5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి | Clarity on new party after five states assembly polls: Rayapati Sambasiva Rao | Sakshi
Sakshi News home page

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి

Published Tue, Oct 29 2013 2:01 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి - Sakshi

5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త పార్టీపై స్పష్టత: రాయపాటి

మంగళగిరి, న్యూస్‌లైన్: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర విభజన విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చె ప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని యర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో నీట ముని గిన పొలాలను సోమవారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ విషయమై అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు సీఎం కిరణ్‌తో కలిసి అవిశ్రాంత పోరాటం చేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త పార్టీని తాను పెట్టినా, కిరణ్ పెట్టినా ఒకటేనని నిన్న అన్నారు. టీడీపీలోకి వెళ్లే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని, కాంగ్రెస్‌లోనే ఉన్నానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement