నేతన్నకు నాయకత్వం  | YS Jagan in an interview with handloom weavers in Mangalagiri | Sakshi
Sakshi News home page

నేతన్నకు నాయకత్వం 

Published Sun, Apr 14 2024 5:24 AM | Last Updated on Sun, Apr 14 2024 5:24 AM

YS Jagan in an interview with handloom weavers in Mangalagiri - Sakshi

మంగళగిరిలో చేనేతలతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రాజకీయంగా ఎదిగేలా అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తున్నాం

చేనేతలకు అండగా ఉంటా

కుప్పం, మంగళగిరిలో బీసీలకే సీట్లు ఇచ్చాం

సూర్యోదయాన్ని, పేదల జీవితాలు బాగుపడటాన్ని ఎవరూ ఆపలేరు 

బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి
‘‘చేనేతలకు అన్ని విధాలా అండగా ఉంటూ వారు రాజకీయంగా కూడా ఎదిగేందుకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మున్సిపల్‌ చైర్మన్‌ పదవుల్లో పెద్దపీట వేశాం. మంగళగిరి ప్రజలకు ఇచ్చిన 54 వేల ఇళ్లను చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు. సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందంటూ కేసులు వేశారు.

వాళ్లు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడిగితే.. 54 వేల మందికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే నువ్వెందుకు అడ్డుకున్నావ్‌..! బుద్ధీ జ్ఞానం ఉందా? అని నిలదీయండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. జగన్  చేయవచ్చు, ఇంకొకరు చేయవచ్చు! బాగుపడేది పేదవాడు అయినప్పుడు అడ్డు పడాలని చూసిన ఏ నాయకుడైనా రాజకీయాలకు అనర్హుడు’’ – సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  నేతన్న నేస్తం అనే ఒక్క పథకం ద్వారానే చేనేత­కారులకు రూ.970 కోట్ల మేర లబ్ధి చేకూ­రుస్తూ ఏకంగా 1.06 లక్షల మందికి వర్తింపజేశా­మని సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికీ ఏటా నేతన్న నేస్తం అందిస్తూ ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా అర్హులందరికీ పారదర్శకంగా ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నామ­న్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా శనివారం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌ హాల్‌లో చేనేతకారు­లతో నిర్వహించిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడారు. ఆ వివరాలివీ..

బతుకులు మార్చినవాడే నాయకుడు..
బస్సు యాత్రలో భాగంగా పలు వృత్తులు, వ్యాప­కాల్లో నిమగ్నమైన వారిని కలుస్తూ వస్తున్నాం. ఆ వర్గాలకు జరిగిన మంచితోపాటు ఐదేళ్లలో వారి జీవి­తాలు ఎలా బాగుపడ్డాయో నేరుగా తెలుసుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇంకా మెరుగ్గా, సమర్థంగా చేయడంపై సూచనలు, సల­హాలు ఈ కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్నాం. ప్రజ­లకు చేదు అనుభవాలను మిగిల్చిన చంద్రబాబు మాదిరిగా కాకుండా ప్రతి పేదవాడు గుండెల్లో పె­ట్టుకుని చూసుకునేలా 58 నెలలుగా మీ బిడ్డ ప్రభు­త్వం పాలన సాగిస్తోంది.

ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే, ఆ నాయ­కత్వ స్థానంలో నిలబెట్టినందుకు మన బతు­కులు మా­రాలి. అలాంటి నాయకుడు ఆ స్థానంలో ఉంటేనే మన బతుకులు మారతాయి. ఎన్నుకునే­టప్పుడు మ­నం పొరపాటు చేస్తే రాబోయే ఐదేళ్లు మళ్లీ మనం చేయగలిగింది ఏమీ ఉండదు. మరోసారి మోస­పో­యి మన బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతా­యి. 

నేతన్నకు వెన్నుపోటు.. 98 శాతం ఇంటూ గుర్తులే
ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ అంటూ హామీలు గుప్పిస్తున్న చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టో 21, 22వ పేజీల్లో చేనేతలకు కాస్తంత స్థలం కేటాయించారు. ఇప్పటి మాదిరిగానే కూటమిగా ఏర్పడి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో హామీలిచ్చి 98 శాతం ఎగ్గొట్టారు. నూటి­కి 2 మార్కులు కూడా రాలేదు. అదీ చంద్రబాబు ట్రాక్‌ రికార్డు. ఆ హామీలు ఒక్కసారి గమనిస్తే చేనేత సహకార సంఘాల భవనాలకు ఆస్తిపన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది సున్నా. చేనేత కార్మికులకు గుర్తింపు కార్డులు గతంలోనే ఇచ్చారు. జరీపై వ్యాట్‌ రద్దు చేయలేదు.

ఒక్కో చేనేత కుటుంబానికి రూ.లక్ష మేర సంస్థాగత రుణ సౌకర్యం కల్పించలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, బడ్జెట్‌లో ఏటా రూ.1,000 కోట్లు కేటాయించలేదు.  చేనేత సహకార సంస్థను పటి­ష్టం చేసి అంతర్జాతీయ స్థాయిలో మార్కె­టింగ్‌ కల్పి­స్తామంటూ ఆప్కోకే బకాయిలు పెట్టా­డు. జిల్లాకో చేనేత పార్కు ఏర్పాటు చేయలేదు. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళ­గిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆస్ప­త్రు­లు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు కాలేదు.

సగం ధరకే జనతా వస్త్రాలు, జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ హామీ అమలు చేయలేదు. కేంద్రం ఇస్తోంది కాబట్టి చేనేత సొసైటీలకు 20 శాతం రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్పో జరిగింది. ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు ఒక్కరికన్నా ఇచ్చారా? ఇలా 98 శాతం ఇంటూ గుర్తులే ఉంటే రెండు శాతం మాత్రమే టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఈరోజు ఎన్నికలు రావడంతో మరోసార వంచనకు తయారయ్యాడు.

58 నెలల్లో రూ.3,706 కోట్లు
నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఎప్పుడూ లేని విధంగా 58 నెలల వ్యవధిలో రూ.3,706 కోట్లు ఖర్చు చేశామని గర్వంగా చెబుతున్నా. ఇవన్నీ పార­ద­ర్శకంగా కనిపిస్తున్నాయి. మీ బ్యాంకు ఖాతాలకు గత 58 నెలల్లో ఎన్ని డబ్బులు జమ అయ్యాయి? చంద్రబాబు హయాంలో ఎన్ని డబ్బులు పడ్డాయో ఒక్కసారి ఖాతాలను పరిశీలిస్తే తేడా మీకే తెలుస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం ద్వారానే రూ.970 కోట్లు  1.06 లక్షల మందికి అందచేశాం.

94,410 చేనేత కుటుంబాలు ఆత్మగౌరవంతో ఇంటివద్దే పెన్షన్‌ అందుకున్నాయి. నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్‌ అంది­స్తున్న పరిస్థితి వచ్చిందంటే దివంగత నేత వైఎ­స్సార్‌ చలువే. తొలిసారిగా చేనేత వస్త్రా­లకు అంతర్జాతీయ మార్కె­టింగ్‌ సౌకర్యం కల్పించింది మన ప్రభుత్వమే. అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌­కార్ట్, మీరా, పేటీయం లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారి ఫ్లాట్‌­ఫా­మ్స్‌­లో మన వస్త్రాల­ను చే­ర్చాం.

మ­నం రాక­ముం­దు ఆ­ప్కో బకాయిలే రూ.120 కోట్లు ఉంటే వాటిని క్లియర్‌ చేయడమే కాకుండా రూ.469 కోట్లు ఆప్కో­కు ఇచ్చి చేనేతలకు ఆదుకున్నాం. వి­ద్యా­కా­నుక ద్వా­రా 44 లక్షల మంది స్కూలు పిల్ల­లకు యూనిఫాం అందిస్తుండగా తొలి ప్రాధా­న్యతగా చేనేతకా­రులకే ఆ­ర్డ­ర్లు ఇవ్వాలని ఆదేశించాం.  

బీసీల కోటలో బాబు కుటుంబం తిష్ట
చేనేతకారులు అధికంగా ఉండే మంగళగిరి ప్రాంతంలో వారికి రాజకీయంగా కూడా పెద్దపీట వేశాం. స్థానిక ఎమ్మెల్యే ఆర్కేను పిలిచి మాట్లాడి నా చేనేత చెల్లెమ్మకు సీటు ఇచ్చేందుకు సహకరించాలని కోరా. ఆర్కే కూడా మంచి మనసుతో తాను సిద్ధంగా ఉ­న్నానంటూ ముందుకొచ్చాడు. లావణ్యమ్మకు మంగళ­గిరిలో, బుట్టమ్మకు ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. సునీతమ్మ, హనుమంతన్న ఎమ్మె­ల్సీ­లుగా ఉన్నారు.

ప్రొద్దుటూరు, రాయ­దుర్గం, వెంకటగిరి, ఎమ్మిగనూరు, జగ్గయ్య­పేట, చీరాల, ధర్మవరం, పెడన లాంటి 8 చోట్ల మున్సి­పల్‌ చైర్మన్లుగా ఉన్నది నేతన్నలే. దీనికి కారణం మీ బిడ్డ రూల్‌ తెచ్చాడు కాబట్టే. ఒకవైపు మీ బిడ్డ చేనేతకారులకు రాజకీయంగా ప్రాధాన్యం కల్పిస్తూ అడుగులు వేస్తుంటే మరోవైపు చంద్రబా­బు ఆయన కుమారుడు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న­చోట్ల కూడా వారికి సీట్లు ఇవ్వకుండా ఆ స్థా­నాల్లో తిష్ట వేసి రూ.కోట్లు వెదచల్లు­తున్నారు.

 కుప్పంలో బీసీలే  ఎక్కువ. చంద్రబాబు బీసీల కోట­లో పాగా వేసి డబ్బులతో నెగ్గేందుకు ప్రయ­త్నిస్తు­న్నాడు. మీ బిడ్డ మాత్రం కుప్పంలో బీసీనే నిలబెట్టాడు. చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు కలిపి మొత్తం 200 స్థానా­లకుగానూ 50 శాతం అంటే 100 సీట్లు నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మై­నా­ర్టీలకే కేటాయించి సామాజిక సాధికారతపై చిత్తశుద్ధి చాటుకున్నాం.

మంగళగిరికి మంచి జరిగిందిలా..
మంగళగిరి నియోజకవర్గంలో 1,20,187 ఇళ్లు ఉండగా 1,08,408 ఇళ్లు అంటే 90.1 శాతం గృహాలకు లబ్ధి చేకూర్చాం. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి రూ.1,530 కోట్లు జమ చేశాం. మంగళగిరి నియోజకవర్గంలో నెలకొల్పిన 83 సచివా­లయాల్లో ఈ వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాం. ఇక నాన్‌ డీబీటీతో మరో రూ.735 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. అంటే మొత్తం రూ.2,265 కోట్లు మేర మేలు చేశాం.

ఇవన్నీ ఎందుకు చెబుతు­న్నానంటే మన అభ్యర్థి లావణ్యమ్మ దగ్గర చంద్రబాబు కుమారుడి వద్ద ఉన్నంత డబ్బు­లు లేవు. ఎన్నికలొచ్చేసరికే ఆయన ఓటుకు రూ.4 వేలు, రూ.5 వేలు, రూ.6 వేలు అంటాడు. ఇస్తే తీసు­కోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కటి గుర్తు­పె­ట్టుకోండి. మళ్లీ ప్రతి ఏడాది నేతన్న నేస్తం ఇచ్చే వారికే ఓటు వేయండి.

ఎవరు ఉంటే మన పిల్లల చదువులు, బడులు, హాస్పిటళ్లు బాగుంటాయో వా­రి­కే ఓటేయండి. ఎవరు ఉంటే పేదవాడు అప్పుల­పాలు కాకుండా వైద్యం అందుతుందో, మన ఇంటికే పెన్షన్‌ డబ్బులు నడుచు­కుంటూ వస్తాయో ఆలోచించి ఓటేయండి. ఎవరు ఉంటే అక్క­చెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు విర­బూ­స్తాయో వారికే ఓటు వేయాలని కోరుతున్నా.

చేయగలిగిందే చెబుతాం..
మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్‌గా చెబుతాం. అబద్ధాలాడటం తప్పు. మేనిఫెస్టో హామీల్లో 99 శాతం నెరవేర్చి ఈ­రోజు మళ్లీ మీ ఆశీస్సులు కోరుతున్నాం. నేతన్నలకు ఏటా రూ.24 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలు అందిస్తున్నాం. ఈ డబ్బులతో ఎవరైనా మ­గ్గం కొనుక్కోవచ్చు. ఇంట్లో మగ్గం పెట్టుకో­వచ్చు.

మీరు కోరుతున్నట్లుగా అద్దె మగ్గందారులకూ ప్ర­యో­జనాలు అందించాలని నాకూ ఉంది. కానీ అలా చేయగలుగుతామా? ఎందుకంటే అద్దె మగ్గంలో ఎ­వ­రు ఉంటున్నారో, ఎవరు వాడుకుంటున్నారో ఎ­లా చెప్పగలం? ఈరోజు ఒకరు ఉంటారు.. రేపు మరొకరు ఉండవచ్చు. ఏది చేసినా పారదర్శకంగా ఉండాలి. మన పాలసీ ఏమిటంటే.. ఏ పార్టీవారైనా సరే అర్హత ఉంటే పారదర్శకంగా లబ్ధి చేకూర్చాలి.

ఆదుకుని ఆదరించారు...
చేనేత వృత్తిని గత ప్రభుత్వాలు గుర్తించ­లేదు. దివంగత వైఎ­స్సార్‌ మాత్రమే చేనేత­కారులకు 50 ఏళ్లకే పెన్షన్‌ సదుపాయం, ఆప్కోస్‌ ద్వారా సబ్సిడీలు కల్పించారు. సీఎం జగనన్న ఎక్కడా లేనివిధంగా చేనేతలకు ఏటా రూ.24 వేలను సాయంగా అందిస్తున్నారు.

నవరత్నాల సంక్షేమాల్లో అగ్రభాగం అందుకుంటున్నది మన చేనేతలే. టీడీపీ హయా­ంలో చేనేతలను నట్టేట్లో ముంచితే ఆప్కోను ఆదుకుని రూ.180 కోట్లు అందించారు. కరోనా కష్టకాలంలో రెండుసార్లు రూ.24 వేలు ఇచ్చారు. మనకు జగనన్న లాంటి నాయకుడు ఉండటం ఎంత అవసరమో అందరూ ఆలోచన చేయాలి. మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మశాలి సోదరి లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. – జింకా విజయలక్ష్మి,  పద్మశాలి కార్పొరేషన్‌ చైర్మన్‌ 

మంగళగిరిలో తయా­రయ్యే చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యా­ప్తంగా గుర్తింపు ఉంది. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోశయ్యను, నన్ను పిలిచి చేనేత పరిశ్రమ గురించి ఆరా తీశారు. రంగులు, రసాయ­నాల వల్ల త్వరగా వృద్ధాప్యం బారిన పడుతున్న చేనేతకారులకు 50 ఏళ్లకే పెన్షన్‌ అందించేలా నిర్ణయం తీసుకున్నారు. మేం కోరిన మరో 17 డిమాండ్లు కూడా నెరవేర్చారు. చేనేతల క్రిఫ్ట్‌ ఫండ్‌ను రెట్టింపు చేసి 16%కి పెంచారు. చంద్రబాబు ప్రభు­త్వం రిబేట్‌ను తొలగిస్తే వైఎస్సార్‌ పున­రుద్ధరించారు. డైస్, కెమికల్స్‌పై సబ్సిడీ ఇ­చ్చా­రు.

రూ.100 కోట్లు ఆప్కోకి విడుదల చేయడంతో చేనేత పరిశ్రమ నిలబడింది. మంగళగిరిలో ఇళ్లులేని చేనేత కార్మికుల కోసం 25 ఎకరాలు ఇచ్చారు. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక 150 మంది మగ్గాలకు షెడ్లు వేశాం. నవరత్నాల్లో భాగంగా చేనేత­కారులకు ఏటా రూ.24 వేలు చొప్పున అందిస్తున్నారు. చేనేత కార్మికుల జీవితా­లను బాగుచేసింది నాడు వైఎస్సార్‌ అయితే నేడు వైఎస్‌ జగన్‌ మాత్రమే. ఆప్కోకి రూ.100 కోట్లు రిలీజ్‌ చేశారు. మంగళ­గిరిలో మార్కెటింగ్‌ సౌకర్యం కోసం రూ.3 కోట్లతో 40 షాపులను నిర్మించారు. – మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్సీ

జగనన్న మా చేనేతలకు షెడ్లు వేశారు. నాకు చేయూత వస్తోంది. మావారికి పెన్షన్‌ ఇస్తున్నారు. నేతన్న నేస్తం ఇప్పిస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్న చెప్పారు.
– నందం దుర్గ, చేనేత మహిళ

అధైర్యపడవద్దు.. అండగా ఉంటా
అనారోగ్య సమస్యలు విన్నవించుకున్న బాధితులకు సీఎం భరోసా
పెదకాకాని: మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తు­న్న సీఎం జగన్‌ శనివారం తనను కలిసిన పలు­వురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘అధైర్యపడవద్దు.. అండగా ఉంటా’నంటూ వారి కన్నీళ్లు తుడిచారు.

గుంటూరు రూరల్‌ మండలం చౌడవరం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ పార్వ­తి తన కుమార్తె డింపుల్‌తో కలిసి సీఎం జగన్‌ను కలి­­శారు. తన కుమార్తె వినికిడి లోపంతో బాధపడు­తోందని.. మాటలు కూడా రావని.. చికిత్సకు సాయ­­మందించాలని పార్వతి కోరగా.. సీఎం జగన్‌ ఆదుకుంటానంటూ భరోసా ఇచ్చారు. పాపకు దివ్యాంగ పింఛన్‌ వస్తుందా అని ఆరా తీ­శా­రు. సర్జరీ చేయించడంతో పాటు వినికిడి మి­షన్‌ ఉచితంగా అందజేస్తానని భరోసా ఇచ్చారు. 

రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. 
‘నా బిడ్డకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి.. ఆదుకోండయ్యా’ అంటూ గుంటూరు జిల్లా కొప్పు­­రావూరుకు చెందిన గోపాలం సుజాత తన కుమార్తె సౌజన్యతో కలిసి నంబూరు అడ్డరోడ్డు వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసింది. సీఎం జగన్‌ వారిని ఓదార్చి.. ప్రభుత్వం నుంచి పింఛన్‌ అందుతుందా అని ఆరా తీశారు. సమస్య తెలిసి నాలుగు నెలలవుతుందని వారు బదులివ్వగా.. వెంటనే పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తెలిసిన వారు ఎవరైనా కిడ్నీ ఇస్తామంటే ఆరోగ్య­శ్రీ ద్వారా సర్జరీ చేయిస్తానని హామీ ఇచ్చారు. కిడ్నీ దానం చేసిన వారికి ప్రభు­త్వం నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు.

ఇళ్ల పట్టాలు ఇవ్వాలి
చేనేత కార్మికులకు 100 యూనిట్లు ఉచితంగా విద్యుత్‌ ఇస్తే ఎంతో మేలు జరుగుతుంది. రత్నాల చెరువు ప్రాంతంలో చాలామంది అద్దె మగ్గాలతో నేత పనులు చేస్తున్నారు. వారికి కూడా సాయం చేయాలని కోరుతున్నా. మాకూ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి.  – కొండేటి కుమారి, చేనేత మహిళ,  రత్నాలచెరువు, మంగళగిరి

సీఎం వైఎస్‌ జగన్‌ దీనికి సమాధానం ఇస్తూ...
‘మంగళగిరి నియోజకవర్గంలో లే అవుట్లు రూపొందించి 54 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఆ అక్కచెల్లెమ్మలు జగన్‌ను ఎక్కడ గుండెల్లో పెట్టుకుంటారో అనే భయంతో చంద్రబాబు, లోకేష్‌ కోర్టుకు వెళ్లి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందంటూ కేసులతో అడ్డుపడ్డారు. మీ బిడ్డ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ పోరాటం చేయడంతో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లు కూడా శాంక్షన్‌ చేయించాం.

కట్టడం ప్రారంభించే సమ­యానికి చంద్రబాబు మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లి కేసు వేయడంతో మేటర్‌ హియరింగ్‌ కోసం పోస్ట్‌ పోన్‌ చేస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువ చేసే ఆస్తిని పెడు­తుంటే అడ్డుకున్నది చంద్రబాబు, లోకేషే’ అని పేర్కొన్నారు.

చేనేతల కోసమే లావణ్యకు టికెట్‌
సీఎం వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: బీసీలు ఎక్కువ ఉన్న చోట్ల కూడా చంద్ర­బాబు, ఆయన కుమారుడే పోటీ చేస్తు­న్నారని సీఎం జగన్‌ మండిపడ్డారు. మంగళ­గిరిలో చేనేతలు ఎక్కువ కనుక.. తాము ము­రు­గుడు లావణ్యకు టికెట్‌ ఇచ్చామని చెప్పారు. ఈ తేడాను గమనించాలని ప్రజలను కోరుతూ సీఎం జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు. ‘మంగళగిరిలో చేనేతలు ఎక్కువ.. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మాట్లాడి చేనేత కుటుంబానికి చెంది­న నా చెల్లెమ్మ మురుగుడు లావణ్యకు టికెట్‌ ఇచ్చాం.

మరోవైపు చంద్ర­బాబు, ఆయన కొడుకు ఏం చేస్తున్నారు? బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంత­ంలో వాళ్లే నిలబడి రూ.కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు చేస్తున్నారు. కుప్పంలోనూ బీసీ­లు ఎక్కువ. అయినా అక్కడ కూడా ఇదే పరిస్థితి. తేడా గమనించా­లని కోరుతున్నాను’ అంటూ శనివారం సీఎం జగన్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌­(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement