సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న హీరోయిన్‌.. Actress Sunaina is going to get married soon? Sakshi
Sakshi News home page

పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌.. ఎంగేజ్‌మెంట్‌ అయిందంటూ ఫోటో..

Published Fri, Jun 7 2024 4:45 PM | Last Updated on Fri, Jun 7 2024 5:15 PM

Heroine Sunaina Shares Her Engagement News

హీరోయిన్‌ సునయన పెళ్లికి రెడీ అయింది. కుమార్‌ వర్సెస్‌ కుమారి సినిమాతో వెండితెరపై కథానాయికగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీగా ఉంది. గతేడాది రెజీనా చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ఈ ఏడాది ఇన్‌స్పెక్టర్‌ రిషి వెబ్‌ సిరీస్‌లో తన నటనతో ఆకట్టుకుంది.

తాజాగా ఈమె ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. తనకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని వెల్లడించింది. కాబోయే భర్త వేలిని పట్టుకున్న ఫోటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన నిశ్చితార్థం జరిగిందని పేర్కొంది. అభినందనలు చెప్పే ప్రతి ఒక్కరికీ ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది. అయితే తను పెళ్లి చేసుకోబోయేది ఎవరన్నది మాత్రం పేర్కొనలేదు.

సునయన 2005లో కుమార్‌ వర్సెస్‌ కుమారి సినిమాతో నటప్రయాణం మొదలు పెట్టింది. ​తనకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా కాదలిల్‌ విడుదెన్‌(2008). నీర్పరవై చిత్రం తనను మరో మెట్టు ఎక్కించింది. తెలుగులో పెళ్లికి ముందు ప్రేమ కథ, రాజరాజ చోర సినిమాలతో పాటు చంద్రగ్రహణం, మీట్‌ క్యూట్‌ సిరీస్‌లతో సినీ ప్రియులకు మరింత దగ్గరైంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement