ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా | Vishal, Arya, Karthi and Jayam Ravi to Team up for a Film Soon | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా

Published Sat, Jan 2 2016 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 2:58 PM

ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా

ఆ ముగ్గురితో ఓ చిత్రం చేస్తా

చెన్నై : కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం ఓ చిత్రం చేయనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి, నటుడు విశాల్ వెల్లడించారు. ఆయన హీరోగా నటిస్తూ, విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం కథాకళి. క్యాథరిన్ ట్రెసా నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.

ఆ సందర్భంగా చిత్ర కథానాయకుడు నడిగర్ సంఘం భవన నిర్మాణ నిధి కోసం నటుడు కార్తీ, జయంరవి, ఆర్యలతో కలిసి చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇంతకుముందే తీసుకున్న నిర్ణయమన్నారు. ఇందులో మరికొందరు ప్రముఖ నటులు నటించనున్నారనీ... దర్శకుడి ఎంపిక త్వరలో జరుగుతోందని చెప్పారు.

ఇక కథాకళి చిత్రం విషయానికి వస్తే ఇందులో కాండం అనే పదం గురించి ఒకరు ట్విట్టర్‌లో విమర్శిస్తున్నారని, సెక్స్ విద్య అవసరం అంటున్న ఈ రోజుల్లో కాండం అన్న పదం తప్పు కాదని అన్నారు. కథాకళి చిత్రంలో ఆ పదాన్ని కావాలని వాడలేదని అన్నారు. అయినా చిత్రాలకు సెన్సార్ అనేది ఒకటి ఉందని విశాల్ అన్నారు. కాథాకళి చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు విశాల్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement