
విభజన అనివార్యమైతే కొత్తపార్టీ : రాయపాటి
రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనివార్యమైతే కొత్తపార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఎంపి రాయపాటి సాంబశివరావు చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనను ఆపాలంటే సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు రాజీనామాలు చేయాలన్నారు.
తెలంగాణ తీర్మానం కనీసం రెండుసార్లయినా అసెంబ్లీకి రావలసి ఉంటుందన్నారు. కేబినెట్ నోట్ వచ్చాక రాజీనామాల గురించి ఆలోచిస్తామని చెప్పారు.