
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా స్టార్ హృతిక్ రోషన్‌కు సునయన రోషన్ అనే చెల్లెలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాను మద్యానికి బానిసైనట్లు వెల్లడించారు. ఆ వ్యసనం నుంచి బయప పడేందుకు చాలా ఇబ్బందులు పడినట్లు తెలిపారు. రిహబిలిటేషన్ సెంటర్‌లో నరకం అనుభవించినట్లు సునయన చెప్పుకొచ్చారు. అక్కడ సాధారణ పునరావాస కేంద్రం కంటే అధ్వాన్నంగా ఉంటుందని తాను ఊహించలేదన్నారు.
సునయన రోషన్ మాట్లాడుతూ.. 'ఇది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా చికిత్స అందస్తారు. ఆ సెంటర్‌లో దాదాపు 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడి వాతావరణం సాధారణ పునరావాసం కంటే చాలా దారుణంగా ఉంది. అసలు నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ నన్ను రోజుకు 9 గంటల పాటు ఓకే గదిలో ఉంచేవారు. అలా ప్రత్యక్షం నరకం అనుభవించా' అని తెలిపింది.
అయితే తాను బాగుపడతానని తెలిసే అక్కడికి వెళ్లినట్లు సునయన రోషన్ తెలిపారు. మద్య వ్యసనం నుండి బయటపడేందుకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక అడుగుగా భావించినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రం అమ్మ వారికి ఇచ్చిందని వెల్లడించింది. అక్కడికి సెల్ ఫోన్‌లు, షుగర్, కాఫీ , చాక్లెట్, పెర్ఫ్యూమ్‌లు అనుమతించరని ఆమె చెప్పింది. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే తన తండ్రి రాకేష్ రోషన్‌కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదని సునయన రోషన్ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment