bus yatra
-
ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం ముగిసింది. గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజులపాటు 13 లోక్‌సభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల మినహా రాష్ట్రంలోని మిగతా లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. మెదక్, కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టిపెట్టేలా ఆయన రోడ్ షోలు జరిగాయి. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చివరి రోజు శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్... సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలలో పాల్గొని ప్రచారాన్ని ముగించారు. చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముగించాలని భావించారు. అయితే వర్ష సూచన నేపథ్యంలో సిద్దిపేటలోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఓవైపు బస్సు యాత్ర ముగియడం, మరోవైపు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో కేసీఆర్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈసీ కొరడాతో 48 గంటలపాటు ప్రచారానికి దూరం..బస్సు యాత్ర ఎనిమిదో రోజు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5న సిరిసిల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3న రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రచార షెడ్యూల్లో కొద్దిపాటి సవరణలు చేసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలపై వాక్బాణాలుపక్షం రోజులకుపైగా సాగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ భాష, పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రధానిగా మోదీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలో కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.ప్రచారంలో విశ్రమించని కేటీఆర్, హరీశ్బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు తదితర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. అలాగే హరీశ్‌రావు మెదక్, జహీరాబాద్, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా, బస్సు యాత్రకు భారీగా జనం తరలివచ్చారని, బీఆర్ఎస్ పట్ల ఓటరు సానుకూలతకు ఇది సంకేతమని పార్టీ భావిస్తోంది. కనీసం 8 నుంచి 12 సీట్లలో విజయం సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. -
BRS ఓటమిపై కేసీఆర్ మనసులో మాట
-
కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ తప్పు మాది కాదు: కేసీఆర్
-
ఫోన్ ట్యాంపరింగ్ పై కేసీఆర్ కీ కామెంట్స్
-
మోదీ గెలుస్తే పెట్రోల్, డీజిల్ ధరలు..400 +..!?
-
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చెయ్.. రాజీనామా ఇస్తా..!
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సవాల్ చేశారు. రేవంత్‌రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.వారిది ఢిల్లీకి గులాంగిరీ!రేవంత్‌రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్‌గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.కేసీఆర్ యాత్రను చూసి వణుకుకేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్‌రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం. -
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
కేంద్రంలో సంకీర్ణం.. బీఆర్ఎస్ కీలకం: కేసీఆర్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కేంద్రంలో బీజేపీ గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పారీ్టకి 400, 370 సీట్లు ఏమీ వస్తలేవు. 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని యావత్ ప్రపంచం కోడై కూస్తోంది. రాష్ట్రంలో ఇవ్వాళ ఆరో రోజు యాత్ర చేశా. ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 12 పార్లమెంట్ సీట్లు బీఆర్ఎస్ గెలవబోతోంది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది. ఆ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలకంగా మారనుంది. మీరు నామా నాగేశ్వరరావును ఎంపీగా గెలిపిస్తే సంకీర్ణంలో ఆయన కేంద్ర మంత్రి అవుతారు. తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. నరేంద్రమోదీ దాడి నుంచి, చేతకాని, చేవలేని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన గోదావరిని రక్షించుకోవాలన్నా.. కృష్ణాను రక్షించుకోవాలన్నా.. మన నిధులు మనం తెచ్చుకోవాలన్నా.. హక్కులు సాధించుకోవాలన్నా. బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతుంది..’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కేసీఆర్ బస్సుయాత్ర సోమవారం వరంగల్ నుంచి తిరుమలాయపాలెం మీదుగా ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం నగరంలో కాల్వొడ్డు నుంచి మయూరి సెంటర్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ కొనసాగింది. జెడ్పీ సెంటర్లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీజేపీ వాళ్లకి తెలంగాణ సమస్యలు పట్టవు ‘తెలంగాణలో పంటలు పంజాబ్‌ను తలదన్నే పరిస్థితికి తీసుకెళ్లాం. 3.50 కోట్ల టన్నుల వడ్లు పండించాం. కేంద్ర ప్రభుత్వం మేము ధాన్యం కొనమని మొండికేసింది. నామా నాగేశ్వరరావు నాయకత్వంలో నాడు ఎంపీలు కేంద్రమంత్రి వద్దకు వెళ్లి ధాన్యం కొనమని అడిగారు. యాసంగిలో కొంచెం నూక అవుతుందని మంత్రికి చెప్పారు. అయితే ఆ మెదడు తక్కువ మంత్రి.. మీ తెలంగాణ ప్రజలను నూకలు తినమనండి అని చెప్పారు. దీనిని నిరసిస్తూ మొత్తం తెలంగాణ కేబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేశాం. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీ కానీ, కాంగ్రెస్ ఎంపీ కానీ నోరు కూడా తెరవలేదు. తెలంగాణ ఓట్లు కావాలి కానీ తెలంగాణ సమస్యలు వారికి పట్టవు..’అని కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ‘గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లు ఇస్తామని మోదీ క్లియర్‌గా చెబుతుండు. ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నడు. ముగ్గురు ఎంపీలున్నరు. బీజేపీ ఉంది. వీళ్లేం చేస్తున్నరు. ఒక్కరైనా మాట్లాడుతున్నరా? రాష్ట్రాన్ని ఎండగడతామని మోదీ మాట్లాడుతుంటే వీరికి ఉలుకు, పలుకు లేదు. ఈ దద్దమ్మలు మనకు ఎందుకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో కూడా మోదీ ఇదే ప్రతిపాదన తెచ్చారు. కానీ మా రాష్ట్రానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాక ..మా వాటా మాకు అక్కడ పెట్టేదాక ఎట్టి పరిస్థితుల్లో, నా తల తెగినా ఒప్పుకోనని చెప్పినా.. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ.. వీళ్లకు ఓట్లు కావాలి.. సీట్లు కావాలి.. కేంద్ర మంత్రులు కావాలి.. కానీ తెలంగాణ సమస్యలు, ప్రధానమైన సమస్యలు నీళ్లు, రైతులు, పంటలు వీళ్లకు పట్టదు..’అని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ నోటికి మొక్కాలి ‘మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఆయన నోటికి మొక్కాలి.. వెనకట కూడా కాంగ్రెస్ వాళ్లు చెప్పేది.. దున్నేవాడికే భూమి.. తినేవాడికే విస్తరి.. గీసేవాడికే గుండు.. అమ్మను చూడు ఆవుదూడ బొమ్మను చూడు.. గుద్దో గుద్దు అని. కానీ నిజమైన సంక్షేమం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే. పేదలకు పట్టెడు అన్నం దొరికింది ఆ పుణ్యాత్ముడు చేపట్టిన కిలో రూ.2 బియ్యం ద్వారానే. ఎవరు అవునన్నా.. కాదన్నా ఇది చరిత్ర..’అని బీఆర్ఎస్ అధినేత వివరించారు. తులం బంగారం తుస్సుమంది ‘తెలంగాణ రావడంతో ఎన్టీఆర్ చేసిన దానికి మించి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు ఇలా అన్నీ చేసుకున్నాం. కుంట భూమి ఉన్నా రైతు చనిపోతే వారం లోపు వారి ఇంటికి రూ.5 లక్షలు పంపాం. కల్యాణలక్ష్మి, పెట్టుకున్నాం. అయితే రూ.లక్ష మాత్రమే ఇస్తున్నారు..నేను తులం బంగారం ఇస్తానని రేవంత్‌రెడ్డి అన్నడు.. తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కస్సుమంటోంది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటోంది. తొమ్మిదేళ్లు రెప్పపాటు పోకుండా ఉన్న కరెంట్ నాలుగు నెలల్లో మాయమైపోతదా? నిన్న మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంట్ పోయింది. కరెంట్ పోయిందని నేను ట్విట్టర్లో పెట్టా. ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. వట్టి విక్రమార్క. కరెంట్ పోయిందంటే కేసీఆర్ అబద్ధాలకోరు అంటున్నడు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి కొరత ఉంది.. కరెంటు కోతలు ఉన్నాయి. హాస్టళ్లు మూసేస్తున్నామని చీఫ్ వార్డెన్ నోటీసు ఇచ్చింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి కోతలుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి..’అని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి ‘రూ.2 లక్షల రుణమాఫీ అని రేవంత్‌రెడ్డి అన్నడు. డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తానన్నడు. అయ్యిందా? భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టు అంటావు.. ఇలా ప్రజలను మోసం చేయడానికి ఎన్ని ఒట్లు పెడతావు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలి. ప్రతి మహిళకు రూ.2500 వచ్చిందా? వచ్చే ఆశ ఉందా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతోంది. ఈ మోసాలపై శాసనసభలో, బయట సభల్లో బీఆర్ఎస్ ప్రశ్నిస్తే కేసీఆర్ నీ గుడ్లు పీకుతా, పండపెట్టి తొక్కుతా.. చర్లపల్లి జైల్లో వేస్తానని రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ముఖ్యమంత్రి మాట్లాడే భాషా ఇది?. పార్లమెంట్ ఎన్నికలైన తెల్లారే రేవంత్‌రెడ్డి బీజేపీలోకి జంప్ కొడతాడని బీజేపీ వాళ్లే చెబుతున్నరు. ఈ మాటలను ఆయన ఒక్కసారి కూడా ఖండించడం లేదు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భయంకరమైన రాజకీయ అనిశ్చితి రానుంది..’అని బీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. నాడు ఖమ్మం బ్రహ్మరథం పట్టింది ‘నేను ఒక్కడిని బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు తెలంగాణ వస్తదని. నేను ఆమరణ దీక్షకు పూనుకుంటే నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఆనాడు ఖమ్మం జిల్లా బిడ్డలు, న్యూడెమోక్రసీ, కమ్యూనిస్టు విద్యార్థి బృందాలు, తెలంగాణ వాదులు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు పలికారు. అది నేను మర్చిపోలేదు. చివరికి తెలంగాణ వచ్చింది. ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అభివృద్ధిని చేసి చూపించిండు. నగరంలో నాడు రోజూ మంచినీళ్లు వస్తే.. ఇప్పుడు మూడురోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయి. తమ భూములకు నీళ్లు కావాలని పాలేరు రైతులు తూములు బద్ధలు కొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది? పంటలు ఎండిపోతుంటే నీటి మంత్రి, వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నరు? అడ్డగోలు హామీలు ఇచ్చి రైతులను, అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది. ఈ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి ఇదే సరైన సమయం. మీ కోరికలు నెరవేరాలంటే బీఆర్ఎస్కు శక్తి కావాలి. రాష్ట్రాన్ని, ఖమ్మంను ముందుకు తీసుకెళ్లే బలం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో జరిగింది. మళ్లీ విజృంభిద్దాం.. అభివృద్ధి చేసుకుందాం..’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. బస్సు యాత్రలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, బానోతు మదన్‌లాల్, మెచ్చా నాగేశ్వరరావు, దేశపతి శ్రీనివాస్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. మళ్లీ మీరే రావాలె సారు – కేసీఆర్‌తో రైతులు, వృద్ధులు, మహిళలు – ఖమ్మం మార్గంలో చాయ్ హోటల్ వద్ద బస్సు యాత్రకు బ్రేక్ మరిపెడ రూరల్: ‘మీరు లేకపోవుడుతోటి ఇన్ని కష్టాలు సారు. కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మి మోసపోయినం.. ఇట్లైతదని అనుకోలే సారు .. మళ్లా మీరే రావాలె సారు..’అంటూ పలువురు రైతులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో తమ గోడు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయని, తాను అండగా ఉంటానని చెబుతూ వారిని ఓదార్చారు. బస్సుయాత్రలో భాగంగా హనుమకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్ మార్గం మధ్యలోని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా రోడ్డు పక్కన ఉన్న చిన్న చాయ్ హోటల్ వద్ద కాసేపు ఆగారు. కేసీఆర్‌ను చూసి హోటల్ యజమాని సొందు, కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హోటల్లో ఉన్న మిర్చి బజ్జి, పకోడి, గారెలను ఆయనకు అందించారు. వాటిని తిన్న కేసీఆర్ వారితో కాసేపు ముచ్చటించారు. సమాచారం అందుకున్న ఆనెపురం మాజీ సర్పంచ్ లాల్‌సింగ్ తదితరులు ఎల్లంపేట స్టేజీ వద్దకు చేరుకున్నారు. కొందరు రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, యాసంగికి సాగు నీళ్లు అందక పొలాలు ఎండిపోయాయని, కరెంట్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వికలాంగులు, మహిళలు, వృద్ధులు కూడా తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో రైతుబంధు సహా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మెడలు వంచి సాధిద్దామని కేసీఆర్ వారికి భరోసా ఇచ్చారు. కాగా పలువురు యువతీ యువకులు కేసీఆర్‌తో సెల్ఫీలు దిగారు. మరిపెడ మండల కేంద్రంలో బస్సుయాత్రకు డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. -
మండుటెండల్లోనూ జన సునామీ
సాక్షి, అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపట్టిన ఎన్నికల మలి విడత ప్రచారానికి జనం పోటెత్తారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రను తలపిస్తూ వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం అనంతపురం జిల్లా తాడిపత్రి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరులో నిర్వహించిన సభలకు మండుటెండల్లోనూ ప్రజలు ప్రభంజనంలా కదిలివచ్చారు. తీవ్ర ఎండను, ఉక్కపోతను ఖాతరు చేయకుండా సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రసంగాన్ని ఆసాంతం ఆసక్తితో విన్నారు. గత 58 నెలల్లో చేసిన మంచిని సీఎం వివరించారు.ఈ పథకాలు మళ్లీ కొనసాగాలన్నా.. మరింత మేలు జరగాలన్నా.. పేదింటి భవిష్యత్తు మరింత గొప్పగా మారాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన కావాలన్నా.. మన పిల్లల బడులు బాగుపడాలన్నా.. ఆస్పత్రులు, వ్యవసాయం మరింత మెరుగుపడాలన్నా మన ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరూ రెండు బటన్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కడానికి మీరంతా సిద్ధమేనా అని సీఎం జగన్ అడగ్గా మేమంతా సిద్ధమేనంటూ దిక్కులు పిక్కటిల్లేలా ప్రజలు నినదించారు. లక్షలాది మంది పిడికిళ్లు ఒక్కసారిగా పైకి లేపడంతో తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు దద్దరిల్లిపోయాయి. వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలూ పూర్తి స్థాయిలో ఆమోదించారనడానికి మూడు సభల్లో ఉవ్వెత్తున ఎగిసిన జనకెరటాలే నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రచారాలకు జనస్పందన కనిపించడం లేదు. మొన్న సిద్ధం సభలు.. నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. నేడు మలి విడత ప్రచారంలో తొలి రోజు నిర్వహించిన సభలు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీదే అధికారమని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.తరలివచ్చిన తాడిపత్రి.. ఎన్నికల మలి విడత ప్రచారానికి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు గ్రామాలకు గ్రామాలు తరలివచ్చారు. హెలీప్యాడ్ నుంచి సభ జరిగే వైఎస్సార్ సర్కిల్‌కు చేరుకునే వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట వేలాది మంది పరుగులు తీశారు. సభా ప్రాంగణానికి ఉదయం 11.55 గంటలకు చేరుకునే సరికి ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. అప్పటికే 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయలేదు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రతి ఇంటా తెచ్చిన విప్లవాత్మక మార్పులను సీఎం జగన్ వివరించారు. 2014–19 మధ్య బీజేపీ, జనసేనతో కూటమి కట్టి చంద్రబాబు చేసిన మోసాలు, అరాచకాలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు అదే కూటమి కట్టి అడ్డగోలు హామీలు ఇస్తూ వస్తున్న చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టడమేనని చాటిచెబుతూ సీఎం చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.వెల్లువెత్తిన వెంకటగిరి..తిరుపతి జిల్లా వెంకటగిరిలో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న వేలాది మంది ప్రజలు వెల్లువలా పోటెత్తారు. 43 డిగ్రీల ఉష్ణోగ్రత, విపరీతమైన ఉక్కపోత ఇబ్బంది పెడుతున్నా వెనుకడుగేయలేదు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి మధ్యాహ్నం 2.25 గంటలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా జనం నిల్చున్న ప్రాంతం నుంచి కదల్లేదు. సీఎం జగన్‌ను చూడగానే హర్షధ్వానాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని.. మన తలరాతలు మారుస్తాయని.. ఎవరి వల్ల మీకు మంచి జరిగింది.. ఎవరితో ఆ మంచి కొనసాగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీంతో ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదిస్తూ వేలాది మంది ఒక్కసారిగా జయజయధ్వానాలు చేశారు.కదిలివచ్చిన కందుకూరునెల్లూరు జిల్లా కందుకూరులో షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ఉంటుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు ఉదయం 10 గంటల నుంచే భారీ ఎత్తున కదిలివచ్చారు. దాంతో మధ్యాహ్నం 12 గంటలకే కందుకూరు జనసంద్రంగా మారింది. కందుకూరులో హెలీప్యాడ్ నుంచి సభ జరిగే కేఎంసీ సర్కిల్ వరకూ సీఎం జగన్ కాన్వాయ్ వెంట జనం పరుగులు తీశారు. ఆయనను దగ్గరి నుంచి చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణానికి సీఎం జగన్ చేరుకునే సరికి సాయంత్రం 4 గంటలైంది. అప్పటికి 42 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఎండలోనూ గంటలకొద్దీ నిలబడ్డ జనం సీఎం జగన్‌ను చూడగానే ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రసంగాన్ని జనం శ్రద్ధగా విన్నారు. ‘సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని చంద్రబాబులా బడాయి మాటలు నేను చెప్పడం లేదు. 58 నెలల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్టు మీ ముందు ఉంచి మార్కులు వేయండి అని మీ బిడ్డ అడుగుతున్నాడు’ అని సీఎం జగన్ చేసిన విజ్ఞప్తికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ‘మంచి చేసిన ఫ్యాన్ ఇంట్లో ఉండాలి.. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి.. తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండాలి’ అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. దీనికి ప్రజలు సైతం శ్రుతి కలపడం విశేషం. మండుటెండల్లోనూ, తీవ్రమైన ఉక్కపోతల్లోనూ మూడు సభలకు పోటాపోటీగా జనం కదిలిరావడం.. ఒకదానికి మించి ఒకటి గ్రాండ్ సక్సెస్ కావడంతో రాబోయేది ఫ్యాన్ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ప్రచారం సాగే కొద్దీ వైఎస్సార్సీపీ ప్రభంజనం అంతకంతకూ పెరగడం ఖాయమని.. ఇది చూసి పోలింగ్‌కు ముందే కూటమి నేతలు, శ్రేణులు కాడి పారేయడం తథ్యమని స్పష్టం చేస్తున్నారు. -
వావ్ వాటే టెక్నాలజీ..కేసీఆర్ బస్సులో లిఫ్ట్
-
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
సాక్షి, నాగర్‌కర్నూల్: రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ‘‘రాష్ట్రం ఇప్పుడు భగ్గుమంటోంది. నా బస్సును కదలనివ్వనంత జనం.. వారి పూల స్వాగతమే చెప్తున్నాయి భవిష్యత్తు బీఆర్ఎస్దే నని.. కాంగ్రెస్ బలుపు దించాలి’’ అని వ్యాఖ్యా నించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర ఐదో రోజు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఏప్రిల్ 27.. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి శంకుస్థాపన జరిగిన రోజు. 23 ఏళ్ల కింద తెలంగాణ సాధన కోసం పిడికెడు మందితో ఉక్కు సంకల్పంతో యుద్ధం ప్రారంభించిన రోజు.. బీఆర్ఎస్ పుట్టిన రోజు. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని చెప్పి ఆమరణ దీక్ష చేపట్టినప్పుడు మీరు ఇచ్చిన మద్దతు.. అప్పటి ఘటనలు యాది చేసుకుంటే.. అదో ఉప్పెన, బ్రహ్మాండమైన సన్నివేశం. నేను మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం. ఈ గౌరవం చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి అడ్డగోలు హామీలిచ్చి, దు్రష్పచారం చేసి కేవలం 1.5 శాతం ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రైతులకు మళ్లీ కష్టాలు వచ్చాయి. పంటలు ఎండిపోయాయి. మిగిలిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి 20 రోజులైనా కొనే దిక్కులేదు. మేం రెప్పపాటు కరెంటు పోకుండా 24 గంటల పాటు అందించాం. ఇప్పుడు కాంగెస్ పాలనలో మళ్లీ రాత్రిపూట కరెంటు కోసం తిప్పలు, బావుల వెంట పరుగులు, కరెంటు షాకులు, తేళ్లు, పాములు.. ఈ బాధలు మళ్లీ ఎందుకు వచ్చాయి? రోజు సీఎం, మంత్రులు మీటింగ్‌లు పెట్టి 24 గంటల కరెంటు ఇస్తున్నామని అంటున్నారు. మరి ఈ రోజు మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో నేను భోజనం చేస్తుంటే రెండు సార్లు కరెంటు పోయింది. రోజుకు పది సార్లు ఇలానే పోతోందని చెప్తున్నారు. మళ్లీ బోర్లు, నీళ్ల ట్యాంకులు, బిందెలు ఎందుకు వచ్చాయో ఆలోచించండి. ప్రభుత్వ మెడలు వంచే బలం ఇవ్వండి గ్రామాల్లో పాలోళ్ల మధ్య పంచాయతీ జరిగితే పంచులను ఎన్నుకుంటారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పంచాయతీలో ప్రజల తరపున యుద్ధం చేసే పంచు ఈ కేసీఆర్. ప్రాణం పోయినా తెలంగాణ తెస్తానని మాట ఇచ్చి.. తెచ్చి చూపించా. ఇప్పుడు మీ తరఫున వాదన వినిపించడానికి, ప్రభుత్వం మెడలు వంచడానికి మీరే బలం ఇవ్వాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీయే గెలుస్తుంది. అప్పుడేం లాభం ఉండదు. ఈ రోజు ఉదయమే రిపోర్టు వచ్చింది. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లలో బీఆర్ఎస్దే గెలుపు. రేవంత్‌రెడ్డివి సంస్కారం లేని మాటలు సీఎం రేవంత్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నరు. నా గుడ్లు పీకి గోటీలు ఆడుతడట. పేగులు తీసి మెడలో వేసుకుంటాడట. పదిహేనేళ్లు పోరాటం చేసిన తెలంగాణ సాధించిన వ్యక్తిని, తెలంగాణను పదేళ్లలో తెల్లగ చేసిన, ప్రజల కష్టాలను చూసి తండ్లాడిన వ్యక్తిని అలా అనొచ్చా. ఇది «న్యాయమా ప్రజలే చెప్పాలి. మీ ఓటు ద్వారా ధర్మాన్ని గెలిపించండి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగం జనార్దనరెడ్డి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పంటలు కావాలా.. మోదీ గత్తర కావాలా? బీజేపీ అక్కరకు రాని చుట్టం. మోదీ ఇచ్చిన వంద నినాదాల్లో ఒక్కటైనా నిజం అయిందా? మొన్న నాగర్ కర్నూల్‌కు గుజరాత్ సీఎం వచ్చారట. 1,500 మంది కూడా రాలే. మనకు గుజరాత్ నుంచి సీఎంలు రావాలా? మోదీ మోటార్లకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా పెట్టబోనని చెప్పిన. నేను రైతును.. నాకు వారి బాధలు తెలుసు. ఇప్పుడు మీరు బీజేపీకి ఒక్క ఓటు వేసినా.. మోదీ వచ్చి మీటర్లు పెడతా అంటడు. పచ్చని పంటలు కావాలా? మోదీ గత్తర కావాలా? ఆలోచించండి. ఆర్ఎస్పీ లాంటి వాళ్లు మళ్లీ దొరకరు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అల్లాటప్పా వ్యక్తి కాదు. మాజీ ఐపీఎస్ అధికారి. అలంపూర్ బిడ్డ. నేను సీఎం అయ్యాక గురుకుల పాఠశాలలకు ఎంత బడ్జెట్ కావాలో తీసుకోవాలని చెప్పిన. నేడు తెలంగాణ గురుకుల పాఠశాలలు ఇంటర్నేషనల్ స్కూళ్లతో సమానం. ఎందరో డాక్టర్లు, ఇంజనీర్లు, పైలట్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారు. ఎవరెస్ట్ ఎక్కిన బిడ్డలను గురుకులాల నుంచి పంపినది ప్రవీణ్‌కుమారే. రాష్ట్రానికి మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి. ఇలాంటి వారు మళ్లీ దొరకరు. చదువుకున్నోళ్లు వచ్చినప్పుడు గెలిపించుకోవడం మన బాధ్యత. -
ఇలాగైతే కష్టం... గ్యారంటీగా గెలవం హామీలతో ముంచేద్దాం
సాక్షి, అమరావతి: జనసేన, బీజేపీతో జట్టుకట్టినా ఘోర పరాజయం తప్పదని ఆందోళన చెందుతున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అలవికాని బోగస్ హామీలు గుప్పించేందుకు సన్నద్ధమయ్యారు. గతేడాది మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి సూపర్ సిక్స్ ముసుగుతో మినీ మేనిఫెస్టో అంటూ ప్రకటించారు. ఆ హామీలు కర్ణాటక, తెలంగాణలలో నీరుగారిపోవడం.. చంద్రబాబు అంటేనే మోసాలకు మరోపేరు అని ప్రజలు గుర్తించడంతో ‘సూపర్ సిక్స్’ను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇంటింటికీ కేజీ బంగారం, బెంజ్ కారు తరహాలో బోగస్ హామీలతో మేనిఫెస్టోను వదిలేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే జనం పొరపాటున కూడా నమ్మరని పసిగట్టిన చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో దాన్ని విడుదల చేయించేందుకు ఎత్తులు వేస్తున్నారు. ముఖచిత్రాన్ని మార్చేసిన ‘సిద్ధం’ సభలు, బస్సు యాత్ర..సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరుసగా భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన ‘సిద్ధం’ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మంచి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు తాడేపల్లిగూడెంలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నిర్వహించిన జెండా సభ, ప్రధాని మోదీని రప్పించి చిలకలూరిపేటలో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అవకాశవాద పొత్తును జనం ఛీకొట్టారనడానికి జెండా సభ, చిలకలూరిపేట సభ నిదర్శనంగా నిలిస్తే.. సీఎం జగన్‌పై ప్రజల విశ్వాసానికి ప్రతీకగా ‘సిద్ధం’ సభలు నిలిచాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ఏ ప్రాంతంలోనూ జన స్పందన కనిపించడం లేదు. మరోవైపు ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27 నుంచి ఈ నెల 24 వరకూ 23 జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తీవ్ర ఫ్రస్టేషన్‌తో ఊగిపోతున్న బాబు..సీఎం జగన్ బస్సు యాత్ర సృష్టించిన ప్రకంపనలతోపాటు ఏకంగా 20కిపైగా జాతీయ మీడియా సంస్థలు, పొలిటికల్ కన్సెల్టెన్సీలు నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘనవిజయం సాధిస్తుందని తేల్చిచెప్పడంతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమిలో నైరాశ్యం నెలకొంది.నామినేషన్ల ఘట్టంలోనే కాడి పారేస్తున్నాయి. తీవ్ర ఫ్రస్టేషన్ (నిరాశ, నిస్పృహ)తో సీఎం జగన్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయనగరంలో ప్రజాగళం సభలో సీఎం జగన్‌ను తూలనాడే క్రమంలో.. నెత్తిపై రూపాయి పెడితే పైసాకు కొనుక్కోవడానికి కూడా పవన్ కళ్యాణ్ పనికి రారంటూ చంద్రబాబు తన మనసులో మాట బయట పెట్టడమే అందుకు నిదర్శనం. ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరి తన వద్ద పనిచేసే బడుగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బూతుపురాణం వల్లించడం వారి ఫ్రస్టేషన్‌కు పరాకాష్ట. వైఎస్సార్సీపీ శ్రేణులపై భౌతిక దాడులకు దిగాలంటూ టీడీపీ, జనసేన కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుండటం చూస్తే వారిలో ఫ్రస్టేషన్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటిలాగే బోగస్ హామీలతో ఇప్పుడూ..విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లోనూ జనసేన, బీజేపీలతో జట్టుకట్టిన చంద్రబాబు వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా.. ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానంటూ నాడు 650కిపైగా అలవికాని హామీలిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, పవన్ కళ్యాణ్, తన ఫోటోలను ముద్రించిన పత్రంతో ముఖ్యమైన హామీలంటూ తన సంతకం చేసి మరీ ఇంటింటికీ పంపి ప్రచారం చేయించారు. అనంతరం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేశారు. ప్రజలు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో ఎన్నికల మేనిఫెస్టోను ఏకంగా టీడీపీ వెబ్సైట్ నుంచి చంద్రబాబు మాయం చేయించారు.ఇప్పుడూ అదే కూటమిగా జట్టు కట్టిన చంద్రబాబు 2014 తరహాలోనూ బోగస్ హామీలతో మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోను తాను ప్రకటిస్తే ప్రజలు ఛీకొడతారని గుర్తించడంతో మే 3వ తేదీన రాష్ట్రంలో నిర్వహించే సభలో ప్రధాని మోదీతో విడుదల చేయించేందుకు సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మళ్లీ ‘ఫ్యాన్’ ప్రభంజనం ఖాయంరాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సీఎం జగన్ బస్సు యాత్ర సమూలంగా మార్చేసిందని.. పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్సార్సీపీ, కూటమి అభ్యర్థులు తేలాక జాతీయ మీడియా సంస్థలు, ప్రతిష్టాత్మక పొలిటికల్ కన్సల్టెన్సీలు నిర్వహించిన 20 సర్వేల్లో ‘‘ఫ్యాన్’’ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చాయి.సీ–ఓటర్ సర్వే ఒక్కటి మాత్రమే కూటమి విజయం సాధిస్తుందని పేర్కొంది. అయితే సీ–ఓటర్ నిర్వహించే సర్వేలకు ఏమాత్రం విశ్వసనీయత ఉండదు. 2004, 2009లో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ పేర్కొనగా ఆ రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్ విజయం సాధించడం గమనార్హం. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ గెలుస్తుందని సీ–ఓటర్ ఢంకా భజాయిస్తే వైఎస్సార్సీపీ చారిత్రక విజయం సాధించింది. -
నేడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కేసీఆర్ పర్యటన
సాక్షి, మహబూబ్‌నగర్: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతల రాకతో పార్టీల ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కనుంది. నేడు జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. పాలమూరు పోరుబాట పేరుతో చేపట్టిన బస్సు యాత్ర.. సాయంత్రం జడ్చర్ల నుంచి ప్రారంభం కానుంది. జడ్చర్ల నుండి మహబూబ్‌నగర్ వరకు భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడనున్నారు.రాత్రికి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో బస చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉమ్మడి జిల్లా నేతలతో సమాలోచనలు జరపనున్నారు. రేపు(శనివారం) నాగర్‌కర్నూల్‌కు బస్సు యాత్ర చేరుకోనుంది. నాగర్ కర్నూల్, మహబుబ్ నగర్ అభ్యర్థులకు మద్దుతుగా సభ నిర్వహించనున్నారు. భారీగా జనసమీకరణకు బీఆర్ఎస్ శ్రేణులు కార్యాచరణ చేస్తున్నాయి. -
వార్ వన్ సైడే
నిన్ను చూడటానికే వచ్చానన్నా..బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో సీఎం జగన్‌ను చూసేందుకు వేల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ పరుగెత్తుకొస్తోంది. మధ్యలో చెప్పులు తెగిపోయినా లెక్క చేయకుండా తారు రోడ్డుపై ఉత్త కాళ్లతోనే పరుగులు తీస్తున్న ఆమెను చూసిన సీఎం జగన్.. బస్సు ఆపించారు. ఆమెను దగ్గరికి పిలిచారు. ‘ఏం తల్లీ బాగున్నావా? ఏమైనా సమస్య ఉందా..’ అంటూ ఆత్మియంగా పలకరించారు. ‘జగనన్నా.. నీ పాలనలో నాకు ఎలాంటి సమస్య లేదు. నిన్ను దగ్గరి నుంచి చూద్దామని, పలకరిద్దామనే వచ్చా’ అని చెబుతూ మురిసిపోయింది.► కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటకు ఒక కిలోమీటరు దూరంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మండుతున్న ఎండలో సీఎం జగన్‌ను చూసేందుకు పొలాల వెంట 20–25 మంది మహిళలు పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగారు. మహిళలంతా సీఎం జగన్ చుట్టూ చేరారు. ‘విజయవాడలో మీపై రాయితో దాడి చేశారని తెలిసి తల్లడిల్లిపోయాం. మంచి చేసిన మిమ్మల్ని ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే అక్కసుతో టీడీపీ వాళ్లు మీపై దాడి చేయించారు.. జాగ్రత్తగా ఉండు జగనన్నా.. మీరు బాగుంటేనే మేం బాగుంటాం’ అంటూ తోడబుట్టిన అన్నగా భావిస్తూ పరామర్శించారు. ► కాకినాడ జిల్లా సామర్లకోట ముఖ ద్వారం వద్ద ఏప్రిల్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండలో వేలాది మంది మహిళలు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం జగన్ బస్సు అక్కడకు రాగానే మహిళలు హర్షధ్వానాలు చేశారు. బస్సు దిగిన సీఎం జగన్.. వారితో ముచ్చటించారు. ‘జగనన్నా.. మీరు మాకు మంచి చేశారు. మేం మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుని సీఎంగా చేసుకుంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి.. హారతులు ఇచ్చి దీవించారు. ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఆత్మియత, అనుంబంధాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు అడుగడుగునా కన్పించాయి. ఇలాంటి దృశ్యాలు రాజకీయాల్లో అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాటపై నిలబడి.. నిబద్ధత, నిజాయితీతో పని చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి సీఎం జగన్ బస్సు యాత్రే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.బస్సు యాత్ర సాగినంత దూరం.. మండుటెండైనా అర్ధరాత్రయినా లెక్క చేయకుండా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు మానవ హారంగా ఏర్పడి సీఎం జగన్‌కు నీరాజనాలు పలకడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ‘ఫలానా పనులు చేస్తాం.. మాకు ఓటేయండి’ అని రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు అడగడం సాధారణమని, కానీ.. ‘జగనన్నా.. మీరు మంచి చేశారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించి సీఎంగా చేసుకుంటాం’ అని ప్రజలు అడుగడుగునా భరోసా ఇస్తుండటం చరిత్రలో తామెన్నడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. –మరిన్ని వివరాలు ఐఐఐలోసాక్షి, అమరావతి: రాష్ట్రంలో 22 రోజుల పాటు సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌ను చూసేందుకు ఆద్యంతం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ఆరంభించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్రను ముగించారు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది.యాత్రలో 16 భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాల ప్రజలతో ఆరు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి ఈనెల 13న విజయవాడలో జరిగిన రోడ్ షో వరకూ యాత్ర సాగినంత దూరం కెరటాల్లా జనం పోటెత్తారు. విజయవాడలో లక్షలాది మంది ప్రజలు రోడ్ షోలో సీఎం జగన్‌కు నీరాజనం పలుకుతుండడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పదునైన రాయితో గురిపెట్టి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ నుంచి సునామీలా పోటెత్తిన జనం విజయవాడలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు ఈనెల 14న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఈ నెల 15 నుంచి యాత్రను కొనసాగించారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈనెల 15 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు సునామీలా జనం పోటెత్తి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో దారి పొడవునా జనం బారులు తీరి సీఎం జగన్‌కు మద్దతు తెలిపారు.రాజమహేంద్రవరంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు కదలిరావడం కూటమి వెన్నులో వణుకు పుట్టించింది. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది జనం పోటెత్తడంతో కూటమి వణికిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఘోర పరాజయం భయంతో వణికిపోతున్న టీడీపీ సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. టీడీపీ–జనసేన జత కలిశాక తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక చిలకలూరిపేటకు ప్రధానిని రప్పించి నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి ఆందోళన చెందింది.ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు.. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన సభలకు.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వారిద్దరూ నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చేశారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఎం జగన్‌పై దూషణలకు దిగుతూ, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడాలని ఆ పారీ్టల కార్యకర్తలను రెచ్చగొడుతుండటమే అందుకు తార్కాణం. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని, ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని తేల్చి రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరడం.. వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు వారి బాటనే అనుసరించడంతో ఆ పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై దూషణలకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
సిద్ధం అంటే అసలు అర్థం ఏంటో తెలుసా..!
-
సిక్కోలులో జన సంద్రం
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తొలి సూర్యకిరణాలు తాకే అరసవెల్లి సూర్యనారాయణమూర్తి సాక్షిగా జననేతను సిక్కోలు అక్కున చేర్చుకుంది. మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లా అక్కివలసలోని రాత్రి బస శిబిరానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలుకరించేందుకు ఉదయం ఆరు గంటల నుంచే పరిసర గ్రామాలకు చెందిన పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రియతమ నేతను కళ్లారా చూడాలని, వీలైతే ఓ సెల్ఫీ తీసుకోవాలని ఉత్సాహం చూపారు.బుధవారం ఉదయం తిరిగి ప్రారంభమైన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజు సుమారు 64 కి.మీ. మేర సాగి టెక్కలి నియోజకవర్గం అక్కవరం బహిరంగ సభతో ముగిసింది. రాత్రి బస శిబిరం వద్ద శ్రీకాకుళం, విజయనగరం నుంచి వచ్చిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. సీఎం వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు ఆరా తీసి దిశానిర్దేశం చేశారు.అనంతరం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులతో అక్కివలస నుంచి ప్రారంభమైన యాత్ర ఆమదాలవలస కొత్తరోడ్డు, మడపాం, నిమ్మాడ, పొడుగుపాడు, కోటబొమ్మాళి జంక్షన్, కన్నెవలస, చమయ్యపేట వరకు సాగింది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం నేతలతో కలసి అక్కవరం బహిరంగ సభ ప్రాంగణం వద్దకు సీఎం చేరుకున్నారు. ‘సిద్ధం సిద్ధం.. సీఎం సీఎం’ అంటూ మిన్నంటిన నినాదాలతో సభా ప్రాంగణం సముద్ర హోరును తలపించింది. సీఎం మాట్లాడుతుండగా ఆకాశం మేఘావృతంఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైన యాత్రకు అక్కచెల్లెమ్మలు హారతులు పట్టారు. జగనన్న తెచ్చిన వలంటీర్లు, సచివాలయాలతో తమ పనులు సులభతరమైపోయాయని, కార్యాలయాలు చుట్టూ తిరిగే దుస్థితి తప్పిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పొద్దున్నే ఇంటికి వచ్చి నిద్రలేపి మరీ పింఛన్ ఇస్తున్నారని, ఇంత మేలు చేసిన జగన్ బాబును చూడాలని వచ్చామని తమ ఆనందాన్ని పంచుకున్నారు.మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత వాతావరణం చల్లబడింది. సీఎం జగన్ అక్కవరం సభలో ప్రసంగిస్తుండగా మేఘాలు కమ్ముకున్నాయి. సభా ప్రాంగణంలో చినుకులు రాలడం, సమీపంలో వర్షం కురవడంతో హర్షాతిరేకాలు మిన్నంటాయి. జగన్ రాకతో తమ ప్రాంతం చల్లబడిందని, ఆయన అడుగుపెట్టిన చోట మంచే జరుగుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని మహిళలు నినాదాలు చేశారు.♦ పుట్టుకతో వినికిడి లోపం కలిగిన తన కుమారుడు త్రిషాన్ రెండు చెవులకు 2022లో ఆరోగ్యశ్రీ ద్వారా కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఉచితంగా చేయడంతో చిన్నగా మాట్లాడగలుగుతున్నట్లు శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్ సీఎం జగన్ వద్ద ఆనందం వ్యక్తం చేశాడు. అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ఆయన సీఎం జగన్‌కు కలిశారు. ♦ ‘మేమంతా సిద్ధం’ యాత్ర మడపాం టోల్గేట్ వద్దకు చేరుకునేసరికి అభిమానులతో కిక్కిరిసిపోయింది. భారీ క్రేన్‌తో తెచ్చిన నవరత్నాల పథకాల మాలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అక్కడ తనను కలసిన ఓ దివ్యాంగుడికి మూడు చక్రాల మోటార్ సైకిల్ అందజేస్తామని సీఎం జగన్ భరోసా వచ్చారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఓ బాధితురాలికి కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కుటుంబం అంతా జగనన్న అభిమానులంమా కుటుంబం మొత్తం జగనన్న అభిమానులం. జగనన్న పాదయాత చేసినప్పుడు నేను చదువకుంటున్నా. మా జిల్లాకు వచ్చినప్పుడు సెల్ఫీ కూడా తీసుకున్నా. ఇప్పుడు మా పాప రెండో తరగతి చదువుతోంది. జగనన్నను చూడాలని రాత్రి నుంచి మారాం చేయడంతో ఉదయం 7 గంటలకే అక్కివలస తీసుకొచ్చాం. జగనన్న చేపట్టిన విద్య, వైద్య సంస్కరణలు సామాన్యులకు ఎంతో మేలు చేస్తున్నాయి. వాటిని కళ్లారా చూస్తున్నాం. – పి.సంతోషిమణి, శ్రీకాకుళం మా తొలి ఓటు జగనన్నకే.. నాన్న అబ్దుల్ సలీమ్ ప్రైవేటు కాలేజీలో పనిచేస్తుండగా అమ్మ నసీమాబేగం గృహిణి. తక్కువ ఆదాయం ఉన్న మాలాంటి కుటుంబాలకు జగనన్న దేవుడు. మా అక్క, నా చదువు పూర్తిగా జగనన్న విద్యా దీవెనతోనే పూర్తయింది. ఇంటి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం చేయడంతో సొంతిల్లు కట్టుకున్నాం. మా కుటుంబం ఆనందంగా ఉందంటే అది జగనన్న పుణ్యమే. మా అక్కకు, నాకు తొలిసారి ఓటు వేసే అవకాశం వచ్చింది. తొలి ఓటు ఫ్యానుకే వేస్తాం. జగనన్నను చూశాకే అక్కివలస నుంచి ఇంటికి వెళతా. – నజీమా, విజయనగరం -
కరెంట్ ఇవ్వడం కూడా కాంగ్రెస్‌కు చేతకావడం లేదు: కేసీఆర్
మిర్యాలగూడలో రోడ్ షో ముగించుకుని సూర్యాపేట బయలుదేరిన కేసీఆర్మనకు శత్రువే కాంగ్రెస్ పార్టీ: కేసీఆర్మిర్యాలగూడలో కేసీఆర్ ప్రసంగంఅడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీరైతుబంధు అడిగితే చెప్పుతో కొడతానని ఓ మంత్రి అంటాడురైతులు చెప్పులు కూడా గట్టిగానే ఉన్నాయని కాంగ్రెస్ నేతలకు చెప్పాతెలంగాణ వచ్చాక పంటలు ఎండాయంటే ఇదే తొలిసారి.కరెంట్ కోతలెందుకు వస్తున్నాయి? ఎక్కడికి పోయింది కరెంట్? ఎందుకు ప్రజలను బాధపెడుతున్నారు.కరెంట్‌ను ఇవ్వడం కూడా చేతకావడం లేదా?.మిషన్ భగీరథ ఎందుకు నడపలేకపోతున్నారు లేదు? అది మీ చేతకాని తనం కాదా?కేసీఆర్‌ను తిట్టడమే కాంగ్రెస్ నేతలు పనిగా పెట్టుకుంది.ధాన్యం కొనడం లేదని రైతులు చెబుతున్నారు.తప్పకుండా తెలంగాణలో మన రాజ్యమే వస్తది.1956 నుంచి ఈనాటి వరకు మనకు శత్రువు కాంగ్రెస్సే.21 ఏళ్ల క్రితం కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేశా. నాలుగైదు నెలల క్రితం ధీమాతో ఉన్న రైతులు ఈరోజు బాధతో ఉన్నారు.ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ జిల్లాకు చెందినవారే. వీళ్లంతా కలిసి కృష్ణా నదిని కేఆర్ఎంబీకి పంపించారు.బీఆర్ఎస్ హయాంలో 18 పంటలకు నీళ్లిచ్చాం. రైతు బీమా ఉంటదో ఉండదో తెలవదు.కరెంట్ కనిపించకుండా పోయింది.రైతు బంధు ఐదెకరాలకే అంటున్నారు.ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనడం లేదని రైతులు నాతో అన్నారు. కేంద్రం గతంలో ధాన్యం కొననంటే మెడలు వంచి కొనిచ్చాంకల్యాణ లక్ష్మీ కింద తులం బంగారు ఇస్తామన్నారు. ఇంతవరకు లేదురెండు లక్షల రుణమాఫీ ఏమైంది?పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తే ప్రభుత్వం మెడలు వంచుతాం.కేసీఆర్‌ను చర్లపల్లి జైలుకు పంపిస్తా అంటున్నారు. వీటికి కేసీఆర్ బయపడతాడా?అంబేడ్కర్ పుణ్యమా అని తెలంగాణ వచ్చింది.125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం కడితే. జయంతి ఒక్కరు పోలేదు. మిర్యాలగూడ చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రరోడ్ షోలో పాల్గొని రాజీవ్ చౌక్ లో కార్నర్ మీటింగ్ లో మాట్లాడనున్న కేసీఆర్ కాసేపట్లో మిర్యాలగూడకు చేరుకోనున్న కేసీఆర్మిర్యాలగూడ బైపాస్ నుంచి రాజీవ్ గాంధీ కూడలి వరకు ర్యాలీరాజీవ్ గాంధీ కూడలిలో ప్రసంగిచనున్న కేసీఆర్నల్లగొండ జిల్లా: బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్తూ మార్గమధ్యలో నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ వద్ద ఆగిన మాజీ సీఎం కేసీఆర్ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కేసీఆర్తెలంగాణ భవన్ నుంచి ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్రకేసీఆర్ బస్సు వెంట భారీ కార్ల కాన్వాయ్ ర్యాలీమొదటిసారిగా తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి కేసీఆర్ బస్సు యాత్రసాక్షి, హైదరాబాద్/నల్గొండ: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నుంచి భారీ కాన్వాయ్ ర్యాలీ నడుమ బయల్దేరారు. తెలంగాణ భవన్ సౌత్ గేట్ నుంచి ఆయన కాన్వాయ్ బయల్దేరడం విశేషం. సాయంత్రం 4గం. మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో బస్సు యాత్ర జరగనుంది. రైతుల కోసం, రాష్ట్రం కోసం 2 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మమేకం కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక సీట్లను గెలిపించడమే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. స్థానికంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడి నుంచి బస్సులో ఎన్నికల ప్రచారానికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌షోలలో పాల్గొంటారు.నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు. -
సీఎం జగన్ బస్సు యాత్ర బ్రహ్మరథం పడుతున్న జనం
-
అడుగడుగునా జన నీరాజనం
-
ఇవాళ్టితో ముగియనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర
-
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్‌షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్‌లోని చెన్నాస్ కన్వెన్షన్‌లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్‌కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్‌కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
నేటి నుంచి కేసీఆర్ ప్రగతి రథం యాత్ర
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: భారత్ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు బస్సు యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మే 10 వరకు 17 రోజుల పాటు జరిగే బస్సు యాత్రలో భాగంగా 40కి పైగా పట్టణాల్లో జరిగే రోడ్ షోలలో కేసీఆర్ పాల్గొని లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేసీఆర్ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. ఈ ప్రగతి రథానికి బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. కాగా బుధవారం మధ్యాహ్నం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేస్తారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు హారతులు పట్టేందుకు వందలాది మంది మహిళలు పార్టీ కార్యాలయానికి తరలిరానున్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత... భోజనానంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఆయన వెంట ఉంటారు. సుమారు వందకు పైగా వాహనాలు ప్రగతి రథాన్ని అనుసరించే అవకాశముంది. సుమారు రెండు వందల మందితో కూడిన వలంటీర్ల బృందం కూడా యాత్రలో పాల్గొంటుంది. పార్టీ యువజన, విద్యార్థి విభాగం నేతలతో పాటు సుదీర్ఘకాలంగా పారీ్టలో పనిచేస్తున్న నేతలు, కార్యకర్తలు వలంటీర్లుగా వ్యవహరించనున్నారు. పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఘన స్వాగతం తొలిరోజు బస్సు యాత్ర బేగంపేట, ఉప్పల్, ఎల్బీనగర్ మీదుగా విజయవాడ రహదారిపైకి చేరుతుంది. వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్ మెట్ దాటిన తర్వాత చౌటుప్పల్ పంతంగి టోల్‌ప్లాజా వద్ద అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనితో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దారి పొడవునా కేసీఆర్‌కు ప్రజలు, కార్యకర్తలు పెద్దయెత్తున స్వాగతం పలికేలా మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. నకిరేకల్ క్రాస్ రోడ్, నల్లగొండ, మాడుగులపల్లి మీదుగా సాయంత్రం 5 గంటలకు మిర్యాలగూడ ఫ్లైఓవర్ వద్దకు యాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 5:30కి రాజీవ్ చౌక్‌వద్ద రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం వేములపల్లి, మాడుగులపల్లి తిప్పర్తి మీదుగా రాత్రి 7 గంటలకు సూర్యాపేటకు చేరుకుని రోడ్ షోలో ప్రసంగిస్తారు. సూర్యాపేటలోనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ రాత్రి బస చేస్తారు. గురువారం ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచారం తీరుతెన్నులను సమీక్షించి దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సాయంత్రం 4 గంటలకు సూర్యాపేట నుంచి బయలుదేరి చిట్యాల, రామన్నపేట మీదుగా భువనగిరి చేరుకుని అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస కోసం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. శుక్రవారం నుంచి మరో 15 రోజులు పాటు కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుంది. కిలోమీటర్ మేర రోడ్ షో ప్రతిచోటా కిలోమీటర్ మేర రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం కేసీఆర్ ప్రసంగిస్తారు. రోజూ రోడ్ షో ముగిసిన తర్వాత లేదా మరుసటి రోజు ఉదయం కేసీఆర్ విలేకరులతో మాట్లాడతారు. దీంతో పాటు ఉదయం వేళల్లో వివిధ సామాజికవర్గాలతో భేటీలు, క్షేత్ర స్థాయి సందర్శనలు ఉంటాయని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా కేసీఆర్ బస్సు యాత్ర వెంట వెళ్లే వలంటీర్లకు ఎక్కడికక్కడ బస ఏర్పాట్లు చేశారు. పార్టీ జిల్లా కార్యాలయాల్లో భోజన సదుపాయం కల్పిస్తున్నారు. -
చంద్రబాబు హయాం అంతా.. మోసం,మోసం, మోసం
-
నా తండ్రి లాంటి వారు ఎమోషనల్ అయిన బొత్స
-
అక్క చెల్లమ్మలకు జగనన్న విజ్ఞప్తి..!