ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌.. ఇప్పుడు సినిమాల్లేక.. | Senior Actress Sukanya revealed that she has not received any movie offers currently - Sakshi
Sakshi News home page

పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్‌ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో!

Published Sat, Mar 30 2024 4:09 PM | Last Updated on Sat, Mar 30 2024 4:37 PM

Sukanya: I was Ready, But No One Called Me - Sakshi

సుకన్య.. ఒకప్పుడు తమిళంలో స్టార్‌ హీరోయిన్‌. తమిళంలోనే కాకుండా, మలయాళ, తెలుగు భాషల్లో అగ్ర హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. ఒకప్పుడు ఎంతో ఫేమ్‌ అందుకున్న ఈ బ్యూటీ కొంతకాలంగా మాత్రం వెండితెరపై కనిపించడమే లేదు. అప్పటి హీరోయిన్లంతా ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. కానీ ఈ బ్యూటీ మాత్రం కనిపించకుండా పోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత తమిళంలో ఒకే ఒక్క సినిమా చేసింది. ఆ తర్వాత ఆమె ఊసే లేదు.

కెరీర్‌లో వెనుకబడిపోయిన ఆమె వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. శ్రీధర్‌ రాజగోపాలన్‌ను పెళ్లాడి అమెరికాలో సెటిలైన ఈ నటి ఏడాదికే(2003లో) అతడికి విడాకులిచ్చేయడం గమనార్హం. అయినా సరే తనకు ఇష్టమైన యాక్టింగ్‌ను విడిచిపెట్టలేదు. మళ్లీ సినిమాల్లో ట్రై చేసింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించింది. కొన్ని టీవీ షోలలోనూ మెరిసింది. ప్రస్తుతం సినీ అవకాశాల్లేక ఓ సీరియల్‌లో నటిస్తోంది. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను సినిమాలకు రిటైర్‌మెంట్‌ ప్రకటించలేదు. పలు భాషల్లో నటించి ఎన్నో అవార్డులను అందుకున్నాను. సినిమా వల్లే నాకంటూ గుర్తింపు వచ్చింది. నాకు అవకాశాలు రాకపోవడం వల్లే సినిమాలు చేయడం లేదు. ఎవరూ నన్ను పిలవడం లేదు. మంచి ఛాన్స్‌ వస్తే మళ్లీ మూవీస్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను' అని సుకన్య చెప్పుకొచ్చింది.

చదవండి: డేనియల్‌ బాలాజీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. సంపాదించిన డబ్బంతా ఏమైంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement