Mangalagiri
-
అఘోరీ హల్చల్
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు. దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
మంగళగిరి ఎయిమ్స్‌లో డ్రోన్ వైద్య సేవలు
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో డ్రోన్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఎయిమ్స్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రోన్ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, సిబ్బందిని ప్రధాని మోదీ అభినందించారు. ముందుగా మంగళగిరి మండలం నూతక్కి పీహెచ్సీలో చికిత్స పొందుతున్న మహిళ నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రోన్ ద్వారా ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు.పరీక్ష అనంతరం మహిళకు అవసరమైన చికిత్స అందించారు. ఈ సందర్భంగా ఎయిమ్స్ డైరెక్టర్, సీఈవో మధుబానందకర్ మాట్లాడుతూ.. ఎయిమ్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నూతక్కి పీహెచ్‌సీకి 9 నిమిషాల్లోనే డ్రోన్ చేరుకొని.. బ్లడ్ శాంపిల్స్ సేకరించిందని చెప్పారు. తద్వారా వేగంగా చికిత్స అందించడానికి అవకాశం లభించిందన్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని గర్భిణులకు ఉచితంగా డ్రోన్‌తో వైద్య సేవలందిస్తామన్నారు. అత్యవసర సమయాల్లో డ్రోన్ వైద్య సేవలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎయిమ్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విచారణకు సజ్జల పోలీసుల ఓవరాక్షన్ పై పొన్నవోలు ఫైర్
-
అక్రమ కేసు.. విచారణకు సజ్జల హాజరు
సాక్షి, గుంటూరు: టీడీపీ కార్యాయలంపై దాడి చేశారంటూ అక్రమ కేసు విచారణకు హాజరు కావాలంటూ నిన్న(బుధవారం) వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గురువారం ఆయన మంగళగిరి పీఎస్‌లో విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, అవినాష్, నందిగం సురేష్లను పోలీసులు విచారించారు. ఈ కేసులో సజ్జలను 120వ నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు.కాగా, సజ్జల వెంట పొన్నవోలు, అప్పిరెడ్డి, తలశిల రఘురాం ఉండగా, పోన్నవోలు సుధాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. న్యాయవాదిని అడ్డుకోవడం రాజ్యాంగం విరుద్ధం అంటూ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని.. ప్రాథమిక హక్కులను సైతం కాలరాస్తున్నారన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉంది’’ అని పొన్నవోలు పేర్కొన్నారు.ఇదీ చదవండి: విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలకు అర్థం లేదు: వైఎస్ జగన్ -
అరాచకానికి హద్దు లేదా?.. నోటీసులపై సజ్జల రియాక్షన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విచారణకు హాజరు కావాలంటూ మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులపై ఆయన స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాన్ని అయినా చంద్రబాబు నిజంగా మల్చుతారని.. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు‘‘మాకు న్యాయ స్థానాలపై విశ్వాసం ఉంది. నేను విదేశానికి వెళ్లానని తెలిసి లుకౌట్ నోటీసు ఇచ్చారు. అక్టోబర్ 7న విదేశానికి వెళ్తే 10న నోటీసు ఇచ్చారు. 2021లో టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగితే ఇప్పుడు మళ్లీ కొత్తగా మాకు నోటీసులు పంపుతున్నారు. కేసు ముగిసే సమయానికి నోటీసులు ఏంటి?. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా? అరాచకానికి హద్దు లేదా?’’ అంటూ సజ్జల నిప్పులు చెరిగారు.‘‘అధికారం ఉందని తప్పుడు కేసులు పెడుతున్నారు. దానిపై మేము న్యాయం కోర్టుకు వెళ్తాం. ఎల్లోమీడియా తప్పుడు వార్తలు రాస్తోంది. మీ పెండ్యాల శ్రీనివాసరావు, ఇతర నేతల్లాగా నేనేమీ పారిపోవడం లేదు. కానీ లుకౌట్ నోటీసులు పేరుతో హడావుడి చేస్తున్నారు. ఎప్పుడో మూడేళ్ల క్రితం జరిగిన టీడీపీ ఆఫీసు మీద దాడి కేసును ఇప్పుడు బయటకు తీశారు. అసలు ఆ దాడి జరగడానికి కారణం ఏంటో కూడా అందరికీ తెలుసు..టీడీపీ నేతలు సీఎం జగన్ ని దారుణంగా దూషించారు. సుప్రీంకోర్టు నాకు ఇంటీరియమ్ ప్రొడక్ట్ ఇచ్చింది. అది కూడా సెప్టెంబర్ 20నే ఇచ్చినా కూడా ఇప్పుడు నాకు నోటీసులు ఎలా ఇస్తారు?. చేతిలో అధికారం ఉందని ఎలాగైనా నోటీసులు ఇస్తారా?. దీన్ని బరితెగింపు అనాలా? పొగరు అనాలా? ఇంకేమైనా అనాలా?. అసలు రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తోందా?. ఏమాత్రం బేస్‌లేని విషయాలలో కూడా నోటీసులు ఇచ్చి ఏం చేయాలనుకుంటున్నారు?. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈడీ అటాచ్మెంట్ చేసిందంటే చంద్రబాబు తప్పుడు పని చేసినట్టు నిర్ధారణ అయింది. అందుకే ఆస్తుల అటాచ్మెంట్ జరిగింది. కానీ చంద్రబాబుకు క్లీన్ చిట్ అని ఎలా రాస్తారు? అంతకన్నా బరితెగింపు ఉంటుందా?’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు.ఇదీ చదవండి: ఏపీ ప్రజల కళ్లల్లో కూటమి ‘ఇసుక’! ‘‘అలా తప్పుడు ప్రచారం చేసి జనాన్ని నమ్మించగలరేమోగానీ కోర్టును నమ్మించలేరు. జత్వానీ కేసులో కూడా నన్ను ఇలాగే ఇరికించారు. ఏదోలాగా కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. పట్టాభి ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌ని దూషించారు. అప్పుడు టీడీపీ ఆఫీస్‌పై గొడవ జరిగింది. వైఎస్ జగన్ మీద కూడా తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి నేరం జరగకపోయినా జరిగినట్టుగా క్రియేట్ చేసి కేసులు పెడుతున్నారు. బోట్లతో ప్రకాశం బ్యారేజిని కూల్చాలని ప్లాన్ చేశారని కూడా కేసులు పెట్టారు. అలాంటి వారికి న్యాయంతో పనిలేదు. ఏదోలా కేసులలో ఇరికించాలనే లక్ష్యంగా పని చేస్తున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉన్న వారందరినీ టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు. కోర్టుల్లో న్యాయ పోరాటం చేస్తాం’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. -
సజ్జలకు పోలీసుల నోటీసులు
-
సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ సీనియర్ నేత సజ్జలకు మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా రేపు(గురువారం) ఉదయం 10:30 గంటలకు సజ్జల హాజరు కావాలని నోలీసులు ఇచ్చారు. -
కీచకపర్వం.. మంగళగిరిలో ఏం జరుగుతోంది?
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎక్కడా చూసినా అత్యాచారాలు, హత్యలు, దాడులే కనిపిస్తున్నాయి. మొన్నటి ముచ్చమర్రి ఘటనతో మొదలైన అఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక, తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం జరగడం తీవ్ర కలకలం సృష్టించింది.కాగా, ఈ ఘటనలపై వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది. ఈ దారుణాలపై ట్విట్టర్లో..‘మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించారు. 24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న ఆడపిల్లల తల్లిదండ్రులు. నీ రెడ్ బుక్ రాజ్యాంగంలో శాంతి భద్రతను గాలికొదిలేసి.. కామాంధులకి లైసెన్స్ ఇచ్చేశావా నారా లోకేష్’ అని ప్రశ్నించింది. మంగళగిరిలో ఒక్క రోజులో ముగ్గురు బాలికలపై అత్యాచారయత్నం నియోజకవర్గంలోని ఆత్మకూరు, మంగళగిరి పట్టణంలోని రత్నాల చెరువు, బాలాజీ నగర్లో మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించిన కామాంధులు24 గంటల వ్యవధిలో ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి కామాంధులు యత్నించడంతో.. భయంతో వణికిపోతున్న…— YSR Congress Party (@YSRCParty) September 14, 2024ఇదిలా ఉండగా.. ఏపీలో రెడ్ బుక్ పాలనలో శాంతి భద్రతల అంశం గాలిలో దీపంలా మారింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందోననే భయంలో ప్రజలు ఉన్నారు. వరుసగా అఘాయిత్యాల ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ముచ్చుమరి ఘటన నుంచి గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ దారుణాల వరకు బాధితులకు న్యాయం చేయడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
పతాకస్థాయికి టీడీపీ కక్షసాధింపు 'పార్టీ ఆఫీసు కూల్చేశారు'
సాక్షి ప్రతినిధి, గుంటూరు/మంగళగిరి: తెలుగుదేశం ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం తెల్లవారుజామున పొక్లయిన్లు, బుల్డోజర్లతో కూల్చి వేసింది. దీనిపై శుక్రవారం హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, వాటిని ధిక్కరించి పార్టీ కార్యాలయాన్ని కూల్చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యాలయ నిర్మాణంపై ప్రొసీజర్ ప్రకారం వ్యవహరించాలని కోర్టు చెప్పింది. దీని ప్రకారం మరో రెండుసార్లు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, కోర్టు ప్రొసీడింగ్ అందలేదంటూ కూల్చి వేయడం ప్రభుత్వ కక్ష సాధింపుకు నిదర్శనం. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం నుంచే పొక్లయిన్లు, బుల్డోజర్లతో మోహరించారు. భవనం కూల్చివేతకు బందోబస్తు కావాలని పోలీసులను కోరగా, అసెంబ్లీ విధుల్లో ఉన్నందున తమ వద్ద తగిన సిబ్బంది లేరని వారు సమాధానం ఇచ్చారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో శనివారం ఉదయానికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేయాలని సీఎంఓ నుంచి ఒత్తిడి రావడంతో శనివారం ఉదయం ఐదున్నర గంటలకు ప్రారంభించి ఏడున్నర గంటలలోపు పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. సీఆర్డీఏ అధికారులు, మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేతను పర్యవేక్షించారు. పక్కాగా లీజున్నా దౌర్జన్యం గుంటూరు జిల్లా తాడేపల్లి గ్రామంలోని బోట్ యార్డు వద్ద సర్వే నంబర్ 202/ఎ–1లోని రెండు ఎకరాల స్థలాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం కోసం 33 ఏళ్లకు లీజుకు ఇస్తూ గత ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ఆదేశాలు జారీ అయ్యాయి. 2012లో రాష్ట్రంలో పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులకు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 571 ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి. స్థలం కేటాయించిన మూడేళ్లలో దేనికి కేటాయించారో ఆ విధంగా ఉపయోగించని పక్షంలో రద్దు చేస్తామని పేర్కొన్నారు. దీనికి భిన్నంగా భూమిని ఖాళీగా ఉంచితే ఆ భూమి కేటాయింపును జిల్లా కలెక్టర్ రద్దు చేసి వెనక్కు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 31న జీవో–52 ప్రకారం కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ భూమిని అప్పటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాదరావుకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. భూమిని కేటాయించినందుకు ప్రభుత్వానికి గత ఏడాది జూలై 26న రూ.66 వేలు చలానా కట్టారు. మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఈ నెల 15న రూ.4,44,312 ఆస్తి పన్ను కూడా చెల్లించారు. ఈ మేరకు అన్ని వివరాలతో సీఆర్డీఏకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో మొదటి అంతస్తు శ్లాబ్ పూర్తి అయ్యి, రెండో అంతస్తు శ్లాబ్ వేసే సమయంలో ఈ నెల 10న సీఆర్డీఏ అధికారులు నోటీసు జారీ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ శుక్రవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ ప్రొసీజర్ పాటించాలని, తొందరపాటు చర్యలు వద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ సమాచారాన్ని వెంటనే సీఆర్డీఏ న్యాయవాదులతో పాటు సీఆర్డీఏ కమిషనర్‌కు వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి ఫోన్ ద్వారా చేరవేశారు. దీంతో కోర్టు ఆదేశాలు తమకు అందడానికి ముందే పడగొట్టాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో శుక్రవారం సాయంత్రం నుంచే అక్కడ బుల్డోజర్లను మోహరించారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో మాట్లాడటానికి వైఎస్సార్సీపీ నాయకులు ప్రయతి్నంచినా వారు అందుబాటులోకి రాలేదు. శనివారం ఉదయం 5.30 గంటలకు అధికారులు కూల్చి వేశారు. నిర్మాణ దశలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని జేసీబీతో కూల్చివేస్తున్న దృశ్యం రైతుల నుంచి లాక్కున్న భూమిలో టీడీపీ కార్యాలయం నిర్మాణంగుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో జాతీయ రహదారిని ఆనుకుని కాలువ పోరంబోకు భూమిలో రైతులకు ఇచ్చిన పట్టా భూమిని ఆక్రమించుకుని టీడీపీ రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించారు. ఆత్మకూరులో 1974లో రైతులు బొమ్మి రామిరెడ్డి (0.65 ఎకరం), కొల్లు రాఘవరావు (1.75 ఎకరాలు), కొల్లు భాస్కరరావు (1.75 ఎకరాలు)లకు ప్రభుత్వం మొత్తం 4.15 ఎకరాలకు డీకేటీ పట్టాలు ఇచ్చింది. టీడీపీ ఆ భూముల్ని స్వాధీనం చేసుకుని, ఇది సరిపోదన్నట్టు పక్కనే ఉన్న రెండెకరాల కాల్వ పోరంబోకును ఆక్రమించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది. టీడీపీ రాష్ట్ర కార్యాలయం మొత్తంగా 6.15 ఎకరాల భూమిని అక్రమంగా దక్కించుకుంది. ఏటా ఎకరాకు రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్ల పాటు ప్రభుత్వానికి లీజు చెల్లించేలా జీవో జారీ చేయించుకుంది. ఈ భూమి ధర దాదాపు రూ.100 కోట్లకు పైమాటే. టీడీపీ భూ దందాపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పటి తహసీల్దారు జి.వి.రామ్‌ప్రసాద్.. ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలపై నోటీసులు జారీ చేశారు. కేవలం రోడ్డును ఆక్రమించి నిర్మించిన రేకుల షెడ్లను మాత్రమే తొలగించారు. కానీ నేడు వైఎస్సార్సీపీ నిర్మిస్తున్న కార్యాలయం మొత్తం కూల్చేయడం చంద్రబాబు కక్షపూరిత చర్యలకు అద్దం పడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఓటు తెచ్చిన చేటు..
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : పేద రైతులకు ముఖ్యంగా కౌలుదారులకు మొన్న జరిగిన సాధారణ ఎన్నికలు ఎక్కడాలేని కష్టం తెచ్చిపెట్టాయి. తమ యజమానులు చెప్పిన వారికి ఓటు వేయకపోవడం.. తమ మనస్సాక్షి ప్రకారం వారు నడుచుకోవడమే వారు చేసిన నేరం. తమ మాటకు విలువ ఇవ్వలేదని, తాము చెప్పినట్లు ఓట్లు వేయలేదన్న అక్కసుతో తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు బరితెగించి ఇక నుంచి మా భూముల్లోకి అడుగుపెట్టొద్దని చెప్పేస్తున్నారు.మీకు మా భూములను కౌలుకు ఇవ్వడంలేదని తేల్చిచెప్పేయడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలురైతులు వ్యవసాయ సీజన్ ఆరంభంలో ఒక్కసారిగా రోడ్డునపడ్డారు. తాత, తండ్రుల నుంచి ఇప్పటివరకు ఆ భూముల్లో పంటలు పండించుకుంటూ క్రమం తప్పక కౌలు చెల్లిస్తున్న తమను రావద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదనకు లోనవుతున్నారు. మాకిష్టమైన వారికి ఓటు వేసుకునే స్వేచ్ఛ కూడా లేదా అని వాపోతున్నారు.భూమి వారిదైనప్పుడు మా ఓటు మాది కాదా అని యువ కౌలుదారులు ప్రశ్నిస్తున్నారు. ఇలా మాలాంటి పేదలపై పెత్తందారుల దాష్టీకాలు ఇంకెంత కాలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ దారుణాలు మంగళగిరి నియోజకవర్గంలోనే చోటుచేసుకుంటున్నాయా? లేక ఇతర ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి దాపురించిందా అని గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కౌలురైతులు ‘సాక్షి’ వద్ద తమ ఆవేదన వ్యక్తంచేశారు.కౌలురైతు: బుల్లా శ్రీనివాసరావు సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి- రెండెకరాలుఎప్పటి నుంచి - 15 ఏళ్లుగాకౌలు మొత్తం (ఎకరానికి) - రూ.35 వేలుకౌలురైతు: గొడవర్తి ప్రతాప్సింగ్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - వాసిరెడ్డి వాసుగ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - ఏళ్లుగా చేస్తున్నారుకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ సద్దాం హుస్సేన్ సామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - గద్దె శ్రీనివాసరావుగ్రామం - చిలువూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - ఐదేళ్లుగా..కౌలు మొత్తం - 16 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాదర్ భాషాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - యడ్ల హర్షవర్థన్రావుగ్రామం - తుమ్మపూడిసాగుచేస్తున్న భూమి - 10 ఎకరాలు ఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 70 వేలు (నిమ్మతోట)కౌలురైతు: చిలకా తిమోతిసామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - పాటిబండ్ల హరిప్రసాద్ గ్రామం - పెదపాలెంసాగు చేస్తున్న భూమి - ఒకటిన్నర ఎకరంఎప్పటి నుంచి - 30 ఏళ్లుగాకౌలు మొత్తం - 22 బస్తాలుకౌలురైతు: షేక్ ఖాంసాసామాజికవర్గం - ముస్లిం భూ యజమాని - లంక గోపాలరావుగ్రామం - కంఠంరాజు కొండూరుసాగుచేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 14 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుకౌలురైతు: గంపల శ్రీనివాసరావుసామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - పుతుంబాక సాయికృష్ణగ్రామం - పేరకలపూడి సాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 22 ఏళ్లుగాకౌలు మొత్తం - 35,000కౌలురైతు: యలమాటి ప్రసాద్కుమార్సామాజికవర్గం - ఎస్సీ (మాదిగ)భూ యజమాని - గుంటుపల్లి సరస్వతిగ్రామం - పెదపాలెంసాగుచేస్తున్న భూమి - మూడెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగా (తండ్రి నుంచి)కౌలు మొత్తం - 5 బస్తాలు మొదలు 23 బస్తాల వరకు / 30 వేలుకౌలురైతు: దేశబోయిన బాబుయాదవ్సామాజికవర్గం - బీసీ (యాదవ)భూ యజమాని - గుండిమెడ బసవయ్యగ్రామం - కంఠంరాజు కొండూరుసాగు చేస్తున్న భూమి - నాలుగెకరాలుఎప్పటి నుంచి - 35 ఏళ్లుగాకౌలు మొత్తం - 18 బస్తాలుమంగళగిరి నుంచి లోకేశ్ పోటీతో..టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేశ్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేసిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలై, మూడు శాఖల మంత్రిగా పనిచేసిన ఆయన మరోసారి అదే స్థానం నుంచి బీసీ వర్గానికి చెందిన మురుగుడు లావణ్యతో ఈసారి పోటీపడ్డారు. చాలాకాలంగా మంగళగిరి టౌన్, రూరల్, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని తన సామాజికవర్గంపై ఆయన ప్రధానంగా దృష్టిసారించారు.ఈ నేపథ్యంలో.. పెదపాలెంకు చెందిన పాటిబండ్ల కృష్ణప్రసాద్ (కేపీ) వైఎస్సార్సీపీ నాయకుడిగా కొనసాగుతూ కొద్దినెలల కిందట లోకేశ్ పక్షాన చేరారు. అలాగే, దుగ్గిరాల మండలవాసి, మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య రంగ సంస్థల ముఖ్యులు, వ్యాపారస్తులు, ఎన్ఆర్ఐల సహకారం కూడా లోకేశ్‌కు తోడైంది. తమ వాడైన లోకేశ్‌కు మద్దతిస్తే ఇవ్వండి, లేదంటే మా సంస్థల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలను వదిలేసుకోండని స్పష్టంగా చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు.. ఇళ్లలోని పెద్దలకు, మహిళలకు కూడా ఫోన్లుచేసి ఇదే విషయమై బెదిరించారని చెప్పారు.వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నామని..దుగ్గిరాల మండలంలోని వివిధ గ్రామాల్లో పెత్తందారులుగా చలామణి అవుతున్న పలువురు టీడీపీ నాయకులు, మద్దతుదారులు తమను అనేక విధాలుగా బెదిరింపులకు పాల్పడ్డారని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు వాపోయారు. మండలంలోని పెదపాలెం, తుమ్మపూడి, చిలువూరు, కంఠంరాజు కొండూరు, పేరకలపూడి, శృంగారపురం, పెనుమోలి, మోరంపూడి, చిన్నపాలెం తదితర 12 పల్లెల్లోని పేద రైతులకు ఈ ఏడాది నుంచి కౌలుకు భూమి ఇవ్వడంలేదని వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందు టీడీపీ సామాజికవర్గానికి రైతులు చెప్పడం పరిశీలనాంశం. ‘ఎన్నికలు జరగడం కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎవరికిష్టమైన పార్టీకు వారు ఓట్లు వేసుకుంటున్నారు. ఆ తరువాత ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఈసారే కులాలు, మతాలు అంటూ దారుణంగా పరిస్థితులు మారాయి’.. అని వైఎస్సార్సీపీ నాయకుడు వీరయ్య వ్యాఖ్యానించారు.నియోజకవర్గ ఓటర్లకు డబ్బులు..ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని వాటితో పాటు విజయవాడ, గుంటూరు, ఇతర ముఖ్య నగరాల్లోని కార్పొరేట్ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు, వ్యాపార సముదాయాల్లో పనిచేసే నియోజకవర్గ ఓటర్లకు ఎన్నికల బోనస్ అందింది. టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఆయా ఉద్యోగి స్థాయిని బట్టి 2,500 నుంచి 5,000 వరకు డబ్బులు అకౌంట్లలో పడ్డాయి. చేతికి కూడా ఇచ్చారు. అడక్కపోయినా తమకు ఎన్నికల బోనస్ అందిందని ఆయా గ్రామాలకు చెందిన ఉద్యోగుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. పదవులు వచ్చాయని పగబట్టారు..మండలంలోని ఓ ప్రధాన సామాజికవర్గం వారు దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ (పసుపు) యార్డు చైర్మన్ పదవిని దశాబ్దాలుగా అనుభవించారు. ఆ పదవిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికిచ్చారు. అప్పటి నుంచే ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేకపోతోంది. నియోజకవర్గంలోని ఇతర పదవుల విషయంలోనూ వారిది అదే తీరు.ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన కౌలు దారులకు మండలంలో సుమారు 200 ఎకరాల వరకు కౌలుకు ఇవ్వడంలేదనేది మా అంచనా. గత ఎన్నికల్లో నారా లోకేశ్ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో బీసీ వర్గీయురాలిపై పోటీచేశారు. ఫలితం తేలాల్సి ఉంది. ఆయన సామాజికవర్గీయులకు చెందిన భూములు కౌలుకు ఇవ్వడంలేదంటే వారి ఆలోచనా తీరును అర్థంచేసుకోవాలి. ఆయన మంగళగిరి నియోజకవర్గ నాయకుడా? లేక రాష్ట్రస్థాయి లీడరా? అనేది ఆయనే తేల్చుకోవాల్సిన విషయం. – దుగ్గిరాల వీరయ్య, వైఎస్సార్సీపీ, దుగ్గిరాలరెడ్బుక్లో పేరు ఎక్కిందంటూ బెదిరింపులు..35 ఏళ్లుగా మా తాత తండ్రుల కాలం నుంచి మూడెకరాలను కౌలుకు చేస్తున్నాం. వాళ్ల ఇళ్లలో అన్నిరకాల పనులూ చేశాం. వైఎస్సార్సీపీ వైపు నిలిచినందుకు మాకు భూమి కౌలుకు ఇచ్చేది లేదంటున్నారు. అమరావతి భూముల అంశంలో మాట్లాడినందుకు.. ‘నీ పేరు లోకేశ్ రెడ్‌బుక్‌లో ఎక్కింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక నీ సంగతి తేలుస్తా’..మని బెదిరిస్తున్నారు. ఏం జరుగుతుందో, ఏమో! – యలమాటి ప్రసాద్‌కుమార్, పెదపాలెంఇల్లు కట్టుకుంటున్నా ఓర్వలేకున్నారు..మేం ఇల్లు కట్టుకుంటున్నాం. నిర్మాణ సమయంలో పొరుగు ఇంటిపై కాస్త నీళ్లు పడినా, దుమ్ము రేగినా తట్టుకోలేకపోతున్నారు. పనిచేసే భవన కార్మికులను, పనివాళ్లను తిడుతున్నారు. కారణం మేం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలిచామని. – షేక్ బాజీ, చిలువూరుమీరు పార్టీ మారారని మేమూ మారాలా?‘మీరు ఎందుకు జగన్‌కు మద్దతుగా ఉంటున్నారు? ఆ పార్టీని వదిలేసి లోకేశ్‌కు ఓట్లు వేయండి’.. అని మా గ్రామ పెత్తందారు హుకుం జారీచేశారు. మేం జగన్‌ను వదిలే ప్రసక్తిలేదని నాతో పాటు మా బంధువర్గానికి చెందిన వారందరం స్పష్టంగా చెప్పాం. మీరు పార్టీ మారారని, మమ్మల్ని కూడా మారాలని ఆదేశిస్తే అంగీకరించేదిలేదన్నాం. దీంతో పదిహేనేళ్లుగా కౌలుచేస్తున్న రెండెకరాలను ఇచ్చేదిలేదన్నారు. కౌలు డబ్బులు సీజన్‌కు ముందే చెల్లిస్తాం. ఓట్లు వేయనందుకు పొలం ఇవ్వడంలేదనడం వ్యవసాయ సీజన్ మొదలయ్యే ముందు చెప్పడం ఎంతవరకు న్యాయమో వారే ఆలోచించుకోవాలి. – బుల్లా శ్రీనివాసరావు, పెదపాలెండబ్బులు వెనక్కు ఇచ్చేశారు..భూమి సత్తువ కోసం జొన్న మొదుళ్లను కట్టర్‌తో పనిచేయించాం. రూ.5వేలు ఖర్చయ్యింది. ఆ మొత్తాన్ని మా భూ యజమాని తిరిగి ఇచ్చేశారు. మూడెకరాలను ఈ ఏడాది కౌలుకు ఇచ్చేది లేనిదీ ఇరవై రోజులు తరువాత చెప్తామన్నారు. ఇక వారు చెప్పేదేంటో అర్థమైపోయింది. – గొడవర్తి ప్రతాప్‌సింగ్, పెదపాలెంమేమే సాగు చేసుకుంటామంటున్నారు..పద్నాలుగేళ్లుగా సాగుచేసుకుంటున్న నాలుగెకరాల పొలాన్ని ఈ దఫా కౌలుకు ఇచ్చేలా లేరు. మేమే సాగు చేసుకుంటామని చెబుతున్నారు. మొన్న ఎన్నికల్లో మేం ఫ్యాన్‌కు ఓట్లేశామని వారికి మాపై కోపం.– షేక్ ఖాంసా, కంఠంరాజుకొండూరుమా నాన్నకు వీడియోలు చూపించి బెదిరించారు..మీ అబ్బాయి వైఎస్సార్సీపీలో తిరుగుతున్నాడు. పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీ తరఫున గట్టిగా మాట్లాడాడు. ఇవిగో వీడియోలు చూడండని ఇంటికెళ్లి మా నాన్న ఇస్మాయిల్‌కు వాటిని చూపించారు. దీంతో.. ఐదేళ్లుగా చేస్తున్న నాలుగెకరాలను ఇక నుంచి కౌలుకు ఇచ్చేదిలేదని చెప్పారు. – షేక్ సద్దాం హుస్సేన్, చిలువూరుసర్పంచ్గా గెలిచానని..మాది తుమ్మపూడి. మా అన్న షేక్ ఖాదర్ బాషా. ప్రస్తుతం ఏడాదికి ఎకరానికి రూ.70 వేలు చొప్పున నిమ్మతోటకు కౌలు చెల్లిస్తూ వచ్చాం. పదెకరాలకు 35 ఏళ్ల పాటు ఎప్పటి కౌలు అప్పుడు ఇచ్చేవాళ్లం. నేను సర్పంచ్‌గా పోటీచేసి గెలిచినందుకు మూడేళ్ల నుంచి నిమ్మతోటను మా అన్నకు ఇవ్వలేదు. – జానీ బాషా, తుమ్మపూడి సర్పంచ్మీవి భూములైనప్పుడు మావి ఓట్లు కావా?మా బాబాయి గంపల శ్రీనివాసరావు 22 ఏళ్లుగా రెండెకరాలు కౌలుకు చేసేవారు. ఎకరానికి రూ.35 వేలు చొప్పున ముందస్తు కౌలు క్రమం తప్పక చెల్లించేవారు. ఎంబీఏ చేసిన నేను బీసీ వర్గం నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసి సర్పంచ్‌గా గెలుపొందాను. అంతమాత్రాన కౌలుకు భూమి ఇచ్చేదిలేదంటే ఎలా? భూములు వారివి అయినప్పుడు ఓట్లు మావి కావా? వారికి మాత్రమే పార్టీ.. మాకు పార్టీ అంటే ఇష్టం ఉండదా? ఇదెక్కడి న్యాయమో అర్థంకావడంలేదు. – గంపల గంగాధరరావు, పేరుకలపూడి, సర్పంచ్ -
Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతోంది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు తనయుడు లోకేష్ రెండోసారి ఓటమికి సిద్ధమవుతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో దొడ్డిదారిన మంత్రి పదవి వెలగబెట్టిన లోకేష్ మంగళగిరిలో పునాది వేసుకోలేకపోయారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే మంగళగిరిని ఊహించనిరీతిలో అభివృద్ధి చేశారు. వైఎస్ జగన్ పాలనకు జనం జేజేలు పలుకుతున్నారు. పోలింగ్ రోజు ఉదయమే బారులు తీరిన ఓటర్లే జగన్ పాలనకు ఆమోదమనే చర్చ జరుగుతోంది.ఆర్కే చేతిలో తొలి పరాజయంగుంటూరు జిల్లా ముఖద్వారం మంగళగిరి నియోజకవర్గాన్ని మూడోసారి కూడా వైఎస్సార్సీపీ పార్టీ కైవసం చేసుకోబోతోంది. గత రెండు ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019లో టీడీపీ తరపున అప్పటి మంత్రి, ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. తండ్రితో కలిసి హైదరాబాద్ పరార్ఓటమి తర్వాత ఏడాదికిపైగా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో కరకట్ట మీది ఇల్లు వదిలి తండ్రితో కలిసి హైదరాబాద్ పారిపోయారు. దీంతో మంగళగిరిలో టీడీపీ క్యాడర్ కకావికలమైంది. లోకేష్‌ను కలవాలంటే క్యాడర్‌కు సాధ్యమయ్యేది కాదు. సీఎం జగన్ పాలనలో మారిన మంగళగిరి రూపురేఖలువైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ చేరాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 500 కోట్లతో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. దీంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా 1700 కోట్లు లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లాయి. వైఎస్ జగన్ పాలనలో మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడూ ప్రజలకు అందుబాటలో..తాడేపల్లి, మంగళగిరి కలిపి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మంగళగిరి అభివృద్ధిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటమే గాకుండా అవినీతికి తావు లేకుండా, ప్రతి అభివృద్ధి పనినీ ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. జగన్ పాలన పట్ల ఆకర్షితులైన నియోజకవర్గంలోని కీలక టీడీపీ నేతలు గంజి చిరంజీవి, మురుగుడు హనుమంతరావు వైఎస్సార్ సీపీలో చేరి మరింత బలోపేతం చేశారు. చేనేత వస్త్రాలకు పేరు గాంచిన మంగళగిరిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేనేత షెడ్లను ఏర్పాటు చేశారు. నేతన్నలు ఉత్పత్తి చేసిన వస్త్రాలను మార్కెట్లో అమ్ముకోవడానికి చేనేత బజారు ఏర్పాటు చేశారు. మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేయడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది. మరోవైపు లోకేష్ వ్యవహార శైలితో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతూ వచ్చింది. లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్..మంగళగిరిలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఈ సీటును బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. అందులో భాగంగానే వరుసగా రెండుసార్లు గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాకుండా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మురుగుడు లావణ్యకు వైఎస్సార్సీపీ టికెట్‌ను కేటాయించింది. మురుగుడు లావణ్య మామయ్య మురుగుడు హనుమంతరావు గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. లావణ్య తల్లి కాండ్రు కమల కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో నియోజకవర్గంపై వారిద్దరికీ మంచిపట్టుంది.సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, మరోనేత గంజి చిరంజీవి కలిసికట్టుగా ఎన్నికల యుద్ధంలో దిగటంతో లోకేష్‌కు మైండ్ బ్లాక్ అయింది. తనకు బలం లేకపోయినా డబ్బుతో గెలవాలని నిర్ణయించుకున్న లోకేష్ కోట్లు కుమ్మరించారు.పోలింగ్ రోజు ఉదయం 6 గంటలకే క్యూఅంతేకాదు 30 మంది డమ్మీ క్యాండెట్లను రంగంలోకి దించి ఓట్లు చీల్చడానికి, ఓటర్లను గందరగోళపరచడానికి కుట్రపన్నారు. కానీ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో జగన్ పాలనకే మంగళగిరి ప్రజలు పోలింగ్ రోజు జైకొట్టారు. ఉదయం 6 గంటలకే వృద్ధులు మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలు గంటలకొద్దీ క్యూల్లో నిలుచుని ఫ్యాన్‌ను గిరగిరా తిప్పారు. వైస్సార్సీ ప్రభుత్వంలో కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన మంగళగిరి మరింత అభివృద్ధి చెందాలంటే మురుగుడు లావణ్యను గెలిపించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రజలు భావించారు. లోకేష్ ఎన్ని కుట్రలు చేసినా మరోసారి ఆయనకు ఓటమి తప్పదనే టాక్ మంగళగిరిలో గట్టిగా వినిపిస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ఓటును అమ్ముకున్న ఎస్సై
-
జై జగన్ నినాదాలతో మారుమోగిన మంగళగిరి
-
రూ.300 పింఛన్‌ను రూ.400 చేస్తా
మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ మరోసారి నోరు జారి.. నవ్వుల పాలయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్ గురువారం రాత్రి మంగళగిరి పరిధిలోని కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా నిడమర్రులో ఆయన మాట్లాడుతూ.. రూ.300 పింఛన్‌ను రూ.400కు పెంచుతాననడంతో సభకు హాజరైనవారు అవాక్కయ్యారు. వెంటనే పక్కనే ఉన్న మరో నాయకుడు కలుగజేసుకొని.. రూ.3 వేల నుంచి రూ.4 వేలకు అని చెప్పడంతో లోకేశ్ నాలుక కరుచుకున్నారు. -
నేనంటే భయమెందుకు బాబు
-
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్.. జయహో జగన్ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే ఎగురుతుందంటూ లోకేష్ అండ్ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. -
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
-
చంద్రబాబు దోచిన సొమ్ము అంతా ప్రజలదే..
-
ప్రత్యేక హోదా కూడా అమ్మేశారు
-
సీఎం జగన్ సింహగర్జన.. దద్దరిల్లిన మంగళగిరి సభ
-
నారా లోకేష్ కు ఈ దెబ్బతో..!
-
మన ప్రభుత్వం ఉంటే..మరెన్నో సంక్షేమ పథకాలు
-
సీఎం జగన్ కాన్వాయ్ విజువల్స్
-
వాళ్లు గొంతు నొక్కేది మీ బిడ్డ ప్రభుత్వానిది మాత్రమే కాదు.. : సీఎం జగన్
గుంటూరు, సాక్షి: రాజకీయాల్లో.. పట్టపగలే ఇంతదారుణంగా ప్రజల్ని మోసం చేస్తున్న పరిణామాలను చూస్తున్నామని, సరిగ్గా ఎన్నికల వేళ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కుట్రలకు తెర తీశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళగిరి ప్రచార సభలో అన్నారు.‘‘ఎవరైనా దొంగతనం చేస్తే దొంగోడు అని కేసు పెడతాం. మోసం చేస్తే చీటింగ్ కేసు పెడతాం. మరి మేనిఫెస్టో పేరుతో మోసగించే చంద్రబాబు లాంటి వాళ్ల మీద ఎలాంటి కేసులు పెడదాం?. వీళ్ల కుట్రలు ఏ స్థాయిలో ఉందంటే.. జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందనో.. అన్ని వర్గాలు ఎక్కడ జగన్‌ను తమ వాడిగా భావిస్తున్నాయో అని అసూయతో కుట్రలకు తెర తీశాయి... అవ్వాతాలకు పెన్షన్ రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్లు. వీళ్ల కుట్రలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నాయంటే.. రెండు నెల కిందట బటన్ నొక్కితే ఎన్నికల కోడ్ పేరుతో అక్కచెల్లమ్మలకు డబ్బు వెళ్తాయో అని దానిని కూడా అడ్డుకున్నారు. వీటి మీద స్వయంగా ముఖ్యమంత్రి కోర్టుకు వెళ్లారంటే.. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలి.ఇదీ చదవండి: ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్.. మీ బిడ్డ జగన్ ఏదీ ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ పాలనలో అలాంటి దాఖలాలూ లేవు. మొదటి రోజు నుంచి ప్రతీ నెలా క్యాలెండర్ ఇస్తూ ఈ నెలల రైతు భరోసా, ఈ నెలలో ఈ పథకం ఇస్తాం అంటూ సంవత్సరం క్రమం తప్పకుండా అందరికీ మంచి చేస్తూ వస్తున్నాడు. కానీ, ఎన్నికలకు ముందే కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు... మన ప్రజాస్వామ్యంలో ఐదేళ్ల కోసం ప్రభుత్వం ఎన్నుకుంటున్నారు. 57 నెలలకే ఈ ప్రభుత్వం గొంతు పిసికేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వం గొంతు పికసడం మాత్రమే కాదు. అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలు, రైతులు, పేద విద్యార్థుల గొంతుల్ని నొక్కడమే అని గమనించండి. మళ్లీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి?.. బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడూ మన గుర్తు ఫ్యాన్, అక్కా మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, అక్కడ అవ్వ మన గుర్తు ఫ్యాన్ మర్చిపోకూడదు, చెల్లెమ్మా మన గుర్తు ఫ్యాన్, అక్కడ చెల్లెమ్మలు మన గుర్తు ఫ్యాన్.. అన్నా తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడుండాలి.. ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి.. ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి.. సింకులోనే ఉండాలి.నా చెల్లిని పరిచయం చేస్తున్నా. లావణ్యమ్మ(మురుగుడు లావణ్య) మీలో ఒకరు. మంగళగిరి సీటు బీసీల సీటు. వెనుక బడిన వర్గాల సీటు. నేను గతంలో ఆర్కేకు ఇచ్చా. ఇప్పుడు ఆర్కేను త్యాగం చేయమని చెప్పి.. బీసీకి ఇప్పించా. కానీ, అవతల నుంచి పెద్ద పెద్ద నేతలు వచ్చి.. డబ్బు వెదజల్లుతున్నారు. మీ బిడ్డ దగ్గర పెద్దగా డబ్బు లేదు. బటన్లు నొక్కి పంచిపెట్టడమే ఉంది. చంద్రబాబు పాలనలో అంతా దోచుకోవడం.. పంచుకోవడమే. కాబట్టి చంద్రబాబు మాదిరి మీ బిడ్డ దగ్గర డబ్బు లేదు. అందుకే ఆయన గనుక డబ్బు ఇస్తే వద్దు అనకండి తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మన దగ్గరి నుంచి దోచుకుందే. కానీ, ఎవరి వల్ల మంచి జరిగింది.. ఎవరు ఉంటే మంచి కొనసాగుతుంది అనేది ఆలోచన చేయండి. ప్రతీ ఒక్కరూ ఓటేయండి. అలాగే ఎంపీ అభ్యర్థిగా రోశయ్య నిలబడుతున్నారు. మీ ఆశీస్సులు రోశయ్యపై కూడా ఉంచాల్సిందిగా కోరుతూ.. ఓటేయమని కోరుతున్నా అని సీఎం జగన్ ప్రసంగం ముగించారు. -
Watch Live: మంగళగిరిలో సీఎం జగన్ ప్రచార సభ