అలాంటి వార్తలు రాస్తే లీగల్‌ నోటీసులు పంపిస్తా..సాయి పల్లవి వార్నింగ్‌ | Sai Pallavi Slams Reports Claiming She Turned Vegetarian For Ramayana Film | Sakshi
Sakshi News home page

ఇక్కడితో ఆపేయండి..లేదంటే లీగల్‌ నోటీసులు పంపిస్తా.. సాయి పల్లవి మాస్‌ వార్నింగ్‌

Published Thu, Dec 12 2024 10:17 AM | Last Updated on Thu, Dec 12 2024 11:28 AM

Sai Pallavi Slams Reports Claiming She Turned Vegetarian For Ramayana Film

నేచురల్‌ బ్యూటీ సాయి పల్లవి పుడ్‌ విషయం చాలా జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనం నుంచే ఆమె వెజిటేరియన్‌. బయట పదార్థాలు ఎక్కువగా తినదు. ఈ విషయం ఆమె చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. కానీ ఇప్పుడు ఆమె తిసుకునే ఫుడ్‌పై రకరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. రామాయణ మూవీ కోసమే సాయి పల్లవి నాన్‌ వెజ్‌ తినడం లేదని ఓ తమిళ మీడియా రాసుకొచ్చింది. ఆ సినిమా కోసమే చాలా రోజులుగా బయటి ఫుడ్‌ తినడం లేదని అందులో పేర్కొంది. దీనిపై సాయి పల్లవి తీవ్ర స్థాయిలో మండిపడింది. 

(చదవండి: పుష్పరాజ్‌ వసూళ్ల సునామీ.. ఆరు రోజుల్లోనే రప్ఫాడించాడు!)

 వాస్తవలు తెలియకుండా ఇలాంటి పిచ్చి పిచ్చి వార్తలు రాయకండని వార్నింగ్ ఇచ్చింది. తాను అసలు రూమర్లు, బేస్ లెస్ వార్తల్ని చూసి పట్టించుకోనని, కానీ ఇప్పుడు ఇలాంటి పిచ్చి రాతల్ని చూసి మాట్లాడకతప్పని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది.

తెలిసి రాస్తారో.. తెలియకుండా రాస్తారో.. వ్యూస్ కోసం రాస్తారో.. అదంతా దేవుడికే తెలియాలి.. ఇలానే ఇకపై రాస్తామంటే మాత్రం కుదరదు.. ఇక్కడితో ఆపేయండి.. నా సినిమా రిలీజ్ టైంలో ఇలాంటివి రాస్తే ఊరుకునేది లేదు.. అవన్నీ నాకు చాలా స్పెషల్ మూమెంట్స్.. మీరు ఇలాంటి వార్తలు రాసి కష్టాలు కొనితెచ్చుకోకండి.. ఇదే చివరి ఛాన్స్.. ఇకపై ఇలాంటి వార్తలు రాస్తే లీగల్ నోటీసులు పంపిస్తాను అంటూ సాయి పల్లవి వార్నింగ్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement