సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తు న్నారంటూ సోషల్ మీడి యాలో ప్రచారం కావడం వివాదాస్పదమైంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందని, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమా చారం వచ్చిందని సోమవారం సోషల్ మీడి యాలో విస్తృత ప్రచారం జరిగింది. అంతేకాదు ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’గా ఈ పార్టీ ఉండే అవకాశముందంటూ పెద్ద ఎత్తున ప్రచా రం చేశారు.
అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసిన శంకర్ అనే వ్యక్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేసిన అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకో వాలని కోరారు. టీపీసీసీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయడం గమనార్హం.
చదవండి: చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment