టాలీవుడ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం తండేల్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతిలిచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.50 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అలాగే మల్టీప్లెక్స్‌ల్లో రూ.75 అదనంగా వసూలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ టికెట్ ధరలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
(ఇది చదవండి: తండేల్ మూవీ.. నాగచైతన్య జర్నీ చూశారా?)
చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కించిన తండేల్ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. శ్రీకాకుళంలో జరిగిన రియల్ స్టోరీ అధారంగా ఈ సినిమాను రూపొందించారు. పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారులను బంధించి పాక్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో సాయి పల్లవి చైతూ సరసన హీరోయిన్‌గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కోసం చైతూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్..
తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరు కావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా రాలేకపోయారు. ఈ విషయాన్ని బన్నీ తండ్రి అల్లు అరవింద్ వెల్లడించారు. ఈ ఈవెంట్‌లో రియల్ తండేల్ రాజ్ అలియాస్ రామారావు తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment