New Party
-
విజయ్ అద్భుతం చేస్తాడా?
-
మాజీ సీఎం చంపయీ సోరెన్ కొత్త పార్టీ
రాంచి : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీపై ప్రకటన, పార్టీ గుర్తు ఇతర అంశాలపై మరో వారంలో చంపయీ సోరెన్ స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి,జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత చంపయీ సోరెన్ కొత్త పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరో వారంలో చంపయీ సోరెన్ కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇవ్వనున్నట్లు చెప్పారు. చంపయీ సోరెన్ బీజేపీలో చేరుతున్నానే వార్తల నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Former Jharkhand CM & JMM leader Champai Soren says, "I will not retire from politics. In the new chapter that I have started, I'll strengthen the new organisation and if I find a good friend in the way, I'll move ahead with that friendship to serve the people and… pic.twitter.com/Q8VwIK694o— ANI (@ANI) August 21, 2024మంగళవారం నుండి మద్దతుదారులు చంపయీ సోరెన్ భారీగా చేరుకుంటున్నారు. ఆయనతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశంపై చంపయీ సోరెన్ మాట్లాడారు. నేను ఇప్పటికే చెప్పా. ఒకటి రాజకీయాల నుంచి తప్పుకోవడం, కొత్త పార్టీని పెట్టడం, లేదంటే మరో పార్టీలో చేరడం. ఇప్పుడు చెబుతున్నా. నేను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నేను నా సొంత పార్టీని ఎందుకు పెట్టకూడదు.నా తదుపరి భవిష్యత్ కార్యచరణ ఏంటనేది వారంలో తేలిపోతుందన్ని అన్నారు. ఆగస్ట్ 18న ఢిల్లీలో మకాంఆగస్ట్ 18న చంపయీ సోరెన్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. దీంతో ఆయన అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.దీనికి తోడు చంపయీ సోరెన్‌ను ఎన్డీయేలోకి స్వాగతం పలుకుతూ ‘చంపయీ సోరెన్ నువ్వు ఒక పులివి.. నువ్వు ఎప్పుడూ పులిలాగే ఉండాలి.. నీకు ఎన్డీయే కూటమిలోకి స్వాగతం’అంటూ కేంద్ర మంత్రి జీతన్‌రామ్ మాంఝీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి పోవడంతోనే భూ కుంభకోణం కేసులో అప్పటి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ ఈ ఏడాది జనవరి 31న అరెస్టు చేసింది. ఈడీ అరెస్ట్‌తో హేమంత్ సోరెన్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సోరెన్ కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్న చంపాయీ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. వరుస పరిణామాల అనంతరం హేమంత్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే తనను సీఎం పదవి నుంచి తప్పించడం వల్ల చంపయీ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. -
అఖిలేష్‌పై అలిగి.. ప్రసాద్ మౌర్య కొత్త పార్టీ?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యపై కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. స్వామి ప్రసాద్ మౌర్య తన కొత్త పార్టీని ఫిబ్రవరి 22న ప్రకటిస్తారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మౌర్య నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, అధినేత అఖిలేష్ యాదవ్‌కు లేఖ రాశారు. పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. అఖిలేష్ యాదవ్‌కు రాసిన లేఖలో మౌర్య.. తాను సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటి నుండి, పార్టీకి మద్దతు కూడగట్టేందుకు నిరంతరం ప్రయత్నించానని పేర్కొన్నారు. అయితే పార్టీ తన కృషిని గుర్తించలేదని ఆరోపించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వందలాది మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలు, గుర్తులు మారిన తర్వాత కూడా పార్టీ మద్దతును పెంచుకోవడంలో విజయం సాధించానన్నారు. ఫలితంగా ఎస్పీ ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిందని, ఒకప్పుడు పార్టీలో 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో వారి సంఖ్య 110కి చేరిందని పేర్కొన్నారు. తన కృషితో ఎమ్మెల్యేల సంఖ్య పెరిగిన తర్వాత కూడా తనను శాసనమండలికి పంపారని, ఆ వెంటనే తనను జాతీయ ప్రధాన కార్యదర్శిగా చేశారని మౌర్య తెలిపారు. ఇంతటి గౌరవం అందించినందుకు ధన్యవాదాలని మౌర్య పేర్కొన్నారు. -
శరద్ పవార్ కొత్త పార్టీ పేరు.. NCP శరద్చంద్ర పవార్
ముంబై: శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది. లోక్‌సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది. ఎస్పీపీ ఎవరిదనే విషయంలో గత కొంతకాలంగా ఆ పార్టీ చీలిక వర్గాలు కుమ్ములాడుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై క్రమంగా నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఇక.. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. -
నాకు ఓటు వేస్తే స్మార్ట్ ఫోన్స్ ఫ్రీ గా ఇస్తా..నాని మేనిఫెస్టో వైరల్
-
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై.. సచిన్ పైలట్ కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపధ్యంలో వారి మధ్య చర్చలు నిర్వహించి సమన్వయము కుదిర్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పెద్దలు. అయినా కూడా సమస్య పరిష్కారం కాని కారణంగా సచిన్ పైలట్ వేరుకుంపటి పెట్టనున్నారని ఈ మేరకు తన తండ్రి రాజేష్ పైలట్ వర్ధంతి రోజున కొత్త పార్టీ పెట్టనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. దీంతో కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కె.సి.వేణుగోపాల్ స్వయంగా రంగంలోకి దిగి సచిన్ పైలట్ కొత్త పార్టీ పుకార్లను కొట్టి పారేశారు. అవన్నీ సత్యదూరమైన ప్రచారాలని తేల్చి చెప్పారు. కలిసే ఉన్నాం.. కలిసే పోటీ చేస్తాం.. త్వరలో రాజస్థాన్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సచిన్ పైలట్ కొత్త పార్టీ పెడుతున్నారనే వార్త జోరుగా ప్రచారంలో ఉండి. కానీ ఆ వార్తల్లో వాస్తవం లేదని, వాటిని నమ్మవద్దని అన్నారు కాంగ్రెస్ నేత కె.సి.వేణుగోపాల్. ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. " నేను ఈ పుకార్లను నమ్మడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరితో జరిపిన చర్చల్లో మనం కలిసే పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వారిద్దరూ సానుకూలంగా స్పందించారు. నాకు తెలిసి సచిన్ కొత్త పార్టీ అనేది పూర్తిగా అవాస్తవం. మా పార్టీ ఐక్యంగానే ఉంది మేము వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని కరాఖండిగా తేల్చిచెప్పారు. సచిన్ అసంతృప్తి.. రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లపాటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన సచిన్ పైలట్ గత ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అవినీతి అంశాలతో పాటు పేపర్ లీకేజీ, రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పునర్వ్యవస్థీకరణ అంశాలపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన వాదన గట్టిగానే వినిపిస్తున్నారు. ఈ అంశాలనే అదనుగా చేసుకుని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయని సచిన్ కొత్త పార్టీ పెట్టబోతున్నారని వదంతులు పుట్టుకొచ్చాయంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇది కూడా చదవండి: మొదట భారత దేశం పరువు తీసింది ఆయనే.. -
బీఆర్ఎస్ మాజీ నేతలు పొంగులేటి, జూపల్లితో జాతీయ పార్టీల చర్చలు
-
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పొంగులేటి కొత్త పార్టీ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయ వ్యూహంపై నల్లగొండ జిల్లాలో చర్చ జోరందుకుంది. బీజేపీలో చేరతారా.. కాంగ్రెస్‌లో చేరతారా అన్న చర్చతో పాటు ఆయన సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం ఇక్కడ జరుగుతోంది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన బీఆర్ఎస్, ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలు పొంగులేటి శిబిరం టచ్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల బీఆర్ఎస్కు రాజీనామా చేసిన నల్లగొండ జిల్లా సీనియర్ నేత చకిలం అనిల్‌కుమార్‌కు ఆహ్వానం అందడంతో ఆయన నేడు(ఈ నెల 6న) ఖమ్మంలో పొంగులేటితో భేటీ కానున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటికి నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలతో నూ మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, పొంగులేటి బీజేపీలో చేరితే ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో ఆయన ప్రభావం చూపడం కష్టమేనని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరినా కష్టమేనన్న భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్ఎస్)పేరుతో పార్టీ పెడతారన్న చర్చ సాగుతోంది. తద్వారా బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ముఖ్యనేతలు, ఉద్యమంలో పనిచేసినా ప్రాధాన్యం దక్కని నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్కు ఇటీవల రాజీ నామా చేసిన చకిలంను పొంగులేటి బృందం చర్చలకు ఆహా్వనించిందని అంటున్నారు. ఇది కూడా చదవండి: ఎంపీగా నాలుగేళ్లు ఏం చేశాడో చెప్పే ధైర్యం లేదు: బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్ -
కర్ణాటకలో కొత్త పార్టీని స్థాపించిన గాలి జనార్దన్ రెడ్డి..
-
చర్లపల్లి జైలు నుంచి తీన్మార్ మల్లన్న విడుదల.. కొత్త పార్టీ ప్రకటన..
సాక్షి, హైదరాబాద్: జైలు తనకేమీ కొత్త కాదని, సీఎం కేసీఆర్ కుటుంబానికే కొత్తని, జైలుకెళ్లేందుకు కేసీఆర్ కుటుంబం సిద్ధంగా ఉండాలని తీన్మార్ మల్లన్న ఆలియాస్ చింతపండు నవీన్ పేర్కొన్నారు. చర్లపల్లి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన మంగళవారం విడుదలయ్యారు. మల్లన్న అభిమానులు జైల్ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ తనపై ప్రభుత్వం మోపిన కేసులన్నీ దొమ్మీ కేసులేనని, అందుకే కోర్టు బెయిల్ మంజూరు చేసిందని తెలిపారు. 'తెలంగాణ నిర్మాణ పార్టీ' పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు. అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. చదవండి: ఒక్క గుంట భూమి ఎక్కువున్నా రాజీనామా చేస్తా.. పశువుల కొట్టాలు, కూలీల రేకుల షెడ్లు కూడా ఫాంహౌస్‌లేనా? -
ఖమ్మంవైపు తెలంగాణ రాజకీయాలు.. త్వరలో కొత్త పార్టీ?
సాక్షి, ఖమ్మం: రాష్ట్ర రాజకీయాలు ఖమ్మం వైపు చూస్తున్నాయి. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలే ఇందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం రాజకీయాల్లో వీరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడ్డవారంతా ఏకమవుతారని పొంగులేటి కీలక వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మే నెలలో తెలంగాణలో కీలక పరిణాలు జరగబోతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంతో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలోని 9 నియోజక వర్గాల్లో ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ఖమ్మం నియోజకవర్గం మాత్రమే మిగిలుంది. ఇక్కడ జరగబోయే ఆత్మీయ సమ్మేళనంలో దాదాపు లక్ష మంది పాల్గొనేలా వ్యూహాలు రచిస్తున్నారు. చదవండి: బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. పొంగులేటి, జూపల్లిపై వేటు ఖమ్మం వేదిక ద్వారానే పార్టీ మార్పు, కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ఊహాగానాలపై పొంగులేటి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఆయన అనుచరులు. ముఖ్యంగా జిల్లాలోని జనరల్ కేటగిరి స్థానాలైన ఖమ్మం, కొత్తగూడెం, పాలేరు.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి శ్రీనివాస రెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా సోమవారం బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యాలయం వెల్లడించింది. -
జేడీయూ నుంచి వైదొలిగిన ఉపేంద్ర కుష్వాహ
పట్నా: జేడీయూ అసంతృప్త నేత ఉపేంద్ర కుష్వాహ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కొత్తగా రాష్ట్రీయ లోక్తాంత్రిక్ జనతా దళ్ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బిహార్ మహాఘఠ్‌బంధన్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు లభిస్తున్న ప్రాముఖ్యంపై అసంతృప్తితో ఉన్న కుష్వాహ గత కొంత కాలంగా జేడీయూ నేత, బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌పై విమర్శలు చేస్తున్నారు. ఆయన రాజీనామాపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ స్పందించారు. ‘జేడీయూ నుంచి వెళ్లిపోయి సొంతంగా రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ పెట్టుకున్న కుష్వాహను 2021లో తిరిగి పార్టీలోకి కేవలం సీఎం నితీశ్ కుమార్ జోక్యంతోనే తీసుకున్నాం. స్థాయికి మించిన ఆశలు ఆయనకున్నాయి. అందుకే వెళ్లిపోతున్నారు’అని పేర్కొన్నారు. -
Revanth Reddy: రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ?.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం..
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తు న్నారంటూ సోషల్ మీడి యాలో ప్రచారం కావడం వివాదాస్పదమైంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతోందని, రేవంత్ రెడ్డి కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమా చారం వచ్చిందని సోమవారం సోషల్ మీడి యాలో విస్తృత ప్రచారం జరిగింది. అంతేకాదు ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’గా ఈ పార్టీ ఉండే అవకాశముందంటూ పెద్ద ఎత్తున ప్రచా రం చేశారు. అయితే దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేసిన శంకర్ అనే వ్యక్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ సైబర్ క్రైమ్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలను ప్రచారం చేసిన అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకో వాలని కోరారు. టీపీసీసీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయడం గమనార్హం. చదవండి: చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి -
ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల
సాక్షి,తాడేపల్లి: ఎన్నికల ముందు ఇచ్చే హామీలు పవిత్రంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 100కు వందశాతం అమలయ్యేలా ఉండాలన్నారు. మ్యానిఫెస్టో తయారీకి ముందే రాజకీయ పార్టీలు ఆచరణ సాధ్యం పరిశీలించాలని సూచించారు. తాము గతంలో చెప్పినవి 98శాతం పైగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అడ్డగోలుగా హామీలు ఇచ్చి చంద్రబాబు ప్రజలు నష్టపోయేలా చేశారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కొత్త పార్టీల వల్ల పోటీ పెరిగి తమ పనితీరును మరింత మెరుగు పరుచుకోవచ్చన్నారు. ప్రజల అంశాలపై విధానపరమైన అంశాలతో పార్టీలు వస్తే మంచిదేనన్నారు. కొత్త పార్టీల రాకపై మేము విశ్లేషించమని తెలిపారు. తమది రాజకీయం కోసం రాజకీయ ఎత్తుగడలు వేసే పార్టీ కాదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా చేస్తున్నామని, అందుకే ప్రజలు తమను సొంతం చేసుకున్నారన్నారు. చదవండి: ఆదాయాలను సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్ సమీక్ష ‘మా విధానం మాకు ఉంది, మేము ప్రజల కోసం రాజకీయం చేస్తున్నాం. కాబట్టి ప్రజలు మాకే మద్దతు ఇస్తారని నమ్ముతున్నాం. అంతిమ నిర్ణేతలు ప్రజలే. రాష్ట్ర అభ్యున్నతే ముఖ్యం. పక్క రాష్ట్రాల గురించి మేము మాట్లాడటం లేదు. వాళ్లు అక్కడి విషయాలు వదిలేసి మా గురించి ఎందుకు విమర్శలు చేస్తున్నారు. భవిష్యత్తు రాజకీయాల కోసం వాళ్లు అలా చేస్తున్నారేమో మాకు తెలియదు. తెలంగాణ నేతలు మా గురించి మాట్లాడటంతోనే మేము స్పందించాల్సి వచ్చింది. మేము ఇక్కడి వ్యవహారాలకు మాత్రమే కట్టుబడి ఉన్నాం. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు. అందరూ బాగుండాలనేదే వైఎస్సార్ సీపీ సిద్ధాంతం. అమరావతి ఉద్యమం పేరుతో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అభివృద్ధి వికేంద్రీకరణ విధానం ఎందుకు ఎత్తుకున్నామో ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇది చారిత్రాత్మక పరిణామం. చంద్రబాబు రుణమాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదు.’ అని సజ్జల పేర్కొన్నారు. -
డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ
జమ్మూ: కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త పార్టీని ప్రకటించారు. దానికి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. కశ్మీర్లో ఏ క్షణమైన ఎన్నికలు రానున్నందున పార్టీ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామన్నారు. 50 శాతం టిక్కెట్లను యువత, మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలే తమ పార్టీ సిద్ధాంతాలన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిని బలోపేతం చేయడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు. ఆర్టికల్ 370 విషయంలో పీడీపీ సహా ఇతర పార్టీలు తనపై చేస్తున్న విమర్శలను ఆజాద్ తిప్పికొట్టారు. ‘‘దాని పునరుద్ధరణ అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రధాని మోదీని ఒప్పించలేకపోయాననే చెప్పా. ఆర్టికల్ 370పై మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఎవరైనా ఒప్పించాలనుకుంటే స్వాగతిస్తా. వారివద్ద నాకంత పలుకుబడి లేదు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా నిర్ణయంపై అక్టోబర్ 10 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండడం మంచి పరిణామం’’ అని అన్నారు. -
14 రోజుల్లో ఆజాద్ కొత్త పార్టీ ప్రారంభం... ఊహించని ఝలక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అన్ని సభ్యుత్వాలకు రాజీనామ చేస్తున్నట్లు ప్రకటించిన కొద్దిగంటల్లోనే కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆజాద్ 14 రోజుల్లోనే కొత్త పార్టీ తొలి యునిట్‌ను జమ్ము కశ్మీర్ ఏర్పాటు చేయుబోతున్నారని ఆయన సన్నిహితుడు ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీఎం సరూరి తెలిపారు. సైద్ధాంతికంగా లౌకికవాది అయిన ఆజాద్ ఆదేశానుసారం పనిచేసే ప్రశ్నే లేదని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ మాజీ నాయకుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడటంతో వందలాది మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పంచాయతీ రాజ్ సంస్థల సభ్యులు, ప్రముఖులు కూడా తమ రాజనామాను సమర్పిచినట్లు పేర్కొన్నారు. అంతేకాద మా కొత్త పార్టీని ప్రారంభించేందుకు సెప్టెంబర్ 4న అజాద్ జమ్మ కశ్మీర్‌కి వస్తున్నారని అన్నారు. అదీగాక ఆజాద్ కూడా తాను కొత్త జాతీయ పార్టీని ప్రారంభించే తొందరలో లేనని, జమ్ము కశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు. ఐతే సరూరి జమ్ముకశ్మీర్‌కి అజాద్ తిరిగి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన జమ్ముకశ్మీర్‌లో నవంబర్ 2, 2005 నుంచి జూలై11, 2008 వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారు, పైగా ఆయన పాలనను ప్రజలు స్వర్ణయుగంగా చూస్తారని చెప్పారు. తమ కొత్తపార్టీ ఆగస్టు 5, 2019కి ముందు ఉన్న జమ్ము కశ్మర్ పూర్వవైభవాన్ని పునరుద్ధరించడం కోసమే పోరాడుతుందని చెప్పారు. అలాగే ఆజాద్‌కి మద్దతుగా పలువురు మాజీ మంత్రులు, శాసనసభ్యులతో సహా డజనుకు పైగా నాయకులు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేగాక మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ వంటి పలువురు ఈ రోజు ఢిల్లీలో ఆజాద్‌తో సమావేశమై రాజీనామ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. (చదవండి: కాంగ్రెస్‌కు ఆజాద్ గుడ్‌బై) -
బీజేపీలో చేరుతారనే ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన గులాం నబీ ఆజాద్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా అనంతరం గులాం నబీ ఆజాద్ నెక్స్ట్ ఏం చేస్తారు? ఏ పార్టీలో చేరుతారు? అని జోరుగా చర్చ మొదలైంది. ఆయన బీజేపీలో చేరుతారానే ప్రచారం ఊపందుకుంది. అయితే వీటిపై ఆజాద్ స్పష్టతనిచ్చారు. తాను బీజీపీతో అసలు టచ్‌లో లేనని చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. తాను ప్రస్తుతానికి జాతీయ స్థాయిలో ఉనికి కోసం చూడటం లేదని ఆజాద్ వివరించారు. ఇప్పటికైతే సొంత రాష్ట్రానికే పార్టీని పరిమితం చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విషయంపై భవిష్యత్తులో ఆలోచిస్తానన్నారు. అయితే తాను స్థాపించబోయే రాజకీయ పార్టీ పేరు, గుర్తుకు సంబంధించి ఆజాద్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న ఆజాద్.. కాంగ్రెస్ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈమేరకు ఐదు పేజీల లేఖను సోనియా గాంధీకి పంపారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2013లో ఆయన ఉపాధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచే పార్టీ నాశనమైందని ఆరోపించారు. రాహుల్ వచ్చాక పార్టీలో సీనియర్లను పరిగణనలోకి తీసుకోవట్లేదని, సంప్రదింపుల విధానానికి స్వస్తి పలికారని ధ్వజమెత్తారు. మరోవైపు ఆజాద్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పార్టీ నేతలు ఆయనకు ఎంతగానో గౌరవించారని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో ఆజాద్ పార్టీకీ ద్రోహం చేశారని, ఆయన డీఎన్ఏ 'మోడీ-ఫై' అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఘాటు విమర్శలు చేశారు. చదవండి: ఆజాద్‌ది ద్రోహం.. ఆయన ఆరోపణల్లో నిజం లేదు -
చతుర్ముఖ పోరులో... పంజాబ్ షేర్ ఎవరో?
వచ్చే ఏడాది ఫిబ్రవరి– మార్చి నెలల్లో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యంత కీలక రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే మిగతా మూడు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలు. సాగు చట్టాలకు వ్యతిరేక ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పంజాబ్ రైతులు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, ఎవరి పక్షాన నిలుస్తారు... అనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే పంజాబ్ రాజకీయం బాగా వేడెక్కింది. శిరోమణి అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలైతే ఏడాదికాలంగా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల స్వర్ణదేవాలయం, కపుర్తలాలలో సిక్కుల మతచిహ్నాలను అపవిత్రం చేసే ప్రయత్నాలు జరగడం, లుథియానా కోర్టులో పేలుడు వెనుక ఖలిస్థాన్ గ్రూపుల హస్తమున్నట్లు వార్తలు రావడంతో... రాజకీయాలకు మతం రంగు పులిమేందుకు, ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం అమరీందర్ సింగ్ పంజాబ్ లోక్ కాంగ్రెస్ (పీఎల్సీ) పేరిట కొత్త పార్టీని పెట్టి బీజేపీతో జట్టు కట్టడంతో పంజాబ్ ఎన్నికలు చతుర్ముఖ పోరుగా మారాయి. రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల తాజా పరిస్థితిపై విశ్లేషణ... దళిత ఓటుపై గంపెడాశలు పదేళ్లు అధికారంలో ఉండి... తీవ్రమైన అవినీతి ఆరోపణలు, రాష్ట్రం డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడంతో 2017లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. కేవలం 15 సీట్లతో మూడోస్థానానికి పరిమితమైంది. పంజాబ్ రైతాంగంలో రగులుతున్న అసంతృప్తిని పసిగట్టిన అకాలీదళ్ 2020లో మూడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ బీజేపీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుంది. పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ సతీమణి హర్సిమ్రత్ కౌర్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత అకాలీదళ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ వస్తోంది. రాష్ట్ర జనాభాలో 32 శాతం దళితులు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)తో ఈ ఏడాది జూన్‌లోనే పొత్తు పెట్టుకుంది. 20 సీట్లకు బీఎస్పీకి వదిలిపెట్టింది. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి 111 స్థానాల్లో బరిలోకి దిగిన బీఎస్పీ 110 నియోజకవర్గాల్లో డిపాజిట్లు పోగొట్టుకుంది. 1.59 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయితే అంతకుముందు 2007లో 4.17 శాతం, 2012లో 4.3 శాతం ఓట్లను బీఎస్పీ పొందింది. దళితులపై పట్టున్న డేరాల ప్రభావం తగ్గడం, డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్‌రహీమ్ సింగ్ జైలుకెళ్లడంతో... దళితల ఓట్లను కూడగట్టడంతో మాయావతి తొడ్పడగలరని అకాలీదళ్ అంచనా. అయితే సొంత రాష్ట్రం యూపీలో కూడా ఎన్నికలున్న నేపథ్యంలో పంజాబ్ ప్రచారానికి మాయావతి ఎంత సమయాన్ని కేటాయించగలరనేది ప్రశ్న. మరోవైపు సుఖ్బీర్ చాలా ముందునుంచే 2022లో పోటీచేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఇప్పటికి 91 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు. 21 కొత్త ముఖాలను దింపారు. ముందే ఖరారు కావడంతో నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనిచేసుకోవడానికి, తగినంత సమయం వెచ్చించడానికి అకాలీదళ్ అభ్యర్థులకు వీలు చిక్కింది. కొత్త పొత్తు... కాంగ్రెస్ పొమ్మనకుండా పొగబెట్టడం తో పాటియాలా రాజు.. అమరీందర్ ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరిట సొంతకుంపటి పెట్టుకున్నారు. సాగు చట్టాలను రద్దు చేస్తే బీజేపీతో కలిసి బరిలోకి దిగుతానని ప్రకటించిన కెప్టెన్ అన్నట్లుగానే పొత్తును ఖరారు చేసుకున్నారు. ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలనేది ఇంకా తేల్చుకోలేదు. అకాలీ చీలికవర్గ నేతలను కూడా కూటమిలో చేర్చుకుంటామని కెప్టెన్ ఇదివరకే స్పష్టం చేశారు. అకాలీదళ్‌తో పొత్తులో భాగం గా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కేవలం మూడు స్థానాల్లో నెగ్గింది. 5.39 శాతం ఓట్లను సాధించింది. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి పోటీచేసిన మూడింటిలో రెండు నెగ్గి...9.63 శాతం ఓట్లు పొందింది. అమరీందర్ కాంగ్రెస్ ఓట్లను ఎన్నింటిని చీల్చగలరు, సాగు చట్టాల రద్దు ఈ కూటమికి ఏ మేరకు లబ్ధి చేకూరుస్తుంది, మోదీ కరిష్మా రాబోయే ఎన్నికల్లో ఎన్ని ఓట్లను రాల్చ గలదు... ఇవన్నింటిపై ఈ కూటమి ఎన్ని చోట్ల గెలుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. సొంతగూటిని చక్కదిద్దాలి.. ఒత్తిడికి తలొగ్గి అనుభవజ్ఞుడైన ముఖ్య మంత్రి అమరీందర్ సింగ్‌ను మార్చడం, తర్వాత అదేపనిగా పీసీసీ అధ్యక్షుడు నవ జ్యోత్ సింగ్ సిద్ధూ అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో కాంగ్రెస్‌కు సొంత గూటిని సరిదిద్దుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతోంది. పీసీసీ అధ్యక్షుడే సొంత ప్రభుత్వంపై బౌన్సర్లు సంధిస్తుంటే... తలబొప్పి కట్టడం ఖాయం. ప్రస్తుతం సిద్ధూతో కాంగ్రెస్ పెద్దలు ఇదే అవస్థను ఎదుర్కొంటున్నారు. పంజాబ్ జనాభాలో దాదాపు 32 శాతం దళిత ఓట్లు ఉండటాన్ని దృష్టిలో పెట్టుకొని... ఆ వర్గానికి చెందిన చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పీఠంపై కూర్చోబెట్టింది కాంగ్రెస్. ఎన్నికల్లో దళిత కార్డుగా ఉపయోగించుకోవడానికే చన్నీని అందలం ఎక్కించారని.. ఆర్నెళ్ల సీఎంగా మిగిలిపోతారని... కాంగ్రెస్‌కు దమ్ముంటే 2022 ఎన్నికల్లో కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ హస్తం పార్టీ అలా చేయలేదు. సర్వం తన కనుసన్నల్లో నడవాలనుకునే సిద్ధూకు కోపం తెప్పించే సాహసం కాంగ్రెస్ చేయలేదు. అలాగని ఆయన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్తే... దళిత ఓటు పోటును ఎదుర్కోవాల్సిన సంకట స్థితి. సిద్ధూ మాటల మాంత్రికుడు. చక్కటి హావభావాలతో సూటిగా ప్రజల మనసుల్లో ముద్రవేయగల వాగ్భాణాలను సంధిస్తారు. పంజాబ్ లో కాంగ్రెస్‌కు పర్యాయపదంగా మారిన అమరీందర్ లేని లోటును సిద్ధూ ఏమేరకు పూడ్చగలరు, ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి తన చరిష్మాతో మళ్లీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఖాతాలో వేయగలరా? వేచి చూడాలి. కేజ్రీవాల్‌పైనే భారం ఢిల్లీకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌పై బాగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో బల మైన పునాది కలిగిన అకాలీదళ్‌కు వెనక్కి నెట్టి... 20 స్థానాలతో ఆప్ పంజాబ్ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 23.72 శాతం ఓట్లు రావడంతో గత ఐదేళ్లుగా ప్రణాళిక ప్రకారం పంజాబ్‌లో బలపడేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్ ఇన్సాఫ్ పార్టీకి ఆరుస్థానాలను (రెండు నెగ్గింది) వదిలిన ఆప్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రజాకర్షణపైనే ఆధారపడుతోంది. ఢిల్లీలో పాఠశాలల్లో నాణ్యత మెరుగుపడటం, మొహల్లా క్లినిక్‌లు విజయవంతం కావడం, పేదలకు ఉచిత విద్యుత్... తదితర ఢిల్లీ మోడల్ పాలనను అందిస్తామని వాగ్ధానం చేస్తోంది. సిక్కునే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగు విడతల్లో 73 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. -
పంజాబ్‌లో మారనున్న రాజకీయ సమీకరణాలు
చంఢీగడ్: త్వరలోనే తాను.. కొత్త పార్టీ పేరు, గుర్తును ప్రకటిస్తానని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచిచూస్తున్నామని... ఆ ప్రక్రియ కాగానే పార్టీ పేరును ప్రకటిస్తానని అమరీందర్ సింగ్ అన్నారు. బీజేపీతో ఎలాంటి పోత్తు ఉండబోదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము 117 స్థానాల్లో పోటీకి దిగుతామని అన్నారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నాయకులు తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. తాను పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడే.. 90 శాతానికి పైగా ఎన్నికల వాగ్దానాలను పూర్తి చేశానని పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. చదవండి: తమిళనాడులో కేంద్రం కొత్త ఆట.. రసవత్తరంగా రాజ్‌భవన్ రాజకీయం..! -
కొత్త పార్టీ పెడుతున్నట్టు అమరీందర్ సింగ్ ప్రకటన
-
Punjab: అమరీందర్ సింగ్ సొంత పార్టీ!
న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టనున్నారు. సీఎం పదవి నుంచి తనను అవమానకర రీతిలో తప్పించిందని రగిలిపోతున్న అమరీందర్ కాంగ్రెస్ పార్టీని సాధ్యమైనంతగా దెబ్బతీసే లక్ష్యంతో పావులు కదుపుతున్నారు. త్వరలో సొంత పార్టీని ప్రకటిస్తానని, రైతు సమస్యలు సానుకూలంగా పరిష్కారమైతే బీజేపీతో పొత్తు ఉంటుందనే ఆశాభావంతో ఉన్నట్లు మంగళవారం వెల్లడించారు. నవజోత్ సింగ్ సిద్ధూతో తీవ్ర విభేదాల కారణంగా కిందటి నెలలో అమరీందర్ పంజాబ్ సీఎంగా రాజీనామా చేయగా... కాంగ్రెస్ దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్నీని కుర్చీపై కూర్చొబెట్టిన విషయం తెలిసిందే. ‘పంజాబ్ భవిష్యత్తు కోసం పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే సొంత పార్టీని ప్రకటిస్తాను. పంజాబీలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తాను. ఏడాదికాలంగా మనుగడ కోసం పోరాడుతున్న రైతుల ప్రయోజనాల కోసం కూడా పాటుపడతాను’ అని అమరీందర్ తన మీడియా సలహాదారు రవీన్ తుక్రాల్ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ‘బీజేపీతో పాటు అకాలీదళ్ చీలికవర్గాలకు చెందిన దిండ్సా, బ్రహ్మపురాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే’ అని కెప్టెన్ తెలిపారు. చదవండి: ‘మోదీ నిరక్ష్యరాస్యుడు’... ‘అయితే రాహుల్ డ్రగ్స్ అమ్ముతాడు’ -
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
-
కొత్త పార్టీ ఏర్పాటుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 15 రోజుల్లో కొత్త పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, కెప్టెన్ అమరీందర్‌తో ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు,రైతు నేతలు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా, అమరీందర్ సింగ్ పంజాబ్ వికాస్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులతో, కార్యకర్తలతో చర్చించాక భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని అమరీందర్ సింగ్ సన్నిహితులు తెలిపారు. కాంగ్రెస్,ఆప్, అకాలీదళ్ అసంతృప్త నేతలను అమరీందర్ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, సిద్ధూ పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రానికి సరైన వ్యక్తి కాదని.. ఆయన ఎన్నికలలో.. ఏ స్థానం నుంచి బరిలోకి దిగిన గెలవనిచ్చేది లేదని అమరీందర్ సింగ్ ఇది వరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చదవండి: శాంతించిన సిద్ధూ..! -
సగం సీట్లను మహిళలకే కేటాయిస్తాం : వైఎస్ షర్మిళ
-
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ
-
వైఎస్సార్టీపీ ఆవిర్భావం నేడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ అధికారికంగా ఆవిర్భవిస్తోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆయన జయంతి రోజున గురువారం ప్రారంభిస్తున్నారు. పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 5 గంటలకు వేలాది మంది వైఎస్సార్ అభిమానుల సమక్షంలో వైఎస్ షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించడంతోపాటు ఎజెండాను, తెలంగాణలో ఏ కారణాలతో పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్న అంశాన్ని ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని జూమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించేలా లింక్‌ను పార్టీ యంత్రాంగం ఇప్పటికే దాదాపు పదివేల మంది వరకు షేర్ చేసినట్లు వెల్లడించింది. పార్టీకి సంబంధించి పాలపిట్ట, నీలం రంగుతో కూడిన జెండాను రూపొందించారు. ఆ జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులోనే వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ షర్మిల రోడ్‌మ్యాప్ ఖరారైంది. ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళులు.. గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి షర్మిల ఆశీర్వాదం తీసుకుంటారని పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి తెలిపారు. అనంతరం ఉదయం 10.30కు ఇడుపులపాయ నుంచి ప్రత్యేక విమానం లో బేగంపేటకు చేరుకుంటారన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు షర్మిల బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ర్యాలీగా బయలుదేరి జేఆర్సీ కన్వెన్షన్‌కు రానున్నారు. మధ్యలో పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పార్టీ ఆవిర్భావ వేడుక జరుగుతుందని అన్నారు. -
వైఎస్సార్ జయంతి రోజున కొత్త పార్టీ: వైఎస్ షర్మిల
సాక్షి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజైన జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు వైఎస్ షర్మిల ప్రకటించారు. అదే రోజున పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటిస్తామని తెలిపారు. ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీయడంలో ప్రతిపక్ష పార్టీలన్నీ విఫలమయ్యాయని విమర్శించారు. ఇకపై అధికారపక్షాన్ని నిలదీసేందుకు, ప్రశ్నించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజన్న తరహా సంక్షేమ పాలన కోసం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా తమ పార్టీ ముందుకుసాగుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం పట్టణంలోని పెవిలియన్ మైదానంలో శుక్రవారం రాత్రి జరిగిన ‘రాజన్న సంక్షేమ పాలన కోసం సంకల్ప సభ’కు తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వచ్చిన వైఎస్ షర్మిల తొలుత సభా ప్రాంగణంలో వైఎస్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. అభివృద్ధి ఫలాలన్నీ ఆ కుటుంబానికే.. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్‌ను తిరిగి ప్రతిష్టించేందుకు పార్టీ పెడుతున్నానని షర్మిల తెలిపారు. ఎన్నో ఆశలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలేవీ నెరవేరడం లేదన్నారు. విద్యార్థులకు కేజీ టూ పీజీ ఉచిత విద్య ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వడం లేదని, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు లేవని విమర్శించారు. నీళ్లు, నిధులు, ని యామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ లో అభివృధ్ధి ఫలాలన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబానికే పరిమితం అయ్యాయని, వారి కుటుంబమే లబ్ధి పొందుతోందని ఆరోపించారు. పదవులన్నీ బంధు వర్గానికి, భజన బ్యాచుకే కట్టబెడుతున్నారన్నారు. శుక్రవారం రాత్రి ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభకు హాజరైన జనం బంగారు తెలంగాణ ఎక్కడుంది? ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ ఎక్కడుందని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవం అంతా కేసీఆర్ దొరగారి ఎడమ కాలిచెప్పు కింద పడి నలిగిపోతోందని విమర్శించారు. దేశంలో సచివాలయానికి రాని ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు తల, తోక తీసేసి రీ డిజైన్ పేరుతో అంచనాలు పెంచేసి అవినీతికి పాల్పడ్డారని, దీన్ని ప్రశ్నించేందుకు ఒక పార్టీ అవసరం లేదా? అని ప్రశ్నించారు. ‘నువ్వు కొట్టినట్లు చెయ్..నేను ఏడ్చినట్లు చేస్తా’అన్న చందంగా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు గురిపెట్టిన ప్రజా బాణమై కొత్త పార్టీతో వస్తున్నా..’అని అన్నారు. దారి పొడవునా ఘనస్వాగతం షర్మిలకు హైదరాబాద్ నుంచి ఖమ్మం పట్టణం వరకు దారిపొడవునా ఘన స్వాగతం లభించింది. లోటస్ పాండ్ నుంచే షర్మిల వాహనం వెంబడి వందలాది వాహనాలు అనుసరించాయి. పలుచోట్ల నేతలు, అభిమానులు పూలు, హారతులు, బోనాలతో షర్మిలకు స్వాగతం పలికారు. 15 నుంచి హైదరాబాద్‌లో నిరాహార దీక్ష రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని, దీంతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని, ప్రతి ఉద్యోగాన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. నాలుగో రోజు నుంచి తమ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లాల్లో రిలేదీక్షలు చేస్తారని తెలిపారు. నా బిడ్డను ఆశీర్వదించండి: వైఎస్ విజయమ్మ వైఎస్సార్ ప్రజా ప్రస్థానం మొదలు పెట్టిన రోజునే షర్మిల తన రాజకీయ అడుగులు మొదలు పెడుతున్నారని వైఎస్ విజయమ్మ తెలిపారు. దీనికి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కావాలంటూ, ఆమెను ఆశీర్వదించాల్సిందిగా కోరారు. షర్మిల స్వభావం పూర్తిగా వైఎస్ రక్తం నుంచే వచ్చిందని, వైఎస్ మాదిరే షర్మిల సైతం మంచి పాలన అందిస్తుందని భరోసా ఇచ్చారు. షర్మిల గతంలో తెలంగాణలో చేసిన ప్రతి యాత్రలో ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తు చేశారు. తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ కుటుంబం తెలంగాణ ప్రజలకు రుణ పడి ఉంటుందని అన్నారు. వైఎస్‌ను గతంలో తెలంగాణ ప్రజలు ఆదరించారని, ఆ రుణం ఇప్పుడు తీర్చుకుంటామని తెలిపారు. వైఎస్ భార్యగా, షర్మిలకు అమ్మగా ఆమెను ఆశీర్వదించడానికి ఇక్కడకు వచ్చానని విజయమ్మ పేర్కొన్నారు. -
దొంగల రాజ్యానికి రాజులు
పథార్‌ప్రతిమ (పశ్చిమబెంగాల్): ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడానికి బీజేపీ మద్దతుతో కొత్త పార్టీ పుట్టుకొచ్చిందని, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్)ను ఉద్దేశిస్తూ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ విమర్శించారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడికి బీజేపీ నుంచి నిధులు అందుతున్నాయని ఆరోపించారు. దక్షిణ 24 పరగణలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రముఖ ముస్లిం మతపెద్ద అబ్బాస్ సిద్దిఖీ ఇటీవల ఐఎస్ఎఫ్ను స్థాపించిన విషయం, కాంగ్రెస్, వామపక్ష కూటమితో ఆ పార్టీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా బీజేపీతో ఒక అవగాహన కుదుర్చుకున్నాయని మమత ఆరోపించారు. రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ల అమలును తృణమూల్ కాంగ్రెస్ అడ్డుకోగలదని, తమ పార్టీ అధికారంలో ఉంటేనే మత సామరస్యం సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. అవసరమైన ప్రతీసారి ప్రజల పక్షాన నిలిచినందువల్లనే తనను దొంగగా, హంతకురాలిగా ప్రచారం చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ‘దోపిడీ దొంగల రాజు’లని అభివర్ణించారు. ‘కేంద్రం రాష్ట్రాన్ని దోచుకుంటోంది కానీ సాయం చేయడం లేదు’ అన్నారు. -
అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు: ట్రంప్
వాషింగ్టన్: 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉంటానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. బైడెన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అమెరికా ఫస్ట్’ నుంచి ‘అమెరికా లాస్ట్’కు దిగజారామన్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాక సోమవారం తొలిసారి బహిరంగ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఆర్లాండొలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మనం మళ్లీ గెలుపుబాట పట్టాలి. ముందు సెనెట్ ఎన్నికల్లో గెలుపొందాలి. తరువాత, రిపబ్లికన్ అధ్యక్షుడు వైట్‌హౌజ్‌లో మళ్లీ అడుగుపెట్టాలి’ అని మద్దతుదారుల హర్షధ్వానాల మధ్య వ్యాఖ్యానించారు. 2022 మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని, అలా చేయడం వల్ల కన్సర్వేటివ్ ఓట్లు చీలుతాయని ట్రంప్ పేర్కొన్నారు. రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ గెలిస్తే.. ఆయనకు అధ్యక్ష ఎన్నికల్లో మద్దతిస్తానని రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత మిట్ రోమ్నీ ఇప్పటికే ప్రకటించారు. కరోనాపై పోరు సహా అన్ని అంశాల్లో బైడెన్ ప్రభుత్వం విఫలమైందని ట్రంప్ విమర్శించారు. అక్రమ వలసదారుల కోసం సరిహద్దులను తెరిచారన్నారు. ట్రంపిజం అంటే దృఢమైన సరిహద్దులని వ్యాఖ్యానించారు. పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడంపై బైడెన్‌పై విమర్శలు గుప్పించారు. వాతావరణ సమతౌల్యత విషయంలో అమెరికా కన్నా భారత్, చైనా, రష్యాల బాధ్యత ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు. ‘రష్యా, చైనా, భారత్‌లు కాలుష్యాన్ని వెదజల్లుతూ ఉంటే, ఆ భారం మనపై పడుతోంది’ అని విమర్శించారు. -
సీఎంకు మరో తలనొప్పి : రంగంలోకి కొత్త పార్టీ
సాక్షి, తిరువనంతపురం : రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలనేపథ్యంలో కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేరళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)నేత మణి సీ కప్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పార్టీ ఆవిర్భావానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇందుకు గాను ఒక కమిటీనీ ఏర్పాటు చేశారు. కేరళలో అధికార కూటమి ఎల్డీఎఫ్లో భాగంగానున్న ఎన్సీపీకి చెందిన కొందరు నేతలు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)లో చేరిన అనంతరం తాజా పరిణామం ఆసక్తికరంగా మారింది. కప్పెన్ కొత్త పార్టీ, 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో 25వ రాజకీయ పార్టీగా అవతరించనుంది. కొత్త పార్టీ యోచనలో భాగంగా 10 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. మణి సీ కప్సన్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ పార్టీ పేరు, చిహ్నం ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ వారాంతంలో పార్టీ పేరు తదితర వివరాలు వెల్లడికానున్నాయని అంచనా. ఏడు జిల్లాల ఎన్సీపీ అధ్యక్షులు, రాష్ట్ర క్యాడర్లోని తొమ్మిది మంది నేతల మద్దతు ఉన్నట్టు ప్రకటించుకున్న ఎమ్మెల్యే మణి సీ కప్పన్ యూడీఎఫ్‌లో చేరారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాల నేతృత్వంలోని ఐశ్వర్య కేరళ యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత కేఎం మణి మరణించడంతో, పాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019 ఉపఎన్నికల్లో మణి సీ కప్పన్ ఎల్డీఎఫ్ టిక్కెట్ పై గెలిచారు. అయితే, రానున్న ఎన్నికల్లో పాల స్థానంలో టికెట్‌ను వేరే అభ్యర్థి ఇవ్వనున్నట్టు సీపీఐ సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిర్ణయించడం ఎన్సీపీ ఎమ్మెల్యే మణి సీ కప్పన్‌కు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి గుడ్పైచెప్పి యూడీఎఫ్‌లో చేరారు. ఆదివారం ఐశ్వర్య ర్యాలీలో మాట్లాడిన ఆయన ఎల్డీఎఫ్కు అధికారం దక్కదని, రాష్ట్రంలో ఈ పార్టీకి కాలం చెల్లినట్టేనని వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల నేపథ్యంలో వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తున్న సీపీఐ(ఎం) నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్కు ఎదురు దెబ్బ తగలనుంది. -
ప్రేమకు నిర్వచనం నా తమ్ముడు
‘‘నా తమ్ముడు మంచి మనిషి. ప్రేమకు నిర్వచనం’’ అన్నారు రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ. జనవరిలో కొత్త పార్టీ పెడతానని ప్రకటించిన రజనీకాంత్ ఈ సందర్భంగా తన అన్నయ్య సత్యనారాయణ ఆశీస్సులు తీసుకోవడానికి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. శనివారం (డిసెంబర్, 12) రజనీ పుట్టినరోజు. చెన్నైలో ఆయన బర్త్‌డే వేడుకలు జరిగాయి. తమ్ముడికి ఏం బహుమతి ఇచ్చారు? అసలు పుట్టినరోజులకు ఏమైనా ఇచ్చి పుచ్చుకుంటారా? అని సత్యనారాయణను ‘సాక్షి’ అడిగితే – ‘‘అలాంటివి ఏమీ లేదు. మా తమ్ముడు చూపించే ప్రేమను నేను పెద్ద బహుమతిలా భావిస్తాను. నా ప్రేమను ఆయన అలానే అనుకుంటారు. కుటుంబ సభ్యులంటే ఆయనకు చాలా ప్రేమ. కుటుంబం అనే కాదు.. మనుషులందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి’’ అన్నారు. మీ తమ్ముడి రాజకీయ భవిష్యత్తు గురించి ఏమంటారు? అంటే, ‘‘ఇన్నేళ్లుగా సినిమా హీరోగా ఉన్నారు. ఆయనకు అన్ని విషయాలూ తెలుసు. బాగా రాణిస్తారు’’ అన్నారాయన. ‘‘నా ఆరోగ్యం బాగుంది. తమ్ముడి ఆరోగ్యం కూడా చాలా బాగుంది. తను ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. తమ్ముడు ఎంత బిజీగా ఉన్నా నా క్షేమసమాచారాలు తెలుసుకుంటారు’’ అన్నారు సత్యనారాయణ. ఇదిలా ఉంటే ఈ 15 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న ‘అన్నాత్తే’ షూటింగ్లో పాల్గొననున్నారు రజనీకాంత్. అందరికీ ధన్యవాదాలు ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులకు, ప్రపంచవ్యాప్తంగా నా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్న అభిమాన దేవుళ్లకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
కొత్త పార్టీ స్థాపన దిశగా అళగిరి
సాక్షి, చెన్నై: కలైంజర్ డీఎంకే పేరుతో కొత్త పార్టీ స్థాపనకు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి కసరత్తు చేస్తున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ నెల 20న మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యతకు దారి తీసింది. డీఎంకే నుంచి తన పెద్దకుమారుడు అళగిరిని కరుణానిధి గతంలో బహిష్కరించిన విష యం తెలిసిందే. కరుణానిధి మరణం తదుపరి డీఎంకేలో చేరడానికి అళగిరి ప్రయత్నాలు చేసినా స్టాలిన్ ఆసక్తి చూపలేదు. చదవండి: బిహార్ ముఖ్యమంత్రిగా ఏడోసారి డీఎంకే అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం 2021 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా స్టాలిన్ ముందుకెళుతున్నారు. అదే సమయంలో పార్టీలోకి తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకురావడం, ప్రాధాన్యత ఇవ్వడంతో డీఎంకే సీనియర్లలో కొందరు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో అళగిరి కొత్త పార్టీ పెడతారని ప్రచారం జరగడం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మద్దతుదారులతో భేటీ రాజకీయాలకు అళగిరి దూరంగా ఉంటున్నా తన మాటలతో వార్తల్లో నిలుస్తున్నారు. నటుడు రజనీకాంత్ పార్టీ పెడితే ఆయన వెంట నడిచేందుకు అళగిరి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం కూడా సాగింది. అయితే రజనీ పార్టీపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 20న మదురైలోని దయ కల్యాణ మండపంలో తన మద్దతుదారులతో భేటీ కానుండడం ప్రాధాన్యను సంతరించుకుంది. చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు.. దక్షిణ తమిళనాడులో అళగిరికి మద్దతు గణం అధికంగా ఉండడం, ప్రస్తుత డీఎంకేలో అసంతృప్తితో ఉన్న నేతలకు రహస్యంగా పిలుపు వెళ్లడం వెరసి అళగిరి ఏ ప్రకటన చేస్తారో అన్న ఆసక్తి నెలకొంది. అయితే కలైంజర్ డీఎంకే ఏర్పాటుకు గతంలో తమ నేత సిద్ధంగా ఉన్నట్టుగా మద్దతుదారులు ప్రకటించిన నేపథ్యంలో అదే నినాదాన్ని అందుకుని డీఎంకేలో చీలిక దిశగా అళగిరి వ్యూహాలు ఉండవచ్చన్న చర్చ ఊపందుకుంది. మద్దతుదారుల అభిప్రాయం మేరకు కొత్త పార్టీనా లేదా బీజేపీతో జతకట్టడమా? అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది. -
నేనే నేను
ఉపేంద్రని తెర మీద చూసినమొదటిసారి నుంచి ఇప్పటిదాకా ఇదే లొల్లి!వెయ్యి ఇజమ్‌లలో ఈయనది ‘నేనిజమ్’.కథ ఎలా ఉన్నా స్క్రీన్‌ప్లే మాత్రంఎప్పుడూ ఇలాగే నేస్తాడు.ఎవరు ఏమన్నా నేవర్ మైండ్.నేను ఉంటే పెయిన్ ఉంటుంది...గెయిన్ ఉంటుంది అంటాడు.ఆ సినిమాలో ఉన్న నేనేరాజకీయాల్లో ఉన్న ఈ నేను అంటాడు. కొన్ని రోజులుగా మీ పార్టీ ‘యుపీపీ’ (ఉత్తమ ప్రజాకీయ పార్టీ) తరఫున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపారు. ప్రచారం ఎలా సాగింది? ఉపేంద్ర: ఆర్గానిక్‌గా ప్రచారం చేశాం. అంటే సహజసిద్ధంగా. ప్రచారం అంటే ర్యాలీ, రోడ్ షోలా కాకుండా కేవలం మీడియా, సోషల్ మీడియా ద్వారా ఓటర్స్‌ను అప్రోచ్ అయ్యాం. విచారమే (వివరణ) ప్రచారం అవ్వాలనుకున్నాను. అన్ని జిల్లాల ప్రజలను కలిశాను. వెళ్లిన ప్రతిచోటా ఓ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాం. అక్కడ ఎవరెవరు మా ప్రజాకీయను సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్లే వచ్చి మాతో కలసి ప్రచారం చేశారు. మీ అభ్యర్థులను ప్రవేశ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారని విన్నాం.. అవును. మూడు స్టేజీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించాం. ఫస్ట్ క్వొశ్చన్ రౌండ్, ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్. వాటిలో ఎంపికైన వాళ్లతో ఫైనల్ ఇంటర్వ్యూ నిర్వహించాం. మా గైడ్ లైన్స్ అన్నింటినీ వాళ్లు అంగీకరిస్తేనే తీసుకున్నాం. జీతం కోసం మాత్రమే పని చేయాలి. సేవ చేస్తాను, లీడర్ అవుతానని రాకూడదని స్పష్టంగా చెప్పేశాను. ఎమ్మెల్యే, ఎంపీలకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. నువ్వు (రాజకీయాల్లో ఉన్నవాళ్లు) కేవలం జీతం తీసుకుంటున్న ఉద్యోగివి మాత్రమే. కార్పొరేట్ ఎంప్లాయ్‌లానే పదవుల్లో ఉన్నవాళ్లు కూడా తామేం చేస్తున్నారనే రిపోర్ట్ ఇవ్వాలి. రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోయినా, వాళ్ల పనితో ప్రజలు సంతృప్తిగా లేకపోయినా వాళ్లు రాజీనామా చేసి వెళ్లిపోవాలి. ఇదీ మా పార్టీ నిబంధన. కొత్తవాళ్లకు, అంతగా పాపులార్టీ లేనివాళ్లకు కూడా టికెట్ ఇచ్చారు. వాళ్లు గెలుస్తారనుకుంటున్నారా? మన రాజ్యాంగం ఏం చెప్పింది? ఎవ్వరైనా అభ్యర్థిగా నిలబడొచ్చు. గెలవడానికి కోట్లు ఖర్చు పెట్టి 2, 3 లక్షల జీతం కోసం ఎవరైనా పనిచేస్తారా? అంత ఖర్చు పెట్టి ఓట్లు కొని, రాజకీయాన్ని బిజినెస్ చేసేశారు. 100, 200 కోట్లు ఖర్చు పెడతాను. దానికి డబుల్ సంపాదిస్తాను అన్నట్టు ఉంటారు. పార్టీ ఫండ్స్ కూడా అలానే ఉంటాయి. వాళ్లనుంచి అవినీతి లేని రాజకీయం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? బేసిక్ ప్రాబ్లమ్ ఈ స్ట్రక్చర్, మనీ. నా ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ ద్వారా అవన్నీ పక్కన పెడదాం అనుకుంటున్నాను. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ ఎక్కువగా లేకపోయినా ఎవ్వరైనా వచ్చి రాజకీయాల్లో నిలబడ వచ్చని మన రాజ్యాంగం చెప్పింది. మనకు కావాల్సింది ఓ రిపోర్టర్లా పని చేయాలి. కానీ మన మైండ్‌ని ఎలా సెట్ చేశారంటే... ఇక్కడికి వచ్చేవాళ్లు పెద్ద మనిషి అయ్యుండాలి, అనుభవం కలిగి ఉండాలని. రాజకీయాల్లోకి రావడం ద్వారా మీరు ప్రజలకు చెప్పాలనుకున్నదేంటి? నేను గెలవడం, నా అభ్యర్థి గెలవడం కాదు. మీరు (ప్రజలు) గెలవాలి. సర్వెంట్స్‌ను తీసుకోండి మీరు. లీడర్స్ వద్దు మీకు. పెద్ద మనిషిని గెలిపిస్తే వాళ్ల ఇంటికి మీరు వెళ్లాలి. చిన్నవాళ్లను గెలిపిస్తే వాళ్లు మీ ఇంటికి వచ్చి, సమస్యలు తెలుసుకుంటారు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే రాజులు. ఇప్పుడు రాష్ట్రం మన ఇల్లు అనుకుంటే.. మన ఇంటి పనుల కోసం వర్కర్స్‌ని పెట్టుకుంటాం. ఎలక్ట్రీషియన్, ప్లంబర్, సెక్యూరిటీ.. వీళ్లతో ఎలా పనులు చేయించుకుంటామో రాజకీయాల్లో ఉన్నవాళ్లతో కూడా అలానే పనులు చేయించుకోవాలి. కానీ మనం ఓట్లు వేసి గెలిపించి, మనం ట్రాఫిక్‌లో ఉండిపోయి వాళ్లను జీరో ట్రాఫిక్‌లో పంపిస్తాం. దీన్ని మించిన ట్రాజెడీ ఉందా? బ్రిటీష్ వాళ్లు పరిపాలించినప్పుడు మనపైన కూర్చున్నారు. వాళ్లు వెళ్లి, ప్రజాప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు వీళ్లు కూడా పైన కూర్చుంటా అంటే? ఇంకా మనం రోడ్డులోనే ఉన్నాం. యూత్‌కి రాజకీయాలంటే అసహ్యంగా ఉంది. అందుకే వాళ్లకు ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేశాను. డబ్బు ఖర్చు పెట్టకపోతేనే సరైన పాలన జరుగుతుంది. డబ్బులు పెట్టుబడిగా పెడితే నేనూ ఆ డబ్బు వెనక్కి తెచ్చుకునే మార్గం ఆలోచిస్తాను. అందుకే మా పార్టీలో ఎవర్నీ ఖర్చు పెట్టొద్దన్నాను. నేనూ మినిమమ్ ఖర్చే పెట్టా. పోలింగ్ అయిపోయింది. మీ పార్టీ రిజల్ట్ గురించి ఎలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది? బాగా సపోర్ట్ చేశారు. అయితే గెలుపోటముల గురించి ఆలోచించలేదు. ఓడిపోతే తలెత్తుకొని జీవిస్తాను. గెలిస్తే తల దించుకొని పనిచేస్తానని డిసైడ్ అయి రాజకీయాల్లోకి వచ్చాను. రాజకీయాలంటే గెలుపోటములు కానే కాదు. పాల్గొనడం.. అంతే. నేను కర్మణ్యే వాదికారస్తే...ని ఫాలో అవుతాను. మీ పార్టీలో వాళ్లకి డ్రెస్ కోడ్ పెట్టాలన్నది ఎవరి ఆలోచన? మదర్ థెరిస్సాగారు ఏదీ ఆశించకుండా సేవ చేశారు. కానీ డబ్బులు తీసుకొని వీళ్లు చేసింది సేవ ఎలా అవుతుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. నాయకులు ‘లీడర్స్’ అంటే వాళ్ల ఇంటి నుంచి డబ్బులు తెచ్చి ఫ్లై ఓవర్, రోడ్స్ కట్టలేదు. జనం డబ్బు అది. నో సర్వీస్.. నో లీడర్స్. అక్కడున్నది ఓన్లీ వర్కర్స్ మాత్రమే. అందుకే ఖాకీ పెట్టాం. మీరు ప్రచారానికి ఖాకీ డ్రెస్‌లోనే వెళ్లారా? లేదు. నేను ఎంపీగా పోటీ చేయలేదు కాబట్టి ప్రస్తుతానికి నేను రాజా (నవ్వుతూ). ఎమ్మెల్యేగా గెలిచాక వర్కర్ని అవుతాను. పాలిటిక్స్‌ను మారుద్దాం అనుకున్నవాళ్లల్లో చాలామందిని పాలిటిక్స్ మార్చేస్తుందని, పొల్యూట్ చేస్తుందని అంటుంటారు. మీరు అలా పొల్యూట్ అయిపోతారన్నది కొందరి ఊహ? ఇక్కడ ఒక మాట చెప్పనా.. ‘ఏ ఫర్ అంటే యాపిల్’ అని మనల్ని ట్రైన్ చేశారు. అలా కాకుండా ఏ ఫర్ ఏంటి? అని మీ అంతట మీరు ఆలోచించండి చెప్పండి అంటే అమెరికా అనో అంటార్కిటికా అనో చెప్పేవాళ్లు. ఇప్పుడు 20 పర్సంట్, 80 పర్సంట్ సైకాలజీ గురించి వివరిస్తాను. మన దగ్గర 20 శాతం మందిమి మాత్రమే మాట్లాడతాం. మిగిలిన 80 శాతం మందికి వాయిస్ లేదు. ఆ 20 శాతం మంది రాజకీయాలంటే ఇలా ఉంటాయి, ఇక్కడికి రాకూడదు అని 72 ఏళ్లుగా చెప్పినదే చెప్పీ చెప్పీ ఓ అభిప్రాయాన్ని రుద్దేశారు. రాజకీయాలు డబ్బులు ఉండేవాళ్లవి అని మన బ్రెయిన్‌కు ఫీడ్ చేశారు. పొల్యూట్ అయిపోతారనే భావనను కూడా బలపరిచారు. నేను ఓ కొత్త ప్రయత్నం చేయడానికి వచ్చాను. నిజాయితీగా మాట్లాడుతున్నాను. ఏమవుతుందో చూద్దాం. సినిమాల్లోంచి వచ్చిన వారిలో తెలుగు నాట ఎన్టీఆర్, తమిళంలో ఎంజీఆర్, జయలలిత సీఎంలుగా రూల్ చేశారు. భవిష్యత్తులో మీరు కన్నడ రాష్ట్రాన్ని రూల్ చేస్తారని అనుకుంటున్నారా? లేదు. నేను ఇక్కడ రూల్ చేయడానికి రాలేదు. మీరు (ప్రజలు) రూల్ చేయండి అని చెప్పడానికి వస్తున్నాను. నేను చేసేది రాజకీయం కాదు, ప్రజాకీయం. మీరు (ప్రజలు) కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఒక్కరోజు ప్రజాస్వామ్యం మనకు వద్దు. స్విట్జర్లాండ్‌లో జనాల అభిప్రాయాలు తీసుకుంటారు. అక్కడ అన్నీ పారదర్శకంగా జరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా జీతానికి పని చేస్తున్న వర్కర్లా చేస్తారు. ఇక్కడ కూడా నాతో సహా ఒక వర్కర్లా మారిపోవాలి. వర్క్ చేయాలి. అన్నీ పారదర్శకంగా జరగాలి. ఓటర్స్ కూడా ఇందులో భాగం అవ్వాలి. నేను చేయబోయేది రెగ్యులర్ పాలిటిక్స్ కాదు. అసలెందుకు పాలిటిక్స్‌లోకి రావాలనుకున్నారు? జనాలకు మంచి చేయాలని కాదు. నేనో సిటిజన్ని. బాధ్యత గల పౌరుడిగా నా సొసైటీని బాగు చేయాలని వస్తున్నాను. అది పొలిటికల్ పార్టీ పెట్టకుండా కుదరదా? పవర్ కావాలా? ఇది ఒక మైండ్‌సెట్. ఇందాక ‘ఏ ఫర్ యాపిల్’ కథ చెప్పాను కదా. ఇది కూడా అలాంటిదే. మనం ఎలా ఆలోచించాలో నిర్ధేశించేశారు. అలాగే పాలిటిక్స్ అనేది సోషల్ వర్క్ కాదని డిసైడ్ చేసేశారు. మరి రాజకీయాలంటే ఏంటి? వ్యాపారమా? ఇది సమాజ సేవ కాదా? నేను సోషల్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సోషల్ వర్క్ అంటే ఏదో ఊళ్లో బస్టాండ్ కట్టించుకో, నీళ్ల ట్యాంక్ కట్టించుకో అంటున్నారు లేదా ఊరినే అడాప్ట్ చేసుకో అంటున్నారు. అసలు రాజకీయం అంటేనే సోషల్ వర్క్ కదా. మనం అందరం ట్యాక్స్ కడుతున్నాం. మీరు ట్యాక్స్ రూపంలో ఖర్చు చేసిన డబ్బుని మళ్లీ మీకు ఎలా ఉపయోగపడేలా చేయాలనేది మెయిన్ ఎజెండ్ అవ్వాలి. నా లక్ష్యం అదే. దీనివల్ల యంగ్‌స్టర్స్ వస్తారు. విద్యావేత్తలు, అట్టే చదువుకోనివాళ్లు.. ఇలా అందరూ సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి వస్తే అందరం కలసి అద్భుతాలు సృష్టించవచ్చు. సినిమా, పాలిటిక్స్ రెండు పడవల ప్రయాణమా? ఇది ఇంకో మైండ్‌సెట్. మీరు వస్తే పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రావాలి, అప్పుడప్పుడు వచ్చి పోతే కష్టం అని అంటుంటారు. నేను బతకడానికి సినిమాలు చేయాలి. దాంతోపాటు రాజకీయాలకు ఓ టైమ్ కేటాయిస్తాను. సినిమాలు చేసుకుంటూ, ఇక్కడ ఏదైనా పని ఉందంటే వచ్చి పూర్తి చేస్తాను. ప్రజాకీయాల్లో నాకు పని కలిపిస్తే నేను పూర్తి స్థాయిలో రావొచ్చు. కానీ ఇంకా నాకు ఓట్ వేయలేదు. నేను పవర్లోకి రాలేదు. అప్పుడే సినిమాలు మానేస్తా అనకూడదు. నా ఇండస్ట్రీలో నేను కింగ్ అయ్యుండొచ్చు. రూలింగ్‌లోకి వచ్చాక వర్కర్ని. కానీ ప్రస్తుతం మాత్రం గెలిచే వరకూ వర్కర్లా ఉండి గెలిచాక నాయకుడు అయిపోతున్నాడు. ఓట్ వేసిన తర్వాత వర్కర్ అనే ‘మైండ్‌సైట్’ పోకూడదు. ఓకే.. ‘ఐ లవ్ యూ’ అనే టైటిల్‌తో.. ‘నన్నే ప్రేమించు’ అనే ట్యాగ్‌లైన్‌తో త్వరలో స్క్రీన్ మీదకు రానున్నారు... మీ కాలేజ్ రోజుల్లో ఎవరితో అయినా ‘నన్నే ప్రేమించు’ అని చెప్పారా? (పెద్దగా నవ్వుతూ). ప్రేమను చెప్పడానికే భయపడేవాణ్ణి. ఇక ప్రేమించు అని చెబితే ఎక్కడ అపార్థం చేసుకుంటుందో, స్నేహం ఎక్కడ కట్ అవుతుందో అని భయపడేవాణ్ణి. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో సునాయాసంగా నటించేస్తాను. రియల్ లవ్‌లో మన లోపల చాలా భయం ఉంటుంది. ఒకవేళ లవ్ ఎక్స్‌ప్రెస్ చేశాక తను మాట్లాడకపోతే? దూరం పెడితే? డిజప్పాయింట్ అయిపోతాను. యంగ్ ఏజ్‌లో ఒక అట్రాక్షన్ ఉంటుంది. అందులో దురుద్దేశాలేమీ ఉండవు. ఆ ప్రేమలో నిజాయతీ ఉంటుంది. కానీ చెప్పేంత ధైర్యం ఉండేది కాదు. అందుకే చెప్పకుండా నేను కవితలు రాసేవాణ్ణి. మీది లవ్ మ్యారేజే కదా.. ప్రియాంకాగారితో చెప్పడానికి ఎలా ధైర్యం వచ్చింది? ఇక తను లేకపోతే మన జీవితం లేదు అనేంతగా ప్రేమించేశాను. ఆ ప్రేమే నాకు ధైర్యం ఇచ్చింది. అయినప్పటికీ ‘ప్రేమిస్తున్నాను’ అని ప్రియాంక దగ్గర చెప్పడానికి ఏడాదిన్నర సమయం తీసుకున్నాను. చెప్పాలా వద్దా? అనుకుంటూ చివరికి చెప్పేశా. అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ లాంటి ఇప్పటి బోల్డ్ సినిమాలను 20 ఏళ్ల క్రితమే మీరు తీశారు. ఆ టైమ్‌లో వివాదాలు కూడా ఎదుర్కొన్నారు? మంచి విషయమే చెప్పాంగా! ఎందుకు వివాదం అవుతోంది? అనుకునేవాణ్ణి. అర్థం అయ్యేది కాదు. సమాజానికి చెప్పాల్సిన విషయం చెబితే ఇలా రివర్స్‌గా తీసుకుంటున్నారేంటి? అనే ఫీలింగ్ కలిగేది. సినిమాల్లో నన్ను నేనే తిట్టుకుంటూ మంచి విషయాలు చెప్పేవాణ్ణి. అయితే ఓ 20 ఏళ్ల తర్వాత చెప్పాల్సిన విషయాలను ముందుగానే చెప్పేసరికి షాకయ్యారు. విడిగా నన్ను చూసినవాళ్లూ షాకయ్యారు. నాతో మాట్లాడాక ‘మీరు మీ సినిమాల్లో పాత్రల్లానే ఉంటారేమో? అనుకున్నాం. మరీ ఇంత సాఫ్ట్‌గా ఉన్నారేంటి?’ అని ఆశ్చర్యపోయేవాళ్లు. ‘లేదండీ.. సినిమాల్లో చూపించేవి జస్ట్ నా ఆలోచనలు మాత్రమే’ అనేవాణ్ణి. అప్పట్లో మీరు ‘ఏ’ సినిమాలోనే ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి డిస్కస్ చేశారు. ఆ ఇష్యూ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్. అలాంటివి ఏమైనా సంఘటనలు విని లేదా చూసి ఆ సినిమా తీశారా? ‘మీటూ’ అనేది ఇప్పుడు మొదలైంది కాదు కదా. స్త్రీలను వేధించడం అనేది రాజుల కాలం నుంచీ ఉన్నదే. ‘రేప్’ అన్న పదం ఈనాటిది కాదు. ఎప్పుడో ఉంది. ఎక్కడ పురుషుడు ఉంటాడో అక్కడ స్త్రీకి వేధింపులు తప్పవు. నేను అంటున్నది తప్పుడు మనస్తత్వం ఉన్న పురుషుల గురించి. సినిమా ఇండస్ట్రీ ప్రభావంతో మాత్రమే ‘ఏ’ తీయలేదు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నవాటిని కూడా దృష్టిలో పెట్టుకునే ‘ఏ’ కథ రాశాను. దర్శకుడిగా నా ఆలోచనలను స్క్రీన్ మీద చూపించాను. మంచి విషయం ఏంటంటే ఇప్పుడు అందరూ ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి ఓపెన్ అవుతున్నారు. ఇప్పుడొస్తున్న కొన్ని సినిమాల్లో విచ్చలవిడితనం పెరిగినట్లనిపిస్తోంది. మీ అభిప్రాయం? గుట్టుగా ఉండటం అనేది ఇప్పుడు దాదాపు లేదు. కుతూహలం ఉంటేనే అక్కడ ఏదో ఉందన్న ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా చూడొచ్చు. చూసిన తర్వాత ఇంతేనా అని వదిలేస్తాం. ఏదైనా మోతాదు మించితే ప్రమాదమే. సైన్స్ అనేది మనల్ని సత్య యుగంలోకి తీసుకుపోతోంది. ఇప్పుడు నా భార్యతో నేను ముంబైలో ఉండి హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పడానికి కుదరదు. వీడియోకాల్ చేస్తుంది. ఎక్కడున్నావు చెప్పు అని? ఫ్యూచర్లో అబద్ధం చెప్పలేం. మన రోజుల్లో స్కూల్ బంక్ కొడితే ఓకే. ఇప్పుడు స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది. టెక్నాలజీ మనల్ని నిజం వైపు తీసుకువెళ్తుంది. అయితే అదే టెక్నాలజీ మనుషులను దూరం చేస్తోంది కదా? కాదన్నది నా అభిప్రాయం. ఫ్యూచర్ జనరేషన్ వాళ్లు దూరంగా ఉన్నా ఫేస్ టైమ్‌లో లైవ్‌లో మాట్లాడుకుంటారు. దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మనకు కారు లేదు. ఇప్పుడు చూడండి అందరూ కారులో తిరుగుతున్నారు అనుకుంటే కుదరదు. హల్లో... సాంకేతికాభివృద్ధిని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంటాను. ఇంతకు ముందు ఫ్యామిలీని మిస్ అయ్యేవాళ్లం. ఇప్పుడు ఎక్కడున్నా వీడియోకాల్ చేస్తే చాలు.. భార్యాపిల్లలు హాయిగా మాట్లాడతారు. అప్పట్లో అవుట్డోర్ అంటే.. ఇంటిని మిస్సయినట్లే. ఇప్పుడు వీడియో కాల్ వల్ల మిస్ అయిన ఫీలింగ్ ఉండదు. సో.. టెక్నాలజీ మనుషులను దగ్గర చేస్తోందంటాను. కమ్యూనికేషన్ బాగా పెరిగినప్పటికీ, ఇద్దరు వ్యక్తులు ఒకేచోట ఉన్నా ఎవరి ఫోన్లతో వాళ్లు బిజీగా ఉండటం వల్ల నేరుగా మాట్లాడుకోవడం తగ్గింది కదా? మీరు మొబైల్ లేకుండా ఒక్కరోజుని ఊహించుకోండి. పిచ్చి లేచిపోతుంది. అట్లీస్ట్ ఏదో ఓ దాంట్లో మునిగిపోతారు. భార్య–భర్త, అత్తా–కోడలు ఏదో పనిలో బిజీగా ఉంటారు. గొడవల్లోకి వెళ్లరు కదా (నవ్వుతూ). ఏది జరిగినా మంచి కోసమే. మన ఐడియాలజీని మన కిడ్స్ మీద రుద్దుతూ ఉంటాం. అది తప్పు ఇది తప్పు అని. నిజమేంటంటే వాళ్ల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. అలాగే పిల్లలకు కష్టం నేర్పాలి. ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపో, లేదంటే మరోలా సెటిల్ అయిపో అని చెబుతుంటాం. నేను చాలా కష్టపడి బైక్ కొనుక్కున్నాను. ఆ బైక్ నడిపే కిక్ ఎలా ఉంటుంది? కానీ ఆ హ్యాపీనెస్‌ని మనం కష్టం తెలియకుండానే మనం మన పిల్లలకు ఇచ్చేస్తాం. ఆ హ్యాపీనెస్ సులువుగా లభిస్తుంటే కష్టపడకుండా కొత్త కొత్త అలవాట్లు అలవాటు చేసుకునే అవకాశం ఉంది. రేపు వాళ్లు కూడా నేనింత కష్టపడి ఇది సొంతం చేసుకున్నాను అని ఫీల్ అవ్వాలి. కానీ మీ పిల్లలు హైఫై లైఫే లీడ్ చేస్తుంటారు కదా? కొన్నిసార్లు మనం అనుకున్నది కుదరకపోవచ్చు. అవును.. వాళ్లు కంఫర్ట్బుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కానీ వాళ్లకు ప్రైవసీ అనేది ఉండదు కదా. బయటకు ఎక్కువగా రాలేరు. అవన్నీ వాళ్లు మిస్ అవుతారు. కొన్ని విషయాలను యాక్సెప్ట్ చేయాలి. ఫైనల్లీ... ఒకప్పుడు మీరు బాగా డబ్బులు సంపాదించాలని వచ్చుంటారు. ఇప్పుడు డబ్బు, ఫేమ్ ట్రాష్ అనిపించిన సందర్భాలేమైనా ఉన్నాయా? నేను డబ్బు సంపాదించాలని రాలేదు. డబ్బులు సంపాదించాలనుకుంటే డబ్బులు సంపాదించలేం. నేను బతకాలని వచ్చాను. నాకు ఎవరైనా భోజనం పెడితే అదే నా హ్యాపీనెస్. జీరో నుంచి స్టార్ట్ చేస్తే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవరైనా అపాయింట్మెంట్ ఇస్తే సంతోషం. నేను రాసింది వింటే ఇంకో రేంజ్ హ్యాపీనెస్. అదే నేను రాసింది తీసుకుంటే మహానందం. డబ్బు కూడా ఇస్తే అయ్యో... ఇంక చెప్పలేను. ఆనందం.. ఆనందం.. జీరోలో ఉంటే ఎన్ని కిక్కులో చూడండి. అదే మా నాన్న బాగా ధనవంతుడు అయితే... నేను రాసిందానికి ఐదొందలే ఇస్తారా? ఏంట్రా నా వేల్యూ తెలుసా నీకు? అనుకుంటాను. నటుడు అర్జున్ తనను వేధించాడంటూ కథానాయిక శ్రుతీ హరిహరన్ ఆరోపించారు. ఈ ఇద్దరితో మీకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఏమనిపించింది? నాకు ఇద్దరి గురించి బాగా తెలుసు. శ్రుతి ఆరోపణలు విన్నప్పుడు మైండ్ బ్లాంక్ అయింది. అర్జున్ అలా చేస్తాడని ఊహించలేను. శ్రుతి అన్నా నాకు నమ్మకమే. ఇలాంటి పరిస్థితిలో మనకేమీ అర్థం కాదు. నేను అలానే అయ్యాను. ఆ ఇష్యూ మీద చాలా గొడవ జరిగింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరూ మాట్లాడటం లేదు. ఒకప్పుడు బతుకు తెరవు కోసం ‘పేపర్ కవర్స్’ తయారు చేసేవారు. ఇప్పుడు కోటీశ్వరుడు. డబ్బు, పేరు ఉన్నాయి. ఇంకా ఏదైనా అచీవ్ చేయాలని ఉందా? నేను అచీవ్ చేయాల్సింది ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. నేను ఇక్కడ వరకూ వచ్చింది ‘ప్రజాకీయ పార్టీ’ పెట్టి, రాజకీయాల్లోకి రావడానికే అనుకుంటున్నాను. ఇంత ఎత్తుకి ఎదగడానికి ‘జీరో’ నుంచి మొదలయ్యాను. ఇప్పుడు పాలిటిక్స్‌లో జీరో నుంచి మొదలవుతున్నాను. ‘క్యాష్‌లెస్’ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నా. జీరో నుంచి మొదలుపెడితే ప్యూర్‌గా ఉంటుంది. డి.జి. భవాని -
సిరిసేన పార్టీతో రాజపక్స తెగదెంపులు
కొలంబో: శ్రీలంకలో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహింద రాజపక్స(72) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు హ్యాండిచ్చారు. సిరిసేనకు చెందిన శ్రీలంక ఫ్రీడం పార్టీ(ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ)తో తన 50 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకుని కొత్తగా ఏర్పాటైన శ్రీలంక పీపుల్స్ పార్టీలో చేరారు. గత ఏడాది ఏర్పాటైన ఈ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అనూహ్యంగా మూడింట రెండొంతుల స్థానాలను గెలుచుకుంది. ఆదివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో రాజపక్స ఎస్ఎల్పీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంతో జనవరి 5న జరిగే ఎన్నికల్లో రాజపక్స ఎస్ఎల్పీపీ నుంచి బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. సిరిసేన ఉత్తర్వులను అమలు చేయొద్దు చట్ట సభ్యుల అధికారాలను హస్తగతం చేసుకున్న అధ్యక్షుడు సిరిసేన జారీ చేసే ఎలాంటి ఉత్తర్వులను కూడా అమలు చేయవద్దని పార్లమెంట్ స్పీకర్ కరు జయసూర్య అధికార యంత్రాంగాన్ని కోరారు. -
ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ
-
శివపాల్ సింగ్ యాదవ్ కొత్త పార్టీ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ అసమ్మతిదారుడిగా పేరొందిన శివపాల్ సింగ్ యాదవ్ మంగళవారం కొత్త పార్టీని ప్రకటించారు.ఆగస్టులోనే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో మనస్పర్థల కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరును ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ లోహియాగా రిజిస్ట్రేషన్ చేయించారు. లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలనుంచి పోటీచేస్తుందని చెప్పారు. -
శశికళ సోదరుడి సొంత పార్టీ.. ‘ఏడీకే’
మన్నార్గుడి: ఏఐఏడీఎంకే బహిష్కృత నేత వి.కె.శశికళ కుటుంబం నుంచి మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. శశికళ సోదరుడు వి.దివాకరన్ ఆదివారం కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. ఇప్పటికే శశికళ కుటుంబానికి చెందిన ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎంఎంకే) పార్టీని స్థాపించారు. దినకరన్‌పై తీవ్ర విమర్శలు చేసిన దివాకరన్‌కు గత నెలలో శశికళ లీగల్ నోటీసులిచ్చారు. బహిరంగ సభల్లో తన పేరు వాడుకోరాదని అందులో హెచ్చరించారు. శశికళను ప్రస్తావించాల్సినప్పుడు సోదరిగా చెప్పుకోబోననీ, ‘తన మాజీ సోదరి’అని మాత్రమే అంటానని దివాకరన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆయన ‘అన్న ద్రవిడార్ కళగం (ఏడీకే)’పార్టీని ఏర్పాటు చేశారు. ‘అన్నా’అని అందరూ పిలుచుకునే ద్రవిడ నేత సీఎన్ అన్నాదురై పేరుతో ఈ పార్టీని స్థాపించినట్లు ప్రకటించారు. -
తమిళనాడులో మరో కొత్త పార్టీ
చెన్నై : తమిళనాడులో కొత్త పార్టీలకు కొదవలేకుండా పోతుంది. తాజాగా శశికళ సోదరుడు దివాకరన్ కొత్త రాజకీయా పార్టీని స్థాపించారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బయటికిచ్చిన శశికళ వర్గం నాయకుడు దినకరన్ పెట్టిన అమ్మ మక్కల్ మున్నెట్రా కదగజం పార్టీలో ఉన్న దివాకరన్ ఇప్పుడు ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని ‘అమ్మ అని’ అనగా ‘అమ్మ జట్టు’ అనే కొత్త పార్టీని నెలకొల్పారు. తెలుపు, నలుపు, ఎరుపు, మధ్యలో ఆకుపచ్చ వర్ణాలతో పార్టీ జెండాను ఆదివారం చెన్నైలో ఆవిష్కరించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం అనంతరం తమిళనాడలో ఇప్పటికే దినకరన్, ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌లు కొత్త పార్టీలను స్థాపించిన సంగతి తెలిసిందే. అలాగే గతంతో జయలలిత మేనకోడలు దీప కూడా ఎంజీఆర్ అమ్మ దీప పేరవాయి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సుపర్‌స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పడతానని ప్రకటించారు. కేవలం జయ మరణం కారణంగానే తమిళనాడులో ఇన్ని రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. -
తెరపైకి బీసీల పార్టీ!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీసీ సామాజిక వర్గాలను ఒకే వేదికపైకి తెచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు బీసీ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పావులు కదుపుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ పార్టీల సిద్ధాంతాలు, జ్యోతిరావు ఫూలే అభివృద్ధి పథకాల కలబోతగా ఆగస్టు రెండో వారంలో బీసీ జన సమితి పేరుతో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, వేదికపై పార్టీని ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి తదితర నేతలను ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గద్దర్, కృష్ణమాదిగ మద్దతు ఇటీవల కేంద్ర నిఘా విభాగం చేసిన ఓ సర్వేలో తెలుగు రాష్ట్రాల్లో ఆర్.కృష్ణయ్యకు వ్యక్తిగతంగా 35 శాతం ప్రజా మద్దతు వచ్చినట్లు తెలిసింది. బీసీ యువత, ఉద్యోగులు, విద్యార్థులు 75 శాతం మంది విశ్వాసం ప్రకటించినట్లు సర్వే తేల్చడంతో ఆయన కొత్త పార్టీ ఏర్పాటుకు ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతోపాటు, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని బీసీ నేతలతో ప్రాథమికంగా చర్చించిన ఆర్.కృష్ణయ్య వారి మద్దతు కూడగట్టినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాన్షీరాం ఎజెండాతోపాటు బీసీల అభివృద్ధి కోసం జ్యోతిరావు ఫూలే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధ్యయనం చేసే బాధ్యత ఉస్మానియా, కాకతీయ, పాలమూరు యూనివర్సిటీల్లోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్లకు అప్పగించినట్టు తెలిసింది. దీనిపై అధ్యయనం చేసిన అనంతరం వారిచ్చే సలహాలు, సూచనలతో బీసీ జన సమితి ఎజెండాను రూపొందించాలని నిర్ణయించారు. పంచకులాలే కీలకం.. తెలంగాణతోపాటు ఏపీలో కూడా ముదిరాజులు, మున్నూరుకాపు, గొల్లకుర్మ, గౌడ, పద్మశాలి సామాజిక వర్గాలు బలంగా ఉండటంతో ఈ పంచకులాలపైనే కృష్ణయ్య ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల విజయవాడలో 80 కుల సంఘాలతో నిర్వహించిన బీసీ సదస్సులో.. ఎవరు ఎంత మంది ఉన్నారో వారికి అన్ని సీట్లు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బీసీ జేఏసీని ఏర్పాటు చేసి రమణబాబు అనే పారిశ్రామిక వేత్తను దానికి చైర్మన్‌గా ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు బీసీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని, బీసీలకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు పెంచలేదని, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎన్నికలు వచ్చినా బీసీలకు అవకాశం ఇవ్వలేదని, అందువల్ల ఆయన్ను బీసీ వ్యతిరేకిగానే పరిగణించాలని సదస్సు అభిప్రాయపడింది. తెలంగాణలోనూ బీసీ వ్యతిరేక పాలన నడుస్తోందని, త్వరలోనే ఇక్కడా బీసీ జేఏసీ ఏర్పాటు చేస్తామని కృష్ణయ్య సన్నిహితులంటున్నారు. -
పార్టీపై నిర్ణయం తీసుకోలేదు: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్ : బీసీల హక్కుల సాధనకు రాజకీయ వేదిక అవసరమని, అయితే పార్టీ ఏర్పాటుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...బీసీలలో ఉన్న మేధావులు, కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్తు కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోందని విలేకరులు ప్రశ్నించగా తనను రావాలని అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయని ఇటీవల కాంగ్రెస్ పెద్దలు కూడా తనతో చర్చించారని, కానీ తాను ఏ పార్టీలోనూ చేరబోనని అన్నారు. -
పాలకుల మార్పు కాకుండా.. పాలనలో మార్పు రావాలి
-
‘కొందరి తెలంగాణ కాదు.. అందరి తెలంగాణ కావాలి’
సాక్షి, హైదరాబాద్ : బతుకు దెరువు తెలంగాణ కావాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభలో ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకు దెరువు కోసం తెలంగాణ కావాలని, కొందరి తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలన్నారు. ప్రస్తుత పాలకులు ఉద్యమ ఆకాంక్షలను అటకెక్కించారని, పాలకుల మార్పు కాకుండా.. పాలనలో మార్పు రావాలన్నారు. ప్రజలు కేంద్రంగా గల తెలంగాణ కావాలని, తెలంగాణ జనసమితి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా కోదండరాం పేరును ఆ పార్టీ నేతలు చంద్రశేఖర్, జీపీ రెడ్డిలు ప్రతిపాదించగా.. ఆయన ఎన్నికను నేతలు, కార్యకర్తలు ఆమోదించారు. ఈ వేదికపై తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూర్చున్నారు. ఈ ఆవిర్భావ సభకు విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫ్రోఫెసర్ హరగోపాల్ సైతం హాజరయ్యారు. -
ప్రధాన వేదికపై వెయ్యిమంది..
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ సభ ఆదివారం సాయంత్రం సరూర్‌నగర్ స్టేడియంలో జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై వెయ్యిమంది కూర్చునేవిధంగా ఏర్పాటు చేశారు. తొలివరుసలో అన్ని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థులు కూర్చోనున్నారు. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న అమరుల కుటుంబసభ్యులు, బలవన్మరణాలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులు కూడా వేదికపై కూర్చోనున్నారు. ఈ సభలో పార్టీ అధినేత కోదండరాంతోపాటు హరగోపాల్, నాగేశ్వర్ ప్రసంగించనున్నారు. -
తెలంగాణలో కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
-
తెలంగాణలో కొత్త పార్టీ ఆవశ్యం
మంచిర్యాలక్రైం : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నేరవేర్చుటకు రాష్ట్రంలో ఓ కొత్త పార్టీ ఏర్పాటు అవశ్యకత ఉందని టీజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి గురిజాల రవీందర్రావు అన్నారు. మంచిర్యాలలోని టీజేఏసీ పార్టీ కార్యాలయంలో సోమవారం కోదండరామ్ పార్టీ అవిర్భావ సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రం సాధించుకున్న తర్వాత తిరిగి పాత కథే పునరావృత్తం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరంకుశ, దొరల, కుటుంబ పాలనకు తెరలేపారని విమర్శించారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమద్రోహులకు పదవులు అంటగట్టడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని విమర్శించారు. రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోíషించిన కోదండరామ్ నేతృత్వంలో ఏర్పడుతున్న పార్టీకి ప్రజలందరు మద్దతు పలకాలని కోరారు. అనంతరం మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సమన్వయ కమిటీలను నియమించారు. సమన్వయ కమిటీ సభ్యులు... మంచిర్యాల జిల్లా సమన్వయ కమిటీ సభ్యులుగా బాబన్న, సంజీవ్, శ్యాంసుందర్‌రెడ్డి, ఎండీ.ఫయాజ్, చంద్రశేఖర్, పరంధాంకుమార్, ఇబ్రహీం, మనోహర్, లక్ష్మి, మద్దెల భవాని, రవికుమార్, రమేష్, పెరుగు రవీందర్, ఎర్రబెల్లి రాజేష్, రాజన్న, రాజునాయక్, రాజు, రమణాచారి, ప్రవీణ్‌కుమార్‌లను నియమించారు. -
నా వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడు
-
ఆ ఆరోపణలను తోసిపుచ్చిన రజనీకాంత్
సాక్షి, చెన్నై : తమిళ ఉగాది ఏప్రిల్ 14న తాను రాజకీయ పార్టీ, జెండా ప్రకటించడం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తమిళనాడులో మత సామరస్యానికి ఎవరూ భంగం కలిగించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. విగ్రహాల ధ్వంసం, వీహెచ్‌పీ రథయాత్రలపై స్పందించిన రజనీకాంత్ పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ఖండించారు. రామ రాజ్య రథయాత్రతో మత విద్వేషాలు చెలరేగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు. తమిళనాడు ప్రశాంతతకు మారు పేరని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఇక తన రాజకీయ ప్రవేశం వెనక బీజేపీ ఉందంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలను రజనీ తోసిపుచ్చారు. తన వెనుక దేవుడు మాత్రమే ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు. రెండు వారాల పాటు ఆధ్యాత్మిక పర్యటన అనంతరం రజనీకాంత్ మళ్లీ చెన్నైకి చేరుకున్నారు. తన హిమాలయాల పర్యటన ప్రశాంతంగా జరిగిందని, కొత్త శక్తినిచ్చిందని రజనీ పేర్కొన్నారు. ఇక తనపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించనని ఆయన తెలిపారు. -
14న రజనీకాంత్ పార్టీ ఆవిర్భావం
-
14న రజనీకాంత్ పార్టీ ఆవిర్భావం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ పేరును ఏప్రిల్ 14వ తేదీ తమిళ ఉగాది నాడు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పార్టీలో 35 ఏళ్ల లోపు యువతకు ప్రాధాన్యమిచ్చేలా వివిధ విభాగాల ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏ పార్టీతో పొత్తు లేకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు రజనీ ఇప్పటికే ప్రకటించారు. ‘రజనీ మక్కల్ మంద్రం’ పేరుతో సభ్యత్వ నమోదు, జిల్లా ఇన్చార్జీల నియామకం సాగుతోంది. పార్టీ అనుబంధ యువజన విభాగంలో 35 ఏళ్ల లోపువారికి మాత్రమే స్థానం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శులుగా రాజు మహాలింగం, సుధాకర్ పేర్లు ఖరారయ్యాయి. పార్టీ జిల్లా విభాగాలకు అధ్యక్షులు బదులు కార్యదర్శులు మాత్రమే ఉంటారు. కార్యదర్శి కింద ఇద్దరు సహాయ కార్యదర్శులు, ముగ్గురు సంయుక్త కార్యదర్శులను నియమిస్తారు. అలాగే, యువజన, మహిళ, వాణిజ్య, మత్స్య, న్యాయ, వ్యవసాయ విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెలాఖరులోగా ఈ ఆరు అనుబంధ విభాగాల నియామకాలు పూర్తి చేయాలని రజనీ భావిస్తున్నారు. హిమాలయాల్లో ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని త్వరలో చెన్నైకి రానున్న రజనీ, ఏప్రిల్ 14న తమిళ ఉగాది సందర్భంగా పార్టీ ఆవిర్భావ ప్రకటన చేస్తారని విశ్వసనీయ సమాచారం. ఇలా ఉండగా, సినీ పరిశ్రమలో స్నేహితులైన రజనీ, కమల్ల రాజకీయ ప్రవేశం తనకు ఎంతో సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికల్లో ఇద్దరి తరఫునా ఎన్నికల ప్రచారం చేస్తానని దివంగత శివాజీ గణేశన్ కుమారుడు, నటుడు ప్రభు శుక్రవారం వేలూరులో ప్రకటించారు. -
‘మక్కళ్ నీది మయ్యం’
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ బుధవారం మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. అలాగే, ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్లుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తరువాత మరొకటి ఉండేలా చిత్రించారు. ఆ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగం సందర్భంగా కమల్ వివరించడం విశేషం. దక్షిణ తమిళనాడులోని మదురైలో నిర్వహించిన ఈ భారీ బహిరంగసభకు కమల్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా.. తాను ప్రజల చేతుల్లోని ఆయుధాన్నని అభివర్ణించుకున్న కమల్.. పార్టీ ఏర్పాటు ప్రజాపాలనకు తొలి అడుగని, ఇక్కడున్న ప్రజాసమూహంలోని ప్రతీ ఒక్కరూ నాయకులేనని స్పష్టం చేశారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలను, వివాదాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నేను మీకు సలహాలు ఇచ్చే నాయకుడిని కాను. మీ సలహాలు వినే కార్యకర్తను’ అని వేదికపై కమల్ చెప్పడంతో ప్రజలంతా చప్పట్లు, ఈలలు, కేరింతలతో కొత్త పార్టీకి స్వాగతం పలికారు. వృత్తి కాదు.. నీతి ముఖ్యం! రాజకీయాల్లో చేరేందుకు వృత్తి ఏమిటనేది ముఖ్యం కాదని, నీతి, నిజాయితీ, సత్యం, ఉద్వేగం వంటి సుగుణాలు కలిగి ఉన్నవారంతా రాజకీయ రంగ ప్రవేశానికి అర్హులేనని కమల్ చెప్పారు. ‘తమిళనాడు ప్రజలు ఇంకా ఎన్నాళ్లు అవినీతి పాలనలను భరించాలి.. మూగవారిగా కలలు కంటూ కాలం గడపాలి? ఈ రాష్ట్రంలో డబ్బుకు కొదవ లేదు. మంచి మనుషులకే కొరత ఉంది. నేను నాయకుడిని కాదు. మీ సేవకుడిని. ఓటుకు ఆరువేలు ఇచ్చి నష్టపోతున్నామని నేతలంటున్నారు. నేను డబ్బులిచ్చి ఓటు అడగను. ఇన్నాళ్లు ప్రజలు ఓటును అమ్ముకుని మోసపోయారు. మంచి పార్టీకి ఓటేస్తే ఏడాదికి ఆరు లక్షలు సంపాదించుకునే స్తోమత కలుగుతుంది. ఇన్నాళ్లు కావేరి జలాల సమస్యపై నేతలు ఇల్లు కాలుతుంటే బీడి వెలిగించుకున్నట్లుగా వ్యవహరించారు. కర్ణాటక నుంచి నీరు కాదు ప్రజలు తమిళనాడు కోసం రక్తదానం చేసేందుకు సిద్ధం చేస్తాను. మనకు మంచి భవిష్యత్తు ఉంది. నటుడిగా మీ వల్ల సంపాదించాను. ఇందుకు కృతజ్ఞతగా ప్రజలకు ఏమి చేశానని ఆలోచించాను. నాలో తప్పు చేశానన్న భావన కలిగింది. అందువల్లే రాజకీయపార్టీని స్థాపించడం ద్వారా తమిళనాడు ప్రజల రుణం తీర్చుకోవాలని సంకల్పించాను. ప్రజా సేవకుడిగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేకుంటే మరొకరికి సారథ్యం అప్పగిస్తానే గాని పదవులను పట్టుకుని ఊగిసలాడను. అవినీతి నిర్మూలనకు ప్రజలు నాతో పాటు కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది. నేను అధికారంలోకి వస్తే ప్రజలకు క్వార్టర్ బాటిల్, స్కూటర్లు ఉచితంగా ఇవ్వను. స్కూటర్లు కొనుక్కునే స్తోమతకు ప్రజలను తీసుకుని వస్తాను. ఇన్నాళ్లు ఏలిన వారు ప్రజలకు చేసింది శూన్యం. అందుకే నేను రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది’ అని కమల్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో మంగళవారం రాత్రి తాను మాట్లాడాననీ, విధానాలను ప్రకటించడం కంటే ప్రజాసంక్షేమ కార్యక్రమాల జాబితాను తయారుచేసుకోవాల్సిందిగా తనకు చంద్రబాబు సూచించారని కమల్ చెప్పారు. రామేశ్వరం నుంచి ప్రారంభం.. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఇంటిని సందర్శించి కమల్ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. కలాం దేశభక్తి, ఆశయాలకు తాను ముగ్దుడినయ్యాననీ, ఆయనే తనకు మార్గదర్శకుడు, స్ఫూర్తి ప్రదాత అని కమల్ కొనియాడారు. శతాధిక వృద్ధుడైన కలాం అన్న మహమ్మద్ ముత్తుమీరన్ లెబ్బై మరైక్కయార్ను కమల్ కలసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఓ ట్వీట్ చేస్తూ ‘నిరాడంబరత నుంచే గొప్పతనం వస్తుంది. గొప్ప వ్యక్తికి చెందిన చిన్న ఇంటి నుంచి నా ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. నిజ జీవితపు హీరో కమల్: కేజ్రీవాల్ కమల్ నిజాయితీ గల, నిజ జీవితపు హీరో అని కేజ్రీవాల్ ప్రశంసించారు. డీఎంకే, ఏడీఎంకేలు అవినీతి పార్టీలనీ, నిజాయితీ ఉన్న పార్టీకి ఓటేసే అవకాశం ఇప్పుడు తమిళనాడు ప్రజలకు లభించిందని కేజ్రీవాల్ అన్నారు. కమల్ రాజకీయ అరంగేట్రాన్ని కేరళ సీఎం విజయన్ ఓ ప్రకటనలో స్వాగతించారు. లౌకికత్వం, ప్రజాస్వామ్యం, బహుళత్వ సమాజాన్ని కమల్ పార్టీ గౌరవిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి మవురియా, నటి శ్రీప్రియ మంగళవారం రాత్రి కమల్పార్టీలో చేరారు. కాగితపు పువ్వు కమల్: డీఎంకే, ఏడీఎంకే కమల్, రజినీలు సువానస వెదజల్లలేని కాగితపు పువ్వులని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ అన్నారు. స్టాలిన్ వ్యాఖ్యలపై కమల్ స్పందిస్తూ వాడిపోవడానికి తాను పువ్వును కాదనీ, చెట్టుగా ఎదిగే విత్తనాన్నని బదులిచ్చారు. దీనిపై జయకుమార్ మాట్లాడుతూ కమల్ జన్యుపరంగా మార్పులు చేసిన విత్తనమనీ, ఎవ్వరికీ ఉపయోగం లేదనీ, భారత్‌లో దాన్ని వాడరని అన్నారు. పార్టీ, పతాకం మక్కల్ నీది మయ్యంలో మయ్యం అంటే కేంద్రం...మధ్యస్థానం.ప్రజలకు సమపాలన అందించే త్రాసులోని ముల్లు వంటిది. పతాకంలోని ఆరు చేతులూ ఆరు రాష్ట్రాలు, దక్షిణ భారతావనికే కొత్త మ్యాపు ఇది’ అని కమల్ అభివర్ణించారు. మధ్యలో ఉన్న నక్షత్రం రాష్ట్ర ప్రజలని వివరించారు. మేనిఫెస్టో ‘నాణ్యమైన విద్య, అవినీతి రహిత పాలన, నిరుద్యోగ నిర్మూలన, కోతలు లేని విద్యుత్ నా రాజకీయలక్ష్యాల’ని కమల్ పేర్కొన్నారు. బాల నటుడిగా ప్రారంభించి.. ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో కొనసాగి ఎన్నో అద్భుత విజయాలను, జాతీయ పురస్కారాలను అందుకున్న కమల్ తాజాగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1954లో జన్మించిన కమల్ 1960లో ‘కాళత్తూర్ కణ్నమ్మ’ చిత్రంలో ఒక అనాథ బాలుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం కొద్దికాలం నృత్య సహాకుడిగానూ పనిచేశారు. తర్వాత దర్శకదిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత దివంగత కె.బాలచందర్ దృష్టిని ఆకర్షించిన కమల్.. ఆయనతో దర్శకత్వంలో అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1981లో ‘ఏక్ దూజే కే లియే’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ అరంగేట్రం చేశారు. ఎన్నో శృంగారభరిత, పోరాట చిత్రాల్లో నటించిన ఆయన మగువల మనసును కొల్లగొట్టారు. అయితే 2012–13 సమయంలో ఆయన సినీ పరిశ్రమలో కష్టకాలాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కమల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన విశ్వరూపం చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టి విడుదలకు ఆటంకాలు ఏర్పడటంతో ఓ దశలో ఆయన దేశం విడిచి పోతానని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొలి నుంచి రాజకీయాలకు దూరంగా ఉండిన కమల్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అధికార ఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేలపై ట్వీటర్లో విమర్శలు చేసేవారు. ఏదైనా మాట్లాడాలంటే రాజకీయాల్లోకి రావాలని కొందరు నేతలు అనడంతో అప్పటి నుంచి రాజకీయ రంగ ప్రవేశంపై దృష్టి పెట్టారు. జయలలిత మరణం, డీఎంకే అధినేత కరుణానిధి వృద్ధాప్యం కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొంత రాజకీయ శూన్యం ఏర్పడిన నేపథ్యంలో కమల్ పార్టీ పెట్టడం గమనార్హం. తమిళనాడులో ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చినా, మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి మినహా మిగతా ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. -
కమల్ పార్టీ ప్రధాన ఎజెండా ఏంటంటే...
సాక్షి, చెన్నై : సీనియర్ నటుడు, కమల్ హాసన్ రాజకీయ పార్టీని ప్రకటించేందుకు సిద్ధమైపోయారు. వచ్చే బుధవారం పార్టీ పేరుతోపాటు పలు కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. అయితే తన పార్టీ అసలు ఎజెండా ఏంటో ఇప్పుడు ఆయన వివరించే పనిలో నిమగ్నమయ్యారు. తమిళ వారపత్రిక ఆనంద వికటన్‌లో ఈ మేరకు ఆయన ఓ వ్యాసం రాశారు. ‘రైతన్నల సమస్యల పరిష్కారం- ఆ దిశగా పోరాటం’ తన పార్టీ ప్రధాన ఉద్దేశ్యమని కమల్ ప్రకటించేశాడు. ‘‘తమిళనాడులో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. అభివృద్ధి పేపర్ల మీద తప్ప ఆచరణలో కనిపించటం లేదు. ఇక్కడ అన్నాడీఎంకే ప్రభుత్వం, అక్కడ కేంద్ర ప్రభుత్వం కలిసి రైతాంగాన్ని మోసం చేస్తున్నాయి. ఢిల్లీ నడిబొడ్డున రైతులు దీక్షలు చేసినా.. దేశం మొత్తం చర్చించుకున్నా ప్రభుత్వాల్లో కదలికలు రాలేదు. అందుకే ఆ అంశాన్ని పార్టీ ప్రధాన ఎజెండాగా ఎత్తుకుని ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా’’ అని కమల్ వివరించారు. ఇక అమెరికా పర్యటనలో భారత వ్యాపారవేత్తలతో భేటీ అయిన విషయాలను కూడా ఆయన వెల్లడించారు. ‘తమిళనాడు వ్యవసాయ రంగం గురించి భారత వ్యాపారవేత్తలతో చర్చించా. గ్రామాల అభివృద్ధికి వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అయితే పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారంగానో, విద్యాలయాలకు కేంద్రంగానో భావించవద్దని విజ్ఞప్తి చేశా. అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు’ అని కమల్ వివరించారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాతను, వ్యవసాయాన్ని సజీవంగా సమాధి చేయాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని... అందుకే తన పోరాటాన్ని(రాష్ట్ర పర్యటన) గ్రామాల నుంచే ప్రారంభిస్తున్నానని ఆయన తెలిపారు. తమిళనాడులోని గ్రామాలన్నింటిని స్వర్గధామంగా చూడటమే తన కల అని కమల్ ఆ వ్యాసంలో వెల్లడించారు. -
కొత్త పార్టీ.. కుండబద్ధలు కొట్టేసిన సీనియర్ నేత
సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలు కొట్టేశారు. కాగా, ఈ మధ్యే ఆయన ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను ప్రారంభించి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మీడియా ఆయన్ని ప్రశ్నించింది. ‘‘బీజేపీ సభ్యుడిగా కంటే.. ఒక పౌరుడిగానే నాకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర మంచ్ అనేది నిరుద్యోగులు, రైతుల హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ వేదిక మాత్రమే. అంతేగానీ పార్టీల పేరుతో రాజకీయాలను వెలగబెట్టడానికి కాదు. నేను బీజేపీలోనే ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీని వీడను’’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే తన వ్యవహారం నచ్చక ఒకవేళ బీజేపీ అధిష్ఠానం వేటు వేస్తే సంతోషంగా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అంతేగానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించటం మాత్రం ఆపనని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. ‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఓ జాతీయ పత్రికలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసంతో మొదలైన దుమారం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులకు మద్ధతుగా ఆయన పోరాటానికి దిగటంతో తారాస్థాయికి చేరుకుంది. మరో సీనియర్ నేత, నటుడు శతృఘ్న సిన్హా.. యశ్వంత్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటిస్తూ వస్తున్నారు. -
దినకరన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచెర్రిలో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంజీఆర్ జయంతి వేడుకల నేపథ్యంలో దినకరన్ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నీమధ్యే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలలో ప్రభుత్వం కూలిపోతుందని.. అన్నాడీఎంకే నుంచి బయటకు రావాలంటూ ఆ సందర్భంలో దినకరన్ నేతలకు పిలుపునిచ్చాడు. శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశికళ-దినకరన్ వర్గంపై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది. -
రజనీ పొలిటికల్ ఎంట్రీపై వర్మ కామెంట్!
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. తలైవా రాజకీయాల్లోకి రావడం ‘ఈవెంట్ ఆఫ్ ది సెంచరీ’ అని అభివర్ణించిన వర్మ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రజనీని ఆదర్శంగా తీసుకొని అన్నిస్థానాల్లో పోటీచేయాలని తన ఫేస్బుక్ పేజీలో పేర్కొన్నాడు. ‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఈ శతాబ్దపు అత్యున్నత ఘటన (ఈవెంట్ ఆఫ్‌ది సెంచరీ).. రాజకీయాల్లోకి వస్తున్నట్లు చెప్పే సందర్భంలో రజనీ స్క్రీన్‌పై కనిపించే సూపర్ స్టార్ కన్నా వెయ్యిరెట్లు ప్రభావితంగా కనిపించారు. తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పిన తలైవా ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పీకే(పవన్ కళ్యాణ్) ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలి’ అని వర్మ సూచించాడు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో రజనీ చెప్పారు. -
పార్టీ మూల సూత్రాలు ఇవే..
సాక్షి, చెన్నై: సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఊహాగానాలకు తెరదించారు. తాను స్థాపించబోయే పార్టీ ఎలా ఉంటుందో సూచనప్రాయంగా వెల్లడించారు. సత్యం, కార్యం, అభివృద్ధి (ట్రూత్, వర్క్, గ్రోత్).. తమ పార్టీ మూల సూత్రాలుగా ఉంటాయని అభిమానులతో చెప్పారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే తాను పాలిటిక్స్‌లోకి వస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజాయితీ, జవాబుదారితనం పెంచాల్సిన అవసరముందన్నారు. మీడియా అంటే భయం రాజకీయాలంటే తనకు భయం లేదని మీడియా అంటేనే భయపడతానని తలైవా అన్నారు. ఈ విషయంలో తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. దీని గురించి చో రామస్వామి గతంలో తనను హెచ్చరించారని, ఆయన లేకపోవడం పూడ్చలేని లోటన్నారు. ఆయన ఉండివుంటే తన కొత్త ప్రయాణంలో అండగా నిలిచేవారని పేర్కొన్నారు. వివాదాల్లో చిక్కుకోవద్దు తాను పార్టీ పెట్టే వరకు అభిమానులు ఎటువంటి రాజకీయ విభేదాల్లో చిక్కుకోవద్దని, పార్టీ నిర్మాణంలో పాలుపంచుకోవాలని అభిమానులను రజనీకాంత్ కోరారు. సరైన సమయంలో పార్టీని స్థాపిస్తానని, కలిసికట్టుగా పనిచేసి ముందుకు సాగుదామన్నారు. తలైవా ప్రకటనతో ఫ్యాన్స్ హర్షాతిరేకాలు తెలిపారు. తర్వాత అభిమానులతో రజనీకాంత్ ఫొటోలు దిగారు. బండారం బయట పెడతా పార్టీ పేరు, అభ్యర్థులను ప్రకటించాక రజనీకాంత్ బండారం బయటపెడతానని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యస్వామి అన్నారు. కాగా, రాజకీయాల్లోకి రజనీకాంత్ రావడం వల్ల ఏ పార్టీకి నష్టంలేదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందరరాజన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఆయన పోటీ చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
రజనీ వచ్చేస్తున్నాడు!
-
రజనీ క్లారిటీ.. ఉత్కంఠకు తెర
సాక్షి, చెన్నై: తాను రాజకీయాలోకి రావడం ఖాయమని, కాలమే దీన్ని నిర్ణయించిందని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అన్నారు. అభిమానులతో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రావడం లేదని.. అవన్నీ తనకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయావని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయన్నారు. గెలిస్తే విజయం.. లేదంటే మరణం వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని, పార్టీ ఏర్పాటులో అభిమానులదే కీలకపాత్ర అని రజనీకాంత్ అన్నారు. తనకు కార్యకర్తలు వద్దని, రక్షకులు కావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, తనకు తమిళ ప్రజల దీవెనలు కావాలని అభ్యర్థించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమిళ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని వాపోయారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాడిని అవుతానని అభిప్రాయపడ్డారు. రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలు చేయడం అంత సులువు కాదని, ‘గెలిస్తే విజయం.. లేదంటే మరణం’ అని వ్యాఖ్యానించారు. సమయం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటన అభిమానుల సంబరాలు రాజకీయ ప్రవేశంపై రజనీకాంత్ స్పష్టత ఇవ్వడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బాణాసంచా కాల్చి, పరస్పరం స్వీట్లు పంచుకుని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తలైవా పొలిటికల్ ఎంట్రీతో తమిళ రాజకీయాల్లో మార్పులు వస్తాయని పేర్కొన్నారు. -
అవినీతి రహిత పాలన అందించేందుకే
హైదరాబాద్: అవినీతి రహిత పాలన అందించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తుందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీ పేరును డిసెంబర్ చివరిలోగాని, జనవరిలో గాని ప్రకటిస్తామని, ఆలోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు. దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. నిజాయతీతో పనిచేసే ఏ పార్టీలు వచ్చినా వారితో కలసి పనిచేస్తామన్నారు. అనంతరం గద్దర్ మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాల్లేకుండా జస్టిస్‌గా విధులు నిర్వహించిన చంద్రకుమార్ ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో అరుణోదయా సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, ప్రొఫెసర్ తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, ప్రొఫెసర్ మురళీ మనోహర్, పాశం యాదగిరి, నిర్మల, సౌగరాబేగం పాల్గొన్నారు. పార్టీ తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్తపార్టీ తాత్కాలిక కమిటీని జస్టిస్ చంద్రకుమార్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా జస్టిస్ చంద్రకుమార్, ముఖ్య సలహాదారులుగా తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, ప్రొ.మురళీ మనోహర్, బాల లక్ష్మణ్, ఈశ్వరయ్య, ఏఎల్ మల్లయ్య, ప్రధాన కార్యదర్శులుగా టీవీ రామనర్సయ్య, పి.మోహన్ రాజ్, సాంబశివగౌడ్, పాలె విష్ణు, ఉపాధ్యక్షులుగా ఆకుల భిక్షపతి, నిర్మల, ప్రకాష్, లచ్చన్న, వేదవికాస్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
డిసెంబర్లో కొత్త పార్టీ
కోలారు: డిసెంబర్లో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ వెల్లడించారు. బెగ్లిహసహళ్లి గ్రామ సమీపంలోని తన ఫాం హౌస్‌లో మంగళవారం ఆయన కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. సీఎం సిద్ధరామయ్య, మంత్రి రమేష్కుమార్లు అసలైన కాంగ్రెస్ వాదులు కాదని, వారు జేడీఎస్ నుంచి వలస వచ్చిన వారన్నారు. సీఎం సిద్దరామయ్య మంత్రి రమేష్‌కుమార్ మాటలు విని తనను కాంగ్రెస్ సమావేశానికి హాజరు కావద్దని ఫోన్ చేసి చెప్పారన్నారు. దీని వల్ల తన స్వాభిమానం దెబ్బతిందని అన్నారు. శ్రేయోభిలాషుల సలహా మేరకు నమ్మ కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తున్నట్లు తెలిపారు. తనను కాంగ్రెస్‌లోకి రాకుండా అడ్డుకున్న వారికి వచ్చే ఎన్నికల్లో ఓటర్లే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. వచ్చే ఎన్నికలలో తాను కోలారు నుంచి పోటీ చేస్తానని తెలిపారు. -
నవంబర్ 7న కమల్ హాసన్ పార్టీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన 63వ పుట్టినరోజు అయిన నవంబర్ 7న కొత్త పార్టీని ప్రకటించొచ్చని తమిళనాడు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ ఆయన బుధవారం తన అభిమానులతో సమావేశమయ్యారు. కమల్ పుట్టిన రోజు వేడుకల నిర్వహణ, తాము చేపట్టబోయే సేవా కార్యక్రమాలపైనే చర్చలు జరిగినట్లు కమల్ హాసన్ సంక్షేమ క్లబ్ సీనియర్ సభ్యుడు తంగవేలు చెప్పారు. సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కమల్ సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించినట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, తొందరపాటుతో ప్రభుత్వం, పార్టీ నేతలపై అసభ్యకర రీతిలో విమర్శలు చేయరాదని అభిమాన సంఘాల నేతలకు కమల్ సూచించారు. -
రజనీతో కలిసి రాజకీయాల్లో పని చేస్తా: కమల్
సాక్షి, చెన్నై: కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఆరంగ్రేటంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా అభిమానులను గందరగోళానికి గురి చేస్తుంటే.. మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ మాత్రం తాను రాజకీయాల్లో రావటం ఖాయమనే సంకేతాలను ఇప్పటికే అందించారు. ఈ నేపథ్యంలో గత సాయంత్రం ఓ తమిళ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలనే వెల్లడించారు. ‘త్వరలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నా. రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషం. సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. కీలక సమస్యలపై గతంలో మేం చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయన మా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తా. రజనీతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తా’ అని కమల్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వచ్చే నెలలో తాను హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్ షో పూర్తయిపోయిన వెంటనే రాజకీయ పార్టీపై ప్రకటన చేస్తానని కమల్ ఇది వరకే చెప్పిన విషయం తెలిసిందే. 62 ఏళ్ల ఈ సీనియర్ నటుడు మొదటి నుంచి సామాజిక అంశాలతోపాటు తమిళ రాజకీయాలపై కూడా స్పందిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీ, ప్రస్తుతం ఆ పార్టీలో నెలకొన్న సంక్షోభంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో డీఎంకేతో సానిహిత్యంగా కనిపిస్తూనే.. మరోవైపు తన రంగు కాషాయం కాదంటూ బీజేపీపై కమల్ పరోక్షంగా సెటైర్లు వేశారు కూడా. -
రాజకీయాల్లోకి ఉపేంద్ర
కర్ణాటకలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటన ► పారదర్శక ప్రత్యామ్నాయమే లక్ష్యమని వెల్లడి సాక్షి, బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీనటుడు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు, ‘రియల్ స్టార్’ ఉపేంద్ర తాను త్వరలో కర్ణాటకలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది మొదట్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. ప్రజాసమస్యలను పరిష్కరించే శక్తిసామర్థ్యాలు, ఆలోచనలు ఉన్న వారికి వేదిక కల్పించేందుకు పార్టీని స్థాపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలకు పూర్తి పారదర్శక ప్రత్యామ్నాయాన్ని అందించాలన్నది తన యోచన అని పేర్కొన్నారు. ఆయన శనివారం బెంగళూరులోని రుప్పీస్ రిసార్ట్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఖాకీ చొక్కా ధరించిన ఉపేంద్ర ‘ఈ దుస్తులు కష్టించి పనిచేసే ‘జన కార్మికుడి’కి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ‘మా పార్టీ జన నాయకుడిని, జన సేవకుడిని కాకుండా ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే జన కార్మికుడికి ప్రతీక. నాతో నడవాలనుకునే వారు ఈ ఆలోచనతో ఉండాలి. ఖాదీకి బదులు ఖాకీ ధరించాలి. మాది బహిరంగ వేదిక. ప్రతి ఒక్కరూ కలసిరావాలి’ అని పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లో పారదర్శకత ‘మా పార్టీలో అన్ని స్థాయిల్లో పారదర్శకత పాటిస్తాం. ప్రజాధనం దుర్వినియోగం కాకూడదన్నదే మా ముఖ్యోద్దేశం’ అని ఉపేంద్ర చెప్పారు. తనతో కలసి వచ్చేవారితో చర్చించాక పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై పలుసార్లు సంకేతాలిచ్చిన ఉపేంద్ర శుక్రవారం ఓ ఆడియో క్లిప్పులో మరింత స్పష్టమైన సంకేతం ఇచ్చారు. ‘మార్పు కోసం ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను’ అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారన్న ఊహాగానాలకు తాజా ప్రకటనతో తెరపడింది. తెలుగు, కన్నడ సినిమాలకు విరామం పార్టీ ఏర్పాటు నేపథ్యంలో సినిమాల్లో అవకాశాలను వదులుకున్నట్లు ఉపేంద్ర తెలిపారు. ప్రస్తుతం చేస్తున్న ఒక సినిమా ముగిశాక పూర్తి సమయం పార్టీ కోçసం కేటాయిస్తానని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ నుంచి ఉపేంద్ర తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఉపేంద్ర 50కిపైగా సినిమా ల్లో నటించి, 10 సినిమాలకు దర్శకత్వం వహించారు. ‘ఉపేంద్ర’, ‘ఏ’, ‘టాస్’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. -
రజనీకాంత్ ఎన్డీయే వెంటే ఉంటారు...
చెన్నై: రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం ఖరారు కాగా, తాజాగా ఆయన ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుడు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి స్వయంగా వెల్లడించారు. శుక్రవారం గురుమూర్తి ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని తెలిపారు. ఆయన కొత్త పార్టీ పెడతారని, రజనీ రాకతో చిన్న పార్టీలన్నీ కనుమరుగు అవుతాయని అన్నారు. అంతేకాకుండా రజనీకాంత్ ఎన్డీయే వెంటే ఉంటారని గురుమూర్తి తెలిపారు. కాగా రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని కొన్నేళ్లుగా అభిమానులు, పార్టీలకతీతంగా నాయకులు కోరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం గత లోక్‌సభ ఎన్నికల సమయంలో చెన్నైలోని రజనీ ఇంటికి వెళ్లి ఆయన మద్దతు కోరారు. అయినా రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ తన మనసులోని మాటను ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే ఇటీవల అభిమానులతో ఆయన సమావేశమయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకునే సన్నాహాల్లో భాగంగానే రజనీకాంత్ ఇవన్ని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన సన్నిహిత మిత్రుడు చేసిన ప్రకటనతో రజనీ రాజకీయ ప్రవేశం ఖాయమన్న ప్రచారం పతాకస్థాయికి చేరింది. రజనీకాంత్ తన జన్మదినమైన డిసెంబర్ 12వ తేదీన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేస్తారని ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. రాజకీయాల్లోకి రావాలని రజనీ నిర్ణయించుకున్నారని, అభిమానులతో మరోసారి సమావేశమైన తరువాత డిసెంబర్ 12వ తేదీన బ్రహ్మాండమైన బహిరంగ సభను ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన మీడియాకు తెలిపారు. -
యూపీలో కొత్త పార్టీ..!
► సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా స్థాపిస్తా.. ► ములాయం జాతీయ అధ్యక్షునిగా ఉంటారు: శివపాల్ లక్నో: సమాజ్‌వాదీ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. సమాజ్‌వాదీ సెక్యులర్ మోర్చా పేరిట కొత్త పార్టీ స్థాపించనున్నట్టు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత శివపాల్ యాదవ్ ప్రకటించారు. ఈ పార్టీకి ములాయం నేతృత్వం వహిస్తారని వెల్లడించారు. శుక్రవారం ఎతావాలో బంధువుల నివాసంలో ములాయంతో సమావేశమైన అనంతరం శివపాల్ ఈ ప్రకటన చేశారు. ‘పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగిస్తానని అఖిలేశ్ హామీ ఇచ్చాడు. ఆ హామీ నెరవేర్చాలి. అందరం కలసి సమాజ్‌వాదీ పార్టీని పటిష్టపరచాలి. అఖిలేశ్‌కు మూడు నెలల సమయం ఇస్తున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ పగ్గాలను ములాయంకు అప్పగించాలి. ఒకవేళ అతను పార్టీ పగ్గాలను నేతాజీకి అప్పగించడంలో విఫలమైతే.. నేను కొత్త పార్టీ స్థాపిస్తా’ అని బుధవారమే శివపాల్ చెప్పారు. దేశానికి మంచిదే: అఖిలేశ్ శివపాల్ హెచ్చరికలపై అఖిలేశ్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి మీడియా ద్వారానే తెలుసుకున్నానని, అలాంటి పార్టీ ఏర్పాటైతే అది దేశానికి మంచిదేనని అన్నారు. యూపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఖిలేశ్, శివపాల్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. -
కొడిగడుతున్న దీపం
► బలహీనమవుతున్న పేరవై ► భర్త మాధవన్ వేరుగా కొత్త పార్టీ ► రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన ఆమె మేనకోడలు దీప నానాటికి తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు, దీప పేరవై నేతలు కార్యకర్తలతో విబేధాలతో సతమతం అవుతున్న దీప జీవితంపై శుక్రవారం మరో రెండు పిడుగులు పడ్డాయి. భర్త మాధవన్ కొత్త పార్టీ స్థాపన, పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు దీపను మరింత బాధల్లోకి నెట్టేశాయి. జయలలిత మర ణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ చేతుల్లోని అన్నాడీఎంకే వెళ్లడాన్ని సహించలేని వారిపై నమ్మకంతో ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. పేరవైపై భర్త మాధవన్ పెత్తనం లేకుండా చేసి ఆమె కారుడ్రైవర్‌ను ప్రధాన కార్యదర్శిగా, ఆయన భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై అలిగిన మాధవన్ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. పన్నీర్‌సెల్వం రాజీనామా, శశికళపై తిరుగుబాటుతో అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిపోగా సీఎంగా ఎడపాడి పళనిస్వామి విశ్వాస పరీక్ష సమయంలో పన్నీర్‌సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలపై పన్నీర్‌సెల్వం పట్టుజారిపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్లో పోటీకి దిగడంతో భర్త మాధవన్ మనసు మార్చుకుని మళ్లీ చేరుమయ్యారు. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో భర్త పేరు కాలమ్‌ను ఖాళీగా పెట్టి మరో వివాదానికి కా>రణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్‌ను లోనికి అనుమతించక పోవడం అగ్నిలో అజ్యం పోసింది. దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్‌ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది. ‘ఎమ్జేడీఎంకే’ ఆవిర్భావం: మాధవన్ దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ శుక్రవారం అకస్మాత్తుగా రాజకీయ పార్టీ స్థాపించి పేరవైని మరింతగా బలహీనపరిచే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎమ్జేడీఎంకే) పేరున తాను స్థాపించిన కొత్తపార్టీకి దీపకు ఎటువంటి సంబంధం లేదు, తను చేరదలుచుకుంటే చేరవచ్చని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నేరుగా జయలలిత సమాధి వెళ్లి నివాళులర్పించిన అనంతరం పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే తీవ్రమైన నాయకత్వలేమిని ఎదుర్కొంటోందని, ఇరుపక్షాల నేతలు పన్నీర్‌సెల్వం మాయలో పడిపోయారని మాధవన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన నిజాయితీగా నిలిచే సిసలైన నేతను తానేనని చెప్పుకున్నారు. రెండాకుల చిహ్నం తన పార్టీకి సాధిస్తానని చెప్పారు. భర్త మాధవన్ పార్టీ పెట్టడం దీపకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు: ఇప్పటికే పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయి ఉన్న దీప రూ.20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు. తాను సైతం రూ.50వేలు చెల్లించి 5వేల దరఖాస్తులను పొందానని చెప్పాడు. రిజిస్ట్రేషన్ దరఖాస్తులో కోశాధికారిగా, సభ్యత్వ దరఖాస్తులో ప్రధాన కార్యదర్శిగా పేర్కొనడం మోసపూరితమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. తనలాగా మరింత మంది కార్యకర్తలు మోసపోకుండా దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇలా రోజుకో సమస్యతో ‘దీప’ం కొడిగట్టుతోందా అనే భావన కలుగుతోంది. -
జయలలిత పేరుతో కొత్త పార్టీ
- దీప భర్త మాధవన్ వేరుకుంపటి - పార్టీ పేరు ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ - దీపపై రూ.20 కోట్ల మోసం కేసు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అమ్మ పేరిట మరో కొత్తపార్టీ జీవంపోసుకుంది. దివంగ సీఎం జయలలిత మేనకోడలు దీప భర్త మాధవన్ ‘ఎంజీఆర్ జయలలిత ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఎంజేడీఎంకే) అనే కొత్త పార్టీని స్థాపించారు. శుక్రవారం ఉదయం జయలలిత సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించిన మాధవన్.. ఆ తరువాత పార్టీ పేరును ప్రకటించి పతాకాన్ని ఆవిష్కరించారు. దీప పేరవైకి తన పార్టీకి సంబంధం లేదని, దీపకు ఇష్టమైతే తన పార్టీలో చేరవచ్చని తెలిపారు. అన్నాడీఎంకేలో వర్గపోరు కారణంగా ఎవరికీ దక్కకుండాపోయిన రెండాకుల చిహ్నాన్ని తాము సాధిస్తానని మాధవన్ మీడియాకు చెప్పారు. ఇటీవలి ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో పోటీకి దిగిన దీప.. తన నామినేషన్ పత్రాల్లో భర్త పేరును రాయనికారణంగా దంపతుల మధ్య విబేధాలు చెలరేగాయి. నాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు అంతకంతకూ పెద్దవవుతూ వచ్చాయి. అంబేడ్కర్ జయంతి రోజున దీప, మాధవన్‌ల అనుచరులు తీవ్రంగా ఘర్షణపడ్డారు. కొన్నిరోజులుగా దీపను వదిలివేరుగా ఉంటున్న మాధవన్ రాజకీయ పార్టీని పెట్టడం చర్చనీయాంశమైంది. దీపపై రూ.20 కోట్ల మోసం కేసు ఎంజీఆర్ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాసుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో పెద్ద సంఖ్యలో దరఖాస్తులను అమ్మి, సభ్యత్వ రుసుమును స్వీకరించిన దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
‘జల్లికట్టు’ యువత కొత్త పార్టీ
సాక్షి, చెన్నై: జల్లికట్టు ఉద్యమానికి నేతృత్వంవహించిన యువతలోని పలువరి ఆధ్వర్యంలో‘ నాదేశం...నాహక్కు’ పేరుతో తమిళనాడులో శనివారం కొత్త పార్టీ ఆవిర్భవించింది. రుంబాక్కంలోని ఒక హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ పార్టీని ప్రకటించారు. ఇందులో కన్వీనర్లుగా ఎబినేజర్, సత్య, ప్రవీణ, సుకన్య, కార్తీ, స్వతంత్ర దేవి, ప్రకాష్, ప్రసాద్ వ్యవహరించనున్నారు. ఈ పార్టీ జెండాను జాతీయ పతాకం తరహాలో రూపొందించారు. మధ్యలో సంకెళ్లు తెంచుకున్న యువకుడి చిత్రాన్ని పొందుపరిచారు. -
తమిళనాట మరో కొత్త పార్టీ!
-
దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి
► పన్నీర్‌సెల్వం వైపు వలసలు ► శశికళ వ్యతిరేకులకు ప్రత్యామ్నాయ పవర్ సెంటర్ ► దీప కొత్త పార్టీపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఉరుము ఉరిమి మంగళం మీద పడింది’ అన్నట్లుగా తయారైంది జయ మేనకోడలు దీప పరిస్థితి. పన్నీర్‌సెల్వం పుణ్యమాని పార్టీ పెట్టక ముందే, పర్యటనలతో ప్రజల్లో రాకముందే బలహీనపడుతోంది. అన్నాడీఎంకేలోని అందరికీ జయలలిత ఆరాధ్యదేవత. అడుగులకు మడుగులొత్తడమేకాదు, పాద నమస్కారాలు చేసేవారు. రాష్ట్ర ప్రజల చేత అమ్మగా కూడా జయ కీర్తింపబడ్డారు. జయలలిత మరణంతో అన్నాడీఎంకేలో తీరని అగాథం ఏర్పడింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం ఆ పార్టీలో అసంతృప్తి రాజేసింది. జయ మరణానికి కారణమైన శశికళ ప్రధాన కార్యదర్శిగా సహించలేమని బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. దీప వైపు కార్యకర్తల చూపు: అన్నాడీఎంకేలోని అసంతృప్తివాదులు ప్రత్యామ్నాయంగా జయ మేనకోడలు దీపను ఎంచుకున్నారు. చెన్నైలోని టీనగర్‌లోని ఇంటికి క్యూకట్టడం ప్రారంభించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా దీపను ఊహించుకున్నారు. ఇది కుదరని పక్షంలో దీప చేత కొత్త పార్టీ పెట్టించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావించిన శశికళ వ్యతిరేకీయులు రాష్ట్రవ్యాప్తంగా దీప పేరవైలను ప్రారంభించారు. పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కూడా సాగిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. శశికళపై వ్యతిరేకత, తన పట్ల పెరుగుతున్న అభిమానానికి స్పందించిన దీప తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు గత నెల 17వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున కీలకమైన ప్రకటన చేస్తానని, ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజలను కలుసుకుంటానని తెలిపారు. అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ సంక్షోభం శశికళకు పోటీగా దీపను రాజకీయాల్లో తేవాలని భావించిన వారిని ఆలోచనలో పడేసింది. జయ మరణించిన మూడునెలల్లోనే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గంగా పార్టీ రెండుగా ముక్కలైంది. శశికళపై తిరుగుబాటు చేసిన పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో బలమైన పవర్‌సెంటర్‌గా మారిపోవడం వారిని ఆనందింపజేసింది. శశికళపై తమకున్న వ్యతిరేకత పన్నీర్‌సెల్వం రూపంలో తీరిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఇక దీప అవసరం ఏమిటనే ఆలోచనలో పడ్డారు. అన్నాడీఎంకేలో రాజకీయపోరు ప్రారంభం కాగానే దీప ఇంటి వద్ద అభిమానులు పలచన కావడం ప్రారంభమైంది. జయ మేనకోడలు హోదాలో దీపను ఆహ్వానిస్తున్నానని, ఎప్పుడు వచ్చినా తగిన మర్యాదనిస్తానని పన్నీర్‌సెల్వం ఆహ్వానించడం పరోక్షంగా దీప పేరవైని దెబ్బతీసింది. శశికళపై కక్షతో దీపను బలమైన రాజకీయనేతగా తీర్చిదిద్దేకంటే పన్నీర్‌సెల్వం పంచన చేరడం మేలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవే పరిస్థితులు కొనసాగితే దీప నేతృత్వంలో కొత్త పార్టీ ఉదయించకుండానే అస్తమించినట్లు కాగలదు. -
తమిళనాట రజినీ పార్టీ సునామీ!
తనకు పవర్ అంటే ఇష్టం అన్న రజినీ సొంత పార్టీని పెడతారని ఊహాగానాల జోరు చెన్నై: తమిళనాట కొత్త పార్టీ అవతరిస్తోందా.. రాజకీయాలకు దూరంగా ఉంటూ, రాజకీయాలంటే నచ్చవంటూ ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలోనే ఉన్నట్లు కనిపించే ప్రముఖ నటుడు సూపర్ స్టార్ ఆ కొత్త పార్టీకి ఊపిరి పోస్తున్నారా అంటే అవునంటూ గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ విషయం హల్ చల్ చేస్తోంది. తనకు 'పవర్' అంటే ఇష్టమేనని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలే తాజాగా కొత్త పార్టీ చర్చకు అసలు కారణమైనట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించి కీలకంగా వ్యవహరించాలని చూస్తున్న బీజేపీ మద్దతుతో రజనీ కొత్త పార్టీ పెడతారని, దాని ద్వారా దక్షిణాధి అంతటా తనకు బాటలు వేసుకోవచ్చని బీజేపీ కూడా యోచిస్తోందని ఊహాగానాలు బయలుదేరాయి. రాజకీయాలకు దూరంగా ఉంటున్న రజనీ కాంత్.. జయలలిత మరణం అనంతరం తాజాగా తమిళనాడులో ఏర్పడుతోన్న రాజకీయ పరిస్థితులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వార్తలు తమిళనాట వీధుల్లో చెక్కర్లు కొడుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీ జనరల్ శశికళను లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా ఎన్నుకునేందుకు ఒకరోజుముందే తనకు పవర్ అంటే ఇష్టం అని రజనీకాంత్ చెప్పారు. ఆయన అలా చెప్పిన మరుసటి రోజే తమిళనాట రాజకీయాల్లో విపరీతంగా మార్పులు చోటుచేసుకున్నాయి. 1996 ఎన్నికల సమయంలో రజనీకాంత్ ఒక ఫేమస్ స్టేట్ మెంట్ ఇచ్చారు. 'జయలలితకు ఓటెస్తే దేవుడు కూడా తమిళనాడును రక్షించలేడు' అని ఆ దెబ్బకు జయలలిత ఓడిపోయింది. అయితే, ఆ తర్వాత ఆయన రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడలేదు కదా.. పట్టించుకోలేదు కూడా. అయితే, ఎప్పటి నుంచో తమిళనాడులో పాతుకుపోవాలని బీజేపీ చూస్తోంది. దీనికి సరైన అవకాశం కోసం చూస్తోంది. ప్రస్తుతం జయలలిత చనిపోవడంతో బీజేపీ ఆశకు మరింత బలం చేకూరుంది. ఇప్పటికే బీజేపీ వర్గాలు రజినీకాంత్‌తో చర్చలు చేశారని, అవి అనుకున్నదానికంటే మంచి ఫలితాలు ఇచ్చాయని, నేరుగా బీజేపీ అని కాకుండా ఆయన ఒక పార్టీని పెట్టడం ద్వారా తమిళనాడులో రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని పలువురు చెప్పుకుంటున్నారు. అయితే, ఇవేం వాస్తవాలు కావన్నట్లుగా రజినీకాంత్ మాటల ప్రకారం తెలుస్తోంది. పవర్ అంటే పొలిటికల్ పవర్ కాదంట.. తనకు పవర్ అంటే ఇష్టమన్నానని, అయితే, పొలిటికల్ పవర్ కాదని, ఆధ్యాత్మిక శక్తి అని రజినీ చెప్పారు. 'డబ్బు, ఖ్యాతి ఒకపక్కకు పెట్టి నన్ను ఏం కావాలని అడిగితే నేను ఆధ్యాత్మికాన్ని కోరుకుంటాను. ఎందుకంటే అది చాలా శక్తిమంతమైనది. శక్తిని ఇష్టపడేవాళ్లలో నేను ఒకడిని. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు' అని రజినీ చెప్పారు. -
పార్టీ పెడతా.. ఎలా సీఎం అవుతావో చూస్తా
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో వివాదం సమసిపోయిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనగా మార్చి 11 తర్వాత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తానని ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ ప్రకటించారు. అంతేగాక మళ్లీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చూస్తానని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అఖిలేష్‌కు శివపాల్ స్వయానా బాబాయ్ అవుతారు. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడాన్ని శివపాల్ తప్పుపట్టారు. ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన ములాయం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఎతాహ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శివపాల్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, యూపీలో కనీసం నాలుగు సీట్లు కూడా గెలవలేదు అని చెప్పారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎస్పీ తరఫునే జస్వంత్ నగర్ స్థానం నుంచి పోటీ చేస్తానని, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కొత్త పార్టీని స్థాపిస్తానని చెప్పారు. ములాయంను అఖిలేష్ అవమానించారని, కావాలనే తన వర్గీయులకు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో ఎక్కువ మంది తనతోనే ఉన్నారని శివపాల్ చెప్పారు. యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 11 నుంచి ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మార్చి 11న ఓట్లను లెక్కిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ.. అఖిలేష్, శివపాల్ వర్గాలుగా విడిపోగా.. అఖిలేష్ పార్టీలో పూర్తి పట్టు సాధించారు. ఎస్పీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తండ్రి ములాయంను తొలగించి.. అఖిలేష్ పార్టీ పగ్గాలు చేపట్టారు. యూపీ పార్టీ చీఫ్‌గా ఉన్న శివపాల్‌ను పదవి నుంచి తొలగించారు. ఎన్నికల సంఘం వద్ద పోరాడి పార్టీ పేరు, పార్టీ గుర్తు సైకిల్‌ను అఖిలేష్ దక్కించుకున్నారు. పార్టీలో శివపాల్‌ను దాదాపుగా ఒంటరి చేశారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుని మళ్లీ అధికారంలోకి రావడానికి అఖిలేష్ పోరాడుతున్నారు. సంబంధిత వార్తలు చదవండి అఖిలేశ్‌కే సైకిల్ గుర్తు అఖిలేశ్ లిస్టులో బాబాయ్ సైకిల్‌కు రెండు చక్రాలం -
సామాజిక తెలంగాణ కోసం కొత్త పార్టీ
తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ వెల్లడి హైదరాబాద్: సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా అణగారిన రాష్ట్ర ప్రజల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ డాక్టర్ చెరుకు సుధాకర్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని హస్తినాపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లిన వారిని పక్కన పెట్టారని, తెలంగాణ ద్రోహులు నేడు అధికార దాహంతో పదవులు అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను పరామర్శించి, అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొంది జూన్ 2 నాటికి నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ శూన్యత నెలకొందని పేర్కొన్నారు. బడుగు, బలహీన అణగారిన వర్గాల వారు నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారన్నారు. గౌని నర్సింహ్మగౌడ్ అధ్యక్షతన వహించిన ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశం, తెలంగాణ బీసీ సమాఖ్య అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త పార్టీ ఏర్పాటు.. గుర్తు మోటార్ సైకిల్?
ఉత్తరప్రదేశ్‌లో కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధమైనట్లేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. అందులోనూ సాక్షాత్తు సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయం సింగ్ యాదవే ఈ విషయం చెబుతుండటంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. రాంగోపాల్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారని, దానికి మోటార్ సైకిల్ గుర్తును ఆయన తీసుకున్నారని ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. దానికి 'అఖిల భారతీయ సమాజ్‌వాదీ పార్టీ' అని పేరు కూడా పెట్టినట్లు చెప్పారు. తాజాగా ములాయం, అఖిలేష్ యాదవ్‌ల మధ్య జరిగిన సమావేశంలో పార్టీ జాతీయాధ్యక్ష పదవి విషయంలో ఇద్దరూ రాజీ పడలేదని తెలుస్తోంది. ఎన్నికల గుర్తు సైకిల్ కోసం ఇరు వర్గాలు దాఖలు చేసుకున్న పిటిషన్లను ఉపసంహరించుకోవాలని ములాయం చేసిన ప్రతిపాదనను కూడా అఖిలేష్ తోసిపుచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కావాలంటే శివపాల్ యాదవ్, అమర్‌సింగ్‌లను ఈ ఎన్నికల నుంచి పక్కకు పెట్టడానికి సరేనన్న ములాయం.. అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించడానికి మాత్రం ససేమిరా అన్నారు. పార్టీ జాతీయాధ్యక్షుడిగా తానే ఉంటానని, ఇన్నాళ్లూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాంగోపాల్ యాదవ్ అనుభవించిన అధికారాలన్నింటినీ అఖిలేష్‌కు ఇస్తానని కూడా ములాయం ప్రతిపాదించారు. అంటే, రాంగోపాల్ యాదవ్‌ను మాత్రం పార్టీ నుంచి బయటకు పంపాలన్నదే ములాయం ప్రతిపాదనగా తెలుస్తోంది. -
తమిళనాడులో ‘అమ్మ డీఎంకే’ ఆవిర్భావం
సాక్షి, చెన్నై : తమిళనాడులో అమ్మ డీఎంకే అనే కొత్త పార్టీ ఆవిర్భవించింది. ద్రావిడ ఇయక్కంలో ఒకప్పుడు కీలక నేతగా ఎదిగిన ఈవీకే సంపత్ కుమారుడు ఇనియన్ సంపత్ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. అన్నాడీఎంకేను ఆంగ్లంలో జాతీయ స్థాయిలో ఏఐడీఎంకే, రాష్ట్రంలో ఏడీఎంకే అని పిలుస్తుంటారు. ఈ పిలుపులో గందరగోళాన్ని సృష్టించే విధంగా మరో ఏడీఎంకే ఆవిర్భవించింది. అమ్మ సేనల్ని ఆకర్షించే విధంగా, అన్నాడీఎంకేలో గందరగోళాన్ని రేకెత్తించే విధంగా అమ్మ డీఎంకే (ఏడీఎంకే)ను చెన్నైలో ఏర్పాటు చేశారు. అన్నాడీఎంకే జెండాను పోలిన జెండాను తన ఇంటిపై ఎగుర వేశారు. అన్నాడీఎంకే జెండాలో రెండాకుల చిహ్నం ఉండగా, అమ్మ డీఎంకే జెండాలో జయలలిత విక్టరీ సంకేతంతో చిహ్నాన్ని పొందుపరిచారు. -
సీఎం కోసం ప్రొఫెసర్ సాబ్.. 'కొత్త' డ్రామా
సమాజ్‌వాదీ పార్టీలో ప్రొఫెసర్ సాబ్ అంటే ప్రతి ఒక్కరికీ తెలుసు. పార్టీ అధినేత ములాయం సహా అందరూ అలా పిలిచేది ఒక్క రాంగోపాల్ యాదవ్‌ని మాత్రమే. ములాయంకు వరసుకు సోదరుడయ్యే రాంగోపాల్ యాదవ్.. గత కొన్నేళ్లుగా పార్టీ ప్రధాన కార్యదర్శి. చాలాకాలంగా పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎన్నికల కమిషన్‌తో ఆయనే సంప్రదింపులు జరుపుతుంటారు. పార్టీలో వారసత్వం గురించిన గొడవలు వస్తున్నప్పుడు.. బాహాటంగా అఖిలేష్ యాదవ్‌కు రాంగోపాల్ మద్దతు పలికారు. అయితే.. ప్రొఫెసర్ సాబ్ ఉన్నట్టుండి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లారు. రాజ్యసభ సభ్యుడైన ఆయనకు ఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌లో గల ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఇల్లు ఉంది. ఎప్పుడైనా ఆయన అక్కడ ఉంటుంటారు. ఎన్నికల కమిషన్ వద్దకు ఆయన వెళ్లడం కూడా మామూలే. ఈసారి కూడా నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మ్యాప్‌లు ఇవ్వాలని కోరేందుకే ఆయన వెళ్లారని అంటున్నారు. ఎన్నికలకు ముందు అన్ని పార్టీల వాళ్లూ అలా వెళ్లడం కూడా మామూలే. కానీ.. ఇక్కడ ప్రొఫెసర్ సాబ్ పాత్ర గురించి పార్టీలో రకరకాలుగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీకి వంద కంటే తక్కువ సీట్లు వస్తే.. అందుకు పూర్తి బాధ్యత ములాయందేనని గతంలోనే లేఖ రాశారు. పార్టీలో 95 శాతం మంది అఖిలేష్ వెంటే ఉన్నారని కూడా ఆయన చెబుతుంటారు. అలాంటి ప్రొఫెసర్ సాబ్.. ఇప్పుడు ఎన్నికల కమిషన్‌కు వెళ్లినప్పుడు ఏం చేశారన్నది స్వతహాగానే ఆసక్తికరంగా మారింది. అన్న కొడుకు కోసం కొత్త పార్టీని ఆయన ఏమైనా రిజిస్టర్ చేస్తున్నారా అన్న విషయం చర్చనీయాంశమైంది. ఇన్నాళ్లూ పార్టీ గుర్తు సైకిల్ కాగా, ఇప్పుడు మోటార్‌సైకిల్‌గా మార్చాలని కూడా కొందరు అంటున్నారు. దాన్నిబట్టి చూస్తే, పార్టీలో యువత అంతా పాత నాయకులను వదిలిపెట్టి అఖిలేష్ యాదవ్‌ను తమ నాయకుడిగా గుర్తిస్తారా అనే చర్చ మొదలైంది. ఒకవైపు అఖిలేష్ యాదవ్ రథయాత్ర మొదలుపెడుతుండగా.. మరోవైపు ప్రొఫెసర్ సాబ్ రాంగోపాల్ యాదవ్ దక్షిణాది యాత్రకు బయల్దేరుతున్నారు. ఇటువైపున్న ప్రాంతీయ పార్టీల నాయకులతో ఆయన మంతనాలు జరుపుతారని సమాచారం. ఇదంతా చూస్తుంటే ఎన్నికలకు ముందుగానీ, ఆ తర్వాత గానీ ములాయం పార్టీలో ముసలం రావడం తప్పకపోవచ్చని అంటున్నారు. -
మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!
-
మరో కొత్త పార్టీ వచ్చేస్తోంది!
మణిపూర్ రాష్ట్రంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని తొలగించాలంటూ దాదాపు 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసిన ఇరోమ్ షర్మిలా చాను.. త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారు. దానిపేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'. వచ్చే సంవత్సరం మణిపూర్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఈ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారు. మణిపూర్ రాష్ట్రంలో తాము రాజకీయంగా ఒక మార్పును తీసుకొస్తామని, ఏఎఫ్ఎస్పీఏ లాంటి చట్టాలు ఇకమీదట సామాన్యులను ఇబ్బంది పెట్టలేవని పార్టీ ప్రకటన సందర్భంగా ఆమె అన్నారు. 2000 సంవత్సరం నవంబర్ రెండో తేదీన మొదలుపెట్టిన నిరాహార దీక్షను ఆమె గత ఆగస్టు నెలలో విరమించారు. అప్పుడే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ''నిరాహార దీక్షను ముగించినంత మాత్రాన ఉద్యమాన్ని ఆపినట్పలు కాదు. మరో కొత్త ప్రారంభం ఉంటుంది'' అని ఆమె అన్నారు. రాష్ట్రానికి తాను ముఖ్యమంత్రి కావాలని, ఆ తర్వాత సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని నిషేధించాలని భావిస్తున్నారు. అయితే తాజా సర్వేల ప్రకారం.. మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీయే అధికారం చేపడుతుందని.. షర్మిలా చానుకు మద్దతు పలికేవాళ్లు కేవలం 6 శాతం మంది మాత్రమేనని తేలింది. మరి ఈ పార్టీ స్థాపించి ఆమె ఏం సాధిస్తారో.. ఎంతమేరకు ఫలితాలు రాబడతారో వేచి చూడాల్సిందే. -
కొత్తపార్టీని ప్రకటించిన మాజీ ప్రధాని
నేపాల్ మాజీ ప్రధాని బాబు రామ్ భట్టారాయ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. నేపాల్ రాజధాని కఠ్మాండులో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన తాను స్థాపిస్తున్న పార్టీని గురించి వివరించారు. తన పార్టీ పేరు'నయా శక్తి నేపాల్' గా తెలిపారు. ప్రజల అభ్యున్నతిని కోరుకునేవాడిగా ఈ పార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. -
'కొత్త పార్టీ పెడుతున్నా, పేరు సూచించండి'
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి.. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. హస్తం పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి పేరు సూచించాలని ప్రజలను కోరారు. బిలాస్ పూర్ జిల్లా మార్వాహిలో సోమవారం ఆయన తన మద్దతుదారులతో బహిరంగ సభ నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. మార్వాహి బహిరంగ సభకు హాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని అజిత్ జోగి మద్దతుదారులను కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరించింది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజిత్ జోగి వెళ్లిపోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అజిత్ జోగి కొత్తపార్టీ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని, తమపై ఎటువంటి ప్రభావం పడదని ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ అన్నారు. -
కొత్త పార్టీ పెట్టిన మాజీ ప్రధాని
కట్మాండు: నేపాల్ మాజీ ప్రధాని బాబురామ్ భట్టారాయ్ కొత్త పార్టీ స్థాపించాడు. ఆయన తన పార్టీకి 'న్యూ ఫోర్స్ నేపాల్' అని నామకరణం చేశాడు. అంతకుమందు ప్రచండ ఆధ్వర్యంలో నడుస్తున్న యూసీపీఎన్-మావోయిస్టు పార్టీలో కొనసాగిన బాబురామ్ ఆయనతో విభేదాల కారణంగా గత నాలుగు నెలల కిందటే ఆ పార్టీని వదిలి బయటకొచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘంగా మాజీ మావోయిస్టులు, ఇతరులతో చర్చలు జరిపి చివరికి నేడు(ఆదివారం) 35 మంది అంతర్గత కేంద్ర మండలి సభ్యుల పేరుతో పార్టీని ప్రకటించారు. దఫాల వారిగా వీరి సంఖ్య 265కు పెంచుతామని చెప్పారు. ప్రస్తుతం నేపాల్ ల్లో ఉన్న పార్టీకి తమ పార్టీ ప్రత్యామ్నాయం కానుందని, తమ పార్టీలో మాజీ మావోయిస్టులు ఉంటారని ఆయన ప్రకటించారు. -
ఆర్నెళ్ల తర్వాత కొత్త పార్టీ!
ముందుగా ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో గ్రూప్ ఏర్పాటు ఆప్ తిరుగుబాటు నేతల ‘సంవాద్’ సదస్సులో నిర్ణయం న్యూఢిల్లీ: ఆప్ తిరుగుబాటు నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లు కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు. ముందుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు లక్ష్యంగా ‘స్వరాజ్ అభియాన్’ గ్రూప్ ఏర్పాటు చేసి, ఆరు నెలల తర్వాత కొత్త పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని వీడబోమని స్పష్టంచేశారు. పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి అసమ్మతి ద్వయం మంగళవారమిక్కడ నిర్వహించిన ‘స్వరాజ్ సంవాద్’ సదస్సు 8 గంటలు కొనసాగింది. భవిష్యత్తు కార్యాచరణపై చర్చోపచర్చలు జరిపారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన కార్యాకర్తల అభిప్రాయాలను ఓటింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఆప్‌ను వీడి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను 69 మంది వ్యతిరేకించారు. కొత్త పార్టీ ఏర్పాటుకు సదస్సుకు హాజరైనవారిలో 25 శాతం మందే మద్దతు పలికారు. ఇక ఆప్‌పై తమకు నమ్మకం ఉందని 1.43 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘స్వరాజ్ అభియాన్’ పేరుతో తమకు మద్దతు కోరుతూ దేశవ్యాప్తంగా పర్యటిస్తామని, అందరి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్న అనంతరం 6 నెలల తర్వాత పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని యోగేంద్ర యాదవ్ వెల్లడించారు. ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. ఆప్ అధినేత కేజ్రీవాల్ నియంతృత్వ పోకడలు పోతున్నారని విమర్శించారు. పార్టీలో గొంతెత్తే వారిని బహిష్కరించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. యోగేంద్రయాదవ్, భూషణ్‌తోపాటు పార్టీ ఉన్నత పదవుల నుంచి బహిష్కరణకు గురైన ఆనంద్ కుమార్, అజిత్ ఝా సదస్సులో పాల్గొన్నారు. -
100 కోట్లు - కొత్త పార్టీ !
ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తారు? అవకాశముంటే మంత్రి పదవి దక్కాలని, కుదరకపోతే కార్పొరేషన్ లేదా ఇతర అధికార పదవుల్లో కొనసాగాలని ఆశపడతారు. కానీ కరీంనగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే మాత్రం అవేవీ తనకు వద్దనీ, భవిష్యత్తులో తానే కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వస్తాననీ చెబుతున్నారట! అధికారంలోకి వచ్చిన తరువాత తానే ఇతరులకు మంత్రి పదవులు ఇస్తానని కూడా సన్నిహితులకు ఆశపెడుతున్నారట. అనుకున్నదే తడవుగా ‘రూ.100 కోట్లు-కొత్త పార్టీ’ లక్ష్యంగా వసూళ్ల పర్వానికీ తెరదీశారట. సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులని కూడా చూడకుండా తన దగ్గరకు పనుల కోసం వచ్చే వారందరి దగ్గర ఒక్కో పనికి ఒక్కో రేటు వసూలు చేస్తున్నారట. సదరు ఎమ్మెల్యే వ్యవహారం నచ్చని కొందరు నాయకులు ఈ విషయాన్నిసీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారట. ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా పార్టీ కార్యకర్తలు చెప్పిందంతా నిజమేనని తెలుసుకున్న సీఎం ఆ ఎమ్మెల్యేను పిలిపించి ‘తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవు’ అంటూ తలంటుపోశారట. దాంతో ఎమ్మెల్యే వ్యవహారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ నాయకులు భావించినా ఆ ఎమ్మెల్యే మాత్రం ‘లైట్’గా తీసుకున్నారట. ‘రాబోయే ఎన్నికల నాటికి ఫలానా ఐపీఎస్ అధికారి, ఫలానా సామాజికవర్గ ఉద్యమకారుడితో కలిసి నేనే కొత్త పార్టీ పెట్టబోతున్నా. అప్పటి వరకు రూ.100 కోట్లు పోగేసుకుంటా. ఎవరేం చేస్తారో చూస్తా’ అంటూ మరింత రెచ్చిపోతున్నారట. ఇదంతా దగ్గరుండి గమనిస్తున్న సన్నిహితులు ‘మా ఎమ్మెల్యేకు ఇదేం పోయేకాలం’ అంటూ గుసగుసలాడుతున్నారు. -
మరో కొత్త పార్టీ?
న్యూఢిల్లీ: ఆప్ బహిష్కృత నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రయత్నాలు శరవేగంగా చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తమ మద్దతుదారులతో కలిసి అంబేడ్కర్ జయంతి అయిన ఏప్రిల్ 4న సమావేశమవుతున్నట్టు సమాచారం. ఆప్ మాజీ నేత, లోకపాల్ అడ్మిరల్ రామదాస్ సహా, ఇతర సన్నిహిత వర్గాలు కొన్ని ప్రజా సంఘాలు సమావేశంలో పాల్గొననున్నాయి. అలాగే ప్రశాంత్, యోగేంద్ర యాదవ్ ను పార్టీనుంచి తొలగించినందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేసిన నర్మదా బచావో ఆందోళన్ నేత మేథాపాట్కర్ ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అనూహ్య మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీలో రగిలిన విభేదాలు తారా స్తాయికి చేరాయి. ముఖ్యంగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ , పార్టీలో కీలక నేతలుగా ఉన్న యోగేంద్ర, ప్రశాంత్ భూషణ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చివరికి ఇరువురి నేతలను జాతీయ మండలి పదవులనుంచి తొలగించడంతో చీలిక అనివార్యమైంది. -
బీఎస్పీకి పోటీగా మరో పార్టీ!
మాయావతి వ్యతిరేకులతో కలసి ఏర్పాటుకు కాన్షీరాం సోదరుడి యత్నాలు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో మరో కొత్త పార్టీ రానుందా? మాయావతి వ్యతిరేకులు, కాన్షీరాం కుటుంబీకులు కలసి నూతన పార్టీని స్థాపించనున్నారా? 2017 అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఇది నిజం కావొచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాన్షీరాం చిన్న సోదరుడు దల్బారా సింగ్ ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన కొద్ది ఏళ్లుగా బహుజన సంఘర్ష్ పార్టీ(కాన్షీరాం)కి నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మాయావతికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తున్నారు. మాయావతి యూపీ సీఎంగా ఉన్నప్పుడు బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన నేతలు దల్బారా వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘కాన్షీరాం సిద్ధాంతాల నుంచి మాయావతి ఎలా దూరం జరిగారో ప్రజలకు వివరిస్తున్నా. బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన వారు కూడా నాతో జత కలుస్తున్నారు. అసలు ఆ పార్టీలో ఏం జరుగుతోందన్న వాస్తవాలను ప్రజల ముందుంచుతాం. మాయావతి పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. తగిన ప్రత్యామ్నాయంగా ఎదిగితే మా నాయకత్వాన్ని బలపరిచేందుకు జనం సిద్ధంగా ఉన్నారు’ అని దల్బారా సింగ్ తెలిపారు. 2017కల్లా మాయావతికి ప్రత్యామ్నాయంగా ఎదిగి యూపీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తలపడాలన్నదే తమ లక్ష్యమన్నారు. కాన్షీరాం ఆశయాలతో జనాన్ని ప్రభావితం చేస్తూ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తమ ఉనికిని చాటుకుంటామని చెప్పారు. కాన్షీరాం సిద్ధాంతాలను అనుసరించేవారు, బీఎస్పీ నుంచి బయటకు వచ్చినవారు తమతో కలిసి వస్తారన్నారు. బీఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన దద్దూ ప్రసాద్ ఇటీవలే సామాజిక్ పరివర్తన్ మంచ్ పేరుతో కొత్త పార్టీ నెలకొల్పారు. ఈయన కూడా దల్బారాకు మద్దతు పలికే అవకాశాలున్నాయి. -
అభిమానుల పార్టీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై దశాబ్దాల తరబడి ఊహాగానాలు సాగుతుండగా, రజనీ అభిమాన సంఘాల నేత ప్రకటన ఇచ్చాడు. రజనీకాంత్ జన్మదినమైన ఈనెల 12న అభిమాన సంఘాలన్నీ రాజకీయపార్టీగా రూపాంతరం చెందుతున్నట్లు తమిళనాడు రజనీకాంత్ ప్రజా కార్మికుల సంఘం అధ్యక్షులు ఎస్ఎస్ మురుగేష్ ప్రకటించారు. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సీజన్ వచ్చినపుడల్లా రజనీకోసం అన్ని పార్టీలూ ప్రయత్నాలు చేయడం రాష్ట్రంలో పరిపాటిగా మారింది. రజనీ సైతం నర్మగర్భంగా వ్యవహరిస్తూ సంకేతాలు ఇవ్వడమేగానీ ఏ పార్టీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించలేదు. తాజా పార్లమెంటు ఎన్నికలు, ఇటీవల జయలలిత రాజకీయ సంక్షోభ సమయంలో సైతం రజనీ ప్రసన్నం కోసం బీజేపీ బలంగా ప్రయత్నాలు చేసింది. అయితే జయ బెయిలుపై విడుదల కాగానే రజనీ ఆమెకు శుభాకాంక్షలు తెలపడంతో అన్ని పార్టీలు బిత్తరపోగా, బీజేపీ భారీమోతాదులో భంగపడింది. రజనీ రాజకీయ ప్రవేశంపై అన్ని పార్టీలు దాదాపుగా ఆశలు వదులుకున్నాయి. జన్మదినం రోజున రాజకీయ పార్టీ రజనీకాంత్ బలం, బలగమంతా ఆయన అభిమానులు, అభిమాన సంఘాలే. అటువంటిది రాష్ట్రంలోని రజనీ అభిమాన సంఘాలన్నింటినీ రాజకీయపార్టీగా మార్చబోతునట్లు తిరుపూరు జిల్లాకు చెందిన రజనీకాంత్ వీరాభిమాని మురుగేష్ ప్రకటించి సంచలనానికి తెరలేపారు. రజనీకాంత్ మహిళా సేవా సంఘాలను సైతం కలుపుకుని పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రజనీ అభిమాన సంఘాలను రాజకీయపార్టీగా మారుస్తున్నామని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు సైతం చేసుకున్నట్లు మురుగేష్ వెల్లడించారు. 12వ తేదీన పార్టీ పేరును ప్రకటించిన అనంతరం మరికొద్ది రోజుల్లో మదురై లేదా కోవైలో పార్టీ మహానాడును భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు ఆయన చెప్పారు. ర జనీ అభిమాన సంఘాల అధ్యక్షులతో చర్చించిన అనంతరమే రాజకీయపార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తిరుపూరు కేంద్రంగా పార్టీ ఆవిర్భావంపై 14 జిల్లాల్లో సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఆనవాయితీ కొనసాగేనా? ప్రతి ఏడాది డిసెంబరు 12వ తేదీన రజనీకాంత్ తన జన్మదినాన్ని ఆయన అభిమానులు కోలాహలంగా జరుపుకుంటారు. ఉచితంగా పుస్తకాల పంపిణీ, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. రజనీ సైతం జన్మదినాన అభిమానులను కలుసుకోవడం ఆనవాయితీ. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే అభిమానులను తన ఇంటి వద్ద ప్రత్యక్షంగా పలకరిస్తారు. ఈ ఏడాది తన జన్మదిన కానుకగా లింగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రజనీ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. లింగా విడుదలతోపాటూ రజనీ జన్మదినాన్ని కోలాహలంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో అదే రోజున రజనీ అభిమాన సంఘాలు రాజకీయ పార్టీగా మార బోతున్నట్లు వెలువడిన ప్రకటన అందరినీ అయోమయంలో పడవేసింది. రజనీ అభిమానులంతా తిరుపూరులో పార్టీ అవిర్భావ వేడుకకు హాజరవుతారా లేక చెన్నైలోని రజనీ ఇంటికి చేరుకుంటారా అనేది అగమ్యగోచరమైంది. రజనీ అభిమాన సంఘాల కార్యకలాపాలను పర్యవేక్షించే ఆయన సోదరుడు సత్యనారాయణరావు రెండురోజుల క్రితం తిరుచ్చికి వచ్చారు. రజనీ రాజకీయ అరంగేట్రంపై ఆయనను ప్రశ్నించినవారికి ‘రజనీ రాజకీయాల్లోకి రారు, రజనీకి రాజకీయాలు సూట్ కావు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల వల్ల రాజకీయపార్టీ ఆవిర్భావానికి రజనీకి ఎటువంటి సంబంధం లేదని తేలింది. మురుగేష్ చర్యలను మరో అభిమాని తీవ్రంగా తప్పుపట్టాడు. రజనీ అభిమాన సంఘాన్ని రాజకీయ పార్టీగా మార్చడం అభిమాన సంఘాల నిబంధనలకు విరుద్ధమని ఖండించారు. రజనీ పేరు, ప్రతిష్టలను మురుగేష్ అప్రతిష్టపాలు చేస్తున్నాడని చెప్పారు. రజనీ పేరును దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్య తప్పదని మరో అభిమాని చేసిన హెచ్చరిక వల్ల అభిమాన సంఘాలన్నీ మురుగేష్ బాటలో పయనించడం లేదని స్పష్టమైంది. అభిమాన సంఘాలు రాజకీయపార్టీగా మారుతున్న క్రమంపై రజనీకాంత్ ఏవిధంగా స్పందిస్తారో తేలాలంటే మరో రెండురోజులు ఆగాల్సిందే. -
కొత్త పార్టీ అంటే ఆత్మహత్యే...!
నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించడం అంటే ప్రస్తుత పరిస్థితిలో ఆత్మహత్యతో సమానమని నటుడు విజయ్‌కి తండ్రి హితబోధ చేశారు. అసలు విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో అభిమానులుండడం వారంతా రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తీసుకురావడంతో నటుడు విజయ్‌కి రాజకీయ రంగ ప్రవేశంపై మోహం పెరిగింది. ఈయనకు రాష్ట్ర వ్యాప్తంగా 350 అభిమాన సంఘాలు వున్నాయి. సుమారు 10 లక్షల మంది వీరాభిమానులున్నారు. వీరంతా తమ నాయకుడు రాజకీయ రంగ ప్రవేశం చేయాలని కోరుకుంటున్నారు. దీంతో విజయ్ రాజకీయ ప్రయోజనాలను ఆశించే మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంఘాన్ని నెలకొల్పారు. ఆ తరువాత రాజకీయల్లోకి రావడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని కలిసి చర్చించారు. అదే సమయంలో రాష్ట్రంలో డీఎంకే పార్టీతో సన్నిహితంగా మెలిగారు. అలాంటి సమయంలో తన చిత్రం విడుదలకు ఎదురైన సమస్యలు, నిర్మాత, నటుడు ఉదయనిధి స్టాలిన్‌తో విబేధాలతో మనస్థాపం వంటి కారణాలతో డీఎంకేకు వ్యతిరేకంగా గళం విప్పడం మొదలెట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా విజయ్, ఆయన తండ్రి ఎస్ ఎ చంద్రశేఖర్ ప్రచారం చేశారు. ఆ పార్టీ విజయం సాధించడంతో ఆ ఘనత తమదేనంటూ ప్రచారం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం పసిగట్టిన ఆ పార్టీ అధిష్టానం ఆదిలోనే మేల్కొని విజయ్ను పక్కన పెట్టింది. ఆ తరువాత తుపాకీ, కత్తి చిత్రాలు విడుదలలో పలు సమస్యలు తలెత్తాయి. దీంతో విజయ్ చాలా కలత చెందారు. దీంతో కొన్ని రోజులు మౌనంగా వున్న ఈ స్టార్ నటుడు ఇటీవల శ్రీలంక ప్రభుత్వం అరెస్టు చేసిన జాలర్ల విషయంలో జోక్యం చేసుకుని ప్రధాని నరేంద్రమోదీకి తన కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు. దీంతో ఆయన బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారమయ్యాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో విజయ్ తన తండ్రి ఎస్ఎ చంద్రశేఖర్‌తో సంప్రదించారట. అందుకాయన ప్రస్తుత పరిస్థితుల్లో సొంతంగా పార్టీ పెట్టడం ఆత్మహత్యతో సమం అంటూ హితబోధ చేశారట. 50 ఏళ్ల దాటిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచిద్దాం అప్పటి వరకు సినిమాలో నటించమని సలహా ఇచ్చారని కోలీవుడ్ వర్గాల టాక్. -
పార్టీ పతాకంలో ఆ ఇద్దరు..
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్ర మాజీ మంత్రి జీకే.వాసన్ తాను స్థాపించబోయే కొత్తపార్టీ పతాకాన్ని బుధవారం ఆవిష్కరించా రు. త్రివర్ణాల నడుమ మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, దివంగత జీకే.మూపనార్ ఫొటోలతో పతాకాన్ని తీర్చిదిద్దారు. పార్టీ పేరు శుక్రవారం ప్రకటించనున్నారు. కాంగ్రెస్ అధిష్టాన వైఖరితో విభేదించిన జీకే.మూపనార్ 1996లో తమిళమానిల కాంగ్రెస్‌ను స్థాపించారు. మూపనార్ మరణం తర్వాత ఆయన తనయుడు జీకే.వాసన్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. వాసన్ సైతం తన తండ్రిబాటలోనే కాంగ్రెస్ అధిష్టానంతో విభేదించారు. పార్టీ సంస్థాగత ఎన్నికల సమయంలో సభ్యత్వ కార్డులపై కామరాజనాడార్, మూపనార్ ఫొటోలను ప్రచురించరాదన్న కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయాన్ని వాసన్ వ్యతిరేకించారు. అంతేగాక సొంతపార్టీ స్థాపనకు సిద్ధమయ్యూరు. కాంగ్రెస్‌లో ఏ ఇద్దరు నేతలకైతే (కామరాజనాడార్, మూపనార్) అవమానం జరిగినట్లు వాసన్ భావించారో వారి ఫొటోలనే తన పతాకానికి వినియోగించుకున్నారు. జాతీయ పతాకాన్ని పోలిన ఆరంజ్, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన పతాకం మధ్యలో ఇద్దరి ఫొటోలను ఉంచారు. చెన్నై శాంతోమ్ చర్చ్ సమీపంలోని కమ్యూనిటీ హాలులో బుధ వారం ఉదయం 10 గంటలకు అభిమానుల హర్షధ్వానాల మధ్య జీకేవాసన్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కామరాజనాడార్ పాలనకు తమ పార్టీ అంకితం అవుతుందని అన్నా రు. తమిళనాడులోని కుగ్రామాల నుంచి మహా నగరాల వరకు పార్టీ పతాకం రెపరెపలాడాలని పిలుపునిచ్చారు. ఈ నెల 28న తిరుచ్చిలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు ఇదే పతాకాలతో హాజరుకావాలని సూచించారు. సభ అనంతరం వాసన్ మీడియూతో మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండ దని స్పష్టం చేశారు. డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు ఆ నాటి విషయమని దాటవేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ సీసీ మాజీ అధ్యక్షులు జ్ఞానదేశికన్ తదితరులు పాల్గొన్నారు. -
నవంబర్ 28న జీకే వాసన్ కొత్తపార్టీ
తమిళనాడు:కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీకి ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 28వ తేదీన కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వాసన్ తాజాగా స్పష్టం చేశాడు. రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో బహిరంగ సభలోనే పార్టీ ఏర్పాటును వాసన్ ప్రకటిస్తారు. ఈ మధ్యనే కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పిన వాసన్.. కొత్త పార్టీ పేరు.. అజెండాను అదే రోజు వెల్లడించనున్నారు. తిరుచ్చిలో జరగనున్న జీకేవీ మహానాడుకు డీఎండీకే శ్రేణు లు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జీకే వాసన్ కొత్తపార్టీకి విజయ్ కాంత్ మద్దతిచ్చే క్రమంలోనే ఆ కార్యక్రమానికి డీఎండీకే శ్రేణులు హాజరవుతున్నట్లు ప్రచారం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
కొత్త పార్టీకి పేరే ప్రాణం
కొత్త పార్టీకి ప్రజాకర్షణ కలిగిన పేరే ప్రాణం. ఆదరణ పొందాలంటే ప్రాచుర్యం పొందిన పేరుండాలి. అయితే, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్‌కు ఆ పేరుతోనే పెద్ద చిక్కు వచ్చిపడింది. తండ్రి జీకే మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) తనకు దక్కేనా అనే సంకటస్థితిలో జీకే వాసన్ పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:పార్టీల ఆవిర్భావం, మరో పార్టీలో విలీనం రాజకీయాల్లో సహజమే. డీఎంకేతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకోవడాన్ని తీవ్రంగా నిరసించిన సీనియర్ కాంగ్రెస్ నేత జీకే మూపనార్ 1996లో తమిళ మానిల కాంగ్రెస్(తమాకా)ను స్థాపించి, బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. ప్రజాభిమానంతో పెద్ద సంఖ్యలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలుచుకున్నారు. మూపనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని 2002లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఆయన లిఖితపూర్వకంగా తెలియజేశారు. సీఈసీ సైతం ఆమోదించింది. అయితే జీకే మూపనార్ హయాంలోనే పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత శాఖ అధ్యక్షునిగా ఉన్న తేనీ జయకుమార్ యథాప్రకారం కొనసాగారు. పార్టీ విలీనం పద్ధతి ప్రకారం జరగలేదంటూ పార్టీని నిర్వహించారు. 2006 వరకు పుదుచ్చేరి శాఖ అధ్యక్షునిగా కొనసాగిన తేనీ జయకుమార్ ఆ తరువాత కాంగ్రెస్‌లో చేరిపోవడంతో, అదే పార్టీలోని మరోనేత తులసీదాస్ అధ్యక్షుడు అయ్యూరు. అయితే పుదుచ్చేరి తమాకా ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు నిర్వహించకుండా నామమాత్రంగా నేటికీ కొనసాగుతోంది. తమిళనాడు ప్రజలకు చిరపరిచితమైన తమాకా పేరునే పెట్టాలని జీకే వాసన్తోపాటూ ఆయన అనుచరుల్లో అధిక సంఖ్యాకులు ఆశిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పార్టీ పేరును ప్రకటించాల్సి ఉండగా అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నందున కుదరదనిఎన్నికల అధికారులు వాసన్‌కు చెప్పేశారు. అంతేకాకుండా జీకేవీకి ఈసీ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. ఎంజీఆర్ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారంటూ ఒక ఉదంతాన్ని ఉదహరించింది. కరుణానిధి నాయకత్వంలోని డీఎంకేతో విబేధించిన ఎంజీఆర్ అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీని స్థాపించాలని భావించారు. అయితే అనకాపుత్తూరుకు చెందిన రామలింగం అదే పేరుతో పార్టీని రిజిస్టర్ చేసి ఉన్నారు. దీంతో చేసేది లేక ఎంజీఆరే రామలింగం పార్టీలో చేరారు. ఆ తరువాత తనదైన శైలిలో అన్నాడీఎంకే అధ్యక్షునిగా మారి బలమైన పార్టీగా తీర్చిదిద్దారు. తప్పనిసరిగా తమాకా పేరునే కావాలని భావించిన పక్షంలో వాసన్ సైతం పుదుచ్చేరిలోని పార్టీలో చేరి తమిళనాడుకు విస్తరించవచ్చని ఈసీ సూచించింది. తమాకా పుదుచ్చేరి అధ్యక్షుడు తులసీదాస్ చేత అక్కడి పార్టీని రద్దు చేయించడం లేదా ఎంజీఆర్లాగా పుదుచ్చేరి పార్టీలో వాసన్ చేరిపోవడం మినహా గత్యంతరం లేదు. తమాకా పేరు ప్రజలకు చిరపరిచితం కాబట్టి అదే పేరును పెట్టడం వల్ల రాష్ట్రంలో వేగంగా బలపడవచ్చనేది అధిక సంఖ్యాకుల అభిప్రాయంగా ఉంది. ఇది నిజమే అయినా ఈ చిక్కుల నుంచి బయటపడేదెలా అనే ఆలోచనలో పడిపోయారు. 16న పార్టీ పేరుకు అవకాశం కొత్త పార్టీ ఏర్పాట్లలో మునిగితేలుతున్న జీకే వాసన్ మంగళవారం సైతం సమీకరణల్లో మునిగారు. తనను కలుస్తున్న వారితోనూ, తానుగా వెళ్లి కలిసిన వారితోనూ చర్చలు జరిపారు. ఈనెల 12 లేదా 16న తిరుచ్చిలో భారీ బహిరంగ సభను నిర్వహించి పార్టీ పేరును ప్రకటించాలని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించాలని భావిస్తున్నారు. మదురై జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు తమాకా పతాకాన్ని ఎగురవేయగా, ఈ రోడ్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలోని జీకే వాసన్ ఫొటోను తొలగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఎదురుచూడటం లేదని, రాష్ట్ర పార్టీకి ఆ పరిస్థితి ఎంతమాత్రం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్ మంగళవారం వ్యాఖ్యానించారు. ఒక్కరోజునే వలస కొత్త పార్టీ పూర్తిగా పుట్టకముందే జీకేవీ అనుచరుడు దూరమయ్యూరు. జీకే వాసన్ పార్టీని పెట్టబోతున్నట్లు సోమవారం ప్రకటించిన సందర్భంలో కన్యాకుమారి జిల్లా ప్రిన్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే జాన్‌జాకబ్ ఆయన వెంట నిలిచారు. మంగళవారం ఉదయాన్నే జాన్‌జాకబ్ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఇళంగోవన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాను జీకే వాసన్‌కు అత్యంత విశ్వాసపాత్రుడన్నది వాస్తవమే అని, అయితే ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌లో లేరు, పార్టీని వీడేంత గడ్డుపరిస్థితులు లేవని తాను భావిస్తున్నట్లు మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. -
కొట్టినోన్ని..పెట్టినోన్ని మర్సిపోకూడదు..!
‘‘ఏరా మహేశ్....ఆదివారం ఓట్లుండాయి కదా...మీ వీధిలో లెక్క ఎంత పంచుతాండారు..!’ ‘ఏమో...అల్తాఫ్...డబ్బులు మేము తీసుకోవడం లేదు. మేం ఎవ్వరికి ఓట్లెయ్యాలో డిసైడైనాం.! ‘ఎవ్వరికేస్తున్నావోయ్...కొత్తపార్టీకా...పాతపార్టీకా...!’ ‘కొత్తలేదు...పాత లేదు..మామ...మాకు ఎవరు మంచి చేసినారో...మేము వాళ్లకే ఓట్లేస్తాం...కొట్టినోన్ని పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా...ఈ ఎలచ్చన్లలో అందరూ అట్టనే ఉండారు.’ ‘ఇంతకి ఎవ్వరు కొట్టినారు...ఎవ్వరు పెట్టినారోయ్..!’ ‘ఏం నీకు తెల్దు. మనం కాలేజీకి పోయేటప్పుడు మీ అవ్వకు పింఛన్ కోసం పోతే...మీ వార్డులో 22 మందికి 75 రూపాయలు వచ్చాంది. వాళ్లలో ఎవరైనా సచ్చిపోతే అప్పుడు రాండి అని అధికార్లు సెప్సినారు. మతికి లేదా?’ ‘కరెక్టే మామ..సచ్చిపోయినాక కూడా ఇవ్వలే! చంద్రబాబు హయాంలో ...2001లో అనుకుంటా...బుగ్గవంకకు వరదొచ్చి...ఇండ్లన్నీ మునిగిపోయినాయి...సుమారుగా 30మందిదాకా సచ్చిపోయినారు...కడపలో ఇంత కంటే మరొక ఘోరం ఏం లేదనుకో...ఇండ్లంటే మునిగినాయి...కనీసం మనుషుల ప్రాణాలు కూడా కాపాడలేకపోయినారే! నాకు బాగా గుర్తుంది. ఒక చిన్నపిల్ల...నాలుగేళ్లు ఉంటాయి...వాళ్ల అమ్మ...నాన్న ఇద్దరూ కొట్టుకుపోయినారు..ఆ పాపకు ఎవ్వరు లేరు. ఒక్కటీ అమ్మా..నాన్న అని ఏడుస్తాంటే గుండె భగ్గుమనింది మామ....చివరకు ఆ పాప వాళ్ల అవ్వ కనీసం నాకు పింఛన్ అయినా ఇయ్యండయ్యా అని ఎంత మొత్తుకోని ఏడ్సినా ఎవరూ పట్టించుకోల్యా! ‘అవునుమామ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 ఇచ్చినారు. మన వార్డులో ఎంతమంది ముసలోళ్లు ఉండారో....అందరికీ 200 పింఛన్ ఇచ్చినారు...అదిగుడక ఒకటో తేదీ జీతం మాదిరి!’ ‘ పింఛనే కాదురా...బుగ్గవంకకు మళ్లీ వరద రాకుండా మొత్తం రక్షణ గోడ కట్టినారు..’ ఇంక ఎంత వరదొచ్చినా నీళ్లు రావు.’ ‘ఇంతకు పెద్దాయప్ప సీఎం అయిన తర్వాత కడప కు శానా మేలు చేసినాడు మామ..కడపను కార్పొరేషన్ సేసినాడు. రిమ్స్ కట్టిచ్చినాడు...యూనివర్శిటీ...రోడ్లు వెడల్పు చేయడం...బుగ్గవంకపైన ఫ్లైఓవర్ బ్రిడ్జిలు..ఒక్కటేంటి శానా చేసినాడు.’ ‘కడపకే కాదురా...జిల్లా అంతా బాగా సేసినారు. రాయచోటి, బద్వేలు, రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ఒక్కటేసారి ఐదు మునిసిపాలిటీలు సేసినాడు. అప్పట్లో రాజీవ్ నగరబాట’ అని వచ్చి...ఏసమస్యలు అధికారులు సెప్పినారో...అన్నిటికి డబ్బులు ఇచ్చినాడు.’ ‘ కరెక్టే ప్రొద్దుటూరు వెటర్నరీ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ కట్టిచ్చినాడు...తాగునీటి సమస్య తీర్చేందుకు కుందు-పెన్నా వరద కాలువకు డబ్బులు ఇచ్చినాడు.’ ‘ఇంతకీ అది పూర్తి అయిందా...కాలేదా..?’ ‘కాలేదు... ఆ ఇద్దరు నాయకులు ఒకర్నిమించి ఒకరు దాన్ని అడ్డుకున్య్నారు. ఇప్పుడు ఇద్దరు టీడీపీలో సేరినారు. వాళ్లిద్దరి వల్లనే ఆ నీళ్లు పెన్నాలోకి రాలే! ఈ విషయం పొద్దుటూరోళ్లందరికీ తెలుసు. అయినా 25 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి నీళ్ల సమస్య కూడా తీర్చకపోవడం ఏంటి మామ..దేనికి ఓట్లేసేది పన్లాకనా!’ ‘కరెక్టేరా..!పక్కనే జమ్మలమడుగు ఎమ్మెల్యే సూ డు మైలవరం నుంచి వాటర్ స్కీం తీసుకొచ్చినాడు.! ‘అదొక్కటే కాదు మామ..ఆస్పత్రికి 2004 నుంచి ఇప్పటి దాకా ప్రతీ నెల 30వేల మందులకు డబ్బులు ఇచ్చాండాడు. ఆయప్ప పుణ్యాన రోగులంతా సంతోషంగా ఉండారు. పైగా అక్కడ ప్రతీ వీధిలో సిమెంట్‌రోడ్లు ఉంటాయి...మొత్తానికి ఆయప్ప బాగా సేసుకున్యాడు. ‘పులివెందుల పరిస్థితి ఏంటి? ‘దాని కథ సెప్పాలేంవోయ్...ఒక్కసారి పోయి సూడుపో...ఎట్టుందో!’ ‘మొత్తానికి పెద్దాయప్ప వల్ల అందరూ లబ్ది పొందినారు మామ.’ ‘అందరూ అంటే...’ ‘అందరూ అంటే అందరూ గ్యాస్ సబ్సిడీ 50 రూపాయలు వైఎస్సే భరించినాడు. దీంతో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. చివరకు చంద్రబాబు నాయుడు ఇంట్లో గ్యాస్‌కు కూడా వైఎస్ ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ భరించింది.’ ‘కరెక్ట్మామ...ఆయప్ప ఇచ్చిన ఫీజురీయింబర్స్‌మెంట్ వల్ల మా తమ్ముడు సదువుకున్న్యాడు. ఆరోగ్యశ్రీ వల్ల మీ తాత ఆపరేషన్ చేయించుకున్నాడు.’ ‘నీకు ఒకమాట సెప్పమంటావా...మా తాత...హెడ్మాస్టర్గా రిటైరైనప్పుడు 5వేలు జీతం తీసుకోలేదంటా. ఇప్పుడు పింఛనే 15వేలు పైన వస్తాంది...ఇదంతా వైఎస్ పెంచాడని మాతాత సెబుతాంటాడు.’ ‘మరి ఇట్టాంటోళ్లంతా వైఎస్ కుటుంబాన్ని మర్సిపోకూడదు మామ...ఎందుకంటే కొట్టినోన్ని...పెట్టినోన్ని మర్సిపోకూడదు కదా..!’ ‘సరే...మామ...మనకు ఎవ్వరు మేలు చేసినారో...సేచ్చారో వాళ్లకే ఓట్లేద్దాం..పద ఓట్లకు టైం అయితాంది....’ ‘సరే...ఉండు ఇంట్లో మా అవ్వపడుకోని ఉంది..‘ఫ్యాన్’ స్విచ్ వేసొస్తా..!! - సాక్షి, కడప -
డీఎంకేను చీల్చేందుకు అళగిరి సిద్ధం?
తమిళనాట మరో కొత్త పార్టీ రాబోతోంది. డీఎంకే నుంచి బహిష్కతుడైన కరుణానిధి పెద్దకుమారుడు ఎంకే అళగిరి.. తన తండ్రి పార్టీని నిలువునా చీల్చి, కొత్త పార్టీ పెట్టేందుకు చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ముందుగా తన సొంత నియోజకవర్గం మదురైలో తన మద్దతుదారులతో సమావేశం అవుతున్నారు. క్రమశిక్షణ రాహిత్యం ఆరోపణలతో జనవరిలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అళగిరి, పార్టీ పెట్టే విషయాన్ని గతవారమే సూచనప్రాయంగా వెల్లడించారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాతే ఈ విషయమై నిర్ణయం తీసుకుంటానంటున్నారు. కానీ ఇప్పటికే కళైంగర్ డీఎంకే అనే పేరును కొత్త పార్టీకి పెడుతూ మదురైలో పోస్టర్లు వెలిశాయి. ఇంతకుముందే ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు, బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలిసిన అళగిరి, ఆ తర్వాత సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కూడా భేటీ అయ్యారు. ఒకవేళ అళగిరి కొత్త పార్టీ పెడితే మాత్రం తన కంచుకోట అయిన దక్షిణ తమిళనాడు ప్రాంతంలో డీఎంకే విజయావకాశాలను అళగిరి గట్టిగా దెబ్బతీయగలరు. 2001 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇలాగే రెబల్ అభ్యర్థులను రంగంలో నిలబెట్టి, 30 మంది పార్టీ అభ్యర్థులను ఓడించారు. అయితే డీఎంకే వర్గాలు మాత్రం స్టాలిన్ ఉన్నంతవరకు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని అంటున్నాయి. -
కలైంజర్ డీఎంకే!
మదురైలో ఆదివారం పోస్టర్లు కలకలం రేపాయి. డీఎంకే వర్గాల్లో గుబులు పుట్టించే రీతిలో హంగామా సృష్టిస్తూ వీటిని అళగిరి మద్దతుదారులు సిద్ధం చేశారు. డీఎంకేను చీలుస్తూ కలైంజర్ డీఎంకే పేరిట పార్టీ ఆవిర్భావం అన్న నినాదాలను అందులో పొందు పరచడం చర్చకు దారి తీస్తున్నది. ఈ తంతు ఓ వైపు ఉంటే మరో వైపు సోమవారం తన మద్దతుదారులతో మంతనాలకు అళగిరి సిద్ధం అయ్యారు. సాక్షి, చెన్నై:డీఎంకే నుంచి అళగిరిని బహిష్కరించిన విషయం తెలిసిందే. పార్టీ తనను దూరం పెట్టినా, కలైంజర్ కరుణానిధి మాత్రం తన నాయకుడంటూ అళగిరి చెప్పుకొస్తున్నారు. కరుణానిధిని తప్ప మరొకరిని నాయకుడిగా అంగీకరించబోనని స్పష్టం చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా అళగిరి వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారి తీస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే పతనం తప్పదని బల్ల గుద్ది మరీ ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తన సత్తాను చాటుతానని హెచ్చరికలు చేస్తూ వచ్చిన అళగిరి గత వారం మీడియాకు చిక్కారు. పార్టీ పెట్టబోతున్నారా? అని మీడియా ప్రశ్నించగా లేదని సమాధానం ఇచ్చిన ఆయన తన మద్దతుదారుల అభీష్టమే తన నిర్ణయంగా ప్రకటించారు. జాతీయ స్థాయి నేతలతోపాటు, దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో ఆయన భేటీ కావడంలో ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న బయలు దేరింది. రజనీ కాంత్‌తో భేటీ అనంతరం ఈనెల 17న మద్దతుదారులతో భేటీ కాబోతున్నట్టు, అందులో తీసుకునే నిర్ణయం మేరకు లోక్‌సభ ఎన్నికల్లో తన మద్దతు ఎవరికోనన్నది ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేశారు. ఏర్పాట్లు: మద్దతుదారులతో భేటీకి అళగిరి నిర్ణయించడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మదురైలో ఓ కల్యాణ మండపం వేదికగా సోమవారం మద్దతుదారులను కలుసుకునేందుకు అళగిరి సిద్ధం అయ్యారు. ఇందులో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది. మీడియూ అంతా మదురై వైపు చూస్తున్నది. అదే సమయంలో అళగిరి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, తమకు ఎలాంటి ఢోకా లేదని డీఎంకే వర్గాలు పైపైకి చెబుతున్నా, లోలోపల అళగిరి కార్యచరణపై నిఘా వేసి ఉన్నాయి. ఈ సమయంలో ఏకంగా పార్టీ పెట్టేద్దామని పిలుపునిస్తూ అళగిరి మద్దతుదారులు మదురైలో ఆదివారం హల్చల్ సృష్టించారు. పోస్టర్ల కలకలం: సోమవారం మద్దతుదారులతో అళగిరి మంతనాలకు సిద్ధం అవుతున్న సమయంలో ఆదివారం మదురైలో పోస్టర్లు కలకలం సృష్టించాయి. డీఎంకేను రెండుగా చీలుస్తూ, కలైంజర్ డీఎంకే పేరిట ఈ పోస్టర్లు వెలిశాయి. పార్టీని, జెండాను ప్రకటిచేద్దాం...లోక్ సభ ఎన్నికల బరిలో అభ్యర్థులను నిలబెట్టేద్దామన్న నినాదంతో వెలసిన ఈ పోస్టర్లపై డీఎంకే వర్గాలు దృష్టి కేంద్రీకరించారుు. కేవలం తమను బెదిరించేందుకు ఈ పోస్టర్లు వెలిశాయూ లేదా, అళగిరి పార్టీ పెట్టే నిర్ణయంతో ఉన్నారా..? అనే అన్వేషణలో మదురై డీఎంకే నాయకులు తలమునకలై ఉన్నారు. మద్దతుదారుల అభీష్టం మేరకు పార్టీ నిర్ణయం ఉంటుందని అళగిరి ఇప్పటికే స్పష్టం చేసిన దృష్ట్యా, తాజాగా వెలసిన పోస్టర్లపైఅ ళగిరి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
రేపు పవన్ ప్రెస్ మీట్..మీడియాకు ఆహ్వానం
-
మరో కొత్త పార్టీ?
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం స్టాలిన్, అళగిరి మధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల పార్టీ నుంచి అళగిరి బహిష్కరణకు గురయ్యూరు. ఆయన మద్దతుదారుల్లో పలువురు అళగిరి వెంట నడిచారు. మరి కొందరు స్టాలిన్‌కు మద్దతు ప్రకటించారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక అళగిరి రోజుకో వ్యాఖ్యతో వార్తల్లో వ్యక్తిగా అవతరించారు. పార్టీతోపాటు నాయకులపై విమర్శనాస్త్రాలు ఎక్కు బెడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల సీట్లను అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలు సంధించారు. అయితే, ఆయన వ్యాఖ్యల్ని డీఎంకే అధిష్టానం పట్టించుకునే పరిస్థితిలో లేదు. తన మద్దతుదారులను స్వయంగా వెళ్లి కలుస్తూ వస్తున్న అళగిరి, డీఎంకేలో ఒకప్పుడు సేవలు అందించి, ఇప్పుడు పార్టీకి దూరంగా ఉన్న వాళ్లను కలుపుకు వెళ్లే యత్నంలో ఉన్నారు. మద్దతుదారులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నా, ఏదేని వేడుకలకు ఆహ్వానించినా హాజరవుతూ, వారికి తానున్నానన్న భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు అళగిరి డీఎంకేను చీల్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.చీలిక: డీఎంకేలో చీలిక దిశగా అళగిరి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పవచ్చు. పార్టీలో స్టాలిన్ వర్గం తిరస్కరించిన వారిని ఏకం చేయడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్టు ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అందుకే రాష్ట్రంలో ఆయన పర్యటన చాప కింద నీరులా సాగుతోందంటున్నారు. అదే సమయంలో తన మద్దతుదారులుగా ఉన్న రితీష్, నెపోలియన్, పళిని మాణిక్యం, ఆది శంకర్, జయ దురై, ెహ లన్ డేవిడ్ సన్లకు మళ్లీ సీటు ఇవ్వకుండా స్టాలిన్ అడ్డుపడ్డారన్న సమాచారంతో అళగిరి మరింత ఆక్రోశంతో ఉన్నారు. పార్టీకి సేవలు అందించిన వారందరినీ పక్కన పెట్టిన దృష్ట్యా, వారిని కలుపుకుని తన సత్తా చాటుకునేందుకు అళగిరి సిద్ధం అవుతున్నారు. కొత్త పార్టీ: లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే భవిష్యత్తు తేలడం ఖాయం అన్న ధీమాతో అళగిరి ఉన్నారు. డిపాజిట్లు గల్లంతైన పక్షంలో తన సత్తాను చాటుకుంటూ తెరపైకి కొత్త పార్టీని తెచ్చే వ్యూహంతో అళగిరి ఉన్నాట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీలో నెలకొన్న పరిస్థితుల్లో ఎలాగో రానున్న ఎన్నికల్లో డీఎంకేకు పతనం తప్పదంటూ పదే పదే చెప్పుకొచ్చిన అళగిరి, ఆ ఎన్నికల అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు బలం చేకూరే రీతిలో సోమవారం అళగిరి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రెండు నెలల్లో: ఒకప్పుడు డీఎంకేకు సేవలు అందించి, తాజాగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పంబళ్ నల్ల తంబిని ఉదయం అళగిరి పరామర్శించారు. 25 వాహనాలతో కాన్వాయ్ రూపంలో కాంచీపురం జిల్లా పరిధిలోని పల్లావరం వైపుగా అళగిరి దూసుకెళ్లారు. ఆయన రాకను వ్యతిరేకిస్తూ అక్కడి డీఎంకే నాయకుడు కరుణాకరన్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం జరిగినా పట్టించుకోలేదు. నేరుగా నల్ల తంబి ఇంటికి వెళ్లిన అళగిరి గంట పాటుగా అక్కడున్నారు. అనంతరం వెలుపలకు వచ్చిన అళగిరిని మీడియా కదిలించగా, డీఎంకేపై ఆక్రోశాన్ని వెల్లగక్కారు. కొత్త పార్టీ పెట్టే వ్యూహంలో ఉన్నట్టుందే..? అని మీడియా ప్రశ్నించగా లేదు అని సమాధానం ఇచ్చారు. తమరి మద్దతుదారులు కొత్త పార్టీ పెట్టాలని ఆశిస్తున్నట్టుందే..? అని ప్రశ్నించగా, వారందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మద్దతుదారుల అభీష్టం మేరకు తన నిర్ణయాలు ఉంటాయని, రెండు నెలల్లో కొత్త పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తానని అళగిరి స్పష్టం చేయడం విశేషం. -
కిరణ్ సభకు ఆదిలోనే హంసపాదు
రాజమండ్రి : మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సభకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభకు జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. ఈనెల 12వ తేదీ గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో పార్టీ పేరు సహా జెండా, ఏజెండా ప్రకటిస్తామని కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సభకు అనుమతి లేకపోవటంతో కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. దాంతో బహిరంగ సభ ఏర్పాట్లలో నిమగ్నమైన ఎంపీలు ఉండవల్లి అరుణ్ కుమార్, హర్షకుమార్లు సభా స్థలిని మార్చే ఆలోచనలో ఉన్నారు. కాగా సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా నిర్ణయం కావాల్సి ఉంది. -
పవన్ కల్యాణ్ పార్టీపై కాంగ్రెస్ లో టెన్షన్!
హైదరాబాద్:ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ఆరంగేట్రం ఊహాగానాలపై అప్పుడే కాంగ్రెస్ నేతల్లో అలజడి మొదలైంది. పవన్ అన్నయ్య చిరంజీవి ఒక ప్రక్క కాంగ్రెస్ పార్టీలోకీలక పాత్ర పోషిస్తుండగా, ఇప్పుడు అదే కుటుంబం నుంచి కొత్త పార్టీ ఏమిటని కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. పవన్ కొత్త పార్టీ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు మీనమేషాలు లెక్కిస్తున్నారు. పవన్ కల్యాణ్ కొత్త పార్టీ పెడితే కాంగ్రెస్ పరిస్థితి ఏమిటని కొందరు తమకు తామే ప్రశ్నించుకుంటుండగా, మరికొందరిలో మాత్రం పవన్ తమ ప్రక్క చేరితే బాగుంటుందని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ పార్టీపై కాంగ్రెస్ పెద్దలు తమదైన శైలిలో కూనిరాగాలు తీస్తూ ముందుకు వెళుతున్నారు. పవన్ పార్టీ పెడితే స్వాగతిస్తామని పైకి చెబుతున్న కాంగ్రెస్ నాయకులు లోలోపల మాత్రం మల్లగుల్లలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇప్పటికే ఒక అడుగు ముందుకేసి పవన్ పార్టీ పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అంతటి ఆగకుండా, పవన్ కల్యాణ్ తమతో జత కట్టిన ఫర్వాలేదంటూ మరోరాగాన్ని ఆలపించారు. దీంతో వారి మనసుల్లో ఏముందో సామాన్య జనానికి ఇట్టే అవగతమవుతుంది. మరో కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మాత్రం పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఆదర్శవంతమైన జీవితం, వ్యక్తిత్వం కల్గిన వారే రాజకీయాలకు అర్హులంటూ తనశైలిని కాస్త రంగరించారు. మహిళలకు అన్యాయం చేసేవారిని ప్రజలు ఛీకొడతారంటూ కొత్తపాట అందుకున్నారు. మూడో పెళ్లి చేసుకున్న పవన్ కల్యాణ్ ముందు నీతి నిజాయితీ నిరూపించుకోవాలని ఎద్దేవా చేశారు. పవన్ పార్టీ పెడతారా?లేదా?అనేది ప్రక్కన పెడితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పార్టీలపై వస్తున్న వార్తలు మాత్రం కాంగ్రెస్ నేతల గుండెల్లో అలజడి సృష్టిస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన కాంగ్రెస్ కు భవితవ్యాన్నిమాత్రం కాలమే నిర్ణయించాలి. -
కిరణ్ పార్టీకి ఒక్కసీటు కూడా రాదు: భూమన
కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే కొత్త పార్టీకి ఒక్క సీటు కూడా రాదని వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్ఠానానికి పూర్తిస్థాయిలో సహకరించింది కిరణ్ కుమార్ రెడ్డేనని, ఇప్పుడు ఆయన కొత్త పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఇప్పుడు కిరణ్ నిందలు వేయడం సిగ్గుచేటని భూమన మండిపడ్డారు. అసలు జగన్ పేరు వింటేనే కిరణ్, చంద్రబాబులకు వెన్నులో వణుకు పుడుతోందని ఆయన అన్నారు. -
కిరణ్ కొత్త పార్టీ
-
ఒక్కరంటే ఒక్కరేరీ?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి ‘అనంత’ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. ఈ నెల 12న తాను స్థాపించే కొత్త పార్టీలో చేరాలని గురువారం ‘ఫోన్’లో కాంగ్రెస్ నేతలను కిరణ్ ఆహ్వానించారు. కానీ.. అధిక శాతం మంది ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. వివరాల్లోకి వెళితే.. కాంగ్రెస్ అధిష్టానం డెరైక్షన్‌లో రాష్ట్ర విభజనకు బాటలు వేసిన కిరణ్ ఇప్పుడు కొత్త పార్టీ స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కీలక నేతలకు ఆయన ఫోన్ చేసి.. పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కిరణ్‌తో ఆది నుంచి స్నేహంగా ఉన్న రఘువీరా.. రెండేళ్ల క్రితం విభేదించారు. గురువారం మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ద్వారా రఘువీరాతో కిరణ్ ఫోన్లో మాట్లాడే యత్నం చేశారు. కానీ.. కిరణ్‌తో మాట్లాడేందుకు రఘువీరా నిరాకరించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డికి కిరణ్ నేరుగా ఫోన్ చేసి.. తమతో కలిసి నడవాలని కోరగా.. తాను కాంగ్రెస్‌లోనే కొనసాగదల్చుకున్నానని ఎంపీ తెగేసి చెప్పడంతో కిరణ్ షాక్ తిన్నారు. మొదట్లో కిరణ్‌ను సమర్థించిన గుంతకల్లు ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తా ఇప్పుడు నిరాకరించారు. మడకశిర ఎమ్మెల్యే సుధాకర్ కూడా తాను రఘువీరానే అనుసరిస్తానని కిరణ్‌కు స్పష్టీకరించారు. జేసీతో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిని కూడా తన వైపునకు తిప్పుకునేందుకు కిరణ్ చేసిన యత్నాలు వికటించాయి. డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి కూడా కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. రఘువీరాతో విభేదించిన తర్వాత కిరణ్.. ఏడాదిన్నర కాలంగా సీనియర్ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డితో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఒకానొక దశలో కిరణ్‌తో కలిసి జేసీ దివాకర్‌రెడ్డి సాగుతారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వాటిని నిజం చేస్తూ కొత్త పార్టీని స్థాపించడంపై కిరణ్ నిర్వహించిన చర్చల్లో కూడా పాల్గొన్నారు. తనతో కలిసి నడుస్తారనే నెపంతోనే జేసీ దివాకర్‌రెడ్డి సన్నిహితులకు చెందిన త్రిశూల్ సిమెంట్స్‌కు కేటాయించిన సున్నపురాళ్ల గనుల లీజును కూడా పొడిగించినట్లు అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. కానీ.. టీడీపీలో తనకు బెర్తు ఖరారు కావడంతో కిరణ్‌కు జేసీ దివాకర్‌రెడ్డి మొహం చాటేశారు. మాజీ మంత్రి శైలజానాథ్‌కు కిరణ్ భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినట్లు కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. శైలజానాథ్‌కు వైద్యం కోసం రూ.40 లక్షలను అధికారికంగా మంజూరు చేయడాన్ని అందుకు తార్కాణంగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సాన్నిహిత్యంతో శైలజానాథ్ ఒక్కరైనా తనతో నడుస్తారని కిరణ్ భావిస్తున్నారు. కానీ.. శైలజానాథ్ అందుకు సుముఖంగా లేనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో బెర్తు ఖాళీ లేకపోవడంతో.. టీడీపీ వైపు చూస్తున్నారు. జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా టీడీపీ టికెట్ సాధించేందుకు శైలజానాథ్ తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వర్గీయులు చెబుతుండటం గమనార్హం. ఒకవేళ శైలజానాథ్‌కు కూడా మరో పార్టీలో బెర్తు ఖరారైతే.. జిల్లా నుంచి కిరణ్ వెంట ఒక్కరు కూడా నడిచే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వెళ్లాలా... వద్దా
సాక్షి ప్రతినిధి, కడప : ఊగిసలాట నడుమ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆయన వెంటే ఉండాలని ముందుగా నిర్ణయించినా ఎందుకో స్తబ్దత ఆవహించింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జిల్లా నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్న తరుణంలో కొత్త పార్టీ ప్రకటన చేశారు. కిరణ్‌తో జత కట్టలా.. వద్దా అని జిల్లా నేతలు తర్జన భర్జన పడుతున్నారు. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ పార్టీ నాయకులను అతలాకుతలం చేసింది. ఆ పార్టీని వీడేందుకు జిల్లా నేతలంతా సన్నద్ధమయ్యారు. ప్రత్యామ్నాయ రాజకీయం కోసం ఎదుటి పార్టీల వైపు చూస్తూ ఎవరి దారిన వారు వెళ్లేందుకు సంసిద్ధులయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కొత్త పార్టీ పెడతారని భావించారు. అందులో చేరి తమ భవిష్యత్తును పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టే దిశగా అడుగులు కనిపించకపోవడంతో పలువురు నాయకులు పక్క పార్టీల వైపు చూస్తుండిపోయారు. అయితే ఉన్నట్లుండి కొత్త పార్టీ పెడుతున్నట్లు కిరణ్ ప్రకటించడంతో డైలమాలో పడిపోయారు. ప్రజలను ఏ మేరకు కిరణ్ ఆకట్టుకోగలరు.. ఆ పార్టీలో కొనసాగితే ఏ మేరకు ఉపయోగముంటుందని చర్చల్లో జిల్లా నేతలు నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్పార్టీకి జిల్లాలో సారధ్య బాధ్యతలు వహించేందుకు మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి సంసిద్ధంగా ఉన్నట్లు సమాచారం. డైలమాలో కాంగ్రెస్ నేతలు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రత్యామ్నాయ పార్టీని ఏర్పాటు చేయలేరనే అంచనాకు వచ్చిన కాంగ్రెస్ నేతలు రాజకీయ భవిష్యత్తు కోసం టీడీపీ పంచన చేరేందుకు సంసిద్ధులయ్యారు. ఆ మేరకు వారివారి స్థానాలను ఖాయం చేసుకునేందుకు రాజకీయ ఎత్తుగడలను ప్రారంభించారు. అందులో భాగంగా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి టీడీపీ టిక్కెట్ కోసం విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ సభ్యుడు రమేష్ ద్వారా కొంతమేర సఫలీకృతమైనట్లు తెలుస్తోంది. ఈ దశలో కిరణ్ పార్టీ ప్రకటన రావడంతో డైలామాలో పడినట్లు సమాచారం. ఎమ్మెల్సీ బత్యాల సైతం ఇదే రకమైన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట బరిలో సాయిప్రతాప్ రాజంపేట పార్లమెంట్ స్థానానికి కిరణ్ పార్టీ నుంచి సాయిప్రతాప్ పోటీ చేసేందుకు దాదాపు రెడీ అయినట్లు తెలుస్తోంది. కిరణ్ పార్టీ ప్రకటన లేకపోతే టీడీపీ నేతలతో సయోధ్య కుదుర్చుకునేందుకు తీవ్ర మంతనాలు చేసిన ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సాయిప్రతాప్తోపాటు రమేష్‌రెడ్డి, తులసిరెడ్డి, కమలమ్మ పయనించనున్నారు. మిగతా నేతలు ఊగిసలాటలో ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. నిరాశలో తెలుగుదేశం పార్టీ ప్రజా మద్దతు అపారంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేతల మైత్రిని కొనసాగించాలని టీడీపీ భావించింది. ఆ మేరకు జిల్లాలోని కాంగ్రెస్ నేతలందరికీ ఏదో ఒక రీతిలో ఎరవేస్తూ టీడీపీలో చేర్చుకునేందుకు ఆపార్టీ నేతలు సమాయత్తమయ్యారు. ఈదశలో కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తగా పార్టీ పెట్టనుండడంతో జిల్లాలోని కొందరు నేతలు కిరణ్ వెంట నిలవనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నేతలు జతకడితే ఎంతో కొంత ప్రయోజం ఉంటుందని భావించిన టీడీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైందని పరిశీలకులు పేర్కొంటున్నారు. -
వచ్చేవారంలో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ప్రకటన
వచ్చేవారంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టడం ఖాయం అని తెలుస్తోంది. పార్టీ పేరును, ఎజెండాను ఆయన ప్రకటించనున్నారని సమాచారం. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ఈరోజే ప్రకటించారు. పవన్ మరో పార్టీ పెట్టబోతున్నట్లు చెబుతున్నారు. రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారు. దానిని రాజకీయ పార్టీ ప్రకటన రోజున విడుదల చేస్తారని చెబుతున్నారు. సమాజంలో రాజకీయాలు మారాలి - ప్రజాస్వామ్య దేశంలో హక్కులు, విధులు - ప్రజలతో ప్రభుత్వం సత్సంబంధాలు ... తదితర అంశాలను ఆ పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం తర్వాత బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాబోతున్నారని పది రోజుల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పలువురు ఆయనను తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ తమ పార్టీలో చేరతామంటే స్వాగతిస్తామని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. తెలుగు దేశం పార్టీ నేతలు కూడా ఆహ్వానం పలికారు. అయితే పవన్ కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని - లోకసత్తా పార్టీ తరపున పోటీ చేస్తారని - మల్కాజిగిరి లేక ఏలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని - లేదు కొత్త పార్టీ పెడతారని - ఆ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్పీ) లేక యువరాజ్యం అని ....ఇలా అనేక రకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ వార్తలన్నిటికీ బలం చేకూరే విధంగా ఈనెల రెండో వారంలో మీడియా ముందుకు రానున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నెల 9వ తేది ఆదివారం పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి ఓ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఆ ప్రకటన ఏదో చేస్తేగాని ఈ ప్రచారానికి తెరపడదు. -
కొత్త పార్టీ ప్రకటించిన కిరణ్
-
తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్త పార్టీ: కిరణ్
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవమే అజెండాగా కొత్తపార్టీ పెట్టనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాదాపూర్ ఇమేజ్ హాలులో ఈ సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగువారి గుండెచప్పుడే తమ విధానంగా పార్టీ అని చెప్పారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన, రాజీనామా చేసిన కొందరు నేతలతో కిరణ్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కొత్త పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నెల 12వ తేది గురువారం సాయంత్రం 4 గంటలకు రాజమండ్రిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆ సభలో పార్టీ పేరు, పార్టీ విధివిధానాలు, ఇతర అంశాలు ప్రకటిస్తామన్నారు. పదవుల కోసం కాదని, ప్రజల కోసం పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగిన విధానం - ముసాయిదా బిల్లు - పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన తీరు - ఆంధ్రప్రదేశ్ ఎంపిల బహిష్కరణ - తెలుగు జాతికి చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా రాజీనామా చేసినట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరిగిందన్నారు. పార్లమెంటరీ వ్యవస్థకు సిగ్గుచేటు కలిగించే విధంగా విభజన జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం అనుసరించిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడుకు ఇప్పటికి కూడా స్పష్టతలేదన్నారు. రాష్ట్రాన్ని కలిసి ఉంచాలని ఆయన ఇప్పటికీ చెప్పడంలేదన్నారు. రాజకీయ లాభం కోసం వారు ప్రవర్తించిన తీరు బాధ కలిగించిందన్నారు. శాసనసభలో కూడా చంద్రబాబు అభిప్రాయం చెప్పలేదని గుర్తు చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపి కలిసి తెలుగు జాతికి అన్యాయం చేశాయన్నారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పురుడుపోసి తల్లిని చంపారని అన్నారు. అధ్వానీ ఇటువంటి బిల్లు పార్లమెంటు చరిత్రలో ఎప్పుడూ పెట్టలేదన్నారు. సుష్మాస్వరాజ్ బిల్లు లోక్‌సభలో ప్రవేశపెట్టలేదన్నారు. ఉభయ సభలలో సభ్యులు ప్రవర్తనకు బాధ కలిగిందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారని విమర్శించారు. కలిసి ఉండాలన్న తెలుగు ప్రజల భావనను ఎవరూ వ్యక్తీకరించలేకపోయారని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కాపాడటానికి, వారి ఆలోచనల మేరకు నడిచేందుకు పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ప్రపంచంలో ఉండే తెలుగువారందరి ఆత్మగౌరవాన్ని, వారి గుండెచప్పుడుని అర్ధం చేసుకునే విధంగా తమ పార్టీ ఉంటుందని చెప్పారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలపై విచారణ విషయం విలేకరులు ప్రస్తావించగా, తాను భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. విచారణ చేసుకోవచ్చని తెలిపారు. గవర్నర్‌కు తాను భయపడే వ్యక్తిని కాదన్నారు. తన ముఖ్యమంత్రి పదవి తెరిచిన పుస్తకం అని చెప్పారు. విలేకరుల సమావేశంలో లగడపాటి రాజగోపాల్, సబ్బం హరి, హర్షకుమార్, శాయిప్రతాప్ పాల్గొన్నారు. -
విభేదాలను వాడుకోడానికే కిరణ్ కొత్త పార్టీ: బొత్స
విభజన అనంతరం రెండు రాష్ట్రాల పీసీసీల విషయాన్ని అధిష్ఠానం రెండు రోజుల్లో తేలుస్తుందని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పారు. రెండు రాష్ట్రాలకు వేరువేరు పీసీసీలా, రెండు ప్రాంతీయ కమిటీలా లేక ఒక్క పీసీసీ కిందే రెండు పీసీలల అనే విషయం తేలిపోతుందని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీయేనని, అయితే తెలంగాణ వచ్చింది కాబట్టి అది కాంగ్రెస్‌లో విలీనమవుతుందా, లేక రాజకీయ పార్టీగా కొనసాగుతుందా అనే విషయాన్ని టీఆర్ఎస్ పెద్దలే చెప్పాలని అన్నారు. విలీనం అంశం హైకమాండ్ పరిధిలోనిదని, దానిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని తెలిపారు. జైరామ్ రమేష్ టీఆర్ఎస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, కాని కేసీఆర్ మాత్రం జైరామ్ రమేష్ ను కించపరిచేలా మాట్లాడడం సరికాదని బొత్స అన్నారు. ఎన్నికల ముందు రాజకీయ వలసలు సహజమేనని, అయితే కాంగ్రెస్ నుంచి వలసలను ప్రోత్సహిస్తూ టీడీపీ విలువలు లేని రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం సీమాంధ్రకు ఇచ్చిన ప్యాకేజీని ప్రజల్లోకి తీసుకెళ్లి విభజన వల్ల సీమాంధ్రకు మేలే జరిగిందని చెబుతామన్నారు. ప్రజల్లో ఉన్న తాత్కాలిక విభేదాలను రాజకీయాల్లో వాడుకునేందుకు కిరణ్ కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నట్లు బొత్స ఆరోపించారు. ఇక సీమాంధ్రలోని నాలుగు జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు కొత్త ఇంచార్జులను నియమించినట్లు బొత్స సత్యనారాయణ చెప్పారు. పశ్చిమగోదావరికి ఎం.వెంకటేశ్వరరావు (రత్నం), నెల్లూరుకు ధనుంజయరెడ్డి, చిత్తూరుకు వేణుగోపాలరెడ్డి, అనంతపురానికి మాజీ ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డిలను నియమించామన్నారు. ఈనెల 5వ తేదీ ఉదయం11 గంటలకు గాంధీభవన్‌లో సీమాంధ్ర డీసీసీ, సీసీసీ అధ్యక్షులు ఆప్రాంత బేరర్లతో సమావేశం ఉంటుందని, ఆ సందర్భంగా సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచన చేయనున్నామని చెప్పారు. -
కిరణ్ వెంట నడిచేదెవరు?
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సోనియా డెరైక్షన్ మేరకు కొత్త పార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి జిల్లా నుంచి ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తిగా మారింది. నిన్న మొన్నటి వరకు కిరణ్ వెంట నడిచిన వారు కొత్త పార్టీలో చేరే అవకాశాలు తక్కువేనన్న భావన వ్యక్తమవుతోంది. ఏడాదిన్నర నుంచి కిరణ్‌తో విభేదిస్తున్న రఘువీరారెడ్డి తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని తేల్చి చెప్పారు. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి సైతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని ప్రకటించారు. కిరణ్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటూ వచ్చిన జేసీ దివాకరరెడ్డి.. కొత్త పార్టీ చర్చల్లో పాల్గొన్నా ఆ పార్టీలో చేరేదీ, లేనిదీ స్పష్టం చేయలేదు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జేసీ దివాకరరెడ్డిని అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ తరఫున బరిలోకి దించాలని నిర్ణయించడంతో.. ఆ పార్టీలోకి జేసీ చేరడం ఖాయంగా కన్పిస్తోంది. ఇన్నాళ్లూ కిరణ్ వెంటే ఉన్న శైలజానాథ్ కూడా టీడీపీలో చేరుతారన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. తనకు సన్నిహితుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ద్వారా టీడీపీలోకి చేరే అంశంపై జేసీ బ్రదర్స్‌తో శైలజానాథ్ మంతనాలు సాగించినట్లు సమాచారం. టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌తో కూడా శైలజానాథ్ చర్చలు సాగించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శైలజానాథ్ కొత్త పార్టీలో చేరుతారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న అంబికా లక్ష్మినారాయణ ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన్‌గుప్తా మాజీ మంత్రి రఘువీరాను అనుసరించేందుకే ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, పాటిల్ వేణుగోపాల్‌రెడ్డిలు కాంగ్రెస్‌లోనే ఉంటామని ఇప్పటికే ప్రకటించారు. కాగా ఇతర పార్టీల నుంచి కిరణ్ స్థాపించే కొత్త పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న నేతలు ఎవరూ బహిరంగంగా ముందుకు రాకపోవడం కొసమెరుపు. -
కిరణ్‌కు షాక్
-
కిరణ్ వెంటే ఉంటా..
కిరణ్ కుమార్ రెడ్డి వెంటే తాను ఉంటానని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ సీమాంధ్రకు ద్రోహం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు దక్కవన్నారు. మలాపురం, : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి వెంటే తాను ఉంటానని కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్పష్టం చేశారు. తన కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కిరణ్ కొత్త పార్టీ పెట్టి కొత్త రక్తాన్ని తీసుకువస్తారని ఆయన అన్నారు. బీజేపీకి రాష్ట్రంలో పట్టులేని కారణంగా విభజనకు మద్దతు తెలిపిందని ఆయన మండిపడ్డారు. తప్పుడు నిర్ణయాలతోనే రాష్ట్ర విభజన చేశారని, త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకుంటుందన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాదని ఆయన అన్నారు. టీబిల్లుకు సవరణలు చేసి ఆమోదించి ఉంటే విభజన వేరే విధంగా ఉండేదన్నారు. ప్రస్తుతం జరిగిన విభజనతో సీమాంధ్ర తీవ్రంగా నష్టపోయిందన్నారు. -
కొత్తపార్టీపై కిరణ్ తర్జనభర్జన
-
హైకమాండ్ డైరెక్షన్లో సీఎం రాజీనామా
-
కొత్తపార్టీపై చర్చ
హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు విషయమై చర్చిస్తున్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ సాయంత్రం పీసీపీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నివాసంలో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, సీఎం కొత్తపార్టీ ఏర్పాటు విభజన సమస్యకు పరిష్కారం కాదని మంత్రి రామచంద్రయ్య అన్నారు. సిడబ్ల్యూసి తెలంగాణ తీర్మానం చేసినప్పుడే సీఎం రాజీనామా చేసి ఉండాల్సిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాలకే సీఎం రాజీనామా అని విమర్శించారు. ఇది నిజమైన సమైక్యవాదం కాదని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్ బలహీనపడిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. పార్టీలో కొనసాగుతూ పార్టీని బలోపేతం చేయాలే తప్ప, కాంగ్రెస్‌ను వీడాలనుకోవడం సరికాదని రామచంద్రయ్య అన్నారు. -
ఎవరు కొత్త పార్టీ పెట్టినా జనం ఛీ కొడతారు:కొండ్రు
-
ప్రెస్‌మీట్ పెట్టినంత సులువు కాదు
సీఎం కొత్త పార్టీపై మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: రాజకీయ పార్టీ పెట్టడమంటే ప్రెస్‌మీట్ పెట్టినంత సులభం కాదని రాష్ట్ర మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త పార్టీ పెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి తనదైన శైలిలో స్పందించారు. శనివారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యతంటూ సీఎం తరచూ ప్రెస్మీట్లు పెడుతున్నారని, కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఆయన ఏ విధంగా భావిస్తున్నారో కానీ అది అంత సులభం కాదనేది తన అభిప్రాయమన్నారు. సీఎం కిరణ్, తాను నియోజకవర్గానికంటే ఎక్కువ స్థాయి నేతలమని చెప్పారు. అలాంటి స్థాయి నుంచి తాను మంత్రి, కిరణ్ ముఖ్యమంత్రి కాగలిగామంటే అందుకు సోనియానే కారణమని చెప్పారు. ఆమె ఇచ్చిన అవకాశాల వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామన్నారు. సీఎం రెండు చేతులతో ఎడాపెడా సంతకాలు చేస్తున్నా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలేవీ ముందుకు సాగడం లేదని చెప్పారు. విభజన విషయంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని డొక్కా పేర్కొన్నారు. ఏడు కోట్ల సీమాంధ్రుల ఆకాంక్షలను ఎంపీలు వ్యక్తపరుస్తుంటే పట్టించుకోకుండా కేంద్రం ముందుకెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. -
సీఎం కిరణ్ కొత్త పార్టీ పెట్టరు : డొక్కా
-
కొత్తపార్టీ పెట్టడం అంటే ప్రెస్కాన్ఫరెన్స్ పెట్టినంత ఈజీకాదు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టరని, ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రమే పెడతారని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. కొత్త పార్టీ పెట్టడం అనేది ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినంత సులువు కాదని చెప్పారు. తాను, సీఎం ఇద్దరమూ నియోజకవర్గ స్థాయి నేతలం మాత్రమేన్నారు. విధేయులమని భావించి అధిష్టానం తనని మంత్రిని, కిరణ్‌ను సీఎంను చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కరడుగట్టిన కాంగ్రెస్ వాదని డొక్కా పేర్కొన్నారు. 24 గంటలూ రెండు చేతులతో సంతకాలు పెట్టినా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. ఆయనకు బ్యాక్ ఆఫీస్ ఉందనేది కొందరి నేతల అభిప్రాయం అన్నారు. -
రాజీనామా తరువాత కొత్తపార్టీపై నిర్ణయం
-
రాజీనామా తరువాత కొత్తపార్టీపై నిర్ణయం
హైదరాబాద్: సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన రాజీనామా, కొత్త పార్టీ విషయమై చర్చలు జరుపుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఆరుగురు ఎంపీల బహిష్కరణ నేపథ్యంలో సీఎం చర్చలు కొనసాగిస్తున్నారు. ఎల్లుండి అసెంబ్లీ వేదికగా సిఎం మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక అక్కడ మాట్లాడటానికి కుదరకపోతే ప్రెస్‌మీట్ పెట్టి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. సీఎం రాజీనామా చేస్తారంటూ మంత్రుల ప్రచారం చేస్తున్నారు. సీఎం రాజీనామాకే కట్టుబడి ఉన్నారని మంత్రి పితాని సత్యనారాయణ కూడా చెప్పారు. రాజీనామా చేసిన తర్వాత రెండురోజులపాటు తనతో కలిసివచ్చేవారితో మేధోమధనం జరుపుతారని తెలుస్తోంది. ఆ తరువాత కొత్తపార్టీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. -
పొత్తుపై టీడీపీకి ఆశా ‘కిరణం’!
ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందేనని డిసైడయిన టీడీపీ.. తమతో పొత్తులకొచ్చే పార్టీల కోసం బూతద్ధం పెట్టి వెతుకుతోంది. పార్టీలు మారి వచ్చే వారిని చేర్పించుకోవడానికి ప్యాకేజీలు ప్రకటించిన తరహాలోనే పార్టీలకూ టోకుగా ప్యాకేజీని సిద్ధంగా ఉంచినా.. టీడీపీతో పొత్తంటేనే వామ్మో అని అన్ని పార్టీలు భయపడుతున్నాయట. ఆ పార్టీ నాయకత్వాన్ని జనం నమ్మడం లేదని, అలాంటి పార్టీతో పొత్తేంటని ముఖం మీదే చెప్పేస్తున్నారని తెలుగు తమ్ముళ్లు బాధపడిపోతున్నారు. మనతో పొత్తంటే పార్టీలు ఎగిరి గంతేసి ముందుకొచ్చిన రోజులు పోయి ఇలా అయిందేంటబ్బా అని మథనపడుతున్న తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు సన్నిహిత నేత ఒకరు శుభవార్త చెప్పారట. మనతో పొత్తు పెట్టుకుని కలిసి పని చేయడానికి ఆశా కిరణంలా కొత్త పార్టీ రాబోతోందని చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తెగ ఆనందపడిపోతున్నారట. అదేంటి సీఎం కిరణ్ ఏర్పాటు చేయబోతున్న కొత్త పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందన్న గ్యారంటీ ఏంటి? ఏమాత్రం అనుమానం అక్కరలేదు. పొత్తు గ్యారంటీ...! ‘ఒక్కొక్కరం ఏమీ చేయలేం...! అందుకే వచ్చే ఎన్నికలను ఎదుర్కొనడానికి ఏం చేయాలన్న దానిపై మన అధినేతతో ముందుగానే చర్చలు జరిగిపోయాయి. పార్టీ ఎప్పుడు పెట్టాలి? ఏం చేయాలి? ముందుగానే డిసైడైంది! విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో లగడపాటి, మన పార్టీ నేతలు, కొత్త పార్టీలోకొచ్చే మిగతా వాళ్లంతా ఒకే వేదికపై కూర్చున్నది చూడలేదా...?’ అని టీడీపీ నేత ఒకరు చెప్పడంతో తమ్ముళ్లు హమ్మయ్య.. అనుకున్నార్ట! -
సెకండ్ 'హ్యాండ్' పార్టీ
-
కొత్త పార్టీ.. ఊహాగానాలే : మంత్రి కె.పార్థసారథి
గూడూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంతంగా కొత్త పార్టీ పెడుతున్నారని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం ఊహాగానాలేనని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ మంత్రి కె.పార్థసారథి చెప్పారు. శుక్రవారం గూడూరు విచ్చేసిన ఆయన పార్టీ నాయకులతో స్థానిక సమస్యలపై చర్చించారు. సీఎం కొత్త పార్టీ పెడుతున్నారా అని ఈ సందర్భంగా ఆయన్ని విలేకరులు ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కరుడుగట్టిన సమైక్యవాది అని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని చెప్పారు. ఇటీవల రాష్ట్రంతో పాటు జిల్లాలోని పలు పట్టణాల్లో జై సమైక్యాంధ్ర నినాదంతో కూడిన ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. కొత్త పార్టీ పెట్టేందుకు చేస్తున్న ఏర్పాట్లలో భాగమే ఈ ఏర్పాట్లని.. ఎంపీ లగడపాటి బ్యానర్ల వెనుక కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోందని మంత్రిని ప్రశ్నించగా ఇది అవాస్తవమన్నారు. తమకు అందిన సమాచారం మేరకు 18 ఉద్యోగ సంఘాలు త్వరలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముమ్మరం చేయనున్నట్లు తెలిసిందన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా వారే ఈ బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. లజ్జబండ సమస్య పరిష్కరించండి... స్థానిక మంత్రి దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. రైతులు సాగు చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న లజ్జబండ పూడికతీత పనులను త్వరితగతిన చేపట్టాలని ఆయన్ని కోరారు. కాలువలో నిత్యం తూడు, గుర్రపుడెక్క నిండిపోతుండటంతో కొద్ది వర్షాలు కురిసినా డ్రెయిన్‌లో నీరు ఎగదన్ని సమీప పొలాలన్నీ ముంపునకు గురవుతున్నాయని, దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇరిగేషన్, డ్రెయిన్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కొల్లువారి వీధిలోని ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద లజ్జబండ డ్రెయిన్‌పై కాలిబాట వంతెన నిర్మించాలని రైతులు కోరగా, అధికారులతో మాట్లాడి ప్రతిపాదనలు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. -
సెకండ్ 'హ్యాండ్' పార్టీ
సమైక్యం ముసుగేసుకొస్తోంది.. కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కాంగ్రెస్ అధిష్టానం తారాగణం: తిరుగుబాటు మేకప్‌తో కాంగ్రెస్ నేతలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీ చర్చ ముగిసి ఢిల్లీకి తిరిగిపంపే గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. కాంగ్రెస్ ముసుగు మెల్లగా తొలగిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మునిగిపోయిన పడవలా మారడంతో కనీసం కాగితం పడవనైనా తయారు చేయాలన్న ఆలోచనను క్రమంగా అమలులో పెడుతోంది. ఏం చేసినా కాంగ్రెస్ కోలుకునే అవకాశాలు లేవని తేలిపోవడంతో.. సొంత పార్టీ నేతలతోనే కొత్తగా వేరే పార్టీ పెట్టించే ప్రణాళికను కాంగ్రెస్ అధిష్టానం ముందుగానే రచించిందని.. రాష్ట్ర విభజన నిర్ణయంతో పాటే బయటకు పొక్కిన విషయం తెలిసిందే. ఆమేరకు పక్కాగా నడిపిస్తున్న ఈ హైడ్రామాలో.. తనపై తిరుగుబాటు స్వరం వినిపిస్తూ సమైక్య నటన చేస్తున్న వారితోనే చివరి అంకం రక్తికట్టిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ నుంచి పుట్టబోయే పార్టీ స్వరూప స్వభావాలు పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌ల రూపంలో తెరకెక్కుతుంటే.. మరోవైపు ఆయా నేతలకు అందిస్తున్న భారీ ఆర్థిక ప్రయోజనాలు, ప్రచార ఒప్పందాల వివరాలు బయటపడుతున్నాయి. కళ్లు మూసుకుని పాలుతాగే పిల్లి చందంగా కాంగ్రెస్ వ్యవస్థ పై నుంచి కింది వరకు నడుపుతున్న ఈ నాటకం వాళ్లనుకుంటున్నట్టు గోప్యంగా ఏమీ లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న తెలుగుదేశం పార్టీ.. శత్రువుకి శత్రువు తన మిత్రుడన్న తీరులో కాంగ్రెస్ నాటకంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కాంగ్రెస్ - టీడీపీలు పరస్పర సహకారంతో ఉభయులూ లబ్ధిపొందవచ్చన్న ఆశతో ప్రణాళికను అమలు చేస్తున్నాయి. ఆ కారణంగానే తాజాగా చానెళ్లలో హోరెత్తుతున్న సమైక్య ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నోరు మెదపడం లేదని తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం రూపొందించిన పథకంలో భాగంగానే అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నేతలే ఇప్పుడు కొత్త పార్టీ రూపంలో సరికొత్త అవతారం ఎత్తనున్నారు. విభజన బిల్లుపై ఉభయ సభల్లో చర్చను పూర్తి చేసి కేంద్రానికి తిప్పిపంపిన వెంటనే కార్యాచరణతో రంగంలోకి దిగడానికి ఆ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. భూస్థాపితం చేస్తామన్నా.. క్రమశిక్షణ ఊసు లేదు! రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అధిష్టానాన్ని ధిక్కరిస్తూవచ్చారు. కొందరైతే ఏకంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అసలు కాంగ్రెస్ నాయకత్వ బాధ్యతల నుంచి ఆమె తప్పుకోవాలని డిమాండ్ చేసేవరకూ వెళ్లారు. సొంత పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కానీ.. వారెవరిపైనా క్రమశిక్షణా చర్యల ఊసే కాంగ్రెస్ అధిష్టానం నుంచి వినిపించలేదు. కనీసం వారిని పిలిచి ఇదేమిటని మాట్లాడనూ లేదు. కారణమేమంటే.. వారి ద్వారానే కొత్త పార్టీ పెట్టించాలన్న ఆలోచన అప్పటికే జరిగిపోవడమే కాకుండా, ఆ వ్యూహంలో భాగంగానే ఆ నేతలంతా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్టు మాట్లాడుతుండటమేనని పరిశీలకులు స్పష్టంచేస్తున్నారు. తన ప్రణాళిక ప్రకారం నడుస్తున్న ఆ నేతలను హైకమాండ్ చూసీచూడనట్టు వదిలేస్తోందని చెప్తున్నారు. ఇప్పుడు విభజన బిల్లును కేంద్రానికి తిప్పిపంపే గడువు సమీపించడంతో కొత్త పార్టీ నడిపించడానికి కావలసిన ‘సరుకు, సరంజామాల’ను కూడా సమకూర్చుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. ప్రభుత్వపరంగా ఆయా నేతల పనులను చకచకా చేసిపెడుతున్నారని విశ్వసనీయ సమాచారం. తాజాగా తెలుగు చానళ్లలో మారుమోగుతున్న సమైక్య ప్రచారం ఆ కోవలోనే తెరపైకి వచ్చినట్టు కాంగ్రెస్‌లో గుప్పుమంది. ప్రణాళిక అమలు బాధ్యత కిరణ్‌దే... రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్న దశలోనే కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కార్యాచరణ రూపొందించి అమలు చేసే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. అయితే విభజన బిల్లుపై రాజ్యాంగపరంగా పూర్తి కావలసిన ప్రక్రియను సాఫీగా ముగించేంతవరకు ఏ దశలోనూ బయటపడొద్దని ఆయనకు చెప్పడంతో ఇంతకాలంగా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. పార్టీ పెడుతున్న విషయం ఎప్పుడడిగినా ఆయన ఏ రోజూ సూటిగా సమాధానమివ్వకుండా.. ‘చూద్దాం.. ఏం జరుగుతుందో!’ అంటూ దాటవేశారు. దాంతో పార్టీలోని కొందరు నేతలు సీఎం కొత్త పార్టీ పెట్టబోరని సంశయం వ్యక్తంచేస్తూ వచ్చినప్పటికీ.. తాజాగా జరుగుతున్న పరిణామాలతో పార్టీ పెట్టనున్నారనే నిర్ధారణకు వచ్చినట్టు మాజీ మంత్రి ఒకరు చెప్పారు. కొత్త పార్టీ కోసం ఇప్పటికే కోట్లలో ఖర్చు... కొత్త పార్టీ వ్యవహారాల్లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తలమునకలై ఉండగా.. ఎవరి ఊరూ పేరూ లేకుండా సమైక్య నినాదంతో తొలి హోర్డింగ్ విజయవాడలోనే వెలిసింది. ఇలా ఊరూపేరూ లేకుండా హోర్డింగ్‌లు వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వివిధ చానళ్లలో సమైక్య ప్రచారం ఉధృతంగా మొదలైంది. ఈ కొత్త పార్టీ నిర్వహణకయ్యే నిధులను సమకూర్చడం కూడా ఒక పథకం ప్రకారమే జరుగుతోందని తెలుస్తోంది. తాజాగా వెలిసిన హోర్డింగ్‌లు, చానళ్లలో ప్రచారానికి ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ఇవన్నీ పరోక్ష పద్ధతిలో ప్రభుత్వ నిధులే మళ్లాయన్న విషయం కాంగ్రెస్‌లో ఇప్పుడు బహిరంగ రహస్యంగా మారింది. కొత్త పార్టీ లో చేరబోయే నేతలకు చెందిన సంస్థలకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించే నిర్ణయాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పలు సంస్థలకు రాయితీలు కల్పించడం, భారీ నష్టాల్లో ఉన్న పలు సంస్థల బ్యాంకు రుణాలను రీషెడ్యూల్ చేయడం వంటివన్నీ ఇందులో భాగమేనని అంటున్నారు. కిరణ్ పదవికి ఢోకా లేదని హామీ... కాంగ్రెస్ హైకమాండ్ స్క్రిప్ట్‌ను భుజాన వేసుకుని అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవికి ఢోకా లేదని కాంగ్రెస్ పెద్దల నుంచి స్పష్టమైన హామీ ఉందని పార్టీ వర్గాలు మొదటి నుంచీ చెప్తున్నాయి. పదవిపై భరోసా, హైకమాండ్ ఇచ్చిన సంకేతాల మేరకే సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తూ.. తానొక సమైక్య చాంపియన్ అన్న ప్రచారాన్ని తీసుకొచ్చేందుకు సీఎం ప్రయత్నించారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవైపు అంతర్గతంగా హైకమాండ్ నిర్దేశించిన పనిని పూర్తి చేస్తూ.. బయటకు సమైక్య చాంపియన్‌గా ముద్రపడే విధంగా వ్యవహారాలను నడిపిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఆ విషయాన్ని కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పినప్పుడే ప్రత్యామ్నాయ పథకంపైన కూడా హైకమాండ్ పెద్దలు చర్చించినట్టు ఏఐసీసీ వర్గాలు చెప్తున్నాయి. టీడీపీ నేతలకూ ప్రయోజనాలు..! రాష్ట్రంలో సమైక్య నినాదంతో ముందుకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడమెలాగో అర్థంకాక రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న టీడీపీ కూడా కాంగ్రెస్ ప్రణాళికకు అన్ని రకాలుగా సహకరిస్తోంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై సీబీఐ ద్వారా కేసులు నమోదు చేయించిన క్రమంలో.. ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల్లో తనపై ఎక్కడ కేసులు వస్తాయోనని భయపడిన చంద్రబాబు నాయుడు ఆ దశలో కాంగ్రెస్‌కు అన్ని రకాలుగా సహకరిస్తూ వచ్చారన్న తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఎఫ్‌డీఐలపై రాజ్యసభలో బిల్లు వీగిపోరాదని భావించి టీడీపీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ వంటి పార్టీలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఆ ప్రభుత్వం పడిపోకుండా అవిశ్వాసానికి మద్దతునివ్వకుండా తటస్థ వైఖరితో గట్టెక్కించారు. త్వరలో లోక్‌సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనతో ఉన్న టీడీపీ నాయకత్వం కాంగ్రెస్ అధిష్టానానికి తాజా పథకంలోనూ సహకరిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో జగన్‌పై దుష్ర్పచారం చేయడంలో తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తామని కాంగ్రెస్‌కు టీడీపీ నాయకత్వం హామీ ఇచ్చింది. టీడీపీ అందిస్తున్న సహకారానికి ప్రతిఫలాల్లో భాగంగా.. ఆ పార్టీకి చెందిన ఎంపీ సి.ఎం.రమేష్‌కు చెందిన ఒక సంస్థ కూడా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోగా దానికి 400 కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూలు చేసినట్టు తెలుస్తోంది. లగడపాటి ల్యాంకోకు రూ. 8 వేల కోట్ల రుణాలు..! కొత్త పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి చెందిన సంస్థలకు ఇటీవలి కాలంలో భారీ ఆర్థిక ప్రయోజనమే కలిగింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ల్యాంకో ఇన్ఫ్రా సంస్థకు.. ఆయా జాతీయ బ్యాంకుల నుంచి కొత్తగా 8 వేల కోట్ల రూపాయల మేరకు ప్రయోజనం కల్పించారు. దాదాపు 36 వేల కోట్ల రూపాయల రుణాలపై కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న సంస్థ రుణాలను రీషెడ్యూలు చేయడమే కాకుండా కొత్తగా మరో 8 వేల కోట్ల మేరకు రుణాలను ఇప్పించే కార్యక్రమం చురుకుగా సాగుతోందని తెలుస్తోంది. సీమాంధ్రకు చెందిన ఎంపీలందరం రాజీనామా చేస్తామని ప్రకటన చేసి లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తామని వెళ్లడానికి ఒక్క రోజు ముందు.. సెప్టెంబర్ 23న ల్యాంకోకు చెందిన 660 మెగావాట్ల బాబంద్ (ఒడిశా)విద్యుత్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా నిమిత్తం కోల్ ఇండియాతో లింకేజీ ఒప్పందం చేసుకోవడానికి మంత్రుల బృందం ల్యాంకోకు అనుమతిచ్చింది. గడిచిన ఆరేళ్లుగా పెండింగ్‌లో పెట్టిన ఫైలు దుమ్ము దులిపి తాజా పరిణామాల్లో ఆగమేఘాలపై క్లియర్ చేయడం విశేషం. ఇందులో 18 ఎకరాలకు సంబంధించి అటవీ అనుమతులేవీ రానప్పటికీ కోల్ లింకేజీకి అనుమతిచ్చేశారు. చాంపియన్లుగా కొత్త పార్టీలో చేరండి... రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వమే.. ‘దాన్ని అడ్డుకుంటామని ప్రచారం చేసుకుంటూ ఈ క్రీడలో మీరే చాంపియన్లుగా ప్రచారం చేసుకోవాల’ని కూడా పార్టీ సీమాంధ్ర నేతలు పలువురికి నిర్దేశించినట్లు కాంగ్రెస్ వర్గాలు కొన్నాళ్ల కిందటే వెల్లడించాయి. ఈ ప్రత్నామ్యాయ పథకంలో భాగంగానే ధిక్కారస్వరం వినిపించిన నేతలు ఒక్కొక్కరుగా కొత్త పార్టీలో చేరడంపైన కూడా అధిష్టానం ఒక క్యాలెండర్ రూపొందించిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించడం దగ్గరి నుంచి రెండు రోజుల కింద జరిగిన ఏఐసీసీ సమావేశం వరకు కొందరు ఎంపీలు హైడ్రామా నడిపించారని సమాచారం. ఏఐసీసీ సమావేశానికి రావొద్దని అధిష్టానం ఆదేశించిందని వీరే ప్రచారం చేసుకున్నారు. అయినప్పటికీ ఆ సమావేశానికి వెళ్లారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న బలమైన కాంక్ష ఉండిఉంటే ఏఐసీసీ సదస్సు వేదికనెక్కి నానా రభస చేసేవారేననీ.. అలాంటిదేమీ చేయలేదని పార్టీ వర్గాలు ప్రస్తావించాయి. పైగా వారు హైడ్రామా నడిపారన్న విషయం ఆంగ్ల పత్రికల్లో స్పష్టమైన కథనాలు వచ్చాయి. పిలవనప్పటికీ ఏఐసీసీ సమావేశానికి వెళతామని, తమ నిరసనను తెలియజేస్తామని వీరావేశంతో ప్రకటనలు చేసిన నేతలు తీరా అక్కడికి వెళ్లి దూరంగా (మీడియాకు కేటాయించిన చోటికి దగ్గరగా) నిలబడి కొద్దిసేపు ప్లకార్డులు ప్రదర్శించి వెనుదిరిగారు. -
అంతా అధిష్టానం ఆదేశానుసారమే
-
సీఎం కుటుంబీకులదే...స్ధానికులు
-
కిరణ్ కొత్త పార్టీ ఊహాజనితమే: రఘువీరా
-
కొత్త పార్టీ.. సోమలింగం
-
ఓరుగల్లు నేత సారథ్యంలో కొత్త పార్టీ
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: ఓరుగల్లుకు చెందిన నేత సారథ్యంలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. మహాజన సోషలిస్ట్ పార్టీ(ఎంఎస్పీ) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ జిల్లా నేత కావడం విశేషం. వరంగల్ నగర పరిధిలోని న్యూశాయంపేటకు చెందిన మంద కొమురమ్మ, మంద చిన్న ఓదెలు మూడో సంతానంగా కృష్ణ జన్మించారు. తొలుత విప్లవ భావాలతో సాధారణ జీవితాన్ని గడిపిన కృష్ణ.. 1992లో దళిత, విప్లవ నేతలు కేజీ సత్యమూర్తి, సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడిలో జరిగిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేశారు. ఆయన నేతృత్వంలో 1994 జులైలో జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైంది. రాష్ట్రంలో మాదిగలను ఐక్యం చేశారు. రెండు దశాబ్దాలుగా మాదిగ దండోరా, వికలాంగుల హక్కుల ఉద్యమం నడిపారు. తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములయ్యూరు. అంధుల ఆరాధ్య దైవం లూయీ బ్రెయిలీ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఎంఎస్పీ ఆవిర్భావ ప్రకటన చేశారు. పార్టీ ఏర్పాటుతో ఎమ్మార్పీఎస్ శ్రేణులు హర్షం ప్రకటించాయి. జిల్లాలో పార్టీని విస్తరింపజేసేందుకు ఈ నెల 6, 7 తేదీల్లో ఎర్రగట్టు వద్ద రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. తాను పుట్టిన గడ్డ నుంచే పార్టీని బలోపేతం చేయాలని మంద కృష్ణమాదిగ భావిస్తున్నారు. స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం నక్కలగుట్ట, న్యూస్‌లైన్ : ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఇన్చార్జ్ డిప్యూటీ డైరక్టర్, అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య సూచించారు. ఈ విద్యాసంవత్సరంలో స్కాలర్‌షిప్‌ల రెన్యూవల్ కోసం 20,344 మంది విద్యార్థులు అర్హులని తెలిపారు. -
కొత్త పార్టీ.. సోమలింగం
మీడియా ప్రశ్నకు సీఎం కిరణ్ స్పందన 23 తర్వాత పార్టీ ముఖ్యనేతలతో కలసి మేధోమథనం నిర్వహిస్తాం పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేసినా అది రాష్ట్రపతికి వెళ్లదు సాక్షి, హైదరాబాద్: కొత్త పార్టీ పెడతారంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై వుుఖ్యవుంత్రి కిరణ్‌కువూర్‌రెడ్డి ఎట్టకేలకు పెదవి విప్పారు. ‘‘ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోవులింగవున్నట్లుంది’’ అని కొత్త పార్టీ గురించి వ్యాఖ్యానించారు. ‘‘నేను కాంగ్రెస్‌లో పుట్టిన వాడిని. నా తండ్రితోపాటు నా కుటుంబానికి 1956కు వుుందు నుంచి కాంగ్రెస్‌తో అవినాభావ సంబంధవుుంది. ఈనెల 23తో అసెంబ్లీ సవూవేశాలు వుుగిసిన తర్వాత పార్టీలోని వుుఖ్యనేతలందరం కలసి మేధోవుథన సదస్సు నిర్వహించి పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాం’’ అని తెలిపారు. శనివారం అసెంబ్లీలోని తన చాంబర్లో ఆయున మీడియూతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తపార్టీ గురించి అడగ్గా.. మీడియూలో దీనిపై వస్తున్న వార్తలు చూసి నవ్వు వస్తోందన్నారు. ఇటీవల రాజవుండ్రి వెళ్లినప్పుడు కొంతవుంది ఎమ్మెల్యేలు తవు భవిష్యత్తు ఏమిటోనని ఆందోళన వ్యక్తపరిస్తే వుుందు 23 వరకు అసెంబ్లీలో బిల్లు చర్చపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాత పార్టీ వుుఖ్య నేతలందరితో కలసి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుందావుని చెప్పాను తప్ప కొత్త పార్టీ ఊసే లేదన్నారు. కొత్త పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలుంటాయో లేదో కూడా చెప్పలేవున్నారు. కాంగ్రెస్‌లో ఉండే వారికి రాజకీయు భవిష్యత్తుపై భరోసా ఇస్తారా అని అడగ్గా.. ‘‘ఎవరు హామీ ఇవ్వగలరు? వునం శాశ్వతవూ? వునం ఇక్కడ ఎల్లకాలం బతుకుతావుని గ్యారెంటీ ఉందా?’’ అని సమాధానమిచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిపట్ల తామేమీ చేయులేవున్నారు. తెలంగాణ ఇచ్చినా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో చెప్పడానికి తాను జ్యోతిష్కుడిని కానని చెప్పారు. ‘‘ఉల్లిపాయుల ధర రూ.5 పెరిగిందని గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోరుుంది. ఆ తర్వాత వుళ్లీ పదేళ్లపాటు వూ పార్టీయే అధికారంలో ఉంది. ఇప్పుడు వుళ్లీ అదే ఉల్లిపాయు ధరతో ఓటమి పాలైంది. పార్టీ ఓడిపోవడానికి చిన్న కారణం చాలు’’ అని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీతో ఇటీవల జరిగన సవూవేశంలో విభజన వల్ల రెండు ప్రాంతాలూ నష్టపోతాయుని చెప్పానన్నారు. ఈనెల 23న అసెంబ్లీలోనే సీఎం రాజీనావూ చేస్తారని, ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేస్తారని వస్తున్న వార్తల గురించి ప్రస్తావించగా... ‘‘ఏదో ఆంగ్ల పత్రికలో ఇలాంటి వార్త చూశాను. మీడియూ ఇలాంటి వుంచి ఐడియాలు బాగానే ఇస్తుంటుంది. నేనైతే ఎవరితోనూ ఇలాంటి అభిప్రాయూలు పంచుకోలేదు’’ అని కిరణ్ వివరించారు. వుుందుగా చెప్పి ఏదీ చేయుబోనన్నారు. బిల్లుపై చర్చ ప్రారంభిస్తేనే వుంచిది... విభజన బిల్లుపై చర్చ ఎంత త్వరగా ప్రారంభమై, వుుగిస్తే అంత వుంచిదని సీఎం అభిప్రాయుపడ్డారు. రాష్ట్ర సమైక్యతపై ప్రత్యేక తీర్మాన ం వల్ల ప్రయోజనం లేదని, బిల్లుపై అందరూ అభిప్రాయూలు చెబితే చాలని, అదే తీర్మానం కింద లెక్కకు వస్తుందన్నారు. సభలో చర్చకు అన్ని పార్టీలను ఒప్పించాల్సిన బాధ్యత స్పీకర్దేనని, ప్రభుత్వం కేవలం సహకారం వూత్రమే అందిస్తుందని పేర్కొన్నారు. సభలో విడిగా సమైక్య తీర్మానం చే సినా అది రాష్ట్రపతికి వెళ్లదని, వెళ్లినా దాన్ని విశ్వాసంలోకి తీసుకోరని చెప్పారు. ‘‘ఎవరెంత వుంది ఎటువైపు వూట్లాడారో తేలాలంటే డివిజన్ అనేది ఉండాలి. సభ్యులు అడిగాక స్పీకర్ డివిజన్ ఇవ్వక తప్పదు’’ అని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సవుయుంలో, ఆ తర్వాత జరిగిన ఇతర రాష్ట్రాల ఏర్పాటు, ఇటీవల యుూపీ, బీహార్ విభజన సందర్భంగా కూడా అందరి అభిప్రాయూలతో డివిజన్ ద్వారానే రాష్ట్రాలు ఏర్పడ్డాయున్నారు. అలాంటివి 11 లేఖలున్నాయి.. వుంత్రి శ్రీధర్‌బాబు రాజీనావూ లేఖ అందిందని, అలాంటి లేఖలు ఇంకా తన వద్ద 11 ఉన్నాయుని సీఎం తెలిపారు. ఆదాయుం తగ్గినందునే వాణిజ్య పన్నుల శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించానని పునరుద్ఘాటించారు. హోం వంటి ఇతర శాఖలు కూడ ఇతరులకు ఇస్తారా అని అడగ్గా.. మీలో ఎవరున్నారో చెప్పండి ఇప్పుడే ఇచ్చేస్తా అని మీడియూనుద్దేశించి అన్నారు. వివాదాస్పద ఫైళ్లను క్లియుర్ చేస్తూ సీఎం కోట్ల రూపాయులు కమీషన్లుగా తీసుకుంటున్నారన్న విపక్షాల ఆరోపణలపై స్పందిస్తూ ‘‘నాది తెరచిన పుస్తకం. ఉద్యోగుల నియూవుకాలు, బదిలీలు, హెల్త్ బిల్లులు వంటివి వూత్రమే వస్తుంటారుు. కాంట్రాక్లర్ల బిల్లులు నా దగ్గరకు రావు. ఏదైనా ఉంటే ఆధారాలతో ఆరోపణలు చేయూలి’’ అని చెప్పారు. చిత్తూరుకు వుంచినీళ్ల పథకానికి రూ.6 వేల కోట్ల ప్రాజెక్టును ఇవ్వడంపై సొంత పార్టీ వారే కోర్టుకు వెళ్తావుంటున్నారనగా... ‘‘నాన్సెస్ వూటలు అవి. చిత్తూరుకు నీళ్ల కోసం రూ.5 వేల కోట్లు ఇస్తే తప్పేంటి? ప్రాణహిత చేవెళ్లకు రూ.38 వేల కోట్లు ఇవ్వడం లేదా? ప్రజలకు ఏది ఎక్కడ అవసరమో ప్రభుత్వం అది చేస్తుంది’’ అని స్పష్టంచేశారు. సీఎం హెలికాప్టర్‌ను పేల్చేస్తావుంటూ ఎంపీ పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. అలాంటి చీప్ వూటలపై స్పందించనన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా ఒత్తిడి పెంచడానికి శంకుస్థాపనకు వస్తానని చెప్పానే తప్ప ఆరోజున అక్కడకు వెళ్లడం లేదన్నారు. ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.. పాలెం బస్సు ప్రవూద బాధితులకు చట్టం ప్రకారం ఏ మేరకు సాయుం చేయూలో అది చేస్తున్నావుని సీఎం చెప్పారు. రూ.25 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగమివ్వాలన్న డివూండ్పై ప్రభుత్వం ఏమీ చేయులేదన్నారు. ‘‘ప్రైవేటు బస్సు ప్రవూదాలు అనేకం జరుగుతుంటారుు. ఎంతోవుంది చనిపోతుంటారు. అందరికీ అడిగినంత ఎలా ఇవ్వగలం. ప్రత్యావ్నూయు ప్రయూణ సదుపాయూలు లేనప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటారుు’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో రవాణా రూట్లు ఆర్టీసీ, ప్రైవేటులో 60, 40 శాతం నిష్పత్తిలో ఉన్నాయుని, రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. కేసులు పెట్టినా ప్రైవేటు బస్సులు వుళ్లీ తిరుగుతున్నారుు, కఠిన చర్యలుండడం లేదనగా... అది కేంద్రం చట్టమని, రాష్ట్రమేమీ చేయులేదన్నారు. -
మహాజన సోషలిస్టు పార్టీ
కొత్త పార్టీని ప్రకటించిన మంద కృష్ణ బడుగులకు రాజ్యాధికారమే లక్ష్యమని ఉద్ఘాటన సాక్షి, హైదరాబాద్: సామాజిక న్యాయం ఎజెండాగా రాష్ట్రం లో కొత్త పార్టీ అవిర్భవించింది. ‘మహాజన సోషలిస్టు పార్టీ(ఎంఎస్పీ)’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శనివారం ప్రకటించారు. వికలాంగులు, మహిళలు, బడు గు, బలహీన వర్గాలకు సంపూర్ణ న్యాయం కోసమే పార్టీని నెలకొల్పుతున్నట్లు సికింద్రాబాద్‌లో నిర్వహించిన వికలాంగుల మహాసభలో చెప్పారు. ‘అంధులకు లిపి ద్వారా బ్రెయిలీ చూపును అందించారు. ఆయన జయంతి రోజున ఆవిర్భవించిన ఎంఎస్పీ ఇంతకాలం రాజ్యాధికారానికి దూరమైన కులాలకు, వర్గాలకు అధికారాన్ని అందించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు, మూడు అగ్రకులాలే రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నాయి. వాటి పునాదులను పెకిలించి మా పార్టీని అదికారంలోకి తెచ్చి సామాజిక న్యాయం అందిస్తాం. దోపిడీ, వివక్ష, అసమానతలు, కుటుంబ పాలన, సామాజిక, రాజకీయ, ఆర్థిక అసమానతలు తొలగిస్తాం’ అని మందకృష్ణ పేర్కొన్నారు. బడుగులకు సీట్లేవి?: ఎస్సీల వర్గీకరణ కోసం 20 ఏళ్లుగా సాగుతున్న తమ ఉద్యమానికి మద్దతిస్తున్న అన్ని పార్టీల నాయకులు చట్టసభల్లో మాత్రం ఈ అంశాన్ని చర్చకు తేవడం లేదని మందకృష్ణ ధ్వజమెత్తారు. మెజారిటీ సభ్యులు అగ్రకులాలకు చెందిన వారు కావటం వల్లే ఇతర సామాజిక వర్గాల సమస్యలకు పరిష్కారం లభించడం లేదన్నారు. ప్రభుత్వంతోపాటు అన్ని పార్టీలూ వికలాంగులు, వృద్ధులు, మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని విమర్శించారు. జనాభాలో 50 శాతం ఉన్న బలహీన వర్గాలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించిన పార్టీల నాయకులు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో బీసీ ఎమ్మెల్యేలకు రెండు సీట్లు కూడా కేటాయించడం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, సీపీఐ నేత నారాయణలకు చెందిన చిత్తూరు జిల్లాలో 14 శాసనసభ స్థానాలు ఉండగా మూడు ఎస్సీ స్థానాలు పోను మిగతా సెగ్మెంట్లలో ఒక్కరు కూడా బీసీ ఎమ్మెల్యే లేరని చెప్పారు. గొప్ప నేతలుగా చెప్పుకుంటున్న జానారెడ్డి, వెంకయ్యనాయుడు, రాఘవులు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, జైపాల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల నుంచి బీసీలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పించడంలో పూర్తిగా అన్యాయం జరిగిందన్నారు. సామాజికంగా అందరికీ ఉపయోగపడే 20 అంశాలపై తమ పార్టీ ఉద్యమాలు చేస్తుందని మందకృష్ణ తెలిపారు. ఎంఎస్పీ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో వికలాంగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అందె రాంబాబు, నాయకులు సునీల్, భవాని, గోపాల్, రవీందర్‌లతోపాటు ఎమ్మార్పీఎస్ నాయకులు యాతాకుల భాస్కర్, వంగపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వీటి కోసమే ‘ఎంఎస్పీ’ పోరాటం ఎస్సీల వర్గీకరణ, లంబాడా తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయడం ఆదివాసీల జీవన విధానాన్ని మెరుగుపరచడం జనాభాలో 50 శాతం ఉన్న 130 కులాలకు చెందిన బీసీలకు సమాన ప్రాతినిధ్యం ముస్లింలకు రిజర్వేషన్ల అమలు దళిత క్రైస్తవులు దళిత ముస్లింలకు రిజర్వేషన్లు మహిళలకు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రాతినిధ్యం వికలాంగులకు సామాజిక న్యాయం అగ్రకులాల పేదలకు ఆర్థిక ప్రగతి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేసి పేదలకు సంపూర్ణంగా ఉచిత వైద్యం వృద్ధులు వితంతువులకు రూ.1,000 పెన్షన్లు పేదలందరికీ చౌకగా నిత్యావసర వస్తువులను అందించడం పేదలకు భూ పంపిణీపై కోనేరు రంగారావు సిఫార్సుల అమలు నిరుద్యోగులకు ఉపాధి అణగారిన వర్గాల విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య కార్మిక వర్గానికి ఉద్యోగభద్రత ప్రతినిత్యం పేదలకు ఉపాధి పథకం అమలు. -
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావించింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మహాజన సోషలిస్టు పేరుతో ఆయన ఈ కొత్తపార్టీ పెట్టారు. చట్టసభల్లో తమ వాణి వినిపించేందుకు కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు మందకృష్ణ మాదిగ కొద్దిరోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో సామాజిక న్యాయం లేదని ఆయన అన్నారు. తమ సమస్యలపై ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నా పరిష్కారం దొరకడంలేదని చెప్పారు. అందుకే మహాజన సోషలిస్టు పార్టీని పెట్టినట్లు ఆయన తెలిపారు. -
సీఎం కొత్త పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న లగడపాటి
-
ప్లీజ్.. ఆగండి సీఎం పార్టీ వస్తోంది..!
=పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ నేతలు =తొందరపడవద్దని ఎంపీ లగడపాటి హితబోధ =అసెంబ్లీ సమావేశాల తర్వాత సీఎం పార్టీ వస్తుందని వెల్లడి సాక్షి, విజయవాడ : ‘జనవరిలో అసెంబ్లీ సమావేశాలు పూర్తికాగానే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ పెడుతున్నారు. అప్పుడు మనమంతా చేరదాం. అప్పటి వరకూ ఓపిక పట్టండి. తొందరపడవద్దు.’ అంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమ పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీ మారాలనే ప్రయత్నాలు ఉన్నారు. దీంతో ఆ వలసను అడ్డుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం గుడ్డిగా రాష్ట్ర విభజన నిర్ణయంతో ముందుకు సాగడంతో ఆ పార్టీకి సీమాంధ్రలో పుట్టగతులు ఉండవనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆ పార్టీ నేతలు కూడా దాన్నే గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ రాజకీయ ప్రస్థానానికి ఇబ్బందిలేని, ప్రజాదరణ ఉన్న పార్టీల్లోకి చేరేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అత్యధికులు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లో కీలకస్థానాల్లో ఉన్న నేతలు, ప్రజాప్రతినిధులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఈ వలసలను ఏ విధంగానైనా నిలువరించాలని కాంగ్రెస్ నాయకత్వం ఒక వైపు ప్రయత్నాలు చేస్తుంటే, ముఖ్యమంత్రి వర్గం మాత్రం అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకూ ఓపిక పట్టాలని ఆ నేతలకు నచ్చచెప్పేందుకు శ్రమిస్తోంది. ఇటీవల పార్టీ మారిన వారికి లగడపాటి రాజగోపాల్ స్వయంగా ఫోన్లు చేసి మాట్లాడినట్లు తెలిసింది. వారిలో కొందరు తాము పదవుల కోసం పార్టీ మారడం లేదని, ఇప్పటి వరకూ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నందుకు అవమానాలే మిగిలాంటూ ఎంపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. త్వరలో పార్టీ వీడతార ని భావిస్తున్న వారందరితో ఎంపీ వ్యక్తిగతంగా ఫోన్లో మాట్లాడుతూ తొందరపడవద్దని కోరుతున్నట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కంకణం కట్టుకున్న విషయం అందరికి అర్ధం అవుతోందని, ఇప్పటి వరకూ విభజనకు సహకరించి తర్వాత కొత్త పార్టీ పెడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పలువురు నేతలు స్పష్టం చేస్తున్నట్లు ఆ పార్టీ వారే చెబుతున్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి బుధవారం నగరానికి రానుండటంతో ఈ అంశంపై చర్చ సాగే అవకాశం కనిపిస్తోంది. -
సమైక్యవాది కాదు.. అధిష్ఠానం వాది సీఎం కిరణ్!!
-
సమైక్యవాది కాదు.. అధిష్ఠానం వాది సీఎం కిరణ్!!
అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఆవేశంగా ప్రసంగాలు చేస్తూ నిజంగానే ఈయన అతిపెద్ద సమైక్యవాదేమోనని అనిపించేలా చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసలు స్వరూపం ఏంటి? ఆయన నిజానికి హైకమాండ్ వాదే తప్ప.. సమైక్యవాది కానేకాదట. ఈ విషయం చెబుతున్నది కూడా ఎవరో తెలుసా? సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు!! అంటే, కిరణ్ సొంత సహచరులు. అధిష్ఠానానికి వీర విధేయుడైన ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టబోరని కూడా స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను కాపాడుకునేందుకే హైకమాండ్ వ్యూహాత్మకంగా సీఎం కిరణ్‌తో సమైక్యాంధ్ర అనిపిస్తోందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి సమైక్యాంధ్ర అంటున్నారని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అంగీకరిస్తున్నారు. గత జూలై 30న వర్కింగ్ కమిటీ తెలంగాణ తీర్మాణం చేయడంతో సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఒక్క నాయకుడి ప్రమేయం కూడా లేకుండా ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమించారు. దీంతో భయపడిన సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీడబ్ల్యుసీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ ఆ సమయంలో సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు తమ పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేస్తే కిరణ్ సర్కార్ పతనమయ్యేది. అందుకే హైకమాండ్ ముందుగా ఆలోచించి.. వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రితోనే సమైక్యాంధ్ర అనిపించారని నేతలు అంగీకరిస్తున్నారు. రాజీనామాలు వద్దంటూ సీమాంధ్ర మంత్రులను , ఎమ్మెల్యేలను సిఎం కిరణ్ వారించడమే అందుకు నిదర్శనం. లేదంటే మంత్రి విశ్వరూప్ బాటలోనే మరికొందరు మంత్రులు, సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేవారు. దాంతో ప్రభుత్వం పతనమయ్యేది. అప్పుడు కాంగ్రెస్ ప్రతిష్ట దేశవ్యాప్తంగా మసక బారేది. సీడబ్ల్యుసీ నిర్ణయం అభాసు పాలయ్యేది. ఈ ప్రమాదాలను నివారించేందుకే అధిష్ఠానం ముఖ్యమంత్రితో సమైక్యాంధ్ర అనిపించింది తప్ప.. ఆయన ఏనాడూ అధిష్ఠానాన్ని ధిక్కరించలేదు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ మాటలే అందుకు నిదర్శనం. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరుపాళ్లు కట్టుబడి ఉండే వ్యక్తి అని, ఆయన తమ నిర్ణయాన్ని ధిక్కరించే అవకాశమే లేదని డిగ్గీ రాజా చెప్పారు. అసెంబ్లీకి వచ్చే విభజన బిల్లును వ్యతిరేకించాక ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా స్పష్టం చేశారు. ఆయన అధిష్టానానికి విధేయుడని, కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టరని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడమనేది వర్కింగ్ కమిటీ తీర్మానం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకోదంటూ సిఎం కిరణ్ మంత్రులను, ఎమ్మెల్యేలనే కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ మభ్య పెట్టారని నేతలంటున్నారు. కేంద్ర క్యాబినెట్ తెలంగాణ నోట్‌ను ఆమోదించడంతో పాటు జిఓఎమ్ను ఏర్పాటు చేసి విభజన బిల్లును రూపొందిస్తుండడం వరకు కిరణ్ చెప్పినవేవీ జరగలేదని.... ఆయన ప్రకటనలకు విరుధ్దంగా విభజన ప్రక్రియ వేగంగా సాగుతోందని నేతలు గుర్తు చేస్తున్నారు. హై కమాండ్ కూడా ముఖ్యమంత్రికి సహకరిస్తుందనడానికి ఇప్పటి వరకు ఆయనను హై కమాండ్ పెద్దలెవరూ మందలించకపోవడమే నిదర్శనమంటున్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు సిఎం కిరణ్ ఆడుతున్న సమైక్య నాటకం విభజన ప్రక్రియ ముగిసి రెండు రాష్ట్రాలు ఏర్పడేంత వరకు కొనసాగుతుందని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అంటున్నారు. -
కిరణ్ సెంటిమెంట్!
=నేడు భైరవేశ్వరస్వామిని దర్శించుకోనున్న సీఎం =స్వామిని దర్శించుకోవడం ఆయనకు ఇది నాల్గోసారి =ప్రతిసారీ ఏదో ఒక పదవి లేదా గెలుపు =ఈసారి కొత్తపార్టీ పెడతారంటూ చర్చ గుర్రంకొండ, న్యూస్‌లైన్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ శీలంవారిపల్లెలో కొలువైన భైరవేశ్వర స్వామిని ఆయన సోమవారం దర్శించుకోనున్నారు. గతంలో దర్శించుకున్న ప్రతిసారీ ఏదో ఒక పదవి అలంకరించడంతో ఆయనకు సెంటిమెంట్ ఎక్కువైంది. ఎక్కడో వూరువుూల పల్లెలో ఉన్న ఈ స్వామివారిని సీఎం ఇప్పటికే మూడుసార్లు దర్శించుకోవడం గమనార్హం. ఇదిలావుండగా గ్రావుం పక్కనే సువూరు 300 సంవత్సరాల ఓ మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద భైరవేశ్వర స్వామి విగ్రహం కొలువైంది. ఇక్కడ స్వామికి ఎలాంటి ఆలయం లేదు. ప్రతి ఏడాదీ మొలకల పున్నమిరోజున గ్రావు ప్రజలు తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. భైరవేశ్వర స్వామి అంటే విజయూలను అందించే దేవుడని, ఇక్కడ మొక్కుకున్న వారి కోర్కెలు తప్పక నెరవేరుతాయుని స్థానిక భక్తుల నమ్మకం. ఈనేపథ్యంలోనే 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచార నిమిత్తం ఇక్కడకు వచ్చి, ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటానని పూజలు నిర్వహించారు. ఆపై చీఫ్ విప్‌గా, స్పీకర్‌గా ఎన్నికైన తరువాత వివిధ సందర్భాల్లో స్వామిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. అప్పట్లోనే కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నత పదవి అలంకరిస్తారని స్థానికులు విశ్వసించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నందుకు గ్రామస్తులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో సీఎం కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పార్టీ పెడతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. ఈసారి సీఎం హోదాలో స్వామిని దర్శించుకుని ఏమి కోరుకుంటారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సమైక్యాంధ్ర సమస్య నుంచి బయట పడి కొత్త పార్టీ పెట్టడానికే ఇక్కడకు వస్తున్నారని పలువురు చర్చించుకోవడం కనిపించింది. -
కొత్త పార్టీ యోచనలో సీఎం కిరణ్ టీం
-
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి
మంగళగిరి, న్యూస్‌లైన్: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర విభజన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చె ప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో నీట ముని గిన పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ విషయమై అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్‌తో కలిసి అవిశ్రాంత పోరాటం చేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని నిన్న అన్నారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. -
కొత్త పార్టీ నేను పెట్టినా కిరణ్ పెట్టినా ఒకటే: రాయపాటి
సాక్షి, చెన్నై ప్రతినిధి: కొత్త పార్టీపై డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ, టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని అన్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తమ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ లో ఆయన సొంత కుంపటి పెట్టుకునే అవకాశముందని సీఎం సన్నిహిత వర్గాలే అంటున్నట్టు సమాచారం. కాగా, రాయపాటి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో దీక్ష చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు ఆయన సంఘీభావం తెలపడంతో ఈ ప్రచారానికి బలం లభించింది. అయితే ఇప్పుడే టీడీపీలో చేరే ఆలోచన రాయపాటికి లేదని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. -
హైకమాండ్ డైరెక్షన్ మేరకే సీఎం కొత్త పార్టీ
-
జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు: మాజీ ఎంపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాజమండ్రి మాజీ లోక్‌సభ సభ్యుడు చిట్టూరి రవీంద్ర కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడలో విభజనకు నిరసనగా చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా రవీంద్ర ప్రసంగిస్తూ... కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే జనవరిలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో ముద్దాయి కాంగ్రెస్ పార్టీనే అని ఆయన ఆరోపించారు. అక్టోబర్ 1 నుంచి సమైక్య ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కిస్తామన్నారు. ఆ సెమైక్య సెగ ఢిల్లీని తాకుతుందని చిట్టూరి రవీంద్ర తెలిపారు. -
విభజన అనివార్యమైతే కొత్తపార్టీ : రాయపాటి
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనను ఆపాలంటే సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయాలన్నారు. తెలంగాణ తీర్మానం కనీసం రెండుసార్లయినా అసెంబ్లీకి రావలసి ఉంటుందన్నారు. కేబినెట్ నోట్ వచ్చాక రాజీనామాల గురించి ఆలోచిస్తామని చెప్పారు. -
సీమాంధ్రలోమరో కొత్త నాటకానికి తెరతీసిన కాంగ్రెస్
-
కాంగ్రెస్ ‘కొత్త’ జెండా!
సీమాంధ్ర ప్రాంతంలో తనకు పూర్తిగా నూకలు చెల్లాయన్న వాస్తవాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం, సరి‘కొత్త’ ఆలోచనలకు తెర తీస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం, తదనంతర పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కుదేలైందని పలు సర్వేలు ముక్త కంఠంతో తేల్చడం, వచ్చే ఎన్నికల్లో అది పూర్తిగా చతికిలపడటం ఖాయమని పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కనీసం తెలంగాణలోనైనా ఎంతో కొంత గట్టెక్కేందుకు రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకుంటే, దానివల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరడం సంగతి అలా ఉంచి సీమాంధ్రలో కాంగ్రెస్‌కు కనీసం నామరూపాలు కూడా మిగలకుండా పోయే పరిస్థితులు నెలకొనడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలోని కాంగ్రెస్ నేతలకు కనీసం జనంలోకి వెళ్లేందుకు కూడా ముఖం చెల్లడం లేదు! సీమాంధ్రలో తాము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున సమైక్య ఆందోళనలు వెల్లువెత్తుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు ఆందోళనకు లోనవుతున్నారు. పక్షం రోజులుగా సమైక్యోద్యమం నానాటికీ తీవ్రతరమవుతూ వస్తున్న తీరును చూశాక, సీమాంధ్రలో పార్టీ తిరిగి తలెత్తుకోవడం అసాధ్యమేనన్న నిర్ధారణకు వచ్చారు. దాంతో ‘కొత్త పార్టీ’ ఎత్తుగడతో గండం గట్టెక్కేందుకు మరో నయా నాటకానికి కాంగ్రెస్ తాజాగా తెర తీస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతోనే సమైక్యవాద నినాదంతో కొత్త పార్టీ పెట్టించడం, ఆ ముసుగులో ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాక దాన్ని తిరిగి విలీనం చేసుకోవడం ఈ ఎత్తుగడ సారాంశమని తెలుస్తోంది. దీని అమలుకు ఇప్పటికే రంగం సిద్ధమవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొత్త పార్టీకి గట్టి పునాది వేయడంలో భాగంగా 1969, 1972 విభజన ఉద్యమాల పట్ల కఠినంగా వ్యవహరించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచిన ఇందిరాగాంధీ పేరు దానికి కలిసి ఉండేలా రూపకల్పన జరుగుతోందనికాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ‘‘సీమాంధ్రలో ‘కాంగ్రెస్’ పేరుతో సీమాంధ్రలో ఎన్నికల బరిలోకి దిగేందుకు పార్టీ నేతల్లో కనీసం ఒక్కరు కూడా ముందుకొచ్చే పరిస్థితి కన్పించడం లేదు. ఇలాంటప్పుడు ఇంతకంటే వేరే మార్గం మాత్రం మాకు ఏముంటుంది?’’ అని ఆ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీని వెనుక కథ, స్క్రీన్‌ప్లే, డైరక్షన్ మొత్తం కాంగ్రెస్ అధిష్టానానిదేనని తెలుస్తోంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రలో పూర్తిగా తుడిచి పెట్టుకుపోయే ముప్పు నుంచి బయట పడటంతో పాటు అక్కడ కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లలో చీలిక తెచ్చి రాజకీయంగా వీలైనంత లబ్ధి పొందడం కూడా కొత్త పార్టీ యోచన వెనక లక్ష్యంగా కన్పిస్తోంది. సమైక్య హోరులో కొట్టుకుపోకుండా పరువు దక్కించుకోవడంతో పాటు సమైక్య సెంటిమెంటును వేరే పార్టీలు ఏకమొత్తంగా తన్నుకుపోకుండా అడ్డుకట్ట వేయడం కోసం ఈ వ్యూహాన్ని రచిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన నేతగా సోనియాగాంధీ పేరుతో ఆ ప్రాంతంలో ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో సీమాంధ్రలో ‘సమైక్యానికి కట్టుబడిన ఇందిర’ పేరుతో పార్టీ పెట్టి ఓట్లు రాబట్టుకునే దిశగా వ్యూహరచన చేస్తోంది. కొత్త పార్టీ తరఫున సొంత పార్టీ నేతలనే బరిలోకి దించి, వారితో కాంగ్రెస్‌పైనే విమర్శలు గుప్పించి, సీమాంధ్రలో ఓట్లను వీలైనంతగా చీల్చి లబ్ధి పొందాలన్నది అధిష్టానం అభిప్రాయంగా కనిపిస్తోంది. సమైక్యవాదమే అజెండాగా ఆవిర్భవించే ఆ పార్టీ, ఎన్నికల దాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసి, ఆ తర్వాత మళ్లీ అందులోనే కలిసిపోతుందన్నమాట! రాష్ట్ర ముఖ్యులతో ఇప్పటికే చర్చలు! కొత్త పార్టీ ఏర్పాటుపై రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలతో కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తోంది. 1969లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ ప్రజా సమితి పేరిట కాంగ్రెస్ నేత మర్రి చెన్నారెడ్డి కొత్త పార్టీ పెట్టడం, ఎన్నికల్లో భారీగా లోక్‌సభ స్థానాలను గెలుచుకున్నాక దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడాన్ని సీమాంధ్ర నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోసారి దాన్నే పునరావృతం చేసే దిశగా ప్రణాళిక సిద్ధమవుతోందంటున్నారు. అయితే తెలంగాణ సెంటిమెంటును టీపీఎస్ సొమ్ము చేసుకున్నంతటి సానుకూలత కొత్త పార్టీకి ఉండకపోయినా కనీసం సీమాంధ్రలోని సమైక్య సెంటిమెంటు పూర్తిగా ఏదో ఒక్క పార్టీవైపే మొగ్గకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తామంటున్నారు. ముఖ్యంగా సీమాంధ్రలో బలంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఈ ప్రయోగం తప్పదన్న ఆలోచనకు అధిష్టానం వచ్చినట్టు చెబుతున్నారు. ఎందుకంటే సమైక్యోద్యమ సెగలు కాంగ్రెస్‌ను తీవ్రంగా తాకుతుండటంతో సీమాంధ్రలోని పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తమ భవిష్యత్తుపై ఆందోళనలో పడుతున్నారు. ‘అందరికీ సమ న్యాయం జరగాలి. అలా లేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే మేలు’ అని బలంగా వాణిని విన్పిస్తున్న వైఎస్సార్సీపీ వైపే అక్కడి ప్రజలు నిలుస్తుండటంతో కాంగ్రెస్ నేతల్లోనూ పలువురు అటే దృష్టి సారిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు కొత్త పార్టీని కాంగ్రెస్ పెద్దలు తెరపైకి తెస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త పార్టీ ప్రజల భావోద్రేకాల నడుమ ఆవిర్భవించినట్టుగా చూపడం ద్వారా దాన్ని ప్రజలు విశ్వసించేలా చూసే దిశగా వారిప్పటికే స్క్రిప్టును సిద్ధం చేశారు. ఈ వ్యూహంలో భాగంగా, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు అధిష్టానంపై తిరుగుబాటు చేసి ఈ పార్టీని ఏర్పాటు చేశారన్నట్టుగా కథ నడపాలని చూస్తున్నారు! నిజానికి ఆంటోనీ కమిటీని తెరపైకి తేవడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ నేతలే అభిప్రాయపడుతున్నారు. కమిటీకి అభిప్రాయాలు చెప్పినా తమ సమస్యలను పార్టీ వినడం లేదన్న వాదనతో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఈకొత్త పార్టీకి అంకురార్పణ చేయనున్నారని కాంగ్రెస్‌లో గట్టిగా వినిపిస్తోంది. చేయాల్సిన సమయంలో చేయకుండా... కానీ కాంగ్రెస్ అధిష్టానం ‘కొత్త’ ఆలోచనలపై సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో ఆయోమయం, గందరగోళం నెలకొన్నట్టు తెలుస్తోంది. ‘సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నవాళ్లమే అయితే అధిష్టానం నిర్ణయం తీసుకుంటున్నప్పుడే పదవులకు రాజీనామాలు చేయాల్సింది. అలా చేస్తే విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వాళ్లు. కానీ పదవుల కోసం అప్పుడు మిన్నకుండి ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినా దానివల్ల ఫలితం ఉంటుందనుకుంటే పొరపాటు’ అని వారంటున్నారు. కొత్త పార్టీ ఆలోచన నిజమే: రౌతు కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలు నిజమేనని రాజమండ్రి (సిటీ) కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అంగీకరించారు. ‘‘ఇందిర సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతమే సమైక్యవాదం. ఆ సిద్ధాంతాన్నే కాంగ్రెస్ గౌరవించనప్పుడు మేమెందుకు ఆ పార్టీలో ఉండాలి?’’ అంటూ ప్రశ్నించారు! శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మాకు పార్టీ సుప్రీం కాదు. మా భవిష్యత్తును నిర్ణయించేది ప్రజలు. ఇందిర పేరు చెప్పుకుని ప్రజల్లోకి వెళ్తాం’’ అని కూడా స్పష్టం చేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు ముగిశాక కొత్త పార్టీకి పూర్తి స్వరూపం వస్తుందని రౌతు వివరించారు. ‘‘దానికి నాయకత్వం వహించేదెవరో త్వరలోనే చెబుతా. బహుశా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా నాయకత్వం వహించవచ్చేమో’’ అని కూడా పేర్కొన్నారు. కానీ ఇవన్నీ మీడియాలో ప్రసారమై కలకలం రేపడంతో, దాన్ని ఖండిస్తూ కాసేపటికే ఆయన వివరణ ప్రకటన ఇచ్చారు. ‘‘త్వరలో కొత్త పార్టీ ఆధ్వర్యంలో సమైక్యోద్యమం జరగనుందని నేను చెప్పినట్టు వార్తలొచ్చాయి. కానీ ఇందిర ఆశయాల మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని అధిష్టానాన్ని కోరతామనేదే నా ఉద్దేశం’’ అని చెప్పుకొచ్చారు.