Sai Pallavi
-
నేనూ మనిషినే కదా.. నా ముందు ఇలాంటి పని చేయకండి: సాయిపల్లవి
నటీనటులకు ఒక్కొక్కరికీ ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. కొందరు లోప్రొఫైల్ను మెయింటెయిన్ చేస్తే, మరొకరు హై ప్రొఫైల్‌ను మెయిన్‌టెయిన్ చేస్తుంటారు. ఇకచాలా మంది హంగులు, ఆర్భాటాలు చేస్తుంటారు. మరి అలాంటి వారిలో నటి సాయిపల్లవి (Sai Pallavi) ఏ కోవకు చెందుతుందో చూద్దాం. ఈమె సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారన్నది అందరికీ తెలిసిందే. అదే సాయిపల్లవి కెరీక్‌కు ప్లస్ అయ్యిందేమో. ప్రేమమ్(Premam) అనే మలయాళ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి. తొలి చిత్రంలోనే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న తమిళ భామ ఈమె.ఆ చిత్రం సాయిపల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ను చేసిందనే చెప్పాలి. ఆ తరువాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు 90 శాతంకు పైగా సక్సెస్ అయ్యాయి. తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తెలుగులో నటుడు నాగచైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్(Amaran) చిత్రం సంచన విజయాన్ని సాధించడంతో పాటూ సాయిపల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయిపల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి, నచ్చని విషయాలు ఉండటం సహజం అని చెప్పింది. కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతుంటాయని అంది. తనకు ఫొటోలు తీయడం అస్సలు నచ్చదని చెప్పింది. బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్‌గా సెల్ఫోన్లో తనను ఫొటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని చెప్పింది. అలాంటప్పుడు తాను చెట్టునో, సుందరమైన భవనాన్నో కాదనీ, జీవం ఉన్న మనిషిని కథా అని అనిపిస్తుందన్నారు. మీమ్మల్ని ఒక్క ఫొటో తీసుకోవచ్చా? అని అడిగి తీసుకుంటే ఎంత భాగుంటుందీ అని పేర్కొంది. తన చుట్టూ చాలా మంచి ఉన్నప్పుడు లేదా అందరూ తననే చూస్తున్నప్పుడు కొంచెం భయంగానూ, కొంచెం బిడియంగానూ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాకుండా హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అంది. ఆ అలవాటును మానకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నాననీ, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్‌ను వేసుకుని సాంప్రదాయ బద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయిపల్లవి చెప్పుకొచ్చింది. -
జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి
నటి సాయి పల్లవి సినిమా రంగంలో సంపాదించుకున్న పేరు మామూలుగా లేదు. ముఖ్యంగా గ్లామర్‌కు దూరంగా సహజ నటిగా ముద్ర వేసుకున్న ఈ బ్యూటీ మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా పరిచయమైంది. అయితే, సాయి పల్లవి తన తొలి చిత్రంతోనే నటనలో తనదైన ముద్ర వేసుకుంది. దీంతో వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ పలు చిత్రాల్లో నటించి సక్సెస్ ఫుల్ కథానాయకిగా రాణిస్తోంది. అదేవిధంగా కోలీవుడ్ లోనూ నటిస్తూ దక్షిణాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇటీవల శివకార్తికేయన్‌కు జంటగా అమరన్ చిత్రంలో నటించి మరోసారి నటిగా తన సత్తా చాటుకుంది. కథలోని తన పాత్ర నచ్చితేనే నటించడానికి సమ్మతించే ఈమె పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎలాంటి అవకాశం అయినా తిరస్కరిస్తుంది. అయితే తాజాగా అందుకు భిన్నంగా ఒక అవకాశాన్ని చేజార్చుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరందుకుంది. అదే నటుడు విక్రమ్ సరసన నటించే అవకాశం అని సమాచారం. తంగలాన్ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించిన నటుడు విక్రమ్ ప్రస్తుతం వీర వీర సూరన్ చిత్రంలో నటిస్తున్నారు. ఎస్.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా తదుపరి మడోన్ అశ్విన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు ఈ దర్శకుడు ఇంతకుముందు యోగిబాబు కథానాయకుడిగా మండేలా, శివ కార్తికేయన్ హీరోగా మావీరన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. కాగా విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. కాగా ఇందులో విక్రమ్ సరసన నటి సాయిపల్లవి నటింపజేసే ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా ఆమె ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న సాయిపల్లవి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విక్రమ్‌తో కలిసి ఒక సినిమా చేస్తే అంచనాలు భారీగానే ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అనేది ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి ఉంది. అదేవిధంగా విక్రమ్ దర్శకుడు మండోన్ అశ్విన్ కాంబోలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన అబ్బాయి.. ఎవరంటే?
సినిమా తారలకు డబ్బింగ్ చెబుతారని మనకు తెలిసిందే. సాధారణంగా మగవారికి మేల్ వాయిస్ ఆడవారికి ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్‌లు ఉంటారు. కానీ, అమ్మాయిలకు అబ్బాయి డబ్బింగ్ చెబితే..! ఆశ్చర్యమనిపించక మానదు...ఎంబీబీఎస్ చేసిన ఆద్య హనుమంత్ ఇప్పటి వరకు సమంత (Samantha), సాయిపల్లవి, అవికాగోర్.. ఇలా తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ సినిమా హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పాడు. ఇప్పటి వరకు 175 సినిమాలలకు డబ్బింగ్ చెప్పిన ఆద్య హనుమంత్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ వాసి. కర్ణాటకలోని రాయచూరులో ఉంటున్న ఆద్య హనుమంత్‌కి ఇలాంటి క్రేజీ వాయిస్ ఎలా అబ్బిందో, సినిమాలకు స్పెషల్ వాయిస్ ఆర్టిస్ట్ (Voice Artist)గా ఎలా మారారో అతని మాటల్లోనే తెలుసుకుందాం..నా వయసు ఇప్పుడు 22 ఏళ్లు. పదమూడేళ్ల వయసు నుంచి డబ్బింగ్ చెబుతున్నాను. స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు నా వాయిస్ బాగుంటుందని సీరియల్స్‌లోని చైల్డ్ ఆర్టిస్టులకు డబ్బింగ్ చెప్పించేవారు. తర్వాత్తర్వాత హీరోయిన్లకు నా వాయిస్ కనెక్ట్ అయ్యింది.నాలుగు భాషల్లో...సాధారణంగా ఇతర భాషల్లోని డబ్బింగ్ ఆర్టిస్టులు మన దగ్గర ఫేమస్‌గా ఉంటారు. నేను మాత్రం తెలంగాణ నుంచి తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తున్నాను. సమంత, సాయిపల్లవి, ఐశ్వర్య, అవికా... ఇలా ప్రముఖ హీరోయిన్లందరికీ డబ్బింగ్ చెప్పాను.ఒక పూట తిండి అయినా మానేస్తా!నా గొంతు అమ్మాయిల మాదిరి ఉంటుందని, మరింత స్పెషల్‌గా ఉంటుందని అంతా అంటుంటారు. ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అదంతా దేవుడి దయ. ఇష్టమైన పని కావడంతో డబ్బింగ్, చదువు రెండింటినీ ప్రేమిస్తాను. కష్టంగా ఉన్నా ఒక పూట తిండి అయినా మానేస్తాను. కానీ, చదువుతోపాటు డబ్బింగ్ కూడా నాకు ప్రాణమే. ఎప్పుడు ఈ గొంతు మారబోతుందో చెప్పలేను. కానీ, ప్రేక్షకులు ఎంత కాలం కోరుకుంటే అంతకాలం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతాను. ప్రత్యేకించి ప్రాక్టీస్ ఏమీ ఉండదు. డైలాగ్ మాడ్యులేషన్ మాత్రం పలికిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుంది.వెక్కిరించారు... ‘ఆడపిల్లలా ఆ గొంతేంటి?’ అని వేళాకోలం అడినవారు ఉన్నారు. మొహమ్మీదనే చులకనగా మాట్లాడిన వారూ ఉన్నారు. కానీ, మా అమ్మ ఒకసారి చెప్పింది. ‘దేవుడు, నీకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఎందుకిచ్చాడో గమనించు. మనం చేయాలనుకున్న పని సాధారణంగా ఉండకూడదు. ఎంత రిస్క్ అయినా ఒక్క అడుగు ముందుకే వేసి చూడు’ అని చెప్పేది. ఆ మాటలు నాకు ఈ రోజు ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తున్నాయి. చాలా మంది తమ సమస్యలను నాతో చెప్పుకోవడానికి ఇష్టపడుతుండేవారు. దీంతో ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడు సైకియాట్రీ ఎంచుకోవాలనుకున్నాను. సైకియాట్రీలో పీజీ చేస్తున్నాను. మెడికల్, సినీ ఫీల్డ్‌ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణించాలనుకుంటున్నాను. శని, ఆదివారాలు డబ్బింగ్‌కి ఎంచుకుంటున్నాను. మిగతా రోజుల్లో చదువు, సంగీతానికి ప్రాధాన్యత ఇస్తాను. యూనివర్శిటీ ప్రొఫెసర్లు నాకు చాలా సపోర్ట్ చేస్తుంటారు.వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియా... సోషల్ మీడియా అనగానే అప్‌కమింగ్ స్టార్స్ అందరూ అక్కడే ఉంటారు. దీంతో నేనూ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటూ వచ్చాను. ‘ఇట్లు మీ సీతా మహాలక్ష్మి’ అనే పేజీ ప్రారంభించాను. సోషల్‌మీడియా ద్వారా ఎంతో మంది నాకు స్నేహితులయ్యారు. తెలుగు నుంచి తమిళ్, కన్నడ నుంచి తెలుగు ప్రముఖుల కవిత్వాలను అనువాదం చేస్తుంటాను. సోషల్ మీడియా ద్వారా తూర్పు గోదావరి జిల్లాలో సీతానగరంలోని ఓ కుటుంబానికి నాకు స్నేహం కుదిరింది. దీంతో సంక్రాంతి పండగకు సీతానగరం వచ్చేశాను. గోదావరి అందం, వారి పలకరింపులు, ఆప్యాయత, పిండివంటలు ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ వాయిస్ ఇలాగే ఉంటుంది అని చెప్పలేను. ఇప్పటికైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. కర్నాటకలో ఉన్నా నాకు మాత్రం తెలుగు ఇండస్ట్రీనే బాగా సపోర్ట్ చేసింది. మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెబుతాడు ఈ ఫిమేల్ వాయిస్ ఆర్టిస్ట్.– నిర్మలారెడ్డి View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial) View this post on Instagram A post shared by dr. adhyaa (@adhyaahanumanthuofficial)చదవండి: కట్టెలపొయ్యి మీద చేపల పులుసు వండిన నాగచైతన్య -
నటన వదిలేయాలనుకున్నా..నా భార్య మాటలే నిలబెట్టాయి
తమిళ హీరో శివకార్తికేయన్ రాజ్‌కుమార్ పెరియసామి ’అమరన్’ తో ఒక్కసారిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇండియన్ ఆర్మీ రాజ్‌పుత్ రెజిమెంట్‌లో కమీషన్డ్ ఆఫీసర్‌గా ఉన్న మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కధగా తీసిన అమరన్ చిత్రం మంచి రివ్యూలను అందుకొని సూపర్‌హిట్‌గా నిలిచింది. దాంతో తమిళనాడులో మరో సూపర్ స్టార్ అవతరించినట్టేనని సినీ విశ్లేషకులు తీర్మానించేశారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తర్వాత శివకార్తికేయన్... అఖమురుగదాస్ వెంకట్ ప్రభు వంటి ప్రఖ్యాత దర్శకుల చిత్రాలకు సంతకం చేశాడు.అలుపెరుగని యాత్ర...ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినిమా ప్రపంచంలోకి ప్రవేశించిన శివకార్తికేయన్ సాధించిన విజయం...సాగించిన ప్రయాణం చాలా మందికి స్ఫూర్తి దాయకం. కాలేజీ రోజుల్లోనే స్టాండప్ కమెడియన్, మిమిక్రీ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్ నటుడు..కూడా. ఆ తర్వాత తొలుత స్టార్ విజయ్ టీవీ వేదికగా.. 2011లో టీవీ షోలను హోస్ట్ చేయడం ద్వారా శివకార్తికేయన్ తన కెరీర్‌ను ప్రారంభించాడు నిదానంగా సినిమాల్లోకి వచ్చి మొదట్లో సహాయక పాత్రలను పోషించాడు, సినిమాల్లోకి వచ్చి పుష్కరకాలం పూర్తయిన తర్వాత గానీ అతనికి పెద్ద బ్రేక్ వచ్చిందని చెప్పాలి. ఈ నేపధ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, శివకార్తికేయన్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితం నటన నుంచి నిష్క్రమించాలని భావించినట్లు వెల్లడించాడు, అయితే తన భార్య ఆర్తి చెప్పిన స్ఫూర్తి దాయకమైన మాటలే తనని నటన కొనసాగించడానికి ప్రేరేపించాయంటూ చెప్పుకొచ్చాడు.పరిశ్రమ మంచిదే...వ్యక్తులే....సినిమా పరిశ్రమలో కొందరు వ్యక్తులతో తనకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకున్నప్పటికీ, పరిశ్రమపై తనకు ఎటువంటి ఫిర్యాదులు లేవని శివకార్తికేయన్ స్పష్టం చేశాడు. ఆర్ధిక ఇబ్బందులతో సహా కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ.. తన నటనా ప్రయాణాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నానన్నాడు. అయితే తన పోరాటాలు తన కుటుంబాన్ని ప్రభావితం చేయకూడదని ఎప్పుడూ కోరుకున్నానని, తన వారు సాధారణ జీవితాలను గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నానన్నారు. తన ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో భార్య, అత్తమామలు, పిల్లలపై భారం వేయకూడదని భావించానని చెప్పాడు. అయితే భార్య మాటలతో స్ఫూర్తి పొంది... అడ్డంకులను అధిగమించడానికి మార్గాలను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. ఒక ఎంబిఎ గ్రాడ్యుయేట్ గా, అతను ఈ సవాళ్లను ఎలా అధిగమించాలో తెలుసుకోగలిగాడు.కుమార్, చియాన్ తర్వాత నువ్వే...అన్న భార్యఇండస్ట్రీలో కొనసాగాలనే తన నిర్ణయంలో తన భార్య ఆర్తి ప్రోత్సాహం కీలక పాత్ర పోషించిందని ఈ అమరన్ హీరో వెల్లడించాడు. ‘ఇక్కడకి వచ్చేటప్పుము ’మీ దగ్గర ఏమీ లేదు, అయినా సరే మీరు ఇంత దూరం వచ్చారు. గత 20 ఏళ్లలో,కుమార్ (అజిత్) సార్ చియాన్ (విక్రమ్) సార్ తర్వాత, బయటి వ్యక్తి ఎవరూ ఈ పరిశ్రమలో పెద్దగా ఎదిగింది లేదు, కాని నువ్వు అది సాధించావ్. ’ఇది అంత తేలికైన పనిగా తీసిపారేయవద్దు.’మీ స్టార్డమ్ ప్రయోజనాలను మేం అనుభవిస్తున్నాం కాబట్టి,కొన్ని ప్రతికూల అంశాలను కూడా ఎదుర్కోగలం’’ అని తన భార్య చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నాడు.సినీ పరిశ్రమలో తన ఎదుగుదల సమయంలో ఎదుర్కొన్న శత్రుత్వం సవాళ్ల గురించి కూడా శివకార్తికేయన్ చర్చించారు. ‘సామాన్యుడు‘ నుంచి విజయవంతమైన నటుడిగా తన ప్రయాణాన్ని కొందరు స్వాగతించగా, మరికొందరు బహిరంగంగా విమర్శించారని, పరిశ్రమలో అతని స్థానాన్ని ప్రశ్నిస్తూ వ్యాఖ్యలు చేశారని, గత ఐదేళ్లలో గణనీయమైన కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, ప్రయాణం కొనసాగించానని ఘర్షణ లేకుండా ముందుకు సాగాలని కోరుకున్నానన్నాడు..అయితే నేటి తన విజయం విమర్శకులకు ఖండన అనుకోనక్కర్లేదని, సహకరించిన కష్టపడి పనిచేసే తన చిత్ర బృందాలకుు, తన పట్ల అంకితభావంతో ఉన్న అభిమానులకు అతని కథ నుండి ప్రేరణ పొందిన వారికి వేడుకగా మాత్రమే అనుకోవాలని వినమ్రంగా చెబుతున్నాడు. -
బలగం వేణు సినిమా లో ఎల్లమ్మ గా సాయి పల్లవి
-
లక్కీ భాస్కర్ తర్వాత 'దుల్కర్ సల్మాన్' చేతిలో రెండు సినిమాలు
లక్కీ భాస్కర్‌తో ప్రేక్షకులను మెప్పించిన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నారు. షూటింగ్ పనులు మొదలు కూడా త్వరలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే సినిమా తెరకెక్కించనున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు.ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో స్వప్నా సినిమాస్, వైజయంతీ మూవీస్, లైట్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్, గీతా ఆర్ట్స్ పతాకాలపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ సినిమాను నిర్మించనున్నారు. దుల్కర్ మునుపెన్నడూ నటించన విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత దర్శకుడిగా ఈ ప్రాజెక్ట్‌కు పనిచేస్తుండగా.. సుజిత్ సారంగ్ కెమెరామెన్‌గా వ్యహరించనున్నట్లు తెలిసింది. దుల్కర్ సల్మాన్ తెలుగులో ఇప్పటికే 'కాంత' అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో కొనసాగుతుంది. ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో నటిస్తుంది.ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాలో హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని తీసుకోవాలని చిత్రయూనిట్ భావిస్తోందని, ఈ కథ సాయి పల్లవికి వినిపించగా, ఆమె కూడా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని టాక్. మరి... దుల్కర్–సాయి పల్లవి జోడీ కుదురుతుందా? అంటే వేచి చూడాల్సిందే. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని యూనిట్ పేర్కొంది. -
నమో నమః శివాయ సాంగ్: చై, సాయిపల్లవి తాండవం చూశారా?
యువ సామ్రాట్ నాగ చైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'తండేల్' (Thandel Movie). చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ సింగిల్ "బుజ్జి తల్లి" సెన్సేషనల్ హిట్ అయింది. ఇప్పుడు అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ "నమో నమః శివాయ" లిరికల్ (Namo Namah Shivaya Lyrical Song) వీడియోను రిలీజ్ చేశారు. మహాదేవ్ నామస్మరణతో కొనసాగిన ఈ శివ శక్తి పాట బ్రీత్ టేకింగ్ మాస్టర్ పీస్. డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా పాడాడు. హరిప్రియ గాత్రం పాటకు మరింత అందాన్ని తెచ్చింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరించడం బాగుంది. 'లవ్ స్టోరీ' మూవీలో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ మూవీకి షామ్‌దత్ సినిమాటోగ్రాఫర్‌గా, నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చదవండి: మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు -
అనంతపురం: ఆ ఆలయంలో నటి 'సాయి పల్లవి' న్యూ ఇయర్ వేడుకలు
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సాయి పల్లవి రీసెంట్గా అమరన్ చిత్రంతో అభిమానులను మెప్పించారు. తన పాత్రకు బలం ఉంటే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినా ఓకే చెబుతుందని ఆమెకు గుర్తింపు ఉంది. ఒక ప్రాజెక్ట్‌లో సాయిపల్లవి నటిస్తుందంటే ఆ చిత్రంపై భారీ అంచనాలే ఉంటాయి. సాయి పల్లవి తన కెరీర్ ప్రారంభం నుంచే సెలక్టెడ్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం అందుకుంది.డాక్టర్ విద్యను పూర్తి చేసిన సాయి పల్లవిలో మొదటి నుంచి ఆధ్యాత్మిక కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా అందరూ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంటే సాయి పల్లవి మాత్రం ఆధ్యాత్మికం వైపు వెళ్లింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా మందిరాన్ని ఆమె సందర్శించారు. ఆమె ఇప్పటికే చాలాసార్లు అక్కడికి వెళ్లారు. అయితే, తాజాగా తన కుటుంబంతో కలిసి 'ప్రశాంతి నిలయం'లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయికల్వంత్ మందిరంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మానవుడు తనలోని చెడుగుణాలను త్యజించి సత్యనిష్ఠతో జీవిస్తే దైవత్వాన్ని పొందవచ్చనే సందేశాన్ని పూర్వ విద్యార్థులతో కలిసి నాటిక రూపంలో సాయి పల్లవి తెలియజేశారు. 'చెడు త్యజించి అందరూ సన్మార్గంలో పయనించాలని ఆమె కోరారు.అక్కడ బాబా నామస్మరణ చేస్తూ తనలోని ఆధ్యాత్మికతను ఆమె చాటుకున్నారు. పట్టుచీరలో సంప్రదాయంగా మెరిసిన ఆమె నుదుటన బొట్టుతో సంప్రదాయబద్ధంగా భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి ఆలయంలో కళ్లు మూసుకొని ఆధ్యాత్మికతలో సాయిపల్లవి మునిగిపోయారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అభిమానులు సాయి పల్లవిని ప్రశంసిస్తున్నారు. కొంతమంది సెలబ్రిటీలు పార్టీలు, పబ్‌ల పేరుతో ఎంజాయ్ చేస్తుంటే.. ఆమె ఆధ్యాత్మికత వైపు వెళ్లడంతో అభినందిస్తున్నారు.అమరన్ హిట్ తర్వాత సాయి పల్లవి నటించిన తండేల్ విడుదలకు సిద్ధంగా ఉంది. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రీకాకుళం మత్స్యకారుడి పాత్రను నాగ చైతన్య పోషిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. మరోవైపు పాన్ ఇండియా చిత్రం 'రామాయణం'లో ఆమె సీతగా కనిపించనున్నారు. బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించనున్న ఈ మూవీలో శ్రీరాముడిగా బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ నటించనున్నారు. మూడు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దీపావళీ కానుకగా మొదటి భాగం విడుదల కానుంది.Our Sai Pallavi today evening at Satya Sai's Mangala Aarati program 🥹✨♥️@Sai_Pallavi92 #SaiPallavi #NewYearCelebration pic.twitter.com/KZKncToDwF— Saipallavi.Fangirl07™ (@SaiPallavi_FG07) January 1, 2025 -
బుజ్జితల్లి క్రేజ్.. తండేల్ సాంగ్ అరుదైన ఘనత..!
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం 'తండేల్'. ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. మత్స్యకార బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో వస్తోన్న ఈ మూవీ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. తాజాగా ఈ పాట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. దీంతో చైతూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తండేల్ రిలీజ్ ఎప్పుడంటే?ఈ సినిమా విడుదల డేట్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. క్రిస్మస్, సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుందని అందరూ అనుకున్నారు. అయితే పలు కారణాల వల్ల మరో తేదీకి తండేల్ వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పాన్ ఇండియా రేంజ్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలో ఫిబ్రవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.కానీ మొదట డిసెంబర్ 28న 'తండేల్' విడుదల చేయాలనుకుంటే కుదరలేదు. అయితే, సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ సమయంలో చాలా సినిమాలు పోటీలో ఉండటంతో విరమించుకున్నట్లు నిర్మాత అరవింద్ పేర్కొన్నారు. అలా ఫైనల్‌గా ఫిబ్రవరి 7న వస్తున్నట్లు ప్రకటించారు.తండేల్ కథేంటంటే..నాగచైతన్య- సాయి పల్లవి ప్రధాన పాత్రలలో శ్రీకాకుళం మత్స్యకార కుటుంబంలో జరిగిన కథ అధారంగా ఈ సినిమా తీస్తున్నారు. 2018లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రానుంది. శ్రీకాకుళం సాంసృతిక, సామాజిక అంశాలతో పాటు మత్స్యకారుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపించనున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. Biggest chartbuster of the season is playing in every headphone and heart ❤🔥'Love Song of the Year' #BujjiThalli from #Thandel hits 40 MILLION+ VIEWS, 450K+ LIKES on YouTube and 610K+ REELS on Instagram ✨▶️ https://t.co/52ZLxEJe7IA 'Rockstar' @ThisIsDSP's soulful melody… pic.twitter.com/OVi5KpZaRm— Thandel (@ThandelTheMovie) December 30, 2024 -
Sai Pallavi: నాకంటే ఎక్కువే ప్రేమిస్తున్నాడు.. ఎమోషనలైన హీరోయిన్ (ఫోటోలు)
-
చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) చెల్లి పూజా కన్నన్ సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కింది. క్లోజ్ ఫ్రెండ్ వినీత్‌తో ఏడడుగులు వేసింది. ఈ వేడుకలో హీరోయిన్ కుటుంబం సంతోషంగా గడిపారు. అదే సమయంలో పెళ్లయ్యే క్షణాల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాజాగా మరోసారి ఆ వెడ్డింగ్ ఫోటోలను సాయిపల్లవి సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా చెల్లి పెళ్లి తర్వాత నా జీవితం కొత్త దశలోకి వెళ్తుందని నాకు తెలుసు. నేనే సాక్ష్యంఆ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజ వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. ఇకపై నీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను. కానీ నా మనసులో మాత్రం వినీత్ నిన్ను నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకముంది.ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలుమీ పెళ్లయి మూడు నెలలవుతోంది. నేను అనుకున్నట్లుగానే తను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) View this post on Instagram A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai) చదవండి: నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్ అవడానికేనా?: ఉర్ఫీ -
‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
వెండితెరపై ఎల్లమ్మగా సాయి పల్లవి(sai Pallavi) కనిపించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. నితిన్ హీరోగా ‘బలగం’ ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలు పెట్టాలనుకుంటున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఆల్రెడీ తెలంగాణ నేటివిటీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫిదా, విరాటపర్వం’ చిత్రాల్లో సాయి పల్లవి నటిగా మెప్పించారు. ఇక ఇప్పుడు వేణు తెరకెక్కించే చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే ఉంటుందట. ఎల్లమ్మ(Yellamma) పాత్రకు సాయి పల్లవి అయితేనే న్యాయం చేస్తుందని వేణు, దిల్ రాజు భావిస్తున్నారట. దిల్ రాజు ద్వారా సాయి పల్లవిని కలిసిన వేణు.. కథ చెప్పి ఆమె పాత్ర గురించి వివరించారట. ఆమె పాత్ర నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ గాపిప్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరోసారి తెలంగాణ నేపథ్య సినిమాలో సాయి పల్లవి నటించబోతున్నారనే వార్త తెలియడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఈ గాసిప్ నిజమై.. వెండితెరపై ‘ఎల్లమ్మ’గా సాయి పల్లవి కనిపిస్తారా? లేదా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
కాశీ వెళ్లిన సాయిపల్లవి.. పూజల్లో మునిగి తేలుతూ (ఫొటోలు)
-
ఇకపై సహించను!
‘‘నాపై ఇప్పటివరకూ చాలా పుకార్లు వచ్చాయి. కానీ, వాటిపై నేను స్పందించ కుండా మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే వాస్తవం ఏంటనేది దేవుడికి తెలుసు. అయితే మౌనంగా ఉంటున్నానని పుకార్లు తెగ రాస్తున్నారు. నా గురించి నిరాధారమైన వార్తలు రాస్తే ఇకపై సహించను’’ అంటున్నారు సాయి పల్లవి. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే సాయి పల్లవి తొలిసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో ‘రామాయణ’ సినిమాలో నటిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణాసురుడి పాత్రలో యశ్ నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు సాయి పల్లవి మాంసాహారానికి దూరంగా ఉండాలను కుంటున్నారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఉద్దేశించే సాయి పల్లవి పై విధంగా స్పందించి ఉంటారు. ‘‘నా సినిమాల రిలీజ్, నా ప్రకటనలు.. ఇలా నాకు సంబంధించిన వాటి గురించి నిరాధారమైన వార్తలు రాస్తే యాక్షన్ తీసుకుంటాను. ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్నాళ్లూ సహించాను. ఇకపై సిద్ధంగా లేను’’ అంటూ ΄ోస్ట్ చేశారామె. -
అలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తా..సాయి పల్లవి వార్నింగ్
నేచురల్ బ్యూటీ సాయి పల్లవి పుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనం నుంచే ఆమె వెజిటేరియన్. బయట పదార్థాలు ఎక్కువగా తినదు. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె తిసుకునే ఫుడ్‌పై రకరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి నాన్ వెజ్ తినడం లేదని ఓ తమిళ మీడియా రాసుకొచ్చింది. ఆ సినిమా కోసమే చాలా రోజులుగా బయటి ఫుడ్ తినడం లేదని అందులో పేర్కొంది. దీనిపై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. (చదవండి: పుష్పరాజ్ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!) వాస్తవలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్లు, బేస్ లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడకతప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.తెలిసి రాస్తారో.. తెలియకుండా రాస్తారో.. వ్యూస్ కోసం రాస్తారో.. అదంతా దేవుడికే తెలియాలి.. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు.. ఇక్కడితో ఆపేయండి.. నా సినిమా రిలీజ్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు.. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్.. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొనితెచ్చుకోకండి.. ఇదే చివరి ఛాన్స్.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ సాయి పల్లవి వార్నింగ్ ఇచ్చింది.Most of the times, Almost every-time, I choose to stay silent whenever I see baseless rumours/ fabricated lies/ incorrect statements being spread with or without motives(God knows) but it’s high-time that I react as it keeps happening consistently and doesn’t seem to cease;… https://t.co/XXKcpyUbEC— Sai Pallavi (@Sai_Pallavi92) December 11, 2024 -
అమరన్ మూవీలో సాయిపల్లవి లుక్‌ను అచ్చుగుద్దినట్లు దింపేసిన కియారా వైరల్ అవుతున్న ఫొటోలు
-
ఓటీటీకి వచ్చేసిన రూ.300 కోట్ల మూవీ.. ఎక్కడ చూడాలంటే?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. దీపావళికి థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు నెల రోజుల పాటు థియేటర్లలో రన్ అయింది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.అమరన్ ఈ రోజు నుంచే ఓటీటీ ప్రేక్షకులను అందుబాటులోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హిట్ సినిమా కావడంతో ఓటీటీలోనూ అదరగొడుతుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ మూవీని కమల్ హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ఓటీటీలో రూ. 300 కోట్ల సినిమా .. అధికారిక ప్రకటన
సూపర్ హిట్ సినిమా అమరన్ ఓటీటీ ప్రకటన వచ్చేసింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ హిట్ మూవీ నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా తెలుపుతూ ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది.భారీ అంచనాల మధ్య విడుదలై అమరన్ మూవీ డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈమేరకు ఆ సంస్థ అధికారికంగా ప్రకటన చేసింది. తమిల్తో పాటు తెలుగు,మలయాళం, కన్నడ,హిందీ భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ. -
ఓటీటీలో 'అమరన్' స్ట్రీమింగ్ తేదీని లాక్ చేశారా..?
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’. థియేటర్స్‌లో భారీ కలెక్షన్స్‌తో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు నెట్‌ప్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు నెట్టింట ఒక వార్త ట్రెండ్ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. దీపావళి కానుకగా విడుదలైన లక్కీ భాస్కర్,క సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే, అమరన్ మాత్రం స్ట్రీమింగ్కు రాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ భారీగా ఎదురుచూస్తున్నారు.భారీ అంచనాల మధ్య అక్టోబర్ 31న విడుదలై అమరన్ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే, ఈ సినిమా విడుదలై ఇప్పటికే నాలుగు వారాలు దాటింది అయనప్పటికీ కలెక్షన్స్ పరంగా కొన్ని చోట్ల రానిస్తుంది. దీంతో ఓటీటీ విషయంలో ఆలస్యమైంది. అయితే, డిసెంబర్ 5న నెట్‌ప్లిక్స్‌లో అమరన్ విడుదల కానుందని తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఇదే తేదీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.అమరన్ చిత్రాన్ని సుమారు రూ. 120 కోట్లతో తెరకెక్కించారు. అయితే, ఇప్పటి వరకు రూ. 331 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ చిత్రాల జాబితాలో అమరన్ చేరింది. శివకార్తికేయన్ కెరీర్లో టాప్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా అమరన్ నిలిచింది. -
నాగచైతన్య తండేల్.. బుజ్జి తల్లి వచ్చేసింది
అక్కినేని హీరో నాగచైతన్య నటిస్తోన్న చిత్రం తండేల్. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. నేచరల్ బ్యూటీ సాయిపల్లవి ఈ మూవీ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.తాజాగా ఈ మూవీ నుంచి బుజ్జితల్లి అంటూ సాగే క్రేజీ సాంగ్ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ లవ్ అండ్ ఎమోషనల్ ఫీలింగ్స్‌తో కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. హీరో తన బాధలో ఉన్న ప్రియురాలిని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కథలో కీలకమైన సమయంలో ఈ సాంగ్ వస్తుంది. సింగర్ జావెద్ అలీ ఆలపించిన ఈ సాంగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని డి మచ్చిలేశం గ్రామంలో జరిగిన యధార్ద సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. కాగా.. తండేల్ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Divided by the ocean, united by love 💕The 'Love Song of the year' is here for your to express the feelings of long distance love ✨ #Thandel First Single #BujjiThalli out now 🫶▶️ https://t.co/ZqKgx9roRiA @ThisIsDSP melody 🎼Sung by @javedali4u 🎙️Lyrics by @ShreeLyricist… pic.twitter.com/umR1JLTvHp— Geetha Arts (@GeethaArts) November 21, 2024 -
అమరన్ టీమ్ రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలి: విద్యార్థి
తమిళ హీరో శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ అమరన్. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. ఇకపోతే ఈ సినిమా వల్ల తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానంటూ విఘ్నేశన్ అనే విద్యార్థి చిత్రబృందానికి లీగల్ నోటీసులు పంపించాడు. గుర్తు తెలియని వ్యక్తులు తనకు ఫోన్లు చేసి విసిగిస్తుండటంతో మానసిక వేదనకు లోనవుతున్నానన్నాడు.అసలేం జరిగిందంటే?అమరన్ సినిమాలోని ఓ సీన్లో సాయిపల్లవి హీరోకు తన ఫోన్ నెంబర్ ఇస్తుంది. అది నిజంగానే సాయిపల్లవి నెంబర్ అని భావించిన ఫ్యాన్స్ ఫోన్ కాల్స్ చేయడం మొదలుపెట్టాడు. సినిమాలో చూపించిన నెంబర్ తనదేనని విఘ్నేశన్ అనే ఇంజనీర్ విద్యార్థి తెలిపాడు.ఇది సాయిపల్లవి నెంబర్ అనుకుని ఆమె అభిమానులు పెద్ద ఎత్తున కాల్స్ చేస్తున్నారని వాపోయాడు. వరుస ఫోన్ కాల్స్, మెసేజ్‌ల వల్ల తనకు ప్రశాంతత లేకుండా పోయిందన్నాడు. తన ఫోన్ నెంబర్ ఉపయోగించినందుకుగానూ అమరన్ టీమ్ రూ.1.1 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు. మరి ఈ గొడవపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి!చదవండి: రెహమాన్ విడాకులు.. ఆస్తి పంపకాలపై లాయర్ ఏమన్నారంటే? -
అమరన్ సక్సెస్.. స్వయంగా బిర్యానీ వడ్డించిన హీరో!
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అమరన్. ఈ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైంది. సాయిపల్లవి హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. విడుదలై మూడు వారాలైనప్పటికీ కలెక్షన్స్ పరంగా రాణిస్తోంది. ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అయితే ప్రస్తుతం శివ కార్తికేయన్ మరో మూవీతో బిజీగా ఉన్నారు. ఎస్కే23 వర్కింగ్ టైటిల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా అమరన్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. షూటింగ్ సెట్లోనే ఈ వేడుకలు చేసుకున్నారు.అనంతరం మూవీ సిబ్బందికి భోజనాలు ఏర్పాటు చేశారు. హీరో శివ కార్తికేయన్ స్వయంగా అందరికీ బిర్యానీ వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లు, శ్రీకుమార్, శ్యామ్ మోహన్, గీతా కైలాసం కీలక పాత్రలు పోషించారు. #Sivakarthikeyan served Biryani to #SK23 crew members on celebrating #Amaran Blockbuster success ❤️🔥❤️🔥pic.twitter.com/uAzB5PbXqh— AmuthaBharathi (@CinemaWithAB) November 19, 2024 -
'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?
దీపావళికి హడావుడి లేకుండా రిలీజై హిట్ కొట్టిన సినిమా 'అమరన్'. తమిళ హీరో శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించారు. మేజర్ ముకందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారు. విడుదలకు ముందు తెలుగులో పెద్దగా హైప్ లేదు కానీ థియేటర్లోకి వచ్చిన తర్వాత మాత్రం అద్భుతమైన రెస్పాన్ వచ్చింది.ప్రస్తుతం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌కి చేరువలో 'అమరన్' ఉంది. దీంతో మూవీ టీమ్ ఆనందానికి అవధుల్లేవ్. ఎందుకంటే హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ మరీ ఈ రేంజ్ సక్సెస్ అయితే ఊహించలేదు. దీంతో ఈ చిత్ర ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ప్లాన్ మార్చుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ థ్రిల్లర్.. తెలుగులోనూ)లెక్క ప్రకారం నెలరోజుల్లోనే 'అమరన్' ఓటీటీలోకి రావాల్సింది. అంటే డిసెంబరు తొలివారంలో స్ట్రీమింగ్ అయ్యేది. కానీ ఇప్పుడు అద్భుతమైన సక్సెస్ కావడంతో మరో 1-2 వారాలు తర్వాత స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుంటోందట. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం డిసెంబరు మూడో వారంలోనే ఓటీటీలోకి 'అమరన్' వచ్చే అవకాశముంది.అడివి శేష్ 'మేజర్' తరహా కథతోనే 'అమరన్' సినిమా తీసినప్పటికీ.. ముకుందన్ భార్య వైపు నుంచి స్టోరీ చెప్పడం, అలానే సాయిపల్లవి యాక్టింగ్ సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు. ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు సూర్య 'కంగువ' చిత్రానికి రిలీజ్ ముంగిట తలనొప్పిగా మారింది. థియేటర్లు అనుకున్నంతగా దొరకడం కష్టమే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత) -
వాళ్ల కష్టం ఎక్కువ.. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారు: సాయిపల్లవి
ఇటీవల ఎక్కడ చూసినా సాయిపల్లవి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం అమరన్ చిత్రంలో ఆమె అద్భుతమైన నటనే.అందరి హీరోయిన్ల రూటు వేరు సాయి పల్లవి రూటు వేరని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ మాటను మరోసారి సాయిపల్లవి నిరూపించారు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న చాలామంది హీరోయిన్లు తమకు తక్కువగా పారితోషికం ఇస్తున్నారని గగ్గోలు పెట్టడం మనం చూశాం. కానీ సాయిపల్లవి మాత్రం అందుకు భిన్నంగా ఒక సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న అసిస్టెంట్ డైరెక్టర్స్‌కు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తున్నారని అభిప్రాయపడ్డారు. వారి కష్టానికి తగినంత పారితోషం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు.సౌత్ ఇండియాలో సాయిపల్లవి పేరు ఎప్పటికీ ప్రత్యేకమే.. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎలాంటి యాడ్స్ చేయనని చెప్పేస్తారు. కథకు అందులోని తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే అది ఎంత భారీ చిత్రం అయినా, స్టార్ దర్శకుడు, కథానాయకుడు అయినా నో అనేస్తారు. ఇక పోతే స్కిన్ షో అనే విషయాన్నే దరిదాపులకు కూడా రానివ్వరు. అసలు మేకప్‌కు ప్రాముఖ్యతను ఇవ్వరు. అందుకే సహజ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఇక విజయాల విషయానికి వస్తే ఈమె నటించిన అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక అమరన్ చిత్రంలోని తన నటనకు దర్శకుడు మణిరత్నం వంటి వారే ప్రశంసల జల్లు కురిపించారు. త్వరలో ఈమె నటుడు నాగచైతన్యతో జతకట్టిన తండేల్ చిత్రం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం రామాయణ అనే హిందీ చిత్రంలో సీతగా నటిస్తున్నారు. అదేవిధంగా మరో హిందీ చిత్రం ప్రచారం జరుగుతోంది. తెలుగులోనూ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇలా వరుసగా చిత్రాలు చేసుకుంటూ బిజీగా ఉన్న సాయిపల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సహాయ దర్శకుల గురించి మాట్లాడారు. సహాయ దర్శకులకు వారి అర్హతకు తగిన వేతనాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్‌తో పోలిస్తే వేతనాలు చాలా తక్కువ తీసుకుంటున్న దర్శకులు మన చిత్ర పరిశ్రమంలో ఉన్నారని పేర్కొన్నారు. బాలీవుడ్లో ఒక చిత్రాన్ని చేసిన సహాయ దర్శకుడు వెంటనే మరో చిత్రానికి పనిచేయడానికి సిద్ధమవుతున్నారని, ఇది చాలా మంచి విషయమని అన్నారు. అయితే. దక్షిణాదిలో పరిస్థితి వేరు అని పేర్కొన్నారు వారి శ్రమకు, అర్హత తగిన వేతనం లభించడం, లభించకపోవడం బాధ కలిగిస్తోందని సాయిపల్లవి పేర్కొన్నారు. -
'అమరన్' హిట్.. మ్యూజిక్ డైరెక్టర్‌కి ఖరీదైన గిఫ్ట్
గతవారం దీపావళి సందర్భంగా నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ 'లక్కీ భాస్కర్' లాంటి తెలుగు మూవీస్‌తో పాటు తమిళ డబ్బింగ్ చిత్రం 'అమరన్' కూడా హిట్‌గా నిలిచింది. పెద్దగా ప్రమోషన్ లేకుండా తెలుగులోనూ రిలీజైనప్పటికీ జనాలకు నచ్చేసింది.ఇప్పటికే 'అమరన్' మూవీకి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శివకార్తికేయన్, సాయిపల్లవి తమదైన యాక్టింగ్‌తో కట్టిపడేశారు. కంటెంట్ కూడా అంతకు మించి అనేలా క్లిక్ అయింది. 'హే రంగులే' లాంటి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్.. సినిమాని మరో స్థాయిలో నిలబెట్టాడు.(ఇదీ చదవండి: తమన్నా డిజాస్టర్ సినిమా.. ఏడాది తర్వాత ఓటీటీలోకి)సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించిన జీవీ ప్రకాశ్ కుమార్‌కి హీరో శివకార్తికేయన్ ఖరీదైన బహుమతి ఇచ్చాడు. దాదాపు రూ.3 లక్షల విలువ చేసే టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా 1 బ్రాండ్‌కి చెందిన స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచీని తనకు ఇచ్చినట్లు జీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా హీరోకి థ్యాంక్స్ చెప్పాడు.కశ్మీర్లో తీవ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన ముకుందన్ వరదరాజన్ జీవితం ఆధారంగా 'అమరన్' సినిమా తీశారు. ట్రైలర్ రిలీజైనప్పుడు అడివి శేష్ 'మేజర్'తో పోల్చి చూశారు. కానీ మూవీ రిలీజైన తర్వాత అలాంటివేం వినిపించలేదు. (ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)