
దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వాడు వీడు’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు విశాల్, ఆర్య. ఇప్పుడు ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఇది యాక్షన్ ఎంటర్‌టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో విశాల్, ఆర్య ఒకరి మీద మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకోనున్నారట. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. చిత్రీకరణలో పాల్గొంటున్న వీడియోను షేర్ చేసి, ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కొత్త టీమ్. కొత్త లుక్. కొత్త సినిమా’’ అన్నారు విశాల్. ఇందులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళినీ రవి హీరోయిన్‌గా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment