Sister
-
డబ్బు కోసం అన్నపైనే లైంగిక ఆరోపణలు!?
సొంత సోదరి చేస్తున్న సంచలన ఆరోపణలపై ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ స్పందించాడు. ఇప్పటికే ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈలోపు.. రక్తం పంచుకుని పుట్టిన సోదరి ఆయన్ని కోర్టుకీడ్చింది. అయితే.. ఆమెకు మానసికస్థితి సరిగా లేదని.. పైగా డబ్బు కోసమే ఈ చర్యకు దిగిందని ఆయన అంటన్నారు. ఈ మేరకు కుటుంబంతో సహా సంయుక్త ప్రకటన ఒకటి విడుదల చేశారాయన.దాదాపు దశాబ్ద కాలంగా తన సోదరుడు శామ్ (Sam Altman) తనపై లైంగిక వేధింపులకు పాల్పడాడంటూ ఆన్ ఆల్ట్‌మన్ మిస్సోరీ డిస్ట్రిక్ట్ కోర్టులో దావా వేశారు. తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పటినుంచే ఆ దారుణాలను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. అయితే.. ఆమె ఈ తరహా ఆరోపలు చేయడం ఇదేం కొత్త కాదు. కాకుంటే ఈసారి దావా వేయడంతో శామ్ ఆల్టమన్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ పరిణామంపై ఆయన ఏమన్నారంటే..‘‘ఆమె ఆరోగ్యంపై మేం చాలా ఆందోళనకు గురవుతున్నాం. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఓ కుటుంబ సభ్యురాలిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమైన పని. ఆమెకు అండగా ఉండేందుకు మేం చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాం. ఆర్థికంగానూ సాయం చేస్తున్నాం. ఇవన్నీ చేసినప్పటికీ ఆమె మమ్మల్ని ఇంకా డబ్బు కోసం డిమాండ్ చేస్తూనే ఉంది. మా కుటుంబంపై, ముఖ్యంగా శామ్‌పై అవాస్తవ ఆరోపణలు చేసి మమ్మల్ని మరింత ఎక్కువగా బాధ పెట్టింది... ఆమె గోప్యత దృష్ట్యా మేం దీనిపై బహిరంగంగా స్పందించొద్దని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆమె శామ్‌పై కోర్టుకు వెళ్లడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చింది. తండ్రి నిధులను అక్రమంగా అట్టిపెట్టుకుని.. సొంత కుటుంబసభ్యులపైనే ఆరోపణలకు దిగింది. ఇప్పుడు మరింత దిగజారి శామ్ తనను లైంగికంగా వేధించాడని చెబుతోంది. ఇవన్నీ అవాస్తవం. ఈ పరిస్థితుల్లో మా కుటుంబగోప్యతను గౌరవించాలని ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నా. ఇకనైనా ఆమెకు మానసిక ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తున్నాం’’ అని ఆల్ట్‌మన్ కుటుంబం తమ ప్రకటనలో పేర్కొంది.ఇదిలా ఉంటే.. ఆరోపణలు చేసిన అన్నే ఆల్ట్‌మన్(Annie Altman).. ఆ కుటుంబానికి కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే తనపై జరిగిన లైంగిక దాడికి గానూ శ్యామ్‌ను విచారించాలని, అలాగే తనకు జరిగిన నష్టానికి గానూ 75వేల డాలర్ల పరిహారం ఇప్పించాలని ఆమె కోర్టుకు కోరారు.‘‘మిస్సోరీలోని క్లేటన్లో గల మా ఇంట్లోనే నేను వేధింపులను ఎదుర్కొన్నా. అప్పుడు నాకు మూడేళ్లు. శామ్కు 12 ఏళ్లు. 1997 నుంచి 2006 వరకు అతడు నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వారానికి పలుమార్లు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దారుణమైన అనుభవాల కారణంగా నేను తీవ్ర ఒత్తిడికి లోనయ్యా. మానసికంగా కుంగిపోయా. ఈ డిప్రెషన్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందేమో’’ అని శామ్ సోదరి తన దావాలో పేర్కొన్నారు.ఓపెన్ఏఐ సీఈఓగా హారిస్ శామ్ ఆల్టమన్ ప్రపంచానికి సుపరిచితుడే. ఏఐ బూమ్‌లో ఈయనొక ప్రముఖుడు. తండ్రి రియల్ ఎస్టేట్ బ్రోకర్కాగా, తల్లి డెర్మటాలజిస్ట్. ఈ జంటకు నలుగురు పిల్లలు కాగా, శామ్ పెద్దోడు. తనను తాను గేగా ప్రకటించుకున్న శామ్.. కిందటి ఏడాది జనవరిలో తన బాయ్‌ఫ్రెండ్ అలీవర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో ట్రంప్ మద్దతు క్యాంపెయిన్‌కు మద్దతుగా విరాళం కూడా ఇచ్చాడు.ఇక.. గత ఏడాది ఓపెన్ఏఐ ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఉద్యోగులు, వాటాదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో కంపెనీ బోర్డు ఆయన్ని తిరిగి తీసుకుంది. తాజాగా.. ఓపెన్ఏఐ విజిల్ బ్లోయర్ సుచీర్ బాలాజీ అనుమానాస్పద మృతి కేసు కూడా ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది.ఇదీ చదవండి: అద్భుతాలు చేస్తాడనుకున్నాం కానీ,.. సుచీర్ బాలాజీ తల్లిదండ్రుల రోదన -
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్‌లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
డియర్ అక్క.. నువ్వు సాధించిన ఈ విజయం నాకు స్పూర్తి: శివకార్తికేయన్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తాజాగా సోషల్‌మీడియా ద్వారా తన అక్క గౌరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఒక ఓమోషనల్ నోట్ రాశారు. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతుంది. చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు పాన్ ఇండియా హీరో రేంజ్‌కు చేరుకున్నాడు. తను నటించిన రీసెంట్ హిట్ సినిమా అమరన్ బాక్సాఫీస్ వద్ద రూ. 330 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.శివకార్తికేయన్ ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయినప్పటికీ చాలా సాధారణమైన జీవనశైలినే ఇష్టపడుతారు. ఈ క్రమంలో తాజాగా తన సోదరి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇలా పంచుకున్నారు. 'నా జీవితంలో ఆదర్శంగా నిలుస్తున్న ప్రియమైన అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒక బిడ్డ పుట్టిన తర్వాత MBBS (డాక్టర్ కోర్సు) పూర్తి చేశావ్.. తల్లిగా నీ బాధ్యతలు చేస్తూనే 38 ఏళ్ల వయసులో MD వంటి ఉన్నతమైన కోర్సును పూర్తి చేసి గోల్డ్‌మెడల్ సాధించావ్. ఇప్పుడు 42 ఏళ్ల వయసులో FRCP సాధించావు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని అందుకున్నావ్.. ఈ సందర్భంలో మన నాన్న ఉండుంటే చాలా గర్వంగా ఉండేది అక్క' అంటూ తన సోదరి గురించి చెబుతూ ఆయన ఒక నోట్ విడుదల చేశారు.శివకార్తికేయన్ వివాహం కూడా తన దగ్గరి బంధువుల అమ్మాయి అయిన ఆర్తితో జరిగింది. 2010 ఆగస్టు 27న ఆర్తిని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకున్నాడు. శివకార్తికేయన్-ఆర్తి దంపతులకు ఒక కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. View this post on Instagram A post shared by Sivakarthikeyan Doss (@sivakarthikeyan) -
అందమైన వధువుగా నువ్వు.. నాకెంతో సంతోషం: సోదరి పెళ్లి... టీమిండియా కెప్టెన్ భావోద్వేగం(ఫొటోలు)
-
సాయిపల్లవి సిస్టర్ పూజకన్నన్ పెళ్లి వేడుక.. ఈ అరుదైన పిక్స్ చూశారా? (ఫొటోలు)
-
కోహ్లికి స్పెషల్ విషెస్: అక్క, అన్న పిల్లలతో విరాట్ రేర్ ఫొటోలు
-
కౌంట్‌డౌన్ మొదలైంది..చైతూ- శోభిత పెళ్లి పనులపై సమంత పోస్ట్! (ఫొటోలు)
-
మానవతకు ప్రతిరూపం
మహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించిన సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. వివేకా నందుడి బోధనలకు ప్రభావితమై హిందూ (ధర్మం) మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఐర్లాండులో ఆమె 1867 అక్టోబర్ 28న జన్మించారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్. 1895లో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద లండన్‌లో చేసిన ప్రసంగాలు మార్గ రెట్ జీవితాన్ని మార్చాయి. భారతీయ స్త్రీ గొప్పదనం గురించి విన్న ఆమె... వివేకానందను కలిసి 1898 జనవరి 28న భారత్ వచ్చింది. ఆమెకు వివేకానంద ‘నివేదిత’ అని నామకరణం చేశారు. నివే దిత అంటే భగవంతునికి సమర్పణ చేయబడినది అని అర్థం. వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి తాను రాసిన ‘ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. ఇతరుల పట్ల దయతో మెలిగే ఆమె మంచి అభిరుచి గల కళాకారిణి. సంగీతంలోనూ, చిత్రకళలోనూ ఆమెకు ప్రవేశం ఉండేది.ఉపాధ్యాయురాలిగా పనిచేసిన అనుభవం ఉన్న నివేదిత భారత్‌లోనూ విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల విద్య కోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్ బజారులో పాఠశాలను ప్రారంభించారు. కనీస విద్య లేని బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. 1899 మార్చిలో కలకత్తా వాసులకు ప్లేగువ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. భారత మహిళల ఔన్నత్యం గురించీ, ఆచార వ్యవహారాల గురించీ న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో ప్రసంగించారు. భారత స్వాతంత్య్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. 1911 అక్టోబర్ 13న డార్జిలింగ్‌లో మరణించిన సిస్టర్ నివేదిత తలపెట్టిన పనులను విస్తరించడమే మనం ఆమెకు ఇవ్వగల నివాళి.– సాకి ‘ 99511 72002(నేడు సిస్టర్ నివేదిత జయంతి) -
నాడు సమంత సంగీత్ వేడుక.. సందడి చేసిన శోభిత ధూళిపాళ్ల (ఫొటోలు)
-
టీమిండియా స్టార్ క్రికెటర్ బర్త్‌డే.. లవ్ యూ అంటూ అక్క విషెస్! (ఫొటోలు)
-
స్టార్టప్ ద్వారా రూ. 500 కోట్ల ఆదాయం, కట్ చేస్తే అద్దె ఇంట్లోనే నివాసం
ఆరోగ్యకరమైన ఆహారం, లేదా ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతుందా అన్వేషించి, అన్వేషించి చివరికి వారే తయారు చేసిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల సక్సెస్ స్టోరీ ఇది. సుహాసిని, ఆమె సోదరి అనిందితా సంపత్ న్యూయార్క్‌లో నివసించేవారు. వీరిద్దరూ కలిసి యోగా క్లాస్‌కు హాజరయ్యేవారు. ఒకరోజు అనిందిత ట్రేడర్ జో నుండి ప్రోటీన్ బార్‌ను తీసుకున్నప్పుడు, వాటికి ప్రత్యామ్నాయంగా ఏమైనా దొరుకుతుందా అని ఆలోచింది. ఆ వెదుకులాటే కొత్త స్టార్టప్ ఎనర్జీ బార్ బ్రాండ్ కంపెనీకి నాంది పలికింది. కట్ చేస్తే.. రూ. 500 కోట్ల ఆదాయం.ఎంత విజయం సాధించాం, ఎంత డబ్బు సంపాదించామన్నదికాదు ముఖ్యం, తద్వారా ప్రజల జీవితాల్లో ఎంత మార్పుతెచ్చామన్నంది కూడా ముఖ్యం అంటారు బెంగుళూరుకు చెందిన సోదరీమణులు సుహాసిని.ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటే ఏమి చేయాలి?ఎలా ఉండా? అనే ఆలోచన ఫలితంగా పుట్టిందే 'యోగా బార్'. బెంగళూరుకు చెందిన సుహాసిని సంపత్, తన సోదరి అనిందితా సంపత్తో కలిసి 2014లో దీన్ని ప్రారంభించారు. యుఎస్‌లో ఉద్యోగం చేస్తూ, చదువుకుంటున్నప్పుడు ఫిట్నెస్ స్పృహతో, శ్రద్ధగా యోగా తరగతులకు హాజరయ్యేవారు. కఠినమైన వ్యాయామ సెషన్ల తర్వాత, బాగా ఆకలి వేసింది. కానీ తమ కడుపుని సంతృప్తిపరిచే ఆరోగ్యకరమైన, పోషకమైన స్నాక్స్ తిందామంటే దొరికేదికాదు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు. అలా అంచెలంచెలుగా వివిధ ఉత్పత్తులతో తమ వ్యాపారాన్ని విస్తరించారు. వాటిల్లోయోగా బార్ కూడా ఒకటి.యోగా బార్ భారతీయ ఆహార, ఆరోగ్య ప్రమాణాలను సంతృప్తి పరచడమే కాకుండా, అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)చే ఆమోదాన్ని పొందారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులతో నాణ్యతకు మారుపేరుగా నిలిచింది .కట్ చేస్తే గత ఏడాది ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ ఐటీసీ 30 శాతం వాటాను కొనుగోలు చేసింది. 2026 నాటికి 100 శాతం స్టార్టప్‌ను రూ. 500 కోట్లకు కొనుగోలు చేయాలని ఒప్పందం చేసుకుంది.తొలి సంవత్సరంలో 5 లక్షల రూపాయలు. ఇండియాకు తిరిగి వచ్చి 2015 ఆగస్టులో, తొలి ఉత్పత్తి మల్టీగ్రెయిన్ ఎనర్జీ బార్లను, 2018లో ప్రొటీన్ బార్‌ను లాంచ్ చేసింది కంపెనీ. దీని ఆదాయం 2019లో రూ. 12 కోట్ల నుండి 2021 నాటికి రూ. 45 కోట్లకు పెరిగింది. వేలాది ఔట్ లెట్లతో అమెరికా, యూకేలో రెండు లక్షలకు పైగా కస్టమర్లు, ఎగుమతులతో, యోగా బార్ భారతదేశంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది. దీంతో రూ.175 కోట్లతో సంస్థలో 39.4 శాతం వాటా కొనుగోలు చేసింది ఐటీసీ. సుహాసిని, అనిందిత, ఆర్తి ముగ్గురు అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచీ పోటీతత్వం, విజయాల పట్ల ఆసక్తి ఉన్న సోదరీమణులు ఇంటా బైటా రాణించారు. ప్రపంచంలోని అత్యుత్తమ కాలేజీల్లో చదువుకున్నారు. పెరుగుతున్నక్రమంలో రెస్టారెంట్ ఆహారం కంటే ఇంట్లో తయారు చేసిన ఆహారాన్నే ఇష్టపడేవారు. ముఖ్యంగా కూరగాయలు, తృణధాన్యాలు ,పండ్లతో పాటు, పిల్లలు ఇష్టమపడే జంక్ ఫుడ్ కోరికలను తీర్చడానికి, వారి తల్లి ఆరోగ్యకరమైన స్నాక్స్ స్వీట్ల తయారు చేసేవారట. అదే హెల్దీ యోగా బార్ సంస్థకు పునాది అంటారీ సోదరీ మణులు. కాగా లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసిని చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేశారు. రెండు ఇళ్లు ఉన్నప్పటికీ వాటికి అద్దెకిచ్చి బెంగళూరులో అద్దెకు నివసిస్తుండటం విశేషం. ఈమెకు రియల్ ఏస్టేట్ వ్యాపారంలో కూడా పట్టు ఉందిట. -
పూజా కన్నన్ పెళ్లిలో సాయిపల్లవి ఎమోషనల్ మూమెంట్స్ (ఫోటోలు)
-
Pooja Kannan: చెల్లి మెహందీ ఫంక్షన్.. దగ్గరుండి రెడీ చేసిన సాయిపల్లవి (ఫోటోలు)
-
పూజా కన్నన్ హల్దీ ఫంక్షన్.. అందరి కళ్లు సాయిపల్లవిపైనే! (ఫోటోలు)
-
టీమిండియా స్టార్ అక్క.. ఈమె కూడా క్రికెటరే! (ఫొటోలు)
-
హీరోయిన్ రష్మిక చెల్లిని చూశారా? ఎంత చిన్న పిల్లనో! (ఫొటోలు)
-
రక్షాబంధన్: అన్నకు ప్రాణం పోసిన చెల్లెలు
అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. చెల్లెలంటే ప్రాణమిచ్చే అన్న.. అన్నయ్యంటే ప్రాణం పెట్టే చెల్లెళ్లను మనం చూసే ఉంటాం. ఇటువంటి కథనాలను మనం వినే ఉంటాం. అయితే అంతకుమించిన అనుభంధం రాజస్థాన్‌లోని ఈ అన్నాచెల్లెళ్లది.రాజస్థాన్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన ఒక సోదరి తన సోదరునికి కిడ్నీని దానం చేయడం ద్వారా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. వీరు ఆస్పత్రిలోనే రక్షాబంధన్ వేడుకను జరుపుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే ఉపాధ్యాయురాలు సునీతా బుడానియా తన కిడ్నీని తన సోదరుడు దేవేంద్ర బుడానియాకు దానం చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.2016లో దేవేంద్ర బుడానియా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో అతని బంధువైన బీర్బల్ బుడానియా అతనికి కిడ్నీని దానం చేశారు. అయితే ఆ కిడ్నీ ఎనిమిదేళ్ల తర్వాత పనిచేయడం మానేసింది. దీంతో దేవేంద్రకు మరోమారు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో దేవేంద్ర సోదరి సునీత తన అన్నకు తన కిడ్నీని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ సందర్భంగా సునీతతో మీడియాతో మాట్లాడుతూ వివాహం అయినంతమాత్రన ఆడపిల్లకు పుట్టింటితో సంబంధం ముగిసిపోదని, అది ఇంకా పెరుగుతుందని అన్నారు. ఆడపిల్లకు అటు పుట్టినిల్లు, ఇటు అత్తారిల్లు అనే విధంగా బాధ్యతలు పెరుగుతాయన్నారు. తాను తన సోదరునికి కిడ్నీని దానం చేయడాన్ని సంతోషంగా భావిస్తున్నానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న వీరిద్దరూ త్వరలోనే డిశ్చార్జి కానున్నారు. -
Rakshabandhan: ఆడపడుచులకు యోగీ సర్కార్ కానుక
రక్షా బంధన్ నాడు మహిళలకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ప్రత్యేక కానుక ప్రకటించింది. ఆగస్టు 17 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో అదనంగా బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది. అలాగే ఆడపడచులకు ఆగస్టు 19, 20 తేదీలలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఆగస్టు 17 నుంచి 22వ తేదీ వరకు అన్ని రూట్లలో నిరంతరాయంగా బస్సులు నడిపేందుకు వీలుగా రావాణాశాఖ అధికారులు, ఉద్యోగుల సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ సమయంలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రోత్సాహక నగదును ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాంట్రాక్టు బస్సులను కూడా నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ నుండి లక్నో, వారణాసి, కాన్పూర్, ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్ మార్గాలకు అదనపు బస్సులు నడపనున్నారు. ఇప్పటికే లోకల్ రూట్లలో నడుస్తున్న బస్సులకు అదనంగా ట్రిప్పులు పెంచనున్నారు. -
సోదరితో పాటు షాపింగ్ చేసిన షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్‌కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం షేక్ హసీనా టీమ్‌లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్ తరలివచ్చారు.తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె క్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.షేక్ హసీనా భద్రత కోసం ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమెను కలుసుకున్నారు. -
సెయిలింగ్ సిస్టర్స్..
ఒడ్డున చేరే అలల్లాంటివి వారి జీవితాలు.. ఐనప్పటికీ ఎగిసిపడే కెరటాల్లా తెరచాపలై దూసుకపోతోంది వారి చైతన్యం. చాలామందికి సెయిలింగ్ అంటే ఏంటో కూడా సరిగా తెలియని తరుణంలో.. ఇదే సెయిలింగ్‌లో నేషనల్ చాంపియన్లుగా నిలుస్తున్నారు ఆ అక్కాచెల్లెళ్లు.. పేదరికం అడ్డంకి కాకుండా యాచ్ క్లబ్ అందిస్తున్న సహకారంతో రసూల్‌పుర ఉద్భవ్ స్కూల్లో 8, 10 తరగతులు చదువుతున్న కొమరవెల్లి దీక్షిత, కొమరవెల్లి లాహరిలు టాప్ సెయిలింగ్ సిస్టర్స్‌గా రాణిస్తున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగానే కాకుండా భారత్ తరపున విదేశాల్లోనూ సెయిలింగ్ పోటీల్లో పాల్గొంటూ దేశ కీర్తికి భవిష్యత్ వారధులుగా నిలుస్తున్నారు. వివిధ క్రీడల్లో నగరానికి చెందిన సానియా మీర్జా, సైనా నెహా్వల్, పీవీ సింధూ, నిఖత్ జరీనా రాణించినట్టే.. రానున్న కాలంలో సెయిలింగ్ క్రీడకూ ఈ అక్కాచెల్లెళ్లు కేరాఫ్ అడ్రస్‌గా మారతారేమో.. ముంగ్గురు ఆడపిల్లలున్న కుటుంబం అది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు.. సామాన్య జీవనమే గగనమైన తరుణంలో అనితర సాధ్యమైన సెయిలింగ్ పోటీల్లో చాంపియన్లుగా నిలుస్తున్నారంటే ఆ అక్కా చెళ్లెల్ల ఆత్మ స్థైర్యమేంటో ఊహించవచ్చు. వీరి సామర్థ్యాలను గుర్తించిన నగరంలోని యాచ్ క్లబ్ వ్యవస్థాపకులు సుహేమ్ షేక్ వారి విద్యతో పాటు సెయిలింగ్ శిక్షణకు సహాకారం అందిస్తున్నారు. అందివచి్చన సహకారాన్ని వినియోగించుకుంటూ.. ఈ హైదరాబాదీ సెయిలర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండించారు. సౌత్ కొరియా, భారత్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో దీక్షిత కొమురవెళ్లి పోటీపడింది. ప్రస్తుతం లండన్ వేదికగా జరుగుతున్న మరో అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకం కోసం పోరాడుతోంది. ఈ మధ్యనే జరిగిన ఓ ప్రమాదంలో చెయి విరగడంతో లండన్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు వెళ్లలేకపోయానని లహరి బాధను వ్యక్తం చేసింది. అయితే కొన్ని రోజుల క్రితమే నగరం వేదికగా జరగిన 15వ మాన్సూన్ రెగట్టా పోటీల్లో అదే గాయంతోనే పోటీ చేసి అందరి ప్రశంసలను పొందింది చెల్లి. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న మొదటమ్మాయి కూడా సెయిలింగ్‌లో ప్రవేశముంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సెయిలింగ్‌ను కొనసాగించలేకపోయిందని తల్లి కవిత తెలిపింది. పిల్లల చదువులు, సెయిలింగ్ శిక్షణతో పాటే తనకు కూడా యాచ్ క్లబ్ ఆధ్వర్యంలో వంట వండటానికి ఉద్యోగమిచ్చి ఉపాధి అవకాశాన్ని కల్పించారని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీక్షిత విజయాలు–పతకాలుకాంస్యం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 14వ మాన్సూన్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికలవిభాగం వైఏఐ యూత్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ జూనియర్ నేషనల్స్ 2023. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం సెయిల్ ఇండియా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం వైఏఐ 4వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2024. బంగారు పతకం– అప్టిమిస్ట్ బాలికల విభాగం 15వ మాన్సూన్ రెగట్టా 2024.లహరి విజయాలు–పతకాలు..బంగారు పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, మొదటి వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2023. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం, వైఏఐ 3వ సికింద్రాబాద్ క్లబ్ యూత్ రెగట్టా 2023. కాంస్యం– ఆప్టిమిస్ట్ వైఏఐ యూత్ నేషనల్స్ 2022. కాంస్యం– ఆప్టిమిస్ట్ 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024. వెండి పతకం– ఆప్టిమిస్ట్ బాలికల విభాగం 2వ వైఏఐ నార్త్ ఈస్ట్ రెగట్టా 2024.ప్రతిష్ఠాత్మక సెయిలింగ్ పోటీల్లో జాతీయ స్థాయి పతకాలు.. లండన్, కొరియాలో దీక్షిత, నేషనల్స్‌లో లహరి రాణింపు.. విద్య, సెయిలింగ్‌లో యాచ్ క్లబ్ సహాయం -
బాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అక్కాతమ్ముడు ఎవరంటే (ఫోటోలు)