Investments
-
ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులు
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్‌లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయంఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్‌ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?పెట్టుబడులతో ప్రయోజనాలుమిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్‌తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి. పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్‌లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలవు. మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్లను తప్పక పరిశీలించవచ్చు.- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్ -
పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
-
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్‌గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్‌కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్‌గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్‌కు దేశీ ఇంధనం!
సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్‌పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.దేశీ లిస్టెడ్ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్íÙప్లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్ చేస్తూ దేశీ స్టాక్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. గత నాలుగేళ్లుగా బుల్ ట్రెండ్‌తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు యూటర్న్ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.2015తో పోలిస్తే 2025లో ఎఫ్‌పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో 2024 డిసెంబర్‌కల్లా ఎఫ్‌పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్‌పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్‌పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ ఆధిపత్యం డీఐఐలలో మ్యూచువల్ ఫండ్స్‌దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇక 2024 అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్‌పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్‌పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!రిటైలర్ల బలమిది ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్‌కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్ చేశాయి. 2024 చివరి క్వార్టర్లో రిటైలర్లు స్టాక్స్‌లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! ఈ జోష్‌తో గతేడాది 91 కంపెనీలు ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!జనవరిలో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లుదేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు కొనసాగవచ్చు పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది. 2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. థిమాటిక్ ఫండ్స్ స్పీడ్ గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. -
ఆర్థిక యుద్ధం గెలవగలరా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఉత్తర్వుల తుఫానును సృష్టిస్తున్నా, వాటన్నింటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధ మైనదే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వా లపై, వలసలపై ఆంక్షలు; దిగుమతులపై భారీగా సుంకాలు; గ్రీన్లాండ్, పనామా కాలువల స్వాధీనం; చైనాపై వాణిజ్య యుద్ధం; చమురు ధరలు తగ్గించాలనీ, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ అరబ్ దేశాలపై ఒత్తిడులు; ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం; తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్ఓ, ప్యారిస్ ఒప్పందాల నుంచి ఉపసంహరణ; డాలర్‌కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు... ఇట్లా దేనిని గమనించినా వాటన్నింటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే.ఆధిపత్యపు గుప్పిటిఏ అధ్యక్షుడైనా తమ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలనీ, ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబడాలనీ కోరుకోవటంలో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పగూలినప్పటి నుంచి అమెరికాదే అగ్రస్థానం. అయినప్పటికీ ట్రంప్ ఆర్థిక యుద్ధం అనదగ్గ రీతిలో పై చర్య లను ఎందువల్ల ప్రకటిస్తున్నట్లు? అమెరికా బలానికి మూలస్తంభాలు నాలుగున్నాయి. ఒకటి, ఆర్థిక స్థితి. రెండు, సైనిక శక్తి. మూడు, ఉన్నత విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాలలోని ప్రతిభా సామ ర్థ్యాలు. నాలుగు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐక్య రాజ్యసమితి వంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం. ఈ నాలుగు అమెరికా గుప్పిట్లో ఉన్నంతకాలం అమెరికా సామ్రాజ్యానికి ముప్పు ఉండదు. ఈ పాఠాలను వారు బ్రిటిష్ సామ్రాజ్య పతనం నుంచి నేర్చుకున్నారు. కనుక ఈ ఆధిపత్యాలు చెదరకూడదు.రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ ఓడిన తర్వాత సోవియెట్ యూనియన్ నాయకత్వాన కమ్యూనిస్టు శిబిరం బలపడి, అమెరికాకు మొదటి పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, సోవియెట్ కూటమి అమెరికాకు సైద్ధాంతికంగా, సైనికంగా మాత్రమే సవాలు అయింది తప్ప, పైన పేర్కొన్న మొత్తం నాలుగు రంగాలలోనూ కాలేకపోయింది. చివరకు పలు స్వీయాపరాధాలవల్ల కుప్పకూలింది. ఇది 1991 చివరి దశ మాట. తర్వాత 30 ఏళ్లపాటు అమెరికాకు ఎదురులేక పోయింది. చైనా సవాలుఆ విధంగా తమకు ఎదురు లేదని భావిస్తుండగా రష్యా తన అపారమైన సహజ వనరుల బలంతో నెమ్మదిగా పుంజుకోవటం మొదలైంది. దానితోపాటు మరికొన్ని పరిణామాలు అమెరికాకు సరికొత్త సవాలుగా మారసాగాయి. ఈ పరిణామాలలో అన్నింటి కన్నా ప్రధానమైంది చైనా అనూహ్యమైన అభివృద్ధి. అందుకు ఆరంభం ఆ దేశం 2001లో డబ్ల్యూటీఓలో ప్రవేశించటంతో మొదలైంది. 1980–90 మధ్య తెంగ్ శియావ్ పింగ్ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేయగా, డబ్ల్యూటీఓ ప్రవేశంతో అందుకు మహా వేగం వచ్చింది. పదేళ్లయేసరికి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 నాటికైతే పర్ఛేజింగ్ పవర్ పేరిటీ (పీపీపీ; దేశాల మధ్య కొనుగోలు శక్తిలోని తారతమ్యం) కొలమానాల ప్రకారం అమెరికాను సైతం మించిపోయింది.ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది సోవియెట్ యూనియన్ వ్యూహానికీ, చైనా వ్యూహానికీ మధ్యగల తేడా. సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా, అమెరికా వలెనే ఒక సమగ్ర వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. ఆర్థికాభివృద్ధి, సైనికాభివృద్ధి, విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలలో పలుకు బడిని క్రమంగా పెంచుకోవటం. ఇవిగాక, అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల చిన్న దేశాల సహజ వనరులను, మార్కెట్లను కొల్లగొడుతూ వాటిని తమ చెప్పు చేతలలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా తన అపారమైన ధన సంపదతో వాటి అభివృద్ధికి సహకరించటంతో పాటు తాను కూడా లాభపడే వ్యూహాన్ని అనుసరించటం మొదలుపెట్టింది.అమెరికా, యూరప్ ఉత్పత్తుల ఖర్చు పెరగటంతో పరిశ్రమలను తమంతట తామే చైనాకు, ఆగ్నేయాసియా దేశాలకు తరలించటం, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవటం అనే వ్యూహం తొలుత బాగానే పనిచేసింది. కానీ తర్వాత అదే వారికి సమస్యగా మారింది. అనేక ఆధునిక పరిశోధనలు, ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాలు అమెరికా కన్నా ముందుకు వెళ్లి పోయాయి.బ్రిక్స్ సవాలుఅమెరికా కూటమికి దీనికిదే ఒక జంకుగా మారగా, చైనా చొరవతో ఏర్పడిన బెల్ట్ అండ్ రోడ్ పథకం, బ్రిక్స్ కూటమి పెద్ద సవాళ్లు అయాయి. ఇండియా కొన్ని కారణాల వల్ల బెల్ట్ పథకంలో చేరలేదుగానీ, 2009లో వ్యవస్థాపితమైన బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం కావటం గమనించదగ్గది. అమెరికా ఏక ధృవ ప్రపంచంవల్ల కలుగుతున్న హానిని గుర్తించిన ముఖ్యమైన దేశాలు కొన్ని బహుళ ధృవ ప్రపంచం అనే భావనను అజెండా పైకి తెచ్చాయి. ఒకప్పుడు అమెరికా, సోవియెట్ యూనియన్లతో ద్విధృవ ప్రపంచం ఉండగా, సోవియెట్ పతనం తర్వాత అది ఏకధృవంగా మారింది. దీనితో ఈ కొత్త సవాలును భగ్నం చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్లు చతురోపాయాలను ప్రయోగిస్తు న్నాయి గాని సఫలం కావటం లేదు. వారు ఎంత వ్యతిరేకించినా బెల్ట్ పథకపు సభ్య దేశాల సంఖ్య 150కి మించి పోయింది. విశేషమేమంటే, అమెరికా కూటమిలోని యూరోపియన్ దేశాలు కొన్ని కూడా అందులో చేరాయి. బ్రిక్స్‌లో మరికొన్ని పెద్ద దేశాలు కొత్తగా చేరగా డజన్ల కొద్దీ దరఖాస్తు చేశాయి. సరిగా ట్రంప్ అధికార స్వీకరణ చేస్తుండిన రోజులలోనే ఇండోనేసియా చేరగా, తాము కూడా చేరను న్నట్లు మలేసియా ప్రధాని ప్రకటించారు. బ్రిక్స్ కూటమి జీడీపీ ప్రపంచ జీడీపీలో ఇప్పటికే 35 శాతానికి చేరగా, జీ–7 జీడీపీ 30 శాతం దగ్గర ఆగిపోయి ఉంది. మరొకవైపు చైనాతో అమెరికా వాణిజ్య లోటు సంవత్సరాల తరబడిగా తీరటం లేదు. దాదాపు 120 దేశాలతో చైనా వాణిజ్యం అమెరికాను మించిపోయింది.ఈ విధమైన మార్పులతో కలవరపడినందువల్లనే ట్రంప్ తన మొదటి హయాంలో చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రక టించారు. సుంకాలు పెంచారు. అమెరికన్ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైనా సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయ త్నాలు చేశారు. కానీ, ఆయన పాలన ముగిసే నాటికి, ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కలు వేసి చూపించాయి. ఆ తర్వాత బైడెన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫల మయ్యారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి చిత్రంగా ఉంది. ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే, మరొకవైపు చైనాతో చర్చలు జరప గలమని అంటున్నారు. అమెరికా ఆధిపత్యానికి డాలర్ శక్తి ఒక ముఖ్యాధారం. బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు గానీ, వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించ గలమన్నది. ఈ మార్పులు డాలర్‌ను బలహీనపరచగల అవకాశం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ట్రంప్ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అందుకే పెట్టుబడులొచ్చాయ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్.. తమ ప్రభుత్వ కృషి వల్లే పెట్టుబడులు వచ్చాయన్నారు.‘‘ఈ పెట్టుబడులు ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టబడులు తీసుకొచ్చాం. ప్రణాళికతో వెళ్లాం కాబట్టే పెట్టుబడులొచ్చాయి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధించినట్లు: శ్రీధర్‌బాబు‘‘రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఓయూల రూపంలో వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే మనం విజయం సాధించినట్లు. మూసీ నది పునరుజ్జీవనం అవసరం.. సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపాం..ఓ వైపు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులకు స్కిల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటే.. 17కంపెనీల పనులు జరుగుతున్నాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్ -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్‌లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్‌కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్‌లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్‌బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్‌విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య
సాక్షి, అమరావతి: ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళుతున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్‌ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్వర్కింగ్ కేంద్రం దావోస్’ అంటూ సెలవిచ్చారు. ఒప్పందాల కోసం దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్‌మార్ట్, యూనీలీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్‌ను తాను ప్రమోట్ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ దావోస్‌కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్‌ను ప్రమోట్ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులుకొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ 14 మిలియన్ టన్నుల స్టీల్ప్లాంట్స్ పోర్టు ఆధారంగా ఏర్పాటవుతున్నాయన్నారు. దీంతోపాటు ఎల్జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యూనిట్, రిలయన్స్ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్‌గా తయారు కానుందన్నారు. టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వచ్చిందని, గూగుల్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్‌గేట్స్‌ను కోరినట్టు తెలిపారు. సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జిందాల్ గ్రూపుతో దావోస్‌లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాకపోతే నేర్పించా..ఇండియాలో దావోస్‌ను, సీఐఐని నేనే ప్రమోట్ చేశా» గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.» 1997లో దావోస్ వెళ్లి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగేవారు.» 25 హైస్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను.» నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ హైదరాబాద్‌లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో చేసిన ప్రగతి చూసి ఎస్ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యారు.» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.» నేను అప్పట్లో పీసీ (పర్సనల్ కంప్యూటర్) అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.» 1995లో ఐటీని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా.» కార్పొరేట్–పబ్లిక్ గవర్నెన్స్‌లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా తయారు చేస్తా.» హైదరాబాద్‌ని తెలంగాణ వాళ్లదిగా చూడకూడదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్‌ను ప్రమోట్ చేశాను.» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.» గతంలో నువ్వు ల్యాప్‌టాప్‌లోని డాష్‌బోర్డుతో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నావా అని బిల్‌గేట్స్ అడిగారు.» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మహారాష్ట్రను హబ్‌గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను. -
ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు.. ‘దావోస్’ వైఫల్యంపై కవరింగ్
సాక్షి, విజయవాడ: దావోస్(Davos) వైఫల్యంపై సీఎం చంద్రబాబు(Chandrababu) బుకాయింపులకు దిగారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోరంటూ వింత సమాధానం ఇచ్చారు. దావోస్ వెళితే పెట్టుబడులు (Investments) వస్తాయన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు భాష్యం చెప్పారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోవాల్సిన పనిలేదంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లేముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గతంలో దావోస్‌నే ఏపీకి తెస్తానంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అక్కడ ఆయన టీమ్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో దావోస్‌లో ఏపీకి ఘోర అవమానమే మిగిలింది. జీరో ఎంవోయులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరిగొచ్చారు. తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు.‘‘దావోస్ అంటే ఒక మిత్ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు.. ఎంత డబ్బులొచ్చాయన్నది ఓ మిత్. ఇక్కడుండే ఎంవోయూలు అక్కడ చేసుకునే పనిలేదు. దావోస్ కేవలం నెట్ వర్క్ ప్లేస్ మాత్రమే. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.ఇదీ చదవండి: చంద్రబాబు దావోస్ పర్యటన.. దారి ఖర్చులు 'దండగ'! -
తెలంగాణకు పెట్టుబడులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. -
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
-
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. -
విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి
సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్‌ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూల పేట ఇందుకు అనుకూలమని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది. బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్‌కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు. -
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...జిందాల్‌ను వేధించిన బాబు సర్కారు– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్‌ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..– ఈవీ, సోలార్ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలుసజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్‌తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్‌డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.నాడు.. పెట్టుబడులకు రాచబాట..– పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ భరోసావైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. -
సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పండి: Yanamala Nagarjuna Yadav
-
కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.రాష్ట్రం నుంచి తరిమేశారు..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.కమీషన్ల కోసం బెదిరింపులుముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలిఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. యూనీలివర్‌తో ఒప్పందం దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. -
జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది. ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. -
ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా భారత్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది. మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్/సూపర్వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్మెంట్, మేనేజీరియల్/సూపర్వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి. -
రాజధానిలో కొత్త ఐటీ పార్క్
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌కు చెందిన క్యాపిట ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం క్యాపిటల్యాండ్ ప్రతినిధి బృందంతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యాపిటల్యాండ్ కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ సారథ్యంలో హైదరాబాద్ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు.ఇప్పటికే పలు పెట్టుబడులు..క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ కూడా ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. సింగపూర్‌లో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉన్నతాదికారులు, క్యాపిటల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ పాల్గొన్నారు.మెరీనా బేలో సీఎం పడవ ప్రయాణంసీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లోని మెరీనా బేలో ఫెర్రీ ప్రయాణం చేశారు. మెరీనా బే తీరంలో నిర్మించిన ఆకాశహర్మ్యాలను తిలకించి, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పర్యాటకాభివృద్ధికి చేపట్టిన చర్యలను పరిశీలించారు.ముగిసిన సింగపూర్ పర్యటనసీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి ఆదివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో దావోస్‌కు వెళుతున్నట్టు రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ఇక సింగపూర్‌లో తమ పర్యటన విజయవంతమైందని తెలిపింది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ఒప్పందం, రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం కీలక అంశాలని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెబుతున్నాయి.చివరి రోజు వరుస సమావేశాలుసింగపూర్ పర్యటనలో ఆదివారం సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్‌తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించింది. -
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలుకేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు 2015లో⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం ⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన ⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం2016లో⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి 2017లో⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు ⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు ⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు 2018లో⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు 2019లో⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం ⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి -
డేటా సెంటర్లకు రాజధాని: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ త్వరలోనే డేటా సెంటర్లకు రాజధానిగా అవతరిస్తుందని, సింగపూర్‌కు చెందిన ఎస్టీ టెలి మీడియా భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకురావడం దీనిని చాటి చెబుతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలు ఉన్నాయని చెప్పారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఎస్టీ టెలి మీడియా కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. ఆ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.3,500 కోట్ల పెట్టుబడితో ‘గ్లోబల్ డేటా సెంటర్’ ఏర్పాటుకు ఎస్టీ టెలి మీడియా ముందుకొచ్చింది. ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్పేటలో ఏఐ ఆధారిత అత్యాధునిక డేటా సెంటర్ క్యాంపస్ స్థాపించేందుకు అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఒప్పంద పత్రాలపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిశ్రమల శాఖ ముఖ్య కార్య దర్శి జయేశ్ రంజన్, ఎస్టీటీ గ్రూప్ ప్రెసిడెంట్, సీఈఓ బ్రూనో లోపెజ్ సంతకాలు చేశారు. భారతదేశంలోని అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా నిలిచే ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ తెలంగాణలో ఏర్పాటు కానుండటం... ఇక్కడి మౌలిక సదుపాయాలు, ప్రపంచస్థాయి అనుకూలతలను చాటి చెప్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత రంగాల్లో వస్తున్న మార్పుల్లో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఇక తెలంగాణలో మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రగతిశీల విధానాలు ఆవిష్కరణలను ప్రోత్సహించేలా ఉన్నాయని ఎస్టీ టెలిమీడియా గ్లోబల్ డేటా సెంటర్స్ ప్రెసిడెంట్, సీఈవో బ్రూనో లోపెజ్ ప్రశంసించారు. భారీగా విస్తరణ దిశగా.. ఇప్పటికే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో డేటా సెంటర్‌ను నిర్వహిస్తున్న ఎస్టీ టెలీమీడియా కొత్త క్యాంపస్ ఏర్పాటుతో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. వంద మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటయ్యే కొత్త క్యాంపస్ సామర్థ్యాన్ని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పెంచనుంది. వచ్చే పదేళ్లలో భారత్‌లో తమ డేటా సెంటర్లను ఒక గిగావాట్ సామర్థ్యానికి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా వచ్చే పదేళ్లలో ఎస్టీ టెలీమీడియా సుమారు 3.2 బిలియన్ డాలర్లను (సుమారు రూ.27 వేల కోట్లు) పెట్టుబడిగా పెడుతుందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు: సీఎం రేవంత్ సింగపూర్ వాణిజ్య, పర్యావరణ మంత్రి గ్రేస్ ఫు హెయిన్తో సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. నగరాలు, పట్టణాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, నీటి వనరుల నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్ల తయారీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో.. తెలంగాణ, సింగపూర్ ప్రభుత్వాలు కలసి పనిచేసేందుకు ఉన్న అనుకూలతలను సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై సింగపూర్ మంత్రి గ్రేస్ ఫు హెయిన్ స్పందిస్తూ.. వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంపై అందిన ఆహ్వానాన్ని పరిశీలిస్తామని, తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, నీటి వనరుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి ప్రణాళికలపై ఆసక్తి చూపడంతోపాటు పలు ప్రాజెక్టుల్లో పరస్పరం కలసి పనిచేసేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఉమ్మడిగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు, వాటిపై అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు, వివిధ రంగాల్లో సింగపూర్ అనుభవాలను పంచుకోవడంపై చర్చించారు. సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి సింగపూర్ ఆసక్తి సింగపూర్ పర్యటనలో భాగంగా శనివారం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (ఎస్ఎస్ఐఏ)తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. తెలంగాణలో సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడికి అనుకూల వాతావరణం ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పెట్టుబడిదారులకు అందించే సహకారం, ప్రోత్సాహకాలు, ఇతర అనుకూలతలను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ పరిశ్రమ వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ కీలక కేంద్రంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు... సెమీకండక్టర్ల రంగంలో పెట్టుబడులపై ఆసక్తి చూపారు. ఈ ఏడాది చివరిలో తమ ప్రతినిధుల బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని ప్రకటించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్ఎస్ఐఏ చైర్మన్ బ్రియాన్ టాన్, వైస్ చైర్మన్ టాన్ యూ కాంగ్, సెక్రటరీ సీఎస్ చుహ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, ఆధునిక మౌలిక వసతులు, విధానాలు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆకర్షించాయని ఈ భేటీ అనంతరం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
రియల్టీలో పీఈ పెట్టుబడులు ప్లస్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి తొమ్మిది నెలల్లో రియల్టీ రంగంలోకి ప్రయివేట్ ఈక్విటీ(Private equity) పెట్టుబడులు 6 శాతం పెరిగాయి. ఏప్రిల్–డిసెంబర్లో 2.82 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రధానంగా ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ పార్క్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ గణాంకాల ప్రకారం గతేడాది(2023–24) ఇదే కాలంలో 2.66 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు లభించాయి. అయితే డీల్స్ 24కు పరిమితమయ్యాయి. గతేడాది 30 లావాదేవీలు నమోదయ్యాయి. మొత్తం పీఈ పెట్టుబడుల్లో విదేశీ ఫండ్స్ వాటా 82 శాతంకాగా.. దేశీయంగా 18 శాతం నిధులు లభించాయి. ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ విభాగం అత్యధికంగా 62 శాతం పెట్టుబడులను సమకూర్చుకుంది. ఈ బాటలో హౌసింగ్ 15 శాతం, ఆఫీస్ విభాగం 14 శాతం, మిక్స్డ్ వినియోగ ప్రాజెక్టులు 9 శాతం పెట్టుబడులను ఆకర్షించాయి. ఇదీ చదవండి: భారత్ ఎకానమీ వృద్ధి కోతటాప్–10 డీల్స్ హవాతొలి 9 నెలల మొత్తం పీఈ లావాదేవీలలో టాప్–10 డీల్స్ వాటా 93 శాతమని అనరాక్(Anarock Capital) క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ వెల్లడించారు. 1.54 బిలియన్ డాలర్ల విలువైన రిలయన్స్, ఏడీఐఏ, కేకేఆర్ వేర్‌హౌసింగ్ డీల్‌ను అతిపెద్ద లావాదేవీగా పేర్కొన్నారు. దీనితోపాటు 20.4 కోట్ల డాలర్ల విలువైన బ్లాక్‌స్టోన్, లోగోస్ ఈక్విటీ డీల్.. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగానికి ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. ఈ రంగం మొత్తం పీఈ పెట్టుబడుల్లో 62 శాతం వాటాను ఆక్రమించుకున్నట్లు వెల్లడించారు. -
ఈ ఏడాదికి పెట్టుబడి అస్త్రాలు!
‘ఈ రోజు గడిస్తే చాలులే.. రేపటి రోజు గురించి ఇప్పుడు ఎందుకు?’.. ఈ తరహా ధోరణి ఆర్థిక విజయాలకు పెద్ద అడ్డంకి. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ రేపటి రోజు కోసం కచ్చితమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు లక్ష్యాలు ఒక నెల సంపాదనతో సాధించేవి కావు. వీటి కోసం దీర్ఘకాలం పాటు పొదుపు, మదుపు చేయాల్సిందే. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామన్నది కీలకం. పొదుపును మెరుగైన సాధనంలో పెట్టుబడిగా మార్చి, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లిన వారే ఆకాంక్షలను నెరవేర్చుకోగలరు. వివిధ సాధనాల మధ్య చక్కని పెట్టుబడుల కేటాయింపులతో ముందుకు వెళ్లడం ద్వారా జీవిత లక్ష్యాలను త్వరగా సాకారం చేసుకోవచ్చు. ఈ ఏడాది పెట్టుబడుల కోసం ఏ సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు? వాటి పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల సూచనలను ఓ సారి పరిశీలిద్దాం. రూ.5 వేలతో కోటి.. గతంతో పోల్చితే నేడు ఆదాయ స్థాయిల్లో ఎంతో మార్పు వచ్చింది. నెలకు రూ.5 వేలు పొదుపు చేయడం చాలా మందికి సాధ్యమే. రూ.5 వేలను ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా 15 శాతం రాబడులను ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు రూ.1,64,20,369 సమకూరుతుంది. ఇందులో పెట్టుబడి రూ.15 లక్షలే. మిగిలిన రూ.కోటిన్నర కాంపౌండింగ్ మాయతో సమకూరిన సంపద. ఒకవేళ రాబడి ఇంకాస్త అధికంగా ఏటా 18 శాతం వచ్చిందని అనుకుంటే సమకూరే సంపద రూ.2.91 కోట్లు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఖర్చులు ఎదురైనా పెట్టుబడిని విస్మరించకూడదు. అలాగే, మొత్తం పెట్టుబడిని ఈక్విటీల్లో పెట్టేయకూడదు. వివిధ సాధనాల మధ్య పెట్టుబడిని వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్‌్కను అధిగమించొచ్చు. పెట్టుబడిని కాపాడుకోవచ్చు. రాబడులను పెంచుకోవచ్చు. ఈక్విటీలతోపాటు డెట్ సెక్యూరిటీలు, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలి. ఈక్విటీలు అధిక రాబడులను ఇస్తాయి. కానీ అస్థిరతలు ఎక్కువ. డెట్‌లో అస్థిరతలు తక్కువ, రాబడులూ తక్కువే. బంగారం, రియల్ ఎస్టేట్‌లో అస్థిరతలు తక్కువగా, రాబడులు మోస్తరుగా ఉంటాయి. ఈక్విటీలు..ఈక్విటీల విలువలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో, ఇటీవలి దిద్దుబాటు తర్వాత కూడా షేర్ల ధరలు కొంత అధికంగా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించాలని, రాబడుల అంచనాలు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్ స్టాక్స్ మెరుగైన పనితీరు చూపిస్తాయన్నది విశ్లేషకుల అంచనా. నాణ్యమైన, పటిష్ట వృద్ధి అవకాశాలతో, సహేతుక విలువల వద్దనున్న స్టాక్స్‌ను పరిశీలించొచ్చు. టాప్–50 కంపెనీల విలువ మొత్తం మార్కెట్ విలువలో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిల వద్ద ఉండడాన్ని గమనించొచ్చు. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఐదేళ్ల కాలానికి మెరుగైన రాబడులను ఇస్తాయని, వీటి నుంచి ఏటా సగటున 20 శాతం రాబడిని ఆశించొచ్చని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. ‘‘2025 లార్జ్‌క్యాప్ స్టాక్స్ వంతు. ప్రైవేటు బ్యాంక్‌లు, టెలికం, ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు చూపించొచ్చు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కూడా రాబడులను ఇస్తాయి. కానీ అంచనాలు తగ్గించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు ఫ్లెక్సీక్యాప్ వైపు చూడొచ్చు’’ అని నువమా వెల్త్ ప్రెసిడెంట్ రాహుల్‌జైన్ వివరించారు. ‘‘పెట్టుబడులను వివిధ అసెట్ క్లాస్‌ల మధ్య విస్తరించుకోవడం చక్కని అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఉన్న మెరుగైన మార్గం’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో శంకరన్ నరేన్ సూచించారు. హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఇటీవలి మార్కెట్ కరెక్షన్తో లార్జ్‌క్యాప్‌లో విలువలు దిగొచ్చాయి. కానీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విలువలు చారిత్రక సగటు కంటే ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. కనుక సమీప కాలానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌పై అధిక వేయిటేజీ ఇవ్వొచ్చు. మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక ఆచితూచి ఉండాలి’’ అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ సూచించింది. నేరుగా స్టాక్స్ కంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. నిఫ్టీ 2024లో 9 శాతం లాభాలతో ముగిసింది. 2025లో 28,800 వరకు ర్యాలీ చేయొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తోంది. రియల్టీ / ఏఐఎఫ్లుపట్టణీకరణ విస్తరిస్తూ ఉంది. మెరుగైన ఉపాధి కల్పనతో ఆదాయ స్థాయిల్లో మార్పు వస్తోంది. ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కనుక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్చేసుకోవాలని నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యానికి మౌలిక వసతులు కీలకం. కనుక ఇన్వెస్టర్లు రీట్లతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ ఏఎంసీ సూచిస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఆర్ఈ ఏఐఎఫ్‌లు) కూడా ఉన్నాయి. ‘‘ప్రత్యేకమైన ఆర్ఈ ఏఐఎఫ్‌లు అత్యున్నత గ్రేడ్ కమర్షియల్ ఆఫీస్, లగ్జరీ నివాస గృహాల పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడుల అవకాశాలను కలి్పస్తాయి. వీటిపై అధిక రాబడులకుతోడు, మెచ్యూరిటీ సమయంలో మూలధన లాభాలను సైతం పొందొచ్చు’’అని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. రియల్ ఎస్టేట్‌లో ఒకరు విడిగా ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం పడుతుంది. రీట్లు, ఏఐఎఫ్‌ల ద్వారా అయితే రూ.100–500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. భౌతిక ప్రాపరీ్టకి బదులు వీటిల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అవసరం వచ్చినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. వీటిల్లో అస్థిరతలు తక్కువ.ఎఫ్‌అండ్‌వో/ క్రిప్టోలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో), క్రిప్టో ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడ్ చేసే 1.13 కోట్ల మందిలో 92.8 శాతం మంది 2021–22 నుంచి 2023–24 మధ్య ఒక్కొక్కరు సగటున రూ.2 లక్షలు నష్టపోయినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. అంతా కలిపి పోగొట్టుకున్న మొత్తం ఈ కాలంలో రూ.1.81 లక్షల కోట్లు. టాప్ 3.5 శాతం ట్రేడర్లు అయితే విడిగా ఒక్కొక్కరు రూ.28 లక్షల చొప్పున నష్టపోయారు. ‘‘ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ మీ లాభాలను రెట్టింపు చేయడమే కాదు, నష్టాలను రెట్టింపు చేస్తుంది. దాంతో ఏళ్లపాటు చేసిన పొదుపు అంతా తుడిచిపెట్టుకుపోతుంది’’ అని ఈక్విరస్ వెల్త్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే హెచ్చరించారు. క్రిప్టో అసెట్స్ కూడా ఒకరి నియంత్రణలో నడిచేవి కావు. ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా.. డిమాండ్–సరఫరా, స్పెక్యులేషన్ ఆధారంగా వీటి విలువలు భారీ అస్థిరతలకు లోనవుతుంటాయి. దీంతో వీటిల్లో పెట్టుబడికి రక్షణ తక్కువ. కనుక రిస్క్ తీసుకునే వారు క్రిప్టోల కంటే పటిష్టమైన నియంత్రణల మధ్య నడిచే స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. భారీ లాభాల కంటే పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యమని 5నాన్స్ ఫౌండర్ దినేష్ రోహిరా సూచించారుబంగారమాయే..అనిశి్చత పరిస్థితుల్లో, ఈక్విటీ తదితర సాధనాల్లో ప్రతికూలతలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి బంగారం కొంత స్థిరత్వాన్ని తెస్తుంది. బంగారం 2024లో 24–26 శాతం మేర రాబడులు కురిపించింది. సామాన్యుడి నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు అందరికీ బంగారం ఆకర్షణీయంగా మారిపోయింది. పసిడికి డిమాండ్ ఈ ఏడాది కూడా కొనసాగొచ్చన్నది అంచనా. డాలర్‌కు బదులు సెంట్రల్ బ్యాంక్‌లు బంగారం రూపంలో నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడం డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. రూపాయి విలువ క్షీణత రూపంలోనూ బంగారం పెట్టుబడులపై అదనపు ప్రయోజనం లభిస్తుంది. కనీసం 18–24 నెలల కాలానికి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికి కేటాయించుకోవచ్చు. ‘‘2025లో ఈక్విటీలు తదితర రిస్కీ అసెట్స్‌లో అస్థిరతలు కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉంటే, సురక్షిత సాధనమైన బంగారంలో పనితీరు ఇతర సాధనాలతో పోల్చితే స్థిరంగా ఉండొచ్చు’’అని నిప్పన్ ఇండియా ఏఎంసీ కమోడిటీస్ హెడ్ విక్రమ్ ధావన్ అభిప్రాయపడ్డారు. బంగారంలో రాబడులు ఈ ఏడాది మోస్తరుగా ఉండొచ్చని ఆనంద్‌రాఠి కమోడిటీస్, కరెన్సీస్ డైరెక్టర్ నవీన్ మాధుర్ తెలిపారు. పన్ను ప్రయోజనాల దృష్ట్యా గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరుగైన ఎంపికగా పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో తులం బంగారం ధర రూ.86,000కు చేరుకోవచ్చని, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనే విధానాన్ని అనుసరించొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్టులు సూచిస్తున్నారు. బంగారం ఈ ఏడాది రూ.82,000–85,000 శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా. వెండి సైతం రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ర్యాలీ చేయొచ్చని అంచనా వ్యక్తీకరించారు. మిరే అసెట్ షేర్‌ఖాన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ సింగ్ మాత్రం ఈ ఏడాది చివరికి బంగారం 10 గ్రాములు రూ.90,000–93,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. డెట్‌లో అవకాశాలు..స్థిరాదాయ (డెట్) సాధనాల్లో రాబడులు వడ్డీ రేట్ల గమనంపై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులకు స్టాక్స్ విలువలను ఎలా అయితే పరిశీలిస్తామో.. డెట్‌లో పెట్టుబడులకు సమీప కాలంలో వడ్డీ రేట్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. యూఎస్ ఫెడ్ ఇప్పటికే రెండు విడతలుగా వడ్డీ రేట్ల కోత నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాదికి రెండు కోతలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉంది. వచ్చే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున ఈ దశలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయన్నది నిపుణుల సూచన. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత బ్యాండ్‌లోనే ఉంది. వృద్ధి నిదానించింది. వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరాయని మేము భావిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), ఎన్సీడీలు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వారు తమ పెట్టుబడులను అధిక రాబడుల (రేట్లు) వద్ద లాకిన్ చేసుకోవాలి. సంప్రదాయ సాధనాలకు వెలుపల క్రెడిట్ ఫండ్స్, వెంచర్ డెట్ ఫండ్స్, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్స్ రిస్క్‌ను మించి రాబడులను ఇస్తాయి. దీంతో మొత్తం మీద డెట్ పోర్ట్‌ఫోలియో రాబడులను పెంచుకోవచ్చు’’అని నువమా వెల్త్ ఎండీ రాహుల్‌జైన్ సూచించారు. సైబర్ రక్షణ2023–24లో సైబర్ మోసాలు 300 శాతం (2,92,800 ఘటనలు) పెరిగాయి. 2024లో మొదటి తొమ్మిది నెలల్లోనే 11,333 కోట్ల నష్టం వాటిల్లింది. ‘‘మన దేశ వాసులు ఒక్కొక్కరు సగటున ఒక రోజులో 194 నిమిషాలు సోషల్ మీడియాపై గడుపుతున్నారు. టీనేజర్లు సైతం 3–6 గంటలు వెచ్చిస్తున్నారు. ఫిషింగ్, గుర్తింపు చోరీతోపాటు సైబర్ దాడులు పెరిగాయి’’అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నజీమ్ బిల్గ్రామి తెలిపారు. నేడు చాలా మంది స్మార్ట్ ఫోన్ నుంచే స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అదే స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారు సైబర్ దాడుల రూపంలో పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ‘‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అన్నది ఆన్లైన్ మోసాలు, అనధికారిక లావాదేవీలు, డేటా లీకేజీ రూపంలో వ్యక్తులకు కలిగే ఆర్థిక నష్టం, చట్టబద్ధమైన బాధ్యతల నుంచి రక్షణనిస్తుంది’’ అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఎస్.బ్రహ్మజోస్యుల వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ రూ.10,000 నుంచి రూ.కోటి వరకు తీసుకోవచ్చు. వ్యక్తులు, కుటుంబ సభ్యులకూ కలిపి తీసుకునే వెసులుబాటు ఉంది. సైబర్ ఇన్సూరెన్స్‌తోపాటు, ఎవరూ ఊహించని విధంగా పాస్వర్డ్లు, మొబైల్లో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఆధార్, చిరునామా వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు.ఏవి.. ఎందుకు..? ఈక్విటీ ఫండ్స్: అధిక వృద్ధి అవకాశాలతో దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం. డెట్ ఫండ్స్: స్థిరమైన, ఊహించదగిన రాబడులు ఇచ్చేవి.హైబ్రిడ్ ఫండ్స్: ఈక్విటీ, డెట్ కలసినవి. పెట్టుబడుల వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేసేవి. ఈఎల్ఎస్ఎస్: ఈక్విటీ పెట్టుబడికి అదనంగా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఆఫర్ చేసేవి. ఎన్పీఎస్: చాలా చౌక చార్జీలకే ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతూ, రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన మెరుగైన సాధనం. పన్ను ప్రయోజనాలతో కూడినది.రీట్లు/ఇన్విట్లు: కార్యకలాపాలు నిర్వహించే ఆఫీస్, రిటైల్ ప్రాపర్టీలు.. ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో యూనిట్ల రూపంలో పెట్టుబడికి వీలు కలి్పంచేవి.గోల్డ్ ఈటీఎఫ్: స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్ సాధనం. -
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్‌కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాగ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు. -
కొత్త ఏడాదికి సన్నద్ధమా?
కేలండర్లో నంబర్ మారిపోతోంది. కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నామంటే ఏదో తెలియని హుషారు. కొత్త ఏడాదిలో కలలు సాకారం కావాలని, మరిన్ని విజయాలు వరించాలని, గొప్ప అవకాశాలను అందుకోవాలని, వృత్తి/వ్యాపారం/ఉద్యోగంలో రాణించాలని ఇలా.. ఎన్నెన్నో ఆకాంక్షలు. ఈ జాబితాలో ఆర్థిక లక్ష్యాలకూ చోటు ఉండాల్సిందే. అయితే ఆర్థిక నిర్ణయాలకు ఫలితాలు వెంటనే కనిపించవు. కొన్నేళ్ల ప్రయాణం తర్వాతే విజయాలు సాకారం అవుతాయి. పెట్టుబడి వృద్ధి అన్నది ఒక్క ఏడాదితో అయ్యేది కాదు. ఇది సుదీర్ఘ ప్రయాణం. ఈ దిశగా ఆచరణ పక్కాగా ఉండాలి. కారు, సొంతిల్లు, పిల్లల విద్య, రిటైర్మెంట్.. తదితర కీలక లక్ష్యాలను సరైన ప్రణాళికతోనే చేరుకోగలరు. ప్రస్తుత ఏడాది ఆర్థిక నిర్ణయాలు, పెట్టుబడులు, రుణాలను ఒక్కసారి సమీక్షించుకోవాల్సిన తరుణం కూడా ఇదే. ఆర్థిక సన్నద్ధతను పరీక్షించుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. బడ్జెట్ రూపకల్పనరూపాయి ఆదా చేయడం తిరిగి సంపాదించడంతో సమానం. అందుకే డబ్బు విషయంలో లెక్క పక్కాగా ఉండాలి. ఇందుకు వీలు కలి్పంచేదే ఆర్థిక ప్రణాళిక. ఈ దిశగా మొదట చేయాల్సింది కుటుంబానికి బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం. కానీ, అందరికీ ఆర్థిక అంశాలపై అవగాహన ఉండదు. అటువంటప్పుడు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ లేదా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ తదితర నిపుణుల సాయంతో బడ్జెట్ రూపొందించుకోవాలి. ముందుగా మీ ఆర్థిక స్థితిపై అవగాహన అవసరం. వివిధ మార్గాల్లో వస్తున్న మొత్తం ఆదాయం, వ్యయాలు, అవసరాలు, కోరికలు, జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలు, వాటిని నెరవేర్చుకునేందుకు సమకూర్చుకోవాల్సిన వనరులు తదితర సమాచారం ఆధారంగా నిపుణులు మీకంటూ ప్రత్యేకమైన ఆర్థిక ప్రణాళికను సూచిస్తారు. ఆర్థిక స్వేచ్ఛకు స్పష్టమైన మార్గసూచీ మీకు లభిస్తుంది.50/30/20 సూత్రం ఆర్థిక క్రమశిక్షణతో మెలిగేవారికి 50/30/20 సూత్రం ఆచరణీయం. ఒక ఆర్థిక సంవత్సరంలో పన్నుల చెల్లింపులు పోను మిగులు ఆదాయంలో 50 శాతాన్ని అవసరాలకు వెచి్చంచుకోవాలి. రోజువారీ జీవన వ్యయాలు (గ్రోసరీ, ఇంటి అద్దె, ఫోన్, గ్యాస్, వాహన ఇంధన వ్యయాలు, పిల్లల స్కూల్/కాలేజీ ఫీజులు/ఔషధాలు, చికిత్సల ఖర్చులు), ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ అవసరాల కిందకే వస్తాయి. 30 శాతాన్ని కోరికలకు కేటాయించుకోవచ్చు. జీవనానికి కచ్చితంగా అవసరం లేనివి ఈ విభాగంలోకి వస్తాయి. రెస్టారెంట్లలో విందులు, విహార యాత్రలు, ఖరీదైన ఎల్రక్టానిక్ వస్తువులు, లగ్జరీ ఉత్పత్తులు, వినోదం ఈ విభాగం కిందకు వస్తాయి. మిగిలిన 20 శాతాన్ని పెట్టుబడులకు కేటాయించుకోవాలి. ఈ పెట్టుబడులు జీవితంలో ముఖ్యమైన లక్ష్యాలను నెరవేర్చే విధంగా ఉండాలి. ఇల్లు కొనుగోలు, పిల్లల ఉన్నత విద్య, పిల్లల వివాహాలు, ప్రశాంతమైన విశ్రాంత జీవనం వీటన్నింటికీ మద్దతుగా నిలవాలి. అవసరమైతే ముఖ్యమైన జీవన లక్ష్యాల కోసం 30–40 శాతం మేర పెట్టుబడులకు కేటాయించుకుని, కోరికలకు 20–10 శాతం బడ్జెట్‌తో సరిపెట్టుకున్నా తప్పులేదు. రోజువారీ ముఖ్యమైన జీవన అవసరాలు మొదటి ప్రాధాన్యంగా, ముఖ్యమైన జీవిత లక్ష్యాలు రెండో ప్రాధాన్యంగా పెట్టుబడుల ప్రణాళిక సాగిపోవాలి. పన్ను ప్రయోజనాలు పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. దీనివల్ల రాబడి పెంచుకోవచ్చు. ఈక్విటీ పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా చూసుకోవాలంటే అందుకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అనుకూలం. రిటైర్మెంట్ ఫండ్‌కు వీలైన పీపీఎఫ్, ఎన్పీఎస్ సాధనాల్లో చేసే పెట్టుబడులకూ పన్ను ప్రయోజనాలున్నాయి. అందుకే పెట్టుబడులను పన్ను ప్రయోజనాలతో సమన్వయం చేసుకోవాలి. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను ప్రయోజనాలను సైతం వినియోగించుకోవాలి. అంతేకాదు, పన్నుల్లోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. వీటికి అనుగుణంగా నిర్ణయాల్లో సవరణలు కూడా అవసరం కావొచ్చు. స్పష్టమైన ఆచరణ ముఖ్యమైన లక్ష్యాలకు అవసరమైన మొత్తాన్ని సమకూర్చుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ లక్ష్యాలకు ఎంత మొత్తం అవసరం అన్నది నిపుణుల సాయంతో తేల్చుకోవాలి. ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు మెరుగైన పెట్టుబడి సాధనాలను గుర్తించాలి. 10 ఏళ్లు అంతకుమించిన సాధనాలకు ఈక్విటీలు మెరుగైనవి. కానీ, వీటిల్లో స్వల్పకాలానికి (మూడేళ్లలోపు) రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో ఈ రిస్క్ ప్రభావం తగ్గిపోయి రాబడులు అధికంగా ఉంటాయి. ఐదేళ్ల కంటే తక్కువ కాల లక్ష్యాలకు డెట్ సాధనాలు అనుకూలం. ఐదు– ఏడేళ్ల కాల లక్ష్యాలకు డెట్, ఈక్విటీ కలయికగా పెట్టుబడులు ఉండాలి. మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికీ కేటాయించుకోవాలి. లక్ష్యాలకు కావాల్సిన రాబడుల కోసం ఏ ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలన్నది నిపుణులను అడిగి తెలుసుకోవాలి. సరైన అస్సెట్ అలోకేషన్ (వివిధ సాధనాల మధ్య వర్గీకరణ) వ్యూహం అమలు చేయాలి. ఈక్విటీ పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంపిక చేసుకోవాలి. ప్రతి నెలా నిర్ణయించిన మేర ఆటోమేటిగ్గా వాటిల్లోకి వెళ్లేలా చూసుకోవాలి. ఆదాయం వచి్చన వెంటనే ముందు చేయాల్సింది పెట్టుబడి. ఆ తర్వాతే మిగిలిన అవసరాల సంగతి చూడాలి. రిటైర్మెంట్ కోసం ఎన్పీఎస్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా సంపాదన మొదలు పెట్టిన మొదటి నెల నుంచే పెట్టుబడులు కూడా ప్రారంభం కావాలి. ఎందుకంటే పెట్టుబడి సంపదగా మారడంలో కాంపౌండింగ్ (రాబడిపై రాబడి) కీలకం అవుతుంది. ఈ కాంపౌండింగ్‌కు ఎక్కువ కాలం కావాలి. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా సంపద సమకూర్చుకోవచ్చు. అత్యవసర నిధి కుటుంబానికి అత్యవసర నిధి తప్పనిసరి. కారణం ఏదైనా ఉన్నట్టుండి ఆదాయం ఆగిపోతే.. కుటుంబ అవసరాలు, పెట్టుబడుల లక్ష్యాలు నిలిచిపోకూడదు. ముఖ్యమైన అవసరాలు, పెట్టుబడులకు ప్రతి నెలా ఎంత మెత్తం వెచి్చస్తున్నారో చూసుకుని.. కనీసం ఆరు నెలల నుంచి 12 నెలలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొత్తాన్ని లిక్విడ్ ఫండ్స్‌లో లేదా ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వేగంగా వెనక్కి తీసుకో వచ్చు. బీమా రక్షణ అత్యవసర నిధితోపాటే బీమా రక్షణ కూడా చాలా ముఖ్యమైనది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తికి జరగరానికి జరిగితే ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లోకి వెళ్లకుండా జీవిత బీమా రక్షణ (టర్మ్ లైఫ్) కలి్పస్తుంది. రోడ్డు ప్రమాదం లేదా అనారోగ్యం కారణంగా ఆస్పత్రి పాలైతే ఆరోగ్య బీమా అండగా నిలుస్తుంది. ఈ రెండింటిలో ఏది లేకపోయినా, ఆర్థిక కష్టాలను ఆహా్వనించినట్టే అవుతుంది. అంతేకాదు బడ్జెట్ ప్రణాళికలు తల్లకిందులవుతాయి. తన కుటుంబ జీవనం, కీలక లక్ష్యాలకు సంబంధించి పెట్టుబడులకు ఒక ఏడాదిలో ఎంత వ్యయం అవుతుందో.. అంతకు 20 రెట్ల మొత్తం టర్మ్ లైఫ్ అష్యూరెన్స్ తీసుకోవాలి. యాక్సిడెంటల్ డెత్, డిస్‌మెంబర్‌మెంట్ (వైకల్యం) రైడర్ జోడించుకోవాలి. ఒక కుటుంబానికి కనీసం రూ.5–10 లక్షల బేసిక్ ఇండెమ్నిటీ హెల్త్ పాలసీతోపాటు, రూ.50 లక్షలకు (రూ.5–10 డిడక్టబుల్) సూపర్ టాపప్ ప్లాన్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ కూడా ఉండాలి. రుణపడొద్దు.. ఒక్కసారి బడ్జెట్ రూపొందించుకున్న తర్వాత దాని పరిధిలోనే లక్ష్మణ రేఖ దాటకుండా నడుచుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం నేటి కోరికలను నియంత్రించుకోవడం ఆర్థిక శాస్త్ర పరంగా ఎంత మాత్రం తప్పుకాదు. ఖర్చులు ఆర్జనను మించరాదు. మరీ ముఖ్యంగా ఆర్జనలో 70 శాతం దాటిపోకుండా చూసుకుంటేనే, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా చూసుకోవడం సాధ్యపడుతుంది. ఇందులో భాగంగా బై నౌ పే లేటర్, క్రెడిట్ కార్డు రుణాలకు దూరంగా ఉండాలి. రేపటి వనరులను కూడా నేడే ఖర్చు పెట్టేందుకు వీలు కల్పించే సాధనాలు ఇవి. వీటికి అలవాటుపడితే బయటకురావడం అంత సులభం కాదు. ఆర్థిక స్వేచ్ఛకు అతిపెద్ద అవరోధం రుణమే. గృహ రుణం, విద్యా రుణం మినహా మరే ఇతర రుణం జోలికి పోవకపోవడమే మంచిది. తప్పనిసరి అయి ఏదైనా రుణాన్ని ఆశ్రయించినట్టయితే.. పెట్టుబడి కంటే ముందే ఈ రుణాన్ని తీర్చివేసేందుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉండేలా కాపాడుకోవచ్చు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యా, గృహ రుణాలు సులభంగా, తక్కువ రేటుకు పొందొచ్చు. పెట్టుబడులను రుణాల కోసం త్యాగం చేయాల్సి వస్తే.. అప్పుడు భవిష్యత్ లక్ష్యాల్లోనూ రాజీపడాల్సి వస్తుంది. అందుకే వచి్చన ఆదాయం పరిధిలోనే జీవించడం నేర్చుకోవాలి. ఒకవేళ రుణఊబిలోకి దిగి, బయటకు వచ్చే మార్గం తోచకపోతే ఆలస్యం చేయకుండా నిపుణుల సాయం తీసుకోవాలి. అవసరమైతే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేíÙంచాలి. ఇలా చేయడం వల్ల రుణాల నుంచి బయటపడడంతోపాటు, దీర్ఘకాల లక్ష్యాలకు కావాల్సిన పెట్టుబడిని సమకూర్చుకోవచ్చు. నామినీ/వీలునామా ఇక పెట్టుబడులకు నామినేషన్ ఇవ్వడం మర్చిపోవద్దు. బ్యాంక్ ఖాతా, లైఫ్ ఇన్సూరెన్స్,, మ్యూచువల్ పండ్స్, డీమ్యాట్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా ప్రతి పెట్టుబడికి నామినీని నమోదు చేయాలి. అనుకోనిది జరిగితే, ఆయా పెట్టుబడులు తమ వారికి సులభంగా బదిలీ అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఇక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి వీలునామా రాయడం మంచి చర్య అవుతుంది. నామినేషన్ అన్నది కేవలం క్లెయిమ్ అర్హత కలి్పస్తుంది. కానీ, వీలునామా అన్నది చట్టపరమైన హక్కులకు మార్గాన్ని సులభం చేస్తుంది. వారసుల మధ్య వివాదాలను నివారిస్తుంది. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ఆస్తుల బదిలీకి చట్టబద్ధమైన డాక్యుమెంట్‌గా సాయపడుతుంది. ముగ్గురిలో ఇద్దరు రుణగ్రస్తులే → మన దేశంలో రుణభారం లేని వారు 38 శాతమేనట. అంటే ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆర్థిక సంస్థలకు రుణపడి ఉన్నట్టు తెలుస్తోంది. → మరీ ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలోనూ 31 శాతం మంది ఈఎంఐ చెల్లింపులతో సతమతం అవుతున్నారు. → 40 శాతం మందికి అత్యవసర నిధి లేదు → 27 శాతం మందికి మెరుగైన పన్నుల ప్రణాళిక లేదు. → దేశంలో 74 శాతం మందికి సరిపడా బీమా కవరేజీ లేదు. వీరిలో కొందరికి అసలు బీమా రక్షణే లేదు. → ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారిలోనూ 54 శాతం మందికి కాంపౌండింగ్ గురించి తెలియకపోవడం విడ్డూరం (ఫైనాన్షియల్ ఫిట్నెస్ ప్లాట్‌ఫామ్ ‘ఫిన్నోవేట్’ ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికర అంశాలు ఇవి) – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
డేటా సెంటర్ సామర్థ్యాలు పెంపు
ముంబై: దేశంలో డేటా సెంటర్ల సామర్థ్యం 2026–27 ఆర్థిక సంవత్సరం చివరికి రెట్టింపై 2–2.3 గిగావాట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. ఇప్పటికే ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల విస్తరణ ప్రణాళికలకు తోడు కొత్త సంస్థల రాకతో డేటా సెంటర్ల సామర్థ్యం పెరగనున్నట్టు వెల్లడించింది. డిజిటలైజేషన్ పెరగడానికితోడు, క్లౌడ్ స్టోరేజీపై సంస్థల పెట్టుబడులు ఇనుమడిస్తుండడం డేటా సెంటర్ల డిమాండ్‌ను పెంచుతున్నట్టు తెలిపింది. జెనరేటివ్ ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం సైతం మధ్య కాలానికి ఈ డిమాండ్‌ను నడిపించనున్నట్టు పేర్కొంది. ఈ బలమైన డిమాండ్‌ను అందుకోవడానికి వీలుగా సంస్థలకు అదనపు మూలధన వ్యయాలు అవసరం అవుతాయని, ఇవి రుణాల రూపంలో ఉండొచ్చని పేర్కొంది. వ్యాపార సంస్థలు తమ వ్యాపారాల నిర్వహణ విషయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు మొగ్గు చూపిస్తుండడం డేటా సెంటర్ల కంప్యూటింగ్, స్టోరేజ్ వసతుల డిమాండ్‌ను పెంచుతున్నట్టు వివరించింది. కరోనా తర్వాత ఈ ధోరణి పెరగడాన్ని గుర్తు చేసింది. అధిక వేగంతో కూడిన డేటా అందుబాటులోకి రావడం సోషల్ మీడియా, ఓటీటీ, డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచినట్టు తెలిపింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాలుగా మొబైల్ డేటా ట్రాఫిక్ ఏటా 25 శాతం చొప్పున పెరగడాన్ని ప్రస్తావించింది. 2024 మార్చి నాటికి నెలవారీ డేటా వినియోగం 24 జీబీకి చేరిందని, 2026 మార్చి నాటికి 33–35జీబీకి ఇది పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది.భారీ పెట్టుబడులు..‘‘పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్‌ను తీర్చేందుకు గాను వచ్చే ఐదు ఆర్థిక సంవత్సరాల్లో రూ.55,000–65,000 కోట్ల మేర పెట్టుబడులు అవసరం అవుతాయి. ప్రధానంగా భూమి, భవనాలు, విద్యుత్ ఎక్విప్మెంట్, కూలింగ్ పరిష్కారాల కోసం ఎక్కువ వ్యయం చేయాల్సి ఉంటుంది. భూమి, భవనం కోసమే డేటా సెంటర్ ఆపరేటర్లు మొత్తం మూలధన వ్యయాల్లో 25–30 శాతాన్ని వెచి్చంచాల్సి వస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ మనీష్ గుప్తా తెలిపారు. ఒక్కసారి ఒప్పందం కుదిరితే డేటా సెంటర్లకు స్థిరమైన నగదు ప్రవాహాలు వస్తుంటాయని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి వివరించారు. ‘‘ఒక కేంద్రం నుంచి మరో కేంద్రానికి మారడం అన్నది అధిక వ్యయాలతో కూడుకున్నదే కాకుండా, వ్యాపార అవరోధాలకు దారితీస్తుంది. దీంతో క్లయింట్లను అట్టిపెట్టుకునే రేషియో ఎక్కువగా ఉంటుంది’’అని తెలిపారు. -
రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా?
సాక్షి, విశాఖపట్నం: రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి... ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయడం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. రాజధానికే రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తే ఎలా? అని ఆయన ప్రశి్నంచారు. రాజధాని పేరుతో ఉత్తరాం«ధ్ర, రాయలసీమలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈఏఎస్ శర్మ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ‘గుంటూరు జిల్లా అమరావతిలో రానున్న మూడేళ్లలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణాలు, ఇతర నిధులన్నీ దాదాపు రూ.50వేల కోట్ల నుంచి రూ.60వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ప్రభుత్వం ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం. ఈ రుణభారం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలపైనా పడుతుంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజల నుంచి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తెరగాలి. అమరావతి రాజధాని వల్ల మిగిలిన ప్రాంతాలకు ఎంత లాభం ఉందో తెలీదు కానీ... అన్యాయం మాత్రం తీవ్రంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజల ఆస్తిగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తుంటే దాన్ని ఆపకుండా... పక్కనే నక్కపల్లిలో ప్రైవేట్ కంపెనీ ఆర్సెల్లరీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించేందుకు మొగ్గు చూపడం ఎంతవరకు సమంజసం? ఈ ఒక్క నిర్ణయంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఉత్తరాంధ్రపై ఉన్న ఉదాసీనత బట్టబయలైంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి కోసం విభజన చట్టంలో ఉన్న హామీలపై ఇంతవరకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో చర్చించకపోవడం కూడా మీ నిర్లక్ష్యానికి నిదర్శనం. ఈ వ్యవహారంపై మీరు చూపించిన చొరవపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. రాజధాని పేరుతో బిల్డింగులు, హంగులపై ప్రజల నిధులు ఖర్చు చేసే బదులుగా.. ప్రభుత్వ విధానాల్లో వికేంద్రీకరణ, ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడం, ప్రజాస్వామ్య విధానాలపై దృష్టి సారిస్తే మంచిది. వెనుకబడిన ప్రాంతాలను విస్మరించి వేల కోట్ల రూపాయలను రాజధానికి ఖర్చు చేస్తే రాష్ట్ర ప్రజలు హర్షించరన్న విషయాన్ని గుర్తించాలి..’అని లేఖలో శర్మ పేర్కొన్నారు. -
నేలచూపులు కొనసాగవచ్చు
ముంబై: ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బలహీనతలు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రభావితం చేయగల కీలక అంశాలు కొరవడటంతో విదేశీ ఇన్వెస్టర్ల తీరుపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇటీవల మరోసారి ఎఫ్‌పీఐలు కొనుగోళ్లను వీడి అమ్మకాల బాట పట్టడంతో సెంటిమెంటు దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ విశ్లేషకులు ప్రవేష్ గౌర్ పేర్కొన్నారు. అయితే గత వారం భారీ అమ్మకాల కారణంగా ఈ వారం కొంతమేర కొనుగోళ్లకూ వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఉన్నట్టుండి ఎఫ్‌పీఐలు భారీ అమ్మకాలకు తెరతీయడంతో మార్కెట్లు బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్విసెస్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. విదేశీ అంశాలు... బుధవారం క్రిస్మస్ సందర్భంగా దేశీ స్టాక్ మార్కెట్లు పనిచేయవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానుంది. దీంతో మార్కెట్లలో విదేశీ అంశాలు కీలకంగా నిలవనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్విసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా వివరించారు. విదేశీ పెట్టుబడులు, గ్లోబల్ మార్కెట్ల తీరు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని అంచనా వేశారు. వీటికితోడు డిసెంబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో ఆటుపోట్లకు అవకాశమున్నట్లు తెలియజేశారు.దేశీయంగా ప్రస్తావించదగ్గ ప్రధాన అంశాలు కొరవడటంతో యూఎస్ నిరుద్యోగ గణాంకాలు, కొత్త గృహాల విక్రయాలు, బాండ్ల ఈల్డ్స్, డాలరు ఇండెక్స్ వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్లు మరింత నీరసించవచ్చని విజయకుమార్, గౌర్ తెలియజేశారు. డాలరుతో రూపాయి మారకం, ముడిచమురు ధరల కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు విశ్లేíÙంచారు. అయితే విదేశీ మార్కెట్లలోనూ క్రిస్మస్ సెలవుల కారణంగా యాక్టివిటీ తగ్గే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. గత వారమిలా... విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు డీలా పడ్డాయి. బీఎస్ఈ సెన్సె క్స్ 4,092 పాయింట్లు (5 శాతం) పతనమైంది. 82, 000 పాయింట్ల నుంచి 78,042కు దిగజారింది. ఇక ఎన్ఎస్ఈ ఇండెక్స్ నిఫ్టీ సైతం 1,181 పాయింట్లు (4.8 శాతం) కోల్పోయి 23,588 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐల యూటర్న్..గత రెండు వారాలుగా దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వచి్చన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) గత వారం అమ్మకాల యూటర్న్ తీసుకున్నారు. తొలి రెండు రోజుల్లో రూ. 3,126 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు చివరి మూడు ట్రేడింగ్ సెషన్లలో రూ. 4,102 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. దీంతో గత వారం నికరంగా రూ. 976 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లయ్యింది. ప్రధానంగా ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడటానికితోడు 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ పుంజుకోవడం ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం దాదాపు 5 శాతం పడిపోయిన విషయం విదితమే. గత వారం ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను అంచనాలకు అనుగుణంగా 0.25 శాతం తగ్గించినప్పటికీ 2025లో ద్రవ్యోల్బణ అదుపునకు వీలుగా కఠిన పరపతి విధానాలు అవలంబించనున్నట్లు ఫెడ్ చైర్మన్ పావెల్ పేర్కొనడం సెంటిమెంటును దెబ్బతీసినట్లు మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలియజేశారు. అంతేకాకుండా దేశీ కార్పొరేట్ ఫలితాలు నిరాశపరచడం, జీడీపీ వృద్ధి నెమ్మదించడం తదితర అంశాలు జత కలసినట్లు జియోజిత్ స్ట్రాటజిస్ట్ విజయకుమార్ వివరించారు. -
పేదరికం లేని సమాజం
సాక్షి, అమరావతి: పేదరికం లేని సమాజం రూపకల్పనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర – 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించినట్లు సీఎం నారా చంద్రబాబునాయుడు చెప్పారు. 2047లో వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు జరపుకుంటామని, ఆ నాటికి భారతదేశం అగ్రదేశంగా మారాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ – 2047ను కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని, ఇందులో భాగంగా రాష్ట్రంలో కూడా స్వర్ణాంధ్ర–2047 డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ మైదానంలో జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం–మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు–వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి–ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత లక్ష్యంగా దీనిని ఆవిష్కరించామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ రూ.16 లక్షల కోట్లుగా ఉందని, విజన్ – 2047 ద్వారా ఇది రూ. 2 కోట్ల కోట్లకు చేరుకుంటుందని తెలిపారు. రూ. 2,49,000 (3 వేల డాలర్లు) కంటే తక్కువగా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2047 నాటికి రూ.34,86,000 (42 వేల డాలర్లు)కు చేరుతుదన్నారు. పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీ 4) విధానం ద్వారా నిరుపేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతుందన్నారు.విజన్ 2020 ద్వారా ప్రతి కుటుంబం నుంచి ఒక కంప్యూటర్ ఉద్యోగి వచ్చారని, ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంగా విజన్–2047 రూపొందించామని అన్నారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించేలా పాలసీలు తెస్తున్నామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామన్నారు. పట్టిసీమ తరహాలో నదుల అనుసంధానం చేయడం వల్ల కరువు అనే మాట రాదని, రాష్ట్రంలో నీటి ఎద్దడి ఉండదని, దక్షిణ భారతంలోనే ఏపీ నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందని వివరించారు. అగ్రీ టెక్ విధానాలతో రైతులకు న్యాయం చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దుతామని, అన్ని వాహనాలను ఈవీ వాహనాలుగా తయారు చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోయే రోజుల్లో రూ. 20 లక్షల కోట్ల నుంచి రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలొచ్చేలా ఈ డాక్యుమెంట్ తయారు చేశామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఉద్దేశంతో 175 నియోజకవర్గాల్లో 175 పారిశ్రామిక పార్కులు పెడుతున్నామని తెలిపారు. వీటివల్ల 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీతో వల్ల రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.50 లక్షల మందికి ఉపాధి లక్ష్యమని వివరించారు. విజన్ డాక్యుమెంట్‌పై 17 లక్షల మంది ఆన్లైన్లో అభిప్రాయాలు తెలిపారని చెప్పారు.ఇంకో రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు నేతృత్వంలోనే: పవన్ఇంకో రెండున్నర దశాబ్దాలు చంద్రబాబు నేతృతంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. కులం, మతపరంగా విడిపోయే రోజులు పోయాయని, కూటమిలో ఏదైనా సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుంటామని, అంతేకానీ విడిపోయే ప్రసక్తే లేదని అన్నారు. శుక్రవారం విజయవాడలో స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ – 2047 విడుదల సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం అవసరమని చెప్పారు. తామంతా ఒకే మాటగా మీ (చంద్రబాబు) వెనుకే ఉంటామని హామీ ఇస్తున్నామన్నారు. పార్టీ పెట్టడం అన్నది ఆత్మహత్యా సదృశ్యం వంటిదని, తాను పార్టీ పెట్టిన తర్వాత నుంచి చంద్రబాబు మీద అభిమానం మరింతగా పెరిగిందని చెప్పారు. తన ముక్కు సూటి తనం వల్ల రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వామి అయినందుకు ఆనందంగా ఉందన్నారు. -
భారత్‌లో వన్‌ప్లస్ భారీ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఉన్న చైనా సంస్థ వన్‌ప్లస్ ప్రాజెక్ట్ స్టార్లైట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో వచ్చే మూడేళ్లలో రూ.6,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించింది. దశలవారీగా ఏటా రూ.2,000 కోట్లు వెచి్చంచనుంది. భారత్‌లో ఉత్పత్తులు, సేవలలో ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేయనున్నట్టు వన్‌ప్లస్ గురువారం ప్రకటించింది. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ పెట్టుబడి మూడు కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని వివరించింది. మరింత మన్నికైన పరికరాలను తయారు చేయడం, అసాధారణ కస్టమర్ సేవలు, భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను అభివృద్ధి చేయడం ఇందులో ఉన్నాయి. పరికరాలను మరింత మన్నికైనదిగా చేయడానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ రెండు ముఖ్యమైన డిస్ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రపంచంలోని మొట్టమొదటి డిస్ప్లేమేట్ ఏ++ డిస్ప్లే, వన్‌ప్లస్ యొక్క గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్‌ను రూపొందించడం ఇందులో భాగం. భారత్ కస్టమర్ల కోసం.. కొత్త డిస్ప్లే రాబోయే ఫ్లాగ్షిప్ మోడల్లో కొలువుదీరనుందని వన్‌ప్లస్ వెల్లడించింది. గ్రీన్ లైన్ వర్రీ–ఫ్రీ సొల్యూషన్ మొబైల్స్ కనిపించే ఆకుపచ్చని గీతలపట్ల ఆందోళనలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ‘వివిధ సెట్టింగ్‌లలో మొత్తం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక పరిష్కారాలను కూడా అమలు చేస్తున్నాం’ అని వన్‌ప్లస్ వివరించింది. అత్యంత ప్రాధాన్య మార్కెట్.. ‘వినియోగదారులు వారి దైనందిన జీవితంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు వేయాలనే అంకితభావానికి ప్రాజెక్ట్ స్టార్‌లైట్ నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి భారత్ అత్యంత ప్రాధాన్య మార్కెట్’ అని వన్‌ప్లస్ ఇండియా సీఈవో రాబిన్ లేవో తెలిపారు. ప్రాజెక్ట్ స్టార్‌లైట్ కింద వన్‌ప్లస్ తన సరీ్వస్ సెంటర్లను 2026 మధ్య నాటికి 50 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫ్లాగ్షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్‌గ్రేడ్ చేయనుంది. 2024లో బ్రాండ్ సొంత ప్రత్యేక సేవా కేంద్రాలలో 11 శాతం పెరుగుదలతో సహా 22 శాతం మేర తన సరీ్వస్ సెంటర్లను పెంచినట్లు వన్‌ప్లస్ తెలిపింది. -
Sridhar Babu: రాష్ట్రంలో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోంది
-
పెరిగిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి అర్ధభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) భారీగా ఎగిశాయి. ఏప్రిల్–సెప్టెంబర్‌లో 29.79 బిలియన్ డాలర్ల(రూ.2.4 లక్షల కోట్లు)ను తాకాయి.ప్రధానంగా సర్వీసులు, కంప్యూటర్, టెలికం, ఫార్మా రంగాలకు పెట్టుబడులు పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గతేడాది(2023–24) ఇదే కాలంలో 20.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు మాత్రమే లభించాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఎఫ్‌డీఐలు 43 శాతం వృద్ధితో 13.6 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ2లో కేవలం 9.52 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు తరలి వచ్చాయి. ఇక ఈ ఏడాది తొలి క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో మరింత అధికంగా 48 శాతం అధికంగా 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు నమోదయ్యాయి. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్‌డీఐలు 28 శాతం పెరిగి 42.1 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాది తొలి 6 నెలల్లో ఇవి 33.12 బిలియన్ డాలర్లు మాత్రమే.ఇదీ చదవండి: 1,319 కిలోల బంగారం, 8,223 కిలోల డ్రగ్స్ స్వాధీనం! -
మళ్లీ ‘మైక్రో’ పడగ!
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ జిల్లాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్లీ పడగ విప్పుతున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి, అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నగరాలు, పట్టణాలు, సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి. పేదలు, మధ్య తరగతి వారి ఆర్థిక అవసరాలు, బలహీనతలను ఆసరాగా తీసుకుని వ్యాపారం చేస్తున్నాయి. మహిళలే టార్గెట్‌గా, వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి. ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలసి కట్టాలనే నిబంధనలు పెడుతూ.. బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే... ‘చస్తే చావండి.. డబ్బులు మాత్రం కట్టండి’ అంటూ తీవ్రంగా వేధింపులకు దిగుతున్నాయి. ఈ మైక్రో ఫైనాన్స్‌ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ.. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రిజర్వు బ్యాంకు నిబంధనలు అంటూ... మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళలను గ్రూపుగా చేసి.. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్స్‌లు తీసుకుని రుణాలు ఇస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్ చేయించుకుని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్లుగా రికార్డుల్లో చూపుతున్నాయి. వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి. ఉదాహరణకు గ్రూపులో ఒక్కో మహిళకు రూ.30వేల చొప్పున అప్పుగా ఇస్తారు. ఇందులోనూ బీమా, ప్రాసెసింగ్ ఫీజు పేరిట రూ.2 వేలు ముందే కోతపెట్టి.. రూ.28 వేలు మాత్రమే మహిళల చేతికి ఇస్తారు. ఈ అసలు, వడ్డీ కలిపి వారానికి రూ.800 చొప్పున ఏడాది పాటు చెల్లించాలి. అంటే రూ.28 వేలకుగాను.. మొత్తంగా రూ.44,800 కట్టాల్సి ఉంటుంది. అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే.. అదనంగా రూ.100 జరిమానా కింద వసూలు చేస్తారు. అసలు లక్ష్యం పక్కదారి పట్టి.. స్పందన, కీర్తన, ఫిన్‌కేర్, ఒరిగో, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, యాక్సిస్, పిరమిల్, ఐ రిఫ్, క్రిస్, బంధన్, ఎపాక్, హోమ్ లోన్స్ ఫైనాన్స్, వెరిటాస్ మైక్రో ఫైనాన్స్, ప్యూజియన్ బ్యాంకు, ఆశీర్వాద్ బ్యాంకు, ఎఫ్‌ఎఫ్‌ఎల్, ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి. వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం, ఆర్థిక చేయూత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ వ్యవస్థల లక్ష్యం. సూక్ష్మరుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, విస్తరించడానికి తోడ్పడాలి. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోటాపోటీగా పాగా.. అడ్డగోలు వడ్డీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు తెలంగాణలోనూ పాగా వేశాయి. అవి రూ.8 వేల నుంచి రూ.50 వేల వరకు మహిళలకు రుణాలు ఇస్తున్నాయి. రుణాలు ఇచ్చే సమయంలోనే కాల పరిమితిని బట్టి 36 శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి. ఒక్కో సంస్థ ఒక్కోరకంగా డాక్యుమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, బీమా వంటివాటి పేరిట రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు రుణంలో ముందే కోతపెడుతున్నాయి. అన్నీ కలిపి లెక్కేస్తే.. పేరుకు 36 శాతం అయినా, 50శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి. పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు. ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికీ ప్రయత్నిస్తున్నారు. ఆర్బీఐ నిబంధనల మేరకే అంటూ.. 2008లోనూ ఇలాగే మైక్రో ఫైనాన్స్ వేధింపులు పెరిగిపోవడంతో.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్లపై కొంతకాలం మారటోరియం విధించారు. ఈ సమస్య పరిష్కారం కోసం 2010 అక్టోబర్ 14న ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ నిర్వహకులకు కనీసం మూడేళ్ల జైలు, రూ.లక్ష జరిమానా విధించాలని.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్బీఐ నిబంధనలంటూ దందాకు శ్రీకారం చుట్టాయి. సంపాదన.. అప్పు, వడ్డీ కిందకే పోతోంది చిన్న వ్యాపారానికి పెట్టుబడి కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.85 వేల రుణం తీసుకున్నాం. వారానికి రూ.1,400 చొప్పున 90 వారాలు చెల్లించాలి. రోజూ గిన్నెలు విక్రయించగా వచ్చే మొత్తంలో కొంత ఇంటి అవసరాలకుపోగా మిగతా అంతా ఫైనాన్స్‌కు చెల్లిస్తున్నా. ఒక్కోసారి వ్యాపారం సాగకపోయినా వాయిదా మాత్రం చెల్లించాల్సి వస్తోంది. ఏ మాత్రం ఆలస్యమైనా జమానత్ ఉన్నవారిపై ఒత్తిడి తెస్తున్నారు. 20 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ చిన్నపాటి వ్యాపారంతో సంపాదించిందంతా అప్పు, వడ్డీకే పోతోంది. – బానాల శంకర్, కమ్మర్పల్లి, నిజామాబాద్ జిల్లా అటువంటి రుణాలతో మోసపోవద్దు మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలను గ్రూపులుగా ఏర్పాటు చేసి అధిక వడ్డీతో రుణాలు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఎవరైనా భద్రత, సెక్యూరిటీ లేని సంస్థల నుంచి రుణాలు పొందేటపుడు జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి లోన్లతో మోసపోవద్దు. సభ్యులను బ్యాంకు సిబ్బంది లేదా తోటి సభ్యులు ఇబ్బంది పెడితే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలి. – పి.సంపత్‌రావు, డీఎస్పీ, భూపాలపల్లి ఈ చిత్రంలోని వ్యక్తి పేరు దుబాసి సాయికృష్ణ (27). రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఉండేవారు. ఆయన భార్య రజిత పేరిట మైక్రో ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నారు. ఆ వాయిదాలు చెల్లించలేకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి. దాంతో నూతి అనిల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.20వేలు అప్పు చేసి.. ఆ వాయిదాలు కట్టారు. కానీ ఈ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయికృష్ణను నిలదీసిన అనిల్.. అతడి సెల్‌ఫోన్ లాక్కుని వెళ్లాడు. సాయికృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్ జైలుకు వెళ్లాడు. కానీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు బలవంతపు వసూళ్లు చేస్తున్నా చర్యలు లేవు.నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కిందే మరణించాడు. ఆమె గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ గాజులు, బొమ్మలు, దండలు అమ్ముతూ.. కొడుకు, కూతురును పోషించుకుంటోంది. ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్‌లో రూ.50 వేలు రుణం తీసుకుని వారానికి రూ.5 వేలు చెల్లిస్తోంది. గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైనా రుణం వాయిదా చెల్లించాల్సి వస్తోందని.. లేకుంటే జమానత్ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతోంది. ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్‌లో రుణం తీసుకుని కడుతున్నానని... సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
13 ఏళ్లలో రూ.75 లక్షలు సమకూరే ప్లాన్
మా అమ్మాయికి మంచి విద్య అందించాలనుంది. ప్రస్తుతం రూ.లక్షల్లో ఫీజులున్నాయి. తన వయసు ఇప్పుడు 10 ఏళ్లు. తన పేరుమీద నెలకు రూ.20వేల వరకూ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం. మంచి రాబడులు వచ్చే పథకాలు ఏవైనా ఉన్నాయా? కనీసం 13 ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రాబడి అంచనా వేయవచ్చు? - విక్రమ్పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే మీ కోరికకు ధన్యవాదాలు. మీరు అన్నట్లు ప్రస్తుతం ఫీజులు భారీగా పెరుగుతున్నాయి. మీ పాప వయసు 10 ఏళ్లు. తాను ఉన్నత చదువులు చదివేటప్పటికీ ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చులు లెక్కేస్తే చాలా డబ్బు అవసరం అవుతుంది. విద్యా ద్రవ్యోల్బణం ఏటా పెరుగుతూనే ఉంది. పెట్టుబడిపై అధిక రాబడి వచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. దీనికి డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లను ఎంచుకోవచ్చు. మీరు నెలకు రూ.20వేలు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు. 13 ఏళ్ల పాటు 12 శాతం రాబడితో మీ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రూ.75,18,623 అయ్యే అవకాశం ఉంది. అయితే ముందుగా మీరు అమ్మాయి భవిష్యత్ అవసరాలకు ఆర్థిక రక్షణ కల్పించాలి. అందుకోసం టర్మ్పాలసీను తీసుకోవాలి. మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీకు ఏదైనా జరిగినా పాలసీ డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది.ఇదీ చదవండి: ‘ఎవరికి చెల్లింపులు చేసినా నాకు తెలుస్తుంది’ఇటీవల కాలంలో బంగారం ధరలు తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? ఎంత సమయం పెట్టుబడి పెట్టాలి? - ప్రకాశ్పెట్టుబడులను డైవెర్సిఫైడ్గా ఉంచుకోవాలి. ఓకే విభాగంలో ఇన్వెస్ట్ చేయకూడదు. బంగారం ధరల్లో ఒడిదొడుకులు సహజం. తాత్కాలికంగా ధరలు పెరుగుతున్నాయని, తగ్గుతున్నాయని ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలం కొనసాగితేనే ఇన్వెస్ట్ చేయాలి. మీ పెట్టుబడిలో 10-15 శాతం మేరకే బంగారంలో ఉండేలా చూసుకోవాలి. అంతకుమించి పెట్టుబడి మంచిది కాదు. మిగతా మొత్తాన్ని విభిన్న ఈక్విటీ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయండి. కనీసం అయిదేళ్లకు మించి సమయం ఉంటేనే మంచి రాబడులు అందుకోవచ్చు. -
గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ రూ.7,500 కోట్ల పెట్టుబడులు
ముంబై: జంషెడ్ గోద్రేజ్ ఆధ్వర్యంలోని గోద్రేజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ (జీఈజీ) రానున్న మూడేళ్లలో వివిధ వ్యాపారాల్లో రూ.7,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత తయారీ సామర్థ్యాల విస్తరణ, మార్కెటింగ్, పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ), టెక్నాలజీపై వ్యయం చేయనున్నట్టు తెలిపింది. గోద్రేజ్ గ్రూప్ ఇటీవలే పరస్పర అంగీకారంతో రెండు గ్రూపులుగా విడిపోవడం తెలిసిందే. ఆది గోద్రేజ్, నాదిర్ గోద్రేజ్ ఆధ్వర్యంలో గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్, జంషెడ్ గోద్రేజ్ ఆధ్వర్యంలో జీఈజీ గ్రూప్ వేరయ్యాయి. లాక్‌లు (తాళాలు), రిఫ్రిజిరేటర్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్ గూడ్స్, ఫర్నిచర్ తదితర వ్యాపారాల్లో జీఈజీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంజనీరింగ్, ఇన్ఫ్రా, ఏరోస్పేస్ రంగంలోనూ వ్యాపారాలు నిర్వహిస్తోంది. గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోయినప్పటికీ వినియోగదారుల పరంగా ఎలాంటి మార్పుల్లేవని జంషెడ్ గోద్రేజ్ మీడియాకు తెలిపారు. వ్యాపారాల వృద్ధికి కొత్త విభాగాలను గుర్తించినట్టు చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్, ఇంధన స్టోరేజీ, నిర్మాణ రంగ మెటీరియల్స్ రీసైక్లింగ్ తమ గ్రూప్‌నకు భవిష్యత్ వృద్ధి విభాగాలుగా ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా యూఎస్‌కు చెందిన రెండు స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపారు. ఇవి మినహా ఇతర కొత్త వ్యాపార ప్రణాళికలేవీ లేవన్నారు. ఇంజనీరింగ్, డిజైన్ ఆధారిత దిగ్గజ గ్రూప్‌గా జీఈజీని మార్చడం తమఉద్దేశ్యమని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నైరికా హోల్కర్ తెలిపారు. జంషెడ్ గోద్రేజ్ సోదరి స్మితాకృష్ణ కుమర్తెనే హోల్కర్. 2032 నాటికి గ్రూప్ ఆదాయంలో సగం మేర గ్రీన్ ఉత్పత్తుల ద్వారానే వస్తుందన్నారు. ప్రస్తుతం గ్రూప్ వార్షిక టర్నోవర్ రూ.16,000 కోట్లుగా ఉండగా, ఇందులో రూ.10,000 కోట్లు కన్జ్యూమర్ వ్యాపారాల నుంచి, మిగిలిన రూ.6,000 కోట్లు 13 ఇతర వ్యాపారాల నుంచి సమకూరుతున్నట్టు చెప్పారు. ఈ టర్నోవర్‌ను రూ.20,000 కోట్లకు తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. మూడు క్లస్టర్లుగా గ్రూపు వ్యాపారం వ్యాపారాలను మూడు క్లస్టర్లుగా విభజిస్తున్నట్టు జంషెడ్ గోద్రేజ్ తెలిపారు. ‘‘కన్జ్యూమర్ ఫస్ట్ వ్యాపారం కింద గృహోపకరణాలు, లాక్‌లు ఉంటాయి. నేషన్ ఫస్ట్ కింద ఏరోస్పేస్, అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ తదితర వ్యాపారాలు, ఫ్యూచర్ ఫస్ట్ కిందకు గ్రీన్ హైడ్రోజన్, జింక్–మాంగనీస్ బ్యాటరీ, రీసైకిల్డ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వస్తాయి’’అని వివరించారు. కంపెనీ వృద్ధి ప్రణాళికల్లో బ్యాటరీ స్టోరేజీ కూడా ఉన్నట్టు చెప్పారు. ‘‘నేడు ప్రపంచంలో అధిక శాతం బ్యాటరీలు లిథియం ఐయాన్ లేదా సోడియం ఐయాన్ ఆధారితమైనవి. మేము వీటికి భిన్నమైన జింక్, మాంగనీస్ కెమిస్ట్రీపై దృష్టి సారించాం. ఇందుకు సంబంధించి ఏర్పాటు చేసిన పైలట్ ప్లాంట్ ఇప్పటికే పని మొదలు పెట్టింది. బ్యాటరీ స్టోరేజీ ద్వారా దేశ ఇంధన పరివర్తనలో కీలక పాత్ర పోషించనున్నాం’’అని వెల్లడించారు. జీఈజీ గ్రూప్ పరిధిలో పెద్ద వ్యాపారాలున్నప్పటికీ ఒక్క లిస్టెడ్ కంపెనీ లేకపోవడం గమనార్హం. సమీప భవిష్యత్తులోనూ ఇందులో మార్పు ఉండదని జంషెడ్ గోద్రేజ్ స్పష్టం చేశారు. బలమైన వ్యాపారాలు కావడంతో, నగదు ప్రవాహాలు కూడా మెరుగ్గా ఉన్నాయంటూ.. దీంతో పెట్టుబడులకు కావాల్సిన నిధులను అంతర్గతంగానే సమకూర్చుకోగలమని చెప్పారు. అందుకే నిధుల కోసం ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడలేదన్నారు. ఇప్పటి వరకు అయితే గ్రూప్ కంపెనీలకు సంబంధించి ఐపీవో ప్రణాళికల్లేవని స్పష్టం చేశారు. -
విదేశీ ‘స్టాక్స్’ షాపింగ్ చేద్దామా!
‘పెట్టుబడుల్లో ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే’ అన్నది ఆధునిక ఫైనాన్స్‌కు పితామహుడిగా చెప్పుకునే, నోబెల్ పురస్కార గ్రహీత హ్యారీ మర్కోవిజ్ అభిప్రాయం. వైవిధ్యం అంటే పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఏదో ఒక సాధనంలో ఉంచకపోవడం. మార్కెట్ అస్థిరతలు, ఊహించని నష్టాల నుంచి పెట్టుబడులకు ఈ వైవిధ్యమే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈక్విటీలు, ఎఫ్డీలు, బాండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోనూ కొంత మేర అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ వైవిధ్యాన్ని మరింత విస్తృతం చేసుకున్నట్టు అవుతుంది.భారత్ శరవేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని వేరే దేశానికి ఎందుకు కేటాయించుకోవడం అన్న సందేహం రావచ్చు. కానీ, ఒక మార్కెట్‌కే పరిమితం కావడం వల్ల ఆ దేశానికి సంబంధించి ఆర్థికపరమైన రిస్క్‌ల ప్రభావం పెట్టుబడులపై అధికంగా ఉంటుంది. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ కంటే అమెరికా ఎస్అండ్పీ 500 (ప్రధాన సూచీ) అధిక రాబడులు అందించింది. ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు కంటే భారత్ వృద్ధి రేటు మూడు రెట్లు అధికం. అయినా కానీ, రాబడుల్లో ఎస్అండ్పీ సూచీయే ముందుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చిరునామా అమెరికా స్టాక్ మార్కెట్. అలాంటి గొప్ప కంపెనీల్లో పెట్టుబడులతో వైవిధ్యం మరింత బలపడుతుందన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడుల వైవిధ్యంతో వచ్చే ప్రయోజనాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది. వైవిధ్యం ఎందుకు..? భారత్‌కు వెలుపల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం ఆధారంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తే.. గొప్ప పనితీరు చూపించిన రెండు మార్కెట్లు భారత్, అమెరికా. అందుకే ఈ రెండు ఈక్విటీ మార్కెట్ల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. రిస్క్ సమతుల్యతతోపాటు గొప్ప రాబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అమెరికా, భారత్ ఈక్విటీలు గత 20 ఏళ్ల కాలంలో గొప్ప రాబడులు ఇచి్చనప్పటికీ వీటి మధ్య సహ సంబంధం తక్కువ. అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లకు, భారత్‌కు మధ్య పనితీరు విషయంలో 60–80 శాతం వరకు పరస్పర సంబంధం ఉంటోంది. అదే అమెరికాకు వచ్చేటప్పటికి (2008 ఆరి్థక మాంద్యం, కరోనా మినహా) ఇది 50 శాతమే. కనుక రిస్క్, రాబడులను బ్యాలన్స్ చేసుకోవడమే కాదు.. రెండు ఆరి్థక వ్యవస్థల్లోని అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు.రూపాయి క్షీణతకు హెడ్జింగ్ ప్రతి కొన్నేళ్లకోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు బాటలో నడుస్తుంటుంది. ఆ సమయంలో భారత్ సహా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలి్చతే యూఎస్ డాలర్ బలోపేతం కావడం గమనించొచ్చు. 2011లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు 84 డాలర్లను దాటేసింది. ట్రంప్ 2.0 నాలుగేళ్ల పాలనలో రూపాయి మరో 6–8 శాతం క్షీణిస్తుందన్న అంచనాలున్నాయి. అమెరికా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయి విలువ క్షీణతతో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల వృద్ధికితోడు.. పెట్టుబడుల ఉపసంహరణతో మరిన్ని రూపాయిలు (విలువ క్షీణత వల్ల) చేతికి వస్తాయి. రూపాయి విలువ క్షీణత అన్నది యూఎస్ ఈక్విటీ రాబడులను ఇతోధికం చేస్తుంది. సాధారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుంటారు. ఆ సమయంలో మన ఈక్విటీలు ప్రతికూలతలను చూస్తుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం.. మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అంతేకాదు విద్య అనంతరం ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇలాంటి వారికి యూఎస్ పెట్టుబడులు అనుకూలం. అధిక ఆదాయ వర్గాలు విదేశీ పర్యటనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివించుకోవాలంటే యూఎస్ డాలర్ మారకంలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విదేశీ కోర్సుల వ్యయం ఏటా నిరీ్ణత శాతం మేర పెరుగుతుంది. అదే సమయంలో ఏటా రూపాయి విలువ క్షీణతతో ఆ విద్యా వ్యయం ఇంకాస్త అధికమవుతోంది. అందుకే డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపాయి విలువ క్షీణతతో ఏర్పడే భారాన్ని తొలగించుకోవచ్చు. రూపాయి అస్థిరతలను తగ్గించుకోవచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? భారత స్టాక్స్ మాదిరే నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్/ఈటీఎఫ్‌ల ద్వారా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. యూఎస్ స్టాక్ బ్రోకర్లతో మన దేశ స్టాక్ బ్రోకర్లు కొందరికి ఒప్పందాలు ఉన్నాయి. అలాంటి దేశీ బ్రోకర్ ద్వారా అకౌంట్ ప్రారంభించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ → యాక్సిస్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → బంధన్ యూఎస్ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → ఎడెల్వీజ్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → కోటక్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్, → ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్ → మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఇన్వెస్కో ఇండియా నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రెట్టింపు కాంపౌండింగ్ వాటాదారులకు సంపదను సమకూర్చడంలో యూఎస్, భారత ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని దశాబ్దలుగా ఎంతో మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్లను భిన్నమైన వృద్ధి చోదకాలు నడిపిస్తుంటాయి. అయినా కొన్ని ఏకరూప అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు. మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలు. అందుకే మిగిలిన మార్కెట్లకు భిన్నంగా అమెరికా, భారత్ దీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల స్టాక్స్‌లోనూ పెట్టుబడులు సంపద సృష్టికి రెండు ఇంజన్ల మాదిరిగా పనిచేస్తాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధిక వృద్ధి అవకాశాలు భారత ఈక్విటీల ద్వారా.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ గూడ్స్ పరంగా దిగ్గజ కంపెనీల్లో ఎక్స్పోజర్ అమెరికన్ ఈక్విటీల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)ని ప్రారంభించింది. ఇక్కడ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం ద్వారా యూఎస్‌కు చెందిన 50 స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ద్వారా ఖాతా తెరిచి, బ్యాంక్ ఖాతా నుంచి ఫండ్స్ బదిలీ చేసుకుని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆరి్థక సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 2,50,000 డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది స్థిరత్వం.. రాబడులు ఆరి్థక మందగమన సమయాల్లో అమెరికా, భారత మార్కెట్లు ఒకే మాదిరి పనితీరు చూపించాలని లేదు. గడిచిన 20 ఏళ్లలో యూఎస్, భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే భారీ మార్కెట్ పతనాల్లో నష్టాలు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలా అరుదుగానే ఈ రెండు ఒకే మాదిరి ప్రవర్తిస్తాయి. అంతర్జాతీయ సంక్షోభాల్లో రూపాయితో డాలర్ బలపడుతుంటుంది. దీంతో ఆ సమయంలో యూఎస్ పెట్టుబడులు అదనపు విలువను సమకూరుస్తాయి. ఇదే నష్టాలను తగ్గించి, పెట్టుబడులకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అమెరికా స్టాక్స్, భారత స్టాక్స్‌కు 50:50 రేషియోలో పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల రిస్క్ ఆధారిత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రిస్‌్కను పరిమితం చేసుకుని, వీలైనంత అధిక రాబడులు సమకూర్చుకోవడమే విజయవంతమైన పెట్టుబడి విధానం రహస్యం. భారత ఇన్వెస్టర్లకు విదేశీ స్టాక్స్ అన్నవి సమతూకాన్నిస్తాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశం అయితే, రెండేది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో పనిచేస్తున్న దేశం. రెండింటిలోనూ వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవడం ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గాల్లో ఒకటి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
అంతర్జాతీయ పరిణామాలే కీలకం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక(జులై–సెప్టెంబర్) ఫలితాల సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇకపై దేశీ స్టాక్ మార్కెట్లకు అంతర్జాతీయ పరిణామాలే దిక్సూచిగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా ప్రభావిత అంశాలు కొరవడటం దీనికి కారణమని తెలియజేశారు. వివరాలు చూద్దాం.న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ క్యూ2 ఫలితాలు దాదాపు ముగియనున్నాయి. దీంతో ఇకపై ఇన్వెస్టర్లు విదేశీ మార్కెట్లు, పెట్టుబడులు, గణాంకాలవైపు దృష్టి సారించనున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. బుధవారం(20న) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. దీంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు నాలుగు రోజులే పనిచేయనున్నాయి.కొద్ది రోజులుగా మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొంతమేర షార్ట్‌కవరింగ్‌కు వీలున్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఫలితంగా మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని తెలియజేశారు. 288మంది సభ్యుల మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీసహా పలు పారీ్టలు ఎన్నికలలో పోటీ పడుతుండటంతో ఫలితాలకు ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్ ఎఫెక్ట్ కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ బలపడుతోంది. గత వారాంతాన ఒక దశలో 106.66ను తాకింది. దీంతో దేశీ కరెన్సీ బలహీనపడుతూ వస్తోంది. గురువారం(14న) రూపాయి సరికొత్త కనిష్టం 84.41 వద్ద ముగిసింది. దీనికితోడు యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ సైతం మెరుగుపడుతున్నాయి. గత వారం చివర్లో 4.5 శాతానికి చేరాయి. మరోవైపు చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీస్తోంది. రియల్టీ రంగానికి వెసులుబాటు కల్పించింది. 5.3 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్టీగేజ్ రుణ వ్యయాలుసహా.. డౌన్ పేమెంట్‌ను తగ్గించడం వంటి చర్యలు చేపట్టింది. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలివెళుతున్నాయి. ఈ వారం జపాన్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదల కానున్నాయి. యూఎస్ నిరుద్యోగిత, తయారీ, సరీ్వసుల రంగ గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. 10 శాతం దిద్దుబాటు.. గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో డీలా పడ్డాయి. సెన్సెక్స్ 1,906 పాయింట్లు కోల్పోయి 77,580 వద్ద ముగిసింది. వెరసి రికార్డ్ గరిష్టం(86,000స్థాయి) నుంచి 8,395 పాయింట్లు(10 శాతం) పడిపోయింది. ఇక గత వారం నిఫ్టీ సైతం 616 పాయింట్లు క్షీణించి 23,533 వద్ద స్థిరపడింది. ఈ బాటలో చరిత్రాత్మక గరిష్టం(26,277) నుంచి 2,745 పాయింట్లు పతనమైంది.వర్ధమాన మార్కెట్లకు దెబ్బయూఎస్ బాండ్ల ఈల్డ్స్, డాలరు బలపడటంతో వర్ధమాన మార్కెట్లపై ప్రభావం పడుతున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేశ్ గౌర్ పేర్కొన్నారు. క్యూ2 ఫలితాల సీజన్ ముగియడంతో ఇకపై మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్ల తీరు ఆధారంగా కదలవచ్చని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ట్రేడర్లు ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌ను అనుసరించే వీలున్నట్లు తెలియజేశారు. విదేశీ అంశాల నేపథ్యంలో ఈ వారం దేశీ మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదిలే వీలున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్‌మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అంచనా వేశారు.అమ్మకాల బాటలోనే...దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ నికరంగా రూ. 22,420 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. యూఎస్ డాలర్‌తోపాటు ట్రెజరీ ఈల్డ్స్ బలిమి, చైనా ప్యాకేజీలు, దేశీ మార్కెట్ల గరిష్ట విలువల కారణంగా అమ్మకాలవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో గత నెల(అక్టోబర్)లో కొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఈ స్థాయిలో రూ. 61,973 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అయితే ఈ ఏడాది సెపె్టంబర్లో 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే సంపద సృష్టి
చంద్రబాబు సంపద సృష్టిస్తానంటూ పెద్ద బిల్డప్ ఇస్తారు. 2014–19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా (జీఎస్డీసీ) కేవలం 4.47 శాతం మాత్రమే. అదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ 4.83 శాతానికి పెరిగింది. తయారీ రంగంలో 2014–19 మధ్య దేశ వస్తు ఉత్పత్తిలో రాష్ట్రం వాటా కేవలం 2.86 శాతం మాత్రమే. అదే రెండేళ్లు కోవిడ్ కష్టకాలంలో పాలన సాగించిన వైఎస్సార్సీపీ హయాంలో 2019–24 మధ్య 4.07 శాతానికి పెరిగింది. అంటే చంద్రబాబు హయాంలో వెనకబడినట్లు కాదా?» వైఎస్సార్సీపీ హయాంలోనే పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చారు. అవన్నీ ఇప్పుడు తానేదో తీసుకొస్తున్నట్టు చంద్రబాబు, లోకేశ్ కలరింగ్ ఇస్తున్నారు. గతంలో దావోస్ వేదికగా మిట్టల్‌తో సంప్రదింపులు చేశాం. మా హయాంలో అదాని ఫౌండేషన్ విశాఖలో డేటా సెంటర్ పెట్ట లేదా? కుమార మంగళం బిర్లా ఫ్యాక్టరీ ప్రారంభించారు. » విశాఖ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముకేష్ అంబానీ ప్రత్యేకంగా వచ్చారు. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని స్టేట్మెంచ్ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 8 బయో ఇథనాల్ ప్రాజెక్టులు కట్టడం ప్రారంభించారు. ఇప్పుడు దానిని ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు సమక్షంలో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. దీనికి రూ.65 వేల కోట్లతో రిలయన్స్ పెట్టుబడులు అంటూ బిల్డప్ ఇస్తున్నారు. » చంద్రబాబు కొడుకు లోకేశ్ అయితే.. ఏపీలో రూ.1.61 లక్షల కోట్లత్లో 17 మిలియన్ టన్నుల గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తోంది.. ఆదిత్య మిట్టల్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడేసి ఒప్పించినట్టు కలరింగ్ ఇచ్చారు. మిట్టల్ ఇప్పటికే ఒడిశాలో రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడుతున్నారు. లోకేశ్ స్టేట్మెంట్తో ఒడిశా బీజేపీ మంత్రి రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఒడిశాలో మిట్టల్ ప్లాంట్ పనులు ప్రారంభించింది.. ఇది ఎక్కడికీ వెళ్లట్లేదని గట్టిగా చెప్పారు. ఎవరైనా ఎన్ని చోట్ల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టగలుగుతారు? చంద్రబాబు, లోకేశ్ ఎవరి చేవిలో పూలు పెట్టేందుకు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ డ్రామాలు చేస్తున్నారు?» మరో వైపు పరిశ్రమలను పెడతామంటున్న సజ్జన్ జిందాల్ వంటి పారిశ్రామిక వేత్తలను వెళ్లగొడుతున్నారు. జిందాల్ కడపలో 5 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ కడతామంటే నేరాలు చేయడమే అలవాటుగా పెట్టుకున్న జత్వానితో కేసులు పెట్టించి బెదరగొడుతున్నారు. వీళ్ల హయాంలో రాని దానికి ఒక బిల్డప్.. వచ్చే వాళ్లపై దొంగ కేసులు పెట్టి తరిమేస్తున్నారు. ఇదేనా మీ పారిశ్రామిక విధానం? -
నారా లోకేష్, చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు
-
భారత్‌లో ఎస్ఏపీ అపార పెట్టుబడులు
న్యూఢిల్లీ: జర్మనీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఎస్ఏపీ భారత్‌లో అపారమైన పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగాలను కలి్పంచే ప్రణాళికల్లో ఉందని కంపెనీ సీఈఓ క్రిస్టియన్ క్లీన్ చెప్పారు. తమకు అత్యంత వేగవంతమైన వృద్ధిని అందించడంతో పాటు భవిష్యత్తులో అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా కూడా భారత్ నిలుస్తుందన్నారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్ బోర్డు బెంగళూరు పర్యటనలో భాగంగా ఆయన విషయాలను వెల్లడించారు. ‘భారత్ టాప్–10 మార్కెట్లలో ఒకటి. ఈ ర్యాంక్ అంతకంతకూ ఎగబాకుతోంది. ఈ నేపథ్యంలో ఆర్అండ్డీ కార్యకలాపాలపై భారీగా వెచ్చించనున్నాం. జర్మనీ తర్వాత ఇక్కడే కంపెనీకి అత్యధిక సిబ్బంది ఉన్నారు. ఇతర ఎస్ఏపీ ల్యాబ్‌లతో పోలిస్తే అసాధారణ రీతిలో నియమాకాలను చేపట్టనున్నాం. అతి త్వరలోనే అతిపెద్ద హబ్‌గా భారత్ ఆవిర్భవిస్తుంది. ఏఐ భారీ అవకాశాలను అందించనుంది. భారత్‌లోని ఏఐ నిపుణుల పనితీరు అద్భుతం’ అని క్లీన్ చెప్పారు. కాగా, భారత్‌లోని ఎస్ఏపీ ఆర్అండ్డీ సెంటర్లలో 15,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. మరో 15,000 కొలువులు కల్పించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది. -
Diwali 2024: దీపావళి మెరుపుల్..
అంతర్జాతీయంగా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులు, అధిక వడ్డీ రేట్లు వంటి సవాళ్లు నెలకొన్నప్పటికీ సంవత్ 2080లో దేశీ సూచీలు కొత్త రికార్డు స్థాయులను తాకాయి. నిఫ్టీ50 దాదాపు 26,250 మార్కును, బీఎస్ఈ సెన్సెక్స్ 85,900 మార్కును దాటాయి. గత దీపావళి నుంచి దాదాపు 25 శాతం పెరిగాయి. కొన్నాళ్లుగా అంతర్జాతీయ సూచీల్లో భారత్‌కి వెయిటేజ్ గణనీయంగా పెరుగుతోంది. దిగ్గజ గ్లోబల్ ఫండ్స్ దృష్టిని భారత మార్కెట్లు ఆకర్షిస్తున్నాయి. అమెరికా డాలరు బలహీనత, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐలు) మన మార్కెట్ల వైపు మళ్లించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. టెక్నికల్ చార్ట్స్ ప్రకారం చూస్తే నిఫ్టీ 22 శాతం, సెన్సెక్స్ 27 శాతం పెరగవచ్చనే అంచనాలున్నాయి. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, కొంత ఉద్దీపన చర్యలతో చైనా మార్కెట్లు పుంజుకోవడం వంటి అంశాల ప్రభావం మన మార్కెట్లపైనా ఉంటుందని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మార్కెట్లో కన్సాలిడేషన్ జరగవచ్చని, 2080 సంవత్తో పోలిస్తే కొత్త సంవత్ 2081లో రాబడులు తక్కువగానే ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. గత 12–18 నెలలుగా ర్యాలీ చేసిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్ .. ఆదాయ అంచనాలను అందుకోలేకపోతే గణనీయంగా తగ్గవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్‌తో పోలిస్తే కాస్త స్థిరంగా, మెరుగైన వేల్యుయేషన్స్‌తో లార్జ్ క్యాప్స్ ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యాపిటల్ గూడ్స్, విద్యుత్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్జూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్, ఫైనాన్స్ తదితర రంగాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలు నెలకొన్నాయి. అలాగే పసిడి, వెండికి కూడా కొంత కేటాయించాలనే సూచనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పలు బ్రోకరేజీలు కొత్త సంవత్ 2081లో పరిశీలించతగిన స్టాక్స్‌ను సూచించాయి. వాటిలో కొన్ని .. గణనీయంగా పెరిగిన బంగారం ధరలు రాబోయే రోజుల్లోనూ అదే ధోరణి కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 30న అంతర్జాతీయంగా పసిడి రేటు ఔన్సుకి (31.1 గ్రా) ఆల్ టైమ్ గరిష్టం 2,801 డాలర్లని దాటింది.. ఎంసీఎక్స్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రూ. 79,775కి ఎగిసింది. 2080 సంవత్ నాటి నుంచి చూస్తే అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు, సెంట్రల్ బ్యాంక్‌ల పాలసీల కారణంగా గ్లోబల్‌గా గోల్డ్ ధరలు 41 శాతం పైగా, ఎంసీఎక్స్‌లో 27 శాతం పైగా పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు చైనాలో పటిష్టమైన డిమాండ్, స్పెక్యులేటివ్ కొనుగోళ్లు కూడా పసిడికి ఊతమిస్తున్నాయి. దేశీయంగా ఇటీవల పసిడిపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో దీనిపై ఆసక్తి మరింత పెరిగింది. 2081 సంవత్‌లో పసిడి రేట్లు మరింత బలపడొచ్చు. ఎంసీఎక్స్‌లో పది గ్రాముల పసిడి రూ. 70,000– 87,000 శ్రేణిలో తిరుగాడవచ్చు. అంతర్జాతీయంగా ఔన్సు ధర 3,030 డాలర్ల స్థాయికి తాకే అవకాశం ఉంది. అమెరికా ఆర్థిక గణాంకాల వల్ల పెరుగుదలకు కాస్త అడ్డుకట్ట పడినా, మొత్తం మీద చూస్తే మాత్రం సానుకూల అంచనాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇన్వెస్టర్లకు బంగారం సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉంటుంది. – కాయ్నాత్ చైన్వాలా, అసోసియేట్ వీపీ, కమోడిటీ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్ బ్రోకరేజి సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 107.35 టార్గెట్ ధర: రూ. 132 పటిష్టమైన క్యాపిటల్ అడెక్వసీ నిష్పత్తి, నికర వడ్డీ మార్జిన్లు .. అసెట్ క్వాలిటీ మెరుగుపడటం వంటివి సానుకూలాంశాలు. వ్యవసాయ, ఎస్ఎంఈ సెగ్మెంట్లలో అసెట్ నాణ్యత పడిపోయే అవకాశాలు, మొండిబాకీల పరిష్కారం ఆశించినంత స్థాయిలో ఉండకపోవడం, ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీము వర్తింపచేయడం ప్రతికూలాంశాలు.జ్యోతిల్యాబ్స్ ప్రస్తుత ధర: రూ. 513.55 టార్గెట్ ధర: రూ. 600ప్రమోటర్ ఆధారిత, దక్షిణాది కేంద్రంగా, సింగిల్ ప్రోడక్ట్ కంపెనీగా పని చేయడం నుంచి ప్రొఫెషనల్స్ నిర్వహణలో, బహుళ ఉత్పత్తులతో, దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించిన సంస్థగా ఎదిగింది. నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడటం మార్జిన్లకు దన్నుగా ఉండగలవు. ప్రతికూల వర్షపాతం, ద్రవ్యోల్బణం ప్రతికూలతలు.నాల్కో ప్రస్తుత ధర: రూ. 227.20 టార్గెట్ ధర: రూ. 270అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతుండటం, సరఫరా అంతగా లేకపోవడంతో అల్యూమినియం ధరలు పెరుగుతుండటం కంపెనీకి సానుకూలాంశాలు. నియంత్రణ విధానాలపరమైన మార్పులు, ముడివస్తువుల ధరల పెరుగుదల, అల్యూమినా రేట్లలో హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రతికూలంగా ఉండవచ్చు.నవీన్ ఫ్లోరిన్ ప్రస్తుత ధర: రూ. 3,331.95 టార్గెట్ ధర: రూ. 3,948సీడీఎంవో, స్పెషాలిటీ కెమికల్ సెగ్మెంట్స్ విభాగాలు వృద్ధి చెందుతుండటం కలిసి రానున్నాయి. ప్రోడక్ట్ మిక్స్ మెరుగ్గా ఉండటం వల్ల వచ్చే మూడేళ్లలో మార్జిన్లు750 బేసిస్ పాయింట్ల మేర మెరుగుపడొచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, చైనా కంపెనీల నుంచి పోటీ, వ్యాపార విస్తరణలో జాప్యాలు మొదలైనవి మైనస్.ఎన్సీసీ ప్రస్తుత ధర: రూ. 292.20 టార్గెట్ ధర: రూ. 363మౌలిక రంగంపై ప్రభుత్వ వ్యయాలు సానుకూల అంశం. ఆర్డర్ బుక్, బ్యాలెన్స్ షీట్ బాగుంది. ప్రాజెక్టుల అమలు వేగవంతంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో మధ్యకాలికంగా కంపెనీ ఆరోగ్యకరమైన స్థాయిలో వృద్ధి నమోదు చేయవచ్చు. ముడి సరుకుల ధరల్లో హెచ్చుతగ్గులు, ప్రాజెక్టుల వ్యయాలు పెరిగిపోవడం, జాప్యం వంటి రిసు్కలు ఉన్నాయి.చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ బజాజ్ ఆటో ప్రస్తుత ధర: రూ. 9,917 టార్గెట్ ధర: రూ. 12,483మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్నాయి. అమ్మకాలను పెంచుకునేందుకు ఎగుమతులపై దృష్టి పెడుతుండటం, కొత్త వాహనాలు, ఈవీ చేతక్‌కు డిమాండ్ పెరుగుతుండటం, సీఎన్జీ ఆధారిత టూ–వీలర్లు, ఎలక్ట్రిక్ వేరియంట్ల విక్రయాలను పెంచుకునే వ్యూహాలు మొదలైనవి కలసి రానున్నాయి.భారత్ డైనమిక్స్ ప్రస్తుత ధర: రూ. 1,063.70టార్గెట్ ధర: రూ. 1,501భద్రతా బలగాల అవసరాల ఉత్పత్తులను అందిస్తోంది. భారీ ప్రాజెక్టులు 2025 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. ఎగుమతులను పెంచుకునే క్రమంలో 4–5 దేశాలతో చర్చలు జరుగుతున్నాయి. సాయుధ బలగాలకు సంబంధించి డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఉంది. 2024 ఏప్రిల్ 1 నాటికి రూ. 19,500 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది.ఏసీసీ ప్రస్తుత ధర: రూ. 2,337.80 టార్గెట్ ధర: రూ. 2,795దేశీయంగా సిమెంట్‌కు డిమాండ్ 7–8 శాతం మేర వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తిని 140 మిలియన్ టన్నుల స్థాయికి రెట్టింపు చేసుకోవాలని సంస్థ నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 89 మిలియన్ టన్నులుగా ఉంది. వ్యయాల నియంత్రణపై మరింతగా దృష్టి పెడుతోంది.టీసీఎస్ ప్రస్తుత ధర: రూ. 4,085.60 టార్గెట్ ధర: రూ. 4,664వృద్ధికి అవకాశమున్న వర్ధమాన మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తోంది. టోటల్ కాంట్రాక్ట్ వేల్యూ దాదాపు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో ఉండటం, జెన్ఏఐపై క్లయింట్ల ఆసక్తి పెరుగుతుండటం వంటివి వ్యాపార వృద్ధికి దోహదపడే సానుకూలాంశాలు.గ్రాన్యూల్స్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 551.60 టార్గెట్ ధర: రూ. 723ఎఫ్డీ సెగ్మెంట్‌వైపు వ్యూహాత్మకంగా మళ్లుతుండటం, యూరప్‌లో పారాసెట్మల్ ఏపీఐల అమ్మకాలు స్థిరపడుతుండటం మొదలైనవి సానుకూలాంశాలు. అలాగే, కొత్త ఎఫ్డీ ప్లాంటు అందుబాటులోకి రావడం, ఉత్తర అమెరికాలో కొత్త ఉత్పత్తుల లాంచింగ్ వంటి అంశాలు వ్యాపార వృద్ధికి తోడ్పడగలవు.ఎస్బీఐ సెక్యూరిటీస్ కోల్ ఇండియా ప్రస్తుత ధర: రూ. 449.55టార్గెట్ ధర: రూ. 593భారీ ఉత్పత్తి లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఫస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవడంలో పురోగతి సాధించింది. లాభసాటి కాని భూగర్భ గనుల నుంచి తప్పుకోవడం ద్వారా వ్యయాలను నియంత్రించుకుంటోంది. గ్రాఫైట్ వంటి ఇతర విభాగాల్లోకి కూడా విస్తరిస్తోంది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ ప్రస్తుత ధర: రూ. 1,181.80 టార్గెట్ ధర: రూ. 1,398 రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజ సంస్థగా రాణిస్తోంది. రెసిడెన్షియల్, కమర్షియల్, వేర్‌హౌసింగ్ వంటి వివిధ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 23,363 కోట్లుగా ఉన్న రుణభారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో గణనీయంగా రూ. 7,680 కోట్లకు తగ్గించుకుంది.భారతి హెక్సాకామ్ ప్రస్తుత ధర: రూ. 1,420.90టార్గెట్ ధర: రూ. 1,747రాజస్థాన్, ఈశాన్య టెలికం సర్కిళ్లలో కార్యకలాపాలు సాగిస్తోంది. 25,704 టవర్లు, 79,835 మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్టేషన్లతో పటిష్టమైన మౌలిక సదుపాయాల నెట్వర్క్ ఉంది. భారతి ఎయిర్‌టెల్‌తో అనుబంధం వల్ల డిజిటల్ ఇన్ఫ్రా, మేనేజ్మెంట్ నైపుణ్యాలపరంగా ప్రయోజనాలను పొందుతోంది.నిప్పన్ లైఫ్ ఏఎంసీ ప్రస్తుత ధర: రూ. 683టార్గెట్ ధర: రూ. 825ఈక్విటీ, ఈటీఎఫ్ ఏయూఎంపరంగా పటిష్ట వృద్ధి కనపరుస్తోంది. 2024–26 ఆరి్ధక సంవత్సరాల మధ్య కాలంలో ఏయూఎం వృద్ధి రెండంకెల స్థాయిలో ఉండొచ్చనే అంచనాలున్నాయి. బలమైన రిటైల్ నెట్వర్క్, దేశీ యంగా మ్యుచువల్ ఫండ్ విస్తృతి తక్కువగా ఉండటం తదితర అంశాలు ఇందుకు తోడ్పడనున్నాయి. ఎస్కార్ట్స్ కుబోటా ప్రస్తుత ధర: రూ. 3,642.45 టార్గెట్ ధర: రూ. 4,40812 హెచ్‌పీ నుంచి 120 హెచ్‌పీ వరకు వివిధ సామర్థ్యాలున్న ట్రాక్టర్లతో బలమైన పోర్ట్‌ఫోలియో ఉంది. మూడు తయారీ ప్లాంట్లు, ఏటా 12 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. హైడ్రాలిక్ మొబైల్ క్రేన్లకు సంబంధించి దేశీ మార్కెట్లో అగ్రగామిగా ఉంటోంది. 1,200 పైచిలుకు డీలర్లతో మార్కెట్లలో విస్తరిస్తోంది.సిస్టమాటిక్స్ షేర్స్ అండ్ స్టాక్స్ (ఇండియా) పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుత ధర: రూ. 925 టార్గెట్ ధర: రూ. 1,333 దేశీయంగా మూడో అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఏయూఎం రూ. 71,243 కోట్లుగాను, లోన్ బుక్ రూ. 65,358 కోట్లుగా ఉంది. రిటైల్ లోన్ బుక్‌ను 2027 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1 లక్ష కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకుంది. వార్షికంగా 50 చొప్పున 2026 నాటికి మొత్తం 400 శాఖలు ఏర్పాటు చేయనుంది.శ్రీరామ్ ప్రాపరీ్టస్ ప్రస్తుత ధర: రూ. 106.95 టార్గెట్ ధర: రూ. 152 దక్షిణాదిలో దిగ్గజ రెసిడెన్షియల్ డెవ లపర్లలో ఒకటిగా వ్యాపార వృద్ధి, లాభదాయకతపై మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే మూడేళ్లలో 15 ఎంఎస్ఎఫ్ స్థాయిలో విక్రయాలను లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమపై సానుకూల అంచనాలు ఉండటం, మిడ్ సెగ్మెంట్లో అగ్రగామిగా ఉండటం వంటివి సంస్థకు సానుకూలాంశాలు.జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రస్తుత ధర: రూ. 464.85 టార్గెట్ ధర: రూ. 700 ఇది దేశీయంగా నాలుగో అతి పెద్ద స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. 2021 ఆర్థిక సంవత్సరంలో 40 శాతంగా ఉన్న సెక్యూర్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో 2024 ఆర్థిక సంవత్సరంలో 60 శాతానికి పెరిగింది. నికర వడ్డీ మార్జిన్లు స్థిరంగా ఉండటం, నికర ఎన్పీఏలు తగ్గుతుండటంతో లాభాల మార్జిన్లు మెరుగుపడనున్నాయి. ఏయూఎం వృద్ధి 19–20% అంచనా. పేటీఎం ప్రస్తుత ధర: రూ. 752.25టార్గెట్ ధర: రూ. 900 ఎంటర్టైన్మెంట్ వ్యాపారాన్ని రూ. 2,000 కోట్లకు జొమాటోకి విక్రయించడం ద్వారా కీలకమైన పేమెంట్, ఆర్థిక సేవలపై మరింతగా దృష్టి పెడుతోంది. ఈ డీల్‌తో నగదు నిల్వలు పెరిగి, భవిష్యత్‌లో పెట్టుబడులకు కాస్త వెసులుబాటు లభిస్తుంది. విస్తృతమైన మర్చంట్ నెట్వర్క్, పటిష్టమైన సౌండ్–బాక్స్ సబ్‌్రస్కయిబర్లు సానుకూలాంశాలు.జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రస్తుత ధర: రూ. 80.70టార్గెట్ ధర: రూ. 108 దేశంలోనే రద్దీగా ఉండే రెండు విమానాశ్రయాలను (డీఐఏఎల్, జీహెచ్ఐఏఎల్) నిర్వహిస్తోంది. ఈ రెండింటిలో ప్యాసింజర్ ట్రాఫిక్ గత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 13%, 19% మేర వృద్ధి చెందింది. డ్యూ టీ–ఫ్రీ సర్వీసెస్ వంటి నాన్–ఏరోనాటికల్ ఆదాయ వనరులను పెంచుకుంటోంది. గ్రూప్ ఏడీపీతో భాగస్వా మ్యం వల్ల ఆర్థిక స్థిరత్వం మెరుగుపడింది.యాక్సిస్ సెక్యూరిటీస్ గ్రావిటా ఇండియా ప్రస్తుత ధర: రూ. 2,000.70 టార్గెట్ ధర: రూ. 3,000 వచ్చే ఏడాది వ్యవధిలో కంపెనీ పటిష్టమైన ఎబిటా నమోదు చేసే అవకాశం ఉంది. వాల్యూమ్స్, ప్రతి టన్నుపై ఎబిటా వృద్ధి మెరుగ్గా ఉండగలవు.అరవింద్ స్మార్ట్ స్పేసెస్ ప్రస్తుత ధర: రూ. 918.75 టార్గెట్ ధర: రూ. 1,085 ఎన్‌హెచ్47 సూరత్, సౌత్ అహ్మదాబాద్ ప్రాజెక్టుల బుకింగ్స్ సానుకూలంగా ఉండవచ్చు. వీటి నుంచి వరుసగా రూ. 1,100 కోట్లు, రూ. 1,450 కోట్ల మేర రావచ్చని అంచనా.ఐనాక్స్ విండ్ ప్రస్తుత ధర: రూ. 218.70 టార్గెట్ ధర: రూ. 270 2023–24 నుంచి 2026–27 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో కంపెనీ రెవెన్యూ/ఎబిటాలు వార్షిక ప్రాతిపదికన 83 శాతం/90 శాతం మేర వృద్ధి చెందవచ్చని అంచనా.కేపీఐటీ టెక్నాలజీస్ ప్రస్తుత ధర: రూ. 1,386.10 టార్గెట్ ధర: రూ. 2,150 ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉండటంతో దీర్ఘకాలంలో అధిక వృద్ధిని కొనసాగించగలమని మేనేజ్మెంట్ ధీమాగా ఉంది.హెచ్‌జీ ఇన్ఫ్రా ఇంజినీరింగ్ ప్రస్తుత ధర: రూ. 1,331.85 టార్గెట్ ధర: రూ. 1,700వ్యూహాత్మక డైవర్సిఫికేషన్‌పై దృష్టి పెడుతుండటం సంస్థకు గణనీయంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఇన్ఫ్రా, పెట్టుబడులపై ఫోకస్
వాషింగ్టన్: 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఇన్ఫ్రా, పెట్టుబడులు, నవకల్పనలు, సమ్మిళితత్వం ఉన్నట్లు పెన్సిల్వేనియా యూనివర్సిటీ విద్యార్థులకు వివరించారు. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల కోసం అమెరికాలో పర్యటిస్తున్న సందర్భంగా ఆమె వర్సిటీని సందర్శించారు. ‘2047లో భారత్ వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అప్పటికల్లా సంపన్న దేశంగా ఎదగాలన్నది భారత్ ఆకాంక్ష. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం నాలుగు అంశాలపై దృష్టి పెడుతోంది‘ అని సీతారామన్ పేర్కొన్నారు. వంతెనలు, పోర్టులు, డిజిటల్ తదితర మౌలిక సదుపాయాల కల్పన కీలకమని, అలాగే వాటిపై పెట్టుబడులు పెట్టడం కూడా ముఖ్యమని ఆమె తెలిపారు. భారత్‌కే పరిమితమైన సమస్యల పరిష్కారానికి వినూత్న ఆవిష్కరణలు అవసరమన్నారు. ఇక ప్రతి విషయంలోనూ అందరూ భాగస్వాములయ్యేలా సమ్మిళితత్వాన్ని సాధించడం కూడా కీలకమని మంత్రి పేర్కొన్నారు. -
కోరమాండల్ రూ.800 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎరువుల తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ రూ.800 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇందులో రెండు నూతన ప్లాంట్ల ఏర్పాటుకు రూ.677 కోట్లు వెచ్చించాలని గురువారం సమావేశమైన బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన మొత్తాన్ని మూలధన అవసరాలకు వినియోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్లాంటును రూ.513 కోట్లతో విస్తరిస్తోంది. ఇందులో భాగంగా 7,50,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల గ్రాన్యులేషన్ ట్రైన్‌ను 24 నెలల్లో ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే కాకినాడ కేంద్రం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 22,50,000 టన్నులు ఉంది. వినియోగం 93 శాతానికి చేరిందని కంపెనీ తెలిపింది. ‘ఈ విస్తరణతో కాకినాడ ప్లాంట్‌ను భారత్‌లో అతిపెద్ద ఎరువుల తయారీ కేంద్రాల్లో ఒకటిగా మారుస్తుంది. ఎరువుల రంగంలో సంస్థ నాయకత్వాన్ని సుస్థిరం చేస్తుంది’ అని కోరమాండల్ తెలిపింది. ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్.. అలాగే గుజరాత్‌లోని అంకలేశ్వర్ వద్ద 600 టన్నుల వార్షిక సామర్థ్యంతో ఫంగిసైడ్స్ మల్టీ ప్రొడక్ట్ ప్లాంట్‌ను రూ.164 కోట్లతో నెలకొల్పాలని నిర్ణయించింది. 18 నెలల్లో ఇది కార్యరూపంలోకి రానుంది. క్రాప్ ప్రొటెక్షన్ టెక్నికల్స్‌ను ఇక్కడ తయారు చేస్తారు. కోరమాండల్ క్రాప్ ప్రొటెక్షన్ ఫిలిప్పైన్స్‌లో (సీసీపీపీ) అదనంగా 6.67 శాతం వాటాను రూ.76 లక్షలతో కొనుగోలు చేయాలని బోర్డు నిర్ణయించింది. తద్వారా సీసీపీపీ పూర్తి అనుబంధ కంపెనీగా మారుతుందని వివరించింది. తగ్గిన నికర లాభం.. సెప్టెంబర్ త్రైమాసికంలో కోరమాండల్ ఇంటర్నేషనల్ నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం క్షీణించి రూ.659 కోట్లకు చేరింది. ఎబిటా 8 శాతం తగ్గి రూ.975 కోట్లు నమోదైంది. టర్నోవర్ 6.4 శాతం ఎగసి రూ.7,433 కోట్లను తాకింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో కోరమాండల్ షేరు ధర 2.46 శాతం లాభపడి రూ.1,640 వద్ద స్థిరపడింది. -
నోబెల్ అవార్డులు చెప్పే పాఠాలు
ఈ ఏడాది భౌతిక, రసాయనశాస్త్ర నోబెల్ అవార్డులను పరిశీలించారా? ఈ రెండింటితోనూ రేపటితరం టెక్నాలజీగా చెప్పుకొంటున్న కృత్రిమ మేధకు సంబంధం ఉంది. కృత్రిమ మేధ పునాదులు దశాబ్దాల నాటి ఆవిష్కరణల్లో ఉన్నాయని ఈ పురస్కారాలు చాటుతున్నాయి. మౌలికాంశాలపై పరిశోధ నలు ఎంత ముఖ్యమో కూడా ఇవి మరోసారి స్పష్టం చేస్తున్నాయి. మానవ విజ్ఞానం విస్తరించేందుకూ ఇవి ఎంతగానో అవసరం. మౌలికాంశాల పరి శోధనలకు ప్రత్యామ్నాయం లేదు. భారతీయులెవరికీ నోబెల్ అవార్డులు దక్కడం లేదంటే... అందుకు కారణం అదే. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఇదో దీర్ఘకాలిక కార్యక్రమం అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ అవార్డులు పొందిన జాన్ హాప్ఫీల్డ్, జెఫ్రీ హంటన్ భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను, టూల్సును మెషీన్ లెర్నింగ్ కోసం ఉపయోగించారు. అణువు తిరిగే పద్ధతి సాయంతో హాప్ఫీల్డ్ సమా చారాన్ని నిల్వ చేసుకునే, పునర్మించే నిర్మాణం రూపొందించారు.హంటన్ సమాచార ధర్మాలను స్వతంత్రంగా గుర్తించగల పద్ధతిని ఆవిష్కరించారు. ప్రస్తుతం విస్తృత వినియోగంలో ఉన్న న్యూరల్ నెట్ వర్క్‌కు పునాదులు ఇవే. కాలక్రమంలో ఈ ఆవిష్కరణలు కంప్యూటర్లు కాస్తా మానవుల జ్ఞాపకశక్తి, నేర్చుకునే శక్తులను అనుకరించేంత శక్తి మంతమయ్యాయి.ఇప్పుడు ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్ అవార్డు సంగతి చూద్దాం. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన డేవిడ్ బేకర్, గూగుల్ డీప్‌మైండ్‌లో పని చేస్తున్న డెమిస్ హస్సాబిస్, జాన్ ఎం.బంపర్లకు ఈ పురస్కారం దక్కింది. ప్రొటీన్ డిజైన్‌ను కంప్యూటర్ల సాయంతో అంచనా వేసేందుకు బేకర్ ఒక పద్ధతిని ఆవిష్కరిస్తే, డీప్‌మైండ్ శాస్త్ర వేత్తలు ప్రొటీన్ల నిర్మాణాన్ని ముందస్తు అంచనా వేయగలిగారు. మన శరీరంలోని కణాలు, జీవక్రియలన్నింటికీ ప్రొటీన్లే కీలకం. అవి అతి సంక్లిష్టమైన పద్ధతుల్లో ముడుచుకుని ఉంటాయి. ఈ ముడతల్లోని తేడాలు, మార్పులు శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అణు నిర్మాణం, పరిసరాల్లోని నీటి పరమాణువులు ప్రొటీన్ ముడతలను నిర్ణయిస్తాయి. ఒకే ఒక్క ప్రొటీన్ లెక్కలేనన్ని ఆకారాల్లో ఉండవచ్చు. కొత్త ప్రొటీన్లను డిజైన్ చేసేందుకు అవసరమైన కంప్యూటర్ నియ మాలను బేకర్ అభివృద్ధి చేశారు. దీనివల్ల కొత్త చికిత్సలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఇక గూగుల్ డీప్‌మైండ్ శాస్త్రవేత్తలు ఆల్ఫా–ఫోల్డ్ పేరుతో తయారు చేసిన సాఫ్ట్వేర్ అమైనో ఆమ్ల క్రమాన్ని బట్టి ప్రొటీన్ త్రీడీ నిర్మాణాన్ని ముందుగానే అంచనా కడుతుంది. పథ నిర్దేశకులకే నోబెల్...మౌలికాంశాలపై పరిశోధనలు ఎంత ముఖ్యమో ఈ అవార్డులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. సీవీ రామన్ తరువాత భారతీయు లెవరికీ నోబెల్ అవార్డు దక్కలేదంటే... కారణం ఇదే. హరగోబింద్ ఖొరానా, ఎస్.చంద్రశేఖర్, వెంకీ రామకృష్ణన్ వంటి వారు విదేశీ విశ్వవిద్యాలయాల్లో మౌలిక అంశాలపైనే పరిశోధనలు చేసి నోబెల్ అవార్డులు సాధించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నోబెల్ అవార్డులు సాధారణంగా సాంకేతిక, శాస్త్ర రంగాల్లో కొత్త మార్గాలను ఆవిష్కరించిన వారికే ఇస్తూంటారు. హాప్ఫీల్డ్ విషయాన్నే తీసుకుందాం. తొంభై ఒక్క సంవత్సరాల వయసున్న ఈయన ‘హాప్ ఫీల్డ్ నెట్వర్క్’ అని పిలుస్తున్న ఆవిష్కరణ కోసం 1980 నుంచే కృషి చేస్తున్నారు. హంటన్ ఆవిష్కరించిన ‘బోల్æ్ట›్జమన్ మెషీన్’ పద్ధతి కూడా దశాబ్దాల కృషి ఫలితమే. ఎంతో కాలం తరువాత 2010లో ఈ ఆవిష్కరణలు మెషీన్ లెర్నింగ్ రంగాన్ని సమూలంగా మార్చేశాయి. చాట్‌జీపీటీ వంటి వినియోగదారు ఉత్పత్తికి వీరి పరిశోధనలే మూలం. ఇదే విధంగా రసాయన శాస్త్రంలో బేకర్ ప్రొటీన్ నిర్మాణా లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. 1998లో ఆయన తన తొలి ఆవిష్కరణ ‘రొసెట్టా’ను సిద్ధం చేశారు. ఇలాంటి ఆవిష్కరణల్లో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కృత్రిమ మేధ, డిజిటల్ కంప్యూటర్లకు సంబంధించి శాస్త్రవేత్తల్లో ప్రాథమికంగా ఒక ఆలోచన మొదలైన 1950లలోనే గణాంక శాస్త్రవేత్తగా మారిన భౌతిక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహాలనోబిస్ ఒక భావనను ప్రతిపాదించారు. ‘మహాలనోబిస్ డిస్టెన్స్’ అని పిలిచే ఈ భావన వేర్వేరు డేటా పాయింట్లలోని తేడాలను లెక్కిస్తుంది. అనంతరం ఈ మహాలనోబిస్ డిస్టెన్స్‌ను కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో విస్తృతంగా వినియోగించారు. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ) వ్యవస్థాపకుడు కూడా మహాలనోబిసే. సైబర్నెటిక్స్ ప్రాము ఖ్యతను అప్పట్లోనే గుర్తించారు. ఇందుకు తగ్గట్టుగా 1955లోనే నార్బెర్ట్ వీనర్ వంటి వారిని ఐఎస్ఐ విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఆహ్వానించారు. ద్విజేశ్ దత్తా మజుందార్ వంటి వారిని ఫజీ లాజిక్, న్యూరల్ నెట్వర్క్ వంటి రంగాల్లో పరిశోధనలకు వీనర్ పురిగొల్పారు.ప్రొఫెసర్ రాజ్ రెడ్డి భాగస్వామ్యం...1966లో అమెరికాలో డాక్టోరల్ విద్యార్థిగా ఉన్న రాజ్ రెడ్డి... మాటలను గుర్తించేందుకు ‘హియర్సే–1’ వంటి వ్యవస్థలను అభివృద్ధి చేశారు. మనుషుల్లానే కంప్యూటర్లు కూడా విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా, మనిషి మాటలను గుర్తించి అర్థం చేసుకోగల సామ ర్థ్యాన్ని కల్పించారు. ప్రస్తుతం కంప్యూటర్లు, రోబోలు మాటలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నది రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన ‘హియర్సే –2’, హార్పీ, డ్రాగన్ వంటి సిస్టమ్సే. ‘బ్లాక్‌బోర్డ్ మోడల్’ పేరుతో రాజ్ రెడ్డి అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్... కృత్రిమ మేధ వేర్వేరు మార్గాల నుంచి వచ్చే సమాచారాన్ని సమన్వయపరచుకునేందుకు కీలకంగా మారింది. ఈ ఆవిష్కరణకు గాను 1994లో ప్రొఫెసర్ రాజ్ రెడ్డికి కంప్యూటర్ సైన్సులో నోబెల్ అవార్డుగా పరిగణించే ‘టూరింగ్ అవార్డు’ దక్కింది. నోబెల్ అవార్డులు కృత్రిమ మేధ రంగంలో కీలక ఆవిష్కరణలకు దక్కడం బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీతో వచ్చే ప్రమాదాలను కూడా ఈ ఏడాది నోబెల్ గ్రహీతలు గుర్తించారు. ఏఐ ఛాట్బోట్లు భయం పుట్టించేవే అని గూగుల్ కృత్రిమ మేధ విభాగపు అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తరువాత హింటన్ వ్యాఖ్యానించడం గమనార్హం. కృత్రిమ మేధ విస్తృత వాడకం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయనీ, ఏఐ కారణంగా పెరిగిపోయే ఉత్పాదకత, సంపద ధనికులకు మాత్రమే సాయపడుతుందనీ అంచనా కట్టారు. కృత్రిమ మేధ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చిన్నా చితకా ఉద్యోగాలు అనేకం లేకుండా పోతాయని హెచ్చరించారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వాలు సార్వత్రిక సామాన్య వేతనం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలని హింటన్ సూచించారు. భారతీయులకు నోబెల్ అవార్డు దక్కక పోవడం గురించి కూడా మాట్లాడుకుందాం. పరిశోధనలకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. కాకపోతే ఇందుకు నిధులు ఎలా సమకూరుస్తారన్నది ఇంకా స్పష్టం కాలేదు. అంతర్జాతీయ స్థాయి శాస్త్ర రంగంలో భారత్ తనదైన ముద్ర వేయాలని కృత నిశ్చయంతో ఉంటే, యూనివర్సిటీల్లో మౌలికాంశాలపై పరిశోధనలకు పెద్దపీట వేయాలి. అలాగే అన్ని రకాల మద్దతు అందివ్వాలి. ఇదో దీర్ఘ కాలిక కార్యక్రమం అన్నది గుర్తు పెట్టుకోవాలి. అప్లైడ్ రీసెర్చ్, టెక్నా లజీ డెవలప్మెంట్లపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా తక్షణ సామాజిక, పారిశ్రామిక అవసరాలను తీర్చుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే నిధుల కేటాయింపు విషయంలో మౌలికాంశాలపై పరిశోధనలతోపాటు అప్లైడ్ రీసెర్చ్, టెక్నాలజీలు రెండింటికీ మధ్య ఒక సమతూకం సాధించాలి. ప్రైవేటు రంగం కూడా ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతల నుంచి స్ఫూర్తి పొందాలి. రసాయన శాస్త్ర నోబెల్ అవార్డులో సగం గూగుల్ శాస్త్రవేత్తలకు దక్కిన విషయం గమనార్హం. మౌలికాంశాలపై పరిశోధనలకు ఆ ప్రైవేట్ కంపెనీ పెట్టిన పెట్టుబడులు ఇందుకు కారణం. నోబెల్ స్థాయి అవార్డు రావాలంటే, మౌలికాంశాలపై పరిశోధనలకు పెట్టుబడులు సమకూరుస్తుండటమే మార్గం.దినేశ్ సి.శర్మవ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వేదాంత రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: విభిన్న రంగాల్లో ఉన్న వేదాంత గ్రూప్ రాజస్తాన్‌లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. యూకేలో జరిగిన రైజింగ్ రాజస్తాన్ రోడ్‌షోలో రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మతో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ భేటీ అయి తాజాగా పెట్టుబడి ప్రతిపాదనలు చేశారు. వేదాంత కంపెనీ అయిన హిందుస్తాన్ జింక్ రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. జింక్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 1.2 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులకు, వెండి ఉత్పత్తిని 800 నుంచి 2,000 టన్నులకు చేరుస్తారు. ఒక మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఫెర్టిలైజర్ ప్లాంటు నెలకొల్పుతారు. రోజుకు 3 లక్షల బ్యారెల్స్‌కు సామర్థ్యం పెంచేందుకు కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ రూ.35,000 కోట్లు పెట్టుబడి చేయనుంది. 10,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరులను అభివృద్ధి చేసేందుకు సెరెంటికా రెన్యూవబుల్స్ రూ.50,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఉదయ్‌పూర్ సమీపంలో లాభాపేక్ష లేకుండా ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పనున్నట్టు వేదాంత గ్రూప్ ప్రకటించింది. తాజా పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే కొత్తగా రెండు లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ఇప్పటికే రాజస్తాన్‌లో వేదాంత గ్రూప్ కంపెనీలు రూ.1.5 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు చేయడం విశేషం. దేశంలో ఉత్పత్తి అవుతున్న ముడి చమురులో కెయిర్న్ వాటా 25% ఉంది. హిందుస్తాన్ జింక్, కెయిర్న్ ప్రధాన కార్యకలాపాలకు రాజస్తాన్ కేంద్రంగా ఉంది. కాగా ఒడిశాలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ శుక్రవారం తెలిపింది. -
రియల్టీలో భారీగా పెరిగిన పెట్టుబడులు: సీబీఆర్ఈ
2024 జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడులు 8.9 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 46 శాతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ నివేదిక ప్రకారం 2018లో ఈ పెట్టుబడులు 5.8 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2019లో 6.4 బిలియన్ డాలర్లు, 2020లో 6 బిలియన్ డాలర్లు, 2021లో 5.9 బిలియన్ డాలర్లు, 2022లో 7.8 బిలియన్ డాలర్లు, 2023లో 7.4 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్, సావరీన్ వెల్త్ ఫండ్స్, సంస్థాగత ఇన్వెస్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు. రియల్ ఎస్టేట్ ఫండ్ – కమ్ – డెవలపర్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు, కార్పొరేట్ గ్రూప్‌లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు మొదలైనవి చేసే ఇన్వెస్ట్మెంట్లను ఈక్విటీ పెట్టుబడులుగా వ్యవహరిస్తారు. డేటా ప్రకారం జూన్ త్రైమాసికంలో పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో 2024 జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో దేశీ రియల్ ఎస్టేట్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు కొత్త గరిష్టాలకు ఎగిశాయి. జూలై–సెపె్టంబర్ మధ్య కాలంలో రియల్టీలోకి 2.6 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. రాబోయే రోజుల్లోనూ ఇదే తీరు కొనసాగే అవకాశం ఉందని సీబీఆర్ఈ చైర్మన్ (భారత్, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా) అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.సెప్టెంబర్ త్రైమాసికంలో దేశీ ఇన్వెస్టర్లు (ప్రధానంగా డెవలపర్లు) పెట్టుబడులకు నేతృత్వం వహించారు. ఆఫీస్ లీజింగ్ మార్కెట్ పుంజుకోవడం, గృహాల కొనుగోలు.. ఖర్చు చేసే విషయంలో వినియోగదారుల్లో రిస్కు సామర్థ్యాలు అసాధారణంగా పెరగడం తదితర అంశాలు ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో రియల్టీలోకి పెట్టుబడులు రావడానికి దోహదపడినట్లు నివేదిక వివరించింది. -
ఫాక్స్‌కాన్‌ను మరింత విస్తరించండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపార విస్తరణ చేపట్టాలని ప్రముఖ సెల్ఫోన్ల తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, లిథియం బ్యాటరీల తయారీకి సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. హైటెక్నాలజీ ఉత్పత్తుల తయారీ, ఆవిష్కరణలకు రాష్ట్రంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని వివరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఫోర్త్‌సిటీలో భాగస్వాములు కావాలని కోరారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ పరిశ్రమను ఆయన సందర్శించారు.గంటకు పైగా అక్కడ గడిపిన ఆయన ఫ్యాక్టరీ ఏర్పాటులో పురోగతిని పరిశీలించారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కంపెనీ ఉత్పత్తులు, నిరుద్యోగ యువతకు కల్పించనున్న ఉపాధి అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ ప్రస్తుత, భవిష్యత్తు కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటునందిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ కంపెనీ సీఈఓ, చైర్మన్ సిడ్నీ లూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రాజెక్టు పురోగతిని సీఎంకు వివరించారు.కంపెనీ నిర్వహణకు సంబంధించిన కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించగా, వాటి సత్వర పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్ ఈ పర్యటనను చేపట్టారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
‘రీజనల్’ చుట్టూ సెజ్‌లు!
సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిని గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మించనుండటంతో..ఈ రోడ్డు ఉండే చాలా ప్రాంతాలు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. అక్కడి భూములకు డిమాండ్ పెరుగుతుంది, రోడ్డు సదుపాయం వల్ల పరిశ్రమల స్థాపనకూ వీలవుతుంది. అలాంటి చోట్ల ‘స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్)’లను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు మార్గం సుగమం అవుతుందని.. అదే సమయంలో సెజ్‌లలో కంపెనీలకు భూములు కేటాయించటం ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని భావిస్తోంది. ఇది సాకారం కావాలంటే.. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారయ్యే ప్రాంతా ల్లో ల్యాండ్ పూలింగ్ చేపట్టాల్సి ఉండనుంది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ సాధ్యాసా ధ్యాలపై అధ్యయనం చేస్తున్నట్టు తెలిసింది.గతంలోనే ప్రతిపాదనలున్నా..హైదరాబాద్ చుట్టూ 158 కిలోమీటర్ల నిడివితో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్).. నగర రూపురేఖలను మార్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా 2006లో ఓఆర్ఆర్ నిర్మాణానికి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ శంకుస్థాపన చేశారు. ఆరేళ్ల తర్వాత దశలవారీగా అది అందుబాటులోకి వచ్చింది. ఓఆర్ఆర్ను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మంచి పురోగతి మొదలైంది. డిమాండ్ పెరిగింది. కానీ ఆ రోడ్డును ఆనుకుని ప్రభుత్వానికి కొత్తగా భూవనరులేవీ సమకూరకపోవడంతో.. అదనపు ఆదాయమేదీ రాలేదు. భవిష్యత్తులో రీజనల్ రింగురోడ్డు కూడా ఔటర్ రింగు రోడ్డు తరహాలోనే ఆయా ప్రాంతాలకు కొత్త రూపును ఇవ్వడం ఖాయమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఔటర్ నిర్మాణ సమయంలో ప్రభుత్వం సొంతంగా ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసుకోకపోవటం వంటి పొరపాటును ఇప్పుడు చేయవద్దని.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కొంత భూమిని సేకరించి పెట్టుకోవాలని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.అలైన్మెంట్ మార్పు నేపథ్యంలో..రీజనల్ రింగురోడ్డులో దక్షిణ భాగాన్ని సొంతంగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) గతంలో రూపొందించిన అలైన్‌మెంట్‌ను కాదని.. కొత్త అలైన్‌మెంట్‌ను రూపొందిస్తోంది. భూసేకరణ వ్యయంలో 50శాతం భరించటం మినహా మొత్తం నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరించే అవకాశాన్ని కూడా కాదనుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ సాహసానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రింగ్‌రోడ్డును ఆదాయ వనరుగా మార్చుకునే అంశంపై దృష్టి పడింది.అంత భూసేకరణ సాధ్యమేనా?రీజనల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి 2 వేల హెక్టార్ల భూమి అవసరమవుతోంది. దానికంటే దక్షిణ రింగ్ దాదాపు 50 కిలోమీటర్ల నిడివి ఎక్కువ ఉండే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు 2,400 హెక్టార్లకుపైగా భూమి రోడ్డు నిర్మాణానికే కావాలి. ఈ భూముల సేకరణ ఎలాగన్నది చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పటికే రీజనల్ ఉత్తర భాగంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అలాంటిది రోడ్డు కోసమే కాకుండా అదనంగా భూమిని సేకరించడం ఎంతవరకు సాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో మల్లన్నసాగర్, ఇతర ప్రాజెక్టులకు భూములి చ్చేందుకు రైతులు ఇష్టపడక న్యాయ పోరాటం చేశారు. ఇప్పుడు రీజనల్ రింగ్ విషయంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు కాకుంటే.. రీజనల్ రోడ్డు వెంట భవిష్యత్తులో భూమిని సమీకరించడం సాధ్యమయ్యే పనికాదని.. ఇప్పుడే ముందుకెళ్తే ప్రయోజనమని అధికారవర్గాలు చెబుతు న్నాయి. -
ఫండ్స్ కంటే పీఎంఎస్ నయమా?
మ్యూచువల్ ఫండ్స్‌లో నాకున్న పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసేసుకుని, తమ పీఎంఎస్లో ఇన్వెస్ట్ చేయాలని ఓ ఫిన్‌టెక్ యాప్ అడుగుతోంది. నేను రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్నాను. కనుక పీఎంఎస్ సేవలు వినియోగించుకోవడం సరైనదేనా? – విష్ణు నివాస్పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా పోర్ట్‌ఫోలియో రక్షణ బాధ్యతలను ఫండ్ మేనేజర్ తీసుకుంటారు. పీఎంఎస్ అయితే ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణమైన సేవలను అందించగలదు. కాకపోతే పీఎంఎస్లో పెట్టుబడులకు కనీసం రూ.50 లక్షలు ఉండాలి. అదే మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పైగా మ్యూచువల్ ఫండ్స్‌లో కొనసాగడం వల్ల పన్ను ప్రయోజనాలు పొందొచ్చు.ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అయితే, ఫండ్ మేనేజర్ పోర్ట్‌ఫోలియో పరంగా ఎన్నో లావాదేవీలు నిర్వహిస్తుంటారు. వీటిపై ఇన్వెస్టర్ ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడదు. కేవలం పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే లాభంపై పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే పీఎంఎస్ అనుకోండి.. మీ డీమ్యాట్ ఖాతా నుంచే స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహిస్తుంది. కనుక లావాదేవీల చార్జీలు, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై పన్నులు చెల్లించాల్సి వస్తుంది. ఇది అధిక వ్యయాలకు, పన్నులకు దారితీస్తుంది. ఫలితంగా రాబడులపై ప్రభావం పడుతుంది. ఏ పెట్టుబడి సాధనం అయినా పారదర్శకత కీలకం.మ్యూచువల్ ఫండ్స్ రోజువారీ యూనిట్ ఎన్ఏవీలను ప్రకటించాల్సిందే. నెలవారీగా తమ పోర్ట్‌ఫోలియో వివరాలను సైతం వెల్లడించాలి. దీంతో తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పెట్టుబడుల విధానం, పనితీరు ఇన్వెస్టర్లకు స్పష్టంగా తెలిసిపోతుంది. పీఎంఎస్ ఖాతాల్లో ఇదే స్థాయి పారదర్శకత ఉండదు.నాకు గడిచిన మూడేళ్లలో ఈక్విటీ పెట్టుబడులపై గణనీయమైన రాబడులు వచ్చాయి. కనుక ఇప్పుడు వీటిని విక్రయించి, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? – అద్వైత్మీ నిధుల అవసరాలపైనే పెట్టుబడులను లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించడం ఆధారపడి ఉంటుంది. సమీప కాలంలో (6–12 నెలలు) మీకు డబ్బులతో పని ఉంటే, ఈక్విటీ ఫండ్స్ నుంచి కొంత మొత్తాన్ని వెనక్కి తీసుకుని లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే, మీ ఆర్థిక లక్ష్యానికి చేరువ అయినప్పుడు కూడా ఈక్విటీ పెట్టుబడులు వెనక్కి తీసుకుని, డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మీరు ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ పథకం పోటీ పథకాలతో వరుసగా మూడేళ్ల పాటు రాబడుల విషయంలో వెనుకబడి ఉంటే, అప్పుడు కూడా ఆ పథకం నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఏడాది, రెండేళ్ల పనితీరు ఆధారంగా ఈ నిర్ణయానికి రావద్దు. మరో ఐదేళ్ల వరకు మీకు నిధుల అవసరం లేకపోతే ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించడమే సరైనది. ఎందుకంటే ఇప్పుడే వాటిని వెనక్కి తీసుకుంటే మిగిలిన ఐదేళ్ల కాలంలో మరింత రాబడులు పొందే అవకాశం కోల్పోతారు. అస్సెట్ అలోకేషన్ (డెట్–ఈక్విటీ తదితర సాధనాల మధ్య పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళిక)కు అనుగుణంగా మీ పెట్టుబడుల్లో క్రమానుగతంగా మార్పులు చేసుకోవడంపై దృష్టి సారించండి.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, వస్తు సేవల ఉత్పత్తి రంగాల్లో పురోగమిస్తున్న తెలంగాణ..అమెరికన్ కంపెనీల భాగస్వామ్యాన్ని సహకారాన్ని కోరుతోందని, గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్‌కు పెట్టుబడులతో తరలిరావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న మైన్స్ ఎక్స్పో– 2024 సదస్సులో గురువారం ఆయన ప్రముఖ అమెరికన్ కంపెనీలతో సమావేశమయ్యారు. భారత ఆర్థిక పురోగతిలో అమెరికన్ కంపెనీలు కీలక పాత్ర పోషించాయని, దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ సంస్థలు హైదరాబాద్‌ను తమ స్వస్థలంగా భావిస్తూ.. వ్యా పారాలు నిర్వహిస్తున్నాయని, తద్వారా హైదరాబాద్ గ్లోబల్ ఐటీ కేంద్రంగా, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకున్నదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వ వ్యాపార అనుకూల విధానాలు, నైపుణ్యం గల మానవ వనరులు, చక్కని మౌలిక సదుపా యాలు గల హైదరాబాద్ సిటీ పెట్టుబడులకు స్వర్గధామం అని అన్నారు. హైదరాబాద్ టెక్నాలజీ హబ్‌గానే కాకుండా ఫార్మాసిటీ రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉంటుందన్నారు. కరోనా విపత్కర సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అరబిందో ఫార్మా, బయోలాజికల్–ఈ, భారత్ బయోటెక్ వంటి కంపెనీల ఆవిష్కరణలతో ‘వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్’గా నగరం ఖ్యాతి గడించిందని చెప్పారు.ఐటీ అభివృద్ధిలో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ ఆవిష్కరణ జరుగుతోందని, ఇక్కడ ఏఐతో నిర్వహించే పరిశ్రమలు, ఏఐ అభివృద్ధి, స్మార్ట్ ఇన్ఫ్రాస్టక్చర్, గ్రీన్ ఎనర్జీ ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్నామని, ఈ విభాగాల్లో ఆసక్తి, అనుభవం ఉన్న కంపెనీలకు తెలంగాణ స్వాగతం పలుకుతుందన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఇంధన, పారిశ్రామిక విధానాలు రూపొందించామని, కొత్త ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి, పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధికి ఎక్కువ అవకాశాలుంటాయన్నారు.ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ టెక్నాలజీని వృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని తెలి పారు. సదస్సులో ఆ్రస్టేలియాకు చెందిన డోపల్ మేర్ కంపెనీ స్టాల్‌ను సందర్శించారు. ఈ కంపెనీ రూపొందించిన అత్యాధునిక బొగ్గు, ఓవర్ బర్డెన్ రవాణా బెల్టులు, వాటి పనితీరును పరిశీలించారు. సౌత్ ఆఫ్రికా, స్విజర్లాండ్ వంటి దేశాలలో తమ కంపెనీ బెల్టులతో జరుగుతున్న రవాణా ప్రక్రియను స్టాల్ నిర్వాహకులు వివరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్. బలరామ్, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. -
ఎన్ఆర్ఐలకు ఫండ్స్ రూట్!
మెరుగైన ఆరి్థక వృద్ధితో భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయమైన చిరునామాగా నిలుస్తోంది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్న పరిస్థితి చూస్తున్నాం. విదేశాల్లో స్థిరపడిన భారతీయులకు (ఎన్ఆర్ఐలు) సైతం భారత ఈక్విటీ అవకాశాలు మెరుగైన ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. తమ పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడంతోపాటు, ఆకర్షణీయమైన రాబడులు, పన్ను ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. తమ విశ్రాంత జీవనాన్ని స్వదేశంలో ప్రశాంతంగా, హాయిగా గడపాలని కోరుకునే వారు.. భారత ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెరుగైన నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. పెట్టుబడులకు అనుకూల విధానాలు, వాతావరణంతోపాటు, మెరుగైన నియంత్రణలు భద్రతకు హామీనిస్తున్నాయి. దీర్ఘకాలంలో సంపద సృష్టికి లేదా స్థిరమైన ఆదాయం కోసం ఎన్ఆర్ఐలు ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు (అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) విదేశీ మారకంలో పెట్టుబడులు స్వీకరించవు. అదే విధంగా ఎన్ఆర్ఐలు భారత్‌లో సాధారణ సేవింగ్స్ ఖాతాలో డిపాజిట్‌కు విదేశీ మారకద్రవ్య చట్టం (ఫెమా) అనుమతించదు. రూపాయి మారకంలో పెట్టుబడులకే అనుమతి ఉంటుంది కనుక ఎన్ఆర్ఐలు భారత ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంక్ ఖాతా ఉండాలి. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్ (ఎన్ఆర్ఈ), నాన్ రెసిడెంట్ ఆర్డినరీ అకౌంట్ (ఎన్ఆర్వో), ఫారీన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్సీఎన్ఆర్) అకౌంట్ అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఖాతా అవసరం→ ఎన్ఆర్ఈ ఖాతా అయితే.. విదేశాల్లో ఆర్జించిన మొత్తాన్ని స్వదేశానికి పంపుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతాలో డిపాజిట్లపై వచ్చే వడ్డీపై పన్ను లేదు. → ఎన్ఆర్వో ఖాతా.. భారత్‌లో ఆదాయ వనరులను ఇక్కడే డిపాజిట్ చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ ఖాతా ద్వారా భారత్‌లో ఆదాయాన్ని భారత్‌లోనే ఇన్వెస్ట్చేసుకోవచ్చు. ఈ ఖాతాలోని డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒక ఆరి్థక సంవత్సరంలో గరిష్టంగా మిలియన్ డాలర్లనే ఈ ఖాతా నుంచి విదేశీ ఖాతాకు మళ్లించుకోగలరు.→ విదేశీ కరెన్సీ రూపంలో డిపాజిట్లు కలిగి ఉండేందుకు ఎఫ్సీఎన్ఆర్ ఖాతా అనుకూలిస్తుంది. ఈ ఖాతాతో కరెన్సీ మారకం రేట్ల రిస్క్ లేకుండా చూసుకోవచ్చు. ఎఫ్సీఎన్ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా కాగా, ఎన్ఆర్ఈ పొదుపు/కరెంటు/రికరింగ్/ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాగా పనిచేస్తుంది. → చెక్, డీడీ, నెఫ్ట్ లేదా ఆర్టీజీఎస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేస్తే.. ఈ నిధుల మూ లాలు తెలియజేసేందుకు వీలుగా ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్స్ సర్టిఫికెట్ (ఎఫ్ఐఆర్సీ)ను సమర్పించాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛానళ్లు, బ్రోకరేజీ సంస్థల సాయంతోనూ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవైసీ కీలకంభారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ముందు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకోసం పాస్‌పోర్ట్ కాపీ, పుట్టిన తేదీ ధ్రువీకరణ కాపీ, పాన్, ఫొటో, విదేశీ చిరునామా ధ్రువీకరణ కాపీలను సమరి్పంచాలి. ప్రస్తుత నివాసం అది శాశ్వతమైనా లేదా తాత్కాలికమైనా సరే రుజువులు సమరి్పంచాలి. ఫారిన్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఓసీఐ కార్డ్ కాపీని ఇవ్వాల్సి ఉంటుంది.పెట్టుబడుల మార్గాలు.. ఎన్ఆర్ఐలు తామే స్వయంగా లేదంటే పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) ద్వారా ఇతరుల సాయంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నేరుగా అంటే ఎన్ఆర్ఈ/ఎన్ఆర్వో ఖాతాను తెరిచి వాటి ద్వారా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయడం లేదా సిప్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది వీలు కానప్పుడు.. భారత్‌లో తాము విశ్వసించే వ్యక్తికి ఈ పని అప్పగిస్తూ పీవోఏ ఇవ్వొచ్చు. మీ తరఫున సంబంధిత వ్యక్తి పెట్టుబడుల వ్యవహారాలు చూస్తారు. ప్రతి లావాదేవీ నిర్వహణ సమయంలో పీవోఏ లేదా నోటరైజ్డ్ కాపీని సమరి్పంచాల్సి ఉంటుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఎన్ఆర్ఐ స్వయంగా హాజరు కావాలని కోరుతున్నాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు యూఎస్ఏ, కెనడాలోని ఎన్ఆర్ఐల నుంచి పెట్టుబడులు అనుమతించడం లేదు. ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కాంప్లియన్స్ యాక్ట్ (ఫాక్టా) నిబంధనల అమలు ప్రక్రి య సంక్లిష్టంగా ఉండడమే దీనికి కారణం. ఎన్ఆర్ఐలు, యూఎస్ పౌరుల ఆర్థిక లావాదేవీల వివరాలను అమెరికా ప్రభుత్వంతో పంచుకోవాలని ఫాక్టా నిర్దేశిస్తోంది. విదేశీ ఆదాయంపై పన్ను ఎగవేతలను నిరోధించేందుకు ఈ నిబంధన పెట్టారు. పైగా అమెరికా, కెనడా నియంత్రణ సంస్థల వద్ద భారత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్నీ కాకుండా, కొన్ని అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు యూఎస్ఏ, కెనడా నుంచి ఎన్ఆర్ఐల పెట్టుబడులను కొన్ని షరతుల మేరకు అనుమతిస్తున్నాయి. కనుక అమెరికా, కెనడాలోని ఎన్ఆర్ఐలు అదనపు డాక్యుమెంట్లను సమరి్పంచాల్సి రావ చ్చు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్, నిప్పన్ ఇండియా, క్వాంట్ మ్యూచువల్ ఫండ్, సుందరం మ్యూచువల్, యూటీఐ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కాకుండానే ఆన్లైన్లో, ఎలాంటి పరిమితులు లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలు ప్రత్యక్షంగా హాజరు కావాలనే సంస్థల్లో.. 360 వన్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, డీఎస్పీ మ్యూచువల్ ఫండ్, ఐటీఐ మ్యూచువల్ ఫండ్, కోటక్ మ్యూచువల్ ఫండ్, నవీ మ్యూచువల్ ఫండ్, ఎన్జే ఇండియా మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, టారస్ మ్యూచువల్ ఫండ్, వైట్ఓక్ క్యాపిటల్ ఉన్నాయి. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్, బంధన్ మ్యూచువల్ ఫండ్ కేవలం అమెరికాలోని ఇన్వెస్టర్ల నుంచే పెట్టుబడు లు స్వీకరిస్తున్నాయి. ఇవి కూడా ఫిజికల్ మోడ్‌లో నే (భౌతిక రూపంలో) పెట్టుబడులు అనుమతిస్తున్నాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మొదటి లా వాదేవీ భౌతిక రూపంలో, తదుపరి లావాదేవీలు అన్లైన్లో నిర్వహించేందుకు అనుమతిస్తోంది. https://mfuindia.com/usa-canada-residents నుంచి యూఎస్, కెనడాలోని ఎన్ఆర్ఐలు మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అవకాశాలు.. మ్యూచువల్ ఫండ్స్‌లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు రకాల ప్లాన్లు ఉన్నాయి. రెగ్యులర్ ప్లాన్లు మధ్యవర్తుల ప్రమేయంతో పొందేవి. అంటే పంపిణీదారులకు ఈ ప్లాన్ల ద్వారా కమీషన్ ముడుతుంది. కేవైసీ, డాక్యుమెంటేషన్ ప్రక్రియ, ఎటువంటి పథకాలను ఎంపిక చేసుకోవాలి తదితర సేవలను వీరి నుంచి పొందొచ్చు. వీరికి కమీషన్ చెల్లించాల్సి రావడంతో రెగ్యులర్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో (ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ) ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు దీనికి విరుద్ధం. ఇందులో మధ్యవర్తులకు కమీషన్ చెల్లింపులు ఉండవు. దీంతో ఎక్స్పెన్స్ రేషియో డైరెక్ట్ ప్లాన్ల కంటే తక్కువగా ఉంటుంది. దీంతో దీర్ఘకాలంలో రెగ్యులర్ కంటే డైరెక్ట్ ప్లాన్లలో రాబడులు అధికంగా ఉంటాయి. ఒక పథకానికి సంబంధించి అది రెగ్యులర్ లేదా డైరెక్ట్ ప్లాన్ ఏది అయినా కానీ.. పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో ఒక్కటే ఉంటుంది. డైరెక్ట్ ప్లాన్లు ఎంపిక చేసుకునే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగల అవగాహన కలిగి ఉండాలి. అప్‌స్టాక్స్, కువేరా, ఎన్ఆర్ఐలకు సంబంధించి వాన్స్ తదితర ప్లాట్‌ఫామ్‌లు డైరెక్ట్ ప్లాన్లలో పెట్టుబడులకు వీలు కలి్పస్తున్నాయి. ఉపసంహరణ – పన్ను బాధ్యత భారత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే లాభంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి వస్తుందన్న భయం అక్కర్లేదు. భారత్‌తో ద్వంద పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) కుదుర్చుకున్న దేశాల్లోని ఎన్ఆర్ఐలు ఒక చోట పన్ను చెల్లిస్తే సరిపోతుంది. యూఎస్, కెనడా, మధ్యప్రాచ్య దేశాలు సహా మొత్తం 80 దేశాలతో భారత్‌కు ఈ విధమైన ఒప్పందాలు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్ లాభాలపై భారత పౌరులకు, ఎన్ఆర్ఐలకు ఒకే రకమైన నిబంధనలు అమలవుతున్నాయి. ఎన్ఆర్ఐలు తమ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులను ఆన్లైన్లోనే విక్రయించుకోవచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు లాభంపై పన్నును మినహాయించి మిగిలిన మొత్తాన్ని ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్వో ఖాతాకు జమ చేస్తాయి. అన్ని ఏఎంసీలు ఎన్ఆర్ఐలు పెట్టుబడులు విక్రయించిన సందర్భంలో టీడీఎస్‌ను అమలు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలకు మించిన లాభంపై 12.5 శాతం, అంతకులోపు విక్రయించగా వచ్చిన లాభం (స్వల్ప కాల మూలధన లాభం)పై 15 శాతం టీడీఎస్ అమలు చేస్తాయి. అదే డెట్ ఫండ్స్‌లో లాభాలపై పన్ను ఇన్వెస్టర్ వార్షిక ఆదాయానికి కలుస్తుంది. డీటీఏఏ కింద పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవాలనుకునే వారు తాము నివసిస్తున్న దేశం నుంచి ట్యాక్స్ రెసిడెన్సీ సరి్టఫికెట్ (టీఆర్సీ) సమరి్పంచాల్సి ఉంటుంది. భారత్‌లో పన్ను చెల్లించిన ఎన్ఆర్ఐలు తమ దేశంలో డీటీఏఏ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లోని ఎన్ఆర్ఐలు భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా తమ విశ్రాంత జీవనానికి తగినంత నిధి సమకూర్చుకోవచ్చని రిటైర్మెంట్ విషయంలో సలహా, సూచనలు, పరిష్కారాలు అందించే ‘ద్యోత సొల్యూషన్స్’కు చెందిన కౌశిక్ రామచంద్రన్ సూచిస్తున్నారు. మధ్య ప్రాచ్య దేశాల్లో పౌరసత్వం పొందలేరు కనుక రిటైర్మెంట్ తర్వాత స్వదేశానికి రావాల్సిందేనని, అలాంటి వారికి భారత మ్యూచువల్ ఫండ్స్ అనుకూలమని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పరిశ్రమ చిన్నదే.. పాత్ర పెద్దది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకపాత్ర పోషిస్తున్నాయి. గడిచిన పదేళ్లుగా ఈ రంగంలో తెలంగాణలో గణనీయ పురోగతి సాధించింది. తయారీ, సేవా రంగాలతోపాటు రిటైల్, వాణిజ్య రంగాల్లోనూ వీటి పాత్ర అత్యంత కీలకంగా ఉంది. తెలంగాణలోని భారీ ప్రభుత్వ రంగ సంస్థలు, బహుళ జాతి కంపెనీల సరఫరా వ్యవస్థలో ఎంఎస్ఎంఈలు విడదీయరాని భాగంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఐటీ, దాని అనుబంధ సేవలు, ఫార్మా, రక్షణ, వస్త్ర, ఆహారశుద్ధి తదితర రంగాలకు సూక్ష్మ, చిన్న, పరిశ్రమలు వెన్నెముకగా ఉన్నాయి.ఎస్ఎంఎస్ఈల కచి్చతమైన సంఖ్యపై స్పష్టత లేకున్నా సుమారు 26 లక్షల మేర ఉంటుందని 2015 నాటి నేషనల్ శాంపిల్ సర్వే అంచనా వేసింది. ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ప్రకారం 8.93 లక్షలు, టీజీ ఐపాస్ కింద 2014 నుంచి ఇప్పటి వరకు ఎస్ఎంఎస్ఈలకు ఇచ్చిన అనుమతులు 22,206 ఉన్నాయి. వీటిలో సూక్ష్మ పరిశ్రమలు సుమారు 90 శాతానికి పైగా ఉండగా, ఎక్కువగా మాన్యుఫాక్చరింగ్, సేవలు, రిటైల్, హోల్‌సేల్ రంగాల్లోనే ఉన్నాయి. రాష్ట్ర పారిశ్రామిక చట్టం టీజీ ఐపాస్ ప్రకారం 2014 నుంచి ఎంఎస్ఎంఈల నమోదులో గణనీయ పురోగతి నమోదవుతూ వస్తోంది. టీజీ ఐపాస్ కింద సూక్ష్మ, చిన్న పరిశ్రమల నమోదులో ఏటా 11 నుంచి 15 శాతం వృద్ధి కనిపిస్తోంది. పెట్టుబడుల్లోనూ భారీ వృద్ధి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. 2014–19లో ఒక్కో పరిశ్రమపై పెట్టుబడి సగటున రూ.కోటి రూపాయలు కాగా, 2023 నాటికి రూ.2.15 కోట్లకు చేరింది. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న సమయంలో ఓ దశలో (2021–22)లో సగటు పెట్టుబడి ఒక్కో పరిశ్రమపై రూ.4 కోట్లకు కూడా చేరుకుంది. ఇదిలా ఉంటే ఎంఎస్ఎంఈల్లో ఎక్కువ శాతం రాజధాని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకృతమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోనే 40 శాతం ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ⇒ రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళలు 25 శాతంలోపే ఉన్నారు. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదైన ప్రతీ వేయిమంది ఎంటర్ప్రెన్యూర్లలో మహిళలు కేవలం 3.1 శాతం మాత్రమే ఉన్నారు. ఎంఎస్ఎంఈ యాజమాన్యాల్లో ఎస్సీలు 14.94 శాతం, ఎస్టీలు 8.75 శాతం, ఓబీసీలు 27.69 శాతం, జనరల్ 48.62 శాతంగా ఉన్నారు. ⇒ 2020–23 మధ్యకాలంలో దేశ వ్యాప్తంగా మూతపడిన సూక్ష్మ, పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే అతి తక్కువగా ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలతో పోల్చి చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లో మూతపడగా తెలంగాణలో కేవలం 231 ఎస్ఎంఎస్ఈలు మాత్రమే మూతపడ్డాయి. ఇదిలా ఉంటే నష్టాలతో మూసివేత బాటలో ఉన్న 1.340 ఎస్ఎంఎస్ఈలను తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది. మూతపడిన మరో 115 చిన్న పరిశ్రమలు తిరిగి తెరుచుకునేలా తోడ్పాటు అందించింది. ⇒ రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ రంగాలతోపాటు అత్యధికంగా ఉపాధి కలి్పస్తున్న రంగాల్లో ఎంఎస్ఎంఈ కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. వీటిలో సేవల రంగంలోనే సుమారు 33 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. తర్వాతి స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ 10 లక్షలు, ఖనిజ, ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో నాలుగేసి లక్షలకుపైగా మంది ఉపాధి కలి్పస్తున్నాయి. ఎంఎస్ఎంఈ పాలసీ –2024 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను మరింత ప్రోత్సహిస్తే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ‘ఎస్ఎంఎస్ఈ పాలసీ–2024 ఆవిష్కరించింది. నూతన పాలసీలో భాగంగా ఎస్ఎంఎస్ఈల ఏర్పాటుకు అందుబాటులో భూమి, రుణ సదుపాయం, ముడి పదార్థాల లభ్యత, కార్మిక నైపుణ్యత, సాంకేతిక వినియోగానికి ప్రోత్సాహం, వ్యాపార విస్తరణకు పలు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తారు. తద్వారా జీఎస్డీపీలో ఎంఎస్ఎంఈల వాటా 10 శాతానికి చేరడంతో పాటు వాటి నమోదులో 15 శాతం వృద్ధి రేటును ప్రభుత్వం ఆశిస్తోంది.ఉపాధి కల్పన, సమగ్రాభివృద్ధి, సాంకేతికత ఆధునీకరణ, ఉత్పాదకత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త పాలసీతో ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాల కల్పనలో 20 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఎంటర్ప్రెన్యూర్లలో 30 శాతం వృద్ధిని ఆశిస్తోంది. పెట్టుబడుల్లో మరో 2 0 శాతం వృద్ధిని కోరుకుంటోంది. -
పెట్టుబడులకు షిప్‌బిల్డింగ్ ఆహ్వానం
గోవా: దేశీయంగా షిప్ బిల్డింగ్, ఓడల మరమ్మతు రంగాలకు ప్రోత్సాహాన్నివ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు దక్షిణ కొరియా, జపాన్ నుంచి పెట్టుబడులతోపాటు.. టెక్నాలజీ బదిలీకావలసి ఉన్నట్లు పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ సెక్రటరీ టీకే రామచంద్రన్ పేర్కొన్నారు. షిప్ రిపేర్ క్లస్టర్లకు దన్నునివ్వడం ద్వారా షిప్పింగ్ సరఫరాను మెరుగుపరచవలసి ఉన్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భారత్ షిప్ బిల్డింగ్ మార్కెట్లో 1 శాతానికంటే తక్కువవాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచ షిప్‌బిల్డింగ్ మార్కెట్లో చైనా, దక్షిణ కొరియా, జపాన్ ఆధిపత్యం వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి దక్షిణ కొరియా, జపాన్‌వైపు పెట్టుబడులుసహా సాంకేతికతల కోసం చూస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా దేశీయంగా నౌకా నిర్మాణం, నౌకల మరమ్మతుల క్లస్టర్లను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. మ్యారీటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(ఎంఎస్డీసీ) 20వ సదస్సుకు హాజరైన సందర్భంగా రామచంద్రన్ విలేకరులతో పలు అంశాలపై స్పందించారు. పలు రాష్ట్రాలలో విస్తరించేలా మెగా షిప్ బిల్డింగ్ పార్క్ ఏర్పాటుకు ఎంఎస్డీసీ యోచిస్తోంది. కాగా.. టెక్నాలజీ, పెట్టుబడులతో రావలసిందిగా ఇప్పటికే దక్షిణ కొరియా, జపాన్‌లను ఆహా్వనించినట్లు రామచంద్రన్ వెల్లడించారు. వీటి ఏర్పాటుకు వీలుగా భూమిని సమకూరుస్తామని హామీ ఇచి్చనట్లు తెలియజేశారు. -
SEMICON India 2024: ప్రపంచమంతా ఇండియా చిప్‌లు
గ్రేటర్ నోయిడా: దేశంలో సెమీ కండక్టర్ల తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ రంగంలో భారీగా పెట్టుబడులు రాబట్టడానికి చర్యలు ప్రారంభించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బుధవారం నోయిడాలో ‘సెమీకాన్–2024’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ రంగం విలువ 150 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. ఈ దశాబ్దం ఆఖరు నాటికి దీన్ని 500 బిలియన్ డాలర్లు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో 60 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ రంగంలో వృద్ధితో సెమీకండక్టర్ రంగం లబ్ధి పొందుతుందని ఉద్ఘాటించారు. దేశంలో ఉపయోగించే ఎల్రక్టానిక్స్ పరికరాలు వంద శాతం ఇక్కడే తయారు కావాలన్నది తమ ధ్యేయమన్నారు. 85 వేల మందికి శిక్షణ భారత్‌లో అమలవుతున్న సంస్కరణలు, స్థిరమైన ప్రభుత్వ విధానాలు పెట్టుబడులకు ఊతం ఇస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలో సెమీకండక్టర్ల తయారీ రంగంలో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో చిప్‌లకు డిమాండ్ తగ్గినా, భారత్‌లో మాత్రం పెరుగుతూనే ఉంటుందని స్పష్టంచేశారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల డిజైనింగ్, తయారీ కోసం 85 వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వీరిలో సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు, ఆర్అండ్డీ నిపుణులు ఉంటారని వెల్లడించారు. ప్రపచంలో ఎక్కడా కనిపించని 3డీ పవర్(త్రి–డైమెన్షనల్ పవర్) ఇండియాలో ఉందని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు. -
దూసుకెళ్తున్న ఆటో రంగం.. మహారాష్ట్రలో వేలకోట్ల పెట్టుబడులు
స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చకాన్‌లో తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏకంగా రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని క్యాబినెట్ మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు.స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా చకాన్ తయారీ కేంద్రంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను తయారు చేయనుంది. కంపెనీలో వెయ్యి కంటే ఎక్కువ ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో టయోటా కిర్లోస్కర్ కూడా రాష్ట్రంలో రూ. 21273 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ 8800 ఉద్యోగాలను కల్పించనుంది.మహారాష్ట్రలో తన కొత్త ఉత్పత్తి యూనిట్ ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తామని, మెరుగైన హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తామని స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా అధికారులు వెల్లడించారు.టయోటా కంపెనీ తమ ఛత్రపతి శంభాజీనగర్‌లో కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇక్కడ కంపెనీ హైబ్రిడ్ వెహికల్స్, ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.One more BIG news for Maharashtra !Huge investments of total₹ 1,20,220 crore approved in today’s Cabinet Sub-Committee Meeting, with CM Eknath Shinde ji !The detailed list of approved investments is as follows:✅Tower Semiconductor with Adani Group at Taloja MIDC, Panvel… pic.twitter.com/DVI9z94WyU— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 5, 2024 -
జోలోప్యాక్వైపు బాలీవుడ్ చూపు
న్యూఢిల్లీ: పర్యావరణహిత(సస్టెయినబుల్) డిస్పోజబుల్ ప్యాకింగ్ సంస్థ జోలోప్యాక్ ఇండియాలో పెట్టుబడులకు పలువురు బాలీవుడ్ అగ్రహీరోలు ఆసక్తి చూపుతున్నారు. సెలబ్రిటీ నటులు ఆమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కరణ్ జోహార్ పబ్లిక్ ఇష్యూకంటే ముందుగా కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా రోజీ బ్లూ ఇండియా యజమాని రసెల్ మెహతా, ఆకాశ్ అంబానీ మామ సైతం కంపెనీలో మైనారిటీ వాటాలను సొంతం చేసుకున్నారు. అయితే ఎవరెంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడికాలేదు. సంస్థ ప్రీఐపీవో రౌండ్లో వాటాలు కొనుగోలు చేసిన జాబితాలో రివర్స్టోన్ క్యాపిటల్‌కు చెందిన దేవనాథన్ గోవిందరాజన్, మినర్వా వెంచర్స్ ఫండ్, నెక్ట్సా ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, ఎన్వీఎస్ కార్పొరేట్ కన్సల్టెన్సీ సరీ్వసెస్, ఓపస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, సరోద్ రియలీ్ట, ఫిరోజ్ ఫామ్స్ అండ్ హోల్డింగ్స్, వినే ఈక్విటీ మార్కెట్ ఎల్ఎల్పీ చేరాయి. కంపెనీ వివరాలివీ.. పుణేకు చెందిన జోలోప్యాక్ ఇండియా ఆర్గానిక్ డిస్పోజబుల్ చాకులు(కట్లెరీ), ఐస్‌క్రీమ్ స్టిక్స్, స్పూన్లు తదితర ఉత్పత్తులను రూపొందిస్తోంది. కంపెనీ ఇప్పటికే పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ఎమర్జ్‌కు ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా 52.86 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. గతేడాది(2023–24) కంపెనీ ఆదాయం రూ. 12 కోట్ల నుంచి రెండున్నర రెట్లు జంప్‌చేసి రూ. 31.5 కోట్లకు చేరింది. నికర లాభం సైతం రూ. 3.5 కోట్ల నుంచి రూ. 6.4 కోట్లకు ఎగసింది. -
భారీ పెట్టుబడుల దిశగా రియల్ ఎస్టేట్
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ పరిశ్రమ డిమాండ్‌కు తగ్గట్టుగా భారీ పెట్టుబడుల దిశగా అడుగులు వేస్తోంది. గడిచిన 19–20 నెలల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సమీకరించడం ఈ డిమాండ్‌కు అద్దం పడుతోంది. 92 శాతం పెట్టుబడులను డెట్ ఇష్యూల జారీ ద్వారానే సమీకరించాయి. అంతేకాదు మరో రూ.28,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇష్యూలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. హౌసింగ్ మార్కెట్లో బూమ్‌కు తోడు స్థిరమైన నగదు ప్రవాహాలు ఈ రంగంలోని కంపెనీలకు అనుకూలిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉండడంతో డెట్ పత్రాల మార్గంలో నిధుల సమీకరణకు మొగ్గు చూపిస్తున్నాయి. 2023, 2024లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్, సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు డెట్ మార్గంలో రూ.95,975 కోట్ల నిధులు సమీకరించాయి. ఇందులో 2023లో రూ.61,600 కోట్లు, ఈ ఏడాది రూ.34,375 కోట్ల చొప్పున సమకూర్చుకున్నాయి. ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణ తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2023లో ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు రూ.124 కోట్లు రాబట్టగా, 2024లో ఇప్పటి వరకు రూ.8,772 కోట్లు సమీకరించాయి. ఇందులో ఐపీ వోలు కూడా ఉన్నాయి. ఇక సమీప కాలంలో సమీకరించనున్న రూ.28,350 కోట్లలో.. డెట్ మార్గంలో రూ.16,635 కోట్లు, రూ.9,695 కోట్లు క్యూఐపీ రూ పంలో, మిగిలినది ఐపీవోల రూపంలో రానుంది.మెరుగైన అమ్మకాలు లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలు కరోనా అనంతరం ఏటా 15–20 శాతం మేర వృద్ధి చెందడంతో నగదు ప్రవాహాలు (నికర నిధుల మిగులు) మెరుగయ్యాయి. అంతేకాదు భవిష్యత్ నగదు ప్రవాహాలు అంచనాలపైనా స్పష్టత ఏర్పడింది. ‘‘ఇళ్ల అమ్మకాలపై చెల్లింపులు సాధారణంగా క్రమానుగతంగా (మైలురాయి చేరికల ఆధారంగా) ఉంటుంది. ఇది రియల్ ఎస్టేట్ సంస్థల నగదు ప్రవాహాలు మెరుగయ్యేలా చేసింది’’అని ఈక్విరస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ విజయ్ అగర్వాల్ తెలిపారు. కొత్త ప్రాజెక్టులను ఆరంభించిన వెంటనే 25–30 శాతం మేర అమ్ముడుపోయే పరిస్థితులు కనిపిస్తున్నట్టు చెప్పారు. దీంతో నగదు ప్రవాహాలపై అంచనాలకు ఇది వీలు కలి్పస్తోందని, దీంతో అవి డెట్ రూపంలోనిధుల సమీకరణకు ఆసక్తి చూపిస్తున్నట్టు వివరించారు. ఈక్విటీఈక్విటీ మార్గమే చౌక మార్గమే చౌక ఈ ఏడాది ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు పెద్ద మొత్తంలో నిధుల సమీకరణకు ఉన్న కారణాలను నిపుణులు వెల్లడిస్తున్నారు. రుణాలపై వడ్డీ రేట్లు పెరిగిపోవడం ఇందులో ప్రధానమైనది. రియల్ ఎస్టేట్ కంపెనీలు రెండంకెల రాబడులను ఆశిస్తుంటాయి. దీంతో ప్రస్తుత తరుణంలో ఈక్విటీ జారీయే మెరుగైన మార్గమని భావించడంతో.. ఈ దిశగా ఆసక్తి నెలకొంది. ఈ నిధులను భూముల సమీకరణపై ఎక్కువగా వెచి్చస్తున్నాయి. 2024 మొదటి ఆరు నెలల్లో 54 భూ లావాదేవీలు నమోదయ్యాయి. వీటి పరిమాణం 1,000 ఎకరాలపైనే ఉంది. గతేడాది 100 భూలావాదేవీలు నమోదు కాగా, వీటి పరిమాణం 2,700 ఎకరాలుగా ఉంది. -
పేటీఎం పేమెంట్స్‌లో పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ సరీ్వసెస్‌లో (పీపీఎస్ఎల్) పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించినట్లు పేటీఎం బ్రాండ్ మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం ఆగస్టు 27న అనుమతులు మంజూరు చేసినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. దీంతో పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్సు కోసం మరోసారి దరఖాస్తు చేసుకోనున్నట్లు వివరించింది. ఈ–కామర్స్ మార్కెట్‌ప్లేస్ సేవలను, పేమెంట్ అగ్రిగేటర్ సరీ్వసులను ఒకే కంపెనీ అందించకూడదనే నిబంధన కారణంగా, 2022 నవంబర్‌లో పీఏ లైసెన్సు కోసం పేటీఎం సమరి్పంచిన దరఖాస్తును రిజర్వ్ బ్యాంక్ తిరస్కరించింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు సంబంధించిన ప్రెస్ నోట్ 3కి అనుగుణంగా మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రెస్ నోట్ 3 ప్రకారం భారత సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు కేంద్రం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. అప్పట్లో పేటీఎంలో చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ అతి పెద్ద వాటాదారుగా ఉండేది. తాజాగా మారిన పరిస్థితుల ప్రకారం కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో, ప్రెస్ నోట్ 3 నిబంధనలకు అనుగుణంగా పేటీఎం మరోసారి పీఏ లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకోనుంది. -
వాస్తవ రూపంలోకి ఓఎన్జీసీ భారీ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) పెట్టుబడులు వాస్తవ రూపంలోకొస్తున్నాయి. బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ పరిధిలో ఈ ఏడాది జనవరిలో 4 చమురు బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించిన ఓఎన్జీసీ తాజాగా అయిదో బావి నుంచి చమురు ఉత్పత్తిని ప్రారంభించింది. కేజీ డీ–5 బ్లాక్‌లోని క్లస్టర్–2లోని ఐదో బావి నుంచి విజయవంతంగా చమురును వెలికి తీసినట్లు ఆదివారం స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలిపింది. ముడి చమురును వెలికి తీయడమే కాకుండా దాన్ని పెట్రోల్, డీజిల్, ఇతర ఉత్పత్తులుగా రిఫైనరీ చేసి ఫ్లోటింగ్ ప్రొడక్షన్, స్టోరేజ్, ఆఫ్ లోడింగ్ వెజల్ (ఎఫ్‌పీఎస్‌వో) ద్వారా సముద్రం నుంచి తీరానికి చేరుస్తోంది. ఇందుకోసం ఆర్మదా స్టెర్లింగ్–వీ ఫ్లోటింగ్ రిఫైనరీని ఓఎన్జీసీ అద్దెకు తీసుకుంది. క్లస్టర్–2లో అభివృద్ధి చేస్తోన్న ఈ బావులు ద్వారా 23.52 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు, 50.70 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి అవుతుందని ఓఎన్జీసీ అంచనా. ఓఎన్జీసీ కేజీ బేసిన్లో మొత్తం చమురు సహజ వాయువు అన్వేషణ కోసం 26 చోట్ల డ్రిల్లింగ్ చేసింది. అందులో 13 చమురు బావులు, 7 సహజ వాయువు బావులను అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కేజీడీ–6 బ్లాక్‌కు కూత వేటు దూరంలోనే ఓఎన్జీసీ కేజీ–డీ5 బ్లాక్‌ను అభివృద్ధి చేస్తోంది. తీరానికి 35 కి.మీ దూరంలో 300–3,200 మీటర్ల లోతులో వీటిని అభివృద్ధి చేస్తోంది. బావులను 3 క్లస్టర్లుగా విభజించిన ఓఎన్జీసీ మొదటి రెండు క్లస్టర్‌ల్లోని బావులను అభివృద్ధి చేస్తోంది. అక్టోబర్ నాటికి గ్యాస్ బావులతో పాటు మార్చి, 2025కి మొత్తం బావుల నుంచి ఉత్పత్తి ప్రారంభించాలన్నది లక్ష్యం. ఇందుకోసం రూ.42,081 కోట్లను వ్యయం చేస్తోంది.గత ప్రభుత్వ అండతో.. తూర్పు తీర ప్రాంతంలో తన పట్టును పెంచుకునేందుకు ఓఎన్జీసీ కృష్ణా గోదావరి బేసిన్‌పై ప్రధానంగా దృష్టి సారించింది. జగన్ సీఎం అవగానే కేజీ–డీ5 బ్లాక్ అభివృద్ధికి మద్దతి వ్వాల్సిందిగా ఓఎన్జీసీ అధికారులు కోరారు. నవంబర్1, 2019లో ఓఎన్జీసీ ఈడీ ఏజే మార్బుల్ నేతృత్వంలోని బృందం అప్పటి సీఎం జగన్‌ను కలిసి కేజీ–డీ5 ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందని చెప్పడమే కాకుండా వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2021కే ఉత్పత్తి ప్రారంభించాలని ఓఎన్జీసీ లక్ష్యంగా పెట్టుకోగా కోవిడ్ పరిణామాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఆ తర్వాత ఓఎన్జీసీ చైర్మన్ సుభాష్ కుమార్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్‌తో కలిసి సెప్టెంబర్22, 2021న నాటి సీఎం జగన్‌ను కలిసి కేజీ బేసిన్లో జరుగుతున్న పనులను వివరించారు. దీంతో 2024 ప్రారంభం నుంచి ఒకొక్క బావి నుంచి ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వస్తున్నాయి. -
రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారత సిమెంట్ పరిశ్రమ 2027 మార్చి నాటికి రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి చేయనుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక తెలిపింది. ఈ కాలంలో 130 మిలియన్ టన్నుల సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యం తోడవుతోందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం ఉన్న సామర్థ్యంలో 20 శాతానికి సమానం అని వివరించింది. క్రిసిల్ నివేదిక ప్రకారం.. ఆరోగ్యకర డిమాండ్ దృక్పథం, మార్కెట్ వాటా కోసం పోటీ ఈ పెట్టుబడులను నడిపిస్తాయి. తక్కువ మూలధన వ్యయాలు, బలమైన బ్యాలెన్స్ షీట్లు కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్స్‌ను స్థిరంగా ఉంచుతాయి. అంచనా వేసిన పెట్టుబడులు గత మూడు ఆర్థిక సంవత్సరాలలో చేసిన క్యాపెక్స్ కంటే 1.8 రెట్లు ఉంటుంది. అయినప్పటికీ తయారీదారుల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్‌లు స్థిరంగా ఉంటాయి. దశాబ్దంలో గరిష్టంగా.. గత మూడు ఆర్థిక సంవత్సరాలలో సిమెంట్ డిమాండ్‌లో ఆరోగ్యకరంగా 10 శాతం వార్షిక పెరుగుదల.. సామర్థ్యం జోడింపును మించిన వృద్ధిని సాధించింది. 2023–24లో వినియోగ స్థాయి ఈ దశాబ్దంలో గరిష్టంగా 70 శాతానికి చేర్చింది. ఇది సిమెంట్ తయారీదారులను ‘క్యాపెక్స్ పెడల్‌ను నొక్కడానికి‘ ప్రేరేపించింది. 2024 మార్చి 31 నాటికి పరిశ్రమ స్థాపిత సిమెంట్ గ్రైండింగ్ సామర్థ్యంలో 80 శాతానికి పైగా కైవసం చేసుకున్న 20 సిమెంట్ తయారీ సంస్థల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందించినట్టు క్రిసిల్ తెలిపింది. డిమాండ్ ఔట్లుక్.. సిమెంట్ పరిశ్రమ మూలధన వ్యయాలు ఇప్పటికీ తక్కువగా ఉన్నాయి. 2025–26, 2026–27 ఆర్థిక సంవత్సరాలలో 0.7–0.9 శ్రేణిలో ఉండొచ్చు. ఇది గత మూడు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఉంది. 2025–2029 ఆర్థిక సంవత్సరాల్లో 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో సిమెంట్ డిమాండ్ ఔట్లుక్ ఆరోగ్యంగా ఉంది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో క్యాపెక్స్‌లో వృద్ధి ప్రధానంగా పెరుగుతున్న డిమాండ్‌తోపాటు.. దేశవ్యాప్తంగా ఉనికిని మెరుగుపరుచుకోవాలనే సిమెంట్ తయారీదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ రేటింగ్స్ ఆఫీసర్ మనీష్ గుప్తా తెలిపారు. సిమెంట్ తయారీదారుల సంఘం (సీఎంఏ) ప్రకారం దేశంలో స్థాపిత సిమెంట్ సామర్థ్యం 670 మిలియన్ టన్నులు. -
గోల్డ్ బాండ్.. రివర్స్!
సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) పథకం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ముఖ్యంగా దిగుమతులను తగ్గించడంతోపాటు.. బంగారంపై పెట్టుబడులను డిజిటల్‌వైపు మళ్లించే లక్ష్యాలతో తీసుకొచ్చిందే సావరీన్ గోల్డ్ బాండ్ పథకం. పసిడిపై పెట్టుబడులను డిజిటల్ రూపంలోకి మళ్లించడంలో కేంద్రం ఒక విధంగా సక్సెస్ అయింది. కానీ, బంగారం దిగుమతులు ఏ మాత్రం తగ్గలేదు. ఎస్జీబీలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రభుత్వ హామీతో కూడిన సాధనం కావడంతో పెట్టుబడులకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎస్‌జీబీల రూపంలో ప్రభుత్వంపై చెల్లింపుల భారం పెరిగిపోయింది. మరోవైపు బంగారం దిగుమతులు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 16 శాతం పెరిగిగి 376 టన్నులకు చేరాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో 325 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకున్నట్టు ప్రపంచ స్వర్ణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఊరిస్తున్న రాబడులు ఎస్‌జీబీలపై రాబడి ఇన్వెస్టర్లను ఊరిస్తోంది. మొదటి ఎస్జీబీ సిరీస్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఎనిమిదేళ్లలో రెట్టింపునకు పైగా రాబడి వచి్చనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది సెపె్టంబర్లో ఒక ఎస్జీబీ మెచ్యూరిటీ (గడువు ముగింపు) తీరనుంది. దీనికి సంబంధించి ఎనిమిదేళ్ల క్రితం గ్రాము జారీ ధర రూ.3,007. నవంబర్‌లో మెచ్యూరిటీ తీరనున్న ఎస్‌జీబీకి సంబంధించి గ్రాము జారీ ధర రూ.3,150. ప్రస్తుతం గ్రాము ధర సుమారు రూ.7వేల స్థాయిలో ఉంది. అంటే ఎనిమిదేళ్లలోనే 130 శాతం రాబడి వచ్చింది. పైగా ఇటీవలే బంగారం దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్రం 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ధరలు కొంత దిగొచ్చాయి. ఎస్‌జీబీలపై చెల్లింపుల భారం తగ్గించుకునేందుకే కేంద్రం సుంకం తగ్గించిందన్న అభిప్రాయాలు విశ్లేషకుల నుంచి వ్యక్తమయ్యాయి. పైగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంత వరకు ఒక్క ఎస్జీబీ ఇష్యూని కూడా కేంద్రం చేపట్టలేదు. సెపె్టంబర్లో తీసుకురావచ్చన్న అంచనాలున్నాయి. ఇటీవల ధరలు తగ్గడంతో ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి మరింత స్పందన రావచ్చని చాయిస్ బ్రోకింగ్ కమోడిటీ అనలిస్ట్ ఆమిర్ మక్దా అభిప్రాయపడ్డారు. దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే వారు, స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల నుంచి సైతం కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. -
తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/శ్రీసిటీ (వరదయ్యపాళెం): వివిధ పరిశ్రమలకు వేదికగా ఉన్న శ్రీసిటీ నుంచి తక్కువ ఖర్చుతో ఉత్పత్తులు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుగా పారిశ్రామిక రంగం వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఇప్పుడు సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో సోమవారం వివిధ పరిశ్రమలకు చంద్రబాబు సోమవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు.శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించి మరో 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 5 కంపెనీలతో రూ.1,213 కోట్ల పెట్టుబడికి కొత్తగా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తంగా 15,280 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. దీంతోపాటు ఫైర్ స్టేషన్‌ను ప్రారంభించి, పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీసిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీల సీఈవోలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులపై చర్చించారు. అత్యుత్తమ ఎకనమిక్ జోన్‌గా శ్రీసిటీ.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఈరోజు ఒకేచోట 30 కంపెనీల ప్రతినిధులతో భేటీ కావడం గొప్ప విషయం. శ్రీసిటీలో 220 కంపెనీల ఏర్పాటుకు అవకాశం ఉంది. శ్రీసిటీలో 4.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించడం, 4 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించడం గొప్ప విషయం. శ్రీసిటీని స్పెషల్ ఎకనమిక్ జోన్‌గా గుర్తించాం. 30 దేశాలు శ్రీసిటీలో పరిశ్రమల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంపద çసృష్టి.. సంక్షేమం, సాధికారతకు దోహదపడుతుంది.చెన్నై, కృష్ణపట్నం, తిరుపతికి శ్రీసిటీ దగ్గరగా ఉంది. శ్రీసిటీని అత్యుత్తమ ఎకనమిక్ జో¯Œన్గా తీర్చిదిద్దాలనేదే నా ఆలోచన. నేను 1995లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలను ప్రారంభించాను. అప్పట్లోనే విజన్ 2020కి రూపకల్పన చేసి అమలు చేశా. పెట్టుబడులు రాబట్టేందుకు పలు దేశాల్లో పర్యటించా. భారత్‌ను ఐటీ ప్రపంచపటంలో నిలిచేలా చేస్తుందని ఆనాడే చెప్పా. ఈరోజు దాని ఫలితాలు అందరూ చూస్తున్నారు’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి.జి.భరత్, వంగలపూడి అనిత, డీజీపీ, పలు కంపెనీల ప్రతినిధులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సోమశిల ప్రాజెక్టుకు పరిరక్షణకు చర్యలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సోమవారం సోమశిల ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. రాష్ట్రంలో రైతులకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామన్నారు. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏటా రూ.20 వేల సాయం అందిస్తామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టును సద్వినియోగం చేసుకునేలా దాని పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమశిల జలాశయం 1988–89లోనే అప్పటి సీఎం ఎన్టీ రామారావు 75 టీఎంసీలు చేశారని చంద్రబాబు మాట్లాడడం చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. వైఎస్సార్ హయాంలోనే 72 టీఎంసీలకు సోమశిల చేరింది. -
‘ఫ్యూచర్ సిటీ’లో పెట్టుబడులు పెట్టండి
గచ్చిబౌలి: తెలంగాణ అభివృద్ధిలో క్షత్రియులు భాగస్వామ్యం కావాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే ‘ఫ్యూచర్‌సిటీ’లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు నగరాలుగా ఉందని.. కొత్తగా అత్యాధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్‌సిటీ నిర్మించనున్నామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో క్షత్రియ సేవాసమితి (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ఆత్మీయ సమావేశం జరిగింది. ఇందులో రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ శివార్లలో 1960లోనే చిన్న గ్రామంగా ఉండే కొంపల్లి ప్రాంతానికి క్షత్రియులు వలస వచ్చి, పెట్టుబడులు పెట్టి ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఫార్మా, వైద్య, విద్య, మీడియా రంగాల్లో రాజులు పెట్టుబడులు పెట్టి విజయం సాధించారన్నారు. సినీ రంగంలో కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా ఉండలేమని, బాహుబలి ప్రభాస్ కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో గర్వించే స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు. అదేవిధంగా రాంగోపాల్‌వర్మ ఎంతో ఎదిగారని చెప్పారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి జీవం పోస్తాం తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని రాజులే ప్రారంభించారని సీఎం గుర్తు చేశారు. ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపా రు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులకు ఉన్నత విద్య, నైపుణ్య శిక్షణ ఇవ్వడానికే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నూతన విధానానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు వస్తోందన్నారు. క్షత్రియ భవన్‌కు స్థలం ఇస్తాం హైదరాబాద్‌లో క్షత్రియ భవన్ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని కేటాయిస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అందులో రాజుల దర్పం కనిపించేలా దివ్యమైన భవన నిర్మాణ బాధ్యత క్షత్రియ సమితి తీసుకోవాలన్నారు.క్షత్రియులకు అండగా ఉంటామని, రాజకీయంగా ఎదిగేలా ముందు పార్టీ లో పదవులు ఇచ్చి, అనంతరం పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పా రు. పార్టీలో చేరితే నాలుగేళ్లలో నాయకులుగా మార్చి, తర్వా త ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేలా ప్రొత్సహిస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు క్రియాశీల పాత్ర పోషించారని ప్రశంసించారు.తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: శ్రీనివాస వర్మరాష్ట్ర విభజన సమయంలో తన్ని తరిమేస్తామన్నా ఎక్కడికీ వెళ్లబోమని క్షత్రియులు చెప్పారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. గోదావరి, వైజా గ్, చిత్తూరు జిల్లాల క్షత్రియులు అక్కడి పొలాలను అమ్ము కుని వచ్చి.. ఇక్కడ భూములు కొన్నారని, పరిశ్రమలు నెలకొల్పారని గుర్తు చేశారు. కష్టాన్ని నమ్ముకున్న క్షత్రియులు తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.హైదరాబాద్ క్షత్రియుల కర్మ భూమి అని.. ఇక్కడికి వచ్చిన క్షత్రియులు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని కర్ణాటక మంత్రి నడింపల్లి బోసురాజు చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి అభివృద్ధిలో సహకారం అందించాలని క్షత్రియులకు పిలుపునిచ్చారు. కాగా.. క్షత్రియులకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని, క్షత్రియభవన్కు స్థలం ఇవ్వాలని, పేద క్షత్రియులకు రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌ను క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు విజ్ఞప్తి చేశారు. -
రియల్టీలో సిప్ చేద్దామా!
వాణిజ్య ప్రాపరీ్టపై పెట్టుబడి పెట్టాలంటే సామాన్య ఇన్వెస్టర్లకు అయ్యే పనేనా..! ఎక్కడ చూసినా ధరలు గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో.. కొనాలంటే పెద్ద మొత్తమే పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అయితే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే క్రమానుగత పెట్టుబడి (సిప్) విధానంలో వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయాలన్న ఆకాంక్షలకు ఆచరణ మార్గమే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు). వీటిలో ఇన్వెస్ట్ చేయడం ఎలా? వచ్చే ప్రయోజనం ఎంత మేర? తదితర వివరాలను అందించే కథనమే ఇది. రీట్ అంటే...?రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్లు) పేరులో ఉన్నట్టుగానే.. వివిధ రకాల వాణిజ్య ప్రాపరీ్టలపై పెట్టుబడులు పెడుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాదిరే ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు సమీకరిస్తుంటాయి. వాటిని వాణిజ్య ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేస్తాయి. ఆయా ప్రాపరీ్టలను అద్దెకు, లీజుకు ఇస్తుంటాయి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తిరిగి వాటాదారులకు క్రమం తప్పకుండా పంచుతుంటాయి. ఆఫీసులు, మాల్స్, ఇండ్రస్టియల్ పార్క్‌లు, వేర్‌హౌస్‌లు, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్ సెంటర్లు తదితర వసతులపై రీట్లు ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ అయితే బాండ్లు, గోల్డ్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఉదాహరణకు ఓ పది మంది స్నేహితుల బృందం ఉందనుకుందాం. తలో రూ.10 లక్షలు వేసుకుని రూ.కోటితో ఒక వాణిజ్య భవనాన్ని సమకూర్చుకున్నారు. దాన్ని ఓ కార్పొరేట్ సంస్థ కార్యాలయానికి లీజుకు ఇచ్చారు. లీజు రూపంలో వచ్చే మొత్తం నుంచి 90 శాతాన్ని పది మంది డివిడెండ్ కింద పంచుకుంటారు. రీట్‌లో ఇదే మాదిరి జరుగుతుంది. కాకపోతే రీట్ల నిర్వహణలో ఇలాంటి వాణిజ్య ఆస్తులు పెద్ద సంఖ్యలో ఉంటాయి. అమెరికా, జపాన్ తదితర దేశాల్లో రీట్లకు ఎంతో ఆదరణ ఉంది. కానీ మన దేశంలో వీటిపై అంత అవగాహన లేదు. అందుకే ఇవి పెద్దగా ప్రాచుర్యానికి నోచుకోలేదు. ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలుగా వీటికి తగినంత ప్రచారం కల్పించేందుకు సెబీ తన వంతు కృషి చేస్తోంది. స్టాక్స్, ఫండ్స్ మాదిరే రీట్లు కూడా సెబీ పర్యవేక్షణ కిందకే వస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం రీట్లు 80% పెట్టుబడులను అద్దెను సమ కూర్చే ఆస్తులపైనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరో 20% మేర పెట్టుబడులను నిర్మాణంలోని ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే, వచ్చే అద్దె ఆదాయంలో నిర్వహణ వ్యయాలు, పన్నులు పోను మిగిలిన నికర మొత్తం నుంచి 90 శాతాన్ని ఇన్వెస్టర్లకు పంపిణీ చేయాలి. ప్రయోజనాలు... అద్దె ఆదాయంరీట్లకు లీజు రూపంలో ఆదాయం వస్తుంటుంది. దీన్ని వాటాదారులకు డివిడెండ్ రూపంలో పంపిణీ చేస్తాయి. సాధారణంగా ప్రతి మూడేళ్లకోసారి 15 శాతం అద్దె పెంచాలన్న నిబంధనతో లీజు ఒప్పందాలు చేసుకుంటుంటాయి. దీంతో వాటాదారులకు వచ్చే డివిడెండ్ ఆదాయం కూడా కాలక్రమేణా పెరుగుతూ వెళుతుంది. కొత్త లీజు సమయంలో అప్పటికి పెరిగిన మార్కెట్ ధరల ప్రకారమే ఒప్పందాలు చేసుకుంటుంటాయి. వడ్డీ ఆదాయం రీట్లు తమవద్దనున్న మిగులు నిధులపై వడ్డీ రాబడిని పొందుతుంటాయి. లేదా ప్రాపర్టీ లీజుదారులకు రుణాలు సమకూర్చడం ద్వారా వాటిపై ఆదాయం పొందుతాయి. ఈ రూపంలోనూ వాటాదారులకు ఆదాయం లభిస్తుంది. మన దేశంలో రీట్లు ప్రధానంగా టైర్–1 పట్టణాల్లోని ప్రాపరీ్టలపైనే ఎక్కువ పెట్టుబడులు పెట్టి ఉన్నాయి. కనుక వీటి ధరలు మరింత పెరిగేందుకు ఆస్కారం ఉంది. పనితీరు భిన్నంస్టాక్స్, బాండ్లు తదితర సాధనాలకు భిన్నంగా రీట్ స్పందన ఉంటుంది. అంటే స్టాక్స్ లేదా బాండ్ల ధరలు పడిపోతే రీట్ల ధరలు కూడా పడిపోవాలనేమీ లేదు. ఆ సమయంలో ఇవి స్థిరంగా ఉండొచ్చు. లేదా లాభాలను ఇవ్వొచ్చు. ఒకవేళ రీట్ల ధరలు కూడా తగ్గినా.. ఇతర సాధనాల స్థాయిలో ఉండదు. ఈ విధంగా పెట్టుబడుల్లో కొంత భాగానికి రిస్క్ తగ్గుతుంది. పెట్టుబడి విలువ వృద్ధిరీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల విలువలు కొంత కాలానికి సహజంగా పెరుగుతుంటాయి. తమ నిర్వహణలోని ఆస్తుల విలువలను ఎప్పటికప్పుడు రీట్లు మదింపు చేసుకోవాలి. దీంతో పెరిగిన ప్రాపరీ్టల విలువ రీట్ యూనిట్ విలువపై ప్రతిఫలిస్తుంది. అలాగే, ఆరి్థకంగా లాభదాయకం లేని, లీజు పరంగా అంత డిమాండ్ లేని ప్రాపరీ్టలను విక్రయించి, డిమాండ్ ఉన్న ప్రాంతాల్లోని ప్రాపరీ్టలపై ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇది కూడా పెట్టుబడి విలువ వృద్ధికి, డివిడెండ్ వాటా పెంపునకు దారితీస్తుంది. అంతేకాదు, కొంత మేర రుణాలు తీసుకుని కొత్త ప్రాపరీ్టలపై వెచి్చంచేందుకు సైతం వీటికి వెసులుబాటు ఉంటుంది. కనుక కాలక్రమంలో, కంపెనీ నగదు ప్రవాహాలు, నికర విలువ పెరుగుతున్న కొద్దీ.. కొత్త ప్రాపర్టీలను అదనంగా సమకూర్చుకుంటాయి. ఆ విధంగానూ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతుంది. ఆదాయం పెరుగుతుంది. మెరుగైన లిక్విడిటీభౌతిక ప్రాపర్టీ కొనుగోలు చేస్తే విక్రయించడానికి చాలా సమయం తీసుకోవచ్చు. అదే రీట్లను పనిదినాల్లో ఏ రోజు అయినా విక్రయించుకుని, మరుసటి రోజే ఆ మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో పొందొచ్చు. ఇవి స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ అయి ఉంటాయి కనుక లిక్విడిటీ సమస్య ఉండదు.లిస్టెడ్ రీట్లు... బ్రూక్‌ఫీల్డ్ ఇండియా రియల్ ఎస్టేట్ ట్రస్ట్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ రీట్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ రీట్లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు లిస్ట్ అయి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రైమాసికానికి ఒకసారి డివిడెండ్‌ను పంపిణీ చేస్తున్నాయి.ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? రీట్‌లో పెట్టుబడులకు ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాలు తప్పనిసరిగా ఉండాలి. స్టాక్స్‌ను కొనుగోలు చేసినట్టుగానే రీట్ యూనిట్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇవి డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. రాబడులు... వాణిజ్య రియల్ ఎస్టేట్‌పై వార్షిక రాబడులు 8–10 శాతం మధ్య ఉంటాయి. గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్‌పై రాబడులు ఒక్కోసారి 15 శాతం స్థాయిలో ఉంటాయి. కానీ, మన దేశంలో రీట్‌లపై ప్రస్తుత రాబడులు 10 శాతం లోపే ఉన్నాయి. మన ఆరి్థక వ్యవస్థ రానున్న రోజుల్లో మరింత విలువను సంతరించుకుంటుందని నిపుణుల అంచనా. దీనికితోడు ఈ మార్కెట్ పరిణతి చెందిన కొద్దీ రీట్‌లపై వార్షిక రాబడులు 10 శాతం, అంతకంటే ఎగువ స్థాయికి చేరుకుంటాయని నిపుణుల అంచనా. 2022–2024 మధ్య రీట్ల నుంచి డివిడెండ్ రాబడి 6–9 శాతం మధ్య ఉన్నట్టు, పెట్టుబడి విలువలో 12–18 శాతం మేర వృద్ధి ఉన్నట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక చెబుతోంది.ఇవి గమనించాలి..→ రీట్లు స్వల్పకాలానికి కాకుండా దీర్ఘకాలం కోసమే (ఐదేళ్లు అంతకుమించిన కాలం) పరిశీలించడం సూచనీయం. అప్పుడు మూలధన పెట్టుబడి వృద్ధి సాధ్యపడుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ సైక్లికల్‌గా ఉంటుంది. స్వల్పకాలంలో రీట్ల ధరలు స్టాక్స్ మాదిరే ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొంత మేర హెచ్చుతగ్గులకు గురికావచ్చు. → మనదేశంలో ఇప్పటి వరకు కేవలం నాలుగు రీట్లే లిస్ట్ అయి ఉన్నాయి. ఇందులో నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ మాత్రం రిటైల్ మాల్స్ ఆస్తులపైనే అధిక శాతం ఇన్వెస్ట్ చేసింది. మిగిలిన రీట్లు ఆఫీస్ ప్రాపరీ్టలపై ఇన్వెస్ట్ చేసేవి. పనితీరు పోల్చి చూసేందుకు పరిమిత అవకాశాలే ఉన్నాయి. → ఇన్వెస్ట్ చేసే ముందు ఆయా రీట్ల పరిధిలోని ప్రాపరీ్టలలో ఆక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) చూడాలి. లీజుకు తీసుకున్న కంపెనీలు అన్నీ ఒకే రంగంలో కాకుండా భిన్న రంగాలకు చెందినవి అయితే రిస్క్ వైవిధ్యం అవుతుంది. రీట్ల నిర్వహణలోని ప్రాపరీ్టల నాణ్యత, డిమాండ్ చూడాలి. → ఆర్థిక సంక్షోభ సమయాల్లో, కరోనా వంటి విపత్తుల సమయాల్లో ఆఫీస్ లీజింగ్ మార్కెట్‌పై ప్రభావం పడొచ్చు. అలాంటి సందర్భాల్లో డివిడెండ్ పంపిణీ, మూలధన పెట్టుబడి విలువ ప్రభావితం కావచ్చు. → మన దగ్గర స్టాక్స్‌తో పోలిస్తే రీట్లకు ప్రాచుర్యం తక్కువ. కనుక స్టాక్ ఎక్సే్చంజీల్లో వీటి లిక్విడిటీ (ట్రేడింగ్ వ్యాల్యూమ్) తక్కువగా ఉంటుంది. → తమకు స్థిరమైన ఆదాయం కావాలని కోరుకునే వారు రీట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా తమ మొత్తం పెట్టుబడుల్లో 10 శాతం వరకు కేటాయించుకోవచ్చన్నది నిపుణుల సూచన. పన్ను బాధ్యత... రీట్ పెట్టుబడులపై డివిడెండ్ రూపంలో వచ్చే ఆదాయంపై పన్ను కొంత భిన్నంగా ఉంది. బ్రూక్‌ఫీల్డ్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్, మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్లు రాయితీతో కూడిన పన్ను రేటును ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 115బీఏఏ కింద ఎంపిక చేసుకోలేదు. ఇవన్నీ స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)పైనే ఇన్వెస్ట్ చేశాయి. కనుక ఇవి పంపిణీ చేసే డివిడెండ్‌పై పన్ను లేదు. ఒకవేళ ఎస్పీవీలు రాయితీ రేటును ఎంపిక చేసుకుంటే, అప్పుడు అవి పంపిణీ చేసే డివిడెండ్ పన్ను పరిధిలోకి వస్తుంది. ఇన్వెస్టర్ తనకు వర్తించే శ్లాబు ప్రకారం దీనిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. డివిడెండ్‌పై పన్ను వర్తించేట్టు అయితే, రీట్లు 10 శాతం టీడీఎస్ కింద తగ్గించి ఆదాయపన్ను శాఖకు జమ చేస్తాయి. ఇన్వెస్టర్లు తమ వార్షిక పన్ను రిటర్నుల్లో దీన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. సొంత ప్రాపరీ్టలపై రీట్లకు వచ్చే ఆదాయం నుంచి వాటాదారులకు డివిడెండ్ పంపిణీ చేసినా, ఎస్పీవీలకు ఇచ్చిన రుణాలపై రీట్లకు వచ్చే ఆదాయాన్ని వాటాదారులకు పంపిణీ చేసిన సందర్భాల్లోనూ.. ఇన్వెస్టర్ వ్యక్తిగత ఆదాయానికే కలుస్తుంది. ఇక రీట్లలోని పెట్టుబడులకు స్టాక్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాదిరే పన్ను నిబంధనలు వర్తిస్తాయి. విక్రయించినప్పుడు వచ్చే లాభంపై మూలధన లాభాల పన్ను చెల్లించాలి. ఏడాదిలోపు విక్రయించగా వచ్చిన లాభంపై 20 శాతం పన్ను, ఏడాది ముగిసిన తర్వాత విక్రయించినప్పుడు వచి్చన లాభం మొదటి రూ. లక్ష తర్వాత మొత్తంపై 12.5 శాతం చెల్లించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పెట్టుబడులు రాత్రికి రాత్రే వచ్చి పడవ్
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను, తమ అధికారులు చేసుకున్న అవగాహన ఒప్పందాల (ఎంవోయూ)తో రాత్రికి రాత్రే వేలకోట్ల పెట్టుబడులు వచ్చిపడవని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఆ ఎంవోయూలపై నిరంతరం శ్రమిస్తేనే అవి పెట్టుబడుల రూపంలో వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని స్పష్టం చేశారు. అయినా వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని తాము అమెరికా, దక్షిణ కొరియా వెళ్లలేదని వ్యా ఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలను ప్ర ముఖ పరిశ్రమల యాజమాన్యాలతో పంచుకున్నామని తెలిపారు. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. శనివారం సచివాలయంలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో అధికారి శ్రీనివాస్, ప్రజా సంబంధాల కమిషనర్ హనుమంతరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ అభివృద్ధిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపడమే లక్ష్యంగా తమ పర్యటన సాగిందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ (భవిష్యత్ రాష్ట్రం)గా దిగ్గజ కంపెనీల ముందు ఆవిష్కరించామన్నారు. పలు సంస్థలు అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు (జీసీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయని, 11 రోజుల పర్యటనలో మొత్తం 19 ఒప్పందాలు, 50 మందితో వ్యాపార సమావేశాలు జరిపామని తెలిపారు. మొత్తం రూ. 31,500 కోట్ల పెట్టుబడులతో 30,750 మందికి ఉపాధి కల్పించడానికి ఆయా సంస్థలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. వీటిల్లో ముఖ్యంగా కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీయంఆర్, ట్రైనెట్, ట్రైజిన్, కారి్నంగ్, ఆమ్జెన్, జోయ్టిస్, థెర్మో ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్, స్వచ్ఛ్‌బయో, వాల్‡్షకర్ర హోల్డింగ్స్ లాంటి సంస్థలు ఉన్నాయని వెల్లడించారు. ఇవి కాకుండా హ్యుందాయ్ మోటార్స్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు చేస్తోందని, దుస్తులు, ఫ్యాషన్, కాస్మోటిక్స్ సంస్థలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చాయని తెలిపారు. గతంలో దావోస్‌లో రూ.40,230 కోట్ల పెట్టుబడులకు తమ ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇటీవలి కాలం వరకు ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టుబడులను ఆహ్వానించడానికి, ప్రభుత్వ ఆలోచనలు పంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదనే అభిప్రాయం ప్రవాస భారతీయులు, పలు పరిశ్రమల యజమానుల్లో వ్యక్తమైందని మంత్రి చెప్పారు. సీఎం సోదరుడు అయితే ఒప్పందం కుదుర్చుకోకూడదా? సీఎం సోదరుడి కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నంత మాత్రాన వారికి రాయితీల కల్పన, భూముల ధారాదత్తం లాంటివి చేయలేదు కదా అని శ్రీధర్‌బాబు అన్నారు. 30 సంవత్సరాలుగా అమెరికాలో ఉండి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ పెట్టడానికి వస్తామంటే ఎందుకు వద్దనాలని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల బంధువులు పెట్టుబడులు పెడతామన్నా తాము స్వాగతిస్తామన్నారు. గత ప్రభుత్వం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాల్లో కేవలం 30 నుంచి 35 శాతం పరిశ్రమలు మాత్రమే ఏర్పాటయ్యాయని, వారు పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో ప్రజలే చెప్పాలని అన్నారు. తాము మాత్రం సంవత్సర కాలంలో ఈ ఎంవోయూలను పెట్టుబడుల రూపంలోకి మార్చడానికి ప్రయతి్నస్తామని చెప్పారు. త్వరలోనే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక పాలసీ తీసుకుని వస్తుందని తెలిపారు. -
ఫోర్త్‌సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లతోపాటు అన్నిరంగాల్లో విస్తరించే సత్తా హైదరాబాద్‌కు ఉందని అంతర్జాతీయ దిగ్గజ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్‌లియూ అన్నారు. త్వరలోనే తన బృందంతో కలిసి నగరాన్ని సందర్శిస్తానని తెలిపారు. యంగ్‌లియూ నేతృత్వంలోని ఫాక్స్‌కాన్ ప్రతినిధి బృందం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆయన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం సమావేశమైంది. నగరానికి ఉన్న చరిత్ర.. పారిశ్రామిక సంస్థల విస్తరణకు ఉన్న అనుకూలత, అద్భుతమైన వాతావరణ పరిస్థితులను సీఎం రేవంత్ ఫాక్స్‌కాన్ బృందానికి వివరించారు.430 ఏళ్ల కింద పునాదిరాయి పడిన హైదరాబాద్‌లో అభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకే తాము ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టు ఫ్యూచర్ సిటీ పేరుతో నాలుగోనగరానికి (ఫోర్త్ సిటీ) రూపకల్పన చేస్తున్నామని సీఎం రేవంత్ వివరించారు. ఫోర్త్ సిటీలో విద్య. వైద్యం, క్రీడా, ఎలక్ట్రానిక్స్–ఎలక్ట్రికల్, స్కిల్స్..ఇలా బహుముఖంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్ సంస్థ పరిశ్రమలు పెట్టేందుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వడంతోపాటు అవసరమైన మద్దతు అందజేస్తామని సీఎం ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు హామీ ఇచ్చారు. ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇటీవల సీఎం రేవంత్ నేతృత్వంలో తమ బృందం అమెరికా, దక్షిణకొరియాలో పర్యటించి దిగ్గజ పారిశ్రామిక సంస్థలతో జరిపిన చర్చలు, చేసుకున్న ఒప్పందాలను మంత్రి శ్రీధర్ బాబు యంగ్లియూకి వివరించారు.ఫోర్త్ సిటీ రూపకల్పనలో ముఖ్యమంత్రి దార్శనికత, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని యంగ్‌లియూ రేవంత్‌ను అభినందించారు. తాను సాధ్యమైనంత త్వరలోనే హైదరాబాద్‌ను సందర్శిస్తానని.. అంతకుముందే తమ చీఫ్ క్యాంపస్ ఆపరేషన్స్ ఆఫీసర్ క్యాథీ యాంగ్, సంస్థ భారత దేశ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని బృందం హైదరాబాద్ వస్తుందని చెప్పారు.ప్రస్తుత ప్రపంచానికి అవసరమైన స్కిల్స్‌ను యువతకు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఫాక్స్‌కాన్ చైర్మన్‌కు వివరించారు. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు జయేశ్ రంజన్, డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి , ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డిలతో పాటు డాక్టర్ ఎస్.కే. శర్మ, బాబ్చెన్, జొవూ, సూషొకూ, సైమన్సంగ్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు కాలిఫోర్నియా పెట్టుబడులు: సీఎం రేవంత్‌రెడ్డిపై ప్రశంసలు
తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ & కాలిఫోర్నియాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్ర గొప్పదని మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డి ప్రశంసించారు. కాలిఫోర్నియా, ఫ్రీమాంట్‌లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో కమ్యూనిటీ రిసెప్షన్ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ప్రొక్లమేషన్ కూడా అందించారు.ఈ కార్యక్రమంలో కాన్సులేట్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి , మిల్పిటాస్ సిటీ కమిషనర్ రఘు రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు.. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులకు కమిషనర్ రఘు రెడ్డి హామీ ఇచ్చారు.తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాకు చెందిన రఘురెడ్డి శాంటా క్లారా కౌంటీ కమీషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భారతదేశానికి చెందిన రఘురెడ్డి అక్కడ మొదటి తెలుగు కమిషనర్ కావడం విశేషం. ఈయన వచ్చే ఏడాది సిటీ మేయర్ పదవిని చేపట్టాలని పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు 800 మందికిపైగా ప్రవాసులు పాల్గొన్నారు. -
మొత్తం రూ.36 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: సుమారు పది రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పలు ప్రపంచ స్థాయి కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అమెరికా కంపెనీలు రూ.31,502 కోట్ల పెట్టుబడులు, దక్షిణ కొరియా కంపెనీలు రూ.4,500 కోట్ల పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపాయి. మొత్తంగా 25 కంపెనీల నుంచి రూ.36 వేల కోట్ల పెట్టుబడులను తెలంగాణ సాధించింది. దీంతో ఆయా రంగాల్లో కొత్త సంస్థలు, కొత్త పరిశ్రమలతో వేలాది కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. సరికొత్త రికార్డు: ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులోనూ సీఎం పాల్గొన్నారు. ఆ సందర్భంగా జరిగిన ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు సాధించినట్లు తెలిపారు. ఈ విధంగా 8 నెలల్లోనే మొత్తం రూ.76,232 కోట్ల పెట్టుబడుల సాధన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు నమోదు చేసిందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ!రెండురోజుల దక్షిణ కొరియా పర్య టనలో సీఎం రేవంత్ బృందం ప్రధానంగా ఆటోమోటివ్, ఎలక్ట్రాని క్స్, సెమీ కండక్టర్, ఇంధన స్టోరేజీ, టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తగినంత సహకారం అందిస్తుందని భరోసా ఇవ్వడంతో అమెరికన్ కంపెనీల తరహాలోనే కొరియన్ కంపెనీల నుంచి భారీ స్పందన లభించినట్లు వివరించాయి. కాగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించిన సీఎం అదే తరహాలో రాష్ట్రంలోనూ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతంశంషాబాద్: బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ బృందానికి ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, కాలె యాదయ్య, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ తదితరులు ఘన స్వాగతం పలికారు. వీఐపీ లాంజ్‌లో పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా సీఎం అందరికీ అభివాదం చేస్తూ పుష్పగుచ్ఛాలు స్వీకరించారు. కాగా తమ పర్యటన విజయవంతమైందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్ర వారం ఢిల్లీ వెళ్లనున్నారు. అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన సందర్భంగా పార్టీ పెద్దలను కలిసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. అయితే వీలునుబట్టి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలతో ఆయన భేటీ అవుతారని, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్‌ను కలుస్తారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై వీరితో చర్చలు జరిపే అవకాశముందని సమాచారం. పీసీసీకి కొత్త అధ్య క్షుడిపై ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయి. కానీ ఎటూ తేలని నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీని యర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను కూడా ఢిల్లీకి పిలవనున్నట్లు సమాచారం. బీసీ లేదా లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలున్నాయనే చర్చ జరు గుతుండగా, తాజాగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ మంత్రి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇలావుండగా 17–20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఈ సందర్భంగా లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. రైతు, విద్య, మానవ హక్కులు, బీసీ కమిషన్ల పేర్లు కూడా ఫైనల్ అవుతాయని తెలుస్తోంది. -
హైదరాబాద్ మా బలం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోనే ఎవరి వద్దా లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది. ఇక్కడ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వంటి మౌలిక వసతులు, వాతావరణం, శాంతిభద్రతలు దేశంలో మరెక్కడా లేవు. మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనలకంటే ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం అమెరికా, దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులతో వస్తే భద్రత, లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది. పెట్టుబడులతో ఎవరు వచ్చినా రక్షణ ఉంటుందని హామీ ఇస్తున్నా. మీకు అవసరమైన అనుమతులు, వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మా పోటీ కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి మహా నగరం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా పాలసీల్లో పారదర్శకత పాటిస్తాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నాం’అని రేవంత్ చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అభివృద్ధి ‘కులీ కుతుబ్‌షాహీలు మొదలుకుని హైదరాబాద్ నగరం 430 ఏళ్లుగా రాజకీయ భిన్నాభిప్రాయాలను అధిగమిస్తూ అభివృద్ధి చెందుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా భేదాభిప్రాయాలు లేనందునే ప్రపంచంతో పోటీ పడుతోంది. నిరుద్యోగ సమస్యకు సాంకేతిక నైపుణ్యంతో పరిష్కారం చూపాలనే రాజీవ్‌గాంధీ ఆలోచన మేరకు 1992లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నిర్మించారు. వైఎస్ హయాంలో మూడో నగరంగా సైబరాబాద్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు అవసరాలను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు తీర్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తాం. చైనా బయట పెట్టుబడుల కోసం చూస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది. ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు భాగస్వాములు కావాలి..’అని సీఎం అన్నారు. ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు ‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. త్వరలో మరిన్ని పెట్టుబడుల సాధన దిశగా సమావేశాల నిర్వహణ కోసం ‘ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్’ఏర్పాటు చేస్తాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా మార్చేందుకు హైదరాబాద్‌ను కోర్ అర్బన్ ఏరియాగా, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు నడుమ ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, రీజినల్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా వర్గీకరిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ కేంద్రంగా, రూరల్ తెలంగాణలోని ప్రాంతాలను ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలుగా అభివృద్ధి చేస్తాం..’అని రేవంత్ చెప్పారు. 57 వేల మంది హైదరాబాద్ నుంచే: కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ ‘హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను కేవలం ఆరు నెలల్లో సిద్ధం చేసి ప్రారంభిస్తున్నాం. 2002 నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో కాగ్నిజెంట్ భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.56 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 70 శాతం అంటే 2.40 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. వీరిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా, 39 శాతం మంది మహిళలే కావడం గమనార్హం..’అని కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాగ్నిజెంట్ ప్రతినిధులు నారాయణన్, జాన్కిమ్, కేథరిన్ డియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమరరాజా’ వెళ్లిపోతే విపత్తే: కేటీఆర్ హెచ్చరిక
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రూ. 9500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకుగాను అమర్‌రాజాను ఒప్పించేందుకు చాలా కష్టపడ్డామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది పాలసీ కొనసాగింపును నిర్ధారించాల్సిన సంస్థగా వ్యవహరించాలని సూచించారు.గతంలో తమకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం నిలబెట్టుకోకపోతే తెలంగాణ నుంచి వెళ్లిపోతామని అమర్‌రాజా కంపెనీ చైర్మన్ గల్లాజయదేవ్ అన్నట్లు వచ్చిన వార్తలపై ఆదివారం(ఆగస్టు11) కేటీఆర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘మన రాజకీయ విభేదాల వల్ల తెలంగాణ బాధపడకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోనీ పెట్టుబడిదారులందరికీ గౌరవిస్తుందని నేను ఆశిస్తున్నాను.నిజానికి దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన శక్తివంతమైన రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో సమానం అంటూ హాస్యాస్పద ప్రకటనలు చేయడం సీఎం రేవంత్ మానేయాలి. ఇప్పటికే కేన్స్ టెక్నాలజీ తెలంగాణ నుంచి గుజరాత్‌కు వెళ్లిపోవడం, కార్నింగ్ ప్లాంట్‌ను చెన్నైకి పోగొట్టుకోవడం చూశాం. ఇప్పుడు గనుక అమరరాజా వెళ్లిపోతే అది విపత్తుతో సమానం’అని కేటీఆర్ హెచ్చరించారు. -
AMFI: ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.37,113 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో బలమైన విశ్వాసం కొనసాగుతోంది. జూలైలోనూ రూ.37,113 కోట్ల మేర ఈక్విటీ పథకాల్లో నికరంగా ఇన్వెస్ట్ చేశారు. కాకపోతే జూన్ నెలలో వచి్చన రూ.40,608 కోట్లతో పోల్చి చూస్తే మాత్రం 9 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. అయినప్పటికీ నెలవారీ పెట్టుబడుల్లో ఇది రెండో గరిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి జూలై నెలలో రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో పరిశ్రమ నుంచి (అన్ని రకాల పథకాలు) రూ.43,637 కోట్లు నికరంగా బయటకు వెళ్లడం గమనార్హం. దీంతో జూలై చివరికి అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.65 లక్షల కోట్లకు చేరుకుంది. జూన్ చివరికి ఇది రూ.61.15 లక్షల కోట్లుగా ఉంది. సిప్ పెట్టుబడుల జోరు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో రూ.23,332 కోట్ల పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి వచ్చాయి. జూన్ నెలలో రూ.21,262 కోట్ల సిప్ పెట్టుబడులతో పోలి్చతే 10 శాతం మేర పెరిగాయి. మొత్తం సిప్ నిర్వహణ ఆస్తులు (పెట్టుబడులు) రూ.13,09,385 కోట్లకు చేరాయి. పెట్టుబడుల పట్ల ఇన్వెస్టర్ల క్రమశిక్షణకు ఇది నిదర్శనమని, క్రమపద్ధతిలో సంపద సృష్టించుకునేందుకు సాయపడుతుందని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. ‘‘మ్యూచువల్ ఫండ్స్‌ను నమ్మకమైన పెట్టుబడుల విభాగంగా రిటైల్ ఇన్వెస్టర్లు పరిగణిస్తున్నారు. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సానుకూల వృద్ధిని నమోదు చేసింది. రిటైల్ ఇన్వెస్టర్ల ఆర్థిక వ్యూహాల్లో మ్యూచువల్ ఫండ్స్ కీలకంగా మారాయి’’అని వెంకట్ తెలిపారు. విభాగాల వారీగా.. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.670 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్ నెలలో ఇవి రూ.970 కోట్లుగా ఉన్నాయి. → లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,622 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవే పథకాలు రూ.2,912 కోట్లను ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి జూన్ నెలలో వచి్చన రూ.2,528 కోట్లతో పోలి్చతే.. జూలైలో రూ.1,644 కోట్లకు పరిమితమయ్యాయి. → స్మాల్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,109 కోట్లు వచ్చాయి. జూన్‌లో వచి్చన రూ.2,263 కోట్లతో పోలి్చతే తగ్గాయి. → మల్టీక్యాప్ ఫండ్స్ రూ.7,085 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఈ పథకాల్లోకి రూ.4,709 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. → వ్యాల్యూ ఫండ్/కాంట్రా ఫండ్స్‌లోకి రూ.2,171 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ.18,386 కోట్లను ఆకర్షించాయి. జూన్‌లో ఇవే ఫండ్స్‌లోకి రూ.22,352 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా జూలై నెలలో ఈ విభాగంలో 9 కొత్త ఎన్‌ఎఫ్‌వోలు (నూతన పథకాలు) మార్కెట్లోకి వచ్చి ఇన్వెస్టర్ల నుంచి రూ.12,974 కోట్లను సమీకరించాయి. → ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోకి రూ.3053 కోట్లు వచ్చాయి. → డెట్ (స్థిరాదాయ) పథకాల నుంచి జూన్ నెలలో రూ.లక్ష కోట్లు బయటకు వెళ్లగా.. జూలై నెలలో రూ.1.2 లక్షల కోట్లు తిరిగొచ్చాయి. త్రైమాసికం చివరి నెలలో డెట్ పథకాల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ సహజంగా కనిపిస్తుంటుంది. డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ.70,061 కోట్లు వచ్చాయి. ఎన్‌ఎఫ్‌వోల అండ.. జూన్ నెలతో పోలి్చతే జూలైలో ఈక్విటీల్లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గాయి. మరీ ముఖ్యంగా నూతన పథకాల లిస్టింగ్ (ఎన్‌ఎఫ్‌వోలు), సిప్ పెట్టుబడులు మద్దతుగా నిలిచాయి. ఏక మొత్తంలో పెట్టుబడులు ఎక్కువగా ఎన్‌ఎఫ్‌వోల రూపంలో వచ్చాయి.– మనీష్ మెహతా, కోటక్ మహీంద్రా ఏఎంసీ నేషనల్ హెడ్ (సేల్స్) -
అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఈ ఉదయం శంషాబాద్ నుంచి ఆయన అమెరికా వెళ్లారు. ఆయన వెంట మంత్రి డి.శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్కోతో పాటు దక్షిణ కొరియా సియోల్ నగరంలోనూ రేవంత్ బృందం పర్యటించనుంది.తన పర్యటనలో భాగంగా.. తొలుత ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో ఈ బృందం పాల్గొంటుంది. 5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. అటు నుంచే సియోల్‌కు..10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు .. ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. -
నేడు అమెరికాకు సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్లనున్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి డి.శ్రీధర్‌బాబు కూడా ఆయనతో వెళ్తున్నారు. శనివారం ఉదయం 4.35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.25 గంటలకు న్యూయార్క్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈనెల 4న న్యూజెర్సీలో జరిగే ప్రవాస తెలంగాణీయులతో జరిగే సమావేశంలో పాల్గొంటారు.5, 6 తేదీల్లో న్యూయార్క్‌లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై చర్చిస్తారు. 6న పెప్సికో, హెచ్‌సీఏ కంప్యూటర్స్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి చేరుకుని అక్కడ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. 7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడ గాంధీ స్మృతి కేంద్రాన్ని సందర్శిస్తారు.8న శాన్ఫ్రాన్సిస్కోలో యాపిల్ ఉత్పాదక బృందం, ట్రైనెట్ సీఈఓ, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి చర్చించనున్నారు. 9న గూగుల్, అమెజాన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారు. శాన్ఫ్రాన్సిస్కోలో సాయంత్రం జరిగే ప్రవాస తెలంగాణీయుల భేటీలో పాల్గొంటారు. 10న శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయల్దేరి 11న దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకుంటారు. 12, 13 తేదీల్లో ఎల్జీ, శామ్సంగ్తో పాటు ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. 13న రాత్రి 11.50 గంటలకు సియోల్ నుంచి బయల్దేరి 14న ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం రేవంత్‌తో ఆనంద్ మహీంద్రా భేటీ రాష్ట్రంలో కొత్తగా స్థాపించనున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని ప్రారంభించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా ముందుకొచ్చారు. ఈమేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఆనంద్ మహీంద్రా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిశీలనకు తమ కంపెనీ బృందాన్ని పంపిస్తామని సీఎంకు తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకొచ్చారు. -
భారత్‌లో చైనా పెట్టుబడులు: పీయూష్ గోయల్ ఏమన్నారంటే?
చైనా పెట్టుబడులకు సంబంధించిన విషయం మీద కేంద్రమంత్రి 'పియూష్ గోయల్' స్పష్టమైన వివరణ ఇచ్చారు. చైనా ఎఫ్‌డీఐకి మద్దతు ఇవ్వడంపై పునరాలోచన లేదని, ఆర్థిక సర్వే దీనికి ఏమాత్రం కట్టుబడి లేదని ఆయన అన్నారు. చైనా పెట్టుబడులను ప్రోత్సహించే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి స్పష్టం చేశారు.2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు.. నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఆర్థిక సర్వేలో చైనా పెట్టుబడుల గురించి వెల్లడించారు. చైనా పెట్టుబడుల ద్వారా ఉత్పత్తిని పెంచి.. ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత పెరుగుతుందని సర్వే అభిప్రాయపడింది. ఈ కారణంగానే కేంద్ర మంత్రి కూడా చైనా ఎఫ్‌డీఐలను ప్రోత్సహించాలని పేర్కొన్నారని, పియూష్ గోయల్ అన్నారు.జూన్ 2020లో గల్వాన్ లోయలో చోటు చేసుకున్న భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తరువాత భారత ప్రభుత్వం మనదేశంలో సుమారు 200 చైనా యాప్‌లను నిషేదించింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొంటే తప్ప చైనాతో సంబంధాలు మామూలుగా ఉండవని భారత్ చెబుతోంది. ఈ కారణంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD నుండి వచ్చిన ప్రధాన పెట్టుబడి ప్రతిపాదనను కూడా ఇండియా తిరస్కరించింది. -
నీట్‌గా మీట్
ఆహారం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రజల అభిరుచికి తగ్గట్లే వ్యాపారస్తులు కూడా అధునాతన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో సంతలు సూపర్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక మాంసం దుకాణాలు కూడా నీట్‌గా మారుతున్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి మాంసాహార ఉత్పత్తులు కొనడానికే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాంసాహార ఉత్పత్తులను కొన్ని సంస్థలు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి దీటుగా పట్టణ ప్రాంతాల్లో తాజా, ఫ్రోజెన్ ఉత్పత్తులు అందించడానికి నాన్ వెజ్ స్టోర్స్, మార్ట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. – సాక్షి, అమరావతిమీట్ మార్ట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు నేరుగా మార్టులు నడుపుతుంటే.. మరి కొందరు ఫ్రాంచైజీ తరహాలో ఈ మార్ట్లను విస్తరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ముందుకొస్తున్నారు. కేవలం చేపలు, కోడి, మేక మాంసాలకే పరిమితం కాకుండా అన్ని రకాల మాంసాహార ఉత్పత్తులు ఒకే చోట అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మార్ట్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 50కు పైగా ఉన్నాయి. ఈ మార్టుల ద్వారా రాష్ట్రంలో రోజుకు సగటున ఐదారు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగు తోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాలే లక్ష్యంగా మార్టుల యజమానులు షాప్స్ ఓపెన్ చేస్తు న్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో ఇవి బాగా విస్తరిస్తున్నాయి.మీట్ మార్టుల ప్రత్యేకతలు ఇవే.. » కబేళాలతో పాటు డ్రెస్సింగ్, ప్యాకింగ్ ఇలా ప్రతీ దాంట్ అంతర్జాతీయ ప్రమాణాలు» పరిసరాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్» వచ్చే ప్రతీ కస్టమర్ కళ్లెదుటే వారికి కావాల్సినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» మటన్, చికెన్, ఫిష్ తదితరాలకు ఏ పార్ట్ (భాగం) కావాలంటే ఆ పార్టులు వేరుగా విక్రయం » బిర్యానీ, తందూరీ వంటి వంటకాలకు తగినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» రెడీ టూ కుక్కు వీలుగా మసాలాలు అద్ది మరీ అందించడండోర్ డెలివరీకి ప్రత్యేకంగా కాల్ సెంటర్» రాష్ట్రంలో మీట్ మార్టులు 50» రోజుకు సగటున జరుగుతున్న వ్యాపారం (రూ. కోట్లలో) 5- 6 » ఒక్కో మీట్ మార్టుకు పెట్టుబడి (రూ.ల్లో) 30 - 50 లక్షల వరకుశుచి, శుభ్రత ముఖ్యంశుచి, శుభ్రత ఉంటే కాస్త ధర ఎక్కువైనా వెనుకాడడం లేదు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫిష్, మటన్ మార్ట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్రతికున్న చేపలే కాదు.. శుభ్రమైన వాతావరణంలో కోడి, మేక మాంసంతో పాటు తాజాగా బతికి ఉన్న అన్ని రకాల రొయ్యలు ఈ మార్టుల్లో దొరుకుతున్నాయి. –ఎం.హరినాథ్, రిటైర్డ్ డీఈ, పంటకాలవ రోడ్, విజయవాడప్రజల్లో ఆదరణ బాగుందిగత కొన్నేళ్లుగా మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఈ రంగంలోకి అడుగు పెట్టా. తొలుత విశాఖలో ది హైపర్ మీటన్ స్టోర్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం విశాఖలో నాలుగు, కాకినాడ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్కో మార్ట్‌కు రూ. 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 50 మందికి ఉపాధి కల్పించా. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఆదరణ బాగానే ఉంది. ఆన్లైన్లో బుకింగ్‌కు కూడా అవకాశం ఉంది. డోర్ డెలివరీ చేస్తున్నాం. భవిష్యత్‌లో మిగిలిన నగరాల్లో కూడా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాం. – పసల పర్వేష్, ఎం.డీ, హైపర్ మీటన్ స్టోర్ -
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం కావాలి!
దేశీయ ఆర్థిక వ్యవస్థ 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండొచ్చు; అయితే బయటి ఎదురుగాలులు ఈ వృద్ధిని దెబ్బ తీయొచ్చు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టాలి. ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా ముందుకు సాగాలి. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భర స్థితిలో ఉంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనాలను పొందేలా చూసుకోవాలి. భారీస్థాయిలోని మన యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.భౌగోళిక రాజకీయ రంగంలో కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రంలోని కొత్త ప్రభుత్వం తన మొదటి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ వివాదం తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. దేశీయ ఆర్థిక వ్యవస్థ దాదాపు 8 శాతం వద్ద స్థిరంగా వృద్ధి చెందుతూ ఉండవచ్చు. అయితే బాహ్య వాతా వరణపు స్థిరత్వాన్ని బట్టి ఇది మారవచ్చు. ప్రపంచ చమురు ధరలు తగ్గింపు స్థితిలోనే ఉంటాయనీ, ఎగుమతి వృద్ధిని ప్రభావితం చేసిన మాంద్యం పోకడల నుండి పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థలు బయటపడ తాయనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశిస్తూ ఉండ వచ్చు. అంతర్జాతీయ సముద్ర మార్గాలను కలహాలు లేకుండా ఉంచడం కూడా వచ్చే పోయే వాణిజ్య ఖర్చులలో అనవసరమైన పెరుగుదలను నివారించడంలో కీలకం. స్పష్టంగా, బయటి ఎదురు గాలులు భారతదేశ వృద్ధి కథనాన్ని చెడగొట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సమాన స్థాయిలో మద్దతునిస్తూ, మౌలిక సదుపాయాలు, సేవల వంటి కీలక రంగాలను బలోపేతం చేయడంపై బడ్జెట్ దృష్టి పెట్టడం అవసరం.మౌలిక వసతుల రంగంలో, గత కొన్నేళ్లుగా నమోదైన మూలధన వ్యయంలో విపరీతమైన పెరుగుదలను విధాన రూపకర్తలు కొన సాగించడం మంచిది. 2024–25 మధ్యంతర బడ్జెట్ మూలధన వ్యయంలో అంతకుముందు నమోదైన 30 శాతం పెరుగుదలను సుమారు 16.9 శాతానికి తగ్గించింది. దేశంలోని విస్తారమైన మౌలిక సదుపాయాల అంతరం కారణంగా మూలధన వ్యయంలో అధిక పెరుగుదల అవసరం. ఇది భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను వెంటనే సృష్టించలేకపోయినా, ఉపాధి కల్పనపై నిస్సందేహంగా దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ. 2.11 లక్షల కోట్లను బదిలీ చేసిన వాస్తవం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ దిశలో కొనసాగడానికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది.ప్రభుత్వ రంగం కంటే వెనుకబడిన ప్రైవేట్ పెట్టుబడులకు సులభతర వాతావరణాన్ని సృష్టించే దిశగా కూడా బడ్జెట్ ముందుకు సాగాలి. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకాలు వంటి అమలులో ఉన్న విధానాలు తయారీకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ విధానాలను మరింత క్రమబద్ధీకరించాలి. 1991 ఆర్థిక సంస్కరణల కాలం నుండి నియంత్రణ వాతావరణం కచ్చితంగా చాలా ప్రగతి సాధించింది. కానీ గతంతో పోల్చడం అసందర్భం అవుతుంది. ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో ఇప్పుడు పోల్చుకోవలసి ఉంది. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు సరళమైన, సులభ మైన పెట్టుబడి విధానాలను అందిస్తున్నాయి. బహుళజాతి సంస్థలు అక్కడ స్థావరాన్ని ఏర్పరచుకోవడానికి ఇది ఒక ఆకర్షణ. దీనికి విరుద్ధంగా భారతదేశం అంత ఆకర్షణీయంగా కనిపించడం లేదు.దేశీయ పెట్టుబడిదారులు అధిక మూలధనం, లాజిస్టిక్స్ ఖర్చు లతో పోరాడవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు సమృద్ధిగా లభించకపోవడం అనేది దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయింది. ఈ సమస్యలు ఇప్పుడు ఎక్కువగా రాష్ట్రాలు లేదా స్థానిక మునిసిపాలిటీల స్థాయిలో ఉన్నాయి. సులభతరమైన వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకురావడం తదుపరి తరం సంస్కరణల్లో భాగం కావాలి.మరో తరం సంస్కరణలు అవసరంఫిబ్రవరిలో 2024–25 మధ్యంతర బడ్జెట్‌తో విడుదల చేసిన ఆర్థిక ప్రకటనలో ఇది ఇప్పటికే పరిగణించబడుతుందనే సూచన కనిపిస్తోంది. ఇది మండలం, జిల్లా, గ్రామ స్థాయిలలో పాలనను మెరుగుపరచడం గురించి ప్రస్తావించింది. వృద్ధి, అభివృద్ధి ఆధారిత సంస్కరణల కోసం రాష్ట్రాలకు 75,000 కోట్ల రూపాయల రుణాన్ని కూడా అందించారు. ఆరోగ్యం, విద్య, నైపుణ్యం, భూసేకరణ వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడమైనది.సంస్కరణలు చేపట్టేందుకు రుణాలు అందుబాటులో ఉన్నప్ప టికీ, అన్ని రాష్ట్రాలు సహకరించకపోవడమే ఈ ప్రణాళికలోని ఏకైక చిక్కు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కేంద్రం నుంచి వచ్చే ఆదేశాలకు కట్టు బడి ఉండాల్సి ఉంటుంది, కానీ ఇతర రాష్ట్రాల నుంచి అదే స్పందన రాకపోవచ్చు. అందుకే తదుపరి తరం సంస్కరణలను ప్రారంభించే లక్ష్యం పాక్షికంగా మాత్రమే విజయవంతమవుతుంది. అదే సమయంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలు, ఇప్పటికే నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఇన్వెస్టర్లు వారికి అండగా నిలుస్తున్నారు. ఉదాహరణకు, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసుకొంటున్నాయి. ఈ రాష్ట్రాలు అవలంబించిన విధానాలను అధ్యయనం చేయాలి. ఇతర రాష్ట్రాల్లోనూ వీటిని పునరావృతం చేయాలి.ఈ సందర్భంలో, విద్య, నైపుణ్యాలకు చెందిన క్లిష్టమైన విభాగా నికి బడ్జెట్ కేటాయింపులు అవసరం. ప్రభుత్వ ఎజెండాలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉండాల్సి ఉండగా, అనేక రంగాలు నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. విద్య రకం, పరిశ్రమకు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాల మధ్య అసమతుల్యత కూడా ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక విధాన చికిత్సలను రూపొందించాలి. అయితే స్వల్పకాలంలో, రాబోయే బడ్జెట్లో నైపుణ్యం కలిగిన సంస్థలకు తగిన కేటాయింపులను అందించవచ్చు.అదనంగా, విద్యపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఐఐటీలు, ఐఐఎమ్‌ల వంటి అద్భుతమైన ఉన్నత విద్యా సంస్థలతో కూడిన దేశం ఇది. కానీ ప్రాథమిక, మాధ్యమిక విద్య దుర్భరమైన స్థితిలో ఉంది. ఇక్కడ కూడా, మన భారీస్థాయిలోని యువ జనాభా శ్రామికశక్తిలోకి ప్రవేశించడానికి బాగా సన్నద్ధం అయ్యేలా కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి.జీడీపీ, ఉపాధి కల్పనలకు సహకారం అందిస్తున్నందున ప్రయాణం, పర్యాటకం వంటి సేవలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా మరింత మద్దతు ఇవ్వాలి. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికీ, మెరుగైన ఆర్థిక ఎంపికలు అందుబాటులోకి రావడానికీ హోటళ్లకు మౌలిక సదుపాయాల స్థితిని ఆతిథ్య పరిశ్రమ కోరుతోంది. కోవిడ్ ప్రభావిత పతనం నుండి ఈ రంగం బలంగా పుంజుకుంటోంది. అయితే కొంత లక్ష్యితి మద్దతు ఉపాధి అవకాశాలను విస్తరిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం తక్షణ అవసరం. వాటిని ఏర్పాటు చేయడానికి ప్రోత్సాహకాలతో పాటు, రైతులు రిటైల్ మార్కెట్లను ప్రత్యక్ష మార్గంలో అందుకోవడానికి తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయడం అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని ఆదాయ మార్గాల కల్పనతో పాటు మౌలిక వసతుల కల్పనను తక్షణ ప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే రానున్న సంవత్సరాల్లో పట్టణ, గ్రామీణ అంతరం మరింత విస్తరిస్తూనే ఉంటుంది. సమాజంలోని అన్ని వర్గాలూ ప్రయోజనా లను పొందగలిగేలా చూసుకోవాలి. దేశవ్యాప్తంగా ఆకాంక్షలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయని ఇటీవలి ఎన్నికలు తెలియజేశాయి.సంక్షేమ విధానాలకు స్వాగతమే. అయితే దీర్ఘకాలంలో అవి స్థిరమైన అభివృద్ధికి దారితీయాలి.సుష్మా రామచంద్రన్ వ్యాసకర్త సీనియర్ ఫైనాన్షియల్ జర్నలిస్ట్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఆగస్టులో సీఎం అమెరికా టూర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చే నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఆగస్టు 3వ తేదీ నుంచి సీఎం బృందం అమెరికాలో పర్యటిస్తుందని, అదే నెల 11న రాష్ట్రానికి తిరిగి వస్తుందని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. అమెరికాలోని డల్లాస్, శాన్ఫ్రాన్సిస్కో, న్యూజెర్సీ రాష్ట్రాల్లో పర్యటించనున్న సీఎం బృందం, ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలు కంపెనీల సీఈవోలతో సమావేశం కానుంది. లైఫ్ సైన్సెస్, ఎల్రక్టానిక్స్, ఇతర టెక్నాలజీ రంగాల్లోని ప్రముఖులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరిస్తారని సమాచారం. అమెరికా నుంచి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ దక్షిణ కొరియాలో పర్యటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా దక్షిణ కొరియాలో నదీతీరాల అభివృద్ధిని అధ్యయనం చేయా లని సీఎం భావిస్తున్నట్టు సమాచారం.