
లవ్ టుడే సినిమాతో సెన్సేషన్ అయిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ (Return of the Dragon Movie)తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. ప్రదీప్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీ రూ.100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు ప్రదీప్ రంగనాథన్ సమాధానాలిచ్చారు. మీ పర్ఫామెన్స్ బాగుంటుంది. కానీ స్క్రీన్‌పై చూసినప్పుడు ధనుష్‌ను కాపీ చేసినట్లు అనిపిస్తుంది.
ఎవర్నీ కాపీ కొట్టట్లేదు
ఆ విషయాన్ని మీరు గ్రహించారా? లేదా ఎవరైనా చెప్పారా? అని ఓ పాత్రికేయుడు అడిగారు. అందుకు ప్రదీప్ ఇబ్బందిగా నవ్వుతూనే.. చాలాకాలంగా ఇలాంటి కామెంట్స్ వింటూనే ఉన్నానన్నాడు. కాకపోతే తానెవరినీ ఇమిటేట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. తన ఫిజిక్, ఫేస్‌కట్ వల్ల మీ అందరూ అలా పొరబడుతున్నారని వివరణ ఇచ్చాడు. సేమ్ ధనుష్‌లాగే ఉండటం మీకు ప్లస్సా? మైనస్సా అన్న ప్రశ్నకు.. అదంతా నాకు తెలియదు.. అద్దంలో చూసుకున్నప్పుడు నాకు నేను మాత్రమే కనపడతాను. నేను తీసిన సినిమా బాగా ఆడుతోందంటే నేను బాగానే చేస్తున్నాను అనుకుంటున్నాను అని హీరో తెలిపాడు.
నా కళ్లకు ప్రదీప్‌లాగే ఉన్నాడు: దర్శకుడి అసహనం
ఇంతలో డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) మైక్ అందుకుని.. మీ కళ్లకు మాత్రమే ఫలానా హీరోలా కనిపిస్తున్నాడేమో కానీ నా కళ్లకు మాత్రం ప్రదీప్ రంగనాథన్‌లాగే ఉన్నాడు. కేవలం ఆయన్ను మిగతా హీరోతో పోల్చాలని మాత్రమే ఈ ప్రశ్న అడిగినట్లున్నారు. ప్రదీప్ రంగనాథన్‌లో నేను ఏ ఇతర హీరోను చూడలేదు అని గరమయ్యాడు. డ్రాగన్ సినిమా విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించగా అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. ఫిబ్రవరి 21న ఈ సినిమా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజైంది.
చదవండి: నాపై నీ ప్రేమకు, నమ్మకానికి థాంక్యూ.. పెళ్లిరోజు మౌనిక స్పెషల్ పోస్ట్