సిక్కోలులో తండేల్ టీమ్‌.. చైతూకు మాస్‌ వెల్‌కమ్‌! | Akkineni Naga Chaitanya Gets Huge Response From Fans At Srikakulam Shoot | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: సిక్కోలులో తండేల్ టీమ్‌ సందడి.. ఫ్యాన్స్‌ గ్రాండ్‌ వెల్‌కమ్‌!

Published Wed, Jun 19 2024 4:41 PM | Last Updated on Wed, Jun 19 2024 4:54 PM

Akkineni Naga Chaitanya Gets Huge Response From Fans At Srikakulam Shoot

అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్‌గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.

అయితే ప్రస్తుతం తండేల్‌ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్‌ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్‌కమ్‌ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్‌ మాస్‌ వెల్‌కమ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో  హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్‌ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ 20న రిలీజ్ చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement