‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు.
డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్‌టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment