
ప్రస్తుతం సాయిపల్లవి టైమ్ నడుస్తోంది. గతేడాది 'అమరన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టగా.. రీసెంట్ గా 'తండేల్'తో మరో హిట్ కొట్టింది.

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ 'రామాయణ' చేస్తోంది.

ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని సోదరుడు పెళ్లికి హాజరైంది.

సాయిపల్లవికి పూజా కన్నన్ అనే చెల్లి ఉంది.

గతేడాది పూజకు పెళ్లి జరిగింది. ఆ వేడుకలో సాయిపల్లవి ఫుల్ సందడి చేసింది. డ్యాన్సులు, ఫొటోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.

ఇప్పుడు కజిన్ బ్రదన్ జిత్తుకి పెళ్లి జరగ్గా సాయిపల్లవి హాజరైంది. నీలం చీరలో బుట్టబొమ్మలా ఉంది.

అలానే సాయిపల్లవి తన బంధువులతో కలిస సాంప్రదాయ పాటలకు స్టెప్పులు కూడా వేసింది.

దీనికి తోడు పెళ్లికి హాజరైన పలువురు.. ఈమెతో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.

పెళ్లికి వచ్చింది గానీ సాయిపల్లవి తన ఇన్ స్టాలో ఎక్కడా ఫొటోల్ని, వీడియోలని పోస్ట్ చేయలేదు. ఫ్యాన్ పేజీల్లో వాటిని అందరూ పోస్ట్ చేస్తున్నారు.





