sunaina
-
హృతిక్ రోషన్ సోదరి సునైనా వెయిట్ లాస్ స్టోరీ: ఏకంగా 50 కిలోలు..!
చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు స్లిమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. అలాగే ఆరోగ్యంపై సరైన అవగాన కల్పిస్తున్నారు కూడా. కొంతమంది వారిని ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గుతున్నారు కూడా. ఇప్పుడు తాజాగా అదే కోవలోకి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా కూడా చేరిపోయారు. కిలోల కొద్దీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది. సునైనా వెయిట్ లాస్ జర్నీ ఎలా సాగిందంటే..బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కుమార్తె సునైనా బొద్దుగా అందంగా ఉండేది. చాలమందికి తెలుసు ఆమె చాలా లావుగా ఉంటుందని. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతలా స్లిమ్‌గా మారిపోయింది. దాదాపు 50 కిలోలు బరువు తగ్గినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆమెకు కామెర్లు వంటి ఆరోగ్య సమస్యలున్నప్పటికీ విజయవంతంగా బరువు తగ్గినట్లు వెల్లడించిది. నిజానికి ఆమె గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్‌తో పోరాడుతోంది. ఆమె ఇన్ని అనారోగ్య సమస్యలను అధిగమించి మరీ..బరువు తగ్గేందుకు ఉపక్రమించడం విశేషం. తన అనారోగ్య భయమే తనను సరైన ఆహారం తీసుకునేలా చేసిందంటోంది సునైనా. తాను పూర్తిగా జంక్ ఫుడ్‌కి దూరంగా ఉన్నట్లు వెల్లడించింది. "సరైన జీవనశైలితో కూడిన ఆహారం కామెర్లు సమస్యను తగ్గుముఖం పట్టేలా చేసింది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్య కూడా చాలా వరకు కంట్రోల్ అయ్యింది. తన తదుపరి లక్ష్యం పూర్తి స్థాయిలో ఫ్యాటీలివర్ని తగ్గిచడమే". అని ధీమాగా చెబుతోంది సునైనా View this post on Instagram A post shared by Sunaina Roshan (@roshansunaina) ఫ్యాటీ లివర్‌తో బరువు తగ్గడం కష్టమా..?ఫ్యాటీ లివర్ అనేది ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి అంశాలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఆ సమస్యతో ఉండే వ్యక్తులు బరువు తగ్గడం అనేది అంత ఈజీ కాదు. ప్రపంచ జనాభాలో దాదాపు నాలుగింట ఒక వంతు మంది ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది జీవక్రియ చర్యలకు అంతరాయం కలిగించి బరువు పెరిగేలా చేస్తుంది. పైగా దీర్ఘకాలిక మంట, ఆక్సీకరణ ఒత్తిడికి దారితీసి కండరాల పనితీరుని, శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించేస్తుంది. ఫలితంగా అధిక బరువు సమస్యను ఎదుర్కొంటారని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: ఆ కుటుంబంలో 140 మందికి పైగా డాక్టర్లు! ఐదు తరాలుగా..) -
మొదటి భార్యతో విడాకులు.. అతనితో ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..!
కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ సునయన. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే ఇటీవల తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం వెల్లడించలేదు. తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్, దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఖలీద్ ఇటీవల జూన్ 26న అమ్మాయి వేలికి డైమండ్ రింగ్‌తో చేతులు పట్టుకున్న ఫోటోను పోస్ట్ చేశాడు.దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది.కాగా.. సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.మొదటి భార్యతో విడాకులు..కాగా.. జూలై 1న ఖలీద్ అల్ అమెరీ మాజీ భార్య సలామా మొహమ్మద్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఒ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ తాను, ఖలీద్ విడాకులు తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీనే కోర్టు విడాకులు మంజూరు చేసిందని ఆమె పేర్కొంది. దుబాయ్‌కు చెందిన ఖలీద్ అల్ అమెరికీ సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) View this post on Instagram A post shared by Khalid Al Ameri (@khalidalameri) -
సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్..
హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అయింది. కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకుంది.తాజాగా ఈమె ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. తనకు ఎంగేజ్మెంట్ జరిగిందని వెల్లడించింది. కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం పేర్కొనలేదు.సునయన 2005లో కుమార్ వర్సెస్ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్ విడుదెన్(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్ క్యూట్ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది. Hi, I’ve seen some articles going around regarding my last post and wanted to clarify that I am indeed happily engaged. Thank you for all the wonderful messages that are coming in, it means so much ❤️ pic.twitter.com/CdVGVjKJyk— Sunainaa (@TheSunainaa) June 7, 2024 -
ఐస్‌బాత్ చేస్తున్న తెలుగు హీరోయిన్
కథానాయకిలకు అందం, ఆరోగ్యం చాలా ముఖ్యం. అందుకోసం వాళ్లు నిరంతరం వ్యాయామం, యోగాలు అంటూ కసరత్తులు చేయడం తప్పనిసరి. అందుకు కొత్త కొత్త యోగాలను కనిపెడుతుంటారు. నటి సునైనా అలాంటి కొత్త యోగాను చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముందుగా మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత నటిగా పరిశ్రమకు పరిచయం అయిన అచ్చ తెలుగు అమ్మాయి సునైనా. తమిళంలో కాదలిల్ విళిందేన్ చిత్రం ద్వారా నటుడు నకుల్‌కు జంటగా కథానాయకిగా పరిచయం అయిన సునైనా తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని చవి చూశారు. ఈ చిత్రం 2008లో విడుదల అయ్యింది. ఆ తరువాత ఈ జంట మాచిలామణి అనే మరో చిత్రంలోనూ నటించారు. దీంతో వీరిద్దరి మధ్య ప్రేమ అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత వీరి కలిసి నటించలేదు. కాగా నటి సునైన మాత్రం నీర్ పరవై, వంశం వంటి పలు చిత్రాల్లో నటించినా స్టార్ డమ్ కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఈమె చివరిగా నటుడు విశాల్ సరసన లాఠీ చిత్రంతో పాటు రెజీనా అనే హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంలో నటించారు. కొన్ని వెబ్ సిరీస్‌లోనూ నటించిన సునైనా ఇప్పుడు అరుదైన యోగాసనంతో వార్తల్లో కెక్కారు. ఫిట్‌నెస్‌లో భాగంగా ఈ భామ ఐస్ మెడిటేషన్ చేస్తుండడం విశేషం. సాధారణంగా ఒంటిలోని నరాలను బలపరచుకోవడం కోసం శరీర బడలికను తగ్గించుకోవడం కోసం ఐస్‌బాత్ చేస్తుంటారు. అలాంటిది నటి సునైన మాత్రం ఐస్ మెడిటేషన్ చేస్తున్నారు. ఒక టబ్‌లో ఐస్ ముక్కల నడుమ ఈమె యోగా చేశారు. దీంతో ఈమె మెడిటేషన్ చేస్తున్న వీడియో, ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) -
తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ గతేడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ మాత్రమే థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. అందుకోసం తెలుగునాట ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించారు. కానీ రెజీనాకు ఇక్కడ అనుకున్న స్థాయిలో స్క్రీన్స్ దొరకలేదు. తమిళంలో ఎప్పుడో రిలీజ్ దాంతో తెలుగు రిలీజ్ డేట్ వాయిదాపడింది. తమిళంలో సినిమా అంతగా ఆడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల చేయాలన్న ఆలోచన సైతం విరమించుకున్నారు. ఇకపోతే రెజీనా తమిళ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో ఇదివరకే అందుబాటులో ఉంది. ఇన్నాళ్ల తర్వాత సడన్‌గా తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు. తమిళ వెర్షన్ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్‌ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు.. ఛాలెంజింగ్ పాత్రలో.. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించిన ఈ రివేంజ్ థ్రిల్లర్ మూవీలో అనంత్ నాగ్ కీలక పాత్ర పోషించాడు. ఇందులో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్లో సునైన నటించింది. గత సినిమాల్లో సాఫ్ట్ రోల్స్ చేసిన సునైన ఇందులో ఛాలెంజింగ్ క్యారెక్టర్లో కనిపించింది. తన భర్త మరణంపై ఓ మహిళ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే కథ. ఈ సినిమాలో సునైన నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ కథలోని మలుపులు ఈజీగా గెస్ చేసేలా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా అంతగా వర్కవుట్ కాలేదు. తెలుగు సినిమాతోనే కెరీర్ మొదలు హీరోయిన్గా సునైన కెరీర్ తెలుగు సినిమాతోనే మొదలైంది. కుమార్ వర్సెస్ కుమారీ అనే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. 10th క్లాస్ మూవీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్‌కు 10 ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని 'పెళ్లికి ముందు ప్రేమ కథ'తో రీఎంట్రీ ఇచ్చింది. రాజరాజచోర మూవీ, చదరంగం, మీట్ క్యూట్ వెబ్ సిరీస్‌లతోనూ మెప్పించిందీ బ్యూటీ. Telugu version of Tamil film #Regina (2023) by @domin_dsilva, ft. @TheSunainaa @AnanthNag24 @actorvivekpra @actor_saideena & @writerbava, now streaming on @PrimeVideoIN.@SathishNair20 @YugabhaarathiYb @telugufilmnagar @yellowbearprod @JungleeMusicSTH pic.twitter.com/LqN8WCOM5I — CinemaRare (@CinemaRareIN) February 22, 2024 చదవండి: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబట్టి లైట్..', జీవితం చాలా చిన్నది.. -
ఒక మదర్ గా చెబుతున్న... పిల్లలు వాళ్లే మారతారు లే అని వదిలేస్తే..!
-
హాస్పిటల్ బెడ్‌పై తెలుగు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?
'రాజ రాజ చోర' సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సునైన ఆస్పత్రి పాలయ్యారని తెలుస్తోంది. 2005లో కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సునయన తెలుగులో సమ్‌థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాలు చేసింది. కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా నీర్ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్‌బాస్ 4 సీజన్లోనూ పాల్గొంది. విశాల్‌కు జోడీగా నటించి కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే.. తెలుగులో 'రాజ రాజ చోర' సినిమా ద్వారా క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. (ఇదీ చదవండి: నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!) సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజా ఒక పోస్ట్ చేసింది. ఆ ఫోటో చూసిన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. చేతికి సెలైన్ పెట్టుకుని ఆస్పత్రి బెడ్‌పై దిగిన ఫొటోను సునైన షేర్ చేసింది. అది కాస్త నెట్టింట వైరల్ అయింది. ఆమెకు ఏమైందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఏ కారణం వల్ల ఆమె ఆస్పత్రిలో చేరారో తెలపలేదు. కానీ త్వరలో మరింత దృఢంగా తిరిగి వస్తానని మాత్రం చెప్పుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుతున్నారు. గతంలో హీరోయిన్ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని ప్రచారం జరిగింది. తర్వాత అదంతా డ్రామా అని, ఒక సినిమా కోసం వాళ్లు చేసిన ఫ్రాంక్ వీడియో అని అసలు విషయం తెలిసింది. అప్పట్లో ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. అదే మాదిరి ఇప్పుడు కూడా ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్నారా అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజా చిత్రం ‘రెజీనా’ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. View this post on Instagram A post shared by Sunainaa Yeellaa (@thesunainaa) -
హీరోయిన్ సునయన కామెంట్స్.. నచ్చిందే చేస్తానని!
దక్షిణాదిలో 18 ఏళ్లుగా హీరోయిన్ గా రాణిస్తున్న భామ సునయన. తెలుగు సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ.. తమిళం, మలయాళం, కన్నడం భాషల్లోనూ నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన రెజీనా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో శుక్రవారం తెరపైకి రానుంది. తాజాగా ప్రమోషన్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నా కుటుంబం, తమిళ ప్రేక్షకుల నుంచి ప్రేమ, ఆదరణ చాలానే లభించాయి. అందుకు వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రెజీనా చిత్రం నా కెరీర్లో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2018లో నేన ఏం చేయాలన్న దాని గురించి చాలామంది చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం అనిపిస్తే అదే చేయాలని ఫిక్సయ్యాను. ఆ తర్వాత మంచి ఆలోచనాత్మక సినిమాలని ఎంపిక చేసుకోవడం ప్రారంభించను.' 'ఈ క్రమంలోనే అలా ఎలా నటించడానికి అంగీకరించావని అన్నారు. ఆ సమయంలో చాలా మందికి వెబ్ సీరీస్ అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. అందుకే చాలా మంది అటువైపు దృష్టి సారించలేదని, అయితే వెబ్ సీరీస్‌లో నటించడం నాకు నచ్చింది. అందుకే నచ్చింది చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత తమిళంలో సిల్లుక్కరు పట్టి, తెలుగులో రాజరాజ చోళ లాంటి డిఫరెంట్ మూవీస్ చేశాను. ఈ 'రెజీనా' చిత్రం కూడా అలాంటిదే' అని సునయన చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!) -
చంద్రముఖి సినిమా చూశాక ఒకటి ఫిక్సయ్యా: హీరోయిన్
హీరోయిన్ సునయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రెజీనా. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన డోమిన్ టి.సిల్వా ఈ మూవీని తెరకెక్కించారు. ఎలో బీయర్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష నాయర్ నిర్మించి, సంగీతాన్ని అందించారు. భవీ కె.భవన్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన రెజీనా చిత్ర టీజర్ మే 30వ తేదీన విడుదల చేయగా మంచి స్పందన వచ్చిందని నిర్మాత తెలిపారు. చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం స్థానికరాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఇందులో దర్శకుడు వెంకట్ ప్రభు, నిర్మాత టి.శివ, చిత్రా లక్ష్మణన్, ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్, శక్తి పిలిమ్స్ ఫ్యాక్టరీ శక్తివేలన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై సునయన మాట్లాడుతూ.. 2006లో అమ్మానాన్నల మధ్య కూర్చొని టీవీ సీరియల్స్ చూసే చిన్న అమ్మాయినని, అప్పట్లో తనకు నటిగా రంగ ప్రవేశం చేయాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు. అలాంటి సమయంలో సెలవులకు హైదరాబాద్ వెళ్లినప్పుడు చంద్రముఖి, గజిని చిత్రాలను చూశానని తెలిపారు. ఆ సమయంలో దక్షిణాది సినీ కథానాయిక అవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అప్పుడు సినిమాపై పెంచుకున్న ఆసక్తి, సిన్సియారిటీ, నిజాయితీని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నానన్నారు. ఈ చిత్ర దర్శకనిర్మాతల దగ్గర నుంచి యూనిట్లో ప్రతి ఒక్కరికీ సమైక్యత ఉందని సునయన అన్నారు. చదవండి: ఆదిపురుష్.. మా అదృష్టం: ప్రభాస్ -
హీరోయిన్ కిడ్నాప్.. పోలీసుల వెతుకులాట!
హీరోయిన్ సునయన రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. సునయన కిడ్నాప్ అయిందని, పోలీసులు ఆమె గురించి దర్యాప్తు చేస్తున్నారంటూ ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె ఆచూకీ తెలిసిందని, ఈ కిడ్నాప్ అంతా డ్రామా అని, ఇది సినిమా ప్రమోషన్లో భాగమేనని తెలుస్తోంది. మండిపడుతున్న నెటిజన్లు సునయన ప్రస్తుతం రెజీనా అనే తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని డోమిన్ సెల్వ డైరెక్ట్ చేస్తుండగా సతీశ్ నాయర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగానే సునయన కనిపించడం లేదంటూ పుకారు లేపారు. ఇది నిజమేనని భావించిన అభిమానులు సునయన కోసం ఆందోళన చెందారు. తీరా ఇదంతా ప్రాంక్ అని చెప్పడంతో నెటిజన్లు పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్నారు. అందరినీ కంగారు పెట్టించిన హీరోయిన్‌తో పాటు సినిమా టీమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరీ సునయన.. కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది సునయన. ఆ తర్వాత తెలుగులో సమ్‌థింగ్ స్పెషల్, 10th క్లాస్ సినిమాలు చేసింది. కాదలిల్ విడుంతేన్ అనే సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. నీర్ పార్వై, సమర్, మాసిలామణి, తేరి, సిలుక్కువార్‌పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నీర్ పార్వై సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. తమిళ బిగ్‌బాస్ 4 సీజన్లోనూ పాల్గొంది. సునయన చివరగా లాఠీ సినిమాలో విశాల్‌కు జోడీగా నటించింది. ప్రస్తుతం ఆమె రెజీనా చిత్రం చేస్తోంది. చదవండి: పూజలు, ఉపవాసాలు చేశా.. అయినా ఆ భగవంతుడు కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ -
రజనీకాంత్, విజయ్ రెమ్యునరేషన్‌పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తమిళ సినిమా: ఒకప్పుడు బాలీవుడ్ హీరోలు రూ.100 కోట్లు తీసుకునేవారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్లూ దాన్ని మించేశారు. తమిళనాడులోని రజనీకాంత్, విజయ్ వంటి నటులు రూ.120, 130 కోట్లకు పైగా పుచ్చుకుంటున్నట్లు సమాచారం. ఈ హీరోల గురించి నటి సునైనా సెటైర్లు వేసింది. ఈ పదహారణాల తెలుగు అమ్మాయి తమిళంలో కాదలిల్ విళిందేవ్ చిత్రం ద్వారా కథానాయికగా రంగప్రవేశం చేసింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వరుసగా అవకాశాలను అందుకుంటోంది. అరుళ్‌నిధికి జంటగా నటించిన వంశం చిత్రంలో ఈమె నటనతో అందరి ప్రశంసలు పొందింది. ఆ తర్వాత నీర్ పార్వై, సమర్, మాసిలామణి, తెరి, సిలుక్కువార్‌పట్టి తదితర చిత్రాలతో కోలీవుడ్‌లో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పేర్కొంది. మీకు స్క్రిప్ట్ రాసి నటించే అవకాశం వస్తే ఏ నటుడిని ఎంపిక చేసుకుంటావు అన్న ప్రశ్నకు బదులిస్తూ నటుడు విజయ్, ఫాహత్ సాజిద్, విజయ్ సేతుపతిలలో ఒకరిని ఎంపిక చేసుకుంటానని చెప్పింది. ఇటీవల బాగా నచ్చిన చిత్రం విక్రమ్ అని చెప్పింది. ప్రస్తుతం ప్రముఖ నటులు రూ. 100 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం ఏమిటన్న ప్రశ్నకు దీని గురించి కొందరు ఇంతకుముందే తన వద్ద ప్రస్తావించినట్లు చెప్పింది. అయినా అంత డబ్బు తీసుకుని ఏం చేస్తారబ్బా? అని సందేహం తనకు కలుగుతుందని చెప్పింది. తన తొలి చిత్రానికి రూ.15 వేలు తీసుకున్నట్లు చెప్పింది. తనకు సంబంధించిన వరకు ప్రేక్షకులు తన నటనను ఎలా ఆనందిస్తున్నారు అన్నదే ముఖ్యం అని పేర్కొంది. తాను కాదలిల్ విళిందేన్, సిలుక్కువార్‌పట్టి చిత్రాలను థియేటర్లలో ప్రేక్షకుల మధ్య చూశానని చెప్పింది. సిలుక్కువార్‌పట్టి చిత్రంలో నటుడు సముద్రఖనితో వాగ్వాదం చేసే సన్నివేశాలకు ప్రేక్షకులు ఈలలు వేస్తూ ఎంజాయ్ వేశారని చెప్పింది. అలాంటి తరుణాలే ముఖ్యమని, అందుకే తాను సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు నటి సునైనా పేర్కొంది. -
బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు, పెళ్లి చేసుకోవాలని కూడా లేదు : నటి
సినీ ప్రపంచంలో సక్సెస్ కొంతమందిని త్వరగా పలరికరిస్తే.. మరికొంతమందిని చేరుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుంది. ఆ సమయం వచ్చే వరకు ప్రయత్నిస్తూ వేచిచూసిన వారే స్టార్స్ అవుతారు. అలాంటి ఓ స్టారే.. సునైనా యెల్లా. పుట్టింది మహారాష్ట్రలోని నాగ్‌పూర్. తండ్రి హరీష్ యెల్లా, తల్లి సంధ్య యెల్లా. బీకామ్ పూర్తి చేసి, మోడల్‌గా మారింది. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపిస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంతో రంగుల ప్రపంచంలోకి పరిచయం కావాల్సింది. కానీ, అందులో తను చేసిన పాత్ర ఎడిటింగ్ కత్తెరకు బలైంది. అదృష్టం తలుపు తట్టినట్లు.. ఈ సారి చిన్న పాత్రతో కాదు, ఏకంగా హీరోయిన్ అవకాశమే ఆమెను వరించింది. 2005లో ‘కుమార్ వర్సెస్ కుమారి’ అనే తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తమిళంలో ‘కడలిల్ విసంతిన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తమిళ ‘బిగ్‌బాస్’ సీజన్ 4 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది. అలా తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తర్వాత తమిళంతో పాటు పలు తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో చాలా గ్యాప్ తీసుకొని చేసిన ‘రాజ రాజ చోర’ చిత్రం మంచి విజయం సాధించడంతో వరుసగా ‘లాఠీ’, ‘రెజీనా’ వంటి పెద్ద సినిమాలు ఆమె కాల్షీట్స్ తీసుకున్నాయి. ప్రస్తుతం సోనీలివ్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘వండర్ విమెన్’, ‘మీట్ క్యూట్’ లతో వెబ్ ప్రేక్షకులను అలరిస్తోంది. ‘బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ మధ్యనే పుస్తకాలు చదవడం మొదలుపెట్టా. పుస్తక పఠనం వల్ల ఎంతో ఉపశమనం దొరుకుతోంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు – సుౖనైనా యెల్లా -
Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ
టైటిల్: లాఠీ నటీనటులు: విశాల్, సునైన, ప్రభు, మనిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్ కుమార్ సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం విడుదల తేది: డిసెంబర్ 22,2022 ‘లాఠీ’ కథేంటంటే.. మురళీకృష్ణ(విశాల్) ఓ సిన్సియర్ కానిస్టేబుల్. భార్య కవి(సునైన), కొడుకు రాజునే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పై అధికారులు అతన్ని సెస్పెండ్ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మురళీ అధికారుల చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు డీఐజీ కమల్(ప్రభు) సాయంతో ఉద్యోగంలో చెరతాడు. ఇకపై ఎవరిని లాఠీతో శిక్షించొద్దని భావించిన మురళీ...సిన్సియర్‌గా తన పని తాను చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంటాడు. ఓ సారి డీఐజీ కమల్..తన కస్టడీలో ఉన్న ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని కోరతాడు. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడు ఎవరనేది చూడకుండా.. అతన్ని లాఠీతో కొడతాడు మురళీ. అయితే ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ సూరా కొడుకు వీరా అని తర్వాత తెలుస్తుంది. తనను తీవ్రంగా కొట్టిన మురళీపై వీరా పగ పడతాడు. పట్టుకున్న డీఐజీ కమల్ని కాకుండా.. లాఠీతో కొట్టిన మురళి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మురళీ కృష్ణ ఏం చేస్తాడు? సూరా, వీరాలనుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ సాధారణ కానిస్టేబుల్ కథే ‘లాఠీ’. పై అధికారుల ఒత్తిడితో ఓ ముఠాతో వైరం పెంచుకొని.. ఆ ముఠా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే.. కానిస్టేబుల్ ఒక్కడే తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ స్టోరీ లైన్. పాయింట్ కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో చాలా సింపుల్‌గా కథ ముందుకు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితాన్ని చూపించారు. నిజాయతీగా ఉండే ఓ కానిస్టేబుల్ పై అధికారి చెప్పారని ఓ నేరస్తుడిని కొట్టడం..అతను పై అధికారిపై కాకుండా కానిస్టేబుల్‌పై పగపెంచుకోవడం.. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌తో అతన్ని గుర్తించడం లాంటి సన్నివేశాల ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పోరాట ఘట్టాలు అయినా కొత్తగా ఉంటాయా అంటే అదీ లేదు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. పోలీసు పాత్రలు విశాల్‌కు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో పోలీసు పాత్ర పోషించారు. అందుకే కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. కవిత పాత్రకు సునైనా న్యాయం చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ప్రభు, తలైవాసన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక విలన్లు సూరా, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ తెరపై విలనిజం పండించడంలో విఫలం అయ్యారు. అయితే ఈ తప్పు వారిది కాదు. ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానంలోనే లోపం ఉంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పీటర్ హెయిన్స్ పోరాట ఘట్టాలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
విశాల్ ‘లాఠీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదు: హీరోయిన్
కుమార్ వర్సెస్ కుమారి అనే తెలుగు చిత్రంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది హీరోయిన్ సునైనా. కడలిల్ విసంతిన్(2008) సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది. మాసిలమణి, వంశం సినిమాలతో అలరించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో నటించిన సునయన గతేడాది రిలీజైన రాజ రాజ చోరతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పెళ్లెప్పుడు అన్న ప్రశ్న ఎదురైంది. దీనికామె బ్రేకప్ నుంచి ఇంకా కోలుకోలేదని బదులిచ్చింది. మరొకరు కష్టసమయాల్లో ఏం చేస్తారని అడగ్గా.. ఈ మధ్యే చదవడం ప్రారంభించా, పుస్తక పఠనం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది అని చెప్పింది. తెలుగులో సినిమాలు చేయండి ప్లీజ్ అని ఓ అభిమాని కోరగా.. తప్పకుండా చేస్తానంటూ 'మీట్ క్యూట్', 'లాఠీ', 'రెజీనా' సినిమా పేర్లను రాసుకొచ్చింది. కాగా సునయ నటించిన వండర్ ఉమెన్ సోనీలివ్‌లో రేపటి నుంచి ప్రసారం కానుంది. Let me recover from the last heartbreak 😊 https://t.co/s8GC81iLpO — SUNAINAA (@TheSunainaa) November 16, 2022 Yes yes, #meetcute… #laatti and #regina ❤️ https://t.co/ZWX6KlSEFw — SUNAINAA (@TheSunainaa) November 16, 2022 What you want for yourself… what makes YOU happy. https://t.co/jmXbExK0xl — SUNAINAA (@TheSunainaa) November 16, 2022 చదవండి: అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోన్న కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్ -
విశాల్ ‘లాఠీ’ టీజర్ లాంచ్ (ఫోటోలు)
-
సాధారణ గృహిణిగా హీరోయిన్ సునైనా..!
‘టెన్త్ క్లాస్’, ‘పెళ్లికి ముందు ప్రేమకథ’, ‘రాజరాజ చోర’ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సునైన ‘రెజీనా’ అనే ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించారు. ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సతీష్ నాయర్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ‘‘స్టైలిష్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ ‘రెజీనా’. ప్రవాహానికి ఎదురీదే చేపలా ఒక సాధారణ గృహిణి ఓ అసాధారణమైన పనిని ఎలా సాధించింది? అనే అంశాన్ని ఈ చిత్రంలో చూస్తారు’’ అని డొమిన్ డిసిల్వా పేర్కొన్నారు. -
‘అమ్మోరు’ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Ammoru Child Artist Sunaina Story: సాధారణంగా చాలా మంది అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది క్యారెస్ట్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్గా ఎదిగారు. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారు ఉన్నారు. వారిలో రాశి, శ్రీదేవి, మీనా లాంటి వారు ఉన్నారు. అయితే చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన అందరూ హీరోయిన్గా మారుతారని గ్యారెంటీ లేదు. అందుకు ఉదాహరణ సునైనా బాదం. సునైనా బాదం అని చెబితే ఎవరికీ అర్థం కాదు. కానీ ఆమె నటించిన ఓ సినిమా పేరు చెబితే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ‘అమ్మోరు’సినిమా గుర్తుంది కదా? ఈ సినిమాలో నటించిన మరో పవర్ ఫుల్ చైల్డ్ క్యారెక్టర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్న పిల్లలా సౌందర్య వద్దకు వచ్చే అమ్మోరు తల్లే సునైనా బాదం. ఆ సినిమాలో సౌందర్యను ఇంట్లో వాళ్లందరూ బాధిస్తుంటే.. అమ్మోరు తల్లి చిన్న పిల్లగా మారి సౌందర్యకు రక్షణగా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్లతో గంభీరంగా కనిపించిన సునైనా ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించింది. అప్పట్లో ఆ చిన్నారి నిజంగానే దేవత అని జనాలు అనుకున్నారంటే.. ఆ క్యారెక్టర్లో ఆమె ఎంత జీవించేసేందో అర్థం చేసుకోవచ్చు. ఇలా బాల నటిగా పలు సినిమాల్లో కనిపించి మెప్పించిన సునైన ఆ తర్వాత కూడా ప్రేక్షకులతో టచ్ లోనే ఉంది. గత కొంత కాలంగా యూట్యూబ్ లో ఫ్రస్టేటెడ్ వీడియోలతో బాగా పాపుర్ అయ్యింది. సమంత ‘ఓబేబీ’సినిమాలో రాజేంద్రప్రసాద్ కూతురిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం సునైనా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఆమె చేసిన 'ఫ్రస్టేటెడ్ ఉమెన్’అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా ఫేమస్ అయ్యారు. అయితే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు హీరోయిన్లుగా అవుతుంటే.. సునైనా మాత్రం యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌లు చేస్తూ ఫేమస్ అవుతున్నారు. హీరోయిన్ కావాలని పెద్దగా ఆశ లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించాలని మాత్రం ఉంది అని సునైనా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మరి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సునైనా బాదం భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉండాలని ఆశిద్దాం. -
దయచేసి సాయం చేయండి: నటి అభ్యర్థన
సాయం చేయమని అడుగుతూ నటి సునయన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసింది. ఇప్పటివరకు తనెప్పుడూ ఎవరి సాయం కోరలేదని, కానీ మొట్టమొదటిసారి సాయం అర్థిస్తూ ఈ వీడియోను చేస్తున్నామని చెప్పింది. "పెళ్లికి ముందు ప్రేమ కథ" చిత్ర నిర్మాత అవినాష్ సలంద్ర ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, అతడి చికిత్స కోసం ఆర్థిక సాయం అందించమంటూ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. "సాధారణంగా ఇంతవరకూ నేనెవర్నీ సాయం చేయమని అడుగుతూ వీడియో చేయలేదు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితి వచ్చింది. కరోనా బారిన పడ్డ అవినాష్ నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మెరుగైన వైద్యం చేయించుకోవాలంటే అతడికి డబ్బు అవసరం. కాబట్టి దయచేసి మీకు తోచినంత డబ్బు ఇవ్వండి. నేనూ కోవిడ్ బారిన పడి కోలుకున్నాను, కాబట్టి అతడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోగలను. చిన్నదో, పెద్దదో ఎంతో కొంత డబ్బు అతడికి పంపి నాకు సాయపడండి. వీలైతే మీకు తెలిసిన వాళ్లకు ఈ వీడియోను షేర్ చేయండి" అని అభ్యర్థించింది. సునయన తెలుగులో కుమార్ వర్సెస్ కుమారి చిత్రంలో నటించింది. చివరిసారిగా 'ఎనై నోకి పాయుమ్ తోట', 'శిల్లు కరుపత్తి' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె 'ఎరియుమ్ కన్నడి', 'ట్రిప్' చిత్రాల్లో నటిస్తోంది. View this post on Instagram A post shared by Sunainaa (@thesunainaa) చదవండి: డర్టీ కామెంట్స్: చిక్కుల్లో రణ్‌దీప్ హుడా అవకాశాల కోసం అగచాట్లు పడిన నటి -
నటుడి రెండో పెళ్లి: మాజీ భార్య స్పందన
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలీవుడ్ కపుల్ వైభవ్ రేఖీ-దియా మీర్జాల పెళ్లి ఫొటోలే తారసపడుతున్నాయి. వీరికిది రెండో పెళ్లి. దియా ఇదివరకే నిర్మాత సాహిల్ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకోగా 2019లో భర్తతో విడాకులు తీసుకుంది. ఇటు వైభవ్ కూడా గతంలో సునైన రేఖీతో ఏడడుగులు వేశాడు. కానీ వీళ్ల బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో అతడు దియాకు దగ్గరై, ప్రేమించి ఫిబ్రవరి 15న ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. తాజాగా ఈ పెళ్లి గురించి వైభవ్ మాజీ భార్య, యోగా నిపుణురాలు సునయన స్పందించింది. "నా పేరు సునయన రేఖీ. బహుశా నా పేరు మీరు ఇదివరకు వినే ఉండొచ్చు. ఎందుకంటే ఈ మధ్య వార్తల్లో నా పేరు తరచూ వినిపిస్తోంది. అవును, నా మాజీ భర్త దియాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి నాకు కుప్పలుతెప్పలుగా మెసేజ్‌లు వస్తున్నాయి. నేను, నా కూతురు సమీరా ఎలా ఉన్నామంటూ ఆందోళనపడుతున్నారు. మీ ప్రేమకు థ్యాంక్స్. మేమిద్దరం బాగానే ఉన్నాం. మాకు బాంబేలో ఎవరూ లేరు అనుకునేవాళ్లుం. కానీ ఇప్పుడు వీరి పెళ్లితో సమీరా కుటుంబం పెద్దదైంది. తన జీవితంలో ప్రేమ చాలా అవసరం. ఆమె ఇప్పటివరకు తన తల్లి, తండ్రి మధ్య ప్రేమను చూడకలేకపోతే ఇకనుంచైనా దాన్ని చూసి ఆస్వాదిస్తుంది. ఆ ప్రేమ, మమకారాలను తను కూడా ఒడిసి పట్టుకుని ముందుకు సాగుతుంది. సమీరా, ఆమె తండ్రి వైభవ్, దియా.. ఈ ముగ్గురి వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని చెప్పుకొచ్చింది. చదవండి: రెండో వివాహం.. ట్రెండ్ సెట్ చేసిన నటి అమీర్‌ఖాన్ సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి -
రాజరాజచోర ప్రారంభం
శ్రీ విష్ణు హీరోగా హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజ రాజ చోర’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా బ్రేక్ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం తిరిగి ప్రారంభం అయింది. మేఘా ఆకాశ్, సునయిన కథానాయికలు. యస్పీ బాలసుబ్రహ్మణ్యంకి నివాళులు అర్పించి, చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఒక వినూత్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘సినిమా పూర్తయ్యేవరకూ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాం’ అన్నారు సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. తనికెళ్ల భరణి, రవిబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు కెమెరా: వేదరామన్, సంగీతం: వివేక్ సాగర్. -
నటి సునైనాకు పెళ్లైందా?
చెన్నై: నటి సునైనాకు పెళ్లైందా? ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ఆసక్తికరమైన టాక్ ఇదే. కాదలిల్ విళిందేన్ (ప్రేమలో పడ్డాను) అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన నటి సునైనా. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న ఈ భామ ఆ తరువాత వరుసగా మాసిలామణి, యాదుమాగి, నీర్‌పార్వై, వంశం చిత్రాల్లో నటించింది. అయినా ఎందుకనో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ధనుష్ హీరోగా నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూటా చిత్రంలో కూడా ముఖ్య పాత్రలో నటించింది. కాగా తాజాగా నటించిన సిల్లుక్కరుపట్టి చిత్రంలో సునైనా నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా, ఇటీవల ఒక యువకుడితో ఉన్న ఫొటోను నటి సునైనా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. అంతే అప్పటి నుంచి సునైనాకు పెళ్లైపోయ్యిందని, తన రహస్యంగా వివాహం చేసుకుందని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది సునైనాకు తలనొప్పిగా మారిందట. ఈ ప్రచారంతో చాలా మంది ఆమెకు ఫోన్ చేసి రకరకాలుగా ప్రశ్నిస్తున్నారట. మరి కొందరైతే శుభాకాంక్షలు చెప్పేస్తున్నారట. దీంతో ఈ అమ్మడికి నోరు విప్పక తప్పలేదు. ఈ వ్యవహారంపై నటి సునైనా స్పందిస్తూ తనకు పెళ్లైపోయిందన్న ప్రచారంలో వాస్తవం లేదని, అదంతా వదంతి అని చెప్పింది. ఇలా ఎవరు అసత్య ప్రచారం చేస్తున్నారో తెలియదు గానీ, చాలా మంది తనకు ఫోన్ చేసి విచారిస్తున్నారని అంది. అయినా తన వివాహాన్ని రహస్యంగా జరుపుకోవలసిన అవసరం లేదని, వరుడెవరన్నది నిర్ణయం అయిన తరువాత ఆ విషయాన్ని తానే బహిరంగంగా వెల్లడిస్తానని, పెళ్లిను కూడా అందరి సమక్షంలోనే చేసుకుంటానని చెప్పింది. కాగా తొలుత తెలుగులోనే హీరోయిన్గా పరిచయమైన ఈ భామ నటిగా దశాబ్దన్నర పూర్తి చేసుకుంది. అదే విధంగా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషలన్నింటిలోనూ నటించిన సునైనా ప్రస్తుతం తమిళంలో ట్రిప్, ఎరియుమ్ కన్నాడి చిత్రాల్లో నటిస్తోంది. అన్నట్లు వెబ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే మూడు వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది. -
సైన్స్ ఫిక్షన్ చిత్రంలో సునైనా
సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రంలో నటి సునైనా నటించనుంది. ఆ మధ్య పలు చిత్రాల్లో వరుసగా నటించిన తెలుగు అమ్మాయి ఇటీవల కాస్త వెనుక పడింది. తాజాగా మళ్లీ బిజీ అవుతోంది. యోగిబాబు, కరుణాకరన్ కలిసి నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ డార్క్ కామెడీ చిత్రం గురించి ప్రకటన రాగానే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఇందులో హీరోయిన్గా నటి సునైనాను ఎంపిక చేసినట్లు చిత్రవర్గాలు వెల్లడించాయి. ప్రవీణ్ అనే వర్థమాన నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నాడు. డెన్నీస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఈ చిత్రంలో కథానాయకి పాత్ర సవాల్‌తో కూడుకున్నదన్నారు. ఆ పాత్రకు అనుభవం ఉన్న నటి నటిస్తే బాగుంటుందని భావించామన్నారు. సునైనా మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రీన్‌ప్లే తనను బాగా ఆకట్టుకుందన్నారు. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు తాను ఆ కథతో పయనం అవుతున్న ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చింది. హీరో ప్రవీణ్ గురించి మాట్లాడుతూ నూతన నటుడు అన్నది సినిమాలో ముఖ్యం కాదని, వారికి ఇచ్చిన పాత్రకు ఎంత వరకు న్యాయం చేశారన్నదే ముఖ్యం అని అంది. ఈ చిత్రం కోసం నిర్వహించిన రిహార్సల్స్‌లో ప్రవీణ్ తనదైన శైలిలో ఉత్తమ నటనను ప్రదర్శించాడని పేర్కొంది. కాగా సాయి ఫిలింస్ స్టూడియోస్ పతాకంపై ఏ.విశ్వనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. -
అది అసలు ప్రేమే కాదు: హృతిక్
ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారంటూ హీరో హృతిక్ రోషన్ సోదరి సునయన రోషన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత ఇళ్లే తనకు నరకంగా మారిందని, తమ్ముడు హృతిక్ కూడా తనపై ద్వేషం పెంచుకుని, వేధిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై హృతిక్ తొలిసారిగా స్పందించాడు. ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ మాది అందమైన అనుబంధం. ఇక ప్రేమ అనేది మన పిల్లలు, స్నేహితులతో ఉండే బంధం వంటిదే. అయితే అందులో కూడా కాస్త విఙ్ఞత పాటించాలి. మనపై ఎవరి ప్రేమ నిజమైందో తెలుసుకోగలగాలి. ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలను. ప్రేమ ఎన్నటికీ ద్వేషంగా రూపాంతరం చెందదు. ఒకవేళ అలా జరిగితే అసలు అది ప్రేమే కాదు. ఈ విషయం అర్థం చేసుకోగలిగితే ఎవరైనా పూర్వపు ప్రేమ పొందవచ్చు’ అని సునయను ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇక ప్రస్తుతం హృతిక్ తన అప్‌కమింగ్ మూవీ ‘సూపర్ 30’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. కాగా తన ప్రేమ విషయం గురించి సుయన మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసిన వరుస ట్వీట్లు కలకలం రేపాయి. అయితే ఇంతవరకు రుహైల్ మాత్రం సునయనతో ప్రేమ విషయంపై నోరు విప్పలేదు గానీ.. ఈ విషయంలో ఆమె తండ్రి రాకేశ్ రోషన్‌ను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేశాడు. కాగా రుహైల్కు ఇది వరకే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారని..అతడు సునయను ట్రాప్ చేశాడని బీ-టౌన్లో వార్తలు వినిపిస్తున్నాయి. -
హృతిక్ చేస్తే కరెక్ట్; సునయనది తప్పా!?
హృతిక్ రోషన్ సోదరి సునయిన రోషన్‌తో తనకున్న బంధం గురించి జర్నలిస్టు రుహైల్ అమీన్ తొలిసారిగా స్పందించారు. కేవలం మతం కారణంగానే సునయన కుటుంబ సభ్యులు తనను ద్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హృతిక్ మాజీ భార్య(సుసానే ఖాన్) విషయంలో వారికి అడ్డురాని మతం..తన విషయంలో మాత్రం ఎందుకు అడ్డు వస్తుందో తెలియడం లేదన్నారు. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సునయన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రుహైల్...‘ ఓ ఎంటర్టేన్మెంట్ చానల్లో పనిచేసే సమయంలో మొదటిసారి తనను కలిశాను. ఆ తర్వాత ఇద్దరం సోషల్ మీడియాలో టచ్‌లో ఉండేవాళ్లం. అభిప్రాయాలు పంచుకునే వాళ్లం. ఈ క్రమంలో సునయన నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అందుకు తన కుటుంబం మద్దతు కోరింది. కానీ వారిలా పూర్తి వ్యతిరేకంగా మారతారని తను ఊహించలేదు. ఆమె తండ్రి రాకేష్ రోషన్ నన్ను ఓ ఉగ్రవాదిగా ముద్రవేయడం సరికాదు. వేరే మతానికి చెందిన వాడిని గనుకే నన్నిలా అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాలి. అదే విధంగా కొడుకు విషయంలో అడ్డురాని మతం సునయన విషయంలోనే ఎందుకు అడ్డువస్తుందో గమనించాలి’ అని పేర్కొన్నారు. ఇక తన ప్రేమ విషయం గురించి సునయన మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు’ అని కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. -
ఫోన్ స్విచ్చాఫ్.. దేవుడా ఆమెను ఏమైనా చేశారా?
ముంబై: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సోదరి సునయన వ్యవహారంలో నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించినందుకు తనను తండ్రి రాకేశ్ రోషన్, సోదరుడు హృతిక్ రోషన్ హింసిస్తూ కొడుతున్నారని సునయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమె గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ తాజాగా రంగోలీ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం సునయన ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, ఆమెను సంప్రదించడానికి ఎంత ప్రయత్నించినా కుదరడం లేదని రంగోలీ తన ట్వీట్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘దేవుడా.. ఆమెకు వాళ్లు (రాకేశ్, హృతిక్) ఏదైనా కీడు తలపెట్టారా? ఏమైనా చేశారా? ఆమె గురించి తలుచుకుంటే చాలా భయంగా ఉంది’ అని రంగోలీ పేర్కొన్నారు. (చదవండి: మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హృతిక్ సోదరి) తన ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే.. సునయన పోలీసులను ఆశ్రయించాలి? కానీ, ఇలా సొంత కుటుంబసభ్యులపై ఆరోపణలు చేయవద్దంటూ సినీ ట్రేడ్ అనలిస్ట్ సుమిత్ కదేల్ వ్యాఖ్యానించగా.. దీనికి స్పందనగా ఆమె ఈమేరకు ట్వీట్లు చేశారు. సునయన కుటుంబసభ్యుల మీద ఆధారపడుతూ.. వారి ఇంట్లో ఉందని, వారికి వ్యతిరేకంగా పోలీసులను ఆశ్రయించడం అంత సులభం కాదని, పైగా పోలీసులతో రాకేశ్ రోషన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కంగనా వారిని సమర్థంగా ఎదుర్కోగలిగింది కానీ, 16 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేసుకొని.. పెద్దగా చదువుకోకుండా కుటుంబసభ్యుల మీద ఆధారపడిన సునయన వారిని ఎదుర్కోలేదని రంగోలి పేర్కొన్నారు. సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ రంగోలి ఇంతకుముందు కూడా వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన సునయన.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. కాగా గతంలో హృతిక్- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. -
మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హీరో సోదరి
తన తమ్ముడు హృతిక్ రోషన్ సహా కుటుంబ సభ్యులంతా తనను వేధిస్తున్నారని బాలీవుడ్ దర్శక, నిర్మాత రాకేష్ రోషన్ కూతురు సునయన సంచలన ఆరోపణలు చేశారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునయన రోషన్ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సునయన మాట్లాడుతూ.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు. తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్ అమీన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. తను కంగనాను కలిసి తన దుస్థితిని వివరిస్తానని, ఆమె తనకు న్యాయం జరిగేలా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గతంలో హృతిక్- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. -
‘ఆమె నరకంలో ఉంది.. సాయం చేయలేకపోతున్నాం’
బాలీవుడ్లో కంగనా రనౌత్, హృతిక్ రోషన్ల మధ్య వచ్చిన విభేదాల గురించి అందరికి తెలుసు. ఒకప్పుడు హృతిక్ తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన ఆరోపించిన సంగతి తెలిసిందే. ఏడాది పాటు వీరిద్దరి మధ్య వాదనలు జరిగాయి. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈక్రమంలో కంగన సోదరి రంగోలి సంచలన విషయాలు వెల్లడించారు. హృతిక్ సోదరి సునైనాను ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా హింసిస్తున్నారని.. సాయం కోసం ఆమె కంగనకు ఫోన్ చేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు రోషన్ కుటుంబం మీద సంచలన ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్లు చేశారు రంగోలి. ‘హృతిక్ సోదరి సునైనా ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తిని ప్రేమిస్తున్నారు. ఈ విషయం ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దాంతో అతన్ని మర్చిపోవాలంటూ సునైనాను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ పోలీసు అధికారిని ఇంటికి పిలిపించి మరి సునైనాకు వార్నింగ్ ఇప్పించారు. ప్రస్తుతం సునైనా పరిస్థితి తల్చుకుంటే చాలా బాధగా ఉంది. తన ఇంట్లోనే ఆమె నరకం అనుభవిస్తున్నారు. సాయం కోసం కంగనకు ఫోన్ చేసింది. అయితే సునైనాకు ఎలా సాయం చేయాలో కంగనకు తెలీడంలేదు. అందుకే ఈ విషయాలన్నీ ట్విటర్ వేదికగా బయటపెడుతున్నాను’ అన్నారు రంగోలి. Sunaina Roshan is asking Kangana for help, her family is physically assaulting her because she is in love with a Muslim man from Delhi, last week they got a lady cop who slapped her, her father also hit her, her brother is trying to put her behind bars..(contd) — Rangoli Chandel (@Rangoli_A) June 19, 2019 అంతేకాక ‘సునైనా భద్రత కూడా మాకు ముఖ్యమే. ఎవరినైనా ప్రేమించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. కనీసం ఈ ట్వీట్లు చూసైనా రోషన్ కుటుంబం వెనక్కు తగ్గి సునైనా ప్రేమను అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను’ అంటూ రంగోలి వరుస ట్వీట్స్ చేశారు. గతంలో సునైనాకు, తనకు మంచి స్నేహం ఉందని కంగన వెల్లడించిన సంగతి తెలిసిందే. అంతేకాక ఈ మధ్యకాలంలో సునైనాకు తన కుటుంబంతో ఓ విషయంలో గొడవ జరిగింది. దాంతో కంగన హృతిక్ వివాదంలో సునైనా తన సోదరుడు హృతిక్‌దే తప్పంటూ ట్విటర్ వేదికగా కంగనాకు మద్దతు తెలిపారు. I support Kangana all through — Sunaina Roshan (@sunainaRoshan22) June 18, 2019 -
దీప్తి సునయనపై ట్రోలింగ్..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ సీజన్2 అలరిస్తోంది. కంటెస్టెంట్స్ తమ గేమ్‌ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ హలీం, స్వీట్లు పంపించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ తొలి వారం పూర్తైంది. తొలి ఎలిమినేషన్‌కు కూడా టైం దగ్గర పడింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాని మళ్లీ వచ్చేశారు. కంటెస్టెంట్స్‌ను టీవీ ద్వారా పలకరించారు. ఒక్కొక్కరి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ (విమర్శించడం)పై స్పందించారు. బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. అమిత్ ఫ్యాన్స్ క్లబ్, దీప్తి సునయన ఆర్మీ అంటూ అభిమానులు సోషల్ మీడియా పేజీలు సృష్టించారని చెప్పారు. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో విమర్శించడం, బురద చల్లడం చాలా పెద్ద సమస్యగా తయారైందన్నారు. సరదా కోసం చేస్తే తప్పు లేదని, కానీ అదేపనిగా పెట్టుకొని విమర్శలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. గుర్తింపు కోసం వ్యక్తిగత విషయాల మీద దుష్ప్రచారం చేసే విధంగా వ్యక్తులు తయారయ్యారని పేర్కొన్నారు. ట్రోలింగ్ తప్పు కాదని, కానీ ఏదీ శ్రుతి మించకూడదని హితవు పలికారు. ఇరవై ఏళ్ల వయసులో సునయన డబ్ష్మాస్లు, షార్ట్‌ఫిల్మ్స్ చేసుకుంటూ, అందరికీ తెలిసే స్థాయికి వచ్చారంటూ ప్రశంసించారు. తాను ఇరవై ఏళ్ల వయసులో ఫిలింనగర్ రోడ్ల మీద తిరిగానంటూ నాని గుర్తు చేసుకున్నారు. ఎలిమినేషన్ ఓటింగ్‌లో దీప్తి సునయనకు చాలా మంది మద్దతుగా నిలిచారని, భారీగా వచ్చిన ఓట్లతో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఎందుకు ఏడ్చారని అడగ్గా, కుటుంబ సభ్యులు గుర్తుకు రావడంతో ఏడ్చానని సమాధానం ఇచ్చింది. బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపులు, సభ్యుల మధ్య గొడవలను ప్రస్తావించారు. -
సినిమాలంటే అంత పిచ్చి
మహాదేవ్ హీరోగా, మమతా సాహాస్, సునైన హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివురు’. ఋషికృష్ణ దర్శకత్వంలో అభిరామ్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘హీరో మహాదేవ్ చిన్నప్పటి నుంచి అందరి హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే అంత పిచ్చి. సంగీతం, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ప్యాషన్‌తో ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు మహాదేవ్. ‘‘మా ఇల్లు అమ్ముకుని, ఆటో తోలుకుంటూ ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హిట్ అయ్యి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’’ అన్నారు అభిరామ్. రైటర్ డైమండ్ రత్నబాబు, నటుడు కాశీ విశ్వనాధ్, సంగీత దర్శకుడు యం.ఎల్. రాజా పాల్గొన్నారు. -
కాశీ ఏం చేశాడు?
నటుడిగా, సంగీత దర్శకుడిగా తమిళంలో, తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన పంథా ఏర్పరుచుకున్నారు విజయ్ ఆంటోని. సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆయన నటించిన తాజా చిత్రం ‘కాశి’. అంజలి, సునైన కథానాయికలు. కిరుతిగ ఉదయనిధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఈ నెల 18న విడుదలవుతోంది. లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. కాశీ ఏం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం భారీ పోటీ ఏర్పడగా, ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాం. తమిళంలో ఈ నెల 18న విడుదలవుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎప్పుడు రిలీజ్ చేస్తామన్నది చెబుతాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ ఆంటోని, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
మళ్లీ మదర్ సెంటిమెంట్
‘బిచ్చగాడు’ ఫేమ్ విజయ్ ఆంటోని నటించిన తాజా చిత్రం ‘కాశి’. తెలుగమ్మాయి అంజలి, సునయన కథానాయికలు. క్రితిక ఉదయనిధి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలుగు హక్కులను పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత విలియమ్ అలెగ్జాండర్ సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని ‘కాశి’ పేరుతో తెలుగులో విడుదల చేయనున్నారు. విలియమ్అలెగ్జాండర్ మాట్లాడుతూ –‘‘బిచ్చగాడు’ చిత్రం తర్వాత విజయ్ ఆంటోని మదర్ సెంటిమెంట్‌లో మరో కోణం చూపించనున్న చిత్రమిది. ఆయన తన నట విశ్వరూపాన్ని చూపిస్తూ, చక్కటి సంగీతం అందించారు. ‘బిచ్చగాడు’ తర్వాత విజయ్‌కి తెలుగులో చాలా మంచి క్రేజ్ రావడంతో ట్రేడ్‌లో బిజినెస్ కూడా బాగా పెరిగింది. ఆయన వైవిధ్యమైన కథల్ని ఎంచుకోవడం వల్లే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ‘బిచ్చగాడు’ కంటే ‘కాశి’ చిత్రం కమర్షియల్‌గా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
డిన్నర్ ఆలస్యమైందని కాల్చి చంపాడు
ఘజియాబాద్: క్షణికావేశంలో తనతో దాదాపు 35 ఏళ్లకు పైగా కాపురం చేస్తున్న భార్యను ఓ భర్త చంపేశాడు. రాత్రి భోజనం త్వరగా సిద్ధం చేయనందుకు గొడవపెట్టుకొని ఇంట్లో తుపాకీతో తలపై కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కవీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానససరోవర్ పార్క్ కాలనీలో సునయన(55), అశోక్‌కుమార్(60) అనే దంపతులు ఉంటున్నారు. వారికి టింకు (28), రింకు (32)అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరికి ఒక మినీ ట్రక్ ఉంది. అయితే, శనివారం రాత్రి బయటకు వెళ్లి బాగా మద్యం తాగి వచ్చిన అశోక్ కుమార్ ఇంకా వంట సిద్ధం చేయలేదా అని గొడవకు దిగాడు. చేస్తాను అని చెప్తుండగానే ఇప్పటి వరకు ఏం చేశావంటూ అనకూడని మాటలు అంటూ తాగిన మైకంలో పోట్లాటకు దిగాడు. ఈలోగా రింకు అతడి భార్య సోనీ జోక్యం చేసుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మరింత ఆగ్రహంతో అశోక్ కుమార్ తమ ఇంట్లోని తుపాకీతో కాల్పులు జరిపాడు. దాంతో ఓ బుల్లెట్ కాస్త సునయనకు తగలడంతో ఆమె కుప్పకూలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణం పోయింది. దారి మధ్యలోనే ప్రాణం పోయిందని వైద్యులు స్పష్టం చేశారు. -
'పెళ్ళికి ముందు ప్రేమకథ' మూవీ స్టిల్స్
-
ధనుష్‌తో సునైనా చిందులు
నటుడు ధనుష్ చిత్రంలో చిందులేయడానికి సిద్ధమైంది నటి సునైనా. కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటున్న మరో టాలీవుడ్ భామ సునైనా. అయితే కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా ఎందుకనో నటిగా తనకుంటూ ఒక స్థాయికి చేరుకోలేకపోయింది. కోలీవుడ్, టాలీవుడ్‌లోనూ అడపాదడపా అవకాశాలను అందుకుంటోంది. ఆ మధ్య కవలైవేండామ్ చిత్రంలో అతిథిగా మెరిసిన సునైనా ఆ తరువాత మళ్లీ కోలీవుడ్‌లో కనిపించలేదు. అయితే పస్తుతం సముద్రకనికి జంటగా తొండన్ చిత్రంలో నటించింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లోనూ పెళ్లికి ముందు ప్రేమకథ అనే ఒక చిత్రంలో నటిస్తున్న సునైనాకు కొత్తగా అవకాశాలేమీ లేవు. తమిళంలో తొండన్ చిత్రం కోసం ఎదురుచూస్తున్న ఈ అమ్మడికి ధనుష్ చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకుందట. ధనుష్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఎన్నై నోక్కి పాయుం తోట్టా ఒకటి. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుక్ను తరుణంలో దర్శకుడికి, ధనుష్‌కు మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో మళ్లీ చిత్ర నిర్మాణం మొదలైంది. కాగా 90 శాతం చిత్రీకరణ పూర్తి అయిన ఎన్నైనోక్కి పాయుం తోట్టా చిత్రంలో నటి సునైనాను ఎంపిక చేయడం ఏమిటన్న విషయం గురించి ఆరా తీయగా అమ్మడు ఈ చిత్రంలో సింగిల్ సాంగ్‌కు చిందులేయనుందని చిత్ర వర్గాలు తెలిపాయి. మొత్తం మీద చాలా మంది కథానాయకిల మాదిరిగానే సునైనా కూడా ఐటమ్ సాంగ్‌కు సై అనేసిందన్న మాట. చిత్రంలో ఈ జాణ పాట కనువిందు చేస్తే మరిని అలాంటి అవకాశాలు రావచ్చు. -
ఫుల్ మీల్స్
చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో ప్రేమ్‌కుమార్ పాట్ర సమర్పణలో గణపతి ఎంటర్టైన్మెంట్స్, పట్నం ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమకథ’. డీఎస్కే, అవినాష్ సలండ్ర, సుథాకర్ పట్నం నిర్మాతలు. హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఈ సినిమా తీశా. యూత్‌పుల్ ఎంటర్టైనర్ ఇది. చేతన్ శీను బాగా యాక్ట్ చేశాడు. సహకరించిన చిత్రబృందానికి ధన్యవాదాలు. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి చిత్రమిది’’ అన్నారు. ‘‘డి.ఎస్. రావుగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్స్. ‘రాజుగారి గది’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుం దని నమ్ముతున్నాను’’ అన్నారు హీరో చేతన్ శీను. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డి.ఎస్. రావు, మల్కాపురం శివకుమార్, దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి పాల్గొన్నారు. -
పెళ్లికి ముందు ప్రేమ
‘‘చాలామంది జీవితాల్లో పెళ్లికి ముందు ప్రేమకథలుంటాయి. ఆ ప్రేమకథలు ఎలా ఉంటాయి. పెళ్లి తర్వాత ఎలాంటి మార్పు లు వస్తాయి?’’ అనే కథతో తెరకెక్కిన చిత్రం ‘పెళ్ళికి ముందు ప్రేమ కథ’. చేతన్ శీను, సునైన జంటగా మధు గోపు దర్శకత్వంలో డి.ఎస్.కె, అవినాష్ సలండ్ర, సుధాకర్ పట్నం నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నిర్మాతలు కేయస్ రామారావు, మల్కాపురం శివకుమార్, టీజర్‌ను దర్శకుడు అశోక్ విడుదల చేశారు. ‘‘పెళ్లికి ముందు నడిచిన లవ్‌స్టోరీస్ వల్ల ఓ జంట మధ్య ఎలాంటి మనస్పర్థలొచ్చాయి? వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది కథ. త్వరలో పాటలు విడుదల చేస్తాం’’ అని దర్శక–నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, సమర్పణ: ప్రేమ్‌కుమార్ పాట్ర, మాస్టర్ అవినాష్ సలండ్. -
నాకిప్పుడు బాయ్‌ఫ్రెండ్ లేడు
తనకిప్పుడు బాయ్ ఫ్రెండ్ లేదంటున్నారు నటి సునైనా. పేరుకు తగ్గట్టే సొగసైన నయనాల సుందరీమె. ఇంతకుముందు కంటే కాస్త బరువు,పరువాలు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ అభినయంలోనూ ఆరితేరారన్నది నీర్పరవై చిత్రంతో నిరూపించుకున్నారు. తమిళంలో కథానాయికగా రాణిస్తున్న ఈ భామ పదహారణాల తెలుగమ్మాయి. అయితే ఆశించిన స్థాయిని మాత్రం చేరుకోలేదు. అందుకు తన వంతు కృషి, శ్రమ చేస్తున్నట్లు చెబుతున్నారు సునైనా. ఇటీవల అనూష అంటూ పేరు మార్చుకుని మళ్లీ అసలు పేరుకే మారిపోయారు. ఆ కథేంటో ఈ సుందరి యవ్వారం ఏమిటో చూద్దాం. నీర్పరవై చిత్రం తరువాత తెరపై కనిపించలేదే? నిజం చెప్పాలంటే నీర్పరవై చిత్రం నా ఇమెజ్‌ను హోటల్‌గా మార్చేసింది. నే ను మంచి నటినేనని తమిళ ప్రేక్షకులకు నమ్మకాన్ని కలిగించిన చిత్రం అ ది. అయితే ఆ తరువాత వచ్చిన అవకాశాలన్నీ ఆ తరహాలోనే ఉండటం వల్ల అంగీకరించలేదు. అందుకే ఈ గ్యాప్. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? శ్రీకాంత్‌కు జంటగా నంబియా ర్, కృష్ణ సరసన వన్నం చిత్రాలు చేస్తున్నాను. ఈ రెండు చిత్రాలలో తన పాత్రలు వేర్వేరు గా ఉంటాయి. ఈ చిత్రంలో నాగర్‌కోవిల్ యాసలో మా ట్లాడుతారటగా? అవును. చిత్రం లో విజయ్ సేతుపతి, కృష్ణ పోటీపడి నటిస్తున్నారు. అలాంటప్పుడు నా వంతు నేనూ బాగా నటించాలిగా. నీర్పరవై చిత్రంలో నటనకు ఈ వర్నం చిత్రంలో నటనకు చాలా మార్పు కనిపిస్తుంది. షూటింగ్ స్పాట్లో నాకు నాగర్‌కోవిల్ యాస నేర్పించారు. మొదట్లో మాట్లాడటం కాస్త కష్టం అనిపించింది. నటిగా ఆశించిన స్థాయికి చేరుకోలేదనే చింత ఉందా? అందుకని మూలన కూర్చుని బాధపడితే ఫలితం ఉంటుందా? అందరికీ మంచి కాలం అంటూ ఒకటొస్తుంది. తొలి రోజుల్లో అందాలారబోసినట్లున్నారు? నాయికగా పరిచయమైయిన తొలి రోజుల్లో ఒకటి రెండు చిత్రాల్లో అలా నటించిన విషయం నిజమే. ఇప్పుడు అలాకాదు. కథ విన్న తరువాతనే కాల్షీట్స్ ఇస్తున్నాను. గ్లామర్ విషయంలో నాకం టూ కొన్ని హద్దులున్నాయంటూ ముందే చెప్పేస్తున్నాను. ఇప్పుడు నన్నెవరూ వివాదాల నటి అని పోకస్ చేయరు. తమిళనాడులో నివాసం ఏర్పరుచుకోలేదే? నా మాతృభాష తెలుగు. మాకు హైదరాబాద్‌లో సొంత ఇల్లు ఉంది. షూటింగ్లుంటే చెన్నైకి వస్తాను. ఖాళీ దొరికితే నా సొంత ఊరు నాగపూర్‌కు వెళ్లతాను. ఇటీల పేరు మార్చుకున్నట్లున్నారు? సునైనా అన్నది అందరికీ తెలిసిన పేరు. అయితే న్యూమరాలజీ ప్రకారం అనూషగా మార్చుకున్నాను. అయినా ఆ పేరు అచ్చిరాలేదు. దీంతో మళ్లీ అసలు పేరుకు వచ్చేశాను. అయితే నా పేరు పక్కన ఆంగ్ల అక్షరం ఏను అదనంగా చేర్చుకున్నాను. సునైనా అనే పేరును ఇక మార్చుకునే ప్రసక్తే లేదు. ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాల్లో నటిస్తారా? ఎందుకు నటించను? నటించడానికి సిద్ధమైన తరువాత ఎలాంటి పాత్రనయినా చెయ్యగలననే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. ది దర్టిపిక్చర్, క్వీన్ లాంటి చిత్రాలు తమిళంలో తెరక్కెక్కడం మంచిదే. అలాంటి పాత్రలో నటించాలని ఎవరయినా అడిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది? బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. ఇప్పుడూ నిజమే చెబుతున్నాను. ఇప్పుడు నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు. వెంటనే ఒకప్పుడుండేవారా? అతనెవరు? అని అడక్కండి. నేను కాదలిల్ విళుందేన్ (ప్రేమలో పడ్డాను) చిత్రంలో మాత్రమే నటించాను. ఎవర్నీ ప్రేమించలేదు. నిజంగా నన్ను నమ్మండి. -
‘వన్నం’లో కృష్ణతో సునైనా రొమాన్స్
సునైనా పేరుకు తగ్గట్టుగానే కుట్టి అభినేత్రి ఈ బ్యూటీ. కాదలిల్ విళుందేన్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో మెరిసిన పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి ఈ అమ్మడు. ఆ తరువాత వంశం, నీర్పరవై తదితర చిత్రాలలో హీరోయిన్గా మెప్పించిన సునైనా తగినన్ని అవకాశాలు, రావలసినంత పేరు రాలేదు. అయితే హీరోయిన్గా కోలీవుడ్‌లో తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఈ బ్యూటీకి ఒక అవకాశం వచ్చింది. యువ నటులు విజయ్ సేతుపతి, కృష్ణల కాంబినేషన్లో వన్నం అనే చిత్రం తెరకెక్కుతోంది. నెమిచంద్ జెపక్ పతాకంపై వి.హిందేష్ జెపక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న ఇద్దరు యువకుల మధ్య స్నేహం, పగ, ప్రతీకారాల ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన హీరోయిన్గా సునైనాను ఎంపిక చేసినట్లు చెప్పారు. విజయ్ సేతుపతికి జోడి ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అన్నారు. చిత్ర షూటింగ్ నాగర్‌కోవిల్ ప్రాంతంలో జరుపుతున్నట్లు దర్శకుడు తెలిపారు. -
పేరులో ఏదో ఉంది
పేరులో ఏముందని అంత తేలిగ్గా తీసిపారేయకండి. అందులోనే ఉంది మహత్యం అంతా అంటారు జాతకాలను నమ్మేవాళ్లు. ముఖ్యం గా సినిమావాళ్లకు ఈ సెంటిమెంట్స్ ఎక్కువంటారు. అందులోనూ హీరోయిన్లు హిట్‌కు, ఫ్లాప్‌కు మధ్య తమ పేర్లను మార్చుకుం టుంటారు. ఆస్ట్రాలజీపై వారికి బాగా గురి. యువ నటి సునైనా ప్రస్తుతం ఈ ఆస్ట్రాలజీనే నమ్ముకుంటోంది. ఈ పదారణాల తెలుగు అమ్మాయి. కాదలిల్ విళిందేన్ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమ తనవైపు చూసేలా చేసుకుం ది. ఆ చిత్రంలో సునైనా అభినయం అంతగా ఆకట్టుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేకపోయింది. ఈ మధ్య నటించిన నీర్పరవై చిత్రం సమయంలో పేరు మార్చుకుంటే మంచి ఫలితం ఉంటుందన్న ఆస్ట్రాలజిస్ట్ సూచన మేరకు సునైన తన పేరును అనూషాగా మార్చుకుంది. ఆ తరువాత కూడా అవకాశాల వేటనే మిగలడంతో మళ్లీ తన అసలు పేరుకే వచ్చేసింది. అయితే అసలు పేరుకు చిన్న కొసరు తగిలించుకుంది. సునైనా పేరు చివరన అదనంగా ఆంగ్ల అక్షరం ఏ ను చేర్చుకుంది. ఇప్పుడు తన పేరు సునైనా అని అంటుంది. ఇది కొంత మంది జ్యోతిష్కుల సలహా మేరకే మార్చుకున్నట్లు చెబుతున్న సునైనా తన కుటుంబ సభ్యులు కూడా ఈ పేరునే ఇష్టపడినట్లు పేర్కొంది. అంతా బాగానే ఉంది. మరి కొత్తగా అవకాశాల మాటేమిటన్న ప్రశ్నకు ప్రస్తుతం నంబియార్ అనే చిత్రంలో శ్రీకాంత్‌కు జంటగా నటిస్తున్నానని తెలిపింది. సంతానం హాస్యభూమికను పోషిస్తున్న ఈ చిత్రానికి గణేషా దర్శకత్వం వహిస్తున్నారని చిత్రం త్వరలో తెరపైకి రానుందని సునైనా చెప్పింది. -
పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు
గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : జిల్లాలో తరిగిపోతున్న పెయ్యి దూడలను వృద్ధి చేసేందుకు ఆ దూడల్ని పెంచుతున్న పాడి రైతులకు జిల్లా పశు సంవర్థక శాఖ ప్రోత్సాహకాలు అందిస్తోంది. ‘సునందిని’ పథకం ద్వారా ఈ దూడల్ని అభివృద్ధి చేస్తున్నారు. 9వేల పెయ్యి దూడల్ని జిల్లాలో వృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకోసం రూ.3,62,25,000 నిధుల్ని ఈ శాఖ కేటాయించింది. చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం బాగా వర్తింపజేసేందుకు రూపకల్పన చేస్తున్నారు. ఒక్కో రైతు రెండేసి దూడలకు ఈ ప్రోత్సాహకాలు తీసుకునేలా అవకాశం కల్పించారు. రైతు ఇంట గేద లేక ఆవుకు ఈనికలో వచ్చిన 3-4నెలల వయసున్న పెయ్యిదూడను స్థానిక వెటర్నరీ వైద్యాధికారి నిర్ధారిస్తారు. అలాంటి దూడకు సంబంధించిన యూనిట్ ధర రూ.5వేలు ఉంది. గేద లేక ఆవు పెయ్యి దూడ ఒక్కో దూడకు చెందిన పాడిరైతు తన వాటాగా రూ.975 చెల్లించాలి. పశు సంవర్థక శాఖ తన వాటాగా 4,025 ఇస్తోంది. దూడ దాణాకే రూ.4,100 కేటాయించారు. నెలనెలా డీవార్మింగ్‌కు రూ.300 కేటాయిస్తారు. దూడకు బీమా పాడి రైతుకు ధీమా... లబ్ధిదారుడు చెల్లించిన రూ.975లో ఒక్కోదూడకు రూ.600 బీమా ప్రీమియంకే చెల్లిస్తారు. రెండేళ్ల వరకూ ఈ బీమా దూడకు పనిచేస్తుంది. ప్రీమియం చెల్లించిన తొలి 15రోజుల వరకూ బీమా వర్తించదు. ఆరు నెలల దూడ చనిపోతే రూ.5వేలు, ఏడాదికి రూ.10వేలు, ఏడాదిన్నరకు రూ.15వేలు, రెండేళ్లకు రూ.20వేల చొప్పున బీమా ఇస్తారు. -
తీర గస్తీ నౌక ఐఎన్ఎస్ సునయన ప్రారంభం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం తీర గస్తీ నౌక ఐఎన్ఎస్ సునయన ప్రారంభం నౌకా దళానికి చెందిన రెండో సముద్ర తీర గస్తీ నౌక ఐఎన్ఎస్ సునయనను కోచిలో అక్టోబర్ 15న ప్రారంభించారు. నౌకాదళ పెట్రోలింగ్, నిఘా అవసరాలకు దీన్ని వినియోగిస్తారు. ఇది 25 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ పవర్ మేనేజ్మెంట్ వ్యవస్థ ఉంది. ఆధునిక నేవిగేషన్, క మ్యూనికేషన్, ఎల క్ట్రానిక్ సపోర్ట్ వ్యవస్థలున్నాయి. ఎలక్ట్రిక్ ఆప్టిక్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌తో కూడిన 76 ఎం.ఎం. గన్‌తోపాటు ఇతర ఆయుధాలు ఇందులో ఉంటాయి. హెలికాఫ్టర్‌ను కూడా మోసుకుపోగలదు. రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్ రైల్వే బోర్డ్ చైర్మన్‌గా అరుణేంద్ర కుమార్ అక్టోబర్ 9న నియమితులయ్యారు. రైల్వే బోర్డు సభ్యుడిగా ఉన్న అరుణేంద్ర పదవీ విరమణ చేసిన చైర్మన్ వినయ్‌మిట్టల్ స్థానంలో జూన్ 30 నుంచి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్చ్యూన్ శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయులు ఫార్చ్యూన్ మ్యాగజైన్ రూపొందించిన అంతర్జాతీయ అగ్రశ్రేణి 50 మహిళా వ్యాపారవేత్తల జాబితాలో నలుగురు భారత మహిళలకు స్థానం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ నాలుగో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ చీఫ్ చిత్రా రామకృష్ణ (17వ స్థానం), యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన శిఖా శర్మ (32వ స్థానం), హెచ్ఎస్బీసీకి చెందిన నైనా లాల్ కిద్వాయ్ (42వ స్థానం) ఉన్నారు. ఈ జాబితాలో తొలి స్థానాన్ని బ్రెజిల్‌కు చెందిన ఇంధన దిగ్గజం పెట్రోబాస్ సీఈవో మరియా దాస్ గ్రేకాస్ ఫోస్టర్ సాధించారు. హంగరీ ప్రధానమంత్రి విక్టర్ ఒర్బన్ భారత్ పర్యటన హంగరీ ప్రధానమంత్రి డాక్టర్ విక్టర్ ఒర్బన్ తన భారత పర్యటనలో అక్టోబర్ 16న భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమై చ ర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్‌కు మద్దతునిస్తున్నట్లు ఒర్బన్ చెప్పారు. ఈ సమావేశం సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో జీవ సంబంధ, రసాయన ఆయుధ రంగంలో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, సంప్రదాయ వైద్యం, కళలు, సాంస్కృతిక, రక్షణ, భద్రతా రంగాల్లో సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి. ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ కన్నుమూత ప్రముఖ తెలుగు సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ (87) అక్టోబర్ 18న హైదరాబాద్‌లో మరణించారు. కృష్ణా జిల్లా నందిగామ తాలూకా మోగులూరులో 1927 జూలై 5న జన్మించిన భరద్వాజ 17వ ఏట నుంచి రచనలు చేయడం మొదలుపెట్టారు. అచ్చు అయిన తొలి కథ విమల. దాదాపు 43 పిల్లల కథలు, 17 నవలలు, 11 సాహిత్య గ్రంథాలు, 33 సైన్స్ కథలను రాశారు. 1968, 1983ల్లో రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు, 1987లో సోవియట్‌ల్యాండ్ నెహ్రూ అవార్డు, భారతీయ భాషాపరిషత్ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వంటి అనేక పురస్కారాలు ఆయనకు దక్కాయి. ఆయన అనేక రచనలు ఆంగ్లం, హిందీ, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆంధ్రా, జేఎన్టీయూ, నాగార్జున విశ్వవిద్యాలయాలు ఆయనకు డాక్టరేట్లు ప్రదానం చేశాయి. 2012 సంవత్సరానికి గానూ ఆయన రాసిన నవల పాకుడురాళ్లుకు జ్ఞానపీఠ్ అవార్డు దక్కింది. ఈ అవార్డు పొందిన మూడో తెలుగు రచయిత భరద్వాజ. గతంలో విశ్వనాథ సత్యనారాయణకు, సి.నారాయణరెడ్డిలకు జ్ఞానపీఠ్ లభించింది. భారతీయ యువతికి కామన్వెల్త్ యూత్ అవార్డు భారత్‌లో పర్యావరణ మార్పు సమస్య నివారణకు కృషిచేస్తున్న భారత మహిళ ప్రీతీ రాజగోపాలన్(23) ఈ ఏడాది కామన్వెల్త్ యూత్ అవార్డును గెలుపొందారు. అక్టోబర్ 12న లండన్‌లోని కామన్వెల్త్ ప్రధాన కార్యాలయంలో ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద 5000 పౌండ్లు లభిస్తాయి. పర్యావరణ మార్పుపై స్థానిక సమాజాలు, ప్రభుత్వాలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించి మిత్రులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. భారత్‌లో 200 పాఠశాలలు, 40 విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఆమె శిక్షణ అందిస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా ఆమె ప్రాజెక్టుకు నిధులు అందిస్తోంది. ఎంపీ పదవిని కోల్పోయిన రషీద్ మసూద్ శిక్షకు గురైన రాజ్యసభ సభ్యుడు రషీద్ మసూద్ తన సభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్ష వల్ల పదవి కోల్పోయిన తొలి ప్రజా ప్రతినిధి రషీద్ మసూద్. ఆయనకు అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు సెప్టెంబర్ 19న నాలుగు ఏళ్ల జైలుశిక్ష విధించింది. క్రిమినల్ కేసుల్లో రెండేళ్లకుపైన శిక్ష పడిన ప్రజా ప్రతినిధులు (ఎంపీ, ఎంఎల్ఏలు) వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని జూలై 10న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతర్జాతీయం అమెరికన్లకు అర్థ శాస్త్రంలో నోబెల్ ఆస్తుల ధరలపై అవగాహన కలిగించే విధానాన్ని రూపొందించినందుకు అమెరికా శాస్త్రవేత్తలు ఈజెన్ ఫామా, లార్స్ పీటర్స్ హాన్సన్, రాబర్ట్ షిల్లర్‌లకు అర్థ శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈజెన్ ఫామా, పీటర్స్ హాన్సన్‌లు షికాగో యూనివర్సిటీలో, రాబర్ట్ షిల్లర్ యేల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. షేర్లు, బాండ్ల ధరల తీరు రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనే విషయాన్ని అనుభవపూర్వకంగా, విశ్లేషణ ద్వారా అంచనా వేయవచ్చని వారు ప్రతిపాదించారు. షేర్లు, నగదు, బ్యాంకు డిపాజిట్లు వంటివాటి రూపంలో పొదుపు చేయాలనేది వ్యక్తుల అంచనాలపై ఆధారపడి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఎలీనర్ కాటన్‌కు బుకర్ ప్రైజ్ న్యూజిలాండ్‌కు చెందిన ఎలీనర్ కాటన్ (28)కు 2013 సంవత్సరానికిగానూ ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ లభించింది. ఈ బహుమతి పొందిన అత్యంత పిన్న వయస్కురాలు కాటన్. ఆమె రాసిన ‘ద లూమినరీస్’ అనే నవలకు ఈ బహుమతి లభించింది. 19వ శతాబ్దిలో సాగిన బంగారం అన్వేషణ ఇతివృత్తంతో కూడిన మర్డర్ మిస్టరీ నవల ఇది. బహుమతి కింద 50 వేల పౌండ్లు లభిస్తాయి. భారతీయ అమెరికన్ రచయిత్రి ఝంపా లహరి నవల ‘ద ల్యోలాండ్’ చివరి వరకు పోటీపడ్డా బహుమతి లభించలేదు. ఈ బహుమతిని కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండ్, జింబాబ్వే దేశాలకు చెందిన వారి ఆంగ్ల రచనలకు మాత్రమే అందిస్తారు. ఫిలిప్పీన్స్ భూకంపంలో 100 మందికి పైగా మృతి ఫిలిప్పీన్స్‌లో అక్టోబర్ 15న సంభవించిన భారీ భూకంప తాకిడికి ఇళ్లు, భవనాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. వంద మందికిపైగా మృతి చెందారు. వందలాదిమంది గాయాలపాలయ్యారు. బొహోల్ ద్వీపంలోని కార్మెన్ పట్టణ శివార్లలో భూమికి 33 కి.మీ దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.2గా నమోదైంది. లై-ఫైని కనుగొన్న చైనా శాస్త్రవేత్తలు ఇంటర్నెట్ను అనుసంధానం చేసే కొత్త విధానం లై-ఫైని చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది వై-ఫైకి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. ఈ కొత్త విధానంలో కాంతి కోసం ఉపయోగించే బల్బుల ద్వారా ఇంటర్నెట్ సంకేతాలను చేరుస్తారు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వై-ఫైలో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా సంకేతాలను పంపిస్తారు. లై-ఫైగా పిలిచే కొత్త విధానం సమర్థవంతమైంది. చవకైంది. ఈ విధానం ద్వారా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. నాలుగు కంప్యూటర్లను ఒక వాట్ ఎల్ఈడీ బల్బుతో ఇంటర్నెట్కు అనుసంధానం చేయొచ్చు. ఈ బల్బు మైక్రోచిప్‌ను కలిగి ఉంటుంది. సెకనుకు 150 మెగాబిట్ల డేటాను చేరవేస్తుంది. ఇది చైనాలో అందుబాటులో ఉన్న సగటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కంటే వేగవంతమైంది. భారత్ వృద్ధి 4.7 శాతం: ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. ఇంతక్రితం 6.1 శాతం అంచనాలను తమ తాజా ‘భారత్ వృద్ధి అప్డేట్’ నివేదిక కుదించినట్లు బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ (దక్షిణాసియా వ్యవహారాలు) మార్టిన్ రామ్ ప్రకటించారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందన్నది బ్యాంక్ తాజా అంచనా అని కూడా వెల్లడించారు. ఇంతక్రితం ఈ అంచనా 6.7 శాతం. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ 5 శాతం వృద్ధి సాధించింది. గత దశాబ్ద కాలంలో వృద్ధి సగటు 8 శాతం. భారత్ వృద్ధి 2013-14లో బలహీనం కావడానికి మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆర్థిక వ్యవస్థ (4.4 శాతం వృద్ధి) పేలవ పనితీరు కారణమని ప్రపంచబ్యాంక్ తన తాజా నివేదికలో పేర్కొంది. భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలు భద్రతా మండలికి ఐదు తాత్కాలిక సభ్య దేశాలను ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ అక్టోబర్ 17న ఎన్నుకుంది. భద్రతా మండలికి తాజాగా ఎన్నికైన చాద్, చిలీ, లిథువేనియా, నైజీరియా, సౌదీ అరేబియాలు 2014 జనవరి నుంచి రెండేళ్ల పాటు అందులో కొనసాగుతాయి. తాత్కాలిక సభ్య దేశాలుగా ప్రస్తుతమున్న అజర్బైజాన్, గ్వాటెమాల, మొరాకో, పాకిస్థాన్, టోగోల కాల పరిమితి ఈ ఏడాది చివరికి ముగుస్తుంది. క్రీడలు వన్డేల్లో కోహ్లి రికార్డ్ వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లి రికార్డు సృష్టించాడు. అక్టోబర్ 16న జైపూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో 52 బంతుల్లో 100 పరుగులు చేసి ఈ రికార్డు నెలకొల్పాడు. తద్వారా ప్రపంచంలో వేగంగా వంద పరుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2009 లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. జైపూర్ వన్డేలో ఆస్ట్రేలియా చేసిన 359 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. తద్వారా వన్డే క్రికెట్లో రెండో అతిపెద్ద లక్ష్యా న్ని సాధించినట్లైంది. 2006లో ఆస్ట్రేలియా చేసిన 434 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 438 పరుగులు చేసి ఛేదించింది. డింగ్ జున్ హుయ్‌కి ఇండియన్ ఓపెన్ స్నూకర్ ఇండియన్ ఓపెన్ స్నూకర్ టోర్నమెంట్ టైటిల్‌ను డింగ్ జున్ హుయ్ (చైనా) గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో భారత క్రీడాకారుడు ఆదిత్య మెహతాను ఓడించాడు. దీపికాకు మకావు ఓపెన్ స్క్వాష్ టైటిల్ భారత్ స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికాల్.. మకావు ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన మహిళల ఫైనల్లో రాచెల్ గ్రిన్హామ్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. దీంతో తన కెరీర్లో ఏడు మహిళల స్క్వాష్ అసోసియేషన్ టైటిల్స్‌ను కైవసం చేసుకుంది. సిమోనా హలెప్‌కు క్రెమ్లిన్ కప్ రుమేనియాకు చెందిన సిమోనా హలెప్ క్రెమ్లిన్ కప్ టెన్నిస్ టైటిల్ గెలుచుకుంది. అక్టోబర్ 20న జరిగిన ఫైనల్స్‌లో ఆమె ఆస్ట్రేలియాకు చెందిన సమంతా స్టోసుర్‌ను ఓడించింది. దులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్లు దులీప్ ట్రోఫీ విజేతలుగా నార్త్, సౌత్ జోన్లను సంయుక్తంగా ప్రకటించారు. కోచిలో జరిగిన ఐదు రోజుల మ్యాచ్ అక్టోబర్ 21న వర్షం వల్ల ఆగిపోవడంతో ఫైనల్‌కు చేరిన ఇరు జట్లు విజేతలుగా నిలిచాయి. ఇలా సంయుక్త విజేతలను ప్రకటించడం ఇది నాలుగోసారి. డిమిట్రోవ్‌కు స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ స్టాక్‌హోమ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను బల్గేరియాకు చెందిన గ్రిగోరో డిమిట్రోవ్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 20న స్టాక్‌హోమ్‌లో జరిగిన ఫైనల్స్‌లో డేవిడ్ ఫైను డిమిట్రోవ్ ఓడించాడు. భారత హాకీ జట్టు కోచ్‌గా టెర్రీవాల్ష్ భారత హాకీ జట్టు కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన టెర్రీ వాల్ష్‌ను నియమించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) ప్రకటించింది. ఆయనకు నాలుగు ప్రపంచకప్‌లు, మూడు ఒలింపిక్స్‌లు ఆడిన అనుభవముంది. 1990లో కోచింగ్ కెరీర్ మొదలుపెట్టిన ఆయన మలేసియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ జట్ల ప్రధాన కోచ్‌గా పనిచేశారు. చెన్ లాంగ్‌కు డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టైటిల్ డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో చెన్ లాంగ్ (చైనా) విజేతగా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో చెన్ లాంగ్ ప్రపంచ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు.