డబ్బు ఖర్చు పెట్టడం సులువు. అదే సంపాదించాలంటే కొంత కష్టపడక తప్పదు. కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో విలాసవంత వస్తువులు కొనుగోలు చేయడంకంటే ఆ డబ్బును పొదుపు చేసి మరింత డబ్బు సంపాదించాలని చాలామంది సూచిస్తున్నారు. ఈమేరకు పొదుపునకు సంబంధించి సౌరవ్‌దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. కేవలం రూ.20 వేలతో రూ.17 లక్షలు పోగుచేసే మార్గాన్ని సూచించారు. రవి అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఆ డబ్బు ఎలా సమకూరుతుందో వివరించారు.
‘రవి అనే వ్యక్తి రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొనాలనుకున్నాడు. అందుకు ఐదేళ్లపాటు నెలవారీ రూ.20 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కారు వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి 2030 నాటికి దాని విలువ రూ.నాలుగు లక్షలు అవుతుంది. అంటే ఐదేళ్లలో అది రూ.ఆరు లక్షలు తగ్గిపోతుంది. అదే తన వద్ద ఉన్న రూ.20 వేలను రవి నిఫ్టీ ఈటీఎఫ్‌లో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 2030 నాటికి తన వద్ద ఏకంగా రూ.17 లక్షలు జమవుతాయి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతిలోనే ఉంటుంది’ అని సౌరవ్ పోస్ట్ చేశారు.
₹20000/mo is the 5 year EMI of a 10L car for Ravi.
Instead, Ravi puts ₹20000/mo for 5 years in Nifty ETF SIP.
First decision gives him a car worth ₹4L in 2030.
Second decision gives him ₹17L of bank balance in 2030.
Life is about the choices we make.— Sourav Dutta (@Dutta_Souravd) October 15, 2024
ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులు
డిప్రిషియేషన్ అసెట్(కాలంతోపాటు విలువ తగ్గిపోయే వస్తువులు) కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్పా..దానివల్ల మనం వెచ్చించే డబ్బు కంటే అధిక లాభం ఉంటే తప్పా కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్వీడీ మార్కెట్, ఎఫ్‌డీ..వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment