డైరెక్టర్‌ కాళ్ల మీద పడ్డ హీరోయిన్‌.. ఈమెను గుర్తుపట్టారా? | Actress Laila fell at director Bala feet and apologized - Sakshi
Sakshi News home page

ప్రముఖ డైరెక్టర్‌ చేతిలో తిట్లు తిన్న హీరోయిన్‌.. పెళ్లితో సినిమాలకు దూరం.. ఇప్పుడేం చేస్తుందంటే?

Sep 2 2023 10:52 AM | Updated on Sep 2 2023 11:13 AM

This Actress Fell at Director Bala Feet and Said Forgive Me - Sakshi

దాదాపు ఎనిమిదేళ్లపాటు వీరు ప్రేమించుకున్నారు. కెరీర్‌ ఊపు మీదున్న సమయంలో 2006లో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఎంగేజ్‌మెంట్‌ మాత్రం పెళ్లికి నాలుగేళ్ల ముందే జరిగిపోయిందట.

అమాయకపు చూపులతో, నిష్కల్మషమైన చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులు ఇట్టే గెలుచుకుంది లైలా. 'దుష్మన్‌ దునియా కా' అనే హిందీ చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలైంది. కానీ తనకు స్టార్‌డమ్‌, అవకాశాలు వచ్చింది మాత్రం సౌత్‌లోనే! ఎగిరే పావురమా(1997) సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన లైలా.. పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ శైలజా కృష్ణమూర్తి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 

8 ఏళ్లు లవ్‌.. పెళ్లితో సినిమాలకు దూరం
సౌత్‌లో తిరుగులేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లైలా ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ అది ఇండస్ట్రీ వ్యక్తిని కాదు.. బిజినెస్‌మెన్‌ మెహ్దీని! దాదాపు ఎనిమిదేళ్లపాటు వీరు ప్రేమించుకున్నారు. కెరీర్‌ ఊపు మీదున్న సమయంలో 2006లో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఎంగేజ్‌మెంట్‌ మాత్రం పెళ్లికి నాలుగేళ్ల ముందే జరిగిపోయిందట. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసిన లైలా 2022లో సర్దార్‌ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

డైలాగ్స్‌ సరిగా చెప్పట్లేదని తిట్టిన డైరెక్టర్‌
తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '2001లో నందా సినిమా చేసే సమయానికి నాకు తమిళ్‌ మాట్లాడటం ఇంకా రాలేదు. చాలా తప్పులు దొర్లేవి. డైలాగులు కూడా తప్పుతప్పుగా చెప్పేదాన్ని. దీంతో డైరెక్టర్‌ బాలా సర్‌ నన్ను పదేపదే తిట్టేవాడు. ఒకానొక దశలో నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేనింక సినిమా చేయనని చెప్పేశాను. అప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి బాలా మంచి డైరెక్టర్‌.. ఆయన దర్శకత్వంలో నువ్వు పని చేస్తే నీకు మంచి పేరు, గుర్తింపు వస్తుందని, నీ లైఫే మారిపోతుందని సర్ది చెప్పారు.

ఆయన కోపం అర్థమై కాళ్ల మీద పడ్డా
సరేనని నేను కూడా కోపాన్ని పక్కనపెట్టి సినిమాలో నటించాను. సినిమా రిలీజయ్యాక రెస్పాన్స్‌ ఎలా ఉందో చూద్దామని తొలిరోజే థియేటర్‌కు వెళ్లాను. అక్కడ జనాల అరుపులు, కేకలు చూసి ఆశ్చర్యపోయాను. స్క్రీన్‌పై నేను ఇంత బాగా నటించానా? అని నేనే షాకయ్యాను. వెంటనే బాలా సర్‌ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండంటూ ఆయన కాళ్లపై పడ్డాను. మీ కోపం నాకిప్పుడు అర్థమైందని ఆయనతో చెప్పాను' అని పేర్కొంది లైలా. ఇక నందా సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్‌ అవార్డు సైతం అందుకుంది లైలా.

చదవండి: ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లి.. మోసం చేసిన నాయకుడు.. న్యాయం చేయాలని నటి ఆవేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement