‘సంధ్య థియేటర్’ ఘటన తర్వాత అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లకు దూరంగా ఉన్నాడు. ఇంతవరకు ఏ సినిమా ఫంక్షన్‌కి కానీ, ఇతర ఈవెంట్స్‌కి కానీ రాలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ‘తండేల్’(Thandel) ప్రీరిలీజ్‌కి వస్తున్నాడు. ఈ వార్త వినగానే బన్నీ ఫ్యాన్స్ ఆనందంతో చిందులేశారు. తమ అభిమాన నటుడిని నేరు చూడొచ్చని చాలా మంది ఫ్యాన్స్ భావించారు. కానీ వారందరికి ‘తండేల్’ టీమ్ షాకిచ్చింది. ఈ రోజు(ఫిబ్రవరి 2) సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పబ్లిక్‌కి ఎంట్రీ లేదని ప్రకటించింది.
‘కొన్ని కారణాల రీత్యా దురదృష్టవశాత్తు ‘ఐకానిక్ తండేల్ జాతర’ను చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నాం. ఈవెంట్‌లోకి పబ్లిక్‌కు ఎలాంటి ప్రవేశం లేదు. ప్రసార మాధ్యమాల వేదికగా ఈ కార్యక్రమానికి సంబంధించిన లైవ్ వీక్షించి ఎంజాయ్ చేయండి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. సంధ్య థియేటర్ ఘటన తర్వాత బన్నీ హాజరవుతున్న తొలి ఈవెంట్ ఇది. ఈ ఈవెంట్‌లో ఆయన ఏం మాట్లాడతారా? అని అభిమానులతో పాటు సినీ ప్రియులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. .
నాగచైతన్య, సాయి పల్లవి(Sai Pallav)i జంటగా నటించిన చిత్రం తండేల్. ‘కార్తికేయ 2’ ఫేం చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా తండేల్ సాంగ్సే వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయింది. లవ్‌స్టోరీ తర్వాత నాగచైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవిరి 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తండేల్ కథేంటి?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి కథ ఇది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజు అనే జాలరి పొరపాటుగా పాకిస్థాన్ సముద్రజలాల్లోకి ప్రవేశించాడు. దీంతో పాక్ నేవి అధికారులు అరెస్ట్ చేస్తుంది. ఈ ఘటనను ఆధారం చేసుకుని తండేల్ చిత్రాన్ని నిర్మించారు. ఆ జాలరిని తిరిగి భారత్‌కు రప్పించేందుకు తన ప్రియురాలు చేసిన పోరాటం ఏంటో ఈ సినిమాలో చూడొచ్చు. అయితే సినిమా మొత్తంలో పాకిస్తాన్ ఎపిసోడ్ కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉంటుందట. మిగతా కథంతా రాజు-బుజ్జితల్లి పాత్రల చుట్టే తిరుగుతుందట. నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య అదిరిపోయిన కెమెస్ట్రీకి తోడు కాస్త దేశభక్తిని కూడా జోడించి డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను భారీగా ప్లాన్ చేసినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment