్టినంత మాత్రాన భారీ లాభాలు రావు. సిప్ చేయటానికి ఎంచుకున్న ఇన్వెస్ట్మెంట్ సాధనమూ ఇక్కడ కీలకమే. మనం ఇన్వెస్ట్ చేయబోయే ఫండ్ తాలూకు చరిత్ర, సుదీర్ఘకాలంగా అవి ఇస్తున్న రాబడులు... అన్నీ చూశాకే ఎంచుకోవాలి. మంచి ఫండ్‌ను ఎంచుకుంటే చక్కని రాబడులు అవే వస్తాయి. -
పన్నుకు మందు..లాభాల్లోనూ ముందు!!
► ఈఎల్ఎస్ఎస్లవైపు మదుపరుల మొగ్గు ► చివరి నిమిషం పన్ను ఆదాకోసం వీటివైపు చూపు ► ఐదేళ్లుగా 20 శాతానికిపైగా రాబడులనిస్తున్న పథకాలు ► గడిచిన ఒక్క ఏడాదిలో చూస్తే 30 శాతంపైనే రాబడి ► దీర్ఘకాలానికి ఇవే ఉత్తమమంటున్న నిపుణులు ► ‘సిప్’ పద్ధతిలో ఇన్వెస్ట్ చేస్తే ఇంకా మంచిదని సూచన ► గడిచిన 10 నెలల్లోనే రూ.6వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఇది పన్నుల కాలం. అంటే... ఒకవైపు జీతంలో పన్ను కోతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి... వాటిని తప్పించుకోవటానికి హడావుడిగా వివిధ పొదుపు పథకాలవైపు పరుగులు తీసే కాలం. ఎవరెన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టినా... అందరూ ఎక్కువగా లబ్ధి పొందేది సెక్షన్ 80సీ నుంచే. దానిక్కూడా గరిష్ఠ పరిమితి రూ.1.5 లక్షలే. దీన్లో కూడా వివిధ బీమా పథకాలు, పిల్లల స్కూళ్లకు చెల్లించే ట్యూషన్ ఫీజులు తీసేస్తే... మహా అయితే ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సింది ఏ రూ.50 వేలో ఉంటుంది. సరే!! మరి ఈ 50వేలైనా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎక్కడైతే మన సొమ్ముకు కాస్తంత ఎక్కువ రాబడి వస్తుంది? ఎక్కడైతే దీర్ఘకాలంలో ఊహించనంత లాభాలొస్తాయి? ఇలా ఆలోచించే వారందరికీ కనిపించే పరిష్కారమే ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ పథకాలు(ఈఎల్ఎస్ఎస్). సంక్షిప్తంగా ఈఎల్ఎస్ఎస్లు. ఒకవైపు పన్ను ప్రయోజనాలు... మరోవైపు చక్కని రాబడులు.. ఈ రెండూ కలసి ఉండటమే వీటి ప్రత్యేకత. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద బ్యాంకు డిపాజిట్లు, చిన్నమొత్తాల పొదుపు పథకాలు, బాండ్లు తదితరాల్లో పెట్టుబడి పెట్టినా పన్ను భారం తగ్గుతుంది. కానీ, చక్కని రాబడి కావాలంటే ఈఎల్ఎస్ఎస్ను పరిశీలించాల్సిందే. ఇవి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు కనక వీటి రాబడికి ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ చరిత్ర చూస్తే వీటి రాబడులు మెరుగ్గానే ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ కింద పెట్టే పెట్టుబడుల్లో సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 30 శాతం శ్లాబులో ఉన్నవారికైతే ఏడాదికి రూ.7,500 పన్ను ప్రయోజనం లభించినట్టే. అదే పది, ఇరవై ఏళ్ల కాలంలో ఆదా చేసుకునే పన్ను మొత్తం, రాబడులను అంచనా వేస్తే... ఈ అవకాశాన్ని ఎవరూ కాదనుకోరు. పెరుగుతున్న పెట్టుబడులు చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోయాయి. దీంతో ఈఎల్ఎస్ఎస్ పథకాలను ఎంపిక చేసుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోంది. – రాఘవ్ అయ్యంగార్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వైస్ ప్రెసిడెంట్ పథకాల పనితీరు బాగు దీర్ఘకాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు చాలా బాగుంది. చాలా మంది ఈఎల్ఎస్ఎస్ను పన్ను ఆదాకు ఒక అవకాశంగా చూస్తున్నారు – హిమాన్షు వ్యాపక్, రిలయన్స్ కేపిటల్ అస్సెట్ మేనేజ్మెంట్ డిప్యూటీ సీఈవో ‘సిప్’ పద్ధతికి పెరుగుతున్న ఆదరణ బ్యాంకు డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో రాబడులు బాగా తగ్గిపోతున్న తరుణంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎక్కువ మందికి తెలిసేవి కావు. ఇపుడా పరిస్థితి మారింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేవి షేర్లలో పెట్టుబడి పెడతాయి కనక వీటికి గణనీయమైన రాబడులందించే సామర్థ్యం ఉంటుంది. వీటిలో రిస్క్ ఉంటుందనేది నిజమే అయినా... నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్)లో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ వెళితే రిస్క్ దాదాపు ఉండదనే చెప్పాలి. పైగా రాబడుల శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. నేరుగా స్టాక్ మార్కెట్లో మదుపు కంటే ఇది సురక్షితమని చెప్పొచ్చు. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు... ఈఎల్ఎస్ఎస్ల పనితీరు కూడా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లానే ఉంటుంది. కాకపోతే పన్ను మినహాయింపుల కోసం ఇందులో పెట్టే పెట్టుబడులను మూడేళ్ల దాకా వెనక్కి తీసుకోవడానికి ఉండదు. దీనివల్ల దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగుతాయి. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లో రాబడులు మెరుగ్గా ఉండడానికి ప్రధాన కారణమిదే. దీనివల్ల ఫండ్ మేనేజర్లకు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఫలితంగా వారు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. అధిక రాబడులకు అవకాశం ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి పెట్టుబడుల వరద... మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2016 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు పది నెలల కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాల్లోకి 940 మిలియన్ డాలర్లు్ల వచ్చాయి. అంటే సుమారు రూ.6,194 కోట్లు. ఇదే కాలంలో పన్ను ఆదా చేసే మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ 29 శాతానికి పైగా ఎగసి జనవరి చివరికి రూ.53,886 కోట్లకు చేరింది. నిజానికి నెలనెలా సిప్ విధానంలో కంటే ఆర్థిక సంవత్సరం ముగియడానికి ముందే ఎక్కువ మంది ఈఎల్ఎస్ఎస్ పథకాల వైపు చూస్తుంటారు. జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో పన్ను భారం తప్పించుకునేందుకు ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టే ధోరణి ఎక్కువగా ఉంది. వార్షిక రాబడి 30 శాతం కూడా దాటింది మరి!! మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ గతేడాది డిసెంబర్‌కు రూ.16.46 లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది రూ.20 లక్షల కోట్లను దాటుతుందని అంచనా. గడిచిన ఏడాది కాలంలో ఈఎల్ఎస్ఎస్ పథకాలు మెరుగైన రాబడులనిచ్చాయి. 30 శాతానికి పైగా రాబడులను ఇచ్చిన ఈఎల్ఎస్ఎస్ పథకాలు చాలానే ఉన్నాయి. వాటినొకసారి చూస్తే... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం -
ఈక్విటీ ఫండ్స్‌లో డివిడెండ్ ఆప్షన్ ఓకేనా?
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. వీటికి లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లు కాబట్టి... ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనదా లేకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయమంటారా? –సురేశ్, విశాఖపట్టణం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. పన్ను ప్రయోజనాలతో పాటు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులను కూడా పొందవచ్చు. ఇతర ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో లాగానే ఈఎల్ఎస్ఎస్ల్లో కూడా సిప్(సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం సముచితం. ఒకవేళ మీ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులుంటే వాటిని నెలకి కొంత మొత్తంగా విభజించి సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈక్విటీ మార్కెట్ గరిష్ట స్థాయిలో ఉండి, . ఆ తర్వాత పతనమైనప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో కొంత భాగం హరించుకుపోతుంది. ఈ రిస్క్ ఉండకూడదనుకుంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా సిప్ విధానంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. సాధారణంగా చాలా మంది పన్ను ఆదా నిమిత్తం ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపద సృష్టించుకోవచ్చు కూడా. కనీసం 5 నుంచి ఏడేళ్ల పాటు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లపై ఎలాంటి పన్ను లేనందున డివిడెండ్ ఆప్షన్ ను ఎంచుకోవాలనుకుంటున్నాను. నా నిర్ణయం సరైనదేనా? – స్పందన, హైదరాబాద్ మీ నిర్ణయం సరైనది కాదు. కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. మీకు క్రమానుగతంగా డబ్బులు అవసరమైతేనే మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, రిటైరైన తర్వాత మీకు వైద్య, ఇతర ఖర్చుల కోసం నెలా నెలా కొంత మొత్తం డబ్బులు అవసరమవుతాయి. ఇలాంటి సందర్బాల్లోనే డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేసుకోవడం, సొంత ఇల్లు సమకూర్చుకోవడం వంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసమైతే మీరు గ్రోత్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే డివిడెండ్ చెల్లింపు మొత్తాన్ని కూడా మళ్లీ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి, చక్రగతి వృద్ధితో ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై మంచి రాబడులు వస్తాయి. అలా కాకుండా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకున్నారనుకోండి. వచ్చే డివిడెండ్లు స్వల్పంగా ఉంటాయి. వీటిని ఖర్చు చేయడమో, లేకుంటే స్వల్పరాబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడమో జరుగుతుంది. ఇవి అలా వృ«థా అయిపోతాయి. ఈక్విటీ ఫండ్స్ డివిడెండ్లపై ఎలాంటి పన్నులు లేవు. ఏడాది తర్వాత ఈక్విటీ ఫండ్స్‌ను విక్రయిస్తే, ఎలాంటి మూలధన లాభాల పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని కేవలం పన్ను అంశాలు ఆధారంగా డివిడెండ్ ఆప్షన్‌ను ఎంచుకోవడం అర్థం లేనిది. నా ప్రజా భవిష్యనిధి(పీపీఎఫ్) ఖాతాను రెండు దఫాలుగా పదేళ్లపాటు పొడిగించాను. ఇలా పొడిగించిన తర్వాత పీపీఎఫ్ ఖాతాపై వచ్చే రాబడులపై నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉందా? – రాజేశ్, బెంగళూరు రెండు దఫాలుగా పొడిగించిన తర్వాత కూడా మీ పీపీఎఫ్ ఖాతా రాబడులపై మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. పన్ను పరంగా పీపీఎఫ్‌ను 3ఈ ఎగ్జెంప్ట్(మినహాయింపు)–ఎగ్జెంప్ట్–ఎగ్జెంప్ట్)గా వ్యవహరిస్తారు. అంటే మూడు దశల్లో(ఇన్వెస్ట్ చేసేటప్పుడు–మీ ఇన్వెస్ట్మెంట్స్ వృద్ధి చెందేటప్పుడు–ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునేటప్పుడు) పన్ను మినహాయింపులుంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసే దశలో పీపీఎఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే వడ్డీపై కూడా ఎలాంటి పన్ను భారం ఉండదు. ఇక మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకునేటప్పుడు కూడా మీపై ఎలాంటి పన్ను భారం ఉండదు. మెచ్యురిటీ తీరిన తర్వాత పొడిగించిన పీపీఎఫ్ ఖాతాలకు కూడా ఇదే వర్తిస్తుంది. ప్రస్తుతం నా వయస్సు 52 సంవత్సరాలు. ఎల్ఐసీ జీవన్ అక్షయ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. వడ్డీరేట్లు పడిపోతున్న నేపథ్యంలో దీర్ఘకాలానికి ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయడం సరైనదేనా? – జాన్సన్, విజయవాడ ఎల్ఐసీ జీవన్ అక్షయ్ సిక్స్ అనేది తక్షణ యాన్యుటీ ప్లాన్. మీరు వన్‌టైమ్ ప్రీమియమ్ చెల్లించారనుకోండి. మీరు బతికున్నంత కాలం మీకు నెలవారీ లేదా సంవత్సరానికొకసారి కొంత మొత్తం చెల్లిస్తారు. మీరు చెల్లించిన ప్రీమియమ్‌ను తిరిగి పొందే ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే మీకు నెలవారీ వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలనే దానిపై గరిష్ట పరిమితి లేదు. చెల్లింపులు ఎలా కావాలనుకుంటే అలా (నెలవారీ, మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి, ఏడాదికొకసారి) ఎంచుకోవచ్చు. ఇలాంటి సంప్రదాయ పెన్షన్ ప్లాన్లకు దూరంగా ఉండడమే మంచిది. ఇవి ఖరీదైనవి. ఈ తరహా ప్లాన్‌ల్లో పారదర్శకత ఉండదు. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, లేదా పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లతో పోల్చితే ఈ స్కీమ్‌లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. -
ఎస్టీపీ అంటే ఏమిటి? దీని వల్ల ప్రయోజనమెంత?
సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) గురించి తెలుసుకునే ముందు సిప్ విధానంపై అవగాహన తెచ్చుకోవాలి. ఒక నిర్ణీత మొత్తాన్ని ప్రతి నెల ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంలో పెట్టుబడిగా పెట్టడాన్ని సిప్‌గా పేర్కొనవచ్చు. ఇన్వెస్ట్మెంట్లలో అస్థిరతను తప్పించుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఎస్టీపీ కూడా సిప్ లాంటిదే. యూనిట్ హోల్డర్ ఒక నిర్ణీత మొత్తాన్ని నిర్దేశిత కాలంలో ఒక స్కీమ్ నుంచి మరొక స్కీమ్‌కు బదిలీ చేసుకోవడాన్నే ఎస్టీపీగా పరిగణిస్తాం. ఈ విధానంలో ఇన్వెస్టర్ తన పెట్టుబడులను పలు అసెట్ తరగతులకు సులభంగా బదిలీ చేసుకోవచ్చు. దీని ద్వారా పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్స్ సరళతరం అవుతుంది. మార్కెట్ అస్థిరత నుంచి తప్పించుకోవడానికి, ఆర్థిక లక్ష్యాల సాకారానికి ఎస్టీపీ దోహదపడుతుంది. ఎస్టీపీ రెండు రకాలు. మొదటిది ఫిక్స్డ్ ఎస్టీపీ. ఇందులో ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి కొంత స్థిర మొత్తాన్ని వేరొక ఇన్వెస్ట్‌మెంట్‌కు బదిలీ చేస్తాడు. ఇక రెండవది క్యాపిటల్ అప్రిషియేషన్ ఎస్టీపీ. ఇక్కడ ఇన్వెస్టర్ ఒక ఇన్వెస్ట్మెంట్లో వచ్చిన ప్రాఫిట్‌ను మాత్రమే వేరొక ఇన్వెస్ట్మెంట్లోకి బదిలీ చేస్తాడు. ఉత్తమ ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో సిప్ది ఎప్పుడు అగ్రస్థానమే. ఇక దీని తర్వాతి స్థానం మాత్రం ఎస్టీపీది. మార్కెట్లో అస్థిరతను అధిగమించడానికి ఎస్టీపీ ఎలాగైతే ఉపయోగపడుతుందో.. అదేవిధంగా మార్కెట్ బుల్లిష్‌గా ఉన్నప్పుడు వచ్చే లాభాలు తగ్గడానికి కూడా ఇది కారణంగా నిలువొచ్చు. -
ఎంఎఫ్ ఇన్వెస్టర్లకు పేపర్ లెస్ ‘సిప్’..!
♦ దీపావళికల్లా అందుబాటులోకి ♦ తీసుకురానున్న బీఎస్ఈ ముంబై: మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు కాగిత రహిత(పేపర్‌లెస్) సిప్ విధానాన్ని అందుబాటులోకి తేవాలని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలాఖరు, దీపావళికల్లా ఈ కాగిత రహిత సిప్‌ను అందించే అవకాశాలున్నాయని బీఎస్ఈ ప్రతినిధి వెల్లడించారు. ఈ కాగిత రహిత సిప్ కారణంగా ఇన్వెస్టర్లకు కాలం బాగా ఆదా అవుతుందని, నెట్ బ్యాంకింగ్‌తో సహా వివిధ చెల్లింపుల విధానాల్లో సిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయవచ్చని వివరించారు. ఈ కొత్త విధానంలో ఎలాంటి ధ్రువపత్రాలు దాఖలు చేసే అవసరం లేనందున, సంతకాలు ఇతర విషయాల్లో తప్పులున్నాయనే కారణాలతో తిరస్కరణకు గురయ్యే సమస్య కూడా ఉండదని పేర్కొన్నారు. బీఎస్ఈ స్టార్ ఎంఫ్ ద్వారా ఈ కాగిత రహిత సిప్‌ను అందిస్తామని వివరించారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు తమ క్లయింట్ల కోసం ఎక్స్చేంజ్ సిప్(ఎక్స్సిప్)ద్వారా మాత్రమే నమోదు చేసే ఆప్షన్ ఉందని, ఈ విధానంలో ఇన్వెస్టర్లు ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) ద్వారా చెల్లింపులు జరిపే వీలు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఇక కొత్త కాగిత రహిత సిప్ విధానంలో ఏసీహెచ్(ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్)/ఈసీఎస్ లేదా డెరైక్ట్ డెబిట్ మాండేట్ ఫారమ్ అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో రిజిస్ట్రేషన్ ఊసే ఉండదని వివరించారు. ఈ విధానం కోసం ప్రముఖ చెల్లింపుల అగ్రిగేటర్‌తో బీఎస్ఈ ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు. ఈ కొత్త విధానం వల్ల తమ చెల్లింపులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఇన్వెస్టర్లకు పూర్తి నియంత్రణ ఉంటుందని వివరించారు. బీఎస్ఈ స్టార్ మ్యూచువల్ ఫండ్... భారత్‌లో అతిపెద్ద ఎంఎఫ్ డిస్ట్రిబ్యూటర్ ప్లాట్‌ఫామ్.. నెలకు నాలుగు లక్షల సిప్ లావాదేవీలు జరుగుతాయి. -
నీరు ఎంత కావాలో ఈ బాటిల్ చెప్తుంది
-
భవిష్యత్తులో పసిడికి డిమాండ్
హిందువుల పర్వదినాల్లో అక్షయ తృతీయది ప్రత్యేక స్థానం. ఈ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలకు లోటు ఉండదని భావిస్తారు. ఈ రోజు అన్నపూర్ణ దేవి, పరుశురాముడు జన్మించడం, ఇదే రోజు కుబేరుడికి సంపద రావడం, వినాయకుడు మహాబారత రచనను ప్రారంభించడం వంటి అనేక సంఘటనలు జరగడంతో దీన్ని హిందువులు చాలా పవిత్రమైన దినంగా కొలుస్తారు. ఈ రోజు బంగారం కొంటే అది అక్షయము అవుతుందన్న నమ్మకం. ఈ నమ్మకాల మాట అటుంచితే.. గత కొంతకాలంగా లాభాలు అందించని బంగారం రానున్న కాలంలో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. ధర మళ్లీ పైకే: అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, డాలరు రూపాయి మారకం వంటి అనేక అంశాల వల్ల ఏడాది కాలంగా బంగారం స్థిరంగా కదులుతోంది. కాని ఇదే సమయంలో చైనాలో బంగారం వినియోగం బాగా పెరుగుతోంది. రానున్న కాలంలో చైనాలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇండియాకి సంబంధించి పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో ఇక్కడ కూడా పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సుంకాలు విధించి, దిగుమతులపై ఆంక్షలు పెట్టడంతో బంగారం లభ్యత తగ్గి ధరలు పెరిగే విధంగా చేస్తోంది. బాసెల్-3 నిబంధనలు అందుకోవడానికి ప్రపంచంలోని పలు బ్యాంకులు బంగారం నిల్వలు పెంచుకునే పనిలో ఉన్నాయి. కాని ఇదే సమయంలో అంతర్జాతీయంగా కొన్ని రాజకీయ పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మధ్య ప్రాచ్య, నల్ల సముద్ర ప్రాంతాల్లో ఉన్న రాజకీయ ఒత్తిళ్లు బంగారం ధరలను పెంచేవిధంగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న కాలంలో బంగారం ధరలు మళ్లీ పై దిశగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈటీఎఫ్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ, డెట్ పథకాలతో పాటు బంగారానికి కూడా చోటు కల్పించాలి. ఈక్విటీ, డెట్లు నష్టాలు అందిస్తుంటే... వాటిని పూడ్చే శక్తి బంగారానికే ఉంది. నేరుగా బంగారాన్ని కొని భద్రపర్చడం కష్టమైన పని. బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇప్పుడు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనం. ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం అంటే స్వచ్ఛమైన బంగారాన్ని కొన్నట్లే. అంతేకాదు వీటిద్వారా బంగారాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొని అమ్ముకోవచ్చు. ఈ మధ్యనే ఇండియాలో గోల్డ్ ఈటీఎఫ్‌లపై అవగాహన పెరుగుతుండటంతో పుత్తడికి డిమాండ్ పుంజుకుంటోంది. - లక్ష్మీ అయ్యర్, సీఐవో(డెట్), కోటక్ మ్యూచువల్ ఫండ్ -
ఇలా కూడా ‘సిప్’ చేయొచ్చు
సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ముద్దుగా సిప్. ఇన్నాళ్లూ సిప్ అంటే మనకు తెలిసిందొకటే. నెలనెలా కొంత మొత్తాన్ని క్రమం తప్పకుండా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటం. కానీ... ఇపుడు సిప్ చేసే పద్ధతి కూడా మారుతోంది. రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూనే... కావాలనుకున్నపుడు కొన్నాళ్లు విరామం తీసుకోవచ్చు. అంటే మార్కెట్లు మరీ గరిష్ట స్థాయిలో ఉన్నాయనిపిస్తే... ఆ నెలో, రెండు నెలలో సిప్ చేయటం ఆపేయొచ్చు. మళ్లీ కాస్త తగ్గాయనిపించినపుడు చేయొచ్చు. అదీ కొత్త కథ. అదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం కూడా... కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. దీనికి తోడు ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ హెచ్చు తగ్గులు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సూచీలు గరిష్ట స్థాయిల వద్ద ఉన్నప్పటికీ చాలా షేర్లు విలువ పరంగా బాగా పడిపోయి ఉన్నాయి. కొన్ని ఆకర్షణీయంగా కనిపిస్తున్నా... భవిష్యత్తులో పెరుగుతాయో లేదో తెలియని పరిస్థితి. ఇలాంటి సమయాల్లో సిప్ ఎంచుకోవడమే మంచిదంటున్నారు మార్కెట్ నిపుణులు. మ్యూచువల్ ఫండ్ సంస్థలు సిప్ ఖాతాదారులను ఆకర్షించడానికి సరికొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. అవి... డైలీ సిప్: నెలకు ఒకసారి కాకుండా ప్రతిరోజూ ఇన్వెస్ట్ చేసేదే డైలీ సిప్. ఉదాహరణకు డాయిష్ మ్యూచువల్ ఫండ్ రోజుకు కనిష్టంగా రూ.300 చొప్పున కనిష్టంగా రెండు నెలలు ఇన్వెస్ట్ చేసేలా దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐ సిప్: ఆన్లైన్ ద్వారా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశమిచ్చేదే ఈ ఐ సిప్. దాదాపు అన్ని మ్యూచు వల్ ఫండ్ సంస్థలూ ఇపుడు ఆన్లైన్లో సిప్ ఇన్వెస్ట్మెంట్లను అందుబాటులోకి తెచ్చాయి. సిప్ పాజ్: రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేస్తూనే... చేతిలో డబ్బులు లేకున్నా, మార్కెట్లు గరిష్ట స్థాయిలో ఉండి తక్కువ యూనిట్లు వస్తాయనిపించినా బ్రేక్ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఈ మధ్యే బరోడా పయనీర్ సిప్ పాజ్ అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం వివిధ సందర్భాల్లో గరిష్టంగా 3 ఇన్స్టాల్మెంట్స్ వరకు ఆపొచ్చు. సిప్ ఇన్ డెట్: ఈ మధ్య కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు డెట్ ఫండ్స్‌లో కూడా సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్స్‌ను ఆరంభించాయి. ఎస్టీపీ: అంటే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మీ దగ్గరున్న మొత్తాన్ని తక్కువ రిస్కుండే డెట్ పథకాల్లో మొదట ఇన్వెస్ట్ చేసి, దాన్నుంచి ఈక్విటీ ఫండ్‌లోకి ప్రతి నెలా కొంత ఇన్వెస్ట్ చేసే విధానమిది. సిప్ పనిచేసేదిలా... స్టాక్ మార్కెట్లు పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? అన్నదాంతో సంబంధం లేకుండా ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడమే సిప్. ఇలా చేసినపుడు మార్కెట్లు పడిపోతున్నాయనో, పెరిగిపోతున్నాయనో ఆందోళన ఉం డదు. ఎందుకంటే ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తున్నాం కనక... మార్కెట్లు బాగా పెరిగి ఉన్నపుడు మన సొమ్ముకు తక్కువ యూనిట్లు వచ్చినా... మార్కెట్లు తగ్గి ఉన్నపుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఒడిదుడుకుల నుంచి రక్షణ లభిస్తుందన్న మాట. అధిక లాభాలు... చిన్న ఉదాహరణ చూద్దాం. రాజేష్ 2009 ఫిబ్రవరిలో తన దగ్గరున్న రూ.1.2 లక్షలను ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఫండ్‌లో ఒకేసారి ఏకమొత్తంగా ఇన్వెస్ట్ చేశాడు అనుకుందాం. ఈ ఐదేళ్లలో ఈ పథకం మొత్తమ్మీద 24 శాతం రాబడి అందించింది. అంటే రాజేష్ ఇన్వెస్ట్మెంట్ ఇపుడు రూ.1.48 లక్షలకు చేరింది. ఇదే ఫండ్‌లో రాకేష్ మాత్రం ఒకేసారి కాకుండా 2009 ఫిబ్రవరి నుంచి నెలకు రూ.2,000 చొప్పున ఇన్వెస్ట్ చేశాడు. ఈ ఐదేళ్లలో తను కూడా రూ.1.20 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ తనకు మొత్తమ్మీద 35 శాతం రాబడి లభించింది. తన మొత్తం ఇపుడు రూ.1.62 లక్షలకు చేరింది. గత ఐదేళ్లలో మన స్టాక్ మార్కెట్లు తీవ్రమైన హెచ్చు తగ్గులకు లోనవటంతో ఇది సంభవించింది. రాజేష్‌కు ఒకేసారి తన మొత్తమంతా పెట్టడం వల్ల వడ్డీ కూడా చాలావరకు నష్టపోయాడు. రాకేష్ మాత్రం నెలకు కొంత చొప్పున పెట్టడం వల్ల పెద్దగా ఇబ్బంది పడకున్నా తగిన లాభం మాత్రం పొందాడు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం సిప్ ప్రయోజనాలు... హా మార్కెట్లు పెరుగుతుంటే తక్కువ యూనిట్లు పతనం అవుతున్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి కనక కాస్ట్ యావరేజింగ్కి ఉపయోగపడుతుంది. మార్కెట్లు పెరుగుతాయా? పడతాయా? అనే సందేహాలను పక్కనబెట్టి ఇన్వెస్ట్మెంట్ కొనసాగించవచ్చు. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడం వలన ఆర్థిక క్రమశిక్షణ అలవాటవుతుంది. కొంచెం కొంచెం మొత్తాలతో దీర్ఘకాలంలో పెద్ద నిధిని సమకూర్చుకోవచ్చు.