systematic investment plan
-
సిప్‌తో మూడేళ్లలో రూ.10 లక్షలు.. సాధ్యమేనా?
డెట్ ఫండ్స్ ఈల్డ్ టు మెచ్యూరిటీ (వైటీఎం), యావరేజ్ మెచ్యూరిటీ అంటే ఏంటి? – చంద్ర గుణ శేఖర్డెట్ ఫండ్స్ విశ్లేషణకు వైటీఎం, యావరేజ్ మెచ్యూరిటీ రెండూ కీలక కొలమానాలు. ఫండ్ పనితీరు సామర్థ్యాలు, రిస్క్‌ను వీటి సాయంతో తెలుసుకోవచ్చు. వైటీఎం: మ్యూచువల్ ఫండ్ పథకం పోర్ట్‌ఫోలియోలో బాండ్లను గడువు తీరే వరకు కొనసాగిస్తే వచ్చే రాబడిని తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక డెట్ ఫండ్ వైటీఎం 8గా ఉంటే.. రాబడులు సుమారుగా ఆ స్థాయిలో ఉంటాయని అర్థం. కానీ, ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలో మేనేజర్ చేసే మార్పులతో వాస్తవ రాబడులు వేరుగా ఉండొచ్చు. రోజువారీ ఎక్స్పెన్స్ రేషియో మినహాయింపులు, పెట్టుబడుల రాక, పోక ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చేస్తాయి. ఒక డెట్ ఫండ్‌లో ప్రస్తుత పోర్ట్‌ఫోలియో ప్రకారం ఎంత రాబడులు వస్తాయన్నది వైటీఎం తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ: ఫండ్ పోర్ట్‌ఫోలియోలో వివిధ బాండ్లు వివిధ కాలాలకు మెచ్యూరిటీ అవుతాయి. అన్ని బాండ్ల మెచ్యూరిటీల సగటు మెచ్యూరిటీని ఇది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఒక పోర్ట్‌ఫోలియోలో రెండు బాండ్లు ఉండి, ఒకటి 10 ఏళ్లు, మరొకటి 5 ఏళ్లకు మెచ్యూరిటీ తీరుతుందని అనుకుందాం. అప్పుడు వీటి సగటు మెచ్యూరిటీ 7.5 ఏళ్లు అవుతుంది. ఫండ్ పోర్ట్‌ఫోలియో వడ్డీ రేట్ల సున్నితత్వాన్ని ఇది తెలియజేస్తుంది. యావరేజ్ మెచ్యూరిటీ ఎంత దీర్ఘకాలానికి ఉంటే అంతగా వడ్డీ రేట్ల మార్పుల ప్రభావం ఉంటుందని అర్థం చేసుకోవాలి. యావరేజ్ మెచ్యూరిటీ తక్కువగా ఉంటే ఈ ప్రభావం తక్కువ. వైటీఎం ద్వారా ఫండ్ సగటు రాబడిని, యావరేజ్ మెచ్యూరిటీ ద్వారా ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోపై వడ్డీ రేట్ల మార్పు ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకోవచ్చు. నా వయసు 35 ఏళ్లు. వచ్చే మూడేళ్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా రూ.10 లక్షలు సమకూర్చుకోవాలని అనుకుంటున్నాను. లార్జ్‌క్యాప్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు ఎక్కువ పెట్టుబడిని కేటాయించాలని అనుకుంటున్నాను. ఇవి ఎక్కువ రాబడులు ఇస్తాయని విన్నాను. నా లక్ష్యానికి ఇది మెరుగైన పెట్టుబడుల వ్యూహమేనా? – జిగ్నేష్మీ లక్ష్యం రాజీపడకూడనిది అయితే, కచ్చితంగా మూడేళ్లలో రూ.10లక్షలు రావాలని కోరుకుంటుంటే.. అందుకు ఈక్విటీ పెట్టుబడుల ఎంపిక సరైనది కాదు. 2000 సంవత్సరం నుంచి చారిత్రక రాబడుల గణాంకాలను పరిశీలిస్తే.. సెన్సెక్స్‌లో మూడేళ్ల సిప్ రాబడి మైనస్ 15 శాతంగా ఉంది. అందుకే స్వల్పకాలానికి ఈక్విటీ పెట్టుబడులు ఎంతో రిస్క్‌తో ఉంటాయి. స్వల్పకాలానికి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాల విషయంలో భద్రతతో పాటు, స్థిరమైన రాబడులను ఇచ్చే సాధనాలనే పరిగణనలోకి తీసుకోవాలి. కనుక ఫిక్స్డ్ ఇన్కమ్ విభాగంలో షార్ట్ డ్యురేషన్ డెట్ ఫండ్స్‌ను మీరు పరిశీలించొచ్చు.వీటిల్లో ఎంతో స్థిరత్వం, ఊహించతగిన రాబడులు ఉంటాయి. దీంతో మీ పెట్టుబడులు మార్కెట్ అస్థిరతలకు గురికావు. ఒకవేళ మీ లక్ష్యంలో కొంత వెసులుబాటు ఉండి, రిస్క్ తీసుకునేట్టు అయితే అప్పుడు ఈక్విటీ పెట్టుబడులు పరిశీలించొచ్చు. అది కూడా కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఈక్విటీలు సూచనీయం. దీర్ఘకాలంలో సిప్ రాబడులు ప్రతికూలం నుంచి సానుకూలంలోకి మారి, సంపద సృష్టికి వీలు కల్పిస్తాయి. మార్కెట్ అస్థిరతలను అధిగమించి వృద్ధిని చూపించగలవు. -
రూ.20 వేలతో రూ.17 లక్షలు సంపాదన!
డబ్బు ఖర్చు పెట్టడం సులువు. అదే సంపాదించాలంటే కొంత కష్టపడక తప్పదు. కష్టపడి పోగు చేసుకున్న డబ్బుతో విలాసవంత వస్తువులు కొనుగోలు చేయడంకంటే ఆ డబ్బును పొదుపు చేసి మరింత డబ్బు సంపాదించాలని చాలామంది సూచిస్తున్నారు. ఈమేరకు పొదుపునకు సంబంధించి సౌరవ్దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్‌ను పంచుకున్నారు. కేవలం రూ.20 వేలతో రూ.17 లక్షలు పోగుచేసే మార్గాన్ని సూచించారు. రవి అనే వ్యక్తిని ఉదాహరణగా తీసుకుని ఆ డబ్బు ఎలా సమకూరుతుందో వివరించారు.‘రవి అనే వ్యక్తి రూ.10 లక్షలు ఖర్చు చేసి కారు కొనాలనుకున్నాడు. అందుకు ఐదేళ్లపాటు నెలవారీ రూ.20 వేలు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. కారు వాడుతున్న కొద్దీ దాని విలువ తగ్గిపోతుంది. కాబట్టి 2030 నాటికి దాని విలువ రూ.నాలుగు లక్షలు అవుతుంది. అంటే ఐదేళ్లలో అది రూ.ఆరు లక్షలు తగ్గిపోతుంది. అదే తన వద్ద ఉన్న రూ.20 వేలను రవి నిఫ్టీ ఈటీఎఫ్‌లో క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ఇన్వెస్ట్ చేశాడనుకుందాం. 2030 నాటికి తన వద్ద ఏకంగా రూ.17 లక్షలు జమవుతాయి. మన జీవితం ఎలా ఉండాలో మన చేతిలోనే ఉంటుంది’ అని సౌరవ్ పోస్ట్ చేశారు.₹20000/mo is the 5 year EMI of a 10L car for Ravi.Instead, Ravi puts ₹20000/mo for 5 years in Nifty ETF SIP.First decision gives him a car worth ₹4L in 2030.Second decision gives him ₹17L of bank balance in 2030.Life is about the choices we make.— Sourav Dutta (@Dutta_Souravd) October 15, 2024ఇదీ చదవండి: టాటా కంపెనీకి షోకాజ్ నోటీసులుడిప్రిషియేషన్ అసెట్(కాలంతోపాటు విలువ తగ్గిపోయే వస్తువులు) కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. తప్పనిసరి అయితే తప్పా..దానివల్ల మనం వెచ్చించే డబ్బు కంటే అధిక లాభం ఉంటే తప్పా కొనుగోలు చేయకూడదని సూచిస్తున్నారు. ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్, ఈక్వీడీ మార్కెట్, ఎఫ్డీ..వంటి విభిన్న మార్గాల్లో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చని చెబుతున్నారు. -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం
ముంబై: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూన్ లో రూ.40,608 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో వచి్చ న పెట్టుబడుల కంటే 17 శాతం అధికం. మే నెలలోనూ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ 83 శాతం అధికంగా రూ.34,670 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.1,07,357 కోట్లు బయటకు వెళ్లాయి. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జూన్ చివరికి రూ.61.15 లక్షల కోట్లకు చేరింది. మే నెలతో పోలిస్తే 4% అధికం. ఇందులో ఈక్విటీ పెట్టుబడుల విలువ రూ.27.67 లక్షల కోట్లుగా ఉంది.కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులుసిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.21,262 కోట్ల పెట్టుబడులు వచ్చా యి. ఇది నెలవారీ సరికొత్త గరిష్ట స్థాయి. మే నెల సిప్ పెట్టుబడులు రూ.20,904 కోట్లు. జూన్‌లో కొత్తగా 55.13 లక్షల సిప్ రిజి్రస్టేషన్లు పెరిగాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య మే చివరికి ఉన్న 8.76 కోట్ల నుంచి జూన్ చివరికి 8.99 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.12.44 లక్షల కోట్లకు దూసుకుపోయాయి. మే చివరికి ఇవి రూ.11.53 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ చెప్పుకోతగ్గ వృద్ధిని చూసింది. ఆర్థిక స్థిరత్వానికి, కోట్లాది మంది ఇన్వెస్టర్ల సంపద సృష్టికి కీలకంగా మారింది.’’అని ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) సీఈవో వెంకట్ చలసాని తెలిపారు. జూన్‌లో పెట్టుబడులు రూ.21,262 కోట్లు మేలో పెట్టుబడులు రూ.20,904 కోట్లుపెట్టుబడుల మొత్తం రూ.12.44 లక్షల కోట్లు (యాంఫి నివేదిక)థీమ్యాటిక్ అదుర్స్ రంగాలవారీ/థీమ్యాటిక్ ఫండ్స్ జూన్ నెలలో రూ.22, 351 కోట్లు ఆకర్షించాయి. ముఖ్యంగా ఈ విభాగంలో 9 కొత్త పథకాలు (ఎన్‌ఎఫ్‌వోలు) ప్రారంభమయ్యాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లు సమీకరించాయి. మలీ్టక్యాప్ ఫండ్స్‌లోకి 78% అధికంగా రూ.4,708 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. లార్జ్‌క్యాప్ పథకాల్లోకి పెట్టుబడులు 46% పెరిగి రూ.970 కోట్లుగా ఉన్నాయి. స్మాల్‌క్యాప్ పథకాల్లోకి 17% తగ్గి రూ.2,263 కోట్లు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి 3% తక్కువగా రూ.2,527 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. హైబ్రిడ్ ఫండ్స్ రూ.8,854 కోట్ల పెట్టబడులను ఆకర్షించాయి. ప్యాసివ్స్లోకి రూ.14,601 కోట్లు వచ్చాయి. -
ఈక్విటీ ఎంఎఫ్లకు ఫిబ్రవరిలో రూ.26,866 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్)లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.26,866 కోట్ల పెట్టుబడులు వచ్చాయని భారత మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు వెల్లడించాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం గడిచిన 23 ఏళ్లలో గరిష్టం. ఈ జనవరిలో వెల్లువెత్తిన రూ.21,721 కోట్లతో పోలిస్తే కూడా 23% అధికం. కొత్త ఫండ్ల ఆవిష్కరణ, థీమాటిక్/సెక్టోరియల్ ఫండ్లపై ఆసక్తి ఇందుకు ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) పథకాల్లోకి కూడా ఫిబ్రవరి జీవితకాల గరిష్టం రూ.19,186 కోట్లకు చేరాయి. జనవరి ఇవి రూ.18,838 కోట్లుగా ఉన్నాయి. -
వెయ్.. ‘సిప్’ వెయ్
న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది. అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు. టికెట్ సైజు తక్కువే 18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. -
1.66 లక్షల కోట్లు ‘సిప్’ చేశారు!
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమానుగత పెట్టుబడులకు (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్/సిప్) ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకు నిదర్శంగా ఈ ఏడాది 11 నెలల్లో (జనవరి–నవంబర్) సిప్ రూపంలో ఫండ్స్‌లోకి రూ.1.66 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిప్ కనిష్ట పెట్టుబడిని రూ.250కు తగ్గించే దిశగా పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధురి పురి బుచ్ ఇటీవలే ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. ఇది అమల్లోకి వస్తే సిప్ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2022 సంవత్సరం మొత్తం మీద సిప్ రూపంలో ఫండ్స్‌లోకి వచి్చన పెట్టుబడులు రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటే, ఈ ఏడాది మరో నెల మిగిలి ఉండగానే దీన్ని అధిగమించడం గమనార్హం. ఇక 2021లో సిప్ రూపంలో ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.1.14 లక్షల కోట్లుగా, 2020లో రూ.97,000 కోట్లుగా ఉన్నట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక మీదట ఏటా సిప్ పెట్టుబడులు స్థిరంగా పెరుగుతూ వెళతాయని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆశావహ అంచనాలు, మార్కెట్లో ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం పెరగిన నేపథ్యంలో.. ఫండ్స్‌లో సిప్ ద్వారా పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. మార్కెట్లు బలంగా ఉండడం, చక్కని రాబడులకు ఉన్న అవకాశాల నేపథ్యంలో 2024లో సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు పెరుగుతాయనే నమ్మకం బలపడుతున్నట్టు తెలిపారు. మద్దతిస్తున్న అంశాలు 2022 డిసెంబర్ నెలలో సిప్ రూపంలో ఈక్విటీ పథకాల్లోకి వచి్చన పెట్టుబడులు రూ.11,305 కోట్లు కాగా, 2023 నవంబర్ నెలకు ఈ మొత్తం రూ.17,073 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది అక్టోబర్, సెపె్టంబర్ నెలల్లోనూ రూ.16వేల కోట్లకు పైనే సిప్ పెట్టుబడులు వచ్చాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సిప్ ఆస్తులు నవంబర్ చివరికి రూ.9.31 లక్షల కోట్లకు పెరిగాయి. 2022 డిసెంబర్ చివరికి ఇవి రూ.6.75 లక్షల కోట్లుగా ఉన్నాయి. యాంఫి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు, అధిక జనాభా, ఈక్విఈలపై అధిక రాబడులు, పెట్టుబడుల సౌలభ్యం తదితర అంశాలు మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక పెరగడానికి అనుకూలించే అంశాలుగా మార్కెట్ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. ‘‘సిప్, ఈక్విటీ పెట్టుబడుల వల్ల వచ్చే ప్రయోజనాలపై అవగాహన కల్పించడంలో యాంఫి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈక్విటీలకు ఒక పెట్టుబడి సాధనంగా చూసే ధోరణి పెరగడం కూడా సిప్ పెట్టుబడులు పెరగానికి అనుకూలిస్తోంది’’అని అఖిల్ చతుర్వేది వివరించారు. సిప్ ద్వారా ఇన్వెస్టర్ తాను ఎంపిక చేసుకున్న పథకంలో నిరీ్ణత రోజులకు ఒకసారి పెట్టుబడి పెట్టుకోవచ్చు. మార్కెట్ ర్యాలీలు, పతనాల్లోనూ సిప్ పెట్టుబడి కొనసాగడం వల్ల కొనుగోలు ధర సగటుగా మారి, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ప్రస్తుతం సిప్ కనీన పెట్టుబడి రూ.500గా ఉంది. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయాలన్న లక్ష్యంలో భాగంగా సిప్ కనీస పెట్టుబడిని రూ.250కి తగ్గించాలని సెబీ భావిస్తోంది. -
మీ పెట్టుబడికి మీరే డ్రైవర్!
భవిష్యత్ లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో నియమబద్ధంగా పెట్టుబడులు పెట్టే ధోరణి మన దేశంలో క్రమంగా విస్తరిస్తోంది. ఇందుకు నెలవారీ వస్తున్న సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పెట్టుబడులే నిదర్శనం. 16,928 కోట్లు సిప్ రూపంలో అక్టోబర్ నెలలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఒక నెలలో సిప్ ద్వారా వచి్చన గరిష్ట పెట్టుబడులు ఇవి. అంతేకాదు, ప్రతి నెలా ఈ మొత్తం పెరుగుతూ పోతుండడం, మరింత మంది ఇన్వెస్టర్లు ఈక్విటీ ఫండ్స్ వైపు అడుగులు వేస్తుండడాన్ని తెలియజేస్తోంది. కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల కనీసం ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లు, రెగ్యులర్ ప్లాన్లలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది తెలిసి ఉండాలి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఫండ్స్ ద్వారా సంపద సమకూర్చుకోవాలని ఆశించే వారు ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటే ఎక్కువ ప్రయోజనమో తెలిసి ఉంటే, తమ లక్ష్యం సులువు అవుతుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లు దీర్ఘకాలంలో అధిక రాబడులు అందిస్తాయి. రెగ్యులర్ ప్లాన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ డి్రస్టిబ్యూటర్ ద్వారా లేదా బ్రోకర్ ద్వారా విక్రయించే ప్లాన్. దీనిపై వారికి అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీల (ఏఎంసీలు/మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు) నుంచి కమీషన్లు అందుతాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ పెట్టుబడి నుంచి ఏటా వసూలు చేసే మొత్తం) రెగ్యులర్ ప్లాన్లలో అధికంగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. మూడో పక్షం (బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థలు) కూడా రెగ్యులర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. అయినప్పటికీ వీటిపై కమీషన్ చెల్లింపులు ఉండవు. కనుక డైరెక్టర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో, రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్లను ప్రవేశపెట్టి పదేళ్లు అవుతోంది. అయినా, ఇప్పటికీ ఎక్కువ మంది పెట్టుబడులు రెగ్యులర్ ప్లాన్లలోకే వెళుతున్నాయి. డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఫోలియోలు ఎంతో తక్కువగా ఉన్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతీ ఇన్వెస్టర్ వీటి మధ్య వైరుధ్యాన్ని తప్పక తెలిసి ఉండాలి. అనుకూలతలు... మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ (సలహాదారు) లేదా పంపిణీదారు (డి్రస్టిబ్యూటర్) సేవలు అవసరం లేకుండా నేరుగా పెట్టుబడులు పెట్టే వారికి వ్యయాలు ఆదా చేసుకునేందుకు తీసుకొచి్చందే డైరెక్ట్ ప్లాన్లు. సులభంగా చెప్పాలంటే డ్రైవర్ సాయం లేకుండా ఎవరి కారును వారు డ్రైవ్ చేసుకున్నట్టు. ఇన్వెస్టర్ తన పెట్టుబడుల నిర్వహణను తానే చూసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్‌లో టీఈఆర్ అని ఉంటుంది. అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్). ఇందులో ఫండ్ నిర్వహణ చార్జీలు, మార్కెటింగ్ వ్యయాలు, రిజిస్ట్రార్ ఫీజు, కస్టోడియన్ ఫీజు, ఇతర వ్యయాలు కలిపి ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్లలో పంపిణీదారులకు కమీషన్ చెల్లించాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చెప్పుకున్న వివిధ రకాల వ్యయాలకు కమీషన్ కూడా తోడు కావడంతో రెగ్యులర్ ప్లాన్లలో టీఈఆర్ ఎక్కువగా ఉంటుంది. ఇన్వెస్టర్ పెట్టుబడి విలువపై వార్షికంగా టీఈఆర్‌ను అమలు చేస్తారు. కానీ చార్జీ మినహాయింపు ఏరోజుకారోజు కొనసాగుతుంది. పెట్టుబడి నుంచి అధిక వ్యయాలను మినహాయించినప్పుడు ఆ మేర రాబడి తగ్గుతుంది. ఒక ఇన్వెస్టర్ రెండు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో రూ.10,000 చొప్పున లమ్సమ్‌గా ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ‘ఏ’ అనే పథకంలో టీఈఆర్ ఒక శాతంగా ఉంది. ‘బీ’ అనే పథకంలో టీఈఆర్ 2.5 శాతంగా ఉంది. కానీ, పదేళ్ల తర్వాత రూ.10,000 పెట్టుబడి ‘ఏ’ పథకంలో రూ.36,587గా మారితే, ‘బీ’ పథకంలో రూ.31,407 సమకూరింది. అంటే వ్యత్యాసం ఎంతుందో స్పష్టంగా అర్థమవుతోంది. రాబడులు పేరొందిన ఈక్విటీ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసే వారి రాబడులు పరిశీలించినా.. డైరెక్ట్ ప్లాన్లలోనే ఎక్కువ ఉంటున్నాయి. ఉదాహరణకు మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఎక్స్ఐఆర్ఆర్) డైరెక్ట్ ప్లాన్‌లో 16.73 శాతం రాగా, రెగ్యులర్ ప్లాన్‌లో ఇది 15.60 శాతంగానే ఉంది. అంటే గడిచిన పదేళ్లలో ఈ పథకంలో చేసిన రూ.6 లక్షల సిప్ కాస్తా డైరెక్ట్ ప్లాన్‌లో రూ.14.26 లక్షలుగా మారితే, రెగ్యులర్ ప్లాన్‌లో రూ.13.42 లక్షలు అయి ఉండేది. అంటే ఈ రెండింటి మధ్య రూ.82,945 వ్యత్యాసం కనిపిస్తోంది. రెగ్యులర్ ప్లాన్‌ను ఎంపిక చేసుకోవడం వల్ల ఇన్వెస్టర్ పదేళ్ల కాలంలో కమీషన్ల రూపేణా ఇంత మొత్తం నష్టపోవాల్సి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్బీఐ బ్లూచిప్ ఫండ్, ఐసీసీఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్‌లోనూ రెగ్యులర్ ప్లాన్‌తో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో రూ.67,540, రూ.60,788 చొప్పున అధిక రాబడి వచ్చింది. నేపథ్యం.. 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? 2007 వరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు పెట్టుబడులపై 2–2.5 శాతం వరకు ఎంట్రీ లోడ్‌ను వసూలు చేశాయి. డి్రస్టిబ్యూటర్లు లేదా నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా ఇన్వెస్ట్ చేసినా ఈ చార్జ్ పడేది. కాకపోతే అప్పట్లో ఫండ్స్‌లో పెట్టుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీంతో మరింత మంది రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ దిశగా అడుగులు వేసేందుకు ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. కనుక నేరుగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థ ద్వారా పెట్టుబడులు పెట్టే వారి నుంచి ఎంట్రీ లోడ్ వసూలు చేయవద్దంటూ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి)ను సెబీ కోరింది. అప్పట్లో సెబీ చైర్మన్‌గా దామోదరన్ ఉన్నారు. ఆయన తర్వాత సీబీ భవే అదే విధానానికి మద్దతుగా నిలిచారు. 2008లో ప్రపంచ ఆరి్థక మాంద్యం కారణంగా మార్కెట్లు కుదేలు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది. దీంతో 2009లో సెబీ ఫండ్స్‌లో ఎంట్రీలోడ్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత నుంచి పంపిణీదారులు, ఏజెంట్లకు ఫండ్స్ సంస్థలు కమీషన్ చెల్లిస్తూ, ఆ మొత్తాన్ని టోటల్ ఎక్స్పెన్స్ రేషియో (టీఈఆర్) పేరుతో ఇన్వెస్టర్ల నుంచి రాబట్టడం మొదలు పెట్టాయి. నేరుగా ఫండ్స్ సంస్థల ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి, పంపిణీదారులు ద్వారా పెట్టుబడులు పెట్టే వారికి ఒక్కటే టీఈఆర్ వసూలు చేసేవి. దీనివల్ల ఎంట్రీలోడ్ రద్దు చేసిన ప్రయోజనం ఇన్వెస్టర్లకు నెరవేరకుండా పోయింది. దీంతో డైరెక్ట్ ప్లాన్లకు అప్పటి సెబీ చైర్మన్ యూకే సిన్హా పునాది వేశారు. గతంలో యూటీఐ మ్యూచువల్ ఫండ్‌కు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉండడంతో, నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి ప్రయోజనం కలి్పంచాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నేరుగా ఇన్వెస్ట్ చేసే వారికి కమీషన్ల బెడద తొలగి, డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువగా ఉండడం అమల్లోకి వచి్చంది. ఇన్వెస్టర్లు ఎందుకు దూరం..? డైరెక్ట్, రెగ్యులర్ ప్లాన్ల మధ్య రాబడుల్లో ఇంత స్పష్టమైన వైరుధ్యం కనిపిస్తున్నా, ఈ ప్రయోజనాన్ని పొందుతున్న ఇన్వెస్టర్లు 25 శాతానికి మించి లేరు. యాంఫీ గణాంకాల ప్రకారం మొత్తం 13.89 కోట్ల వ్యక్తిగత ఫండ్స్ ఫోలియోల్లో డైరెక్టర్ ప్లాన్లలో పెట్టుబడులకు సంబంధించినవి కేవలం 3.45 కోట్ల ఫోలియోలే ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో డైరెక్ట్ ప్లాన్ల నుంచి వస్తున్నది 12 శాతం మించి లేదు. ఇందుకు గల కారణాలపై మహీంద్రా మనులైఫ్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో ఆంటోనీ హెరెడియా తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. ఫండ్స్‌లో రెగ్యులర్ ప్లాన్లు సైతం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి సంపదను సమకూర్చి పెట్టాయి. దీనికి తోడు డైరెక్ట్ ప్లాన్లపై ఎక్కువ మందిలో అవగాహన లేదు’’అని వివరించారు. ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్ ప్లాన్ల వైపే మొగ్గు చూపుతుంటే, నాన్ ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లలోనూ 50 శాతం మంది డైరెక్టర్ ప్లాన్లనే ఎంచుకుంటున్నారు. కేవలం రిటైల్ విభాగంలోనే డైరెక్ట్ ప్లాన్లను ఎంపిక చేసుకుంటున్న వారు తక్కువగా ఉంటున్నారు. ఏమిటి మార్గం..? ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల అవగాహన ఉంటే మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు, సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపిక కీలకం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో వేలాది పథకాలు ఉన్నాయి. ఇందులోనూ ఎన్నో విభాగాలు ఉన్నాయి. వీటిల్లో ఇన్వెస్టర్ల ఆకాంక్షలు, రిస్‌్కకు అనుగుణంగా అనుకూలమైన వాటిని ఎంపిక చేసుకోవడం కొంచెం క్లిష్టమైన పనే. ఈక్విటీ మార్కెట్ల పట్ల అవగాహన కలిగి ఉండి, రోజులో కొంత సమయం కేటాయించే వీలున్న వారు నేరుగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెబీ నమోదిత ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల సేవలను ఆశ్రయించినట్టయితే, వారు మెరుగైన పథకాలకు సంబంధించి డైరెక్ట్ ప్లాన్లను సూచిస్తారు. కాకపోతే సెబీ వద్ద నమోదైన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు కేవలం 1,328 మందే ఉన్నారు. కనుక ఇన్వెస్టర్లు డిస్కౌంట్ బ్రోకర్లు, ఫిన్‌టెక్ సంస్థల సేవలను సైతం పొందొచ్చు. కాకపోతే చాలా మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువుల సూచనల మేరకే నడుచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వ్యత్యాసాలు ► మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లలో పంపిణీదారులు, బ్రోకర్లు తదితర మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. కనుక రెగ్యులర్ ప్లాన్‌లో యూనిట్ ఎన్ఏవీతో పోలిస్తే, డైరెక్ట్ ప్లాన్ యూనిట్ ఎన్ఏవీ ఎక్కువగా ఉంటుంది. ►డైరెక్ట్ ప్లాన్లలో టీఈఆర్ తక్కువ. దీంతో దీర్ఘకాలంలో పెట్టుబడుల వృద్ధి వీటిల్లో ఎక్కువ. ►డైరెక్ట్ ప్లాన్లను ఏ సంస్థా సూచించదు. ఇన్వెస్టర్ నేరుగా ఎంపిక చేసుకోవాలి. ►ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా డైరెక్ట్ ప్లాన్లలో సులభంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. జెరోదా, గ్రోవ్ వంటి సంస్థలు సైతం డైరెక్ట్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. -
ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నా.. వారంవారీ సిప్.. నెలవారీ సిప్ ఏది బెటర్?
నేను సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం వారీ సిప్ లేదా నెలవారీ సిప్ ఏది ఎంపిక చేసుకోవాలి? – అమర్ సహాని నేను ఈ రెండింటిని పోల్చి ఎటువంటి వివరణాత్మక అధ్యయనం చేయలేదు. కానీ ఫలితాలు యాదృచ్ఛికంగా ఉంటాయని తెలుసు. వారం వారీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. వారం వారీ అంటే నెలలో నాలుగు సార్లు పెట్టుబడుల లావాదేవీలు నమోదవుతాయి. దీంతో లావాదేవీల నివేదిక కూడా చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. డిజిటల్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా అని అనుకోవచ్చు. కానీ, తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్ చేసుకోవడం? దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్ చేనుకోవడం సముచితం. కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమిటి? వాటిల్లో ట్రేడ్ చేయవచ్చా? – యోగేష్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అన్నవి రెండు ప్రముఖ డెరివేటివ్ సాధనాలు. స్టాక్స్‌లో ముందస్తుగా అంగీకరించిన ధరకు, భవిష్యత్తు తేదీపై ట్రేడ్ చేయడం. షేర్లు కొనుగోలు చేయాలంటే విలువ మేర మొత్తం ముందే చెల్లించాలి. కానీ, ఫ్యూచర్స్‌లో అయితే మొత్తం కాంట్రాక్టు విలువలో నిర్ధేశిత శాతం ముందు చెల్లిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఫ్యూచర్స్లోని స్టాక్ కాంట్రాక్టు విలువలో 20 శాతం అనుకుంటే, అచ్చమైన ఈక్విటీలో కొనుగోలు చేసే విలువతో (క్యాష్ మార్కెట్) ఫ్యూచర్స్‌లో అదే మొత్తంతో ఐదు రెట్లు అధికంగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఈక్విటీలో రూ.లక్ష కొనుగోలు చేసుకునేట్టు అయితే, అంతే మొత్తంలో ఫ్యూచర్స్‌లో రూ.5 లక్షల విలువ మేర ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్రధాన ఉద్దేశ్యం మీ పోర్ట్‌ఫోలియో విలువకు హెడ్జ్ చేసుకోవడమే. కానీ, చాలా మంది వేగంగా డబ్బు సంపాదించేందుకు స్పెక్యులేటివ్‌గా దీన్ని చూస్తుంటారు. ట్రేడింగ్ విజయవంతం అయితే గణనీయమైన లాభాలు వస్తాయి. కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అన్నది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. ఒక్క ట్రేడ్ బెడిసికొట్టినా అప్పటి వరకు ఎన్నో రోజులుగా సంపాదించిన మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ పథకాలు.. ఆర్బిట్రేజ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ హెడ్జింగ్‌ను ఒక విధానంగా ఉపయోగిస్తాయి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆకర్షణీయంగా, సులభంగా డబ్బులు సంపాదించే మార్గంగా అనిపించొచ్చు. కానీ ఇది ఎంతో రిస్క్‌తో ఉంటుంది. గ్యాంబ్లింగ్ కంటే తక్కువేమీ కాదు. ఓ ప్రముఖ ఆన్లైన్ బ్రోకర్ సీఈవో సైతం తమ క్లయింట్లలో కేవలం ఒక శాతం కంటే తక్కువ మందే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో బ్యాంక్ డిపాజిట్ల కంటే ఎక్కువ రాబడులు సంపాదిస్తున్నట్టు ప్రకటించడాన్ని అర్థం చేసుకోవాలి. రిటైల్ ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌కు దూరంగా ఉండడమే సరైనది. - ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ జూలై నెలలోనూ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొన్నాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే నెలవారీ పెట్టుబడులు రూ.15,245 కోట్లకు చేరాయి. ఒక నెలలో సిప్ పెట్టుబడుల పరంగా ఇదే గరిష్ట రికార్డు కావడం గమనార్హం. జూన్ నెలలో సిప్ పెట్టుబడులు రూ.14,734 కోట్లుగా ఉన్నాయి. సిప్ పెట్టుబడులు 2022 అక్టోబర్ నుంచి ప్రతి నెలా రూ.13వేల కోట్లకు పైనే వస్తున్నాయి. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి జూలై నెలలో మొత్తం మీద రూ.7,626 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో వచి్చన పెట్టుబడులతో పోల్చిచూస్తే 12 శాతం తగ్గాయి. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. జూలై నెలలో ఈక్విటీ, డెట్ ఇలా అన్ని విభాగాలు కలసి మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.82,046 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బలపడుతున్న సిప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈక్విటీల్లోకి సిప్ రూపంలో రూ.58,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద ఈక్విటీ ఫండ్స్ రూ.1.56 లక్షల కోట్లను సిప్ రూపంలో ఆకర్షించాయి. సిప్ అనేది ప్రతీ నెలా పెట్టుబడులు పెట్టుకు నే సాధనం. దీనివల్ల మార్కెట్లలో ఉండే అస్థిరతల రిస్క్ కొనుగోలుపై తగ్గుతుంది. ఈ సానుకూలతలను అర్థం చేసుకుంటున్న ఇన్వెస్టర్లు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు ఈక్విటీల్లోకి 29 నెలలుగా సానుకూల పెట్టుబడులు వస్తున్నట్టు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే జూన్ నెలలో ఈక్విటీ పథకాలు రూ.8,637 కోట్లను ఆకర్షించగా, జూలైలో రూ.7,626 కోట్లకు తగ్గాయి. జూలై నెలలో ఐదు నూతన పథకాలు ప్రారంభం కాగా, వీటి వరకే రూ.3,011 కోట్లు సమీకరించాయి. లార్జ్‌క్యాప్, ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్, ఫ్లెక్సీక్యాప్ మినహా మిగిలిన అన్ని విభాగాల్లోని పథకాలు పెట్టుబడులను ఆకర్షించాయి. ఈక్విటీ ఫండ్స్ ► స్మాల్‌క్యాప్ పథకాల్లోకి అత్యధికంగా రూ.4,171 కోట్లు వచ్చాయి. గడిచిన నాలుగు నెలలుగా స్మాల్‌క్యాప్ పథకాల్లోకి ఇతర పథకాలతో పోలిస్తే అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నాయి. ► మల్టీక్యాప్ పథకాల్లోకి రూ.2,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్ నుంచి రూ.1,880 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. గడిచిన మూడు నెలలుగా లార్జ్‌క్యాప్ పథకాలు పెట్టుబడులను కోల్పోతున్నాయి. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగం నుంచి రూ.1,067 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈ విభాగం గడిచిన నాలుగు నెలలుగా పెట్టుబడులను కోల్పోతోంది. ► ఈఎల్ఎస్ఎస్ విభాగం నుంచి రూ.592 కోట్లు, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ నుంచి రూ.932 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.1,327 కోట్లు, మిడ్క్యాప్ఫండ్స్ రూ.1,623 కోట్లు, డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ రూ.342 కోట్లు, వ్యాల్యూఫండ్స్ రూ.703 కోట్లు, సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ రూ.1,429 కోట్ల చొప్పున పెట్టుబడులను రాబట్టాయి. డెట్ ఫండ్స్ ► డెట్ ఫండ్స్‌లోకి రూ.61,440 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఈ విభాగం నుంచి నికరంగా రూ.14,135 కోట్లకు బయటకు వెళ్లడం గమనార్హం. ► అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ.51,938 కోట్లు వచ్చాయి. మనీ మార్కెట్ ఫండ్స్ రూ.8,608 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్ రూ.7,027 కోట్లు, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ రూ.2,865 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,000 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ► ఓవర్ నైట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.10,746 కోట్లు వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్స్ నుంచి రూ.1,309 కోట్లను ఉపసంహరించుకున్నారు. లాభాల స్వీకరణ.. ‘‘మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగింది. దీంతో అన్ని విభాగాల్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఈ నెలలో అన్నింటికంటే సిప్ పనితీరు గొప్పగా ఉంది. 33 లక్షల నూతన సిప్ ఖాతాలు నమోదయ్యాయి’’అని యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ పేర్కొన్నారు. అయితే జూన్‌తో పోలిస్తే జూలై నెలలో ఈక్విటీల్లోకి నికర పెట్టుబడులు తగ్గడానికి లాభాల స్వీకరణే కారణమై ఉండొచ్చని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. కొందరు ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి కూడా అనుసరించి ఉండొచ్చన్నారు. -
సిప్ @ రూ.1.56 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2022–23) సిప్ ద్వారా రూ.1.56 లక్షల కోట్ల పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చినట్టు ‘యాంఫి’ గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సిప్ పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి కనిపించింది. మార్కెట్లలో అస్థిరతలను అధిగమించేందుకు సిప్ మెరుగైన సాధనమని తెలిసిందే. దీనివల్ల మార్కెట్లు పడినప్పుడు, పెరుగుతున్నప్పుడు కూడా పెట్టుబడులు కొనసాగుతాయి కనుక కొనుగోలు సగటుగా మారుతుంది. 2020–21లో సిప్ పెట్టుబడులు రూ.96,080 కోట్లుగా ఉన్నాయి. అంటే ఏటేటా సిప్ పెట్టుబడులు వృద్ధి చెందుతున్నట్టు స్పష్టమవుతోంది. 2016–17లో ఉన్న రూ.43,921 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. ప్రతి నెలా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు సైతం మార్చి నెలకు రూ.14,276 కోట్లుగా నమోదయ్యాయి. నెలవారీ గరిష్ట సిప్ పెట్టుబడులు ఇవే. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సగటున ప్రతి నెలా రూ.13,000 కోట్ల చొప్పున వచ్చాయి. ఇన్వెస్టర్లు దీర్ఘకాల వృద్ధి పట్ల నమ్మకంగా ఉన్నారని, అందుకే ఏకమొత్తంలో కంటే సిప్ రూపంలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని కోటక్ మహీంద్రా ఏఎంసీ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ మనీష్ మెహతా తెలిపారు. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద మార్కెట్లు అస్థిరంగానే ఉన్నాయి. అయినా కానీ, దేశీయ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్లు నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు. పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను ప్రాధాన్య మార్గంగా చూస్తున్నారు’’అని ఫయర్స్ రీసెర్చ్ హెడ్ గోపాల్ కావలిరెడ్డి తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పెరిగి రూ.6.83 లక్షల కోట్లకు చేరాయి. మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.36 కోట్లకు చేరుకుంది. -
మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైలర్ల ‘జోష్’
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌కు రిటైల్ ఇన్వెస్టర్లు అండగా నిలుస్తున్నారు. ఫండ్స్ నిర్వహణలోని రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2023 జనవరి నాటికి రూ.23.4 లక్షల కోట్లకు చేరాయి. 2022 జనవరి నాటికి ఉన్న రూ.21.40 లక్షల కోట్లతో పోలిస్తే 9.3 శాతం వృద్ధి చెందాయి. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) తాజా గణాంకాలను విడుదల చేసింది. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని సంస్థల (ఇనిస్టిట్యూషనల్) పెట్టుబడులు ఏడాది కాలంలో రూ.17.49 లక్షల కోట్ల నుంచి, 2023 జనవరి చివరికి రూ.17.42 లక్షల కోట్లకు తగ్గాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్టర్లు చేసే పెట్టుబడుల్లో వృద్ధి, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడానికి కారణమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సిప్ ద్వారా రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ప్రతి నెలా రూ.13,000 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వస్తుండడం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో సిప్ ద్వారా ఫండ్స్‌లోకి రూ.13,856 కోట్ల పెట్టుబడులు రాగా, 2022 డిసెంబర్ నెలలో రూ.13,573 కోట్లు రావడం గమనించాలి. మొత్తం మీద అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ జనవరి చివరికి రూ.40.80 లక్షల కోట్లకు చేరింది. 2022 జనవరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి చెందింది. -
ఆర్థికమాంద్యం హెచ్చరికలున్నా.. భారతీయ యువత ‘సిప్’.. సిప్.. హుర్రే!
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నా... మరోసారి ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నా.. దేశంలోని యువత స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇందుకోసం వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానం (సిప్)ను ఎంచుకుంటున్నారు. ప్రతీ నెలా నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడాన్ని సిప్ విధానంగా పేర్కొంటారు. బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, రియల్ ఎస్టేట్, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో యువత ఇన్వెస్ట్మెంట్ సాధనంగా మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో గడిచిన మూడేళ్లలో సిప్ ఖాతాల సంఖ్య రెట్టింపు కావడమే కాకుండా అదే స్థాయిలో నెలవారీ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల కాలంలో సిప్ ఖాతాల సంఖ్య 82 లక్షలకు పైగా పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఆంఫీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 ఏప్రిల్‌లో 5.39 కోట్లుగా ఉన్న సిప్ ఖాతాల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 6.21 కోట్లకు చేరాయి. అంటే సగటున ప్రతీ నెలా 10 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారు. భారీగా పెరిగిన ఇన్వెస్ట్మెంట్ దేశంలోని మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ జనవరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 14,28,43,642 కోట్లకు చేరితే అందులో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 6,73,774.80 కోట్లు ఉందంటే మనవాళ్లు సిప్ విధానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు గడిచిన మూడేళ్లుగా సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంలో కూడా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2020–21లో సగటున నెలవారీ ఇన్వెస్ట్ చేసే మొత్తం రూ. 9,000 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు ఏకంగా రూ. 13,856.18 కోట్లకు చేరింది. దీర్ఘకాలిక లక్ష్యాలతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోందని ఆంఫీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్.ఎస్ వెంకటేష్ పేర్కొన్నారు. ఒక్క జనవరిలోనే కొత్తగా 23 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభం కావడం దేశీయ స్టాక్‌మార్కెట్ పాజిటివ్ ట్రెండ్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు. సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా స్మాల్ క్యాప్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ స్టాక్ మార్కెట్ల పతనం తక్కువగా ఉండటానికి సిప్ పెట్టుబడులు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
‘సిప్’ పట్ల ఇన్వెస్టర్లలో సడలని విశ్వాసం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) పట్ల నమ్మకం పెరుగుతోంది. 2022లో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా రూ.1.5 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఇది అంతకుముందు సంవత్సరంలో వచ్చిన రూ.1.14 లక్షల కోట్లతో పోలిస్తే 31 శాతం అధికం. 2020లో సిప్ ద్వారా రూ.97,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంటే ఏటేటా సిప్ సాధనం ద్వారా మరింత మంది పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది. 2023లోనూ సిప్ రూపంలో పెట్టుబడులు రాక అధికంగా ఉంటుందని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ కౌస్తభ్ బేలపుర్కార్ అంచనా వేశారు. సిప్ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టాలన్న ప్రాముఖ్యతను ఇన్వెస్టర్లు అర్థం చేసుకుంటున్నట్టు చెప్పారు. ‘‘కొత్త ఇన్వెస్టర్ల రాకతో సిప్ గణాంకాలు ఇంకా పెరుగుతాయి. మార్కెట్లలో అస్థిరతల ఆధారంగా లంప్సమ్ (ఏకమొత్తంలో) పెట్టుబడులు ఆధారపడి ఉంటాయి. మార్కెట్లు పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించి ఇతర సాధనాలకు మళ్లించడం చూస్తూనే ఉన్నాం’’అని పుర్కార్ పేర్కొన్నారు. నెలవారీగా రూ.13,573 కోట్లు.. సిప్ పుస్తకం 2021 డిసెంబర్ నాటికి నెలవారీగా రూ.11,305 కోట్లుగా ఉంటే, అది 2022 డిసెంబర్ నెలకు రూ.13,573 కోట్లకు వృద్ధి చెందింది. రూ.13వేల కోట్లకు పైగా నెలవారీ సిప్ పెట్టుబడులు నమోదు కావడం వరుసగా మూడు నెలల నుంచి నమోదవుతోంది. ఇక 2022లో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.12,400 కోట్ల చొప్పున ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద సిప్ రూపంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల విలువ (ఏయూఎం) 2022 డిసెంబర్ నాటికి రూ.6.75 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. 2021 డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.5.65 లక్షల కోట్లుగా ఉంది. మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.12 కోట్లకు చేరింది. -
నూతన గరిష్టాలకు సిప్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు నవంబర్ నెలలో 76 శాతం తగ్గిపోయి రూ.2,258 కోట్లకు పరిమితమయ్యాయి. అక్టోబర్‌లో వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉండడం గమనించొచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.13,306 కోట్ల రికార్డు స్థాయి (ఒక నెలలో ఇదే గరిష్టం) పెట్టుబడులు నవంబర్‌లో నమోదయ్యాయి. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో సిప్ ద్వారా వచ్చిన పెట్టుబడులు రూ.13,041 కోట్లుగా ఉండడం గమనార్హం. ఈ ఏడాది మే నెల నుంచి సిప్ ద్వారా వచ్చే పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లపైనే నమోదవుతున్నాయి. సెప్టెంబర్‌లో రూ.12,976 కోట్లు, ఆగస్ట్‌లో రూ.12,693 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు, జూన్‌లో రూ.12,276 కోట్లు, మేలో రూ.12,286 కోట్ల చొప్పున సిప్ సాధనం ద్వారా ఈక్విటీ పథకాల్లోకి పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన సిప్ పెట్టుబడులు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో (ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు) సిప్ రూపంలో మొత్తం రూ.87,275 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. సిప్ అన్నది పెట్టుబడి మొత్తాన్ని ఒకే విడత పెట్టకుండా, ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని, కొన్ని వాయిదాలుగా ఇన్వెస్ట్ చేసుకునేందుకు వీలు కల్పించే సాధనం. గణాంకాలు.. ►నవంబర్ నెలలో కొత్తగా 11.27 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య 6.04 కోట్లకు చేరింది. ►మొత్తం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నవంబర్‌లో వచ్చిన నికర పెట్టుబడులు రూ.13,263 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెలలో వచ్చిన రూ.14,405 కోట్ల కంటే స్వల్పంగా తగ్గాయి. ►డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.3,668 కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్‌లో డెట్ పథకాల నుంచి రూ.2,818 కోట్ల ఉపసంహరణతో పోలిస్తే పరిస్థితి మారింది. ►ఇండెక్స్ ఫండ్స్, గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు, ఫండ్స్ ఆఫ్ ఫండ్స్‌లోకి కలిపి మొత్తం రూ.10,394 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో రూ.8,602 కోట్లు ఒక్క ఇండెక్స్ ఫండ్సే ఆకర్షించాయి. గోల్డ్ ఫండ్స్‌లోకి రూ.195 కోట్లు వచ్చాయి. ►43 మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ అక్టోబర్ చివరికి ఉన్న రూ.39.5 లక్షల కోట్ల నుంచి నవంబర్ చివరికి రూ.40.37 లక్షల కోట్లకు వృద్ధి చెందింది. ►మ్యూచువల్ ఫండ్స్ ఫోలియోల సంఖ్య 13.97 కోట్లకు పెరిగింది. రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు నిలకడగా, సిప్ల ద్వా రా పెట్టుబడులు కొనసాగించినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ వెల్లడించారు. ‘‘రిటైల్ పథకాల నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లాయి. ప్రజలు లాభాలను స్వీకరిస్తున్నారు. పండుగల సందర్భంగా వినియోగం పెరగడమే ఇందుకు కారణం. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వృద్ధి పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో నమ్మకం ఉంది. కనుక వారు వెంటనే మళ్లీ మార్కెట్లోకి వస్తారు. రానున్న బడ్జెట్ మార్కెట్లకు మంచి ఉత్సాహాన్నిస్తుంది. పలు పథకాల్లోకి మరిన్ని పెట్టుబడులు రావడానికి వీలు కల్పిస్తుంది. ఆర్బీఐ రేట్ల పెంపు ఆగిపోయినప్పుడు డెట్ పథకాల్లో స్థిరత్వం వస్తుంది’’అని వెంకటేశ్ తెలిపారు. ఇన్వెస్టర్లలో పరిణతి.. ‘‘దేశ ఈక్విటీ మార్కెట్లో ఆరోగ్యకరమైన ధోరణి ఏమిటంటే సిప్ ద్వారా పెట్టుబడులు నికరంగా పెరుగుతుండడం. ఇవి నవంబర్‌లో కొత్త గరిష్టానికి చేరాయి. రిటైల్ ఇన్వెస్టర్లకు సిప్ ఎంతో విజయవంతమైన విధానంగా నిరూపితమైంది. సిప్ ద్వారా పెట్టుబడులు పెరగడం దేశ ఇన్వెస్టర్లలో పరిణతి పెరిగినదానికి నిదర్శనం’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ తెలిపారు. -
Zerodha ceo Nithin Kamath: ముందు చూపుతోనే.. హాయిగా ‘విశ్రాంతి’!
‘‘వాతావరణంలో మార్పులు మానవాళిని అంతం చేయకపోతే.. ఇప్పటి నుంచి వచ్చే 25 ఏళ్లలో చాలా దేశాలకు రిటైర్మెంట్ సంక్షోభం పెద్ద సమస్యగా మారుతుంది. గత తరాలకు దీర్ఘకాలం పాటు రియల్ ఎస్టేట్, ఈక్విటీ బుల్ మార్కెట్లు రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడానికి సాయపడ్డాయి. కానీ, భవిష్యత్తులో ఇలా ఉండకపోవచ్చు’’. ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జీరోధా వ్యవస్థాపకుల్లో ఒకరైన నితిన్ కామత్ నేటి యువతరాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇవి. సాంకేతిక పురోగతితో పదవీ విరమణ కాలం తగ్గిపోతుంటే, వైద్య రంగంలో పురోగతితో జీవించే కాలం పెరుగుతుందని అంచనా వేశారు. వచ్చే 20 ఏళ్లకు పదవీ విరమణ వయసు 50కు తగ్గి.. 80 ఏళ్ల వరకు జీవిస్తామని.. రిటైర్మెంట్ తర్వాత కూడా 30 ఏళ్ల పాటు జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. జీవితంలో పదవీ విరమణ తర్వాత దశను సరైన ప్రణాళికతోనే సుఖవంతం చేసుకోగలరంటూ కామత్ ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కరికీ మేల్కొలుపు. వయసు సహకరించి పనిచేస్తున్న దశలోనే.. పనిచేయని దశ కోసం ప్రణాళిక వేసుకోకపోతే వృద్ధాప్యంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తమ పిల్లలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తాము పిల్లలకు భారం కాకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అలా కోరుకునే వారు ఆ దిశగా ముందు నుంచే అడుగులు వేసుకుంటూ వెళ్లాలి. మరి రిటైర్మెంట్ తర్వాత జీవితానికి ఎంత కావాలి? అందుకు ఎంత పెట్టుబడులు పెట్టాలి..? ఈ అంశాలపై అవగాహన కల్పించే కథనం ఇది. అవసరాల్లో రాజీ పడలేం మనలో ఒక్కొక్కరు ఒక్కో జీవిత దశలో ఉండొచ్చు. కొందరు ఇప్పుడే ఉద్యోగం ఆరంభిస్తే, మరికొందరు ఇప్పటికే కొన్నేళ్ల ఉద్యోగ కాలాన్ని పూర్తి చేసుకుని ఉండొచ్చు. సంపాదించే వయసులో మన అవసరాలు ఏదో రకంగా తీరిపోతుంటాయి. ఒక విధమైన జీవనశైలికి అలవాటు పడి ఉంటాం. కోరుకున్న మాదిరి జీవితాన్ని కొనసాగిస్తాం. రిటైర్మెంట్ తర్వాత కూడా ఇదే మాదిరి జీవితాన్ని సాఫీగా కొనసాగించడమే అసలైన సవాలు. ఇందుకోసం ఇప్పుడు నెలవారీ జీవనానికి ఎంత అయితే ఖర్చు చేస్తున్నామో.. పదవీ విరమరణ అనంతరం కూడా ప్రతి నెలా అంతే మొత్తం ఖర్చు చేసేందుకు సరిపడా పొదుపు చేసుకోవాలి. ముందుగా మొదలు పెడితే ఈజీ 25 ఏళ్లకు కెరీర్ మొదలు పెట్టారని అనుకుంటే, 55–60 ఏళ్లకు రిటైర్ అవుతారని అనుకుంటే ఇన్వెస్ట్ చేయడానికి 30–35 ఏళ్ల కాలం మిగిలి ఉంటుంది. కనుక నెలకు రూ.10వేల చొప్పున, ఏటేటా దీనిపై 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుతూ వెళితే 30 ఏళ్లకే రూ.6.91 కోట్లు (ఏటా 11 శాతం కాంపౌండెడ్ వృద్ధి అంచనా ప్రకారం) సమకూరుతుంది. అందుకే విశ్రాంత జీవన నిధి కోసం పెట్టుబడికి కెరీర్ ఆరంభంలోనే శ్రీకారం చుట్టాలి. దానివల్ల ఓ పెద్ద లక్ష్యం తేలిక అవుతుంది. 25 ఏళ్లలో రూ.7 కోట్లు సమకూరేందుకు ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి (ఏటాటా 10 శాతం పెంచుతూ) ఉంటే, 30 ఏళ్ల సమయం ఉన్న వారు ఇందులో సగం రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఇంకా 35 ఏళ్ల వ్యవధి ఉంటే ఇంకా తక్కువే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అందుకే ఈ కాంపౌండింగ్ మహిమను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే. నిపుణుల సాయం అవసరమే రిటైర్మెంట్ అవసరాలన్నవి ప్రత్యేకమైనవి. ఇక్కడి నుంచి మరో 25–35 ఏళ్ల తర్వాతి జీవనం కోసం నిధిని సమకూర్చుకోవాలి. అలా ఏర్పడే నిధి అక్కడి నుంచి మరో 20–30 ఏళ్ల పాటు మన జీవితానికి ఆధారంగా నిలబడాలి. కనుక ప్రతి నెలా ఆర్జన ఎంత? పదవీ విరమణకు ఉన్న కాలం ఎంత? ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? పెట్టుబడుల పరంగా రిస్క్ తీసుకోగలరా? ఆశిస్తున్న రాబడులు ఏ మేరకు? ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటి తర్వాత ప్రతి నెలా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలో అంచనాకు రావాలి. ఆశిస్తున్న రాబడులకు తగిన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అయితే, అందులోనూ ఎన్నో విభాగాలున్నాయి. వాటిల్లో రాబడులు, రిస్క్ వేర్వేరుగా ఉంటుంది. పైగా రిటైర్మెంట్ ఒక్కటే కాదు, జీవిత బీమా, ఆరోగ్య బీమా కూడా కీలకమే. అందుకే కెరీర్ ఆరంభించిన వారు పర్సనల్ ఫైనాన్స్ నిపుణులు, లేదా ఫైనాన్షియల్ ప్లానర్ సాయంతో పటిష్ట ప్రణాళిక రూపొందించుకోవడం ఎంతైనా అవసరం ఎంత కావాలి? ఇప్పుడు ప్రతి నెలా కుటుంబ అవసరాల కోసం నికరంగా రూ.50,000 ఖర్చు అవుతుందని అనుకుందాం. ఇప్పటి నుంచి పదవీ విరమణకు మరో 25 ఏళ్ల కాలం మిగిలి ఉంది. రిటైర్మెంట్ తర్వాత కనీసం 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామని అంచనా వేసుకునేట్టు అయితే.. ఆ 20 ఏళ్ల కాలానికి కూడా ప్రతి నెలా రూ.50,000 కావాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు అవసరపడతాయి. రిటైర్మెంట్ విషయంలో కొందరికి భిన్నమైన అంచనాలు ఉండొచ్చు. కొందరు ఇప్పటికంటే వృద్ధాప్యంలో ఇంకా మెరుగ్గా జీవించాలని కోరుకోవచ్చు. అటువంటి వారి విషయంలో ఈ అంచనాలు మారిపోతాయి. కనుక అందరికీ అర్థమయ్యేందుకే దీన్ని ఓ ప్రామాణిక ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. విశ్రాంత జీవితానికి సంబంధించి ప్రణాళికలో ముందు రెండు అంశాలపై స్పష్టత తెచ్చుకోవాలి. 1. ఇప్పటి నెలవారీ అవపసరాల ఆధారంగా రిటైర్మెంట్ నాటికి ఎంత నిధి సమకూర్చుకోవాలి. ఇప్పుడు నెలకు రూ.50,000 ఖర్చు అవుతోంది. అంటే ఏడాదికి రూ.6 లక్షలు. పదవీ విరమణ తర్వాత కూడా ఏటా రూ.6 లక్షలు ఆదాయాన్ని ఇచ్చేంత నిధిని సమకూర్చుకోవాలి. 2. ఇంత మేర నిధి పోగు చేసుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా ఎంత మేర ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలన్నది మరో ముఖ్యమైన విషయం. ∙ రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల పాటు జీవించి ఉంటామనే అంచనా ప్రకారం.. ఏటా రూ.6 లక్షల చొప్పున 20 ఏళ్ల కోసం మొత్తం రూ.1.2 కోట్లు కావాల్సి ఉంటుంది. 2047 నాటికి ఈ మేరకు నిధి మనకు కావాలి. కానీ, రూ.50,000 అన్నది నేటి కరెన్సీ విలువ ప్రకారం జీవనానికి అవుతున్న వ్యయం. ద్రవ్యోల్బణం ప్రభావంతో ఏటేటా కరెన్సీ విలువ తగ్గుతూ, జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ నిధికి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కూడా జోడించాలి. దీర్ఘకాలంలో సగటున 5 శాతం వార్షిక ద్రవ్యోల్బణం ఉంటుందని అంచనా వేసుకుంటే.. 20 ఏళ్ల తర్వాత రూ.6 లక్షలు ఏమూలకూ సరిపోవు. ఇప్పటి నుంచి 25 ఏళ్ల పాటు రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకుంటాం కనుక అన్నేళ్ల కాలానికి ఏటా 5 శాతం ద్రవ్యోల్బణ ప్రభావాన్ని కలిపి చూస్తే.. ఇప్పుడు ఏడాది జీవనానికి రూ.6 లక్షలు అవుతుంటే, 2047లో ఇది రూ.2,031,813 అవుతుంది. అంటే అప్పుడు ఒక ఏడాది జీవనానికి రూ.20.31 లక్షలు కావాలి. అంతేకాదు, అప్పటి నుంచి ఏటేటా ఇది మరో 5 శాతం (ద్రవ్యోల్బణం మేర) పెరుగుతుందని భావించొచ్చు. ఈ ప్రకారం 2048లో రూ.21.33 లక్షలు కావాలి. 2067వ సంవత్సరంలో జీవన వ్యయం రూ.రూ.53.91 లక్షలుగా ఉంటుంది. ఇక 2047 నుంచి 2067 సంవత్సరం వరకు, 20 ఏళ్ల కాలానికి జీవన వ్యయం కోసం (5 శాతం ద్రవ్యోల్బణం కలిపి) మొత్తం రూ.7.25 కోట్లు కావాల్సి వస్తుంది. అంటే మన చేతిలో సంపాదన కోసం మిగిలిన ఈ 25 ఏళ్లలో.. విశ్రాంత జీవనం కోసం రూ7.25 కోట్ల నిధిని సమకూర్చుకోవాలన్నది అంచనా. నిధిని ఎలా సమకూర్చుకోవాలి? రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ల జీవిత అవసరాలకు కావాల్సిన రూ.7.25 కోట్లు సమకూర్చుకోవడం ఎలా..? ఇందుకోసం ఈ రోజు నుంచే పెట్టుబడులు ఆరంభించాలి. ఒకటికి మించిన సాధనాలను ఇందుకోసం ఎంపిక చేసుకోవచ్చు. 50 శాతం రియల్ ఎస్టేట్‌పై, 10 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లలో, బంగారంలో 10 శాతం, ఈక్విటీల్లో 15 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతూ, 15 శాతం నగదుగా ఉంచుకునేట్టు (ఇది అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల పోర్ట్‌ఫోలియో విధానం) అయితే.. రాబడి ఏ మేరకు వస్తుందో చూద్దాం. రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలంలో 8–10 శాతం, ఎఫ్డీలపై 6–7 శాతం, బంగారంపై 8–9 శాతం, ఈక్విటీల్లో 10–11 శాతం వస్తుందని అనుకుంటే.. అప్పుడు మొత్తం మీద అన్ని రకాల పెట్టుబడులపై సగటున 8.25 శాతం వార్షిక రాబడి వస్తుంది. ఇది కొంత రక్షణాత్మకంగా వేసిన అంచనాయే. ఈక్విటీల్లో 10 ఏళ్లకు మించిన కాలంలో రిస్క్ దాదాపు ఉండదు. సగటు రాబడి ఎంత లేదన్నా వార్షికంగా 11 శాతం చొప్పున వస్తుంది. కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో రిటైర్మెంట్ కార్పస్‌ను సమకూర్చుకోవడం రిటైల్ ఇన్వెస్టర్లకు అన్నింటిలోకి మెరుగైన మార్గం అవుతుంది. నెలవారీగా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏటేటా పెరిగే ఆదాయానికి అనుగుణంగా ఈ పెట్టుబడి మొత్తాన్ని 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు మొదటి నెల రూ.5,000 ఇన్వెస్ట్ చేసినట్టయితే.. ఏటా 11 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధి ప్రకారం 25 ఏళ్ల తర్వాత (300 నెలలకు) ఈ మొత్తం రూ.67,927 అవుతుంది. రెండో ఏడాది 10 శాతం అధికంగా రూ.5,500, మూడో ఏట రూ.6,050 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. ఇలా అయితే 25 ఏళ్లకు సమకూరే నిధి రూ.1.7 కోట్లుగా ఉంటుంది. కానీ, మనం చెప్పుకున్న ఉదాహరణ ఆధారంగా రిటైర్మెంట్ కోసం రూ.7.25 కోట్లు కావాలి. అందుకుని ప్రతి నెలా రూ.5 వేలకు బదులు.. రూ.20 వేల చొప్పున ఆరంభించి, ఏటా 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. దీంతో 25 ఏళ్లకు రూ.7 కోట్ల నిధి ఏర్పడుతుంది. అంచనా మాత్రమే.. పదవీ విరమణ తర్వాత వృద్ధాప్యంలో మన జీవన అవసరాలు ఇప్పటి మాదిరిగా ఉండవు. కొంత మారొచ్చు. ఖరీదైన డెనిమ్ వస్త్రాలు అవసరపడకపోవచ్చు. వినోదం, విహారం కోసం ఖర్చు పెరగొచ్చు. ఎందుకంటే అప్పుడు చేతిలో తగినంత ఖాళీ సమయం ఉంటుంది. అందుకుని అప్పటి అవసరాలు ఎలా ఉంటాయని ఇప్పుడే అంచనాకు రాలేం. ఆరోగ్య సమస్యల కారణంగా తరచూ వైద్యం అవసరపడొచ్చు. అందుకే ఇప్పుడు నెలవారీ అవుతున్న వ్యయాన్ని ఓ ప్రామాణికంగా తీసుకున్నాం అంతే. రిటైర్మెంట్ తర్వాత ఫలానా విధంగా జీవితాన్ని కొనసాగించాలనే కచ్చితమైన స్పష్టత, ప్రణాళిక ఉన్న వారు ఆ మేరకు అంచనాకు వచ్చి నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది.+ టిప్స్ ► చాలా ముందుగానే పెట్టుబడులు ఆరంభించాలి. ► పెట్టుబడి సాధనాల మధ్య వైవిధ్యం ఉండాలి. ► అన్నింటిలోకీ ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు ఇస్తాయి. ► అవసరం లేనివి, విలువ తరిగిపోయే వాటిని రుణాలపై కొనుగోలు చేయవద్దు. ► ఆర్జించే వ్యక్తి తనతోపాటు, కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ రక్షణనిచ్చే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. లేకపోతే ఒక ఆరోగ్య సమస్య కారణంగా ఆర్థిక జీవితం తలకిందులు అయిపోవచ్చు. ► ఉద్యోగం శాశ్వతం కాదు. కనుక పనిచేసే చోట ఆరోగ్య బీమా రక్షణ ఉన్నా కానీ, విడిగా ఆరోగ్య బీమా ప్లాన్ కూడా ఉండాలి. ► టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం. అనుకోనిది జరిగితే వచ్చే బీమా పరిహారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే, నెలవారీ కుటుంబ అవసరాలను తీర్చేంత సరిపడా ఆదాయం ఆ నిధి నుంచి రావాలి. – నితిన్ కామత్, జీరోధా సీఈవో -
మెరుగైన రాబడుల కోసం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?
నా వయసు 30 ఏళ్లు. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నాను. సిప్ కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు అనుకూలం? మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి అభినందనలు. పెట్టుబడులను మరీ ఆలస్యం చేయొద్దంటూ తరచుగా మేము చెబుతుంటాం. మీరు పన్ను ఆదా చేయడం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నట్టు అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మంచి ఆప్షన్ అవుతుంది. ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడులు పెడితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ఈ ప్రయోజనం కల్పిస్తోంది. ఒకవేళ మీరు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసేట్లు అయితే అందుకు ఈఎల్ఎస్ఎస్ మెరుగైన సాధనమే అవుతుంది. ఇవి పూర్తి ఈక్విటీ పథకాలు. వేర్వేరు మార్కెట్ పరిమాణంతో కూడిన, వివిధ రంగాల్లోని కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. దీంతో దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడినిస్తాయి. అయితే, వీటిల్లో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుందని మర్చిపోవద్దు. సిప్ అయితే విడిగా ప్రతి సిప్ పెట్టుబడికి మూడేళ్లు అమలవుతుంది. ఒకవేళ మీరు ఈక్విటీ పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్ను ఆదాను కోరుకోనట్టయితే.. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పన్ను ఆదా ప్రయోజనాన్ని వాడుకుని ఉంటే, అప్పుడు మీ ప్రణాళిక వేరే విధంగా ఉండొచ్చు. మీరు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ పథకాలు సాధారణంగా 65 నుంచి 80 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాలకు కేటాయిస్తాయి. డెట్ అన్నది ఈక్విటీలతో సంబంధం లేనిది. డెట్ పెట్టుబడుల రాబడులు ఈక్విటీల మాదిరిగా భారీ అస్థిరతలకు లోను కావు. మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మంచి ఎంపిక అవుతుంది. కనుక ఈఎల్ఎస్ఎస్ లేదా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో సిప్ మొదలు పెట్టుకోవచ్చు. రెండు నుంచి మూడేళ్ల పాటు వీటిల్లో ఇన్వెస్ట్ చేసి, ఈక్విటీలు ఎలా పనిచేస్తాయో అవగాహన వచ్చిన తర్వాత.. అప్పుడు అచ్చమైన ఈక్విటీ పథకాలైన.. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌ను దీర్ఘకాల లక్ష్యాల కోసం ఎంపిక చేసుకోవచ్చు. నేను రూ.50,000 మొత్తాన్ని మూడు నుంచి ఆరు నెలల కాలానికి ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నా ను. మా పిల్లల విద్య కోసం ఆరు నెలల తర్వాత ఈ మొత్తం కావాల్సి ఉంది. మెరుగైన రాబడుల కోసం ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఇంత స్వల్ప కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ముందు లక్ష్యం విషయంలో రాజీ పడడానికి అవకాశం ఉండదు. ఎంతో కాలం లేదు కనుక పెట్టుబడికి భద్రత ఎక్కువ ఉండాలి. రాబడుల కంటే పెట్టుబడిని కాపాడుకునే విధంగా వ్యూహం ఉండాలి. కనుక ఈ మొత్తాన్ని మీరు బ్యాంకు ఖాతాలోనే కొనసాగించుకోవచ్చు. లేదంటే ఆరు నెలల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో రాబడులు తక్కువే అయినా గ్యారంటీతో కూడినవి. పైగా పెట్టుబడికి భద్రత ఎక్కువ. ఆరు నెలలే ఉంది కనుక కచ్చితంగా ఆ సమయానికి పెట్టుబడిని రాబడితో పాటు సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. బ్యాంకులో చేసే డిపాజిట్ రూ.5 లక్షల వరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ నుంచి బీమా ఉంటుంది. ఇవి కాకుండా లిక్విడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ సెక్యూరిటీలు, రెపో సర్టిఫికెట్లలో ఇన్వెస్ట్ చేస్తాయి. గరిష్టంగా 91 రోజుల కాల వ్యవధి కలిగిన సెక్యూరిటీల్లోనే లిక్విడ్ పథకాలు ఇన్వెస్ట్ చేస్తాయి. బ్యాంకు డిపాజిట్ల కంటే లిక్విడ్ ఫండ్స్‌లో కొంచెం అదనపు రాబడి వస్తుంది. కాకపోతే పెట్టుబడి భద్రతకు అవి హామీ ఇవ్వవు. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
ఈక్విటీలకు దేశీ ఇన్వెస్టర్ల మద్దతు
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లకు దేశీ నిధుల మద్దతు దండిగా ఉంది. ఇందుకు నిదర్శనంగా మే నెలలోనూ ఈక్విటీ ఫండ్స్ రూ.18,529 కోట్ల మేర నికర పెట్టుబడులను ఆకర్షించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వచ్చిన రూ.15,890 కోట్ల కంటే మరింత అధికంగా వచ్చాయి. మే నెలకు సంబంధించి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2021 మార్చి నెల నుంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ప్రతి నెలా నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అంతకుముందు వరుసగా ఎనిమిది నెలల కాలంలో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. అన్ని విభాగాల్లోకి.. ► మే నెలలో ఈక్విటీలోని అన్ని విభాగాల్లోకి పెట్టుబడులు ప్రవహించాయి. ఫ్లెక్సీ క్యాప్ విభాగంలోకి అత్యధికంగా రూ.2,939 కోట్లు వచ్చాయి. ► లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్, సెక్టోరల్ ఫండ్స్‌లోకి రూ.2,200 కోట్లు, అంతకుమించి పెట్టుబడులు వచ్చాయి. ► ఇండెక్స్ ఫండ్స్, ఇతర ఈటీఎఫ్‌లు రూ.11,779 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. ► గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.203 కోట్లను ఆకర్షించాయి. ► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.32,722 కోట్లను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు నెల ఏప్రిల్‌లో రూ.69,883 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ► అన్ని విభాగాలు కలిపితే ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.7,532 కోట్లను నికరంగా వెనక్కి తీసేసుకున్నారు. ఏప్రిల్‌లో నికర పెట్టుబడుల రాక రూ.72,846 కోట్లుగా ఉంది. ► మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తులు (ఏయూఎం) ఏప్రిల్ చివరికి ఉన్న రూ.38.89 లక్షల కోట్ల నుంచి మే చివరికి రూ.37.37 లక్షల కోట్లకు క్షీణించింది. సిప్ కళ..: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చిన పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.11,863 కోట్లు కాగా>, మే నెలలో రూ.12,286 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లోనూ ఈక్విటీల పట్ల నమ్మకాన్ని చూపిస్తున్నారని చెప్పడానికి ఈ గణాంకాలు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.10వేల కోట్లకు పైన రావడం వరుసగా ఇది తొమ్మిదో నెల కావడాన్ని గమనించాలి. -
సిప్.. సిప్.. హుర్రే!
న్యూఢిల్లీ: సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు ఆదరణ పెరుగుతోంది. ఈ మార్గంలో ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా సిప్ రూపంలో ప్రతి నెలా వచ్చే పెట్టుబడుల మొత్తం పెరుగుతోంది. ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరానికి సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2020–21)లో వచ్చిన రూ.96,080 కోట్లతో పోలిస్తే ఏడాదిలో 30 శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తోంది. ఈ మేరకు గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను మ్యూచువల్ ఫండ్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద సిప్ రూపంలో ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.43,921 కోట్లుగా ఉన్నాయి. అంటే గత ఐదేళ్లలో రెండు రెట్లు మేర పెరిగినట్టు తెలుస్తుంది. సిప్‌కు ఆదరణ ఎంతో వేగంగా పెరుగుతుందనడానికి ఇదే నిదర్శం. 2021 మార్చి నెలకు సిప్ రూపంలో వచ్చిన పెట్టుబడులు రూ.9,182 కోట్లుగా ఉంటే.. 2022 మార్చి నెలలో ఇవి రూ.12,328 కోట్లకు వృద్ధి చెందాయి. ఏడాదిలో 34 శాతం వృద్ధి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లలో విశ్వాసానికి నిదర్శనం.. సిప్ బుక్ పరిమాణం పెరగడం.. ఈక్విటీల్లో పెట్టుబడులకు మెరుగైన సాధనంగా ఇన్వెస్టర్లలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శమని మార్నింగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. ఇక మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద సిప్ రూపంలోని నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) 2022 మార్చి నాటికి రూ.5.76 లక్షల కోట్లకు వృద్ధి చెందాయి. గతేడాది మార్చి చివరికి నాటికి ఇవి రూ.4.28 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఐదేళ్లలో సిప్ ఏయూఎం ఏటా 30 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 5.39 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి. వీటి ద్వారా ఇన్వెస్టర్లు ప్రతి నెలా ఫండ్స్ పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. మంచి పరిష్కారం.. సిప్, సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎస్టీపీ) ద్వారా ఒక క్రమపద్ధతిలో పెట్టుబడుల విధానాన్ని అనుసరించడం మార్కెట్లలో దిద్దుబాట్లు, అనిశ్చిత పరిస్థితులను అధిగమించేందుకు చక్కని పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడుల సగటు వ్యయం తగ్గుతుందని, బుల్ ర్యాలీ కొనసాగినా ఇన్వెస్టర్లు పెట్టుబడుల అవకాశాలు నష్టపోకుండా ఉండొచ్చని పేర్కొన్నారు. సిప్ రూపంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసుకున్న పథకాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని నిర్ణయించుకున్న తేదీన వెళ్లే విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అదే ఎస్టీపీ అన్నది డెట్‌లో ఒకే విడత పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేసుకుని.. అక్కడి నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఈక్విటీ పథకాల్లోకి బదిలీ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. మార్కెట్లలో ఆటుపోట్లు ఉన్నప్పుడు, లేదంటే అధిక వ్యాల్యూషన్లకు చేరినప్పుడు ఏకమొత్తంలో పెట్టడం రిస్క్ అవుతుంది. అందుకని ఎస్టీపీ మార్గాన్ని అనుసరించొచ్చు. మార్కెట్లలో అస్థిరతలు, కరెక్షన్ల గురించి ఆందోళన చెందకుండా పెట్టుబడులు పెట్టుకునే చక్కని మార్గమే సిప్ అని యాంఫి సైతం పేర్కొంది. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో విక్రయాలు చేస్తున్నా.. మన మార్కెట్లు బలంగా ఉండడానికి సిప్ రూపంలో వస్తున్న పెట్టుబడులు కూడా దోహదపడుతున్నాయి. -
షేర్లు ‘సిప్’ చేస్తారా? ఇదుగో మీకు కావాల్సిన సమాచారం
మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు. వారం/పక్షం/మాసం లేదా త్రైమాసికం.. వీటిల్లో ఎంపిక చేసుకున్న నిర్ణీత కాలానికి ఒకసారి బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా మ్యూచువల్ ఫండ్ పథకంలోకి పెట్టుబడి వెళుతుంది. ఇదే సిప్‌ను నేరుగా స్టాక్స్‌లో పెట్టుబడులకూ సాధనంగా వినియోగించుకోవచ్చు. ఇన్వెస్టర్లు తాము నిర్ణయించుకున్నన్ని షేర్లను నిర్ణీత కాలానికోసారి ఆటోమేటిగ్గా కొనుగోలు చేసుకునే సిప్ సదుపాయాన్ని స్టాక్ బ్రోకర్లు ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇది అందరికీ కాదు.. ఈక్విటీల పట్ల లోతైన అవగాహన, రిస్క్‌లు తెలిసిన వారికే. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ మార్గమే బెటర్. నేడు సమాచార వ్యాప్తి విస్తృతి కారణంగా గతంతో పోలిస్తే సిప్‌కు ఎంతో ఆదరణ పెరిగింది. ప్రతి నెలా రూ.11,000 కోట్లకు పైనే సిప్ రూపంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడులు వస్తున్నాయి. ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలో రూ.1,000 ప్రతి నెలా సిప్‌గా నిర్ణయించుకుంటే.. నిర్ణీత రోజున ఆ మొత్తం ఆ పథకంలో పెట్టుబడిగా చేరిపోతుంది. అదే స్టాక్స్‌లో అయితే ఎంపిక చేసుకున్నన్ని షేర్లు సిప్ రూపంలో డీమ్యాట్ ఖాతాలోకి చేరిపోతాయి. ఇన్వెస్టర్ తరఫున స్టాక్ బ్రోకర్లు ఈ సేవను ఆఫర్ చేస్తున్నారు. ప్రతి నెలా ఏ తేదీన, ఏ కంపెనీ షేర్లను ఎన్ని కొనుగోలు చేయాలన్నది ఇన్వెస్టర్లు చెబితే చాలు. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అయితే ఎంత మొత్తం ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సొంతంగా వేసుకునే సిప్ (డీఐవై సిప్) ఏ షేర్లలో సిప్ చేసుకోవాలన్నది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవాలి. ఒక్క కంపెనీయే అని కాదు.. ఒకటికి మించిన స్టాక్స్‌లో సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు.. దీనివల్ల పెట్టుబడుల్లో వైవిధ్యం నెలకొంటుంది. తద్వారా పెట్టుబడుల్లో రిస్క్ తగ్గించుకోవచ్చు. స్టాక్ సిప్‌లను కావాలనుకున్నప్పుడు నిలిపివేసు కోవచ్చు. లేదా రద్దు చేసుకోవచ్చు. ఎప్పుడైనా పెట్టుబడులకు ఇబ్బంది అనిపించినప్పుడు నిలిపివేసుకునే సౌలభ్యం ఇన్వెస్టర్లకు ఉంటుంది. ట్రేడింగ్ ఖాతా నుంచే సిప్‌లో మార్పులు (మోడిఫై) చేసుకోవచ్చు. స్టాక్‌ను మార్చుకోవచ్చు. అలాగే, సిప్ రూపంలో కొనుగోలు చేయాల్సిన స్టాక్స్ సంఖ్యను కూడా మార్చుకోవచ్చు. కొందరు బ్రోకర్లు ఎక్సే్ఛంజ్‌ల్లో ట్రేడయ్యే ఈటీఎఫ్‌ల్లోనూ సిప్ అవకాశాన్ని కల్పిస్తున్నారు. చార్జీలు నిల్...! ఏ సేవ అయినా అందులో చార్జీలు ఉంటాయని తెలిసిం దే. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో యాక్టివ్ ఫం డ్స్ సాధారణంగా 2.5% వరకు ఎక్స్పెన్స్ రేషియో పేరిట చార్జ్ వసూలు చేస్తున్నాయి. అంటే ఏటా ఇన్వెస్టర్ల పెట్టుబడి వి లువ నుంచి ఈ మేరకు అవి మినహాయించుకుంటాయి. కానీ, స్టాక్ సిప్ విషయానికొస్తే ఎ క్కువ బ్రోకరేజీ సంస్థలు ప్రత్యేకంగా చార్జీలు తీసు కోవడం లేదు. ఈక్విటీ డెలివరీగానే వాటిని చూస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డెలివరీ లావాదేవీలపై 0.5% బ్రోకరేజీ వసూ లు చేస్తోంది. కొందరు బ్రోకర్లు అసలు డెలివరీకి ఎటువం టి చార్జీ తీసుకోవడం లేదు. జెరోదా, అప్‌స్టాక్స్ ఇవన్నీ డెలివరీకి జీరో బ్రోకరేజీ అమలు చేస్తున్నాయి. కనుక ఆయా సంస్థల్లో స్టాక్ సిప్ ఉచితమే. కాకపోతే బీఎస్ఈ, ఎన్ఎస్ఈ తరఫున లావాదేవీ చార్జీ స్వల్పంగా 0.00345 ఉంటుంది. దీనిపై 18% జీఎస్టీ ఉన్నా కానీ, ఈ చార్జీ చాలా కొద్ది మొత్తమే. రిస్క్‌లు కూడా ఉన్నాయ్.. మ్యూచువల్ ఫండ్స్ సిప్‌లతో పోలిస్తే స్టాక్స్ సిప్‌తో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ అన్నవి నిపుణుల ఆధ్వర్యంలో నడిచేవి. అవి ఏ ఒకటి, రెండు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవు. 25 నుంచి 75 స్టాక్స్ వరకు తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహిస్తుంటాయి. పెట్టుబడుల పరిమాణాన్ని బట్టి స్టాక్స్ సంఖ్యను నిర్ణయిస్తుంటాయి. అది కూడా భిన్న రంగాలకు చెందిన, బిన్న సైజు (లార్జ్, మిడ్, స్మాల్) కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ వైవిధ్యాన్ని పాటించగలవు. తద్వారా పెట్టుబడులపై రిస్క్‌ను తగ్గిస్తాయి. కానీ, రిటైల్ ఇన్వెస్టర్ నేరుగా సిప్ రూపంలో స్టాక్స్‌ను కొనుగోలు చేస్తుంటే అది ఒకటి లేదా రెండు స్టాక్స్‌కు పరిమితం కావచ్చు. దీనివల్ల రిస్క్ అధిక పాళ్లలో ఉంటుంది. సిప్ కోసం ఎంపిక చేసుకున్న రెండు కంపెనీల్లో ఒక కంపెనీలో ఏదైనా అక్రమాలు బయటపడితే.. వ్యాపార విధానంలో తేడా వచ్చి చతికిలపడితే అప్పుడు ఎదుర్కొనే రిస్క్ అధికంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు కొన్నేళ్ల పాటు అలా సిప్ చేసుకుంటూ వెళితే.. మీ పెట్టుబడుల్లో అధిక భాగం అలా ఒకటి రెండు కంపెనీల్లోనే పోగుపడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ మేనేజర్లు, పరిశోధన బృందం మార్కెట్ తీరు, పరిస్థితుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారు. భావోద్వేగ నిర్ణయాలకు సాధ్యమైనంత దూరంగా పనిచేస్తుంటారు. పెట్టుబడుల విధానాలు తెలిసి ఉంటారు. ఎంతో లోతైన, విస్తృత అధ్యయనం చేసి, నమ్మకం కలిగితేకానీ ఒక కంపెనీలో ఎక్స్పోజర్ తీసుకోరు. కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టే ముందు ఈ విధమైన పరిశోధన, అధ్యయనం చేస్తారా? దాదాపు లేదనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది. స్టాక్ సిప్ కోసం ఎంపిక చేసుకున్న కంపెనీ.. సమర్థవంతమైనది కాకపోతే నష్టపోయేందుకు అవకాశం ఉంటుంది. మార్కెట్ల గురించి తెలిసి, మంచి విజ్ఞానం ఉన్న వారికి స్టాక్ సిప్ అనుకూలిస్తుంది. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి.. రాబడులా లేక నష్టాలా అన్నది ముఖ్యంగా ఎంపికపైనే ఆధారపడి ఉంటుందని తెలుసుకోవాలి. అంత పరిజ్ఞానం ఉన్న వారికే స్టాక్సిప్. లేదంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ చేసుకోవడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. ముఖ్యంగా కొత్త ఇన్వెస్టర్లు అసలు స్టాక్ సిప్ గురించి ఆలోచించకపోవడమే మంచిది. ప్రయోజనం ఉందా..? ఒక కంపెనీ స్టాక్ ధర ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండదు. తగ్గుతూ పెరుగుతుండడం సాధారణం. సిప్ రూపంలో అయితే తగ్గినప్పుడు, పెరిగినప్పుడు పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకేసారి పెట్టుబడులు పెట్టే వెసులుబాటు లేని ఇన్వెస్టర్లు ఈ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అటువంటి వారు సిప్ రూపంలో దీర్ఘకాలంలో నచ్చిన కంపెనీలో వాటాలను పోగు చేసుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు లోనైనప్పుడే ఇన్వెస్ట్ చేయాలని వేచి చూసే అవస్థ, అయోమయానికి స్టాక్ సిప్ పరిష్కారం చూపుతుంది. ఎందుకంటే మార్కెట్లు పడినా, పెరిగినా సిప్ రూపంలో వాటిని కొనుగోలు చేస్తుంటారు కనుక ‘ఫియర్ ఆఫ్ మిస్సింగ్ (ఫోమో)’ను అధిగమించొచ్చు. ఫోమో అంటే ఒకవేళ వెంటనే కొనుగోలు చేయకపోతే ఆ స్టాక్ ధర పెరిగిపోతుందేమో, చేయి దాటిపోతుందేమో? అన్న ఆందోళన. ఎక్కువ మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఫోమో కారణంగానే స్టాక్స్‌ను గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి స్టాక్స్ పడిపోతుంటే భయంతో అమ్మి బయటపడదామని భావిస్తుంటారు. సిప్ అయితే ఈ తలనొప్పి ఉండదు. -
ఆర్థిక భద్రతా అవసరమే..
చిన్న వయసు.. ఉరకలెత్తే ఉత్సాహం, మంచి ఆరోగ్యం.. ఇవన్నీ భవిష్యత్తును గుర్తు చేయవు. ఏరోజుకారోజు హాయిగా గడిచిపోతుంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే కొన్ని మంచి అలవాట్లకు చోటు కల్పిస్తే.. జీవితాంతం ఆర్థిక భద్రతకు ఢోకా లేకుండా చూసుకోవచ్చు. రేపటి రోజు కోసం మీ ప్రణాళికలో కొంత చోటు కల్పిస్తే చాలు. అందులో ఉండే మ్యాజిక్ ఆ తర్వాత తెలిసొస్తుంది. అందుకే అంటారు వయసులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకోమని..! రిటైర్మెంట్ కోసం రూ.కోటి కావాలంటే.. నెలకు రూ.2,000 ఇన్వెస్ట్ చేస్తే చాలు. 25 సంవత్సరాల వయసులో మొదలు పెట్టి, ఏటా 12 శాతం రాబడులు వచ్చేట్టు చూసుకున్నా.. ఈ మొత్తం సమకూరుతుంది. కానీ, 15 ఏళ్లు ఆలస్యం చేసి 45లో మొదలు పెట్టారనుకోండి అప్పుడు రూ.కోటి కోసం నెలకు రూ.21,000 ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. సిప్ ఆరంభం.. తివారి (30) సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఐదేళ్ల క్రితమే అంటే 25 ఏళ్ల వయసు నుంచే మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతీ నెలా రూ.2,000 చొప్పున మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేశాడు. ఆ తర్వాత వెసులుబాటు లేకపోవడంతో సిప్ ఆపేశాడు. కానీ, అప్పటి వరకు చేసిన పెట్టుబడిని అలాగే ఉంచేశాడు. ఒకరోజు ఏజెంట్ కాల్ చేసి.. రూ.72,000 పెట్టుబడి రూ.1.8 లక్షలు అయినట్టు చెప్పడంతో ఆశ్చర్యపోవడం తివారీ వంతు అయింది. ఎవరో ఫ్రెండ్ చెబితే సిప్ మొదలు పెట్టిన తివారీ.. అంత నిధిని చూసేసరికి పెట్టుబడి ప్రయోజనాన్ని అర్థం చేసుకున్నాడు. పెట్టుబడి చిన్నదైనా క్రమం తప్పకుండా కొనసాగించడం వల్ల వచ్చే ప్రతిఫలం ఇలా ఉంటుంది. రాబడి రుచి తెలిసిన తర్వాత ఎవరైనా పెట్టుబడి పెట్టకుండా ఉంటారా? అందుకే తివారీ మళ్లీ సిప్ మొదలు పెట్టడమే కాదు.. ఈ విడత రూ.2,000 చొప్పున రెండు పథకాల్లో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్జించే ప్రతి ఒక్కరూ తమ ఆదాయ స్థాయికి అనుగుణంగా వెంటనే సిప్ ఆరంభించాలి. సిప్ అన్నది ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్‌గా ప్రతీ నెలా నిర్ణీత తేదీన, నిర్ణీత మొత్తం పెట్టుబడిగా వెళ్లిపోతుంది. క్రమశిక్షణతో పెట్టుబడికి సిప్ వీలు కల్పిస్తుంది. సిప్ అనగానే ఏ పథకంలో ఇన్వెస్ట్ చేయాలి? అన్న సందేహం వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం లార్జ్‌క్యాప్ విభాగానికి 50–60%, మిడ్ స్మాల్‌క్యాప్ విభాగానికి 20–30%, డెట్ విభాగానికి 10–20% కేటాయింపులు చేసుకోవచ్చు. దీన్నే అస్సెట్ అలోకేషన్ అని చెబుతారు. అలాగే, మీ పోర్ట్‌ఫోలియోలో ఎన్ని పథకాలు ఉండాలన్నది నిర్ణ యించుకోవాలి. సిప్ పెట్టుబడులు సైతం మార్కెట్ ప్రతికూలతల్లో నష్టాలను చూపిస్తాయి. అయినా నిరాశ చెందకుండా ఓపికతో పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొన సాగించాలి. పీపీఎఫ్ ఖాతా డెట్ సాధనాల్లో ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) మెరుగైన ఎంపిక. మూడు రకాల ప్రయోజనాలు దీన్నుంచి అందుకోవచ్చు. మొదట ఏటా రూ.1.5 లక్షల వరకు ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఇందులో పెట్టుబడులపై వచ్చే వడ్డీ రాబడిపైనా పన్ను ఉండదు. గడువు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకునే మొత్తంపైనా పన్ను లేదు. ప్రస్తుతం ఇందులో చేసే పెట్టుబడులపై 7.1 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకే ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రతీ నెలా 12,500 చొప్పున పెట్టుబడి పెడితే 15 ఏళ్లలో 22,50,000 ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. రాబడి ప్రస్తుత 7.1 శాతం ప్రకారం రూ.16,94,599 వస్తుంది. భవిష్యత్తులో ఈ రేట్లు ఇంకా తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత ఐదేళ్ల చొప్పున గడువు పొడిగించుకోవచ్చు. ఆ తర్వాత కూడా ఖాతాను క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఏటా కొంత చొప్పున ఉపసంహరించుకోవచ్చు. బ్యాలన్స్‌పై వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ఏడేళ్ల తర్వాత నుంచి ఇందులో పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. రుణ సదుపాయానికి కూడా వీలుంది. పీపీఎఫ్ సొమ్మును కోర్టులు కూడా జప్తు చేయడానికి ఉండదు. టర్మ్ ఇన్సూరెన్స్ తమపై ఆధారపడిన వారు ఉంటే (తల్లిదండ్రులు లేదా భార్యా, పిల్లలు) తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దురదృష్టవశాత్తూ, ఏదేనీ కారణంతో మరణం సంభవిస్తే పాలసీలో ఎంపిక చేసుకున్న మేరకు పరిహారాన్ని బీమా సంస్థ కుటుంబ సభ్యులకు అందిస్తుంది. టర్మ్ కవరేజీ అన్నది తక్కువ ప్రీమియానికే ఎక్కువ కవరేజీ ఇచ్చే అచ్చమైన బీమా సాధనం. ఇందులో పెట్టుబడి కలసి ఉండదు. కట్టిన ప్రీమియం జీవించి ఉంటే వెనక్కి రాదు. మరణించిన సందర్భాల్లోనే ఈ పాలసీ నుంచి పరిహారం అందుకోగలరు. కనుక తీసుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్నే తీసుకోవాలి. టర్మ్ ప్లాన్ అన్నది 30 ఏళ్లలోపు తీసుకోవడమే మంచిది. తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, ఇంకా వివాహం చేసుకోకపోతే.. ముందుగానే తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఆలస్యం చేయడం వల్ల ప్రీమియం పెరిగిపోతుంది. ఈలోపు ఏవైనా ఆరోగ్య సమస్యలు బయటపడితే ప్రీమియం భారం మరింత పెరుగుతుంది. మంచి చెల్లింపుల చరిత్ర కలిగిన కంపెనీల మధ్య టర్మ్ ప్రీమియం వ్యత్యాసాన్ని పరిశీలించి.. ఆకర్షణీయమైన ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోకుండా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే.. భారీ బిల్లుతో ఆర్థికంగా కుదేలవుతున్న వారు ఎందరో ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఇదే కనిపించింది. అందుకే ప్రతి ఒక్కరికి హెల్త్ కవరేజీ తప్పకుండా ఉండాల్సిందే. అందుకే హెల్త్ ప్లాన్‌ను ఆరోగ్యంపై పెట్టుబడిగా చెబుతారు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వైద్య బిల్లుల భారాన్ని తప్పించుకోవచ్చు. పొదుపు, పెట్టుబడులు క్షేమంగా ఉంటాయి. హెల్త్ ప్లాన్ లేకపోతే పెట్టుబడులు కరిగిపోతాయి. లేదంటే అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావచ్చు. వైద్య చికిత్సల వ్యయాలు ఎంతో ఖరీదుగా మారాయన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటేటా చార్జీలు పెరుగుతూనే పోతున్నాయి. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడమే కాకుండా.. కుటుంబ సభ్యులు అందరికీ కవరేజీ తగినంత ఉండేలా చూసుకోవాలి. అరకొర కవరేజీతో తీసుకుంటే అవసరాలు తీరకపోవచ్చు. ఒక అంచనా ప్రకారం మధ్యతరగతి ప్రజల్లో 90 శాతానికి పైగా హెల్త్ కవరేజీ లేదు. ఉన్నా తగినంత కవరేజీ లేదు. ముఖ్యంగా చిన్న వయసులో వ్యాధుల రిస్క్ అంతగా ఉండదు. 40 ఏళ్లు దాటిన తర్వాత నుంచి ఈ రిస్క్ పెరుగుతుంది. యుక్త వయసులో మంచి ఆరోగ్యాన్ని చూసి హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఎక్కువ మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, ఒక్కసారి ఆరోగ్య సమస్యలు వెలుగు చూసిన తర్వాత బీమా తీసుకోవాలంటే ప్రీమియం భారం ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. కనుక బీమా ఏదైనా కానీయండి ముందుగానే తీసుకోవాలి. ప్రీమియం తప్పకుండా చెల్లిస్తూ వెళ్లాలి. వైద్య బీమా తీసుకునే వారు 10 ఏళ్ల తర్వాత వైద్య ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే ప్రతీ పదేళ్లకు కవరేజీని సమీక్షించుకుని పెంచుకోవాలి. రుణాలకు దూరం విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా రుణాలు తీసుకోవడం నష్టానికి దారితీస్తుంది. మీ చెల్లింపుల సామర్థ్యాన్ని మించి రుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. అప్పటికే రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణాల మీద రుణాలు తీసుకుని చెల్లింపులు కష్టమైతే.. క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది. దీంతో భవిష్యత్తులో ముఖ్యమైన రుణాలకు సమస్యలు ఏర్పడొచ్చు. జీవితంలో లాభదాయకమైన రుణం ఏదైనా ఉందంటే అది గృహ రుణమే. పన్ను ప్రయోజాలను పరిగణనలోకి తీసుకుంటే గృహ రుణం ఒక్కదానిని పరిశీలించొచ్చు. అలాగే, అవసరానికి పిల్లల ఉన్నత విద్య కోసం రుణ బాట కూడా పట్టొచ్చు. వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ రుణాలన్నవి విలువను తగ్గించేవి. వీటికి దూరంగా ఉండాలి. రుణ చెల్లింపులు నెలవారీ నికర ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదన్నది ప్రాథమిక సూత్రం. ద్రవ్యోల్బణానికి చోటు సగటు ద్రవ్యోల్బణం 7 శాతం ఉంటుందని అనుకుంటే నేటి రూ.లక్ష విలువ కాస్తా.. 30 ఏళ్ల తర్వాత రూ.13,000 అవుతుంది. అంటే నేడు రూ.లక్షకు లభించే ఏదేనీ సేవ కోసం 30 ఏళ్ల తర్వాత ఏడున్నర రెట్లు అధికంగా చెల్లించాల్సి వస్తుందని అర్థం చేసుకోవాలి. అందుకనే భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే సమయంలో ద్రవ్యోల్బణానికీ ప్రాధాన్యం ఇవ్వాలి. భవిష్యత్తులో పిల్లల విద్య, వివాహం, రిటైర్మెంట్ అవసరాలకు ఎంత కావాలన్నది నిర్ణయించుకునే ముందు ద్రవ్యోల్బణ రేటును అంచనాల్లోకి తీసుకోవాలి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని పొదుపు విలువ పెంచుకోవాలంటే.. పెట్టుబడులపై దీర్ఘకాలంలో సగటు రాబడి రేటు 14 శాతం అయినా వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన. ఈపీఎఫ్ నిధికి ప్రాముఖ్యత ఉద్యోగం మారినప్పుడు, ముఖ్యమైన అవసరాలకు ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్) నుంచి ఉపసంహరించుకోవడం చాలా మంది చేసే పని. గతంలో అంటే సంస్థను మారినప్పుడల్లా, పాత ఖాతాను బదలాయించుకోవడం తలనొప్పిగా భావించి దాన్ని మూసేసేవారు. సంస్థను మారిప్పుడల్లా కొత్త ఖాతాను తెరిచేవారు. కానీ, ఇప్పుడు యూనివర్సల్ ఖాతా నంబర్ విధానం అమల్లోకి వచ్చింది కనుక ఈ ఇబ్బందులు తొలగిపోయాయి. సంస్థను మారినా పాత ఖాతాను బ్యాలన్స్ సహా బదలాయించుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా అవసరమైనప్పుడల్లా ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేస్తుండడం వల్ల పెద్ద నిధిని సమకూర్చుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఇంటి నిర్మాణానికి, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు.. మరే ఇతర మార్గం లేనప్పుడు ఈపీఎఫ్ నిధిని పరిశీలించొచ్చు. అంతేకానీ, ఇతరత్రా అవసరాలకు భవిష్య నిధిని కదపకపోవడమే సూచనీయం. దీనివల్ల ఉద్యోగ విరమణ సమయంలో కాంపౌండింగ్ మహిమతో మంచి నిధిని అందుకోవచ్చు. కాంపౌండింగ్ పెట్టుబడులను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయవద్దు, ఆలస్యం చేయవద్దు. వాయిదా వేయడం వల్ల కాంపౌండింగ్ మ్యాజిక్‌ను కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండింగ్ పెట్టుబడిని మరింతగా వృద్ధి చేస్తుంది. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 చొప్పున 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు పెట్టుబడి 9 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడి ప్రకారం అంచనా వేస్తే 15 ఏళ్లకు రూ.20 లక్షలు అవుతుంది. దీన్ని మరింత కాలం కొనసాగిస్తూ వెళితే అప్పుడు రాబడికి రాబడి కలుస్తూ పెద్ద మొత్తం సమకూరుతుంది. పొదుపు/పెట్టుబడి పొదుపునే పెట్టుబడిగా భావించే వారు కూడా ఉన్నారు. బ్యాంకు ఖాతాలో ఉంచినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా దాన్ని పెట్టుబడిగా పరిగణించడం మెరుగైన ఆర్థిక జీవనానికి మార్గం కానే కాదు. ఎందుకంటే సేవింగ్స్ ఖాతాలో బ్యాలన్స్‌పై వచ్చే వడ్డీ రాబడి 3 శాతమే. ఇది ద్రవ్యోల్బణం రేటులో సగం. కరెన్సీ విలువను హరించే మేరకు రాబడి కూడా ఇవ్వనిది పెట్టుబడి సాధనం ఎలా అవుతుంది.? అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లపైనా వడ్డీ రేటు 6.5 శాతం మించి లేదు. ఇది కూడా ద్రవ్యోల్బణం రేటుకు సమానమే. పైగా ఎఫ్డీపై వచ్చే వడ్డీ ఆదాయం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో రిస్క్ తీసుకుంటే రాబడి రేటు 8 శాతం అందుకోవచ్చు. ద్రవ్యోల్బణం రేటు కంటే ఎక్కువ రాబడి ఇవ్వని ఏదీ కూడా పెట్టుబడి సాధనం కాబోదు. అందుకనే సంపాదనలో ఆదా చేసిన మొత్తాన్ని మంచి రాబడినిచ్చే సాధనంలో పెట్టినప్పుడే పెట్టుబడి అవుతుంది. అన్ని సాధనాల్లోకి ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైనవి. 20–30 ఏళ్ల కాలంలో వీటిల్లో రాబడి 12–18 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. -
మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడుల వర్షం!
దేశంలో రోజు రోజుకి మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లో క్రమానుగత పెట్టుబడుల/సిప్‌లకు భారీగా ఆదరణ పెరుగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో సిప్‌లలో పెట్టుబడులు రూ.67,000 కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ పెట్టుబడిదారుల నుంచి పెట్టుబడుల పట్ల ప్రజాదరణ పెరుగుతుంది. 2020-21లో సిప్‌లలో ₹96,080 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. గత ఐదు సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్‌లలో సిప్ల ద్వారా వస్తున్న నిధుల వాటా రెండింతలకు పైగా పెరిగింది. 2016-17లో ఈ నిధులు రూ.43,921 కోట్లుగా ఉంది. ఇక నెలవారీ సిప్ వసూళ్లు ఈ ఏడాది అక్టోబరులో రూ.10,519 కోట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఇది గత నెల సెప్టెంబర్ ₹10,351 కోట్ల కంటే ఎక్కువ. ఇక గత మార్చి ఆఖరున రూ.4.28 లక్షల కోట్లుగా సిప్ నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) ఈ ఏడాది అక్టోబర్ చివరినాటికి ₹5.53 లక్షల కోట్లకు పెరిగాయి. అక్టోబర్ నెలలో నమోదైన కొత్త ఎస్ఐపీ/సిప్ల సంఖ్య 23.83 లక్షలు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22 మొదటి ఏడు నెలల్లో(ఏప్రిల్-అక్టోబర్) మొత్తం రిజిస్ట్రేషన్లు 1.5 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం మొత్తం 1.41 కోట్ల కొత్త ఎస్ఐపీ రిజిస్ట్రేషన్ల కంటే చాలా ఎక్కువ. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లలో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న సిప్ల సంఖ్య 4.64 కోట్లుగా ఉంది. (చదవండి: స్టాక్ మార్కెట్, లక్షల కోట్లు బూడిద పాలయ్యాయి) ఎస్ఐపీ/సిప్ అంటే ఏమిటి? ఎస్ఐపీ/సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. వీటిని ప్రధానంగా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు అందిస్తాయి. సిప్ పథకాలన్నీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా అసోసియేషన్ నియంత్రణలో ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిప్ పథకమంటే కొంత రిస్క్ ఉంటుంది. అలాగని పెట్టే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఏమీ ఉండదు. సంప్రదాయ వనరుల్లో కాకుండా కాస్తంత లాభాలు తెచ్చిపెట్టే షేర్లు, బంగారం వంటి పెట్టుబడి సాధనాల్లో ఈ సిప్ల ద్వారా ఫండ్ సంస్థలు ఇన్వెస్ట్ చేస్తాయి. ఒక క్రమబద్దమైన పెట్టుబడి ప్రణాళిక లేదా ఎస్ఐపీ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే పద్ధతి. ఇక్కడ పెట్టుబడిదారు మ్యూచువల్ ఫండ్ పథకాన్ని ఎంచుకుని నిర్ణీత వ్యవధిలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక ఎస్ఐపీ పెట్టుబడి ప్రణాళిక ఒకే సమయంలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కంటే కాల క్రమేణా కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఎక్కువ మొత్తంలో రాబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక సిప్‌ను ప్రారంభించడం చాలా సులువైన విషయం. మీరు చేయాల్సిందల్లా మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు దరఖాస్తు చేసేటప్పుడు సిప్ ఆప్షన్‌పై టిక్ చేయండి. ఇక మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచిప్రతి నెలా నిర్ణీత మొత్తం ఆ స్కీమ్‌లోకి డెబిట్ అయ్యేలా బ్యాంక్‌కు ఆదేశాలు ఇస్తే సరి. సిప్ ప్రారంభమవుతుంది. (చదవండి: గిన్నిస్ రికార్డు నెలకొల్పిన కియా ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలుసా?) -
40 ఏళ్ల పాటు సిప్.. మార్గం ఎలా?
ఒక మ్యూచువల్ ఫండ్ పథకం రెగ్యులర్ ప్లాన్‌కు, డైరెక్ట్ ప్లాన్‌కు వేర్వేరు రేటింగ్‌ను ఎలా కలిగి ఉంటాయి?– ఆర్ణబ్ ఒక విభాగంలో పోటీ పథకాలతో పోలిస్తే రిస్క్‌ను సర్దుబాటు చేసుకుని ఇచ్చే రాబడులకు సంబంధించి పరిమాణాత్మక కొలమానమే రేటింగ్. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటంటే.. డైరెక్ట్ ప్లాన్‌ను.. ఇతర పథకాల్లోని డైరెక్ట్ ప్లాన్లతోనే పోల్చి చూడడం జరుగుతుంది. అలాగే, రెగ్యులర్ ప్లాన్లను ఇతర పథకాల రెగ్యులర్ ప్లాన్లతోనే పోల్చి చూస్తారు. డైరెక్ట్ ప్లాన్‌కు, రెగ్యులర్ ప్లాన్‌కు మధ్య రేటింగ్ వేర్వేరుగా ఉండడానికి కారణం.. ఎక్స్పెన్స్ రేషియోనే. రెగ్యులర్ ప్లాన్లలో పోటీ పథకాలతో పోలిస్తే ర్యాంకు తక్కువగాను, సగటు కంటే తక్కువగా ఉండడం అన్నది అసాధారణం, అరుదైనదేమీ కాదు. అందుకనే మ్యూచువల్ ఫండ్ పథకం ఎంపికలో ఎక్స్పెన్స్ రేషియోకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అందులోనూ డెట్ ఫండ్‌లో అయితే ఎక్స్పెన్స్ రేషియోకు మరింత ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. నా వయసు 20 ఏళ్లు. పదవీ విరమణ తర్వాతి జీవితం కోసం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్స్‌లో 40 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను? ఇందుకు అనుసరించే వ్యూహం ఎలా ఉండాలి? – శ్రీజన్సింగ్ కచ్చితమైన ప్రణాళిక గురించి మీరు ఇప్పుడే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సిప్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించడమే ఇప్పుడు కీలకమైనది. మీకు పన్ను చెల్లించే ఆదాయం ఉండి ఉంటే.. అప్పుడు ఒకటి లేదా రెండు మంచి ఈఎల్ఎస్ఎస్ (ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే పన్ను ఆదా సాధనాలు) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఒకవేళ పన్ను చెల్లించేంత ఆదాయం లేకపోతే కనుక మంచి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌లో సిప్‌ను మొదలు పెట్టొచ్చు. ఈ వయసులో ఎంతో క్రమశిక్షణగా మెలుగుతూ మార్కెట్లు పెరిగిన సమయాల్లో, పడిన సమయాల్లోనూ సిప్‌ను కొనసాగించడం ఎంతో ముఖ్యమైనది అవుతుంది. సిప్ ప్రారంభంలో కొంత కాలం పాటు రాబడులు మీ అంచనాల స్థాయిలో ఉండకపోవచ్చు. అయినప్పటికీ అది మీ పెట్టుబడులకు అవరోధంగా మారకుండా చూసుకోవాలి. పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉండాలి. అదే విధంగా పెరుగుతున్న మీ ఆదాయానికి అనుగుణంగా సిప్ మొత్తాన్ని కూడా ఏటేటా పెంచుకుంటూ వెళ్లాలి. నేను ఒకే ఈక్విటీ ఫండ్‌లో సిప్ రూపంలో రూ.20,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను. వివిధ మ్యూచువల్ ఫండ్స్ సంస్థల మధ్య ఈ మొత్తాన్ని వైవిధ్యం చేసుకోవాలా? లేదంటే ఇప్పటి మాదిరే కొనసాగాలా? ఇందులో ఉండే లాభ, నష్టాల మాటేమిటి? – హేమంత్ వైవిధ్యం అవసరం ఎంతో ఉంది. కనీసం మరొక మ్యూచువల్ ఫండ్ సంస్థకు సంబంధించిన వేరొక పథకానికి అయినా మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాల్సిందే. అలా కాకుండా ఇప్పటి మాదిరే అదే పథకంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లారనుకుంటే.. అప్పుడు ఆ పథకం విషయంలో ఏదైనా అనుకోని పరిణామం తలెత్తితే రాబడులన్నీ రిస్క్‌లో పడినట్టు అవుతుంది. వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకానికి (వేరే ఫండ్ సంస్థకు సంబంధించి) మీ పోర్ట్‌ఫోలియోలో చోటివ్వాలి. వైవిధ్యం విషయంలో అతిగా వ్యవహరించకుండా (మితిమీరిన వైవిధ్యం) ఉంటే ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. మీరు ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తున్న పథకం తర్వాతి కాలంలో అద్భుతమైన పనితీరును చూపించొచ్చు. అప్పుడు పెట్టుబడులను వైవిధ్యం చేసుకుని తప్పు చేశామా? అన్న సందేహం రావచ్చు. కానీ, అలా ఆలోచించడం సరైనది కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక వైవిధ్యంలో భాగంగా కనీసం మరొక పథకాన్ని ఎంపిక చేసుకోండి. - ధీరేంద్రకుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రూ.36.74 లక్షల కోట్లకు చేరిన మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు
ముంబై: మ్యూచువల్ ఫండ్స్ వైపు మరింత మంది ఇన్వెస్టర్లు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) రూ.36.74లక్షల కోట్లకు చేరాయి. 2020 సెప్టెంబర్ నాటికి ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.27.6 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 33 శాతం వృద్ధి చెందినట్టు మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) వచ్చే నెలవారీ పెట్టుబడులు మొదటిసారి రూ.10,000 కోట్లను దాటినట్టు యాంఫి సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. మ్యూచువల్ ఫండ్స్ పట్ల రిటైల్ ఇన్వెస్టర్లలో విశ్వాసానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి సాధనాలతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. సిప్ ఖాతాల్లో వృద్ధి.. సిప్ ఖాతాల సంఖ్య ఆగస్ట్ చివరికి 4,32,44,048గా ఉంటే.. సెప్టెంబర్ ఆఖరుకు 4,48,97,602 కోట్లకు పెరిగాయి. సిప్ రూపంలో సెప్టెంబర్‌లో నికరంగా రూ.10,315 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం మీద సిప్ ఖాతాలకు సంబంధించి నిర్వహణ ఆస్తులు రూ.5,44,976 కోట్లకు పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఆస్తులు మొత్తం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల్లో 48.23 శాతానికి చేరి.. రూ.17,72,049 కోట్లుగా ఉన్నాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.8,666 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాలు ఆగస్ట్ నెలలో నికరంగా రూ.8,666 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. నూతన ఫండ్ పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేశాయి. ఇలా ఈక్విటీ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు ప్రవేశించడం వరుసగా ఆరో నెలలోనూ నమోదైంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఆగస్ట్ చివరికి రూ.36.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై ఆఖరుకు రూ.35.32 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) ఆగస్ట్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రూ.22,583 కోట్లు, జూన్‌లో రూ.5,988 కోట్లు, మేలో రూ.10,083 కోట్లు, ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి రావడం గమనార్హం. 2020 జూలై– 2021 ఫిబ్రవరి మధ్య ఎనిమిది నెలల పాటు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. నూతన మైలురాయి.. ‘‘ఓపెన్ ఎండెడ్ పథకాల్లోని సానుకూల పెట్టుబడుల రాకకుతోడు.. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఏయూఎం రూ.36 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించేందుకు తోడ్పడ్డాయి’’ అని యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. సిప్ ఖాతాలు పెరగడం అన్నది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఆగస్ట్‌లో ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో ఇన్వెస్టర్లు రూ.6,863 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు మైవెల్త్‌గ్రోత్ సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. విభాగాల వారీగా... ► ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.4,741 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోకి రూ.3,073 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆగస్ట్‌లో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ పథకాల నుంచి ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు రూ.163 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్టర్లు రూ.18,706 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ► సిప్ ఖాతాలు జూలై ఆఖరుకు 4.17 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి 4.32 కోట్లకు పెరిగాయి. ► నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.9,923 కోట్లుగా ఉన్నాయి. జూలైలో ఈ మొత్తం రూ.9,609 కోట్లుగా ఉంది. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.24 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో మాత్రం ఈ విభాగం నుంచి ఇన్వెస్టర్లు రూ.61 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► ఆగస్ట్‌లో డెట్ పథకాల్లోకి నికర పెట్టుబడులు రూ.1,074 కోట్లుగానే ఉన్నాయి. జూలైలో వచి్చన రూ.73,964 కోట్లతో పోలిస్తే డెట్‌లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ► డెట్‌లో ఫ్లోటర్ ఫండ్స్‌లోకి రూ.9,991 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.3,065 కోట్ల చొప్పున వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.11,808 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆగస్ట్‌లో ఫండ్స్ పరిశ్రమలోకి (అన్ని విభాగాలూ) నికరంగా రూ.32,976 కోట్లు వచ్చాయి.