
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.
విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

Comments
Please login to add a commentAdd a comment