Arya
-
డ్యాన్స్‌తో దుమ్మురేపిన స్టార్ హీరో సతీమణి.. రీఎంట్రీ కోసం ప్లాన్
నటనకు ఎల్లలు ఎలాగైతే లేవో ప్రేమకు సరిహద్దులు ఉండవు. దీనికి చిన్న ఉదాహరణ నటుడు ఆర్య, నటి ఆయేషాసైగల్. ప్రేమబంధం ఎప్పుడు ఎవరితో ముడిపడుతుందో ఎవరికి తెలియదు. కోలీవుడ్‌లో ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్న ఆర్యకు, బాలీవుడ్ భామ ఆయేషా సైగల్‌కు (Sayyeshaa Saigal) అలా ప్రేమబంధం ముడిపడింది. అఖిల్ అనే తెలుగు చిత్రం ద్వారా కథానాయికిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీని దర్శకుడు విజయ్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. నటుడు రవిమోహన్‌కు జంటగా వనమగన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినా, ఆయేషా సైగల్ మాత్రం మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆ తరువాత తమిళంతో పాటు కన్నడం, హిందీ భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను అందుకోలేకపోయారు. కాగా ఆర్యకు జంటగా గజినీకాంత్ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఆయనతో పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది. ఇరు కుటుంబసభ్యుల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. వివాహనంతరం ఆయేషా సైగల్ నటనకు బ్రేక్ ఇచ్చారు. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. దీంతో ఆయేషా సైగల్ మళ్లీ నటనపై దృష్టి సారించారు. అందుకోసం తన వంతు ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు. అందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. మరో విషయం ఏమిటంటే ఆయేషా సైగల్ మంచి డాన్సర్. తన డాన్స్ రీల్స్‌ను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు పని చెబుతూ ఉంటారు. అలా తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. 2013లో విడుదలైన రేస్–2 చిత్రంలోని లాట్ లక్ కయీ అనే పాటకు ఆమె డాన్స్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు అమ్మ అయితే మాత్రం డాన్స్ ఆడకూడదా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా త్వరలో ఆర్య, ఆయేషా జంటగా కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
ఆర్య హీరోగా వస్తోన్న స్పై థ్రిల్లర్.. తెలుగు టీజర్ వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ ఆర్య హీరోగా నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ఎక్స్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. గూఢచారుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే తమిళ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.భారతీయ గూఢచర్య వీరుల జీవితాల ఆధారంగా ఈ కథను తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. దేశాన్ని కాపాడటం మన పని మాత్రమే కాదు.. అది మన బాధ్యత.. అంటూ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. శత్రువుల నుంచి మనదేశాన్ని కాపాడే నేపథ్యంలో ఈ కథను రూపొందించారు. ప్రధానంగా ఓ న్యూక్లియర్ డివైజ్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని టీజర్లోనే తెలుస్తోంది. కాగా.. ఈ స్పై థ్రిల్లర్ సినిమాను వినీత్ జైన్, ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో గౌతమ్ రామ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘా, రైజా విల్సన్, అతుల్య రవి, జయప్రకాష్, కాళి వెంకట్ కీలక పాత్రల్లో నటించారు. -
1965 నందాదేవి స్పై మిషన్‌పై సినిమా.. టీజర్ విడుదల
కోలీవుడ్‌లో గతేడాదిలో విడుదలైన లబ్బర్ బంతు సినిమా భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం తెలుగు వర్షన్ హాట్‌స్టార్‌లో విడుదయ అయిన తర్వాత ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. అలాంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణన్ కుమార్, ఎ. వెంకటేష్‌తో కలిసి నిర్మిస్తున్న తాజా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రం 'మిస్టర్ ఎక్స్'.. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. కోలీవుడ్‌లో ఎఫ్ఐఆర్ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఫ్రేమ్ మను ఆనంద్ ఈ మూవీకి దర్శకత్వం అందిస్తున్నారు. 'మిస్టర్ ఎక్స్' చిత్రంలో ఆర్య కథానాయకుడుగానూ, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ ,నటి మంజు వారియర్, అనకా, అతుల్య రవి, రైసా విల్సన్, ఖాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రుల్లోనూ నటిస్తున్నారు. టీజర్ విడుదల తర్వాత నటుడు ఆర్య మాట్లాడుతూ ఇందులో నటించడానికి తనకు సిఫార్సు చేసింది నిర్మాత ఎస్ లక్ష్మణన్ కుమార్ అని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ కథ చెప్పగానే ఇందుకు చాలా భారీ బడ్జెట్ అవుతుంది కదా అని నిర్మాతలతో చెప్పగా ప్రేక్షకులకు ఆశ్చర్యకరమైన అనుభవాన్ని ఇవ్వాలంటే రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాల్సిందే అని చెప్పారన్నారు. నటుడు గౌతమ్ కార్తీక్ మాట్లాడుతూ ఈ చిత్రం తాను ఊహించిన దానికంటే 100 రెట్లు అధికంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం కండలు పెంచి నటించారన్నారు. తనకు తెలిసి ఈయన కోలీవుడ్ హల్క్ అని పేర్కొన్నారు. నిర్మాత ఎస్. లక్ష్మణన్ కుమార్ మాట్లాడుతూ ఇది చాలా కాలం పాటు ప్రణాళికను సిద్ధం చేసి రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. దర్శకుడు మను ఆనంద్ చెప్పిన ఏ విషయం నమ్మశక్యంగా లేదని అయితే ఆయన చెప్పిన నాలుగు విషయాలు మాత్రం ఎంతో నమ్మశక్యం అనిపించాయన్నారు. చైనాను టార్గెట్ చేసేందుకు1965లో భారత సైనికులు చైనాను ఎదుర్కొనడానికి హిమాలయాల్లో ఉన్న నందాదేవి అనే కొండపైకి ఏడు బ్లుటోనియం క్యాప్షల్స్‌ను తీసుకెళ్తారని అయితే అవి అనుహ్యంగా కనిపించకుండా పోతాయన్నారు. వాటి గురించి ఇప్పటివరకు ఆచూకీ లేదన్నారు. అలాంటి న్యూక్లియర్ క్యాప్సిల్స్ నేపథ్యంలో సాగే కథే మిస్టర్ ఎక్స్ చిత్రం చెప్పారు. తాను దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఎఫ్ఐఆర్ లేకుంటే ఈ చిత్రం అవకాశం తనకు వచ్చేది కాదని దర్శకుడు మను ఆనంద్ పేర్కొన్నారు. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.నందాదేవి మిస్టరీ ఇదేచైనా, భారత్ యుద్ధం ముగిసిన తర్వాత చైనా మిలటరీపై ఇండియా నిఘా పెట్టింది. ఈ క్రమంలో అమెరికాతో భారత్ చేతులు కలిపింది. 1965లో అమెరికా, భారత్ సంయుక్తంగా నందాదేవి పర్వతంపై ఒక అణుశక్తి పరికరాన్ని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశాయి. అందుకోసం ట్రాన్స్ రిసీవర్స్‌తో పాటు అణుశక్తి ఉత్పాదక జనరేటర్, అణు ఇంధనమైన ఫ్లుటోనియంను నందాదేవి కొండపైకి తీసుకెళ్లారు. కానీ, అక్కడి వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా ప్రమాదకరంగా మారడంతో వాటిని అక్కడే వదిలేసి కొండ నుంచి తిరిగొచ్చారు. 1966లో తిరిగి అక్కడికి వెళ్లేసరికి పరికరాలు కనిపించలేదు. అక్కడ పూర్తిగా మంచు కప్పుకొని ఉంది. దీంతో సరైన ప్రదేశం గుర్తించలేక తిరిగొచ్చేశారు. అయితే, 2005లో అనూహ్యంగా ఈ ఫ్లుటోనియం జాడలు కింద ప్రవహిస్తున్న నదుల్లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఫ్లుటోనియం వల్లే మంచు కరిగే ప్రమాదం ఉందని అంచనా వుంది. ఈ మూలకం జీవితకాలం వందేళ్లుగా ఉంది. వచ్చే 40 ఏళ్లలో ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయోనని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన చెందుతున్నారు. దీనిని మరో మానవ తప్పిదంగా వారు చెప్పుకొస్తున్నారు. -
గెట్... సెట్... గో
స్పోర్ట్స్ మూవీస్‌కి ఆడియన్స్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఈ తరహా సినిమాలు ఏమాత్రం ఆడియన్స్‌కి కనెక్ట్ అయినా బాక్సాఫీస్ స్కోర్స్ (కలెక్షన్స్) కొత్త రికార్డులు సృష్టిస్తాయి. దీంతో వీలైనప్పుడల్లా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తుంటారు యాక్టర్స్. ఇలా ప్రస్తుతం సెట్స్‌లో ‘గెట్..సెట్..గో’ అంటూ సిల్వర్ స్క్రీన్ కోసం స్పోర్ట్స్ ఆడుతున్న కొందరు హీరోల గురించి తెలుసుకుందాం.పెద్ది... ప్లే స్టార్ట్‘రచ్చ, ఆరెంజ్’... ఇలా కొన్ని సినిమాల్లో రామ్‌చరణ్ క్రికెట్ ఆడిన సన్నివేశాలు చాలా తక్కువ నిడివిలో కనిపిస్తాయి. కానీ ‘పెద్ది’ సినిమాలో మాత్రం ఫుల్ మ్యాచ్ ఆడనున్నారట రామ్‌చరణ్. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్‌చరణ్ క్రికెటర్‌గా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది. చివరి రోజు తన కుమార్తె క్లీంకారని సెట్స్‌కి తీసుకొచ్చారు రామ్‌చరణ్.అలాగే ఈ సినిమాలో క్రికెట్‌తోపాటు కబడ్డీ వంటి ఇతర స్పోర్ట్స్ల ప్రస్తావన కూడా ఉంటుందట. జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తున్న ఈ మూవీలో దివ్యేందు, జగపతిబాబు, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్స్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ మూవీని ఈ దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలిసింది.ఒక మ్యాచ్.... మూడు జీవితాలు!మాధవన్ , నయనతార, సిద్ధార్థ్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘టెస్ట్’. ఈ స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌కి శశికాంత్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది. ఈ చిత్రంలో క్రికెటర్‌గా నటించారు సిద్ధార్థ్. చక్రవర్తి రామచంద్రన్, శశి కాంత్ నిర్మించిన ఈ మూవీ త్వరలోనే డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ కానుంది. ఒక టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని కోలీవుడ్ సమాచారం. ఇక 2006లో వచ్చిన హిందీ చిత్రం ‘రంగ్ దే బసంతి’ తర్వాత మళ్లీ 18 సంవత్సరాల అనంతరం మాధవన్ , సిద్ధార్థ్ కలిసి నటించిన చిత్రం ఇదే.జల్లికట్టు నేపథ్యంలో...తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు. ఈ క్రీడ నేపథ్యంలో చాలా సినిమాలొచ్చాయి. కాగా సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో ‘వాడి వాసల్’ అనే పీరియాడికల్ యాక్షన్ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రకటించారు. కానీ వివిధ కారణాల వల్ల సెట్స్‌పైకి వెళ్లలేదు. దీంతో ఈ ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకుని వెళ్లాలని సూర్య, వెట్రిమారన్ ప్లాన్ చేశారు. జనవరిలో సూర్య, వెట్రిమారన్, ఈ చిత్రనిర్మాత కలైపులి .ఎస్ థానుల మధ్య ‘వాడి వాసల్’ గురించిన చర్చలు కూడా జరిగాయి. ఇక ఎప్పట్నుంచో ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి, ఈ చిత్రం ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. ‘వాడి వాసల్’ రెండు భాగాలుగా విడుదల కానుందని తెలిసింది.మరోసారి బాక్సింగ్ధనుష్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘ఇడ్లీ కడై’. ఈ మూవీలో అరుణ్ విజయ్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అరుణ్ విజయ్ ఓ బాక్సర్ రోల్ చేస్తున్నారు. కాగా అరుణ్ విజయ్ బాక్సర్‌గా కనిపించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ‘బాక్సర్’ అనే మూవీలో అరుణ్ విజయ్ బాక్సర్‌గా నటించారు. అయితే ‘బాక్సర్’ కంప్లీట్ స్పోర్ట్స్ ఫిల్మ్ కాగా, ‘ఇడ్లీ కడై’ మాత్రం స్పోర్ట్స్‌తోపాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్న మూవీ. ధనుష్, ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కా నుంది. నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో షాలినీపాండే, సత్యరాజ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.కె–ర్యాంప్‘క’ వంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘కె–ర్యాంప్’. ఈ చిత్రం టైటిల్ లోగోలో ఓ వ్యక్తి ఫుట్‌బాల్ ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఊహించవచ్చు. జైన్స్ నాని దర్శకత్వంలో రాజేశ్ దండ నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. యుక్తీ తరేజా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వీకే నరేశ్, ‘వెన్నెల’ కిశోర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు.రేస్ రాజాహీరో శర్వానంద్ బైక్ రేసింగ్‌తో బిజీగా ఉన్నారు. శర్వా నంద్ హీరోగా అభిలాష్ కంకర్ డైరెక్షన్లో ‘రేజ్ రాజా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో మోటారు బైకు రేసర్‌గా శర్వానంద్ నటిస్తున్నారు. 1990 నుంచి 2000ల మధ్య కాలంలో జరిగే ఈ స్పోర్ట్స్ మూవీలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే... స్పోర్ట్స్ డ్రామా జానర్లో సినిమాలు చేసిన అనుభవం శర్వానంద్‌కు ఉంది. ‘మళ్ళీ మళ్లీ ఇది రాని రోజు (2015)’ మూవీలో రన్నింగ్ రేసర్‌గా, ‘పడి పడి లేచే మనసు (2018)’ మూవీలో ఫుట్‌బాల్ ప్లేయర్‌గా శర్వానంద్ నటించి, మెప్పించిన సంగతి తెలిసిందే.బాక్సింగ్ రౌండ్ 2హీరో ఆర్య, దర్శకుడుపా. రంజిత్ కాంబినేషన్లో వచ్చిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ‘సార్పట్టై పరంబర’. ఈ మూవీ 2021లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా 2023 మార్చిలో ‘సార్పట్టై పరంబర రౌండ్ 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించారు. అయితే తొలి భాగం మాదిరి, రెండో భాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు మేకర్స్. కబడ్డీ... కబడ్డీ..ధృవ్ విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీ ‘బైసన్: కాలమాడన్’. మారి సెల్వరాజ్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ధృవ్ విక్రమ్ కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అలాగే కబడ్డీ ప్లేయర్‌గా కెరీర్‌ను మొదలుపెట్టి, రాజకీయ నాయకుడిగా మారిన మనత్తి పి. గణేశన్ జీవితం ఆధారంగా ‘బైసన్’ మూవీ రూపొందుతోంని కోలీవుడ్ సమాచారం. అ΄్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలంప్రోడక్షన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే విడుదల కానుంది.- ముసిమి శివాంజనేయులు -
తెలుగులో తొలి సినిమా.. 16 ఏళ్ల పెద్ద హీరోతో పెళ్లి.. ఈమెని గుర్తుపట్టారా?
ఇప్పుడు హీరోయిన్లలో చాలామంది ఇంకా పెళ్లే చేసుకోవట్లేదు. అలాంటిది ఈమె తనకంటే వయసులో 16 ఏళ్లు పెద్దోడు అయిన హీరోని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగులో ఈమె తొలి సినిమా చేసింది. కానీ బ్యాడ్ లక్. ఈ హీరోయిన్ ఫ్యామిలీ కూడా తరతరాలుగా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు సాయేషా సైగల్. పాప ఈమె కూతురే. పక్కన నిలబడ్డ పెద్దావిడ పేరు సహిన్ భాను. ఈమె సాయేషా తల్లి. రీసెంట్గా కలిసినప్పుడు ఈ ఫొటోని తీసుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులైన దిలీప్ కుమార్, సైరా భానుల మనవరాలే సాయేషా. సినీ కుటుంబం కావడంతో సులభంగానే హీరోయిన్ అయిపోయింది. అక్కినేని అఖిల్ తొలి సినిమా 'అఖిల్'తో హీరోయిన్గా అరంగేట్రం చేసింది. కానీ మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తెలుగులో మరో మూవీ చేయలేదు.అదే టైంలో తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. దాదాపు అరడజనుకి పైగా చిత్రాల్లో నటించింది. అలా చేస్తున్న టైంలో హీరో ఆర్యతో పరిచయం, ఆ తర్వాత అదికాస్త ప్రేమగా మారింది. వయసు చాలా వ్యత్యాసం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఓ పాప కూడా పుట్టింది. ప్రస్తుతం సాయేషా సినిమాలేం చేయట్లేదు. కుటుంబానికే పూర్తి ప్రాధాన్యం ఇస్తోంది. రీసెంట్గా అలా తల్లితో కలిసి తీసుకున్న ఫొటోలే ఇవి.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) -
చిన్న రైతులకు అ‘ధన’పు తోడ్పాటు
చిన్న, సన్నకారు రైతులు పండించిన ధాన్యానికి అనదపు విలువను జోడిస్తూ వ్యవసాయాన్ని మరింత లాభదాయకం చేయడంలో కృషి చేస్తోంది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆర్య.ఏజీ’. తాజాగా రిత్ సమ్మిట్ 2.0 పేరుతో 200 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను (FPO) మరింత ఆకర్షణీయమైన, లాభదాయక సంస్థలుగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక సహకారంతో సాగు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ, లాభదాయకమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చొరవను ప్రారంభించింది.ఈ నేపథ్యంలో రైతులకు ఉత్పత్తుల నిల్వ, మార్కెట్‌తో పాటు రుణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్య.ఏజీ సంస్థ ఎలా ఏర్పాటైంది.. రైతులకు ఎలాంటి సేవలు అందిస్తోంది.. టెక్నాలజీ పరంగా పెరిగిన సౌలభ్యాలు.. తదితర అంశాలపై సాక్షి బిజినెస్ వెబ్ డెస్క్ ఆర్య.ఏజీ మేనేజింగ్ డైరెక్టర్ చట్టనాథన్ దేవరాజన్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా వారు వెల్లడించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా ఏర్పాటైంది?నాథన్: నేను, ప్రసన్నరావు, ఆనంద్ చంద్ర అనే మరో ఇద్దరితో కలిసి ఆర్య.ఏజీని ప్రారంభించాం. మొదట నష్టాల్లో ఉన్న ఆర్య కొలేటరల్స్ అనే సంస్థను కొనుగోలు చేశాం. తర్వాత దీన్ని ఆర్య.ఏజీ పేరుతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చిదిద్దాం.సాక్షి: ఆర్య.ఏజీ ఎలా పని చేస్తుంది?నాథన్: మా సంస్థ ప్రధానంగా మూడు విభాగాలుగా పనిచేస్తుంది. ఆర్య.ఏజీ కింద ఆర్య కొలేటరల్ వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యధన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్యటెక్ ప్లాట్‌ఫారమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ విభాగాలు ఉన్నాయి. ఈ మూడింటినీ సమ్మిళితం చేసి రైతులకు సేవలు అందిస్తున్నాం.సాక్షి: రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు?నాథన్: దేశంలో అత్యధికమంది చిన్న, సన్నకారు రైతులే. వీరికి ప్రధాన సమస్య దిగుబడిని నిల్వ చేయడం. ప్రధానంగా ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. దీంతో పాటు వారికి దిగుబడులకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఈలోపు అవసరమున్న రైతులకు దిగుబడులపై రుణ సదుపాయం కూడా కల్పిస్తున్నాం.సాక్షి: ఎలాంటి దిగుబడులకు స్టోరేజ్ కల్పిస్తున్నారు.. సామర్థ్యం ఎంత?నాథన్: మాది ప్రధానంగా గ్రెయిన్ కామర్స్ ప్లాట్‌ఫామ్. అంటే అన్ని రకాల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్, మార్కెటింగ్, ఫైనాన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. సీజన్‌ను బట్టి దేశవ్యాప్తంగా 3000 వేర్‌హౌస్‌లను నిర్వహిస్తున్నాం. 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులకు స్టోరేజ్ సదుపాయం కల్పిస్తున్నాం.సాక్షి: ఎక్కడెక్కడ మీ కార్యకలాపాలు ఉన్నాయి?నాథన్: కొన్ని ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. స్థానిక సంస్థలు, ప్రభుత్వాల సహకారంతో రైతులకు సేవలు అందిస్తున్నాం. -
హీరో సతీమణి రీఎంట్రీ.. వైరల్ అవుతున్న డ్యాన్స్ వీడియో
‘అఖిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్ బాలీవుడ్ నటదిగ్గజం దిలీప్‌కుమార్ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. అయితే, వివాహం తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ మళ్లీ వెండితెరపై మెరిసేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆమె పంచుకుంటున్న ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.సాయేషా సినిమాలకు దూరంగా ఉన్నా, సోషల్‌మీడియా వల్ల ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటుంది. తమిళంలో జయంరవికి జంటగా వనమగన్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం తర్వాత ఈ బ్యూటీకి మాత్రం వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా కార్తీ, విజయ్‌సేతుపతి, సూర్య, ఆర్యతో పలు చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో నటుడు ఆర్యతో పరిచయం ప్రేమగా మారడంతో ఇరు కుటుంబాల సమ్మతితో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక అందమైన బేబీ కూడా పుట్టింది. దీంతో సాయేషా నటనకు దూరం అయింది. నటనకు దూరమైనా ఈమె సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తరచూ వారితో ముచ్చటించడం, తన ఫొటోలను పొందుపరచడం వంటివి చేస్తుంది. ఇకపోతే సాయేషాలో మంచి డాన్సర్ ఉన్నారనే విషయం తెలిసిందే. అదేవిధంగా మళ్లీ నటిగా రీఎంట్రీకి ఆసక్తి చూపుతుంది. దీంతో త్వరలోనే తన భర్త ఆర్యతో కలసి ఒక చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో సాయేషా ఒక వీడియోను తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేసింది. అందులో ఆమె గురు చిత్రంలోని మైయా మైయా అనే పాటకు సూపర్‌గా స్టెప్స్ వేసింది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సాయేషా డాన్స్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు. View this post on Instagram A post shared by Sayyeshaa (@sayyeshaa) -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన టాలీవుడ్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!
ప్రముఖ నటి శ్రద్ధా ఆర్య అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 2021లో నావీ అధికారి రాహుల్ నాగల్‌ను ఈ బాలీవుడ్ భామ పెళ్లి చేసుకుంది. తొలిసారి గర్భం ధరించిన విషయాన్ని తెలియజేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇది తెలుసుకున్న బాలీవుడ్ తారలు, అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఢిల్లీకి చెందిన శ్రద్ధా ఆర్య 2006లో కల్వనిన్ కదాలి అనే తమిళ సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ నిశ్శబ్ద్ చిత్రంలో నటించింది. తెలుగులో 2007లో కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించిన గొడవ అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత రోమియో, కోతిమూక లాంటి టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. బాలీవుడ్లో చివరిసారిగా రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీలో మెరిసింది. అంతేకాకుండా హిందీలో పలు సీరియల్స్‌తో శ్రద్ధా ఆర్య గుర్తింపు తెచ్చుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
Abhinayashree Photos: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
-
ఆ మాట అనగానే నాకు కోపం వచ్చేసింది: అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ వేడుకలో సుకుమార్, అల్లు అరవింద్, దిల్‌రాజు లాంటి ప్రముఖులంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆర్య రిలీజ్ తర్వాత ఆ విషయంలో తనకు కోపం వచ్చిందని తెలిపారు.అల్లు అర్జున్ మాట్లాడుతూ..'సినిమా రిలీజయ్యాక ఆ రోజుల్లో 70 డేస్ కాదు.. 100 డేస్ ఆడితేనే సక్సెస్. రిలీజ్ రోజు నేను, సుకుమార్ థియేటర్‌కు వెళ్లి చూస్తే అప్పటికీ 40 శాతమే ఉంది. థియేటర్స్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతున్నాయి. మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. తీరా ఆ రోజు రిపోర్ట్ చూస్తే మాత్రం 10 వీక్స్ మాత్రమే అన్నారు. అప్పుడు నాకు ఏంటి ఇది 100 డేస్ సినిమా కాదా? అనిపించింది. కానీ నాకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.. సాయంత్రం కల్లా ఫుల్ అవుతుంది అన్నా. కచ్చితంగా రైజ్ అవుద్ది అని చెప్పా. ఇలాంటి సినిమాకు 70 రోజులంటేనే సక్సెస్ అయినట్లు అని చాలామంది అన్నారు. కానీ ఆ మాట అనగానే నాకు, సుకుమార్‌కు కోపమొచ్చేసింది. అలా ఒకరోజు అయిపోగానే నాన్న ఓ మాట అన్నారు. ఏంటి మొహం అలా పెట్టుకున్నావ్.. పదివారాలు అంటే పెద్ద సక్సెస్ తెలుసా? అని అన్నారు. ఏంటి 10 వీక్స్?..125 డేస్ షీల్డ్ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని చెప్పా. ఆ తర్వాత మెగాస్టార్ చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నా. అది నా పిచ్చి అనుకోండి. ఇంకేమైనా అనుకోండి. థ్యాంక్ యూ' అని అన్నారు. #TFNReels: Icon Star @alluarjun reminisces about his confidence in the #Arya movie result!🔥Watch Full Speech here - https://t.co/MwPKCcVoVm#20YearsForArya #AlluArjun #TeluguFilmNagar pic.twitter.com/C7bOUWk3Wl— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
20 ఏళ్లయినా అదే క్రేజ్.. స్టేజీపై అదరగొట్టేసింది!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అను మెహతా, శివబాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్య. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మే 7, 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం రిలీజై ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బన్నీ ఈ సినిమాను గుర్తు చేసుకున్నారు. ఆర్య కేవలం సినిమా మాత్రమే కాదు.. నా కెరీర్‌ను మలుపు తిప్పిన క్షణం అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌కు టాలీవుడ్ ప్రమఖులు హాజరయ్యారు.అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ సినీ ప్రియులను ఓ ఊపు ఊపేసిన సంగతి తెలిసిందే. 'అ అంటే అమలాపురం.. ఆ అంటే ఆహాపురం' ఓ రేంజ్లో అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌కు క్రేజ్ తగ్గలేదు. అయితే ఈ పాటకు డ్యాన్స్ చేసిన అభినయశ్రీ అందరికీ గుండెల్లో చోటు దక్కించుకుంది. తాజా ఈవెంట్‌కు హాజరైన ఆమె మరోసారి తన స్టెప్పులను అందరికీ పరిచయం చేసింది. అ అంటే అమలాపురం అంటూ డ్యాన్స్‌తో అదరగొట్టింది. 20 ఏళ్లయినా అదే స్టైల్‌తో డ్యాన్స్ చేసి అలరించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. #TFNExclusive: Talented Abinaya Satish Kumar grooves to ‘Aa Ante Amalapuram’ song at #20YearsForArya celebrations event!💃🔥#AlluArjun #Arya #TeluguFilmNagar pic.twitter.com/sPuRjK4wN5— Telugu FilmNagar (@telugufilmnagar) May 8, 2024 -
Allu Arjun HD Photos: ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’లో అల్లు అర్జున్ (ఫొటోలు)
-
Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
ఆర్య కథ వినగానే ఇది నా ఇడియట్ అనిపించింది: అల్లు అర్జున్
‘‘హీరో తరుణ్ నాకు మంచి ఫ్రెండ్. ‘దిల్’ సినిమా ప్రీమియర్‌కి తను పిలవడంతో వెళ్లాను. అక్కడ నన్ను చూసిన సుకుమార్‌గారు మరుసటి రోజు వచ్చి ‘ఆర్య’ కథ చెప్పారు.. మైండ్ బ్లోయింగ్‌గా నచ్చింది. ‘ఇడియట్’ మూవీ చూసి ఇలాంటి యూత్ సినిమా నాకు పడితే ఎలా ఉంటుంది? అనే కోరిక మనసులో ఉండేది. ‘ఆర్య’ కథని సుకుమార్‌గారు చెబుతున్నప్పుడు ఇది నా ‘ఇడియట్’ మూవీ కథ అనిపించింది’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయన హీరోగా, అనూ మెహతా జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. ఈ మూవీ ద్వారా సుకుమార్ దర్శకునిగా పరిచయమయ్యారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2004 మే 7న విడుదలైంది. ఈ చిత్రం విడుదలై 20 ఏళ్లు అయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ‘ఆర్య 20 ఇయర్స్ సెలబ్రేషన్స్’ నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ ఒక సినిమా మాత్రమే కాదు.. మా అందరి జీవితాలను మార్చింది. ఈ మూవీ 20ఏళ్ల వేడుకని నిర్వహించిన రాజుగారికి థ్యాంక్స్. నా జీవితాన్ని పూర్తీగా మార్చిన సినిమా ‘ఆర్య’. నా తొలి మూవీ ‘గంగోత్రి’ హిట్ అయింది. అయితే చూడ్డానికి నేనంత గొప్పగా లేనని ఆ తర్వాత మంచి సినిమాలేవీ రాలేదు. ఏడాది పాటు ఖాళీగా కూర్చున్నా. కానీ, రోజుకి మూడు కథలు వినేవాణ్ణి.. కానీ నచ్చేవి కాదు. ‘ఆర్య’ కథ బాగా నచ్చింది.. కానీ, సుకుమార్‌గారు సరిగ్గా తీయగలరా? లేదా? అనే చిన్న అనుమానం. వీవీ వినాయక్‌గారు ఇంటికొచ్చి.. నాన్నగారు(అల్లు అరవింద్), నాతో మాట్లాడి.. సుకుమార్ తీయగలడు.. అతన్ని నమ్మండి అన్నారు. ఆయన మాట నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ తర్వాత వారం రోజులు ట్రైల్ షూట్ చేస్తే అద్భుతంగా తీశారు సుకుమార్‌గారు. ఆ తర్వాత ధైర్యంగా ముందుకెళ్లాం.. సినిమా అద్భుతంగా వచ్చింది.. బ్లాక్ బస్టర్ అయింది. ఇందుకు సుకుమార్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ–‘‘ఆర్య’ వచ్చి 20 ఏళ్లు అయింది. ఆ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల కళ్లల్లో ఇప్పటికీ ఓ ఆనందం కనిపిస్తోంది. అది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ‘ఆర్య’ కి పనిచేసిన బన్నీ, నేను, సుకుమార్, దేవిశ్రీ, రత్నవేలు.. ఇలా అందరూ ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా టాప్ ΄÷జిషన్‌లో ఉన్నాం. ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది తెలుగు ఇండస్ట్రీనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ‘ఆర్య’ ప్రత్యేకమైన సినిమా. 20 ఏళ్ల తర్వాత కూడా అందరూ ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఉండటం అనేది గ్రేట్ మూమెంట్.. దీనికి కారణం సుకుమార్. ‘ఆర్య’ ప్రయాణాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపొలేను’’ అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ–‘‘ఆర్య’ నా తొలి చిత్రం కాబట్టి ప్రతి మూమెంట్ నాకు గుర్తుంది. ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్‌కి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ, అప్పట్లో లేవు. కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. ధైర్యం చేసి నాకు అవకాశం ఇచ్చిన రాజుగారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి పునాది బన్నీనే.. దాన్ని ఎప్పుడూ మరచిపొలేను’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత అల్లు అరవింద్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామేన్ రత్నవేలు, నటీనటులు అభినయశ్రీ, మధుమిత, శివ బాలాజీ, ‘చిత్రం’ శ్రీను, సుబ్బరాజు, బబ్లు, దేవి చరణ్, ‘ఆదిత్య’ మ్యూజిక్ నిరంజన్ పాల్గొన్నారు. -
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన తొలి సినిమా ఆర్య. 2004లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం..ఊహించని విజయం సాధించింది. అటు సుకుమార్, ఇటు బన్నీ ఇద్దరి సీనీ జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా విడుదలై నేటికి(మే 7) సరిగ్గా 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా బన్నీ ఫ్యాన్స్ ఆర్య సినిమాను గుర్తు చేసుకుంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఆర్య షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమది. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. స్వీట్ మెమొరీస్’ అంటూ ఆర్య సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ని ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేసుకున్నాడు.20 ఏళ్ల సెలబ్రేషన్స్ఆర్య సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ ప్లాన్ చేసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వేడుకకి అల్లు అర్జున్, సుకుమార్, దిల్ రాజుతో పాటు ఆర్య టీమ్ అంతా హాజరుకానుంది. ప్రస్తుతం బన్నీ.. పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న నాలుగో సినిమా ఇది. రష్మిక మందన్నా హీరోయిన్. ఫహద్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆగస్ట్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024Sweet Memories 🖤 #20yearsofArya pic.twitter.com/wp9cXaMeTB— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
నేషనల్ అవార్డ్ విన్నర్ 'అల్లు అర్జున్' అంటే పేరు కాదు ఒక బ్రాండ్ అనేలా తనను తాను మలుచుకున్నాడు. 'గంగోత్రి'తో ఇండస్ట్రీలో ఆయన ఎంట్రీ సులువుగానే జరిగిపోయింది. కానీ, 'ఆర్య' నుంచి తన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ఐకాన్ స్టార్‌గా ఎదిగాడు. బాక్సాఫీసు దగ్గర వసూళ్ల పరంగానే కాకుండా... పురస్కారాల్లోనూ తగ్గేదేలే అని చాటి చెప్పాడు. 'గంగోత్రి'లో అందర్నీ నటనతో కట్టిపడేసిన బన్ని.. తర్వాత వచ్చిన 'ఆర్య'తో తన మార్క్‌ను చూపించాడు. ఆర్య సినిమా బన్నీకి మాత్రమే కాదో ఎందరో జీవితాలను మార్చేసింది. ఆ సినిమాతో మొదలైన సుకుమార్- బన్నీ ప్రయాణం.. పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు వరకు చేరింది. అందుకే ఆర్య సినిమా వారందరికీ చాలా ప్రత్యేకం. సరిగ్గా నేటికి ఆర్య విడుదలై 20 సంవత్సరాలు అయింది.అల్లు అర్జున్ హీరోగా నటించిన రెండవ సినిమానే ఆర్య. సుకుమార్‌కు ఇదే మొదటి సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా 7 మే 2004లో విడుదలైంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఇందులో బన్నీకి జోడిగా అనురాధ మెహతా నటించింది. మొదటి ఆటతోనే 'ఫీల్ మై లవ్' అంటూ 'ఆర్య'తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఆర్య సినిమా తర్వాత బన్నికి కేవలం తెలుగులోనే కాదు, పొరుగు ఇండస్ట్రీల్లోనూ భారీగా క్రేజ్ వచ్చింది. ఇక్కడ అల్లు అర్జున్ను మనం ప్రేమగా బన్నీ అని పిలుచుకుంటే.. మలయాళం ప్రేక్షకులకు మల్లు అర్జున్ అయిపోయాడు. ఈ సినిమాతో అల్లు అర్జున్ కెరియరే మారిపోయింది. తనలోని డ్యాన్స్,నటన, స్టైల్ ఇలా అన్నీ తెరపై చూపించాడు. దీంతో ఒక్కసారిగా ఆయనకు చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు.ఆర్యతో మారిపోయిన జీవితాలుసుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య చిత్రం నేటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఎందరో జీవితాలని మార్చింది. నటుడిగా అల్లు అర్జున్, దర్శకుడిగా సుకుమార్, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌కి, డీఓపీగా రత్నవేలుకి, డిస్ట్రిబ్యూటర్‌గా బన్ని వాసుకి ఇలా చాలామందికి ఆర్య మంచి గుర్తింపునిచ్చింది. వారందరి కెరీర్లో ఒక మైలురాయిగా ఆర్య నిలిచిపోయింది. ఇలా ఎందరికో బ్రేక్ ఇచ్చిన ఆర్యను గుర్తు చేసుకుంటూ ఒక ఈవెంట్‌ను ప్లాన్ చేయాలని దిల్ రాజు ఉన్నారట. దీని నుంచి అధికారక ప్రకటన రాలేదు.అల్లు అర్జున్ రియాక్షన్ఆర్యకు 20 సంవత్సరాలు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవిత గమనాన్ని మార్చిన ఒక క్షణం. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. అని తెలిపాడు 20 years of Arya. It’s not just a movie … it’s a moment in time that changed the course of my life . Gratitude forever . pic.twitter.com/DIYyWIP7ig— Allu Arjun (@alluarjun) May 7, 2024 -
ఈ హీరోను గుర్తుపట్టారా? అప్పుడలా.. ఇప్పుడిలా..!
శరీరాన్ని నచ్చినట్లు మలచడం అంత ఈజీ కాదు. కానీ సినిమాతారలు మాత్రం ఒక్కోసారి ఒక్కో గెటప్‌లో కనిపిస్తారు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్.. అవసరమైతే ఫ్యామిలీ ప్యాక్‌లో కూడా దర్శనమిస్తారు. మళ్లీ యాక్షన్ మూవీ అనగానే వెంటనే కొవ్వును కరిగించేసుకుని.. కండలు తిరిగిన దేహం కోసం శ్రమిస్తారు. పైన కనిపిస్తున్న హీరో కూడా అదే చేశాడు. ఇంతకీ ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా? రాజా రాణి, వరుడు, సైజ్ జీరో, సైంధవ్ సినిమాలతో తెలుగులో బోలెడంత ఫేమ్ సంపాదించుకున్న ఆర్య. ఏడాదిగా కసరత్తులు తమిళంలో హీరోగా రాణిస్తున్న ఆర్య గతేడాది మిస్టర్ ఎక్స్ అనే సినిమా ఒప్పుకున్నాడు. లావుగా, కాస్త పొట్ట ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటో అప్పటిదే! సినిమాకు సంతకం చేసిన మరుసటి నెల నుంచే కసరత్తులు చేయడం ప్రారంభించాడు. కండలు తిరిగిన దేహాన్ని సొంతం చేసుకున్నాడు. 'గతేడాది మార్చిలో సినిమా ఒప్పుకున్నాను. ఏప్రిల్‌లో వర్కవుట్స్ స్టార్ట్ చేశా.. సెప్టెంబర్‌లో సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. చూస్తుండగానే ఏడాది అయిపోయింది. 2023 ఏప్రిల్‌లో.. 2024 మార్చిలో నా లుక్ ఇలా ఉంది' అంటూ ఫోటోలు షేర్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఇది చూసిన ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మిస్టర్ ఎక్స్ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందులో మంజు వారియర్, శరత్ కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గౌతమ్ కార్తీక్ విలన్‌గా నటిస్తున్నాడు. ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. View this post on Instagram A post shared by Arya (@aryaoffl) చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్.. విడిపోయామంటూ పోస్ట్.. -
భర్త చేతిలో మోసపోయిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. చివరికీ!
మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో ఆర్య ఒకరు. బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె మలయాళంలో చాలా సినిమాల్లో నటించింది. అంతే కాకుండా మలయాళ బిగ్‌బాస్ సీజన్-2లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్తో విడిపోవడానికి గల కారణాలను వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆర్య మాట్లాడుతూ.. 'ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తున్నా. వదిలించుకోవడానికే అతను నన్ను బిగ్ బాస్‌కి పంపాడా అనే అనుమానం ఉంది. ముఖ్యంగా షోలో వెళ్లడానికి నాకు మద్దతు ఇచ్చిన వ్యక్తి. నాకు ఓ కుమార్తె ఉంది. మా నాన్న చనిపోయి చాలా కాలం కూడా కాలేదు. బిగ్‌బాస్ వెళ్లమని ఆయనే నాకు సపోర్టు చేసి మరీ ఎయిర్‌పోర్టులో దింపారు. నాకు అక్కడ బిగ్‌బాస్‌లో ఉన్నన్ని రోజులు ఎవరితోనూ పరిచయం లేదు. నేను హౌస్ నుంచి వచ్చేలోగా నాకు దూరం కావాలనేది అతని ప్లాన్ అని తెలీదు. కానీ ఇది ఒక అవకాశం అని నేను భావిస్తున్నా' అని తెలిపింది. కొవిడ్ వల్ల నేను బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చి నా భర్తకు చాలాసార్లు కాల్ చేశా. కానీ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన ఏకైక నంబర్ అతనిదే. అతను ఫోన్ తీయకపోవడంతో.. నేను అతని సోదరికి ఫోన్ చేశా. ఆమె జరిగిన విషయమంతా నాకు చెప్పింది. అతని మరో మహిళ వివాహేతర సంబంధంలో ఉన్నాడని నాకు అప్పుడే తెలిసింది. దీంతో అతన్ని కాల్చి చంపాలన్నా కోపం వచ్చింది. కానీ ఇప్పుడైతే అలాంటి కోపం లేదు. కానీ అతనికి ఏదైనా చెడు జరిగిందని తెలిస్తే మాత్రం సంతోషిస్తా.' అంటూ తన కోపాన్ని బయటపెట్టింది. ఆ సమయంలో అతను దుబాయ్‌లో ఉన్నందున.. కొవిడ్ వల్ల అతన్ని కలిసేందుకు వీలు కాలేదని ఆర్య తెలిపింది. కాగా.. ఆర్య చివరిగా మలయాళ కామెడీ చిత్రం క్వీన్ ఎలిజబెత్‌లో నటించారు. ఈ చిత్రాన్ని ఎం పద్మకుమార్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్వేతా మీనన్, నరేన్, జానీ ఆంటోనీ, మీరా జాస్మిన్, నీనా కురుప్ ప్రముఖ పాత్రలు పోషించారు. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
స్టార్ హీరో తొలి వెబ్ సిరీస్.. ఆ ఒక్కదానికే రెండేళ్లు టైమ్!
ఇప్పుడంతా ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. దీంతో సినిమా హీరోలు కూడా చాలామంది వెబ్ సిరీస్‌లతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. నాగచైతన్య త్వరలో 'దూత' అనే సిరీస్‌తో రాబోతున్నాడు. దీనికంటే ముందు తమిళ స్టార్ హీరో ఆర్య.. 'ద విలేజ్' అనే హారర్ వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయ్. (ఇదీ చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. పాత టాలెంట్ బయటకు తీసిన హీరో నాని!) 'ద విలేజ్' సిరీస్ నవంబరు 24 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా.. ప్రైమ్ వీడియో ప్రెసిడెంట్ అపర్ణ పురోహిత్ హాజరయ్యారు. 'ది విలేజ్' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులని తాము నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ సిరీస్ కోసం దాదాపు నాలుగేళ్లు జర్నీ చేసినట్లు పేర్కొన్నారు. ఇకపోతే ఈ స్ట్రిప్ట్ని రాసి చదవడానికే రెండేళ్లు పట్టిందన్నారు. అలానే నటుడు ఆర్య నటించడానికి అంగీకరించడంతో ఇది చాలా భారీ సిరీస్ అయిందనే అభిప్రాయాన్ని అపర్ణ పురోహిత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగే పలు ఘటనలను ఒక చోటకు తీసుకురావడం ఎలా? అనే ఆసక్తికరమైన స్టోరీతో ఈ సిరీస్ తీసినట్లు నిర్మాత బీఎస్ రాధాకృష్ణ చెప్పారు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఫస్ట్ మూవీ హీరోయిన్) -
ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న స్టార్ హీరో.. టీజర్‌తోనే భయపెట్టేశాడు!
కోలీవుడ్ హీరో ఆర్య తెలుగువారికి కూడా సుపరిచితమే. తన సినిమాలతో టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ రోజుల్లో సినీ తారలు ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆర్య తొలి వెబ్ సిరీస్ 'ది విలేజ్' లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు మిలింద్ రాజు దర్శకత్వంలో.. బి.ఎస్. రాధాకృష్ణన్ నిర్మించారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ది విలేజ్ అనే గ్రాఫిక్ నవల ఆధారంగా హారర్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. టీజర్ రిలీజ్ చేసిన టీమ్.. రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన టీజర్ ఈ సిరీస్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్‌లో దివ్య పిళ్లై, ఆడుకాలం నరేన్, జార్జ్ మయన్, పూజా రామచంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాగా.. ఆర్య ప్రస్తుతం తెలుగులో సైంధవ్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వెంకటేశ్ హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూువీ 2024 జనవరి 13న విడుదల కానుంది. dare to venture into ‘the village' where darkness holds the secrets! 🌙#TheVillageOnPrime, Nov 24#Arya @milindrau #KiranKonda @thespcinemas @DivyaPillaioffl @ActorMuthukumar @Aazhiya_ @highonkokken @Poojaram22 @theabishekkumar #NaveenGeorgeThomas @ashwin_kkumar @arjunchdmbrm… pic.twitter.com/3muX5zC29w — prime video IN (@PrimeVideoIN) November 9, 2023 -
వారివల్లే ఈ ప్రయాణం సాధ్యమైంది
‘‘నా మొదటి సినిమా(కలియుగ పాండవులు) నుంచి ఇప్పుడు 75వ సినిమా ‘సైంధవ్’ వరకూ నన్ను ఎంతగానో ప్రేమించి, ఆదరించి, అభిమానిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ప్రేమ, అభిమానం, ఆప్యాయత వల్లే ఈ ప్రయాణం సాధ్యపడింది. ఇందుకు ప్రేక్షకులకు, నా అభిమానులకు, చిత్ర పరిశ్రమకు ధన్యవాదాలు’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేశ్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘సైంధవ్’. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ‘సైంధవ్’ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ వేడుకలో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘బలమైన భావోద్వేగాలు, యాక్షన్‌కి అవకాశం ఉన్న కథ ‘సైంధవ్’. కుటుంబ ప్రేక్షకులందరికీ సినిమా నచ్చుతుంది. ఇందులో నన్ను కొత్తగా చూస్తారు. గతంలో నా సినిమాలు ‘చంటి, కలిసుందాం రా, లక్ష్మి’ సంక్రాంతికి వచ్చి, హిట్ అయ్యాయి. ఇప్పుడు ‘సైంధవ్’ వస్తోంది. సంక్రాంతి రోజు ప్రేక్షకులు ఒక మంచి సినిమా చూడబోతున్నారు’’ అన్నారు. ‘‘ఈ మూవీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘‘వెంకటేశ్‌గారి ప్రతిష్టాత్మక 75వ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు శైలేష్ కొలను. ‘‘వెంకటేశ్‌గారితో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు వెంకట్ బోయనపల్లి. -
వెంకటేశ్ చిత్రంలో మరో స్టార్ హీరో.. ఎవరంటే?
వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం సైంధవ్. ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రంలో మరో హీరో నటిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: ఈ కాలమే.. మంచి ఫీల్ గుడ్ పాటలాగా ఉంది: మారుతి) ఆ హీరోకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో తమిళ స్టార్ ఆర్య ఈ చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. పోస్టర్లో ఆర్య లుక్ ఫ్యాన్సను తెగ ఆకట్టుకుంటోంది. తుపాకీ చేతపట్టి ఆర్య నడుస్తూ కనిపిస్తోన్న లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. కాగా.. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. కాగా.. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబరు 22న సైంధవ్ విడుదల కానుంది. (ఇది చదవండి: రక్షాబంధన్ వేడుకల్లో స్టార్ హీరో పిల్లలు.. ఎంత ముద్దుగా ఉన్నారో!) Meet the talented @arya_offl as MANAS from #SAINDHAV 🔥#SaindhavOn22ndDEC @Nawazuddin_S@KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @maniDop @Garrybh88 @tkishore555 @NeerajaKona @artkolla @UrsVamsiShekar #Venky75 pic.twitter.com/6TlHJGGQRy — Venkatesh Daggubati (@VenkyMama) August 30, 2023 -
పాన్ ఇండియాను టార్గెట్ చేసిన ఆర్య
కోలీవుడ్ నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం 'మిస్టర్ ఎక్స్'. గతేడాదిలో విడుదల అయిన 'కెప్టెన్' సినిమా అంతగా మెప్పించలేదు. ఆ సినిమా తర్వాత వస్తున్న 'మిస్టర్ ఎక్స్' సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేసి హిట్ కొట్టాలని ప్లాన్‌లో ఆయన ఉన్నారు. ఇందులో నటుడు గౌతమ్ కార్తీక్ ప్రతి నాయకుడిగా నటించడం విశేషం. నటుడు శరత్ కుమార్, నటి మంజూవారియర్, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు ఎఫ్ఐఆర్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆనంద్‌నే ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: అవమానాలు భరించి వెండితెరపై సత్తా చాటిన అల్లు అర్జున్) ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. దౌనోకి దీపు నీనన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కొంతమంది వల్ల దేశానికి ప్రమాదం ఏర్పడితే దేశాన్ని రక్షించే హీరోగా అర్య కనిపించనున్నారు.చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది విభిన్న యాక్షన్ థ్రిల్లర్ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ముఖ్య సన్నివేశాలను ఉగాండా, సిరియా దేశాల్లో చిత్రీకరించనున్నట్లు చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర వర్గాలు విడుదల చేశాయి. మిస్టర్ ఎక్స్ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను తదుపరి వెల్లడించనున్నట్లు దర్శకుడు చెప్పారు. -
అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉంది: హీరోయిన్
తమిళనాడు రాజకీయ కుటుంబం నుంచి సినీ రంగప్రవేశం చేసిన నటి దుషారా. పా.రంజిత్ దర్శకత్వంలో రూపొందిన సార్పట్టా పరంపరై చిత్రంలో అయ్యకు జంటగా కథానాయికిగా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ తరువాత నక్షత్రం నగర్గిరదు చిత్రంలో మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. కాగా తాజాగా వసంత బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన అనిత చిత్రంలో నటుడు అర్జున్‌దాస్‌తో పోటీ పడి నటించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం బాలాజి మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న దుషారా ఈ చిత్రంతో పాటు ధనుష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. దుషారా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటన అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఎలాంటి పాత్రలో నటించడానికై నా సిద్ధం అన్నారు. అయితే చిత్రంలో తన పాత్ర ఐదు నిమిషాలు ఉన్నా దానికి ప్రాధాన్యత ఉండాలన్నారు. (ఇదీ చదవండి: అమల అక్కినేనితో బాలీవుడ్ హీరో, ఫోటో వైరల్) కుటుంబకథా చిత్రాల నాయకి ఇమేజ్ తెచ్చుకున్న తనను గ్లామర్ పాత్రల్లో నటిస్తారా అని చాలామంది అడుగుతున్నారని, అందానికి, అశ్లీలతకు చాలా తేడా ఉందని, అలా ప్రేక్షకులు ముఖం తిప్పుకునేది ఏది గ్లామర్ కాదని అన్నారు. అందాలారబోతలో హద్దులు తనకు తెలుసని, అలాంటి పరిమితులుతో కూడిన గ్లామర్ పాత్రల్లో నటించడానికి తాను సిద్ధమేనని అన్నారు. బాలుమహేంద్ర, మణిరత్నం దర్శకులు అంటే ఇష్టం అని చెప్పారు. -
హీరోగా మారిన 'సార్పట్టా' నటుడు
కోలీవుడ్‌లో ఆర్య హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ 'సార్పట్టా పరంపరై'. అందులో డాన్సింగ్ రోస్ అనే ముఖ్యమైన పాత్రలో షబ్బీర్ కల్లరాక్కల్ నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం 2021లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. తాజాగా డాన్సింగ్ రోస్ షబ్బీర్ కల్లరాక్కల్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'బర్త్ మార్క్' అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో నటి మీర్జా హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్ శ్రీధరన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్యల పెళ్లి.. ఎప్పుడో హింట్ ఇచ్చిన అల్లు అరవింద్, వీడియో వైరల్) 1990 ప్రాంతంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రమని డైరెక్టర్ చెప్పాడు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని మరైయూర్ అనే గ్రామంలో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. మిస్టరీ డ్రామాగా సాగే ఈ చిత్రం కథ ముఖ్యంగా రెండు పాత్రల చుట్టూ తిరుగుతుందని పేర్కొన్నాడు. డేని అనే సిపాయి కార్గిల్ యుద్ధం అనంతరం తన భార్యను తీసుకుని సొంత గ్రామానికి వచ్చిన తర్వాత వారు ఎదుర్కొనే సమస్యలు, కష్టాలే చిత్ర ప్రధాన అంశం అని చెప్పాడు. సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు భావోద్వేగాలతో కూడిన చిత్రం 'బర్త్ మార్క్' అని తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
హీరో ఆర్య కూతురిని చూశారా? ఎంత క్యూట్‌గా ఉందో! (ఫొటోలు)
-
కూతురితో ఆడుకున్న ఆర్య దంపతులు
-
ఆర్య సినిమా చేయనన్నాను, ఎందుకంటే?: శివ బాలాజీ
బిగ్‌బాస్ తొలి సీజన్ విన్నర్ శివ బాలాజీ ఎన్నో సినిమాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకున్నాడు. ఆయన పేరు చెప్పగానే ఆర్య, చందమామ, శంభో శివ భంభో వంటి సినిమాలు టక్కుమని కళ్లముందు మెదులుతాయి. తాజాగా అతడు ఓ షోలో తనకు పేరు తెచ్చిన సినిమాలపై ఆసక్తిక వ్యాఖ్యలు చేశాడు. 'సుకుమార్ గారు ఆర్య ఆడిషన్స్‌కు పిలిస్తే వెళ్లాను. వెంటనే ఓకే చేశారు. అయితే ఆ సినిమాలో నాది నెగెటివ్ పాత్ర కావడంతో చేయనని చెప్పేశాను. కానీ వాళ్లందరూ నాకు సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నాను. అల్లు అర్జున్ ఆర్య సినిమా సమయంలో ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. ఆర్య తర్వాత మల్టీస్టారర్ సినిమా అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. చేసుకుంటూ పోయాను. కానీ చందమామ సినిమా చేయడానికి చాలా భయపడ్డాను. డైరెక్టర్ కృష్ణవంశీ గారు చందమామ సినిమా కోసం ఆడిషన్ చేశారు. రాఖీ సినిమాలోని క్లైమాక్స్ డైలాగ్ చెప్పమని అడిగారు. నేను చెప్పిన తీరు ఆయనకు అంతగా నచ్చలేదు. ఆ విషయం అర్థమైన నేను ఈ సినిమాలో నటించే ఛాన్స్ రాదని ఫిక్సయ్యాను. కానీ కొన్ని రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని ఫోన్ కాల్ వచ్చింది. అపనమ్మకంగానే సెట్స్‌కు వెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్నా నాకు నమ్మకం కలగలేదు. అసలు నన్ను ఈ సినిమాలో ఉంచుతారా? మధ్యలోనే తీసేస్తారా? అనుకుంటూనే చిత్రీకరణ పూర్తి చేశాను. తీరా సినిమా రిలీజై మంచి విజయం సాధించింది. చందమామ సక్సెస్ మీట్‌కు వెళ్లేటప్పుడు కృష్ణవంశీ పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి అందరితో కలిసిపోవాలి. లేదంటే నీలో ఉన్న ప్రతిభ ఎవరికీ తెలియకుండా పోతుంది అని చెప్పారు' అంటూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు శివబాలాజీ. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన సింగర్, 10 సెకన్లలో జీవితమంతా.. బలవంతంగా బంధంలో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే నయం: సదా -
హీరోలు ఆర్య, గౌతమ్ కార్తీక్‌ల మల్టీస్టారర్.. పోస్టర్ రిలీజ్
నటుడు ఆర్య, గౌతమ్ కార్తీక్ హీరోలుగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. దీనికి మిస్టర్ ఎక్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇంతకు ముందు విష్ణు విశాల్ హీరోగా ఎఫ్ఐఆర్ అనే సక్సెస్‌పుల్ చిత్రాన్ని తెరకెక్కించిన మణు ఆనంద్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం మిస్టర్ ఎక్స్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఏస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. చదవండి: గొప్పమనసు చాటుకున్న నిర్మాత.. లైట్‌మెన్ కుటుంబానికి ఆర్థికసాయం చిత్ర వివరాలను నిర్మాత తెలుపుతూ ఇది యాక్షన్ స్పై థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. దీనికి దీపు నినన్ థామస్ సంగీతాన్ని, తన్వీర్ మిర్ ఛాయాగ్రహణం అందిస్తున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను ఉగాండా, సెర్పియా రాష్ట్రా ల్లో చిత్రీకించనున్నట్లు చెప్పారు. ఇందు లో కథ, కథనాలతో పాటు యాక్షన్ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటు ల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు తెలిపారు. చదవండి: దక్షిణాదిలో స్టార్ క్రేజ్.. అక్కడేమో ఒక్క హిట్ కోసం తంటాలు! -
గురుకులం: వేద విద్యామణులు
నలుగురు అక్కచెల్లెళ్లు. లక్ష్మి ఆర్య, కవిత ఆర్య, రజిత ఆర్య, సరిత ఆర్య. వీరిది తెలంగాణలోని ఓ వ్యవసాయ కుటుంబం. ఈ నలుగురూ వేదాలను అభ్యసించారు. కంప్యూటర్ యుగంలో అందులోనూ ఆడపిల్లలకు వేదాలెందుకు అనేవారి నోళ్లను మూయిస్తూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, అపార పాండిత్యంతో ఔరా అనిపిస్తూ సంస్కృతంలో విద్యార్థులను నిష్ణాతులు చేస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఎదిర గ్రామమైన ఈ అక్కాచెల్లెళ్లను కలిస్తే వేదాధ్యయనం గురించి ఎన్నో విషయాలు ఇలా మన ముందుంచారు. ‘‘మా అమ్మానాన్నలు ఆంచ సుమిత్ర, జంగారెడ్డి. నాల్గవ తరగతి వరకు ఊళ్లోనే చదువుకున్నాం. మా మామయ్య విద్వాంసుడవడంతో అతని సూచన మేరకు మా నలుగురు అక్కచెల్లెళ్ల ను కాశీలోని పాణిని కన్యా మహావిద్యాలయంలో చేర్చారు. కాశీ అంటేనే విద్యానగరి. విద్యలన్నీ అక్కడ సులభంగా లభిస్తాయని ప్రతీతి. అక్కడే పదేళ్లపాటు వేదాదేవి సాన్నిధ్య శిష్యరికాలలో విద్యాభ్యాసం చేశాం. ఆత్మరక్షణ కోసం శస్త్ర, శాస్త్రాలు సాధన చేశాం. ► ఆడపిల్లలకు వేదాలా..? వేదాలు బ్రాహ్మణులు కదా చదివేది అనేవారున్నారు. ఆడపిల్లలకు వేదం ఎందుకు అన్నారు. ఎక్కడ రాసుంది స్త్రీ వేదాలు చదవకూడదని, వేద మంత్రమే చెబుతుంది ప్రతి ఒక్కరూ వేదాన్ని పఠించవచ్చు అని. మేం చదివిన గురుకులాన్ని కూడా ప్రజ్ఞాదేవి, భేదాదేవి అనే అక్కచెల్లెళ్లు ఎంతో కృషితో నడిపిస్తున్నారు. రిషిదయానంద్ అనే విద్వాంసుడు స్త్రీని బ్రహ్మ పదవిపై కూర్చోబెట్టారు. వారి వద్ద విద్యను నేర్చుకున్న ఆ అక్కచెల్లెళ్లు వాళ్లు. ఆడపిల్లలు వేదాలు వినడమే నిషేధం అనే రోజుల్లోనే వారిద్దరూ వేదాధ్యయనం చేసి, గురుకులాన్ని స్థాపించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారి శిష్యులు గురుకులాలు స్థాపించి, వేదాన్ని భావితరాలకు అందిస్తున్నారు. ► అన్ని కర్మలు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలను ఔపోసన పట్టడమే కాదు పౌరోహిత్యం, పుట్టినప్పటి నుంచి మరణించేవరకు మధ్య ఉన్న అన్ని కర్మలూ విధి విధానాలతో చేస్తున్నాం. కొంతమంది ‘ఇదేం విచిత్రం’ అన్నవారూ లేకపోలేదు. అనేవారు చాలా మందే అంటారు. కానీ, మేం వాటికి మా విద్య ద్వారానే సమాధానం చెబుతున్నాం. పురాణ, ఇతిహాసాల్లో గార్గి, మైత్రి, ఘోశ, అపాల .. వంటి స్త్రీలు వేదాభ్యాసం చేసి, తమ సమర్థత చూపారు. అయితే, చాలా మందికి వారి గురించి తెలియదు. ► ఉచిత తరగతులు మా నలుగురిలో లక్ష్మి ఆర్య, సరిత ఆర్య చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో విద్యార్థులకు వేదవిద్యను బోధిస్తున్నారు. పౌరహిత్యంతో పాటు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్లైన్లోనూ భగవద్గీత, సంస్కృత పాఠాలను ఉచితంగా చెబుతున్నాం. మా నలుగురి ఆలోచన ఒక్కటే సంస్కృతం విస్తృతంగా ప్రచారం కావాలి. ఆడపిల్లలూ వేద విద్యలో ముందంజలో ఉండాలి. మా వద్ద పిల్లలతోపాటు పెద్దవాళ్లు కూడా సంస్కృతం అభ్యసిస్తున్నారు’’ అని వివరించారు ఈ నలుగురు అక్కచెల్లెళ్లు. నేటి కాలంలో వేద విద్యపై ఎవరూ ఆసక్తి చూపడం లేదని, అందుకోసమే తాము వేద విద్యలో పట్టు సాధించాలనుకున్నాం అని తెలిపారు ఈ సోదరీమణులు. తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి సంస్కృత వ్యాకరణంలో రజిత ఆర్య, సరిత ఆర్య పీహెచ్డీ పట్టా అందుకుని ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. – నిర్మలారెడ్డి – బాలయ్య, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా, సాక్షి -
సింపుల్‌గా..శుభంగా
ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే పెళ్లి అంత ఘనంగా జరిగినట్లు. అనే ఆలోచనధోరణి నుంచి బయటికి వచ్చి నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్ ఆర్య, ఇండియన్పోస్టల్ సర్వీస్ ఆఫీసర్ శివమ్ త్యాగి. ‘ఆనందం అనేది ఆడంబరపు ఖర్చుల్లో కాదు... మనం చేసే మంచి పనుల్లో దొరుకుతుంది’ అని నమ్మిన ఈ నవదంపతులు 20 మంది అనాథ పిల్లల చదువుకు అయ్యే ఖర్చును భరించాలని వివాహ శుభసమయాన శుభనిర్ణయం తీసుకున్నారు... కేరళ, కొట్టాయంలోని కూరోప్పడకు చెందిన ఆర్య ఎన్ నాయర్ తండ్రి రాధాకృష్ణన్నాయర్ జాయింట్ లేబర్ కమిషనర్‌గా రిటైరయ్యారు. కూతురికి చిన్నవయసు నుంచే దినపత్రికలు చదవడం అలవాటు చేశారు. ఈ అలవాటు తనకు ఎంతో మేలు చేసింది. ఎప్పటికప్పుడు సామాజిక సందర్భాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, రకరకాల సమస్యల విశ్లేషణ గురించి తెలుసుకోవడానికి కూడా ఆర్యకు ఉపకరించింది. బంధువులకు సంబంధించిన ఎన్నో పెళ్లిళ్లకు హాజరయ్యేది ఆర్య. ఆ ఆడంబరపు ఖర్చును చూసి తన మనసు చివుక్కుమనేది. ‘ఈ పెళ్లికి చేసిన ఖర్చుతో ఎన్నో మంచి పనులు చేయవచ్చు’ అనుకునేది. ఇదే విషయాన్ని ఇతరులతో పంచుకుంటే... ‘ఇప్పుడు ఇలాగే అంటావ్. తీరా పెళ్లి టైమ్ వచ్చేసరికి మారిపోతావు. నా పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో తెలుసా అని చెప్పుకోవడానికేప్రా ధాన్యత ఇస్తావు. నీ వయసులో నీలాగే ఆలోచించాను. కాని నా పెళ్లి ఘనంగా జరగక తప్పలేదు. చివరికి అప్పు కూడా చేయాల్సి వచ్చింది’ అన్నవాళ్లే ఎక్కువ. ఈ మాటలు ఆర్య మనసులో గట్టిగా నిలిచిపోయాయి.‘పెళ్లంటూ చేసుకుంటే నిరాడంబరంగానే చేసుకోవాలి’ అని నిర్ణయం తీసుకుంది. దిల్లీకి చెందిన శివమ్ త్యాగి కూడా ఆర్యలాగే ఆలోచిస్తాడు. ఇద్దరూ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. వారి పరిచయం స్నేహం అయ్యే క్రమంలో, ఆ స్నేహం ప్రేమకు దారి తీసే క్రమంలో ఎన్నో సామాజిక సంబంధిత విషయాలు మాట్లాడుకునేవారు. అందులో ఆడంబర వివాహాల ప్రస్తావన కూడా తప్పనిసరిగా ఉండేది. ‘నిరాడంబరంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం’ అని ఆర్య చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. వారిని ఒప్పించడానికి కాస్త సమయం పట్టింది. మరోవైపు శివమ్ త్యాగి పరిస్థితి కూడా అంతే. అతడి తల్లిదండ్రులు కూడా నిరాడంబర వివాహానికి మొదట సుముఖంగా లేరు. ‘మా నిరాడంబర వివాహం కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే అంతకంటే గొప్ప ఆనందం ఏం ఉంటుంది!’ అంటున్నాడు శివమ్ త్యాగి. ఆనందాలు ఆడంబరపు ఖర్చులతో ముడిపడిన చోట ఆనందం మాటేమిటోగానీ అప్పులు మాత్రమే మిగులుతాయి. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఈ ధోరణిలో మార్పు రావాలంటే నిరాడంబర వివాహాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ఆర్య– శివమ్ త్యాగిలాంటి వారు ఇందుకు స్ఫూర్తిగా నిలుస్తారు. ‘కేరళలో వివాహాలు మూడు రోజులపాటు అట్టహాసంగా జరుగుతాయి. నా పెళ్లి వార్త తెలియగానే బంధువులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూశారు. పెళ్లి ఆడంబరంగా జరుగుతుందని ఊహించారు. కాని కొట్టాయంలోని సబ్– రిజిస్ట్రార్ ఆఫీసులో దండలు మార్చుకోవడం ద్వారా నిరాడంబరంగా జరిగిన మా పెళ్లి వారిని కాస్త నిరాశకు గురిచేసింది. అయితే ఆ తరువాత వారు మమ్మల్ని అర్థం చేసుకొని అభినందించారు’ అంటుంది ఆర్య. -
కొత్త సినిమా మొదలుపెట్టిన హీరో ఆర్య
కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టారు హీరో ఆర్య. ముత్తయ్య దర్శకత్వంలో ఆర్య, సిద్ధి ఇద్నానీ జంటగా ఈ సినిమా చెన్నైలో ప్రారంభమైంది. జీ స్టూడియోస్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఆర్య విలక్షణ నటుడు. ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడు ముత్తయ్య. వీరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా వినోదాత్మకంగా ఉంటుంది అని అన్నారు జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రివాల్. -
3 వారాలకే ఓటీటీకి కెప్టెన్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
తమిళ హీరో ఆర్య హీరోగా ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్’. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 8న తమిళ్, తెలుగు భాషల్లో విడుదలైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మాత టి. కిషోర్ తో కలిసి ఆర్య కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీకి రిలీజ్‌కు సిద్ధమైంది. చదవంండి: కొడుకు చంద్రహాస్‌పై ట్రోల్స్.. నటుడు ప్రభాకర్ షాకింగ్ రియాక్షన్ విడుదలైన మూడు వారాలకే కెప్టెన్ ఓటీటీకి రావడం గమనార్హం. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ స్టూడియోస్ ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 30 నుంచి ‘జీ5’లో కెప్టెన్ మూవీ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది. తాజా ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్పించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించగా... సీనియర్ నటి సిమ్రాన్ మహిళా ఆర్మీ అధికారినిగా స్పెషల్ రోల్ పోషించింది. చదవండి: ‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. హీరోయిన్ గురించి ఏమన్నదంటే.. #Captain OTT RELEASE September 30 @ZEE5India pic.twitter.com/lnHBo9cSQZ — OTTGURU (@OTTGURU1) September 21, 2022 -
‘కెప్టెన్’ మూవీ రివ్యూ
టైటిల్ : కెప్టెన్ నటీనటులు : ఆర్య, ఐశ్యర్య లక్ష్మీ, సిమ్రాన్, హరీశ్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు నిర్మాణ సంస్థ: ది షో పీపుల్, థింక్ స్టూడియోస్, ఎస్ఎన్ఎస్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల: శ్రేష్ఠ్ మూవీస్ దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్ సంగీతం : డి ఇమాన్ సినిమాటోగ్రఫీ: ఎస్ యువ విడుదల తేది: సెప్టెంబర్8,2022 కథేంటంటే.. భారత్‌లోని ఈశాన్య అటవీ ప్రాంంతంలో, సెక్టార్ 42కి చెందిన అటవీ ప్రాంతంలో కొన్నేళ్లుగా పౌర, సైనిక కార్యకలాపాలు లేవు. ఆ ప్రదేశానికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రావడం లేదు. వారికి వారే షూట్ చేసుకొని చనిపోతున్నారు. దీంతో ఈ మిస్టరీని తెలుసుకోవడానికి భారత ఆర్మీకి చెందిన కెప్టెన్ విజయ్ కుమార్(ఆర్య) బ్యాచ్‌ని రంగంతోకి దించుతుంది. కెప్టెన్ విజయ్‌కి ఏ ఆపరేషన్ అయినా విజయవంతంగా పూర్తి చేస్తాడనే పేరుంది. తన టీమ్‌తో కలిసి స్పెషల్ ఆపరేషన్స్ చేపడుతుంటాడు. అందుకే ఈ డేంజరస్ ఆపరేషన్ని కెప్టెన్ విజయ్‌కి అప్పగిస్తుంది ప్రభుత్వం. విజయ్ తన బృందంతో కలిసి సెక్టార్ 42 ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ మినటార్స్(వింత జీవులు) ఉన్నాయని, వాటివల్లే అక్కడికి వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిగిరి రావడంలేదని విజయ్ గుర్తిస్తాడు. మరి విజయ్ తన ప్రాణాలను పణంగా పెట్టి వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అసలు ఆ వింత జీవులు ఏంటి? సైనికులు తమకు తాము షూట్ చేసుకునేలా మినటార్స్ ఏం చేస్తున్నాయి? సైంటిస్ట్ కీర్తి(సిమ్రాన్) చేసే పరిశోధన ఏంటి? చివరకు కెప్టెన్ విజయ్ మినటార్స్ని అంతం చేశాడా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘కెప్టెన్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై అసక్తి పెరిగింది. వింత జీవులతో ఇండియన్ ఆర్మీ ఫైట్ చేయడం అనే కొత్త పాయింట్‌తో సినిమా తెరకెక్కడంతో అందరికి దృష్టి ‘కెప్టెన్’పై పడింది. అయితే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. దానికి తగ్గ కథ, కథనం లేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ హాలీవుడ్ చిత్రాలను చూసి కథను రాసుకున్నట్లు తెలుస్తోంది. మ్యాన్ వర్సస్ క్రియేచర్ జానర్లో ఈ సినిమా సాగుతుంది. అందులో అయినా ఏదైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. సెక్టార్ 42లో వింత జీవులు ఉంటాయి వాటితో కెప్టెన్ విజయ్ యుద్దం చేయాలి అనేది ఫస్టాఫ్ పాయింట్ అయితే.. ఎలా చేశాడనేది సెకండాఫ్. దీనికి కథను అల్లడానికి ఫస్టాఫ్‌లో అసవరమైన సీన్స్ అన్ని బలవంతంగా చొప్పించాడు దర్శకుడు. ఆ సీన్స్ కూడా ఆకట్టుకున్నట్లు ఉంటుందా అంటే అదీ లేదు. ఇక సినిమాలో లాజిక్ లేని సన్నివేశాలు చాలా ఉంటాయి. సెక్టార్ 42కి వెళ్లిన సైనికులు మరణిస్తారని చూపించిన దర్శకుడు.. వారిని తీసుకురావడానికి వెళ్లిన సైనికులకు ఏమి కాలేదన్నట్టు సన్నివేశాలు రూపొందించడం.. గన్‌తో షూట్ చేసే మినటార్స్ మరణించడం లేదని తెలిసినా.. మళ్లీ మళ్లీ సైనికులు గన్స్ పట్టుకొనే ఆ ప్రదేశానికి వెళ్లడం.. సైంటిస్ట్ కీర్తికి కెప్టెన్ జవాన్ సైన్స్ గురించి చెప్పడం.. ఆమె ఆశ్యర్యంగా చూడడం..ఇలా చాలా సన్నివేశాల్లో లాజిక్ మిస్సవుతుంది. అదే సమయంలో హీరో మాత్రం ఎందుకు స్పృహ కోల్పోవడం లేదనడానికి మాత్రం సరైన కారణం చెప్పాడు. వీఎఫ్ఎక్స్ అంతగా ఆకట్టుకోలేదు. కథకు కీలకమైన క్రీచర్ని కూడా సరిగా చూపించలేకపోయారు. మినటార్స్తో వచ్చే ఫైట్ సీన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోతాయి. హాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చాయి. ఆ చిత్రాలను చూడని ప్రేక్షకులకు ‘కెప్టెన్’ కాస్త కొత్తగా కనిపిస్తాడు. ఎవరెలా చేశారంటే.. కెప్టెన్ విజయ్ కుమార్ పాత్రకు ఆర్య న్యాయం చేశాడు. ఉన్నంతలో యాక్షన్స్ సీన్స్‌ని కూడా అదరగొట్టేశాడు. అతని టీమ్‌లోని సభ్యులు కూడా చక్కటి నటనను కనబరిచారు. ఐశ్వర్య లక్ష్మి రెండు సీన్స్, ఓ పాటలో కనిపిస్తుంది అంతే. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సైంటిస్ట్ కీర్తిగా సిమ్రాన్ పర్వాలేదనిపించింది. అయితే ఆమె పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇమాన్ నేపథ్య సంగీతం ఆట్టుకునేలా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోతాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
హీరో ఆర్య 'కెప్టెన్' మూవీ స్టిల్స్
-
కొత్త అపార్ట్మెంట్స్ కొన్న విజయ్, ఆర్య.. ఎన్ని కోట్లంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వారసుడు చిత్రంతో పాటు లోకేశ్ కనకరాజు డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో తాజాగా చెన్నైలోని ఓ పోష్ ఏరియాలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడట. దీని ఖరీదు అక్షరాలా 35 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్, తన భార్య సంగీత, పిల్లలు దివ్య సాష, జాసన్ సంజయ్‌తో కలిసి ఈసీఆర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. అడయార్‌లోని తన పాత ఇంట్లో ఆఫీస్‌ను నిర్వహిస్తున్నాడు. కాగా విజయ్ ప్రస్తుతం తన ఆఫీస్‌ను కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌కు షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్‌ను హీరో ఆర్య సొంతం చేసుకున్నాడట. దీంతో హీరోలు ఆర్య, విజయ్ ఇద్దరూ ఇరుగుపొరుగువారయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: హీరోతో సహజీవనం వార్తలపై ఇస్మార్ట్ బ్యూటీ గప్‌చుప్! మాజీ ప్రియుడితో నటి చక్కర్లు, వీడియో వైరల్ -
ఏలియన్‌తో హీరో ఆర్య పోరాటం.. ఆసక్తిగా ‘కెప్టెన్’ ట్రైలర్
తమిళ హీరో ఆర్య హీరోగా తాజాగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం కెప్టెన్. శక్తి సౌందన్ రాజన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రేక్షకులు ముందుకు రాబోతోంది, ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ టీం తాజాగా మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇండియన్ ఆర్మీ, ఏలియన్లతో చేసే పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆసక్తిగా మలిచారు. చదవండి: నెపోటిజంపై నోరు విప్పిన నాగ చైతన్య.. ఏమన్నాడంటే ఆర్మీ అధికారులు ఓ గ్రహాంతరవాసితో తలపడే యాక్షన్ సీన్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్, ఆర్మీ ఆఫీసర్ల అధికారిగా నటి సిమ్రాన్ ఇచ్చే సూచనలు, గ్రహాంతవాసులను ఎదుర్కొనేందుకు ఆర్య వేసే ఎత్తుగడలను వివరిస్తూ సాగిన ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. కాగా తెలుగులో శ్రేష్ట్ మూవీస్ సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో ఆర్యకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. -
‘ఆర్య’, ‘గిల్టీ మైండ్స్’ ఫేం సుగంధా గర్గ్ గురించి ఈ విషయాలు తెలుసా?
జీవితాన్ని ఉన్నదున్నట్టుగా యాక్సెప్ట్ చేసేవాళ్లలో సుగంధా గర్గ్ ఒకరు. ఆమె ఎవరు? హాట్ స్టార్‌లో ‘ఆర్య’, అమెజాన్ ప్రైమ్‌లో ‘గిల్టీ మైండ్స్’ చూసిన వాళ్లకు బాగా తెలుసు సుగంధా ఎవరో! అయితే ఆమె గాయని కూడా! ఎమ్‌టీవీ ‘కోక్ స్టూడియో సీజన్ 2’ లో సుగంధా తన గాన మాధుర్యాన్ని వినిపించింది. ఆమె గురించి కొన్ని వివరాలు.. ►పుట్టింది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో. పెరిగింది హైదరాబాద్‌లో. తల్లిదండ్రులు.. మీనా గర్గ్, శేఖర్ గర్గ్. సుగంధా.. ఢిల్లీలోని మైత్రేయి కాలేజ్‌లో డిగ్రీ చదువుకుంది. ►పద్దెనిమిదేళ్ల వయసులోనే బీబీసీ చానెల్లో ఉద్యోగం వచ్చింది.. హోస్ట్‌గా. ఆమె నిర్వహించిన షో పేరు ‘హాథ్ సే హాథ్ మిలా’. ఫొటోగ్రఫీలోనూ శిక్షణ పొందింది. నటి కావాలని కలలు కన్నది. ►డిగ్రీ అయిపోగానే ముంబై చేరింది. సినిమా అవకాశాల కోసం దరఖాస్తుల పర్వం మొదలుపెట్టింది. అలా తెచ్చుకున్న మొదటి చాన్స్ ‘జానే తూ యా జానే నా’ సినిమా. తర్వాత లాస్ట్ డాన్స్, మై నేమ్ ఈజ్ ఖాన్ వంటి సినిమాలూ చేసింది. ►‘తెరే బిన్ లాడెన్’తో సుగంధాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు అదే సినిమా సీక్వెల్లోనూ అవకాశాన్నిచ్చింది. ఆమె నటనా ప్రతిభ అంతర్జాతీయ ప్రేక్షకులకూ పరిచయం అయింది.. ది కైట్ – పతంగ్, కాఫీ బ్లూమ్ వంటి చిత్రాలతో. ► థియేటర్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోంది. ‘ఐ హావ్ గాన్ మార్కింగ్ అండ్ సమ్‌టైమ్స్’ అనే నాటకంలోని సుగంధా అభినయానికి అభినందనల వర్షం కురిసింది. ► ఈ తరానికీ దగ్గరవడానికి ఓటీటీని ప్లాట్‌ఫామ్‌గా చేసుకుంది. ఆర్య, గిల్టీ మైండ్స్‌తో యూత్‌కూ ఫేవరెట్‌గా మారింది. ►ఇంకో విషయం.. సుగంధా దక్షిణాది చిత్రసీమలోనూ ఎంట్రీ ఇచ్చింది. సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ‘సిలోన్’ అనే తమిళ (నిజానికిది ద్విభాషా చిత్రం. ఇంగ్లిష్‌లోనూ విడుదలైంది) చిత్రంతో. ‘సిలోన్ సినిమాలోని రజిని పాత్రలో సుగంధా ఒదిగిపోయింది. ఆ రోల్ ఇంకెవరు చేసినా న్యాయం చేయగలిగేవాళ్లు కాదు. అది ఆమెకు మాత్రమే సాధ్యమైంది’ అంటూ సుగంధా నటనకు ముగ్ధుడయ్యాడు సంతోష్ శివన్. నాకు వచ్చిన ప్రతి పనినీ అమితంగా ప్రేమిస్తా. రాని పనినీ అంతే ఇష్టంగా నేర్చుకుంటా. అందిన జీవితాన్ని అందినట్టుగా ఆస్వాదించడంలో ఉన్న ఆనందమే వేరు - సుగంధా గర్గ్ -
ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం ఏడాదిన్నర సమయం పట్టిందట!
తమిళసినిమా: కెప్టెన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇది. టెడీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత ఆర్య దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ల కాంబినేషన్లో రూపొందుతోంది. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. థింక్ స్టూడియోస్, ది షో పీపుల్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు ట్రెండీగా మారింది. విశేషం ఏమిటంటే ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ కోసం చిత్ర యూనిట్ ఏడాదిన్నరగా శ్రమించారట. కారణం ప్రేక్షకులకు ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి వినూత్న అనుభూతిని కల్పించాలన్నదే అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఒక థ్రిల్లర్ పయనంగా ఉంటుందన్నారు. చిత్రం కోసం ఆర్య చూపించిన అంకితభావం, శ్రమ మాటల్లో చెప్పలేదని నిర్మాతలు పేర్కొన్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్, కావ్యశెట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువ ఛాయాగ్రహణం, డి.ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి: Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక -
ఎనిమి మూవీ ట్విటర్ రివ్యూ
యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన మరో యాక్షన్ చిత్రం ‘ఎనిమి’.ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మతా మోహన్‌దాస్, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. సినిమాలో యాక్షన్‌తో పాటు డైగాగ్స్ బాగాను ఉన్నట్లు తెలుస్తోంది. #Enemy first half 🔥🔥🔥🔥🔥 Anand Shankar 💥 Aarya 🥵🧨🧨🧨🧨 pic.twitter.com/MvviWtx1Fj — MSR (@itz_chillax) November 4, 2021 #EnemyFDFS fans celebration @RohiniSilverScr 💥💥#Enemy Massive entry thalaivaa @VishalKOfficial One of the finest score points @SamCSmusic bgm is just lit 💥@arya_offl @mirnaliniravi @vinod_offl @anandshank @VffVishal pic.twitter.com/CT0IKPyE5F — Esh Vishal (@Eshvishaloff) November 4, 2021 #Annaatthe Review சரியில்லை நம்ம #ENEMY பார்க்க கிளம்புவோம்... — திண்டிவனத்தான் (@itsmetdm) November 4, 2021 #Enemy Epdi Iruku Frands — Thala Ragav™👑 (@Ragav_Tweetz) November 4, 2021 Million Thanks to my brother @VishalKOfficial for making me a part of this film 🤗🤗Had the best time working with @anandshank 😍🤗 💪 Thank you @vinod_offl darling for believing us and making #Enemy special 😍🤗 @RDRajasekar sir u r 😍😍 Happy Diwali everyone 😘💥💥 pic.twitter.com/ruKT2CYFZk — Arya (@arya_offl) November 4, 2021 #Enemy will be flop. Investment recovery is not guaranteed. #Annaatthe getting rave reviews. Industry Hit record will be sure. Watch it soon in theaters only. — AnnaattheTheFilm (@AnnaattheMovie) November 4, 2021 #Enemy review எப்டீ இருக்குன்னு போய் பார்த்தா அவனுங்க நமக்கு முன்னாடி எனிமி ரிவியூவ் எப்டீ இருக்குன்னு கேக்குறானுங்க😍🙌 — ѕ ι я α н🕊️ᴠᴋ (@Prabhaharish7) November 4, 2021 #Enemy Deepawali Than Pola 🙄🔥🔥🔥🔥 — Salva Reviews😷 (@SalvaReviews) November 4, 2021 தீபாவளி னாலே தளபதி தான் போல... புரட்ச்சி தளபதி மாஸ் #Enemy 🔥 — кαι ρυℓℓα (@KPM_Offi) November 4, 2021 #EnemyDeepavali BlockBuster #Enemy — Ansari (@Ansari0401) November 4, 2021 -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
Diwali 2021 Movie Release List: కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రతి వారం కొత్త సినిమలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక దసరా, దీపావళి సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. దసరా సందర్భాంగ ఇప్పటికే ‘పెళ్లి సందD, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, వరుడు కావలెను వంటి తదితర చిత్రాలు వెండితెరపై మెరిసి ప్రేక్షకులకు బాగా అలరించాయి. ఇక దీపావళి సందర్భంగా అగ్ర హీరోల సినిమా థియేటర్లోకి వచ్చేందు రెడీ అయ్యాయి. అలాగే ఈ పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసేందుకు ఓటీటీలోకి సైతం పలు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడోలుక్కేయండి. ‘ఎనిమి’లుగా విశాల్, ఆర్యలు యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దీపావళికి వస్తున్న ‘పెద్దన్న’ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో సైతం ‘పెద్దన్న’గా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా అలరించబోతోంది. ఇక కీర్తి సురేశ్ రజనీకి సోదరిగా కనిపించనుండగా.. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవంబర్ 4న తమిళ/తెలుగులో భాషల్లో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి అగ్ర హీరో మూవీగా రజనీది కావడం విశేషం. మెహ్రీన్, సంతోష్ శోభన్ల్లా ‘మంచి రోజులు వచ్చాయి’ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. చివరకు ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సూపర్ హీరోస్ ‘ఇటర్నల్స్’ సూపర్ హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే! సూర్య జై భీమ్ మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాంటి పాత్రలో ఆయన నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం ‘జై భీమ్’. తాసే జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్లో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ విడుదల కానుంది. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. -
ఆర్య కొత్త చిత్రం ప్రారంభం
తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు ఆర్య.ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 33వ చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ది షో పీపుల్, థింగ్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్న చిత్రం ఇది. నాయిగళ్ జాగ్రత్తై, మిరుదన్, టిక్ టిక్ టిక్, రెడీ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటి సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి, త్యాగరాజన్, కావ్య శెట్టి, హరీష్ ఉత్తమన్, గోకుల్, భరత్ రాజ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, యువ ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. చదవండి: ‘లైగర్’ పాటలో విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ -
శ్రీలంక యువతి కేసులో కీలక మలుపు: హీరో ఆర్యకు బిగ్ రిలీఫ్
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి పెట్టిన కేసులో ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. అసలు ఆ కేసుతో ఆర్యకు సంబంధం లేదని తేలింది. ఉద్దేశపూర్వకంగానే ఆర్యను ఇరికించారని పోలీసులు గుర్తించారు. అయితే ఆర్యపై ఆరోపణలు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇంతటితో ఆవివాదం సద్దుమణిగింది. ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేస్తూ పెద్ద ఉపశమనం లభించింది అని పేర్కొన్నాడు. ఆ ఆరోపణలు తన మనసును గాయపరిచాయని తెలిపాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ చేసింది. ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య ఆగస్టు 10వ తేదీన విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. నేరం ఏమీ చేయకపోవడంతో ఆర్య సానుకూలంగా పోలీసులు అడిగిన వాటికి సమాధానం ఇచ్చాడు. విచారణలో ఆర్య నేరం చేయలేదని తేలడంతో పోలీసులు మరో కోణంలో విచారణ చేపట్టారు. ఈ సమయంలో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. చెన్నెలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్, మహ్మద్ హుస్సేనీ ఇద్దరూ కలిసి ఆర్య పేరుతో నకిలీ వాట్సప్ క్రియేట్ చేశారు. ఆ వాట్సప్ ద్వారా శ్రీలంక యువతి విద్జాతో చాటింగ్ చేసి డబ్బులు దండుకున్నారు. పోలీసులు వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ఎంతటి దుస్థితి! అఫ్గాన్ మంత్రి నేడు డెలివరీ బాయ్‌గా) ఈ పరిణామంపై ఆర్య హర్షం వ్యక్తం చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకున్నందుకు సైబర్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలు మనసుని గాయపరిచిందని తెలిపారు. ఇప్పుడు ఎంతో ఉపశమనంగా ఉందని ట్వీట్ చేశాడు. తన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నటుడిగా ఉన్న ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషాసైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. I would like to thank Commissioner of Police @chennaipolice_ Additional Commissioner of Police-Central Crime Branch and Cyber Crime Team of Chennai city for arresting the Real culprit. It was a real mental trauma which I never expressed. Love to everyone who believed in me 🤗 — Arya (@arya_offl) August 24, 2021 -
ఆకట్టుకున్న విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ఫస్ట్ సింగిల్
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషలలో కలిపి 20 మిలియన్లకి పైగా వ్యూస్ సాధించింది. దీంతో ఈ సినిమాపై అంఛనాలను భారీగా పెరిగాయి. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్న ఈ నేపథ్యంలో తాజాగా ఎనిమి చిత్రం నుండి బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరపరిచిన ‘పడదే.. పడదే’ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘అదిరే నిను చూసే కనులే నీ స్నేహం కోసం కదిలే..అదిగో నిను చూస్తేనే...’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీ రామ్ సాహిత్యం అందించగా పృథ్విచంద్ర ఫుల్ ఎనర్జీతో ఆలపించాడు. తమన్ క్యాచీ ట్యూన్ మరోసారి సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. విశాల్, మృణాలిని రవి మధ్య కెమిస్ట్రీ ఈ పాటకి హైలెట్‌గా నిలిచింది. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళం, హిందీ సహా మరికొన్ని భాషలలో ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: బర్త్‌డే పార్టీలో అమ్మాయితో ఆర్జీవీ రచ్చ, వీడియో వైరల్ -
పెళ్లి చేసుకుంటానని మోసం: పోలీసుల ఎదుటకు హీరో ఆర్య
చెన్నె: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నెలో కమిషనర్ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పలు విషయాలు పోలీసులు ఆరా తీశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీలంకకు చెందిన యువతి విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్లైన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్‌షాట్ ఫొటోలు కూడా విడుదల చేసింది. చెన్నెలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేస్తూనే ఈ కేసుపై మరిన్ని విషయాలు తెలుసుకోవాలని పోలీసులకు ఆదేశించడంతో ఆర్యను విచారించారు. ఆర్య తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. వరుడు, రాజారాణి, వాడువీడు, ఇటీవల సారపట్టతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విశాల్‌తో కలిసి ‘ఎనిమి’ సినిమా చేస్తున్నాడు. అయితే ఆర్యకు సయేషా సైగల్తో వివాహమైంది. వీరిది ప్రేమ వివాహం. ‘అఖిల్' సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా ఆర్యతో కలిసి ‘గజినీకాంత్' సినిమా చేసింది. ఆ సమయంలోనే ప్రేమాయణం సాగింది. 2019లో మార్చ్ 10వ తేదీన పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఇటీవల సయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
హీరో ఆర్యను ప్రశంసించిన కమల్‌హాసన్
చెన్నై: సార్పట్ట పరంపరై చిత్ర యూనిట్‌ను నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అభినందించారు. నటుడు ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం సార్పట్ట పరంపరై. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర యూని ట్ను శనివారం కమలహాసన్ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ఈ చిత్రం చూస్తున్నప్పుడు గత కాలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన జరిగిందన్నారు. దర్శకుడు పా.రంజిత్ పనితీరును ప్రశంసించారు. -
ఏమ్మా నీకు అంత పొగరా? అడగడంతో ఖంగుతిన్నా..
సాక్షి, చెన్నై: ఏమ్మా నీకు అంత పొగరా? అని అడగడంతో ఖంగుతిన్నానని చెప్పారు సార్పట్ట కథానాయిక దుషారా విజయన్. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ అందుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. ‘దిండుగల్ జిల్లా కన్యాపురం గ్రామానికి చెందిన నేను ప్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో బోదై ఏరి బుద్ధిమారి చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించాను. ఐదేళ్ల కష్టానికి ఫలితంగా పా.రంజిత్ దర్శకత్వంలో సార్పట్ట చిత్రం అవకాశం వచ్చింది. ఓ రోజు రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మరుసటిరోజు ఆఫీసుకు రావాల్సిందిగా చెప్పారు. అయితే నేను ఆ ఫోన్‌కాల్‌ను నమ్మలేదు. రెండో రోజు మళ్లీ పోన్ చేసి నీకు అంత పొగరా? పా.రంజిత్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తే రాలేదే అని ప్రశ్నించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను. అడిషన్లో సెలెక్ట్ కావడంతో నటించే అవకాశం లభించింద’ని చెప్పుకొచ్చారు. -
పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
కోలీవుడ్ హీరో ఆర్య భార్య, హీరోయిన సయేషా సైగల్ శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో విశాల్ ట్విటర్ ద్వారా తెలియజేశాడు. తాను మావయ్య అయ్యానని, చాలా ఎమోషనల్‌గా ఉందని చెబుతూ విశాల్ ఆర్య, సయేషాలకు అభినందనలు తెలిపారు. ‘ఈ వార్తను రివీల్ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నా సోదరుడు ఆర్య, సాయేషా ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అంకుల్‌ను అయినందుకు హ్యాపీ. షూటింగ్ మధ్యలో చెప్పలేని అనుభూతి కలిగింది. ఆర్య తండ్రిగా కొత్త బాధ్యతలు తీసుకున్నాడు. బిడ్డకు దేవుడి ఆశీర్వాదం ఉండాలి' అంటూ విశాల్ ట్వీట్ చేశాడు. కాగా, ఆర్య, విశాల్ కలిసి ప్రస్తుతం ‘ఎనిమీ’ సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరబాద్‌లో జరుగుతుంది. ఆర్య, సయేషా సైగల్‌లది ప్రేమ వివాహం. ‘అఖిల్' అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సాయేషా.. ఆ తర్వాత ‘గజినీకాంత్' అనే మూవీలో ఆర్యతో కలిసి నటించింది. ఆ సమయంలోనే ఆర్యతో ప్రేమాయణం సాగించింది. 2019లో మార్చ్ 10న పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. సయేషా వివాహం తరువాత సినిమాలు చేయలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం చాలా రహస్యంగా ఉంచారు. -
‘సార్పట్ట’ మూవీ రివ్యూ
టైటిల్ : సార్పట్ట జానర్ : పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా నటీనటులు : ఆర్య, దుషారా విజయన్, పశుపతి, అనుపమ కుమార్, జాన్ కొక్కెన్ తదితరులు నిర్మాణ సంస్థలు : నీలం ప్రొడక్షన్స్, కె9 స్టూడియో నిర్మాతలు : షణ్ముగం దక్షన్ రాజ్ దర్శకత్వం : పా.రంజిత్ సంగీతం : సంతోష్ నారాయణ్ సినిమాటోగ్రఫీ : మురళి.జి ఎడిటర్ : సెల్వ ఆర్.కె విడుదల తేది : జూలై(22), 2021(అమెజాన్ ప్రైమ్ వీడియో) సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కబాలి’, ‘కాలా’లాంటి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ పా.రంజిత్. వైవిధ్యమైన చిత్రాలలో నటిస్తూ టాలీవుడ్, కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆర్య. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘సార్పట్ట’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది? బాక్సర్‌గా ఆర్య ఎలా నటించాడు? ఈ చిత్రంతోనైనా పా.రంజిత్ కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథ ఈ సినిమా కథ అంతా ఎమర్జెన్సీ కాలం(70వ దశకం)లో నడుస్తుంది. ఉత్తర చెన్నైలోని ఓ హార్బర్లో హమాలి కూలీగా పనిచేసే సమర అలియాస్ సామ్రాజ్యం(ఆర్య)కి చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. స్కూల్‌కి డుమ్మా కొట్టి మరీ బాక్సింగ్ పోటీలు చూడడానికి వెళ్లేవాడు. కొడుకు బాక్సింగ్ పోటీలకు వెళ్లడం మాత్రం తల్లి భాగ్యం(అనుపమ కుమార్)కు అస్సలు నచ్చదు. కానీ సమర మాత్రం తల్లి కళ్లు కప్పి బాక్సింగ్ పోటీలను చూసేందుకు వెళ్లేవాడు. కట్ చేస్తే.. ఒకరోజు బాక్సింగ్ క్రీడకు మారుపేరైన సర్పట్టా, ఇడియప్ప మధ్య జరిగిన బాక్సింగ్ పోటీలో సార్పట్ట ఓడిపోతుంది. దీంతో సార్పట్ట తరపున బాక్సింగ్ చేసి గెలుస్తానని సమర ప్రత్యర్థులకు సవాల్ విసురుతాడు. తన తల్లి మాటను పక్కన పెట్టి ఇడియప్ప పోటీదారైన వేటపులి(జాన్ కొక్కెన్)తో పోటీ పడేందుకు సిద్దమవుతాడు. అసలు సమర బాక్సర్ అవడానికి అతని తల్లికి ఎందుకు ఇష్టం లేదు? బాక్సింగ్ బరిలోకి దిగిన సమరకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమింగే గురువు రంగా కోసం సమర ఎలాంటి సహసం చేశాడు? బాక్సింగ్ పోటీల్లో రారాజుగా వెలుగొందుతున్న వేటపులిని సమరా ఓడించాడా? లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు బాక్సర్‌గా ఆర్య అద్భుతంగా నటించాడు. సమర పాత్ర కోసం ఆర్య పడిన కష్టమంతా తెరపై కనిపిస్తుంది. బాక్సింగ్‌పై ఇష్టం ఉన్న యువకుడిగా, తల్లిమాటని జవదాటని కొడుకుగా తనదైన యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. అలాగే చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తిగాను ఆకట్టుకునే నటనను కనబరిచాడు. ఇక ఆర్య తర్వాత ఈ సినిమాలో బాగా పండిన పాత్ర పశుపతిది. గురువు రంగా అలియాస్ రంగయ్య పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఆయన స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పొచ్చు. సమర భార్య పాత్రలో దుషారా విజయన్ సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకుంది. వేటపులిగా జాన్ కొక్కెయ్ అదరగొట్టేశాడు. డాడీ పాత్రలో జాన్ విజయ్ అలరించాడు. అనుపమ కుమార్, షబ్బీర్ తదితురలు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ క్రీడా నేపథ్య చిత్రాలు ఇండియాలో ఇప్పటికే చాలా వచ్చాయి. ఆ కథలన్నింటిని ఒక్కసారి పరిశీలిసే.. ముందుగా హీరో సాధారణ వ్యక్తిగా ఉంటాడు. అతనిపై ఎవరికి ఎలాంటి అంచానాలు ఉండవు. కానీ ఏదో ఒక సంఘటన వల్ల హీరో ఆ క్రీడా రంగంలోకి సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు అతనిలోని మరో కోణం బయటపడుతుంది. ఒక ప్లాష్‌బ్యాక్... లక్ష్యం వెళ్తున్న హీరోకి అడ్డంకులు, చివరకు హీరో విజయం. ఇదే ప్రతి సినిమా నేపథ్యం. ‘సార్పట్ట’కూడా కొంచెం అటు,ఇటుగా అలాంటి కథే. బాక్సింగ్‌కి 70వ దశకం నాటి ఎమర్జెన్సీ పరిస్థితులను జోడించి చెప్పడం ఈ సినిమా స్పెషల్. అప్పటి బాక్సింగ్ సంస్కృతి ఎలా ఉండేదో తెరపై కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు పా.రంజిత్. ఇతర విషయాల జోలికి వెళ్లకుండా నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లిపోయాడు. బాక్సింగ్ అంటే ఇష్టపడే ఒక యువకుడు తల్లి కోసం ఆ ఆటకు దూరంగా ఉండటం, అనుకోని సంఘటన వల్ల బాక్సర్‌గా మారి, ప్రత్యర్థులు చేసే కుట్రలను తిప్పికొడుతూ గురువుగారి మాట నిలబెట్టటం తదితర సన్నివేశాలను ఆసక్తిగా తీర్చిదిద్దాడు. అయితే క్రీడా నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ‘భావోద్వేగం’అతి ముఖ్యమైనది. అదే సినిమా జయాపజయాలను నిర్ణయిస్తాయి. సార్పట్టలో ఆ ‘ఎమోషన్’మిస్సయింది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు కూడా పెద్దగా లేవు. సినిమా ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపించినా... కథలో, పాత్రల్లో ఒక నిలకడ లేకపోవడం ప్రతికూల అంశమే.సెకండాఫ్‌లో సాగదీత సీన్స్ సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తాయి. అలాగే ఒక్కసారి కూడా బాక్సింగ్ కోచింగే తీసుకొని హీరో.. ఉన్నట్లుండి గ్లవ్స్ వేసుకొని అత్యుత్తమ బాక్సర్‌ని చితక్కొట్టడం కొంచెం అతిగా అనిపిస్తుంది. అన్నింటికీ మించి తెలుగు ప్రేక్షకులు ఇది మన సినిమా అని ఫీలయ్యే అవకాశం ఎక్కడా లేదు. కానీ ‘కబాలి’,‘కాలా’లాంటి విభిన్న చిత్రాలను అందించిన పా.రంజిత్.. ఈ సారి భిన్నంగా స్పోర్ట్స్ డ్రామాను ఎంచుకొని, దానికి పీరియాడికల్ టచ్ ఇచ్చి తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇక సాంకెతిక విషయానివస్తే.. స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో ప్రేక్షకుడిని లీనం చేయడంలో నేపథ్య సంగీతాన్ని కీలక పాత్ర. ఆ విషయంలో సంతోష్ నారాయణ్ సక్సెస్ అయ్యాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. కానీ పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. మురళి.జి సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఇక ఈ సినిమాకు ప్రధాన లోపం సెల్వ ఆర్.కె ఎడిటింగ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలకు కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫస్టాఫ్‌లో ఉన్న జోష్.. సెకండాఫ్‌లో ఉంటే ‘సార్పట్ట’ మరోస్థాయిలో ఉండేది. మొత్తంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి ‘సార్పట్ట’నచ్చుతుంది. ప్లస్ పాయింట్స్ ఆర్య, పశుపతి నటన నేపథ్య సంగీతం దర్శకత్వం ఫస్టాప్ మైనస్ పాయింట్స్ సెకండాఫ్‌లోని సాగదీత సీన్స్ సినిమా నిడివి ఊహకందే క్లైమాక్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నా కల నిజమైంది..అలా మారడం చాలెంజింగ్: హీరో ఆర్య
అది పెద్ద సవాల్ఆర్య హీరోగా ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘సారపట్ట పరంబరై’. ఈ నెల 22 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న సందర్భంగా ఆర్య మాట్లాడుతూ– ‘‘ఒక స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలనుకుంటున్న నాకు రంజిత్ చెప్పిన ‘సారపట్ట పరంబరై’ కథ బాగా నచ్చింది. ఈ కథలో ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ బాక్సింగ్ ఉంటుంది. జీవితాలను ప్రతిబింబిస్తుంది. 1975లో మద్రాస్‌లో ఉండే బాక్సింగ్ కల్చర్‌ని చూపించాం. బాక్సర్‌గా మారడం ఫిజికల్‌గా పెద్ద చాలెంజింగ్‌గా అనిపించింది. జాతీయ స్థాయి బాక్సర్ల దగ్గర శిక్షణ తీసుకున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘నా మ్యారీడ్ లైఫ్ బాగుంది. ‘గజినీకాంత్, కాప్పాన్, టెడ్డీ’ చిత్రాల్లో సాయేషా (హీరోయిన్, ఆర్య భార్య), నేను కలిసి నటించాం. మంచి కథ దొరికితే మళ్లీ నటిస్తాం. తెలుగులో ‘వరుడు’, ‘సైజ్ జీరో’ చిత్రాల తర్వాత మరో సినిమా చేయాలని నాకూ ఉంది. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
ఓటీటీలోకి ఆర్య సర్పట్టా, ఆకట్టుకుంటున్న ట్రైలర్
తమిళ హీరో ఆర్య తాజా చిత్రం సర్పట్టా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బ్రిటిష్ పాలనలోని ఇండియా కాలం నాటి సినిమాగా రూపొందింది. ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, టీజర్లు సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఆర్య లుక్కు అయితే విశేష స్పందన వచ్చింది. ఈ మూవీ వచ్చే వారం ఓటీటీలో విడుదల కానున్న సందర్భంగా ఈ రోజు ట్రైలర్‌ను విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివిగల ఈ ట్రైలర్.. బాక్సింగ్‌లో గెలిచిన వాళ్లే తమ నాయకుడు అని ఊరి ప్రజలు మాట్లాడుకోవడంతో ప్రారంభం అవుతుంది. మొదట్లో ఊరంతా ఒకే వర్గంగా ఉండి బ్రిటిష్ వారితో బాక్సింగ్‌లో పోటీ చేసి గెలిచిన నాయకుడిని ఎన్నుకునేవాళ్ళు. ఆ తర్వాత మన భారతీయులు వాళ్లలోనే వర్గాలుగా ఏర్పడి మనవాళ్లతోనే కొట్లాడి నాయకుడిని ఎన్నుకోవడం మొదలవుతుంది. అలాంటి సమయంలో ఆ ఊరిలో వెనకబడిన జాతిగా పిలువబడి, అసలు పోటీకే అర్హత లేని వర్గం నుంచి ఆర్య పోటీలో ఎలా నిలబడి గెలిచాడన్నదే ఈ సినిమా కథగా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్య ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? జాతి వివక్ష ఎలా ఉంటుందనేది సినిమాలో చూడాల్సిందే. కాగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కే9(K9) స్టూడియోస్, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై షణ్ముగం దక్షన్ రాజ్ నిర్మించారు. జులై 22న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. -
విశాల్, ఆర్యల భారీ మల్టిస్టారర్ ‘ఎనిమీ’ షూటింగ్ పూర్తి
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్‌కు 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాగా తాజాగా ‘ఎనిమీ’ మూవీ షూటింగ్ పూర్తయినట్లు హీరో విశాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. It’s a wrap for #Enemy shoot,all set 4 Teaser soon,so damn happy & elated 2 hv worked wit a lovely team Tnx to @anandshank,@RDRajasekar,@MusicThaman,cast,crew,Tnx 2 producer @vinod_offl 4 making this lovely project Love U @arya_offl so happy we are again in a fab film together pic.twitter.com/yXTqCWzIcS — Vishal (@VishalKOfficial) July 12, 2021 ఈ సందర్భంగా...‘ఎనిమీ చిత్రీకరణను విజయవంతగా పూర్తి చేశాం. టీజర్ విడుదలకు అంతా సిద్ధమైంది. ఇటువంటి లవ్లీ టీమ్‌తో వర్క్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఆర్యతో కలిసి మళ్లీ వర్క్ చేసినందుకు ఆనందంగా ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్‌లో భాగమైన దర్శకుడు ఆనంద్‌శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, కెమెరామ్యాన్ ఆర్డి రాజశేఖర్, నిర్మాత వినోద్ కుమార్‌లతో పాటు చిత్రయూనిట్ సభ్యులందరికి ధన్యవాదలు’ అంటూ విశాల్ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తెలుగు, తమిళంతో పాటు మరిన్ని భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. -
బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న హీరోలు
తెరపై విలన్ ముఖం మీద హీరో ఒక్క కిక్ ఇస్తే.. చూసే ఆడియన్స్‌కి ఓ కిక్. హీరో వరుసగా కిక్‌ల మీద కిక్‌లు కొడుతుంటే.. ప్రేక్షకులకు దక్కే కిక్కే వేరు. కొందరు హీరోలు ఆ కిక్ ఇవ్వనున్నారు. బాక్సర్ అవతారంలో కిక్ ఇవ్వనున్న ఆ హీరోల గురించి తెలుసుకుందాం. యూత్ స్టార్ విజయ్ దేవరకొండ తన తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘లైగర్’ కోసం బాక్సర్ అవతారం ఎత్తారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు విజయ్. దీంతో ‘లైగర్’ సినిమాలో బాక్సింగ్ ఎపిసోడ్స్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోతాయని ఊహించవచ్చు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 9న రిలీజ్ చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ‘లైగర్’ షూటింగ్‌కు కాస్త అంతరాయం కలిగింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ఆరంభించనున్నారు. ఇక తొలి స్పోర్ట్స్ ఫిల్మ్ ‘గని’ చేస్తున్నారు వరుణ్ తేజ్. ఇందులో బాక్సర్ గని పాత్రలో కనిపిస్తారు వరుణ్. లాక్డౌన్ సమయాల్లో తన సమయం అంతా బాక్సింగ్ ప్రాక్టీస్‌తోనే గడిచిపోయిందని వరుణ్ పలు సందర్భాల్లో సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీన్నిబట్టి ‘గని’లో వరుణ్ నుంచి సాలిడ్ బాక్సింగ్ సీన్స్‌ను ఆశించవచ్చు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. 2013లో హీరో ఫర్హాన్ అక్తర్, దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రా కాంబినేషన్లో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం ఎంత గొప్ప విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో అథ్లెట్‌గా కనిపించారు ఫర్హాన్. ఇప్పుడు ‘తుఫాన్’ కోసం వీరి కాంబినేషన్ రిపీటైంది. అయితే ‘తుఫాన్’లో ఫర్హాన్ బాక్సర్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం జూలై 16 నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. అటు తమిళ హీరో ఆర్యను బాక్సింగ్ రింగులో దింపారు ‘కబాలి’ ఫేమ్ పా. రంజిత్. వీరి కాంబినేషన్లో వస్తున్న ‘సారపటై్ట పరంపర’లో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్య శిక్షణ కూడా తీసుకున్నారు. 1980 కాలంలోని బాక్సింగ్ కల్చర్‌ను ఈ సినిమాలో చూపించనున్నారు రంజిత్. ‘బ్రూస్లీ, సాహో’ వంటి చిత్రాల్లో నటించిన అరుణ్ విజయ్ హీరోగా తమిళంలో ‘బాక్సర్’ తెరకెక్కింది. ఇందులో రితికా సింగ్ ఓ హీరోయిన్. ‘గురు’లో బాక్సర్‌గా కనిపించిన రితికా ఈ సినిమాలోనూ ఆ పాత్ర చేశారు. ఆమె నిజంగా కూడా బాక్సర్ అనే విషయం తెలిసిందే. ఇటు సౌత్ అటు నార్త్‌లో ఈ బాక్సర్లు కొట్టే కిక్‌లకు వసూళ్ల కిక్ ఖాయం అనే అంచనాలున్నాయి. -
చిరు-అక్కీ-ఫిక్కీ.. ఓ మంచిపని
కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ సెకండ్ వేవ్‌లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్‌లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో వీళ్లు భాగం కాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌లు ఇందులో పాల్గొనబోతున్నారు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు. ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్‌లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్వర్కర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్పర్సన్ సంజయ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: సత్యదేవ్‌కి జాక్‌పాట్ -
Arya@17: అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఆర్య. 2004లో వచ్చిన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ సూపర్ హిట్ మూవీ విడుదలై నేటికి(మే 7) 17 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఆర్య సినిమా తనతో పాటు చాలా మంది జీవితాన్ని మలుపు తిప్పిదంటూ బావోధ్వేగ లేఖను ట్వీట్ చేశాడు. 17 years of ARYA today pic.twitter.com/YnOs5jDRDL — Allu Arjun (@alluarjun) May 7, 2021 ‘ఆర్య చిత్రం విడుదలై నేటికి 17 ఏళ్లు అవుతుంది. నా లైఫ్ చేంజింగ్ చిత్రాలలో ఇది కూడా ఒకటి. జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం. ఫీల్ మై లవ్ అనే బంగారు పదాలను నేను పలికిన తర్వాత ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపించడం మొదలు పెట్టారు.ఈ సినిమా కొందరి జీవితాలనే మార్చేసింది. నటుడిగా నాకు, డైరెక్టర్‌గా సుకుమార్‌కి, నిర్మాతగా దిల్‌రాజుకి, సంగీత దర్శకుడిగా దేవీశ్రీప్రసాద్(డీఎస్పీ), డీఓపీగా రత్నవేలు, డిస్ట్రీబ్యూటర్‌గా బన్నీవాసు.. ఇలా చాలా మంది జీవితాలను మార్చేసింది. ఇలాంటి మంచి హిట్ మాకిచ్చిన ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అల్లు అర్జున్ అన్నారు. Thank you & Gratitude Forever 💙 pic.twitter.com/9tVshZNQAU — Allu Arjun (@alluarjun) May 7, 2021 -
నేడు ఆర్య అప్‌కమింగ్ మూవీ ఫస్ట్‌లుక్
అరణ్మణై–3 చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న చిత్రం అరణ్మణై –3. ఈయన ఇంతకుముందు రూపొందించిన అరణ్మణై–, 1, 2 చిత్రాలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. దీంతో తాజాగా అరణ్మణై–3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇది కూడా రెండు చిత్రాల తరహాలోనే హర్రర్, కామెడీ, థ్రిల్లర్ ఇతి వృత్తంతో రూపొందుంతున్న చిత్రమే అని దర్శకుడు సుందర్ సి తెలిపారు. ఇందులో ఆర్య కథానాయకుడిగా నటించగా, రాశిఖన్నా, ఆండ్రియా, సాక్షి అగర్వాల్ ముగ్గురు కథానాయికలుగా నటించారు. నటుడు వివేక్, యోగిబాబు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సత్య సంగీతం అందించారు. చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్లను గురువారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
Vishal: దుబాయ్ టు చెన్నై
దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు హీరో విశాల్. దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్లో మేజర్‌గా యాక్షన్ సీక్వెన్సెస్‌ను షూట్ చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా దర్శకత్వంలో వచ్చిన ‘అవన్ ఇవన్ ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు!
సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖ రాశారు. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్ -
ఆర్య 2 ఆరంభం
‘ఆర్య’ వెబ్‌సిరీస్ సెకండ్ సీజన్ స్టార్ట్ అయ్యింది. సుష్మితా సేన్ ప్రధాన పాత్రలో రామ్ మద్వానీ, సందీప్ మోడీ, వినోద్ రావత్ సంయుక్త దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్య’ వెబ్‌సిరీస్ గత ఏడాది జూలైలో ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌కు మంచి వ్యూయర్షిప్ లభించింది. దీంతో వెంటనే ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌కు సెకండ్ సీజన్ ను అనౌ¯Œ ్స చేశారు. తొలి సీజన్ లో సుష్మితా సేన్ తో పాటు చంద్రాచూడ్ సింగ్, నమిత్ దాస్, వికాస్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. మరి.. సెకండ్ సీజన్ లో కూడా వీరు కనిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. -
విశాల్ వర్సెస్ ఆర్య
దర్శకుడు బాల తెరకెక్కించిన ‘వాడు వీడు’ చిత్రంలో అన్నదమ్ములుగా నటించారు విశాల్, ఆర్య. ఇప్పుడు ఒకరితో ఒకరు తలపడనున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో విశాల్, ఆర్య హీరోలుగా ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది. ఇది యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమాలో విశాల్, ఆర్య ఒకరి మీద మరొకరు ఎత్తులు, పైఎత్తులు వేసుకోనున్నారట. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. చిత్రీకరణలో పాల్గొంటున్న వీడియోను షేర్ చేసి, ‘‘మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. కొత్త టీమ్. కొత్త లుక్. కొత్త సినిమా’’ అన్నారు విశాల్. ఇందులో ‘గద్దలకొండ గణేష్’ ఫేమ్ మృణాళినీ రవి హీరోయిన్గా కనిపించనున్నారని టాక్. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. -
ప్రముఖ నటుడికి కోర్టు నోటీసులు
తమిళ సినిమా: నటుడు ఆర్యకు అంబా సముద్రం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏమిటి ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని ఆర్యకు కోర్టు నోటీసులు ఇవ్వడం ఏమిటని ఆశ్చర్యంగా ఉందా? నటీనటులు వివాదాలు చిక్కుకుపోయినా వారు నటించిన చిత్రాలు వివాదాంశం కావచ్చు కదా! అదేవిధంగా 9 ఏళ్ల క్రితం ఆర్య నటించిన అవన్ ఇవన్ చిత్రం ఆయన్ని ఇప్పుడు కోర్టుకు లాగుతోంది. బాల దర్శకత్వంలో విశాల్, ఆర్య కలిసి నటించిన చిత్రం అవన్ ఇవన్. ఈ చిత్రంలో సింగంపట్టి జమీన్‌ను అవమానపరిచే సన్నివేశాలు చోటుచేసుకున్నాయంటూ నెల్లై జిల్లా, అంబాసముద్రం కోర్టులో అప్పట్లో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ శుక్రవారం కోర్టులో విచారణకు వచ్చింది. ఆర్య ఈ నెల 28న హాజరు కావాల్సిందిగా అంబాసముద్రం కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. -
ముచ్చటైన జంట ఆర్య, సాయేషా ఫోటోలు
-
క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టిన సాయేషా
కరోనా లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన సినీ ప్రముఖుల్లో చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రముఖ తమిళ హీరో ఆర్య సతీమణి, హీరోయిన్ సాయేషా సైగల్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఓ సాంగ్‌కు క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఆమె ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు సాయేషా డ్యాన్స్ అద్భుతంగా ఉందంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాయేషా గతంలో కూడా తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (చదవండి : యువ దర్శకుడు మృతి.. విషాదంలో శంకర్) కాగా, బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్ మనవరాలైన సాయేషా.. తెలుగు చిత్రం అఖిల్‌తో వెండితెరకు పరిచమయ్యారు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాకపోవడంతో.. తెలుగులో ఆమెకు అవకాశాలు అంతగా రాలేదు. అఖిల్ అనంతరం బాలీవుడ్లో అజయ్ దేవగణ్.. శివాయ్ చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆమె తమిళంలో పలు చిత్రాల్లో నటించారు. గతేడాది హీరో ఆర్యను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి తమిళ చిత్రం కాగా, మరోకటి కన్నడ చిత్రం. -
బన్నీ, ఆర్యలకు శ్రియ చాలెంజ్..
కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌తో సామాన్యుల నుంచి మొదలుకుని సెలబ్రిటీల వరకు అందరు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో ఇళ్లకే పరిమితమైన పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కరోనాపై జనాల్లో అవగాహన పెంచడమే కాక, అభిమానులకు వినోదాన్ని అందించేలా పలు పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్ శ్రియ సరికొత్త చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. తన భర్త అండ్రీ కొచ్చిన్ కిచెన్‌లో వంట పాత్రలను శుభ్రం చేస్తున్న ఓ వీడియోను శ్రియ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చాలెంజ్‌ను(బార్తన్ సాఫ్ కరో) స్వీకరించాల్సిందిగా హీరోలు అల్లు అర్జున్, ఆర్యలతో పాటు పలువురిని నామినేట్ చేశారు. వారి అందమైన భార్యల కోసం పాత్రలు శుభ్రం చేసిపెట్టాలని ఈ సందర్భంగా శ్రియ చాలెంజ్ విసిరారు. ‘నేను నా భర్తను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా?. ఎందుకంటే.. నాకు వంట పాత్రలను కడగటం ఇష్టం ఉండదు. పెళ్లైనా మగవాళ్లు అందరూ.. వారి అందమైన భార్యలకు సాయం చేయాలని నేను చాలెంజ్ విసురుతున్నాను. నేను నా స్నేహితులు కొందరని ఈ చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను’ అని శ్రియా తెలిపారు. కాగా, తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన శ్రియ.. 2018లో ఆండ్రీ కొచ్చివ్ అనే బార్సిలోనా టెన్నిస్ ప్లేయర్‌ను ఆమె వివాహం చేసుకున్నా సంగతి తెలిసిందే. View this post on Instagram Bartan saaf karo.... So I nominate @therahulaggarwal @rahullings @atulkasbekar @ashishchowdhryofficial @anishchanana @satyasees @aarti.ravi @alluarjunonline @najafkhan1 @neerjasaran @sshauryaa23 @aryaoffl A post shared by Shriya Saran (@shriya_saran1109) on Apr 2, 2020 at 3:52am PDT -
నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను!
చెన్నై : నువ్వు లేని జీవితాన్ని కలలో కూడా ఊహించుకోలేను అని నటి సాయేషా సైగల్ పేర్కొంది. ఈ అమ్మడు ఎవరి గురించి ఇలా చెప్పిందో ఊహించవచ్చు. ఎస్ తన భర్త ఆర్య గురించే అలా తన భావాన్ని వెల్లడించింది. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత తెలుగులో అఖిల్ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత, తమిళంలోకి దిగుమతి అయిన విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి సాయేషా. ఆ తరువాత నటుడు ఆర్యతో కలిసి గజనీకాంత్ చిత్రంలో జత కట్టింది. ఆ చిత్రమే వారిద్దరిని నిజ జీవితంలో ఆలుమగలను చేసింది. అవును గజనీకాంత్ చిత్రంతో పరిచయం ఆర్య, సాయేషాసైగల్ల మధ్య ప్రేమకు దారి తీయడం,ఆ వెంటనే ఇరుకుటుంబాల సమ్మతంతో పెళ్లి చేసుకోవడం చాలా సైలెంట్‌గా జరిగిపోయాయి. 2019, మార్చి 10 తేదీ ఈ జంట నిజజీవితంలో ఒకటైన రోజు అంటే మంగళవారానికి సరిగ్గా వివాహ తొలి వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కాగా ఈ సందర్భంగా ఆర్య, సాయేషా తాజాగా కలిసి నటిస్తున్న టెడీ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.ఇదో విశేషం అయితే తొలి వివాహ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ జంటకు పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్య గురించి సాయేషా తన ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. అందులో నన్ను అన్ని విధాలుగా సంపూర్ణం చేసిన మనిషికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేని జీవితాన్ని ఊహించలేను. ప్రేమ,ఉత్సాహం, స్థిరత్వం, స్నేహం అన్నీ ఒకేసారి లభించాయి. నేను నిన్ను ఇప్పటికీ, ఎప్పటికీ ఇష్టపడతాను అని పేర్కొంది.అందుకు నటుడు ఆర్య బదులిస్తూ ఎప్పటికీ అన్నది భవిష్యత్ కాలం. అయితే దాన్ని నీతో గడపడానికి ఎలాంటి సంకోచంలేదు. నేను నేనుగా ఉండడానికి కారణం నువ్వే. నేను నిన్ను ఎంతగానే ప్రేమిస్తున్నాను. నువ్వు నువ్వుగా ఉండడానికి ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు అని ఆర్య పేర్కొన్నారు. వీరు ఒకరికొకరుఇలా ప్రేమ నిండిన మనసుతో శుభాకాంక్షలు తెలుపుకున్న విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
‘నువ్వు లేకుండా జీవితాన్ని ఊహించలేను’
తమిళ నటుడు ఆర్య, నటి సయేషా సైగల్ ప్రేమ వివాహం చేసుకొని ఈ రోజుతో ఏడాది పూర్తి అవుతోంది. కొంతకాలం ప్రేమించుకున్న ఈ జంట గతేడాది మార్చి 10న వివాహ బంధంతో ఒకటయ్యారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈ క్యూట్ కపూల్కి సెలబ్రిటీలు, అభిమానులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ శుభ సందర్భంగా సాయేషా, ఆర్య ఇద్దరూ ఒకరిమీద ఒకరికి ఉన్న ప్రేమను చాటుకున్నారు. ఇద్దరు కలిసి ప్రేమగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ('ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా') ఈ మేరకు.. ‘నా జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు లేకుండా నా జీవితాన్ని అస్సలు ఊహించలేను జాన్. అన్ని వేళలా నువ్వు చూపే ప్రేమ అమూల్యమైనది. ఇప్పుడు.. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. బెస్ట్ హస్బెండ్’ అంటూ ఆర్య మీద ఉన్న ప్రేమను సయేషా సైగల్ తెలియ జేశారు. అలాగే ఆర్య ‘ఎల్లకాలం అనే పదం చాలా పెద్దది. కానీ నేను నీతో ఉన్నప్పుడు సమయమే గుర్తురాదు. నీవల్ల నేను ఇంకా ఎక్కువ ఆనందంగా ఉన్నాను. నా జీవితంలోకి వచ్చినందుకు ధన్యవాదాలు. లవ్ యూ సోమచ్ మై జాన్. హ్యాపీ యానివర్సరీ’ అంటూ భార్యకు వివాహ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు. తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన సాయేషా.. ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమె బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మనువరాలు. గజినీకాంత్ చిత్రంలో కలిసి నటించిన ఆర్య, సయేషా.. ఈ సినిమా షూటింగ్ సమయంలోనూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి గతేడాది పెళ్లి పీటలెక్కారు. ఆర్య ప్రస్తుతం ‘టెడీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషా సైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ రోజే సినిమా టీజర్ విడుదలవ్వడం మరో విశేషం. Happy Anniversary to the man who completes me in every way possible! Life without you is unimaginable jaan. Love, excitement, stability and companionship all at the same time! I love you now and forever! ❤️😘😍#besthusband @arya_offl pic.twitter.com/MPUx5HJ3JU — Sayyeshaa (@sayyeshaa) March 10, 2020 Forever is a long time but I don’t mind spending it with you 😉😉🤗🤗😍😘😘🤩🤩 I am more of me because of you .. love u so much my jaan 🤗🤗😘 thanks for being you .. Happy Anniversary 🤗🤗😘😘 https://t.co/Je0LkI5f4k — Arya (@arya_offl) March 10, 2020 -
'ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా'
పాత్రలకు తగ్గట్టుగా మారడానికి హీరోలు చాలా శ్రమపడుతున్నారు. ఆరు పలకలు, ఎనిమిది పలకలు అంటూ కఠిన కసరత్తులతో బాడీని మార్చుకుంటున్నారు. అలాంటి వారిలో నటుడు ఆర్య చేరారు. ఈయన ఇప్పటి గెటప్ చూస్తే ఆర్యనేనా అని ఆశ్చర్యపడతారు. ఇటీవల కాప్పాన్ చిత్రంలో కనిపించిన ఆర్య ప్రస్తుతం టెడీ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన భార్య సాయేషాసైగల్నే హీరోయిన్గా నటించడం విశేషం. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తాజాగా పా.రంజిత్ దర్శకత్వంలో నటించడానికి ఆర్య రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన బాడీ బిల్డర్‌గా మారారు.దర్శకుడు పా.రంజిత్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన కాలా తరువాత పిర్చా ముండా అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. చదవండి: ఈ హీరోను గుర్తుపట్టారా? అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. దీంతో ఇప్పుడు నటుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసరాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే దీని గురించి చిత్ర వర్గాలు అధికారికంగా గురువారం వెల్లడించారు. ఇందులో ఆర్య బాక్సింగ్ క్రీడాకారుడిగా నటిస్తున్నారు. అందుకోసం ఆయన తన బాడీని పూర్తిగా మార్చుకున్నారు. కఠినంగా కసరత్తులు చేసి సిక్స్‌ప్యాక్‌కు తయారయ్యారు. ఆయన బాడీని చూస్తుంటే ఇండియన్ టైసన్లా ఉన్నారు. ఆ ఫొటోలను ఆయన ట్విట్టర్లో విడుదల చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఆయన మిత్ర వర్గం వావ్ అదుర్స్ అంటూ అభినందనల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: అతడితోనే తాళి కట్టించుకుంటా: అనుష్క ఇక అభిమానులైతే సూపర్ అంటూ లైకులు కొడుతున్నారు. దీంతో ఆర్య నటించే చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. కాగా ఆర్య తాజా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర యూనిట్ ఇంకా వెల్లడించలేదు. అయితే నటుడు కలైయరసన్, దినేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు ఇంతకు ముందే ప్రచారం జరిగింది. నటుడు ఆర్యకు అర్జెంట్‌గా ఇప్పుడు ఒక హిట్ కావాలి. దీంతో ఆయన తన చిత్రాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అందులో భాగమే ఈ సిక్స్‌ప్యాక్‌కు రెడీ అవడం అని భావించవచ్చు. -
ఈ హీరో ఎవరో చెప్పగలరా?
కండలు తిరిగిన దృఢకాయంతో మతి పోగొడుతున్న ఈ హీరో ఎవరో చెప్పగలరా? అటు తిరిగి నిలుచోవడంతో గుర్తు పట్టలేకపోతున్నారా? దక్షిణాది ప్రేక్షకులకు చిరపరిచితమైన విలక్షణ నటుడు ఇతడు. తమిళ సినిమాల్లో హీరోగా సత్తా చాటిన ఈ నటుడు విలన్‌గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అతనెవరో కాదు తమిళ హీరో ఆర్య. తన 30వ సినిమా కోసం తీవ్రంగా శ్రమించి కండలు పెంచి కొత్త అవతారంలోకి మారిపోయాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు గురువారం వెల్లడిస్తానని చెబుతూ ఈ ఫొటోను ఆర్య ట్వీట్ చేశాడు. ‘మీరంతట మీరు బలవంతులుగా మారేంత వరకు తెలియదు మీరెంత బలవంతులో’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు. ఆర్య లేటెస్ట్ ఫొటోపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఊహించని హార్డ్‌వర్క్, అంకితభావంతో స్ఫూర్తిగా నిలిచారని ఆయన భార్య సాయేషా సైగల్ పేర్కొన్నారు. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎన్ ప్రసాద్, నటి శ్రియారెడ్డి, టీవీ యాంకర్ డీడీ నీలకందన్ తదితరులు ఆర్యను మెచ్చుకుంటూ ట్వీట్లు పెట్టారు. కాగా, ఆర్య నటించిన తాజా చిత్రం ‘టెడ్డీ’ విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషా సైగల్ నటించడం విశేషం. జ్ఞానవేల్‌రాజా నిర్మించిన ఈ చిత్రంలో గ్రాఫిక్స్‌కు పెద్దపీట వేశారు. (చదవండి: టెడ్డీ చిత్రం కథేంటి?) -
హాయ్ హారర్
‘ఇలాంటి సినిమాలో నటించాలి’ అని ప్రతి ఆర్టిస్ట్ కి ఒక ‘విష్ లిస్ట్’ ఉంటుంది. అది నెరవేరే టైమ్ వచ్చినపుడు ఆనందపడిపోతారు. ఇప్పుడు రాశీ ఖన్నా ఆ ఆనందంలోనే ఉన్నారు. ఈ బ్యూటీ విష్ లిస్ట్‌లో హారర్ సినిమా చేయాలని ఉంది. ‘అరణ్మణై 3’తో హారర్ జానర్‌కి హాయ్ చెప్పే అవకాశం ఆమెకు వచ్చింది. సుందర్. సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మౖణె’, ‘అరణ్మణై 2’ పెద్ద హిట్. ఇప్పుడు మూడో భాగం తీయడానికి సుందర్ సిద్ధమయ్యారు. ఇందులో రాశీ ఖన్నా కథానాయికగా నటించబోతున్నారు. ఆండ్రియా మరో కథానాయిక. ఆర్య హీరో. తొలి, మలి భాగాల్లో నటించిన సుందర్ ఇందులోనూ కీలక పాత్ర చేయబోతున్నారు. ‘‘హారర్ జానర్ మూవీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ‘అరణ్మణై’ సిరీస్‌తో ఆ కోరిక నెరవేరబోతోంది. ఫస్ట్, సెకండ్ పార్ట్స్ చూశాను. చాలా బాగుంటాయి. మూడో భాగం షూటింగ్లో పాల్గొనడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు రాశీ ఖన్నా. ఫిబ్రవరి నెలాఖరున లేక మార్చిలో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. -
టెడ్డీ ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది..
నటుడు ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టెడ్డీ. ఇది పలు విశేషాలతో కూడి ఉంటుందంటున్నారు దర్శకుడు శక్తిసౌందర్‌రాజన్. ఈయన ఇంతకు ముందు టిక్ టిక్ టిక్ అనే స్పై చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం. గ్రాఫిక్స్‌తో కూడిన చిత్రాలను రూపొందించడంలో సిద్ధహస్తుడైన ఈయన తాజా చిత్రం టెడ్డీలోనూ గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యత ఉంటుందట. ఆర్యకు జంటగా ఆయన భార్య సాయేషాసైగల్ నటిస్తున్న చిత్రం ఇది. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఆర్య వెనుక టెడ్డీబేర్ నిలబడి తొంగి చూస్తున్న ఫస్ట్‌లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. టెడ్డీ చిత్రం కథేంటి? టెడ్డీబేర్ పాత్ర విశేషాలు ఏమిటి? గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఎంత? వంటి పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ! ఆ సందేహాలను చిత్ర దర్శకుడిని అడిగి తెలుసుకుందాం! ప్ర: ఈ చిత్రానికి టెడ్డీ అని పేరు నిర్ణయించడానికి కారణం? జ: చిత్రంలో ఆర్యకు టెడ్డీబేర్‌కు చాలా సంబంధం ఉంటుంది. అయితే ఈ చిత్రానికి చాలా పేర్లను పరిశీలించాం. చివరికి అందరికీ పరిచయం అయిన టెడ్డీ పేరునే చిత్రానికి ఖరారు చేశాం. టెడ్డీ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తేనే టైటిల్ ప్రాముఖ్యత మీకు అర్థం అయ్యి ఉంటుంది. పెద్దల నుంచి పిల్లల వరకూ ఎలా టెడ్డీబేర్‌ను ముద్దులాడతారో అలా ఈ టెడ్డీ చిత్రాన్ని చూసి అలరిస్తారు. అలా చిత్రాన్ని తయారు చేయడానికి శ్రమిస్తున్నాం. ప్ర: ఇంతకు ముందు బ్యాంకు దోపిడీ. జోంబి, అంతరిక్షం నేపథ్యాల్లో చిత్రాలను తెరకెక్కించారు. మరి ఈ టెడ్డీ ఏ జానర్లో ఉంటుంది? జ: దీన్ని ఒక్క మాటలో పలానా జానర్ చిత్రం అని చెప్పడం కుదరదు. చిత్రంలో హీరోతో పాటు కంప్యూటర్‌కు సంబంధించిన పాత్ర ఉంటుంది. దాన్ని రూపాన్ని గ్రాఫిక్స్‌లో మాత్రమే ఆవిష్కరించాల్సి ఉంటుంది. అదే టెడ్డీబేర్ పాత్ర. ఇదే చిత్రంలో ప్రత్యేకం. చిత్రంలో సెకెండ్ పాత్ర ఇదే. టెడ్డీబేర్‌ను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో సహజత్వానికి అద్దం పట్టేలా రూపొందిస్తున్నాం. ఈ టెడ్డీబేర్ ఫైట్స్ కూడా చేస్తుంది. అదే ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ప్ర: వివాహానంతరం ఆర్య, సాయేషాలను హీరోహీరోయిన్లుగా నటింపజేయాలన్న ఆలోచన గురించి? జ: నిజం చెప్పాలంటే వారిద్దరినీ హీరోహీరోయిన్లుగా నటింపజేయడానికి భయపడ్డాను. అయితే కథ విన్న వారం రోజుల్లోనే పాత్రకు ప్రాముఖ్యత ఉండడంతో నటి సాయేషా నటించడానికి అంగీకరించారు. ప్ర: అజర్బైజాన్ దేశంలో షూటింగ్ చేయడానికి కారణం? జ:అది చాలా పురాతన దేశం. ఇప్పుడు అదే రష్యా. అప్పట్లో భారతీయ చిత్రాలను అక్కడి ప్రజలు ఎక్కువగా చూసేవారు. నటి సాయేషా ప్రఖ్యాత నటుడు దిలీప్‌కుమార్ మనవరాలు అని తెలవగానే అక్కడి ప్రజలు సంతోషంగా దిలీప్‌కుమార్ అంటూ పెద్దగా కేకలు పెట్టారు. ఒక బామ్మ నటుడు ఆర్యను పట్టుకుని అటూ ఇటూ ఊపేసింది. ఎందుకమ్మా? అని అంటే మదరాసు పట్టణం చిత్ర సీడీ చూపించి ఇందులో నటించింది నువ్వేగా అని అడిగింది. అంతగా ఇండియన్ చిత్రాలను ఇప్పటికీ య్యూట్యూబుల్లో అక్కడి ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్ర: చిత్ర నిర్మాత జ్ఞానవేల్‌రాజా గురించి? జ: టిక్ టిక్ టిక్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జ్ఞానవేల్‌రాజాను కలిశాను. బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ వంటివి ఏమీ అడగకుండా చిత్రం చేద్దాం అని చెప్పారు. ఇప్పటికీ ఇంత బడ్జెట్ అని నిర్ణయించలేదు. చిత్రానికి అవసరం అయిన వన్నీ సమకూర్చుతున్నారు. నిర్మాత జ్ఞానవేల్‌రాజా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆయన నిర్మాణ సంస్థలో చాలా మైలురాయి చిత్రాలు ఉన్నాయి. వాటిలో ఈ టెడ్డీ చిత్రం కూడా చేరుతుందని చెప్పగలను -
‘ఆర్యా అజింక్యా రహానే’
పిల్లలకు పేరు పెట్టడానికి చాలామంది పెద్ద కసరత్తే చేస్తుంటారు. రకరకాల అక్షరాలను ఒకచోట చేర్చి కొత్త పేర్లకు శ్రీకారం చుడతారు. వాళ్లలాగే మన టీమ్ ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఎన్ని పుస్తకాలు తిరగేశారో కానీ.. మొత్తానికి తన కూతురుకి ‘ఆర్య’ అనే పేరును ఫిక్స్ చేశారు. రహానే, రాధిక దంపతులకు అక్టోబరు 5 న ఆర్య పుట్టింది. ఇన్నాళ్లకు ఆ పాప ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఫొటో కింద ‘ఆర్యా అజింక్యా రహానే’ అని కాప్షన్ ఇచ్చాడు రహానే. అలా తన కుమార్తె పేరు ఆర్య అని పరోక్షంగా ప్రకటించాడు. ఆర్య అనగానే మగపిల్లాడు అనిపిస్తుంది. నిజానికి అది అమ్మాయి పేరు. ఆర్య అనే మాటకు పదహారేళ్ల యువతి, పార్వతి, దుర్గ, ధాన్యం, తల్లి, అత్తగారు.. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారి తల్లి పేరు ఆర్యాంబ. శ్రీరాముడిని సంబోధించే సమయంలో కూడా ‘ఆర్యపుత్రా’ అనటం తెలిసిందే! ఏమైనా ఇంత అందమైన అర్థవంతమైన పేరును తల్లిదండ్రుల చేత పెట్టించుకున్న ఆర్యకు శతాయుష్మాన్‌భవ!! -
భాషతో పనేంటి?
చెన్నై : భాషతో పనేంటి? అని ప్రశ్నిస్తోంది నటి సాయేషా సైగల్. ఈ బాలీవుడ్ బ్యూటీ తొలుత టాలీవుడ్‌కు దిగుమతి అయినా, ఆ తరువాత కోలీవుడ్‌లో సెటిల్ అయింది. ఇప్పుడు నటిగానే కాదు చెన్నైని తన అత్తిల్లుగా మార్చేసుకుంది. కోలీవుడ్‌లో ‘వనమగన్’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సాయేషాసైగల్ తొలి చిత్రంతోనే ప్రశంసలు అందుకుంది. ఆ తరువాత వరుసగా అవకాశాలు రాబట్టుకుంది. కడైకుట్టిసింగం, జూంగా, గజనీకాంత్ తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఈ అమ్మడు రెండు చిత్రాలకు కృతజ్ఞతలు చెప్పుకునే తీరాలి. అందులో ఒకటి వనమగన్. నటిగా మలుపు తిప్పిన చిత్రం ఇదే. ఇక రెండోది గజనీకాంత్. ఇది ఇంకా సాయేషాకు మరిచిపోలేని చిత్రం. కారణం నటుడు ఆర్యతో పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని పెంచిన చిత్రమే కాకుండా వారి ప్రేమను పండించిన చిత్రం గజనీకాంత్. ఇక కాప్పాన్ చిత్రం కూడా సాయేషా సైగల్ చిత్రంలో గుర్తిండిపోయే చిత్రమే అవుతుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఆర్యతో ఏడడుగులు వేసి అర్ధాంగిగా మారిపోయింది. కాగా చివరిగా ఈ బ్యూటీ నటించిన చిత్రం కాప్పాన్. సూర్య కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆర్య కూడా కీలక పాత్రను పోషించారు. ప్రస్తుతం తన భర్త ఆర్యకు జంటగా టెడ్డీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సందర్భంగా సాయోషా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. హిందీలో అజయ్‌దేవగన్ సరసన నటించిన శివాయ్ చిత్రం విజయం సాధించడం కారణంగానే నటిగా తనకు పలు అవకాశాలు వచ్చాయని తెలిపింది. ఇప్పుడు సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటించే స్థాయికి ఎదిగానని అంది. నటననూ నేర్చుకున్నానని చెప్పింది. ఇంకో విషయం ఏమిటంటే నటనకు కళ్లు చాలని పేర్కొంది. ఆ రెండు కళ్లు ఎన్ని భావాలనైనా పలికిస్తాయంది. అందుకు భాషతో పనే లేదని పేర్కొంది. తాను సినిమా కుటుంబం నుంచి వచ్చినా ఇంట్లో సినిమా గురించి మాట్లాడటం తక్కువేనని చెప్పింది. తమ కుటుంబానికంతా ప్రయాణం చేయడం ఇష్టం అని తెలిపింది. దక్షిణభారత సినిమా సాంకేతిక పరంగా చాలా అభివృద్ధి చెందిందని చెప్పారు. అది కాప్పాన్ చిత్రంలో చూశానని చెప్పింది. సూర్యకు జంటగా నటిస్తానని కలలో కూడా ఊహించలేదని పేర్కొంది. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను భవిష్యత్‌లో తనకు ఉపకరిస్తాయని అంది. ఇప్పుడు పాత చిత్రాలను రీమేక్ చేసే ట్రెండ్ నడుస్తోందని, అలా హిందీ చిత్రం రామ్ లక్కన్‌ను ఎవరైనా రీమేక్ చేస్తే అందులో మాధురీదీక్షిత్ పాత్రలో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. అందులో డాన్స్‌కు ఎక్కువ అవకాశం ఉందని, తాను డాన్స్‌లో శిక్షణ పొందిన నటినని తెలిపింది. తనలోని నాట్యకళాకారిణిని ఆవిష్కరించేలా పూర్తి నాట్యభరిత కథా చిత్రంలో నటించాలని కోరుకుంటున్నానని నటి సాయేషా సైగల్ పేర్కొంది. -
కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్!
సాక్షి, తమిళసినిమా: దర్శకుడు బాలా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సేతు చిత్రంతో విక్రమ్‌కు, నందా చిత్రంతో సూర్యకు, నాన్ కడవుల్ చిత్రంతో ఆర్యకు లైఫ్ ఇచ్చిన దర్శకుడీయన. దర్శకుడిగా వైవిధ్యానికి మారుపేరుగా పేరొందిన ఆయన.. తొలిసారిగా ఒక రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించడానికి అంగీకరించడం గతంలో చాలామందిని ఆశ్చర్యపరిచింది. అదే తెలుగులో సంచలన విజయాన్ని సాధించిన అర్జున్‌రెడ్డి చిత్రం. ఈ చిత్ర తమిళ రీమేక్‌లో విక్రమ్ కొడుకు ధ్రువ్‌ను హీరోగా పరిచయం చేయాలని ఆయన భావించారు. వర్మ చిత్రాన్ని ఆయన రీమేక్ చేసినప్పటికీ.. చిత్రీకరణ అంతా పూర్తయిన తరువాత నిర్మాతలు ఇది అసలు అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌లా లేదు, బాలా సరిగా తీయలేదంటూ పక్కన పడేశారు. నూతన దర్శకుడితో ఆదిత్యవర్మ పేరుతో మళ్లీ ఆ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇంతకంటే బాలాకు జరిగిన అవమానం వేరే ఉండదు. దీంతో ఆయన చాలా కసిగా ఒక కథను తయారు చేశారని సమాచారం. విశేషం ఏమిటంటే ఇది మల్టీస్టారర్ సినిమా. ఇందులో నటించడానికి సూర్య సమ్మతించినట్లు సమాచారం. అంతేకాదు మరో హీరోగా నటుడు ఆర్య, అధర్వ కూడా నటించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముగ్గురు ఇంతకుముందు బాలా దర్శకత్వంలో నటించినవారే. వారిప్పుడు ఆయనకు అండగా నిలవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాహుబలి ఫేమ్ రానాను నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఇక కథానాయికలుగా మహిమ, బిందుమాధవి నటించే అవకాశమున్నట్లు తెలిసింది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముంది. ఈ సినిమా సూపర్‌హిట్ అవ్వాలన్న కసి, పట్టుదలతో బాలా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఈ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. -
‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ!
చెన్నై : ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ.. ఏంటీ సడన్‌గా పాటందుకున్నారు అని అనుకుంటున్నారా? వాస్తవాన్ని చెప్పడంలో తప్పులేదుగా. ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉందన్నది బయట పడితేనే గానీ తెలియదు. నటుడు ఆర్య మంచి నటుడన్న విషయం తెలిసిందే. అయితే ఆయనలో నలభీముడున్న విషయం హీరోయిన్లకు బిరియానీ విందునివ్వడంతోనే వెలుగు చూసింది. ఇది ఆర్యలోని ఇంకో టాలెంట్ అని చెప్పవచ్చు. ఇక ఆయన హీరోయిన్లను మచ్చిక చేసుకోవడంలో సిద్ధహస్తుడంటారు. అదీ టాలెంటే. కాగా తాజాగా ఆయన అర్ధాంగి సాయేషాసైగల్లోనూ మరో టాలెంట్ ఉన్న విషయం బహిర్గతమైంది. వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. నటిగా పరిచయం అయిన కొద్ది కాలంలోనే ఆర్యతో ప్రేమలో పడి, వెనువెంటనే ఆయన్ని పెళ్లి చేసుకున్న సంగతి విధితమే. ఆర్య ఆమెకు నటించరాదని ఆక్షలు విధించకపోయినా, సెలెక్టెడ్ చిత్రాలనే చేయాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం సూర్యకు జంటగా కాప్పాన్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో నటుడు ఆర్య ఒక ముఖ్య పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా తన భర్త ఆర్యకు జంటగా టెడీ అనే చిత్రంలో నటిస్తోంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడికి కొంచెం తీరిక దొరుకుతుండడంతో తనలోని మరో టాలెంట్‌ను బాహ్య ప్రపంచానికి తెలిపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఒండ్రా ఇరండా అనే పాటను పాడి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. నటుడు సూర్య, జ్యోతిక జంటగా నటించిన కాక్క కాక్క చిత్రంలోని ఆ పాటను బాంబే జయశ్రీ పాడారు. ఈ పాటను నటి సాయేషా గొంతు నుంచి వచ్చి మరింత మధురంగా ఉండడంతో సంగీత ప్రియుల లైక్‌లు పెరిగిపోతున్నాయి. దీని గురించి స్పందించిన నటి సాయేషా తనకు పాడడం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. అలా తనకు నచ్చిన పాటను షూటింగ్ విరామ సమయంలో పాడినట్లు తెలిపింది. అయితే ఇందుకోసం ఎలాంటి శిక్షణ తీసుకోలేదని, తప్పులుంటే మన్నించండి అని అంది. నటనే తెలుసనుకుంటే పాడడం కూడా తెలుసా ఈ అమ్మడికి అని ఆశ్చర్యపడుతున్న అభిమానులు మొత్తం మీద చేతిలో మరో వృత్తిలో కూడా టాలెంట్ ఉందన్నమాట అని ప్రశంసిస్తున్నారు. మరి నటి సాయేషాను త్వరలో గాయనిగా కూడా చూసే అవకాశం లేకపోలేదని అంటున్నారు నెటిజన్లు. అయినా సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీకి ఆ మాత్రం టాలెంట్ ఉండదా ఏమిటి? కాకపోతే ఈ ఉత్తరాది భామ తమిళ పాటను అంత చక్కగా పాడడం అభినందనీయమే. -
కొండల్లో థ్రిల్
ఆర్య, కేథరిన్ థెరిస్సా జంటగా రాఘవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కదంబన్’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించి, ఆర్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల్ల ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులోకి అనువదించారు. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ– ‘‘ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా హీరో, హీరోయిన్ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఈ సినిమా కోసం ఆర్య బాగా బరువు పెరిగారు. కేథరిన్, ఆర్య జంట తెరపై కనువిందు చేస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: భారతి వరప్రసాద్ వడ్డెల్ల. -
భర్తపై హీరోయిన్ ప్రశంసల జల్లు..!
సాక్షి, తమిళ సినిమా: పెళ్లి తరువాత భార్య నుంచి ప్రశంసలు లభిస్తే.. ఆ ఆనందమే వేరు. ఇప్పుడు నటుడు ఆర్య అలాంటి ఆనందాన్నే ఆస్వాదిస్తున్నాడు. ఈ సంచలన నటుడు ఇటీవల అనూహ్యంగా నటి సాయేషా సైగల్‌ను ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. ‘నాన్ కడవుల్’ చిత్రంతో నటుడిగా తానేమిటో నిరూపించుకున్న ఆర్య.. ఆ తరువాత బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి వంటి విజయవంతమైన చిత్రాలతో కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన కంబన్, గజనీకాంత్ వంటి చిత్రాలు కొంత నిరాశపరిచాయి. దీంతో ఆర్యకు ఇప్పుడు అర్జెంట్‌గా ఒక హిట్ కావాలి. ఈ క్రమంలో సూర్య హీరోగా నటిస్తున్న ‘కాప్పాన్’ చిత్రంలో ఆర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఆర్య హీరో కాకపోయినా, ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని సమాచారం. ఇకపోతే ఆర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మహాగురు. ఇంతకుముందు మౌనగురు చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు శాంతకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆర్యకు జంటగా ఇందుజా, మహిమా నంబియార్ నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ టీజర్ భార్య సాయేషా సైగల్తోపాటు ఆమె అమ్మను కూడా ఫిదా చేసిందట. ఈ చిత్ర టీజర్ గురించి నటి సాయేషా సైగల్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ఎంతో శ్రమించి.. ఆర్య ఈ సినిమాలో కొత్త గెటప్‌తో సరికొత్తగా కనిపించబోతున్నారని, ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి కలుగుతోందని పేర్కొన్నారు. ఆమె తల్లి కూడా టీజర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. -
కవిత కుమారుడిని పరామర్శించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మనవడు ఆర్యను (నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరామర్శించారు. ఎంపీ కవిత రెండో కుమారుడు ఆర్య తీవ్ర జ్వరంతో ఈ నెల 15వ తేదీ నుంచి రెయిన్ బో హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు. నిన్న మధ్యాహ్నం కేసీఆర్ స్వయంగా హాస్పటల్‌కి వెళ్లి మనవడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యులను ఆయన కోరారు. కాగా ఆర్యను ఇవాళ హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. -
నా జీవితాన్ని మార్చేసింది
ప్రేమలో కొత్త యాంగిల్‌ని చూపించిన చిత్రం ‘ఆర్య’ (2004). అల్లు అర్జున్ హీరోగా ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంతో సుకుమార్ దర్శకునిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా పాటలతో కెరీర్లో మంచి మైలేజ్ పొందారు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా విడుదలై 15ఏళ్లు ముగిసింది. ఈ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ– ‘‘ఆర్య’ సినిమా ఫీల్‌ని ఇంకా ఆస్వాదిస్తున్నాను. నా లైఫ్‌లో మోస్ట్ మ్యాజికల్ ఫిల్మ్ ఇది. నా జీవితాన్ని మార్చేసిన ‘ఆర్య’ సినిమా రిలీజై 15ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకున్నాను. సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రత్నవేలు, ‘దిల్’ రాజుగారు.. ఇలా టీమ్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాను మెచ్చిన ప్రేక్షకులను మరచిపోలేను’’ అని అల్లు అర్జున్ అన్నారు. ‘‘15ఏళ్ల క్రితం ఇదే రోజున (మే 7) ‘ఆర్య’ సినిమా విడుదలై నాకు, బన్నీ (అల్లు అర్జున్), సుకుమార్‌కి మంచి విజయాన్ని అందించింది. అల్లు అర్జున్‌తో నాలుగో సినిమా చేయబోతున్నాను’’ అని ‘దిల్’ రాజు పేర్కొన్నారు. బన్నీ–‘దిల్’ రాజు కాంబినేషన్లో ఆర్య, పరుగు, డీజే చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగో సినిమా టైటిల్ ‘ఐకాన్’. వేణు శ్రీరామ్ దర్శకుడు. -
బిందుమాధవికి భలేచాన్స్
నటి బిందుమాధవికి భలే చాన్స్ తలుపు తట్టనుందని సమాచారం. తెలుగింటి ఆడపడుచు అయిననీ అమ్మడు, తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. కళుగు వంటి చిత్రాల్లో నటిగా చక్కని ప్రతిభను చాటుకుని ప్రశంసలు అందుకుంది. అయినా ఎందుకనో నటిగా రావలసినంత పేరు రాలేదు. ఈ మధ్య చేతిలో అకాశాలు లేక సొంత ఊరికి వెళ్లిపోయింది కూడా. అలాంటి బిందుమాధవికి అనుకోకుండా ఒక లక్కీచాన్స్ తలుపుతట్టిందన్నది తాజా సమాచారం. దర్శకుడు బాలా విషయానికి వస్తే ఈయన చిత్రాల్లో నటులెంత వాళ్లైనా పాత్రలే కనిపిస్తాయి. బాలా ప్రస్తుతం యువ హీరోలతో మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల సూర్య హీరోగా చిత్రం చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. బాలా కథను వినిపించారని, అది సూర్యకు బాగా నచ్చిందని టాక్ స్ప్రెడ్ అయింది. అయితే ప్రస్తుతం సూర్య వరుసగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ఎన్జీకే చిత్రం మేడే సందర్భంగా తెరపైకి రానుంది. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించిన కాప్పాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబరులో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఆ తరువాత శివ దర్శకత్వంలో ఒక చిత్రం, హరి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నారు. దీంతో బాలా దర్శకత్వంలో ప్రస్తుతం నటించలేనని చెప్పడంతో ఆయన మరో కథను తయారు చేసుకున్నారు. ఇందులో యువ నటులు ఆర్య, అధర్వ హీరోలుగా నటించడానికి సై అన్నారు. ఇందులో బిందుమాధవికి నటించే అవకాశం వచ్చిందని సమాచారం. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించడం మరో విశేషం. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
18 మెట్లు
నాలుగు దశాబ్దాల కెరీర్లో దక్షిణ, ఉత్తరాది భాషల్లో దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన మమ్ముట్టి ఇప్పుడు 18 మెట్లు ఎక్కబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం పేరు ‘పదునెట్టామ్ పడి’. అంటే.. 18 మెట్లు అని అర్థం. ఈ చిత్రంలో మమ్ముట్టి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన జాన్ అబ్రహాం పాలక్కల్ అనే ప్రొఫెసర్ పాత్ర చేస్తున్నారు. స్టైలిష్ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారాయన. శంకర్ రామకృష్ణన్ దర్శకుడు. ఈ చిత్రంలో మమ్ముట్టి లుక్‌కి మంచి స్పందన లభించింది. ఆయనది సినిమాకి కీలకంగా నిలిచే అతిథి పాత్ర అని సమాచారం. పృథ్వీరాజ్, ప్రియా ఆనంద్, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
హ్యాపీ హనీమూన్
జీవితపు ఆనందక్షణాలను ఫొటోలలో దాచుకుంటున్నారు కోలీవుడ్ కొత్త దంపతులు ఆర్య, సాయేషా. ఈ నెల 10న ఈ ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జంట విదేశాల్లో హనీమూన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయేషా. ‘‘సూర్యకాంతి సమక్షంలో మా ప్రేమను ఫుల్‌గా ఆస్వాదిస్తున్నాం. ఇక్కడున్న ఫొటోలను నా భర్త (ఆర్య) తీశారు. హనీమూన్ జ్ఞాపకాలను మనసులోనే కాదు.. ఫొటోల్లోనూ దాచుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సాయేషా. ఇక సినిమాల విషయానికి వస్తే... పెళ్లికిముందు గజనీకాంత్, ‘కాప్పాన్’ సినిమాలో నటించారు సాయేషా, ఆర్య. ‘కాప్పాన్’ చిత్రంలో సూర్య హీరోగా నటించారు. పెళ్లి తర్వాత ఆర్య, సాయేషా జంటగా ‘టెడ్డీ’ అనే సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు శక్తిసుందర్ రాజన్ దర్శకత్వం వహిస్తారు. -
టెడ్డీలో జోడీ
కోలీవుడ్ న్యూ కఫుల్ ఎవరంటే ఎవరైనా సరే ఆర్య, సాయేషా అని చెబుతారు. ‘గజనీకాంత్’ చిత్రం షూటింగ్ టైమ్‌లో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ‘కాప్పాన్’ సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఈ జంట ‘టెడ్డీ’ అనే కొత్త సినిమాలో యాక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. శక్తి సౌందరరాజన్ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించనున్న చిత్రం ‘టెడ్డీ’. ఈ సినిమాను ఆర్య, సాయేషా వివాహం రోజే (మార్చి 10)అనౌన్స్ చేయడం విశేషం. మే నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. చిన్నపిల్లలు, యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఈ చిత్రం చెన్నై, యూరప్‌లో చిత్రీకరణ జరుపుకోనుంది. -
వివాహానంతరం నటించాలా వద్దా అనేది సాయేషాకే..
పెరంబూరు: నటి సాయేషా సైగల్ తనకు భార్య కావడం సంతోషంగా ఉందని నటుడు ఆర్య పేర్కొన్నారు. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన ఈయన బాలీవుడ్ బ్యూటీ సాయేషా సైగల్తో కలిసి గజనీకాంత్ చిత్రంలో నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ తొలకరించడంతో పెళ్లికి దారి తీసింది. ఇరుకుటుంబాల అనుమతితో గత 9వ తేదీన సంగీత్, 10వ తేదీన పెళ్లి హైదరాబాద్ వేదికగా వేడుకగా జరుపుకున్నారు. కాగా గురువారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్, నటుడు భరత్, శాంతను పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులకు శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా నటి సాయేషాను వివాహమాడడం గురించి ఆర్య తన భావాన్ని వ్యక్తం చేస్తూ సాయేషాను భార్యగా పొందడం సంతోషంగా ఉందన్నారు. గజనీకాంత్ చిత్రంలో నటిస్తున్నప్పుడే చిన్న ఆకర్షణ కలిగిందని, ఆ తరువాత స్నేహితులుగా మారామని చెప్పారు. అయితే కాప్పాన్ చిత్రంలో నటిస్తున్న సమయంలో తమ మధ్య స్నేహాన్ని గ్రహించిన ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చింయించారని చెప్పారు. చాలా కాలంగా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని, వారి కోరికను నెరవేర్చేవిధంగానూ, వారికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివాహానంతరం నటించాలా వద్దా అన్న నిర్ణయాన్ని సాయేషాకే వదిలేసినట్లు ఆర్య తెలిపారు. కాగా వివాహానంతరం ఈ జంట టెడ్ అనే చిత్రంలో నటించబోతున్నారన్నది తాజా సమాచారం. -
షాదీ ముబారక్
కోలీవుడ్ జంట ఆర్య, సాయేషా పెళ్లి సంబరాలు హైదరాబాద్‌లో మొదలయ్యాయి. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖుల మధ్య ఈ సంగీత్ జరిగింది. ఆర్య, సాయేషా ఇద్దరూ తెల్లటి దుస్తుల్లో కనిపించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్, సంజయ్ దత్, జరీనా, ఆదిత్య పాంచోలీ పాల్గొన్నారు. ఆదివారం రాత్రి వీరి వివాహం జరిగింది. -
అడవి సాక్షిగా..
అదొక అటవీ ప్రాంతం. అడవి సాక్షిగా ఆ ప్రాంతంలో ఉండే రెండు మనసులు కలుస్తాయి. అయితే వారి ప్రేమకు ఆ అమ్మాయి అన్నలు విలన్లు అవుతారు. మరి.. ఆ జంట తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారు? అనే కథాంశంతో రూపొందిన ఓ తమిళ చిత్రం ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఆర్య, కేథరిన్ జంటగా రాఘవ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్షీ్మ వెంకటేశ్వర ఫ్రేమ్స్ పతాకంపై భారతి, వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో ఉదయ్ హర్ష వడ్డెల్ల తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయ్ హర్ష వడ్డెల్ల మాట్లాడుతూ – ‘‘హీరోగా, విలన్‌గా ఆర్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. కథానాయికగా కేథరిన్ చాలా పాపులర్. వీరిద్దరి జంట తెరపై కనువిందు చేసే విధంగా ఉంటుంది. తమిళంలో ఘన విజయం సాధించి, క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకున్న చిత్రమిది. ఇందులో ఓ కొండ ప్రాంతాల్లో ఉండే గిరిజన పుత్రులుగా ఇద్దరూ నటించారు. సినిమా అంతా కూడా కొండ ప్రాంతంలో ఉంటూ ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసేలా ఉంటుంది. ఆర్య ఈ సినిమా కోసం వెయిట్ పెరిగారు. సినిమాకు ఓ హైలెట్ గా యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఉంటుంది. మార్చిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
నిఖా పక్కా?
తమిళ హీరో ఆర్య, ‘అఖిల్’ ఫేమ్ సాయేషా పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ ఇద్దరూ స్పందించలేదు. లేటెస్ట్గా మార్చిలో వీరి వివాహం జరగనుందని చెన్నై టాక్. మార్చి 9న హైదరాబాద్‌లో ముస్లిం సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగనుందట. ఇంతకీ ఈ ఇద్దరూ ప్రేమలో ఎప్పుడు పడ్డారు అంటే.. ‘గజనీకాంత్’ చిత్రం షూటింగ్ టైమ్‌లో. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఇద్దరికీ ఫ్రెండ్షిప్ ఏర్పడిందని, అదే ప్రేమగా మారి పెళ్లి వరకూ వచ్చిందని చెన్నైలో వార్త ప్రచారమవుతోంది. ప్రస్తుతం సూర్య ‘కాప్పాన్’ సినిమాలో ఆర్య విలన్‌గా నటిస్తుంటే, సాయేషా హీరోయిన్గా నటిస్తున్నారు. మరి ఈ నిఖా (పెళ్లి) పక్కానా? వేచి చూద్దాం. -
ఆ హీరో.. హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారా!
మరో రీల్ పెయిర్.. రియల్ పెయిర్‌గా మారేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘అఖిల్’ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన సయేషా సైగల్, తరువాత కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కోలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ త్వరలో పెళ్లిపీటలెక్కేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. గజనీకాంత్ సినిమాలో తనతో కలిసి నటించిన హీరో ఆర్యను సయేషా పెళ్లాడనుందట. ఆర్య, సయేషాలు ప్రేమలో ఉన్నట్టుగా చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఆర్యగానీ, సయేషాగానీ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా మార్చి 10న వీరి వివాహం అంటూ కోలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరి ఇప్పటికైన ఈ జంట స్పందిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం సయేషా, సూర్య హీరోగా తెరకెక్కుతున్న కాప్పాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆర్య కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. -
సిద్దు పోయి ఆర్య వచ్చే!
‘బొమ్మరిల్లు’ సినిమాతో సిద్దార్థ్ తెలుగులో చాలా ఫేమస్ అయ్యాడు. అయితే సిద్దార్థ్ గతకొన్నేళ్లుగా ఫామ్‌లోకి రాలేకపోతున్నాడు. ఆ మధ్య వచ్చిన ‘గృహం’ మూవీ మంచి విజయాన్నే సాధించినా.. అన్ని వర్గాల ప్రేక్షకులను చేరుకోలేకపోయింది. తమిళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్న సిద్దార్థ్‌కు ఓ బంపర్ ఆఫర్ వచ్చి చేజాయిరిపోయింది. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతోన్న ‘ఇండియన్-2’ మూవీలో సిద్దార్థ్‌ను తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు ‘వరుడు’ ఫేమ్ ఆర్యను ఆ పాత్ర వరించినట్లు తెలుస్తోంది. శంకర్ ‘బాయ్స్’ సినిమాతో వెలుగులోకి వచ్చిన సిద్దార్థ్‌కు వచ్చినట్టే వచ్చి మంచి చాన్స్ మిస్సయిపోయిందని కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారట. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి అనిరుద్ స్వరాలను సమకూరుస్తున్నారు. -
పెళ్లికి బాజా మోగిందా?
‘అఖిల్’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు సయేషా. తెలుగులో జోరుగా సినిమాలు ఒప్పుకోకపోయినా తమిళంలో మాత్రం వరుస ఆఫర్స్‌తో దూసుకెళ్తున్నారు. వరుసగా యంగ్ హీరోలతో జతకడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు. ఈ మధ్య మరో వార్త ద్వారా హాట్ టాపిక్‌గా మారారు సయేషా. తమిళ హీరో ఆర్యను పెళ్లి చేసుకోనున్నారన్నదే ఆ టాపిక్. రీసెంట్గా ‘గజినీకాంత్’ అనే సినిమాలో ఈ ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఆ షూటింగ్లో ఏర్పడిన అనుబంధమే ఈ ఇద్దరూ కలిసి ఏడడుగులు నడవాలనే నిర్ణయానికి కారణం అయిందని టాక్. ప్రస్తుతం సూర్య హీరోగా చేస్తున్న ‘కాప్పాన్’ సినిమాలోనూ ఆర్య, సయేషా నటిస్తున్నారు. అయితే జోడీగా కాదు. ఈ సినిమా షూటింగ్ బ్రేక్స్‌లో చెన్నైలో ఏ మాల్లో చూసినా వీళ్లిద్దరే కనబడటంతో ‘సమ్‌థింగ్’ ఉంది అనే వార్త బలం అందుకుంది. ఇరు కుటుంబ సభ్యులు కూడా తమ అంగీకారాలను తెలిపినట్టు కోలీవుడ్ టాక్. మరి పెళ్లికి బాజా మోగిందా? అంటే వేచి చూద్దాం. -
నమ్మకం పెరిగింది
ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వరం జయంత్ కుమార్ ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. వరం జయంత్ కుమార్ మాట్లాడుతూ – ‘‘లవ్, రొమాన్స్, యాక్షన్, కామెడీ.. ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ మా చిత్రంలో ఉన్నాయి. ఆర్య హీరోగా నటిస్తూ, స్వయంగా తమిళ్లో నిర్మించిన చిత్రమిది. అక్కడ మంచి విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిన చిత్రం కావడంతో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. డి. ఇమాన్ పాటలకు మంచి స్పందన వస్తోంది. పాటలు, ట్రైలర్ సినిమాపై క్రేజ్‌ని పెంచాయి. ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమా అనే ఫీలింగ్ రాకూడదనే చాలా క్వాలిటీగా డబ్బింగ్ చేయించాం. సెన్సార్ సభ్యులు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చి, సినిమా బావుందంటూ ప్రశంసించడంతో సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
వినోదమే వినోదం
‘‘మా నాన్న (ఎల్వీ ప్రసాద్) పెద్ద భూస్వామి అయినా సినిమాపై అభిమానంతో ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయారు. నెమ్మదిగా ఎదుగుతూ గొప్ప స్థాయికి చేరుకున్నారు. దర్శకుడిగా ఎదిగారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ సిల్వర్ జూబ్లీ సినిమాలు చాలా తీసింది. సకుటుంబంగా చూడదగ్గ కుటుంబ విలువలున్న సినిమాలు చాలా తీశాం’’ అన్నారు రమేశ్ ప్రసాద్. ఆర్య, విశాల్, సంతానం, తమన్నా, భాను ముఖ్య తారలుగా ఎం.రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఐశ్వర్యాభిమస్తు’. వరం మాధవి సమర్పణలో వరం జయత్ కుమార్ నిర్మించారు. డి.ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలను నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్ రాజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. రమేశ్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా నాన్న సినిమాలపై తప్ప దేనిపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేవారు కాదు. అందరికీ మా ప్రసాద్ ప్రొడక్షన్స్ గురించి తెలుసు. మా ‘ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో 50 శాతం మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఐశ్వర్యాభిమస్తు’ సినిమాను దసరాకు విడుదల చేస్తు న్నాం. సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు వరం జయత్ కుమార్. ‘‘నిర్మాత జయంత్‌కు ఈ సినిమా పెద్ద విజయాన్ని తెచ్చి పెడుతుంది’’ అన్నారు కె.ఇ. జ్ఞానవేల్ రాజా. ‘‘చక్కని హిలేరియస్ ఎంటర్టైనర్. తెలుగులో చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని ఆర్య అన్నారు. -
రక్షించడానికి రాజధానిలో...
సైనికుడి ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ. ఆ విషయంలో అతను ఎంత సమర్థవంతంగా వ్యవహరించాడన్న దాని మీదే దేశ శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సిన్సియర్ సైనికుడి పాత్రలోనే హీరో సూర్య తన నెక్ట్స్ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. ఇందులో మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సయేషా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
నటుడు ఆర్యకు హైకోర్టులో ఊరట
టీ.నగర్: ‘అవన్–ఇవన్’ చిత్రం వ్యవహారంలో అంబాసముద్రంలో హాజరయ్యేందుకు నటుడు ఆర్యకు హైకోర్టు మినహాయింపునిస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. పాళయంకోట్టైకు చెందిన ముత్తురామన్ అనే వ్యక్తి అంబాసముద్రం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. అందులో ప్రసిద్ధి చెందిన జమీన్‌ను, పురాతన సోరిముత్తు అయ్యనార్ ఆలయాన్ని ‘అవన్–ఇవన్’ చిత్రంలో కించపరిచే విధంగా చూపినట్లు తెలిపారు. ఇది తమకు ఆవేదన కలిగించిందని, అందువల్ల చిత్ర దర్శకుడు బాల, నటుడు ఆర్యపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం అంబాసముద్రం కోర్టులో జరుగుతోంది. దీంతో నటుడు ఆర్య కోర్టులో హాజరుకావాలంటూ మెజిస్ట్రేటు ఉత్తర్వులిచ్చారు. ఇలావుండగా నటుడు ఆర్య తరఫున మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అందులో ముత్తురామన్ అంబాసముద్రం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ప్రాథమిక ఆధారాలు లేవని, ఇది కేవలం పబ్లిసిటీ కోసం దాఖలైనట్లు తెలిపారు. అందువల్ల కేసు రద్దు చేయాలని, అంతేకాకుండా అంబై కోర్టులో హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి కృష్ణకుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్‌కు సంబంధించి నటుడు ఆర్య అంబాసముద్రం కోర్టులో నేరుగా హాజరు కావడం నుంచి మినహాయింపునిస్తూ న్యాయమూర్తి ఈ సందర్భంగా ఉత్తర్వులిచ్చారు. -
దైవ శక్తితో క్షుద్ర శక్తి పోరు
‘‘సంగకుమార్ అన్నీ తానై వరుసగా నాలుగు సినిమాలు నిర్మించడం ఆనందంగా ఉంది. థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘తాంత్రిక’ సినిమా హిట్ అవ్వాలి. యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలి’’ అని నిర్మాత సాయి వెంకట్ అన్నారు. సంగకుమార్ నటించి, నిర్మించిన చిత్రం ‘తాంత్రిక’. రాజ్‌కాంత్, కార్తీక్, మనీష, సంజన, గీతాషా, ఆర్య ముఖ్య పాత్రల్లో ఎం. శ్రీధర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. జాన్, నాగవంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సాయి వెంకట్ విడుదల చేశారు. సంగకుమార్ నటించిన ‘పౌరుషం, నరసింహా ఏసీపీ, శివతాండవం’ సినిమాల ట్రైలర్స్‌ని కూడా ఇదే కార్యక్రమంలో రిలీజ్ చేశారు. నటుడు, నిర్మాత సంగకుమార్ మాట్లాడుతూ –‘‘ దైవ శక్తికీ, క్షుద్ర శక్తికీ మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు. డైరెక్టర్ ఎం. శ్రీధర్, నటులు రాజ్‌కాంత్, సంజన మేరీ, ఎస్ఎస్ పట్నాయక్ పాల్గొన్నారు. -
పొల్లాచ్చి పోదాం
లండన్ నుంచి పొల్లాచ్చికి షిఫ్ట్ అయ్యారు సూర్య. లండన్‌లో ఆపేసిన ఆపరేషన్‌ను పొల్లాచ్చిలో తిరిగి స్టార్ట్ చేయనున్నారట. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సాయేషా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లండన్‌లో స్టార్ట్ అయింది. లేటెస్ట్ షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్లో సూర్యతో పాటు మిగతా చిత్రబృందం కూడా పాల్గొననున్నారు. -
సూర్యతో ఆర్య
తమిళ హీరో ఆర్య లండన్ వెళ్లారు. అది పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ తీసిన తన ఫొటోను ఆర్య ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. సూర్య సినిమా కోసం బొమన్ ఇరానీ లండన్ వెళ్లారట. సో.. సూర్య సినిమాలో ఆర్య ఓ రోల్ చేయబోతున్నారనే ఉహాగానాలు వినిపించాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. తన సినిమాలో ఆర్య ఓ కీలక పాత్ర చేస్తున్నట్లు దర్శకుడు కేవీ ఆనంద్ ప్రకటించారు. ‘‘జామీ (ఆర్య) షూట్లో జాయిన్ అయ్యాడు’’ అని పేర్కొన్నారు కేవీ ఆనంద్. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. మోహన్‌లాల్, అల్లుశిరీష్, బొమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు హారీష్ జైరాజ్ స్వరాలు అందిస్తున్నారు. -
మెగా హీరోతో సుకుమార్ హ్యాట్రిక్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం ఈ నెలాఖరున రిలీజ్ అవుతోంది. పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుకుమార్ గత చిత్రాలకు భిన్నంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నాడు. సమంత హీరోయిన్గా నటిస్తుండగా జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. రంగస్థలం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతుండగా సుకుమార్ చేయబోయే తదుపరి చిత్రంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రంగస్థలం సినిమా చేసిన సుకుమార్ తన తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్లో చేయనున్నాడు. అంతేకాదు సుకుమార్ నెక్ట్స్ సినిమాలో కూడా మెగా హీరోనే నటించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఘనవిజయం సాధించగా.. ఆర్య 2 యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. తాజాగా మరోసారి బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు సుకుమార్. ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేకపోయినా.. బన్నీతో సుకుమార్ సినిమా అన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది. -
విలన్‌గా మారిన మరో హీరో..?
కోలీవుడ్, మాలీవుడ్ యంగ్ హీరోలు టాలీవుడ్ లో ప్రతినాయకులుగా కనిపించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ఆది, ఉన్ని ముకుందన్ లాంటి స్టార్లు టాలీవుడ్ లో మంచి విజయాలు సాధించారు. తాజాగా మరో కోలీవుడ్ నటుడు విలన్ రోల్ లో కనిపించనున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న రాజరథం సినిమాలో తమిళ నటుడు ఆర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెబుతుండటంతో టాలీవుడ్ లోనూ ఈసినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అనూప్ బండారీ దర్శకత్వంలో నిరూప్ బండారీ, అవంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా రాజరథం. ఈ సినిమాలో ఆర్య కీలక పాత్రలో నటిస్తున్నట్టుగా ఇన్నాళ్లు ప్రచారం జరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఆర్యది విలన్ రోల్ అని తెలుస్తోంది. మరి నిజంగా ఆర్య నెగెటివ్ రోల్ లో నటిస్తున్నాడా లేదా తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
మార్చి మూడోవారంలో ‘రాజరథం’
నిరూప్ బండారి, అంతిక శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాజరథం. తమిళ నటుడు ఆర్య, రవిశంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో కీలకమైన బస్సు పాత్రకు టాలీవుడ్ యంగ్ హీరో రానా డబ్బింగ్ చెపుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ముందుగా జనవరిలోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాని కారణంగా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ కు కొత్త డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. మార్చి 23న రిలీజ్ చేయనున్నారు. అనూప్ బండారీ దర్శకత్వంలో 25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ బండారీ, అజనీష్ లోక్‌నాథ్‌లు సంగీతమందిస్తున్నారు. -
అమలా.. నన్ను ప్రేమించు
సాక్షి, సినిమా: అమలా.. నన్ను ప్రేమించు అనగానే ఇదేదో సినిమా టైటిలో, ఏదైనా సినిమాలోని డైలాగో అనుకుంటున్నారా? అలాగైతే కచ్చితంగా పప్పులో కాలేసినట్లే. అసలు ఏమిటిది.. ఈ మాట ఎవరన్నారు అనేది తెలుసుకుందాం. ఇటీవల ఖరీదైన కారును కొనుగోలు చేసిన నటి అమలాపాల్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. పన్నును తగ్గించుకోవడానికి ఆ కారును పుదుచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయించుకుందనే ఆరోపణలను ఎదుర్కొంది. దాంతో అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అమలాపాల్ మీడియాపై విరుసుకుపడింది కూడా. అంతటితో ఆగకుండా తాను కేరళలో పుట్టిన అమ్మాయినంటూ బోటులో ప్రయాణం చేసే ఫోటోలను ఇంటర్నెట్లో పెట్టింది. ‘ఇలా బోటులో ప్రయాణిస్తే పన్ను కట్టనవసరం లేదనుకుంటా‘ అంటూ వ్యంగ్యంగా పేర్కొంది. ఎవరు స్పందించారో, స్పందించలేదో కానీ హీరోయిన్లను ఆట పట్టించే నటుడు ఆర్య మాత్రం వెంటనే అమలాపాల్‌పై సెటైర్లు వేశాడు. ఇలా బోటు ప్రయాణం చేసి రోడ్డు ట్యాక్స్‌ను ఆదా చేసుకోవాలనుకుంటున్నావని తాను భావిస్తున్నానని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతో రియాక్ట్ అయిన ‘మీరు రన్నింగ్, సైకిలింగ్ చేసి భవిష్యత్తు కోసం కూడబెడుతున్నట్టా’ అంటూ బదులిచ్చింది. నేను కూడబెడుతున్నది నీ కోసమే.. నన్ను ప్రేమించు అమలా అంటూ ఆర్య తిరిగి పోస్టు చేశాడు. ఇది ఎక్కడికో పోతోందని భావించిన అమలాపాల్ ఇక చాల్లేండి అంటూ ముగింపు పలికింది. కాగా, వీరిద్దరూ కలిసి ఇంతకుముందు వేట్టై, తదితర చిత్రాల్లో నటించారు. హాట్‌హాట్ సన్నివేశాలలో ఈమె నటించిన తిరుట్టుప్పయలే 2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. -
శ్రుతి బాటలో హన్సిక
తమిళసినిమా: సంచలన హీరోయిన్లలో నటి శ్రుతీహాసన్ ఒకరు. నిజం చెప్పాలంటే కోలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించినా సరైన విజయం తన ఖాతాలో ఇప్పటికీ పడలేదనే చెప్పాలి. ప్రస్తుతం చేతిలో తన తండ్రితో నటిస్తున్న చిత్రం మినహా వేరే చిత్రం కూడా లేదు. మంచి అవకాశం శ్రుతీహాసన్కిప్పుడు చాలా అవసరం అని చెప్పకతప్పదు. అదే విధంగా నటి హన్సిక పరిస్థితి దాదాపు అలానే ఉంది. చేతిలో పెద్దగా చిత్రాలు లేవు. మలయాళంలో మోహన్‌లాల్‌తో విలన్ అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే శ్రుతీహాసన్ దర్శకుడు సుందర్.సీ తెరకెక్కించనున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్రలో నటించడానికి ఎంపికై, గత మేలో ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేదికపై జరిగిన లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ తరువాత అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు. ఆ విషయం పెద్ద వివాదానికి దారి తీసిందన్నది వేరే విషయం. తరువాత సంఘమిత్ర చిత్రంలో శ్రుతీహాసన్ ప్లేస్‌ను నటి హన్సిక భర్తీ చేస్తుందనే ప్రచారం జోరందుకుంది. సుందర్.సీ. ఫేవరేట్ నటిగా ముద్రపడిన హన్సికతో ఫొటో సెషన్ కూడా చేశారనే ప్రచారం జరిగింది. జయంరవి, ఆర్య కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ భాణీలు కడుతున్నారు. ఇక షూటింగే తరువాయి అనుకుంటున్న తరుణంలో చిత్రం నుంచి హన్సిక కూడా నటించడం లేదనే ప్రచారం తాజాగా సామాజక మాద్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ కథ మొదటి కొచ్చిందనిపిస్తోంది. అయితే ఈ విషయమై చిత్ర వర్గాలు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. -
మిత్రద్వయం కలిస్తే ఆ కిక్కే వేరప్పా
తమిళసినిమా: స్టార్ మిత్రద్వయం కలిసి నటిస్తే ప్రేక్షకులకు కలిగే ఆ కిక్కే వేరప్పా. చాలా కాలం తరువాత కోలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాల హంగామా మొదలైంది. ఇప్పటికే ముగ్గురు స్టార్స్ కలిసి ఒక చిత్రం చేస్తున్నారు. అందులో ఒక స్టార్ ప్రభుదేవా మోగాఫోన్ పట్టగా మరో ఇద్దరు స్టార్స్ విశాల్, కార్తీలు కథానాయకులుగా నటిస్తున్నారు. కరుప్పురాజా వెళ్లైరాజా అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే నిర్మాణంలో ఉంది. కాగా తాజాగా మరో మిత్రద్వయం ఆర్య, జీవా కలిసి నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా వార్త. ఆర్య, జీవా మధ్య మంచి స్నేహసంబంధాలున్నాయి.వీరిద్దరూ ఒకరి చిత్రాల్లో మరొకరు అతిథిగా కనిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఇద్దరూ కలిసి నటిస్తే కచ్చితంగా ఆ చిత్రంపై అంచనాలు నెలకొంటాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు నాన్, అమరకావ్యం, యమన్ వంటి చిత్రాలను తెరకెక్కించిన జీవాశంకర్ తాజాగా తెరకెక్కిండానికి సన్నాహాలు చేస్తున్న చిత్రం ఇది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైకా సంస్థ నిర్మించనుంది. ప్రస్తుతం ఇందులో నటించనున్న ఇతర తారాగణం, సాంకేతిక వర్గం ఎంపిక జరుగుతోందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
అర్జెంట్‌గా గర్ల్ ఫ్రెండ్ కావాలి: హీరో
అర్జెంట్‌గా తనకో గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటున్నదెవరో తెలుసా? హీరోయిన్ల హీరోగా ముద్రవేసుకున్న నటుడు ఆర్య. ఆర్య గురించి గతంలో రకరకాల వార్తలు ప్రచారం అయిన విషయం తెలిసిందే. ఆర్య అంటే ఇష్టపడని హీరోయిన్లు ఉండరని చాలా మంది కథానాయికలు బహిరంగంగానే చెప్పారు. అదే విధంగా ఆర్య హీరోయిన్లకు బిరియాని వండి పెట్టి మచ్చిక చేసుకుంటారనే ప్రచారం కూడా పాతదే. తన చిత్రాల ప్రమోషన్లకే రాని నటి నయనతార ఆర్య పిలవగానే ఆయన చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై అందర్ని విస్మయపరచిన సంఘటన ఉంది. అయితే నటుడు ఆర్యకు ఇటీవల సరైన హిట్ చిత్రాలు లేవు. ఈ మధ్యకాలంలో విడుదలైన కడంబన్ చిత్రం ఆర్యను నిరాశ పరచింది. ఆర్య అనూహ్యంగా తనకు అర్జెంట్‌గా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ బహిరంగం చేయడం మరో విశేషం. ఆర్య ట్వీట్‌పై ఆయన అభిమానులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. అందులో ఒక అభిమాని ఘగర్లేని కాఫీ, ఆర్యకు తగని ఫిగర్ బాగున్నట్లు చరిత్రే లేదు అంటూ కామెంట్ చేశారు. ఇప్పుడిదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
భారీగా ఇస్తాం నటించవా ప్లీజ్!
కావాలంటే పారితోషికాన్ని భారీగానే ముట్టజెబుతాం.అని నయనతారను దర్శక నిర్మాతలు బ్రతిమలాడుతున్నారట. ఇది నిజమేనా? సంగతేమిటంటే సంఘమిత్ర చిత్రానికింకా నాయకి దొరకలేదట. శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ నిర్మించితలపెట్టిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘమిత్ర. సుందర్.సీ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయకులను ఎంపిక చేయడానికి చాలానే తర్జన భర్జనలు పడాల్సి వచ్చింది. విజయ్, అజిత్, టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు వరకూ చర్చలు జరిగాయి. వారందరూ కథ బ్రహ్మాండం అన్నారే కానీ, అందులో నటించడానికి సాహసించలేదు. అందుకు వారు చెప్పిన కారణం రెండేళ్ల పాటు సంఘమిత్ర కోసం కాల్షీట్స్ను కేటాయించలేమన్నదే. ఎట్టకేలకు జయంరవి, ఆర్య కథానాయకులుగా సెట్ అయ్యారు. ఇక కథానాయకి ఎంపికకు అదే పరిస్థితి. నటి శ్రుతీహాసన్ నటించడానికి సమ్మతించి చివరి క్షణంలో వైదొలిగారు. ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సద్దుమణిగినా నాయకి ఎవరన్నది ప్రశ్నగానే మారింది. బాహుబలి ఫేమ్ అనుష్కను నటింపజేసే ప్రయత్నం జరిగింది. తను ఇప్పటికే బాహుబలి చిత్రం కోసం రెండేళ్లకు పైగా సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. మళ్లీ అన్ని కాల్షీట్స్తో తానీ చిత్రం చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో దర్శకుడు సుందర్.సీ.తన ఆస్థాన కథానాయకి హన్సిక పేరును సిఫారసు చేసినా, నిర్మాత అందుకు సమ్మతించలేదనే టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఒక దశలో బాలీవుడ్ భామను నటింపజేసే ఆలోచన జరిగిందట. అదీ వర్కౌట్ కాకపోవడంతో నటి నయనతారపై దృష్టిసారించినట్లు తాజా సమాచారం.అయితే ఈ టాప్ హీరోయిన్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉన్నారు. అయినా భారీ పారితోషికం ముట్టజెబుతాం సంఘమిత్రలో రాణి కావాలంటూ బ్రతిమలాడే ధోరణికి దిగారని సోషల్ మీడియాలో తాజాప్రచారం. కాగా తాను ఇప్పటికే అంగీకరించిన చిత్రాలకు ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో కాలషీట్స్ కోరితే సంఘమిత్రలో నటించడానికి రెడీ అని నయనతార అన్నట్లు లేటెస్ట్ న్యూస్. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పవచ్చు. -
సంఘమిత్ర కోసం రెండేళ్లు
‘బాహుబలి’ కోసం ప్రభాస్ ఐదేళ్లు రాసిచ్చారు. ఈ టైమ్‌లో మరో సినిమా చేయలేదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే... ‘బాహుబలి’ స్థాయిలో ‘సంఘమిత్ర’ సినిమాను తీయాలని తమిళ దర్శకుడు సుందర్ .సి సంకల్పించిన సంగతి తెలిసిందే. ‘సంఘమిత్ర’లో ఓ హీరోగా నటించనున్న ‘జయం’ రవి తన రెండేళ్ల కాల్షీట్స్ను ఈ సినిమాకు రాసిచ్చారట! ‘బాహుబలి’ చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు ఐదేళ్లు పడుతుందని ఎవరూ అనుకోలేదు. ‘సంఘమిత్ర’కు ‘జయం’ రవి రెండేళ్లు కేటాయించారు. సినిమా పూర్తయ్యే సరికి ఎన్ని రోజులు పడుతుందో! ఇందులో ఆర్య మరో హీరోగా నటించనున్నారు. -
సౌత్ నుంచి తొలి అడుగు శ్రుతిదే!
తెలుగు, తమిళం, హిందీ... శ్రుతీహాసన్ మూడు భాషల ప్రేక్షకులకు పరిచయమే. శ్రుతి కథానాయికగా తమిళ దర్శకుడు సుందర్. సి మూడు భాషల్లోనూ ‘సంఘమిత్ర’ అనే భారీ సినిమా తీయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తమిళ నటులు ఆర్య, ‘జయం’ రవి హీరోలుగా సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా ఈ నెల 18న ప్రారంభం కానుంది. అదీ ఫ్రెంచ్ రివేరా తీరంలో జరగనున్న కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. ఈ 17 నుంచి 28 వరకూ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ప్రతి ఏడాది కాన్స్‌కి పలువురు హిందీ హీరోయిన్లు హాజరవుతారు. అయితే... ఓ సినిమా ప్రారంభోత్సవం నిమిత్తం కాన్స్ వెళ్తున్నది మాత్రం శ్రుతీనే. కేన్స్ రెడ్ కార్పెట్ మీద మెరిసే ఫస్ట్ సౌత్ హీరోయిన్ కూడా ఈమేనని సమాచారం. విద్యాబాలన్ సౌతిండియన్ అయినప్పటికీ హిందీ నటిగానే కాన్స్‌కి వెళ్లారు. సౌత్‌లో హీరోయిన్గా సెటిల్ అయిన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్ సైతం గతేడాది ఫారిన్ సంస్థ ప్రచారం నిమిత్తం కాన్స్ వెళ్లారు. ఈ ఏడాది ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఇండో–బ్రిటన్ సినిమా ప్రచారం కోసం వెళ్తారట! -
అడవిలో గజేంద్రుడు
ఆర్య, కేథరీన్ జంటగా రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజేంద్రుడు’. సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో తెరకెక్కిన 89వ చిత్రమిది. కుటుంబమంతా కలసి చూసి, ఎంజాయ్ చేసేలా ఉంటుంది. హీరో హీరోయిన్ పాత్రలకు తగ్గట్టు అద్భుతంగా నటించారు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తామనేది త్వరలో తెలియజేస్తాం’’ అన్నారు. ‘‘అడవి నేపథ్యంలో మొత్తం సినిమా చేయడమంటే అంత సులభం కాదు. చౌదరిగారి సపోర్ట్ లేకుంటే ఈ సినిమా చేసేవాâý్లం కాదు. రాఘవ రెండో సినిమానే ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో చేశాడు. తను భవిష్యత్‌లో తెలుగు, తమిళంలో పెద్ద దర్శకుడిగా ఎదుగుతాడు’’ అని ఆర్య అన్నారు. -
అతనైతే ఫ్రీగా నటిస్తా!
తొలి రోజుల్లో అవకాశాలు రాబట్టుకోవడానికి హీరోయిన్లు ఎన్ని రకాల ట్రిక్స్ ఉపయోగించాలో అన్నీ చేస్తారు. అందలం ఎక్కిన తరువాతే డిమాండ్ చేస్తారు. వర్ధమాన నటి ఐశ్వర్యమీనన్ది ఇదే తంతు. ఇంతకు ముందు కాదలిల్ సొదప్పవదు ఎప్పడి, తీయ వేలై చేయనుమ్ కుమారు చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఈ అమ్మడు ప్రస్తుతం వీర చిత్రంలో నటుడు కృష్ణకు జంటగా కథానాయకిగా ప్రమోషన్ అందుకుంది.అంతకు ముందే కన్నడం, మలయాళ భాషల్లో నటిగా పరిచయమైన ఈ మలయాళీ భామ అనువాద చిత్రాల ద్వారా తెలుగుకు పరిచయమైంది. వీర చిత్రంలో తనది చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అంటున్న ఐశ్వర్యమీనన్ ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో స్టార్ హీరోలపై కన్నేసింది. ఎవరెవరితో జత కట్టాలన్న దాని గురించి ఒక పట్టికను కూడా రెడీ చేసుకుందట. వారిని టార్గెట్ చేసుకుని అవకాశాలను పొందే ప్రయత్నాలు మొదలెట్టిందట. అయితే తన తొలి గురి ఆర్యనే నట. అందుకు కారణం చెబుతూ తాను కాలేజి చదువుకునేటప్పుడే ఆర్యకు వీరాభిమానినని, తనకు నటినవ్వాలన్న కోరికకు ఆయనే కారణం అని చెప్పుకొచ్చింది. ఆర్యతో చిత్రాలు చేస్తున్న దర్శకుల గురించి ఆరా తీసి వారికి అవకాశాలను కోరుతూ రాయబారిని పంపుతోందట. వారికి ఫ్రీ ఆఫర్ కూడా ఇచ్చేస్తోందట. ఆర్యతో నటించే అవకాశం కల్పిస్తే పారితోషికం కూడా కోరనని అంటోందట. మరి ఐశ్వర్యమీనన్ ఫ్రీ ఆఫర్‌కు ఎవరు రియాక్ట్ అవుతారో చూద్దాం. -
నన్నూ పడక గదికి రమ్మన్నారు
- నటి, 'మరియాన్' ఫేమ్ పార్వతి సంచలన వ్యాఖ్యలు గాయని సుచిత్ర రేపిన కలకలం ఇంకా సద్దుమణగలేదు. దానికి శాఖలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఇటీవల వరుసగా ప్రముఖ నటుల రాసలీల దృశ్యాలను తన ట్విట్టర్లో వెల్లడించి సినీ వర్గాల్లో సంచలనం సృష్టించిన సుచిత్ర ఇతర నటీమణుల్లో తెగింపును తెచ్చిపెట్టింది. ఇప్పటికే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్, సంధ్య, కస్తూరి లాంటి కొందరు హీరోయిన్లు తమ చేదు అనుభవాలను బహిరంగంగానే వెల్లడిం చారు. తాజాగా నటి పార్వతి గొంతు విప్పారు. పూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి ఈ మలయాళీ భామ. ఆ తరువాత ధనుష్‌కు జంటగా మరియాన్, ఆర్య, రానా, బాబిసింహాలతో కలిసి బెంగళూర్ డేస్ చిత్రాల్లో నటించారు. ఇక్కడ తను చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి గుర్తింపునే తెచ్చుకున్నారనే చెప్పాలి. మలయాళంలోనూ నటిస్తున్న పార్వతి ఇటీవల ఒక చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో హీరోయిన్లతో చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవర్తిస్తారన్న ప్రశ్నకు ప్రస్తుతం పరిశ్రమలో జరుగుతున్న ప్రచారం వాస్తవమేనన్నారు. పడక గదికి రమ్మనే చేదు అనుభవాన్ని తాను ఎదుర్కొన్నానని చెప్పారు. మలయాళంలో అవకాశాల పేరుతో హీరోలు, దర్శకులు తనను పలుమార్లు పడక గదికి రమ్మన్నారని, మరి కొందరు సినిమాల్లో ఇదంతా మామూలే అని ఉచిత సలహాలు ఇచ్చారని అన్నారు. అయితే అలాంటి అవకాశాలు తనకు వద్దని ఖరాఖండిగా చెప్పానని తెలిపారు. తాను తక్కువ చిత్రాలు చేయడానికి ఇదీ ఒక కారణం అని నటి పార్వతి పేర్కొన్నారు. అలా అవకాశాలు లేకుండా తాను చాలా కాలం ఖాళీగానే ఇంట్లో కూర్చున్నానని చెప్పారు. -
150 కోట్ల సినిమాలో...
వరుస విజయాలతో రేసుగుర్రంలా దూసుకెళుతున్నారు శ్రుతీహాసన్. ఇటీవల ‘ప్రేమమ్’ వంటి క్యూట్ లవ్‌ప్టోరీ, ‘సింగమ్ 3’ వంటి మాస్ కమర్షియల్ మూవీ.. ఈ రెండు చిత్రాల్లోనూ ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసి, మెప్పించారు. ఇప్పుడు ఓ భారీ చిత్రంలో శ్రుతీకి ఛాన్స్ దక్కిందని సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్.సి భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ‘సంఘమిత్ర’లో శ్రుతి ఓ హీరోయిన్గా ఎంపికయ్యారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ఈ సినిమా కోసం పలువురు కథానాయికలను దర్శకుడు సంప్రదించినా, చివరికి శ్రుతీహాసన్‌ను ఎంపిక చేశారన్నది తాజా సమాచారం. చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో శ్రుతి మరో ఆలోచన లేకుండా ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. హిందీలో అక్కడి నటీనటులతో తీయాలనుకుంటున్నారని వినికిడి. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నారు. త్వరలోనే షూటింగ్ ఆరంభం కానుంది. ఇందులో జయం రవి, ఆర్య హీరోలుగా నటించనున్నారు. -
జల్లికట్టు నేపథ్యంగా అమీర్ చిత్రం
దర్శకుడు అమీర్ చిత్రాలు కాస్త భిన్నంగా ఉంటాయి. పరుత్తివీరన్ చిత్రంతో జాతీయ స్థాయి ఖ్యాతి పొందిన అమీర్ చిన్న గ్యాప్ తరువాత తెరకెక్కిస్తున్న చిత్రం సందనదేవన్. ఈ చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. నటి అతిథి నాయకి. ఈ చిత్ర పరిచయ కార్యక్రమం శుక్రవారం సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర దర్శక నిర్మాత అమీర్ మాట్లాడుతూ కళ రాష్ట్ర, దేశాలను దాటి ప్రపంచస్థాయికి చేరుకుందన్నారు. ఇది ఆహ్వానించదగ్గ అంశమేనని పేర్కొన్నారు. అమ్మపై గౌరవంతో రామ్, తమిళుల ఆచార వ్యవహారాలపై పరుత్తివీరన్ చిత్రాలను రూపొందించిన తాను ఓ దశలో కమర్షియల్ పోకడలో ఆదిభగవాన్ లాంటి చిత్రల వైపు దృష్టి సారించానన్నారు. ఇకపై తమిళ సంస్కృతికి సంబం«ధించిన కథా చిత్రాలే రూపొందించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపా రు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయి న జల్లికట్టు ప్రధాన అంశంగా సందనదేవన్ చిత్రం ఉంటుందన్నారు. జల్లికట్టుపై సుప్రీంకోర్టు నిషేధం విధిం చడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా జల్లికట్టుపై నిషేధాన్ని ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇందు లో జల్లికట్టుకు సంబంధించిన ఒక పాటను శనివారం రికార్డ్ చేసి అదే రోజున విడుదల చేయనున్నట్లు తెలిపా రు. అమీర్ దర్శకత్వంలో నటించడం సంతోషంగా ఉందని, ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని నటుడు ఆర్య అన్నారు. ఈ చిత్రానికి పాటలు రాయడం సంతోషంగా ఉందని వైరముత్తు అన్నారు. 40. యదార్థ సంఘటన ఆధారంగా మున్నోడి మున్నోడి చిత్ర విడుదల హక్కులను ఎస్కేప్ ఆర్టిస్ట్ మదన్ పొంది విడుదల చేయనున్నారు. ఇంతకు ముందు విన్నైతాండి వరువాయా, అళగర్‌సామియిన్ కుదిరై, కేడీబిల్లా కిల్లాడిరంగా, వరుత్తపడాద వాలిభరర్సంఘం, దేసింగ్‌రాజా, కయల్, మాప్పిళైసింగం, కొడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ఆయన తాజాగా ఎన్నైనోక్కి పాయుమ్ తోటా, విక్రమ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రాల హక్కులను పొందారన్నది గమనార్హం. ఒక మనిషి ఎవరిని స్ఫూర్తిగా తీసుకుంటాడో అతని జీవతం అదే బాటలో పయనిస్తుందన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం మున్నోడి అని ఆ చిత్ర దర్శకుడు ఎస్‌పీటీఏ.కుమార్ తెలిపారు. స్వíస్తిక్ సినీవిజన్ పతాకంపై ఎస్‌పీటీఏ.రాజశేఖర్, సోహం అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా హరీష్, యామిని భాస్కర్ హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఇది చెన్నైలో జరిగిన యదార్థసంఘటన ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రం అయినా యూనివర్శల్ సబ్జెక్ట్ కావడంతో ఏ భాషలో అయినా మంచి ఆదరణను పొందుతుందని దర్శకుడు పేర్కొన్నారు. తమ చిత్ర విడుదల హక్కుల్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఎస్కేప్ ఆర్టిస్ట్ పొందడంతో కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. -
సంఘమిత్ర కథానాయకులు ఖరారు
సంఘమిత్ర చిత్రానికి కథానాయకులు ఎట్టకేలకు ఖరారయ్యారు. దర్శకుడు సుందర్.సీ ఒక గొప్ప సృష్టికి నూతన సంవత్సరం ప్రారంభంలో శ్రీకారం చుడుతున్నారు. ఆయన సంఘమిత్ర పేరుతో ఒక చారిత్రక కథా చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన 100వ చిత్రంగా నమోదు కానున్న చిత్రం సంఘమిత్ర. కాగా రూ.400 కోట్ల బడ్జెట్‌తో సోషల్ ఫాంటసీ కథాంశంతో తెరకెక్కనున్న ఇందులో కథానాయకులుగా నటించేందుకు కోలీవుడ్, టాలీవుడ్ ప్రముఖ స్టార్స్ ప్రయత్నించారు. అందులో ఇళయదళపతి విజయ్, సూర్య, టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు పేర్లు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కథ నచ్చినా ఈ భారీ చిత్రానికి 250 రోజుల కాల్షీట్స్ అవసరం అవ్వడంతో ఆ స్టార్ నటులు అన్ని కాల్షీట్స్ కేటాయించలేని పరిస్థితి కావడంతో నటించేందుకు ముందుకు రాలేకపోయారు. తాజాగా ఈ చిత్రంలో నటించడానికి యువ స్టార్స్ జయంరవి, ఆర్య ఎంపికయ్యారని సమాచారం. దీనికి సంగీత మాంత్రికుడు ఏఆర్.రెహ్మాన్ సంగీతం, సాబుశిరిల్ కళాదర్శకత్వం, కమల్ కన్నన్ గ్రాఫిక్స్ అందించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రచయిత ప్రభంజన్, దర్శకుడు బద్రిలతో కలిసి సుందర్.సీ కథను తయారు చేశారు. చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. వారి వివరాలు, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని తెలిసింది. చిత్ర షూటింగ్‌ను ఇండియా, అమెరికా, డెన్మార్క్, ఇరాన్, ఉక్రెయిన్ తదితర 11 దేశాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
సందనదేవన్ గా ఆర్య
నటుడు ఆర్య 1980 కాల యువకుడిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇంతకు ముందు 1947కు ముందు తెల్లదొర పాలనలో భారతీయ యువకుడిగా మదరాసు పట్టణం చిత్రంలో నటించి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా కంబన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదీ పిరియడ్ కథా చిత్రమే అని సమాచారం. దీని తరువాత అమీర్ దర్శకత్వంలో సందనదేవన్ అనే చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. జయంరవి హీరోగా ఆదిభగవాన్ చిత్రం తరువాత దర్శకుడు అమీర్ మరో చిత్రం చేయలేదు. మధ్యలో ఆయన హీరోగా పేరన్భు కొండ పెరియోర్గళే చిత్రం మొదలెట్టారు. అయితే అది ఫైనాన్సియల్ సమస్య కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత శింబు కథానాయకుడిగా చిత్రం చేయనున్నట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. అదీ వార్తలకే పరిమితమైంది.ఇప్పుడు ఆర్య హీరోగా చిత్రం చేయడానికి అమీర్ సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. ఇందులో ఆర్య 1980 నాటి మధురై యువకుడిగా నటించనున్నారట.ఆ కాలంలోని ఒక క్రీడాయోధుడిగా ఆర్య నటించనున్నారట.అందు కోసం ఆర్య తన శారీరక భాషను మలచుకోవడానికి కసరత్తులు చేస్తున్నారట. ఇందులో ఆయనకు జంటగా ఐశ్వర్యారాజేశ్ ఇప్పటికే ఎంపికయ్యారు. మరో నాయకిగా పట్టాదారి చిత్రం ఫేమ్ అతిథిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆర్య కదంబన్ చిత్రాన్ని పూర్తి చేసి అమీర్ దర్శకత్వంలో సందనదేవన్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. -
డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో...
విలక్షణ నటుడు ఆర్య, వైట్ బ్యూటీ హన్సిక జంటగా మగిళ్ తిరుమేని దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన చిత్రం ‘మీగా మాన్’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని సర్వల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ పతాకంపై ‘మండే సూర్యుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. నిర్మాతలు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కొలన ఎల్లారెడ్డి, సర్వల గణేశ్ యాదవ్ మాట్లాడుతూ- ‘‘డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇండియన్ డ్రగ్ మాఫియా నెట్వర్క్ ఎలా ఉంటుంది? వారి ప్లాన్స్ ఎలా ఉంటాయి? వంటి అంశాలను దర్శకుడు ఎంతో పరిశోధించి తెరకెక్కించాడు. ఇందులో ఆర్య స్టైలిష్ అండర్ కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలో హన్సిక నటించారు. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ తమన్, నిర్మాణ నిర్వహణ: శ్రీనివాసు రెడ్డి, సమర్పణ: బెల్లంకొండ శ్రీనిధి. -
విశాల్‌కు విలన్‌గా ఆర్య?
నటుడు విశాల్‌కు ఆర్యకు మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అరే ఒరే అని పిలుచుకునేంత మిత్రుత్వం వారిది. అలాంటిది ఆర్య విశాల్‌కు విలన్‌గా మారడం ఏమిటన్న సందేహం కలగవచ్చు. అయితే రియల్ జీవితంలో మిత్రులైన వీరు రీల్ జీవితంలో శత్రువులుగా మారనున్నారన్నది కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం. వివరాల్లోకెళితే విశాల్ ప్రస్తుతం కత్తిసండై చిత్రాన్ని పూర్తి చేసి మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటిస్తున్నారు. కత్తిసండై చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు ముందు ప్రకటించినా, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో విడుదలను నవంబర్‌కు వాయిదా వేశారు. కాగా తుప్పరివాలన్ చిత్రం పూర్తి చేసిన తరువాత విశాల్ నవదర్శకుడు పీఎస్.మిత్రన్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో నటి సమంత నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇరుంబు కుదిరై అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలిసింది. ఇది ఇంతకు ముందు మహానటుడు శివాజీగణేశన్ నటించిన చిత్రం టైటిల్ అన్నది గమనార్హం. ఇందులో విశాల్‌కు విలన్‌గా ప్రముఖ నటుడిని ఎంపిక చేయాలని భావించిన దర్శక నిర్మాతలు నటుడు ఆర్య అయితే బాగుంటుందని ఆయన్ని విలన్‌ను చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆర్యకు తమిళంలో హీరో ఇమేజ్ ఉన్నా ఆయన ఇప్పటికే మలయాళం, తెలుగు భాషల్లో ప్రతినాయకుడిగా నటించారన్నది గమనార్హం. అయితే ఆర్య విశాల్‌కు విలన్ అవుతారా? లేదా?అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ క్రేజీ చిత్రానికి సంగీతాన్ని యువన్ శంకర్‌రాజా, చాయాగ్ర హణం జార్జ్ సీ.విలియమ్స్ అందించనున్నారు. -
ఆయనకు ఆ హీరోయిన్లే కావాలట!
మార్కెట్‌ను చేజార్చుకున్న నటీనటులు, దర్శకులు మళ్లీ పుంజుకోవాలంటే వారికి ఒక బలమైన ఆధారం అవసరం అవుతుంది. అది హీరోయిన్ కావచ్చు మరెవరైనా కావచ్చు. ఆ మధ్య నటుడు జీవా వరుస అపజయాలతో సతమతం అయ్యారు. ఎలాగైనా కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న దృఢ నిర్ణయంతో చేసిన చిత్రం తిరునాళ్. ఈ చిత్రంలో తనకు జంటగా నయనతారను కోరి మరీ ఎంపిక చేసుకున్నారు. అందుకు కారణం ఆమె క్రేజ్‌ను వాడుకోవాలన్న ప్రయత్నమేనన్న ప్రచారం జరిగింది. ఏదైతేనేం జీవా తిరునాళ్ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. తదుపరి కవలై వేండామ్ చిత్రంలో కూడా స్టార్ నాయకి కాజల్‌అగర్వాల్‌ను ఎంచుకున్నారు. జీవా మిత్రుడైన ఆర్యకు కూడా అలాంటి టాప్ హీరోయిన్ అవసరం అయ్యారిప్పుడు. ఈయనకు ఇటీవల సరైన హిట్స్ లేవన్నది గమనార్హం. ప్రస్తుతం కడంబన్ అనే చిత్రంలో నటిస్తున్న ఆర్య తదుపరి అమీర్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. అయితే దర్శకుడిగా అమీర్ మార్కెట్ డౌన్లో ఉంది. ఆదిభగవాన్ చిత్రం తరువాత ఆయన మరో చిత్రం చేయలేదు. కథానాయకుడిగా మొదలెట్టిన పేరంబు కొండ పెరియవర్గళే చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టి ఆర్య హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇందులో హీరోయిన్ కోసం వేట మొదలైంది. ఆర్యకు జంటగా నయనతార, అనుష్క, తమన్నాలలో ఒకరిని ఎంపిక చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అయితే వారు అనుకుంటున్న హీరోయిన్లు అందరూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. మరో విషయం ఏమిటంటే కోలీవుడ్‌లో హీరోయిన్ల హీరోగా ప్రచారం పొందిన ఆర్యతో నటించడానికి ఈ ముద్దుగుమ్మల్లో ఎవరు ముందుకొస్తారన్నది ఆసక్తిగా మారింది. -
అమీర్ దర్శకత్వంలో ఆర్య
దర్శకుడు అమీర్, నటుడు ఆర్య కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. రామ్, పరుత్తివీరన్ వంటి వైవిధ్య భరిత చిత్రాల దర్శకుడు అమీర్. ఇక నటుడు ఆర్య పలు కమర్షియల్ కథా చిత్రాలలో నటించినా, నాన్ కడవుల్, అవన్ ఇవన్ లాంటి అసాధారణ కథా చిత్రాలలోనూ నటించి మెప్పించారు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో చిత్రం అంటే ఆసక్తిని రేకెత్తించడం సహజమే. ఆదిభగవాన్ తరువాత అమీర్ తదుపరి చిత్రం చేయలేదు. చాలా గ్యాప్ తరువాత మంచి కమర్షియల్ కథతో రానున్నారని తెలిసింది. ఆర్య ప్రస్తుతం కడంభన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాఘవన్ దర్శకత్వంలో సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం ఆర్య భారీగా బరువును పెంచి నటిస్తున్నారు.తదుపరి చిత్రం కోసం చాలా కథలు వింటున్నారట. అలా దర్శకుడు అమీర్ ఆర్యను కలిసి కథ వినిపించారు. ఈ కథలో కథానాయకుడు చాలా బలమైన వాడుగా ఉంటారట. ఈ పాత్రకు ఆర్య బాగా నప్పుతాడని అమీర్ భావించారట. త్వరలోనే ఈ రేర్ కాంబినేషన్లో చిత్రం ప్రారంభం కానుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. -
కాలువలో దూకిన ఆర్య
చెన్నై: అసలే ఎండాకాలం.. ఎనిమిదయిందంటేనే వీపులు పగిలిపోయేలా వేడి. జుట్టు కాలిపోయి పొగలు కక్కుతుందేమో అనిపించేంతటి. ఇంత వేడి అనుభవాన్ని ఎదుర్కుంటున్నవారికి ఆ సమయంలో ఓ నీటి కొలను కనిపిస్తే ఆగుతారా.. టపీ మని అందులో దూకేయరు. మన దక్షిణాధి నటుడు, రాజారాణి చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న ఆర్యా కూడా అదే చేశాడు. హీరో ఇమేజ్ ను పక్కకు పెట్టి ఓ కాలువలో దూకి అందరితో కలిసి సరదాగా స్నానం చేశాడు. సాధారణంగానే వర్కవుట్, బాడీ ఫిట్ నెస్ అంటే ప్రత్యేక శ్రద్ధ చూపే.. మరీ ముఖ్యంగా కచ్చితంగా సైక్లింగ్‌కు వెళ్లే ఆర్య తమ ప్రాంతంలోని ఓ కాలువలాంటిదాంట్లో దూకేశాడు. ఉదయాన్నే వర్కవుట్ ముగించుకొని సైక్లింక్ చేస్తూ వచ్చిన ఆర్య.. దారిలో ఉన్న ఒక పెద్ద కాలువలో తాను హీరో అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి చిన్నచిన్న పిల్లలు, ఆ గ్రామస్థులతో కలిసి సరదాగా ఈతకొట్టాడు. ప్రముఖ సైక్లిస్ట్ కృతికా, ఇతర స్నేహితులతో కలిసి హాయిగా ఈత కొట్టి పొద్దుపొద్దున్నే హ్యాపీ సండే అంటూ ఓ సెల్ఫీ పెట్టేశాడు. -
చిలకా పద.. పద...
వెండితెరపై కొత్త కథానాయిక మెరిస్తే చాలు... ఆ కథానాయిక జాతకం ఎలా ఉంటుంది? అని కొంతమంది ఓ అంచనాకు వచ్చేస్తారు. తమిళ చిత్రం ‘అయ్యా’, ఆ తర్వాత ‘చంద్రముఖి’లో నయనతారను చూసినప్పుడు కూడా అప్పటికే ఫామ్‌లో ఉన్న కథా నాయికలు ఓ అంచనా వేశారు. ‘ఏం ప్రాబ్లమ్ లేదు.. మహా అయితే నాలుగైదు సినిమాలు చేస్తుందేమో. అది కూడా గ్లామరస్ క్యారెక్టర్స్‌కి పనికి రాదు. హోమ్లీ క్యారెక్టర్స్ ఎన్నని వస్తాయి?’ అనుకుని రిలాక్స్ అయ్యారు. కానీ, ఎవరూ ఊహించని విధంగా నయనతార మారిపోయారు? ఏ హీరోయిన్లైతే ఆమెను లైట్ తీసుకున్నారో అదే హీరోయిన్లను టెన్షన్‌కి గురి చేశారు. ‘గజిని’, ‘శివకాశి’, ‘లక్ష్మి’ వంటి చిత్రాల్లో కనిపించిన నయనతారకూ, ‘బాస్’ చిత్రంలో కనిపించిన నయనతారకూ అసలు సంబంధమే లేదు. ఈ రేంజ్లో కూడా మేకోవర్ అవ్వగలుగుతారా? అని అందరూ ముక్కు మీద వేలేసుకునేలా నయనతార సన్నబడిపోయారు. చిక్కిన తర్వాత ఇంకా అందంగా తయారయ్యారు. గ్లామరస్ క్యారెక్టర్స్‌కి పనికొస్తానని నిరూపించుకున్నారు. మొత్తానికి పదేళ్లుగా ఎక్కడా తగ్గకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల తనంతట తానుగా కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు తప్ప నయనతారకు ఎప్పుడూ అవకాశాలు తగ్గలేదు. ఒకవైపు రజనీకాంత్ వంటి సీనియర్ హీరో సరసనా సరిజోడీ అనిపించుకున్నారు. మరోవైపు ప్రభాస్, ఎన్టీఆర్, రానా వంటి కుర్ర హీరోలకు సరిజోడీ అనిపించుకోవడం నయనతారకు ప్రత్యేకత. అటు తమిళంలోనూ సూర్య, అజిత్ వంటి హీరోలతో జతకడుతూ ఆర్య, జీవా వంటి కుర్ర హీరోలతో కూడా చేస్తున్నారు. బహుశా నయనతారకు అవకాశాలు తగ్గకపోవడానికి అదో కారణం అయ్యుండొచ్చు. ఇక నటిగా, ‘శ్రీరామరాజ్యం’లో సీతగా అద్భుతంగా అభినయించారామె. అలాగే ‘అనామిక ’, ‘మాయ’ వంటి చిత్రాల ద్వారా లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. ఏదేమైనా కొత్త నాయికలు వచ్చినప్పుడు పాత నాయికలు తగ్గాల్సిందే కదా. పైగా నయనతార తర్వాత చాలామంది కథానాయికలు వచ్చారు. దాంతో ఈ థర్టీ ప్లస్ ఏజ్ హీరోయిన్ హవా తగ్గుతుందని కొంతమంది ఊహించారు. అందరి ఊహలనూ తలకిందులు చేస్తూ ఇప్పుడు ఆరేడు చిత్రాలతో నయనతార బిజీగా ఉన్నారు. వీటిలో ఒకటి లేడీ ఓరియంటెడ్ మూవీ కావడం విశేషం. తమిళంలో ఐదు సినిమాలు, తెలుగులో హీరో వెంకటేశ్ సరసన ‘బాబూ బంగారం’ చేస్తున్నారు. చేతిలో ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి నయనతార ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తున్నారట. ఈ మధ్య చెన్నైలో పలు పబ్లిక్ థియేటర్స్‌లో ఈ బ్యూటీ కనిపించారట. ప్రేక్షకుల నాడి తెలుసు కుని, అందుకు అనుగుణంగా సినిమాలే ఒప్పుకుంటారేమో. రజనీకాంత్ సరసన నయనతార నటించిన ‘చంద్రముఖి’లో ‘చిలకా పద.. పద...’ అనే పాట ఉంది. సో.. నటిగా ఈ చిలక ప్రయాణం ఆ పాటలా మరో నాలుగైదేళ్లు జోరుగా ఉంటుందన్నమాట. -
ఆర్యతో, నయన మూడోసారి..
ఒక్కోసారి హీరోహీరోయిన్ల వలన కూడా ఆ చిత్రానికి క్రేజ్ వచ్చేస్తుంది. కోలీవుడ్‌లో అలాంటి జంటే ఆర్య, నయనతారలు. రీల్‌లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ఈ ఇద్దరిపై పలు సెటైర్లు వినిపిస్తుంటాయి. ఆర్య, నయనతారల మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లు కూడా వదంతులు జోరుగా సాగుతుంటాయి. ఇక నటన పరంగా చూస్తే వీరిది హిట్ పెయిరే. ఇంతకు ముందు ఆర్య, నయనతార కలసి నటించిన బాస్ ఎన్గిర భాస్కరన్, రాజారాణి చిత్రాలు మంచి విజయం సాధించాయి. తాజాగా ముచ్చటగా మూడోసారి తెరపై రొమాన్స్ చేయడానికి ఈ క్రేజీ జంట సిద్ధమవుతున్నాని సమాచారం. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న నయనతారకు ఇప్పుడు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం కార్తీతో కాష్మోరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న ఆ భామ కోసం చాలా చిత్రాలు ఎదురు చూస్తున్నాయి. స్నేహితురాలు త్రిషతో కలసి తన ప్రేమికుడిగా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌శివ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మించనున్న భారీ చిత్రంలో నటించనున్నారన్న టాక్ వినిపిస్తోంది. అదే విధంగా మోహన్‌రాజా దర్శకత్వంలో శివకార్తికేయన్ సరసన నటించడానికి పచ్చజెండా ఊపినట్లు సమాచారం. తాజాగా సుందర్.సీ దర్శకత్వంలో ఆర్యతో రొమాన్స్‌కు రెడీ అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అరణ్మణై-2 చిత్రం తరువాత సుందర్.సీ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు.ఈయన ఇంతకు ముందు విమల్, మిర్చిశివ, అంజలి, ఓవియలతో రూపొందించిన కలగలప్పు చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య,నయనతార హీరో హీరోయిన్లుగా నటించనున్నట్లు సమాచారం. -
ఆర్యతో క్యాథరిన్ ట్రెసా రొమాన్స్
క్యాథరిన్‌ట్రెసా ఆర్యతో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ కేరళా కుట్టి తమిళ చిత్ర పరిశ్రమలో తన గ్రాఫ్‌ను పెంచుకుంటోందని చెప్పవచ్చు. ఇక్కడ మెడ్రాస్ చిత్రంతో తన కెరీర్‌ను మొదలెట్టిన క్యాథరిన్‌ట్రెసా ఆ చిత్ర విజయం బాగానే హెల్ప్ అయ్యింది. ఇటీవల విశాల్‌తో నటించిన కథకళి చిత్రం కమర్షియల్‌గా హిట్ అనిపించుకోవడంతో క్మాథరిన్ ట్రెసాకి కోలీవుడ్‌లో గిరాకీ పెరిగిందనే చెప్పాలి. అధర్వతో జతకట్టిన కణిదన్ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రానికి మంచి స్పందన రావడంతో పాటు క్యాథరిన్ అందాలు చిత్రానికి ఆకర్షణ అయ్యాయి. తాజాగా హీరోయిన్ల హీరోగా ప్రచారంలో ఉన్న నటుడు ఆర్యతో డ్యూయెట్లు పాడడానికి ఈ మలయాళీ బ్యూటీ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాఘవ లారెన్స్‌తో మొట్టశివ కెట్టశివ చిత్రాన్ని నిర్మిస్తున్న సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్బీ.చౌదరి ఆ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో చిత్ర నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో ఆర్య హీరోగా నటించనున్నారు. ఆయనకు జంట గా నటించే లక్కీచాన్స్ నటి క్యాథరిన్ ట్రెసాను వరించింది. ఇంతకు ముందు మంజాపై వంటి విజయవంతమైన చిత్రానికి దర్శకత్వం వహించిన రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుందని చిత్ర వర్గాలు వెల్లడించారు క్యాథరిన్ ట్రెసా ఇప్పటికే వీర ధీర శూరన్, ముత్తురామలింగన్ చిత్రాలతో పాటు తెలుగులో సరైనోడు చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉందని కోలీవుడ్ టాక్. -
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు
ఆర్యను ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. అయితే... అంటున్న త్రిషను ఎవర్గ్రీన్ ప్రైమ్‌టైమ్ కథానాయిక అనిపేర్కొనవచ్చు. కారణం అందరికీ తెలిసింది.మూడు పదుల వయసు దాటిన ఈ ప్రౌఢ నిత్య సంచలన నటి. నటీమణుల్లో అధిక వదంతులకు కేంద్రబిందువు ఎవరన్న విషయంలో నయనతార, త్రిష పేర్లు పోటీ పడతాయనడంలో అతిశయోక్తి ఉండదేమో. విశేషం ఏమిటంటే వారిద్దరు ఒకప్పుడు బద్దశత్రువులైతే ఇప్పుడు ప్రియమైన నేస్తాలు. 13 ఏళ్ల నట జీవితంలో ఐదు పదుల చిత్రాల సంఖ్యను అవలీలగా అధిగమిస్తున్న నేటికీ క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతుండడం సాదారణ విషయం కాదు.ఈ హారర్‌కు మారిన ఈ చెన్నై చిన్నది నటించిన తాజా చిత్రం అరణ్మణై-2 శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా త్రిషతో చిన్న చిట్‌చాట్. ప్ర: మీకూ దెయ్యంగా మారాలని ఆశ పుట్టినట్లుందే? జ: తొలిసారిగా అరణ్మణై-2 చిత్రంలో దెయ్యంగా నటించాను. అరణ్మణై చిత్రం నాకు బాగా నచ్చింది. దానికి సీక్వెల్ చిత్ర కథ దర్శకుడు సుందర్.సీ చెప్పినప్పుడు అందులో నటించే అవకాశాన్ని వదులుకోదలచుకోలేదు. కుష్బూ నాకు మంచి స్నేహితురాలు. అరణ్మణై-2లో నటించడానికి ఇదొకకారణం. ఇందులో నటించే అవకాశం రావడం ఘనతగా భావిస్తున్నాను. సిద్ధార్ధ్, హన్సిక, సూరి తదితర కొత్త టీమ్‌తో నటించడం సంతోషకరం. ప్ర: సెకెండ్ ఇన్నింగ్‌లోనూ బిజీగా నటించడం గురించి? జ: నేను సినిమాలోకి వచ్చి 13 ఏళ్లుఅయ్యిందన్నది నమ్మలేకపోతున్నాను. అధిక చిత్రాలు చేయాలి, ప్రముఖ నటులతో నటించాలీ అనే మొదట్లో భావించాను. అయితే ఆ అనుభవం ఇప్పుడు మంచి కథాపాత్రలపై దృష్టి సారించాలని చెబుతోంది. ఇప్పుడు సెలెక్టెడ్ చిత్రాలే చేస్తూ రాశి గల నటిగా రాణిస్తున్నాను. ప్ర: నాన్న మరణం, ఆగిపోయిన పెళ్లి లాంటి బాధాకరమైన సంఘటనలకు కుంగిపోకుండా వాటిని అధిగమించడం గురించి? జ: నిజం చెబుతున్నా. మా కుటుంబంలో అందరూ ధైర్యవంతులే. ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటాం. నాకు మార్గదర్శిగా అమ్మ ఉన్నారు. జీర్ణించుకోలేని చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కొన్ని రోజులు ఏకాంతంగా మౌనంగా ఉంటాను. ఆ తరువాత పనికి సిద్ధం అవుతాను. ఇదే నా కేరెక్టర్. ప్ర: కొడి చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించడం గురించి? జ: మీకో విషయం తెలుసా? ఆడుగళం చిత్రం తొలుత నేనే కథానాయికని.ధనుష్‌తో కొన్ని సన్నివేశాల్లో నటించాను కూడా. ఆ సమయంలో హిదీ చిత్రంలో నటించాల్సి రావడంతో కాల్షీట్స్ సమస్య కారణంగా ఆడుగళం చిత్రం నుంచి వైదొలిగాను. ఆ తరువాత ఇన్నాళ్లకు కొడి చిత్రంలో ధనుష్‌తో నటిస్తుండడం సంతోషంగా ఉంది. ఇందులో మరో నాయికగా షామిలి నటిస్తున్నారు. ప్ర: మీ యవ్వన రహస్యం? జ: రహస్యం అంటూ ఏమీలేదు. అన్నీ ఫుల్‌గా లాగించేస్తాను. ఆర్య చెప్పినట్లు రెండు ప్లేట్లు బిరియాని కూడా తినేస్తాను. అయితే ఎంత తిన్నానో అన్ని రోజులు తినడం మానేస్తాను. పళ్ల రసం మాత్రమే తీసుకుంటాను. ప్ర: ఇన్నేళ్ల నట జీవితంలో కథాపాత్ర కోసం పారితోషికం విషయంలో పట్టువిడుపుల సంఘటనలు ఉన్నాయా? జ: అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి.ఇం కా చెప్పాలంటే తొలుత పారితోషికం గురించి మా ట్లాడను. కథే ముఖ్యం. అది బాగా నచ్చితే పారితోషికం తగ్గించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్ర: నయనతారతో కలిసి నటించనున్నారటగా? జ: అలాంటిదేమీ లేదు. మీడియా వాళ్లు కొందరు అలా ప్రచారం చేశారు. నిజంగా అలాంటిదేదైనా ఉంటే సోషల్ మీడియాలో నేనే పోస్ట్ చేసేదాన్ని. నేను నయనతార మంచి స్నేహితులమే. సరైన కథ అమరితే ఇద్దరం కలిసి నటిస్తాం. ప్ర: నటుడు ఆర్య ఇటీవల ఒక కార్యక్రమంలో త్రిష నాకు చెల్లెలు మాదిరి అన్నారే? జ: ఆర్య అలా అన్నారా? నిజంగానే ఆర్య చాలా మంచి వ్యక్తి. ఆయనతో ఎలాంటి విషయమైనా పంచుకోవచ్చు. హీరోయిన్లకు మంచి మిత్రుడు. ఆయన ఇంటికి ఎప్పుడు వెళ్లినా భోజనం చేయవచ్చు. ఆయన్ని ఎక్కడికైనా పిలుచుకుపోవచ్చు. ఇక నన్ను చెల్లెలు అనడమే కామెడీ. ఈ విషయం గురించి ఆర్యను అడిగే తీరుతాను. ప్ర: ఈ మధ్య పార్టీలకు వెళ్లడం తగ్గించినట్లున్నారే? జ: క్లోజ్ ఫ్రెండ్స్ బర్త్‌డే పార్టీలు అంటేనే నేను పాల్గొంటాను. అలాంటిది ఎక్కువగా పార్టీలకు వెళతానే ప్రచారం జరుగుతోంది. అప్పుడప్పుడు స్నేహితురాళ్లం ఒక చోట కలుసుకుంటాం. ఇది సాధారణంగా అందరూ చేసే పనే. అయితే సినిమా వాళ్ల విషయంలో దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. ప్ర: మళ్లీ రానాతో ప్రేమాయణం అన్న ప్రచారం గురించి? జ: అందరితో మసలుకున్నట్లే రానాతోనూ ఉంటాను. మా మధ్య స్నేహం తప్ప మరేమీలేదు. ఈ విషయం గురించి పత్రికల వాళ్లే రాస్తున్నారు. అలాంటిది ప్రేమా అని అడగడంలో అర్థం లేదు. ప్ర: సరే.. పెళ్లెప్పుడు చేసుకుంటారు? జ: బిజీగా ఉన్నప్పుడు నేనే కాదు ఏ నటి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోదు. మరో విషయం ఏమిటంటే ఇప్పుడు 30, 40 ఏళ్ల వయసన్నది పెద్ద విషయమే కాదు. ఇక నాకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందో నాకే తెలియదు. మనసుకు నచ్చిన వాడు లభించాలి. రాణీముఖర్జీ, ఐశ్వర్యారాయ్‌లాంటి వారు లేట్‌గానే పెళ్లి చేసుకున్నారు. నటి ప్రియాంక ఇప్పటికీ దుమ్మురేపుతున్నారు. ఇంకా చెప్పాలంటే జీవిత భాగస్వామి లభించడం అంత సులభం కాదు. సమయం వచ్చినప్పుడు పెళ్లి విషయం ఆలోచిస్తాను. -
ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా
చెన్నై : కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం ఓ చిత్రం చేయనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ వెల్లడించారు. ఆయన హీరోగా నటిస్తూ, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ఆ సందర్భంగా చిత్ర కథానాయకుడు నడిగర్ సంఘం భవన నిర్మాణ నిధి కోసం నటుడు కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇంతకుముందే తీసుకున్న నిర్ణయమన్నారు. ఇందులో మరికొందరు ప్రముఖ నటులు నటించనున్నారనీ... దర్శకుడి ఎంపిక త్వరలో జరుగుతోందని చెప్పారు. ఇక కథాకళి చిత్రం విషయానికి వస్తే ఇందులో కాండం అనే పదం గురించి ఒకరు ట్విట్టర్లో విమర్శిస్తున్నారని, సెక్స్ విద్య అవసరం అంటున్న ఈ రోజుల్లో కాండం అన్న పదం తప్పు కాదని అన్నారు. కథాకళి చిత్రంలో ఆ పదాన్ని కావాలని వాడలేదని అన్నారు. అయినా చిత్రాలకు సెన్సార్ అనేది ఒకటి ఉందని విశాల్ అన్నారు. కాథాకళి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్ తెలిపారు. -
రజనీకాంత్ చిత్రం రీమేక్‌లో ఆర్య?
సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రాలను రీమేక్ చేయడం,ఆయన చిత్రాల పేర్లను వాడుకోవడం కోలీవుడ్‌లో ఒక ట్రెండ్‌గా మారిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆయన క్రేజ్‌ను వాడుకుంటున్నారనవచ్చు. అయితే అజిత్ నటించిన బిల్లా లాంటి అతి తక్కువ చిత్రాలే విజయం సాధించాయి. తాజాగా రజనీకాంత్ నటించిన మరో చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. చాలా కాలం ముందు రజనీకాంత్ నటించిన సూపర్‌హిట్ చిత్రం పాండియన్. సీనియర్ దర్శకుడు ఎస్పీ ముత్తురామన్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రం పాండియన్. ఇప్పుడీ చిత్ర రీమేక్‌లో యువ నటుడు ఆర్య నటించడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది. దీనికి సురాజ్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇటీవల జయంరవి హీరోగా కమలహాసన్ చిత్రం సకలకళావల్లవన్ పేరును వాడుకుని చిత్రం రూపొందించిన ఈయన అంతకు ముందు రజనీకాంత్ చిత్ర టైటిల్ పడిక్కాదవన్తో ధనుష్ కథానాయకుడుగా చిత్రం చేశారన్నది గమనార్హం. సకలకళావల్లవన్ చిత్రాన్ని నిర్మించిన లక్ష్మీ మూవీ మేకర్స్ సంస్థే పాండియన్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఆర్య ఇటీవల నటించిన యట్చన్,వాసువుమ్ శరవణన్, ఇంజి ఇడుప్పళగి చిత్రాలు ఆశించి స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో రజనీకాంత్ చిత్ర రీమేక్తోనైనా హిట్ కొట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. -
డిసెంబర్ 11న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
దిలీప్ కుమార్ (నటుడు), ఆర్య (నటుడు), విశ్వనాథన్ ఆనంద్ (చెస్ చాంపియన్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 4. దీనికి అధిపతి రాహువు కాబట్టి చాలా కాలంగా కోర్టులో నడుస్తున్న న్యాయ వివాదాలు, పెండింగ్‌లో ఉన్న పోలీస్ కేసులు ఈ సంవత్సరం పరిష్కారమై ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఆస్తులు కొనుక్కోవాలని, ఉన్న ఆస్తులను అభివృద్ధి చేయాలని కంటున్న కలలు నెరవేరతాయి. వారసత్వంగా రావలసిన ఆస్తులు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. వీరు పుట్టిన తేదీ 11 రెండు సూర్యసంఖ్యల కలయికతో ఏర్పడ్డది గనక వీరికి జన్మతః ఊహాశక్తి, ఆదర్శభావాలు, ధైర్యసాహసాలు, నాయకత్వ లక్షణాలు అబ్బుతాయి. సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. గత సంవత్సరం చేపట్టిన ప్రాజెక్టులు, ప్రణాళికలనుంచి లాభాలను ఆర్జిస్తారు. కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానంతో టీమ్ వర్క్‌తో పనులను చురుకుగా చేస్తారు. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే హ–{దోగాలు, మానసిక అస్థిరత ఉండే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్త తీసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,2,3, 4, 5,6; లక్కీ కలర్స్: పర్పుల్, గ్ల్రే, ఎల్లో, బ్లూ, వైట్, సిల్వర్, క్రీమ్, గోల్డెన్, శాండల్; లక్కీ డేస్: సోమ, గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: దుర్గాదేవిని ఆరాధించడం, శునకాలకు ఆహారం పెట్టడం, వృద్ధులను, అనాథలను ఆదుకోవడం. దర్గాలు, చర్చ్‌లలో అన్నదానం, పిల్లలకు, వృద్ధులకు తీపి par తినిపించడం.ఙ- డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
సామ్రాజ్యం కోసం...
ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఆరాటపడుతుంటారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం హీరో ఏం చేశాడు? ఎవరితో తలపడ్డాడు. చివరికి విజయం సాధించాడా, లేదా? తెలుసుకోవాలంటే తమ చిత్రం చూడాల్సిందే అంటున్నారు నిర్మాత నైనాల సాయిరామ్. ఆర్య, కీర్తి జంటగా చరణ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన ఓ చిత్రాన్ని వీవీయస్ క్రియేషన్స్ పతాకంపై ‘సామ్రాజ్యం’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆర్య తన కెరీర్లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. తమిళంలో మంచి హిట్ అయింది. తెలుగు నేటివిటీకి పక్కాగా సరిపోయే కథ ఇది. పాటలు, ఫైట్స్, వినోదం హైలెట్‌గా ఉంటాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భరద్వాజ్, సహ నిర్మాత: రాజశ్రీ మణికంఠ, సమర్పణ: నైనాల సాంబమూర్తి, హైమావతి. -
'ఫీల్ మై లవ్' అంటున్న దేవీ శ్రీ
చాలా రోజులుగా టాలీవుడ్ లో షికారు చేస్తున్న ఓ వార్త త్వరలో నిజం కాబోతుంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ తో పాటు అదే స్థాయిలో స్టేజ్ పర్ఫార్మెన్సులతోనూ ఇరగదీసే స్వర సంచలనం దేవీ శ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ విషయంగా కుమారి 21 ఎఫ్ సక్సెస్ మీట్ వేదికగా నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. అంతేకాదు అదే స్పీడులో ఈ సినిమా నిర్మాణానికి కావల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించిన దిల్ రాజు. తాజా దిల్ రాజు ఫీల్ మై లవ్ అనే టైటిల్ రిజిస్టర్ చేయించాడు. దీంతో దేవీ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఇదే అన్న టాక్ మొదలైంది. దేవీ శ్రీ సంగీతం అందించిన సూపర్ హిట్ సినిమా ఆర్యలోని ఓ పాట పల్లవినే రిజిస్టర్ చేయించటంతో ఇదే దేవీ శ్రీ హీరోగా తెరకెక్కే సినిమాకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే యూనిట్ సభ్యులు మాత్రం ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. -
సై జీరో!
కొత్త సినిమా గురూ! చిత్రం: ‘సైజ్ జీరో’ తారాగణం: అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ రచన: కనిక కోవెలమూడి సంగీతం: కీరవాణి కెమేరా: నీరవ్ షా ఆర్ట్: ఆనంద్ సాయి ఎడిటింగ్: ప్రవీణ్ పూడి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం; నిర్మాత: పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నే దర్శకత్వం: ప్రకాశ్ కోవెలమూడి. సైజ్ జీరో... నాజూకైన నడుము... ఇవాళ తరచూ వినిపిస్తున్న మాట. అవును. సౌందర్య సాధనాలు, ఉత్పత్తులు, బరువు తగ్గడం అనేవి ప్రత్యేక పరిశ్రమలుగా, వేల కోట్ల రూపాయల వ్యాపారంగా మారినప్పుడు సహజమైన శరీరాకృతీ సహించరానిదే అవుతుంది. సమాజం మొత్తానికీ జెన్నీఫర్ లోపెజ్ లాంటి నాజూకు నడుములే కంపల్సరీ కండిషనింగ్ టెంప్లేట్లవుతాయి. అందాల పోటీలు మన ఇంటి దాకా దిగుమతి అయిందీ, మన అమ్మాయిల తల మీద అందాల రాణి కిరీటాలను ఎక్కించిందీ అందుకే! ఈ ఆలోచనల నేపథ్యంలో ‘సైజ్ జీరో’ పిచ్చిని ఆలంబనగా చేసుకొని ప్రకాశ్ కోవెలమూడి తీసిన సినిమా - ‘సైజ్ జీరో’ (సన్నజాజి నడుము అనేది ఉపశీర్షిక).సౌందర్య అలియాస్ స్వీటీ (అనుష్క) కథ ఇది. బరువు తూచే మిషన్, దానిలో నుంచి వచ్చే కార్డు వెనుక ఉండే భవిష్యత్ వాణితో చిన్నప్పటి నుంచి ఆమెకు విడదీయరాని అనుబంధం. చిన్నతనంలోనే నాన్న (రావు రమేశ్)ను పోగొట్టుకుంటుంది. అమ్మ రాజేశ్వరి (ఊర్వశి), తాత (గొల్లపూడి మారుతిరావు)... ‘సాఫ్ట్వేర్’ అంటూ లోదుస్తుల వ్యాపారం చేసే తమ్ముడు యాహూ (భరత్) - హీరోయిన్ కుటుంబ సభ్యులు. హీరోయిన్ ‘సైజ్’ చూసి, వచ్చిన పెళ్ళి సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఎన్నారై డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అభి (తమిళ హీరో ఆర్య) సంబంధం తప్పిపోయినా, వాళ్ళ మధ్య స్నేహం కొనసాగుతుంది. హీరోయిన్ అతణ్ణి మనసులో ఇష్టపడుతుంటుంది. ‘క్లీన్ ఇండియా’ డాక్యుమెంటరీ తీస్తున్న హీరో అదే టైమ్‌లో బ్రిటన్ నుంచి వచ్చిన మెరుపు తీగ లాంటి ఎన్జీఓ పిల్ల సిమ్రన్ (సోనాలీ చౌహాన్)కు క్రమంగా దగ్గరవుతుంటాడు. హీరోయిన్ గుండె బద్దలవుతుంది. అది ఫస్టాఫ్. సత్యానంద్ (ప్రకాశ్‌రాజ్) నడుపుతున్న సైజ్ జీరో ప్రోగ్రామ్‌లో హీరోయిన్ చేరుతుంది. అందాల పోటీలకు వెళ్ళాలనుకుంటున్న హీరోయిన్ ఫ్రెండ్ కూడా అదే ప్రోగ్రామ్ చేస్తూ, ఒంట్లో కొవ్వు తగ్గించేందుకు అక్కడ వాడుతున్న అనారోగ్యకరమైన పద్ధతుల కారణంగా ఆస్పత్రి పాలవుతుంది. అక్కడ నుంచి హీరోయిన్ ఆ మోసకారి వెయిట్ రిడక్షన్ ప్రోగామ్ మీద పోరాటం మొదలుపెడుతుంది. దానికి, హీరో సాయం కూడా తీసుకుంటుంది. వాళ్ళు ‘పి.వి.పి. స్పోర్ట్స్’ శేఖర్ (అడివి శేష్) సాయంతో ఏం చేశారు? సిమ్రన్కూ, హీరోయిన్‌కూ మధ్య ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా సాగిన ప్రేమ చివరకు ఏమైందన్నది సినిమా రెండు గంటల పది నిమిషాల నిడివే ఉన్న ఈ సినిమాకు బలం - కొంత ప్యాడింగ్‌లు పెట్టుకున్నా, స్వయంగా బరువు పెరిగి మరీ అనుష్క చేసిన ‘బిగ్‌సైజ్’ సాహసం. ఆమె నటన చాలా ఈజ్‌తో సాగింది. ఆ తరువాత మనసుకు హత్తుకునేవి తల్లి పాత్ర, తాత పాత్ర. హీరోగా ఆర్య తమిళ వెర్షన్‌కూ పనికొచ్చే ఛాయిస్. హీరోయిన్ తమ్ముడు కామిక్ రిలీఫ్. నిర్మాణ విలువలు పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో కెమేరా (నీరవ్ షా) వర్క్ బాగుంది. ‘‘ఇన్నాళ్ళూ నేను నీ కూతుర్ని అనుకున్నా. కానీ, కష్టాన్నని ఇప్పుడే అర్థమైంది’’ (తల్లితో హీరోయిన్) లాంటి కొన్ని డైలాగులు (రచయిత కిరణ్) బాగున్నాయి. నిజానికి లావాటి వ్యక్తులు, వాళ్ళ ప్రేమ, పెళ్ళి కష్టాలు కొత్తేమీ కాదు. కమలహాసన్ ‘సతీ లీలావతి’, ఇ.వి.వి ‘కితకితలు’, ‘లడ్డూబాబు’, హిందీ హిట్ ‘దమ్ లగాకే హైసా’ లాంటివన్నీ ఆ అంశాన్ని ఒక్కో రకంగా చూపెట్టినవే. ఇప్పుడీ ‘సైజ్ జీరో’ కొనసాగింపు. ‘క్లీన్ ఇండియా’ అంటూ ‘టాయిలెట్ క్లీన్ చెయ్... డాక్టర్‌ను దూరం చెయ్’ నినాదంతో ‘స్వచ్ఛభారత్’ ప్రోగ్రామ్‌కు ఫస్టాఫ్ మంచి పబ్లిసిటీ. హీరోయిన్ సమస్యకు పరిష్కారం చూపాల్సిన సెకండాఫ్ మరో టర్న్ తీసుకుంది. ‘గెట్ ఫిట్... డోన్ట్ క్విట్’ అంటూ ‘పి.వి.పి. స్పోర్ట్స్’ ఇనీషియేటివ్‌కూ, ఫిట్నెస్ అవసరానికీ పెద్ద పీట వేసింది. హీరోయిన్‌తో తన తల్లి పెంపకం గురించి ఊర్వశి చెప్పే సీన్లు లాంటివి సెంటిమెంటల్ ఫీల్ తెచ్చాయి. కథలో పోరాటం పెరిగి, ప్రేమ, హీరోయిన్ తాలూకు మానసిక సంఘర్షణ తగ్గడం చిక్కే. మొత్తం మీద అందమంటే మానసికమైనది కూడా అనీ, ‘సంతోషంతో ఉండే అమ్మాయిలే అసలైన అందమైన అమ్మాయిలు’ అనీ గుర్తుచేస్తుందీ ‘సైజ్ జీరో’. హాల్లో నుంచి బయటకొస్తుంటే ఎవరో అన్నట్లు, ఇది ‘బొద్దు’మనసుతో చూడాల్సిన వెయిట్ లెస్ ఎంటర్టైనర్! ► సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమా టైటిల్సాంగ్ సాకీ పాడుతూ, జోస్యుడిలా కనపడతారు. ► ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా 17 కిలోల పైగా బరువు పెరిగారు. ► తెలుగుతో పాటు తమిళంలోనూ తీసిన ఈ సినిమా ‘ఇంజి ఇడుప్పళగి’గా అక్కడ రిలీజైంది. ► నాగార్జున, తమన్నా సహా 7 మంది తారలు ఒక చోట గెస్ట్లుగా మెరుస్తారు. ► ఆర్యకు యువహీరో నందు తెలుగుడబ్బింగ్ చెప్పారు. - రెంటాల జయదేవ్ -
బంగారం లాంటి అవకాశం!
‘‘అనుష్కతో స్పెషల్‌గా చాట్ చేయాలనుకుంటున్నారా? కేజీ బంగారం గెలవాలనుకుంటున్నారా?... అయితే మా ‘సైజ్ జీరో’ చిత్రాన్ని మిస్ కావొద్దు’’ అని ప్రసాద్ వి. పొట్లూరి అంటున్నారు. అనుష్క, ఆర్య జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ పతాకంపై ఆయన నిర్మించిన ఈ చితం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర ్భంగా నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రం కోసం అనుష్క చాలా కష్టపడింది. ఆమె కష్టం వృథా కాకూడదని బాగా ప్రమోట్ చేస్తున్నాం. ఇందులో భాగంగానే కార్వీ సహకారంతో ‘కేజీ బంగారం గెలవండి’ కాంటెస్ట్ నిర్వహిస్తున్నాం. ప్రేక్షకులకు సినిమా టిక్కెట్‌తో పాటు ఒక కూపన్‌ని ఇస్తారు. అందులోని 11 డిజిట్స్ కోడ్‌ను ‘పివిపి సినిమా.కామ్’ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. అలాకాకున్నా కూపన్లో ఇచ్చిన సెల్ నంబర్‌కు వివరాలు మెసేజ్ పంపాలి. వీరిలో 20మంది ప్రేక్షకులను ఎంపిక చేస్తాం. వారితో అనుష్క స్పెషల్ చాటింగ్ ఉంటుంది. ఆ 20 మందిలో ఒక లక్కీ విన్నర్‌కు కేజీ బంగారం ఇస్తాం. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడాలనే సంకల్పంతో ఈ కాంటెస్ట్ పెడుతున్నాం’’ అని తెలిపారు. అనుష్క, దర్శకుడు ప్రకాశ్ కోవెలమూడి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఇది విన్నారా?
చెన్నై : సినిమా కొత్త పుంతలు తొక్కుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎల్లలు దాటుతున్న మన సినిమాలో ప్రేక్షకుల మనసు దోచుకునే అంశం ఏదో ఒకటి పొందుపరచడానికి దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు. అందుకు కొందరు గ్రాఫిక్స్‌ను వాడుకుంటుంటే మరి కొందరు సర్ప్రైజింగ్గా అతిథి తారల మెరుపులతో మైమరపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఓం శాంతి ఓం అనే హిందీ చిత్రంలో బాలీవుడ్ క్రేజీ తారలందరూ షారూఖ్‌ఖాన్‌తో సింగిల్ సాంగ్‌లో నటించి కనువిందు చేశారు. అంతకు ముందే ఒక తెలుగు చిత్రంలో ఇలాంటి తారల హేలను చూశాం. నాగార్జున నటించిన కింగ్ చిత్రంలోనూ ఒక పాటలో టాప్ తారలు మెరిశారు. ఇక అలాంటి ఒక సందడి వాతావణం తాజాగా ఇంజి ఇడుప్పళగి చిత్రంలో ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచనుందని కోలీవుడ్ వర్గాల టాక్. ఇది ద్విభాషా చిత్రం. తెలుగులో జీరోసైజ్ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆర్య, అనుష్క నాయికా నాయకులుగా నటించారు. ఒక ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రంలో అందం ప్రధాన పాయింట్‌గా నిలవనుంది. అనుష్క సుమారు 100 కిలోల బరువు గల అమ్మాయిగా సన్నగా నాజూగ్గా ఉండే యువతిగా రెండు డైమన్షన్తో సాగే పాత్రలో నటించారు. ఈ ఒక్క అంశం చాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడానికి, వారిని థియేటర్లకు రప్పించడానికి. చిత్ర దర్శకుడు కేఎస్.ప్రకాశ్‌రావు ఇంకా ఎట్రాక్షన్ అంశాలను చిత్రంలో జోడించారన్నది మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం. అదేమిటంటే ఇంజిఇడుప్పళగి చిత్రంలో అతిథులుగా తొమ్మిది మంది స్టార్స్ మెరవనున్నారట. అనుష్కకు అత్యంత సన్నిహితుడుగా ప్రచారంలో ఉన్న టాలీవుడ్ స్టార్ నాగార్జున, రాణాతో పాటు కోలీవుడ్ స్టార్స్ ఆర్య, జీవా, బాబీసింహా, సీనియర్ నటి రేవతి, క్రేజీ భామలు కాజల్ అగర్వాల్, హన్సిక, శ్రీదివ్య తదితర స్టార్స్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మించింది. ఈ సంస్థ మరో చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన బెంగళూర్ డేస్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ఆర్య, బాబీసింహా, రాణా, శ్రీదివ్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆ కారణంగా వారు ఇంజిఇడుప్పళగి చిత్రంలో అతిథులుగా మెరిసే అవకాశం ఉంది. మరి నాగార్జున నటించడానికి కారణం అనుష్క అనుకుంటున్నారా? అదేమో గానీ నాగార్జునకు పీవీపీ సంస్థతో మంచి అనుబంధం ఉంది. ఇక జీవా ఆర్యకు మంచి మిత్రుడు కాబట్టి ఆయన ఆ చిత్రంలో అతిథిగా మెరవవచ్చు. రేవతి, కాజల్ అగర్వాల్, హన్సిక పాత్రలు ఇంట్రస్టింగ్‌గా ఉండడంతో నటించడానికి అంగీకరించినట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఈ విషయం గురించి యూనిట్ వర్గాలు అవునని గానీ, కాదని కానీ నోరు విప్పకపోవడం గమనార్హం. చిత్రం ఈ నెల 27న తెరపైకి రానుంది. ఈ ప్రచారంలో నిజం ఎంత అన్నది అప్పుడే తెలుస్తుంది. -
'సైజ్ జీరో' ప్రచార జోరు
టాలీవుడ్ స్వీటీ అనుష్క నటించిన 'సైజ్ జీరో' సినిమా ప్రచారానికి పీవీపీ సంస్థ భారీ ఎత్తునే సన్నాహాలు చేసినట్టుంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్టుగా రైలు బోగీలను తమ ప్రచారానికి వాడుకుంటున్న వైనం ఇప్పుడు పలువురిని ఆకట్టుకుంటోంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్‌లోని రైళ్లలో 'సైజ్ జీరో' ప్రచారానికి పీవీపీ సంస్థ రెడీ అయింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా పలు నగరాలకు వెళ్ళే రైళ్ళ లో ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రైళ్ల వెలుపల, బయట.. సైజ్ జీరో సినిమాకు సంబంధించిన పోస్టర్స్, డిజైన్స్ ఉండేలా వినూత్నంగా ప్రచారం చేస్తోంది. దీనికి సంబంధించి పీవీపీ సంస్థ ...ఓ క్రియేటివ్ ఏజెన్సీతో కలిసి ఈ ట్రయిన్ పబ్లిసిటీని ప్లాన్ చేసిందట. అందులో భాగంగానే రైలు బోగీలపై ఈ సైజ్ జీరో పోస్టర్లు సందడి చేస్తున్నాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్న రైల్వేస్‌ను ప్రచారానికి ఎన్నుకోవడం మంచి ఎత్తుగడే అని చెప్పుకోవాలి. టాలీవుడ్‌తో పాటు అన్నిభాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైజ్ జీరో' సినిమా తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదల చేయనున్నారు. ఓపెనింగ్ లోనే భారీ వసూళ్లను రాబట్టాలని చిత్ర యూనిట్ యోచిస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాశ్ భార్య కణిక ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. తెలుగు, తమిళ భాషల్లో పీవీపీ పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించేందుకు అనుష్క ఏకంగా 20 కేజీల బరువు పెరిగిన విషయం తెలిసిందే. ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్య పాత్రధారులు. ఈ చిత్రంలో నాగార్జున తళుక్కున మెరవనున్నారని సమాచారం. -
హీరో కోసం ఒకరు, హీరోయిన్ కోసం మరొకరు
ఇటీవల కాలంలో దక్షిణాది హీరోలు ఫ్రెండ్ షిప్ కోసం కూడా చాలా సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్లో సీనియర్ హీరో నాగార్జున ఇలా ఫ్రెండ్స్ కోసం చాలా సినిమాల్లో నటించాడు. మోహన్ బాబు, విష్ణు లాంటి హీరోలతో కలిసి నటించిన నాగ్ తాజాగా తను వెండితెరకు పరిచయం చేసిన అందాల భామ అనుష్క కోసం మరోసారి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. బాహుబలి, రుద్రమదేవి లాంటి భారీ హిట్స్ తరువాత అనుష్క లీడ్ రోల్లో నటిస్తున్న మరో సినిమా సైజ్ జీరో. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు, కెయస్ ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం భారీ సాహసమే చేసింది ఈ యోగా బ్యూటి. ఈ సినిమాలో లావుగా కనిపించటం కోసం చాలా బరువు పెరిగింది. ఇలా ఎంతో రిస్క్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయంటున్నారు చిత్రయూనిట్. ఆర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తన సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనుష్క రిస్క్ చేసి మరి చేస్తున్న ఈ సినిమా కోసం నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ్లో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే తెలుగులో నాగార్జున కనిపించిన పాత్రలో తమిళ్లో మాత్రం యంగ్ హీరో జీవా కనిపించనున్నాడట. సైజ్ జీరోలో హీరోగా నటించిన ఆర్యతో ఉన్న స్నేహం కారణంగా జీవా ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించారు. గతంలో కూడా ఆర్య హీరోగా నటించిన 'బాస్ ఎంగిర భాస్కరన్' సినిమాలో గెస్ట్ రోల్లో నటించాడు జీవా. తాజాగా మరోసారి ఫ్రెండ్షిప్ కోసం అదేపని చేస్తున్నాడు. -
తగ్గాలని తాపత్రయం!
ప్రపంచంలో ఆమెకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి చాక్లెట్స్... ఇంకోటి ఐస్‌క్రీమ్స్. బరువు పెరుగుతున్నా సరే లెక్క చేయకుండా వీర లెవల్లో లాగించేసి భారీ సైజ్‌కు వచ్చేసింది. తర్వాత తన కెంతో ఇష్టమైన ప్రియుని కోసం ఇవన్నీ త్యాగం చేసి జీరో సైజ్‌కు ఎలా మారిపోయిందనే కథాంశంతో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్‌చౌహాన్ ప్రధాన పాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ బ్యానర్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి నిర్మించిన ఈ చిత్రం పాటలను నవంబర్ 1న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
ఫీల్ మై లవ్
సినిమా వెనుక స్టోరీ - 20 ప్రేమ - రెండక్షరాల మహా కావ్యం! రెండు కన్నీటి చుక్కల మహా సంద్రం!! ప్రేమ ఎప్పుడూ కుదురుగా ఉండ నివ్వదు. సుకుమార్ ప్రేమలో ఉన్నాడు. లిటరేచర్తో, మూవీస్‌తో మెదడులోతు ప్రేమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే కుదురుగా ఉండలేకపోతున్నాడు. మంత్లీ ట్వంటీ థౌజండ్ శాలరీ... మేథ్స్ లెక్చెరర్‌గా బోలెడంత రెస్పెక్ట్... ఇవన్నీ వదిలేసి హైదరాబాద్‌లో అనామకంగా ఉండటమేంటి? అసిస్టెంట్ డెరైక్టర్‌గా క్లాప్బోర్డ్లు మోయడమేంటి? నెలకు పదిహేనొందల జీతమేంటి? సినిమాలంటే పిచ్చి ప్రేమ మరి. మూడంటే మూడు సినిమాలు... మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్.... ఇలా ఇంకా ఎన్ని సినిమాలకు క్లాప్ కొట్టాలో? సుకుమార్‌లోని సినిమా ప్రేమ కుదురుగా ఉండనివ్వడంలేదు. వైజాగ్ బీచ్... సుకుమార్, ప్రకాశ్, వేమారెడ్డిల మధ్య స్టోరీ డిస్కషన్స్. సుకుమార్ చెప్పిన లైన్‌కు వాళ్లిద్దరూ ఫ్లాట్. ఆ బీచ్‌లోనే కథ మొత్తం ఓ షేప్కొచ్చింది. ఈ కథతో ప్రొడ్యూసర్ని ఒప్పించాలి. హీరోని మెప్పించాలి. వెండితెరను గెలిపించాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో? విజయ్ ఫోన్. ‘హనుమాన్ జంక్షన్’కి కెమెరా అసిస్టెంట్. వీవీ వినాయక్‌కి సొంత తమ్ముడు. ‘‘సుక్కూ... నితిన్ హీరోగా మా అన్నయ్య ‘దిల్’ సినిమా చేయబోతు న్నాడు. డెరైక్షన్ డిపార్ట్మెంట్లో నువ్వు చేద్దువుగాని రా’’ చెప్పాడు విజయ్. వైజాగ్‌లో రెడీ చేసుకున్న స్క్రిప్ట్‌ని భద్రంగా బ్యాగ్‌లో పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశాడు సుకుమార్. ‘దిల్’ షూటింగ్... కొత్త ప్రొడ్యూసర్స్ రాజు-గిరి. ఇంతకు ముందు వీళ్లు డిస్ట్రిబ్యూటర్స్. మణిరత్నం ‘అమృత’ సినిమాను తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. ఇది ఫస్ట్ డెరైక్ట్ సినిమా. అంతా కుర్రగ్యాంగ్. సందడి సందడిగా ఉంది లొకేషన్. జోక్స్, కామెంట్స్... హుషారే హుషారు. సుకుమార్ మాత్రం సెలైంట్‌గా ఉండేవాడు. పనిలో మాత్రం వయొలెంట్. ఎవరైనా ఏదైనా డౌట్ అడిగితే చాలా డెప్త్‌తో మాట్లాడేవాడు. ప్రొడ్యూసర్ రాజుకి సుకుమార్ అంటే ఇంప్రెషన్. వినాయక్ కూడా ‘‘ఇతనిలో మంచి విషయం ఉంది’’ అని సర్టిఫై చేశాడు. ‘‘దిల్’ హిట్టయితే నీకు డెరైక్షన్ చాన్స్ ఇస్తా. కథ రెడీ చేసుకో’’ రాజు హామీ. సుకుమార్ ఇన్ క్లౌడ్స్. ‘దిల్’ సూపర్‌హిట్. వినాయక్ కంటే ఎక్కువ సంబరపడిపోయాడు సుకుమార్. ఎందుకంటే ఈ హిట్టు మీదే అతని ఫ్యూచర్ డిపెండ్ అయివుంది. రాజు మాట తప్పలేదు. ‘‘ఇదిగో విక్రమన్ చేసిన తమిళ సినిమా స్ట్రిప్టు. దీన్ని నువ్వు డెరైక్ట్ చేయాలి’’. సుకుమార్‌లో పెద్ద జర్క్... కన్ఫ్యూజన్. ‘‘రీమేకా? నాకిష్టం లేదు. నా కథతోనే చేస్తాను’’ అనేశాడు వెంటనే. ‘‘సరే... నీ కథేంటో చెప్పు’’ అడిగాడు రాజు. సుకుమార్ ఇమీడియట్గా కథ చెప్పేశాడు. రాజులో నో రెస్పాన్స్. నచ్చిందా? నచ్చలేదా? సుకుమార్‌లో విపరీతమైన టెన్షన్. ‘‘స్టోరీ బాగుంది కానీ, కమర్షియల్‌గా వర్కవుట్ కాదేమో. ఇంకేదైనా ఆలోచించు’’ అనేసి వెళ్లిపో యాడు రాజు. సుకుమార్ ఇన్ డిప్రెషన్. ‘దిల్’ రాజు ఆఫీసు... సుకుమార్ నీరసంగా లోపలికెళ్తున్నాడు. హాల్లో... ‘దిల్’రాజు, సురేందర్‌రెడ్డి, చందు ఇంకా చాలామంది కూర్చుని నవ్వుకుంటున్నారు. ‘‘రా సుక్కూ... నిన్న నువ్వు చెప్పిన కథ వీళ్లకు చెబితే ఎగ్జైట్ అయిపోతున్నారు. వర్కవుట్ అయ్యేట్టు ఉంది. మనమీ ప్రాజెక్ట్ చేస్తున్నాం’’ అని అప్పటికప్పుడు అనౌన్స్ చేసేశాడు ‘దిల్’ రాజు. సుకుమార్ ఇన్ ఫుల్ జోష్. నితిన్‌కు చెప్పాడు. రవితేజను కలిశాడు. ప్రభాస్ కూడా విన్నాడు. ఫైనల్‌గా కొత్త హీరోనే కరెక్ట్ అని డిసైడయ్యారు సుకుమార్ అండ్ రాజు. అదే టైమ్‌లో- ప్రభాస్ కోసం ‘దిల్’ స్పెషల్ ప్రొజెక్షన్ వేశారు ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో. ప్రభాస్ ఫ్రెండ్స్ చాలామంది వస్తున్నారు. వాళ్లల్లో ఒకబ్బాయి చెంగుచెంగున అటూ ఇటూ తిరుగుతూ జోక్స్ కట్ చేస్తూ తెగ హడావిడి చేస్తున్నాడు. ‘‘అరె... అచ్చం నా హీరోలానే ఉన్నాడే’’ అనుకున్నాడు సుకుమార్. కొంచెం దగ్గరకెళ్లి చూస్తే... అల్లు అర్జున్. ‘గంగోత్రి’తో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ‘ఈ స్టోరీకి ఇతనే యాప్ట్’... ఫిక్స్ అయిపోయాడు సుకుమార్. ‘దిల్’ రాజుకి చెప్పేశాడు. ‘‘లేట్ ఎందుకు... ఇప్పుడే అడిగేస్తా’’ అంటూ అల్లు అర్జున్‌ని పిలిచాడు రాజు. వాళ్లిద్దరికీ కొంచెం దూరంగా సుకుమార్ నిలబడ్డాడు. ‘‘మా దగ్గరో కథ ఉంది. వింటావా?’’ అడిగాడు ‘దిల్’రాజు. ‘‘గంగోత్రి తర్వాత ఇప్పటికి 96 కథలు విన్నాను సార్. అన్నీ రొటీన్... బుర్ర తిరిగిపోతోంది’’ చెప్పాడు అర్జున్. ‘‘ఈ కథ విను. నీకు డెఫినెట్‌గా నచ్చుతుంది’’ భరోసా ఇచ్చాడు రాజు. కథ విని ఒక విజిల్ కొట్టాడు బన్నీ. ఇప్పుడు అల్లు అరవింద్ కథ వినాలి. ఫస్ట్ హాఫ్ వరకూ విని ‘‘అర్జంట్ మీటింగ్ ఉంది. రేపు కలుద్దాం’’ అన్నాడాయన. సుకుమార్‌కి ఏసీలో కూడా చెమట్లు పట్టేశాయి. నచ్చలేదేమో. డౌట్ల మీద డౌట్లు. అదే టైమ్‌కి బన్నీ... ‘‘ఏం టెన్షన్ పడొద్దు. డాడీకి నచ్చింది. సెకెండాఫ్ హ్యాపీగా చెప్పండి’’. నెక్స్ట్ డే - సెకెండాఫ్ విన్నారాయన. ‘‘బాగుంది... కానీ ఎక్కడో ఏదో మిస్సయ్యింది’’ చెప్పాడు అల్లు అరవింద్. ‘‘త్రీడేస్‌లో చేంజెస్ చేసి తీసుకొస్తాం’’ అన్నాడు ‘దిల్’రాజు. త్రీ డేస్ కాదు... టెన్ డేస్ కూర్చున్నారు. ఇప్పుడింకా స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా తయారైంది. కానీ ఏదో డౌట్. అల్లు అరవింద్ ఈసారైనా ఓకే చేస్తారా? ఆయనతో మనకు వర్కవుట్ కాదేమో. పవన్ కల్యాణ్‌ని ట్రై చేస్తే? గుడ్ ఐడియా. కానీ కలిసే చానలే లేదు. అరవింద్‌కి బాగా తెలిసిన వ్యక్తి ఓ మీటింగ్‌లో ‘దిల్’ రాజుని కలిశాడు. ‘‘అరవింద్ గారికి మీరేదో కథ చెప్పారట. మార్పులు చేసి తీసుకొస్తే ఓకే చేసేట్టు ఉన్నారు’’ అన్నాడతను క్యాజువల్‌గా. కట్ చేస్తే- అల్లు అరవింద్ దగ్గరున్నాడు సుకుమార్. కథ విని ఆయన ఫుల్ హ్యాపీ. కానీ చిన్న డైలమా. ‘‘వేరే ప్రాజెక్టు కూడా లైన్లో ఉంది. ఏది ముందో డిసైడ్ చేయాలి’’ చెప్పారు అరవింద్. ఆ పదిరోజులూ సుకుమార్‌కి నరకం. చివరకు సస్పెన్స్ వీడింది. సుకుమార్‌కి గ్రీన్‌సిగ్నల్. చిరంజీవి కూడా కథ విన్నారు. సుకుమార్ ప్రతి మైన్యూట్ బిట్నీ పేపర్ మీద రాసుకుని చెప్పడం ఆయన్ని ఆకట్టుకుంది. రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ కాదని ఆయనకు అర్థమైపోయింది. ‘గీత’ క్యారెక్టర్‌కి ‘కిట్‌క్యాట్’ చాక్లెట్ యాడ్ మోడల్ అనూ మెహతా... ‘అజయ్’ పాత్రకు శివబాలాజీ... ఇలా కాస్టింగ్ అంతా క్లియర్. మ్యూజిక్, ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ విషయంలో చాలా మొండిగా ఉన్నాడు సుకుమార్. సూపర్ టెక్నీషియన్స్ కావాలి. మిగతా విషయాల్లో బడ్జెట్ కంట్రోల్ ఓకేగానీ, ఈ మూడు క్రాఫ్ట్స్ విషయంలోనూ ఫ్రీడమ్ అడిగాడు సుకుమార్. ‘దిల్’ రాజు కూడా ఓకే. ఎడిటర్‌గా శ్రీకర్‌ప్రసాద్. లేకపోతే మార్తాండ్ కె.వెంకటేశ్ కావాలి. మార్తాండ్ ఓకే. మ్యూజిక్ డెరైక్టర్‌గా దేవిశ్రీప్రసాద్ డబుల్ ఓకే. సాయంత్రం స్టోరీ విని మిడ్నైట్ ‘ఫీల్ మై లవ్’ ట్యూన్ రెడీ చేసిచ్చేశాడు. అంతలా కనెక్టయ్యాడు తను. ఇక మిగిలింది కెమేరామ్యాన్. తమిళంలో పాపులర్ ఎవరో ఎంక్వైరీ చేశాడు. రత్నవేలు గురించి తెలిసింది. రాజీవ్ మీనన్ శిష్యుడతను. తమిళంలో అప్పటికే 7 సినిమాలు చేశాడు. ఫస్ట్ మీటింగ్‌లోనే సుకుమార్, రత్నవేలు ఫ్రీక్వెన్సీస్ సెట్. ‘‘నచికేత... ఇదేం పేరు? ఇంత ట్రెండీ కథకు ఇంత ఓల్డ్ నేమా?’’... ‘దిల్’ రాజు ఏదైనా ఓపెన్‌గానే చెప్పేస్తాడు. సుకుమార్ మార్కెట్ నుంచి పిల్లల పేర్ల పుస్తకం తెప్పించాడు. ఫస్ట్ పేజీలోనే పేరు దొరికేసింది. బ్యూటిఫుల్ నేమ్... ‘ఆర్య’. అంటే సంస్కృతంలో ‘మొదటివాడు’. బన్నీ కసి మీద ఉన్నాడు. ఫస్ట్ సినిమా హిట్టు. సెకెండ్ది కూడా ఇంప్రెస్ చేస్తే ఇక సెటిలైపోవచ్చు. అసలే మనసుకి నచ్చిన కథ. ‘ఆర్య’ పాత్రలో లీనమవ్వడం కోసం ఎన్ని కసరత్తులు చేయాలో అన్ని చేస్తున్నాడు. హెయిర్‌స్టయిల్ మార్చేశాడు. కాస్ట్యూమ్స్... లుక్... టోటల్‌గా కొత్త బన్నీ కనిపిస్తున్నాడు. 2003 నవంబర్ 19... అన్నపూర్ణా స్టూడియోలో గ్రాండ్ ఓపెనింగ్. చిరంజీవి క్లాప్... పవన్ కల్యాణ్ కెమెరా స్విచాన్...కె.రాఘవేంద్రరావు ఫస్ట్‌షాట్ డెరైక్షన్. యంగ్ బ్లడ్.. న్యూ కాన్సెప్ట్... టీమ్ మొత్తం హుషారుగా ఉన్నారు. షూటింగూ అంతే హుషారు. సుకుమార్ క్వాలిటీ విషయంలో జగమొండి. అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చి తీరాల్సిందే. 80 రోజులు అనుకుంటే... వర్కింగ్ డేస్ 120 డేస్ అయ్యింది. బడ్జెట్టూ పెరిగింది. ‘దిల్’రాజు బేఫికర్. ప్రొడక్ట్ మీద కాన్ఫిడెన్స్ అలాంటిది. 2004 మే 7.... మోర్నింగ్ షో డివైడ్ టాక్. బాగుందనీ అనడం లేదు. బాగో లేదనీ చెప్పడం లేదు. ఏదో డైలమా. కాన్సెప్ట్ అలాంటిది కదా. ‘దిల్’రాజుకి మాత్రం నో టెన్షన్. సుకుమార్ అయితే 125 డేస్ ఫిల్మ్ అనే నమ్మాడు. ఈవినింగ్‌కి క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్య’ సూపర్ డూపర్ హిట్. సుకుమార్‌కి ఫోన్ల మీద ఫోన్లు. ‘వన్‌సైడ్ లవ్’ కాన్సెప్ట్‌ని చాలా బాగా డీల్ చేశాడని క్రెడిట్స్. బన్నీకైతే ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్. ‘గంగోత్రి’కీ దీనికీ టోటల్ లుక్ ఛేంజ్. బన్నీ ఇకపై ‘స్టయిలిష్ స్టార్’ అని ఎవరో కాయిన్ చేశారు. పాటలన్నీ మార్మోగిపోయాయి. ‘ఫీల్ మై లవ్’ సాంగ్ బాగా పట్టేసింది. ‘అ అంటే అమలాపురం’ సాంగ్ అయితే ఓ కిక్ ఇచ్చింది. 4 కోట్లతో తీసిన ఈ సినిమా 16 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ మూమెంట్లో ఆడియన్సకి ‘అ’ అంటే అల్లు అర్జున్! ‘ఆ’ అంటే ఆర్య! - పులగం చిన్నారాయణ వెరీ ఇంట్రస్టింగ్... * ఆర్యను గీత ముద్దు పెట్టుకున్న స్టిల్‌ను కాలేజ్ క్యాంపస్‌లో అంటించే సీన్ గుర్తుందా? ఆ సీన్లో హీరోయిన్ని కామెంట్ చేసిన కుర్రాడు - శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాకి అసిస్టెంట్ డెరైక్టర్. తర్వాత ‘కొత్త బంగారు లోకం’తో డెరైక్టరయ్యాడు. * 2004 సెప్టెంబర్ 8న హైదరాబాద్ లలిత కళాతోరణంలో 125 రోజుల వేడుక జరిగింది. చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
హ్యాట్రిక్ హిట్ కోసం స్వీటీ
ఈ ఏడాది ఇప్పటికే రెండు భారీ విజయాలను నమోదు చేసిన అనుష్క. మరో ఇంట్రస్టింగ్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసింది. అనుష్క లీడ్ రోల్లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన 'సైజ్ జీరో' సినిమాను నవంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 'బాహుబలి', 'రుద్రమదేవి' సినిమాలతో మంచి విజయాలు సాధించిన అనుష్క 'సైజ్ జీరో'తో హ్యాట్రిక్ హిట్ సాధించాలని చూస్తోంది. ఈ సినిమా కోసం భారీగా బరువు పెరిగి, చాలా రిస్క్ చేసిన స్వీటీ, సక్సెస్ మీద అంతే కాన్ఫిడెంట్‌గా ఉంది. దసరా సీజన్లోనే సైజ్ జీరో రిలీజ్ చేయాలని భావించినా, పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో వెనక్కి తగ్గారు. పివిపి సినిమా బ్యానర్‌పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుష్కతో పాటు ఆర్య, సోనాల్ చౌహాన్, ప్రకాష్ రాజ్, ఊర్వశి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. ఈ సినిమాను నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా 1500 వందల థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. -
స్వీట్‌గా.. క్యూట్‌గా...
చిన్నతనం నుంచి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లను చూస్తే ఆమెకు నోరూరిపోతుంది. అవన్నీ లాగించేసి బొద్దుగా తయారైంది. ఆమె భారీ సైజ్‌ను చూసి అబ్బాయిలు కూడా ‘బాబోయ్’ అంటూ పారిపోతారు కూడా. అయినా ఆ అమ్మాయి బాధపడలేదు. కానీ తన మనసుకు నచ్చినవాడి కోసం జీరో సైజ్‌లోకి మారిపోదామని డిసైడయ్యింది. మరి.. ఈ అమ్మాయి బరువు తగ్గడానికి ఏమేం చేసింది? తాను అనుకున్నట్లు సన్నబడగలిగిందా? అనే కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైజ్ జీరో’. అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ముఖ్యపాత్రల్లో ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో పీవీపీ క్రియేషన్స్ పతాకంపై ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 9న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, పోస్టర్స్‌లో అనుష్క లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎం.ఎం.కీరవాణి సంగీతం, నిరవ్ షా ఫొటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్. అందరినీ న వ్వించే స్వీట్ అండ్ క్యూట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందించాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: ఆనందసాయి, కథ-స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం. -
అనుష్క వర్సెస్ అనుష్క
అనుష్కతో అనుష్క ఢీకుంటున్నారు. అదేమిటని ఆశ్చర్యపోతున్నారా? అంతే మరి ఆ అందాల భామకు ఆమే పోటీ అవుతున్నారు. ఇంకా అర్థం కావడం లేదా?ఈ యోగా సుందరి నటించిన రెండు భారీ చిత్రాలు ఒకే రోజు తెరపై సందడి చేయనున్నాయి. అనుష్క టైటిల్ రోల్లో నటించిన బ్రహ్మాండ చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవి అక్టోబర్ 9వ తేదీన విడుదల కానుంది. గుణశేఖర్ సృష్టికర్త అయిన ఈ చిత్రంలో అల్లుఅర్జున్, రాణా ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం కోసం అనుష్క పలు సాహసాలు చేశారు. కాగా ఆమె నటించిన మరో చిత్రం ఇంజి ఇడుప్పళగి. ఆర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రకాశ్ కోవెలముడి దర్శకత్వం వహించారు. పీవీపీ సినిమా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించడం విశేషం. ఇందులో అనుష్క పాత్ర కీలకంగా నిలవనుంది. ఈ పాత్ర కోసం అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరిగి నటించారు. మరో విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు తమిళం, తెలుగు భాషల్లో రూపొందడం. ఇంజి ఇడుప్పళగి తెలుగులో జీరో సైజ్ పేరుతో విడుదల కానుంది. అలా అనుష్క వర్సెస్ అనుష్క డీకొంటున్నారన్న మాట. -
నయన్ లవ్ స్టోరీలో మరో ట్విస్ట్
-
అనుష్క చిత్రానికి యమ క్రేజ్
నటి అనుష్క చిత్రం అనూహ్య క్రేజ్ సంపాదించుకుంది. ఆ చిత్రం ఏమిటని తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? తమిళంలో ఇంజి ఇడుప్పళగి పేరుతోనూ, తెలుగులో సైజ్ జీరో పేరుతోనూ రూపొందుతున్న ద్విభాషా చిత్రం గురించే ఈ ప్రస్థావన. ఇందులో హీరో ఆర్య ఉండగా అనుష్క చిత్రం అంటారేమిటి అన్న ప్రశ్న తలెత్తుతోందా?ఆర్య ప్రకాశ్‌రాజ్, సోనల్సుహాన్, మాస్టర్ భరత్ ఇలా చిత్రంలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉన్నారు. అయితే ఇది పూర్తిగా నటి అనుష్క చుట్టూ తిరిగే కథ. ఆమె అందం, మందం అంశాలను చర్చించే ఇతి వృత్తం. ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై అనూహ్య ఆదరణను పొందిందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ టీజర్ విడుదలైన రెండు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు లక్షల మంది వీక్షించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు.ముఖ్యంగా ముద్దుగా, బొద్దుగా ఉన్న హన్సిక రూపం, సన్నగా, అందంగా ఉన్న రూపాలు సినీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నట్లు,ఇందులో బొద్దుగా ఉండడానికి అనుష్క సుమారు 20 కిలోల బరువు పెరగడం వంటి అంశాలు ఇంజి ఇడుప్పళగి చిత్రంపై అంచనాలను పెంచేశాయని చిత్ర వర్గాలు పేర్కొన్నారు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా సంస్థ నిర్మిస్తోంది. మరగదమణి(కీరవాణి) సంగీతబాణీలందిస్తున్న ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. -
నేను పోటీ కోరుకుంటాను
నేను పోటీని కోరుకుంటున్నాను. నాకు పలువురు పోటీగా ఉండాలి అంటున్నారు నటి తమన్న. ఈ గుజరాతి భామకు కోలీవుడ్‌లో అవకాశాలు రానురాను అంటూనే వరుసగా రావడం విశేషం. ఆ మధ్య తమన్న పని అయిపోయింది అనుకున్న వారి నోళ్లను బాహుబలి మూయించింది. ఇక తమిళంలో వీరం చిత్రం విజయం సాధించినా తమన్నకు చిన్న గ్యాప్ వచ్చింది. ఇటీవల ఆర్యతో నటించిన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచ్చవంగ చిత్రం విడుదలై సక్సెస్ అనిపించుకుంది. ప్రస్తుతం నాగార్జున కార్తీలతో బెంగళూర్ టైగర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నను పలకరిస్తూ నటిగా గట్టి పోటీని ఎదుర్కొంటునట్లున్నారే అని అడగ్గా నేనెప్పుడూ పోటీని కోరుకుంటాను. పోటీతోనే ప్రతిభను చాటుకుని ఉన్నత స్థాయికి చేరుకోగలం. ఇంకో విషయం ఏమిటంటే నా చిత్రాల విజయాలకు సంతోషిస్తాను.అయితే నేనొక్కదాన్నే ఇక్కడ ఉండాలని కోరుకోను. నేనొక్కదాన్నే ఉంటే బోర్. ఇతర హీరోయిన్లు కూడా నాలా ఉండాలనుకుంటాను. బాహుబలి చిత్ర విజ యం చాలా సంతోషాన్ని ఇచ్చింది. బయట ఎక్కడికెళ్లినా అనామిక అంటూ గౌరవిస్తుంటే గర్వంగా ఉంది. ప్రస్తు తం నాగార్జున, కార్తీలతో బెంగాలీ టైగర్ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవం.ప్రతి చిత్రంలోనూ ఒక్కో విషయాన్ని నేర్చుకుం టున్నాను. అయినా ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఇక దక్షిణాది ప్రతిభావంతులైన నటీమణులు చాలా మంది ఉన్నారు. ఇలాంటప్పుడు హీరోయిన్ల మధ్య పోటీ తప్పకుండా ఉంటుంది. అలాంటి పోటీ నే నేను కోరుకుంటాను. పోటీతోనే ఉన్నత స్థాయికి చేరుకోవడం సాధ్యం అన్నది నా భా వన అని తమ్మన అన్నారు. -
సైజ్ జీరో టీజర్ విడుదల
-
మిల్క్ బ్యూటీకి మరో మాస్ చిత్రం?
ఇక నటి తమన్న పనైపోయింది. కోలీవుడ్ ఆమెను పక్కన పెట్టేసింది. టాలీవుడ్, బాలీవుడ్ల్లోనూ అదే పరిస్థితి. అజిత్‌తో నటించిన వీరం చిత్రం విజయం సాధించిన తరువాత కూడా ఆ మిల్క్ బ్యూటీ గురించి ఇలాంటి ప్రచారమే జరిగింది. అలాంటి గాలి వార్తల్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్న తమన్న బాహుబలి చిత్రంతో తనలోని ఫైర్ ఏమిటో మరోసారి నిరూపించారు. ఆ తరువాత ఆర్య సరసన వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగ చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఆపై నాగార్జున, కార్తీలు హీరోలుగా నటిస్తున్న ద్విభాషా చిత్రం దోస్త్(టైటిల్ అధికారికంగా ప్రకటించలేదు)చిత్రంలో నటించే అవకాశం వరించింది. ఇలా వరుసగా చిత్రాలు చేస్తున్న తమన్నకు తాజాగా సంచలన నటుడు శింబుతో రొమాన్స్ చేసే అవకాశం వచ్చినట్లు తెలిసింది. మూడో సంవత్సరాలు సమస్యల మీద సమస్యలను ఎదురొడ్డి ఇటీవల తెరైపై కొచ్చి విజయాన్ని అందుకున్న వాలు చిత్రం ఇచ్చిన పునరానందంతో ఉన్న నటుడు శింబు ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అచ్చం ఎంబదు మడమయడా చిత్రంతో పాటు సెల్వరాఘవన్ తాజా చిత్రం ఖాన్ లోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. తన చిత్రాల వేగాన్ని పెంచుతానని వాలు చిత్ర సక్సెస్ మీట్లో పేర్కోన్న శింబు ఆ దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తోంది. అమీర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజండా ఊపారు. ఇందులో ఆయనకు జంటగా నటి తమన్న నటించనున్నట్లు కోలీవుడ్ సమాచారం. మంచి రోమంటిక్ ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి మెర్సల్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు, దీనికి ఇప్పటికే అరడజను చిత్రాలతో బిజీగా ఉన్న యువ సంచలన సంగీత దర్శకుడు అనిరుద్ సంగీత బాణీలు అందించనున్నట్లు కోలీవుడ్ టాక్. -
థాను ఖాతాలో వెళైయా ఇరుకిరవన్ పొయ్‌సొల్లామల్లాన్
వెళైయా ఇరుకిరవన్ పొయ్ సొల్లమాట్టాన్(తెల్లగా ఉండే వాడు అసత్యమాడడు)పేరుతో చిత్రం రూపొందింది. ఛాయాగ్రాహకుడు రవివర్మ సమర్పణలో ఇగ్నిటీ ఫిలింస్ పతాకంపై దేవంశు ఆర్య నిర్మించిన ఈ చిత్రానికి ఏయల్, అబనింద్రన్ దర్శకత్వం వహించారు. నవ జంట ప్రవీణ్‌కుమార్, శాలిని వద్నికటి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్‌కుమార్, సనమ్‌శెట్టి, బాలా, ఆడుగళం నరేన్, జయప్రకాశ్, అరుళ్దాస్, ఎంజే.శ్రీరామ్, పళని, సూపర్‌గుడ్ సుబ్రమణి, ఫైవ్‌స్టార్ క్రిష్ణ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జోశ్వా శ్రీధర్ సంగీత భాణీలు అంధించిన ఈ వెళైయా ఇరుకిరవన్ పోయ్ సొల్లమాట్టాన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సోమవారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు ఏయల్ అబనింద్రన్ మాట్లాడుతూ వెళైయా ఉరుకిరవన్ పొయ్ సొల్లమాట్టాన్ అంటే ఇది మేని వర్ణం గురించి చెప్పే కథ కాదన్నారు. మంచి మనసు గల వాడు అబద్ధం చెప్పరనే ఇతి వృత్తంతో తెర కెక్కించిన చిత్రం ఇదని వెల్లడించారు. చిత్రాన్ని కొత్తగా తీశామనే నమ్మకం ఉంన్నారు. ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.ధానుకు చిత్రాన్ని చూపించామన్నారు. చిత్రం చూసిన ఆయన బాగుందని అభినంధించి తానే విడుదల చేస్తానని హక్కులు పొందడంతో ఇప్పుడిది పెద్ద చిత్రమయ్యిందన్నారు. చిత్రాన్ని అక్టోబర్ తొలి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. -
అందరి నోట.. అనుష్క మాట!
-
అందరి నోట.. అనుష్క మాట!
సోషల్ మీడియాలో ఒక్కోసారి ఒక్కో టాపిక్ ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా అంతా సైజ్ జీరో అనే సినిమాలో అనుష్క అవతారం గురించే మాట్లాడుతున్నారు. సైజ్ జీరో ట్రెండ్ జోరుగా నడుస్తోంది. బాహుబలి, రుద్రమదేవి సినిమాల్లో చలాకీగా నటించిన అనుష్క.. ఉన్నట్టుండి ఆర్య సరసన బోలెడంత లావుగా ఎందుకు నటిస్తోందో తెలియక కొంతమంది, ఇంత ధైర్యం ఆమె చేయడం నిజంగా చాలా గొప్పదని మరికొందరు ఈ టాపిక్ గురించే ఎక్కువగా చర్చిస్తున్నారు. సమంత లాంటి హీరోయిన్లు కూడా అనుష్క ఇలా చేయడం చాలా సాహసోపేతమని, ఆమె అద్భుతంగా ఉందని.. సైజ్ జీరో సినిమా చూసేందుకు ఉత్సుకతగా ఉన్నానని ఆమె ట్వీట్ చేసింది. ఈరోజుల్లో హీరోయిన్లు ఒకరి కంటే మరొకరు బాగా హాట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని.. మనం చేయాల్సింది ఇంకా చాలా ఉందన్న విషయం ఇలాంటి పాత్రల వల్లే తెలుస్తుందని చెప్పింది. కెరీర్లో అత్యున్నత స్థాయిలో ఉండి కూడా అనుష్క ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయడం నిజంగా అద్భుతమని మరికొందరు అన్నారు. ఇప్పటివరకు ఇలాంటి ప్రయోగాలు చేయగల హీరోయిన్ విద్యాబాలన్ ఒక్కరే అనుకున్నామని, ఇన్నాళ్లకు అనుష్క రూపంలో మరో హీరోయిన్ దొరికిందని మరొకరు వ్యాఖ్యానించారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉందని లక్ష్మీరాయ్ ట్వీట్ చేసింది. తెలుగు సినిమాలకు సంబంధించిన అనేక ఇతర సంస్థలు కూడా ఈ పోస్టర్లను రీట్వీట్ చేశాయి. In times where every heroine is trying to look hotter than the other. It's really nice to know that there s more that we can do. #SizeZero — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 14, 2015 Wowwwwwww like wowww. So refreshing. Anushka aka amazing. Looking forward. #SizeZero pic.twitter.com/eLzXhFMp5r — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) August 14, 2015 That's a very interesting poster #sizezero something new all the best jam ,anushka n @PVPCinema @arya_offl -
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా?
ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ను గుర్తుపట్టారా?...చెప్పుకోండి చూద్దాం... ఆమెను ఎక్కడో చూసినట్లు ఉంది కదూ... ఎవరో కాదండి బాబూ...అందాల తార అనుష్క. బాహుబలి చిత్రంలో దేవసేనగా కనిపించిన ఆమె ఇప్పుడు 'సైజ్ జీరో' చిత్రంలో న్యూ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వం వహిస్తున్న సైజ్ జీరో (సన్నజాజి నడుము- ట్యాగ్ లైన్) సినిమా ఫస్ట్ లుక్ శుక్రవారం రిలీజ్ చేశారు. యోగాతో చెక్కిన శిల్పంలా ఉండే అనుష్క ఈ చిత్రంలో తన పాత్ర కోసం దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బొద్దుగా, మొహానికి కళ్లజోడుతో అనుష్క డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తోంది. పీవీపీ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రంలో ప్రధాన తారగణంగా అనుష్క, తమిళ నటులు ఆర్యా, భరత్, ఊర్వశి నటిస్తుండగా మరో ముఖ్య అతిథి పాత్రలో శృతిహాసన్ మెరవనుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 1500 థియేటర్స్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. 'అనగనగా ఓ ధీరుడు' తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రకాశ్ రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే... ప్రకాశ్ సతీమణి కనికా థిల్లాన్ ఈ సినిమాకు కథ అందించడం. తెలుగు, తమిళర భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఎంఎం కీరవాణి అందిస్తున్నారు. -
’సైజ్ జోరో’ ఫస్ట్‌లుక్ రిలీజ్
-
సంతానం టీమ్‌లు మెయిన్టైన్ చేస్తున్నాడు
నటుడు సంతానం ఏబీసీ అంటూ మూడు టీమ్‌లను మెయిన్టైన్ చేస్తున్నారని నటుడు ఆర్య అన్నారు. ఈయన నటిస్తున్న 25వ చిత్రం వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగా ఈ చిత్రానికి ఆర్యనే నిర్మాత కావడం విశేషం. రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంతానం మరో ముఖ్య భూమికను పోషించారు. నటి తమన్న హీరోయిన్ డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం చెన్నైలో జరిగింది. అనంతరం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసింది. నటుడు, నిర్మాత ఆర్య మాట్లాడుతూ వాసువుమ్ శరవణనుమ్ ఒన్నా పడిచవంగా చిత్రం నటుడిగా తనకు 25వ చిత్రం అన్నారు. ఇప్పటి వరకు ఒక్కో చిత్రంలో ఒక్కో విషయాన్ని నేర్చుకున్నారన్నారు. అంతేకాకుండా షో పీపుల్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉందన్నారు. శివమనసుల శక్తి చిత్రంలో గెస్ట్ పాత్ర పోషించినప్పుడు ఆ చిత్ర దర్శకుడు రాజేష్‌తో పరిచయం అయ్యిందన్నారు. అలా మొదలైన స్నేహంతో బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రం చేశామని తెలిపారు. ఆ చిత్రం ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు. ఆ తరువాత ఆయన దర్శకత్వంలో నటించాలన్న కోరిక ఈ వాసువుమ్ శరవణనుమ్ ఒన్న పడిచవంగా చిత్రంలో తీరిందని పేర్కొన్నారు. నటుడు సంతానం నాకు ఎనీ టైమ్ ఫ్రెండ్ అన్నారు. ఆయన ఏబీసీ అనే మూడు టీమ్‌లను మెయిన్టైన్ చేస్తున్నారని దీంతో మచ్చి (బావ) ఈ డైలాగ్ సరిగా లేదురా అని చెప్పగానే వెంటనే తన టీమ్‌కు ఫోన్ చేస్తాడు. ఐదు నిమిషాల్లోనే 15 పంచ్ డైలాగ్స్ స్పాట్‌కు వస్తాయని తెలిపారు. అదే విధంగా దర్శకుడు ఒక డైలాంగ్ పేపరు ఇస్తే సంతానం టీమ్ దాన్ని ఐదు విధాలుగా రాసి ఇస్తారని అన్నారు. బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్రంలో సంతానంకు హీరోకు సమానమైన పాత్రలోనే ఈ చిత్రంలోనూ బలమైన పాత్ర అని తెలిపారు. ఆయన తనకు మెంటల్‌గానే కాదు ఫైనాన్సియర్గాను సపోర్టుగా నిలిచారని ఆర్య అన్నారు. దీంతో వాసువుమ్ శరవణమ్ ఒన్నాపడిచ్చవంగా చిత్రం విజయంపై నమ్మకం ఏర్పడిందని అన్నారు.