కోటి రూపాయలు సాయం చేసిన కమల్‌.. హీరో కార్తీ చేతికి చెక్‌ | Kamal Haasan Bigg Help To Nadigai Building | Sakshi
Sakshi News home page

కోటి రూపాయలు సాయం చేసిన కమల్‌ హాసన్‌.. హీరో కార్తీ చేతికి చెక్‌

Published Sat, Mar 9 2024 4:50 PM | Last Updated on Sat, Mar 9 2024 5:21 PM

Kamal Haasan Bigg Help To Nadigai Building - Sakshi

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు  తీవ్రంగానే కష్టపడుతున్నారు. నడిగర్​ సంఘం అధ్యక్షుడిగా నాజర్​, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్​, జనరల్​ సెక్రటరీగా విశాల్​, ట్రెజరర్‌గా హీరో కార్తీ కొనసాగుతున్నారు.  సుమారుగా రూ. 40 కోట్ల రూపాయలతో నిర్మితం అవుతున్న భవనం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

కానీ ప్రస్తుతం నిధుల కొరత కారణంగా ఈ పనులు పూర్తి కాలేదు. దీంతో సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ కోటి రూపాయాలు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు సంబంధించిన చెక్కును హీరో కార్తీ చేతికి ఆయన అందించారు. ఆ సమయంలో కార్తీతో పాటుగా ప్రధాన కార్యదర్శి విశాల్, వైస్‌ ప్రెసిడెంట్‌ పూచీ మురుగన్‌తో కమల్‌ సమావేశం అయ్యారు.

నడిగర్‌ సంఘం భవన నిర్మాణానికి సాయం చేయాలని గతంలో విశాల్‌ విన్నపం చేశారు. దీంతో  కొద్ది రోజుల క్రితం తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వారికి కోటి రూపాయల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికే సూర్య రూ. 25లక్షలు, కార్తీ కోటి రూపాయలు, విశాల్‌ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం తమ వంతుగా అందించారు. త్వరలోనే ఈ సంఘం నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement