న్యూఢిల్లీ: మెజారిటీ యవత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకుంటున్నారు. డిజిటల్ రూపంలో లావాదేవీలు సులభంగా నిర్వహించుకునే వీలు, ఖర్చు చేసే ఆదాయంలో వృద్ధి, ఆర్థిక అక్షరజ్ఞానం పెరుగుతుండడం ఇందుకు వీలు కలి్పస్తున్నట్టు వైట్‌ఓక్ క్యాపిటల్ మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. ఈ సంస్థ నిర్వహణలో 3.33 లక్షల ఇన్వెస్టర్లకు సంబంధించి రూ.8,400 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి.
ఏడాది క్రితమే ఈ సంస్థ మ్యూచువల్ ఫండ్స్ కార్యకలాపాలు మొదలు పెట్టింది. తన కస్టమర్లలో 56 శాతం జెనరేషన్ జెడ్, మిలీనియల్స్ (జెనరేషన్ వై) ఉన్నట్టు తెలిపింది. 1981–1996 మధ్య జన్మించిన వారు జెనరేషన్ వై కిందకు, 1997–2012 మధ్య జని్మంచిన వారు జెనరేషన్ జెడ్ కిందకు వస్తారు. తనకున్న 3.33 లక్షల కస్టమర్లలో 28 శాతం మేర జెనరేషన్ జెడ్, మరో 28 శాతం మేర జెనరేషన్ వై విభాగంలోని వారేనని ఈ సంస్థ తెలిపింది.
అంతేకాదు 51 శాతం మంది డిజిటల్ చానల్స్ ద్వారానే ఇన్వెస్ట్ చేస్తున్నట్టు పేర్కొంది. ‘‘జెనరేషన్ వై, జెడ్ డిజిటల్ టెక్నాలజీ తెలిసిన వారు. కనుక వారు టెక్నాలజీ ఆధారితంగా నడిచే ఫైనాన్షియల్ సరీ్వస్ ప్రొవైడర్లకు ప్రాధాన్యత ఇవ్వడం సహజమే’’అని వైట్‌ఓక్ క్యాపిటల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రతీక్ పంత్ తెలిపారు. సహేతుక రాబడులు, నిపుణుల ఆధ్వర్యంలో పెట్టుబడుల నిర్వహణ, చాలా స్వల్ప మొత్తం నుంచే పెట్టుబడికి అవకాశం, ఎన్నో రకాల పెట్టుబడి పథకాలు, సులభంగా ఉపసంహరించుకునే వెసులుబాటు ఇవన్నీ యువ ఇన్వెస్టర్లు సిప్ వేసేందుకు అనుకూలిస్తున్నట్టు చెప్పారు.
టికెట్ సైజు తక్కువే
18–35 ఏళ్ల వయసు వారు సిప్ రూపంలో చేస్తున్న పెట్టుబడి, ఇంతకంటే పెద్ద వయసులోని వారితో పోలిస్తే తక్కువగానే ఉన్నట్టు వైట్‌ఓక్ తెలిపింది. తమ పాకెట్ మనీ నుంచి లేదంటే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడం ద్వారా వచ్చే మొత్తం నుంచి వీరు ఇన్వెస్ట్ చేస్తుండొచ్చని ప్రతీక్ పంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలో 7.92 కోట్ల సిప్ ఖాతాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment