Director Bala
-
సూర్యను రీప్లేస్ చేసిన హీరో.. రిలీజ్ ఎప్పుడంటే
దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న చిత్రం వణంగాన్. ఈ చిత్రంలో మొదట సూర్య హీరోగా నటించారు. కొంత షూటింగ్ జరిగిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ చిత్రం నుంచి వైదొలిగారు. సూర్య స్థానంలో అరుణ్ విజయ్ను ఎంపిక చేశారు. ఇందులో నటి రోషిణీ ప్రకాశ్, సముద్రఖని, మిష్కిన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వీ హౌస్ పొడక్షన్స్ పతాకంపై సురేశ్ కామాక్షి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. విగ్రహాలతో..ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఆ మధ్య చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో అరుణ్ విజయ్ ఒక చేతిలో పెరియార్, మరో చేతిలో వినాయకుడి శిలను పట్టుకుని ఉన్న ఆ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. కాగా వణంగాన్ చిత్రం విడుదల గురించి నిర్మాత సురేశ్ కామాక్షి తన ఎక్స్ మీడియాలో పేర్కొంటూ జూలై నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. రిలీజ్ ఎప్పుడంటే?ఈ మేరకు రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు. అందులో కన్యాకుమారిలో ఉన్న తిరువళ్లువర్ శిలావిగ్రహం వద్ద నిలబడ్డ అరుణ్ విజయ్‌కు దర్శకుడు బాలా సూచనలుు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, ఆర్పీ గురుదేవ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ஜூலை வெளியீடு(July release) @arunvijayno1 #Bala#Vanangaan@roshiniprakash_@thondankani@DirectorMysskin@Vairamuthu@gvprakash@editorsuriya@rk_naguraj@silvastunt @VHouseProd_Offl@memsundaram @johnmediamanagr #Bstudios pic.twitter.com/hKrOGvWZuR— sureshkamatchi (@sureshkamatchi) June 1, 2024 -
నిర్మాత మృతి.. చివరి రోజుల్లో ఇంత బాధ అనుభవించాడా?
సీనియర్ సినీ నిర్మాత వీఏ దురై (59) సోమవారం సాయంత్రం చైన్నెలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. సూర్య-విక్రమ్ హీరోలుగా తెరకెక్కిన 'పితామగన్' చిత్రానికి వీఏ దురై నిర్మాతగా వ్యవహరించాడు. తెలుగులో ఈ చిత్రం 'శివపుత్రుడు' పేరుతో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. కాగా నటుడు సత్యరాజ్ కథానాయకుడిగా నటించిన 'ఎన్నమ్మా కన్ను' నిర్మాతగా ఈయన తొలి చిత్రం. ఆ తర్వాత కార్తీ కథానాయకుడిగా లూటీ, విజయకాంత్ హీరోగా గజేంద్ర.. ఇలా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అదే విధంగా రజనీకాంత్ బాబా సినిమాకు సైతం నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఈయన భార్యా పిల్లలతో మనస్పర్థల కారణంగా చాలాకాలంగా వారికి దూరంగా స్థానిక విరుగంబాక్కంలో నివసిస్తూ వచ్చారు. కొంతకాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఇటీవల ఒక కాలును కూడా తొలగించారు. వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవంటూ ఆ మధ్య ఈయన సామాజిక మాధ్యమాల్లో వీడియో రిలీజ్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నటుడు కరుణాస్, సూర్య వంటి కొందరు ఆర్థిక సాయం చేశారు. తమిళం తెలుగు భాషల్లో సంచలన విజయాన్ని సాధించిన పితామగన్ చిత్రం నిర్మాతకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. దీంతో ఆ చిత్ర దర్శకుడు బాల మరో చిత్రం చేసి పెడతానని చెప్పి వీఏ దురై వద్ద రూ. 25 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆయన దగ్గర సినిమా చేయలేదు సరి కదా తీసుకున్న అడ్వాన్స్‌ని కూడా తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై బాలను వీఏ దురై పలుమార్లు అడిగినా ఫలితం లేకపోయింది. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నిర్మాత వీఏ దురై సోమవారం రాత్రి ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా వీఏ దురై భౌతికయానికి మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. హస్ గురించి చైతూ కామెంట్ -
డైరెక్టర్ కాళ్ల మీద పడ్డ హీరోయిన్.. ఈమెను గుర్తుపట్టారా?
అమాయకపు చూపులతో, నిష్కల్మషమైన చిరునవ్వుతో ప్రేక్షకుల మనసులు ఇట్టే గెలుచుకుంది లైలా. 'దుష్మన్ దునియా కా' అనే హిందీ చిత్రంతో వెండితెరపై తన ప్రయాణం మొదలైంది. కానీ తనకు స్టార్డమ్, అవకాశాలు వచ్చింది మాత్రం సౌత్‌లోనే! ఎగిరే పావురమా(1997) సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన లైలా.. పెళ్లి చేసుకుందాం, పవిత్ర ప్రేమ, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించింది. 8 ఏళ్లు లవ్.. పెళ్లితో సినిమాలకు దూరం సౌత్‌లో తిరుగులేని హీరోయిన్గా పేరు తెచ్చుకున్న లైలా ఒకరిని గాఢంగా ప్రేమించింది. కానీ అది ఇండస్ట్రీ వ్యక్తిని కాదు.. బిజినెస్మెన్ మెహ్దీని! దాదాపు ఎనిమిదేళ్లపాటు వీరు ప్రేమించుకున్నారు. కెరీర్ ఊపు మీదున్న సమయంలో 2006లో అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఎంగేజ్మెంట్ మాత్రం పెళ్లికి నాలుగేళ్ల ముందే జరిగిపోయిందట. ఈ జంటకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసిన లైలా 2022లో సర్దార్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. డైలాగ్స్ సరిగా చెప్పట్లేదని తిట్టిన డైరెక్టర్ తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. '2001లో నందా సినిమా చేసే సమయానికి నాకు తమిళ్ మాట్లాడటం ఇంకా రాలేదు. చాలా తప్పులు దొర్లేవి. డైలాగులు కూడా తప్పుతప్పుగా చెప్పేదాన్ని. దీంతో డైరెక్టర్ బాలా సర్ నన్ను పదేపదే తిట్టేవాడు. ఒకానొక దశలో నాకు విపరీతమైన కోపం వచ్చింది. నేనింక సినిమా చేయనని చెప్పేశాను. అప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి బాలా మంచి డైరెక్టర్.. ఆయన దర్శకత్వంలో నువ్వు పని చేస్తే నీకు మంచి పేరు, గుర్తింపు వస్తుందని, నీ లైఫే మారిపోతుందని సర్ది చెప్పారు. ఆయన కోపం అర్థమై కాళ్ల మీద పడ్డా సరేనని నేను కూడా కోపాన్ని పక్కనపెట్టి సినిమాలో నటించాను. సినిమా రిలీజయ్యాక రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామని తొలిరోజే థియేటర్‌కు వెళ్లాను. అక్కడ జనాల అరుపులు, కేకలు చూసి ఆశ్చర్యపోయాను. స్క్రీన్‌పై నేను ఇంత బాగా నటించానా? అని నేనే షాకయ్యాను. వెంటనే బాలా సర్ దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండంటూ ఆయన కాళ్లపై పడ్డాను. మీ కోపం నాకిప్పుడు అర్థమైందని ఆయనతో చెప్పాను' అని పేర్కొంది లైలా. ఇక నందా సినిమాకు గానూ ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు సైతం అందుకుంది లైలా. చదవండి: ఒకరితో సహజీవనం.. మరొకరితో పెళ్లి.. మోసం చేసిన నాయకుడు.. న్యాయం చేయాలని నటి ఆవేదన -
ప్రముఖ డైరెక్టర్ ఇంటిముందు నిర్మాత ధర్నా
తమిళసినిమా: దర్శకుడు బాలా ఇంటి ముందు సినీ నిర్మాత ధర్నా చేయడం కోలీవుడ్‌లో కలకలం రేపింది. వివరాలు.. సేతు, పితామగన్, నంద వంటి పలు విజయవంతమైన చిత్రాల దర్శకుడు బాలా. వీటిలో పితామగన్ చిత్ర నిర్మాత వీఏ దురై. 2003లో విక్రమ్, సూర్య హీరోలుగా బాలా దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం పితామగన్ మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా ఆ చిత్రంలో నటించిన విక్రమ్‌కు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టింది. అయితే భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతకు మాత్రం లాభాన్ని అందించలేదు. దీంతో ఈ చిత్రం నిర్మాతకు మరో చిత్రం చేసి పెడుతానని బాల అప్పట్లో మాట ఇచ్చారట. అందుకు ఆయనకు నిర్మాత అడ్వాన్సుగా రూ.10 లక్షలు ఇచ్చారట. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బాల నిర్మాత వీఏ దురైకు చిత్రం చేయలేదు. తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి చెల్లించ లేదు. ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉన్న నిర్మాత వీఏ దురై నటుడుగా మారి ఒక చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. కాగా ఈయన తనకు చేసే చిత్రంపై బాలాను పలుమార్లు అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని దీంతో తాను ఇచ్చిన అడ్వాన్సును తిరిగి చెల్లించాలని కోరినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో మంగళవారం చెన్నైలోని దర్శకుడు బాలా కార్యాలయానికి వచ్చి డబ్బులు ఇవ్వాల్సిందిగా అడిగారు. దీంతో బాలా అనుచరుడు ఆయన్ని కార్యాలయం నుంచి బయటకు నెట్టేసినట్లు సమాచారం. దీంతో నిర్మాత దురై బాలా కార్యాలయం ముందే ధర్నాకు దిగారు. దీంతో నిర్మాతల సంఘం సభ్యులు వీఏ దురైతో ఫోన్లో మాట్లాడి ధర్నాని ఉపసంహరింపజేశారు. దీంతో నిర్మాత దురై అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
Suriya 41: ‘అచలుడు’గా వస్తున్న సూర్య, ఫస్ట్‌లుక్ రిలీజ్
సూర్య హీరోగా బాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సూర్య 41(Suriya 41) అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్. 2డి ప్రొడక్షన్లో భార్య జ్యోతికతో కలిసి సూర్య స్యయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, టైటిల్‌ను డైరెక్టర్ బాల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. సోమవారం(జూలై 11న) డైరెక్టర్ బాల బర్త్‌డే. ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను వణంగన్(తెలుగలో అచలుడు)గా ఖరారు చేశారు. ‘అచలుడు’ అంటే.. దేనికి చలించనివాడు అని అర్థం. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సూర్య చిరిగిన గుడ్డలోంచి గంభీరంగా చూస్తు కనిపించాడు. చదవండి: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది: సాయి పల్లవి ఈ సినిమాలో సూర్య మత్స్యకారునిగా కనిపిస్తాడని మూవీ వర్గాలు అంటున్నాయి. కాగా దాదాపు 20 ఏళ్ల తర్వాత సూర్య- డైరెక్టర్ బాలా కలిసి పనిచేయబోతున్నారు. వీరిద్దరూ గతంలో నందా (2001), పితామగన్ (2003) సినిమాల్లో కలిసి పనిచేశారు. 2003లో రిలీజ్ అయిన యాక్షన్-డ్రామా మూవీ పితామగన్లో చియాన్ విక్రమ్ కూడా నటించాడు. ఈ సినిమాలో విక్రమ్ తన అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు కూడా గెలుచుకున్నాడు. పితామగన్ మూవీ ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అందులో సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, బాలకు ఉత్తమ దర్శకుడు, విక్రమ్‌కు ఉత్తమ నటుడుగా, లైలాకు ఉత్తమ నటి, సంగీతకు ఉత్తమ సహాయ నటిగా పురస్కారం దక్కింది. చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్ -
ఒక్క ట్వీట్‌తో పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన సూర్య
తమిళసినిమా: బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంపై వస్తున్న పుకార్లకు నటుడు సూర్య ఫుల్స్టాప్ పెట్టారు. వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న నటుడు సూర్య ప్రస్తుతం ఈయన వెట్రీమారన్ దర్శకత్వంలో వాడి వాసల్, బాలా దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆగిపోయిందనే వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీనికి క్లారిటీ ఇస్తూ బాలా దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ కన్యాకుమారి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు రెండవ షెడ్యూల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీంతో ఈ క్రేజీ చిత్రంపై ఉన్న అపోహలు తొలగిపోయాయి. పితామగన్, నందా వంటి విజయవంతమైన చిత్రాల తరువాత సూర్య, బాలా కలిసి 17 ఏళ్ల తరువాత చేస్తున్న చిత్రం ఇది. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. Waiting to be back on sets…!! #Suriya41 pic.twitter.com/enuJ5MNbZJ — Suriya Sivakumar (@Suriya_offl) May 26, 2022 -
సినిమా బాగుండకపోతే నా పేరు, బ్యానర్ పేరు వేయొద్దు: దర్శకుడు బాలా
Director Bala Speech at Visithiran Audio Launch: చిత్రం బాగుండకపోతే తన పేరు, బ్యానర్ పేరు వేయవద్దంటానని దర్శకుడు బాలా అన్నారు. ఈయన తన బి.స్టూడియో పతాకంపై నిర్మించిన చిత్రం విసిత్తిరన్. ఆర్.కె.సురేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి పూర్ణ, మధు వైశాలిని నాయికలుగా నటించారు. మలయాళ దర్శకుడు పద్మకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ నిర్మాత, దర్శకుడు బాలా మాట్లాడుతూ మలయాళ చిత్రం జోసెఫ్ నచ్చడంతో తమిళంలో రీమేక్ చేయాలనుకుంటున్నప్పుడు తాను నటిస్తానని ఆర్.కె.సురేష్ అడిగారన్నారు. ఇక మలయాళ దర్శకుడు పద్మకుమార్నే తమిళ వెర్షన్‌కు పని చేయాల్సిందిగా కోరామన్నారు. చిత్రం మళయాళంలో కంటే బాగా వచ్చిందన్నారు. ఆర్.కె.సురేష్ చక్కగా నటించారన్నారు. చదవండి: (నేను మీకు బాగా కావాల్సినవాడిని అంటున్న యంగ్ హీరో) -
క్రేజీ కాంబినేషన్: ఆ డైరెక్టర్‌తో సూర్య నెక్ట్స్ మూవీ
చెన్నై: నటుడు సూర్య, దర్శకుడు బాల కాంబినేషన్లో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నట్లు కోలివుడ్లో టాక్ వినిపిస్తోంది. నంద చిత్రంతో సూర్యను మాస్ హీరోగా మార్చిన దర్శకుడు బాల, ఆ తరువాత విక్రమ్, సూర్య కాంబినేషన్లో పితామగన్ తీసి సంచలన విజయాన్ని సాధించారు. కాగా బాలాతో సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అధర్వ, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
విశాల్ వర్సెస్ ఆర్య
దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వాడు వీడు’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు విశాల్, ఆర్య. ఇప్పుడు ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో విశాల్, ఆర్య ఒకరి మీద మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకోనున్నారట. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. చిత్రీకరణలో పాల్గొంటున్న వీడియోను షేర్ చేసి, ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కొత్త టీమ్. కొత్త లుక్. కొత్త సినిమా’’ అన్నారు విశాల్. ఇందులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళినీ రవి హీరోయిన్గా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. -
కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్!
సాక్షి, తమిళసినిమా: దర్శకుడు బాలా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్‌కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. తొలిసారిగా ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించడం గతంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేయాలని ఆయన భావించారు. వర్మ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసినప్పటికీ.. చిత్రీకరణ అంతా పూర్తయిన తరువాత నిర్మాతలు ఇది అసలు అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌లా లేదు, బాలా సరిగా తీయలేదంటూ పక్కన పడేశారు. నూతన దర్శకుడితో ఆదిత్యవర్మ పేరుతో మళ్లీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకంటే బాలాకు జరిగిన అవమానం వేరే ఉండదు. దీంతో ఆయన చాలా కసిగా ఒక కథను తయారు చేశారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇది మల్టీస్టారర్ సినిమా. ఇందులో నటించడానికి సూర్య సమ్మతించినట్లు సమాచారం. అంతేకాదు మరో హీరోగా నటుడు ఆర్య, అధర్వ కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు ఇంతకుముందు బాలా దర్శకత్వంలో నటించినవారే. వారిప్పుడు ఆయనకు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాహుబలి ఫేమ్ రానాను నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇక కథానాయికలుగా మహిమ, బిందుమాధవి నటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలన్న కసి, పట్టుదలతో బాలా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. -
అర్జున్ రెడ్డి రీమేక్‌కు హీరోయిన్ ఫిక్స్!
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి సినిమాను కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా బాలా దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్‌పుట్‌తో నిర్మాతలు సంతృప్తిగా లేకపోవటంతో సినిమాను మరోసారి కొత్త టీంతో తెరకెక్కించే పనిలో ఉన్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా దర్శకుడి పేరు ఫైనల్ చేయని ఈ సినిమాలో హీరోయిన్ను కూడా మార్చేస్తున్నారు. మేఘా చౌదరి స్థానంలో బాలీవుడ్ నటి అక్టోబర్ ఫేం బనితా సందు నటించనుంది. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేసిన గిరీషయ్య ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. CONFIRMED... #October leading lady Banita Sandhu to star in #Tamil remake of #ArjunReddy... Dhruv Vikram, son of Chiyaan Vikram, to essay the title role. pic.twitter.com/QPM4FYenuT — taran adarsh (@taran_adarsh) 16 February 2019 -
నేనే తప్పుకున్నాను
‘‘దర్శకుడు బాలా రూపొందించిన ‘వర్మ’ చిత్రం మాకు సంతృప్తికరంగా లేదు. సినిమాను మళ్లీ మొదటి నుంచి చిత్రీకరించాలనుకుంటున్నాం’’ అని ‘అర్జున్ రెడ్డి’ తమిళంలో రీమేక్ చేస్తున్న ఈ4 ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంస్థ పేర్కొంది. అయితే బాలా లాంటి దర్శకుడుని తప్పించడమేంటి? అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విషయంపై బాలా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘నిర్మాతలు ఇచ్చిన అబద్ధపు స్టేట్మెంట్ల వల్ల నేను వివరణ ఇవ్వాల్సివస్తోంది. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలన్నది నా సొంత నిర్ణయమే. ధృవ్ విక్రమ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేద్దామని అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. ‘వర్మ’ కొత్త ప్రాజెక్ట్‌ను దర్శకుడు గౌతమ్ మీనన్ టేకప్ చేస్తారని టాక్. -
‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా
టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘అర్జున్ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్ వారసుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్‌పుట్ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్ విక్రమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘వర్మ’కేమైంది!
తమిళసినిమా: వర్మకేమైంది? కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారిన షాకింగ్ న్యూస్. దర్శకుడు బాలా సృష్టి వర్మ. దీన్ని ఆయన సృష్టి అనవచ్చో కాదో. ఎందుకంటే వర్మ బాలా ముద్దుబిడ్డ కాదు. అద్దె బిడ్డ అనవచ్చు. ఆయన రాసుకున్న కథా చిత్రం కాదు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్ వర్మ. నటుడు విక్రమ్ వారసుడు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఇది. ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థకు ఫస్ట్ కాపీ విధానంలో బాలా నిర్మాణ సంస్థ బీ స్టూడియోస్ రూపొందిస్తున్న చిత్రం వర్మ. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా ఈ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు వర్మ చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడిస్తూ మీడియాకు ఇక ప్రకటనను విడుదల చేశారు. అర్జున్‌రెడ్డికి రీమేక్‌లా లేదు అందులో వారు పేర్కొంటూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని వర్మ పేరుతో రీమేక్ చేసి ఫస్ట్‌కాపీ బేస్డ్లో బాలా బి.స్టూడియోస్ సంస్థ తమకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే బాలా తెరకెక్కించిన వర్మ చిత్రం ఫస్ట్‌కాపీ చూసిన తరువాత తమకు సంతృప్తి అనిపించలేదన్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒరిజినల్ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో వర్మ చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని మళ్లీ వేరే దర్శకుడితో రీమేక్ చేయనున్నట్లు తెలిపారు. హీరోగా ధృవే నటిస్తారని, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జూన్ 29న విడుదల చేస్తామని ఈ 4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా పూర్తిగా అదీ ఒక జాతీయ అవార్డు గ్రహీత, పలు వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త తెరకెక్కించిన చిత్రాన్ని విడుదల సంతృప్తిగా లేదని పక్కన పడేయనున్నట్లు చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. నా చిత్రం రిలీజ్ కావడం లేదా? వర్మ చిత్రంలో ధృవ్‌కు జంటగా నవ నటి మేఘాచౌదరి నటించింది. మోడలింగ్ రంగంలో పాపులర్ అయిన ఈ బెంగాలీ బ్యూటీ హీరోయిన్గా ఇదే తొలి చిత్రం. వర్మ చిత్రం విడుదల కావడం లేదు తెలుసా అన్న ప్రశ్నకు మేఘాచౌదరి షాక్ అయ్యింది. కొత్తగా రూపొందించనున్న చిత్రంలో ధృవ్ నటించనున్నాడు. మరి ఈ చిన్నది ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. విక్రమ్ కూడానా? వర్మ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించడంతో ఆ చిత్ర దర్శకుడు బాలా చాలా హర్ట్ అయ్యారు. ఈయనకు దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్ ఉంది. ఆయన చిత్రాలకు ఆయనే కథలను రాసుకుంటారు. అలాంటి దర్శకుడు అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు ముందు వ్యతిరేకించారట. అయితే సేతు చిత్రంతో తనకు సినీ జీవితాన్ని చ్చిన నటుడు విక్రమ్ తన కొడుకును హీరోగా పరిచయం చేయమని కోరడంతో ఆయన కోసమే అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు బాలా సమ్మతించినట్లు సమాచారం. అయినా రీమేక్‌ను అలానే కాపీ కొట్టి చేయనని బాలా ముందే చెప్పారట. తీరా వర్మ చిత్రం పూర్తయిన తరువాత నటుడు విక్రమ్ కూడా నిర్మాతల తరఫున మాట్లాడటం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
డైరెక్టర్ బాలాకు షాక్
తమిళనాట డైరెక్టర్ బాలాకు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. భిన్నంగా సినిమాలు తీస్తూ.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించిన బాలాకు ఎదురుదెబ్బ తగిలింది. టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డికి రీమేక్‌గా తెరకెక్కుతున్న వర్మ సినిమాను బాలా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవుట్‌పుట్ చూసిన నిర్మాతలు దానితో సంతృప్తి చెందలేదని, పూర్తి సినిమాను మళ్లీ రీషూట్ చేస్తామని ప్రకటించారు. హీరో ధృవ్ తప్పా మిగిలిన క్యాస్టింగ్ మొత్తాన్ని మార్చనున్నట్లు తెలిపారు. డైరెక్టర్ బాలాను కూడా తప్పించడం తమిళ నాట హాట్ టాపిక్ అయింది. విక్రమ్ సూచన మేరకే నిర్మాతలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చిలో మళ్లీ రీషూట్ చేయబోతున్నట్లు సమాచారం. మిగతా వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. -
‘వర్మ సినిమాలో నా కూతురు నటించట్లేదు’
సాక్షి, చెన్నై : సీనియర్ నటి గౌతమి తాజాగా ట్విటర్ లో స్పందించారు. తన కూతురు సుబ్బలక్ష్మి త్వరలో సినిమాల్లోకి రాబోతుందంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో అది నిజం కాదంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘మీడియాలో నా కూతురి డెబ్యూ గురించి వస్తున్న వార్తలు చూశాను. సుబ్బలక్ష్మి తన చదువుల్లో బిజీగా ఉంది. ఇప్పట్లో నటన గురించి ఆలోచన చేయలేదు. తనకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నా’ అని గౌతమి తెలిపారు. కాగా, విలక్షణ దర్శకుడు బాలా అర్జున్ రెడ్డి రీమేక్‌ను ‘వర్మ’ పేరుతో తెరకెక్కిస్తున్నాడు. ‘చియాన్’ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ చిత్రంతో అరంగ్రేటం చేయబోతున్నాడు. హీరోయిన్ కోసం వేట ఇంకా కొనసాగుతోంది. Taken aback to see news about my daughter's acting debut. Subhalaxmi is committed to her studies and has no plans for acting now. Thank you all for your blessings on her. — Gautami (@gautamitads) 13 March 2018 -
బాలా చేతిలో మరో వారసురాలు
దర్శకుడు బాలా మరో నట వారసురాలిని నటిగా మలచనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులు వస్తోంది. వైవిధ్యభరిత కథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు బాలా. సేతు, పితామగన్, నందా, నాన్‌కడవుల్ ఇలా ఒకదానికొక్కటి సంబంధం లేని కథా చిత్రాల సృష్టి కర్త బాలా. ఇటీవల జ్యోతిక, జీవీ ప్రకాశ్కుమార్లు నటించిన నాచియార్ చిత్రంతో మరో సారి తన సత్తా చాటుకున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసే బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఈ చిత్రం ద్వారా నటుడు విక్రమ్ కొడుకు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది కూడా. అయితే ఇందులో నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో ఈ పాత్ర పోషించిన మరాఠీ భామ శాలినిపాండే విపరీతంగా క్రేజ్ తెచ్చుకుంది. ఇక అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్‌కు బాలా వర్మ అనే టైటిల్‌ను పెట్టారు. ఇందులో శాలినిపాండే పాత్రలో చిల్లన్ను ఒరు కాదల్ చిత్రంలో బాల నటిగా నటించిన శ్రియశర్మను నటింపజేయడానికి చర్చలు జరిగాయి. ఆ తరువాత తెలుగులో నటించిన శాలినిపాండేనే తమిళంలోనూ నటించనుందనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. సీనియర్ నటి గౌతమి కూతురు సుబ్బులక్ష్మీని బాలా కథానాయకిగా పరిచయం చేయనున్నారన్నదే ఆ న్యూస్. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. వర్మ చిత్ర షూటింగ్ రెండో షెడ్యూల్ త్వరలో చెన్నైలో నిర్వహించడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో ధృవ్తోపాటు సుబ్బులక్ష్మీ పాల్గొనే అవకాశం ఉంది. -
అనుష్క అంగీకరిస్తే... తెలుగులో రీమేక్
సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా నాచియార్. జ్యోతిక, జీవి ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి వసూళ్లు సాధిస్తోంది. జ్యోతిక చెప్పిన డైలాగ్స్‌తో వివాదాస్పదమైన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పలు తమిళచిత్రాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసిన కోనేరు కల్పన, నాచియార్ హక్కులను సొంతం చేసుకున్నారు. అయితే ఈసినిమాను డబ్ చేయకుండా తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు బాలా సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు తమిళ్లో జ్యోతిక చేసిన పాత్రను తెలుగులో అనుష్క చేస్తే బాగుంటుందని బాల సూచించారు. దీంతో అనుష్క అంగీకరస్తే నాచియార్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
జ్యోతికపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, చెన్నై : నటి జ్యోతికపై హిందూ మక్కళ్ కట్చి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం నాచియార్. బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని కొన్ని సంభాషణలపై ఇంతకు ముందే తీవ్ర వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పలు సంఘాల వ్యతిరేకతతో ఆ సన్నివేశాల్లోని సంభాషణలను చిత్ర వర్గాలు బీప్ చేశారు. ఈ నేపథ్యంలో నాచియార్ చిత్రం నిన్న (శుక్రవారం) విడుదల అయింది. అందులోని మరి కొన్ని సన్నివేశాలు వివాదానికి తెరలేపాయి. దీంతో హిందూ మక్కళ్ కట్చి ప్రచార విభాగ అధ్యక్షుడు కాళీకుమార్ నిన్న చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నాచియార్ చిత్రంలో జ్యోతిక ఒక సన్నివేశంలో ‘మాకు ఆలయాలయినా, చెత్తకుప్పలు అయినా ఒకటే’ అంటూ మాట్లాడిన సంభాషణలు హిందూ దేవాలయాలను అవమానించేవిగానూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సంభాషణలను వెంటనే తొలగించి, జ్యోతిక, దర్శకుడు బాలాపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
మళ్లీ చర్చకు తెరలేపిన దర్శకుడు బాలా
తమిళసినిమా: దర్శకుడు బాలా మరోసారి కుట్రపరంపరై చిత్ర చర్చకు తెరలేపారు. ఈ సంచలన దర్శకుడి నుంచి సాదా సీదా చిత్రాలను ఎవరూ ఆశించరు. సేతు, పితామగన్, నందా,అవన్ ఇవన్, నాన్‌కడవుల్, పరదేశి ఇలా దేనికదే అసాధారణ కథాంశంతో రూపొందిన చిత్రమే. తాజాగా జ్యోతిక ప్రధాన పాత్రలో నాచ్చియార్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాణం దశలోనే వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. చిత్ర టీచర్లో పోలీస్అధికారిగా నటిస్తున్న జ్యోతిక మహిళలను కించపరచే విధంగా మాట్లాడిన సన్నివేశాలపై పలు సంఘాల వారు తీవ్రంగా ఆరోపించడం, ఆ వ్యవహారం కేసు, కోర్టు వరకూ వెళ్లడం తెలిసిన విషయమే. బాలా నాచ్చియార్ చిత్రం తరువాత తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఇందులో నటుడు విక్రమ్ కొడుకు ధ్రువ కథానాయకుడిగా తెరంగేట్రం చేయనున్నారు. ఇదిలా ఉంటే చాలా కాలం క్రితం బాలా కట్రపరంపరై అనే యథార్థ సంఘటనల ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు. వేల్ రామమూర్తి రాసిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందులో అరవిందస్వామి, విశాల్, ఆర్య,అధర్వ, రానా, అనుష్క నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ నవలను చిత్రపరంపరై పేరుతో చిత్రంగా రూపొందించడానికి తాను చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నానని సీనియర్ దర్శకుడు భారతీరాజా ప్రకటించడం, ఈ చిత్ర వ్యవహారంలో బాలాకు భారతీరాజా మధ్య చిన్న పాటి యుద్ధమే జరిగింది. భారతీరాజా కుట్రపరంపరై చిత్ర కథతో షూటింగ్‌ను కూడా ప్రారంభించారు.ఆ తరువాత అది ఆరంభ శూరత్వంగానే ఆగిపోయింది. దర్శకుడు బాలా కూడా అప్పుడు డ్రాప్ అయ్యారు. తాజాగా కుట్రపరంపరై చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు వెల్లడించి మరోసారి సంచలనానికి తెరలేపారు. ఈసారి ఇందులో శ్రద్ధాశ్రీనాథ్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ చిత్ర పూర్తి వివరాలు వెలువడే వరకూ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది. -
జాతీయ అవార్డు విజేతతో రానా
బాహుబలి విజయం తరువాత భల్లాలదేవ రానా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో ఇతర భాషా దర్శకులు కూడా రానాతో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సోలో హీరోగా ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి సినిమాల విజయం కూడా రానాకు కలిసొచ్చింది. ప్రస్తుతం 1945 అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్న రానా, త్వరలో తమిళ దర్శకుడు ప్రభు సాల్మోన్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. హతీ మేరీ సాథీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పీరియాడిక్ జానర్ లోనే తెరకెక్కనుంది. ఈ రెండు సినిమా ల తరువాత ఓ జాతీయ అవార్డ్ విజేత దర్శకత్వంలో నటించనున్నాడు రానా. దక్షిణాదిలో సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో రానా ఓ సినిమా చేయబోతున్నాడట. తన ప్రతీ సినిమాను రియలిస్టిక్ గా రూపొందించే బాల ప్రస్తుతం విక్రమ్ తనయుడు ధృవ్ ను హీరోగా పరిచయం చేస్తూ అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత 2018 ద్వితీయార్థంలో రానా హీరోగా సినిమాను ప్రారంభించనున్నాడట. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. -
ఆ టీజర్ వివాదాలకు దారి తీసింది..
సాక్షి, చెన్నై: నటి జ్యోతిక, దర్శకుడు బాలాలపై కేసు విచారణను కోర్టు జనవరి 11వ తేదీకి వాయిదా వేసింది. సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో జ్యోతిక ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం నాచ్చియార్. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలపై వివాదాలకు దారి తీసింది. టీజర్లో పోలీస్ అధికారిగా నటిస్తున్న నటి జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లోని మహిళలపై అసభ్యపదజాలాన్ని వాడినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ వ్యవహారంపై ఇండియా కుడియరసు పార్టీ రాష్ట్ర నిర్వాహకుడు దళిత్ పాండియన్ సమీప కాలంలో కరూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నాచ్చియార్ చిత్ర టీజర్లో జ్యోతిక మహిళలను అసభ్య పదజాలంతో దూషించారన్నారు. ఆ సంభాషణలు మహిళల మనోభావాలను బాధించేవిగా ఉన్నాయన్నారు. నటి జ్యోతిక, దర్శకుడు బాలాపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ గురువారం కోర్టులో విచారణకు వచ్చింది. పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన తగిన ఆధారాలను, సాక్ష్యాలను కోర్టుకు సమర్పించాల్సిందిగా పిటిషన్‌దారుడికి ఆదేశాలు జారీ చేశారు. విచారణను జనవరి 11వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. పిటిషన్‌దారుడు దళిత్ పాండియన్ తరఫున హాజరైన న్యాయవాది రాజేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో మనోభావాలు దెబ్బతిన్న వారిని, తమ అభిప్రాయాలను వెల్లడించే వారిని, మదర్ సంఘాల వారి సాక్ష్యాలను జనవరి 11వ తేదీన కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. అప్పుడు నటి జ్యోతిక, దర్శకుడు బాలాలకు సమస్లు జారీ చేసేలా కోర్టుకు విన్నవిస్తామని తెలిపారు. -
బాలా దర్శకత్వంలో విక్రమ్ వారసుడు
తమిళసినిమా: సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో సిమాన్ విక్రమ్ వారసుడు హీరోగా ఎంట్రీ అవుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసిన తన కొడుకు ధృవ్‌ను విక్రమ్ హీరోగా పరిచయం చేయాలని గత ఏడాదే నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి మంచి కథ కోసం అన్వేషణ సాగిస్తున్న ఆయకు తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి దృష్టిలో పడింది. ఇదే తన వారసుడికి సరైన ఎంట్రీ అవుతుందని భావించారు. అంతే అర్జున్‌రెడ్డి ధృవ్ హీరోగా తమిళంలో రీమేక్‌కు రెడీ అయిపోయింది. అయితే దర్శకుడెవరన్న ప్రశ్నకు తాజాగా క్లారిటీ వచ్చింది. విక్రమ్‌కు సేతు చిత్రంలో నటుడిగా బ్రేక్ ఇచ్చిన సంచలన దర్శకుడు బాలా అర్జున్‌రెడ్డిని తమిళ తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర వర్గాలు సోమవారం అధికారకపూర్వకంగా వెల్లడించారు. దీన్ని ఈ4 ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మించనుంది. చిత్రం త్వరలోనే సెట్‌పైకి వెళ్లనుంది. ఇందులో ధృవ్‌తో జత కట్టే నాయకి ఎవరన్నది ఆసక్తిగా మారింది. షమితాబ్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ, వివేగం చిత్రంతో కోలీవుడ్‌లోనూ మెరిసిన విశ్వనటుడి వారసురాలు అక్షరహాసన్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అదే సమయంలో బాల నటిగా పరిచయమై గుర్తింపు పొందిన శ్రియశర్మకు కూడా ఇందులో హీరో యిన్ అయ్యే అవకాశం ఉం దనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ఇద్దరు బ్యూటీస్‌లో ఎవరికి ధృవ్‌తో జోడీ కట్టే అవకాశం వస్తుందో తెలిసి పోతుంది. సేతు, నందా, పితామగన్, పరదేశి, తారైతప్పట్టై ఇలా వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించి తనకుంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు బాలా 18 ఏళ్ల సినీచరిత్రలో తొలిసారిగా రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడం గమనార్హం. -
బాలా నాచియార్ మొదలైంది
ఒక సంచలన చిత్రానికి శ్రీకారం జరిగింది. దర్శకుడు బాలా ఈ పేరు వైవిధ్యానికి మారు పేరు. ఒక నందా, పితామగన్, నాన్‌కడవుల్, పరదేశి లాంటి విభిన్న కథా చిత్రాలకు కేరాఫ్ ఆయనే. ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం తారైతప్పట్టై. సాధారణ కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహించడం ఈయన హిస్టరీలో ఇప్పటి వరకూ జరగలేదు. అందుకే బాలా చిత్రాలకు ఆయన ముద్ర కచ్చితంగా ఉంటుంది. ఇక పెళ్లికి ముందు అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించి యువత గుండెల్ని కొల్లగొట్టిన నటి జ్యోతిక. నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత నటనకు చిన్న విరామం ఇచ్చి మళ్లీ 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం మగళీర్ మట్టుం చిత్రంలో నటిస్తున్నారు. కథానాయకి ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాల్లోనే నటించాలన్న నిర్ణయంతో ముందుకు సాగుతున్న జ్యోతిక తాజాగా సంచలన దర్శకుడు బాలా దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అయ్యారు. ఇది నిజంగా రేర్ కాంబినేషన్ అనే చెప్పాలి. ఇందులో యువ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ ముఖ్య పాత్ర పోషించనుండడం మరో విశేషం. కాగా దర్శకుడు బాలా తన బీ.స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మరో ప్రత్యేకత సంగీత జ్ఞాని ఇళయరాజా. ఈయన సంగీత బాణీలందిస్తున్న ఈ చిత్రానికి నాచియార్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. చిత్రం మంగళవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. కాగా ఇది సైకో థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రం అని, ఇందులో జ్యోతిక పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సైకోగా నటుడు జీవీ నటిస్తున్నట్లు టాక్. చిత్ర రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి సెప్టెంబర్ నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట. -
విజయ్‌కు నో.. బాలాకు ఎస్
టీనగర్: విజయ్ చిత్రానికి నో చెప్పిన నటి జ్యోతిక బాలా చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ‘తెరి’ చిత్రం తర్వాత విజయ్ నటించే చిత్రానికి రెండవసారి అట్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్, సమంత, జ్యోతిక నటిస్తున్నారు. జ్యోతిక వద్ద దర్శకుడు అట్లి కథ చెబుతుండగా ఆమె కొన్ని మార్పులు చెప్పినట్లు సమాచారం. అందుకు ఓకే చెప్పిన అట్లి ఆ తర్వాత దాని గురించి బదులేమీ చెప్పకుండా చిత్రం షూటింగ్ ప్రారంభించారు. దీంతో జ్యోతిక నిరుత్సాహపడి ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బ్రహ్మ దర్శకత్వంలో ‘మగలిర్ మట్టుం’ చిత్రంలో నటిస్తున్నారు జ్యోతిక. హీరోయిన్ ఓరియెంటెడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇలావుండగా ఈఓఎన్ అనే చిత్ర నిర్మాణ సంస్థ, దర్శకుడు బాలా బీ స్టూడియోస్‌తో కలిసి కొత్త చిత్రం రూపొందుతోంది. ఇందులో ప్రముఖ హీరో నటించనున్నారు. ముందుగా ముఖ్యమైన కథాపాత్రలో నటింపజేసేందుకు జ్యోతికను ఒప్పందం చేసుకున్నారు బాలా. మార్చి ఒకటవ తేదీన ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. శశికుమార్, వరలక్ష్మి నటించిన ‘తారై తప్పటై’ చిత్రం తర్వాత ఈ చిత్రాన్ని బాలా రూపొందించడం విశేషం.