అడుగడుగునా నీరా‘జనం’ | CM Ys Jagan Memantha Siddham Bus Yatra in Srikakulam | Sakshi
Sakshi News home page

అడుగడుగునా నీరా‘జనం’

Published Wed, Apr 24 2024 6:18 AM | Last Updated on Wed, Apr 24 2024 6:18 AM

CM Ys Jagan Memantha Siddham Bus Yatra in Srikakulam - Sakshi

విశాఖ నుంచి విజయనగరం వరకు వెంట నడిచిన అభిమానులు

ఉత్సాహంగా 21వ రోజు సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 

ఉదయం ఎండాడ నైట్‌ స్టే పాయింట్‌ నుంచి యాత్ర ప్రారంభం 

ఉదయం పీఎం పాలెం, కొమ్మాది, మధురవాడ,గంభీరం మీదుగా సాగిన యాత్ర

పీఎంపాలెం వద్ద ఉత్తరాంధ్ర సంప్రదాయ చెక్క భజన, కోలాటంతో స్వాగతం

(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగ­తం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్త­రాంధ్ర కళారూపాలైన చెక్క భజ­నలు, కోలా­టాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకు­న్నారు. విశాఖలోని ఎండాడ నైట్‌ స్టే పాయింట్‌ వద్ద అభిమానుల కోలాహలం మంగళ­వారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది.

దారిలో అడుగడుగునా అభిమా­నులు వెంటరాగా సీఎం జగన్‌ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్‌ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండి­పోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్‌ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్‌షెడ్‌ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంట­నడిచారు. దారి­పొడ­వునా అక్కచెల్లెమ్మల హార­తులు, మహిళల కోలా­టాలు, యువకుల తీన్‌మార్‌ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్‌ యాత్ర వెంట అడుగులు వేశారు. 

జగన్‌ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట..
ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్‌ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్‌ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్‌ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారిక­వలస మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను దూరం నుంచి చూసిన అపార్ట్‌మెంట్లలోని మహి­ళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది.

వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసు­కున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామా­న్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ఆనందపురం జంక్షన్‌లోని చెన్నాస్‌ కన్వెన్షన్‌లో సోషల్‌ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు.

అనంతరం.. మోదవలస జంక్షన్‌ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్‌ అభి­మానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్‌కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్‌ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. 

శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర..
సభ అనంతరం సీఎం జగన్‌ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్‌ కోసం పెద్దఎత్తున అభి­మా­నులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వా­నించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్‌ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయ­M­ý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహ­దారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్‌ చేరుకున్నారు.

వైఎస్సార్‌సీపీలోకి బీజేపీ నేతలు
ఎండాడ నైట్‌ క్యాంపులో ఎస్‌.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో  చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్‌ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్‌ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్‌కుమార్‌ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్‌ సలీమ్, షేక్‌ హుస్సేన్‌ బాషా తదితరులున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement