బాలా షరతులు బాగానే పనిచేశాయి | varalaxmi to work with director Bala! | Sakshi
Sakshi News home page

బాలా షరతులు బాగానే పనిచేశాయి

Published Sat, Jun 14 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM

బాలా షరతులు బాగానే పనిచేశాయి

బాలా షరతులు బాగానే పనిచేశాయి

దర్శకుడు బాలా చిత్రాల్లో నటులెవరైనా సరే కథా పాత్రలే కనిపిస్తాయి. నటీనటుల పాత్రధారణల్లో ఆయన అంతగా శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సేతు పితామగన్ చిత్రాల్లో విక్రమ్ పాత్రధారణ, నందాలో సూర్య, నాన్ కడవుల్‌లో ఆర్య, అవన్ ఇవన్ చిత్రంలో విశాల్, ఆర్యలను బాలా ఎలా మార్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి బాలా ప్రస్తుతం తారై తప్పట్టై చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దర్శక, నిర్మాత, నటుడు శశికుమార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా వరలక్ష్మి ని ఎంపిక చేసుకున్నారు.

బాలా చిత్రాల్లో కథానాయకుడితో పాటు కథానాయిక పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఈ సారి కరగాటకార కళను చిత్ర ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. నృత్యంలో ప్రవేశం ఉన్న నటి అవసరమవ్వడంతో ఆ అదృష్టం నటి వరలక్ష్మిశరత్‌కుమార్‌ని వరించింది. నటుడు విశాల్ సిఫార్సు, ఆమె పొట్ట అవకాశం రావడానికి పనిచేశాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. కరగాట కళాకారులకు కాస్త పొట్ట కనిపించాలట.

నటి వరలక్ష్మిని ఆడిషన్ చేసిన బాలా గత నెలలో శశికుమార్, వరలక్ష్మిలకు ఫొటో షూట్ నిర్వహించారట. అందులో నటి వరలక్ష్మి పొట్ట పరిధికి మించి ఉన్నట్లు అనిపించడంతో ఆమెకు కొన్ని షరత్తులు విధించారట. పొట్ట తగ్గించాలని సూచించారట. పార్టీలకు, పబ్‌లకు వెళ్లరాదని, వెళ్లినా అక్కడ గ్లాసు పట్టరాదం టూ హెచ్చరించారట. బాలా షరతుల కారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం తన బరువును 12 కిలోలు తగ్గించారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement