Srikakulam
-
LIVE: శ్రీకాకుళంకు వైఎస్ జగన్
-
ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైఎస్సార్సీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.పాలవలస కన్నుమూతఇటీవల, వైఎస్సార్సీపీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం (81)అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్‌ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
సిక్కోలు మట్టిపై ఇంటాక్ అమితమైన ప్రేమ
‘ఏ స్టోరీ ఆన్ స్టోన్’ పవిత్రమైన సిక్కోలు గడ్డపై అనంతమైన అభిమానంతో రాసిన ప్రేమలేఖ. అటు ఇచ్ఛాపురంలోని (Ichchapuram) సురంగి వారి కోట నుంచి ఇటు శ్రీకూర్మంలోని కుడ్య చిత్రాల వరకు ఏ కథను వదలకుండా ‘ఇంటాక్’ సభ్యులు అందంగా గుదిగుచ్చిన బంతిపూల మాల. ప్రతి ప్రాంతాన్ని, ప్రతి చరిత్రను, ప్రతి గాథను మనసారా ప్రేమించి ఆరారా అచ్చువేసిన ఓ పుస్తకమిది. పుస్తకమే కాదు ఆ ప్రయత్నం వెనుక ఉన్నది స్వచ్ఛమైన ప్రేమ. ఈ మట్టిపై, ఇక్కడి కథలపై, ఈ దారుల్లో దాగున్న అపురూప చరిత్రపై అమితమైన ఇష్టం. అంతే ఇష్టం మీకూ ఉంటే.. గ్రంథాలయంలోని ఈ పుస్తకాన్ని తిరగేయండి. పేజీలు ప్రియురాలిలా మారి చెప్పే ఊసులు వినండి. నెచ్చెలిలా చిత్రాలు వివరించే నులివెచ్చని జ్ఞాపకాలను ఆస్వాదించండి. – శ్రీకాకుళం కల్చరల్ఒక ప్రాంత చరిత్ర గుర్తుండాలంటే.. అక్కడి కథలు మళ్లీ మళ్లీ చెప్పుకోవాలి. ఆ ప్రాంత ప్రాశస్త్యం తెలియాలంటే.. ఆ గాథలు చరిత్రలో మిగిలిపోయే ప్రయత్నమేదో చేయాలి. అలాంటి ప్రయత్నమే ఇంటాక్ చేసింది. శ్రీకాకుళం జిల్లా చరిత్రను అందమైన పుస్తకంగా అచ్చు వేసి అందుబాటులో ఉంచింది. దేశంలోని అన్ని యూనివర్సిటీలకు, కళాశాలలకు, గ్రంథాలయాలకు చేరే విధంగా చర్యలు తీసుకుంది. భారత జాతీయ సంస్కృతి కళ వారసత్వ సంపద పరిరక్షణ సంస్థ కేంద్ర సహకారంతో నడుస్తోంది. ఇక్కడి శాఖ జిల్లాపై ఉన్న ప్రేమతో సంస్కృతి, వారసత్వ సంపదను అందరికీ తెలియజేసేందుకు విశేష కృషి చేసింది.దూసి ధర్మారావు జిల్లా శాఖ కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చెస్తున్న మండా శ్రీనివాసరావు ఫొటోగ్రఫీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ‘శ్రీకాకుళం ఏ స్టోరీ ఆన్ స్టోన్’ (Srikakulam A story on stone) అనే పుస్తకం రూపొందించారు. అందులో జిల్లాలోని చారిత్రక స్థలాలు, కళలు, సంస్కృతి వారసత్వ సంపదలు, కవులు, గాయకులు, నటులు, పర్యాటక ప్రదేశాల గురించి నిక్షిప్తం చేశారు. అనంతరం కేవీజే రాధాప్రసాద్ కన్వీనర్‌గా ఉన్న సమయంలో విద్యార్థులకు మన సంస్కృతి వారసత్వాలను పరిచయం చేసే ప్రక్రియలో వారికి వ్యాసరచన పోటీలు, వారికి అక్కడి సందర్శింప చేసే కార్యక్రమం చేశారు.సేకరణ, నిక్షిప్తీకరణ, నివేదన స్థానికంగా ఉండే చారిత్రక ప్రాధాన్యత కలిగిన అంశాలను ఎంచుకొని ఆ ప్రాంతానికి స్వయంగా వెళ్లి అక్కడి ప్రజల ద్వారా తెలుసుకున్న అంశాలతో పాటు చారిత్రక అంశాలను అధ్యయనం చేసి వాటిని రికార్డు చేసి రిపోర్టును కేంద్ర శాఖకు పంపుతారు. వారి సొంత ఖర్చులతో వెళ్లి విషయ సేకరణ చేస్తారు. ఇప్పటి వరకు 150 టూరిజం స్థలాలను, 100కు పైగా చారిత్రక స్థలాలను గుర్తించి పుస్తకంలో నిక్షిప్తం చేశారు. పురాతన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. అలాగే హెరిటేజ్ ఫొటోగ్రఫీ ప్రదర్శనలో ప్రదర్శించగా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. కోల్‌కతాలో కూడా ప్రదర్శించారు. శ్రీకాకుళం నా ప్రేమనగర్ శ్రీకాకుళం కేవలం ఒక ఊరి పేరో, ఒక జిల్లా పేరో మాత్రమే కాదు. అభ్యుదయ సామాజికవాదుల ఊపిరి ఉత్తేజం నింపే ఆక్సిజన్. జీవనదుల నేల, ఖనిజాల గని, శ్రమమజీవుల తూర్పు ప్రాంతం. జిల్లా పేరు చెబితే ఇండియన్ హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు, వయోలిన్ విద్వాంసుడు వెంకటస్వామి నాయుడు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, ఆధునిక సాహిత్యానికి, కథ, నాటకం, ముత్యాల సరాలు అందించిన గురజాడ.. పెన్ను గన్ను పట్టిన పాణిగ్రహి గుర్తుకు వస్తారు. ప్రసిద్ధ ప్రజా కళాకారుడు వంగపండు వంటి వారికి .. ఇక్కడి సీమ కొండలు, సాలూరవతలి సువర్ల కొండలే కాక కత్తు లు దులపరించిన చిలకలు, పాముని యెంటదగిలి న చీమలు గుర్తొస్తాయి. శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం రా – వీర యోధులనే కన్న గడ్డ శ్రీకాకుళం రా... అందుకే శ్రీకాకుళం నా ప్రేమనగర్. – అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ కథ, నవల రచయితఇంటాక్ ద్వారా మూడు పుస్తకాలు ఇంటాక్ తరఫున గుర్తించిన చారిత్రక ప్రదేశాలన్నింటితో ఒక పుస్తకాన్ని రూపొందించారు. ‘శ్రీకాకుళం... ఏ స్టోరీ ఆన్ స్టోన్ ’ పేరుతో పుస్తకాన్ని ఇప్పటికి మూడు సార్లు ముద్రించాం. కళింగ ఆంధ్ర చరిత్ర, స్టోరీ ఆన్ స్టోన్స్ శ్రీకాకుళం, జిల్లా చరిత్రపై బిట్స్‌తో ఒక పుస్తకాన్ని కూడా రూపొందించాం. – వి.జగన్నాథం నాయుడు, అదనపు కన్వీనర్, ఇంటాక్ శాఖ దూసి కోసం ప్రయత్నం మహాత్మా గాంధీ అడుపెట్టిన దూసి రైల్వే స్టేషన్‌ను గాంధీ స్మారక స్థలిగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం కొనసాగుతోంది. – నూక సన్యాసిరావు, కన్వీనర్, ఇంటాక్ శ్రీకాకుళం శాఖవిద్యార్థులకు పోటీలు విద్యార్థులకు మన సంస్కృతి సంప్రదాయాలు, చారిత్రక కట్టడాల వంటి వాటిపై జిల్లా స్థాయి, జోనల్ స్థాయిల్లో పోటీలు నిర్వహించి వారిలో చిన్నతనం నుంచి అవగాహన కల్పిస్తున్నాం. – నటుకుల మోహన్, ఇంటాక్ కో కన్వీనర్220 సమర్పణ పత్రాలు చారిత్రక ప్రదేశాలతో ఇంటాక్ సమర్పణ పత్రాలు అందించాను. జిల్లాలో చారిత్రక నిర్మాణాల సంపద, తీరప్రాంత చారిత్రక సంపదతో కలిపి మొత్తం 220 ప్రదేశాలు ఉన్నట్లు గుర్తించాను. వీటిని అన్నింటిని రికార్డు చేసి ఈ పత్రాలను క్రమపద్ధతిలో ఇంటాక్ సంస్థకు రికార్డులు పంపించాం. – మండా శ్రీనివాస్, ఇంటాక్ ఫొటోగ్రాఫర్చరిత్ర తెలియాలని..జిల్లా చరిత్ర విద్యార్థులకు తెలియాలని నేను కన్వీనర్‌గా ఉన్న సమయంలో పోటీలు నిర్వహించేవాళ్లం. ధర్మారావు కాలంలో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ల సాయంతో పునర్ముద్రణ చేసి యూనివర్సిటీలకు, గ్రంథాలయాలకు ఉచితంగా అందించాం. – కేవీజే రాధా ప్రసాద్, పూర్వపు కన్వీనర్, ఇంటాక్ -
శ్రీకాకుళంలో ‘తండేల్’ మూవీ విజయోత్సవ వేడుక (ఫొటోలు)
-
టీడీపీ కార్యకర్త అమానుషం.. దివ్యాంగురాలిపై అఘాయిత్యం
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో టీడీపీ కార్యకర్త దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో ఆమెను బెదిరించి రాజీ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. పలాస మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు దారుణానికి పాల్పడ్డాడు. తమ ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన ఓ దివ్యాంగురాలి(20)పై కన్నేసిన భాస్కరరావు ఆమెపై పలుమార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. కాగా, బాధితురాలి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో ఉండగా.. పెదంచలలో తన నానమ్మతో కలిసి ఉంటోంది ఆమె.ఇక, తన మనుమరాలికి న్యాయం జరగాలని బాధిత కుటుంబ సభ్యులు భాస్కరరావు వద్దకు వెళ్లి నిలదీశారు. దీంతో, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకునేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు.. కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ సందర్బంగా బాధితురాలి నానమ్మ మాట్లాడుతూ..‘అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా నా మనవరాలు గర్భవతి అని తెలిసింది. వరిశి భాస్కరరావు నా మనవరాల్ని గర్భవతిని చేశాడు. మాకు అన్యాయం జరిగింది.. న్యాయం జరగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అల’పెరుగని గుండెల్
పురాణాల నుంచి వర్తమానం వరకు పతిప్రాణాలు రక్షించుకోవడం కోసం మహిళలు పడిన కష్టాలు, చేసిన పోరాటం మనకు కొత్త కాదు. నూకమ్మ చేసిన పోరాటం ఆ కోవలోకే వస్తుంది. శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల గ్రామానికి చెందిన నూకమ్మ భర్త, అతడి బృందం గుజరాత్లో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్టు గార్డుల చేతికి చిక్కారు. పాకిస్తాన్ జైల్లో పద్నాలుగు నెలలు మగ్గారు. అప్పట్లో ‘ప్రజా సంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. నాగచైతన్య కథానాయకుడిగా వస్తున్న ‘తండేల్’ సినిమాకు మూలం రామారావు– నూకమ్మల జీవితకథ.శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పంచాయతీ పరిధిలోని గ్రామాలు డి.మత్స్యలేశం, కె.మత్స్యలేశం. గనగళ్ల రామారావుది కె.మత్స్యలేశం. నూకమ్మది డి.మత్స్యలేశం గ్రామం. వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలు కూడా వీరి ప్రేమను ఆమోదించారు. పెళ్లి చేశారు. తమ ప్రేమకు పెద్దలు ఒప్పుకుంటారో లేదో, ఎన్ని కష్టాలు ఎదురవుతాయో! అనుకున్నారు. హమ్మయ్య... ఎలాంటి కష్టం లేకుండానే వారి పెళ్లి జరిగింది. అయితే సినిమా ట్విస్ట్‌లా అసలు కష్టాలు ఆ తరువాతే మొదలయ్యాయి. తన బృందంతో కలిసి చేపల వేట కోసం రామారావు గుజరాత్‌లోని వెరావల్‌కు వెళుతుండేవాడు. గుజరాత్లో వేటకెళ్లిన మత్స్యకారుల నాయకుడిని ‘తండేల్’ అని పిలుస్తారు.ఆరోజు....శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది రామారావు నాయకత్వంలో మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తున్నారు. ఎదురుగా దట్టమైన మంచు. ఏమీ కనిపించడం లేదు. పయనిస్తున్న పడవ దిశ మారిపోయింది. దీంతో పాకిస్థాన్‌ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. బోట్లలో వైర్లెస్ సెట్లు కూడా పనిచేయకపోవడంతో వారికి దిక్కు తోచలేదు. ఆ తరువాత పాకిస్తాన్ కోస్టు గార్డులు చేతికి చిక్కారు. వీరి ఫొటోలు తీసుకుని ఏప్రాంతానికి చెందిన వారని ఆరా తీశారు. పొరపాటున వచ్చిన మిమ్మల్ని విడిచి పెడతాం’ అని కోస్టు గార్డులు హామీ ఇవ్వడంతో ‘బతికిపోయినం దేవుడా’ అనుకున్నారు. ఊపిరి పీల్చుకున్నారు. కథ మలుపు తిరిగింది...కానీ తరువాత కథ మలుపు తిరిగింది. ‘భయపడకండి... విడిచి పెడతాం’ అన్న వాళ్లే ఆ తరువాత ‘విడిచిపెట్టేదే లేదు’ అంటూ మాట మార్చారు. ఆ మాట వారి గుండెల్లో గునపంలా దిగింది. వేలిముద్రలు తీసుకుని కరాచీ సబ్‌జైలులో బంధించారు. వీరందరినీ ఒకే బ్లాక్‌లో ఉంచారు. జైలులో వారు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సరైన ఆహారం అందకపోవడం, జైలు సిబ్బంది నానా రకాలుగా ఇబ్బంది పెట్టడంతో చిత్రహింసలు అనుభవించారు. ఎవరికి ఎవరూ ధైర్యం చెప్పుకునే పరిస్థితి లేదు. అందరి కళ్ల ముందు దుఃఖసముద్రం.పద్నాలుగు నెలలు... ప్రతి రోజూ నరకమే వేటకు వెళ్లిన తమ వాళ్ల ఆచూకి దొరకకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పాకిస్తాన్ కోస్టు గార్డులకు పట్టుబడ్డారనే వార్త తెలిసి కుప్పకూలిపోయారు. ‘ఎన్ని కష్టాలొచ్చినా సరే నా భర్తను జైలు నుంచి విడిపించుకుంటాను’ ఏడుస్తూనే దృఢంగా అన్నది నూకమ్మ. ‘నీ భర్త విజయనగరంలో ఉన్నాడనుకున్నావా? విశాఖపట్నంలో ఉన్నాడనుకున్నావా?... అక్కడెక్కడో పాకిస్తాన్ జైలులో ఉన్నాడు’ అన్నారు ఒకరు. ఆ మాటకు అర్థం... ఇక ఆశ వదులుకోవాల్సిందేనని!పాక్ జైల్లో బందీలుగా వున్న మత్స్యకారుల గురించి పాదయాత్రలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి వివరిస్తున్న నూకమ్మ తదితరులు అయితే చివరి శ్వాస వరకు అయినా పోరాడాలని నిర్ణయించుకుంది నూకమ్మ. ఆమెకు ఎర్రమ్మ భార్య శిరీష జత కలిసింది. నిండు గర్బిణీగా ఉన్న నూకమ్మ, ఎర్రయ్య సతీమణి శిరీష కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వానికి విన్నపాలు చేశారు. అప్పట్లో ‘ప్రజాసంకల్పయాత్ర’ చేస్తున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లారు. బాధిత కుటుంబాలకు జగన్ అండగా నిలబడ్డారు. ధైర్యం చెప్పారు. వీరి నిరంతర పోరాటం వల్ల, నాడు ఉన్న వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో మత్స్యకారులు పాకిస్తాన్ జైలు నుంచి 14 నెలల తరువాత విడుదలయ్యారు. భర్తను జైలు నుంచి విడిపించటం కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు నూకమ్మ చేసిన పోరాటం, గర్భిణిగా, పాపకు జన్మనిచ్చిన తల్లిగా తను ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అంతులేని నిస్సహాయతలో కూడా చిన్న ఆశ మనిషిని బతికిస్తుంది. పోరాటశక్తిని ఇస్తుంది. విజయాన్ని చేతికి అందిస్తుంది. నూకమ్మ విషయంలో అదే జరిగింది.పాకిస్తాన్ నుంచి విడుదలైన తర్వాత తనను కలిసిన రామారావుకు స్వీట్ తినిపించిన నాటి సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అదృష్టం కాదు...అంతా ఆమె కష్టమే!పాకిస్తాన్ జైల్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కుటుంబం గుర్తుకొచ్చి నాలో నేను కుమిలిపోయేవాడిని. నెల గర్భిణిగా ఉన్న నా భార్య నేను విడుదలయ్యే నాటికి మూడు నెలల పాపతో కనిపించింది. ఎన్నో నెలల పాటు నా కుటుంబానికి దూరంగా బతికాను. నా విడుదల కోసం నా భార్య చేసిన పోరాటం, పడిన కష్టాలు ఎంతోమంది ద్వారా విన్నాను. ఆమె పడిన కష్టం వల్లే విడుదలయ్యాను.– గనగళ్ల రామారావుఆందోళనలో బతికానా భర్త పాకిస్తాన్‌కు పట్టు పడినట్లు తెల్సుకున్నాక ఆందోళన చెందా. గుజరాత్ మరి వెళ్లనని సంక్రాంతికి వచ్చి ఇక్కడే ఉండి పోతానని అన్నారు. అంతలో పాకిస్తాన్లో చిక్కుకుపోయారు. పాకిస్తాన్ మన శత్రుదేశం కావటం వల్ల ఎంతో ఆందోళన చెందాను. అయినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోరాటం చేశాను. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిశాను. ఆయన జైలులో ఉండగా పాప పుట్టింది. మా కథ సినిమాగా వస్తుండటం సంతోషంగా ఉంది. – నూకమ్మ– కందుల శివశంకరరావు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
శ్రీకాకుళం : ఆర్ట్స్ కళాశాల మైదానంలో సింగర్ మంగ్లీ సందడి (ఫొటోలు)
-
అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ వద్ద కలకలం
-
శ్రీకాకుళం కళావతి కేసులో సంచలన విషయాలు..
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన వివాహిత హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పొందూరు (Ponduru) మండలం మొదలవలస (Modalavalasa) గ్రామానికి చెందిన పూజారి కళావతి (53) ఒంటిపై ఉన్న బంగారు నగల కోసమే నగరానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) పథకం ప్రకారం హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. శనివారం (Saturday) మధ్యాహ్నం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.వి.రమణ, టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానందలు వివరాలు వెల్లడించారు.నిండా అప్పులు.. ఆపై వ్యసనాలుశ్రీకాకుళానికి చెందిన అండలూరి శరత్‌కుమార్ (31) తల్లిదండ్రులతో తగువులాడుకుని ఇంటి నుంచి బయటకొచ్చేశాడు. సరస్వతీ మహల్ ఎదురుగా ఏవీఆర్ జనరేటర్ రిపేర్ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తూ.. న్యూకాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. వ్యసనాలకు తోడు జల్సాలు ఎక్కువగా చేసేవాడు.పథక రచన చేశాడిలా..నగరంలోని డీసీసీబీ కాలనీలో సూరిబాబు సుందర సత్సంగానికి పొందూరు నుంచి కళావతి భజనలు, కీర్తనలు వినడానికి వచ్చేవారు. ఏడాది కిందట శరత్‌కుమార్‌కు కళావతి పరిచయమైంది. సత్సంగానికి ఎప్పుడొచ్చినా ఒంటి నిండా బంగారు ఆభరణాలతో కళావతి కనిపించేవారు. దీంతో తన అప్పులు తీర్చేందుకు ఆమెను హతమార్చి బంగారాన్ని కాజేయాలని శరత్‌కుమార్ పథక రచన చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 18న కళావతి రూమ్‌కి వస్తున్నట్లు శరత్‌కుమార్‌కు ఫోన్ చేయడంతో హత్య చేయడానికి సరైన సమయమిదేనని భావించాడు.కళావతి మధ్యాహ్నం మూడు గంటలకు గదికి వచ్చారు. ఇదివరకు శరత్‌కుమార్ ఆమెకు వెయ్యి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. కానీ అతడు రూ.500 మాత్రమే ఇవ్వడంతో మిగతా రూ.500 కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో కళావతి శరత్‌కుమార్ తల్లినుద్దేశించి అనరాని మాట అనడంతో కోపోద్రిక్తుడైన శరత్‌కుమార్ వైరుతో ఆమె గొంతు బిగించి తలగడతో గట్టిగా ముఖాన్ని అదిమి చంపేశాడు. వెంటనే ఆమె ఒంటిపై ఉన్న బంగారు గాజులు రెండు, పుస్తెలతాడు, నాలుగు ఉంగరాలు, ఓ చెవిదిద్దు, సెల్ఫోన్లు రెండు తీసుకున్నాడు. శవాన్ని పక్కనే ఉన్న బాత్రూమ్లోకి ఈడ్చుకువెళ్లి అక్కడ పడేశాడు. గాజులు రెండూ తన వద్ద ఉంచుకుని మిగతా వస్తువులను ఒక పాలిథీన్ కవర్లో కట్టి ఇంటి మెట్ల కింద పెట్టి రూమ్‌కి తాళాలు వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.తన స్నేహితుడి ఇంటిలో ఓ రాత్రి, ఆదిత్య పార్క్‌లో రెండు రాత్రులు గడిపాడు. సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి అక్కడే ఆగి ఉన్న లారీపైకి విసిరేశాడు. తానే చంపానని బయటకు తెలిసిపోవడంతో 24న బాకర్ సాహెబ్‌పేట వీఆర్వో స్పందన అనూష వద్దకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఆమె సమక్షంలో పోలీసులకు లొంగిపోయాడు. వేరే వ్యక్తికి అమ్మజూపిన రెండు గాజులనే కాక మెట్లపై దాచి ఉన్న మిగతా బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చదవండి: శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..! -
టీడీపీ సభ్యత్వం పేరుతో మోసం.. మహిళా అకౌంట్ నుండి లక్ష ట్రాన్సఫర్
-
బొబ్బిలి పేట సర్పంచ్ గా పోటీచేసిన YSRCP నేత చంద్రయ్య మర్డర్
-
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో YSRCP కార్యకర్తపై దుండగుడు హత్యాయత్నం
-
శరత్ అనే వ్యక్తితో కళావతి సన్నిహితంగా..!
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని న్యూకాలనీలో 53 ఏళ్ల వివాహిత పూజారి కళావతి దారుణ హత్యకు గురయ్యారు. శనివారం మ«ధ్యాహ్నం రెండున్నర గంటలకు తన స్వగ్రామం పొందూరు మండలం మొదలవలస నుంచి శ్రీకాకుళం నగరానికి తన వ్రస్తాలు తెచ్చుకుంటానని స్కూటీపై వచ్చిన ఆమె రోజు గడిచినా ఇంటికి వెళ్లకపోవడం.. ఆదివారం రాత్రి న్యూకాలనీ ఎక్సైజ్ కార్యా లయం సమీపంలోని ఓ బిల్డింగ్ పై ఫ్లోర్ బాత్రూమ్లో విగతజీవిగా పడి ఉండటం స్థానికంగా సంచలనం రేపింది. రెండో పట్టణ పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. పొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన పూజారి వెంకటరావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతని భార్య కళావతి. వీరికి ఇద్దరు మగ పిల్లలు, ఓ కుమార్తె ఉన్నారు. ఈమెకు నగరంలో సత్సంగంకు భజనలకు వెళ్లే అలవాటు ఉంది. శనివారం నగరానికి స్కూటీపై వచ్చిన ఆమె రాత్రయినా ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆమె సత్సంగానికి వెళ్లి ఉంటారని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఉదయం అక్కడ ఉన్న గురువుకు ఫోన్ చేశాక రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. సీసీ కెమెరాలు పరిశీలించడంతో.. ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా ఉన్న వీధి చివరన, మరికొన్ని చోట్ల సీసీ కెమెరాలు పరిశీలించగా చైతన్య కళాశాల వద్ద ఆమె స్కూటీ ఆపి పార్క్ చేయడం, అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి రెడ్డిమ్ ఎంటర్‌ప్రైజస్ బిల్డింగ్ ఒకటో ఫ్లోర్‌కు మెట్లెక్కుతూ ఉండటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె దిగడం రికార్డు కాలేదు. దీంతో రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తన సిబ్బందితో పాటు క్లూస్ టీమ్‌తో పై ఫ్లోర్ రూమ్‌లోకి వెళ్లి చూడగా పక్కనే ఉన్న బాత్రూమ్లో కళావతి విగతజీవిగా పడి ఉంది. పరిసరాలన్నీ పరిశీలించగా బాత్రూమ్ పక్కన ఉన్న గదిలో బెడ్ ఉండటం, దానిపై రెండు తలగడల్లోని ఓ తలగడపై రక్తపు మరక ఉండటం, కళావతి ముక్కు నుంచి కూడా రక్తం కారి ఉండటాన్ని బట్టి హత్యగా భావించి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె వచ్చిన బిల్డింగ్ ఓనర్ సూరిబాబు అనే వ్యక్తి. అందులో పై ఫ్లోర్లో అండలూరి శరత్‌కుమార్ అనే యువకుడు అద్దెకు ఉంటున్నాడు. ఆ వ్యక్తితో గత కొంతకాలంగా ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడిన బాలుడి హత్య మిస్టరీ -
తవ్వుకోవడం.. అమ్ముకోవడం కూటమి నేతల కనుసన్నల్లోనే..!
-
టీడీపీ కార్యకర్త అరాచకం.. కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి లైంగిక దాడి
సాక్షి, ఆమదాలవలస: ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన నాటి నుంచి పచ్చ టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వారే అధికారంలో ఉన్నారనే కారణంగా పలు అఘాయిత్యాలు, నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్త ఒకరు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, ఆమె గర్భవతి కాగా.. బెదిరింపులకు దిగాడు.టీడీపీ కార్యకర్త ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జరిగింది. ఈ దారుణ ఘటనపై ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. కోటిపల్లి రాజు అనే యువకుడు 9వ తరగతి విద్యార్థినికి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో మోసం చేశాడు. బాలిక గర్భిణి అని తేలడంతో బాధితురాలి తల్లి ఆదివారం ఆమదాలవలస పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.అయితే, తల్లిదండ్రులు బయటకు వెళ్లిన సమయంలో బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దంటూ బాలికను బెదిరించినట్టు సమాచారం. ఈ విషయమై యువకుడిని ప్రశ్నించగా తాను టీడీపీ కార్యకర్తనని, తనకు పార్టీ నేతల అండదండలున్నాయంటూ బెదిరిస్తున్నాడని బాలిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
ఐదువందల పైచిలుకు కిలోమీటర్ల దూరం. జాతీయ రహదారిపై కారులో నిమ్మళంగా వెళ్తే దాదాపు పది గంటల సేపు ప్రయాణం. అప్పటికే వారు దాదాపు సగం దూరం ప్రయాణం పూర్తి చేశారు. ఇంకాసేపైతే ఆంధ్రాపరిధి దాటి ఒడిశాలోకి ప్రవేశిస్తారు. కానీ అక్కడే వారి ప్రయాణం ఆగిపోయింది. అంతసేపు కారు నడిపిన బడలిక.. అతి వేగం.. నిద్రమత్తు కలగలిపి వారి జీవిత ప్రయాణాన్ని ఆపేశాయి. అదుపు తప్పిన వారి కారు జాతీయ రహదారి పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొంటే.. ఆ ధాటికి స్తంభం ఏకంగా విరిగిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కూతురికి ఐఐటీలో సీటు వచ్చిందని మొక్కు తీర్చుకోవడానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కంచిలి (శ్రీకాకుళం): కంచిలి మండల పరిధి పెద్దకొజ్జిరియా–చిన్నకొజ్జిరియా గ్రామ కూడళ్ల మధ్యలో మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వచ్చిన కారు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నేహా గుప్తా(18), కదిరిశెట్టి సోమేశ్వరరావు(49), లావణ్య(43) దుర్మరణం పాలయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా విశాఖకు చెందిన వారు. వివరాల్లోకి వెళ్తే.. మొక్కు తీర్చుకుందామని.. విశాఖలోని సీతమ్మధారకు చెందిన ముత్తా వెంకట రంగ రాజేష్ భార్య లావణ్య, కుమార్తె నేహా గుప్తా, తల్లి సుబ్బలక్ష్మితోపాటు తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు, ఆయన భార్య రాధికలతో కలిసి కారులో ఒడిశా రాష్ట్ర పరిధి జాజ్పూర్లో గల గిరిజామాత అమ్మవారి దర్శనానికి బయల్దేరారు. నేహా గుప్తాకు ఐఐటీలో సీటు రావడంతో మొక్కు తీర్చుకోవడానికి తమ కారులోనే బయల్దేరారు. ఉదయం 9 గంటల సమయంలో కంచిలి మండలం చిన్నకొజ్జిరియా గ్రామకూడలి వద్దకు వచ్చేసరికి వాహనాన్ని నడుపుతున్న ముత్తా వెంకటరంగరాజేష్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కన బెర్మ్వైపు దిగి ఆ పక్కన ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా అదుపు తప్పి మళ్లీ రోడ్డు మీదకు చేరి పల్టీ లు కొడుతూ మరికొంత దూరం వెళ్లిపోయి బోల్తాపడింది. కారు ఢీకొన్న వేగానికి విద్యుత్ స్తంభం ఏకంగా విరిగిపోయింది. ప్రమాదంలో వాహనం నడుపుతున్న ముత్తా వెంకట రంగ రాజేష్ భార్య లావణ్య(43) కారులో నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయారు. కుమార్తె నేహా గుప్తా(18), తోడల్లుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు(49)లను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూశారు. మృతుడు సోమేశ్వరరావు భార్య కదిరిశెట్టి రాధిక తీవ్రగాయాలపాలవ్వడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వాహనం నడుపుతున్న వ్యక్తి వెంకట రంగ రాజేష్ తోపాటు ఆయన తల్లి సుబ్బలక్షి్మలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు కదిరిశెట్టి సోమేశ్వరరావు భద్రాచలంలో ఐటీసీ పేపర్ ఇండస్ట్రీ లో ఉద్యోగి. ఆయనకు భార్య రాధిక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు సోమవారం రాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. అంతా కలిసి మంగళవారం వేకువజామున ఒడిశాలోని గుడికి బయల్దేరారు. ఇక రాజేష్ విశాఖపట్నంలో ఆటోమొబై ల్ స్పేర్‌పార్ట్స్ వ్యా పా రం చేస్తుంటారు. ప్ర మాదం జరిగిన విష యం తెలుసుకొని పరామర్శకు వచ్చిన బంధు వులకు చెబుతూ గుండెలు బాదుకుంటూ రో దించారు. నేహా పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21నే నిర్వహించారు.అధికారుల పరిశీలన.. ప్రమాదం విషయాన్ని తెలుసుకొని కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు, స్థానిక తహసీల్దార్ ఎన్.రమే‹Ùకుమార్‌లు సంఘటన స్థలంతోపాటు, ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి. పారినాయడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదం విషయం తెలుసుకొని సోంపేట ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ సోంపేట ప్రభుత్వాసుపత్రికి వచ్చి వెంకట రంగ రాజేష్‌ను పరామర్శించారు. ప్రమాద విషయాన్ని అడిగి తెలుసుకొన్నారు.హాహాకారాలు.. ప్రమాదంలో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర విషాదం చోటుచేసుకొంది. ప్రమాదం జరిగిన ప్రదేశమంతా బాధి తుల ఆర్తనాదాలతో మార్మోగింది. జాతీయ రహదారిలో వాహన రాకపోకలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడం, ఆ సమయంలో మరే వాహనం రాకపోవడంతో కుడివైపు ఉన్న ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో కారులో మూడు వరుసల్లో సీట్లలో ఆరుగురు కూర్చుండగా, ఎడమవైపు విద్యుత్ స్తంభం ఢీకొనడంతో ఆ వైపు కూర్చున్నవారంతా ప్రమాదానికి గురయ్యారు. మరోవైపు కూర్చున్న ముగ్గురు గాయాలతో బయటపడినట్లు సంఘటన స్థలంలో ప్రమాద స్థలంలో పరిస్థితిని చూస్తే అర్ధమవుతుంది.⇒ విజయనగరం జిల్లా భోగాపురం వద్ద హైవేపై మితిమీరిన వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ఎక్కించి ఆవలి రోడ్డు వైపునకు వెళ్లి లారీని ఢీకొనడంతో నలుగురు జిల్లావాసులు దుర్మరణం చెందారు. ⇒మెళియాపుట్టి మండలం చినహంస సమీపంలో ధాన్యపు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయబోయి ఎడ్జ్‌లో ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఓ యువకుడు, బాలిక మృతిచెందారు.ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై నలుగురు వెళ్లడం గమనార్హం..⇒ కోటబొమ్మాళి మండలం పాకివలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలు సంపతిరావు త్రివేణి(30) మృతిచెందారు.⇒ తమిళనాడు నుంచి జార్ఖండ్‌కు వెళ్లేందుకు కొబ్బరికాయల లోడుతో వస్తున్న లారీ ఎచ్చెర్ల ఫరీదుపేట కొయ్యరాళ్ల కూడలి వద్ద విద్యుత్తు స్తంభాన్ని (టవర్‌ను) బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. క్యాబిన్లో ఉన్న డ్రైవర్ మృతిచెందగా వెనుక నిద్రిస్తున్న క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డాడు. -
శ్రీకాకుళం : జోరువానలో శ్రీలీల చూసేందుకు అభిమానుల ఉత్సాహం (ఫొటోలు)
-
శ్రీకాకుళం జిల్లాలో YSRCP కార్యకర్తల కిడ్నాప్ కలకలం
-
అర్ధరాత్రి వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్.. వారిద్దరూ ఎక్కడ?
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలను కూటమి సర్కార్ టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తల కిడ్నాప్ కలకలం సృష్టించింది.శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు కిడ్నాప్‌నకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్థరాత్రి పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లారు. పోలీసు యూనిఫామ్‌లో వచ్చిన కొందరు దుండగులు కూర్మపు ధర్మారావు, అంపోలు శ్రీనివాస్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనపై వారి కుటుంబ సభ్యులు కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ కిడ్నాప్ విషయంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు తెలియడంతో ఆయన కార్యకర్తల కుటుంబాల వద్దకు చేరుకున్నారు. అనంతరం, పోలీసు స్టేషన్ ముందు అప్పలరాజు నిరసనకు దిగారు. ఈ సందర్బంగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల పేరుతో తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ కార్యకర్తలను వెంటనే తీసుకు రావాలని డిమాండ్ చేశారు. వారు ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ఈ క్రమంలో అప్పలరాజు, పోలీసుల మధ్య వాగ్వాదం జరగడంతో ఆయన అక్కడే కూర్చుని నిరసనలు తెలిపారు. -
దొంగనోట్ల ముఠా ఆటకట్టు
మెళియాపుట్టి: దొంగనోట్లు ముద్రించి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనుకున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. టెక్కలి డీఎస్పీ ఆర్వీఎస్ఎన్ మూర్తి వివరాలను శుక్రవారం స్థానిక స్టేషన్ వద్ద వెల్లడించారు. తక్కువ సొమ్ముకు అధిక మొత్తంలో దొంగనోట్లు ఇస్తామని ఆశ చూపించే ఆరుగురిని అరెస్టు చేశామన్నారు. పలాస మండలం నర్సింపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి, పెదంచల గ్రామానికి చెందిన కుసిరెడ్డి దూర్వాసులు, మెళాయపుట్టి మండలం సంతలక్ష్మీపురానికి చెందిన తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, కరజాడ గ్రామానికి చెందిన దాసరి రవికుమార్, వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడు గ్రామానికి చెందిన దుమ్ము ధర్మారావులను అరెస్టు చేశామని, వీరి వద్ద నుంచి కెనాన్ కలర్ ప్రింటింగ్ మిషన్, కలర్ ఇంక్ బాటిల్స్, బ్లేడ్, గమ్ బాటిల్, పేపర్ కట్టలు, రూ.57.25 లక్షలు విలువైన దొంగనోట్లు, 4 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్రవాహనం (స్కూటీ) స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఎలా పట్టుకున్నారంటే..? కేసులో ఎ1 గా ఉన్న తమ్మిరెడ్డి రవి అనే వ్యక్తి గురువారం మెళియాపుట్టి మండలం పట్టుపురం కూడలిలో కొంతమేర దొంగనోట్లు పట్టుకుని తిరుగుతున్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రమేష్ బాబు సిబ్బందితో వెళ్లి అతడిని పట్టుకుని దొంగ నోట్లను స్వా«దీనం చేసుకున్నారు. అతడిని స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా మిగిలిన వారి పేర్లు చెప్పాడు. దీంతో వారందరినీ అరెస్టు చేశారు. వారి వద్దనున్న మొత్తం నకిలీ నోట్లు అయిన రూ.27.25 లక్షలు స్వా«దీనం చేసుకున్నారు. నేరం చేయడంలో వీరి స్టైలే వేరు వీరంతా ఒక్కో ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. ఒడిశాలో ఎక్కడి నుంచో కొన్ని దొంగనోట్లు సంపాదించి, నకిలీనోట్లు తయారు చేసే విధానాన్ని యూట్యూబ్‌లో చూసేవారు. సంతలక్ష్మీ పురం గ్రామంలోని అందరూ నివాసముండే ప్రదేశంలోనే ఇళ్ల మధ్య ఒక ఇంటిని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రింటర్, ఇతర సామగ్రి అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక వ్యాపారం మొదలెట్టే ప్రక్రియలో భాగంగా రూ.5లక్షలు ఇస్తే రూ.25 లక్షల నకిలీ నోట్లు ఇవ్వడానికి ఓ వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని నోట్ల తయారీ ప్రారంభించారు. అందులో భాగంగానే మచ్చుకు కొన్ని నోట్లు చూపించే క్రమంలోనే పట్టుబడ్డారు. ఇద్దరు పాత నేరస్తులే.. నేరానికి పాల్పడిన వారిలో ఎ2 గా ఉన్న కుసిరెడ్డి దూర్వాసులుపై కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు, ఎ6 దుమ్ము ధర్మారావు పై పలాస, మందస పోలీస్ స్టేషన్లలో పలు మార్లు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయి. మరికొందరిపై ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయి. అయితే నకిలీ నోట్ల కేసు లో మరికొందరు ముద్దాయిలను పట్టుకోవాల్సి ఉందని, వారిని త్వరలోనే పట్టుకుని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. స్వా«దీనం చేసుకున్న నకి లీ నోట్లలో 500,200 నోట్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతానికి దొంగ నోట్లు చేతులు మారలేదని, దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. ముద్దాయిలను టెక్కలి కోర్టులో హాజరుపరిచారు. పాతపట్న ం సీఐ రామారావు, మెళియాపుట్టి ఎస్సై రమేష్ బా బు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
రామ్మోహన్ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు!
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర లక్షల్లో వసూలు వేసి వారిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ..‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు.బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలకు గురిచేస్తున్నాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. రమణ ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కి కూడా రమణ సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ విమర్శించింది. 💣 Truth Bomb 💣శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణశిక్షణ పేరుతో సెంటర్… pic.twitter.com/CdcgSdJUJE— YSR Congress Party (@YSRCParty) December 6, 2024 -
ఫోన్ చేసి అడుగుతారంట.. అసలు ఉంటేనే కదా!: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
శ్రీకాకుళం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమావేశం
-
జిల్లాల్లో పర్యటిస్తా.. అక్కడే నిద్ర చేస్తా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆరు నెలల్లో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని.. రాష్ట్రంలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వైద్యరంగం పరిస్థితి దయనీయంగా ఉందని.. వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయిన వైఎస్ జగన్.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరునెలలు కావస్తోంది. ఆరునెలల కాలంలోనే ఇంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేదు. తొలిసారిగా చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో మనమంతా కలిసికట్టుగా ఏం చేయాలని ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాం. మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాల్టికి కూడా మన జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు ఏ గ్రామానికైనా, ఏ ఇంటికైనా ఈ మంచి చేశామని చెబుతూ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం. సగర్వంగా..కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రమే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేసిందని మనం సగర్వంగా చెప్పగలం. మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మేనిఫెస్టో అని రంగు, రంగులు కాగితాలు ఇచ్చి దాన్ని ఎన్నికలు అయిపోగానే చెత్తబుట్టలో పడేసే పరిస్థితుల నుంచి.. తొలిసారిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మనం తూచ తప్పకుండా అమలు చేశాం.వైఎస్సార్సీపీ హయాంలో మాత్రమే ఇలా..మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తూ... అందులో 99శాతం వాగ్దానాలు అమలు చేశాం. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే ఏ పధకం ఏ నెలలో ఇస్తామో ముందుగానే బడ్జెట్ తో పాటు సంక్షేమ కేలండర్ ను విడుదల చేసి క్రమం తప్పకుండా ఆ నెలలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేశాం. చరిత్రలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రమే ఇలా జరిగింది.ఈ మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తుందిఆ రకమైన మంచి మనం చేశాం. ఆ రకమైన మంచి చేసినా కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అందుకు కారణాలు ఏమైనా వాటిని పక్కనపెడితే.. మనకు గత ఎన్నికల్లో 50 శాతం ఓట్ షేర్ వస్తే ఈ సారి 40 శాతం వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి పలావు పెట్టాడు. కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు కాబట్టి పొరపాటున చేయి అటువైపు పోయింది. తీరా ఇవాల చూస్తే పలావు పోయింది, బిర్యానీ కూడా లేదు అన్న మాట ప్రతి ఇంటిలోనూ వినిపిస్తుంది. కానీ మనం అలా చేయలేదు..ఆ రోజుల్లో మనం ఏ ఇంటికి పోయినా చిక్కటి చిరునవ్వుతో ఆహ్వానించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తీవ్రమైన ప్రచారం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంట్లో ఎవరు కనిపించినా.. చిన్న పిల్లలు కనిపిస్తే నీకు రూ.15వేలు అని వాళ్ల తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని, అంతకన్నా పెద్దవాళ్లు వాళ్ల అత్తగారు కనిపిస్తే నీకు రూ.48వేలు అని, ఆ ఇంట్లోంచి ఉద్యోగం చేసే వయస్సున్న పిల్లాడు వస్తే నీకు రూ.36 వేలు అని ఆ ఇంట్లో రైతు కండువా వేసుకుని బయటకు వస్తే నీకు రూ.20వేలు అని చెప్పారు. మనం కుటుంబం మొత్తానికి సహాయం చేస్తుంటే.. టీడీపీ వాళ్లు ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికీ సాయం చేస్తామని అబద్దాలు చెబుతున్నారని చాలా మంది నాతో కూడా చెప్పారు. కానీ మనం అలా చేయలేదు.అతి మంచితనం.. అతి నిజాయితీఇవాళ్టికి నా దగ్గరకు వచ్చిన మన ఎమ్మెల్యేలు, ఇన్ ఛార్జీలు.. మీ దగ్గర అతి మంచితనం, అతి నిజాయితీ ఈ రెండూ మనకు సమస్యలు అంటున్నారు. కానీ రేపు మరలా మనం ఈ గుణాలతోనే అధికారంలోకి వస్తాం. ఆరునెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్లలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్లినా చిన్నపిల్లలు నా రూ.15వేలు ఏమైందని.. రైతులు నా రూ.20వేలు ఏమైందని.. ఉద్యోగం కోసం వెతికే పిల్లలు నా రూ.36వేలు ఏమయ్యాయని అడిగే పరిస్థితి ఉంది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేటతెల్లం అవుతున్నాయి.తిరోగమనంలోకి స్కూళ్లు..మరో వైపు వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్న పరిస్థితులు. స్కూళ్లలో నాడు నేడు లేదు. ఇంగ్లిషు మీడియం లేదు. మన హయాంలో రోజుకొక మెనూతో భోజనం పెట్టే గోరుముద్ద ఉండేది. ఇవాళ అధ్వాన్న పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం ఉంది. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచర్లు, టోఫెల్ ఎత్తివేశారు. 8వతరగతి పిల్లల చేతుల్లో ట్యాబులు కూడా గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన హయాంలో ఆరోతరగతి నుంచి డిజిటిల్ క్లాస్ రూములు తయారు చేశాం. మన హయాంలో ప్రైవేటు స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీపడతాయా అన్న పరిస్థితి నుంచి... ఇవాళ పూర్తిగా తిరోగమనంలోకి స్కూళ్లు వెళ్లిపోయాయి.అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది..ఇవాళ గవర్నమెంటు బడులు మాకు వద్దు అని పేదవాడు అనుకునే పరిస్ధితుల్లోకి నెట్టేశారు. అమ్మఒడి గాలికి ఎగిరిపోయింది. విద్యాదీవెన, వసతి దీవెన కూడా ఇవ్వడం లేదు. ఇంజనీరింగ్, డిగ్రీ చదువుతున్న పిల్లలకు ప్రతి క్వార్టర్ ముగిసిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెల ఇచ్చేవాళ్లం. ఈ రోజు ఫీజు రీయింబర్స్ మెంట్ కు సంబంధించి నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన ఫీజులు బకాయిలు పెట్టారు. వసతి దీవెన గాలికెగిరిపోయింది. పిల్లలు చదువుకునే కాలేజీలు యాజమాన్యాలు మీరు ఫీజు కట్టకపోతే ఒప్పుకోమని వారిని ఇంటికి పంపిస్తున్నారు.దయనీయం.. ఆరోగ్యశ్రీ సేవలువైద్యరంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది. ఆరోగ్యశ్రీ సేవలు అందించే నెట్ వర్క్ ఆసుపత్రులకు మార్చి నుంచి ఇంతవరకు బిల్లులు చెల్లింపులేదు. మార్చి నుంచి నవంబరు వరకు లెక్కిస్తే.. ఇప్పటికీ ఇంకా రూ.2400 బకాయిలు ఉన్నాయి. నెట్ వర్క్ ఆసుపత్రులకు పేదలు వెళితే వైద్యులు మేం వైద్యం చేయలేమనే పరిస్థితి. 104,108 ఆగష్టు నుంచి బకాయిలు ఇవ్వడం లేదు. నడపలేని పరిస్థితి. కుయ్ కుయ్ మంటూ రావాల్సిన అంబులెన్స్‌లు చతికిలపడుతున్నాయి.మన ప్రభుత్వ హయాంలోఆరోగ్యశ్రీ పరిధిని 3350 రోగాలకు పెంచి రూ.25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఉండకూడదని జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్ల్యూహెచ్ ఓ, జీఎంపీ ప్రమాణాలతో మందులు ఇచ్చేలా మార్పులు తెచ్చాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ తీసుకొచ్చి, ప్రతి పదిహేను రోజులకొకమారు ఊరికే వచ్చి వైద్యం అందించే పరిస్థితి తీసుకొచ్చాం. ఇవాళ అంతా తిరోగమనం.వ్యవసాయ రంగం కుదేలువ్యవసాయ రంగం కూడా కుదేలైంది. ఆర్బీకేలు స్థాపించి, ఇ-క్రాప్ పెట్టి పారదర్శకంగా ప్రతి రైతుకు ఆర్బీకే ద్వారా ఉచిత పంటల బీమా పెట్టాం. దళారీ వ్యవస్థ లేకండా ధాన్యం నేరుగా రైతు వద్దకే వచ్చి కొనుగోలు చేసే కార్యక్రమం మనం చేస్తే... ఈరోజు ఏ రైతుకూ ధాన్యానికి కనీస మద్ధతు ధర రావడం లేదు. రూ.200 నుంచి రూ.300 తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఇ-క్రాప్ గాలికెగిరిపోయింది. పారదర్శకత పక్కకుపోయింది. తిరోగమనంలో వ్యవసాయం ఉంది.అసలు పథకాలుంటే కదా!డోర్ డెలివరితో ప్రతి పథకం ఇంటికి అందించే పాలన మనదైతే.. ఈ రోజు డోర్ డెలివరీ మాట, మంచి పాలన దేవుడెరుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చుట్టూ తిరిగితే తప్ప వచ్చే పరిస్ధితి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు. మళ్లీ పథకాలు ఎలా ఉన్నాయని హలో అని ఫోన్ చేసి అడుగుతామంటున్నారు.. అసలు పథకాలుంటే కదా.విచ్చలవిడిగా అవినీతి..విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. ఇసుక రేట్లు చూస్తే..మన కన్నా తక్కు రేట్లకు ఇస్తామన్నారు. మన హయాం కంటే రెట్టింపు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదు. మద్యం షాపులు ప్రభుత్వంలో ఉన్నవి తీసేశారు. ప్రతి గ్రామంలో వేలం వేసి రూ.2-3 లక్షలకు బెల్టుషాపులు నడుపుతున్నారు. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా... ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు. ఏ నియోజకవర్గంలో మైనింగ్ జరగాలన్నా, పరిశ్రమ నడవాలన్నా ఏం జరగాలన్నా ఎమ్మెల్యేకు ఇంత, ముఖ్యమంత్రికి,ఆయన కొడుకుకి ఇంత అని దోచుకోవడం, పంచుకోవడం జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇలాంటి దుర్మార్గమైన పాలన వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది.ప్రజల తరపున నిలబడాల్సిన సమయంఆరు నెలలు అయింది. మనం ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. ఆరు నెలల ప్రభుత్వ పాలన వేగంగా నడిచిపోయింది. జమిలి అంటున్నారు. అందరం చురుగ్గా ప్రజల తరపున పనిచేయాలి. ప్రజల తరపున గళం వినిపించాలి. మీ అందరినీ నేను ఒక్కటే కోరుతున్నాను. ప్రతిఒక్కరూ ప్రజలకేం కావాలి, వారికి తోడుగా అండగా ఉండాలి. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి.బలోపేతం చేసే దిశగా అడుగులురాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. నా జిల్లాల పర్యటన కార్యక్రమం సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి ప్రారంభం అవుతుంది.అక్కడే నిద్ర చేస్తాను. ప్రతి బుధవారం, గురువారం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండు రోజులు అక్కడే ఉంటాను. కార్యకర్తలతో మమేకం అవుతాను. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అన్న పేరుతో ఈ కార్యక్రమం చేస్తాను.ఇదీ చదవండి: వినేవాడుంటే... కథలు చెప్పేది కూటమి ప్రభుత్వమని..అన్యాయాన్ని ప్రశ్నించాలి..పార్టీ గట్టిగా నిలబడాలంటే ఆర్గనైజేషన్ బలంగా ఉండాలి. ప్రతి గ్రామంలోనూ, మండలంలోనూ, నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ బలంగా ఉంది. దీన్ని మరింత బలోపేతం చేయాలి. నా పర్యటనలోగా జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి పార్టీ కమిటీలు పూర్తి చేయాలి. నా కార్యక్రమం మొదలైనప్పుడు గ్రామ స్థాయి, బూత్ కమిటీల వరకు నియామకాలు పూర్తి చేద్దాం. ఈ కమిటీల పూర్తైన తర్వాత ప్రతి సభ్యుడికీ సోషల్ మీడియా మాధ్యమంలో ఉండే ట్విట్టర్, ఇన్ స్టా, ఫేస్ బుక్, వాట్సప్, యూట్యూబ్ అన్ని అకౌంట్లు ఉండాలి. మన గ్రామంలో ఏం జరుగుతున్నా అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఆసుపత్రిలో డాక్టర్ ఎందుకు లేడు? పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? అమ్మఒడి ఏమైంది? ఇలా ప్రతిదీ ఫోటో తీసి అప్ లోడ్ చేయాలి.ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలి..మనం కేవలం చంద్రబాబుతో యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తున్నాం. వీళ్లు ఆకాశం నుంచి ఒక అబద్దాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలు కట్టి ఇంత మందితో ప్రచారం చేస్తారు. ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవంలా పనిచేయాలి. మోసంతో అధికారంలో వచ్చిన వీళ్లు ప్రజల కోపానికి గురికాకతప్పదు. అప్పుడు వీళ్లు ఎంత దూరంలో పడతారంటే... తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం. మనం అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన సమయం ఇది. -
సిక్కోలు సమస్యలపై.. వైఎస్ జగన్ కీలక మీటింగ్
-
శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. శ్రీకాకుళం జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని కార్యాలయంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్‌తో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యేలు కళావతి, రెడ్డిశాంతి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నెలకొన్న సమస్యలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఇదే సమయంలో భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. -
నేడు శ్రీకాకుళం జిల్లా నేతతో వైఎస్ జగన్ సమావేశం
-
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్.. డిటెక్టివ్ టీజర్ చూశారా?
టాలీవుడ్ నటుడు వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. చంటబ్బాయ్ తాలుకా అనే ఉపశీర్షిక. ఈ సినిమాకు ప్రముఖ రచయిత మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో వెన్నెల కిశోర్ డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే క్రైమ్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వెన్నెల కిశోర్ యాక్టింగ్ ఫర్మామెన్స్తో తెగ ఆకట్టుకుంటోంది. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతమందిస్తున్నారు. -
ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం
కేఎల్ రాహుల్ క్లాసిక్ షాట్లను దగ్గరుండి చూడొచ్చు. మిచెల్ స్టార్క్ బులెట్ యార్కర్ల గుట్టు తెలుసుకోవచ్చు. హ్యారీ బ్రూక్ పరుగుల దాహం వెనుక రహస్యం తెలుసుకోవచ్చు. ఫాఫ్ డూప్లెసిస్ అనుభవాలను తెలుసుకుని పునాదులు పటిష్టం చేసుకోవచ్చు. జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్‌కు బంగారం లాంటి అవకాశం తలుపు తట్టింది. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి అడుగుపెట్టబోతున్న విజయ్‌కు అనుభవజు్ఞల ఆటతీరు మార్గదర్శకం కాబోతోంది. టీమిండియాలోకి ప్రవేశించేందుకు ఇది తొలి అడుగు కానుంది. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్టార్ క్రికెటర్ త్రిపురాన విజయ్ ఐపీఎల్లో అడుగుపెట్టబోతున్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో రిజిస్టర్ చేసుకున్న విజయ్ను ఢిల్లీ డేర్ క్యాపిటల్స్ జట్టు అదే ధరకు కొనుగోలు చేసింది. సౌదీ అరేబియాలో ఈ ఐపీఎల్ వేలం జరిగింది. వేలంలో డీసీ జట్టు కొనుగోలు చేసిందని తెలిశాక క్రికెట్ తల్లిదండ్రులు, జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా నిలకడగా రాణింపు.. విజయ్ పదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నా.. గత మూడే ళ్లుగా నిలకడ చూపిస్తున్నాడు. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి వచ్చిన పిలుపు మేరకు సెలెక్షన్స్ ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు. కుచ్‌బిహార్ ట్రోఫీ, విజయ్‌హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ ఆలీ క్రికెట్ టోరీ్నలు, రంజీల్లో రాణించడంతో బీసీసీఐ పెద్దల దృష్టిని ఆకర్షించడంతో ఐపీఎల్ ఎంపిక కచ్చితంగా జరుగుతుందని తల్లిదండ్రులతోపాటు జిల్లా క్రికెట్ సంఘ పెద్దలు ఆశించారు. వారి ఆశలు నిజమయ్యాయి.శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక క్రికెటర్ ఐపీఎల్‌కు చేరువ కావడం గర్వంగా ఉందని జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షులు పెద్దలు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్‌రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాదికి మరో ముగ్గురు నలుగురు క్రికెటర్లను తయారుచేస్తామని వారు చెబుతున్నారు. జిల్లా నుంచి ఒకే ఒక్కడు..జిల్లా నుంచి ఐపీఎల్ వరకు వెళ్లిన మొదటి క్రికెటర్‌గా త్రిపురాన విజయ్ గుర్తింపు అందుకున్నాడు. టెక్కలిలోని అయ్యప్పనగర్‌లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్యలు విజయ్ తల్లిదండ్రులు. తండ్రి సమాచారశాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి గృహిణి. ప్రస్తుతం విజయ్ టెక్కలిలోని ఓ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పాఠశాల దశలో క్రికెట్‌పైన మక్కువతో త్రిపురాన విజయ్ 2013–14లో అరంగ్రేటం చేశాడు. అంతర్ జిల్లాల నార్త్‌జోన్ అండర్–14 జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఉత్తమ ప్రదర్శనతో రాణించడంతో కడప క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటింగ్‌తోపాటు ఆఫ్‌స్పిన్ మ్యాజిక్‌తో విశేషంగా ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ట్రాక్ రికార్డ్2022–23, 2024–25 రెండు సీజన్లలో ప్రతిష్టాత్మక రంజీ పోటీల్లో పాల్గొనే ఆంధ్రా పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. అండర్–19 విభాగంలో ఏసీఏ నార్త్‌జోన్ పోటీల్లో 6 మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లు తీయడంతోపాటు 265 పరుగులు సాధించి ఉత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్ రాష్ట్ర అండర్–25 వన్డే క్రికెట్ టో రీ్నలో హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో 4.4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి సెలెక్టర్లను ఆకర్షించాడు. 2021–22లో అంతర్రాష్ట్ర అండర్–23 క్రికెట్ టోరీ్నలో మెరుగ్గా రాణించడంతో బీసీసీఐ నిర్వహిస్తున్న బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికై శిక్షణ పొందారు. ఆంధ్ర ప్రీమియం లీగ్(ఏపీఎల్) టీ–20 క్రికెట్ పోటీల్లో మూడు సీజన్లలోనూ రాణించా డు. రాయలసీమ కింగ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో 63 పరుగులు సాధించి అజేయంగా నిలిచి విశేషంగా ఆకట్టుకున్నాడు. బౌలింగ్లోను సత్తాచాచడంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నారు. ఏపీఎల్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌ల్లో బెస్ట్ ఫీల్డర్‌గా మరో రూ.50వేల నగదు బహుమతిని ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ చేతులమీదుగా అందుకున్నాడు. గత సీజన్లో నాగ్‌పూర్‌లో జరిగిన విదర్భపై తన మొదటి మ్యాచ్‌లోనే నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. తాజాగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.చాలా సంతోషంగా ఉంది మా కుమారుడు విజయ్ ఐపీఎల్‌కు ఎంపిక కావడం నిజంగా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులుగా మేము గర్వపడుతున్నాం. ఐపీఎల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం వస్తే తన ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. గత దశాబ్ద కాలంగా క్రికెట్టే శ్వాసగా ఉంటున్నాడు. భగవంతుడు శ్రమకు తగిన ఫలితాన్ని అందించాడని నమ్ముతున్నాం. –వెంకట కృష్ణంరాజు, లావణ్య త్రిపురాన విజయ్ తల్లిదండ్రులుచాలా గర్వంగా ఉంది.. చాలా గర్వంగా, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఐపీఎల్‌కు ఎంపిక కావాలన్న నా కల సాకారమైంది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ సెలక్షన్ ట్రయల్స్ పాల్గొన్నప్పుడే నమ్మకం కలిగింది. నా బేస్ ప్రైస్ రూ.30లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి, ప్రతినిధులకు థాంక్స్ చెప్పుకుంటున్నాను. అవకాశం లభించిన మ్యాచుల్లో సత్తా చాటేందుకు ప్రయతి్నస్తాను. ఈ నాలుగు నెలలపాటు కఠోర సాధన చేస్తాను. నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్న నా తల్లిదండ్రులకు, జిల్లా క్రికెట్ సంఘం, ఆంధ్రా క్రికెట్ సంఘ పెద్దలకు కృతజ్ఞతలు. త్రిపురాన విజయ్ -
‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు?
మహానది–గోదావరి నదుల మధ్య విస్తరించి యున్న భూభాగమే కళింగాంధ్ర. ఈ కళింగాంధ్రలోని అంతర్భాగం ఉత్తరాంధ్ర. ఇది ఇచ్ఛాపురం నుండి పాయకరావుపేట వరకు వ్యాపించి ఉంది. విస్తారమైన కొండకోనలు, అటవీ భూములు గల పచ్చని ప్రాకృతిక ప్రదేశం. ఇక్కడ నివసించే ప్రజలు కష్టపడే తత్వం గలవారు. మైదాన, గిరిజన, మత్స్యకార ప్రజల శ్రమతో సృష్టించబడిన సంపద పెట్టుబడి వర్గాల పరమౌతున్నది. దాంతో ఇక్కడి ప్రజలు అనాదిగా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ప్రాంతం వెనుకబడినది అనేకంటే, వెనుకకు నెట్టి వేయబడిందన్నమాట సబబుగా ఉంటుంది.ఒక వ్యక్తి కాని, ఒక సమూహం కాని ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి జీవనోపాధి నిమిత్తం కాల పరిమితితో సంబంధం లేకుండా వెళ్లడాన్ని వలస అనొచ్చు. అనాదిగా ఉత్తరాంధ్ర ప్రజలు అనుభవిస్తున్న ప్రధాన సమస్య ‘వలస’. ఇలా వలస వెళ్లినవారు ఆయా ప్రాంతాల్లో అనేక ఇడుములు పడటం చూస్తున్నాం. వీరికి ‘మేమున్నాం మీ వెంట’ అనే భరోసా ఇచ్చేదెవరు? మరో ముఖ్య సమస్య ఈ ప్రాంత భాష–యాస, కట్టు– బొట్టుపై జరుగుతున్న దాడి. నాగరికులుగా తమకు తాము ముద్రవేసుకొన్నవారు ఆటవికంగా ఉత్తరాంధ్ర జనాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణ సాంస్కృతిక భాషోద్యమంలాగా, ఉత్తరాంధ్ర సాంస్కృతిక భాషోద్యమం రావాలి. ఈ ప్రాంత వేషం–భాష అధికారికంగా అన్నిటా చలామణి కావాలి. తగువిధంగా గౌరవం పొందాలి. తెలంగాణ సాహితీవేత్తల వలె ఈ ప్రాంత కవులు, రచయితలు, కళాకారులు తమ మాండలిక భాషా సౌరభాలతో సాహిత్యాన్ని నిర్మించాలి.అనాదిగా ఈ ప్రాంతం పారిశ్రామికీకరణకు చాలా దూరంలో ఉంది. ఒక్క విశాఖపట్నం, పైడిభీమవరం తప్పితే ఎక్కడా పరిశ్రమల స్థాపన లేదు. ఉత్తరాంధ్ర అంతటా వ్యవసాయధారిత ఉత్పత్తుల పరిశ్రమల స్థాపన ఎక్కువగా జరగాల్సి ఉంది. అయితే రెడ్ క్యాటగిరీకి చెందిన కాలుష్య కారక పరిశ్రమల స్థాపన మాత్రం జరుగుతోంది. ఇవి ఉత్తరాంధ్ర ప్రజల జీవనానికి, మనుగడకు సవాల్ విసురుతున్నాయి.ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ఇండస్ట్రీని ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవాలి. ఉత్తరాంధ్రలో నిర్మించ తలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మాణ దశలోనే ఉన్నాయి. శతశాతం పూర్తయినవి దాదాపుగా లేవు. విశాఖ రైల్వే జోన్ ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. ఉత్తరాంధ్ర అంతట మారుమూల ప్రాంతాలను అనుసంధానం చేస్తూ రహ దారుల నిర్మాణం పెద్ద యెత్తున జరగాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఎక్కువగా ఉంది. ఇక్కడ అడవి బిడ్డలు పౌష్టికాహార లోపంతో రక్తహీనతకు గురై తీవ్ర అనారోగ్యం పాలౌతున్నారు. ఈ కొండకోనల్లో, అడవుల్లో విలువైన అటవీ సంపద ఉంది. అందువల్ల ఈ భూములపై గిరిజనులకు ప్రత్యేక హక్కులు ఉండాలి. 1/70 చట్టం అమలు సక్రమంగా జరగాలి. ఇక్కడ ఖనిజ సంపద అపారంగా ఉంది. దీనితో వచ్చే ఆదాయం గిరిపుత్రుల సంక్షేమానికే వినియోగించాలి. ఇక్కడ భూగర్భ జలాలలో కాల్షియం, ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉంది. కిడ్నీ, ఎముకల వ్యాధులతో తరచూ బాధపడటం చూస్తాం. అందువల్ల ఇక్కడి ప్రజలకు మంచినీరు అందివ్వాలి. నిర్మాణంలో ఉన్న పోర్టులను, హార్బర్లను వేగవంతం చేయాలి.చదవండి: రైతులు అడగాల్సిన ‘మహా’ నమూనాకార్మికులలో 90 శాతానికి పైబడి అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో భవన నిర్మాణ రంగంలోనే అధికంగా ఉన్నారు. వీరి భద్రతకు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల జీవనస్థితిగతులు మెరుగవ్వాలంటే, విభజన చట్టం సెక్షన్ 94(3)లో పేర్కొన్న విధంగా ఉత్తరాంధ్రకు ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. అది వెనుకబడిన బుందేల్‌ఖండ్, కోరాపుట్, బోలంగిర్, కలహండి తరహాలో ఉండాలి.చదవండి: మంచి పనిని కించపరుస్తారా?ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద పట్టణం విశాఖపట్నం. ఈ పట్టణం ఇతర ప్రాంతాల పెట్టుబడి వర్గాల గుప్పిట ఉంది. విశాఖను మాత్రమే అభివృద్ధి చేస్తే ఒనగూరే లాభమేమిటి? నిజంగా ఈ ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడుతుందా అనేది మాత్రం శేషప్రశ్నే. ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి గతంలో జరిగిన వివిధ వామపక్ష, అస్తిత్వ జీవన పోరాటాల వలె మరికొన్ని ఉద్యమాలు రావాల్సి ఉందేమో!- పిల్లా తిరుపతిరావు తెలుగు ఉపాధ్యాయుడు -
నాలుగు నెలల్లోనే బాబు సర్కార్ ఘోర వైఫల్యం: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీకాకుళం: పలాసలో లైంగికదాడికి గురైన బాలికల కుటుంబాన్ని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో బాలికలపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామన్నారు.‘‘నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లో భారీగా పెంచారు. చంద్రబాబుకు అబద్దాల చెప్పడం ఎప్పుడూ అలవాటే. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ నిర్మించిన, ఇక్కడ ప్రజలకు 700 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’’ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. -
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో టీడీపీ బరితెగింపు
-
కూటమి ప్రభుత్వంలో ఆగని అఘాయిత్యాలు
-
బిగ్ బాస్ 'ప్రియాంక సింగ్' ఇంట్లో విషాదం
బుల్లితెర నటి ప్రియాంక సింగ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున ఆమె తండ్రి బీబీ సింగ్ మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుది శ్వాస విడిచారు. తన తండ్రి మరణించారని సోషల్ మీడియా ద్వారా ప్రియాంక సింగ్ ఒక పోస్ట్ పెట్టింది. దీంతో ఆమె స్నేహితులు, అభిమానులు ధైర్యంగా ఉండాలని ఓదార్చుతున్నారు.శ్రీకాకుళానికి చెందిన ప్రియాంక సింగ్ ట్రాన్స్‌జెండర్ అని తెలిసిందే. సాయితేజగా ఉన్న తను లింగమార్పిడి చేయించుకుని ప్రియాంక సింగ్‌గా మారిపోయారు. అయితే, తాను ట్రాన్స్ జెండర్‌గా మారిన విషయం మొదట తల్లిదండ్రులకు చెప్పలేదు. చాలా కాలం పాటు తన తండ్రి వద్ద ఈ విషయాన్ని దాచారు. అయితే, బిగ్‌బాస్5 హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తానొక ట్రాన్స్‌జెండర్ అనే విషయం తన తండ్రికి తెలియాలని ఎమోషనల్ అయ్యారు. బిగ్‌బాస్ వేదికగా తన తండ్రికి తాను ట్రాన్స్ జెండర్ చేయించుకున్నట్టు, అమ్మాయిగా మారిపోయినట్టు తెలిపారు.కొంత కాలం తర్వాత ప్రియాంక సింగ్ నిర్ణయాన్ని బీబీ సింగ్ కూడా గౌరవించారు. తన తండ్రికి ఓ ప్రమాదంలో కళ్లుపోతే .. అన్నయ్యలు, చెల్లెల్లు తమకు పట్టనట్లు ఉండటంతో తానే తల్లిదండ్రుల బాధ్యతలు స్వీకరించినట్లు ప్రియాంక చెప్పింది. ఈ క్రమంలో వారికి ప్రియాంక సొంత ఇల్లు కూడా కట్టించారు. ఎంతో ఇష్టమైన తన తండ్రి మరణంతో ప్రియాంక సింగ్ కన్నీటి పర్యంతం అవుతున్నారు. -
అమ్మానాన్నను విడిచి ఉండలేక.. జడ రిబ్బనతో చిన్నారి ఆత్మహత్య
శ్రీకాకుళం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి ఉండలేక ఏడవ తరగతి విద్యార్థిని తనువు చాలించింది. పాతపట్నం నియోజకవర్గంలోని మెలియపుట్టి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో లావణ్య ఏడవ తరగతి చదువుతుంది.అయితే ఇటీవల దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన లావణ్యను గురువారం ఆమె తల్లిదండ్రులు స్కూల్లో విడిచి పెట్టి ఇంటికి వెళ్లారు. దీంతో తల్లిదండ్రుల్ని విడిచి పెట్టి దూరంగా ఉండలేక లావణ్య మనోవేధనకు గురైంది. తల్లిదండ్రులు వెళ్లిన గంట తర్వాత జడ రిబ్బన తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తోటి విద్యార్థులు టీచర్‌కు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారిని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.ఈ విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
పేదలపై కక్ష! దుర్మార్గంగా టీడీపీ నేతలు
-
మరో మూడు జిల్లాలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. మరో మూడు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులుగా ధర్మాన కృష్ణదాస్, విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులుగా తమ్మినేని సీతారాం నియమితులయ్యారు.ఇదీ చదవండి: ఎల్లో మీడియాకు నటి కాదంబరీ జత్వానీ ఝలక్కాగా, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, (ఎమ్మెల్సీ), నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్‌రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ నియమితులయిన సంగతి తెలిసిందే. -
మూడు జిల్లాల నేతలతో వైఎస్ జగన్ భేటీ
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నేతలతో తన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి వచ్చిన ముఖ్య నేతలతో ఆయన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లా అధ్యక్షుల నియామకాలు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. -
లావేరు మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న అదపాక గెడ్డ
-
టీడీపీ గూండాల దాడిలో YSRCP కార్యకర్త మృతి
-
అర్ధరాత్రి పచ్చ మూక అరాచకం.. వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. పచ్చ బ్యాచ్ దాడుల్లో మరో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతిచెందాడు. పది మంది టీడీపీ కార్యకర్తలు కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ తీవ్ర గాయాల కారణంగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కాగా, పచ్చటి పల్లెలో రాజకీయ చిచ్చు రేగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఎక్కడో ఒక చోట వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పచ్చ మూకల దాడులు జరుగుతూనే ఉన్నాయి. గత ఆదివారం ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట గ్రామంలో రాత్రి 11.15 గంటల సమయంలో వైఎస్సార్సీపీ కార్యకర్త కూన ప్రసాద్‌పై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ప్రసాద్ ఈరోజు తెల్లవారుజామున మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు.. ప్రసాద్ మరణ వార్త విని మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.అర్దరాత్రి అరాచకం.. టీడీపీ వర్గానికి చెందిన కొందరు ఆదివారం రాత్రి జాతీయ రహదారి పక్కనే ఉన్న దాబా హోటల్లో బర్త్‌డే పార్టీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైక్‌లపై గ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కూన ప్రసాద్ తన బండిపై రామ చెరువు వైపు వెళ్తూ.. వారికి ఎదురుపడడంతో వారంతా ఒక్కసారిగా బైక్ ఆపి తాళం తీసుకుని మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. పది మంది కర్రలతో విచక్షణారహితంగా కొట్టడంతో ప్రసాద్ భయంతో పరుగులు తీశాడు. అయినా వదలకుండా వెంటాడి మరీ కొట్టారు. చివరకు బీసీ కాలనీలోని సూర కృష్ణమూర్తి అనే వ్యక్తి ఇంటి టెర్రస్‌పైకి ఎక్కితే.. అక్కడకూ వచ్చి దాడి చేశారు. దాడిలో దెబ్బలకు తాళలేక అపస్మారక స్థితికి చేరటంతో విడిచి పెట్టి వెళ్లిపోయారు.అనంతరం గ్రామంలో పికెట్ నిర్వహిస్తున్న పోలీసులకు విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ ఆధ్వర్యంలోని సిబ్బంది అక్కడకు వచ్చారు. అనంతరం 108 వాహనంలో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో పోలీస్ పికెట్ బందోబస్తు సిబ్బంది సంఖ్య పెంచారు. -
ఆ తీరమంతా..సువాసనంట
ఆ వంశధార తీరానికి చేరుతూనే బిర్యానీ సువాసన స్వాగతమంటూ పిలుస్తుంది. ఊరి పొలిమేరలోనే ఆ వాసనకు కడుపులో జఠరాగ్ని రాజుకుంటుంది. ఒక్కో వీధి దాటుకుంటూ వెళ్తుంటే ఆకలి అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఎర్రగా కారం పట్టిన మాంసం ముక్కను మధ్యలో దాచుకున్న ఓ బిర్యానీ ముద్ద నాలిక కొసన తగలగానే కడుపు, మనసు రెండూ ఆనందాన్ని ప్రకటించేస్తాయి. వసప బిర్యానీ చేసే మాయ ఇది. 200 గడపలుండే ఈ చిన్న ఊరు బిర్యానీకి పెట్టింది పేరు.కొత్తూరు: కొత్తూరు నుంచి నివగాం వెళ్లే పాలకొండ–హడ్డుబంగి రోడ్డుకు ఆనుకుని ఉండే చిన్న గ్రామం పేరే వసప. కొత్తూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. ఊరు చిన్నదే అయినా నిత్యం ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్, హడ్డుబంగి, కాశీనగర్, పర్లాఖిమిడితో పాటు ఉమ్మడి జిల్లాలోని కొత్తూరు, పాతపట్నం, పలాస, పాలకొండ, సీతంపేట, హిరమండలం, భామినితో పాటు జిల్లా కేంద్రం శ్రీకాకుళం వాసులు కూడా నిత్యం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడి బిర్యానీ రుచి అలాంటిది మరి. శ్రీకాకుళానికి వీఐపీలు ఎవరు వచ్చినా ఇక్కడి నుంచి పొట్లాలు పట్టుకెళ్లాల్సిందే. నాణ్యమైన బియ్యం, మసాలా ది నుసుల వాడకమే ఇక్కడి రుచికి కారణమని తయారీ దారులు చెబుతుంటారు. వసప గ్రామంలో మొదటి సారిగా బిర్యానీ పెట్టిన కొయిలాపు వెంకటరావు దగ్గర రుచి భలేగా ఉంటుందని తిన్నవారు చెబుతుంటారు. ఆ రోడ్డుపక్కగా వెళ్తూ బిర్యానీ కొనని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఉదయం 10 గంటలు నుంచి రాత్రి వరకు అక్కడ బిర్యానీ ఘుమఘుమలాడుతూనే ఉంటుంది. కార్తీకం వచ్చిదంటే చాలు ఇక్కడ ఖాళీ ఉండదు. శుభకార్యాల భోజనాలు, యువకులు పార్టీల కోసం వసపనే ఆశ్రయిస్తారు. అక్కడ మొత్తం 8 బిర్యానీ పాయింట్లు ఉన్నాయిప్పుడు.హైదరాబాద్‌లో నేర్చుకున్నా..దమ్ బిర్యానీ కోసం ముందుగా వేడి చేసిన నీటిలో బియ్యం ఎసరు పెడతాను. మసాలా దినుసులు మంచి కంపెనీలవి తీసుకుంటాను. నాణ్యమైన బియ్యం కొనుగోలు చేస్తాను. వీటితో నా శైలిలో దమ్ బిర్యానీ తయారు చేస్తాను. నేనూ హైదరాబాద్‌లోనే ఈ విద్య నేర్చుకున్నాను. – కొయిలాపు వెంకటరావురుచి అమోఘంవసప బిర్యానీ చాలా బాగుంటుంది. ఒడిశా నుంచి వచ్చి కొంటూ ఉంటాను. వెంకటరావు దగ్గర బిర్యానీ మరింత రుచికరంగా ఉంటుంది.– పి.రవి, హడ్డుబంగి, ఒడిశా -
వద్దన్నా వచ్చేవాడు.. పైన చేతులు వేసి
-
కనుమరుగవుతున్న బుడితి కళాకారులు..
-
ఆ యాప్‌లు చెల్లవు
కరెంటు బిల్లు.. పాతపట్నం:విద్యుత్ బిల్లుల చెల్లింపులో కీలకమైన మార్పులు జరిగాయి. డిజిటలైజ్ అయ్యాక చాలా మంది విద్యుత్ బిల్లులను ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐల ద్వారా నేరుగా కట్టేసేవారు. కానీ ఇప్పుడలా కుదరదు. యూపీఐ యాప్ ల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపులకు ఏపీఈపీడీసీఎల్ స్వస్తి పలికింది. ఇక నుంచి కేవలం ఏపీఈపీడీసీఎల్ వెబ్ సైట్, ఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్‌ల ద్వారా మాత్రమే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ పార్టీ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీల ద్వారా చెల్లింపులకు నో చెప్పింది. ఇందుకోసం ఈస్ట్రన్ పవర్ మొబైల్ యా ప్ను సిద్దం చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్త నిబంధనల నేపథ్యంలో ఇకపై ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, యాప్ ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని సీఎండీ పృథ్వీతేజ్ ఆదేశాలు జారీ చేశారు.కొత్త మార్గదర్శకాలువిద్యుత్ బిల్లులను చాలామంది వినియోగదారులు కౌంటర్లలో చెల్లిస్తారు. గ్రామాల్లో నెలకు ఒకసారి ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించిన సిబ్బంది వచ్చి కట్టించుకుంటున్నారు. మరి కొందరు విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వెబ్సైట్, మొబైల్ యాప్ లలో చెల్లిస్తున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలన్నీ వాటి నుంచే జరుగుతున్నాయి. ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఆర్బీఐ భారత్ బిల్ పేమెంట్స్ మార్గదర్శకాల ప్రకారం నేరుగా యాప్‌ల నుంచి చెల్లింపులను నిలిపివేశారు.పేమెంట్ సులభంసాధారణంగా యాప్‌ల ద్వారా బిల్లు చెల్లించడం చాలా సులువుగా ఉండడంతో చాలా మంది వినియోగదారులకు ఆ విధానంలో కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఈపీడీసీఎల్ బిల్లుల చెల్లింపు విషయంలో కూడా సులభమైన పేమెంట్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మేర కు ఏపీఈపీడీసీఎల్ వెబ్సైట్, మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. ఇప్పటికే వీటిని ప్రజలకు చేరువ చేసింది.డౌన్లోడ్ చేసుకునే విధానంAఆన్లైన్లో విద్యుత్ బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. దీని ద్వారా చాలా సులభంగా బిల్లులు కట్టవచ్చు.A వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలనుకునే వినియోగదారులు డబ్లూడబ్లూడబ్లూ.ఏపీఈస్ట్రన్పవర్.కమ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.A యాప్, వెబ్సైట్లలో బిల్లులు చెల్లించేటప్పుడు వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లతో పాటు డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లను కూడా ఉపయోగించుకోవచ్చు. విద్యుత్ బిల్లుల చెల్లింపులో కొత్త నిబంధనలుఫోన్పే, గూగుల్‌పే, పేటీఎంలతో ఇక కుదరదుఈస్ట్రన్ పవర్ మొబైల్ యాప్, వెబ్సైట్ ద్వారా బిల్లుల చెల్లింపులుచాలా సులువుఈస్ట్రన్ పవర్ యాప్‌ను, వెబ్సైట్ల ద్వారా వినియోగదారులు చాలా సులభంగా విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. ఈ మేరకు పాతపట్నంతో పాటు, టెక్కలి డివిజన్, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ద్వారా అధికారులు అవగాహన కల్పిస్తున్నాం. ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి సంస్థ ఈ విధమైన చర్యలు చేపట్టింది.– జి.ప్రసాదరావు,డీఈఈ, విద్యుత్‌శాఖ, పాతపట్నం -
ఆగని టీడీపీ గుండాల దాడులు పచ్చని పల్లెలో కక్ష పెట్టిన "కారు" చిచ్చు
-
"మా జీతాలు ఎక్కడ ?" రిమ్స్ ఉద్యోగుల నిరసన
-
శ్రీకాకుళంలో తండేల్
శ్రీకాకుళంలో ల్యాండ్ అయింది ‘తండేల్’ టీమ్. నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ (2021) చిత్రం తర్వాత నాగచైతన్యతో ఈ సినిమా కోసం మళ్లీ జోడీ కట్టారు సాయి పల్లవి. ‘ప్రేమమ్’ (2016), ‘సవ్యసాచి’ (2018) చిత్రాల తర్వాత నాగచైతన్యతో దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది.2018లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సెమీ పీరియాడికల్ ఫిల్మ్‌లో జాలరి రాజు పాత్రలో నాగచైతన్య, సత్య పాత్రలో సాయి పల్లవి కనిపిస్తారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ శ్రీకాకుళంలో ఆరంభం అయింది. ఈ షెడ్యూల్లో నాగచైతన్య, సాయి పల్లవిపై లవ్, ఎమోషనల్ సీన్స్ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
కూన ఎక్కడ..?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన కింజరాపు రామ్మోహన్నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటనలో మాజీ విప్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కనిపించలేదు. ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయ్యారా? మరేదైనా కారణం ఉందా అన్నది తెలీదు గానీ టీడీపీలో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కూన రవికుమార్ గుర్రుగా ఉండటం వల్లనే రాకపోయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.మంత్రి పదవిపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాళింగ సామాజిక వర్గం నుంచి తప్పనిసరిగా కేబినెట్లో బెర్త్ ఖాయమని భావించారు. కానీ అంచనాలు తలకిందలయ్యాయి. కింజరాపు ఫ్యామిలీకి ఇచ్చేందుకే మొగ్గు చూపారే తప్ప కూన రవికుమార్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కాళింగ సామాజిక వర్గమంతా గుర్రుగా ఉంది. ప్రెస్మీట్లు, సమావేశాలు పెట్టి నిరసన కూడా తెలియజేశారు. చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తంచేయడమే కాకుండా సమయం వచ్చి నప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాళింగులు ఎన్ని చేసినా ఫలి తం కనిపించడంలేదు. చంద్రబాబు నుంచి సాను కూలత రావడం లేదు. చిన్నా చితకా పదవి ఇచ్చి సరిపుచ్చుకునేలా ఉన్నారు. ఈ క్రమంలో భారీ ఆశలు పెట్టుకున్న కూన రవికుమార్ కూడా ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిస్తే తమకిచ్చే గౌరవమిదా అని ఆయన వర్గీయులు బాధపడుతున్నారు.కూన రవికుమార్‌తో పాటు కాళింగ సామాజిక వర్గమంతా అసంతృప్తితో ఉన్న వేళ.. జిల్లాలోకి అడుగు పెట్టిన కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు స్వాగతం పలికేందుకు ఒక వర్గం హాజరు కాలేదు. సోమవారం రాత్రి జరిగిన ఆత్మీయ సభలోనూ పాల్గొనలేదు. మంగళవారం జిల్లా అధికారులతో జరిగిన తొలి సమావేశం ప్రాంగణానికి కూడా రాలేదు. ఏడు రోడ్ల కూడలి వద్ద మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సభకు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీ హాజరయ్యారు. కానీ, కూన రవికుమార్, బెందాళం అశోక్ ఎక్కడా కనిపించలేదు. మంగళవారం జెడ్పీలో జరిగిన అధికారుల సమావేశంలో కూడా వీరిద్దరూ పాల్గొనలేదు. కాళింగ సామాజిక వర్గానికి మొండి చేయి చూపారన్న అసంతృప్తితో ఉద్దేశకపూర్వకంగా గైర్హాజరయ్యారా? లేదంటే మరే కారణం చేతో రాలేదా? అన్నది తెలియదు గాని పార్టీ శ్రేణులు మాత్రం కాళింగులకు జరిగిన అవమానం వలనే దూరంగా ఉండి ఉండవచ్చని అని చర్చించుకుంటున్నాయి. -
పసుపు బిళ్ల .. అచ్చెన్న తొలి జెల్ల!
‘ నేను మాటిస్తున్నాను.రేపు అధికారులకు సమావేశం పెట్టి చెబుతాను.రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరకు వెళ్లినా..ఎమ్మార్వో దగ్గరకు వెళ్లినా.. ఎండీఓ దగ్గరకు వెళ్లినా..ఏ ఆఫీసుకు వెళ్లినా..మీరు పసుపు బిళ్ల పెట్టుకుని వెళ్లండి.మీకు గౌరవంగా కుర్చీ వేసి, టీ ఇచ్చి.. మీ పనేంటి అని అడిగి మీ అందరికీ పనిచేయించే విధంగా అధికారులను లైనులో పెడతాను.ఎవరైనా ఒకరో ఇద్దరో నా మాటకు జవదాటితే ఏమవుతారో వాళ్లకు నేను చెప్పవలసిన అవసరం లేదని తెలియజేస్తున్నా’..కార్యకర్తల ఆత్మీయ సభ, ఉద్యోగుల తొలి సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి.ఇప్పుడీ వ్యాఖ్యలు ఉద్యోగ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియానూ కుదిపేస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇప్పుడే కాదు గతంలో పలు సందర్భాల్లో అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీలోనూ, ఇటు రాష్ట్రంలో సంచలనంతో పాటు వివాదాస్పదమైన సందర్భాలు ఉన్నాయి. కొత్తగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి జిల్లాకొచ్చాక చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా ఉద్యోగ వర్గాలను కుదిపేశాయి. టీడీపీ శ్రేణులను ప్రభుత్వ కార్యాలయాలకు దూకుడుగా వెళ్లేలా ప్రోత్సహించేలా ఉన్నాయి.అచ్చెన్నాయుడుకు మంత్రిగా పనిచేయడం కొత్తేమీ కాదు. 2014–19లో కూడా పనిచేశారు. అప్పట్లో కూడా కాస్త కటువుగా మాట్లాడిన సందర్భాలున్నాయి. అయితే ఈ సారి అలా ఉండబోరని, ఉద్యోగులతో స్నేహ పూర్వకంగా ఉంటారని ఆయా వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చిన తొలి పర్యటనలోనే ఉద్యోగులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఆయా వర్గాలు స్వీకరించలేకపోతున్నాయి. జాగ్రత్తగా పనిచేయండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకు రండి, ప్రజల్ని ఇబ్బంది పెడితే చర్యలు ఉంటాయి, ఏదైనా పనుల కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వస్తే చూసి చేయండి, ప్రభుత్వ లైన్లో పనిచేయండి అనే విధంగా ఎవరైనా మాట్లాడుతారని.. కానీ అందుకు భిన్నంగా అచ్చెన్నాయుడు హెచ్చరిస్తూ మాట్లాడటాన్ని ఉద్యోగ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.‘టీడీపీ కార్యకర్తలు ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాలకు మెడలో పసుపు బిళ్ల వేసుకుని వెళ్లండి. అధికారులు మీకు కుర్చీ వేసి, టీ ఇచ్చి పని ఏంటి అని అడిగి ఆ పనిని చేసి పంపిస్తారు. ఎవరైనా అధికారులు మాట వినకపోతే ఏం జరుగుతుందో వాళ్లకు తెలుసు’ అని కార్యకర్తల ముందు చెప్పడం సరికాదని ఉద్యోగులు బాధపడుతున్నారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే బెదిరింపు ధోరణిగానే ఉన్నాయని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అచ్చెన్నాయుడు చేసిన సంచలన వ్యాఖ్యలు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే సంచలనమయ్యాయి. సోషల్ మీడియాలోనైతే హల్చల్ చేశాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా జరిగాయి. -
కింజరాపు ఫ్యామిలీకి డబుల్ బొనాంజా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కింజరాపు ఫ్యామిలీ జాక్‌పాట్ కొట్టింది. అబ్బాయి రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కగా.. బాబాయి అచ్చెన్నాయుడికి రాష్ట్ర మంత్రి పదవి లభించింది. మొత్తమ్మీద వెలమ సామాజిక వర్గానికే చంద్రబాబు పెద్దపీట వేశారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు సీనియారిటీని పరిగణనలోకి తీసుకు ని కేబినెట్లో చోటు కలి్పంచారు. జిల్లా నుంచి ఒకే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో మిగతా ఆశావహులంతా నిరాశకు గురి కాక తప్పలేదు. వారి ఆశలపై నీళ్లు.. వివిధ జిల్లాల్లో ఇద్దరేసి మంత్రులను నియమించినా మన జిల్లా నుంచి ఆ చాన్స్ ఇవ్వలేదు. కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష ప్రధానంగా మంత్రి పదవి ఆశించినప్పటికీ వారి ఆశలపై నీళ్లు జల్లి అచ్చెన్నాయుడికే అగ్రతాంబూలం ఇచ్చారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, వరుసగా మూడు సార్లు గెలిచిన నేతగా, ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడంతో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి అచ్చెన్నాయుడికి బెర్త్ కేటాయించారు. తన అన్న కుమారుడైన ఎంపీ రామ్మోహన్నాయుడికి కేంద్రమంత్రి పదవి ఇవ్వడంతో అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కుతుందో లేదో అన్న ఉత్కంఠ మంగళవారం అర్ధరాత్రి వరకు సాగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ మంత్రి పదవులు ఇవ్వరేమో అన్న సందేహాలుండేవి. వాటిన్నింటినీ పటాపంచలు చేసి, సామాజిక సమీకరణాలు కన్నా కింజరాపు ఫ్యామిలీతో సాన్నిహిత్యానికే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రం సంబంధం లేకుండా ఒకే ఫ్యామిలీకి మంత్రి పదవులిచ్చేశారు. అచ్చెన్నాయుడు 2014–19లో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. హ్యాట్రిక్ విజయాలు.. టెక్కలి నియోజకవర్గం కోటబోమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో దాలినాయుడు, కళావతమ్మ దంపతులకు 1971 మార్చి 26న అచ్చెన్నాయుడు జని్మంచారు. ఏడుగురు సంతానంలో ఈయనొకరు. భార్య విజయమాధవి, పిల్లలు కృష్ణమోహన్‌నాయుడు, తనూజ ఉన్నారు. డిగ్రీ విద్యా ర్హత గల అచ్చెన్నాయుడు తన సోదరుడు ఎర్రం నాయుడు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చి హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు విజయం సాధించగా, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత టెక్కలి నుంచి 2009లో కొర్ల రేవతీపతి చేతిలో ఓట మి పాలయ్యారు. తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించారు. -
కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులో పెద్ద బాధ్యతలు అందుకున్నారు. టీడీపీ నాయకులు ప్రేమగా రాము అని పిలుచుకునే రామ్మోహన్ నాయుడిని 36 ఏళ్ల వయసులోనే కేంద్ర మంత్రి పదవి వరించింది. నరేంద్ర మోదీ మూడోసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ఆదివారం రాత్రి క్యాబినెట్ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు దక్కించుకున్న రామ్మోహన్నాయుడు.. జిల్లాలో ఎంపీగా హ్యాట్రిక్ కొట్టారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయనకు క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి దక్కింది. 36 ఏళ్ల వయస్సులో.. ఎంపీ రామ్మోహన్నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు 37 ఏళ్ల వయస్సులో కేంద్రమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తనయుడు 36 ఏళ్ల వయస్సులోనే కేంద్ర మంత్రి పదవిని అలంకరించారు. దీంతో జిల్లా నుంచి కేంద్ర మంత్రి బాధ్యతలు నిర్వర్తించిన వారి సంఖ్య మూడుకు చేరింది. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఎర్రన్నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనా శాఖ మంత్రిగా పనిచేశారు. 2011లో కిల్లి కృపారాణి ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అలాగే, ఉమ్మడి శ్రీ కాకుళం జిల్లాలోని పాలకొండ, ఉణుకూరు నియోజకవర్గాలు కలిసి ఉన్న పార్వతీపురం ఎంపీగా ఎన్నికైన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కూడా చరణ్‌సింగ్(1979–80), మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(2011–2014)లో కేంద్ర ఉక్కు, గనుల, బొగ్గు శా ఖా మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా పనిచేశారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడక ముందు పాతపట్నం లోకసభ నుంచి గెలిచిన వీవీ గిరి కూడా ఆ తర్వాత ఎన్నికైన సందర్భంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.కుటుంబ నేపథ్యం.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు, విజయకుమారి దంపతులకు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో 1987 డిసెంబర్ 18న రామ్మోహన్నాయుడు జని్మంచారు. ఈయనకు సోదరి భవానీ ఉన్నారు. ఈమె 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన బాబాయ్ అచ్చెన్నాయుడు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు టీడీపీలో కీలక నేతగా కొనసాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో రామ్మోహన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు. మాజీ మంత్రి, విశాఖ జిల్లా టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి కుమార్తె శ్రావ్యను 2017లో వివాహమాడారు. వీరికి నిహిర అన్వి, శివాంకృతి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం రామ్మోహన్నాయుడు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు శ్రీకాకుళంలోని గురజాడ ఎడ్యుకేషన్ సొసైటీ హాస్టల్లో చదువుకున్నారు. 1994లో ఎర్రన్నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్‌గా ఎన్నికవ్వడంతో హైదరాబాద్‌కు మకాం మార్చారు. దీంతో 4,5వ తరగతులు హైదరాబాద్‌లోని భారతీయ విద్యా భవన్లో చదువుకున్నారు. 1996 లో ఎర్రన్నాయుడు లోకసభకు ఎన్నికవ్వడంతో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కుటుంబమంతా షిఫ్ట్ అయ్యింది. దీంతో రామ్మోహన్నాయుడు ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత అక్కడే ఉన్న లాంగ్ ఐలాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ కూడా చేశారు. సింగపూర్‌లో ఏడాది పాటు ఉద్యోగం చేసి తర్వాత ఢిల్లీకి వచ్చేశారు. ఢిల్లీలో ఒక ఇంటీరియర్ డెవలప్మెంట్ కంపెనీ మా ర్కెటింగ్ వ్యవహారాలు చూసేవారు. ఎర్రన్నాయుడు 2012లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉద్యోగం మానేసి శ్రీకాకుళం వచ్చేశారు. 2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు. 26 ఏళ్లకే ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు. అక్కడి నుంచి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 36 ఏళ్ల వయస్సులో కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. -
కుమారుడి మృతి తట్టుకోలేక..
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస పంచాయతీ చిన్న నారాయణపురం గ్రామానికి చెందిన దాసరి నిరోష అనే వివాహిత బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈమె కుమారుడు సాయివినీత్ మంగళవారం పాముకాటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. తన కుమారుడు కళ్లెదుటే కాలి బూడిదవ్వడంతో చూసి తట్టుకోలేకపోయిన ఆ తల్లి ఇక తానెందుకు బతకాలి అంటూ కుమిలిపోయి ఇంట్లో ఉన్న మాత్రలను అధిక మొత్తంలో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే టెక్కలి జిల్లాసుపత్రికి తరలించారు. చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
టీడీపీ నాయకుల హౌస్ అరెస్ట్ మూలపేట పోర్టుకు గట్టి భద్రత
-
నా ప్రాణాలు పోయిన పర్లేదు..రిగ్గింగ్ జరిగితే ఊరుకోను
-
అచ్చెన్న అడ్డాలో.. రక్త చరిత్ర
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: 👉 నిమ్మాడలో కింజరాపు కుటుంబానికి కాదని సర్పంచ్‌గా నామినేషన్ వేసిన కింజరాపు సూరయ్య... ఆయన ఇంటిలోనే హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు కుటుంబీకులకు వ్యతిరేకంగా నిలిచిన ఎచ్చెర్ల సూర్యనారాయణను చిట్టయ్యవలస తోటలో హత్యకు గురయ్యారు. 👉 కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు ఎమ్మెల్యేగా పోటీకి అడ్డుపడిన కింజరాపు భుజంగరావు (బుజ్జి) కత్తులతో హత్యకు గురయ్యారు. 👉 నిమ్మాడ రాజకీయంలో కొంచాడ బాలయ్య అనే వ్యక్తి శవమయ్యాడు. 👉 పిన్నింటిపేటలో రిగ్గింగ్‌కు అడ్డుపడిన కూన రామారావుని 1994లో డిసెంబర్ 3న కత్తితో పొడిచి చంపేశారు. 👉 కింజరాపు గణపతి కుమార్తె మేనకమ్మను మహిళ అని చూడకుండా విచక్షణా రహితంగా అక్కడే వివస్త్రను చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కింజరాపు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పనిచేసిన అనేక మంది హత్యలకు గురయ్యారు. వాటి వెనక ఎవరున్నారో చనిపోయిన వారి శత్రువులకు తెలియాలి. నిమ్మాడ రాజకీయమంటే అలాగే ఉంటుందనేది అందరి నోట మాట. తొలుత బెదిరింపులు..ఆ తర్వాత దౌర్జన్యాలు..అప్పటికీ లొంగకపోతే సామాజిక, గ్రామ బహిష్కరణలు..ఇంకా వినకపోతే దాడులు చేయడం నిమ్మాడలో పరిపాటిగా మారిపోయింది. ఏళ్ల క్రితం నుంచి 18 ఎకరాల రైతు మెండ రామ్మూర్తిని ఇబ్బంది పెడుతున్న విషయం ఇప్పటికీ కొనసాగుతోంది. అన్న కుమారుడిపైనా దౌర్జన్యం.. కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబీకులకు వరసకు అన్న కుమారుడైన కింజరాపు అప్పన్న టార్గెట్ అయ్యారు. అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అప్పన్నను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. అప్పన్న భార్య చంద్రకళ మెళియాపుట్టి కేజీబీవీలో హిందీ పండిట్‌గా పనిచేసేవారు. 2014లో మంత్రి అయ్యాక ఆమెను తొలగించారు. అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ వద్ద 15 ఏళ్ల క్రితం రూ. 2లక్షలను అప్పన్న అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తమంతా చెల్లించినప్పటికీ ముందుగా రాసుకున్న నోటు పత్రం ఈ రోజుకూ ఇవ్వలేదని అప్పన్న మొరపెట్టుకునే వస్తున్నారు. అదే అప్పన్న నిమ్మాడ సర్పంచ్ పదవికి నామినేషన్ వేస్తే అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ తదితరులు దాడి కూడా చేశారు. అచ్చెన్నపై నమోదైన కేసులు, ఫిర్యాదులు👉 కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో సర్పంచ్ కింజరాపు గణేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద మూడో విడత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు, ఆయన అనుచరులు కింజరాపు హరిప్రసాద్, కింజరాపు కృష్ణ, కింజరాపు అచ్చెన్న, కింజరాపు దాముమోహన్, మెండ సత్యం తదితరులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో పింఛన్ల పంపిణీ చేపట్టాలని పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో సర్పంచ్ గణేశ్వరరావు కుమార్తె మేనకపై కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు అనుచరులు దాడి చేసి అవమానపరచినట్లు ఆమె తండ్రి గణేశ్వరరావు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అచ్చెన్నాయుడిపై కేసులు నమోదు చేశారు. 👉 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంత»ొమ్మాళి మండలం ఆకాశలక్కవరం గ్రామానికి ప్రచారానికి వెళ్లిన అచ్చెన్నాయుడును అడ్డుకున్న మహిళపై దారుణంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై నౌపడ పోలీస్‌స్టేషన్‌లో మహిళలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఆ తరువాత వారిని బెదిరించి రాజీ ప్రయత్నాలు చేశారు. 👉పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓ కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసిన సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడిపై కేసు నమోదు చేశారు. 👉 1995లో కాంగ్రెస్ మద్దతుదారులుపై అచ్చెన్న వీరంగం చేసి నిమ్మాడలో తన పినతండ్రి వరుసైన బుజ్జి అనే వ్యక్తిపై దాడి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. 👉 కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, ఆ ఘటనను కప్పి పుచ్చేందుకు అధికారులను బెదిరించారు. ఈ కేసును కొట్టివేశారు. 👉 2021 ఫిబ్రవరిలో నిమ్మాడలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసేందుకు వెళ్లగా, అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్, ఆయన కుమారుడు సురేష్ తో పాటు వారి అనుచరులు, టీడీపీ కార్యకర్తలంతా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు అప్పన్న కోటబొమ్మాళి ఎస్ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశాడు. -
చంద్రబాబు చిమ్మిన కాలకూటమి విషం
మండుటెండలో పండుటాకులు రెండోరోజూ అవే కష్టాలు ‘చంద్రబాబూ మా ఉసురు నీకు తగులుతుంది..’పింఛన్ డబ్బు తీసుకోవడానికి బ్యాంకుకు వచ్చినఓ వృద్ధుడి శాపమిది.‘బాబూ.. మాకు అన్యాయం చేయడం తగదు..’బ్యాంకు క్యూలో నిలుచోలేక ఓ పింఛన్‌దారు వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ‘చంద్రబాబూ.. మమ్మల్ని బతకనీయవా..’ ఎండలకు తట్టుకోలేక మరో పెన్షన్ లబ్ధిదారు సూటిగా వేసిన ప్రశ్న ఇది. చంద్రబాబు చిమ్మిన కాల‘కూటమి’ విషం పింఛన్‌దారులను నరకయాతన పెడుతోంది. వలంటీర్ల సేవలు వద్దంటూ మొదట ఆయనే తనవాళ్లతో ఫిర్యాదు చేయించారు, బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేయాలంటూ ఎన్నికల కమిషన్‌కు సిఫార్సులు చేశారు, ఇప్పుడు లబ్ధిదారులు అవస్థలు పడుతుంటే.. ప్రభుత్వమే ఇదంతా చేయించిందంటూ నీచ రాజకీయాలకు తెర లేపుతున్నారు. కానీ నిజం తెలిసిన జనాలు మాత్రం ప్రతి బ్యాంకు క్యూలోనూ చంద్రబాబు వైఖరిని దునుమాడుతున్నారు.మమ్మల్ని బతకనివ్వరా..?నాయనా చంద్రబాబు నాయుడా మాకు చివరి దశలో చుక్కలు చూపిస్తున్నావు. ఇలా మండుటెండలో బ్యాంకుల చుట్టూ డేకిరిస్తూ కాళ్లాడని నాలాంటివారి ఉసురు పోసుకుంటున్నావు. ప్రతి నెలా కడుపులో చల్ల కదలకుండా ఇంటికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవారు. ఇదేం ఘోరం బాబూ...ఎవరికి అడిగినా నీ పుణ్యమే ఇది అంటున్నారు.– కుప్పిలి రాములు, మర్రిపాడుకాలనీ, సవలాపురం, ఆమదాలవలస నియోజకవర్గంమా ఉసురు చంద్రబాబుకి తగులుతుందిపింఛన్ కోసం నా బోటి ముసలోళ్లను ఇన్ని ఇబ్బందులకు గురి చేసిన చంద్రబాబుకి మా ఉసురు తప్పకుండా తగులుతుంది. వలంటీర మ్మ ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం మా ఇంటికి వచ్చి రూ.3000 లు పింఛన్ డబ్బులు చేతికి అందించేది. ఇప్పుడు పింఛన్ కోసం గుబులుగా ఉంది. నడ్డి ఈడ్చూకుంటూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా. బాబు చేసిన పాపం మాకు శాపంగా మారింది. మా ఉసురు ఊరికినే పోదు. – తమ్మినాన లత్సమ్మ, పింఛన్ లబ్ధిదారు,వజ్రపుకొత్తూరు మండలం -
అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
‘ఒరే.. ఏరా..’ ఉద్యోగులను అచ్చెన్నాయుడు పిలిచే విధానమిది. ‘బట్టలూడదీసి కొడితే నీకు దిక్కెవరే..’ ఓ మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న మాట ఇది. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ పోలీసులను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలివి. ఒంటి నిండా మదం, గొంతు నిండా విషం నింపుకున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను చాలాకాలంగా చులకనగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన తీరు మారలేదు. ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న వ్యవహార శైలిని ఉద్యోగులు విశ్లేషించుకుంటున్నారు.👉ఆర్ అండ్ బీ ఉద్యోగి కళ్యాణి అనే మహిళపై అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆమైపె దౌర్జన్యం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.👉 గతంలో కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేసి, నీకు బట్టలు ఊడదీసి కొడితే దిక్కెవరే అంటూ బెదిరించాడు. ఆ సంఘటనను కప్పి పుచ్చేందుకు అప్పట్లో పోలీస్ అధికారులను బెదిరించి కంప్లైంట్ నమోదు కాకుండా చేశారు.👉 గతంలో పోలాకి మండలం రహీమానుపురంలో జన్మభూమి కమిటీ సభ్యుడు బాలక గోపి తండ్రి డెత్ సర్టిఫికెట్ విషయంలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు త్రివేణి అక్కడ నిబంధనల మేరకు వ్యవహరించిందని నిమ్మాడ పిలిపించి ఆగ్రహించడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.👉గతంలో టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి అప్పటి ఎంపీడీఓగా పనిచేసిన లోకనాథంను బెదిరించారు. చెప్పినట్టు చేయలేదన్న ఆగ్రహంతో తలుపులేసి తంతే నీకు దిక్కెవరు అని భయపెట్టారు.👉గతంలో పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూర్యారావు అనే కానిస్టేబుల్‌పై అచ్చెన్నాయుడు దాడి చేశారు. ‘నిన్ను తుపాకీ తిరగేసి కొడితే నీకు దిక్కెవరం’టూ అచ్చెన్నాయుడు బెదిరించారు. సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.👉‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికి కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయారు.👉ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరైస్టెనప్పుడు కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద వైద్య పరీక్షలు నిర్వహణ కోసం పోలీసులు తీసుకురాగా...అక్కడున్న సీఐ నీలయ్యను బెదిరించారు. ‘హోం మినిష్టర్‌ను అవుతాను. నీ లెక్క తేలుస్తాను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కింజరాపు అచ్చెన్నాయుడికి ఉన్న గౌరవిమిది. ఒరే..ఏరా అన్న పిలుపే తప్ప ఆయనలో అంతకుమించి సంస్కారం లేదని పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. మంత్రి హోదాలోనే కాదు ప్రతిపక్ష నేతగా కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నా, అధికారులన్నా చిన్నచూపే. ప్రతి దానికి అధికారులపై మండిపడటం, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం చేయడం, పరుష పదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించడం ఆయన రాజకీయ జీవితంలో సర్వసాధారణమైపోయింది. అచ్చెన్నాయుడు వస్తే చాలు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక, ఫోన్ బెదిరింపులైతే చెప్పనక్కర్లేదు. తన అనుయాయులకు పనిచేయకపోగా, చెప్పినట్టుగా అధికారులు నడుచుకోకపోయినా ఫోన్ చేసి తిట్టడం, దూషణలకు దిగడం అచ్చెన్నకు పరిపాటిగా మారిపోయింది.ఉద్యోగులపై నిత్యం జులుంటీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శించారు. ఎవరైనా జీ హుజూర్ అన్నట్టుగానే ఉండాలి. లేదంటే వారందరికీ శంకర గిరి మాన్యాలు పట్టిస్తానంటూ బెదిరింపులు చేసేవారు. చేయి చూపించి వార్నింగ్‌లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిపోయాక కూడా ఆయన మదం తగ్గలేదు. నోటికొచ్చినట్టు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులనే కాకుండా పోలీసు అధికారులను బెదిరించారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను చూసుకుని మిగతా టీడీపీ నాయకులు కూడా ఉద్యోగులపైన, అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.బేరీజు వేసుకుంటున్న ఉద్యోగులు ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు, అటు కూన రవికుమార్ వ్యవహార శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారులకు గానీ, ఉద్యోగులకు గానీ గౌరవం లేకుండా పోయిందని, అదే సంస్కృతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించారని ప్రభుత్వ ఉద్యోగులు విశ్లేíÙంచుకుంటున్నారు. అధికారులపైన, ఉద్యోగులపైన జులుం ప్రదర్శించడంతో పాటు దూషణలు, బెదిరింపులకు దిగే టీడీపీ నాయకులెక్కడ, ఉద్యోగులను గౌరవించే ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలకులెక్కడ అని బేరీజు వేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నామన్నదానిపై ఎన్నికల నేపథ్యంలో తేడాలు గమనించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసుకునే తరుణంలో ఎవరు బెస్ట్ అనే దానిపై పోల్చి చూసుకుంటున్నారు. -
టెక్కలి సభలో సీఎం జగన్ పొలిటికల్ పంచ్‌లు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ‘‘మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే. కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల కుట్రలను సీఎం జగన్ తిప్పికొట్టారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. దోచుకోవడం, పంచుకోవడం వారి అలవాటు. మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశాం. ధనికులకు, పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచివేశాం. డబుల్ సంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు.సీఎం జగన్ స్పీచ్ హైలైట్స్..బాబు లాంటి మోసగాడు కావాలా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు మోసాలు, అబద్దాలు, వెన్నుపోట్లతో నేను పోటీ పడలేను.చంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పని కూడా గుర్తుకురాదు.పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలువిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాసుపత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం600లకు పైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కా చెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తుందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోందిమాట మీద నిలబడే మీ జగన్ కావాలా?. మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు..చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?సింగ్‌పూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌కారు ఇస్తారంట నమ్ముతారా?.ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు వస్తున్నాడు -
22 రోజులు.. 2100 కిలోమీటర్లు.. ముగిసిన సీఎం జగన్ బస్సు యాత్ర
CM Jagan Memantha Siddham Bus Yatra Live Updates..నేటితో ముగిసిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర22 రోజులు పాటు 2100 కిలోమీటర్ల మేర సాగిన బస్సు యాత్రఈ యాత్రలో 16 బహిరంగ సభల్లో పాల్గొన్న సీఎం జగన్6 ప్రత్యేక సమావేశాలకు హాజరయిన సీఎం జగన్9 చోట్ల భారీ రోడ్ షోల్లో పాల్గొన్న సీఎం జగన్ ఇడుపులపాయలో ప్రారంభమై 86 నియోజకవర్గాల మీదుగా సాగిన బస్సు యాత్రఅక్కవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగంఅక్కవరంలో సిక్కోలు సింహాలు కనిపిస్తున్నాయి.అక్కవరం, శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలో జనసముద్రం కనిపిస్తోంది.సిక్కోలు జనం సింహాల్లా కదిలివచ్చారుజగన్కు ఓటేస్తే పథకాలన్నీ ముందుకేచంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేమూడు పార్టీల కూటమి మెసాలకు చెంపచెళ్లు మనేలా సమాధానం చెప్పాలిఇవి ఎమ్మెల్యేలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కాదు.పేద ప్రజల గుండెచప్పుడే ఈ సిద్ధం సభ.ఈ యాత్ర వైఎస్సార్సీపీ జైత్రయాత్రకు సంకేతంఇక్కడి జనసునామి చూస్తుంటే 25కు 25 ఎంపీలు, 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు గెలవడం ఖాయం.రాయలసీయ నుంచి ఉత్తరాంద్ర వరకు జన సునామీ చూశాంసంక్షేమ పథకాలను డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది.విద్యా, వైద్య, ఆరోగ్య రంగంలో మార్పులు తీసుకువచ్చాం.గ్రామ స్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం.ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చంద్రబాబు సంస్కృతిని చూశాం58 నెలల్లో పేదల బతుకుల్లో వెలుగులు నింపాం.పేద ధనిక విద్యార్ధులకు ఒకే రకమైన విద్యను అందిస్తున్నాం.పొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారు.కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలిమరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు సిద్ధమేనా?జగన్ వెనుక ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధంవిప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్య, ఆరోగ్య రంగంలో మార్పులతో ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంఇంటింటికీ సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు సిద్ధంలక్షా 35 వేల మంచి ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు సిద్ధంగ్రామస్వరాజ్యం సిద్ధం, పట్టణాల్లో ఇంటింటికీ పౌరసేవలు సిద్ధం1వ తేదీ ఇంటికే వచ్చే రూ.3 వేలు పింఛను సిద్ధంమీకు మంచి జరిగి ఉంటే ఓటు వేయండని అడిగే ధైర్యమే సిద్ధంమరో 18 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయిమేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 99 శాతం నెరవేర్చాంపొత్తులు పెట్టుకుని కుట్రలు చేస్తూ దిగజారిపోయారుమంచి పనులు చేసానని చంద్రబాబు చెప్పుకోలేడు...అందుకే నన్ను తిట్టడమే చంద్రబాబు పనిఇదొక రాజకీయం అవుతుందా చంద్రబాబూజతకట్టిన జెండాలకు సరైన సమాధానం చెప్పాలిఅబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారుదోచుకోవడం, పంచుకోవడమే వారి అలవాటుచంద్రబాబులాగా నేను మోసపు హామీలు ఇవ్వనుబాబులాంటి మోసగాడు కావాలా?.. జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలా?చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని కూడా గుర్తుకురాదు2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?రూ. 10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ అన్నాడు.. చేశాడా?ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?సింగపూర్‌ను మించి అభిృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?ఆడబిడ్డ పుడితే రూ. 25 వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుందిఇప్పుడు సూపర్ 6 అంటూ చంద్రబాబు వస్తున్నాడు..ఇంటికి బంగారం, బెంజ్ కారు అంటున్నాడు..నమ్ముతారా?ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్నికాపాడేందుకు మీరంతా సిద్ధమామీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధంవిద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధంవైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధంఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధంమంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోందిమీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండిశ్రీకాకుళం జిల్లాలో అడుగడుగునా సీఎం జగన్ బస్సు యాత్రకు జననీరాజనందారిపొడవునా జై జగన్ అంటూ నినాదాలుదారి పొడవునా సీఎం జగన్ బస్సు యాత్రకు మహిళల హారతులుఅభిమాన నేత కోసం ఎండను సైతం లెక్క జేయకుండా తరలివస్తున్న జనం చిన్నారి చికిత్సకు సాయం.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు►అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్‌ను కలిసిన శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం నర్సిపురం గ్రామానికి చెందిన చమల్ల శ్రీధర్►ఆరోగ్య శ్రీ ద్వారా తన కుమారుడు త్రిషాన్కు రెండు చెవులకు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించుకున్న విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించి.. కృతజ్ఞతలు తెలిపిన శ్రీధర్►చిన్నారి త్రిషాన్ ఆరోగ్యంపై వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి►2022 జూలై 18న కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ జరిగిందని సీఎంకు చెప్పిన శ్రీధర్►కాక్లియర్ ఇంప్లాంట్ తర్వాత తన కుమారుడు త్రిషాన్ వినగలుగుతున్నాడని.. చిన్న చిన్న పదాలు కూడా పలుకుతున్నాడని ఆనందంగా సీఎంకి చెప్పిన శ్రీధర్► నరసన్నపేటకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►ఆముదాలవలస ఫ్లై ఓవర్ చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్ర. ►ఎచ్చెర్ల చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర►చిలకపాలెం చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర►అక్కివలస నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం►శ్రీకాకుళం సిద్ధమా?. శ్రీకాకుళం జిల్లా సిద్ధమా..? #MemanthaSiddham— YS Jagan Mohan Reddy (@ysjagan) April 24, 2024 ►వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 22వ రోజైన బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. Memantha Siddham Yatra, Day -22.ఉదయం 9 గంటలకు అక్కివలస రాత్రి బస నుంచి ప్రారంభంసాయంత్రం 3:00 గంటలకు టెక్కలి వద్ద బహిరంగ సభ#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/U5fyZ9Vt5d— YSR Congress Party (@YSRCParty) April 24, 2024 ►బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ మంగళవారం రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కాగా, నేటితో మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగియనుంది. ►ఇక, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కె.కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకొని.. 3 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్రలో జగనన్న జన ప్రభంజనం✊🏻Memantha Siddham Yatra, Day -21.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/axMpaCHQ68— YSR Congress Party (@YSRCParty) April 23, 2024 -
అడుగడుగునా నీరా‘జనం’
(‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): మరోసారి చరిత్ర సృష్టించేందుకు చారిత్రక విజయనగరం జననేత జగనన్నకు అఖండ స్వాగతం పలికింది. అడుగడుగునా ప్రజలు జననీరాజనాలు పలికారు. ఉత్తరాంధ్ర కళారూపాలైన చెక్క భజనలు, కోలాటాలతో తమ అభిమాన నేతను అక్కున చేర్చుకున్నారు. విశాఖలోని ఎండాడ నైట్ స్టే పాయింట్ వద్ద అభిమానుల కోలాహలం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో 21వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఎండాడ నుంచి విజయనగరం వరకు సాగింది. దారిలో అడుగడుగునా అభిమానులు వెంటరాగా సీఎం జగన్ బస్సుపై నుంచి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైఎస్సార్ స్టేడియం, పీఎం పాలెం మీదుగా సాగిన యాత్ర జాతీయ రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. కొత్తవలస మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన చెక్కభజన బృందంలోని అక్కచెల్లెమ్మలు జగన్ కోసం తరలివచ్చారు. ఎండాడ నుంచి కార్‌షెడ్ జంక్షన్, మధురవాడ, కొమ్మాది, పరదేశీపాలెం, గంభీరం, తాళ్లవలస వరకు వెంటనడిచారు. దారిపొడవునా అక్కచెల్లెమ్మల హారతులు, మహిళల కోలాటాలు, యువకుల తీన్మార్ డ్యాన్సులతో వారంతా సీఎం జగన్ యాత్ర వెంట అడుగులు వేశారు. జగన్ సైన్యంతో జాతీయ రహదారి కిటకిట.. ఇక ఉదయం పీఎంపాలెం వద్దకు చేరుకున్న సీఎం జగన్ బస్సుయాత్రలో పాల్గొనేందుకు అప్పటికే ఆయన రాకకోసం పెద్దఎత్తున మహిళలు, పిల్లలతో పాటు ఆటోడ్రైవర్లు తరలివచ్చారు. జగన్ బస్సుపై నుంచి అభివాదం చేయగానే ఆ ప్రాంతమంతా జగన్నినాదాలతో మార్మోగింది. వైఎస్సార్ స్టేడియం నుంచి మొదలైన జనప్రవాహం కొమ్మాది, మారికవలస మీదుగా ఆనందపురం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ వేచి ఉన్న అక్కచెల్లెమ్మలు జగనన్నకు ఘనస్వాగతం పలికారు. జగన్‌ను దూరం నుంచి చూసిన అపార్ట్మెంట్లలోని మహిళలు, విద్యార్థులు సైతం బాల్కనీల్లో హుషారుగా కేరింతలు కొట్టారు. ‘గత ప్రభుత్వంలో ఏ చిన్న పనికావాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా స్థానిక టీడీపీ నేతలను కలవాల్సి వచ్చేది. వారు అడిగింది ముట్టజెప్పినా, ఇష్టం లేకపోతే నెలల తరబడి తిప్పించుకునే వారు’ అని మహిళలు నాటి పీడకలలను గుర్తుచేసుకున్నారు. జగనన్న తీసుకొచ్చిన వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలతో ఇంటికే వచ్చి మీకేం అవసరమో చెప్పాలని అడిగి మరీ చేస్తున్నారని నేటి పరిస్థితులను వివరించారు. ఇది సామాన్యుల ప్రభుత్వమని, తామంతా ఆనందంగా ఉన్నామని జనం ముక్తకంఠంతో చెప్పారు. ఇక యాత్రలో భాగంగా సీఎం జగన్ ఆనందపురం జంక్షన్‌లోని చెన్నాస్ కన్వెన్షన్‌లో సోషల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించారు. అనంతరం.. మోదవలస జంక్షన్ మీదుగా విజయనగరం జిల్లాలో యాత్ర కొనసాగింది. జిల్లా నాయకులు, జగన్ అభిమానులతో మోదవల కూడలి జనసందోహంతో నిండిపోయింది. యువకులు ర్యాలీగా వెంటరాగా, మ.2 గంటలకు జొన్నాడ సమీపంలో ముఖ్యమంత్రి భోజన విరామం తీసుకున్నారు. అనంతరం సా.5 గంటలకు జొన్నాడ నుంచి చెల్లూరు వరకు ర్యాలీగా వచ్చి అక్కడ అశేష జనావాహినితో నిండిపోయిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. ఈ బహిరంగ సభకు విజయనగరం జిల్లాకు చెందిన దివ్యాంగులు సీఎం జగన్‌కు మద్దుతుగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లపై పెద్దఎత్తున తరలివచ్చారు. జగన్ సీఎం అయ్యాకే తమ భవిష్యత్తు బాగుందని ఎంతో సంతోషంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలోకి బస్సుయాత్ర.. సభ అనంతరం సీఎం జగన్ చింతలవలస మీదుగా విజయనగరం జిల్లా సరిహద్దు గ్రామం కొప్పెర్ల చేరుకున్నారు. అప్పటికే చీకటి పడినా జగన్ కోసం పెద్దఎత్తున అభిమానులు అక్కడే ఉండి తమ ప్రియతమ నేతకు భారీ పూలదండలతో శ్రీకాకుళం జిల్లాలోకి ఆహ్వానించారు. కిక్కిరిసిన జన సందోహం మధ్య జగన్ అభివాదం చేస్తూ సవరవిల్లి, భోగాపురం మీదుగా రణస్థలం చేరుకున్నారు. అక్కడ ప్రజలు, నాయMý ులు రహదారిపై బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారి జన సంద్రాన్ని తలపించింది. అక్కడి నుంచి అక్కివలస సమీపంలోని రాత్రి బసకు జగన్ చేరుకున్నారు. వైఎస్సార్సీపీలోకి బీజేపీ నేతలు ఎండాడ నైట్ క్యాంపులో ఎస్.కోట, గాజువాక, విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, భీమిలి నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సీఎం జగన్‌ను కలిశారు. వారిని పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పార్టీ కార్యకలాపాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇందులో బీజేపీ గాజువాక నియోజకవర్గం నుంచి మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాశరావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవిందు, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి,సంపత్‌కుమార్ ఉన్నారు. వీరితోపాటు విశాఖ ఉత్తరం నుంచి జనసేన నాయకురాలు దివ్యలత, బీజేపీ నుంచి హేమాంబర్, వ్యాపారవేత్త షేక్ సలీమ్, షేక్ హుస్సేన్ బాషా తదితరులున్నారు. -
సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల జీవన ప్రమాణాలను పెంచారు
-
ప్రచారంలో దుమ్ములేపుతున్న తమ్మినేని..
-
ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంటి హల్ చల్
-
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్‌ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్‌ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్‌ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్‌తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్‌కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్‌కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్‌కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్‌కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్‌కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్‌గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్‌ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
శ్రీకాకుళం అభ్యర్థిని మార్చాల్సిందే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గంలో బీజెపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థిగా ఉన్న గొండు శంకర్‌ను మార్చి, గుండ లక్ష్మీదేవికి టిక్కెట్ కేటాయించాల్సిందేనని జోనల్ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డికి శ్రీకాకుళం నగర తెలుగుదేశం క్యాడర్ ఆల్టిమేటం జారీ చేసింది. నెల్లూరు నుంచి శ్రీకాకుళం జోనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులురెడ్డి అరసవల్లిలోని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి నివాసానికి చేరుకొని వారితో సమావేశమయ్యారు. అనంతరం క్యాడర్‌తో మాట్లాడారు. చంద్రబాబునాయుడు గుండ దంపతులను తీసుకొని రమ్మన్నారని ఆ విషయాన్ని వారిద్దరికీ వివరించారు. దీనికి గుండ దంపతులు స్పందిస్తూ చంద్రబాబుతోనే మాట్లాడుతామని, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌తోనైతే మాట్లేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. మరో రెండు మూడు రోజుల్లో వారు చంద్రబాబునాయుడును కలిసేలా ఏర్పాట్లు చేస్తానన్నారు. దీనిపై నగర తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఏది ఏమైనా శ్రీకాకుళం అసెంబ్లీ టిక్కెట్ లక్ష్మీదేవికి కేటాయించాల్సిందేనని డిమాండ్ చేశారు. నగరానికి చెందిన 50 డివిజన్లలో 45 డివిజన్లకు చెందిన ఇన్‌చార్జులంతా గుండ లక్ష్మీదేవి వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. రెండేళ్లుగా క్రమశిక్షణ తప్పిన అసమ్మతి నేతకు టిక్కెట్ కేటాయించడంపై నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడి పరిస్థితిని చంద్రబాబునాయుడుకు వివరించి లక్ష్మీదేవికి టిక్కెట్ వచ్చేలా చూడా లని కోరారు. దీనికి సమాధానంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మీ ఆవేదన తనకు అర్థమైందని చంద్రబాబు వద్దకు గుండ దంపతులను తీసుకెళ్లడం వరకే తన బాధ్యతని వివరించారు. టికెట్ ఇస్తే గుండకే ఇవ్వాలని, యూత్ కోటా అనుకుంటే వారి కుమారుడికి ఇవ్వాలే తప్ప గొండు శంకర్‌కి కన్ఫర్మ్ చేస్తే తాము ఒప్పుకోబోమని కార్యకర్తలు అన్నారు. -
విషాదం.. ఎలుగుబంటి దాడిలో ఇద్దరి మృతి
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి ఇద్దరి ప్రాణాలను తీసేసింది. మరొకరు గాయపర్చింది. వివరాలు.. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. జీడితోటలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులపై ఒక్కసారిగా దాడి చేసింది. జీడితోటలో పనిచేస్తున్న కార్మికులపై ఎలుగుబంటి దాడి చేసింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా.. మరో మహిళకు గాయాలయ్యాయి. మృతులను అప్పికొండ కూర్మారావు(45), లోకనాథం(46)గా గుర్తించారు. గాయపడిన మహిళలు స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎలుగుబంటిని బంధించేందుకు చర్యలు ప్రారంభించారు. ఇద్దరి ప్రాణాలు పోవడం, ఓ మహిళ గాయాలతో ఆసుపత్రి పాలవ్వడంతో అనకాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా ఎలుగు బంటి దాడి గురించి తెలుసుకున్న గ్రామస్తులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎలుగుబంట్లు గ్రామాల్లోకి ప్రవేశించి మనుషుల ప్రాణాలు తోడేస్తున్న పట్టించుకోవడం లేదని అటవీశాఖ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
రేయ్ చంద్రబాబు.. అబ్బా కొడుకులకి ఇచ్చిపడేశారు టీడీపీ నేతలు
-
శ్రీకాకుళం టీడీపీలో సిటు మంటలు
-
కళా వెంకటరావు మెడకు చీపురుపల్లి గంట
అటు తిరిగి ఇటు తిరిగి కిమిడి కళా వెంకటరావు పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చీపురుపల్లి నుంచి పోటీ చేయమని ఆయన్ను పార్టీ సూచించినట్లు సమాచారం. ఎచ్చెర్లలో పార్టీ శ్రేణులు కళాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. వాస్తవానికి ‘కళా’ను చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేయాలని పార్టీ అధినేత మొదట్లోనే సూచించారు. కానీ ‘కళా’ అంగీకరించలేదు. విశాఖకు చెందిన గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి పంపించి పోటీ చేయించాలని అనుకున్నారు. ఆయన కూడా అంగీకరించకపోవడంతో అక్కడ మంత్రి బొత్సపై పోటీకి సరైన అభ్యర్థి దొరకలేదు. దాంతో మళ్లీ కళా మెడలో గంట కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ విస్తృత బంధువర్గం, పరిచయాలు ఉన్న సీనియర్ నేత అయిన కళా అయితేనే బొత్సకు కొంత పోటీ ఇవ్వగలరన్నది చంద్రబాబు ఆలోచన. అదే సమయంలో ఎచ్చెర్లలో పంచాయితీని కూడా పరిష్కారం సాధించినట్లు అవుతుందని భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్లలో స్వపక్షంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్న టీడీపీ నేత కిమిడి కళా వెంకటరావును నియోజకవర్గం మార్చే యోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కాకుండా చీపురుపల్లి నియోజకవర్గంలో బరిలో దించితే ఎలా ఉంటుందనేదానిపై ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును చీపురుపల్లి నుంచి పోటీ చేయించాలని చూసినా ఆయన ససేమిరా అనడంతో ప్రత్యామ్నాయంగా కళా వెంకటరావుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఐవీఆర్ఎస్ సర్వే ప్రకారం కళాను బరిలో దించుతారా? లేదంటే అక్కడా సానుకూలత లేదని పక్కన పెట్టేస్తారా? అంత రిస్క్ చేయడమెందుకని ఓడిపోయే సీట్లలో ఎవరు పోటీ చేస్తే ఏముందని ఎచ్చెర్లకే వదిలేస్తారా? అన్నది ప్రస్తుతం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. గ్రూపుల గోల..! ఎచ్చెర్లలో టీడీపీ బలహీనంగా ఉంది. గత ఐదేళ్లలో ఆ పార్టీ ఏమాత్రం బలపడలేదు. సరికదా గ్రూపులుగా తయారై టీడీపీ శ్రేణులు విడిపోయి మరింత పట్టుకోల్పోయారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గరి నుంచి ఇక్కడ వర్గపోరు నడుస్తోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు ఒకవైపు, ఏఎంసీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు మరోవైపు గ్రూపుగా తయారై రాజకీయాలు చేస్తున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఎవరికి వారు బల ప్రదర్శన చేసుకుంటున్నారు. ఎన్నాళ్లు కళా వెంకటరావు పల్లకిమోస్తామని, ఈ సారి కలిశెట్టికి టికెట్ ఇవ్వాల్సిందేనని కొన్నాళ్లుగా టీడీపీలో ఓ గ్రూపు పట్టుబడుతూ వస్తోంది. చెప్పాలంటే కళా వెంకటరావుకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తోంది. చౌదరి బాబ్జీ తదితర నాయకులు సైతం కళా వెంకటరావుతో తాము వేగలేమని.. అణగదొక్కే రాజకీయాలు ఇంకెంత కాలమని స్వరం విన్పిస్తున్నారు. అనుకున్నట్టుగా చివరికొచ్చేసరికి కళాతో పోటీగా కలిశెట్టి రేసులో నిలబడ్డారు. ఇప్పుడు ఎవరికి టికెట్ ఇస్తారన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. రకరకాల సర్వేలు.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేస్తే సమస్యే లేదని ఒకవైపు ఆలోచిస్తుండగానే మరోవైపు కళా, కలిశెట్టిలో ఎవరి బెస్ట్ అన్నదానిపై ఐవీఆర్ఎస్తో పాటు రకరకాల సర్వేలను చంద్రబాబు చేయించారు. కొన్నింటిలో కలిశెట్టికి సానుకూలత రాగా, మరికొన్నింటిలో కళాకు అనుకూలంగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో చీపురుపల్లి నియోజకవర్గం ఆ పార్టీకి గుదిబండగా తయారైంది. మంత్రి బొత్స సత్యనారాయణను ఢీకొట్టే నాయకత్వం అక్కడ లేకపోవడంతో చంద్రబాబు రకారకాల ఆలోచనలు చేస్తున్నారు. తరుచూ నియోజకవర్గాలు మార్చి ఎన్నికల్లో గట్టెక్కుతున్న గంటా శ్రీనివాసరావును అక్కడ బరిలో దించాలని చూసింది. పార్టీకి సమస్యగా మారిన గంటాను ఈ రకంగానైనా వదిలించుకోవాలని చంద్రబాబు అండ్‌కో చూస్తోంది. దానిలో భాగంగా ఓడి పోయిన సీట్లలో గంటాను పోటీ చేయిస్తే పీడ విరగడయిపోతుందని భావించారు. కానీ, గంటా దాని కి ససేమిరా అంటున్నారు. బొత్సతో పోటీ చేయలేనని చెప్పేస్తున్నారు. ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడమే మంచిదన్న ఆలోచనకొచ్చి తన మనసులో మాటను అధిష్టానానికి చేప్పేశారు. కాకపోతే, పైరవీలు, లాబీయింగ్ చేసే గంటా తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో గంటా పోటీ చేసే సీటుపై ఆ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడింది. ఈ క్రమంలో చీపురుపల్లి నుంచి కిమిడి కళా వెంకటరావును పోటీ చేయిస్తే ఎలా ఉంటుందనేదానిపై ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వే కూడా చేయించింది. ఎచ్చెర్లలో ఎలాగూ కష్టం.. చీపురుపల్లిలో కనీసం పోటీ అయినా ఇచ్చి బొత్సతో ఢీకొనాలని చూస్తోంది. అందులో భాగంగానే చీపురుపల్లికి కళా వెంకటరావును పంపిస్తారని ఇప్పటికే ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది. బీజేపీకి ఎచ్చెర్ల ఇచ్చేస్తే.. సీనియర్‌కు కనీసం చీపురుపల్లిలోనైనా సీటు ఇచ్చి గౌరవం ఇచ్చామని చెప్పుకునేలా టీడీపీ అడుగులు వేస్తోంది. ఈ సమీకరణాలు చివరి వరకు నడుస్తాయా? లేదంటే ఆఖరి నిమిషంలో మారుతాయో తెలియదు గానీ ప్రస్తుతం చీపురుపల్లికి కళాను పంపించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. -
భావోద్వేగంతో కంట తడిపెట్టుకున్న లక్ష్మీదేవి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం టీడీపీలో కమలం ప్రమేయం కల్లోలం రేపుతోంది. జిల్లా కేంద్రం అసెంబ్లీ సీటు బీజేపీకి కేటాయిస్తున్నారనే సంకేతాలతో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వర్గం ఆందోళనకు దిగింది. లక్ష్మీదేవి అనుచరులు తీవ్ర ఆవేదనకులోనై ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు ఇంటిని ముట్టడించారు. అనంతరం ఆయన నివాసంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో వాచ్మెన్పై దాడి చేశారు. ఎంపీ లేరని తెలుసుకుని ఇంటి బయట బైఠాయించి, అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామాలో తాము బలైపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం టిక్కెట్ కోసం గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ రెండు వర్గాలు గొడవ పడుతున్నాయి. నువ్వెంత అంటే నువ్వెంత అని బాహాబాహీకి సైతం దిగాయి. ఇందులో గొండు శంకర్‌ను కింజరాపు ఫ్యామిలీ ప్రోత్సహిస్తోందని గుండ లక్ష్మీదేవి వర్గం తరుచూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ సీటు వస్తుందన్న ఉద్దేశంతో లక్ష్మీదేవి పనిచేస్తూ వస్తున్నారు. ఆమెకు పోటీగా గొండు శంకర్ కూడా తగ్గేది లేదంటూ కాలు దువ్వుతున్నారు. లక్ష్మీదేవికే టిక్కెట్ అని ఒకవైపు, యూత్ కోటాలో శంకర్‌కు అని మరోవైపు ఆశలు కల్పించి చంద్రబాబు పబ్బం గడిపారు. చివరికి వచ్చేసరికి శ్రీకాకుళం సీటును బీజేపీకి కేటాయిస్తున్నారని సంకేతాలు పంపించారు. బీజేపీతో ఒప్పందం కూడా జరిగిపోయిందని, ఆ పార్టీ తరఫున రాయలసీమకు చెందిన సురేంద్రకుమార్ పోటీ చేస్తారని తొలుత, తర్వాత పైడి వేణుగోపాల్ పోటీ చేస్తారని తెరపైకి తెచ్చారు. డ్రామానా.. చంద్రబాబు ఎత్తుగడా..! సీటు బీజేపీకి కేటాయించేశారా? లేదంటే టీడీపీలో ఉన్న ఆశావహుల అభిప్రాయం తెలుసుకోవడానికి చంద్రబాబు అండ్‌కో డ్రామాలాడిందో తెలియదు గానీ శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి గుండ లక్ష్మీదేవి వర్గం రోడ్డెక్కింది. టికెట్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. అధిష్టానంతో టచ్‌లో ఉండే ఎంపీ రామ్మోహన్నాయుడు వద్ద తేల్చుకోవాలని భావించారు. ఆమేరకు ఆమె వర్గీయులంతా 80అడుగుల రోడ్డులో ఉన్న ఎంపీ రామ్మోహన్నాయుడు నివాసాన్ని ముట్టడించారు. తమకు అన్యాయం చేస్తున్నదంతా కింజరాపు ఫ్యామిలీ అన్నట్టుగా ఆందోళనకు దిగారు నిమిషాల్లోనే ఇంటిలోకి వెళ్లేందుకు యత్నించారు. అడ్డుకున్న వాచ్మెన్పై దాడి చేశారు. మొత్తానికి లోపలికి వెళ్లేసరికి ఎంపీ లేకపోవడంతో కార్యాలయం అసిస్టెంట్‌తో మాట్లాడారు. ఎంపీ ఇక్కడ లేరని చెప్పడంతో ఫోన్లోనే ఎంపీతో మాట్లాడారు. మీ ఆవేదన అర్థమైందని, రెండో జాబితాలో లక్ష్మీదేవి పేరు లేకపోవడం బాధాకరంగా ఉందని, తన వంతుగా ప్రయత్నిస్తానని ఫోన్లోనే ఎంపీ రక్తి కట్టించారు. అయినప్పటికీ శాంతించలేదు. ఇదంతా ఎంపీ రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఆడుతున్న డ్రామా అని బయటికొచ్చి బైఠాయించారు. అక్కడే అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టైర్లు కూడా కాల్చుదామని వెంట పట్టుకుని వచ్చారు. ఎంత చేసినా ఫలితం కనిపించకపోవడంతో ఆందోళనకారులంతా గుండ లక్ష్మీదేవి ఇంటికి వెళ్లి సమావేశమయ్యారు. ఎంపీ ఇంటి దగ్గర జరిగిన ఎపిసోడ్‌ను అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు వివరించారు. ఎంపీ చెప్పిన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలో కొందరు జోక్యం చేసుకుని అదంతా డ్రామాయేనని, రెండు జాబితాల్లోనూ పేరు లేదనే విషయం ఎంపీకీ తెలియదా... బాబాయ్, అబ్బాయ్ కలిసి తమను తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం లోగా లక్ష్మీదేవి పేరు రాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని, ఆత్మహత్యలకు సైతం సిద్ధపడతామంటూ హెచ్చ రించారు. ఈ సందర్భంగా అప్పల సూర్యనారాయణ మాట్లాడుతూ అనాదిగా తమను తొక్కేస్తున్నారని, గత ఏడాదికి పైగా వర్గపోరు నడుస్తోందని చెప్పినా, అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సీనియర్‌నైన తనకు అన్యాయం చేస్తున్నారని బాధపడ్డారు. వ్యక్తిగతంగా ఇష్టంలేకపోయినా అచ్చెన్నాయుడ్ని లక్ష్మీదే వి కలిసి మొర పెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టారు. మొత్తానికి టీడీపీలో ప్రస్తుతం జరుగుతున్నది డ్రామానా? చంద్రబాబు వేసిన ఎత్తుగడా అన్నది త్వరలోనే తేలనుంది. -
చంద్రబాబు బీసీ వ్యతిరేకి: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: బీసీల వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తి చంద్రబాబు అంటూ ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వకుండా.. జయహో బీసీ ఎలా అవుతుంది బాబూ? అంటూ ప్రశ్నించిన ధర్మాన.. బాబు మాటలతో సామాజిక న్యాయం జరగదు.. సీఎం జగన్‌లా చేతల్లో చూపిస్తేనే సాధ్యమవుతుందన్నారు. శ్రీకాకుళం టౌన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. ఏమన్నారంటే.. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాయ మాటలు చెప్పే వారే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి హామీలు ఓటర్లకు ఇస్తారే తప్ప స్వతహాగా బ్యాక్ వర్డ్ క్లాస్ వాళ్లు సామాజికంగా ఎదగాలన్న ఆలోచన అన్నది ఆయనకు లేదు. వారికి అవసరం అయిన రాజ్యాధికారం ఇవ్వాలన్న ఆలోచన ఏనాడూ ఆయన చేయలేదు. చేయరు కూడా, అటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనేమీ ఇప్పుడొచ్చినటువంటి నాయకుడేమీ కాదు కదా ఆయన ఆల్మోస్ట్ పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగానే ఉన్నారు. నలభై సంవత్సరాలు రాజకీయాలలో అనుభవం ఉన్నవారు. ఆయన భావజాలం మీరు చూస్తే ఏనాడూ అతడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు. దానికి ఒక్కటే ఒక్క ఉదాహరణ చెబుతాను. ఈ దేశంలో రాజ్యసభకు ఇప్పటిదాకా ఒక్కరిని కూడా బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని చంద్రబాబు పంపించలేదంటేనే.. ఆయన రాజకీయ అధికారం బీసీలకు ఇస్తారంటే ఎవ్వరయినా నమ్ముతారా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో ప్రజలెవ్వరయినా, బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారెవ్వరయినా నమ్ముతారా?. ఆయన తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఆయన రాజ్యసభకు నలుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారిని పంపించారు. ఐదు సంవత్సరాలలోనే ఐదుగురు బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు చెందిన వారిని పెద్దల సభకు పంపించారు. మీరు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు. ఏనాడయినా మీరు ఈ విధంగా రాజకీయ అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదే ? అంటే ఏంటి ?. చంద్రబాబు భావజాలంలోనే బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు చెందిన వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్న కోణం లేదు మొదట్నుంచి. వీళ్లకు అధికారం ఇచ్చి వాళ్లను బలోపేతం చేసే పనులు మీరు ఏనాడూ చేయలేదు. నేను ఎనలైజ్ చేసిన విషయాలైతే ఇవి. అధికారాన్ని అలాంటి వారికి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నారు మీరు. అందుకే ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఎవ్వరైనా అత్యున్నత న్యాయస్థానానికి బ్యాక్ వర్డ్ క్లాస్ వారు జడ్జీలుగా పనికి రారు అని ఉత్తరం రాస్తారా? అంటే కరడుగట్టినటువంటి బ్యాక్ వర్డ్ క్లాస్ వ్యతిరేక భావాలు మీలో నాటుకుని ఉన్నాయి కనుక, అలాంటి పొజిషన్లలోకి బ్యాక్ వర్డ్ క్లాసెస్ వారు రాకూడదు అనే భావజాలం కలిగి ఉన్నారు మీరు. మీ పార్టీ పక్కన బెట్టండి. అసలు మీరు వ్యక్తిగతంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు వ్యతిరేకి మీరు(చంద్రబాబు). అది మేం చెప్పింది కాదు. మీరు రాసిన ఉత్తరం కాని, గడిచిన ఐదేళ్లలో మీరు రాజ్యసభకు సీట్లు ఇచ్చినటువంటి సందర్భం కానీ క్లియర్‌గా చెబుతోంది కదా. నిన్న జయహో బీసీ అని అన్నారు. రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎలా అవుతుంది? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి వెసులుబాటు కల్పించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారం ఇవ్వాలి. ఇస్తే ఆటోమెటిక్ గా సామాజిక న్యాయం సాధ్యం అవుతుంది. బ్యాక్ వర్డ్ క్లాసెస్‌కు సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ, తెలుగు దేశం పార్టీకీ ఒక డిబెట్ కనుక మీరు పెడితే,డిబెట్‌కు మీరు వస్తామన్నా, మీ తాలుకా వ్యక్తులు ఎవ్వరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడేందుకు సిద్ధం. ఈ ఐదు సంవత్సరాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ బద్దంగా బీసీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారం ఇచ్చి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కలిగించి, సామాజిక న్యాయం అందించినటువంటి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నేను రుజువు చేస్తాను. మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరెవ్వరయినా చర్చకు వస్తే, మాట్లాడేందుకు నేను సిద్ధం. మీరెవ్వరని అయినా చర్చకు పంపించినా,లేదా మీరొచ్చినా మాట్లాడేందుకు నేను సిద్ధం అని మనవి చేస్తున్నాను. ఇలాంటి విషయాలు మాట్లాడేందుకు ఒక వేదిక మీదకు రావాలని చెబుతున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు. చిత్తశుద్ధితో పనిచేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ, ఎన్నికలు అయిపోయాక అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. ఇలాంటి జయహో బీసీ సభలు ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. ఎన్నిక అయిపోగానే సంబంధిత కాగితాలు చింపి అవతల పారేశారు. డిక్లరేషన్ల ఊసే లేదు. ఇవాళ మిమ్మల్ని నమ్మమంటే ఏ బీసీ నమ్ముతాడు. మా పార్టీలో లోక్‌సభలో ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. బీసీలకు చెందిన వారే వారంతా. చూస్కోండి. ఎప్పుడయినా మీరు ఆ విధంగా పార్లమెంట్‌కు సంబంధించి ఎగువ సభకు కానీ దిగువ సభకు కానీ ఆ విధంగా పంపగలిగారా ? అని ప్రశ్నిస్తున్నాను. చేయగలిగారా ?.11 మంది మంత్రులు రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్నారు. సరే ఇతర కార్పొరేషన్లు అంటే యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, సంబంధిత వర్గాలకు లీడర్ షిప్ ఇచ్చారు. మీరు దానిని విమర్శిస్తారు. విమర్శించడం కాదు లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. ప్రజా స్వామ్యంలో ప్రభుత్వాలు, బడ్జెటింగ్ వీటికి సంబంధించిన సమాచారం తదితర వివరాలు తెలుసుకునేటటువంటి లీడర్ షిప్‌ను డెవలప్ చేయాలి. మీరెప్పుడూ అది చేయలేదే ? ఎన్నికలు వస్తున్నాయి కనుక జయహో బీసీ అంటే అవుతుందా ? నిజంగా మీరెప్పుడయినా బీసీ సంక్షేమం కోసం పాటుపడ్డారా? పాల వ్యాపారం చేసుకునే వారుంటే వారికొక డొక్కు సైకిల్ ఇవ్వడం, ఇస్త్రీ పెట్టె ఇవ్వడం.. వాటిపై మీ బొమ్మలు వేసుకోవడం..ఇవా బీసీల సామాజిక స్థితిగతులు మారడానికి సహకరిస్తాయా ? ఇవి కాదు కదా ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారిందరికీ చేయూత ఇవ్వగలగాలి. కానీ ఆ రోజు ప్రొగ్రాంలు పెట్టడం వాటిలో కొన్నింటిని మాత్రం పంచి మిగిలినవి సొంత మనుషుల ఖాతాల్లోకి చేర్చేయడం వంటి పనులెన్నింటినో గత ప్రభుత్వ హయాంలో మీరు చేశారు.అలాంటివి మీరు ఈ ఐదేళ్లలో చూశారా ? డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు ఇచ్చిన డబ్బెంతో తెలుసా ? లక్షా 22 వేల కోట్ల రూపాయలు అందించాం. ఇంత మొత్తాన్ని బ్యాక్ వర్డ్ క్లాసెస్ అకౌంట్లలోకి చేరవేశాం. ఇందుకుగాను మీలా ఏ ఒక్కరు కూడా ఒక్క నయాపైసా లంచం అని,కమీషన్ అని,మధ్యవర్తి అని లేకుండా చేశాం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నాన్ డీబీటీ ఇంకా వేరుగా ఉంది. మీరు సబ్ ప్లాన్ అంటున్నారు. సబ్ ప్లాన్ అంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి చూపించిన ప్రభుత్వం ఇది. బ్యాక్ వర్డ్ క్లాసెస్ గురించి మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. ఆ అర్హత మీకు లేదు. వెనుకబడిన వర్గాలను మోసగించినటువంటి ప్రభుత్వం మీది. ఇప్పటికీ మీరు అదే చెబుతారు సైకిళ్లు ఇస్తాం..డొక్కులు ఇస్తాం.. కత్తులు ఇస్తాం అని చెబుతారు. ఇవి కాదండి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి. రాజకీయ స్వాతంత్ర్యం కావాలి. సమాజంలో వారి స్థితి పెరిగేందుకు ఏమయినా అవకాశం ఉంటే అందుకు తగ్గ పనులు చేయగలగాలి. నాయీ బ్రాహ్మణులను తీసుకోండి. వారి ఆర్థిక స్థోమత పెరిగేందుకు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి సహకారం అందించాం. వారికి ఒక క్షౌరశాల ఉంటే డైరెక్టుగా డబ్బులు పడే విధంగా ఏర్పాటు చేశాం. ఏడాదికి పదివేలు రూపాయలు అందించాం. వారి విద్యుత్ బిల్లులను కొంత తగ్గించి,ఊరట ఇచ్చాం. చేస్తున్న వృత్తికి సంబంధించి ఛార్జీలు పెంపు చేసేందుకు అనుమతి ఇచ్చాం. వృత్తిని ఎవ్వరైనా అగౌరవ పరిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేసేందుకు వీలుగా చట్టాన్ని సవరించాం. ఇవాళ ప్రతి దేవాలయంలో చివరికి తిరుపతిలో కూడా ఓ నాయీ బ్రాహ్మణుడు ట్రస్ట్ బోర్డులో మెంబర్ గా ఉండే అవకాశం ఇచ్చాం. ఇది కదా సామాజిక న్యాయం అందించడం అంటే.. అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. మీరు మామాలుగా మాటలు చెబితే సామాజిక న్యాయం దక్కదు. అలానే తీసుకోండి ఏ కమ్యూనిటీ అయినా తీసుకోండి. శెట్టి బలిజలలో రాజ్యసభ మెంబర్ ఉన్నారు. యాదవులకు పెద్ద ఎత్తున పార్లమెంట్ సీట్లు. అసెంబ్లీలో ఎన్నడూ లేనివిధంగా బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు సీట్లు ఇచ్చింది. ఏనాడూ చంద్రబాబును ఈ పద్ధతుల్లో చూడలేదే ? ధనవంతులను ఎంపిక చేసే పనిలోనే చంద్రబాబు ఉన్నారే తప్ప నిజమయిన సంప్రదాయ రీతులలో ప్రజల తరఫున పోరాడుతున్న బ్యాక్ వర్డ్ క్లాసెస్ లీడర్లను ఎప్పుడూ ఆయన గుర్తించ లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు జయహో బీసీ అంటారు. ఎందుకు అంటారో తెలియదు. ? ఏ వర్గం ప్రయోజనం ఆశించి అంటారో కూడా తెలియదు ? ఏమిటి బీసీ ? ఏమిటి జయహో బీసీ ? మీరు చెప్పండి. రాజ్యాధికారం దక్కించడంలో విశాల భావం ఉండాలి. మీకు ఆ దృక్పథం లేదు. మీ మాటలను ఎవ్వరూ నమ్మే విధంగా ప్రజలు లేరు అని మనవి చేస్తున్నాను. ఎంత కాంట్రడక్షన్ ఉంది మీ మాటలలో.. జగన్ పాలకు సంబంధించి మొదటి ఏడాది మీరు ఏం చెప్పారు ? ఆ రోజు ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అమలు సాధ్యం కాదని చెప్పారు. అనుభవం ఉన్నవాడిగా చెబుతున్నాను ఇవన్నీ అసాధ్యం అని చెప్పారు. అమలు చేస్తున్న సందర్భంలో మళ్లీ మాట మార్చారు. ఇంకెన్నాళ్లు చేస్తారు మరో ఆరు మాసాలలో సంక్షేమ పథకాల అమలు ముగిసిపోతుంది మరి చేయలేడు అని చెప్పారు. అయినా మీరు చెప్పిన విధంగా ఆగిపోలేదు. జగన్ పాలనలో రెండున్నర, మూడు సంవత్సరాల తరువాత మళ్లీ మీరు చెప్పారు. ఇలా చేసుకుంటూ పోతున్నారు ఈ రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని.. వెనుజులా అవుతుందని... దివాలా తీసేస్తుంది రాష్ట్రం అని చెప్పారు. కానీ భారత ప్రభుత్వం ప్రకటించిన సూచీలు (ఇండికేటర్స్) మీరు చూస్తే జీడీపీ బ్రహ్మాండంగా మీ టీడీపీ ప్రభుత్వం కన్నా ఎక్కువ వృద్ధి మా ప్రభుత్వంలో నమోదు చేసింది అని కేంద్ర ప్రభుత్వ సూచీలు చెబుతున్నవి. అన్ని రంగాలలో మీ కంటే అనేక స్థాయిలలో వృద్ధి పెరిగి అనేక రాష్ట్రాలను నెట్టుకుని ముందుకు వచ్చింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. మరి మీరేమో ఈ రాష్ట్రం వెనుజులా అయిపోందని అన్నారు. శ్రీలంక అయిపోతుందని అన్నారు. నాలుగేళ్లు అయిపోయింది. అప్పుడు మళ్లీ మీరు మాట మార్చారు. రాజమండ్రిలో సభ పెట్టి నేను కూడా ఇంత కన్నా ఎక్కువ ఇస్తానని మాట మార్చారు. ఆ నాలుగు సంవత్సరాలలో నాలుగు దఫాలుగా మాట మార్చారు. ఇప్పుడు ఐదో సంవత్సరం చెప్పినటువంటి మాట మార్చరని ఏంటి గ్యారంటీ ? ఇప్పుడు జయహో బీసీ అంటూ చెబుతున్న మాటలు మార్చరని ఏంటి గ్యారంటీ ? మీరు సిగ్గుపడడం లేదా దీనికి. అనుభవం లేని వారా మీరు ? ఇప్పుడే మీరు పార్టీ పెట్టారా ? మీదేమయినా కొత్త పార్టీనా ? ఈ రాష్ట్రానికి ఏమి వనరులు సమకూరుతాయి అన్నది మీకు బాగా తెలుసు కదా..ప్రభుత్వంలో బడ్జెటింగ్ ఎలా ఉండాలి ? దానికి లిమిటేషన్లు ఏంటన్నవి ? మీకు బాగా తెలుసు కదా..ఎందుకు మీరు చేయలేకపోయారు. చేయలేకపోయారు అంటే మీ భావజాలంలోనే ఆ విధం అయిన ఆలోచన లేదు అని అంటాను నేను. ఆ విధం అయిన దృక్పథం మీలో లేదు అని అంటాను నేను. ఎప్పుడూ మీరు చెప్పుకునే మాటలకూ చేతలకూ సంబంధమే ఉండదు. అభివృద్ధి అంటే ఓ కుటుంబం అన్ని రంగాలలో సాధించినటువంటి అభివృద్ధిని మీరు చూడడమే లేదు. ప్రపంచంలో ఉన్న సంస్థలన్నీ ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటి అభివృద్ధికి..? వారు ఆరోగ్యంగా జీవించే స్థితి ఉండాలి. చక్కగా చదువుకుని పోటీ ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలను అందుకునేటటువంటి విద్యా విధానం ఉండాలి. మంచి పోషకాహారం లభించాలి. నివాస యోగ్యం అయిన ఇల్లు ఉండాలి. పరిసరాలు బాగుండాలి. మంచి నీరు ఉండాలి. ఇవన్నీ లేకుండా అభివృద్ధి అనేదానికి అర్థం ఏముందని ? ఇవేవీ కాకుండా ఎవరి కోసం అభివృద్ధి. అభివృద్ధి ఆ రాష్ట్ర ప్రజల కోసం కాకుండా ఏ కొద్దిమంది ధనవంతుల కోసమో..పెద్ద పెద్ద భవంతులు చూపించి,రోడ్లు చూపించి ఇదే అభివృద్ధి అనేటటువంటి మీ తత్వానికి మీ సిద్ధాంతానికి మా పార్టీ సిద్ధాంతానికి జగన్ మోహన్ రెడ్డి సిద్ధాంతానికి ఎక్కడా పొంతనా లేదు. జగన్ గారి పాలన రాజ్యాంగం చెప్పినటువంటి నిబద్ధత కలిగిన పాలన.ప్రపచంలో ఇతర దేశాలు అనుసరిస్తున్నటువంటి ప్రజల తాలుకా జీవన ప్రమాణాలు పెంచే పాలన. మీకూ మాకూ ఎక్కడా పొంతన లేదు. ఈ విషయమై మీరు వైఎస్సార్సీపీ తో పోల్చి చూసుకోకూడదు. మీకు సాధ్యం కాదు. ఎందుకంటే మీ భావజాలం వేరు. మీ భావజాలంలో ప్రజలకు మేలు చేద్దాం జీవన ప్రమాణాలు పెంచుదాం అన్నవి లేవు. ఇటువంటి ఉన్నత స్థాయి ఆలోచనలు లేనే లేవు. మీరు ఇవ్వలేరు. ఇదే మాట నేను పదే పదే చెబుతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడూ చేయలేదు. మీ చుట్టూ ఉన్నది ధనవంతుల కూటమి. ధనవంతుల ప్రయోజనాలను మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల జీవన ప్రమాణాలను మీరు పెంచలేరు. మీ చుట్టూ ఉన్న కోటరీని మీరు కాపాడగలరు కానీ పేద ప్రజల విషయమై ఆలోచన చేయలేరు. ఇదే విషయం అన్నింటా కనిపిస్తూనే ఉంది గత పాలనలో మీరు అందించిన పాలనలో. అందుకే అప్పుడూ ఇప్పుడూ అవే మాటలు చెబుతున్నారు. అత్యంత వెనుకబడిన నార్త్ కోస్టల్ ఏరియాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతాం అంటే మీరు అంగీకరించడం లేదు. మీకు ఎక్కడుంది కాన్ఫిడెన్స్ ? విశాలం అయిన భావం ఎక్కడుంది మీకు. అందుచేత జయహో బీసీ లేదు.మీ కపట మాటలూ ఎవ్వరూ నమ్మరు. మీరు చెప్పే మాటలు అన్నీ ఎన్నికల్లో ఓటు పొంది తద్వారా అధికారం దక్కించుకునేందుకు కాక మరొకదానికి కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఎన్నికల ముందు గొప్ప ప్రసంగాలు ఇచ్చినంత మాత్రాన మోసపోయేందుకు ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు. మీరు కనుక చర్చకు వస్తే,ఏ వేదిక ఏర్పాటు చేస్తే ఆ వేదికలో మీతో వాదించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మీరు చేసిన పొరపాట్లు అన్నీ చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యాక్ వర్డ్ క్లాసెస్ కు జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచీలు నేను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ జయహో బీసీని ప్రజలెవ్వరూ నమ్మవద్దు అని సూచన చేస్తూ బ్యాక్ వర్డ్ క్లాస్ కు చెందిన నేతగా, చాలా కాలం ప్రభుత్వాలలో పనిచేసిన వ్యక్తిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాను. టీడీపీ జయహో బీసీలో కపటం ఉంది. అందులో మాయ ఉంది. అందులో మోసం ఉంది. అధికారం కోసం చెప్పే మాటలు ఉన్నాయి తప్ప నిజమైనటువంటి సామాజిక న్యాయం,రాజకీయ అధికారం, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగించే ఆలోచనలు అందులో లేవు. బీసీలకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబు నాయకత్వానికి లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. -
సీఎం జగన్ నిర్ణయంతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
-
ఎక్కువ మంది పిల్లల్ని కంటే లాభం.. చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రజలు ఓపిక ఉండి ఎక్కువ మంది పిల్లల్ని కంటే ఎక్కువగా లాభ పడతారని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఇక్కడ జరిగిన రా.. కదిలిరా.. సభలో ఆయన మాట్లాడుతూ.. “టీడీపీ అధికారంలోకి వస్తే ఒక ఆడపిల్ల ఉంటే నెలకు రూ.1500, ఇద్దరు ఉంటే రూ.3000, ముగ్గురు ఉంటే రూ.4500 .. అలాగే ఒక్కో పిల్లవానికి చదువుకోసం ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఎందరు పిల్లలు ఉంటే అంత మొత్తం జమ చేస్తాం. ఎక్కువ మంది పిల్లలను కంటే టీడీపీ అధికారంలోకి వచ్చాక అంతగా లాభపడతారు’ అని చెప్పడంతో సభలోని వారంతా ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయటం సరికాదన్నారు. ఈ ప్రభుత్వం తప్పుడు సలహాలు ఇస్తున్న సలహాదారులకు ఇప్పటివరకు రూ.680 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. అన్న క్యాంటీన్లు మూత వేసిన ఈ సీఎం పేదల మనిషి ఎలా అవుతారని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ అవినీతికి పాల్పడుతున్నారని, అభివృద్ధి చేయలేదని తెలిపారు. జనసేన టీడీపీ మధ్య వివాదాలు సృష్టించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని అన్నారు. తాము అనేక రకాలుగా సర్వేలు చేయించి ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి 99 మంది అభ్యర్థులను ప్రకటించామన్నారు. ఈ రోజు నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చి సైకిల్ ఎక్కాలని, కనబడిన ప్రతి చోటా తెలుగుదేశం పారీ్టకి ఓటు వేయటంపై చర్చించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఖాళీ అయిన సభ గంటపాటు సాగిన చంద్రబాబు ప్రసంగంలో చెప్పిందే చెబుతూ సాగదీయడంతో ప్రజలకు విసుగుపుట్టి ఆయన ప్రసంగం మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. ఆయన ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రజలు లేచి వెళ్లిపోవడం ప్రారంభించారు. చివరికి వచ్చేసరికి సభా ప్రాంగణం ఖాళీ అయింది. ఎన్టీఆర్ కు బదులు ఎర్రన్న స్మరణ తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభ నిర్వహించినా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం పరిపాటి. కానీ, శ్రీకాకుళంలో సోమవారం జరిగిన రా.. కదిలిరా.. సభలో కొత్త ఆనవాయితీ తీసుకువచ్చారు. దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు విగ్రహాన్ని వేదికపై ఉంచి ఆయన స్మరణతో సభను జరుపుకుందామంటూ ఎర్రన్న విగ్రహానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. -
2 వేలు ఇచ్చి 2 ఎకరాలు కొట్టేసిన బాబు
-
లోకేష్ శంఖారావం అట్టర్ ఫ్లాప్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీది బలుపా..? వాపా..? ఈ ప్రశ్నకు ఒకే ఒక్క పర్యటనతో చినబాబు లోకేష్ సమాధానం చెప్పేశారు. శంఖారావం పేరుతో అట్టర్ ఫ్లాప్ షో నిర్వహించి టీడీపీది వాపేనని రుజువు చేసేశారు. ఎంత ప్రయత్నించినా రెండు మూడు రోజుల ముందు నుంచీ ఆ సభలకు రెండు, మూడు వేల మంది కూడా హాజరు కాకపోవడం చూసి అసలుకే ఎసరొచ్చిందని ఆ పార్టీ శ్రేణులు బాధ పడుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నాయకుడికొచ్చిన జనాలు కూడా హాజరు కాకపోవడంతో లోకేష్‌కున్న ఇమేజ్, ఆ పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానం స్పష్టంగా తెలిసిపోయింది. క్వార్టర్ మద్యం, బండికి పెట్రోల్ కూపన్, మనిషికింతని సొమ్ము, ప్రయాణించేందుకు వాహనాలు సమకూర్చినప్పటికీ లోకేష్ సభలకు జనాలు రాలే దు. అధికారంలో ఉన్నంత సేపూ ప్రజలను మోస గించి, హామీలను విస్మరించి, అభివృద్ధిని గాదిలికొదిలేశారన్న అభిప్రాయంతో ప్రజలంతా ఉండటంతో లోకేష్ పర్యటన పేలవంగా సాగింది. లోకేష్ పర్యటనతో అసలుకే ఎసరొచ్చిందని, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఉన్న బలమేంటో తేలిపోయిందని సాక్షాత్తు ఆ పార్టీ సానుభూతి పరులే వాపోయారు. ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల...ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా సభలకు జనాల్లేరు. రెండు మూడు వేల మంది మాత్రమే కన్పించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో రెండు మూడేసి గ్రూపులు ఉన్నాయి. లోకేష్ పర్యటనతో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆ గ్రూపులు ఆరాటపడ్డాయి. కానీ, ఖాళీ కుర్చీలతో వారికి వాస్తవ పరిస్థితులు చివరికి అర్థమయ్యాయి. కుమ్ములాటకు కేరాఫ్.. ► లోకేష్ పర్యటనతో పార్టీకి మేలు జరగకపోగా, ఆ పార్టీ బలహీనత బయటపడింది. దానికి తోడు గ్రూపు రాజకీయాలు గొడవలకు దారితీశాయి. లోకేష్ సాక్షిగానే కొందరు కొట్టుకున్నారు. దీనికంతటికీ తండ్రీకొడుకులు చెరో వర్గాన్ని ప్రోత్సహించడమే కారణమని సభలకు హాజరైన జనాలే వ్యాఖ్యానించారు. ► పలాసలో టీడీపీలో రెండు వర్గాలు గట్టిగా తన్నుకున్నాయి. సభా ప్రాంగణం వద్ద పిడిగుద్దులు గుద్దుకున్నారు. పలాస, మందస టీడీపీ నాయకుల మధ్య గొడవ జరిగింది. ► నరసన్నపేటలో బగ్గు లక్ష్మణరావు వర్గీయులు లోకేష్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ బగ్గు రమణమూర్తి వారిని అడ్డుకున్నారు. దీంతో గొడవ జరిగింది. దీంతో బగ్గు లక్ష్మణరావు వర్గీయులు సభకు గైర్హాజరయ్యారు. టిక్కెట్ ఆశిస్తున్న బగ్గు శ్రీనివాసరావు కూడా హాజరు కాలేదు. ► శ్రీకాకుళంలో లోకేష్ సభకు ముందు రోజు రాత్రి గొండు శంకర్ ప్లెక్సీలను చించేశారు. అదేవిధంగా లోకేష్ పర్యటనలో గొండు శంకర్‌కు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈయన పేరు కూడా ప్రస్తావించలేదు. గొండు శంకర్‌ను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో ప్రాధాన్యత లేని తాము ఎందుకు పనిచేయాలని ఆయన వర్గీయులంతా తిట్టిపోశారు. ► పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు వర్గాలు నువ్వానేనా అన్నట్టు వ్యవహరించడంతో లోకేష్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. మామిడి ఫ్లెక్సీలను చాలా వరకు చింపేశారు. సభ జరిగిన రోజైతే మామిడి గోవిందరావును వేదికపైకి రానివ్వకూడదని కలమట చివరి వరకు ప్రయత్నించారు. కాకపోతే, మామిడి గోవిందరావు దూకుడుగా వెళ్లడంతో వేదికపైకి రానివ్వకుండా అడ్డుకోలేకపోయారు. ఒకానొక సందర్భలో ఇరువర్గాలు రక్తం వచ్చేలా కొట్టుకుంటారనే ప్రచారం జరగడంతో అంతా అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. ► ఎచ్చెర్లలో కళా వెంకటరావు, కలిశెట్టి అప్పలనాయుడు మధ్య బహిరంగంగా ఫైట్ జరిగింది. లావేరులో జరిగిన సభ ప్రాంగణంలోకి కలిశెట్టిని రానివ్వకుండా కళా వెంకటరావు దగ్గరుండి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి కలిశెట్టి దూసుకుని వెళ్లడంతో కళా వెంకటరావు చేసేదేమి లేక వెనక్కి తగ్గారు. లేదంటే ఇక్కడ రక్తం వచ్చేలా కొట్టుకునేవారు. కళింగ కోమట్లకు అవమానం టెక్కలిలో కళింగ కోమట్లను లోకేష్ తీవ్రంగా అవమాన పరిచారు. తమ సామాజిక వర్గ సమస్యలను చెప్పేందుకు వచ్చిన కళింగ కోమట్ల పెద్దలను కలవకుండా ముఖం చాటేశారు. వీరిలో టీడీపీ నాయకులే ఎక్కువ మంది ఉన్నా లోకేష్ కలవలేదు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకుంటే...లోకేష్ తన దగ్గరికి వచ్చిన వారిని కలవకుండా అవమాన పరిచారని కళింగ కోమటి పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులకు తీవ్ర అవమానం ► రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా ఉందన్నది అందరికీ తెలిసిందే. ప్యాకేజీ రా జకీయాలతో చంద్రబాబు పంచన పవన్ కల్యాణ్ చేరినంతగా జనసైనికులు క్షేత్రస్థాయిలో కలవలేకపోతున్నారు. వారి ఆధిప త్యం ఎక్కువైపోతోందని టీడీపీ శ్రేణులు దగ్గరకు చేర్చుకోలేకపోతున్నాయి. దీంతో లోకేష్ పర్యటన ఆద్యంతం జనసేన నాయకులకు అవమానం ఎదురైంది. సభా ప్రాంగణంలో కి వారిని రానివ్వకుండా అడ్డుకున్నారు. లోకేష్ కూడా వారిని కలుపుకోవడానికి ఆసక్తి చూపలేదు. పొత్తు ధర్మం పాటించాలని పవ న్ కల్యాణ్ పిలుపు ఇవ్వడమే తప్ప టీడీపీ నుంచి ఆ ధర్మమేంటో కన్పించలేదని జనసైనికులు బాహాటంగానే పెదవి విరిచారు. ► ఇచ్ఛాపురంలో శంఖారావం సభకు రావద్దంటూ జనసేన నేతలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అవమాన భారంతో జనసేన నాయకులు వెనుదిరిగారు. ► పలాసలో జనసేన నాయకులు చాలావరకు లోకేష్ సభకు హాజరు కాలేదు. ఆ పార్టీ నాయకుడు కోత పూర్ణచంద్రరావుకు కనీసం ఆహ్వానం అందలేదు. దీంతో లోకేష్ సభకు జనసైనికులు చాలా మంది దూరంగా ఉండిపోయారు. కొందరు వచ్చినా సభా ప్రాంగణంలోకి రానివ్వలేదు. దీంతో టీడీపీ, జనసేన వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టెక్కలి, నరసన్నపేటలో కూడా దాదాపు ఇదే జరిగింది. -
Ratha Saptami: రథసప్తమి వైభవం
సాక్షి, తిరుపతి: తిరుమలకు మినీ బ్రహోత్సవంగా పిలువబడే రథసప్తమి మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. సూర్య జయంతి వేడుకలతో టీటీడీ ఆలయ మాడ వీధుల్లో భక్తసందోహం నెలకొంది. సప్త వాహనాల సేవలో భాగంగా.. తొలుత సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. రాత్రి చంద్ర ప్రభ వాహనంతో వాహన సేవలు ముగియనున్నాయి. ఇక రథసప్తమి మహోత్సవాలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. ఉదయం భానుని తొలిరేఖలు సూర్యప్రభ వాహనంపై కొలువైన స్వామివారి నుదుటన, నాభి, పాదకమలాలపై ప్రసరించే అద్భుత దృశ్యాన్ని తిలకించడానికి భక్తులు ఎదురుచూస్తుంటారన్నది తెలిసిందే. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. మహద్వారం నుంచి స్వామి సన్నిధి వరకు రంగురంగుల పుష్పాలంకరణలు చేపట్టారు. ఇందుకోసం ఏడు టన్నుల సంప్రదాయ పుష్పాలు, 50వేల కట్ ఫ్లవర్స్ వినియోగించారు. భక్తుల భద్రతకు పటిష్ఠ చర్యలను టీటీడీ నిఘా, భద్రతా విభాగం, పోలీసుశాఖ చేపట్టింది. వాహన సేవలు ఇలా.. తెల్లవారుజామున 5.30-8.00 సూర్యప్రభ (సూర్యోదయం 6.40) ఉదయం 9-10 : చిన్నశేష ఉదయం 11-12 : గరుడ వాహనం మధ్యాహ్నం 1-2 : హనుమంత మధ్యాహ్నం 2-3 : చక్రస్నానం సాయంత్రం 4-5 : కల్పవృక్ష సాయంత్రం 6-7 : సర్వభూపాల రాత్రి 8-9 : చంద్రప్రభ తిరుమలలో నేడు ప్రొటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది. శనివారం వరకు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేసిన నేపథ్యంలో భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి శ్రీవారిని దర్శించుకోవచ్చు. అలాగే.. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యజయంతిని పురస్కరించుకొని టీటీడీ స్థానిక ఆలయాల్లో రథసప్తమి ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. దీంతో.. స్థానిక ఆలయాలైన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామాలయం, శ్రీనివాసమంగాపురంల శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం తదితర ఆలయాల్లో రథసప్తమి పర్వదినం నిర్వహిస్తున్నారు. మరోవైపు.. తిరుచానూరు శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈరోజు సూర్యప్రభ వాహనం సేవతో మొదలై.. రాత్రి గజ వాహనంపై అమ్మవారు దర్శనమిస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆలయ మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం భారీ షెడ్లను ఏర్పాటు చేసింది. రథ సప్తమి ప్రశస్తి.. మాఘ శుద్ధ సప్తమి సూర్యజయంతి రథసప్తమిగా ప్రశస్తి పొందింది. అదితి కశ్యపులకు సూర్య భగవానుడు జన్మించిన సుదినమిది. రథసప్తమి ఉత్తరగతిని సూచించే పండుగ. రథసప్తమిని సూర్యజయంతి, జయంతి సప్తమి, మహాసప్తమి, సౌరసప్తమి, భాస్కర సప్తమి మొదలైన పేర్లతో విభిన్న ప్రాంతాల్లో పిలుస్తారు. నిజానికి రథసప్తమి నుంచే ఆదిత్యుడి ప్రయాణం దక్షిణం నుంచి ఉత్తర దిశకు ప్రారంభమైందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ రోజున స్వర్గస్థులైన పితృదేవతలకు తర్పణాలు విడుస్తారు. ఒకప్పుడు రథసప్తమినే ఉగాదిగా వ్యవహరించేవారట. రాష్ట్రంలో పలు ఆలయాల్లో.. రథసప్తమి సందర్భంగా ప్రత్యేక పూజలు, రథయాత్రల నేపథ్యంలో.. రాష్ట్రంలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయంలో స్వామివారికి అర్ధరాత్రి క్షీరాభిషేకం తో ప్రత్యేక పూజలు చేశారు. సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం కోసం వేల సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సహా పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు జిల్లాలోని వజ్రపుకొత్తూరు (మం ) అక్కుపల్లి శివసాగర్ బీచ్ కు భక్తులు పోటెత్తారు. కృష్ణాజిల్లా మోపిదేవిలో వైభవంగా శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సుబ్రహ్మణ్య క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మోపిదేవి పురవీధుల్లో వల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు, ఆలయ ఏసీ నల్లం సూర్య చక్రధరరావు ప్రారంభించారు. -
ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. చీకూ చింతా లేకుండా జీవిస్తున్నా.. గోడలకు రంగులు వేయడం నా వృత్తి. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. శ్రీకాకుళం సమీపంలోని కాజీపేటకు చెందిన నాది దినసరి కూలీ బతుకు. రెక్కాడితేగానీ డొక్కాడదు. ఉన్నదాంట్లో ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో నా భార్యకు ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. ఆమెకు చికిత్స చేయించేందుకు శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చాను. ఆమెకు సహాయంగా నేనూ ఆస్పత్రిలోనే ఉండేవాడ్ని. ఇంతలో డిసెంబర్ 28వ తేదీన ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చింది. వెంటనే ఆస్పత్రిలో వైద్యులు నన్ను పరీక్షించి స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో సమీపంలోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ చేస్తుండగానే మరోసారి స్ట్రోక్ వచ్చింది. అయినా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. విశ్రాంతి సమయంలో ఆసరాగా రూ.10 వేల వరకు డబ్బులు జమ చేశారు. నా భార్య కన్ను మూసింది. ఒంటరిగానే ఉంటున్న నాకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. రేషన్‌కార్డు ఉండటంతో బియ్యం, పప్పు ఉచితంగా వస్తున్నాయి. ఇంకా నెలనెలా అవసరమైన మందులు మా ఊరికే తెచ్చి ఇస్తున్నారు. ఇప్పుడు నాకు ఏ చింతా లేదు. – సాధు మల్లేసు, కాజీపేట (బలివాడ శివప్రసాద్, విలేకరి, అరసవల్లి) అద్దె భారం తప్పింది మా ఆయన వెంకట నూక శివ అప్పారావు పెయింటింగ్ పని చేస్తుంటాడు. ఆయన సంపాదనతోనే కుటుంబం మొత్తం గడవాలి. పనులు ఉంటేనే ఆదాయం. లేదంటే అప్పులతోనే జీవనం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లిలో ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లోనే కాపురం చేస్తున్నాం. ఒక్కో నెల ఆదాయం ఉండేది కాదు. అలాంటి సమయంలో అప్పు చేసి అద్డె చెల్లించాల్సి వచ్చేది. గత ప్రభుత్వ హయాంలో పలు మార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసినా ఫలితం లేక పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటి పట్టా మంజూరు చేయాలని సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. వెంటనే స్థలంతోపాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.లక్షా 80 వేలు సాయం అందించారు. దీంతో సొంతిల్లు నిర్మించుకొని గృహ ప్రవేశం చేశాం. అద్దె బాధ తప్పడంతో సంతోషంగా కుటుంబ పోషణ సాగుతోంది. మాకు ఇద్దరు సంతానం. మా బాబుకు అమ్మఒడి పథకం ద్వారా మూడు సంవత్సరాలుగా రూ.45 వేలు అందింది. మా మామ మల్లేశ్వరరావుకు వృద్ధాప్య పింఛన్ ప్రతి నెలా ఒకటో తేదీనే అందుతోంది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి. మళ్లీ ఆయనే సీఎం కావాలని కోరుకుంటున్నాం. – కొయిలాడ ఇందు, వాడ్రాపల్లి (వెలగా జగదీష్ కుమార్, విలేకరి, మునగపాక) ఉన్న ఊళ్లోనే ఉపాధి దొరికింది మాది పేద కుటుంబం. నేను బీఎస్సీ, నా భర్త శ్రీనివాసరావు ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేశాం. ఇద్దరం నిరుద్యోగులం. నా ఇద్దరు కుమారులు ప్రభుత్వ బడిలో చదువుతున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం కొప్పర గ్రామానికి చెందిన మాకు ఇక్కడ బతుకు తెరువు లేకపోవడంతో వలస వెళ్లిపోవాలని అనుకున్నాం. ఇంతలో ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత మా కుటుంబ జీవన స్థితిగతుల్లో మార్పు వచ్చింది. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.30 వేలు వచ్చింది. వెలుగు శాఖ ద్వారా స్త్రీనిధి రుణం రూ.2 లక్షలు, సీఐఎఫ్ రుణం రూ.1.50 లక్షలు, పీఎంఎఫ్ఎంఈ కింద రూ.6.90 లక్షలు తీసుకుని దాంతో మాప్స్టిక్స్(తుడుపు కర్రలు) యూనిట్ నెలకొల్పాం. అనంతరం మినపగుళ్లు తయారీ యంత్ర పరికర యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాం. నా భర్త శ్రీనివాసరావు సహాయంతో రెండు రకాల యూనిట్ల ద్వారా వ్యాపారం సాగిస్తున్నాం. నెలకు రూ.30 వేల వరకు సంపాదించుకొని నిరుద్యోగాన్ని పారదోలాం. అమ్మ ఒడి పథకం కింద ఏటా రూ.15 వేలు వస్తోంది. మా అమ్మమ్మ వరహాలమ్మకు వైఎస్సార్ పింఛన్ కానుక వర్తిస్తోంది. ఇప్పుడు మేము ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉన్న ఊళ్లోనే జీవిస్తున్నాం. ఈ ప్రభుత్వం చేసిన సాయం మరచిపోలేం. – లగ్గు మౌనిక, కొప్పర(తూముల మహేశ్వరరావు, విలేకరి, వంగర)