Casting the roles of actors
-
సల్మాన్ పేరుతో మోసం!
‘‘నా పేరుని దుర్వినియోగం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సల్మాన్‌ఖాన్. ‘సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్’(ఎస్కేఎఫ్) అనే నిర్మాణ సంస్థను స్థాపించి సల్మాన్ సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఎస్కేఎఫ్’లో నిర్మించనున్న సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా పలువురికి ఫేక్ ఈ–మెయిల్స్ అందుతున్నాయట. ఈ విషయంపై సల్మాన్ స్పందించారు. ‘‘నేను నటించబోతున్న సినిమాల్లో కానీ, ఎస్కేఎఫ్ సంస్థలో నిర్మించబోతున్న సినిమాల కోసం కానీ ప్రస్తుతం ఏ క్యాస్టింగ్ (నటీనటుల ఎంపిక) జరగడం లేదు. మేం ఎటువంటి క్యాస్టింగ్ ఏజెంట్స్‌ని నియమించలేదు. మా సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామన్నట్లుగా వస్తున్న ఈ మెయిల్స్, మెసేజ్‌లను, వార్తలను నమ్మవద్దు. ఎస్కేఎఫ్ బ్రాండ్‌ను, అలాగే నా పేరును దుర్వినియోగం చేసినవారి పట్ల చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని సల్మాన్‌ఖాన్ పేర్కొన్నారు. -
ఎన్టీఆర్ బయోపిక్.. ప్రధాన సమస్య అదే!
సాక్షి, సినిమా : ఇంకా సెట్స్ మీదకు వెళ్లక ముందే ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు తేజకు ముచ్చెమటలు పోయిస్తోంది. ముఖ్యంగా తారాగణం విషయంలోనే దర్శకుడు గందరగోళంలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నటీనటులకు సంబంధించి ఒక్క బాలయ్య మినహాయించి ఇంత దాకా ఎవరి పేరును అధికారికంగా ప్రకటించలేదు. ఎన్టీఆర్ జీవితంలోని పాత్రలకు దగ్గరి పోలికలు ఉండాలన్న కారణంగానే కాస్టింగ్ ఎంపికలోనే జాప్యం జరుగుతోంది. ఇందుకోసం హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ టీమ్ చాలా కష్టపడింది. ఇప్పటిదాకా మొత్తం 72 పాత్రలకు సంబంధించిన నమునాలను(స్కెచ్లను) వారు అందజేశారంట. దీంతో వాటికి తగ్గట్లు ఉండే వ్యక్తులను ఎంపిక చేసే పనిలో తేజ బిజీగా ఉన్నాడు. ఈ పనుల మూలంగానే ‘ఎన్టీఆర్’ చిత్రం సెట్స్ మీదకు వెళ్లటం ఆలస్యమౌతోంది. మరోవైపు బయోపిక్ పనుల జాప్యంపై బాలయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనే మరో వార్త వినిపిస్తోంది. ఏది ఏమైనా వీలైనంత త్వరలో చిత్రాన్ని లాంఛ్ చేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టాలని తేజ డిసైడ్ అయ్యాడు. అదే రోజు టీజర్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో ‘ఎన్టీఆర్’ తెరకెక్కనుంది. -
బాలా షరతులు బాగానే పనిచేశాయి
దర్శకుడు బాలా చిత్రాల్లో నటులెవరైనా సరే కథా పాత్రలే కనిపిస్తాయి. నటీనటుల పాత్రధారణల్లో ఆయన అంతగా శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. సేతు పితామగన్ చిత్రాల్లో విక్రమ్ పాత్రధారణ, నందాలో సూర్య, నాన్ కడవుల్లో ఆర్య, అవన్ ఇవన్ చిత్రంలో విశాల్, ఆర్యలను బాలా ఎలా మార్చారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి బాలా ప్రస్తుతం తారై తప్పట్టై చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. దర్శక, నిర్మాత, నటుడు శశికుమార్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్గా వరలక్ష్మి ని ఎంపిక చేసుకున్నారు. బాలా చిత్రాల్లో కథానాయకుడితో పాటు కథానాయిక పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకుడు ఈ సారి కరగాటకార కళను చిత్ర ప్రధాన ఇతివృత్తంగా తీసుకున్నారు. నృత్యంలో ప్రవేశం ఉన్న నటి అవసరమవ్వడంతో ఆ అదృష్టం నటి వరలక్ష్మిశరత్కుమార్ని వరించింది. నటుడు విశాల్ సిఫార్సు, ఆమె పొట్ట అవకాశం రావడానికి పనిచేశాయంటున్నారు కోలీవుడ్ వర్గాలు. కరగాట కళాకారులకు కాస్త పొట్ట కనిపించాలట. నటి వరలక్ష్మిని ఆడిషన్ చేసిన బాలా గత నెలలో శశికుమార్, వరలక్ష్మిలకు ఫొటో షూట్ నిర్వహించారట. అందులో నటి వరలక్ష్మి పొట్ట పరిధికి మించి ఉన్నట్లు అనిపించడంతో ఆమెకు కొన్ని షరత్తులు విధించారట. పొట్ట తగ్గించాలని సూచించారట. పార్టీలకు, పబ్‌లకు వెళ్లరాదని, వెళ్లినా అక్కడ గ్లాసు పట్టరాదం టూ హెచ్చరించారట. బాలా షరతుల కారణంగా వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రస్తుతం తన బరువును 12 కిలోలు తగ్గించారట.