tpcc chief
-
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
మల్లన్న వ్యాఖ్యలు చాలా తప్పు : పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
-
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
తెలంగాణకు పెట్టుబడులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. -
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC candidate)ని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని టీపీసీసీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ నరేందర్‌రెడ్డి పేరు చాలా మంది చెప్పారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్రపక్షాలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యాఖ్యలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. అందరి రిపోర్టు కేసీ వేణుగోపాల్ వద్ద ఉందన్న మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ నేతలందరూ వచ్చే 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పారు. ఈ నెలాఖరుకు పార్టీలో అన్ని కమిటీలు వేస్తామన్న ఆయన.. పనిచేసిన వారందరికీ పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పనిచేసిన నాయకులకే పదవులు వస్తాయని.. కార్పొరేషన్ పదవుల భర్తీ ఈ నెలాఖరుకి పూర్తవుతుందని చెప్పారు.ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు బీజేపీ అధ్యక్ష పదవి కసరత్తు.. రేసులో ఈటల, అరవింద్ -
ఈ ప్రశ్నలకు సమాధానాలున్నాయా?.. కవితకు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ధర్నా చేయాలంటూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. బీసీలకు న్యాయంగా అందాల్సిన నిధులు అందించకుండా నిట్టనిలువునా ముంచిందన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత బీసీలపై కపట ప్రేమ చూపుతూ కల్వకుంట్ల కుటుంబం వారిపై మొసలికన్నీరు కారుస్తోందని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు‘‘బీసీలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు బీసీలు గుర్తుకొచ్చారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసి వారి గొంతు కోసింది బీఆర్ఎస్. లిక్కర్ స్కాంలో మరకంటించుకున్న ఎమ్మెల్సీ కవిత దాన్ని పోగొట్టుకోవడంతో పాటు బీఆర్ఎస్లో ఆమెకు ప్రాధాన్యత తగ్గడంతో ఎటూ పాలుపోని ఆమె రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీసీల పేరిట కపట నాటకం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమం’’ అంటూ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.కాంగ్రెస్ బీసీలకు పెద్దపీట వేస్తుందనడానికి నిదర్శనం నన్ను తెలంగాణ అధ్యక్షులుగా నియమించడమే. అంతేకాక రాష్ట్ర క్యాబినెట్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గత మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా బీసీలకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో బహిరంగ రహస్యమే. మీ పాలనలో బీసీలను అడుగడుగున అణగదొక్కిన మీరు ఇప్పుడు బీసీ జపం చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది’’ అంటూ మహేష్ కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు.‘‘కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతమున్న రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచడం కోసం చర్యలు తీసుకొని, అందులో భాగంగా సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందుకు మీరు ధర్నా చేస్తున్నారా.?..బీసీలకు రిజర్వేషన్లు పెంచడం ద్వారా పంచాయతీలు, మున్సిపాల్టీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు ప్రాతినిథ్యం లభించే అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు చర్యలు చేపడుతున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి గాను ప్రజా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో కమిటీని నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?..జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగేందుకు రాష్ట్రంలో కులగణన చేపట్టినందుకు ధర్నా చేస్తున్నారా..?. గత బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సంక్షేమ బడ్జెట్‌ను 2971.32 కోట్ల రూపాయలకు పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. కాంగ్రెస్ ప్రభుత్వం గీతన్నల ఆవేదనను గుర్తించి తాడి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?..గీతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం కాటమయ్య రక్షణ కార్మక్రమాన్ని ప్రారంభించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి 10 సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేసినందుకు ధర్నా చేస్తున్నారా..?. ఎమ్‌బీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?. మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల పాఠశాలల్లోని వివిధ విభాగాల్లో 5136 మంది ఉద్యోగులను నూతనంగా నియమించినందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ హాస్టళ్లకు పక్కా భవనాల నిర్మాణాల్లో భాగంగా ఇప్పటికే 20 నిర్మాణాలకు కోసం 100 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా..?..గురుకులాల్లో డైట్ కాస్మోటిక్ ఛార్జీలు 40 శాతానికి పెంచినందుకు ధర్నా చేస్తున్నారా..?. 28 యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూళ్లు నూతనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నందుకు ధర్నా చేస్తున్నారా..?. బీసీ కార్పొరేషన్ కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 73 కోట్ల రూపాయలను కేటాయించినందుకు ధర్నా చేస్తున్నారా.?’’ అంటూ బీఆర్ఎస్ పార్టీకి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నలు సంధించారు. -
లోకల్ బాడీ ఎన్నికలు.. కుల గణన ఆధారంగా టికెట్స్: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణలో కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, కుల గణన అంశం రాష్ట్రంలో కీలకంగా మారనుంది.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన సర్వే ఆధారంగానే లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్స్ ఇవ్వడం జరుగుతంది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీలో కీలకంగా ఉన్నారనే దిల్ రాజుకు కార్పోరేషన్ పదవి ఇచ్చాం. తెలంగాణ తల్లిని విమర్శించడం అంటే తెలంగాణను విమర్శించడమే అవుతుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ తలసాని కొడుకుదే: కాంగ్రెస్
నిర్మల్ : దిలావర్ పూర్లో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసింది తెలిసిందే. దీంతో కలెక్టర్ పనులను ఆపేయించారు. అయితే ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండగా.. కాంగ్రెస్ కౌంటర్‌కు దిగింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘దిలావర్పూర్ ఇథనాల్ పరిశ్రమ బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడిదే. ఇథనాల్ ఫ్యాక్టరీతో జనాల్ని ముంచాలని కేసీఆర్ చూశారు. అందుకే తలసాని కొడుకు సాయి సంస్థకు అప్పగించారు. కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కేసీఆర్, కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వానికి, ఆ ఇథనాల్ కంపెనీకి సంబంధం ఏంటి? ఇథనాల్ ఫ్యాక్టరీ ఎవరిదో తేల్చుకునేందుకు బీఆర్ఎస్ నేతలు దిలావర్ పూర్‌కి రావాలి. వారితో పాటు మేమూ వస్తాం. అక్కడికి వెళ్లి తప్పెవరిదో? తేల్చుకుందాం’ అని అన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై పూర్వపరాలు పరిశీలించాకే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. కాగా, నిర్మల్ జిల్లా దిలావర్ పూర్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు నిరసనగా స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిర్మల్ - భైంసా రహదారి వైపు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానికుల నిరసనతో పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనలో భారీగా పాల్గొన్న మహిళలు. ఇథనాలు పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చిరించారు. దీంతో అధికార యంత్రాగం పనుల్ని ఆపేయించి.. చర్చలకు పిలిచింది. అదే సమయంలో.. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. గత ప్రభుత్వ హయాంలో ఈ అనుమతులు జారీ అయ్యాయని గుర్తించింది. ఫ్యాక్టరీ అనుమతులపై సమీక్షించి.. అవసరమైతే వాటిని రద్దు చేయాలని యోచిస్తోన్నట్లు సమాచారం. -
టీపీసీసీ చీఫ్ జిల్లాల టూర్
-
కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: పదేళ్ల బీఆర్ఎస్ పాలన, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పార్మా సిటీ ఒక్కచోట ఉండకూడదనే వికేంద్రీకరణ చేశామని చెప్పారు. లగచర్లలో భూమిలేని వారు అధికారులపై దాడి చేశారని, కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా దాడి జరిపించాడని ఆరోపించారు. ఫార్ములా వన్ రేసులో చేసిన తప్పేంటో కేటీఆర్‌కు తెలుసని, ఆయన తప్పు చేశాడని ఫీలవుతున్నాడు కాబట్టే జైలుకుపోతా అంటున్నాడని తెలిపారు.ఈ మేరకు శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీని జైలుకు పంపడం లేదేంటని ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి అధికారులపై పద్దతి ప్రకారం చర్యలు ఉంటాయని వెల్లడించారు. ప్రతిపక్షహోదా ఉన్నప్పటికీ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏడాదిగా బయటకు రావడం లేదన్నారు. ఆయన ఎక్కడ దాకున్నారని ఆయన ప్రశ్నించారు.‘కేసీఆర్‌ను కేటీఆర్ నిర్బంధించారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ కంటే మేము 9 నెలల్లో ఎక్కువ చేశాం. నిర్బంధ పాలన నుంచి ప్రజా పాలన తీసుకొచ్చాం. అందుకే బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప్రజలు కోరినట్లు పాలన సాగింది కాబట్టే విజయోత్సవాలు చేస్తున్నాం. బీఆర్ఎస్ హయాంలోని అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయి.హైడ్రా అనేది హైదరాబాద్ నగరానికి ఒక వరం. ఆక్రమణలకు గురైన చెరువులు, కాలువలను పూర్తిగా బాగు చేస్తే.. వయనాడ్‌లో చోటుచేసుకున్న ఉపద్రవాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మూసీ ప్రక్షాళన అవసరం. పేదలెవరూ నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం పునరావాస చర్యలు తీసుకుంటుంది’ అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. -
లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్... తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ధ్వజం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
కేటీఆర్‌కు శిక్ష తప్పదు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: అధికారులపై దాడి అనేది హేయమైన చర్య.. ఈ కేసులో కేటీఆర్‌కు శిక్ష తప్పదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పక్కా ప్లాన్ ప్రకారమే కలెక్టర్‌పై దాడి జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. దాడిలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో అధికారం పోయిందనే అక్కసు కేటీఆర్‌లో కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడమే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తోంది. అధికారులపై దాడి హేయమైన చర్య.. కేటీఆర్‌కు శిక్ష తప్పదు. లగచర్లలో భూమిలేని వారు కలెక్టర్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ భారీ కుట్రలు చేస్తోంది. పక్కా ప్లాన్ ప్రకారం దాడి జరిగింది.అభివృద్ధి వికేంద్రీకరణను బీఆర్ఎస్ అడ్డుకుంటోంది. కేటీఆర్ ఫోన్ కాల్ సంభాషణలు ఉన్నాయని పోలీసులు నిర్దారించారు. లగచర్ల దాడి ఘటనలో మొదటి ముద్దాయి కేటీఆర్. ఈ ఫార్ములా రేసులో డబ్బులు చేతులు మారాయి.. ప్రభుత్వ సొమ్మును కేటీఆర్ తన వారికి కట్టబెట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా.. లగచర్ల దాడి ఘటనలో ఎవరు ఉన్నా వెంటనే అరెస్టు చేయాలి. నిందితులను శిక్షించండి.ప్రభుత్వ ఉత్సవాలలో పార్టీ కార్యకర్తలు పాల్గొనాలి. డిసెంబర్ 2 లేదా 3వ తేదీన హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని సభ ద్వారా ప్రజలకు వివరిస్తాం. ఈనెల 16 నుంచి జిల్లాల పర్యటన చేస్తాను. మొదట కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తాను’ అని చెప్పారు. -
కులగణనకు ఎమ్మెల్యేలే ఇన్‌ఛార్జ్‌లుగా వెళ్తారు: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు టీపీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆఫీసులో మహేశ్వర్ రెడ్డికి అసలు కుర్చీనే లేదంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండగా.. మరో సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డికి, మహేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ కార్యాలయంలో మహేశ్వర్ రెడ్డికి కుర్చీనే లేదు. రాష్ట్రంలో సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎక్కడి నుండి వస్తుంది. మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయి?. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పిన విషయాలను కొందరు వక్రీకరిస్తున్నారు. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ప్రభుత్వం పని చేస్తోంది. ఈనెల ఆరు లేదా ఏడో తేదీన కుల గణనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈనెల ఐదో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు బోయినపల్లి గాంధీ ఐడీయాలజీ సెంటర్లో కులగణనపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వస్తారు. పార్టీ నేతలు, బీసీ నేతలు, వివిధ వర్గాల మేధావులతో రాహుల్ గాంధీ సమావేశం అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కులగణనపై రాహుల్‌గాంధీ వివరాలు తెలుసుకుంటారు. ప్రధాని మోదీ ఎప్పుడూ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయరు. విమర్శలను రాహుల్‌గాంధీ పాజిటివ్‌గా తీసుకుంటారు. కులగణన కోసం కనెక్టింగ్ సెంటర్‌ను కూడా ప్రారంభించాం. కులగణనకు ఎమ్మెల్యేలు ఇన్‌ఛార్జులుగా వెళ్తారు అని స్పష్టం చేశారు. -
ఢిల్లీకి టీపీసీసీ చీఫ్.. కార్యవర్గం కూర్పుపై చర్చ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరారు. ఆయన రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. పర్యటనలో భాగంగా కార్యవర్గం కూర్పు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, వీహెచ్ పుస్తక ఆవిష్కరణలో పాల్గొననున్నారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి ఢిల్లీకి బయలుదేరారు. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో పార్టీ పెద్దలను ఆయన కలువనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, కార్యవర్గం కూర్పు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం. ఇక, రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో మహేష్ గౌడ్ పాల్గొననున్నారు. -
మంత్రి పదవి నుంచి ‘కొండా’ను తప్పిస్తారా? పీసీసీ చీఫ్ క్లారిటీ
హైదరాబాద్, సాక్షి: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఎంఐఎం) పార్టీతో స్నేహం వేరు.. శాంతిభద్రతలు వేరని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌పై దాడి విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఆయన శుక్రవారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘దాడుల విషయంలో కఠినంగా ఉంటాం. పార్టీలో నేతల చేరికలు జరిగిన చోట కొంత ఇబ్బంది అవుతుంది. అందుకే చేరికలకు బ్రేక్ వేశాం. దసరాకు రెండో విడత కార్పోరేషన్ పదవులు అనుకున్నాం. కానీ కుదరలేదు. దీపావళి లోపు పూర్తి చేస్తాం. త్వరలోనే జిల్లా పర్యటనకు వెళ్తాను భావితరాల భవిష్యత్ కోసమే హైడ్రా, మూసీ అభివృద్ధి. మూసీ అభివృద్ధికి రు. లక్షా యాబై వేల కోట్లని ఎక్కడా మేం చెప్పలేదు.పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వందేళ్ల దోపిడీ జరిగింది. ఏఐసీసీ నేతలంత బిజీబిజీగా ఉండడం వల్లే మంత్రివర్గం, పీసీసీ కార్యావర్గం ఆలస్యం అయింది. త్వరలోనే రెండు భర్తీ చేస్తాం. మంత్రి కొండా సురేఖ ఇటీవల తన వాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఆరోజే ఆ వ్యవహారం క్లోజ్ అయింది. మంత్రి వర్గం నుంచి కొండా సురేఖను తప్పిస్తారని ప్రత్యర్ధులు చేస్తున్నది ప్రచారం మాత్రమే. వాస్తవం కాదు. ఈ విషయంపై అధిష్టానం ఎటువంటి వివరణ అడగలేదు’’ అని అన్నారు. -
హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుంది: టీపీసీసీ చీఫ్
సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో హైడ్రా ఆపితే హైదరాబాద్ మరో వయనాడ్ అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అలాగే, ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. ఇదే సమయంలో కొండా సురేష్, కేటీఆర్ అంశంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా, మూసీ యజ్ఞం ఏదీ ఆగదు. హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం. మా కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి. మూసీ సుందరీకరణపై ఇంకా డీపీఆర్ సిద్ధం కాలేదు. నిధులు ఎలా మళ్లిస్తాం. బీఆర్ఎస్ నేతలు దాదాపు 1500 చెరువులను కబళించారు. మూసీ సుందరీకరణ ప్రారంభానికి ముందే అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్ విమర్శలు అవివేకం. ఇప్పుడు జరుగుతుంది మూసీ ప్రక్షాళన మాత్రమే.రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారు. పదేళ్లలో బీఆర్ఎస్ రుణమాఫీకి ఇచ్చిన సొమ్మెంత.. కాంగ్రెస్ ఇచ్చిన సొమ్మెంతో హరీష్ చెప్పాలి. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాము.. తొమ్మిదినెలల్లోనే 18 వేల కోట్లు రుణమాఫీని ప్రభుత్వం చేసింది. దీనిపై చర్చకు మేం సిద్దమే..హరీష్ సిద్దమా?. ఏడున్నర లక్షలపైగా అప్పుతో బీఆర్ఎస్ మాకు రాష్ట్రాన్ని అప్పగించింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ చేశాం.కేటీఆర్ అమెరికాలో చదివాడా? లేక సర్టిఫికెట్ కొన్నాడా?. కేటీఆర్‌పై కోపంతో కొండా సురేఖ మాట్లాడారు. పీసీసీ సూచనతో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. మాటల్లో తప్పులు దొర్లాయి కాబట్టి.. సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ వివాదానికి తెర లేపిందే కేటీఆర్. యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదు. కానీ, రఘునందన్ రావు విషయంలో కొండా సురేఖపై దుబాయ్ నుంచి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు చేశారు. దానివల్లే సురేఖ అలా మాట్లాడారు. అయినా అలా మాట్లాడటం సరైంది కాదు కాబట్టి కొండా సురేఖ చెప్పాం. దీంతో, తన మాటలను ఉపసంహరించుకున్నారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని సూచించాం. ఎవరు అయినా కోర్టుకు వెళ్ళే హక్కు ఉంటుంది. అందుకే నాగార్జున కూడా వెళ్లి అంటారు.త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ జరుగుతుంది. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్‌కు తప్పుకుండా ప్రాతినిధ్యం దక్కుతుంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం లభిస్తుంది. నిజామాబాద్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండాల్సిందే. సాంకేతిక అంశాలు అన్నీ అనుకూలంగా ఉన్నా జాబితాలో రాలేదు. కొందరి అసమర్థత వల్ల జాబితాలో రాలేదు. స్మార్ట్ సిటీ జాబితాలో వచ్చేలా ప్రయత్నం చేస్తాం. జిల్లాలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నా. 2025 నాటికి సీఎంసీ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హరీష్.. కేసీఆర్‌ను తీసుకొచ్చే కెపాసిటీ ఉందా?: జగ్గారెడ్డి సవాల్ -
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్
-
కొండా కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి
సాక్షి,హైదరాబాద్: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో సినీ ప్రముఖులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు.మంత్రి సురేఖ భేషరతుగా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. ఇరు వైపులా మహిళలు ఉన్నారు..కావునా ఈ విషయాన్ని ఇంతటితో ముగింపు పలకాలని అన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని ఆమె ఉద్దేశం కాదు.కొండా సురేఖ ట్వీట్లో వారు హీరోయిన్గా ఎదిగిన తీరు కేవలం అభిమానం మాత్రమే కాదు నాకు ఆదర్శమని స్పష్టం చేశారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే ఆమెపై సోషల్ మీడియాలో చేసిన ట్రోల్ చూశాము. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడకండి. మా కాంగ్రెస్ నాయకులు మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా.. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అని సూచించారు. -
హైడ్రా పేరిట వసూళ్లు నిరూపిస్తే మూసీలో దూకుతా: మహేశ్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏం చదువుకున్నారో అర్థం కావడం లేదని, రాహుల్ గాం«దీకి, మూసీకి, హైడ్రాకు ఏం సంబంధముందని ఆయన మాట్లాడుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. హైడ్రా పేరిట వసూళ్లు చేసినట్టు నిరూపిస్తే తాను పురానాపూల్ బ్రిడ్జి మీద నుంచి మూసీలో దూకుతానని, లేదంటే కేటీఆర్ దూకాలని ఆయన సవాల్ చేశారు. బుధవారం గాం«దీభవన్‌లో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు యథేచ్ఛగా కబ్జాలు చేశారని, అందుకే హైడ్రా అనగానే భయాందోళనలకు గురవుతున్నారని వ్యా ఖ్యానించారు. చెట్లు, లిక్కర్, ఇరిగేషన్ పేరు మీద దోచుకుని రా ష్ట్రాన్ని లూటీ చేశారని, ఇప్పుడు ఆ సొమ్ముతో సోషల్‌మీడియాలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడిస్తున్నారని ధ్వజమెత్తారు. మూసీ చుట్టూ ఉన్న ఒక్క ఇల్లును కూడా ఇప్పటివరకు తొలగించలేదని, ఒకవేళ తొలగించాల్సి వచ్చినా చట్టబద్ధంగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. అసలు మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు, హైడ్రాకు సంబంధం లేని, డీపీఆర్ తయారు కాకుండానే మూసీ అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందో ఎలా చెప్తామని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ గురించి అసభ్యంగా ట్రోల్ చేసిన విషయంలో బావకు ఉన్న సోయి బావమరిదికి లేదని, అందుకే కేటీఆర్ ట్రోల్స్‌ని ఖండించలేదని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని మహేశ్‌గౌడ్ ఈ సందర్భంగా చెప్పారు.మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది: మంత్రి సురేఖ బీఆర్ఎస్లో రాజకీయంగా మహిళలను ఎదగనివ్వరని మంత్రి కొండా సురేఖ అన్నారు. అందుకే బొడిగె శోభ, రేఖానాయక్‌తో పాటు తనకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. కుటుంబ పాలన నడవాలి కాబట్టే తమకు పదవులు ఇవ్వలేదని చెప్పారు. తనపై సోషల్‌మీడియాలో చేసిన కామెంట్లను మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందని చెప్పారు. తాము బీఆర్ఎస్ లాగా సోషల్‌మీడియాను దురి్వనియోగం చేయబోమన్నారు. మూసీ చుట్టూ ఉన్న ఇళ్లను కూల్చకముందే బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించిన సురేఖ.. బతుకమ్మ పండుగకు ఏమివ్వాలన్న దానిపై ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. -
800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే: టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే వారికి హైడ్రా అంటే భయం అంటూ కామెంట్స్ చేశారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి. ఆయన ఏం చదువుకున్నాడో అని అనుమానం వస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు 800 చెరువులను కబ్జా చేశారు. వారికే ఇప్పడు భయం. హైడ్రాకు, మూసీకి, రాహుల్ గాంధీకి సంబంధం లేదు. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వవైభవం తెస్తాం.మూసీపై డీపీఆర్ సిద్ధం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుంది. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తా అన్నారు. కానీ చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్ధంగా ఉంది. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. బయట రాష్ట్రంలో వీడియోలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్న వాటిని మాత్రమే హైడ్రా కూల్చి వేస్తోంది. హైడ్రా పని వేరు. మూసీ ప్రాజెక్ట్ వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు -
మీ మేనిఫెస్టోల్లో పెట్టలేదా?
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే బీఆర్ఎస్, బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్ కుమార్‌గౌడ్ మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను ఆ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పెట్టలేదా అని నిలదీశారు. మూసీపై ఒక్క గుడిసె కూడా ప్రభుత్వం తొలగించలేదని, అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.అందరూ గ్లోబల్ వారి్మంగ్ గురించి మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతల మెదళ్లకు మాత్రం ఆ ఆలోచన రావడం లేదని వ్యాఖ్యానించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కలుíÙతమైన నదిగా మూసీ గుర్తింపు పొందిందని, ఇలాంటి పరిస్థితుల్లో మూసీని ప్రక్షాళన చేయడం వల్ల రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన 26 లక్షల మందికి మేలు జరుగుతుందన్నారు. వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు సోషల్‌మీడియాను ఉపయోగించి ప్రజా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని మహేశ్‌కుమార్ విమర్శించారు. సోషల్‌మీడియా కోసం బీఆర్ఎస్ వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోందని ఆరోపించారు. సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్‌క్రైమ్ అధికారులను కోరామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి అంటే ప్రగతి భవన్, జన్వాడ ఫామ్‌హౌజ్‌ల చుట్టూ కాదని, చార్మినార్, మూసీలో జరగాలని అన్నారు.గత పదేళ్లలో 1,500 చెరువులు కబ్జాకు గురయ్యాయని ఇందులో 80 శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చేసినవేనని ఆరోపించారు. హైదరాబాద్‌ను బీఆర్ఎస్, బీజేపీ నేతలు కబళించారని, ఈ భూబకాసురులే తమ టార్గెట్ అని, పేద ప్రజలు కాదని స్పష్టంచేశారు. సమయం వచి్చనప్పుడు ఈ భూబకాసురుల పేర్లు బయటకు వస్తాయని, వారు వెళ్లే జైలు పేరు కూడా తెలుస్తుందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. హైడ్రాతో భయభ్రాంతులకు గురవుతున్నది బీఆర్ఎస్ నేతలే తప్ప సామాన్య ప్రజలు కాదని అన్నారు. తలో దిక్కు దోచుకున్నారు రాష్ట్రాన్ని పదేళ్ల పాలించిన బీఆర్ఎస్ మల్లన్నసాగర్ కట్టేందుకు సీఆరీ్పఎఫ్ జవాన్లతో కొట్టించి మరీ ప్రజలను ఖాళీ చేయించిందని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పదేళ్ల అరాచకాలను ప్రజలు మర్చిపోలేదని, తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు తలోదిక్కు దోచుకున్న విషయాన్ని గమనించిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఇక, బీజేపీ నేతల్లో ప్రజానాయకులు ఎవరున్నారని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు.నిజామాబాద్ ఎంపీ అరవింద్ కంటే రైతు మోసగాడు ఎవరుంటారని ప్రశ్నించారు. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ చేసిన ట్రోలింగ్లతో పద్మశాలీల గుండెలు పగిలిపోతున్నాయని మహేశ్‌గౌడ్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం పెట్టిన ఆ పోస్టింగ్‌పై కేటీఆర్, హరీశ్‌రావులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎక్కడున్నాడో చెప్పాలని మహేశ్‌గౌడ్ దుయ్యబట్టారు. సమావేశంలో ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, టీపీసీసీ నేతలు సామా రామ్మోహన్‌రెడ్డి, సంధ్యారెడ్డి, భవానీరెడ్డి, బండారి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. -
అసమ్మతిపై కాంగ్రెస్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.సమర్థుల కోసం అన్వేషణపీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
అధికారులు మాట వినడం లేదట!.. టీపీసీసీ చీఫ్‌కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: అధికారులు తమ మాట వినడం లేదంటూ కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. అధికారంలో ఉన్నామో.. ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల వ్యవహారాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు మహేష్‌గౌడ్ అప్పగించారు. కాగా, రేపు సాయంత్రం 4 గంటలకు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మాదాపూర్ రాడియంట్ హోటల్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. లోకల్ బాడీ ఎన్నికలు, పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపడుతోంది. పీసీసీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో శనివారం నుంచి జిల్లా స్థాయి సమీక్షలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలుజిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల స్థితిగతులు, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాల్సిన తీరు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ అంశాల ప్రాతిపదికగా ఈ సమీక్షలు జరుగుతాయని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పార్టీ అన్ని స్థాయిల నాయకులు పాల్గొననున్నారు. -
సీఎం, మంత్రులకు టీపీసీసీ చీఫ్ కొత్త రూల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. సీఎం రేవంత్ టీపీసీసీ బాధ్యతలను మహేష్ కుమార్‌కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘నేను పీసీసీ అధ్యక్షుడు అయినా కార్యకర్తగానే ఉంటాను. ఇద్దరు విభిన్నమైన వ్యక్తులతో కలిసి పని చేశాను ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొకరు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ. అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నాయకులు అందరినీ కో-ఆర్డినేట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అందరూ కలిసి పని చేస్తున్నారు.నాకు గాంధీ భవన్‌తో 40 ఏళ్ల అనుబంధం ఉంది. నేను పీసీపీ చీఫ్ అవుతానని అనుకోలేదు. నాకు ఇన్నీ రోజులు పదవి ఎందుకు రాలేదు? అని ఎప్పుడు అనుకోలేదు. నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. అందుకే నాకు ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు పీసీసీ పదవి వచ్చింది. నాకు భేషజాలు లేవు. గాంధీ భవన్లో పవర్ సెంటర్లు లేవు. ఒక్కటే పవర్ సెంటర్ రాహుల్ గాంధీ పవర్ సెంటర్. ప్రతీ రోజు గాంధీ భవన్లో ఆరు గంటలు ఉంటాను. ప్రతీ వారం ఒక ఇద్దరు మంత్రులు గాంధీ భవన్‌కు రావాలి. బుధవారం ఒకరు.. శుక్రవారం మరో మంత్రి అందుబాటులో ఉండాలి. నెలకు ఒకసారి సీఎం కూడా గాంధీభవన్‌కు రావాలి.కౌశిక్ రెడ్డి వాడిన భాష వలన గాంధీ అనుచరులు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక భాష మారిపోయింది. కేసీఆర్‌కు భాషకు రేవంత్ కూడా తన భాషతోనే సమాధానం చెప్పాడు. అందుకే మనం అధికారంలోకి వచ్చాము. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాను సోషల్ సెన్స్ లేకుండా వాడుతున్నారు అంటూ విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండుగ కాదు.. పండుగ అని నిరూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేశాం. ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేశారు. రూ.2లక్షలు మాఫీ చేస్తామని చెప్పి.. చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.రూ.2లక్షలు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామన్నారు. రైతు రుణమాఫీపై ఆనాడు హామీ ఇచ్చాం.. అమలు చేసి చూపించాం. రాజీనామా సవాల్ చేసిన వాళ్లు ఎక్కడికి పోయారు. రాజీనామా చేయకుండా ఎక్కడ దాకున్నారు. రుణమాఫీ అయిన రైతుల వివరాలు హరీష్‌రావుకు పంపిస్తాం. మొన్నటి గెలుపు సెమీ ఫైనల్ మాత్రమే. 2029లో ఫైనల్స్ ఉన్నాయి అంటూ వ్యాఖ్యలు చేశారు.త్వరలోనే రీజినల్ రింగ్ రోడ్డు రాబోతుంది. ఆర్ఆర్ఆర్ కోసం ప్రధాని మోదీని కలిసాం. ముచ్చర్లలో ఫోర్త్ సిటీ రాబోతుంది. అక్కడ అద్భుతమైన సిటీని నిర్మించబోతున్నాం అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం చేసే మంచి పనులు ప్రతీ ఇంటికీ తీసుకెళ్లే బాధ్యత కొత్త పీసీసీపై ఉంది. ప్రభుత్వాన్ని, పార్టీని సమన్వయం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాం. పార్టీలో క్రమశిక్షణ ఉంటే కొంచం ఆలస్యమైనా పదవులు వస్తాయి. పార్టీలో చాలా మందికి ప్రభుత్వంలో అవకాశం కల్పించాం. ఇంకా మరికొందరికి కూడా అవకాశం ఇస్తాం అని చెప్పుకొచ్చారు. -
ఉప ఎన్నికలు రావు.. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే: టీపీసీసీ చీఫ్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను కలిసి సమన్వయంతో పనిచేస్తామని చెప్పుకొచ్చారు కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీలో అందరినీ కలుపుకుని పనిచేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సూచించారని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో పెద్దలను కలిశారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గేను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. 60 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. లోక్‌సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అయినా 2019 కంటే ఐదు స్థానాలు ఎక్కువగానే సాధించాం.కేబినెట్ విస్తరణపై ఏఐసీసీదే నిర్ణయం..తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారు. దీనిపై వారే నిర్ణయం తీసుకుంటారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంతవరకు పాత కమిటీలు పనిచేస్తాయి. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతాను. ప్రజలు నమ్మకంతో మాకు అధికారాన్ని ఇచ్చారు, సమన్వయంతో పనిచేస్తున్నాం. కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికలు మాకు ఓ సవాల్. పీసీసీ కమిటీలలో 50 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉంటాయి.అరికెపూడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే..పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చింది. మరికొంతమంది ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ సవాళ్లను పట్టించుకునే స్థితిలో లేరు. ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించే స్థితిలో లేరు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారు?. బీఆర్ఎస్ నాయకత్వంపై నమ్మకం లేకనే కారు పార్టీ నేతలు మా పార్టీలో చేరుతున్నారు. ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికలు వచ్చినా మేము సిద్ధమే. ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే మళ్లీ గెలుస్తారు. అరికెపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే’ అని చెప్పుకొచ్చారు.అలాగే, హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలపై కూడా ఆయన స్పందించారు. హైడ్రా కూల్చివేతల్లో ఇల్లు కోల్పోతున్న పేదలకు న్యాయం చేయాలి. తెలిసో తెలియకో పేదల అక్కడ ఇల్లు కట్టుకున్నారు. వారికి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఇది కచ్చితంగా రేవంత్ చేయించిన దాడే.. కేటీఆర్ ఫైర్ -
‘ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతా!’
సాక్షి, గాంధీభవన్: టీపీసీసీ చీఫ్ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. ఇదే సమయంలో తన మనసులోని మాటను బహిర్గతం చేశారు. తాను కూడా పీసీసీ చీఫ్ కావాలనుకుంటున్నట్టు తెలిపారు. ఎప్పటికైనా పీసీసీ చీఫ్ అవుతానని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి శనివారం గాంధీభవన్‌లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘కొత్త పీసీసీ చీఫ్ పార్టీలో అందరినీ కలుపుకునిపోతారని భావిస్తున్నాను. పార్టీ లైన్లో పనిచేసిన నేత మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ పదవి బీసీ నేతకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. తెలంగాణలో ముఖ్యమంత్రి రెడ్డి సామాజికి వర్గానికి చెందిన నేత కావడంతో పీసీసీ బీసీ నేతకు ఇచ్చారు. నేను కూడా ఏదో ఒకరోజు పీసీసీ చీఫ్ అవుతాను. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అధిష్టానం పీసీసీ ఇచ్చింది. భవిష్యత్‌లో రెడ్డిలకు పీసీసీ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయిస్తే నేను ప్రయత్నాలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి చాలా హ్యాపీగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే ఫ్రీడమ్ ఉంటుంది. బీజేపీలో స్టేట్ ప్రెసిడెంట్ కావాలన్నా కష్టమే. ఎవరికీ వస్తుందో తెలియదు. ఎప్పుడు పోతుందో తెలియదు. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ.. అందులో పార్టీ ప్రెసిడెంట్ పోస్టు ఉండదు. బీసీ కమిషన్ నియామకం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రైతుల పట్ల పూర్తి అవగాహన ఉన్న నేత కోదండరెడ్డికి రైతు కమిషన్ ఇచ్చారు. వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం అందరినీ ఆదుకుంటుంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకాలం టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి అద్భుతంగా పనిచేశారంటూ పార్టీ అధిష్టానం అభినందించింది. మహేష్‌కుమార్‌గౌడ్ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్విద్యార్థి నేత నుంచిబొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ 1980లో భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) ద్వారా విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన, ఎనిమిదేళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ కమిటీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై యూత్‌కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కమిటీల్లో స్థానం సంపాదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీపీసీసీ అధికార ప్రతినిధిగా, కార్య దర్శిగా, ప్రధానకార్యదర్శిగా పలు హోదాల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమ యంలో ఏపీ వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితుౖలెన సమయంలోనే మహేశ్‌కుమార్‌గౌడ్‌కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం దక్కింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలుగా టీపీసీసీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి టికెట్ ఆశించినా దక్కలేదు. పార్టీ వ్యవహారాల్లో నిమగ్నమై ఉండాలని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు టికెట్ రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. విధేయతకు పెద్దపీట వేస్తూ తాజాగా అధిష్టానం ఆయన్ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ ఏర్పాటయ్యాక నాలుగో పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పొన్నాల లక్ష్మయ్య, కెప్టెన్.ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డిల తర్వాత అధ్యక్షుడు కానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పదోన్నతి కల్పించి పీసీసీ అధ్యక్షుడిగా నియమించిన కాంగ్రెస్ హైకమాండ్... మళ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌కు పదోన్నతి కల్పించి అధ్యక్షుడిగా నియమించడం గమనార్హం.కరాటే ‘డాన్’....రాజకీయాల్లో నిత్యం బిజీగా ఉండే మహేశ్‌కుమార్‌గౌడ్ తనకు ఇష్టమైన కరాటే పట్ల ఆసక్తిని మాత్రం తగ్గనివ్వలేదు. 2006లో కరాటే బ్లాక్‌బెల్ట్ 6వ డాన్ పూర్తి చేసిన ఆయన రాష్ట్రంలో కరాటే క్రీడ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు.చిత్తశుద్ధి, అంకితభావంతో పార్టీని బలోపేతం చేస్తా : మహేశ్కుమార్గౌడ్నిరంతరం కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధితోపాటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని టీపీసీసీ కొత్త అధ్యక్షుడు బొమ్మా మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, అంకిత భావంతో నెరవేరుస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, పార్లమెంట్లో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతకాలం నాకు సహకరించిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు.’అని ఆ ప్రకటనలో మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ⇒ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు గోపిశెట్టి నిరంజన్, అధికార ప్రతినిధి శ్రీరంగం సత్యం తదితరులు వేర్వేరు ప్రకటనల్లో హర్షం వ్యక్తం చేశారు. మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడి గా నియమించిన వార్త తెలియగానే గాంధీ భవన్లో టీపీసీసీ కల్లుగీత కార్మిక విభాగం అ«ధ్యక్షుడు నాగరాజుగౌడ్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు. ⇒ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి ఫోన్ చేసినట్టు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కొత్త అధ్యక్షుడికి ఫోన్ చేసిన రేవంత్ అభినందనలు తెలిపారని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరినట్టు వెల్లడించాయి.మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రొఫైల్పేరు: బొమ్మా మహేశ్కుమార్గౌడ్తండ్రి: గంగాధర్‌గౌడ్ (లేట్)పుట్టిన తేదీ: 24–02–1966జన్మస్థలం: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లావిద్యార్హత: బీకాంరాజకీయ ప్రస్థానం: నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1986–1990) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు (1990–98) యూత్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శి (1998–2000) పీసీసీ కార్యదర్శి (2000–2003), అధికార ప్రతినిధి (2012–2016) టీపీసీసీ ప్రధాన కార్యదర్శి (2016–2021) టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ (2017–2024) -
టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్ గౌడ్‌ను కాంగ్రెస్ హైకమాండ్ ఫైనల్ చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఏఐసీసీ అధికారికంగా వెల్లడించింది. బీసీ వర్గానికి చెందిన నేతకే పీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక, ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీగా ఉన్నారు. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా పని చేశారు. Congress appoints B Mahesh Kumar Goud as President of Telangana Pradesh Congress Committee with immediate effect pic.twitter.com/DoSd31xagO— ANI (@ANI) September 6, 2024ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..‘నాపై అత్యంత నమ్మకంతో నాకు కీలకమైన టీపీసీసీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో అంకిత భావంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పని చేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్ఠతకు కృషి చేస్తాను. ఇంతకాలం నాకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. నాకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ నెలల సమయం తీసుకుంది. ఆగస్టు 23న పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన హై కమాండ్ పెద్దలు. విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలలో మహేష్ కుమార్ గౌడ్‌కు పట్టుంది. దక్షిణ తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో ప్రాంతీయ సమీకరణాల దృష్ట్యా ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ను హైకమాండ్ ఎంపిక చేసింది.ఓసీ సామాజిక వర్గం నుంచి సీఎంగా రేవంత్ రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క, బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేశారు. కుల సమీకరణలను దృష్టిలో ఉంచుకొని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ హై కమాండ్ పెద్దలతో మహేష్ కుమార్ గౌడ్ క్రియాశీల సంబంధాలు కలిగి ఉన్నారు. అంతకుముందు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆ పదవి ఖాళీ అయ్యింది. ఆ స్థానంలో మమేష్ కుమార్ గౌడ్‌ను ఎంపిక చేశారు. ఇక, రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన మహేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వరించడం విశేషం. రాజకీయ ప్రస్థానం ఇలా..👉నిజామాబాద్ జిల్లాలోని భీంగల్ మండలంలోని రహత్ నగర్లో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మించారు. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆయన ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి చెందారు.👉2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.👉2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.👉అనంతరం, పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.👉2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ, అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.👉మహేష్ కుమార్ 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియామకం.👉2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా ఎంపికయ్యారు.👉2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు.[👉2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలుపొందారు. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది.👉జనవరి 31న తెలంగాణ శాసనమండలి సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. -
టీపీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త సారథిగా ప్రస్తుత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ సారథితోపాటు పశి్చమ బెంగాల్‌కు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, కేరళకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామకానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత పత్రంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంతకం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలలుగా కసరత్తు.. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పీసీసీ అధ్యక్ష నియామకంపై గడిచిన రెండు నెలలుగా కసరత్తు జరుగుతుండగా, వివిధ సామాజిక కోణాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరిగాయి. పది రోజుల కిందటే మరో దఫాలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించి ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చర్చించారు. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గ నేతకే పీసీసీ పదవిని కట్టబెట్టాలనే తుది నిర్ణయానికి వచ్చారు.బీసీల్లో ప్రధాన పోటీదారులుగా ఉన్న మహేశ్‌గౌడ్‌తోపాటు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ల అభ్యర్థిత్వాలపై చర్చించారు. వారి అభ్యర్థిత్వాలపై రాష్ట్ర నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉండటంతో నిర్ణయాధికారాన్ని అగ్రనేత సోనియా గాం«దీకి కట్టబెట్టారు. ఆమె సూచనల మేరకు విద్యార్థి దశ నుంచి పారీ్టకి సేవలందిస్తూ రాష్ట్ర నేతలందరితో సన్నిహిత సంబంధాలుగల మహేశ్ గౌడ్ వైపు ఏఐసీసీ మొగ్గుచూపినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఏ క్షణమైనా ఉంటుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. -
ఆ ఇద్దరిలో ఒక్కరికి పీసీసీ చీఫ్ పదవి
-
తెలంగాణ పీసీసీ చీఫ్ పై ఎట్టకేలకు క్లారిటీ
-
ఉత్తర తెలంగాణ నేతకు పీసీసీ చీఫ్..
-
ఢిల్లీలో రేవంత్.. పీసీసీ చీఫ్ రేసులో ఆ ముగ్గురు?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కాగా, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్ష పదవితోపాటు, మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. మరోవైపు.. శుక్రవారం తెల్లవారుజామునే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీకి బయలుదేరారు.ఇక, గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ కోర్ కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్సీలు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా నేడు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో నూతన పీసీపీ చీఫ్, కేబినెట్ విస్తరణ, రైతులకు రుణమాఫీ చేసిన అంశాన్ని రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ వివరించనున్నారు.పీసీసీ రేసులోకి కొత్త పేర్లు..ఇక, తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వినిపిస్తున్నట్టు సమాచారం. సీఎం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకే పీసీసీ ఇవ్వాలంటున్నారు. దీంతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల నుండి ఒక్కో పేరుతో షార్ట్ లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది.వారి పేర్లు ఇలా.. ఎస్సీ సామాజికవర్గం నుండి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్.ఎస్టీ సామాజిక వర్గం నుండి బలరాం నాయక్.బీసీ సామాజిక వర్గం నుండి మధు యాష్కీ.ఇదిలా ఉండగా.. నేటి సమావేశంలోనే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎంతో సహా ఇప్పుడున్న 12 మంది మంత్రులకు అదనంగా మరో నలుగురిని మంత్రి మండలిలోకి తీసుకునేందుకు ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలలో సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, గడ్డం వివేక్, శ్రీహరి ముదిరాజ్, బాలునాయక్, రామచంద్రనాయక్ ఉన్నారు. ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, కోదండరాం తదితరులు ఉన్నారు. -
నెలాఖరులోగా ‘నామినేటెడ్’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు మరోసారి పదవుల పందేరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. రెండో దఫా నామినేటెడ్ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఇంతకుముందు 36 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించగా.. ఈసారి మరో 25కుపైగా పోస్టులను నింపే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం రేవంత్ అమెరికా, దక్షిణ కొరియాల పర్యటన పూర్తి చేసుకుని వచ్చాక..ఢిల్లీ వెళ్లి ఈ విషయంపై అధిష్టానంతో చర్చలుజరపనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అవుతుందని.. ఈ నెలాఖరులోపే నామినేటెడ్ పదవుల జాబితా వెలువడుతుందని వెల్లడిస్తున్నాయి. పదవుల కోసం ఎదురుచూపులు ఎన్నో.. తొలి దఫాలో పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు కలిపి 36 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అప్పగించారు. ఆ జాబితాలో చోటుదక్కని చాలా మంది మలి జాబితా కోసం ఎదు రుచూస్తున్నారు. చాలా కాలం నుంచీ పార్టీలో పనిచేస్తున్నవారు, విద్యార్థి నాయకులు, అధికార ప్రతినిధులుగా పనిచేస్తున్నవారు, మహిళా నేతలతోపాటు కొందరు సీనియర్లు కూడా పదవులు ఆశిస్తున్నారు. నెల రోజుల క్రితమే రెండో దఫా పదవుల పందేరం ఉంటుందనే చర్చ జరిగినా ఆ దిశగా అడుగులు పడలేదు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది దగ్గరపడుతోందని, వీలైనంత త్వరగా పదవులు ఇవ్వాలని ఆశావహులు రాష్ట్ర పార్టీ నాయకత్వానికి, అధిష్టానానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యేలకు కూడా! రెండో రౌండ్ నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు కీలక కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్టు చర్చ జరుగుతోంది. ఆర్టీసీ, సివిల్ సప్లైస్, మూసీ రివర్‌ఫ్రంట్ వంటి ముఖ్యమైన కార్పొరేషన్లను ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని.. సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గంలో స్థానం దక్కనివారికి చైర్మన్ పదవులతోపాటు కేబినెట్ హోదా కల్పిస్తారని సమాచారం. ఇక బేవరేజెస్ కార్పొరేషన్, వైద్య మౌలిక సదుపాయాల కల్పన, హ్యాండ్లూమ్స్, గీత కార్పొరేషన్ తదితర పోస్టులు కూడా ముఖ్య నేతలకు అప్పగించనున్నట్టు తెలిసింది. వీటితోపాటు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లకు కూడా ఈసారి చైర్మన్లను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు వైశ్య కార్పొరేషన్‌కు మాత్రమే చైర్మన్‌ను ప్రకటించగా.. మిగతా కులాల కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను ప్రకటించాలని టీపీసీసీ నాయకత్వంపై ఒత్తిడులు వస్తున్నాయి. -
కాంగ్రెస్ నేతల్లో కొత్త ఆశలు
-
కర్ణాటక ఫార్ములా..?
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పగ్గాల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. పార్టీ పట్ల విధేయత, సీనియారిటీతోపాటు విపక్షాలను దీటుగా ఎదుర్కోగలిగిన సామర్థ్యం, అధికారంలో ఉన్న పార్టీని సమన్వయంతో నడి పించగలిగిన నేత కోసం కాంగ్రెస్ అధిష్టానం అన్వేషిస్తున్నట్టు తెలిసింది. కర్ణాటక ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే అంశాన్ని కూడా ఢిల్లీ పెద్దలు సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు సమాచా రం. అన్ని కోణాల్లో కసరత్తు పూర్తిచేసి ఈ నెలాఖరు కల్లా టీపీసీసీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించాలని భావిస్తున్నట్టు తెలిసింది. విధేయత, సమర్థతను పరిశీలిస్తూ: సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఈనెల 27 నాటికి మూడేళ్లు పూర్తవుతోంది. పీసీసీ అధ్యక్షుడి పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. దీనికితోడు రేవంత్ సీఎం అయిన నేపథ్యంలో.. పీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టింది. ఇందుకోసం సామాజిక వర్గాలు, విధేయత, సీనియారిటీ, కర్ణాటక ఫార్ములా తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. సమర్థుడైన నేతను పీసీసీ చీఫ్‌గా నియమించాలని భావిస్తున్నట్టు తెలిసింది.ముఖ్యంగా సీనియారిటీతోపాటు పార్టీ పట్ల విధేయతను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. వచ్చే మూడేళ్లపాటు ప్రభుత్వంతో, పార్టీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడం, విపక్షాలకు దీటుగా కౌంటర్లు ఇవ్వగలిగిన నేతను ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ కోణంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్టు గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.గతంలో పార్టీని నడిపించిన అనుభవం, ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సభ్యుడిగా పనిచేయడం నేపథ్యంలో.. ఉత్తమ్‌ను మరోమారు పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందని అంటున్నారు. మరోవైపు పారీ్టకి విధేయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. సామాజికవర్గ కోణంలోనూ ఫోకస్.. పీసీసీ అధ్యక్ష పదవిని సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ (మాదిగ) వర్గ నేతకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. ఈ సామాజిక వర్గానికి చెందిన ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతోపాటు మంత్రి దామోదర రాజనర్సింహ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీలకు కాదంటే బీసీలకు పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని గాం«దీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీహెచ్‌ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నాయి.అదే ఎస్టీలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటే.. సీతక్క, బలరాం నాయక్ తదితరుల పేర్లను.. మైనార్టీ కోణంలో చూస్తే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేరును పరిశీలించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. అయితే సామాజిక వర్గాల కోణంలో ఇవ్వాల్సి వస్తే.. ఎస్సీ లేదా బీసీలకే చాన్స్ ఎక్కువనే చర్చ జరుగుతోంది. మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి పీసీసీ బాధ్యతలు ఇవ్వాలనుకుంటే మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆయనను పీసీసీ చీఫ్‌గా నియమించలేని పక్షంలో ఏఐసీసీలో మంచి హోదాలో నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది.మొత్తంగా సీనియారిటీ, సిన్సియారిటీ, సామాజిక వర్గాల లెక్కల్లో అన్ని అంశాలను పరిశీలించి.. ఈ నెలాఖరు కల్లా పీసీసీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి సోనియాగాం«దీని కలిసిన సందర్భంగా కొత్త పీసీసీ చీఫ్‌గా ఎవరు ఉండాలన్న దానిపై అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. కర్ణాటక తరహా ఫార్ములాపై పరిశీలన కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ విషయంలో కర్ణాటక తరహా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలన్న విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్‌ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబట్టిన శివకుమార్‌కు ఆ అవకాశం ఇవ్వలేకపోవడంతో డిప్యూటీ సీఎంతోపాటు పీసీసీ చీఫ్ బాధ్యతలనూ అప్పగించారు. దాంతో ఆయన పారీ్టలో, ప్రభుత్వంలో రెండో పవర్ సెంటర్‌గా నిలిచారు.అదే తరహాలో తెలంగాణలో డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కను పీసీసీ చీఫ్‌గా నియమించే అంశాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నట్టు సమాచారం. అదే జరిగితే రాష్ట్రంలో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని.. కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఇలానే ఉంటాయని గాం«దీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం గమనార్హం. -
దూసుకెళ్తున్న కాంగ్రెస్.. రేవంత్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్ నుంచి కాంగ్రెస్ తన సత్తా చాటుతోంది. తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు 65 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతోంది. తెలంగాణలో తొలి ఫలితం వెల్లడైంది. ఖమ్మం ఆశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం సాధించింది. 28,358 ఓట్లతో ఆది నారాయణ గెలించారు. ఇల్లందులోనూ కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం సాధించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది’’ అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j — Revanth Reddy (@revanth_anumula) December 3, 2023 -
తెలంగాణ ప్రజలకు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మకు రాజకీయాలతో మభ్యపెట్టాలని చూస్తున్నాయని.. ప్రజలు ఇది గమనించి ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పాలని లేఖలో కోరారాయన. ‘‘బీజేపీ-బీఆర్ఎస్లు కుమ్మక్కు అయ్యాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేయిస్తున్నాయి. అత్యున్నత ప్రభుత్వ సంస్థల్ని.. రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని మోదీ, కేసీఆర్‌లు రాజకీయ క్రీడలో పావులుగా మార్చారు. ఆ రెండు పార్టీలో చేరినవాళ్లు పవిత్రులు.. ఇతర పార్టీలో చేరి ప్రజల తరఫున పోరాడితే వాళ్లు ద్రోహులా?. అటు దేశంలో.. ఇటు రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదు... ప్రశ్నించే గొంతులే మిగలకూడదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీ-బీఆర్ఎస్ మధ్య కుదిరిన కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఇది’’ అని లేఖలో పేర్కొన్నారయన. .. కేవలం కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా ఈడీ, ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి?. వీటి వెనుక ఉన్న అదృశ్య హస్తాలు ఎవరివి?!. కాంగ్రెస్ నేతలను వేధించాలన్న ఆదేశాలు ఈడీ, ఐటీ సంస్థలకు ఎక్కడ నుండి అందుతున్నాయి?. గడచిన పదేళ్లలో మోదీ - షా ఆదేశాలు లేకుండా ఈడీ, ఐటీ సంస్థల్లో చీమచిటుక్కు మన్నది లేదు. కాంగ్రెస్ నేతల ఇళ్లపై జరుగుతోన్న దాడుల వెనుక ఎవరున్నారో తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అని లేఖ ద్వారా కోరారు రేవంత్. కాంగ్రెస్ గెలుపు అవకాశాలు పెరుగుతున్న కొద్దీ... ఈడీ, ఐటీ దాడులూ పెరుగుతున్నాయి. అమిత్ షా - కేసీఆర్ కలిసి ప్రణాళిక రచించడం. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి దానిని అమలు చేయడం... ఇదే కదా జరుగుతున్నది!. ప్రతి రోజు సూర్యుడు అస్తమించగానే.. వీళ్ల కుట్రలకు పథక రచన జరుగుతోంది. కేసీఆర్‌కు వందల కోట్ల విరాళాలు ఇచ్చిన వ్యక్తుల జోలికి ఆ సంస్థలు వెళ్లవు. కాళేశ్వరం కుంగి అవినీతి బట్టబయలైతే ఆ సంస్థలు కేసీఆర్ ను ప్రశ్నించవు. కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగులేటి, కేఎల్ఆర్, తుమ్మల ఇళ్లపై.. తాజాగా వివేక్ వెంకట స్వామి ఇళ్లు, కార్యాలయాలపై మాత్రం విరుచుకుపడుతున్నారు. .. మీ పార్టీలో ఉన్నప్పుడు కనిపించని పన్ను ఎగవేతలు... కాంగ్రెస్ పార్టీలో చేరగానే కనిపిస్తున్నాయా?! . పోటీ చేసే అభ్యర్థుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం పై కూడా ఉంది. నేను బీజేపీ – బీఆర్ఎస్ పార్టీలను హెచ్చరిస్తున్నా. మీ పతనం మొదలైంది. మీ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లింది. మీ కవ్వింపు చర్యలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో మరింత కసిని పెంచాయి. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరెన్ని దాడులు చేసినా రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరు’’ అని రేవంత్‌రెడ్డిలో లేఖలో పేర్కొన్నారు. -
నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి.. రేవంత్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆధిపత్య ధోరణితోనే ముందుకు వెళ్లారని, పదేళ్లుగా తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అందలేదని, అందుకే మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడిందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ప్రస్థానాన్ని మూడు భాగాలుగా చూడాల్సి ఉంటుంది. నిజాం నిరంకుశ పాలన.. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన విధ్వంసం.. తెలంగాణలో జరిగిన అన్ని పోరాటాలకు మూలం భూమి.. తెలంగాణ చరిత్ర చూస్తే.. ఆకలినైనా భరించింది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. అందుకే నాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ‘‘నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు రుచి చూపించబోతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరిచేందుకే కాంగ్రెస్ మేనిఫెస్టోను రూపొందించాం. ప్రజలు ఇచ్చే తీర్పుకు కొలబద్దగా పాలసీ డాక్యుమెంట్‌ను ప్రజల ముందుంచాం. తుది దశ తెలంగాణ ఉద్యమంలో మీడియా ముందుభాగాన నిలవాలి. ప్రజలను బానిసలుగా చూస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలి. తెలంగాణ ప్రజలకు ఇదే చివరి ఉద్యమం కావాలి’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ‘‘ఈ ఉద్యమం పరిపాలన కోసం, అధికారం కోసం కాదు... తెలంగాణ ఆత్మగౌరవం కోసం.. ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఎవరు సీఎంగా ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆ ఆదర్శాన్ని తిరిగి పునరుద్దరిస్తాం.. కేసీఆర్ కు ఫెడరల్ స్ఫూర్తి తెలియదు... ఆయన రాచరికం అనుకుంటున్నారు’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా ప్రాధాన్యతలు ఉంటాయి. 2 వేల పెన్షన్ గురించి కేసీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఇచ్చే పెంషాన్ కంటే కర్ణాటకలో పెన్షన్‌తో పాటు మహిళలకు అదనంగా నగదు బదిలీ అవుతోంది. కేసీఆర్ సవాల్లో పస లేదు. 60 నెలల్లో కేసీఆర్ పేదలకు 1 లక్షా 80 వేలు బాకీ ఉన్నారు. 110 సీట్లలో డిపాజిట్లు రాని బీజేపీ బీసీ సీఎంను చేస్తామనడం ఓబీసీలను అవమానించడమే. బలహీనవర్గాలు కేసీఆర్‌ను ఓడించాలన్న కసితో ఉన్నారు.. ఆ ఓట్లను చీల్చి కేసీఆర్‌కు సహకరించడమే బీజేపీ వ్యూహం. ఏబీసీడీ వర్గీకరణపై గతంలో వెంకయ్య నాయుడు సభ నిర్వహించి 100 రోజుల్లో చేస్తామన్నారు.. ఇప్పటికీ అతీగతి లేదు. బిల్లు పెడితే మద్దతు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నా.. బీజేపీ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదు?’’ అని రేవంత్ మండిపడ్డారు. ‘‘దళితుల ఓట్లు కాంగ్రెస్‌కు రాకుండ చీల్చేందుకే కమిటీతో కాలయాపన. మంద కృష్ణకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. ఢిల్లీ వెళదాం.. మోదీని కలిసి ఆర్డినెన్స్‌కు మద్దతు ఇస్తామని నేను చెబుతా.. అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఇవ్వాలని మోదీని కోరదాం. ప్రభుత్వం అనుకుంటే 48 గంటల్లో ఆర్డినెన్స్ ఇవ్వొచ్చు. అబద్ధపు హామీలను నమ్మకుండా మందకృష్ణ కార్యాచరణ ప్రకటిస్తే ఆయనకు మద్దతు ఇస్తాం. 24 గంటల కరెంటుపై ఏ సబ్ స్టేషన్ కైనా వెళదాం.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం’ అని రేవంత్ తెలిపారు. ధరణి పేరుతో పెద్ద ఎత్తున భూ దోపిడీ జరిగింది. హైదరాబాద్ చుట్టూ ఉన్న లక్ష ఎకరాల నిజాం వారసుల భూములు చేతులు మారాయి. అందుకే ధరణి రద్దు చేస్తామంటే కేసీఆర్ కు దుఃఖం వస్తుంది. కేసీఆర్ సీఎం హోదాలో అబద్దాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు’’ అంటూ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా? -
‘అందుకే 15 రోజుల్లో కుట్ర అంటూ కేటీఆర్ సంకేతాలిచ్చారు’
సాక్షి, హైదరాబాద్: ‘గువ్వల బాలరాజును కేటీఆర్ పరామర్శించి మాపై ఆరోపణలు చేశారు. కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ చర్యలు సిగ్గుచేటు’’ అంటూ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘15 రోజుల్లో ప్రభుత్వంపై కుట్రలు జరగబోతున్నాయని డ్రామారావు అంటుండు. 2021లో పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ పై దాడి ఘటన జరిగింది. ఫలితాలు వచ్చిన తరువాత దాడిలో కుట్ర లేదని తేల్చారు.. తెలంగాణలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ యువకుడు దాడి కత్తి చేశాడు. గాయపడ్డ ప్రభాకర్ రెడ్డి నడుస్తుంటే.. మంత్రి హరీష్ పరుగెత్తి సురభి డ్రామాను మించి నాటకాలాడారు. ఈ దాడి వెనక కాంగ్రెస్ ఉందని కేసీఆర్ కుటుంబమంతా ప్రచారం చేసింది. కానీ దాడిలో కుట్ర కోణం లేదని... సెన్సేషన్ కోసమే దాడి అని పోలీసులే చెప్పారు. కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి రిమాండ్ రిపోర్ట్ ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేదు? రిమాండ్ రిపోర్ట్ బయట పెట్టకపోవడంలో అంతర్యమేంటి?’’ అని రేవంత్ ప్రశ్నించారు. ‘‘హరీష్ రావుకు.. దాడికి పాల్పడ్డ యువకుడి ఫోన్ సంభాషణ ఏమైనా ఉందా?. దాడులు జరుగుతాయంటున్న కేటీఆర్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. కర్ణాటక నుంచి కూలి మనుషులను తెచ్చి కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తే ప్రజలు తిప్పికొట్టారు. గువ్వల బాలరాజును పరామర్శ పేరుతో డ్రామారావు మరో డ్రామాకు తెర తీశారు. కుమారస్వామి ప్రెస్ మీట్ గురించి తెలంగాణలో టీవీ ఛానళ్లు ప్రసారం చేయాలని మంత్రి హరీష్ ఛానళ్లకు ఫోన్లు చేశారు. ఆ రాష్ట్ర రాజకీయాలను ఈ రాష్ట్రంలో ప్రసారం చేయాలని చెప్పడంలో ఆంతర్యం ఏంటి?. బీజేపీతో పొత్తులో ఉన్న కుమార స్వామి ప్రెస్ మీట్ మంత్రి హరీష్ సమన్వయం చేయడం ఏంటి?. మూడోసారి కేసీఆర్‌ను సీఎం చేయడానికి బీఆరెస్, బీజేపీ, జేడీఎస్, ఎంఐఎం దుష్ట చతుష్టయం కుట్ర చేస్తున్నాయి’’ అంటూ రేవంత్ దుయ్యబట్టారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది?. రిటైర్ అయిన అధికారులపై చర్యలు చేపట్టాలని మేం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు స్పందన లేదు. ఫోన్లను హ్యాకింగ్ చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం మౌనంగా ఉంటుంది. బీజేపీ స్పష్టంగా బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనలో రిమాండ్ రిపోర్ట్ వెంటనే బయటపెట్టాలి. హరీష్ అనుచరులు, రాజుకు మధ్య ఫోన్ సంభాషణ ఏమైనా ఉంటే బయటపెట్టాలి. మేడిగడ్డ కుంగిన ఘటనలో అసాంఘిక శక్తుల పని అని తప్పుడు కేసులుపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలి. అందుకే కేటీఆర్ 15 రోజుల్లో కుట్ర జరగబోతుందని ప్రజలకు సంకేతాలు ఇచ్చారు. అధికారం కోసం ఎంతటి దారుణానికి తెగబడేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది’’ అని రేవంత్ మండిపడ్డారు. ‘‘మైనారిటీలను బీసీల్లో కలుపుతారని కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మోకాలికి, బోడిగుండుకు లింకుంపెట్టి అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు తప్పుడు ప్రకటనలు చేస్తున్న కేటీఆర్ పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?. ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన కమిటీలు ఎప్పుడో నివేదిక ఇచ్చాయి. డిసెంబర్ లో పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం బిల్లు పెడితే సరిపోతుంది. డిసెంబర్ 4 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మీరు బిల్లు పెట్టాలని బీజేపీని డిమాండ్ చేస్తున్నాం. వర్గీకరణ బిల్లుకు కాంగ్రెస్ అన్ కండిషనల్ మద్దతు ఇస్తుంది. మాదిగలను మరోసారి మోదీ మోసం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు.. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి. బీఆర్ఎస్ నేతల్లా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై మా నాయకులు రెడ్ డైరీలో రాసి పెడుతున్నారు. అధికారంలోకి రాగానే వారిపై చర్యలు ఉంటాయి’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 24 గంటల ఉచిత విద్యుత్ పై సూటిగా సవాల్ విసురుతున్నా. రాష్ట్రంలో ఏ గ్రామానికైనా వెళదాం.. 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం. శకునం పలికే బల్లి కుడితిలో పడి చచ్చినట్లు కేటీఆర్ వైఖరి ఉంది. కొడంగల్‌లో నన్ను ఒడిస్తానంటున్న కేటీఆర్ ముందు సిరిసిల్లలో చూసుకోవాలి’’ అని రేవంత్ కౌంటర్ ఇచ్చారు. చదవండి: నన్ను చంపాలని చూశారు: ఎమ్మెల్యే గువ్వల -
అధికారంలోకొస్తే ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక మైనారిటీ సబ్‌ప్లాన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచి్చంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సీడబ్ల్యూసీ సభ్యులు నాసిర్, షకీల్ ఆహ్మద్, కర్ణాటక మంత్రి జమీరుద్దీన్ అహ్మద్ తదితరులు మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ అధికార బీఆర్ఎస్ మెప్పు కోసం క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓడించేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ బాధ్యత తీసుకున్నాడని ఆరోపించారు. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో పోటీ చేయని మజ్లిస్ ఈసారి అజహరుద్దీన్‌పై ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపడం వెనుక మైనారిటీ ఓట్లు చీల్చే కుట్ర కనిపిస్తోందని దుయ్యబట్టారు. అలాగే మైనారిటీ పక్షపాతినని చెప్పుకొనే సీఎం కేసీఆర్ తమ పార్టీ నేత షబ్బీర్ అలీ పోటీ చేసే కామారెడ్డి స్థానం నుంచి కూడా పోటీ చేయడమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌కు దమ్ముంటే గోషామహల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై గెలవాలని రేవంత్ సవాల్ చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే మైనారిటీ డిక్లరేషన్‌లోని హమీల అమలు బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్, సీనియర్ ఉపాధ్యక్షుడు జాఫర్ జవీద్, కాంగ్రెస్ రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీతారావ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్‌లోని హామీలు... ► మైనారిటీ సంక్షేమ బడ్జెట్‌ను రూ. 4,000 కోట్లకు పెంచడంతోపాటు నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలు అందించడానికి ఏటా రూ.1,000 కోట్ల కేటాయింపు. ► 6 నెలల్లోగా కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో మైనారిటీలు సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు ఉండేలా చర్యలు. ► అబ్దుల్ కలాం తౌఫా–ఎ–తలీమ్ పథకం కింద ఎంఫిల్ పూర్తి చేస్తున్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, ఇతర మైనారిటీ యువతకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం. పీహెచ్డీ, అదనంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వారికి రూ. లక్ష, గ్రాడ్యుయేష¯న్కు రూ. 25,000, ఇంటర్‌కు రూ.15,000, 10వ తరగతి పాసైన వారికి రూ. 10,000 ఆర్థిక చేయూత. ► తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. ► మైనారిటీ సంస్థల్లో ఖాళీల భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ. ► మసీదుల ఇమామ్‌లు, మౌజమ్‌లు, దర్గాల ఖాదీమ్‌లు, చర్చి పాస్టర్లులకు నెలకు రూ. 10,000 నుంచి 12,000 వరకు గౌరవ వేతనం. ► వక్ఫ్ బోర్డు పరిరక్షణ, ఆక్రమణకు గురైన ఆస్తుల స్వాదీనం, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్. ► ముస్లిం, క్రిస్టియన్ శ్మశానవాటికల కోసం భూకేటాయిపు. ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు. ► కొత్తగా పెళ్లయిన ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు ఇతర మైనారిటీ జంటలకు రూ. 1,60,000 ఆర్థిక చేయూత. ► కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం సెట్విన్‌ల బలోపేతం. -
కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి: రేవంత్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: అన్నారం బ్యారేజీ వద్ద నెలకొన్న పరిస్థితిపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల ‘స్కామేశ్వరం’లో మరో మైలురాయి అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ నిన్న మేడిగడ్డ.. నేడు అన్నారం అంటూ ‘ఎక్స్’వేదికగా వ్యాఖ్యానించారు. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు అని విమర్శించారు. ‘ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌస్‌కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్లు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ. లక్ష కోట్ల ప్రజల సొమ్మును మింగేసి, నాలుగు కోట్ల జనం నోట్లో మట్టిగొట్టావు’అని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ‘వందేళ్లకు పైగా ఉండాల్సిన నిర్మాణాలు, ఇలా కండ్లముందే కొట్టుకుపోవడానికి కారణం.. మందేసి నువ్వు గీసిన ఆ పనికిమాలిన డిజైన్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు. కల్వకుంట్ల 'స్కామేశ్వరం'లో మరో మైలు రాయి.. నిన్న మేడిగడ్డ .. నేడు అన్నారం.. అక్కడ కూలుతున్నవి బ్యారేజీలు కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలు.. ప్రాజెక్టు అంటే నీ ఫామ్ హౌజ్ కు ప్రహరీ గోడనుకున్నావో.. నీ మనవళ్ళు ఆడుకునే ఇసుక గూళ్లు అనుకున్నావో.. రూ.లక్ష కోట్ల ప్రజల… pic.twitter.com/JC5NKgKaC4 — Revanth Reddy (@revanth_anumula) November 1, 2023 -
నవంబర్ 2 లోగా సంక్షేమ పథకాల చెల్లింపులు విడుదల చేయాలి: రేవంత్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: నోటిఫికేషన్ విడుదలకు ముందే నగదు బదిలీ కార్యక్రమాలు పూర్తిచేయాలని ఈసీని కోరామని టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్కు అనుకూలమైన రిటైర్డ్ అధికారులను తొలగించాలని కోరాం. బీఆర్ఎస్కు అనుకూలమైన అధికారులు ఏళ్లుగా కీలకమైన రంగాల్లో ఉన్నారు. కీలకమైన రంగాల్లో ఉన్న అధికారులు.. బీఆర్ఎస్కు ఆర్థిక సాయం చేయాలని వ్యాపార రంగాల వారిని కోరుతున్నారు. డీజీపీ అంజనీకుమార్‌ని తొలగించాలని ఈసీని కోరామని రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తాయి. బీఆర్ఎస్,బీజేపీ,ఎంఐఎం.. చడ్డీ గ్యాంగ్. బీఆర్ఎస్ను కాపాడేందుకు కేంద్రం పనిచేస్తుందని రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు అనుకూలంగా అధికారులు: ఉత్తమ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. తొమ్మిదిన్నరేళ్లుగా కొంతమంది అధికారులు బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. సీఎం అధికార నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజలను తప్పుదారి పట్టిస్తుంది: భట్టి బీఆర్ఎస్ ప్రజలను ఎలా తప్పుదారి పట్టిస్తుందో ఈసీకి తెలిపామని భట్టి విక్రమార్క అన్నారు. మేం చెప్పింది ఒకటైతే బీఆర్ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘‘మళ్లీ కేసీఆర్ మాయలో పడేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. నాణ్యతాలోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయి. కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోంది. క్రిమినల్ కేసులు పెట్టి విచారిస్తే తప్ప అసలు విషయం బయటకు రాదు. డ్యామ్ సేఫ్టీ అధికారులు నివేదికను నివేదికను బయటపెట్టడం లేదు. కేంద్రానికి.. బీఆర్ఎస్ కు ఉన్న లాలూచీ ఏంటి?. కేంద్రానికి ప్రొటెక్షన్ మనీ చెల్లించారు కాబట్టే రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలపై చర్యలు తీసుకోవడంలేదు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ ప్రభుత్వం కుంగిపోయే పరిస్థితి వచ్చింది’’ అంటూ టీ.కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. -
రేవంత్ శవాల మీద పేలాలు ఏరుకునే రకం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ‘‘మేము బతుకమ్మ చేస్తాం. బాధను కూడా పంచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?’’ అంటూ కవిత ప్రశ్నించారు. నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా?. కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. చివరికి గ్రూప్-2ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్‌రెడ్డి కూడా ట్విట్టర్లో డిమాండ్ చేయలేదా?’’ అని కవిత దుయ్యబట్టారు. బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాము.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం... ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023 -
సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
-
నాగర్ కర్నూల్ పీఎస్ లో రేవంత్ పై కేసు నమోదు
-
కుటుంబ సభ్యుల కోసం కేసీఆర్ పని చేస్తున్నారు: రేవంత్ రెడ్డి
-
కేటీఆర్‌కు పిండ ప్రదానం.. రేవంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఉప్పల్ పర్యటనలో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరణించిన కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ.. మున్సిపల్ మంత్రికి పిండప్రదానం చేస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదన్నారు. వరదలపై సమీక్షలు చేయకుండా రాజకీయాలపై దృష్టిపెట్టారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కేటీఆర్ బర్త్‌డే పార్టీల్లో మునిగిపోయారు అంటూ రేవంత్ మండిపడ్డారు. ‘‘వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వరదలతో 30 మంది చనిపోయినా కేసీఆర్ ఎందుకు పరామర్శించడం లేదు. వరద బాధితుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా? హైకోర్టు అక్షింతలు వేసినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదు’’ అని ధ్వజమెత్తారు. చదవండి: బండి బలమేంటో కమలానికి తెలిసొచ్చిందా? ‘‘సోమవారంలోగా ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో కదలిక రావాలి. లేకపోతే సోమవారం పార్లమెంట్లో నితిన్ గడ్కరీకి నివేదిస్తాం. వరద సాయం కింద తెలంగాణకు కేంద్రం రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలి. వరద సాయం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డిపై ఉంది. వెంటనే ప్రధానిని కిషన్‌రెడ్డి కలిసి నిధులు తీసుకురావాలి. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పరాకాష్ట’’ అంటూ రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. -
ఎంపీ కోమటిరెడ్డితో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం
-
బీఆర్ఎస్కు షాక్...కాంగ్రెస్‌లోకి కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి
సాక్షి, నాగర్‌కర్నూల్: కాంగ్రెస్‌లో పార్టీలోకి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. శనివారం హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇరువురి మధ్య విస్త్రృతస్థాయిలో చర్చ జరిగినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఎవరికి వారు తమ అభిప్రాయాలను చెప్పగా.. చివరగా ఇరువురి మధ్య సయోధ్య కుదిరినట్టుగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చినా ఇరువురు నేతలు సంపూర్ణ మద్దతుతో సహకారం అందించుకోవాలని ముఖ్య నేతలు చెప్పినట్లు తెలిసింది. ఇక కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైనట్టు సమాచారం. మరో నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో కూచుకుళ్ల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కలుసుకున్న పాత మిత్రులు సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఇరువురు ముఖ్యనేతలు కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్‌లో రాష్ట్ర ఉన్నత స్థాయి నేతల సమక్షంలో శనివారం జరిగిన భేటీలో ఇరువురి మధ్య సయోధ్య కుదిరి మళ్లీ కలసిపోనున్నట్లు తెలుస్తోంది. కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి మొదటి నుంచి నాగం జనార్దన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో నాగం టీడీపీ నుంచి పోటీ చేసినప్పుడు కూచుకుళ్ల ఆయన కోసం పనిచేశారు. అనంతరం 1998 సంవత్సరం వరకు నాగం వెంటే ఉండి ఆయనకు మద్దతుగా నిలిచారు.1999 ఎన్నికల సమయంలో నాగంతో విభేదించిన కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత బలపడనున్న వీరి బంధం ఎలాంటి ప్రభావం చూపనుందోననే అంశంపై ఆసక్తి నెలకొంది. ఎన్నికల ఏడాదిలో బీఆర్ఎస్కు షాక్ .. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతుండటంపై జోరుగా చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే నియోజకవర్గంలో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి పార్టీలో కలవడం తమకు ఎంతో కలసివస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తుండగా, ఆయన పార్టీ మారినా తమకు ఢోకా ఉండదని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రంగంలోకి డీకే శివకుమార్.. ట్రబుల్ షూటర్‌తో రేవంత్ రెడ్డి భేటీ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరు వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. టీ-కాంగ్రెస్‌లో చేరికలకు సంబంధించి డీకేతో రేవంత్ చర్చించారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో డీకే శివకుమార్ కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో డీకే శివకుమార్‌కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా అక్కడ పార్టీకి మరింత బలం చేకూరుతుందని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లోనూ డీకే అంతా తానై చక్రం తిప్పుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యతిరేకులను మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. కాగా మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం.. తెలంగాణలోని ఆ పార్టీ శ్రేణులకు కొత్త జోష్ ఇస్తోంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోంది. కర్ణాటక విజయ మంత్రాన్నే తెలంగాణలో పఠించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. దీనికి సంబంధించి వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. పలు పార్టీల నుంచి వచ్చిన వలస నేతలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. వీరితో పాటు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్లో చేరిన హస్తం ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్‌లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రియాంకగాంధీ సమక్షంలో పెద్ద సంఖ్యలో పార్టీలో చేరికలుంటాయని కాంగ్రెస్ చెబుతోంది. -
దశాబ్ది ఉత్సవాలకు కాంగ్రెస్ కౌంటర్ ప్లాన్
-
రేవంత్ రెడ్డి తో గరం గరం ముచ్చట్లు
-
ఈటల,రేవంత్ రెడ్డి ఇద్దరూ తోడుదొంగలు
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ ప్రమాణంపై స్పందించిన ఈటల
-
ఈటల వ్యాఖ్యలపై రేవంత్ ఫైర్
-
రేవంత్.. తాత.. ట్వీట్ చేసిన టీపీసీసీ చీఫ్
సాక్షి, హైదరాబాద్: తాను తాతయ్య అయిన విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన కుమార్తె నైమిష గత వారం బాబుకు జన్మనిచ్చిందంటూ.. మనవడిని లాలిస్తున్న ఫొటోను ఆదివారం పోస్టు చేశారు. ‘తాతను అయ్యానని తెలియచేయడం సంతోషంగా ఉంది. మీ ఆశీస్సులు వారికి కావాలి’ అని రేవంత్ ట్వీట్ చేశారు. (చదవండి: తప్పులు చేశారు శిక్ష తప్పదు) I am happy to share with you all that we are blessed with the arrival of our grandson. My little girl Nymisha delivered a baby boy last week. I wish all your blessings for the baby and the mother. pic.twitter.com/DZOm1DHVtj — Revanth Reddy (@revanth_anumula) April 9, 2023 -
కాంగ్రెస్‌కు 20, 30 సీట్లు వస్తే.. రేవంత్ జోస్యమేంటీ?
సాక్షి, న్యూ ఢిల్లీ: బీఆర్ఎస్తో పొత్తుపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పొత్తు ఉండదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందన్నారు. కాంగ్రెస్‌కు 20, 30 సీట్లు వచ్చినా బీఆర్ఎస్కు వెళ్లిపోతారు.. అందుకే మాకు 60 సీట్లు కావాలి. పూర్తి మెజారిటీతో మమ్మల్ని గెలిపించే బాధ్యత ప్రజలదే. కాంగ్రెస్‌కు 20 సీట్లు వస్తే పోతారు కాబట్టి జనం 80 సీట్లు ఇస్తారు. బీఆర్ఎస్కు ఈ సారి 25 సీట్లే. ఎవరినైనా క్షమిస్తాం కానీ, కేసీఆర్‌ను క్షమించేది లేదని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో స్వేచ్చ లేదు. ఆంధ్రా, నిజాం పాలనలో కూడా అభివృద్ధి జరిగింది.. కానీ స్వేచ్ఛ కోసమే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య ట్రయాంగిల్ లవ్ ఉంది. బీజేపీతో కొట్లాడినట్లు నటిస్తూ కాంగ్రెస్‌ను మింగేస్తారు ధృతరాష్ట్ర కౌగిలికి మేం సిద్ధంగా లేం’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన దిల్ రాజు.. రాజకీయాల్లోకి వస్తాడా? రాడా? -
‘సిట్’ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమే.. రేవంత్ రెడ్డి సెటైర్లు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సిట్ అంటే.. సిట్, స్టాండ్ మాత్రమేనని, గతంలో సిట్ విచారించిన కేసులు ఎటు పోయా యని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో దాఖలు చేసిన కేసు విచారణకు వెళ్లిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్, నయీం భూముల కేసులు, గోల్డ్‌స్టోన్ ప్రసాద్ కేసు, హౌసింగ్‌బోర్డు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులను విచారించేందుకు ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఎటు పోయిందని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ వ్యవహారంలో సిట్ తాళాలు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారి చేతుల్లో పెట్టారని ఆరోపించారు. ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వాదనలు వినిపించిందని, టీఎస్పీఎస్సీ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలని తాము కోర్టును కోరామని చెప్పారు. పేపర్ లీకేజీ అంశంలో ప్రవీణ్, రాజశేఖర్‌లతో పరిమితం కాకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీ, కస్టోడియన్ శంకరలక్షి్మని కూడా బాధ్యులుగా చేర్చాలని కోరారు. ఈ విషయాన్ని సమగ్రంగా దర్యాప్తు జరపాలని అడిగితే తనకు సిట్ నోటీసులిచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: కొలువుల కలవరం -
మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్
-
'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు'
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ పేషీ నుంచే జరిగిందని, మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే ఇద్దరి వల్లే పేపర్ లీక్ అయ్యిందంటూ మంత్రి కేటీఆర్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏ తిరుపతి షాడో మంత్రి అని, ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించడంలోనే అసలు రహస్యం దాగి ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్లను ఎన్కౌంటర్ చేస్తామని జైలులో బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ఈనెల 13 నుంచి 18 వరకు చంచల్‌గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్వోసీ ఎలా ఇచ్చారు.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న వారు పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులని నిబంధనలు చెబుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న 20 మందికి పరీక్షలు రాయడానికి ఎన్వోసీ ఎలా ఇచి్చందని ప్రశ్నించారు. అమెరికానుంచి వచ్చిన మాధురికి గ్రూప్–1 మొదటి ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్ రజనీకాంత్‌రెడ్డికి నాలుగో ర్యాంకు ఎలా వచ్చాయన్నారు. శ్రీలక్షి్మ, ప్రవీణ్, వెంకటాద్రి, శ్రీదేవి, రమేశ్, వాసు, మధులతలతో పాటు మరికొందరికి పరీక్షలకు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2016లో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 25 మందికి గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయని, దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ2 రాజశేఖర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనే.. లీకేజీ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి దగ్గరి స్నేహితుడని, ఇద్దరిదీ ఒకే ప్రాంతమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పరిచయంతోనే రాజశేఖర్‌రెడ్డికి 2017లో ఉద్యోగం ఇప్పించాడని, వెనువెంటనే ప్రమోషన్ వచి్చందని, తర్వాత టీఎస్‌పీఎస్సీలోకి బదిలీ అయ్యాడని ఆయన వెల్లడించారు. వీటన్నింటికీ కేటీఆర్ పీఏ తిరుపతే కారణమని ఆరోపించారు. అలాగే లీకేజీ వ్యవహారంలో కాని్ఫడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్లక్ష్మి పాత్రపై విచారణ జరపాలన్నారు. తాజా గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో మల్యాల ప్రాంతానికి చెందిన వంద మందికిపైగా అభ్యర్థులకు 103 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని, వారి వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లకు అన్ని వివరాలు తెలిసి ఉంటాయన్నారు. సిట్ అధికారి కేటీఆర్ బావమరిదికి దోస్త్.. పేపర్ లీకేజీ కేసు బాధ్యతలు అప్పగించిన సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్.. మంత్రి కేటీఆర్ బావమరిదికి దగ్గరి స్నేహితుడని, ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంలో ఉద్దేశం ఏమిటో అర్థమవుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. లీకేజీ వ్యవహారంపై తాము కోర్టులో వేసిన కేసుపై సోమవారం విచారణ జరగనుందని తెలిపారు. 21న గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సీతక్క, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొత్త కోణం.. ఎన్ఆర్ఐ లీడర్ సిఫారసుతోనే రాజశేఖర్‌కు ఉద్యోగం? -
'బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీ లిక్కర్ స్కాంపై చర్చ'
సాక్షి, జగిత్యాల: మల్లాపూర్ మండలం ముత్యంపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్పై ఫైర్ అయ్యారు. అదానీ అంశం పార్లమెంటు లో చర్చకు వస్తుందనే కమలం పార్టీ వ్యూహాత్మకంగా లిక్కర్ స్కాంను బయటకు తీసిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అదానీ ఆంశం వల్ల బీజేపికి నష్టం జరుగుతుందనే ఈ చర్చకు తెరలేపారని విమర్శించారు. బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ లబ్ధికోసమే లిక్కర్ స్కాంపై చర్చ జరిగేలా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ మూడోసారి అధికారంలో ఉండాలి, ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించాలనే ప్రశాంత్ కిషోర్ చెప్పిన విధంగా రెండు పార్టీలు పథకాన్ని అమలు చేస్తున్నాయిని రేవంత్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలు కేసీఆర్ కు కట్టు బానిసలని ఎద్దేవా చేశారు. చిన్నపిల్లాడిని కుక్కులు చంపేస్తే పట్టించుకోలేదు, మహిళలపై దాడులు జరిగితే స్పందిచరు, కానీ కవిత లిక్కర్ స్కాం పై మాత్రం నలుగురు ఢిల్లీకి వెళ్లారని దుయ్యబట్టారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే రెండు పార్టీలు గేమ్ ఆడుతున్నాయయని, కవిత అరెస్టు.. తర్వాత రోడుపైకి వచ్చి గొడవలు ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. చదవండి: బీఆర్ఎస్లో ‘చిలిపి’ రాజకీయం! -
రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ యాక్సిడెంట్... బెలూన్లు ఓపెన్ కావడంతో..
సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్కి భారీ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ అతివేగంతో రావడంతో ఆరు కార్లు బలంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆరు కార్లు ధ్వంసం కాగా, పలువురు రిపోర్టర్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమయంలో రేవంత్ రెడ్డి కారులో ఒక్కసారిగా బెలూన్లు ఓపెన్ కావడంతో ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ కార్లలో రిపోర్టర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన రిసోర్టర్లను, సిబ్బందిని ఆస్పత్రికి తరలించారు. ఐతే ఈ ఘటనలో ఎవరికీ పెద్దగా ప్రమాదం కాకపోవడంతో సెక్యూరిటీ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. స్వల్ప గాయాలతో సిరిసిల్ల రిపోర్టర్లు బయటపడ్డట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం రేవంత్ రెడ్డి శ్రీ పాద ప్రాజెక్టు సందర్శనకు వెళుతుండగా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ స్టేజి వద్ద జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. (చదవండి: డీఎల్‌పీవోపై కొనసాగుతున్న విచారణ) -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ
-
పాదయాత్రకు రేవంత్ సన్నాహాలు! ఓకే అయితే జూన్ 2 వరకు
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. అధిష్టానం నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్న తర్వాత భద్రాచలం నుంచి తన 126 రోజుల పాదయాత్రను ఆయన ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే తాజా పర్యటనలోనే పాదయాత్రకు లైన్ క్లియర్ కానుందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఠాక్రే శనివారం హాజరుకానున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించనున్నట్టు సమాచారం. శనివారం పాదయాత్రకు సంబంధించిన తీర్మానం ఉంటుందని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. అయితే రేవంత్ పాదయాత్రపై రెండురకాల వాదనలు జరుగుతున్నాయి. నేడు స్పష్టత?: టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఒక్కరే రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సిద్ధం కావడాన్ని కొందరు పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గం అనుమతి తీసుకోవడం ద్వారా అధిష్టానం దగ్గర లైన్ క్లియర్ చేసుకోనున్నారని తెలుస్తోంది. పార్టీ కార్యవర్గం (పీఏసీ) తీర్మానం చేస్తే రేవంత్ పాదయాత్రను వద్దనాల్సిన అవసరం లేదనే భావనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉన్నారని, ఇదే విషయాన్ని ఆయన ఠాక్రేకు చెప్పారని సమాచారం. ఈ నేపథ్యంలోనే పీఏసీలో ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారని కొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగా పాదయాత్రను ప్రారంభించాలని రేవంత్‌కు ఠాక్రే సూచించారని, వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్త యాత్రకు అధిష్టానం నుంచి అనుమతి తీసుకుందామనే సంకేతాలను ఆయన రేవంత్‌కు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. హాథ్‌సే హాథ్‌జోడో యాత్రల్లో భాగంగానే యాత్ర ప్రారంభమైనా అది జూన్ 2 వరకు కొనసాగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. రేవంత్ పాదయాత్రలో సీఎల్పీ నేత భట్టి కూడా పాలుపంచుకుంటారా? వంటి విషయాలపై శనివారం జరిగే టీపీసీసీ కార్యవర్గ సమావేశం తర్వాత స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది. చదవండి: కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లొచ్చు -
కాంగ్రెస్ కీలక నేతకు రూ.500 కోట్ల ఆఫర్.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కీలక నేతను లొంగదీసుకునేందుకు రూ. 500 కోట్లు ఆఫర్ చేశారన్నారు. బుధవారం సాయంత్రం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కాంగ్రెస్ 130 సీట్లు గెలుస్తుందని, బళ్లారి నుంచి రాయచూరు వరకు 25–30 స్థానాల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. ఆ 30 సీట్లలో కాంగ్రెస్ పార్టీ పరాజయం కోసం పనిచేయాలని కర్ణాటకకు చెందిన ఓ కీలక నేతకు కేసీఆర్ రూ.500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? ఆయనతో ఫామ్ హౌస్‌లో బేరసారాలు సాగించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇది ఆరోపణ కాదని, ఆధారాలతో సహా నిరూపించేందుకు సిద్ధమని చెప్పారు. కర్ణాటకలో తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభాకర్ రావు నేతృత్వంలో పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులను కర్ణాటక రాష్ట్రంలో నియమించారని, వారి నుంచి కాంగ్రెస్ మద్దతుదారులు, ఓటు వేసే వాళ్ల వివరాలను సేకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ తెలిసే జేడీఎస్ నేత కుమార స్వామి ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ సమావేశానికి రాలేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను ఓడించేందుకు కేసీఆర్ ఎవరి దగ్గర సుపారీ తీసుకున్నారో ప్రజలకు తెలియాలన్నారు. మోదీతో వైరం ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం ఇది.. ఖమ్మంలో కేసీఆర్ ఉపన్యాసం వింటే మోదీతో వైరం ఉందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పారీ్టగా నమోదైన తర్వాతనే జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ప్రచారం చేయలేదని, యూపీ ఉప ఎన్నికలు, ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే డిసెంబర్లో జరపాల్సిన శీతాకాల సమావేశాలు జరపలేదని, ఫిబ్రవరి చివరిలో ప్రభుత్వాన్ని రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాఖ్యానించారు. రూ. 100 లక్షల కోట్లు అప్పు చేసిన మోదీతో కాంగ్రెస్‌ను పోలుస్తారా? 1947 నుంచి 2014 వరకు దేశాన్ని పాలించిన ప్రధానులందరు రూ.56 లక్షల కోట్ల అప్పులు చేస్తే... ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ రూ.100 లక్షల కోట్లు అప్పు చేశారని రేవంత్ ఆరోపించారు. అలాంటి మోదీతో కాంగ్రెస్‌ను పోల్చడం కేసీఆర్ దుర్మార్గానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ప్రభుత్వ సంస్థలను అమ్ముకుంటున్న మోదీకి పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కేసీఆరేనని అన్నారు. మన దేశం చైనా మార్కెట్ అయిందంటున్న కేసీఆర్.. సెక్రటేరియట్ దగ్గర ఏర్పాటు చేయబోయే అంబేడ్కర్ విగ్రహం కోసం మంత్రుల బృందం చైనా వెళ్లిన విషయమై ఏం సమాధానం చెపుతారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
-
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: పంచాయతీల నిధుల విషయంపై ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్నా కోసం బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు అడ్డుకోవడంతో కొద్ది సమయం రేవంత్ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం కొనసాగింది. అక్కడి నుంచి వెళ్లేందుకు అనుమతించని పోలీసులు.. రేవంత్‌ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు ధర్నా విషయంపై మాట్లాడారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సర్పంచ్ నిధులను ప్రభుత్వం దొంగిలించిందని ఆరోపించారు. నిధులు కాజేసిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచే కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం కొనసాగుతోంది. ఇదీ చదవండి: టీపీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతల హౌస్ అరెస్ట్ -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు?: పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అసలు దోషి ఎవరు? అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారన్నారు. 2018 నుంచి జరిగిన ఫిరాయింపులపై విచారణ జరగాలని, త్వరలో ఈ అంశంపై తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసును రెండు కోణాల్లో చూడాలి. టీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలను బాధితులుగా చూపిస్తున్నారు. మరి ఇందులో దోషి ఎవరు?. నేరం జరిగింది.. కానీ విచారణ తామే చేస్తాం అనడం ద్వారా టీఆర్ఎస్ లోపం బయటపడింది. నేరమే జరగలేదని అంటూనే సీబీఐ విచారణ అడగడం ద్వారా బీజేపీ లోపం బయటపడుతుంది. సీబీఐ విచారణ అనగానే బీజేపీ, సిట్ విచారణ అనగానే టీఆర్ఎస్ ఎందుకు సంకలు గుద్దుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. చదవండి: ఎరలు.. దాడులు.. ‘విచారణ’ల రాజకీయం! -
Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తు న్నారంటూ సోషల్ మీడి యాలో ప్రచారం కావడం వివాదాస్పదమైంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందని, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమా చారం వచ్చిందని సోమవారం సోషల్ మీడి యాలో విస్తృత ప్రచారం జరిగింది. అంతేకాదు ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’గా ఈ పార్టీ ఉండే అవకాశముందంటూ పెద్ద ఎత్తున ప్రచా రం చేశారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసిన శంకర్ అనే వ్యక్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేసిన అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకో వాలని కోరారు. టీపీసీసీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడం గమనార్హం. చదవండి: చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి -
TPCC Chief: బీఆర్ఎస్పై ఢిల్లీ హైకోర్టుకు రేవంత్ రెడ్డి
న్యూఢిల్లీ: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. బంగారు కూలి పేరుతో టీఆర్ఎస్ నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీకి గతంలోనే ఫిర్యాదు చేశారు రేవంత్. దీనిపై విచారణ జరపాలని ఆదాయపన్ను శాఖకు అప్పుడే లేఖ పంపింది ఈసీ. అయితే ఈ విచారణ పూర్తి కాకుండానే టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళే(సోమవారం) విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. చదవండి: సీవీ ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరా?.. ఓ పార్టీ కార్యకర్తా?: రేవంత్ -
సీవీ ఆనంద్ ఐపీఎస్ ఆఫీసరా?.. ఓ పార్టీ కార్యకర్తా?: రేవంత్
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్లో మూడు గంటలకుపైగా సాగిన టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ముగిసింది. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కమిటీ మీటింగ్‌ను హైకమాండ్ ఆదేశాలతోనే నిర్వహించినట్లు రేవంత్ స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్రపై భేటీలో చర్చించినట్లు చెప్పారు. ఈ నెల 20 నుంచి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇన్‌ఛార్జ్‌ల నియామకం ఉంటుందన్నారు. కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు అవుతాయన్నారు. అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకునే కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 43 లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు వివరించారు. మోదీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జ్‌షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమం తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి 3,4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. తాను చేపట్టే పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతానని రేవంత్ చెప్పారు. వార్ రూంపై దాడి చేసింది పోలీసులు కాదు, గూండాలని తమకు అనుమానంగా ఉందని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ డేటాను దొంగల్లా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు, నిపుణులపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని రేవంత్ ధ్వజమెత్తారు. ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. కమిషనర్ సీవీ ఆనంద్‌పై అసహనం.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్‌పై రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన ఏపీఎస్ ఆఫీసరా లేక ఓ పార్టీ కార్యకర్తా అని ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై తాను వ్యతిరేక పోస్టులు పెట్టానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టులను తనకు అంటగట్టవద్దని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడి కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే కోరుకునే వక్తినని చెప్పారు. కేసీఆర్‌కు అబద్దాలు చెప్పి డీజీపీ పదవి పొందాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. కాగా, టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి ముందు హైడ్రామా చోటుచేసుకుంది. ఈ భేటీకీ సీనియర్ నాయకులు గైర్హాజరయ్యారు. కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీల్లో టీడీపీ నుంచి వచ్చిన వలస నేతలకే ప్రాధాన్యం ఇచ్చారని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వర్గీయులు 12 మంది తమ పదవులకు రాజీనామా చేశారు. పదవులు రాలేదని బాధపడుతున్న వారికి వాటిని అప్పగించాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో మరింత ముదిరిన సంక్షోభం.. పీసీసీ పదవులకు 12 మంది రాజీనామా -
జనవరి 26 నుంచి తెలంగాణలో రేవంత్ రెడ్డి పాదయాత్ర
-
‘తండ్రిపై కేటీఆర్ అలిగారు.. అందుకే ఢిల్లీ వెళ్లలేదు: రేవంత్ షాకింగ్ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్‌కు మరోసారి అధికారం ఇస్తే వచ్చేది కిసాన్ సర్కార్ కాదని లిక్కర్ సర్కార్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి పవన్ ఖేరాతో కలిసి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదం ఇచ్చారు. దానికి కౌంటరుగా అబ్ కీ బార్ లిక్కర్ సర్కార్ అని విమర్శించాం. ఎందుకంటే కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన విషయాల్లో మద్యం ఒకటి. ఆయన కుటుంబానికి లిక్కర్‌కు అవినాభావ సంబంధం ఉంది. మద్యంతోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించారని ఎద్దేవా చేశారు. ‘‘ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయన కుమార్తె కవితపై ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ వార్ రూమ్ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు. నేను స్వయంగా ఆరోపిస్తున్న కేసీఆర్‌కి మరోసారి అధికారం ఇస్తే ఢిల్లీ లేదా తెలంగాణలో లిక్కర్ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్‌పై ప్రభుత్వ ఆదాయం రూ.10,500 కోట్ల నుంచి రూ.36 వేల కోట్లకు పెరిగింది. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలను కేసీఆర్ కొనేశారు. అందుకే సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్నినిలదీస్తోంది. కేసీఆర్ అవినీతిపై కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ‘‘గత ఎనిమిదేళ్లుగా కేసీఆర్, మోదీ ఒకరికొకరు సహకరించుకున్నారు. నాణానికి బొమ్మా, బొరుసులా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయి. అధికారం నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయి. వారి నాటకాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణలో బీహార్ రాష్ట్ర సమితిగా మార్చాలనుకుంటున్నారా?. తెలంగాణలో మోదీ మోడల్ పాలనను కేసీఆర్ తీసుకురావాలనుకుంటున్నారా?. నరేంద్ర మోదీ విధానం ఐస్(ఇన్‌కంటాక్స్, సీబీఐ, ఈడీ), నైస్ (నార్కోటిక్స్, ఇన్‌కం టాక్స్, సీబీఐ, ఈడీ). తెలంగాణలో ఐస్, నైస్ మోడల్ చెల్లదు. ఈ రోజు ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీనికి కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అవినీతిపరుడైన కేసీఆర్‌కు సహకరించవద్దని కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ ను కోరుతున్నా’’ అని రేవంత్ అన్నారు. చదవండి: TS: ముందస్తు ఎన్నికలు?.. వణికిస్తున్న సర్వే రిపోర్టులు! ‘‘కేసీఆర్ పార్టీని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణను కూతురుకు అప్పగిస్తారనే కేటీఆర్ తండ్రిపై అలిగారు. అందుకే ఢిల్లీలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ వెళ్లలేదు. ప్లాస్టిక్ సర్జరీ చేస్తే డీఎన్ఏ మారదు. అలాగే పేరు మార్చినంత మాత్రాన ఆ పార్టీ డీఎన్ఏ మారదు. కేసీఆర్ డీఎన్ఏ ఏంటో అందరికీ తెలుసు. ప్లాస్టిక్ సర్జరీతో రూపు రేఖలు మార్చవచ్చు కానీ.. మనిషి ఆలోచనలు మార్చలేరు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినా ఆ పార్టీతో పొత్తు ఉండదు. మాది యాంటీ బీఆర్ఎస్, యాంటీ కేసీఆర్’’ అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. -
తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్ అండ్ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్‌బ్రాండ్స్. ఈ క్రమంలో.. ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్‌ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. #jaggannamla #Revanthreddy pic.twitter.com/4xuXbzqY4m — S-Punna Reddy (@125PunnaReddy) December 2, 2022 -
తెలంగాణలో మరో పాదయాత్ర?.. ఆ నాయకుడెవరు?
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పాదయాత్రకు రంగం సిద్ధం అవుతుందా? వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. పాదయాత్రలతో అధికారంలోకి వస్తామని భావిస్తున్న ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ మరోసారి పాదయాత్రకు రెడీ అవుతున్నారా? పార్టీ జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఇంతకీ ఏ పార్టీ? ఆ నాయకుడెవరు? నడుస్తా.. గెలిపిస్తా..! తెలంగాణలో ప్రస్తుతం పాదయాత్రల సీజన్ నడుస్తోంది. కమలం పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ విడతల వారీగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తున్నారు. వీరి దారిలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఆయన గతంలో కూడా కొంతమేర పాదయాత్ర నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు ఏడాదిలోనే రానున్న తరుణంలో మళ్ళీ రాష్ట్రమంతా పాదయాత్ర చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఏదో ఒక రూపంలో నిత్యం ప్రజల్లో ఉండకపోతే అధికారంలోకి రావడం సాధ్యం కాదని భావిస్తున్న పీసీసీ చీఫ్...ఈ మేరకు పార్టీలోని తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. ఏడాదంతా జనంలోనే.! తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుండటంతో పీసీసీ చీఫ్ రేవంత్ తన సన్నిహితుల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎంత కష్టపడ్డా.. రాష్ట్ర ప్రభుత్వ అవినీతికి సంబంధించి ఎన్ని విషయాలు వెలుగులోకి తెస్తున్నా... జనం తనను ఆదరించడం లేదని వాపోతున్నారట. జనరల్ ఎలక్షన్స్ కు కేవలం ఏడాది మాత్రమే ఉండటంతో.. వచ్చే ఏడాది కాలం నిత్యం జనంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారట రేవంత్‌రెడ్డి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని యోచిస్తున్నారట. పాదయాత్రను డిసెంబర్ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం తన ముఖ్య అనుచరులకు ఈ మేరకు సిగ్నల్స్ కూడా అందాయని తెలుస్తోంది. సదరు నేతలు ఇప్పుడు రేవంత్ పాదయాత్ర ఏర్పాట్లలో తలమునకలయినట్లు టాక్ నడుస్తోంది. హస్తం కేరాఫ్ హస్తిన.! అయితే కాంగ్రెస్ జాతీయ పార్టీ కావడంతో.. ఏ నిర్ణయం అయినా ఢిల్లీ స్థాయిలోనే జరుగుతుంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆలోచనకు పార్టీ హైకమాండ్ ఎంత వరకు ఓప్పుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగతా నేతలు అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. పాదయాత్రలు చేయడానికి చాలా మంది నాయకులు రెడీ అవుతారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. వస్తుందన్న ఆశ లేకపోయినా... ముఖ్యమంత్రి అభ్యర్థులు డజన్ల మంది ఉంటారు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ లో ముఖ్య నాయకులందరినీ ఒప్పించి రేవంత్ రెడ్డి పాదయాత్రకు రూట్ క్లియర్ చేస్తుందా? లేక ఇతర నేతలు అడ్డు చెప్తున్నారంటూ రేవంత్ రెడ్డి పాదయాత్ర కు రెడ్ సిగ్నల్ చూపిస్తుందా చూడాలి. చదవండి: మానుకోటలో మహిళా నేతల కోల్డ్‌వార్ ఏమన్నా చేసుకో.. పైసలు మాత్రం అడక్కు.! కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ పాదయాత్రకు అనుమతి వస్తుందా రాదా అనేది ఒక ప్రశ్న. దానికి ఢిల్లీ నుంచి మాత్రమే సమాధానం ఇవ్వాలి. కాగా పాదయాత్ర అంటే రాష్ట్రంలోని నేతలు హాడలిపోతున్నారట. ఇప్పటికే మునుగోడు బై పోల్ కు , భారత్ జోడో యాత్రకు ఖర్చు తడిసి మోపెడయిందని, ఇప్పుడు పాదయాత్ర అంటే మళ్ళీ డబ్బు ఎలా సమకూర్చాలనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పాదయాత్ర అంటే రోజుకు కనీసం 25 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుందని..ఎక్కడి కక్కడ స్థానిక, జిల్లా నాయకులే భరించాల్సి ఉంటుందని అంటున్నారు. రేవంత్ యాత్ర పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుందని భావిస్తున్నారు. అయితే పాదయాత్రకు వనరులే ఇబ్బందిగా మారే అవకాశం అంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
రేవంత్ రెడ్డి (పీసీసీ చీఫ్) రాయని డైరీ
కాంగ్రెస్ ఎప్పుడూ విశిష్టమైన వ్యక్తులనే ఎంపిక చేసుకుంటుంది. ఆ విశిష్టమైన వ్యక్తులతో పార్టీలో అప్పటికే ఉన్న అతి విశిష్టులు విభేదిస్తూ ఉండొచ్చు గాక. కోపంగా వెళ్లి వేరే పార్టీలో చేరొచ్చు గాక. కాంగ్రెస్ తన విశిష్టతను చేజార్చుకోదు. శశిధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయినందుకు.. ‘అయ్యో, ఊడల మర్రి.. వేళ్లు పెకిలించుకుందా..’ అని కాంగ్రెస్ ఏమీ హుటాహుటిన ఢిల్లీలో స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్‌ను మించిన మహామర్రి దేశంలో ఎక్కడైనా ఉందా.. తెలంగాణలో ఉండటానికి?! స్కూల్లో ఉన్నప్పుడు ఆర్.ఎస్.ఎస్. ఆకర్షిస్తుంది. ఆకర్షించేది ఆర్.ఎస్.ఎస్. కాదు. ఆర్.ఎస్.ఎస్. చేతిలోని ఆ పొడవాటి కర్ర . కాలేజ్‌లో ఉన్నప్పుడు రాడికల్స్ ఆకర్షిస్తారు. ఆకర్షించేది రాడికల్స్ కాదు. వారి భుజాలకు వేలాడే ఆ పొడవాటి తుపాకీ. భ్రమలన్నీ తొలగిపోయాక ఆకర్షించేది కాంగ్రెస్. కాంగ్రెస్ చేతిలో కర్రా ఉండదు, కాంగ్రెస్ భుజానికి తుపాకీ ఉండదు. అయినా ఆకర్షిస్తుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీకి తను ఎంపిక చేసుకున్న విశిష్టమైన వ్యక్తులే ఆయుధాలు! ఆయుధం పేరు ఖర్గే కావచ్చు, రేవంత్‌రెడ్డి కావచ్చు. పదును మాత్రం పార్టీదే. వ్యక్తిగా ఎదగాలని అనుకున్న వాళ్లే పార్టీని వదిలి వెళ్తారు. బీజేపీలో చేరడం కోసం శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లడానికి ముందు రోజు నేను ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నాను. ఖర్గే పిలిపించారని చెబితే ఖర్గే కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ‘‘ఎంతసేపైంది రేవంత్ గారూ మీరు వచ్చి?’’ అనే మాట వినిపించి అటు వైపు చూశాను. మాణిక్కం ఠాగూర్! తెలంగాణ స్టేట్ ఇంచార్జ్. ఆయన వెనకే బోసు రాజు, రోహిత్ చౌదరి, నదీమ్ జావెద్ వచ్చారు. వాళ్లు ముగ్గురూ తెలంగాణ స్టేట్‌ను, తెలంగాణ స్టేటస్‌ను చూస్తున్న ఏఐసీసీ కార్యదర్శులు. మాణిక్కం ఠాగూర్ తమిళనాడు. బోసు రాజు కర్ణాటక, రోహిత్ చౌదరి ఢిల్లీ, నదీమ్ జావెద్ యూపీ. నలుగురూ నాతో చాలా ఆత్మీయంగా ఉన్నారు. నేను పార్టీలోకి వచ్చి ఐదేళ్లయింది. తెలంగాణలో ఒక్క సీనియర్ కూడా నాతో ఇంత ఆత్మీయంగా లేరు! ‘‘శశి థరూర్‌రెడ్డి అలా సడన్‌గా పార్టీకి రిజైన్ చేసి ఎందుకు వెళ్లిపోయారు రేవంత్?’’ అని అడిగారు రోహిత్ చౌదరి! శశి థరూర్‌రెడ్డి కాదు, శశిధర్‌రెడ్డి అని రోహిత్ చౌదరిని సరిదిద్దినందు వల్ల.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక నేను ఆ ప్రయత్నం మానుకున్నాను. ‘‘రేవంత్ గారూ! మీరు పార్టీలో పెద్దల్ని గౌరవించడం లేదట! హనుమంతరావు గారిని గోడకేసి కొడతానన్నారట! స్టార్ క్యాంపెయినర్ వెంకట్‌రెడ్డి గారిని హోమ్ గార్డ్ అన్నారట!’’ అని అడిగారు బోసు రాజు. నేను ఎవర్ని ఏం అనినా పార్టీ కోసమే అన్నాను అని చెప్పినందు వల్ల హనుమంత రావుకి గానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గానీ కనువిప్పు కలిగి వారు నాతో కలిసి పనిచేసేది ఉండదు కనుక నేనేమీ మాట్లాడలేదు. ‘‘రాజగోపాల్ రెడ్డిని పూర్తి పేరుతో ఎవరూ పిలవొద్దు, ఆర్.జి.పాల్ అనండి చాలు అని పార్టీ క్యాడర్‌కి మీరు పిలుపునిచ్చారట..’’ అన్నారు నదీమ్ జావెద్. కేఏ పాల్‌తో పోల్చినందుకు ఆర్.జి.పాల్ అప్‌గ్రేడ్ అయినట్లు ఫీల్ అవాలి గానీ, అందులో డీగ్రేడ్ అవడానికి ఏముందీ అని అనబోయి, కేఏ పాల్‌పై హై కమాండ్‌కు అనవసరంగా ఇంట్రెస్ట్ జనరేట్ చేసినట్లవుతుందని ఆగిపోయాను. ‘‘గుడ్’’ అన్నారు మాణిక్కం ఠాగూర్! అంతకుమించి ఆయనేం మాట్లాడలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాక మాణిక్కం ఠాగూర్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ‘‘రేవంతు గారూ.. కంగ్రాట్స్.. ఖర్గేజీ మీ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్నారు..’’ అని చెప్పారాయన. -
పొలిటికల్ కారిడార్ : గాంధీభవన్ కు కొత్త ముఖాలు..
-
కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌పై విమర్శల వెల్లువ
కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌పై విమర్శల వెల్లువ -
బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలతో జాగ్రత్త.. కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ లేకుండా చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పాల్పడుతున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీపీ సీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే పార్టీ ఉనికే ప్రమాదంలో పడుతుందన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ అధ్యక్షతన పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు, అధ్యక్షులతో జరిగిన భేటీలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడాలి పార్టీలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని, అందరం సహచరులమేనని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వంపై పోరాటంలో అనుబంధ సంఘాల పాత్ర కీలకమని చెప్పారు. గతంలో చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికపై పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉందని, అందరం బాధ్యతగా కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ల నాటకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, అజారుద్దీన్, కోదండరెడ్డి, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
తెలంగాణ పట్ల అడుగడుగునా నిర్లక్ష్యమే.. రేవంత్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్ర ప్రభు త్వం నిర్లక్ష్యంగా వహిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. బీజేపీ, టీఆర్ఎస్ తమ ప్రయోజనాల కోసం అలజడి సృష్టించడమే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు భావిస్తున్నారని తెలి పారు. మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి శనివారం బహిరంగ లేఖ రాశారు. ‘పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతోంది. కాజీపేట రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐఐటీ, ఐఐఎం, రామగుండంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఐటీఐఆర్, జవహర్ నవోదయ, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు, డిఫెన్స్ కారిడార్, చేనేతపై జీఎస్టీ ఎత్తివేత వంటి అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది’ అని పేర్కొన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు, డిఫెన్స్ కారిడార్ లాంటి విషయాల్లో కూడా తెలంగాణకు అన్యాయమే జరి గిందన్నారు. సీఎం కేసీఆర్ వైఖరికి బీజేపీ రాష్ట్ర శాఖలోని కొందరు నాయ కులు సహకరించే పరిస్థితి ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలెదు ర్కొంటున్న సమస్యలపై వెంటనే కార్యాచరణ ప్రకటించాలని, లేదంటే వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ స్పష్టంచేశారు. చదవండి: మోదీకి వ్యతిరేకంగా నిరసనలు.. 7 వేల మంది సీపీఐ కార్యకర్తల అరెస్టు -
కోమటిరెడ్డి వ్యవహారంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ గెలవదని స్వయంగా ఒప్పుకొన్న కేసీఆర్ కమ్యూనిస్టుల సహకారంతో మునుగోడులో చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా గెలిచారని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ రాష్ట్రంలో పరాన్న జీవిగా మారిందని ఎద్దేవా చేశారు. రేవంత్ బుధవారం తన నివాసంలో మీడియాతో మా ట్లాడుతూ కమ్యూనిస్టుల సహకారంతో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పారించి సాధించిన గెలుపు కూడా గెలుపేనా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు సహజమిత్రు లని, ఇప్పుడేదో మోజులో కేసీఆర్‌కు మద్దతి చ్చారన్నారు. కేసీఆర్ అక్కున చేరిన వాళ్లెవ రూ మళ్లీ కనిపించలేదని, ఆ విషయం క మ్యూనిస్టులకు కూడా తెలుసని పేర్కొన్నారు. దేశానికి నాయకుడవుతానన్న కేసీఆర్ సొంత కాళ్లపై నిలబడలేకపోయారని ఎద్దేవా చేశారు. మునుగోడులో బీజేపీ బరితెగించిందని, రూ. వందల కోట్లు పంచిపెట్టి దేశంలో మునుగోడును తాగుబోతు నియోజకవర్గంగా నిలబెట్టారని మండిపడ్డారు. 20 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం తాగించారని ఆరోపించారు. చుక్క మందు పోయకుండా కాంగ్రెస్ 24వేల ఓట్లు పొందడం గర్వంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను మూడో స్థానానికి నెట్టేయడానికి బీజేపీ జాతీయస్థాయి నాయకులు, కేంద్ర మంత్రులు తిష్ట వేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈసీ అవసరం తేలిపోయింది! తెలంగాణలో కాంగ్రెస్ ఖతం అయిందని మోదీ ప్రకటించడం దిగజారుడుకు పరాకాష్ట అని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘ఓటమిని సమీక్షించుకోకుండా కాంగ్రెస్ సఫా అయిందని మోదీ సంబరపడుతున్నారు. టీఆర్ఎస్, బీజేపీ మిత్రులే అని మోదీ ప్రకటనతో మరో సారి నిరూపితమైంది. బీజేపీ, టీఆర్ఎస్లది మిత్రభేదమే.. శత్రుభేదం కాదు. దేశానికి ఎన్నికల సంఘం అవసరం లేదని మును గోడు ఉప ఎన్నికతో తేలిపోయింది’ అని పేర్కొన్నారు. మునుగోడు ఫలితాలపై తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యవహారం రాష్ట్ర పరిధిలోనిది కాదని, ఏఐసీసీ ఆదేశాల ప్రకారం టీపీసీసీ ముందుకెళ్తుందన్నారు. గవర్నర్ సందేహా లను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అదే సమయంలో ప్రతీది గవ ర్నర్ రాజకీయ కోణంలో చూడాల్సిన అవస రంలేదని పేర్కొన్నారు. పోలీసులు రహస్య కెమెరాలతో చిత్రీకరించిన ఫాంహౌజ్ వీడి యోలు ప్రగతిభవన్‌లో ఎందుకున్నాయని ప్రశ్నించారు. తెలంగాణలో భారత్ జోడో యాత్రలో రాహుల్‌ను ప్రజలు అక్కున చేర్చు కున్నారని రేవంత్ పేర్కొన్నారు. ఈ యాత్ర తో రాహుల్ నూతన శకానికి తెర లేపారని, దేశం ప్రమాదకర స్థితిలోకి పోతున్న సమ యంలో రాహుల్ భరోసాగా కనిపించారన్నా రు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: నా ఫోన్లూ ట్యాపింగ్.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
మునుగోడులో కాంగ్రెస్ ఘోర పరాభవం.. రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: యావత్ తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరభవం చవిచూసింది. డిపాజిట్ కూడా దక్కించుకోలేేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని రేవంత్ పేర్కొన్నారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పనిచేశామన్నది ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా, నికార్సుగా, నిబద్ధతగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నది ముఖ్యం. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. — Revanth Reddy (@revanth_anumula) November 6, 2022 ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ 10వేలకుపైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు. చదవండి: ఘాటెక్కిన ఎన్నికలో కారెక్కిన మునుగోడు.. టీఆర్ఎస్ జయకేతనం -
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
కన్నీటిపర్యంతమైన రేవంతరెడ్డి
-
మోదీ, కేసీఆర్‌లు బ్రిటిషర్లకు ఏకలవ్య శిష్యులు
కంటోన్మెంట్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు బ్రిటిష్ వారికి ఏకలవ్య శిష్యులుగా తయారయ్యారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మోదీ దేశాన్ని ప్రమాదం వైపు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. బ్రిటిషర్లు విభిజించు, పాలించు విధానాన్ని అవలంబిస్తూ పాలిస్తున్న క్రమంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన గొప్ప వ్యక్తి మహాత్మాగాంధీ అని చెప్పారు. హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీయన్ ఐడియాలజీ సెంటర్ ఆవరణలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 24న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, యాత్రను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, హనుమంతరావు, వినోద్ రెడ్డి, సునీతారావు పాల్గొన్నారు. గాంధీ ఆలోచనలకు భిన్నంగా టీఆర్ఎస్, బీజేపీ: భట్టి ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో స్వాతంత్య్రం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం లోపించాయని, గాంధీ ఆలోచనలకు భిన్నంగా టీఆర్ఎస్, బీజేపీలు పాలిస్తున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసమానతలు లేని భారతదేశాన్ని గాంధీ కలలుగన్నారని... కానీ, బీజేపీ పాలనలో దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల్ని విస్మరించి ఇద్దరు వ్యాపారవేత్తలను మాత్రమే ప్రపంచ కుబేరులుగా ఎదిగేందుకు కేంద్రంలోని బీజేపీ దోహదపడిందని విమర్శించారు. త్వరలో దళిత, గిరిజన బస్తీల్లో సీఎల్పీ బృందం పర్యటన హైదరాబాద్ మురికివాడల్లోని దళిత, గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చేందుకు సీఎల్పీ బృందం త్వరలోనే ఆయా బస్తీల్లో పర్యటిస్తుందని భట్టి తెలిపారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పేరు తెరమీదకు రావడంతో బీజేపీకి భయం పట్టుకుందన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న శశిథరూర్ కూడా తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని ఖర్గేకు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశా రు. సీఎం కేసీఆర్ సొంత విమానాన్ని కొనుగోలు చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని, జాతీయ పార్టీ ఏర్పాటు ఇంకా ఊహాజనితంగానే ఉందని, పార్టీని ప్రకటించిన తర్వాతే దానిపై మాట్లాడతానని విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. చదవండి: వీఆర్ఏ సమస్యలను పరిష్కరించలేని వాళ్లు దేశం కోసం ఏం చేస్తారు? -
జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించరు?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌తోపాటు గుజరాత్‌లోని జునాగఢ్‌కు కూడా ఒకేసారి స్వాతంత్య్రం వచ్చిందని, మరి బీజేపీ నేతలు అక్కడ ఎందుకు వజ్రోత్సవాలు నిర్వహించడంలేదని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేవలం రాజకీయ ప్రయోజ నాల కోసం సెప్టెంబర్ 17ను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ చిల్లర వేషా లు వేస్తోందని దుయ్యబట్టారు. తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా శనివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ద్దేశించి ఆయన మాట్లాడుతూ గుజరాత్లో ఉత్సవా లు జరిపిన తర్వాతే హైదరాబాద్‌లో విమో చన ఉత్సవాలు జరపాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సవాల్ విసిరారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మతకల్లోలాలు సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకు పోవాలనే కుట్రతోనే ఇక్కడ కొత్త వేషాలు కడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే కార్యక్రమాలు కాకుండా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అమలు చేసే ప్రణాళికలేంటో వివరించాలని డిమాండ్ చేశారు. సర్దార్ పటేల్ మా వాడు... హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసిన నాటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తమ వాడని, ఆయనది కాంగ్రెస్ కుటుంబమని, తమ నుంచి పటేల్‌ను ఎవరూ విడదీయలేరని రేవంత్ వ్యాఖ్యానించారు. పటేల్ తన హయాంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ చరిత్రను దొంగిలించి తమ చరిత్రగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీజేపీ చిచ్చుపెట్టే పరిస్థితులు టీఆర్ఎస్ వల్లే ఏర్పడ్డాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీ, టీఆర్ఎస్ల కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం సబ్బండ వర్గాలను ప్రతిబింబించే విధంగా కాంగ్రెస్ రూపొందించిన తెలంగాణతల్లి విగ్రహాన్ని రేవంత్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని సన్మానించారు. కార్యక్రమంలో పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, ఏఐసీసీ కార్యదర్శి నదీమ్ జావెద్, అంజన్‌కుమార్ యాదవ్, మల్రెడ్డి రంగారెడ్డి, ఎంఆర్జీ వినోద్‌రెడ్డి, ప్రేంసాగర్‌రావు, సిటీ కాంగ్రెస్ నాయకులు విజయారెడ్డి, రోహిణ్‌రెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం తెలంగాణ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు వేమవరపు మనోహర్ పంతులుతోపాటు పలువురిని రేవంత్ శాలువాలతో సన్మానించి, వారికి పాదాభివందనం చేశారు. ఆపై ఇందిరా భవన్లో జరిగిన టీపీసీసీ ఎక్స్ సర్వీస్‌మెన్ సెల్ చైర్మన్ పి.రాజేంద్రన్ పదవీబాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ మాజీ సైనికులకు నెలలో బెనిఫిట్స్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం ఇదీ చూడండి: మతోన్మాద శక్తులు వస్తున్నాయి.. జాగ్రత్త! -
హై కమాండ్‌పై కూడా తిరుగుబాటేనా.. టి కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. పీసీసీ చీఫ్ మారినప్పటి నుంచి పార్టీలో తిరుగుబాట్లు ఎక్కువవుతున్నాయి. ఇక్కడి నేత మీదే కాదు.. హైకమాండ్ మీద కూడా తిరుగుబాటు చేస్తున్నారు. టీ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?. కాంగ్రెస్ అంటే అంతే.. వచ్చే వాళ్లు వస్తుంటారు. పోయేవాళ్లు పోతుంటారు. తిట్టేవాళ్లు తిడుతుంటారు. కొట్టే వాళ్లు కొడుతుంటారు. అధినేత మాటైనా ఇక్కడ నడవదు. చదవండి: వచ్చే ఎన్నికల్లో పోటీ.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు: పొంగులేటి ఎవరిష్టం వాళ్లదే. గీత దాటితే చర్యలు తీసుకుంటామంటారు. అయినా ఎవరూ భయపడరు. కొంతకాలం క్రితం పార్టీ అధినేత స్థాయి నేత రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. పార్టీ నేతలు ఎవరు కూడా బహిరంగ విమర్శలు చేయవద్దని, ఏదైనా ఉంటే అంతర్గత సమావేశాల్లోనే మాట్లాడాలని అందరికీ ఆదేశాలిచ్చారు. క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని కూడా రాహుల్‌గాంధీ హెచ్చరించారు. ఆయన ఆదేశాలు కొద్ది రోజుల్లోనే బేఖాతర్ అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ షరా మామూలే. పార్టీలోని సీనియర్లెవరూ రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా అంగీకరించడం లేదు. కోమటిరెడ్డి బ్రదర్స్ గుర్రుగా ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి జెల్ల కొట్టారు. రాజగోపాలరెడ్డి అన్న వెంకటరెడ్డి అటు హైకమాండ్ మీద, ఇటు రేవంత్ మీద ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ వ్యూహరచన కమిటీ సమావేశానికి వర్కింగ్ ప్రెసిడెంట్ మధుయాష్కీ డుమ్మా కొట్టారు. వంత్ మీద సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి నేరుగా దాడి ప్రారంభించారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ రేవంత్‌రెడ్డికి ఏజెంట్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు శశిధర్‌రెడ్డి. పాలమూరు జిల్లా జడ్చర్ల పార్టీ ఇన్చార్జ్ అనిరుధ్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఠాకూర్‌కు రెండు పేజీల ఘాటు లేఖ రాశారు. జిల్లాల్లో ఎవరికి వారే తాము అభ్యర్థులుగా ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం అండదండలు తమకే ఉన్నాయని, రాబోయే ఎన్నికల్లో తామే పోటీ చేయబోతున్నామని కనీసం 25 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ తమకే హామీ ఇచ్చాడని మరికొందరు స్థానికంగా సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అభ్యర్థి ఎవరనే విషయంలో క్యాడర్లోనే సందిగ్ధత ఏర్పడే పరిస్థితి ఉంది. మునుగోడు ఉప ఎన్నిక విషయంలోనూ చివరి వరకూ స్రవంతి పేరు ప్రకటనను నాన్చారు. ఇప్పుడు పార్టీ మీద, రేవంత్ మీద బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్న నాయకులంతా సీనియర్లు, ఢిల్లీ పెద్దల దగ్గర పలుకుబడి ఉన్నవారే. రాహుల్ గాంధీతో నేరుగా మాట్లాడగలిగినవారే. పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా రచ్చ చేయవద్దని రాహుల్ గాంధీ ఆదేశించిన తర్వాత కూడా సీనియర్లు బేఖాతరు చేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ వ్యవహార సరళి, పీసీసీ చీఫ్ రేవంత్ ఏకపక్ష ధోరణుల్ని సీనియర్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు వారి మాటలు తెలియచేస్తున్నాయి. -
దేశ ప్రయోజనాల కోసమే భారత్ జోడో యాత్ర: రేవంత్ రెడ్డి
-
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
-
దేశవ్యాప్తంగా ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ పిలుపు
-
గాంధీభవన్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక సమావేశం
-
రేపు మునుగోడుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
-
మునుగోడు పాదయాత్రకు రేవంత్‌రెడ్డి దూరం
సాక్షి, హైదరాబాద్: మునుగోడులో పాదయాత్రకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి దూరంగా ఉన్నారు. కరోనా లక్షణాలతో ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా పరీక్షకు శాంపిల్స్‌ను పంపించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నారాయణపురం నుంచి చౌటప్పల్ వరకు కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టింది. ఇది ఇలా ఉండగా, చండూరు సభలో అద్దంకి దయాకర్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చేసిన పరుష వ్యాఖ్యలు నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తనకు గౌరవం ఉందన్నారు. తెలంగాణ సాధనలో ఆయన కీలక పాత్ర పోషించారని చెప్పారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన దయాకర్‌పై చర్యలు ఉంటాయన్నారు. కాగా, మునుగోడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడులో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. దీంతో అన్ని పార్టీలు ఉప ఎన్నికల కసరత్తును ప్రారంభించాయి. చదవండి: రేవంత్ బహిరంగ క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే.. -
టార్గెట్ రేవంత్.. మరోసారి తెరపైకి మాజీ ఎంపీ కుమారుడి టాపిక్!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు కల్లోలం రేపుతున్నాయి. దాదాపు ఏడాది నుంచి వివాదాలు, అలకలు, బుజ్జగింపులు, వరుస ఓటములతో సతమతం అవుతున్న కాంగ్రెస్‌లో.. ఎన్నికలు సమీపిస్తున్నా లుకలుకలు మరింతగా పెరిగిపోతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదంటూ పార్టీ నేతల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్య నాయకులు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతూనే.. రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఘాటైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో ఉన్న నేతల నుంచీ ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. మొన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇప్పుడు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు రేవంత్ టార్గెట్‌గా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాణం పోయినా సరే కాంగ్రెస్‌లోనే ఉంటానంటూనే రేవంత్‌పై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన విమర్శలు కలకలం రేపుతున్నాయి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన నాటి నుంచీ రేవంత్ వ్యవహరిస్తున్న తీరే దీనికి కారణమని అసంతృప్త నేతలు చెప్తున్నారు. వీరే కాకుండా ఇంకా ఎవరెవరు తెరపైకి వస్తారోనన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తీవ్ర ఆరోపణలతో.. రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్ ఇద్దరూ కాంగ్రెస్‌ను వీడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పార్టీని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చారని, రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బాగుపడదని శ్రవణ్ విమర్శించారు. ఏఐసీసీ నుంచి ఓ ఫ్రాంచైజీ తీసుకున్నట్టుగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజగోపాల్‌రెడ్డి కూడా ఇంతకుముందే తీవ్ర ఆరోపణలు చేశారు. చేయకూడని పనులు చేసే రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తాను పనిచేయలేనని, జైలుకు వెళ్లొచ్చినవారి నేతృత్వంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని కొనసాగలేనని వ్యాఖ్యానించారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతుందని విమర్శించారు. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ తీరును తప్పుపట్టారు. తనతో సహా పాత కాంగ్రెస్ నాయకులను వెళ్లగొట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అంతా వెళ్లిపోతే టీడీపీ వాళ్లను తెచ్చుకుని టికెట్లు ఇచ్చుకోవాలనేది రేవంత్ ఆలోచన అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే.. రేవంత్‌రెడ్డి గత ఏడాది జూలైలో టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. చాలా విషయాల్లో రేవంత్ ఏకపక్షంగా వెళుతుండటం వల్లే ఒక్కొక్కరుగా పార్టీ నేతలు బయటికి వస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. టీపీసీసీ కార్యవర్గంలో నియమితులైన పలువురు సీనియర్లతో రేవంత్‌రెడ్డికి పొసగడం లేదనే విమర్శలున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతల మధ్య సమన్వయం కుదరక.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చాలా కాలం క్రితమే రేవంత్‌తో విభేదించారు. ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా రేవంత్‌పై మహేశ్వర్‌రెడ్డి మాటల దాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్లోనూ రేవంత్‌కు అభిప్రాయ భేదాలు ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి తర్వాత కీలక హోదాలో ఉన్న తనను రేవంత్‌రెడ్డి కావాలనే పక్కన పెడుతున్నారన్న అభిప్రాయంతో మధుయాష్కీ ఉన్నారని పేర్కొంటున్నాయి. నిజామాబాద్ జిల్లా పార్టీ విషయంలో రేవంత్‌తో ఆయనకు సఖ్యత కుదరక అంటీ ముట్టనట్టే ఉంటున్నారు. కీలక నేతలు కూడా దూరం దూరంగా.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న నలుగురు నేతలు కూడా రేవంత్ వైఖరి పట్ల మనస్తాపం చెందిన సందర్భాలు ఉన్నాయి. టి.జగ్గారెడ్డి (సంగారెడ్డి), మహేశ్‌కుమార్‌గౌడ్ (నిజామాబాద్), అంజన్‌కుమార్ యాదవ్ (హైదరాబాద్), గీతారెడ్డి (మెదక్)లు పలు సందర్భాల్లో రేవంత్ వైఖరితో విభేదించిన ఘటనలు ఉన్నాయి. జగ్గారెడ్డి మొదటి నుంచీ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మిగతా నాయకులు గుంభనంగా ఉంటున్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. పార్టీలోని ఏకైక ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతో కూడా రేవంత్ ఇప్పటికీ సఖ్యత కుదుర్చుకోలేకపోయారని.. ఉత్తమ్, భట్టి, వీహెచ్ లాంటి సీనియర్లను కలుపుకొని పోయే అంశాన్నీ రేవంత్ పట్టించుకోవడం లేదని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. చేరికలు.. క్రమశిక్షణల విషయంలో.. కాంగ్రెస్‌లో కీలకమైన రెండు కమిటీల విషయంలో రేవంత్ ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఒకట్రెండు చేరికల ప్రతిపాదనలు వివాదానికి కారణమయ్యాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్, పాలమూరు జిల్లా జడ్చర్లకు చెందిన నేత ఎర్రశేఖర్ తదితరులు కాంగ్రెస్‌లో చేరే విషయంలో ఆయా జిల్లాల నాయకత్వాలు రేవంత్‌తో విభేదించాయి. తర్వాతా పలుచోట్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌లోకి ఎవరిని చేర్చుకోవాలనే అంశంలో సీనియర్లతో కమిటీ వేయాలని నిర్ణయించారు. తొలుత పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఈ కమిటీకి చైర్మన్‌గా నియమించాలనే ప్రతిపాదన చేసినా.. తర్వాత రేవంత్ చక్రం తిప్పి జానారెడ్డి పేరు ప్రకటించేలా చేశారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరిగింది. ఆ తర్వాత జానారెడ్డికి కూడా చెప్పకుండానే చాలా మందిని పార్టీలో చేర్చుకున్నారనే విమర్శలున్నాయి. పార్టీలో ధిక్కార స్వరాలను నియంత్రించాలనే లక్ష్యంతో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా తన జిల్లాకు చెందిన నాయకుడు చిన్నారెడ్డిని రేవంత్ నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ శిబిరం నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తేనే చిన్నారెడ్డి షోకాజ్ నోటీసులు ఇస్తారనే విమర్శలూ ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ రేవంత్ విషయంగా అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ టికెట్ల ప్రకటన, పార్టీ పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నియామకాల్లో జరుగుతున్న కసరత్తు, పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకంలో తాత్సారం, పార్టీ కమిటీల నియామకంలో ప్రాధాన్యత వంటి అంశాల్లో రేవంత్‌రెడ్డిపై చాలా మంది సీనియర్లు కినుకగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు అయినా ఇవన్నీ సర్దుకుంటాయా, మరింత ముదిరి పార్టీ పుట్టి మునుగుతుందా అంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: నయవంచకుడు రాజగోపాల్‌రెడ్డి.. నిప్పులు చెరిగిన రేవంత్‌రెడ్డి -
‘చీకోటి’ వెనుక ఉన్న చీకటి మిత్రులెవరూ?
సాక్షి, హైదరాబాద్: కల్వకుంట్ల కుంటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో నాలుగు కోట్ల జనం దగా పడ్డారన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందన్నారు. ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వంతో కొట్లాడుతున్నామన్నారు. వారం రోజులుగా కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. చదవండి: మునుగోడు ఉపఎన్నిక ఖాయం: రాజగోపాల్‌రెడ్డి ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర ధరలు ఇష్టమున్నట్లు పెంచుతున్నారు. అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తే .. తెలంగాణ తగ్గించలేదు. వరదల వల్ల రూ.1400 కోట్లు నష్టం జరిగిందని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. స్పష్టమైన అంచనా వేయలేదు. వారం రోజులుగా ఢిల్లీలో ఉన్నా.. నోరు మెదపడం లేదు. ప్రజా సమస్యలు గాలి కొదిలేశారని దుయ్యబట్టారు. ‘‘చీకోటి ప్రవీణ్ వెనక ఉన్న చీకటి మిత్రులు ఎవరనేది బయటపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల పాత్రల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈడీ దాడుల్లో వెలుగు చూసిన ఆధారాలపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలి. లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లుగా భావించవలసి ఉంటుంది. మంత్రులు స్టిక్కర్లు ఇచ్చి దొరికిన కానీ, కేసీఆర్ పట్టించుకోవడం లేదని’’ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
అవాకులు పేలినవారే అవాక్కు అవుతారు!
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ కుంగిపోయిందని, ఇక లేవలేదని అవాకులు, చెవాకులు పేలిన పార్టీలకు బుద్ధిచెప్పే విధంగా 2023లో రాష్ట్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోబోతున్నామని ప్రదేశ్‌కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2001లో కేసీఆర్ సిద్దిపేట ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి కూడా 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, అప్పుడు కూడా చాలామంది నేతలు కాంగ్రెస్ పని అయిపోందని విమర్శించారని, కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో 2023లో జూన్, జూలై మధ్యలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలనాపగ్గాలు చేపట్టబోతోందని అన్నారు. ఉప ఎన్నికలు తమకు లెక్కకాదని స్పష్టం చేశా రు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌తోపాటు కార్యవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది కావడంతో గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీలో జూనియర్ అయినా, వయసులో చాలామంది సీనియర్ నేతలకన్నా చిన్నవాడినైన తనకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా, మాజీ అధ్యక్షుడు రాహుల్పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించారని రేవంత్ అన్నారు. ప్రతీ ఒక్క నేతను కలుపుకొని ముందుకు సాగుతానని, సోనియా నిర్ణయించిన వ్యక్తిని పల్లకీలో మోసుకెళ్లి సీఎం కుర్చీలో కూర్చోబెడతానని ఉద్వేగంగా పేర్కొన్నారు. తన పేరుతో సోషల్ మీడియాలో పార్టీ సీనియర్ నేతలపై కామెంట్లు పెట్టకూడదని, అలా ఎవరు చేసినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 45 లక్షల సభ్యత్వం.. ప్రతీ సభ సక్సెస్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత నిర్వహించిన ప్రతి ఒక్క సభను కార్యకర్తల కృషితో విజయవంతం చేసుకున్నామని రేవంత్ వెల్లడించారు. సోనియా అభినందించేలా 45 లక్షల డిజిటల్ మెంబర్షిప్ చేశామని, దేశంలోనే తెలంగాణ ఫస్ట్ అని అధిష్టానం కితాబు ఇచ్చిందన్నారు. తన లక్కీ నెంబర్ 9 అని, 99 మందితో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. తెలగాణను కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని సీఎల్పీ నేత భట్టి విమర్శించారు. పార్టీలో చేరిన ఎర్ర శేఖర్, బిల్యానాయక్... మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, నల్లగొండ జిల్లా దేవరకొండ టీడీపీ నేత బిల్యానాయక్ తమ అనుచరులతో గాంధీభవన్‌లో రేవంత్, భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు సుబ్బరామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అనుచరులు, ఫిర్జాదిగూడకు చెందిన బీజేపీ, మహేశ్వరం నుంచి టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీలో చేరారు. -
కాంగ్రెస్‌లో కల్లోలం: వీహెచ్ వ్యవహారంపై రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కాంగ్రెస్ నేతలు కలవలేదు. కానీ టీపీసీసీ ఆదేశాలను పక్కనపెట్టి సిన్హాను వీహెచ్ కలిశారు. ఆయన వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: బీజేపీ సిద్ధమైతే.. అందుకు మేమూ రెడీ: మంత్రి తలసాని సిన్హాను కలవబోమని ముందే టీపీసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీని నిర్ణయాన్ని ఎవ్వరైనా పాటించాల్సిందేనని.. పార్టీ నిర్ణయం కాదని వ్యక్తిగతంగా మాట్లాడితే గోడకేసి కొడతామని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఆ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలనీయం’’ అంటూ ధ్వజమెత్తారు. మన ఇంటికి వచ్చినప్పుడే మనం కలవాలని రేవంత్‌రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
రూటు మార్చిన తెలంగాణ కాంగ్రెస్.. పార్టీలోకి కీలక నేతలు
-
కేసీఆర్ ఒక ఎక్స్పైర్ మెడిసిన్.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ అనే కాలం చెల్లిన మెడిసిన్ ఇక పనిచేయదని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.శనివారం టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం అనంతరం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో సీనియర్ నేతలు షబ్బీర్‌అలీ, మల్లు రవి, బలరాం నాయక్, అంజన్‌కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, దాసోజు శ్రవణ్, అనిల్ కుమార్ యాదవ్‌లతో కలసి మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన పాత్రను పెద్దది చేసి చూపడానికే కేసీఆర్ జాతీయపార్టీ ఏర్పాటు అంశాన్ని ఎత్తుకున్నారని అన్నారు. కేసీఆర్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి కథలు చెప్తా రని, వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లేనప్పు డు పొత్తు కోసం ఎందుకు ప్రయత్ని స్తున్నా రని రేవంత్ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ లైంగిక దాడి ఘటనపై సీఎం కేసీఆర్ కానీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకానీ ఇంతవరకూ స్పందిం చలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత లపై చర్చించేందుకు కేసీఆర్ వెంటనే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో శాంతిభద్రతల సమస్య తీవ్రమైన నేపథ్యంలో ఈ నెల 15న ‘హైద రాబాద్ బచావో’నినాదంతో అఖిల పక్ష సమా వేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 3న ఈడీ కార్యాలయం వద్ద నిరసన నేషనల్ హెరాల్డ్ పత్రిక ఆస్తుల విషయంలో ఎలాంటి నగదు లావాదేవీలు జరగకపో యినా కాంగ్రెస్ అధినేతలు సోనియా, రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్(ఈడీ) నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ నెల 13న హైదరాబాద్‌లోని ఈడీ కార్యాల యంలో విచారణకు హాజరవుతున్న రాహు ల్ బయటకు వచ్చేవరకు అక్కడే శాంతి యుత నిరసన తెలపాలని నిర్ణయించారు. -
అది బీజేపీ కుట్రే.. కావాలనే కేసు: రేవంత్ రెడ్డి
-
టీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా పిలుస్తా.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
-
వచ్చేది కాంగ్రెస్సే.. నాదే నాయకత్వం
వికారాబాద్, పరిగి: ‘కేసీఆర్ పుర్రెలో పురుగు తిరిగింది.. ఎన్నికలకు పోవాలనుకుంటుండు.. డిసెంబర్లోనే ఎన్నికల నగారా మోగుతుంది. మరో 11 నెలల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. దానికి నేనే నాయకత్వం వహిస్తా..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. శుక్రవారం పరిగిలో జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ డేటా అనలిటిక్స్ విభాగం చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తితో కలిసి కార్యకర్తలకు రేవంత్ పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరినోళ్లే, కాంగ్రెస్ సభ్యత్వం ఉన్నోళ్లే ప్రభుత్వ సం క్షేమ పథకాలు పొందటంలో ముందు వరుసలో ఉంటారని చెప్పారు. ఉద్యమకారులు, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఒక్క కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తాం గాంధీ కుటుంబాన్ని చూస్తే మోదీకి తడిసిపోతుందని, అం దుకే పాత కేసులు తిరగదోడి ఈడీ ద్వారా సోనియా, రాహుల్‌లకు నోటీసులు ఇప్పిస్తున్నారని రేవంత్ విమర్శిం చారు. గాంధీ కుటుంబం జోలికొస్తే అంతు చూస్తామని, బీజేపీని బట్టలూడదీసి కొడతామన్నారు. సోనియా, రాహుల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఈడీ నోటీసులకు నిరసనగా ఈ నెల 13న సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. డిజిటల్ కార్డులు పరిగిలోనే మొదలు సోనియా, రాహుల్‌ల తర్వాత పరిగిలోనే మొదటగా డిజిటల్ కార్డులు అందజేస్తున్నామని రేవంత్ తెలిపారు. కార్డు ఉన్నవారికి రూ. 2 లక్షల ప్రమాద బీమాతో పాటు అనేక ఉపయోగాలున్నాయని స్పష్టం చేశారు. పరిగిలో 50 వేల మెజార్టీతో రామ్మోహన్‌రెడ్డి గెలువటం ఖాయమని జోస్యం చెప్పారు. ‘పేదలకు భూములు ఎవరు పంచారు? ఇంది రమ్మ ఇళ్లు ఎవరిచ్చారు? మొదట రుణమాఫీ చేసిందెవరు? ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చారు? బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా...?’ అంటూ గుర్తు చేశారు. డిజిటల్ కార్డుతో ఢిల్లీ నుంచే పర్యవేక్షణ డిజిటల్ కార్డు ద్వారా పార్టీ అధిష్టానం ఢిల్లీ నుంచే ప్రతి కార్యకర్తను చూస్తుందని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. కార్యకర్త పనితీరును కూడా దీనిద్వారా అంచనా వేస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసాంఘిక చర్యలకు పాల్పడే పబ్‌లపై దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, నేరాలను ప్రోత్సహించే పబ్‌లపై దాడులు తప్పవని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ పరిధిలో అలాంటి పబ్‌లపై రాబోయే రోజు ల్లో భౌతిక దాడులు చేయాలని ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. అలాగే రాత్రి 11:30 తర్వాత తెరిచి ఉంచే వాటిపై కూడా దాడులు తప్పవని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశ్వనగరంగా మారాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశా రు. కేసీఆర్ సీఎం అయ్యాక హైదరాబాద్‌లో సుమారు 150 పబ్‌లకు అనుమతినిచ్చారని, పబ్‌ల వ్యాపారం వెనుక రాష్ట్రంలోని రాజులు, యువరాజులకు సంబంధించిన వ్యక్తులు కీలకంగా ఉన్నారని ఆరోపించారు. పబ్‌లు, డ్రగ్ల సంస్కృతిని ప్రోత్సహించడం వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారు మిత్రపక్షాలుగా ఉన్న టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు హత్యలు, అత్యాచారాల్లోనూ భాగస్వాములయ్యారని రేవంత్ విమర్శించారు. మైనర్ అత్యాచారం ఘటన గురించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే, కొందరిని తప్పించే ప్రయత్నం చేసినట్టుగా ఉందని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా వాహనానికి సంబంధించిన కీలకమైన ఆధారాలను, వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. యజమానులపై పోక్సో చట్టం ప్రకారం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్లలోని కీలకమైన ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోందన్నారు. పబ్‌లపై పోలీసుల పర్యవేక్షణ కరువైందని, తనిఖీలు చేయకుండా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించాలి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహించలేదని, ఇప్పటికైనా తక్షణమే ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులపై సమీక్ష జరపాలని రేవంత్‌రెడ్డి కోరారు. మైనర్లను అనుమతిస్తున్న పబ్ యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మైనర్ అత్యాచార వ్యవహారంలో వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌పై సీఎం కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మైనర్ బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించట్లేదని మండిపడ్డారు. -
రేవంత్ రెడ్డి ఓ దొంగ: మల్లారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ దివాలా తీసిన దరిద్రపు పార్టీ అని, రేవంత్ రెడ్డి ఏపార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్ అవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి. రేవంత్ తనపై చేసిన కామెంట్లకు కౌంటర్‌గా.. టీఆర్ఎస్ఎల్పీ నుంచి మంగళవారం ఆయన మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లోని భట్టి, ఉత్తమ్, జగ్గారెడ్డి అమాయకులు. రేవంత్ మాత్రం లుచ్చా పనులు చేస్తున్నాడు. పదే పదే కేసీఆర్, కేటీఆర్‌లను తిడుతున్నాడు. అది రచ్చబండ కాదు.. లుచ్చా బండ. పెళ్లి పెటాకులు లేకుండా నైట్ క్లబ్‌ల చుట్టూ తిరిగే రాహుల్ గాంధీ ఓ తోపు.. ఈ పీసీసీ చీఫ్(రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి..) ఓ తోపు. అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నాడు. సీఎం కాదు కదా.. కనీసం అటెండర్ కూడా కాలేడంటూ రేవంత్‌పై మండిపడ్డారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి తమ మధ్య గొడవలు జరుగుతుండేవని పేర్కొన్న మల్లారెడ్డి.. టీడీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే రేవంత్ తనపై బెదిరింపులకు దిగాడని చెప్పారు. ‘నా కాలేజీలు మూయిస్తానని బ్లాక్మెయిల్ చేశాడు. రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి ఎవరి డబ్బుతో చేశాడు.. నా డబ్బుతో చేశాను’ అంటూ సంచలన కామెంట్లు చేశాడు మల్లారెడ్డి. కాదని యాదగిరిగుట్టపై ప్రమాణం చెప్పాలని రేవంత్‌కు సవాల్ విసిరాడు మల్లారెడ్డి. రేవంత్ వ్యాఖ్యలపై సొంత సామాజిక వర్గమే అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి. రేవంత్ రెడ్డిది అంతా డ్రామా అని, మూడేళ్లలో ఎంపీగా ఏం చేశాడని, చివరికు రాహుల్ గాంధీని సైతం బ్లాక్మెయిల్ చేసే రకం అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబును పట్టుకుని పీసీసీ తెచ్చుకున్నాడంటూ సెటైర్ సంధించారు. ఇదిలా ఉండగా.. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారని, ఆయన అల్లుడికి అందులో హస్తం ఉందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరినీ జైలుకు పంపి తీరతానంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే కౌంటర్‌గానే ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి ఇలా మీడియా ముందుకు వచ్చారు. తాను ప్రభుత్వ భూమిని ఎక్కడా కొనలేదని.. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే కొన్నానని, అందులో తప్పేముందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం భూములు కొంటున్నారు కదా అని ప్రశ్నించారు. కోర్టు సైతం తనకు అనుకూల తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మల్లారెడ్డి గుర్తు చేశారు. -
Sakshi Cartoon: మా కార్యకర్త చావుకు కారకులయ్యార్సార్!
అప్పుడు మీరు టీడీపీలో ఉండి మా కార్యకర్త చావుకు కారకులయ్యార్సార్! -
కేసీఆర్.. వడ్లు ఎట్ల కొనవో చూస్తా
సాక్షి, కామారెడ్డి : ‘బిడ్డా కేసీఆర్.. వడ్లు ఎట్ల కొనవో చూస్తా.. దుడ్డు కర్రల సైన్యం నిర్మిస్తా.. వేలాది మందితో నీ ఫాంహౌస్‌కు ఉప్పెనలా దూసు కొస్తా.. సునామీ సృష్టిస్తా..’ అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి గర్జించారు. ‘ఈ నెలాఖరులో వడ్ల కొనుగోలు కోసం ఉద్యమం మొదలు పెడతా.. రైతుల ముందు నేనే ఉంటా.. లాఠీ అయినా, తూటా అయినా నా నుంచే మొదలు కావాలె..’ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిర్వహిం చిన ‘మన ఊరు–మన పోరు’ బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరి గారు. రూ.2 లక్షల కోట్లతో బడ్జెట్ పెడుతున్న కేసీఆర్.. రైతులు పండించిన ధాన్యం కొనేందుకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేయలేడా? అని ప్రశ్నించారు. ఎల్లారెడ్డి సభ ఉందనే సీఎం ఆగమై ధాన్యం కోసం కేంద్రం మీద యుద్ధమంటూ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రతి గింజనూ కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వా నిదేనని రేవంత్ స్పష్టం చేశారు. ఫాంహౌస్ ముందర కూసుంటం: కేసీఆర్ ఫాం హౌస్‌లో 150 ఎకరాల వరి ధాన్యం ఎవరు కొంట రో, రైతులు పండించిన ధాన్యం కూడా అతనే కొనా లని, దాని కోసం రైతులతో కలిసి గుత్ప కట్టెలు పట్టుకుని కేసీఆర్ ఫాంహౌస్ ముందు కూచుంటా మని రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరా ల్లో వరి పండితే, 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తయని, వీటిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు చేతకాదా? అని ప్రశ్నించారు. రైతులపోరు స్ఫూర్తిదాయకం: రైతులు, నిరు ద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వా నికి కనబడటం లేదా? అని రేవంత్ ప్రశ్నించారు. మోదీ మెడలు వంచిన పంజాబ్, హర్యానా రైతు లను స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి నిజామాబాద్ రైతులు పోరాడాలని పిలుపునిచ్చారు. హరీశ్ దగ్గరకి వీహెచ్ ఎందుకు పోయిండు? ‘సన్నాసుల చేతుల్లో పావులుగా మారిండ్రు. పార్టీని గౌరవిం చకుంటే పార్టీలో ఉన్నా సచ్చినట్టే’ అని పీసీసీ అధికార ప్రతి నిధి అద్దంకి దయాకర్ సభలో ధ్వజమెత్తారు. ‘మంత్రి హరీశ్ మా పెద్దమనిషి వీహెచ్‌ను ఎందుకు పిలిచిండో సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ షబ్బీర్‌అలీ, మల్లు రవి పాల్గొన్నారు. రేవంత్ కాన్వాయ్‌కు ప్రమాదం తూప్రాన్: హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్తుండగా రేవంత్ వాహనం వెనుక వస్తున్న 4 వాహనాలతో కూడిన కాన్వాయ్‌లోకి అకస్మాత్తుగా ఒక ప్రయాణికుడి కారు చేరింది. దీంతో ఆయా కార్ల డ్రైవర్లు ఒక్కసారిగా సడన్ బ్రేక్‌లు వేశారు. నాలుగు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొని స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. -
వరి కొనకుంటే కేసీఆర్‌కు ఉరే..
వికారాబాద్/పరిగి: యాసంగిలో రైతులు పండించిన వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందేనని.. లేకుంటే సీఎం కేసీఆర్‌కు మిగిలేది ఉరేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. అంతా కలిసి సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను ముట్టడిద్దామని పిలుపునిచ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘మన ఊరు – మన పోరు’బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో రైతులు వరి పండించారు. ఆ పంటను కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. కేసీఆర్ కూడా తన ఫామ్‌హౌజ్‌లో 150 ఎకరాల్లో వరి పండించారు. కేసీఆర్ పంటను ఎవరు కొంటరో.. వారు పేద రైతుల వరిని కొనాల్సిందే. రైతులెవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుంది. పంటకోతకు వచ్చినప్పుడు వేలమంది కార్యకర్తలు, రైతులు కలిసి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌ను ముట్టడిద్దాం. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసు చేసుకుంటే కేవలం రూ.10 వేల కోట్లతో రైతుల పంటను కొనొచ్చు. కానీ ఈ సన్నాసులకు మంచి ఆలోచనలు రావు. చేవెళ్ల, వికారాబాద్ అభివృద్ధి ఏది? నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాడిన కొండా వెంకటరంగారెడ్డి, దేశ రాజకీయాలను శాసించిన మర్రి చెన్నారెడ్డి వంటివారు వికారాబాద్, చేవెళ్ల ప్రాంతాన్ని ఏలారు. అటువంటి ప్రాంతం ఇప్పుడు రంజిత్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి వంటి సన్నాసుల పాలైంది. వాళ్లు చేవెళ్లకు గోదావరి నీళ్లు తెస్తారని ఎట్లా అనుకుంటాం? చేవెళ్లనేమో కొండపోచమ్మలో కలిపారు. చేవెళ్ల చెల్లెమ్మ (మంత్రి సబితా ఇంద్రారెడ్డి)ను టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన అని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. మరి ఇంతవరకు ఏం అభివృద్ధి జరిగింది? మీకు మంత్రి పదవి, మీ కుమారుడికి డబ్బులు తప్ప.. ప్రజలకు ఏం ఒరిగింది. గోదావరి జలాలతో పరిగి, వికారాబాద్, తాండూరు ప్రాంత ప్రజల కాళ్లు కడుగుతా అని కేసీఆర్ ఇచ్చిన మాట తప్పితే ప్రశ్నించేందుకు మీకు మాటలు రావా? ప్రాణహిత–చేవెళ్ల, పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ తెస్తే.. రద్దు చేసింది కేసీఆర్ కాదా? దమ్ముంటే యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు వేసి చెప్పాలె. పాలమూరు కట్టలేం అంటున్నరు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మెదక్ జిల్లాకే పరిమితం చేసింది నిజం కాదా కేసీఆర్..? ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను కొడంగల్ వరకు తెస్తానంటే ఎవరూ వద్దనలేదు. స్వయంగా కేసీఆరే వద్దన్నాడు. ఇప్పుడు పాలమూరు–రంగారెడ్డినీ పడావు పెట్టిండు. ఇక ఈ ప్రాజెక్టు కట్టబోమని కోర్టులో అఫిడవిట్ వేసిం డు. 2014లో సీఎం అయ్యాక కేసీఆర్ చెప్పినట్టు మూడేళ్లలో పాలమూరు–రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తర్వాత ఏపీ పెట్టిన కేసుల వల్ల ఆ ప్రాజెక్టు ఆగింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణకు అన్యా యం జరుగుతోందని.. వందల మంది ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం. కేసీఆర్‌ను నమ్మి రెండుసార్లు సీఎంని చేస్తే.. నీళ్లేమో ఏపీకి.. నిధులేమో మేఘా కుటుంబానికి పోయాయి. నియామకాలేమో కేసీఆర్ ఇంటిల్లిపాదికి వచ్చాయి. మరి తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరులకు, రైతులకు ఏం వచ్చింది?’’అని రేవంత్ నిలదీశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, గీతారెడ్డి, చిన్నారెడ్డి, నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్ యాదవ్, అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. సభకు ముందు రోడ్‌షో నిర్వహించారు. -
అవినీతి వల్లే చార్జీల పెంపు
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎత్తిపోతల పథకాలు, ఇతర ఉచిత విద్యుత్ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వమే ఏటా సుమారు 30% విద్యుత్‌ను వాడుకుంటోంది. ఇందుకు రూ. 16 వేల కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాల్సి ఉండగా రూ. 5,652 కోట్లనే సబ్సిడీగా ఇస్తోంది. మిగతా రూ. 10 వేల కోట్లను రాష్ట్ర ప్రజలే చెల్లించాల్సి రానుంది. ప్రభుత్వ ఆస్తులు జప్తు చేసైనా ఈ బకాయిలు వసూలు చేయాలి. ప్రజలపై భారం వేసే చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలి’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ. 8,631 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు సమర్పించిన టారిఫ్ ప్రతిపాదనలపై ఈఆర్సీ చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు, సభ్యులు ఎం.డి. మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్య శుక్రవారం హైదరాబాద్‌లో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుతోపాటు రైతులు, వినియోగదారులు, పారిశ్రామిక సంఘాలు తమ వాణిని వినిపించాయి. రేవంత్ మాట్లాడుతూ జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంల నిర్వహణలో తప్పిదాలు, ప్రభుత్వ అవినీతి వల్లే డిస్కంలు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందని మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశారు. డిస్కంలు దివాలా..! ‘ఉదయ్’ పథకంలో చేరడంతో 2014–15లో డిస్కంల అప్పులు రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 2,234 కోట్లకు తగ్గాయని, కానీ 2022 నాటికి ఏకంగా రూ. 60 వేల కోట్లకు పెరిగాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలుకు అడ్డగోలుగా అప్పులు చేయడంతో డిస్కంలు ఆర్థికంగా దివాలా తీశాయన్నారు. జనరేటర్లకు రూ. వేల కోట్ల బకాయిలు చెల్లించలేక చేతులెత్తేశాయని చెప్పారు. జెన్కో థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించి ప్రైవేటు నుంచి అధిక రేటుతో ప్రభుత్వం విద్యుత్ కొనడం వల్ల వినియోగదారులపై రూ. వేల కోట్ల భారం పడిందని ఆరోపించారు. ‘భద్రాద్రి’ వ్యయాన్ని ఆమోదించొద్దు: శ్రీధర్‌బాబు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణ వ్యయం భారీగా రూ. 8,536 కోట్లకు పెరిగిందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ వ్యయాన్ని ఆమోదించరాదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు. గృహాలపై డిస్కంలు అడ్డగోలుగా రూ. 8 వేల వరకు డెవలప్మెంట్ చార్జీలు వేస్తున్నాయని తప్పుబట్టారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రభుత్వ సబ్సిడీలు పెంచడం ద్వారా డిస్కంల ఆర్థిక లోటును పూడ్చాలని సూచించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన రూ. 6,831 కోట్ల చార్జీల పెంపునకు తోడుగా భవిష్యత్తులో గత ఐదేళ్లకు సంబంధించిన ట్రూఅప్ చార్జీలను సైతం వసూలు చేస్తామని డిస్కంలు పేర్కొనడంతో రూ. 50 వేల కోట్లకుపైగా చార్జీల పెంపు భారాన్ని ప్రజలపై వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎన్.వేణుగోపాల్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు విధానాలు, విద్యుత్ సంస్థల నిర్వహణ లోపాలే దీనికి కారణమన్నారు. విద్యుత్ చార్జీల పెంపును తట్టుకోలేక బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్నామని దక్షిణమధ్య రైల్వే చీఫ్ ఇంజనీర్ జీవీ మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఫిక్స్డ్ చార్జీల పెంపు, గ్రిడ్ నిర్వహణ చార్జీల విధింపును టీసీఎస్, ఫ్యాప్సీ, సిమెంట్ కంపెనీలు వ్యతిరేకించాయి. రాత్రి విద్యుత్ వాడకంపై రాయితీలను తగ్గించడాన్ని తప్పుబట్టాయి. బోరు ఎండిపోవడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ను సరెండర్ చేసిన 30 ఏళ్ల తర్వాత రూ. 4 లక్షల బిల్లు జారీ చేశారని భువనగిరి జిల్లాకు చెందిన సామా సత్తిరెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, వివిధ వర్గాల అభ్యంతరాలపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వివరణ ఇచ్చారు. -
సభ్యత్వ నమోదు వేగం పెంచండి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు వేగం పెంచాలని పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి ఆదేశించారు. తమ సంఘాల పరిధిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని, సభ్యత్వం తీసుకునేందుకు అర్హులైన వారిని గుర్తించి చేర్పించాలన్నారు. గురువారం గాంధీభవన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సభ్యత్వ నమోదుపై ఆయన సమీక్షించారు. పార్టీ సీనియర్ ఉపాధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాల వారీ ఇన్చార్జులతో పాటు అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ.. అన్ని అనుబంధ సంఘాలు పార్టీ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని, పార్టీకి వెన్నెముక లాంటి ఎన్ఎస్యూఐ, యూత్, మహిళా కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో మరింత క్రియాశీలంగా పార్టీ సభ్యుల చేరిక జరగాలని అన్నారు. అనుబంధ సంఘాలకే నేరుగా సభ్యత్వ లింకులు ఇచ్చినందున వీలైనంత త్వరగా కార్యక్రమం పూర్తి చేయాలని కోరారు. అనుబంధ సంఘాలు పనితీరు మెరుగుపర్చుకోవాలని, 3 నెలల్లో అన్ని సంఘాలు క్రియాశీలం కాకపోతే బాధ్యులపై వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. కాగా, రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొనే ఈ పండుగపూట ప్రజలకు అంతా మంచి జరగాలని ఆయన అభిలషించారు. -
అధిష్టానికి జగ్గారెడ్డి లేఖ.. మైండ్‌సెట్ మార్చండి.. లేదంటే ఆయన్నే మార్చండి
రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడంలేదు. కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారు. దీనిలో ఏదో మతలబు ఉంది. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే రేవంత్ ఆలోచిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేసేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మైండ్‌సెట్ మార్చాలని లేదంటే కాంగ్రెస్ లైన్లో పనిచేసే మరో నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీకి సోమవారం ఆయన లేఖ రాశారు. కాం గ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌లకు కూడా ఈ లేఖ ప్రతులను పంపారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడం లేదని, కార్పొరేట్ ఆఫీస్ తరహాలో పార్టీని నడుపుతున్నారని సోనియాకు రాసిన లేఖలో జగ్గారెడ్డి పేర్కొన్నారు. దీనిలో ఏదో మతలబు ఉం దని అనుమానం వ్యక్తంచేశారు. పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించకుండా, తన వ్యక్తిగత ప్రతిష్ట కోసం మాత్రమే రేవంత్ ఆలోచిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండానే రైతులను కలిసేందుకు వస్తానని మీడియాను ఇంటికి పిలిపించుకుని ప్రకటన చేశారని, ఈ విషయంలో జిల్లా నాయకులకు ఎవరినీ ఆయన సంప్రదించలేదని వివరించారు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో పార్టీ అభ్యర్థికి కేవలం 3 వేల ఓట్లు మాత్రమే వచ్చాయని, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నియోజకవర్గంలో కూడా పోటీ చేయకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం పార్టీ కోణంలో మాత్రమే ఆలోచించి ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నానని వెల్లడించారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని, పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సిందిగా రేవంత్‌కు సూచించాలని జగ్గారెడ్డి కోరారు. -
రేవంత్‌రెడ్డిని తప్పించండి.. జగ్గారెడ్డి లేఖ
హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి ఓ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పార్టీ నేతలను కలుపోకోపోకుండా వ్యక్తి గత ఇమేజ్ కోసం పాకులాడుతున్నాడని, పార్టీ నేతలతో చర్చించకుండా పార్టీ ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేస్తున్నాడని జగ్గారెడ్డి ఆ లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎర్రవల్లి ప్రోగ్రామ్ గురించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న తనతో చర్చించలేదని జగ్గారెడ్డి ఆ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోయేలా ఆదేశాలు ఇవ్వండి.. లేదంటే పీసీసీ చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించి అందరినీ కలుపుకొనిపోయే మరోకరికి అవకాశం ఇవ్వండంటూ కాంగ్ అధిష్టానాన్ని లేఖలో జగ్గారెడ్డి కోరినట్లు సమాచారం. జగ్గారెడ్డికి సమాచారం ఇవ్వకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంత రావు కూడ తప్పుబట్టారు. ఇదిలా ఉంటే గజ్వేల్ జిల్లా ఎర్రవెల్లి గ్రామంలో రచ్చబండకు వెళ్తుండగా పోలీసులు భారీ బందోబస్తుతో అడ్డుకొని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్
రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల నుంచి రైతులకు ఉరిశిక్ష వేస్తోంది. పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు చనిపోతుంటే ప్రభుత్వం వారిలో ధైర్యాన్ని నింపలేకపోతోంది. మేము వెళ్లి కల్లాల వద్ద, రచ్చబండ పెట్టి ధైర్యం చెప్తామంటే వెళ్లనీయడం లేదు. ప్రభుత్వం వరి కొనుగోలు చేయకుంటే రైతులు సీఎం కేసీఆర్‌ను ఉరేస్తారన్న విషయాన్ని మర్చిపోవద్దు. – టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్/అంబర్‌పేట/గజ్వేల్: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామంలో టీపీసీసీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘రైతులతో రచ్చబండ’ను పోలీసులు భగ్నం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను అన్నదాతలకు వివరించేందుకు కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకోగా ఆదివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సోమవారం ఉదయం టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్‌రెడ్డి సహా నియోజకవర్గ, జిల్లా, మండల స్థాయి నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. దీంతో పలుమార్లు కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పోలీసులు వెళ్లకపోవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎర్రవెల్లి వెళ్లేందుకు రేవంత్‌రెడ్డి ప్రయ త్నించారు. ఇంట్లోంచి బయటకు వచ్చి తన కారు ఎ క్కేందుకు సిద్ధమవగా అడ్డుకున్న పోలీసులు ఆయ న్ను అరెస్ట్ చేసి పోలీస్ వాహనంలో తరలించేందుకు యత్నించారు. కార్యకర్తలు నినాదాలు చేస్తూ పోలీసు వాహనంపై ఎక్కి అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వా దం చోటుచేసుకుంది. అరగంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ తోపులాటలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవికి స్వల్ప గాయాలయ్యాయి. చివరకు రేవంత్‌ను పోలీసులు అంబర్‌పేట పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుస్టేషన్లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్యకర్తలు ప్రయత్నించడంతోపాటు రోడ్డు పై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు సో మవారం సాయంత్రం రేవంత్‌ను విడుదల చేశారు. ఎర్రవల్లి అష్టదిగ్బంధం... రచ్చబండకు అనుమతిలేదంటూ సిద్దిపేట సీపీ శ్వేత ఆదేశాల మేరకు డీసీపీ మహేందర్, ఏసీపీలు మడత రమేశ్, గురువారెడ్డిల అధ్వర్యంలో సోమ వారం తెల్లవారుజాము నుంచి వందలాది పోలీసు లు ఎర్రవల్లి గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. 16 మంది సీఐలు, 25 మందికిపైగా ఎస్ఐలు, వివిధ స్థాయిల పోలీసులు గ్రామానికి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను నిలువరించేందుకు ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కేవలం సరైన గుర్తింపు కార్డులు చూపిన ఎర్రవల్లి గ్రామస్తులనే గ్రామంలోకి అనుమతించారు. మీడియాపైనా ఆంక్షలు విధించారు. జిల్లా సరిహద్దు గ్రామాలు వంటిమామిడి, పీర్లపల్లిల్లోనూ చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి అనుమానితులను నిలువరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు: కాంగ్రెస్ నేతలు రైతులతో రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధించడాన్ని పలువురు టీపీసీసీ నేతలు ఖండించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని, టీఆర్ఎస్–బీజేపీలు కుమ్మక్కై ఆందో ళనలను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతించిన అధికార టీఆర్ఎస్... తమ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని ఎలా అడ్డుకుంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు వీహెచ్, మల్లురవి ప్రశ్నించారు. -
ఈడీ దాడుల భయంతోనే నాటకాలు: రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ శివారులోని భూముల అక్రమ కేటా యింపులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడు లు, కేసుల నుంచి తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్ పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో ఆందోళన చేయించారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ భూముల వ్యవహారానికి సంబంధించి మంత్రి కేటీఆర్‌ను ఈడీ పిలిపించాలని చూసిందని, చివరి నిమిషంలో అది వాయిదా పడిందని తెలిపారు. తాత్కాలికంగా వాయిదా వేశారనే కృతజ్ఞతతోనే ఆ పార్టీ ఎంపీలు సభాకార్య క్రమాలకు ఆటంకం కలిగించి బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా సహకరిం చారన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన ఏపీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ‘వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వా లని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తుంటే, దానిని పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్ ఎంపీలు పోడియం చుట్టుముట్టి ఆందోళన చేశారు. హైదరాబాద్ శివార్లలో రూ.3 వేల కోట్ల విలువైన భూముల విషయంలో కేసీఆర్ సన్నిహితులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. వారందరినీ పిలిచి విచారించింది. ఉమ్మడి ఏపీలో 15 ఏళ్ల క్రితం విదేశీ కంపెనీ లకు రూ.450 కోట్లకు ఈ భూములను అప్పటి ప్రభుత్వం కట్టబెడితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి నుంచి బలవంతంగా రూ.350 కోట్లకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు చెందిన పెద్ద రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్, టీవీ చానల్ యజమానికి కట్టబెట్టారు. ఈ భూముల అక్రమాల ఫైలుపై మంత్రి కేటీఆర్ సంతకం చేశారు’అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్, కేటీఆర్‌ను బర్తరఫ్ చేస్తేనే.. యువతకు ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్‌లను వారి ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసినప్పుడే రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని టీపీసీసీ చీఫ్ ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందుకోసం విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన తాము ముందుండి పోరాడతామని, ప్రభుత్వం పేల్చే తూటా, విసిరే లాఠీలను ఎ దుర్కొని నిలబడతా మని చెప్పారు. తమ ఉద్యమానికి విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు షబ్బీర్ అలీ, మల్లు రవి, మహేశ్‌కుమార్‌గౌడ్, బెల్లయ్య నాయక్, హర్కర వేణుగోపాల్, కైలాశ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై ఆఖరి పోరాటంలో భాగంగా ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 నుంచి తెలంగాణ ప్రజలకు పవిత్రరోజైన డిసెంబర్ 9 వరకు ఈ ఉద్యమాన్ని 65 రోజులపాటు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రం తెచ్చుకుంది దీనికేనా? అక్టోబర్ 2న దిల్సుఖ్నగర్ రాజీవ్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్లో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్న ప్రదేశం వరకు ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ చేస్తామని రేవంత్ చెప్పారు. శ్రీకాంతాచారి స్ఫూర్తితో ఈ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామన్నారు. 65 రోజుల కార్యాచరణలో భాగంగా మండల, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని, అన్ని యూనివర్సిటీలను సందర్శిస్తామని తెలిపారు. కేసీఆర్ అధికారంలో వచ్చే నాటికి ఖాళీగా ఉన్న 1.10లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, అప్పటి నుంచి రిటైరైన పోస్టులను కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు. పీఆర్సీ నివేదికలోనే 1.91 లక్షల ఖాళీలు ప్రకటించారని, వెంటనే నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ డిమాండ్ అన్నారు. అదే విధంగా నిరుద్యోగుల కోసం ఎన్నికల హామీ కింద ఇచ్చిన నెలకు రూ.3,016 భృతిని ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి 30 నెలలవుతోందని, ఈ 30 నెలల్లో రాష్ట్రంలోని ప్రతి నిరుద్యోగికి భృతి కింద కేసీఆర్ బాకీ పడ్డ రూ.లక్ష రూపాయలను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ కింద బకాయి పడ్డ రూ.4వేల కోట్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తెచ్చుకుంది సన్నబియ్యం, చేపపిల్లలు, గొర్రెలు, బర్రెల కోసం కాదని పేద, బడుగు, బలహీన, దళిత, మైనార్టీ, ఆదివాసీల బిడ్డలు కూడా కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకునేందుకని చెప్పారు. రాష్ట్రంలో రాచరిక పాలన నుంచి విముక్తి కలిగించి, ఆ పోకడలను 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టేందుకే ఈ జంగ్‌సైరన్ కార్యాచరణ ప్రకటించామన్నారు. మా వ్యూహం మాకుంది హుజూరాబాద్ ఉప ఎన్నికపై విలేకరులు అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానమిస్తూ ఈ ఎన్నికల్లో తమ వ్యూహం తమకుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అభ్యర్థి ఎవరనేది కమిటీ చూసుకుంటుందని, రెండు రోజుల్లో మంచి వార్త చెపుతామన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని, అయితే కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని ఎన్నికలను ఎదుర్కొంటామని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ తాము ప్రజల పక్షాన రాష్ట్రంలో బంద్ చేస్తుంటే కేసీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో విందు చేశారని ఎద్దేవా చేశారు. తాను గులాంగిరీ చేస్తున్న రాజులు అమిత్‌షా, మోదీలకు సామంతరాజు హోదాలో కప్పం కట్టేందుకే కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు తప్ప రాష్ట్రానికి 5 పైసల ప్రయోజనం కూడా లేదని దుయ్యబట్టారు. -
విద్యుత్ చార్జీల పెంపు మీ అసమర్థ పాలనకు నిదర్శనమా: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు టీఆర్ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి పెరిగి తక్కువ ధరలకు విద్యుత్ లభిస్తున్న తరుణంలో చార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపుతారా అని మండిపడ్డారు.పెట్రో ఉత్పత్తులపై వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిన విషయం వాస్తవం కాదా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు.ఘిది మీ పతనమైన పాలనా వ్యవస్థల దుష్పలితామా అని నిలదీశారు. ఈ మేరకు విద్యుత్ చార్జీల పెంపు, ఆర్టీసీ నష్టాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం ట్వీట్ చేశారు. దేశంలో ఉత్పత్తి పెరిగి,తక్కువ ధరకే విద్యుత్ లభిస్తోన్న పరిస్థితుల్లో వినియోగదారులకు ఛార్జీలు తగ్గించాల్సింది పోయి భారం మోపడం అసమర్ధతకు నిదర్శనమా? మీ పాలనలో పతనమైన వ్యవస్థల దుష్ఫలితమా? పెట్రో ఉత్పత్తుల పై నువ్వు వేసే పన్ను ఆర్టీసీ వెన్ను విరిచిందన్నది వాస్తవం కాదా, కేసీఆర్! pic.twitter.com/eajDYV6k4W — Revanth Reddy (@revanth_anumula) September 23, 2021 -
కేసీఆర్‌ను చూస్తుంటే హిట్లర్ గుర్తుకొస్తున్నారు: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ను చూస్తుంటే హిట్లర్ గుర్తుకొస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో దళితులను పావులుగా వాడుకున్నారని మండిపడ్డారు. ఏడేళ్లలో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేయలేదని.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మాట తప్పారని ధ్వజమెత్తారు. దళితుల అభివృద్ధిపై ఏనాడు కేసీఆర్ సమీక్ష నిర్వహించలేదని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఈనెల 18న రావిరాలలో దండోరా మోగిస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. దళిత బంధు కాదు.. దళిత ద్రోహి.. జగిత్యాల: దళిత బంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోతారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. దళితులకు సంబంధించిన రూ.30 వేల కోట్లను కమిషన్ల కోసం దారి మళ్లించారని ఆయన నిప్పులు చెరిగారు. కేవలం ప్రకటనలు కాకుండా నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టాలని జీవన్‌రెడ్డి హితవు పలికారు. -
పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి వెంటనే పరిహారం చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు సోమ వారం బహిరంగ లేఖ రాశారు. విపత్తుల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర బృందాలను రప్పించి క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేయించే సంప్రదాయం గతంలో ఉండేదని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర బృందాలతో పంట నష్టం అంచనా వేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని అటకెక్కించారని, పంటల బీమా అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమైనందున బాధిత రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోకాపేట భూముల సందర్శనకు ఈరోజు వెళతానని ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులు మొహరించారు. రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం చేసి.. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్ అరెస్ట్ చేశారు. కోకాపేట వేలం భూముల వద్ద నిరసన నేపథ్యంలో వీరిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు ప్లాన్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. కోకాపేట భూముల వద్ద పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మద్య తోపులాట టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు. కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి. -
Revanth Reddy: సమరానికి సై!
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా పరిధిలోని మల్కాజిగిరి ఎంపీ రేవంతరెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టటంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనిపిస్తున్నది. అదే ఉత్సాహాన్ని జిల్లాలో కొనసాగించేందుకు యువత, మహిళలను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు వారు ఎదుర్కొంటున్న తాజా సమస్యలపై ఫోకస్ పెంచి సంస్థాగతంగా కాంగ్రెస్ బలోపేతానికి కేడర్‌ను సిద్ధం చేసేందుకు డీసీసీ యోచిస్తున్నది. జిల్లా స్థాయి నుంచి డివిజన్, వార్డు, గ్రామ స్థాయి వరకు ప్రజా సమస్యలను గుర్తించి, పాలకవర్గాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను జోడించి ఆయా స్థాయిల్లో దశలవారీ ఆందోళనకు కేడర్, నాయకులు నడుంబిగించేలా కార్యాచరణ ఖరారుకు చర్యలు తీసుకుంటుంది. గ్రేటర్ పరిధిలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు, శివారులోని మరో నియోజకవర్గంలో ప్రజాందోళనలు బలంగా నిర్వహించటం ద్వారా కాంగ్రెస్ ప్రతిష్టను పెంచాలనుకుంటుంది. కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్న నాయకులు, కేడర్‌ను ఆయా కమిటీల్లో ఇముడ్చుకునేందుకు జిల్లా నుంచి క్షేత్ర స్థాయి వరకు కమిటీల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాలని యోచిస్తున్నది. వ్యూహప్రతి వ్యూహాలతో... ► మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తాజాగా భేటీ నిర్వహించి సంస్థాగత బలోపేతానికి చేపట్టాల్సిన కసరత్తు, వ్యూహ, ప్రతి వ్యూహాలు, బలం, బలహీనతలు, కమిటీల పునరుద్ధరణ, ఆందోళన కార్యక్రమాలు, నాయకులు, కేడర్ గుర్తింపు, పారీ్టలో చిన్నాపెద్ద తేడా లేకుండా సమష్టిగా పని చేయటం వంటి విషయాలపై చర్చించారు. ► జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీకి ఒక జడ్పీటీసీ సభ్యుడిసహా ఇద్దరు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యాక్షులు, 11 మంది ఎంపీటీసీ సభ్యులు, ముగ్గురు సర్పంచులు , 15 మంది కార్పొరేటర్లు, 18 మంది కౌన్సిలర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. శివారుల్లో పార్టీ బలపడటానికి గట్టి నాయకత్వం ఉండగా, గ్రేటర్లో నాయకులు, కేడర్‌ను పెంచుకోవాల్సిన అంశంపై ఇష్టాగోష్టిలో చర్చించారు. ►టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మేడ్చల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో అందుకు తగినట్టుగా సంస్థాగత బలోపేతం, ప్రజాందోళనలు, నాయకులు, కేడర్ పెంపుదలపై ప్రత్యేక దృష్టి సారించి ఆయన హుందాతనాన్ని మరింత పెంచాలని పలువురు నాయకులు అభిప్రాయపడినట్లు సమాచారం. ►పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నెల 12న ఉప్పల్‌లో చేపట్టనున్న ర్యాలీతోపాటు 16న చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలను ముఖ్యంగా యువత, మహిళలను సమీకరించటం ద్వారా అధిష్టానం దృష్టిలో పడాలని జిల్లా నాయకత్వం భావిస్తోంది. ►అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలను ఫోకస్ చేస్తూ.. వరుస క్రమంలో ఆందోళనలు చేపట్టేందుకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
ఎస్సై ఫిర్యాదు, రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు
బంజారాహిల్స్ (హైదరాబాద్): టీపీసీసీ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బుధవారం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేసి, రాకపోకలకు అంతరాయం కలిగించారని జూబ్లీహిల్స్ ఎస్ఐ యాకన్న ఫిర్యాదు చేయడంతో ఆ మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ఉత్సాహం.. సిటీలో ట్రాఫిక్ నరకం పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకోకపోవడంతో బుధవారం నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో హడావుడిగా మధ్యాహ్నం వీటిని జారీ చేశారు. అప్పటికే కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానుల వాహనాలతో గాంధీభవన్ రోడ్డు నిండిపోవడంతో ఆ చుట్టుపక్కల మార్గాల్లో ప్రయాణించిన నగర జీవి నరకం చవిచూశాడు. ట్రాఫిక్ మళ్లింపులపై ముందురోజే ఆంక్షలు విధించడం ఆనవాయితీ. అయితే ఎందుకో ఈ సారి విస్మరించారు. బుధవారం మధ్యాçహ్నానికే అబిడ్స్, కోఠి, నాంపల్లిలతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో ఆగిపోయాయి. అప్పుడు మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు గాంధీభవన్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు అంటూ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
రేవంత్‌రెడ్డి బాధ్యతలు.. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుమానమే!
సాక్షి, కరీంనగర్: సీనియర్ల అలకల మధ్య పీసీసీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్‌రెడ్డికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మెజారిటీ నాయకుల మద్దతు లభించింది. బుధవారం రేవంత్ పీసీసీ చీఫ్‌గా ప్రమాణం చేయబోతున్నారు. ఆయనకు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంపై జిల్లాకు చెందిన ఒకరిద్దరు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నప్పటికీ, అండగా నిలుస్తున్న వారే అధికంగా ఉండడం గమనార్హం. వీరంతా బుధవారం గాంధీభవన్‌లో జరిగే కార్యక్రమానికి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఇప్పటివరకు కొనసాగిన కమిటీలో పనిచేసిన పొన్నం ప్రభాకర్ నూతన అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సంఘీభావం తెలిపారు. ఈ మేరకు రేవంత్ కూడా పొన్నంను కలిసి అండగా నిలవాలని కోరారు. పార్టీలో క్రమశిక్షణ కార్యకర్తగా అధినేత్రి సోనియాగాంధీ, నాయకుడు రాహుల్‌గాంధీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని ఆయన స్పష్టం చేశారు. గాంధీభవన్‌కు తరలిరావాలంటూ ఆయన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పార్టీ నాయకులందరికీ ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారం పంపించారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కూడా ఇతర నాయకులతో కలిసి హైదరాబాద్ తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే శ్రీధర్‌బాబును కలిసిన రేవంత్ పీసీసీ అధ్యక్ష పదవి రేసులో చివరి వరకు మంథని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తనవంతు ప్రయత్నాలు చేశారు. సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క శిబిరంలో ఉన్న శ్రీధర్‌బాబు చివరి నిమిషంలో తనకు, భట్టికి కాకుంటే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పీసీసీ పీఠం అప్పగించాలని అధిష్టానాన్ని కోరారు. అయితే.. ఏఐసీసీ మాత్రం రేవంత్‌రెడ్డికే అవకాశం కల్పించింది. ఈ పరిణామాలతో అసంతృప్తికి గురైనప్పటికీ, ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం రేవంత్‌రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసిన అనంతరం శ్రీధర్‌బాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు శాలువాతో రేవంత్‌రెడ్డిని సత్కరించి, పార్టీ అభ్యున్నతి కోసం పనిచేయాలని కోరారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీధర్‌బాబు పీసీసీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు, చొప్పదండి నేత మేడిపల్లి సత్యం, వేములవాడ ఇన్చార్జి ఆది శ్రీనివాస్, హుస్నాబాద్ నేత బొమ్మ శ్రీరామ్, ధర్మపురి ఇన్చార్జి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, సిరిసిల్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, నరేందర్ తదితరులు హాజరు కానున్నట్లు సమాచారం. జీవన్‌రెడ్డి రాక అనుమానమే! ఉమ్మడి కరీంనగర్ నుంచి పీసీసీ రేసులో తుదివరకు ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని భావిస్తున్నట్లు సమాచారం. అత్యంత సీనియర్ నేతగా అందరినీ కలుపుకొని పోయే వ్యక్తిగా ఉన్న జీవన్‌రెడ్డి ఈసారి పీసీసీ పీఠం తనకు ఖాయమనే భావించారు. రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డిల మధ్య ఉన్న పోటీలో మధ్యేవాదంగా జీవన్‌రెడ్డికి అవకాశం లభిస్తుందని పార్టీ వర్గాలు కూడా అంచనా వేశాయి. అయితే.. పార్టీ రేవంత్‌రెడ్డి వైపు మొగ్గడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. అదే సమయంలో అసంతృప్త నేతలు, సీనియర్లను కలుస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డి జగిత్యాలలో ఉన్న జీవన్‌రెడ్డిని మాత్రం కలవలేదు. దీంతో బుధవారం ఆయన ప్రమాణస్వీకారానికి హాజరు కావడం అనుమానమే. ఈ విషయమై జీవన్‌రెడ్డితో ‘సాక్షి’ మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘బుధవారం మాట్లాడతాను’ అని దాటవేశారు. -
నో చాన్స్..టీపీసీసీలో ఓరుగల్లుకు మొండిచేయి
సాక్షి, వరంగల్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)లో ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి వరంగల్‌కు మొండిచెయ్యి చూపింది. ఏళ్ల తరబడిగా కాంగ్రెస్‌లో మనుగడ సాగిస్తున్న పలువురు సీనియర్లను పార్టీ విస్మరించింది. అధిష్టానం ప్రకటించిన కమిటీల్లో జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకుల పేర్లు లేకపోవడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ఆరు జిల్లాల పరిధిలో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతోపాటు పలువురు సీనియర్లు ఉన్నప్పటికీ వేం నరేందర్‌రెడ్డి, పోదెం వీరయ్య మినహా ఎవరికీ ఏ కమిటీలోనూ చోటు దక్కకపోవడం గమనార్హం. తెలంగాణ తొలి పీసీసీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రిగా వ్యవహరించిన పొన్నాల లక్ష్మయ్యకు గౌరవప్రదంగానైనా ఏ పదవీ ఇవ్వ లేదు. చదవండి: రేవంత్‌కు పోస్ట్: ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, క్యాంపెయిన్ కమిటీ, ఎలక్షన్ మేనేజ్ మెంట్, ఏఐసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీల్లోనూ ఓరుగల్లు నేతల పేర్లను పరిగణలోకి తీసుకో లేదు. భౌగోళికంగా ఉమ్మడి కరీంనగర్లో మంథని నియోజకవర్గం ఉన్నా.. ఆ నియోజకవర్గంలోని ఆరు మండలాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కిందకు వస్తాయి. ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేరు కూడా పీసీసీ చీఫ్ పదవికి పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. చివరికి టీపీసీసీలో కనిపించలేదు. కేంద్ర మాజీ మంత్రి, షెడ్యూల్ కులాలకు చెందిన పోరిక బలరాంనాయక్, మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కొండపల్లి దయాసాగర్‌లను ఈ కమిటీ నిరాశపర్చింది. చదవండి: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించినా.. ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన సీనియర్ నేత దొంతి మాధవరెడ్డినీ విస్మరించింది. టీఆర్ఎస్కు ఎమ్మెల్యేలు కీలకంగా మారిన సమయంలో ఎంతగా ప్రయత్నించినా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనను విస్మరించడం పట్ల కార్యకర్తల్లో తీవ్రమైన చర్చ జరు గుతోంది. గత పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పలువురిని కూడా పార్టీ అ«ధిష్టానం నిరాశపర్చడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. కాగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్న .. ధనసరి అనసూయ(సీతక్క)కు ఈ కమిటీలో కీలక పదవే దక్కుతుందని భావించారు. అయితే ఆమెను ఆ పదవికే పరిమితం చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రస్థాయి ఏ కమిటీలోనూ జిల్లా నాయకుల ప్రాధాన్యం లేనట్లైంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఉమ్మడి వరంగల్‌కు చెందిన హేమాహేమీ నాయకులు రాష్ట్రకమిటీతో పాటు జాతీయ స్థాయి పదవుల్ని అందుకున్న సందర్భాలున్నాయి. కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితి ఇప్పుడు ఈ కమిటీలో ఏర్పడింది. పార్టీ అ«ధిష్టానం పలువురు సీనియర్లకు మొండిచెయ్యి చూపడం కలకలం రేపుతోంది. -
బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బడ్జెట్‌తో తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చిన 10 వేల కోట్లు 29 రాష్ట్రాలకు ఏ మాత్రం సరిపోవన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించడం దారుణమన్నారు.(చదవండి: బడ్జెట్ 2021: మరింత మండిపోనున్న ఇంధనం) రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్న నినాదం పచ్చి అబద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. మెట్రో రైలు విస్తరణలో హైదరాబాద్‌కు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ప్రజల ఆస్తులను అమ్మేసే ప్రణాళిక రచించడం దారుణమన్నారు. హైదరాబాద్-విజయవాడ బుల్లెట్ ట్రైన్ కేటాయించాలన్నారు.కరోనా పేరుతో ఎంపీల నిధులు కట్ చేశారని, సెంట్రల్ విస్టాకు నిధులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఎంపీ ల్యాడ్స్ వెంటనే పునరుద్ధరించాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.(చదవండి: ఈ ఏడాదిలోనే ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ) -
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు(కేసీఆర్) నిరంకుశ పాలన సాగిస్తున్నారని పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. కేసీఆర్ ఆదేశాలతోనే 7.5 శాతం ఫిట్మెంట్ నిర్ణయం జరిగిందని దుయ్యబట్టారు. 43 శాతానికి తగ్గకుండా ఉద్యోగులకు ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. హౌస్ అలవెన్స్ తగ్గించడం.. ఉద్యోగస్తులంటే చులకన భావంతో చూడటమేనన్నారు. చదవండి: పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం ‘‘తెలంగాణలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పీఆర్సీ రిపోర్ట్ వెల్లడించింది. ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. ఉద్యోగ సంఘాల నేతల ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉద్యోగులకు అన్యాయం జరుగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉద్యోగుల ఫ్రెండ్లీగా పనిచేశాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని.. ప్రభుత్వంపై ఉద్యమించాలని’’ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
సాగర్ బరిలో జానారెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: టీపీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపిక విషయంలో గత కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం కాస్త బ్రేక్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి మేరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గురువారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి అధిష్టాన నిర్ణయాన్ని తెలియచేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో బరిలో జానారెడ్డి దిగుతున్నట్లు ప్రకటించారు. జానా మొదట తటపటా యించినప్పటికీ, సంప్రదింపుల తర్వాత బరిలో దిగేందుకు అంగీకరించారని మాణిక్యం ఠాగూర్ తెలిపారు. టీíపీసీసీ అధ్యక్ష ప్రకటన నిర్ణయం వాయిదా వేయాలన్న సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తిని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆమోదించారని, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక తర్వాతే పీసీసీ నూతన అధ్యక్షుడితో పాటు పూర్తి కార్యవర్గం ప్రకటిస్తామని ఠాగూర్ పేర్కొన్నారు. బుధవారం పార్టీ నాయకులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పీసీసీ ప్రకటనను వాయిదా వేయాలన్న జానారెడ్డి అభిప్రాయంతో దాదాపు అందరూ ఏకీభవించారన్నారు. రాష్ట్ర నాయకుల అభిప్రాయాన్ని అధినేత్రి దృష్టికి తీసుకెళ్ళగా ఆమె అంగీకరించారని ఠాగూర్ తెలిపారు. సాగర్ ఉపఎన్నిక పూర్తయ్యే వరకు ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ పూర్తి స్థాయిలో కొనసాగుతుందని ఠాగూర్ స్పష్టత ఇచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే.. నూతన పీసీసీ ఎంపికకు సంబంధించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలవడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని, అందుకే నూతన కమిటీల ప్రకటన వాయిదా వేశామని తెలిపారు. పార్టీలోని నాయకుల మధ్య పోటీ సహజమే అన్న ఠాగూర్, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని చెప్పారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ వివక్ష చూపిస్తోందన్నది కేవలం అసత్య ప్రచారమేనని, గత 20 సంవత్సరాల్లో 14 సంవత్సరాలు బీసీ నాయకులే పీసీసీకి సారథ్యం వహించారన్న విషయం గుర్తు తెచ్చుకోవాలని అన్నారు. ఇతర పార్టీల్లో మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ రబ్బర్ స్టాంప్ నియామ కాలు చేయదని, తెలంగాణ శ్రేయస్సు కోసం సోనియాగాంధీ అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానిం చారు. నూతన పీసీసీ కమిటీల ఎంపిక విషయంలో పార్టీని వీడతానని ఏ నేతా బెదిరించలేదని, సీనియర్ నేతగా వి.హనుమంతరావు తమ అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారని ఠాగూర్ పేర్కొన్నారు. -
రేవంత్‌కు షాక్.. పీసీసీపై అనూహ్య నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త బాస్ ఎవరన్న విషయం రాష్ట్ర రాజకీయాల్లో గతకొంత కాలంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. తొలుత అనేకమంది సీనియర్ నేతల పేర్లు వినిపించినప్పటికీ.. చివరికి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి వైపే అధిష్టానం మొగ్గుచూపిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు మెరుపు వేగంతో దూసుకువచ్చిన బీజేపీని ధీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్‌కు మాత్రమే ఉందని, పీసీసీ చీఫ్ పదవి ఆయనే దక్కుతుందని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డినే ఆ అవకాశం వరిస్తుందని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) అనుభవజ్ఞుడికి అప్పగింతలు.. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ పదవి రేవంత్‌కే దక్కుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి మొదటి వారంలోనే అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉందని వార్తలు కూడా వచ్చాయి. అయితే టీపీసీసీ చీఫ్ పదవిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న తరుణంలో అనూహ్యంగా మరో కొత్త వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీనియర్ నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పార్టీకి ఎంతోకాలంగా సేవలందిస్తున్న జీవన్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించాలని పార్టీ పెద్దలు నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆరు సార్లు (జగిత్యాల) ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్చేతిలో అనుహ్య ఓటమి పొందారు. అనంతరం జరిగిన పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన మండలికి ఎన్నికయ్యారు. 1981లో రాజకీయ ప్రవేశం చేసిన జీవన్ రెడ్డికి అనుభవజ్ఞుడైన నేతగా, మృదుస్వభావి మంచి పేరుంది. అందరితో కలుపుకునిపోయే తత్వంగల నేతకావడంతో పీసీసీ పదవికి ఆయన్ని నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. (రేవంత్‌కు పీసీసీ.. ఓ వర్గం డిమాండ్!) రేవంత్‌పై టీడీపీ ముద్ర.. ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణలో చావుదెబ్బ తిన్న టీడీపీలో కీలక నేతగా గుర్తింపు పొందిన రేవంత్‌రెడ్డి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. తరువాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కొద్దికాలంలోనే పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలు తప్ప ఒరిగింది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం పార్టీ అంతులేకుండా పోయింది. పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఇక తదుపరి అవకాశం తనకే దక్కుతుందని ఊహించిన రేవంత్‌కు అధిష్టానం మొండి చేయి చూపింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావుతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన చాలామంది సీనియర్లు రేవంత్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పదవి ఎలా అప్పగిస్తారని బహిరంగంగానే విమర్శించారు. (రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను..) రేవంత్‌కు ఊహించని షాక్.. అంతేకాకుండా రేవంత్‌కు పదవీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని అధిష్టానానికి హెచ్చరికలు సైతం పంపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు మాణికం ఠాగూర్‌ను అధిష్టానం రంగంలోకి దించింది. కొత్త సంవత్సరం లోపు నూతన పీసీసీ చీఫ్ ఎంపికను పూర్తి చేయాలని గడువు విధించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నేతలు, కార్యకర్తలు, ముఖ్య నేతలతో అభిప్రాయాన్ని స్వీకరించిన మాణికం అధిష్టానానికి తుది నివేదికను అందించారు. అనంతరం పార్టీ పెద్దలు సైతం పలువురు నేతల్ని ఢిల్లీకి పిలిపించుకుని వ్యక్తిగత అభిప్రాయం సైతం తీసుకుంది. రేవంత్, కోమటిరెడ్డి ఇద్దరిలో ఏ ఒక్కరికి పీసీసీ దక్కకపోయినా ఊహించని పరిణామాలు ఎదుర్కొక తప్పదని భావించిన అధిష్టానం వీరిద్దరికి వేరే బాధ్యతలు అప్పగించి.. మరో సీనియర్ నేతకు పీసీసీ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అందరి పేర్లును పరిశీలించగా.. రాజకీయాలతో పాటు వ్యక్తిగతంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన జీవన్‌రెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం రేవంత్ వర్గీయులు ఏమాత్రం ఊహించనిది. మరోవైపు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్‌గా రేవంత్ రెడ్డిని నియమించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా మరో నాలుగు కీలక కమిటీలకు ముఖ్య నేతలను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. అయితే దీనిపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది. పీసీసీతో పాటు నాలుగు కమిటీల పేర్లును ఇప్పటికే అధిష్టానం పైనల్ చేసిందని షీల్డ్ కవర్లో పేర్లును ఉంచినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం ప్రకారం మంగళవారం లేదా బుధవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఇంకా కసరత్తు సాగుతున్నట్లు సమాచారం. కొత్త కమిటీలో ఎమ్మెల్యే సీతక్కతో పాటు, షబ్బీర్ అలీ, కోమటిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. -
కాంగ్రెస్‌లో వీహెచ్ వ్యాఖ్యల దుమారం
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై కాంగ్రెస్ సీనీయర్ నేత వీహెచ్ హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో దూమారం రేపుతున్నాయి. వీహెచ్ వ్యాఖ్యలపై పార్టీ ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీహెచ్ వ్యాఖ్యలపై కార్యదర్శి బోస్‌రాజును ఠాగూర్ నివేదిక కోరారు. దీంతో హనుమంతరావు వ్యాఖ్యలు, పేపర్ క్లిప్పింగ్స్‌ను బోస్‌రాజు ఠాగూర్‌కు పంపించారు. ఈ క్రమంలో వీహెచ్‌కు నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా టీపీసీసీ చీఫ్ ఎంపిక నేపథ్యంలో మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చదవండి: కాంగ్రెస్‌లో రచ్చకెక్కిన రగడ.. అభిప్రాయ సేకరణలో తను ఇచ్చిన ఆధారాలను అధిష్టానానికి చేరకుండా ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ అడ్డుకున్నాడని వీహెచ్ విమర్శించారు. ఆయన అధిష్టానానికి తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడని, ప్యాకేజీకి అమ్ముడుపోయాడని మండిపడ్డారు. మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఎవరిని వరిస్తుందనే దానిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్ష పదవి కోసం పార్టీ సీనియర్లు హస్తిన వేదికగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ జాబితాలో ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముందువరుసలో ఉన్నారు. వీరితో పాటు జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, మల్లుభట్టి విక్రమార్క, జగ్గారెడ్డి సైతం పీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చదవండి: రేవంత్‌కన్నా నాకే క్రేజ్ ఎక్కువ ఉంది.. -
షబ్బీర్ అలీకి కీలక పదవి!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడానికి ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రయత్నిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కార్యవర్గ కూర్పుపై పక్షం రోజులుగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీకి కీలక పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షబ్బీర్ అలీ పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్ యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయ అరంగేట్రం చేసిన షబ్బీర్ అలీ.. అంచలంచెలుగా ఎదిగారు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి పదవిని పొందారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. తరువాత జరిగిన ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓటమి చవి చూశారు. అయితే ఆరేళ్ల పాటు శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. మండలి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లో కోఆర్డినేషన్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఏఐసీ సీ పెద్దలతో షబ్బీర్ అలీకి సన్నిహిత సంబంధాలున్నాయి. చదవండి: ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో కీలకమైన నేతగా గుర్తింపు ఉన్న షబ్బీర్అలీకి జిల్లా అంతటా అనుచరులున్నారు. అయితే ఇటీవలి కాలంలో కామారెడ్డి నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ ప్రతిపక్ష నేతగా నియోజకవర్గంలో తన సత్తా చాటుకునేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నారు. కాగా మైనారిటీ నేతగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు ఉన్న షబ్బీర్ అలీని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తారని తెలియడంతో ఆయన అనుచరుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పీసీసీ అధ్యక్షుడితో పాటు మిగతా కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని వారు పేర్కొంటున్నారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడితో ముందుకెళ్లనుందా..? టీపీసీసీ అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్న వ్యవహారాన్ని తనదైన శైలిలో అధిష్టానం చేతిలోకి తెచ్చుకోనుందా..? తెలంగాణలోని నాయకులందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా గుజరాత్ తరహా ప్రయోగానికి సిద్ధమవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. గత కొన్ని రోజులుగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చి తెరదింపే దిశలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఆరు కమిటీలను కొత్త ఏడాదిలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఇతర కమిటీలు పనిచేసేలా దిశానిర్దేశం చేయనుందనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదవులపై కొత్త సంవత్సరంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్లు ఎవరికి వారు టీపీసీసీ అధ్యక్షుని ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అమ్ముడుపోయారనే ఆరోపణలు చేస్తున్నారు. బలహీనవర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే తన పేరు జాబితాలో చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ వ్యూహంతో ముందుకు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు దఫాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందలేక పోయిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే ఆలోచనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 162 మంది నాయకుల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఫలానా నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే వాదనలు పెరుగుతుండడంతో పార్టీకి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలవైపు హైకమాండ్ దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. 6 కమిటీలు.. అందరికీ పదవులు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కీలక పదవులు కట్టబెట్టాలన్నది సోనియా ఆలోచన అని చర్చ జరుగుతోంది. ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చి మిగిలిన ఇద్దరికి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. -
ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్ : కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్ ఢిల్లీకి మారుతోంది. కాంగ్రెస్ ‘మార్కు’రాజకీయం మొదలైంది. ‘అయిననూ పోయి రావలె హస్తిన’కు అన్నట్లుగా నాయకులు ఢిల్లీ బాట పట్టనున్నారు. గత నాలుగు రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరిపిన పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ వెళ్లిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ వైపు మళ్లింది. ఫలానా నాయకుడికి ఈ పదవి వస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో... అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిం చాలని కోరుతూ అధిష్టానాన్ని కలిసేందుకు పలువురు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు సోమవారం ఢిల్లీకి బయలుదేరనున్నట్టు సమాచారం. వీరి వెనుకే మంగళవారం జగ్గారెడ్డి కూడా హస్తిన బాట పట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా సోనియా, రాహుల్‌గాంధీల అపాయింట్మెంట్ కోరి రాష్ట్రంలో అభిప్రాయ సేకరణ జరిగిన తీరుపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందరినీ ఎలా అడుగుతారు? టీపీసీసీ అధ్యక్ష వ్యవహారంలో ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ రెండు గ్రూపులుగా చీలిపోయిందని పార్టీ వర్గాలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పార్టీకి సేవ చేస్తున్న వారినే ఈ పదవికి ఎంపిక చేయాలని కొందరు, పార్టీకి ఊపు తెచ్చే స్పీడున్న నాయకుడికి ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. పాతకాపులకే పగ్గాలు ఇవ్వాలని కోరుతున్న నాయకులు అసలు అభిప్రాయ సేకరణే సరిగా జరగలేదని అంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కోర్ కమిటీ సభ్యుల నుంచి మాత్రమే అభిప్రాయాలు సేకరించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా మొత్తం 160 మందిని పిలవడం ఏఐసీసీ నియమావళికి విరుద్ధమని వారంటున్నారు. ఈ మేరకు సోనియా, రాహుల్‌లకు ఇచ్చేందుకు ఫిర్యాదును కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, పార్టీని ఉత్తేజపరిచే నాయకుడికి బాధ్యతలు అప్పగించాలంటోన్న మరోవర్గం మాత్రం పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ కీలక నేత సాయంతో ఢిల్లీలో పావులు కదుపుతోంది. ఈ రెండు గ్రూపుల ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం ప్రస్తుతం రక్తి కడుతోంది. నాయకుల ఢిల్లీ బాటలపై ఓ ముఖ్యనేత ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘టీపీసీసీ అధ్యక్ష ఎంపిక ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లడం సహజమే. ఫిర్యాదు చేసేందుకు వెళ్లడం లేదు. పార్టీ ఇన్చార్జి మాణిక్యం మరో రెండు రోజుల్లో తన నివేదికను అధిష్టానానికి ఇచ్చే అవకాశముంది. అప్పుడు మమ్మల్ని ఢిల్లీ పెద్దలు పిలిచి ముఖ్యులతో మాట్లాడిన తర్వాత మాత్రమే కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు’అని వ్యాఖ్యానించారు. ఈ ఎపిసోడ్ ఎప్పటికి ముగుస్తుందో... కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు, ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఆ తర్వాత పార్టీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో వేచి చూడాల్సిందే. -
కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ పదవిపై కాంగ్రెస్‌లో హీట్ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్యం ఠాకూర్ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఆయనను సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీ శనివారం కలిశారు. (చదవండి: టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరైతే బెటర్) అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏదైనా సరే ఏకాభిప్రాయంతోనే జరగాలని.. వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే పార్టీకే నష్టమని స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారినే అధ్యక్షుడ్ని చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర జరుగుతోందని, సోనియా, రాహుల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. ఠాకూర్‌తో తాడోపేడో తేల్చుకుంటామని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. (చదవండి: పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి) ‘‘కాంగ్రెస్ పార్టీలో అన్ని మామూలే సీఎల్పీలో సమావేశం ఎందుకు అనేది బయటకు చెప్పలేను.ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ చీలిపోకుండా ఉండేందుకు ఇంచార్జ్ ఠాకూర్‌ను కలిశాం. ఎమ్మెల్యేలు, ఎంపీ కోమటిరెడ్డితో కలిసి మా మనసులో ఉన్నది చెప్పాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని వివరించాం. రేపు చాలా ఎన్నికలు రాబోతున్నాయి. వాటిని ఎదుర్కొవాలి. ఠాగూర్ అన్ని వివరించాం. ఆయన అన్ని నోట్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో జరుగుతుంది అందరికీ తెలిసిందే. ప్రజలు అన్ని గమనించాలి. సోషల్ మీడియా ప్రచారాన్ని పట్టించుకోవద్దు. ఢిల్లీకి ఎప్పుడు వెళ్లేది ఇప్పుడే చెప్పలేం. సీఎల్పీ, పీసీసీ అధ్యక్షుడిని మేము ఇన్వాల్వ్ చేయడం లేదు. పీసీసీ అధ్యక్షుడు ఎంపిక మెజార్టీ అభిప్రాయం కాకుండా.. ఏకాభిప్రాయం సాధించాలి. ఒక ఇంచార్జ్ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడటం తప్పు కాదు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు.. మా అభిప్రాయం చెప్పాం. ఈ రోజు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ.. కలిశాం. జరుగుతున్న ప్రచారం దృష్ట్యా.. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని చెప్పాం. ఏకాభిప్రాయంతో్ ఎలాంటి పేరు చెప్పలేదు. సోనియాగాంధీ.. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటారని’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతుండగా.. హైకమాండ్ అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గురువారం గాంధీ భవన్లో మరోసారి కోర్‌కమిటీ నేతలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ సభ్యులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్ బేరర్స్‌తో ఆయన భేటీ కానున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందో చెప్పాలని కోర్‌కమిటీని కోరారు. (చదవండి : పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుంది?) పీసీసీ ఇవ్వాలని కోరా: ఎంపీ కోమటిరెడ్డి పీసీసీ పదవి తనకు ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్‌ను కోరానని భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానికి తెలియజేశానన్నారు. తనకు పీసీసీ పదవి ఇస్తే పార్టీలో పెట్టగలనని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధ్యక్షుడి నియామకం విషయంలో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి రాకపోయినా తాను మాత్రం బీజేపీలో చేరేది లేదని మరోసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. (చదవండి : కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్) -
కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. గెలుపు ముంగిట బొక్కబోర్లాపడింది. గతంలో చక్రంతిప్పిన గడ్డపైనే చతికలపడింది. ఓటమితో పోటీపడుతున్నట్లు నానాటికీ ప్రజాదరణ కోల్పోతుంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన హస్తం పార్టీ.. ఈసారి కూడా అవే ఫలితాలను పునరావృత్తం చేసింది. కేవలం 2,24,528 ఓట్లు (5శాతం) దక్కించుకుని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇతర పార్టీలను ఏమాత్రం ఎదుర్కోలేక ఓటమి ముందు తలవంచింది. ఇప్పటికే వరుస ఓటములతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి గ్రేటర్ ఎన్నికలపరాజయం ఆ పార్టీ భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓవైపు సీనియర్ నేతలు ఒక్కకరూ పార్టీని వీడి కాషాయతీర్థం పుచ్చుకుంటుండగా.. కార్యకర్తలు సైతం తమదారి తాము చూసుకుంటున్నారు. (మంత్రులకు షాకిచ్చిన గ్రేటర్ ఫలితాలు) ఈ తరుణంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవి నుంచి వైదులుగుతున్నట్లు ఓ లేఖను విడుదల చేశారు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను సైతం ప్రారంభించాలని ఏఐసీసీని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం నాటి నుంచి ఉత్తమ్ రాజీనామా కోసం పార్టీలోని ఓ వర్గం బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పార్లమెంట్, దుబ్బాక ఉప ఎన్నిక, బల్దియా పోరులో ఓటములతో ఆ ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో పదవికి రాజీనామా చెయకతప్పలేదు. (హస్తం ఖేల్‌ఖతం.. మరోసారి సింగిల్ డిజిట్!) రేవంత్ వర్సెస్ కోమటిరెడ్డి..! ఉత్తమ్ కుమార్ రాజీనామాతో టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి వర్గంలో ఆశలు చిగురిస్తున్నాయి. పీసీసీ పదవీ బాధ్యతలు రేవంత్‌ను అప్పగిస్తారని ఆయన వర్గం నేతలు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నానాటికీ దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీని ఆయన మాత్రమే గాడిలోపెట్టగలరని, కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకురాగలరని బలంగా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికే రేవంత్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చిందని డిసెంబర్ 9న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే మరో అసమ్మతి వర్గం నిరసన స్వరాన్ని వినిపిస్తోంది. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న సీనియర్లను కాదని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్‌కు పీసీసీ బాధ్యతలు ఎలా ఇస్తారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి వర్గం బహిరంగంగానే నిలదీస్తోంది. ఈ మేరకు అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేసినట్లు సమాచారం అందుతోంది. పీసీసీ పదవి తమకే ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు మీడియా ముఖంగా పలుమార్లు డిమాండ్ చేశారు. పదవి తమకు దక్కనిపక్షంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరతామని రాజ్‌గోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య పెను దుమారాన్నే లేపాయి. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ ఓటమి, ఉత్తమ్ రాజీనామా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను ఆ పార్టీ నేతలు ఏ విధంగా ఎదుర్కొంటారనేది చూడాల్సిఉంది. -
విద్యుత్ బిల్లుల భారం ప్రభుత్వమే భరించాలి
-
కాంగ్రెస్ ర్యాలీకి అనుమతి నిరాకరణ..
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా పేదలు పూర్తిగా నష్టపోయారని, ఇలాంటి సమయంలో పేద కుటుంబాలు, ఎంఎస్ఎంఈల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే భరించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. టెలీ స్కోపిక్ విధానం ద్వారా బిల్లులు ఇవ్వాలని, ఈ విధానంతో భారం తగ్గుతుందన్నారు. లాక్డౌన్లో బిల్లులు మూడింతలు వచ్చాయని,ఆ సమయంలో ఎలాంటి సహాయం చేయని ప్రభుత్వం.. బిల్లులైనా మాఫీ చేయాలన్నారు. బీపీఎల్ కుటుంబాల విద్యుత్ భారం ప్రభుత్వమే భరించాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకే పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టామని ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేపట్టిన కాంగ్రెస్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. గాంధీభవన్ బయట కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. విద్యుత్ సౌధకు నేరుగా వెళ్లి సీఎండీ ప్రభాకర్ రావు కి వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. -
విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం
సాక్షి, హైదరాబాద్: ఇండియా కోసం చైనా సరిహద్దుల్లో ప్రాణాలు విడిచిన కల్నల్ సంతోష్ బాబు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 45 ఏళ్ల పాటు ఇండో-చైనా బోర్డర్ లో ఒక్క ప్రాణం కూడా పోలేదని, బీజేపీ ప్రభుత్వ హయాంలో 20 మంది మృతి చెందారన్నారు. ప్రధాని మోదీ పని తీరు ఏంటో దేశం గమనిస్తోందని పేర్కొన్నారు. మోదీ విదేశీ పర్యటనల వల్ల దేశానికి ప్రయోజనం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా భారత్ తో మిత్ర దేశాలుగా ఉన్న సరిహద్దు దేశాలు- శత్రు దేశాలుగా మారాయని వ్యాఖ్యానించారు. విదేశాంగ విధానంలో కేంద్రం వైఫల్యం చెందిందని విమర్శించారు. చైనా ఆర్మీ ఇండియా సరిహద్దుల్లో నుంచి వెనక్కి వెళ్ళాలని కోరారు. దేశ రక్షణ కోసం ఆర్మీ-నేవీ-త్రివిధ దళాలు చేస్తున్న కృషి పట్ల ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. (రైతుల నోట్లో మట్టికొడుతున్న ప్రభుత్వం) 28న పీవీ జయంతి వేడుకలు.. 28వ తేదీన పీవీ జయంతి వేడుకలను తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేడుకలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పీవీ నరసింహారావు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తల గుండెల్లో ఉంటారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. -
పదవి రాకపోతే పార్టీ మారడమే..!
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధిష్టానం గతరెండు సార్లు సరైన నాయకత్వాన్ని (టీపీసీసీ చీఫ్) ఎంపిక చేయడంలో విఫలమైందని, టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఈసారి పీసీసీ చీఫ్ పదవి తమకు రాకపోతే బీజేపీలోకి వెళ్లడమా లేక సొంతపార్టీని ఏర్పాటు చేసుకోవడమా అనేది భవిషత్తు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సందర్భంగా శుక్రవారం సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం అసెంబ్లీ హాల్లో మీడియాతో ముచ్చటించారు. కాంగ్రెస్ అధిష్టానం ఈసారి సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటుదనే నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. కాగా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరుతున్నట్లు ఆయనపై ఇదివరకే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘సమయం వచ్చినప్పుడు ప్రజల నుంచే నాయకుడు పుడతాడు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించేందుకు నేను రెడీగా ఉన్నా. కాంగ్రెస్ అధిష్టానం గత రెండు దఫాలుగా సరైన నాయకుని ఎన్నుకోవడంలో తప్పులు చేసింది. ఏ పార్టీ అనేది కాదు కేసీఆర్‌ని ఓడించామా లేదా అనేది ముఖ్యం. గత లోక్‌సభ ఎన్నికల్లో కవిత నిజామాబాద్‌లో ఒడిపోయినప్పుడు కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ డబ్బు రాజకీయాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ గొప్పతనం వల్ల గెలువలేదు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే కేసీఆర్ గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారు’ అని అన్నారు. -
పీసీసీ రేసులో నేను లేను
సాక్షి, ఢిల్లీ : రాష్ట్రమంతా సిద్ధిపేట మోడల్ అమలు చేస్తానంటున్న సీఎం కేసీఆర్ దుబ్బాకలో యూరియా కోసం రైతు చనిపోయిన ఘటన చూసి సిగ్గుపడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు పెట్టి కొందామన్నా యూరియా దొరకడం లేదని వాపోయారు. రైతు బంధు, రుణమాఫీ పథకాలను అమలుచేయకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎన్నికల వేళ హడావిడి చేసిన ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేయడం దుర్మార్గమన్నారు. రైతులకు ఇవ్వాల్సిన 20 వేల కోట్లు ఇంకా విడుదల చేయకపోవడంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడం, విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి వంటి అంశాలపై పార్టీ అధ్వర్యంలో పోరాడుతూ.. కేంద్ర హోంమంత్రిని కలిసి లోతైన దర్యాప్తు చేయాలని కోరతామని స్పష్టం చేశారు. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు, మునిసిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చలు జరిపామని తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో లేనని స్పష్టం చేశారు. -
సీఈసీ రజత్‌కుమార్ మాట ఇచ్చి తప్పారు : ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఫలితాలపై అనుమానాలున్న చోట వీవీ ప్యాట్లు లెక్కించారని గుర్తు చేశారు. కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమ అభ్యంతరాలను పట్టించుకోలేదని అన్నారు. కౌంటింగ్‌కు, పోలింగ్‌కు మధ్య భారీ తేడా ఉన్న కారణంగానే తాము వీవీ ప్యాట్లు లెక్కించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు. తమ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఒక్కచోట వీవీప్యాట్లు లెక్కించలేదని వాపోయారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ల సవరణ చేయకుండా ఈసీ ఎన్నికలు వెళ్లిందని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను ‘ఫ్రీ అండ్ ఫేర్’గా నిర్వహించడంలో ఈసీ విఫలమైందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అలాగే, 10వేల మెజారిటీతో ఫలితం వెల్లడైన చోట వీవీప్యాట్లు లెక్కించాలని అన్నారు. ఓట్లను సవరిస్తామని హైకోర్టులో చెప్పిన సీఈసీ రజత్‌కుమార్ మాటతప్పారని విమర్శించారు. -
‘మాజీ సైనికులకు ఐదేకరాల భూమి, ప్లాటు’
సాక్షి, హైదరాబాద్ : మాజీ సైనికులకు ఇళ్ల స్థలాలు.. ఐదెకరాల పోలం ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఈ అంశాలను పట్టించుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కూమార్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మన సరిహద్దుల్లో అనేక మంది సైనికలు ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. వారికి సమాజంలో గౌరవమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాను 16 ఏళ్లకే డిఫెన్స్‌లో చేరానని.. మిగ్21, 23 యుద్ధ విమానాలను నడిపానని తెలిపారు. మాజీ సైనికులకు ప్లాట్లు, ఐదేకరాల పోలం ఇవ్వాలని.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి అమలు కాలేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అమల్లోకి రాగానే కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ ప్రకారం వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక మాజీ సైనికలు ఇళ్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో మాజీ సైనికులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. చనిపోయిన, గాయపడ్డ సైనికలుకు ఆర్థిక సాయంతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాజీ సైనికుల సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామని ఉత్తమ్ వెల్లడించారు. -
ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, మెదక్ : తెలంగాణ రాష్ట్రంలో పాలకులు అహంకారంతో వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ ఏ మాత్రం జరగడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు గౌరవం దక్కడం లేదన్నారు. పక్క రాష్ట్రంలో 10వేల ఉద్యోగాలు నియామకాలు చేపడితే.. తెలంగాణలో 10 కూడా జరగలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. 4 సంవత్సరాల కాలంలో డీఎస్సీ, టీచర్ల నియామకాలను ప్రభుత్వం చేపట్టలేదని ఉత్తమ్ పేర్కొన్నారు. అంతేకాక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్ కార్డు కష్టాలు తప్పడం లేదన్నారు. -
‘కేసీఆర్‌కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు ఎప్పుడు వచ్చిన రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో మహిళా అభయహస్తం కింద రూ.360 కట్టారని తెలిపారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలమంది డబ్బులు కట్టారని ఆయన పేర్కొన్నారు. అభయహస్తం డబ్బులను ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. మీ పైసలు తీసుకున్నారు.. ఎందుకు వాపస్ ఇవ్వరు? మీ ఉసురు తగులుతుందని ఆయన మండిపడ్డారు. అన్ని విధాలుగా మహిళలను అవమాన పరిచి మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా గ్రూపులపై ఆయన వరాలు కురిపించారు. డ్వాక్రా గ్రూపులకు రూ. లక్ష గ్రాంట్, గ్రూపులకు రూ. 10లక్షల రుణం ఇప్పిస్తూ.. దాని వడ్డీ భారం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తోందని హామీ ఇచ్చారు. అంతేకాక డ్వాక్రా సంఘాలకు కార్యాలయాలు లేని చోట కార్యాలయాలు నిర్మిస్తామన్నారు. అభయహస్తం భీమా పునరుద్ధరించి రూ. 5లక్షలకు పెంచుతామని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. -
యడ్డి రాజీనామా...తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక బలపరీక్షలో ఓటింగ్ జరగడానికి ముందే బీజేపీ ఓటమిని అంగీకరించింది. తమ దగ్గర 104 మంది ఎమ్మేల్యేలు మాత్రమే ఉన్నారని, అందుకే బలపరీక్షలో ఓడిపోయామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప తెలిపారు. అనంతరం ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. యడ్యూరప్ప రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసేందుకు మార్గం సుగుమం అయింది. కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా సమర్థిస్తూ కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యమే గెలిచిందని, బీజేపీకి సరైన గుణపాఠం అని హర్షం వ్యక్తం చేశారు. గాంధీ భవన్ వద్ద బాణసంచి కాల్చి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయలను వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య విజయం...ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన సుప్రీంకోర్టు, మీడియా వారికి ధన్యవాదాలు. నియంతలా వ్యవహరించిన బీజేపీకి సరైన బుద్ది వచ్చింది. 2019 లో జరిగే ఎన్నికలకు ఈ ఫలితాలు పునాది. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. - గీతారెడ్డి, పీఏసీ ఛైర్మెన్ ఇది ప్రజాస్వామ్య విజయం. - రఘువీరారెడ్డి ఏపీసీసీ చీఫ్. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. యడ్యూరప్ప రాజీనామా కాంగ్రెస్ విజయం, ప్రజాస్వామ్య విజయం. ఎట్టకేలకు ప్రజాస్వామ్యమే గెలిచింది. 2019 నాటి ఎన్నికలకు ఇది పునాది. - ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది.15రోజులు అవకాశం ఇచ్చి ఉంటే గొర్లను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొనేవారు.కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడారు. - వీహెచ్, కాంగ్రెస్ నేత న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు. గవర్నర్ వ్యవస్థలో మార్పులు రావాలి. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే సాధ్యాసాధ్యాలను గవర్నర్ పరిశీలించాలి.కర్ణాటక గవర్నర్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకం కావాలి. - మర్రి శశిధర్ రెడ్డి, కాంగ్రెస్ నేత సుప్రీంకోర్టు లేకపోతే ప్రజాస్వామ్యం కూని అయ్యేది. సుప్రీమ్ న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మోడీ అమిత్ షా విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. రాహుల్ గాంధీని ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ కు అధికారదాహం లేదు. అందుకే జేడీఎస్ కు మద్దతు ఇచ్చింది.కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతి ఇక్కడ టీఆర్ఎస్కు పడుతుంది. - సర్వే సత్యనారాయణ ప్రజాస్వామ్యం గెలిచి నిలిచింది. ప్రజాస్వామ్య పునాదులు పెకిలించే శక్తులకు అడ్డుకట్ట పడింది. గవర్నర్‌ను రీ కాల్ చేయాలి. ఇక్కడ కూడా ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. మా ఫోన్ లు ట్యాపింగ్ చేస్తున్నారు. దీని పై కూడా విచారణ జరిపించాలి. - పొన్నాల లక్ష్మయ్య -
టీఆర్ఎస్ సర్కారును ఎండగడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనను ఎండగట్టేందుకు, కాంగ్రెస్ పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. 40 రోజుల పాటు రోజుకు 3 నియోజకవర్గాల్లో యాత్ర చేపడతామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల్లో పర్యటించి.. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళతామని చెప్పారు. టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, దాని నుంచి బయటపడటానికి చాలామంది ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తమ్ సోమవారం గాంధీభవన్‌లో ఇష్టాగోష్టిగా మీడియాతో మాట్లాడారు. సమష్టి కృషితో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత టీఆర్ఎస్లో ఎక్కువ చెత్త నిండిపోయిందని, కేసీఆర్ పనితీరు బాగాలేదని ప్రజల్లో అభిప్రా యం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. టీఆర్ఎస్తో పాటు పలు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా షరతులు లేకుండానే చేరుతున్నారని.. తమతో మాట్లాడుతున్న నాయకులకు కూడా ఇదే విషయం చెబుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ సర్వే జరిగినా, ఎవరు మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయం తెలుస్తోందన్నారు. నెలాఖరులో టీపీసీసీ, డీసీసీల పునర్వ్యవస్థీకరణ టీపీసీసీ, డీసీసీల పునర్వ్యవస్థీకరణను ఈ నెలాఖరులో చేపడతామని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీపీసీసీ ఏర్పాటు ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం కమిటీలో ఉన్న కొందరు పనిచేయడానికి ఇష్టపడటం లేదని, పార్టీలో మరికొందరు పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. పనిచేసేవారికి అవకాశాలు ఇస్తామని, పనిచేయలేని వారిని తొలగిస్తామని వెల్లడించారు. టీపీసీసీలో పాత జిల్లా యూనిట్‌గా జిల్లాకు ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, 12 మంది కార్యదర్శులకు అవకాశం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలోకి, ఏఐసీసీలోకి రాష్ట్రం నుంచి పలువురికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. వాటితోపాటు ఎన్నికల ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను కూడా ప్రకటిస్తారని వెల్లడించారు. రాహుల్‌తో ప్రత్యేక సమావేశాలు పార్టీపరంగా కార్యాచరణ ప్రణాళికపై భేటీ అయ్యేందుకు రాహుల్‌గాంధీ ఈ నెలాఖరులో సమయం ఇచ్చారని ఉత్తమ్ వెల్లడించారు. అయితే తాము మేడారం సమ్మక్క–సారక్క ఆలయానికి వెళ్లాలని అనుకుంటున్నామని.. అందువల్ల దానికన్నా ముందో, తర్వాతో భేటీ ఉండేలా యోచిస్తున్నామని తెలిపారు. ఇసుక మాఫియా ఆగడాలు కనిపించడం లేదా? సూటు బూటు వేసుకుని ఇవాంకాతో తిరగడం తప్ప మంత్రి కేటీఆర్‌కు రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలు, హత్యలు కనిపించవా అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కామారెడ్డి జిల్లాలో ట్రాక్టర్ ఢీకొని మరణించిన సాయిలు కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ను కలిశారు. వంతుల వారీగా సాయిలు వీఆర్ఏగా పనిచేస్తున్నాడంటూ.. సంబంధిత గుర్తింపు బిళ్ల, హాజరు పట్టికను వారు ఉత్తమ్‌కు, మీడియాకు చూపించారు. తమను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దులేకుండా పోయిందని ఈ సందర్భంగా ఉత్తమ్ మండిపడ్డారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, పోలీసులు, అధికారులతోపాటు గవర్నర్ కూడా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు మద్దతు పలికేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సాయిలు వీఆర్ఏ కాదంటూ గవర్నర్ కూడా మాట్లాడటం బాధాకరమని వ్యాఖ్యానించారు. మంత్రులు, అధికారులతో పాటు రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన వారు కుమ్మక్కైతే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని పేర్కొన్నారు. సాయిలు మరణానికి కారణమైన ట్రాక్టర్ యాజమానిపై హత్య కేసు నమోదు చేయాలని.. సాయిలు కుటుంబ సభ్యులకు రూ.25 లక్షలు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఉస్మానియాలో సభ నిర్వహిస్తాం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సభకు అనుమతి అడుగుతున్నామని, ఇస్తే బహిరంగ సభ నిర్వహిస్తామని ఉత్తమ్ తెలిపారు. సర్పంచ్ పదవులకు ప్రత్యక్ష ఎన్నికలే మంచిదని, పరోక్ష ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఉండకపోవచ్చని చెప్పారు. పునర్విభజన కోసం టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోందని, దానిపై పార్టీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా ప్రస్తుతానికి టీపీసీసీ అధ్యక్షులను కొనసాగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. పలువురు పార్టీ నేతలు ఉత్తమ్‌కు శాలువాలు కప్పి సన్మానించారు. గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. మహిళలు లేని కేబినెట్ ఇదొక్కటే.. దేశంలో మహిళా మంత్రులు లేకుండా కొనసాగుతున్న కేబినెట్ తెలంగాణ ఒక్కటేనని ఉత్తమ్ విమర్శించారు. సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణలతో కలసి గాంధీభవన్‌లో మహిళా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. మహిళలకు, సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని ఈ సందర్భంగా ఉత్తమ్ పేర్కొన్నారు. 15 రోజుల్లోగా మహిళా కాంగ్రెస్ కమిటీలను పూర్తిచేయాలని ఆదేశించారు. మహిళా సాధికారతపై టీఆర్ఎస్ మాట్లాడేది ఎక్కువని, చేసేది తక్కువని మండిపడ్డారు. -
టచ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీ ముఖ్య నేతలు, కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని చెప్పారు. చర్చలు పూర్తయ్యాక ఎప్పుడు చేరుతారనే విషయంలో స్పష్టత వస్తుందన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో ఏ సంస్థ సర్వే చేసినా, అధికార పార్టీ చేసుకున్న సర్వే అయినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్‌కు 70 స్థానాలకు పైగా వస్తాయని, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో క్లీన్‌స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలోనూ టీఆర్ఎస్పై భ్రమలు తొలగిపోయాయని చెప్పారు. ఈనెల చివరి రెండు వారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన జరిగే అవకాశం ఉందని తెలిపారు. వరంగల్‌లో దళిత, గిరిజన, బీసీల ఆత్మగౌరవ సభ ఉంటుందని వెల్లడించారు. మేం పూర్తి చేస్తే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేసిన విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రారంభించిందని ఉత్తమ్ ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క యూనిట్ కరెంటును కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారంతో గొప్పలు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. దేశంలోని 29 రాష్ట్రాలకు గాను 26 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందని, మరి అక్కడ కూడా సీఎం కేసీఆరే కారణమా అని ప్రశ్నించారు. విద్యుత్‌పై పవన్‌కల్యాణ్‌కు అవగాహన లేదన్నారు. పీసీసీ కార్యవర్గంలో మార్పులుంటాయని, వచ్చే ఎన్నికలు తన నాయకత్వంలోనే జరుగుతాయనే విశ్వాసం ఉందని చెప్పారు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ, నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల నమోదు ప్రక్రియ వంటి అంశాలపై సమావేశంలో చర్చించినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. కేసీఆర్‌ను గద్దెదించాలి మోసాలతో ప్రజలను వంచిస్తున్న సీఎం కేసీఆర్‌ను గద్దె దించాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన వేర్వేరు కార్యక్రమాల్లో టీఆర్ఎస్కు చెందిన మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ జెడ్పీటీసీ నారాయణమ్మ, ఎంఐఎం మాజీ కార్పొరేటర్ బిలాలతో పాటు వందలాది మంది ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. -
పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ పథకానికి వేల కోట్లు చెల్లిస్తున్న తెలంగాణ ప్రభుత్వం వద్ద రైతురుణాలను మాఫీ చేయడానికి మాత్రం డబ్బులు లేవా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, నకిలీ కంపెనీలను గుర్తించి లైసెన్స్‌లను రద్దు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. -
'టీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటాం'
హైదరాబాద్ : పార్టీ మారాలంటూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లను టీఆర్ఎస్ నేతలు చిత్రవధ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్పై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... సర్పంచ్ల అధికారాలు తగ్గిస్తూ జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం అన్యాయమన్నారు. కేంద్రం ఇచ్చిన రూ. 90 వేల కోట్లను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొన్నారా ? అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిషానే ప్రశ్నించారని ఈ సందర్భంగా ఉత్తమ్ గుర్తు చేశారు. వాటర్ గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కమీషన్ల కక్కుర్తి కోసమే... రైతులు, విద్యార్థుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు లేవంటుందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకు నెల నెలా నిధులు చెల్లిస్తోందని ఉత్తమ్ విమర్శించారు.